Students can go through AP Board 9th Class Biology Notes 1st Lesson కణ నిర్మాణం – విధులు to understand and remember the concept easily.
AP Board 9th Class Biology Notes 1st Lesson కణ నిర్మాణం – విధులు
→ జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణము కణము.
→ ప్రోటీనులు, లిపిడ్లతో నిర్మితమైన ప్లాస్మా పొర కణము బయట ఉంటుంది.
→ కణత్వచము లేదా ప్లాస్మాపొరను విచక్షణ త్వచం అంటారు.
→ సెల్యులోజ్ తో నిర్మితమైన కణకవచము మొక్క కణము నందు కణత్వచమునకు వెలుపల ఉంటుంది.
→ రాబర్ట్ బ్రౌన్ 1831లో కేంద్రకమును కనుగొనెను.
→ క్షీరదాల ఎర్ర రక్త కణములలోను, పోషక కణజాలంలోని చాలనీ కణాలందు కేంద్రకము ఉండదు.
→ కణ విధులన్నింటిని కేంద్రకము క్రమబద్దీకరించి నియంత్రిస్తుంది.
→ కేంద్రకము జన్యుసమాచారమును కలిగి జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది.
→ కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచం లేని జీవులు కేంద్రక పూర్వక జీవులు.
ఉదా : బాక్టీరియా, సయానోబాక్టీరియా
→ కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచం గల జీవులు నిజకేంద్రక జీవులు.
ఉదా : శిలీంధ్రాలు, మొక్కలు, జంతువుల కణాలు.
→ ప్లాస్మాపొరచే ఆవరించియున్న జిగురు పదార్థం కణద్రవ్యము.
→ అంతర్జీవ ద్రవ్యజాలం కణాంతర రవాణాలోను మరియు సంశ్లేషక తలంగాను పని చేస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకములు :
- గరకు అంతర్జీవ ద్రవ్యజాలము (ప్రోటీను సంశ్లేషణ)
- నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము (లిపిడ్ల సంశ్లేషణ).
→ గాల్టి సంక్లిష్టాలు వివిధ రకముల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకుంటాయి.
→ జీర్ణక్రియా ఎంజైములు కలిగిన లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.
→ కణ శ్వాసక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు.
→ ఘన, ద్రవ పదార్థాలను నిలువ చేసే సంచుల వంటి నిర్మాణాలు రిక్తికలు.
→ మొక్కలలో మాత్రమే ఉండు ప్లాస్టిడ్లు రెండు రకములు. 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
→ 1838-39 సంవత్సరములో ఎమ్. జే. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్లు ‘కణ సిద్ధాంతమును ప్రతిపాదించారు.
→ 1855లో రుడాల్ఫ్ విర్కోవ్ కణ విభజనను గమనించాడు.
→ కొత్త కణాలు పాత కణాల విభజన ద్వారా ఏర్పడతాయి.
→ ప్లాస్మాపొర లేదా కణత్వచం : కణమునకు బయట ఉండు పొర. కణద్రవ్యమును బయటి వాతావరణముతో వేరు చేస్తుంది.
→ విచక్షణ స్తరం : ప్లాస్మాపొర తన గుండా ఎంపిక చేయబడిన పదార్థాలను మాత్రమే పోనిస్తుంది.
→ కణకవచము : మొక్క కణము నందు ప్లాస్మాపొరకు బయట ఉండే పొర. కేంద్రక పూర్వకణం కేంద్రకం చుట్టూ కేంద్రకత్వచము లేని కణము.
ఉదా : బాక్టీరియా, నయానోబాక్టీరియా
→ నిజకేంద్రక కణం : కేంద్రకం చుట్టూ కేంద్రకత్వచము ఉన్న కణము.
ఉదా : శిలీంధ్రాలు, మొక్కలు, జంతు కణాలు
→ క్రోమోప్లాస్టు : వర్ణద్రవ్యాలు కలిగిన ప్లాస్టిడ్లు
→ ల్యూకోప్లాస్టు : వర్ణద్రవ్యాలు లేని ప్లాస్టిడ్లు
→ సిస్టర్న్ : కణద్రవ్యము నందు త్వచముతో కూడిన ఖాళీ ప్రదేశాలు. కణద్రవ్య పొరచే వేరు చేయబడేవి.
→ కోశాలు : కణద్రవ్యమునందు ఒక పొరచే ఆవరించబడిన సంచుల వంటి ఖాళీ ప్రదేశాలు.
→ క్రిస్టే : మైటోకాండ్రియా లోపలి పొర యొక్క ముడతలు పడిన నిర్మాణాలు.
→ మాత్రిక : క్రిస్టే మధ్యగల ప్రదేశాలు.
→ ఏకకణ జీవులు : దేహములో ఒక కణము మాత్రమే గల జీవులు.
→ బహుకణ జీవులు : జీవి దేహము అనేక కణములచే నిర్మితము.
→ కణద్రవ్యము : కేంద్రకం లేని జీవపదార్థం.
→ కేంద్రకము : కణ విధులను నియంత్రించునది మరియు జన్యు సమాచారము కలిగిన పెద్ద కణాంగము.
→ మైటోకాండ్రియా : కణ శక్యాగారాలు. కణశ్వాసక్రియ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
→ ప్రోటీనులు : అమైనో ఆమ్లాలతో తయారయిన కర్బన పదార్థాలు. జీవపదార్థము నందలి ముఖ్య అంశము.
→ సైటోబ్లాస్ట్ : కేంద్రకము. కొత్త కణములు కేంద్రకము నుండి ఏర్పడతాయని ఊహించి ప్లీడెన్ కేంద్రకము సైటోబ్లాస్ట్ గా పేర్కొనెను.
→ స్వయం విచ్ఛిత్తి సంచులు : లైసోజోమ్ లు. కణ వినాశమునకు కారణమైనవి.
→ కణ శ్వాసక్రియ : కణము నందు జరుగు శ్వాసక్రియ. కణము నందు శక్తి ఉత్పాదక క్రియ.
→ రసభరిత మొక్కలు : కణజాలము నందు నీటిని నిల్వ యుంచు ఎడారి మొక్కలు.
→ హార్మోనులు : అంతస్రావీ గ్రంథులచే విడుదల చేయబడే రసాయనిక పదార్దములు.
→ మైక్రాను : ఒక మీటరులో 10 లక్షల వంతు (భాగము).