AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 3rd Lesson ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మానవాళికి రోమనులు అందజేసిన వారసత్వం గూర్చి చర్చింపుము.
జవాబు:
రోమ్ సామ్రాజ్య వైభవ కాలంలో వారు ఈజిప్ట్, బాబిలోనియా, గ్రీస్, పశ్చిమ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా భూభాగాలను పరిపాలించారు. ప్రాక్ దేశాల నాగరికత, సంస్కృతులకు రోమనులు వారసులయ్యారు. ఆ నాగరికతలను అనుసరించడమే కాక రోమన్లు కూడా ఎన్నో నూతన విషయాలను, భావాలను కల్పనలను ప్రపంచ సంస్కృతికి ప్రసాదించారు.
రోమన్లు మతము, తత్వశాస్త్రము, కళలు, భవననిర్మాణం, విజ్ఞానం, పాండిత్యం వంటి అనేక భావాలను గ్రీకుల నుండి గ్రహించారు. కేంద్ర, ప్రాదేశిక ప్రభుత్వపాలన, న్యాయసూత్రాలు, పన్నుల విధింపు సూత్రాలు, పౌరహక్కులు, వైద్య, ఆరోగ్య, మురుగు పారుదల విధానాలు, ప్రజోపయోగ పనులు, రహదారులు, నీటి ఊటలు, రంగస్థల వేదికలు, స్నానవాటికలు, వంతెనలు వంటి అనేక పనులు చేపట్టారు. రోమన్ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి వారి రహదారులు, నీటి సరఫరా పద్ధతులు నిదర్శనాలు.

న్యాయ సూత్రాలు : రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి, శ్లాఘనీయమైనవి. వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలతో రోమన్ న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

న్యాయాధీశులు ఇచ్చిన తీర్పులు రాయబడని చట్టాలై చిరస్థాయిని పొందాయి. ఘనమైన జస్టీనియన్ చక్రవర్తి ఈ న్యాయసూత్రాలను క్రోడీకరించుటతో వీటిని జస్టీనియన్ కోడ్ అన్నారు. రోమన్ న్యాయశాసనాలు సహజమైనవి. దయాగుణం కలవి. ప్రపంచంలోని అనేక రాజ్యాలు రోమన్ న్యాయసూత్రాలను ఆధారం చేసుకుని కొన్ని మార్పులతో, చేర్పులతో తమ న్యాయ సిద్ధాంతాలను రూపొందించుకున్నాయి. రోమన్ న్యాయశాసనం నిందితునికి తన వ్యాజ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. నేరనిరూపణ జరిగే వరకు నిందితుడిని శిక్షించకూడదు. మరొక గొప్ప అంశమేమిటంటే పౌరులు ఎంత గొప్పవారైనా, బీదవారైనా చట్టం ముందు అందరూ సమానులే.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

మతం : ప్రాచీన రోమనులు దేవతలను, ఆత్మలను ఆరాధించారు. జూపిటర్, జునో, మార్స్, నెప్ట్యూన్, వీనస్‌లు వీరి దైవాలు. రోమన్లు అతీత శక్తులను విశ్వసించారు. దేవతలనారాధించడం వ్యక్తిగత విషయంగా కాక సామూహిక విధిగా రోమనులు భావించారు. జూదాతత్వం, క్రైస్తవమత బోధనలు నాడు ప్రచారంలో ఉన్నాయి.

తత్వశాస్త్రం : గ్రీకు తత్వశాస్త్రంలోగల స్థాయిసిజమ్, ఎకి క్యూరియానిజమ్ రెండూ రోమన్లను ప్రభావితపరచాయి. రోమన్ చింతనాపరులు స్థాయిక్ తత్వాన్ని ప్రచారం చేసారు. స్థాయిన్ తత్వవేత్తలలో ‘పనేషియస్’, ‘సేనేకా’ మరియు చక్రవర్తి ‘మార్కస్ అరీలియస్’ ప్రముఖులు. మార్కస్ అరీలియస్ తన భావాలను ‘మెడిటేషన్స్’ అనే గ్రంథంలో తన భావాలను వ్యక్తం చేసాడు. తాను చక్రవర్తి అయి ఉండి కూడా భోగభాగ్యాలకు దూరంగా నిరాడంబరంగా బ్రతికాడు.

సాహిత్యం : రోమన్ లు జిజ్ఞాసాపరులు. అలంకార, వ్యాకరణ, తర్క, ఖగోళ, గణిత, వైద్యశాస్త్రాలలో అధ్యయనం జరిగేది. అగస్టస్ కాలంలో లాటిన్ సాహిత్యం మహోన్నత శిఖరాలనందుకుంది. ఈ లాటిన్ యూరప్‌లోని అనేక | భాషలకు మూలధారంగా నిలచింది.

శాస్త్రవిజ్ఞానం : వైద్య విషయాలను గూర్చి ‘గాలన్’ కొన్ని పరిశోధనలు చేయడమే కాక, ‘వైద్య విజ్ఞాన సర్వస్వాన్ని’ రచించాడు. రోమన్ సామ్రాజ్యంలో ‘గాలన్’ గొప్ప వైద్యుడు. మానవ శరీర అవయవాలు, రక్తప్రసరణపై 500 పైగా గ్రంథాలు రచించాడు. ప్లిని ‘నేచురల్ హిస్టరీ’ రచించాడు. ఇది ఒక శాస్త్ర విజ్ఞానాల సర్వస్వం. రోమన్లు కాలెండర్ను అభివృద్ధి చేసారు. ఎన్నో నెలల పేర్లు రోమన్ చక్రవర్తులవే. జూలియస్ సీజర్ పేరున జూలై, ఆగస్టస్ పేరున ఆగస్ట్ నెలలు పిలువబడ్డాయి. సెప్టెంబర్, అక్టోబర్ లు లాటిన్ భాషలో తొమ్మిది, పది అని అర్థం. జాలియస్ కేలండర్‌ను సొసిజెనెస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు తయారు చేసాడు.

ఈ విధంగా రోమన్ వాఙ్మయం, న్యాయశాస్త్రం, పాలనావిధానం, కళలు కూడా వారి మేథాశక్తికి, సంస్కృతికి చిహ్నాలుగా మిగిలిపోయాయి. రోమన్ న్యాయశాస్త్రం అనేక నాగరిక దేశాలకు ఒక నమూనాగా నిలిచిపోయింది. విశాల సామ్రాజ్య నిర్మాణంలో, అసంఖ్యాక జన సమూహాల్ని ఒక బలీయమైన జాతిగా తీర్చిదిద్దడంలో రోమన్లు గొప్ప పాత్రను పోషించారు.

ప్రశ్న 2.
రోమన్ సాంఘిక, ఆర్థిక వ్యవస్థల ప్రాథమిక లక్షణాలు పేర్కొనుము.
జవాబు:
సాంఘిక వ్యవస్థ : రోమ్ సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలున్నాయి. వారిని పేట్రిసియన్స్, ప్లీబియన్స్ అని పిలిచేవారు. పేట్రిసియన్స్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కలిగి ఉండేవారు. రోమన్ రాజ్యవ్యవస్థలో సెనేట్ ముఖ్యమైన సభ. సెనేట్ అధికారాలన్నీ భూస్వాములు, ఐశ్వర్యవంతులైన పేట్రీసియన్లు చలాయించగా, ప్లీబియన్స్ పిలవబడే పనివాళ్ళు, చిన్నరైతులు, వృత్తికళాకారులు, చిన్న చిన్న వరక్తకులు, సైనికులు మొదలైన వారికి హక్కులు తక్కువ. కానీ వారు చెల్లించవలసిన పన్నులు ఎక్కువగా ఉండేవి. కాగా రోమన్ న్యాయశాసనాలు ప్లేబియన్లు, పేట్రిసియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి.

రోమన్ సాంఘిక జీవనంలో ఉమ్మడి కుటుంబాలకు బదులు ఏకీకృత చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెండ్లి అయిన అమ్మాయికి తను పుట్టి పెరిగిన కుటుంబంలో ఆస్తిహక్కు కలదు. వివాహిత స్త్రీకి చట్టబద్ధమైన స్వేచ్ఛ ఉంది. విడాకులు పొందడం అంత కష్టమేమీ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరిగేవి. భార్యను హింసించడం సామాన్య విషయంగా మారింది. సమాజంలో బిషప్పులు మతగురువులు. మతగురువులు సమాజంలో చాలా శక్తివంతమైన వారుగా ఉండేవారు. పిల్లలపై తల్లిదండ్రులకు చట్టబద్ధ అధికారాలుండేవి.

రోమన్ సమాజంలో బానిసత్వం ఒక పాతుకుపోయిన సాంఘిక దురాచారం. పై తరగతికి చెందిన రోమన్లు బానిసలను పైశాచికంగా చూసేవారు. వారి సాంఘిక వ్యవస్థలో మూడు వర్గాలు కలవు. సెనేటర్లు, మధ్య తరగతి మరియు దిగువ తరగతి గ్రామీణ శ్రామిక శక్తి దిగువ తరగతిగా ఏర్పడింది. నైట్స్ లేదా అశ్వదళాధిపతులు సాంప్రదాయకంగా శక్తిమంతులు. ధనిక వర్గానికి చెందినవారు. వారిలో చాలా మంది భూస్వాములు కలరు. సైనికులు, సైన్యాధికారులు, భూయజమానులలో చాలా మంది అక్షరాస్యులు. నాటి సమాజంలో సాంస్కృతిక వైవిధ్యం కన్పిస్తుంది. భిన్న మతాచారాలు, విభిన్న భాషలు, వివిధ రకాల వేషధారణ, అనేకరకాల ఆహారపుటలవాట్లు ఆ ప్రజలలో ఉండేవి. అరమిక్, కాప్టిక్, సెల్టిక్, లాటిన్ వంటి వివిధ భాషలు మాట్లాడేవారు. ప్రజలలో అధికులు లాటిన్ భాష మాట్లాడేవారు.

ఆర్థిక వ్యవస్థ : రోమన్ సామ్రాజ్యంలో ఆర్థికంగా మౌలికరంగానికి చెందిన హార్బర్లు, లోహఖనిజాలు, క్వారీలు, ఇటుకల, పరిశ్రమ, నూనె పరిశ్రమలు గణనీయమైనవి. గోధుమ, ద్రాక్ష సారాయి, ఆలివ్ననెల వ్యాపారం ముమ్మరంగా జరిగేది. ద్రవ పదార్థాలు ‘ఆప్ఫోరె’ అనే కంటైనర్లలో రవాణా చేయబడినవి. ఆసియా మైనర్ (టర్కీ), సిరియా, పాలస్తీనా వంటి ప్రదేశాల నుండి ద్రాక్షసారాయి, ఆలివ్ నూనెలు ఎగుమతి అయ్యేవి. కంపానియా నుండి ఉత్తమశ్రేణి సారాయి లభించేది. సిసిరీ, బైజాసియాని ప్రాంతాల నుండి గోధుమలు రోమ్ నగరానికి ఎగుమతి చేయబడేవి.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

రోమన్ సామ్రాజ్యంలో విశిష్టమైన సారవంతమైన ప్రాంతాలు ఎన్నో కలవు. ‘గలీలీ’ సాంద్ర వ్యవసాయానికి పేరుగాంచింది. అత్యాధునిక హైడ్రాలిక్ గని త్రవ్వకాల సాంకేతికతను చేపట్టి స్పానిష్ బంగారు, వెండి గనులు ప్రఖ్యాతి చెందాయి. రోమన్లు వాణిజ్య బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన విజయాలు సాధించారు. వీరు విస్తృతంగా ద్రవ్య వినియోగం చేసేవారు. నాటి గ్రామీణ ఋణ గ్రస్తత కూడా విస్తృతమైనది. సామ్రాజ్యంలోని పెద్ద భూస్వాములు మార్కెట్లపై అదుపు సాధించడానికి పోటీపడేవారు. ‘డెమేరియస్’ అనే వెండి నాణెంను 41/2 గ్రాముల శుద్ధమైన వెండితో తయారు చేసారు. రోమన్లు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేసారు. ఆనాటి ఇంజనీర్లు నిర్మించిన పెద్ద అక్విడెట్లు మూడు ఖండాలలో నీటి పారుదలను మెరుగుపరచాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. 12 ఫలకాలపై రాసిన న్యాయసూత్రాలు.
జవాబు:
రోమన్ న్యాయశాసనాలు, పాలనా సిద్ధాంతాలు వారు ప్రపంచ నాగరికతకు చేసిన సేవలలో అత్యంత ప్రముఖమైనవి. శ్లాఘనీయమైనవి, వారి న్యాయశాసనాలు నేటి ప్రపంచంలోని దాదాపు అన్ని నాగరిక రాజ్యాలపై సంపూర్ణ ప్రభావాన్ని చూపాయి. 12 ఫలకాలపై వ్రాసిన న్యాయసూత్రాలతో రోమను న్యాయశాస్త్రం ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీ.పూ. 150 నాటి ఈ 12 ఫలకాలు కంచుతో చేయబడి వ్యాపారకూడలి ప్రాంతాలలో ప్రదర్శించబడ్డాయి.

ప్రశ్న 2.
రోమన్ సామ్రాజ్య చరిత్రకు లభించు చారిత్రక ఆధారాలు.
జవాబు:
ఖండాంతరాలలో ఖ్యాతినార్జించిన ప్రాచీన రోమన్ సామ్రాజ్య చరిత్రకు విస్తారంగా ఆధారాలు లభించాయి. లిఖిత ఆధారాలు : లివీ రచించిన ‘అన్నాల్స్’ (రోమ్ చరిత్ర); వర్జిల్ రచించిన ఏనియడ్; లుక్రేషియస్ ప్రకృతి రహస్యం; ఓవిడ్ హెరాస్, ప్లిని – నేచురల్ హిస్టరీ; టాసిటస్ – ఏనల్స్ + హిస్టరీ; చక్రవర్తి మార్కస్ అరలియస్ – మెడిటేషన్స్; జస్టీనియన్ చక్రవర్తి సంకలనం చేసిన న్యాయస్మృతి జస్టీనియన్ కోడ్, ఇవన్నీ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, తాత్త్విక పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాయి.

కట్టడాలు: రోమన్ ఇంజనీరింగ్ వైభవానికి చిహ్నాలుగా అనేక కట్టడాలు రోమ్, కార్తేజ్ ఆంటియోస్ అలెగ్జాండ్రియా, కాన్స్టాంట్్నపుల్ ఇంకా అనేక చోట్ల లభించాయి. ఎత్తైన స్తంభాలు, ఆర్చ్ లు గుమ్మటాలు, అక్విడక్ట్‌లు, కలోసియాలు, ప్రజాస్నాన వాటికలు ఎన్నో నాటి సాంకేతిక వైభవాన్ని చాటుతున్నాయి.

త్రవ్యకాలు: వెసూవియస్ అగ్నిపరత్వం దగ్గరలో ఉన్న పాంపేయీ నగరాన్ని క్రీ. శ. మొదటి శతాబ్దిలో హఠాత్తుగా బద్దలయిన పర్వతం లావా క్రింద నగరం పూడిపోయింది. దాదాపు 10 మీటర్లు మందం లావా క్రింద పూడుకపోయిన నగరాన్ని త్రవ్వకాలలో వెలికితీసారు. ఈ త్రవ్వకాలలో వీధులు, నివాసగృహాలు, ఫోరమ్, ఆంఫిధియేటర్, స్నానాగారాలు, దేవాలయాలు బయటపడ్డాయి.

శాసనాలు, నాణేలు : ఆగస్టస్ చక్రవర్తి వేయించిన శాసనం, ‘డెమిరియస్’ అనే 41/2 గ్రా వెండి నాణెం నాటి పరిస్థితులను తెలుపుతున్నాయి. ఇంకా అసంఖ్యాకంగా విగ్రహాలు, వర్గచిత్రాలు నాటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి.

ప్రశ్న 3.
జూలియస్ సీజర్.
జవాబు:
విశ్వవిఖ్యాత విజేత జూలియస్ సీజర్. ఒక సంపన్న కుటుంబంలో క్రీ.పూ. 102 సంవత్సరంలో రోమ్‌లో జన్మించాడు. ఆంటోనియస్ వద్ద విద్యనభ్యసించాడు. అసాధారణ శౌర్యపరాక్రమాలు, విజ్ఞత ప్రదర్శించాడు. ఒక న్యాయాధికారిగా, మత పెద్దగా, స్పెయిన్‌కు గవర్నర్ గా బహుముఖ కార్యాలను నిర్వహించాడు. త్రిమూర్తులుగా పేరు గాంచిన సాంపే, సీజర్, కానన్లలో సీజర్ అగ్రగణ్యుడు. వాస్తవానికి సీజర్ ఒక నియంతగా పిలవబడినా గణతంత్ర సాంప్రదాయాలకు విలువనిచ్చాడు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా అందానికి బానిసై ఆమె ద్వారా ఒక కుమానికి తండ్రి అయ్యాడు. క్రీ.పూ. 46లో రోమ్ నగరానికి తిరిగి వచ్చి నియంతగా ప్రకటించుకున్నాడు. ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యానికి మిత్రరాజ్యమయింది.

స్పెయిన్, ఈజిప్టులలో చెలరేగిన తిరుగుబాట్లను, అణచివేసిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో అనేక సంస్కరణలను ఆవిష్కరించాడు. వ్యవసాయాభివృద్ధి పన్నుల తగ్గింపు, అవినీతిమయమైన నిరంకుశ అధికారుల తొలగింపు, గాల్, సిసిలీ, ప్రజలకు పౌరహక్కులు ప్రసాదించుట, ప్రభుత్వ భూముల పంపిణీ, ప్రజా పనుల కొనసాగింపు, నాణేల వ్యవస్థను మెరుగుపరచుట, జూలియన్ కేలండర్‌ను పరిచయం చేయడం వంటి అనేక పనులు చేపట్టాడు. న్యాయస్మృతులు పరిచయం, గ్రంథాలయ నిర్మాణం వంటి పెక్కు పనులు ప్రారంభించాడు. కానీ పూర్తి చేయలేకపోయాడు. ‘బ్రూటస్’ వంటి శత్రువులు ఏకమై సీజర్‌ను క్రీ.పూ.44లో హత్య చేసారు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
రోమన్ ల పట్టణీకరణ.
జవాబు:
రోమన్ సామ్రాజ్యంలోని పరిస్థితులు పట్టణీకరణను ప్రోత్సహించాయి. చక్రవర్తులు కూడా అనేక ప్రజోపయోగ పనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించారు. ఈ కాలంలో అనేక రహదారులు, భవనాలు, వంతెనలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. వీటి నిర్మాణం కోసం ఎంతోమంది శ్రామికులు అవసరమయ్యేవారు. అలా శ్రామికులుగా, బానిసలుగా వచ్చిన వారితో నగర విస్తీర్ణం పెరుగుతూపోయాయి.

కార్తేజ్, అలెగ్జాండ్రియా, ఆంటియోక్ వంటి ప్రసిద్ధ నగరాలు మధ్యథరా తీరప్రాంతంలో చూడగలం. రోమన్ సామ్రాజ్య సిరిసంపదలు ఇలా అనేక నగరాలలో చూడవచ్చు. విన్టోనిస్సా ప్రజాస్నాననాటిక నిర్మాణం రోమన్ నాగరికత ప్రత్యేక లక్షణం. పట్టణ ప్రజానీకం ఉన్నతశ్రేణి వినోదాన్ని అనుభవించింది. పెద్ద పెద్ద ప్రదర్శనలు తరచుగా ఏర్పాటు చేయబడేవి. విన్డోనిస్సా వద్ద నిర్మించబడిన ఏంపిధియేటర్ సైనిక విన్యాసాలకు, గొప్ప ప్రదర్శనలకు నిలయం. క్రీ.శ. 79లో నిర్మించబడిన పెద్ద ప్రదర్శనశాల కలోసియమ్లో 50,000 మంది వీక్షకులు కూర్చునే సౌకర్యం కలది. ఈ కలేసియామేలలో ‘గ్లాడియేటర్స్’ క్రూరమృగాలతో పోరాడేవారు. ‘సోంపెల్లి’, ‘ఆరంజ్’, ‘టారోమినిమమ్’ వంటి ప్రదర్శనశాలలు ఇట్టివే. ప్రజలను ప్రజా సమస్యల నుండి దూరంగా ఉంచడానికి రోమన్ ప్రభువులకు ఈ ప్రదర్శనశాలలో నిత్యం జరిగే ‘హింసాత్మక కార్యక్రమాలు కొంత వరకు తోడ్పడ్డాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పేపిరస్.
జవాబు:
పేపిరస్ అనేది పేపిరస్ చెట్టు నుండి తయారు చేయబడిన పల్చని కాగితంలాంటిది. దీనిని విషయాలను రచించడానికి ఉపయోగించేవారు. పేపిరస్ ను పత్రాలను ఒక కట్టగా చుట్టేవారు. పేపిరస్ ను వ్రాతకోసం తొలిసారిగా ఈజిప్టు ప్రజలు వాడారు. పేపిరస్ చౌకగా తయారై తొందరగా చినగకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. రోమన్లు సాహిత్యంగాని, లేఖలుగాని మరి ఇతర డాక్యుమెంట్లు గాని పేపిరస్ను వాడేవారు.

ప్రశ్న 2.
రిపబ్లిక్.
జవాబు:
పేట్రీషియన్లు తమ ప్రభుత్వ వ్యవస్థను ‘ప్రజా ఆశయం’ లాటిన్ భాషలో ‘రిపబ్లికా’ అనేవాళ్ళు. దాని నుండి రిపబ్లిక్ అనే మాట పుట్టింది. రిపబ్లిక్ అంటే ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడిన వాళ్ళచేత పరిపాలింపబడే రాజ్యం. రోమ్‌లో పాలన ఎన్నిక మీద ఆధారపడింది. ప్రతి సంవత్సరమూ ప్రజా సభచేత ఇద్దరు పేట్రీషియన్లు కాన్సళ్ళుగా ఎన్నుకోబడేవారు. వీరు కోర్టు తీర్పులు చెప్పడం, సైన్యానికి నాయకత్వం వహించేవారు. ఏడాది ముగిసాక వీరిలో అత్యున్నతులు సెనేట్ సభ్యులు అయ్యేవారు. సెట్‌కు విశేష అధికారాలుండేవి. అన్ని విషయాలు సెనేట్ లో చర్చించి అమలుచేయబడేవి.

ప్రశ్న 3.
బానిసల ఉత్పత్తి.
జవాబు:
రోమ్ చేసిన యుద్ధాల్లో చిక్కిన లక్షల కొలది ఖైదీలు బానిసలుగా మార్చబడేవారు. సకాలంలో పన్నులు కట్టని ప్లేబియన్లను కూడా బానిసలుగా మార్చడం ఉండేది. రోమ్ ఆక్రమించుకున్న ప్రాంతాలలో వందల కొద్దీ బానిస మార్కెట్లు ఉండేవి. రోజుకు 10,000 మంది బానిసలు దాక విక్రయించబడేవారు. రోమన్ బానిస యజమానులు, బానిసలను మనుషులుగా గుర్తించలేదు.

బానిసల పట్ల దయాదాక్షిణ్యాలు లేక గొడ్డుచాకిరీ చేయించేవారు. బానిసలలో బలిష్టులను గ్లాడియేటర్లుగా తీర్చిదిద్దేవారు. బానిసలను కఠినాతి కఠినంగా హింసించేవారు. దారుణ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బానిసలను రోమ్ దోచుకున్నంతగా ప్రపంచంలో మరే దేశం దోచుకోలేదు. ఎక్కడా అంతమంది బానిసలు లేరు.

AP Inter 2nd Year History Study Material Chapter 3 ఖండాతర ఖ్యాతినార్జించిన రోమను సామ్రాజ్యం

ప్రశ్న 4.
కలోసియమ్.
జవాబు:
రోమన్ పాలకుల విధానాలతో, గత్యంతరం లేని సోమరితనంతో, దానధర్మాలతో పాడుచేయబడిన రోమన్ పేదప్రజలకు పనిచేయాలని ఉండేది కాదు. పని చేయడం బానిసల వంతుగా బానిసల యజమానులు కూడా భావించేవారు. వీరు చక్రవర్తి నుండి ఉచిత ఆహారాన్ని, వినోదాన్ని డిమాండ్ చేసేవారు.

రోమన్ బానిస యజమానులకు, పేదవారికి వినోదార్థం గ్లాడియేటర్ల, పోరాటాల కోసం క్రీ.శ. మొదటి శతాబ్ది ఉత్తరార్థంలో రోమ్‌లో ‘కొలీసియం’ అనే బ్రహ్మాండమైన ఆంఫిథియేటర్ నిర్మించబడింది. ఈ కొలీసియంలో 50,000 మంది వరకు ప్రేక్షకులు కూర్చొనవచ్చు. ఈ కలోసియంలో గ్లాడియేటర్లు క్రూరమృగాలతోను, తమలో తాము పోరాడేవారు.

ప్రశ్న 5.
అగస్టస్.
జవాబు:
అగస్టస్ పేరు మార్చుకున్న జూలియస్ సీజర్ వారసుడు ఆక్టివియన్ రిపబ్లికన్ను అంతం చేసాడు. రోమ్ చరిత్రలో అగస్టస్ కాలం స్వర్ణయుగంగా బాసిల్లింది. శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా నిలిచింది. క్లిష్టపరిస్థితులలో పేదవారికి ఆగస్టస్ ఉచితంగా ఆహార పదార్థాలిచ్చి సంతోషపరచాడు. అనేక ప్రజాపనులను చేపట్టి పేదవారికి ఉపాధి కల్పించాడు. ఈ కాలంలో అనేక రహదారులు, వంతెనలు, భవనాలు, ప్రదర్శనశాలలు, నీటి ఊటలు నిర్మించబడ్డాయి. కలోసియమ్ వీటన్నింటిలో ప్రసిద్ధమైన కట్టడం 50,000 మంది ఒకేసారి కూర్చోగల ప్రదర్శనశాల. అగస్ట్ కాలంలో రోమ్ వాణిజ్యకేంద్రంగా ఉండేది. భారత, చైనాలతో సహా అనేక దేశాలతో సంబంధం కలిగిఉండేది.

ప్రశ్న 6.
కాన్స్టాంటైన్ చక్రవర్తి.
జవాబు:
డియోక్లిటియన్ పాలన అనంతరం అధికారం కోసం కాన్స్టాంటిన్ అనే సేనానాయకుడు ఎన్నో కుట్రలు, అరాచకాలు చేసి అధికారంలోకి వచ్చాడు. సింహాసనాన్ని కాంక్షిస్తున్నాడనే అనుమానంతో కన్నకొడుకును కూడా వధించాడు. ప్రజలను బానిసలను అధిక పన్నులతో తీవ్రంగా వేధించాడు.

తన అధికారాన్ని బలపరచుకోవడానికి కన్స్టంటైన్ క్రైస్తవ చర్చిని వినియోగించుకున్నాడు. చర్చికి డబ్బులు, భూములు, విలువైన వస్తువులు ధారాళంగా ఇచ్చాడు. బాస్ఫరస్ జలసంధి తీరంలో బైజాంటియమ్ అనే గ్రీకు వలస ఉన్నచోట కాన్స్టంటెన్ ఒక నగరాన్ని నిర్మించాడు. దీనినే కాన్స్టాంట్్నపిల్ అన్నారు. కాన్స్టంటిస్ ఎన్ని క్రూరకర్మలు చేసినా క్రైస్తవులు అతడిని పవిత్ర పురుషుడిగా ప్రకటించారు.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 2nd Lesson ప్రపంచ ప్రాచీన నాగరికత – మెసపిటోమియా – వ్రాత విధానం – నగర జీవనం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న1.
మెసపిటోమియా నాగరికత ప్రధాన లక్షణాలు రాయండి.
జవాబు:
నాగరికత అనగా మానవ సమాజంలో వచ్చిన మేధాసంపత్తి, సాంస్కృతిక, నిత్యజీవన విధానంలో వచ్చిన అభివృద్ధి. అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలలో మెసపిటోమియా నాగరికత మొదటిది. హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు కూడా దాదాపుగా వీటి సమకాలీన నాగరికతలు. మెసపిటోమియా, ఈజిప్ట్ నాగరికతలు అక్కాచెల్లెళ్ళుగా ప్రసిద్ధికెక్కాయి. గ్రీకు భాషలోని ‘మెసోస్’, ‘పోటమస్’ అనే పదాల కలయికతో మెసపిటోమియా ఏర్పడింది. ఈ పదాలకు ‘రెండు నదుల మధ్య ప్రదేశం’ అని అర్థం. మెసపిటోమియా యూఫ్రిటిస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ప్రస్తుతం ‘ఇరాక్’ అని పిలువబడుతున్న దేశమే మెసపిటోమియా నాగరికత కేంద్రం.

భౌగోళిక పరిస్థితులు: మెసపిటోమియాలో భిన్న భౌగోళిక పరిస్థితులుండేవి. పచ్చని మైదానాలు, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, జలపాతాలు, సెలయేర్లు, పూదోటలు, చక్కని వర్షపాతంతో, పంటలతో ఆహ్లాదకరంగా ఉండేది. వ్యవసాయం, పశుపోషణ ప్రజలకు ప్రధానాధారాలు. మెసపిటోమియా దక్షిణ దిక్కున ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఈ నదుల ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి.

రాజకీయ పరిస్థితులు: ‘గిల్గిమిష్’ అనే రాజు గురించి రెండు టేబ్లెట్స్ ద్వారా వివరించబడింది. గిల్గి మిష్ “ఉర్క్’ అనే నగర రాజ్య పాలకుడు. ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో విచారానికిలోనై, ప్రపంచంలో సుఖ, దు:ఖాలకు మరణానికి కారణాలు తెలుసుకోవాలని దేశ సంచారం చేసాడు. ఇతడు నగర నిర్మాణంలో ప్రసిద్ధిచెందాడు.

మెసపిటోమియా నగరాలు: 1930లో పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అనేక ప్రాచీన నగరాలు బయల్పడ్డాయి.

‘ఉర్’ పట్టణం: ఈ పట్టణంలో వీధులు అతి సన్నగా ఉండేవి. కొన్ని ప్రాంతాలలో బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. ఈ పట్టణ నిర్మాణానికి సరైన ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) లేదని తెలుస్తుంది.

బాబిలోనియా నగరం: ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ 333లో అలెగ్జాండర్ ఆక్రమించినప్పటికీ గొప్ప నగరంగా పేరొందింది.

అబూసలాభిక్ పట్టణం: క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ పట్టణ తవ్వకాలలో చేప ఎముకలు, పంది ఎముకలు లభించాయి.

ఉరుక్ పట్టణం: క్రీ.పూ 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా పేరొందింది. ఇది దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ఆర్థిక పరిస్థితులు: మెసపీటోమియా నాగరికత ప్రపంచంలో వ్యవసాయ ప్రక్రియను ప్రారంభించిన నాగరికత. యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల వలన వ్యవసాయం విస్తృతంగా సాగింది. గోధుమ, బార్లీ, వేరుశనగ పంటలు విస్తారంగా పండేవి. ప్రజలు గొర్రెలు, మేకలను విస్తృతంగా పోషించేవారు. ఖర్జూరం, తాటికాయలు వేసవిలో సమృద్ధిగా లభించేవి.

మెసపిటోమియా ప్రజలు టర్కీ, ఇరాన్ దేశాల వారితో ఎక్కువగా విదేశీ వ్యాపారాలు ఉండేవి. ఆహార పదార్థాలు, వస్త్రాలను టర్కీ, ఇరాన్‌లకు ఎగుమతి చేసి వారి నుండి కలప, రాగి, వెండి, బంగారం, సముద్రగవ్వలు, విలువైన రాతి ఆభరణాలు దిగుమతి చేసుకునేవారు. ఎగుమతి, దిగుమతులకు మెసపిటోమియాలోని సహజసిద్ధమైన నదీ మార్గాలు వారికెంతగానో ఉపయోగపడ్డాయి. నాడు ‘మేరీ పట్టణం’ ప్రముఖ నౌకా రవాణా పట్టణంగా వెలుగొందింది.

సాంఘిక పరిస్థితులు: మెసపిటోమియా నాగరికత నగర జీవనానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. ఉర్ అబూసలాభిక్, ఉరుక్ ఇటువంటి నగరాలే, బాబిలోనియా నాటికే ప్రసిద్ధి చెందిన మహానగరం.

నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా సామాన్యులు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు.

మెసపిటోమియా నాగరికత నాటి కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహసమయంలో కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఉండేవి. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు. కుమారైలకు బహుమతులు ఇచ్చేవారు.

మెసపిటోమియా నాగరికతలో ప్రజలు స్థానిక దేవతలను పూజించడానికి నిర్మించుకున్న దేవాలయాలను జిగూరత్లను నిర్మించుకున్నారు. వీటిని స్వర్గానికి, భూమికి మధ్య వారధిగా భావించేవారు. ప్రజలకు మూఢనమ్మకాలు ఎక్కువని తెలుస్తుంది.

శాస్త్ర – సాంకేతిక అభివృద్ధి:
వ్రాత విధానం అభివృద్ధి: ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదువేల సంవత్సరాలకు మనుపు రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలు, అర్థాలకు తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని ‘క్యూనిఫారమ్’ అంటారు. వీటిని మట్టిబిళ్ళలు సున్నపుముద్ద బిళ్ళలపై రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని ‘టేబ్లెట్స్’ అంటారు. వీటి వలన అనేక వివరాలు చరిత్రకారులు గ్రహించగలిగారు.

మెసపిటోమియా ప్రజలు ప్రపంచానికి అందించిన గొప్పకానుకలలో గణితశాస్త్ర అభివృద్ధి, కాలనిర్ణయ శాస్త్రం ప్రధానమైనవి. సంఖ్యాశాస్త్రంలో 6 మరియు 10 గుణకాలకు ప్రాధాన్యం ఉండేది. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్రూటు వంటివి మట్టిబిళ్ళలలో లభించాయి. మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిముషాలు అనే కాల నిర్ణయ విభజనను కనుగొన్నారు. ఈ విధానం ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు వ్యాపించింది. ఈ విధంగా నగర జీవనానికి, శాస్త్రీయ అభివృద్ధికి మెసపిటోమియా నాగరికత నాంది పలికింది.

ప్రశ్న 2.
వ్రాత విధానంలో మెసపిటోమియా నాగరికత పాత్ర తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైన వాటిని రాయడం ప్రారంభించినవారు. మెసపిటోమియా ప్రజలు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్దతిని ‘క్యూనిఫారమ్’ అంటారు.

వేల సంవత్సరాల క్రితం మెసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైన వాటిని మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. వీటిని టేబ్లెట్స్ అంటారు. క్రీ.పూ 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమయింది. ఈ బిళ్ళలు మట్టితోను, రాళ్ళతోను తయారుచేయబడ్డాయి. వాటి మీద చిహ్నాలు, అంకెలు ఎక్కువగా కనపడేవి. దక్షిణ మెసపిటోమియా ప్రాంతంలోని ‘ఉరుక్’ నగరంలో ఇటువంటి ‘మట్టిబిళ్ళలు’ లభించాయి. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ మానవ వ్యవహారాలను రాసి భద్రపరుచుకోవలసిన అవసరం పెరుగుట వలన వ్రాత విధానం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. మెసపిటోమియా నాగరికత నగర జీవితానికి సంబంధించినందు వలన ప్రజల మధ్య అనేక రకాలైన వ్యవహారాలు, వృత్తులు, వస్తువిక్రయాలు జరిగి వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరచుకోవలసిన అవసరం ఏర్పడింది.

మట్టిబిళ్ళలు – టేబ్లెట్స్: మెసపిటోమియా వాసులు సున్నపు ముద్దతో తయారుచేసిన బిళ్ళలను ఉపయోగించారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్దబిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా తయారుచేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్నప్పుడు రాసిన ఈ పలకలను ఎండబెడితే అవి చెరగని ముద్రలతో బిళ్ళలుగా తయారయ్యేవి. అనేక వ్యవహారాలు వ్యాపార లావాదేవీలు ఇటువంటి బిళ్ళలపై చెక్కుట వలన వేల సంఖ్యలో బిళ్ళలు లభించాయి. వీటి ద్వారా చరిత్రకారులు అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

క్యూనీఫారమ్: క్రీ.పూ. 2600 నాటికి మెసపిటోమియాలో రాత విధానం ‘క్యూనిఫారం’గా రూపొందింది. వారు వాడిన భాష సుమేరియన్ల అనేక రకాలైన పత్రాలు, నిఘంటువుల తయారీకి ఉపయోగపడింది. రాజపత్రాలు, భూముల, బదలాయింపు, స్థానిక సంప్రదాయాలు మొదలైనవి క్యూనిఫారమ్‌లో ఉపయోగించబడ్డాయి.

క్రీ.పూ. 2400 నాటికి సుమేరియా లిపికి బదులు అక్కాడియన్ లిపి వాడుకలోకి వచ్చింది. క్రీ.శ మొదటి శతాబ్ది వరకు మెసపిటోమియా ప్రజలు ఉపయోగించింది అక్కాడియన్ లిపి మాత్రమే. సుమారు రెండువేల సంవత్సరాలు ఈ అక్కాడియన్ లిపి వాడుకలో ఉంది.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 3.
మెసపిటోమియా నగర జీవన విధానాన్ని గురించి రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నగరజీవితానికి ప్రసిద్ధిగాంచింది. అనేక నగరరాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ చిన్న చిన్న గ్రామాలు విస్తరించి ఉండేవి. పట్టణ ప్రజలు నగరరాజ్యాల పరిధిలో జీవించారు. సాధారణ నగరాలు 20వేల జనాభాతో ఉంటే అంతకంటే పెద్ద నగరాలలో జనాభా 50 వేల వరకు ఉండేది. బాబిలోనియా నాడు అతి పెద్ద నగరం. ఆ నగరంలో జనాభా లక్షమందికి పైన ఉండేవారు.

1930లో పురావస్తుశాఖ చేపట్టిన పరిశోధనలలో మెసపిటోమియాలోని అతి ప్రాచీన నగరాలు బయటపడ్డాయి. అందులో ‘ఉర్’ పట్టణం ఒకటి. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు అతి సన్నగా ఉండుట వలన కొన్ని ప్రాంతాలకు మాత్రమే బండ్లు తిరగడానికి సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతంలో ఆహార ధాన్యాలు, కట్టెలు చేరవేయుటకు కంచరగాడిదలు ఉపయోగించేవారు. పట్టణ నిర్మాణానికి సరి అయిన ప్రణాళిక లేదు. మెసపిటోమియా నగర నిర్మాణంలో మూఢవిశ్వాసాలు ఎక్కువ. ‘ఉర్’ నగర శ్మశానవాటికలో రాజులు, సామాన్యుల సమాధులు లభించాయి.

ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనాలు, దేవాలయాలు ఉండేవి. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు, క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. నాటికే ఇది గొప్ప నగరంగా పేరుగాంచింది.

మెసపిటోమియా నాగరికతలో లభించిన మరొక ప్రముఖ పట్టణం ‘అబూసలాభిక్’ క్రీ.పూ. 2500 నాటి ఈ పట్టణం పది హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. ఈ పట్టణంలో చేపల ఎముకలు, పందుల ఎముకలు లభించాయి. కాబట్టి నాడు ఈ ప్రాంతంలో పందిని కూడా ఆహారంగా స్వీకరించినట్లు తెలుస్తుంది.

మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం ఉరుక్. క్రీ.పూ. 3000 సంవత్సరాలకు చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్ల విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ. 2800 ప్రాంతాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో ఈ నగర విస్తీర్ణం 400 హెక్టార్లుకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానిక ప్రజలను ఉపయోగించేవారు. వీరికి రాజు ఉపాధి కల్పించేవాడు. దేవాలయ నిర్మాణానికి రోజుకు 4500 మంది కూలీలను ఐదు సంవత్సరాల వరకు పనిచేయించారు. నాటి శిల్పులు కూడా నైపుణ్యం కలిగి ఉండేవారు. కుమ్మరి చక్రం ద్వారా అనేక కుటీర పరిశ్రమలు వృద్ధి చెంది, కుండల తయారీ పెద్ద ఎత్తున చేపట్టబడింది.

రవాణా రంగం: పట్టణ నాగరికత అభివృద్ధిలో ప్రధాన అంశం రవాణా సౌకర్యం. అతి చౌకగా రవాణా చేయుటకు నదుల, సముద్ర రవాణా అతి ముఖ్యమైనవి. మెసపిటోమియా ప్రజలు నదుల ద్వారా పడవలలో ఆహార ధాన్యాలు రవాణా చేసుకునేవారు. ప్రాచీన మెసపిటోమియాలోని సహజసిద్ధ నదీమార్గాల ద్వారా వస్తురవాణా జరిగేది. |జమరిలియిన్ రాజు కాలంలో మేరీ పట్టణం ప్రముఖ నౌకా రవాణా కేంద్రం.

సమాజం: మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు, దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత పరికరాలు అనుభవించేవారు. ఉర్ నగరం రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

కుటుంబ జీవనం: నాడు కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సంబంధం విషయంలో వధువు, వరుని కుటుంబాల పెద్దలు ఒక ప్రకటన ద్వారా సమ్మతిని తెలిపేవారు. ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి సంపాందించిన ఆస్తికి కుమారులు మాత్రమే హక్కుదారులు. కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప, ఆస్తిలో హక్కు ఉండేది కాదు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులు తెలుపుము.
జవాబు:
మెసపిటోమియా భౌగోళిక పరిస్థితులలో ఎంతో వైవిధ్యముండేది. పచ్చని మైదానాలతో, ఎత్తు పల్లాలుగా ఉండే భూమి, కొండల నుండి జాలువారే జలపాతాలు, సెలయేర్లు, అందమైన పూదోటలు, వర్షపాతం తద్వారా పండే పంటలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే నీటి వనరులు వంటి అంశాలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మెసపిటోమియాకు దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులలో యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు జన్మించాయి. ఆ నదులు ప్రవాహం వలన సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలు సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా మారాయి. క్రీ.పూ. 7000 6000 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం ఆరంభమయిందని చరిత్రకారులు అంచనా. ఇక్కడి ప్రజలు వందలు, వేల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసపిటోమియా పచ్చికబైళ్ళని ఉపయోగించుకుంటూ ప్రజలు జీవించారు.

ప్రశ్న 2.
బాబిలోనియా నగర ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
ప్రపంచ నాగరికతలలో ప్రముఖ పట్టణం బాబిలోనియా. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. దీని చుట్టూ మూడు రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయములు ఉండేవి. ఆనాటి దేవాలయాన్ని ‘జిగూరత్’ అంటారు. ఈ జిగూరత్లు మెట్లు కలిగిన ఎత్తు నిర్మాణాలు. ఈ పట్టణాన్ని క్రీ.పూ. 593లో ఆర్కిమేడియన్లు ఆక్రమించారు. ఆ తరువాత కాలంలో క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ ఆక్రమించారు. అప్పటికే బాబిలోనియా గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రశ్న 3.
మట్టిబిళ్ళలను టేబ్లేట్స్ అని ఎందుకంటారు ?
జవాబు:
వేల సంవత్సరాల క్రితం మొసపిటోమియా వాసులు ప్రతిరోజు జరిపే లావాదేవీలు, వ్యాపారం, నక్షత్ర పరిశోధనలు, సాహిత్యం మొదలైనవి మట్టిబిళ్ళలపై వ్రాయించుట, చిత్రించుట ప్రారంభించారు. అరచేతిలో సరిపోయే విధంగా ఈ |బిళ్ళలను మట్టితోను, రాతితోను, సున్నపు ముద్దలతోను తయారుచేసేవారు. అరచేతిలో సరిపడే సున్నపు ముద్ద బిళ్ళ తడిగా ఉన్నప్పుడు దాని ఉపరితలాన్ని నునుపుగా చేసి దానిపై పదునుగా ఉండే సూదిలాంటి పరికరంతో వివరాలు చెక్కేవారు. తడిగా ఉన్న వీటిని ఎండబెడితే అవి చెరగని బిళ్ళలుగా మారేవి. అనేక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు ఈ బిళ్ళలపై చెక్కుట వలన వేలాదిగా టేబ్లెట్స్ లభిస్తున్నాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 4. మెసపిటోమియా సామాజిక పరిస్థితులు రాయండి.
జవాబు:
మెసపిటోమియా నాగరికత నాటి సమాజంలో ధనవంతులు, సాధారణ ప్రజల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ధనవంతులు మరింత ధనవంతులు కాగా, సామాన్యులు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేసేవారు. ధనవంతులు దేశంలోని అధికశాతం ధనాన్ని, బంగారం, ఆభరణాలు, కలపవస్తువులు, సంగీత | పరికరాలు అనుభవించేవారు. ‘ఉర్’ నగర రాజుల సమాధులలో విలువైన ఆభరణాలు లభించాయి.

మెసపిటోమియా నాగరికతలో కుటుంబాలు చిన్నవిగా ఉండేవి. తండ్రి కుటుంబానికి పెద్ద. వివాహ సమయంలో ఇరువర్గాలు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు. తండ్రి ఆస్తికి కుమారుడు మాత్రమే హక్కుదారులు, కుమార్తెలకు కొంత మొత్తం బహుమతి రూపంలో లభించేది తప్ప వారికి ఆస్తి హక్కు లేదు. నాటి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ చేసేవారు. టర్కీ, ఇరాన్ వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగేది.

ప్రశ్న 5.
మెసపిటోమియా వ్రాత విధానం గురించి తెలుపుము.
జవాబు:
ప్రాచీన సమాజంలోని ప్రజలు వివిధ శబ్దాలను తమ భావాలను వ్యక్తపరుచుకోవడానికి ఉపయోగించారు. వ్రాత పద్ధతి అనగా ‘ప్రజలు మాట్లాడే పదాలకు కంటికి కనబడే చిహ్నాలు’. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అక్షరాలు రాసే విధానం, జరిగిన సంఘటనలు, లెక్కలు మొదలైనవి రాయడం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు.
సుమారు ఐదువేల సంవత్సరాలకు మునుపు మెసపిటోమియా ప్రజలు తమ భావాలు, వివరాలు, లెక్కలు వంటి వివరాలను భద్రపరుచుకోవడానికి వ్రాత విధానాన్ని ప్రారంభించారు. మొదట ఈ లిపిలో ఎక్కువగా చిత్రాలు కనిపించాయి. ఆ కాలం నాటి పంటలు, వాటిపై ప్రభుత్వం విధించే పన్నుల వివరాలు ఈ చిత్రాల ద్వారా వివరించబడ్డాయి. కాలక్రమంలో వ్రాత విధానం ప్రాధాన్యత పెరిగి కొన్ని పదాలు, వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారమ్ అంటారు. క్రీ.పూ. 3200 కాలంలో మొదటిసారి మట్టిబిళ్ళపై వ్రాత ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్యూనిఫారమ్.
జవాబు:
క్రీ.పూ. 3500 – 3200 సంవత్సరాల నాడే ప్రపంచ చరిత్రలో తొలిసారిగా అక్షరాలు రాసే విధానం ప్రారంభించినవారు మెసపిటోమియా ప్రజలు. వారు ప్రారంభించిన వ్రాత విధానంలో తొలినాళ్ళలో ఎక్కువగా చిత్రాలు కనిపించేవి. కాలక్రమంలో పదాలకు వాటి అర్థానికి తగిన చిహ్నాలు అభివృద్ధి చెందాయి. ఈ పద్ధతిని క్యూనిఫారం
అంటారు.

ప్రశ్న 2.
అక్కాడియన్ నాగరికత
జవాబు:
మెసపిటోమియా నాగరికత కాలక్రమంలో సమర్ ‘అక్కడ్’ ప్రాంతాలకు విస్తరించింది. తరువాత అక్కాడియన్ రాజ్యంగా రూపొందింది. అక్కాడియన్ రాజ్యం మెసపిటోమియాను చాలాకాలం పరిపాలించారు. ఈ నాగరికత సెమెటిక్ సుమేరియన్ భాషల వారిని ఒక పాలన క్రిందకు తెచ్చారు. క్రీ.పూ. 2400 నాటికి ఈ భాష అక్కాడియన్ భాషగా పిలవబడింది. ఈ కాలానికి ఈ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది.

ప్రశ్న 3.
మేరీ భవనం.
జవాబు:
పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ‘మేరీ భవనం’. ఈ భవనం క్రీ.పూ. 1810-1760 మధ్య కాలంలో పరిపాలించిన జీమరిలియన్ నివాస భవనం. ఈ భవనం ఎంతో విలాసవంతమైనది, విశాలమైనది. ఇందులోని విశాలమైన హాలులో దేశ, విదేశీ అతిధులతో చర్చలు జరిగేవి. ఈ రాజభవనం అందమైన అలంకరణలతో సమారు రెండు నుండి నాలుగు హెక్టార్లలో విస్తరించి ఉండేది. ఇందులో 260 గదులుండేవని తెలుస్తోంది.

ప్రశ్న 4.
ఉరుక్ నగరం.
జవాబు:
మెసపిటోమియా నాగరికతకు చెందిన మరో ప్రముఖ నగరం. ‘ఉరుక్’. క్రీ.పూ. 3000 సంవత్సరానికి చెందిన ఈ నగరం దేవాలయాల నగరంగా గుర్తింపు పొందింది. ఇది 250 హెక్టార్లు విస్తరించి ఉండేది. ఈ నగరం హరప్పా నాగరికతలోని మొహంజోదారో పట్టణం కంటే రెండు రెట్లు పెద్దది. క్రీ.పూ 2800 మధ్య కాలంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఉరుక్ నగరాన్ని విస్తరించారు. దీనిలో నగర విస్తీర్ణం 400 హెక్టార్లకు పెరిగింది. ఈ నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. వీటి నిర్మాణానికి యుద్ధ ఖైదీలను, స్థానికులను వాడుకునేవారు.

ప్రశ్న 5.
గణితశాస్త్ర పరిస్థితులు.
జవాబు:
మెసపిటోమియా ప్రజలు గణితశాస్త్రంలో అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వారి సంఖ్యాశాస్త్రంలో మరియు 10 గుణకాలకు ప్రాధాన్యత ఉండేది. మొదటి క్రమంలో 10 సంఖ్య వరకు ప్రాధాన్యత ఉండేది. తరువాత 6తో కూడిన గుణకాలు ఉపయోగించి 60 నుండి 600 వరకు లెక్కించేవారు. బహుశా 60 అనే సంఖ్య అనేక సంఖ్యలతో విభజనకు అనుకూలంగా ఉండేది. క్రీ.పూ. 1800 సంవత్సరం నాటి మట్టిబిళ్ళలు మెసపిటోమియా గణితశాస్త్ర పరిశోధనకు నిదర్శనం. గుణకాలు, విభజనలు, స్క్వేర్, స్క్వేర్టు విధానాలు ఈ బిళ్ళలలో కనిపిస్తాయి.

ప్రశ్న 6.
యూఫ్రిటిస్, టైగ్రిస్ నదులు.
జవాబు:
మెసపిటోమియా యూఫ్రిటస్, టైగ్రిస్ నదుల మధ్య విలసిల్లిన నాగరికత. తూర్పు టర్కీలోని టారస్ పర్వతాలలో పుట్టి సిరియా మీదుగా ఇరాక్‌లో ప్రవేశిస్తాయి. తమ ఉపనదులతో కలిపి మెసపిటోమియా (నేటి ఇరాక్)లో సారవంతమైన మట్టిగల మైదాన ప్రాంతాలను ఏర్పరచాయి. దీనితో ఈ ప్రాంతం వ్యవసాయయోగ్య మైదానాలుగా మారాయి. ఈ విధంగా ప్రవహించి ఈ నదులు పర్షియన్ గల్ఫ్ లో కలుస్తాయి.

AP Inter 2nd Year History Study Material Chapter 2 ప్రపంచ ప్రాచీన నాగరికత - మెసపిటోమియా - వ్రాత విధానం - నగర జీవనం

ప్రశ్న 7.
కాల నిర్ణయ విధానం.
జవాబు:
మెసపిటోమియా వాసులు సంవత్సరానికి 12 నెలలు, నెలకు 30 రోజులు, వారానికి 7 రోజులు, గంటకు 60 నిమిషాలు అనే కాల నిర్ణయ విభజన విధానాన్ని కనుగొన్నారు. ఈ కాల నిర్ణయ విధానం అలెగ్జాండర్ అనంతర కాలం నుండి ఎక్కువగా వాడుకలోకి వచ్చి రోమన్ సామ్రాజ్యానికి, అటు మహమ్మదీయ రాజ్యాలకు, మధ్య ఐరోపా దేశాలకు వ్యాపించింది.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 2nd Year History Study Material 1st Lesson తొలికాలపు మానవ చరిత్ర

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. హోమినాయిడ్స్కు హోమోనిడ్స్కు గల భేదాలు తెలపండి.
జవాబు:
2.4 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రైమేట్స్‌లో ఒక భాగమైన హోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది. హోమోనిడ్స్, హోమినాయిడ్స్ నుండి ఆవిర్భవించడం వలన కొన్ని సారూప్యాలు కనిపించినా, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి.
హోమినాయిడ్స్

 1. చిన్న మెదడు.
 2. నాలుగు కాళ్ళపై నడిచే జీవి అయితే ముందరి కాళ్ళు సులువుగా ఉండేవి.
 3. చేతులు అంత సులువుగా ఉండేవి కావు.

హోమోనిడ్స్

 1. పెద్ద మెదడు
 2. నిలువుగా నిలబడి, రెండు కాళ్ళపై నడిచే వ్యక్తి.
 3. చేతులు ఉపయోగించి పనిచేస్తూ భిన్నంగా ఉండేవారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 2.
ఆదిమ మానవుని ఆహారపు అలవాట్లు.
జవాబు:
ఆదిమానవుడు ఆహారాన్ని వివిధ రకాలుగా సంపాదించుకున్నాడు. ఉదా: ఆహార సేకరణ, ఆహారాన్ని పోగు చేసుకోవడం, వేట, చేపలు పట్టడం.

ఆహార సేకరణ: ఆహార సేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్ ట్యూబర్స్ మొదలగునవి. మనకు ఎముక అవశేషాలు బాగా లభించినా, మొక్కల అవశేషాలు తక్కువగానే లభించాయి.

ఆహారాన్ని పోగుచేయడం: తొలినాటి హోమోనిడ్లు సహజంగా చనిపోయిన జంతువుల మాంసం లేక ఇతర జంతువులు, పక్షులు మొదలయినవి చంపి తినగా మిగిలిన మాంసం, ఎముకలు పోగుచేసుకున్నారు.

వేట: వేట అనే ప్రక్రియ దాదాపు ఐదు లక్షల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం వేటాడి పెద్ద పెద్ద జంతువులను చంపడం యొక్క ఆధారాలు ఇంగ్లాండ్ లోని బాక్స్ గ్రేవ్, జర్మనీలోని షోనినిజెన్ ప్రాంతాలలో లభించాయి.
చేపలు పట్టుట: ఇది చాలా ముఖ్య ఆహారము. చేపలు, మనుషుల ఎముకలు వివిధ ప్రాంతాలలో లభించాయి.

ప్రశ్న 3.
ప్రాచీన మానవులు తయారుచేసిన పనిముట్లను తెలపండి.
జవాబు:
సుమారు 4 లక్షల సంవత్సరాల నుంచి లక్షా పాతికవేల సంవత్సరాల క్రితం వరకు ప్రాచీన మానవులు వాడిన వేలాది పనిముట్లు లభించాయి. ఉదాహరణకు కెన్యాలో వేలాది చేతి గొడ్డళ్ళు, ప్లేక్ పనిముట్లు లభించాయి. ఈ పనిముట్లను ఆహార సేకరణ, వినియోగం కొరకు ఉపయోగించేవారు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆస్ట్రలోపిథికస్.
జవాబు:
ఆస్ట్రలోపిథికస్ అనే పదము లాటిన్ మరియు గ్రీకు పదాలనుండి వచ్చింది. లాటిన్ పదం ‘ఆస్ట్రిల్’ అనగా దక్షిణ మరియు గ్రీకు పదమైన పిథకస్ అనగా ‘ఏప్’ అని ‘ఆస్ట్రలోపిథకస్’ అనగా ‘దక్షిణప్రాంత ఏప్’ అని అర్థం. ఆస్ట్రలోపిథికస్ రెండు కాళ్ళ మీద నడవటం వలన చేతులతో పిల్లలను కని, బరువులు మోయడానికి వీలుపడింది. కాళ్ళ శక్తి పొదుపు కావడంతో అది పరిగెత్తడానికి కాలక్రమేణా ఉపయోగపడింది.

ప్రశ్న 2.
హోమో సేపియన్స్.
జవాబు:
జర్మనీలోని హెడెల్బర్గీ పట్టణంలో హోమో అవశేషాలు దొరకటం వలన అతనిని హోమో హెడెల్ బర్గెన్సిస్ అని నియాండర్ లోయలో దొరికిన అవశేషాల వలన అతని హోమోసెపియన్ నియాండర్తలనినీస్ అని పిలిచారు. హోమో సేపియన్లకు పెద్ద మెదడు, చిన్న దవడ, చిన్న పళ్ళు ఉంటాయి. మెదడు పరిమాణం పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి,
తెలివితేటలు పెరిగాయి. హోమోసేపియన్ల తొలి ఆధారాలు ఆఫ్రికాలో లభించాయి.

ప్రశ్న 3.
ఆహార సేకరణ.
జవాబు:
ప్రాచీన మానవుడు తనకు లభించిన వాటిని ఆహారం కోసం సేకరించుకొనేవాడు. ఆహారసేకరణలో విత్తనాలు, బెర్రీలు, పండ్లు, నట్స్, ట్యూబర్స్ మొదలైనవి. పరిశోధనలో ఎముకల అవశేషాలు బాగా లభించాయి. మొక్కల అవశేషాలు తక్కువగా లభించాయి. ఇప్పటివరకు పురావస్తు శాస్త్రవేత్తలు మానవుని తొలినాటి కార్బొనైజ్ డ్ విత్తనాల ఆధారాలు తక్కువగానే కనుగొన్నారు.

AP Inter 2nd Year History Study Material Chapter 1 తొలికాలపు మానవ చరిత్ర

ప్రశ్న 4.
నియాండర్తల్ మనిషి.
జవాబు:
నియాండర్తల్ మానవుడు నేటి ఆధునిక మానవజాతియైన హోమో సేపియన్లకు సన్నిహితుడు. జర్మనీలోని నియాండర్ లోయలో ఇతనికి సంబంధించిన అవశేషాలు లభించడం వలన ‘నియాండర్తల్ మనిషి’ అని పిలిచారు. ఇతని శాస్త్రీయ నామం ‘హోమో నియాండర్తలనిస్’ విశాలమైన దవడ, వెడల్పాటి ముక్కు, హోమో సేపియన్లకున్నంత పెద్ద మెదడు ఉండేది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 12th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశంలో జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలను వివరించండి.
జవాబు:
క్రీ.శ. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనతో వచ్చిన వ్యవస్థాగత మార్పు విద్యావంతులైన ఒక కొత్త సామాజిక వర్గ ఆవిర్భావానికి దారితీసింది. పాశ్చాత్య విద్య, సంస్కృతితో ప్రభావితులైన విద్యాధికులు సామాజిక ఉద్యమాలకు పూనుకున్నారు.

సామాజిక సంస్కరణోద్యమాలు: 19వ శతాబ్ద ప్రారంభం నాటికి సమాజంలో నెలకొన్న సామాజిక కట్టుబాట్లు స్త్రీలను, దళితులను హీనస్థితికి గురిచేశాయి. బాలికల భ్రూణ హత్య, సతి, నిర్బంధ వైధవ్యం, బాల్యవివాహాలు ఆనాటి సమాజంలో నెలకొన్న కొన్ని దురాచారాలు. అయితే భారతీయ విద్యావంతులు ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్యుల్లోని ఉదార, ఆశావాద దృక్పథాన్ని చూసి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. భారతీయ సమాజంలోని వివక్షాపూరిత దృక్పథం, వెనకబాటుతనం వారి సంస్కరణాభిలాషను దృఢతరం చేసింది.

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంస్కరణల్లో రెండు ప్రధాన ధోరణులున్నాయి. అవి మత, సామాజిక సంస్కరణలు, రాజారాంమోహన్ రాయ్ మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించాడు. ఇతని కృషివల్ల 1829 డిసెంబర్ 4న సతీ దురాచారం నిషేధించబడింది. అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ‘సతి’ని చట్టరీత్యా నేరంగాను, శిక్షార్హంగాను ప్రకటించాడు. బ్రహ్మసమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం, థియోసాఫికల్ సంఘం లాంటి మత సంస్కరణాభిలాష గల సంస్థలు తమ కార్యక్రమాలను నడిపించాయి. బ్రహ్మసమాజం బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించింది. దయానంద సరస్వతి నాయకత్వంలో ఆర్యసమాజం విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉద్యమించి ‘వేదాలకు తరలండని’ ప్రబోధించారు. కరుడుగట్టిన సమాజ పునర్వ్యవస్థీకరణకు భారత తాత్విక సంస్థలు, థియోసాఫికల్ సొసైటీవంటివి పూనుకొన్నాయి. హేతుబద్ద పూజా విధానాన్ని రామకృష్ణ మిషన్ వారు ప్రవచించారు. జొరాస్ట్రియన్ల సంస్థ, రహనుమాయి మజ్దాయాన్ సభ, జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతుల పరిరక్షణను ప్రబోధించింది.

ఈ సంస్కర్తలు చేపట్టిన కార్యక్రమాలైన వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య ఉదార పాశ్చాత్య లౌకిక ధోరణుల్ని సూచిస్తాయి. పర్దా నిషేధం, బాల్యవివాహం రద్దు, బహు భార్యత్వం, దళితుల పట్ల వివక్షను రూపమాపటం కోసం సంస్కర్తలు పూనుకొన్నారు. వివాహ వయోపరిమితి పెంపు, స్త్రీల ఆస్తి హక్కుల్ని వారు కాంక్షించారు. ఈ దురాచారాలను రూపుమాపడం కోసం చట్టాల ఏర్పాటుతోపాటు దేవాలయ ప్రవేశం, భోజన విషయాల్లో వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, అలీఘర్ సంస్థ, అమృత్‌సర్‌లోని దివానల్సా, బొంబాయి సోషల్ సర్వీసీగ్, ఇండియన్ నేషనల్ సోషల్ సర్వీస్ లీగ్‌లు, సత్యశోధక్ సమాజ్, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కృషి చేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేలు స్త్రీల విద్యావాప్తి, ముఖ్యంగా దళిత బాలికల విద్యా వ్యాప్తికై కృషి చేశారు. వితంతు స్త్రీల సంతానానికి అనాథాశ్రమం కట్టించారు. క్రీ.శ. 1873లో సత్యశోధక్ సమాజాన్ని 1882లో దీనబంధు సార్వజనిక్ సభను స్థాపించి వీటి ద్వారా సంస్కరణలు చేపట్టారు. పండిత రమాబాయి సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. సంస్కృతంలో ప్రావీణ్యం గడించి సమాజంలోని మూఢాచారాలను ఏవగించుకొంది. సంస్కృత ప్రావీణ్యానికి ‘పండిత’ అనే గౌరవ బిరుదు రమాబాయి పొందారు. అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సామాజిక అన్యాయాల నుంచి హిందూ స్త్రీలను రక్షించడం కోసం కృషి చేశారు. పూణేలో మహిళా ఆర్యసమాజాన్ని, బొంబాయిలో శారదా సదన న్ను స్థాపించారు.

బెంగాల్లో హెన్రీలూయిస్ వివియన్ డొరేజియో హేతువాద దృక్పథంతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపాడు. విద్యాసంస్కరణలకోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పూనుకొన్నారు. ఈయన కృషి వల్లే 1856లో హిందూ స్త్రీల పునర్వివాహానికి ఉన్న నిర్బంధాలన్నీ తొలగి చట్టం చేయడమైంది. ప్రముఖ సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1825లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థే తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఆ తర్వాత కాలంలో వివేకానందుడుగా ప్రఖ్యాతి చెందిన నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ మిషన్ స్థాపించాడు. దీని ద్వారా యువతలో దేశభక్తిని రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా వారిని ఉత్తేజపరిచాడు.

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యత తెల్పండి.
జవాబు:
భారతీయులలో పెరుగుతున్న జాతీయభావం బెంగాల్ విభజనతో బహిర్గతమై వందేమాతరం ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం భవిష్యత్‌లో జరగబోయే ఉద్యమాలకు మార్గదర్శకమైంది.

కారణాలు: ఈ క్రింది కారణాలు వందేమాతర ఉద్యమానికి దోహదపడ్డాయి.
1) మితవాదుల వైఫల్యం: కాంగ్రెస్ స్థాపన జరిగినప్పటి నుంచి నాయకులు తమ కోర్కెల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను అవలంబించారు. వారు ఉద్యమించిన 20 సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా సాధించేందేమీ లేదు. దీనితో మితవాదుల యెడల ప్రజలలో అసంతృప్తి బయలుదేరింది.

2) అతివాద జాతీయభావం: అప్పటికే జాతీయోద్యమంలో తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి అతివాద జాతీయ నాయకులున్నారు. పోరాటం ద్వారానే తమ కోర్కెలు తీరుతాయని వారు భావించి తమకు స్వరాజ్యం కావాలని ప్రకటించారు.

3) ఆంగ్లేయుల విభజించు పాలించు విధానం: ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని దెబ్బతీయటానికి బ్రిటీషు ప్రభుత్వం “విభజించి, పాలించు” అనే సాధనాన్ని వినియోగించింది. భారతీయులలోని ఐక్యతను దెబ్బతీసి, వారిని బలహీనపరచి, తద్వారా తాను లబ్ది పొందాలని భావించింది. ఈ లక్ష్య సాధనకు బెంగాల్‌ను విభజించింది.

4) బెంగాల్ విభజన: బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి ఆయువుపట్టు. దానిని విభజించటం ద్వారా జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కర్జన్ ప్రభువు తలపోశాడు. ఈ కారణంగా బెంగాల్ నుంచి 3 కోట్లకు పైగా జనాభా ఉన్న తూర్పు బెంగాల్, అస్సాంలను విడదీసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాడు. బెంగాల్ రాష్ట్రం అతివిశాలమైందని, పాలనా సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చని ప్రకటించాడు. ప్రజల్లో పెరుగుతున్న జాతీయ భావాన్ని మొగ్గలోనే తుంచేయడానికి, కాంగ్రెసు, ప్రజలను విడదీయటానికి ఆంగ్లేయులు ఈ పన్నాగం పన్నారని భారతీయులు భావించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు ప్రారంభించిన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమం అంటారు. దీనిని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు.

వందేమాతరం ఉద్యమం: వందేమాతరం ఉద్యమం కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజాఉద్యమం. బంకించంద్రుని ‘ఆనందమఠ్’ నవలలోని ‘వందేమాతరం’ గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీనిని వందేమాతర ఉద్యమం అన్నారు. ఉద్యమం బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాక, దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.

బహిష్కరణోద్యమం: ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటీషు యాజమాన్యంలో ఉన్న విద్యాలయాలను బహిష్కరించటం దేశవ్యాప్తంగా జరిగాయి. విదేశీ వస్త్రాలను ఉద్యమకారులు కుప్పలు కుప్పలుగా పోసి తగులబెట్టారు. ఉద్యమంలో హిందువులు, మహమ్మదీయులు ఐక్యతతో పాల్గొన్నారు.

స్వదేశీ ఉద్యమం: ఈ కాలంలో ఉద్యమకారులు స్వదేశీ ఉద్యమాన్ని కూడా నడిపారు. స్వదేశీ వస్తువులకు ఆదరణ లభించింది. స్వదేశీ భావన అన్ని రంగాలకు వ్యాపించింది. విద్య, సంస్కృతి, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలలో స్వదేశీ భావం ప్రజ్వరిల్లింది.

నిర్మాణాత్మక కార్యక్రమం: స్వదేశీ, బహిష్కరణోద్యమాలతో పాటు ప్రజలు నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ విద్యాలయాలను స్థాపించారు.

ప్రభుత్వ దమన నీతి: ఈ ఉద్యమాన్ని అణచటానికి ప్రభుత్వం దమననీతిని సాగించింది. విద్యార్థులను లాఠీలతో కొట్టించింది. అనేకమంది నాయకులను ఎటువంటి విచారణ లేకుండా జైలులో పెట్టించింది. వందేమాతరం నినాదాలు చేయటం, జెండాలను ధరించటం, ఊరేగింపులను జరపటాన్ని నిషేధించింది. పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాసింది. కర్జన్ తరువాత వచ్చిన వైస్రాయ్ లార్డ్ మింటో దేశద్రోహ చట్టాన్ని, విస్ఫోటక పదార్థాల చట్టాన్ని, భారతీయ పత్రికా చట్టాన్ని మొదలైన వానిని చేసి ప్రజల హక్కులను అణగద్రొక్కాడు. తిలక్‌కు 6 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించబడింది. అరవింద ఘోష్ అలీపూర్ బాంబు కేసులో ఇరికించబడ్డాడు. సురేంద్రనాథ్ బెనర్జీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావులు నిర్బంధించబడ్డారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వం మహమ్మదీయులను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది.

విప్లవోద్యమం: ప్రభుత్వం అనుసరించిన దమననీతికి వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులను హత్యచేయడానికి కొందరు యువకులు రహస్య సంఘాలుగా ఏర్పడ్డారు. భూపేంద్రనాథ్ దత్, వి.డి. సావర్కర్, ఖుదీరామ్ బోస్ మొదలైనవారు వీరిలో ప్రముఖులు. ప్రభుత్వం ఖుదీరామ్ బోస్‌కు కింగ్స్ ఫోర్డ్ప హత్యాప్రయత్నం చేసినందుకు మరణశిక్ష విధించింది. ఈ ఉద్యమం బ్రిటిష్ అధికారులను భయభ్రాంతులను చేసింది. భారతీయులను తృప్తిపరచటానికి, మితవాదులను, అతివాదులను విడదీయడానికి, హిందూ, మహమ్మదీయుల మధ్య స్పర్ధలు సృష్టించటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909 భారతీయ కౌన్సిల్స్ చట్టాన్ని చేసింది. అయినా ఈ ఉద్యమం కొనసాగింది.

బెంగాల్ విభజన రద్దు: లార్డ్ మింటో స్థానంలో వైస్రాయ్ గా వచ్చిన లార్డ్ హార్డింజ్ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొన్నాడు. బెంగాల్ విభజన రద్దుచేయాలని, అస్సాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని బీహార్, ఛోటా నాగపూర్, ఒరిస్సాలను ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించగానే 1911లో బెంగాల్ విభజన రద్దయింది.

ఫలితాలు: బెంగాల్ విభజన కొన్ని ముఖ్య ఫలితాలనిచ్చింది.

 1. కేవలం నిరసనలు, ప్రదర్శనలు, తీర్మానాలు ఏవిధంగాను పనికిరావని, తీవ్రమైన చర్యలు అవసరమని కాంగ్రెస్ భావించింది. తీర్మానాలకు మద్దతుగా ప్రజాశక్తి తోడైతేగాని సమస్యలు పరిష్కారం కావని ప్రజలు భావించారు.
 2. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం రూపుదిద్దుకుంది.
 3. భారత జాతీయ కాంగ్రెస్ “స్వరాజ్యం” కావాలని కోరింది.
 4. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం మంచి ఊపునందుకున్నాయి. దీనితో భారతీయ పరిశ్రమలు బాగా లబ్దిపొందాయి.
 5. ఈ ఉద్యమం సాంస్కృతిక కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. జాతీయ కవిత ఈ కాలంలో పెల్లుబుకింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ మొదలైన వారి రచనలను ప్రభావితం చేశాయి. జాతీయవిద్యకు ప్రోత్సాహం లభించింది.
 6. జాతీయోద్యమం తీవ్రతరమైంది. అతివాదులు శాంతియుత ప్రతిఘటనోద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రజలు ప్రభుత్వంతో సహకరించడానికి నిరాకరించడం ఇందులోని ప్రధానాంశం.
 7. ఉగ్రవాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఐరిష్ ఉగ్రవాదులు, రష్యన్ నిహిలిస్టుల విధానాలను అనుసరించి బ్రిటీషు ఉద్యోగులను చంపటానికి పూనుకొన్నారు.
 8. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ లో తీవ్ర భేదాభిప్రాయాలకు దారితీసింది. అతివాదులు, మితవాదులు అను రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిపోయింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి.
జవాబు:
గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో మొదటిది సహాయ నిరాకరణోద్యమం. ఖిలాపత్ ఉద్యమ సందర్భంగా వ్యక్తమైన హిందూ, ముస్లిం సంఘీభావం గాంధీని సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 1920 సెప్టెంబరులో కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తీర్మానం ఆమోదించడమైంది. 1920 డిసెంబర్ విజయరాఘవాచారి అధ్యక్షతన నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో దాన్ని ధృవీకరించడమైంది. రెండు సమావేశాల్లోనూ బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. దాస్ సూచనలను కూడా తీర్మానంలో చేర్చడం ద్వారా గాంధీ ఆయనను సమ్మతింపచేశాడు.

ఉద్యమ కార్యక్రమం: ఈ ఉద్యమానికి మూడు అంశాల కార్యక్రమం కలదు. అవి: బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలు, శాసనోల్లంఘనం.
బహిష్కరణ:

 1. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, పదవులను త్యజించడం.
 2. ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్మానాలు, తదితర కార్యక్రమాలను బహిష్కరించడం.
 3. విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాలను బహిష్కరించడం.
 4. ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేయడం.
 5. ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం. 6) విదేశీ వస్త్రాలను, వస్తువులను బహిష్కరించడం.
 6. శాసనసభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం.
 7. 1921లో ఇంగ్లాండ్ దేశపు యువరాజు పర్యటన బహిష్కరించడం మొదలైనవి బహిష్కరణోద్యమంలో ముఖ్యమైనవి.

నిర్మాణాత్మక కార్యక్రమాలు:

 1. తిలక్ స్మారక నిధికి విరాళాలు వసూలు చేయడం.
 2. రాట్నాలపై నూలు వడికి, ఖద్దరు వస్త్రాలు తయారుచేయడం.
 3. అస్పృశ్యతను నిర్మూలించడం.
 4. మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఉద్యమం నడపడం.
 5. జాతీయ విద్యాలయాలు నెలకొల్పడం.
 6. హిందూ, ముస్లిం సమైక్యతను సాధించడం అనేవి నిర్మాణాత్మక కార్యక్రమాలు.

శాసనోల్లంఘనం: పన్నులు చెల్లించటం, నిరాకరించటం ద్వారా కాంగ్రెస్ శాసనోల్లంఘనాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
ఉద్యమ గమనం 1920లో ప్రారంభించిన ఈ ఉద్యమంలో ప్రజలు తమ విభేదాలను మరిచి చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ విద్యాసంస్థలను బహిష్కరించి జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పారు. నెహ్రూ, చిత్తరంజన్ దాస్, ప్రకాశం పంతులు మొదలైన నాయకులు న్యాయస్థానాలను బహిష్కరించి న్యాయవాద వృత్తిని త్యజించారు. సుభాష్ చంద్రబోస్ మొదలైనవారు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించారు. హిందువుల ఐక్యతను పెంపొందించటానికి అస్పృశ్యతా నివారణను చేపట్టారు.

ఈ ఉద్యమం ఆంధ్రాలో అద్భుత విజయాన్ని సాధించింది. చీరాల-పేరాల సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి. పంజాబ్‌లో అకాలీలు మహంతులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించారు. భారతదేశ సందర్శనానికి వచ్చిన వేల్స్ యువరాజు బహిష్కరించబడ్డాడు. ఈ ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం దమనకాండను సాగించింది. అయినప్పటికి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇంతలోనే ఉత్తరప్రదేశ్‌లోని చౌరీచౌరా అనేచోట హింస చెలరేగి అది అనేకమంది పోలీసులు సజీవదహనానికి దారితీసింది. హింసను సహించలేని గాంధీజీ ప్రజలు ఇంకా అహింసా పద్ధతులకు అలవాటుపడలేదని భావించి ఉద్యమాన్ని నిలుపు చేశాడు.

ఫలితాలు: సహాయ నిరాకరణోద్యమం అనేక గొప్ప ఫలితాలనిచ్చింది.

 1. భారత ప్రజలలోను, కాంగ్రెస్ నాయకులలోను నిరాశ ఏర్పడింది. దీని ఫలితంగా కాంగ్రెస్లోలో చీలిక వచ్చింది.
 2. ఉద్యమ కాలంలో హిందూ-మహమ్మదీయుల ఐక్యత సాధించబడింది.
 3. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయభావం దేశం నలుమూలలా విస్తరించింది.
 4. ప్రజలలో ప్రభుత్వమంటే భయంపోయి వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
 5. కాంగ్రెస్‌లో వామపక్ష ధోరణులు ప్రారంభమైనాయి.
 6. ప్రభుత్వం దమననీతిని ఎదుర్కొనేందుకు భారతీయ యువత విప్లవోద్యమానికి దిగింది.
 7. ఈ ఉద్యమ విరమణ అనంతరం కాంగ్రెస్-లీగ్ మిత్రత్వం రద్దయింది. ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు చెలరేగాయి.

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీ నిర్వహించిన పాత్ర అద్వితీయమైనది. తన నాయకత్వ పటిమతో ఆయన భారత జాతీయ శక్తులను ఏకం చేసి, వాటిని ఒక త్రాటిపై నడిపించిన ఘనుడు. 1919 నుంచి 1947 వరకు గల కాలంలో స్వాతంత్ర్యోద్యమానికి తానే స్ఫూర్తిగా మారిన మహామనిషి, అందువలననే 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీ యుగం” అని పిలుస్తారు.

తొలి జీవితం: గాంధీజీ పూర్తిపేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబరు 2వ తారీఖున సౌరాష్ట్రలోని పోర్బందరులో జన్మించాడు. తన 19వ ఏట ఉన్నత విద్యకై లండన్ వెళ్ళి న్యాయవాద పట్టా పుచ్చుకొని మాతృదేశానికి వచ్చి రాజకోట, బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు.
గాంధీజీ సిద్ధాంతాలు: స్వాతంత్య్ర సముపార్జనకై గాంధీజీ చేపట్టిన రెండు ఆయుధాలలో ఒకటి సత్యాగ్రహం, రెండు అహింస. ‘సత్యాగ్రహం అనగా సత్యమునకు కట్టుబడి ఉండటం అని అర్థం. సత్యాగ్రహము ఐదు విధాలు. అవి:

1) సహాయ నిరాకరణ: శాంతియుత సహాయ నిరాకరణ ద్వారా ఎటువంటి శక్తివంతమైన ప్రభుత్వాన్నైనా పడగొట్టవచ్చు. శాంతియుత ప్రతిఘటన ద్వారా హర్తాళ్ పాటించి, ప్రభుత్వం దమననీతిపై పోరాటం సాగించాలి. మన కోరికలు స్వచ్ఛమైనవిగాను, సమంజసమైనవిగాను ఉండాలి.

2) నిరాహారదీక్ష: ఇతర పద్ధతులు విఫలమైనప్పుడే దీనిని చేపట్టాలి.

3) హిజరత్: హింసాపూరిత వాతావరణంలో ఇమడలేని వ్యక్తులు తమంతట తాముగా ఇతరులకు దూరంగా ఉండాలి.

4) బహిష్కరణ: అన్నిరకాల చెడుకు వ్యతిరేకంగా చేపట్టే నిరాకరణ. ఒక వ్యక్తిని ఆ పనిని చేయకుండా నిరోధించటానికి చేపట్టే శాంతియుత పికెటింగ్. దీనిలో హింసకు తావులేదు.

5) శాసనోల్లంఘనం: ఈ చర్యను చేపట్టే ముందు చర్చలు, ప్రదర్శనలు జరిపి విఫలమైనప్పుడు మాత్రమే శాంతియుత ప్రతిఘటన చేపట్టాలి. ప్రతి చట్టాన్ని ఉల్లంఘించాలి.

అహింస: అహింసా పరమోధర్మః అన్నారు మనవారు. దానినే గాంధీజీ తన ఆయుధంగా స్వీకరించాడు. బౌద్ధ, జైనమతాలు, అశోక చక్రవర్తి ఈ విషయంలో గాంధీజీకి మార్గదర్శకులు. గాంధీజీకి ‘హింస’ అంటే పడదు. మాటల ” ద్వారాగాని, చేత ద్వారాగాని, ఆలోచనల ద్వారా గాని ఎవ్వరికీ హాని కలిగించకూడదన్నది ఆయన సిద్ధాంతం. దీనిలో మూడు రకాల వారున్నారు. మొదటిది అహింసను ఒక సిద్ధాంతంగా నమ్మి ఆచరించే ధైర్యవంతులు, రెండవది అహింసను ఒక విధానంగా చేపట్టేవారు, మూడవది భయస్తులు చేపట్టే అహింసా విధానం. దీనిని గాంధీజీ నిరసించాడు. అవమానాలపాలై, పిరికితనంతో విదేశీ పాలకులకు లొంగి ఉండటం కంటే భారతదేశం తన గౌరవాన్ని తిరిగి పొందటానికి అవసరమైతే ఆయుధాలు చేపట్టవచ్చునని కూడా ఆయన ఉద్బోధించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

దక్షిణాఫ్రికా వెళ్లటం: గాంధీజీ 1893లో ఒక కేసు విచారణ నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లాడు. అచ్చట భారతీయుల దయనీయ పరిస్థితులు చూసి బాధాతప్తుడై వారి హక్కుల పరిరక్షణకై సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమ సాధనాలు ప్రవేశపెట్టి విజయాన్ని సాధించాడు.

భారత రాజకీయాలలో పాల్గొనుట: గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి 1915లో భారతదేశానికి తిరిగివచ్చి సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించాడు. బీహార్‌లోని చంపారన్ రైతులకు నాయకత్వం వహించి ఆంగ్లో-ఇండియన్ తోట యజమానుల బారినుండి వారిని రక్షించి ప్రఖ్యాతిగాంచాడు. అహ్మదాబాద్ మిల్లు యజమానులబారి నుండి కార్మికులను సంరక్షించి వారి ఉద్యమాన్ని విజయవంతం చేశాడు. గుజరాత్లో కరువు సంభవించినపుడు రైతులను ఋణబాధల నుండి, పన్ను చెల్లింపులనుండి విముక్తి గావించుటకు ‘కైరా’ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయాన్ని సాధించాడు. రౌలట్ శాసనము, జలియన్ వాలాబాగ్ మారణహోమం, గాంధీజీలో నూతన మార్పులు తెచ్చాయి. తిలక్ మరణానంతరం గాంధీజీ జాతీయోద్యమానికి నాయకత్వం వహించి జాతీయోద్యమాన్ని దిగ్విజయంగా నడిపాడు.

జాతీయోద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్ర: గాంధీజీ జాతీయోద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం. జాతీయోద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు గల కాలాన్ని “గాంధీయుగం’ అంటారు.

ఎ) సహాయ నిరాకరణోద్యమం: గాంధీజీ 1920లో జాతీయ కాంగ్రెస్ నాగపూర్ సమావేశంలో శాంతియుత మార్గాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జన కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించాడు. దీనిని సాధించటానికి 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమై గాంధీజీ పేరు ప్రఖ్యాతులు పొందాడు. కానీ ఈ ఉద్యమం ‘చౌరీచౌరా’ సంఘటన ద్వారా విప్లవ ధోరణిలో ప్రయాణించుటచేత ప్రజలు శాంతియుత వైఖరికి సుముఖముగా లేరని ఉద్యమాన్ని నిలుపుదల చేసి పలు విమర్శలకు గురైనాడు. గాంధీజీ కారాగార శిక్షను అనుభవించాడు.

బి) శాసనోల్లంఘన ఉద్యమం: సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీజీ 1930లో “శాసనోల్లంఘనోద్యమము” ను ప్రారంభించాడు. నాటి ప్రభుత్వం ఉప్పుపై పన్నును విధించగా అది న్యాయసమ్మతం కాదని ఆ చట్టాన్ని ఉల్లంఘించి దండి గ్రామంలో ఉప్పు సత్యాగ్రహం జరిపి ఉప్పును తయారుచేశాడు. ఇదే జాతీయోద్యమ చరిత్రలో “దండి ఉప్పు సత్యాగ్రహం”గా పేరొందింది.

సి) రౌండేబుల్ సమావేశాలు: గాంధీజీ లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. తదుపరి వైస్రాయ్ ఇర్విన్‌తో ఒడంబడిక చేసుకొని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. జిన్నా వైఖరి వల్ల ఈ సమావేశం విఫలమైంది. మూడవ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు.

డి) పూనా ఒడంబడిక: బ్రిటిష్ ప్రధాని ‘మెక్ డోనాల్డ్’ భారతదేశంలో హరిజనులకు, క్రైస్తవులకు నియోజకవర్గ సౌకర్యాలను కల్పిస్తూ “కమ్యూనల్ అవార్డ్”ను ప్రకటించాడు. ఇది జాతీయ సమైక్యతకు హానియని గాంధీజీ బ్రిటిష్ పాలకుల వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు నిమ్నజాతుల నాయకుడైన డా. అంబేద్కర్ కృషి వల్ల “పూనా ఒప్పందం” జరిగి గాంధీజీ ఆమరణ నిరాహారదీక్ష విరమించాడు.

ఇ) క్విట్ ఇండియా ఉద్యమం: 1942లో క్రిప్స్ రాయబారాన్ని తోసిపుచ్చి 1942 ఆగస్టు 8వ తారీఖున ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలని “క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యఫ్) స్వాతంత్ర్య సముపార్జన: గాంధీజీ నడిపిన శాంతియుత ఉద్యమాలను అణచటంలో బ్రిటిష్ పాలకులు వైఫల్యం చెంది 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఈ విధంగా విదేశీయ పాలనలో దాస్యమును అనుభవించిన భారతదేశం గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్యము పొందింది.

ప్రశ్న 5.
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను, దాని వైఫల్యానికి కారణాలు వివరించండి.
జవాబు:
1941 డిసెంబర్లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. బ్రిటిష్ సామ్రాజ్య భాగాలైన సింగపూర్, బర్మాలను జపాన్ ఆక్రమించినది. జపాన్ సేన పురోగతిని ప్రతిఘటించడానికి భారతీయుల సహకారం అవసరమని బ్రిటిష్ ప్రభుత్వం భావించినది. అందుకుగాను సర్ఫర్డ్ క్రిప్స్న 1942లో భారతదేశం పంపినది. ఆయన భారతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన చేసిన ప్రతిపాదనలను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు 2. తక్షణం చేయదగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు.
1. దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేదా యుద్ధానంతరం చేయతలపెట్టిన మార్పులు:

 • యుద్ధానంతరము భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. భారతదేశానికి కామన్వెల్త్ నుండి వైదొలగే హక్కు కూడా ఉంటుంది.
 • యుద్ధం ముగిసిన తరువాత భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని రచించడానికిగాను రాజ్యాంగ పరిషత్ నెలకొల్పబడగలదు.
 • రాజ్యాంగ పరిషత్‌లో నైష్పత్తిక ప్రాతినిధ్య ప్రాతిపదికపై రాష్ట్ర శాసనసభల సభ్యులచే ఎన్నుకోబడిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల జనాభా నిష్పత్తిని బట్టి సంస్థానాధిపతులు నియమించు సభ్యులుండగలరు.

i) కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్ ఏర్పడడానికి హక్కులుండవలెను. స్వదేశీ సంస్థానాలకు కూడా అట్లే నూతన రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికి, లేకపోవటానికి స్వేచ్ఛ ఉండగలదు.

ii) బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయటం వలన ఉత్పన్నమయ్యే విషయాలను చర్చించటానికి రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య ఒక ఒడంబడిక కుదరవలెను.

2. తక్షణం చేయతగిన మార్పులు లేదా యుద్ధకాలానికి సంబంధించిన ప్రతిపాదనలు: తాత్కాలికంగా “రక్షణ” విషయాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ఉండగలదు. కాని భారతదేశ నైతిక, సైనిక, భౌతిక వనరులను సమీకరించే బాధ్యత భారత ప్రభుత్వానిదనీ, అందుకు భారత నాయకులు సలహా, సహకారములు అందించగలదని భావించబడినది.

క్రిప్స్ ప్రతిపాదనల మంచి, చెడ్డలు: క్రిప్స్ ప్రతిపాదనలు (1942) భారతదేశంలోని భిన్న రాజకీయ పక్షాలను సంతృప్తిపరచడానికి ఉద్దేశించినట్టివి. ఈ ప్రతిపాదనలు కాంగ్రెస్ డొమినియన్ ప్రతిపత్తి, రాజ్యాంగ పరిషత్, బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కు మొదలైన ఆశలు చూపెట్టినవి. లీగ్ కోరికయైన పాకిస్తాన్ గుర్తింపు ఈ ప్రతిపాదనలో నిబిడీకృతమై ఉన్న స్వదేశ సంస్థానాధీపతులకు నూతన రాజ్యాంగమును ఆమోదించటానికి లేదా తిరస్కరించడానికి స్వేచ్ఛగలదని ఈ ప్రతిపాదనలో హామీగలదు. అల్పసంఖ్యాకుల భయాలు కూడా అనేక పరిరక్షణల ద్వారా నివృత్తి చేయబడినాయి. ఈ ప్రతిపాదన ఆగస్ట్ ప్రతిపాదనకన్నా మెరుగైనదని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

పూర్తి డొమినియన్ ప్రతిపత్తితో నూతన భారత యూనియన్ ఏర్పాటు చేయబడగలదనటం, కామన్వెల్త్ నుంచి విడిపోయే హక్కుండటం ప్రోత్సాహక విషయాలే కాని కాంగ్రెస్‌కు పూర్తి స్వాతంత్ర్య ప్రకటన మినహా మిగిలిన విషయాలేవీ సమ్మతం కావు. డొమినియన్ ప్రతిపత్తి ఎంతకాలములోపు ఇవ్వబడగలదో నిర్ధారణ చేయలేదు.

కాంగ్రెస్ కోరికను మన్నించడం కోసం యుద్ధం తరువాత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయగలదని ప్రతిపాదన కలదు. రాజ్యాంగ పరిషత్ నిర్మాణ సంబంధమైన పథకం సవ్యమైనది కాదు. ఉదా: స్వదేశ సంస్థానాల ప్రజలకు రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ఎంపిక విషయాలలో ప్రమేయం ఉండదు. బ్రిటిష్ రాష్ట్రాల ప్రతినిధులు ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికపై నిర్ణయించబడగలదు. పైగా స్వదేశ సంస్థానాధిపతుల ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్‌లో ఉండటం అనేది భారత ప్రగతికి అవరోధమే.

నూతన రాజ్యాంగం ప్రకారం భారత యూనియన్ నుంచి బ్రిటిష్ రాష్ట్రాలకు, స్వదేశ సంస్థానాలకు విడిపోవటానికి హక్కు ఉండగలదనటం ఈ ప్రతిపాదనలో అతి ప్రమాదకరమైన భాగం. అంటే లీగ్ కోరికయైన పాకిస్తాన్ ఏర్పాటుకు బ్రిటిష్‌వారు సమ్మతించినట్లు అయినది. ఇది భారత యూనియన్ ఐక్యతకు గొడ్డలిపెట్టుకాగలదు.

వైస్రాయి కార్యనిర్వహణ మండలి సభ్యుల సంఖ్య మరికొందరు భారతీయ ప్రతినిధులతో విస్తృతపరచబడగలదని ఈ ప్రతిపాదనలో కలదు. కార్యనిర్వహణ మండలిగాని, దాని సభ్యులుగాని ఎలాంటి వాస్తవాధికారాన్ని చెలాయించలేరు. అధికారాలన్నీ వైస్రాయి చేతిలోనే కేంద్రీకరించబడగలవు. వివిధ రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలెనని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే వైస్రాయి ఉండవలెననేది భారతీయల కోరిక. ఇట్టి – పరిస్థితులలో క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఆమోదయోగ్యం కాలేదు.

ప్రతిపాదనల తిరస్కృతి: విభిన్న కారణాలతో దాదాపు భారత రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదనలను తిరస్కరించినాయి. ఈ ప్రతిపాదనలలో భారతదేశ విభజనకు బ్రిటిష్‌వారు విషబీజాలు నాటారని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రక్షణ సమస్య సంబంధంగా క్రిప్స్ కాంగ్రెస్ ఒక అంగీకారానికి రాలేకపోయింది. సంప్రదింపులు విఫలమైనాయి. అత్యవసర పరిస్థితిలో జాతీయ ప్రభుత్వం ఏర్పడవలెనని కాంగ్రెస్ చెప్పినది. రక్షణ విషయాలు కూడా జాతీయ ప్రభుత్వానికి అప్పగించవలెనని కాంగ్రెస్ కోరింది. కాని క్రిప్స్ ఈ కోర్కెలను తిరస్కరించినాడు. భారతీయులకు రక్షణ శాఖను బదిలీ చేయుటకు ఆయన ఇష్టపడలేదు. ‘ఇట్టి ఆపత్సమయములో కూడా బ్రిటిష్‌వారి మౌలిక వైఖరిలో మార్పులేదని భారతీయులు భావించారు. తత్ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రిప్స్ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

ప్రతిపాదనలలో ఇమిడియున్న పాకిస్తాన్ గుర్తింపును ముస్లింలీగ్ హర్షించినప్పటికీ దాని ఏర్పాటు గూర్చి స్పష్టీకరణ లేకపోయేసరికి విమర్శించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా క్రిప్స్ ప్రతిపాదనపట్ల తమ అసంతృప్తిని వెల్లడించినాయి. క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యమునకు కారణములు:

1) క్రిప్స్ రాయబారం విఫలమగుటకు ప్రధాన కారణం ప్రతిపాదనల అసమగ్రతయే. భారతీయుల దృష్టిలో ఈ ప్రతిపాదనలోని తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలు అసంతృప్తికరమైనవి. దీర్ఘకాలిక అంశమైన డొమినియన్ ప్రతిపత్తి, భారతీయుల ఆసక్తిని ఆకర్షించలేకపోయింది. తాత్కాలిక ప్రతిపాదనలు కూడా అస్పష్టము, అసంతృప్తికరములే. ప్రతిపాదనల ముసాయిదా ప్రకటన కూడా ప్రస్తుతము కన్నా భవిష్యత్తుపై నొక్కి చెప్పినది. అవి మొత్తంగా ఆమోదింపబడటమో, |తిరస్కరించటమో చేయవలెను. సవరణలకు అవకాశం లేదు. ఇన్ని లోపాలు గల ప్రతిపాదనలు సఫలమగుట |అనుమానాస్పదమే. కాంగ్రెస్, లీగ్, సిక్కులు, హిందూ మహాసభవారు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.

2) క్రిప్స్ రాయబారం వైఫల్యానికి బ్రిటిష్ అధికారుల స్వార్థం కూడా దోహదపడింది. బ్రిటిష్ మంత్రివర్గం, భారత ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్రిప్స్క పూర్తి సహకారాన్ని ఇవ్వలేదు.

3) భారతదేశంలో అప్పుడు అనుకూల వాతారవణం కూడా లేదు. బ్రిటిష్ వారి వైఖరిపట్ల భారతీయులకు విశ్వాసం లేదు.

4) రక్షణశాఖ సమస్య విషయమై క్రిప్స్, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు విఫలమైనాయి. యుద్ధం కొనసాగినంత కాలం రక్షణశాఖ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండాలని క్రిప్స్ అభిప్రాయం. ఇందుకు జాతీయ కాంగ్రెస్ అంగీకరించలేదు. ఈ ప్రతిపాదనలను గాంధీజీ మొదటి నుండి వ్యతిరేకించెను. కనుకనే ఆయన ఈ ప్రతిపాదనలను “దివాలా తీయు బ్యాంకు మీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కు” అని అభివర్ణించెను. (“A post dated cheque on a withering Bank” -Gandhiji).

ప్రశ్న 6.
శాసనోల్లంఘన ఉద్యమానికి దారితీసిన కారణాలను, సంఘటనలను పేర్కొనండి.
జవాబు:
గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1930, మార్చి 12న చారిత్రాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ శాసనసభ్యులందరూ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుల ఆవేశాలను చల్లార్చేందుకు గాంధీజీ ప్రయత్నించాడు. ఈ సందర్భంలో గాంధీజీ చివరి ప్రయత్నం చేస్తూ రాజ ప్రతినిధి ఇర్విన్‌ను సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలని హెచ్చరించాడు. రాజ ప్రతినిధి ఇర్విన్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించాడు.

శాసనోల్లంఘన ఉద్యమం మూడు దశలుగా జరిగింది. అవి:
1) మొదటి దశ (1930 మార్చి 12 – 1932 జనవరి 3 వరకు) 2) రెండో దశ (1932 జనవరి 4 – 1933 జులై 11 వరకు) 3) మూడో దశ (1933 జులై 12 – 1934 మే వరకు)
మొదటి దశ: దీనినే ఉప్పు సత్యాగ్రహ దశగా వర్ణించవచ్చు. ఈ ఉద్యమంను గాంధీజీ 1930, మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. అతడు 200 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రతీరం వద్ద గల దండి గ్రామాన్ని కాలిబాటన చేరుకొని ఉప్పును తయారుచేసేందుకు ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించాడు. దీంతో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు సామూహిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన కార్యక్రమాలు:

 1. మద్యపాన దుకాణాలు, విదేశీ వస్త్ర విక్రయశాలల ఎదుట పికెటింగ్.
 2. రాట్నాల ద్వారా ఖద్దరు వడకటం.
 3. హిందూ – ముస్లింల మధ్య సంబంధాల పటిష్టత.
 4. అస్పృశ్యతా నివారణ.

ఉప్పు సత్యాగ్రహ పర్యవసానం:

 • బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని నిర్బంధంలోనికి తీసుకొని ఎర్రవాడ కారాగారంలో ఉంచింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు దేశమంతటా హర్తాళ్ పాటించారు.
 • అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
 • 1930-32 మధ్యకాలంలో లండన్‌లో బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది.
 • రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొని అల్పసంఖ్యాకుల ప్రాతినిధ్యం కంటే రాజ్యాంగ నిర్మాణమే ప్రధాన అంశమని వాదించాడు.
  కాని ఆయన వాదనలు ఆమోదయోగ్యం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.

రెండో దశ:
1) ఈ దశలో గాంధీజీని, ఇతర నాయకులను 1932, జనవరి 14న నిర్బంధంలో ఉంచడం జరిగింది. కాని ప్రజలు పికెటింగ్‌ను చేపట్టడం జరిగింది.

2) బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు ధిక్కరించి సమావేశాలు నిర్వహించడం, కరపత్రాల ముద్రణ వంటి చర్యలు అమలుచేయడం జరిగింది.

3) బ్రిటిష్ ప్రభుత్వం అన్ని రకాల ఊరేగింపులను నిషేధించింది.

4) ముస్లిం నాయకులు మినహా, జాతీయ నాయకులందరూ బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ 1932, ఆగస్టు 10న ప్రకటించిన “కమ్యూనల్ అవార్డు”ను వ్యతిరేకించారు.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

5) కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఎర్రవాడ కారాగారంలో గాంధీజీ 1932, సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.

6) బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీ సంప్రదింపుల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ డిమాండ్లలో కొన్నింటికి
ఆమోదం తెలిపింది.

7) బ్రిటిష్ ప్రభుత్వం తమకు విధేయులైన నాయకులతో లండన్‌లో 1932, నవంబర్ 17 – డిసెంబర్ 24 మధ్య మూడో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటుహక్కు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

మూడో దశ:

 1. 1933 జులైలో గాంధీజీ, మరికొంతమంది నాయకులు వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది.
 2. కారాగారంలో గాంధీజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది.
 3. 1934 మే నెలలో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించింది.

ప్రశ్న 7.
భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను అంచనా వేయండి.
జవాబు:
భారత జాతీయోద్యమ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఐ.సి.ఎస్ పరీక్ష పాసై సివిల్ సర్వెంట్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సహాయ నిరాకరణోద్యమ ప్రభావానికిలోనై తన సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు.

కాంగ్రెస్‌లో పాత్ర: సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1938లో హరిపూర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అభ్యర్థియైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందాడు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న శాంతియుత విధానాల యెడల బోస్‌కు విశ్వాసం లేదు. అందువల్ల గాంధీజీతో బోస్‌కు తీవ్రమైన భేదాభిప్రాయాలు కలిగాయి. అందువల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి ‘ఫార్వర్డ్ బ్లాక్’ అనే కొత్త పార్టీని స్థాపించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన: బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్లగొట్టాలంటే రెండవ ప్రపంచ యుద్ధం సరైన అవకాశమని బోస్ భావించాడు. అయితే యుద్ధకాలంలో బోస్ ను ప్రభుత్వం నిర్బంధించింది. బోస్ 1941లో నిర్భంధం నుంచి తప్పించుకొని మొదట రష్యాకు, తరువాత జర్మనీకి, జపాన్‌కు వెళ్ళాడు. యుద్ధసమయంలో ఆ దేశాల సహాయంతో ఇంగ్లీషువారితో పోరాడి, దేశానికి స్వాతంత్య్రం సాధించవచ్చని బోస్ తలచాడు. యుద్ధంలో జపాన్‌కు చిక్కిన భారతీయ యుద్ధఖైదీలందరినీ కూడగట్టుకొని 1943లో సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లేక ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించాడు. ఐ.ఎన్.ఏ. స్థాపనలో బోస్‌కు రాస్ బిహారీ బోస్, మోహన్సింగ్లు సహకరించారు. ఐ.ఎన్.ఏలో చేరిన సేనలు బోస్ న్ను “నేతాజీ” అని గౌరవంగా పిలిచేవారు. “జైహింద్” అనే నినాదాన్ని చేపట్టి బోస్ తన అనుచరులందరితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి “ఛలో ఢిల్లీ” అంటూ భారతదేశంలో ఇంఫాల్ సమీపంలోని మోయిరాంగ్ వరకు వచ్చాడు. ఆయనకు తోడుగా వీరవనిత కెప్టెన్ లక్ష్మి మహిళలతో ఏర్పడిన ఝాన్సీరాణి దళనేత అయింది. ఆయన నాయకత్వంలోని ఐ.ఎన్.ఏ. సైన్యాలు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలొడ్డి పోరాడాయి. కానీ దురదృష్టవశాత్తు 1945 సెప్టెంబర్ లో జపాన్ ఓడిపోవటంతో బోస్ ప్రయత్నాలు విఫలమైనాయి. తన ప్రయత్నాలు కార్యరూపం ధరించకుండానే బోస్ 1945లో ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుల విచారణ: యుద్ధానంతరం ప్రభుత్వం ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సేనలను ఇండియాపై దాడిచేయడానికి ప్రయత్నించినందున దేశద్రోహులుగా ప్రకటించి ఎర్రకోటలో విచారణ జరిపించింది. సైనిక నాయకులైన మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం), కల్నల్ జి.ఎస్. ధిల్లాన్ (సిక్కు, మేజర్ ప్రేమ్ సెహగల్ (హిందూ) లపై విచారణ జరిపించింది. వారి తరఫున జవహర్లాల్ నెహ్రూ, తేజబహదూర్ సప్రూ, భూలాబాయ్ దేశాయ్‌లు వాదించారు. అయినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. కానీ ఆ శిక్షలకు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవటంతో ప్రజాభిప్రాయాన్ని మన్నించి, ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనితో ప్రజలకు, సైనికులకు ప్రభుత్వం పట్ల భయభక్తులు పోయాయి. హిందూ, సిక్కు, ముస్లింల సేనలను విచారించటం వలన కాంగ్రెస్, లీగ్‌లు సమైక్యంగా పోరాడాయి.

ఘనత: సుభాష్ చంద్రబోస్ విజయాన్ని సాధించలేకపోయినా, ఆయన ధైర్యసాహసాలు దేశంలో చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన అచంచల దేశభక్తి, క్రమశిక్షణ, కార్యదీక్ష తరతరాల భారతీయులకు ఆదర్శప్రాయం.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతీయులపై పాశ్చాత్య విద్య ప్రభావం గురించి రాయండి.
జవాబు:
పాశ్చాత్య విద్యావ్యాప్తి ద్వారా భారతీయుల్లో తార్కిక, లౌకిక, ప్రజాస్వామ్య భావాలు పునురుద్ధరింపబడ్డాయి. ఆంగ్ల | బోధన ప్రజల్లో ఏకత్వ భావన కలిగించి, రాజకీయ వికాసానికి తోడ్పడింది. ఆంగ్లవిద్య భారతదేశపు పూర్వ సంస్కృతి, సాహిత్యం, మతం, తాత్వికత, కళ అధ్యయనానికి, పునరుద్ధరణకు తోడ్పడింది. తవ్వకాల ద్వారా బయల్పడిన ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని చూసి భారతీయులు గర్వించారు. ఆంగ్లవిద్య ద్వారా జరిగిన మరో ప్రయోజనం నూతనంగా బ్రిటిష్ ప్రభుత్వరంగాల్లో వచ్చిన ఉద్యోగావకాశాలు. దీంతో పాటు భారతీయ మేధావులు కూడా ఆంగ్లవిద్యను ప్రోత్సహించారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం వల్ల పాశ్చాత్య విద్యనభ్యసించిన విద్యాధికుల సంఖ్య పెరిగింది. మొదటి నుంచి క్రైస్తవ మిషనరీలు విద్యను ప్రోత్సహించాయి. 1717 లో డానిష్ మిషనరీలు మద్రాసులో రెండు ఛారిటీ స్కూళ్ళను తెరిచారు. మద్రాసులోనే కాక అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్కూళ్ళను ప్రారంభించారు. కేరీ, మార్మోన్ లాంటి మిషనరీలు 1793వ సంవత్సరంలో వారి కార్యక్రమాలను విస్తృతం చేశారు. బొంబాయిలో విల్సన్ కాలేజి, మద్రాస్ లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 1853 ఆగ్రాలో సెయింట్ జాన్ కాలేజీ మొదలైంది. మచిలీపట్నం, నాగపూర్లలో మిషనరీ కాలేజీలు స్థాపించబడ్డాయి.

ఆంగ్లవిద్య ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమేకాక, అనేక గ్రంథాలను ప్రాంతీయ భాషల్లో రాయడానికి తోడ్పడింది. దీనివల్ల చదువురాని వారికి కూడా సమాజంలోని దురాచారాల పట్ల అవగాహన కలిగింది. బ్రిటిష్ పాలన దురాగతాలను తెలుసుకొన్న వీరు సంస్కరణావశ్యకతను గుర్తించారు. పాశ్చాత్య మేధావులైన మాకు ముల్లర్, విలియం జోన్స్ వేదాలను, ఉపనిషత్తులను, ఇతర గ్రంథాలను అనువదించారు. వారి పరిశోధనలు భారతదేశ గత చరిత్ర వైభవాన్ని వర్ణించాయి.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 2.
హోం రూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
జవాబు:
బ్రిటీషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూనే భారతదేశానికి స్వపరిపాలనను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమాన్ని హోంరూల్ ఉద్యమం అంటారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో 1916లో హోం రూల్ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్‌లు.
బాలగంగాధర్ తిలక్: హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించటానికి తిలక్ 1916 ఏప్రియల్లో బొంబాయిలో ఒక హోం రూల్ లీగ్‌ను స్థాపించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యభారత్ ప్రాంతాలలో తిలక్ తన ప్రచారాన్ని సాగించాడు. తన “మరాఠా”, “కేసరి” పత్రికల ద్వారా హోం రూల్ భావాన్ని ప్రచారం చేశాడు. తిలక్ హోం రూల్ ఉద్యమ ప్రచారం ప్రజలను చైతన్యవంతుల్ని చేసి, వారిలో స్వీయపాలనాభావాన్ని పటిష్టపరిచింది.

అనిబిసెంట్: హోం రూల్ ఉద్యమం కోసం అనిబిసెంట్ 1916 సెప్టెంబర్ నెలలో మద్రాసులో ఒక హోం రూల్ లీగ్‌ను స్థాపించింది. మద్రాసు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని అక్కడ ప్రచారం చేసింది. తన “న్యూ ఇండియా”, “కామన్వీల్” అనే పత్రికల ద్వారా అనిబిసెంట్ తన ప్రచారాన్ని సాగించింది.

హోం రూల్ ఉద్యమ వ్యాప్తి: తిలక్, అనిబిసెంట్‌ల కృషి వలన హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఈ ఉద్యమం గురించి ప్రజలకు వివరించడానికి అనేక భాషల్లో అనేక కరపత్రాలను కూడా ప్రచురించారు. హోం రూల్‌ను సమర్థిస్తూ అనేక నగరాల్లో, గ్రామాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హోం రూల్ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ జాతీయవిద్యకు చాలా ప్రాముఖ్యం ఇచ్చింది. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ఆమె మదనపల్లిలో ఒక కళాశాల నెలకొల్పింది. వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కూడా ఆమె కృషి చేసింది.

ప్రభుత్వ చర్యలు: 1917 నాటికి అనిబిసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది, ఆమెను నిర్బంధించింది. ఆమె నిర్బంధాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో సభలు, ప్రదర్శనలు జరిగాయి. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. దీనిని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా ఆందోళనకు తలవగ్గి, అనిబిసెంట్‌ను మద్రాస్ ప్రభుత్వం 1917 సెప్టెంబరు నెలలో విడుదల చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను 1917లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. భారత |జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనిబిసెంట్.

ఉద్యమవ్యాప్తికి కారణాలు’: బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమ నాయకులను నిర్బంధించి ఉద్యమ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి కొన్ని కారణాలున్నాయి.
1) 1907 సూరత్ సమావేశంలో చీలిపోయిన కాంగ్రెస్ 1916లో సమైక్యమై సంయుక్తంగా ఉద్యమించింది.

2) బెంగాల్ విభజన రద్దు కావటంతో వందేమాతరం ఉద్యమాన్ని నిర్వహించిన ఉద్యమకారులంతా తమ దృష్టిని హోం రూల్ ఉద్యమంవైపుకు మళ్లించి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు.

3) మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ముస్లిం రాజ్యాల యెడల అవలంబించిన వైఖరి భారతదేశంలో ముస్లింలకు కోపాన్ని కలిగించింది. అందువల్ల వారు కాంగ్రెస్ తో 1916లో లక్నో ఒడంబడికను కుదుర్చుకొని స్వీయపాలనోద్యమంలో పాల్గొన్నారు.

ఉద్యమ ముగింపు: హోం రూల్ ఉద్యమ ఫలితంగా ప్రజలలో నెలకొన్న రాజకీయ చైతన్యాన్ని, బ్రిటీషుపాలన యెడల వారిలో నెలకొన్న అసంతృప్తిని తొలగించటానికి 1917 ఆగస్టు 20వ తేదీన భారతరాజ్య వ్యవహారాల మంత్రి మాంటేగ్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం క్రమక్రమంగా భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పరచబడుతుంది. ఈ ప్రకటన తరువాత బ్రిటీషు ప్రభుత్వం అనిబిసెంట్‌ను విడుదల చేయగా ఆమె హోం రూల్ ఉద్యమాన్ని నిలిపివేసింది. తిలక్ ఉద్యమాన్ని మరికొన్నాళ్లు కొనసాగించాడు.

ప్రశ్న 3.
జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
1919లో ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంలో మాంటేగు – ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు భారతీయులకు ఎట్టి ప్రత్యేక హక్కులు ఇవ్వకపోగా ముస్లింలతో పాటు సిక్కులకు కూడా ప్రత్యేక స్థానాలు కేటాయించాయి. అందుకు భారతీయులలో అసంతృప్తి ప్రబలింది. ఇదే సమయంలో 1915 1918 కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలను సమీక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వముచే నియమించబడిన రౌలట్ కమిటీ కొన్ని చర్యలను సూచించింది. ఈ చర్యలన్నీ చట్టరూపం దాల్చాయి. దీనినే రౌలట్ చట్టం అంటారు. ఈ చట్టం వలన ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమించాయి. ఈ చట్టప్రకారం రాజకీయ ఆందోళనకారులను వారంట్ లేకుండా నిర్బంధించవచ్చు. నిర్బంధించిన వారిని విచారించవలసిన పనిలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమయిన ఏ చిన్న కాగితాన్ని కలిగివున్నా అది నేరంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లాండ్‌లో పౌరుల హక్కులకు పునాది అయిన హెబియస్ కార్పస్ హక్కు భారతీయులకు లేకుండా పోయింది. ఈ బిల్లులను కాంగ్రెస్ వ్యతిరేకించింది. గాంధీజీ ఆ బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ జనరల్‌ను కోరాడు. కానీ అది ఆమోదించబడింది. కనుక వాటి ఉపసంహరణకు గాంధీజీ ఉద్యమించాడు. 1919 ఏప్రియల్ 6న హర్తాళ్ పాటించవలసిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపునందుకొని దేశమంతటా హర్తాళ్ జరిగింది. హిందూ, ముస్లిం భేదం లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, పంజాబ్‌లలో హింసాకాండ జరిగింది. ముఖ్యంగా పంజాబ్‌లో ప్రజల నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా అమృత్సర్ ప్రజలు జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమైనారు. సమావేశం సాగుతుండగానే అమృత్సర్ మిలిటరీ కమాండర్ జనరల్ డయ్యర్ అక్కడకు వచ్చి ప్రజలపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 379 మంది మరణించగా, 1200 మంది గాయపడ్డారు. ఈ సంఘటనే చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతంగా ప్రసిద్ధి చెందింది. జలియన్ వాలాబాగ్ సంఘటన భారత స్వాతంత్ర్య సమరంలో ఒక మైలురాయి. ఈ సంఘటన వలన భారత స్వాతంత్ర్యోద్యమం ఒక మహా సంగ్రామంగా మారింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మితవాదులు ఎవరు ?
జవాబు:
జాతీయ కాంగ్రెస్‌లో తొలి ఇరవై సంవత్సరాల వరకు (1885-1905) ఉన్నత వర్గాలకు చెందిన మితవాదులు ప్రాబల్యం వహించారు. వీరిలో ముఖ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ, మదన్మోహన్ మాలవ్యా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ ముఖ్యులు. బ్రిటిష్ పాలకులు భారతదేశం పట్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని వారు విశ్వసించారు. ప్రజల కోరికలను మహోజర్లు, సభలు, తీర్మానాల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం ద్వారా జాతీయ ప్రగతి సాధించవచ్చునని భావించారు. రాజ్యాంగబద్ధ పోరాటాన్ని వారు చేయడం వల్ల వారిని మితవాదులన్నారు.

ప్రశ్న 2.
ఖేదా సత్యాగ్రహం గురించి రాయండి.
జవాబు:
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీజీ పాలుపంచుకొన్నాడు. మిల్లు కార్మికుల వేతనాలను 35 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. చివరకు మిల్లు యజమానులు దిగివచ్చి గాంధీజీ డిమాండ్లకు అంగీకరించారు. అక్కడి నుంచి గాంధీ గుజరాత్‌లోని ఖేడా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి రైతాంగం దుర్భర పరిస్థితుల్లో ఉంది. పంటల దిగుబడి 25 శాతానికి పడిపోయింది. దాంతో భూమిశిస్తును రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమానికి గాంధీజీ మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గలేదు. వల్లభాయ్ పటేల్, తదితర ఇతర నేతలు గాంధీజీకి జత కలిశారు. చివరకు రైతుల డిమాండు ప్రభుత్వం అంగీకరించింది. సత్యాగ్రహంలో భారతదేశం అద్భుతాలు చేసింది.

AP Inter 1st Year History Study Material Chapter 12 భారత జాతీయోద్యమం

ప్రశ్న 3.
రౌలట్ సత్యాగ్రహన్ని వివరించండి.
జవాబు:
మొదటి ప్రపంచ యుద్ధానంతరం భారత ప్రజల ఏకాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని 1919 మార్చిలో ఆమోదించింది. గాంధీజీ రాజకీయ జీవితంలో ఈ అణచివేత చట్టం కీలకమైన మార్పును తీసుకువచ్చింది. సత్యాగ్రహం ఆయుధంతో ఆ చట్టాన్ని వ్యతిరేకించాలని గాంధీజీ’ నిర్ణయించాడు. 1919 ఏప్రిల్‌లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ దేశవ్యాప్త ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు ప్రజలు గొప్పగా స్పందించారు.

ప్రశ్న 4.
సైమన్ కమీషన్ గురించి రాయండి.
జవాబు:
భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల గురించి సిఫారసు చేయాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్‌ను నియమించింది. 1927 నవంబర్‌లో జాన్సైమన్ అధ్యక్షుడిగా ఒక స్థాయీ సంఘాన్ని నియమించింది. అధ్యక్షుడైన సైమన్ పేరు మీద ఆ సంఘానికి సైమన్ కమీషన్ అనే పేరు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలపై సిఫారసులు చేసేందుకు నియమించిన కమీషన్లో అందరూ ఆంగ్లేయులే ఉండటం, భారతీయులెవరికీ ఇందులో స్థానం కల్పించకపోవడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆ కమీషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సైమన్ కమీషన్‌ను ప్రజలు బహిష్కరించారు. ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశమంతటా మార్మోగింది. అయినప్పటికీ సైమన్ కమీషన్ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి నివేదిక రూపొందించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 11th Lesson వలస పాలనలో భారతదేశం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్రిటిష్, ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన విభేదాలు లేదా కర్ణాటక యుద్ధాలు వివరించండి.
జవాబు:
ఆధునిక యుగంలో యూరోపియన్లు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చారు. కాలక్రమంలో దక్కన్లో వ్యాపార ఆధిపత్యానికై ఇంగ్లీషు, ఫ్రెంచ్‌వారి మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటం మూడు యుద్ధాలుగా జరిగింది. వీటినే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ యుద్ధాల వల్ల భారతదేశంలో ఫ్రెంచ్‌వారి శక్తి పూర్తిగా దిగజారిపోయింది. అప్పటి నుండి ఆంగ్లేయుల విజృంభణకు అడ్డం లేకుండా పోయింది.

మొదటి కర్ణాటక యుద్ధం (1744-1748): 1742వ సంవత్సరంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్‌గా నియమించబడ్డాడు. ఇతనికి విపరీతమైన రాజ్యకాంక్ష. ఈ పరిస్థితులలో ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రష్యా-ఆస్ట్రియాల మధ్య వారసత్వ యుద్ధంగా మారింది. ఫ్రాన్స్ ప్రష్యా వైపు, బ్రిటన్ ఆస్ట్రియా ప్రక్కన చేరాయి. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడింది. భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్ ముఖ్య స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ సహాయం కోరాడు. దీనిపై ఆంగ్లేయులు యుద్ధ ప్రయత్నాలు విరమించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్ సైన్యం లాబోర్డినాయి నాయకత్వంలో భారతదేశానికి వచ్చింది. ఆ ధైర్యముతో డూప్లే 1746వ సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యాలను ఆంగ్లేయుల పైకి పంపాడు. మద్రాసులోని ఆంగ్లేయుల సెయింట్ జార్జికోటను ఫ్రెంచ్‌వారు స్వాధీనపరచుకున్నారు. ఈలోగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్ చేరారు. నవాబు ఫ్రెంచ్ వారిని హెచ్చరించి చివరకు వారితో యుద్ధాలు చేయాల్సివచ్చింది. 1746లో అన్వరుద్దీన్ సైన్యాలు ఫ్రెంచ్ వారి సైన్యాలు, శాంథోమ్ అనే ప్రదేశంలో యుద్ధానికి తలపడ్డాయి. శాంథోమ్ యుద్ధంలో ఫ్రెంచ్‌వారికి విజయం లభించింది. దీనితో కర్ణాటక రాజ్య బలహీనత బయల్పడింది. లాబోర్డినాయి తిరిగి వెనుకకు వెళ్ళటంతో సెయింట్ డేవిడ్ కోటను పట్టుకోదలచిన డూప్లే ఆశయాలు విఫలమైనాయి. ఈలోగా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఐలాషఫల్ సంధితో ముగిసింది. దీనితో భారతదేశంలో కూడా యుద్ధం ముగిసింది. సంధి షరతుల ప్రకారం మద్రాసును ఫ్రెంచ్‌వారు ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చివేశారు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

రెండవ కర్ణాటక యుద్ధం (1749-1754): 1748లో హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ మరణించటంతో హైదరాబాదు సింహాసనము కోసం అతని రెండవ కుమారుడైన నాజర్ంగ్కు, మనుమడైన ముజఫరంగు మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కర్ణాటక సింహాసనం కోసం మహారాష్ట్రుల నుండి విడుదలైన చందాసాహెబ్‌కు, అన్వరుద్దీన్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. చందాసాహెబ్ మరియు ముజఫర్ఆంగ్లు ఫ్రెంచ్ గవర్నరైన డూప్లే సహాయంతో సింహాసనమును అధిష్టించటానికి ప్రయత్నించారు. స్వదేశ రాజులలో గల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి తగాదాలలో జోక్యం చేసుకొని విజయం సాధించాలని డూప్లే ఆశయము. చందాసాహెబు సహాయము చేస్తే కర్ణాటకలోను, ముజఫరంగ్కు తోడ్పడితే హైదరాబాద్‌లోను తన పలుకుబడి పెరగగలదని డూప్లే భావించాడు. ముజఫరంగ్ మరియు చందాసాహెబ్లు 1749 ఆగస్టు 3న ‘అంబూర్’ యుద్ధంలో అన్వరుద్దీన్ ను వధించారు. అన్వరుద్దీన్ మరణానంతరం అతని కుమారుడైన మహమ్మదాలీ తిరుచినాపల్లికి పారిపోయి ఆంగ్లేయుల సహాయాన్ని కోరాడు. ఫ్రెంచ్‌వారి సహాయానికిగాను చందాసాహెబ్ మచిలీపట్నం, రెండు గ్రామాలను కృతజ్ఞతగా వారికి ఇచ్చాడు. ఆంగ్లేయుల సహాయంతో నాజర్ జంగ్, ముజఫరంగ్ను ఓడించాడు. కానీ ఫ్రెంచ్‌వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఫ్రెంచ్‌వారు ముజఫరంగ్ను హైదరాబాదు నవాబుగా చేశారు. అక్కడ బుస్సీ అనే ఫ్రెంచి సైన్యాధిపతి రక్షణగా ఉన్నాడు. కొంతకాలానికి ముజఫరంగ్ శత్రువుల చేతుల్లో మరణించగా ఫ్రెంచ్‌వారు అతని కుమారుడైన సలాబతంగ్ను నవాబుగా చేసి దక్కన్లో ఫ్రెంచి అధికారాన్ని సుస్థిరపరచారు.

కర్ణాటకలో ఫ్రెంచివారు మరియు చందాసాహెబ్ తిరుచినాపల్లిని జయించి మహమ్మదాలీని మరియు ఆంగ్లేయులను ఓడించటానికి ప్రయత్నించారు. ఆంగ్లేయులు మహమ్మదాలీని రక్షించటానికి క్లైవ్ సహాయంతో ఒక పథకాన్ని తయారుచేశారు. చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్‌వారు 1751వ సంవత్సరంలో తిరుచినాపల్లిని ముట్టడించునప్పుడు క్లెవ్ మద్రాసు నుంచి కొంత సైన్యంతో ఆర్కాటును ముట్టడించాడు. తన రాజధానిని రక్షించుకొనుటకై చందాసాహెబ్ కొంత సైన్యంతో తిరుచినాపల్లి నుండి ఆర్కాటుకు వెనక్కి మరలాడు. దీనితో తిరుచినాపల్లి వద్దగల చందాసాహెబ్, ఫ్రెంచి సైన్యం ఆంగ్లేయుల చేతిలో ఓడింపబడ్డారు. కర్ణాటకలో రాబర్ట్ క్లైవ్ చందాసాహెబ్‌ను ఓడించి 1752వ సంవత్సరంలో వధించాడు. మహమ్మదాలీని కర్ణాటక నవాబుగా చేసి కర్ణాటకపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సంపాదించారు. దీనితో కర్ణాటకలో ఫ్రెంచ్‌వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఇట్టి పరిస్థితులలో ఫ్రెంచ్‌వారు డూప్లేను తొలగించి గాడెహ్యూను గవర్నరుగా నియమించారు. ఇతడు ఆంగ్లేయులతో పాండిచ్చేరి సంధి కుదుర్చుకున్నాడు. రెండవ కర్ణాటక యుద్ధానంతరం దక్కన్లో ఫ్రెంచ్‌వారి ప్రాబల్యం, కర్ణాటకలో ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగింది.

మూడవ కర్ణాటక యుద్ధం (1756-1761): గాడెహ్యూ చేసుకున్న సంధి అమల్లోకి రాకమునుపే ప్రపంచాధిపత్యం కోసం ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. దాని ప్రభావం వలన భారతదేశంలో ఫ్రెంచ్ ప్రభుత్వం, ఫ్రెంచ్ గవర్నర్‌గా కౌంట్ డీలాలీని నియమించింది. ఇతడు యుద్ధంలో ఆరితేరిన యోధుడైనా అహంభావం కలవాడు. ఇతడు సేనాధిపతులతో కలిసిమెలసి పనిచేయటం, వారి సలహాలను స్వీకరించటం ఇతనికి ఇష్టంలేదు. భారతదేశం చేరగానే కడలూర్‌లోని ఇంగ్లీషువారి సైనిక పెరేడ్ కోటను ఆక్రమించాడు. మద్రాసును ముట్టడించటానికి ప్రయత్నాలు చేశాడు, కానీ విఫలుడయ్యాడు. ఇట్టి పరిస్థితులలో సర్ ఐర్ కూట్ ఆంగ్ల సైన్యానికి నాయకత్వం వహించాడు.

ఆంగ్లేయులను ఎదుర్కోలేక కౌంట్ డీలాలీ హైదరాబాదు సంస్థానంలోని బుస్సీని రావలసిందిగా కోరాడు. తాను హైదరాబాదును వదిలిన వెంటనే అక్కడ ఫ్రెంచ్‌వారి ప్రాబల్యం అంతరించగలదని బుస్సీ తలచాడు. కానీ డీలాలీ బుస్సీ సలహాను లెక్కచేయక బుస్సీని హైదరాబాదు నుండి రమ్మని ఆజ్ఞాపించాడు. దీనితో ఆంగ్లేయులు నైజాం నవాబుతో సంధి చేసుకొని అతని సంస్థానంలో చేరారు. విజయనగర సంస్థానాధీశుడైన ఆనంద గజపతి బెంగాల్లో ఉన్న క్లైవ్‌ను దండెత్తి రావలసిందిగా ఆహ్వానించాడు. క్లైవ్, సర్ ఐర్ కూట్‌ను పంపించగా అతడు ‘1760లో వాండివాష్ లేక వందవాసి’ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యాన్ని ఓడించి, పుదుచ్చేరిని ఆక్రమించి, కౌంట్ డీలాలీని బంధించి ఇంగ్లండుకు పంపాడు. 1763లో పారిస్ సంధితో సప్తవర్ష సంగ్రామం ముగిసింది. దీనితో మూడవ కర్ణాటక యుద్ధం అంతమైంది.

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్ బెంగాల్న ఆక్రమించిన విధానం రాయండి.
జవాబు:
భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్యానికి పునాదులు వేసిన వారు రాబర్ట్ క్లైవ్. ఇతడు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘంలో సామాన్య గుమాస్తాగా చేరి, తన స్వయం కృషితో, ధైర్య సాహసాలు ప్రదర్శించి, కర్ణాటక యుద్ధాలలో విజయం సాధించి భారతదేశంలో ఆంగ్లేయుల ప్రాబల్యానికి కారకుడయ్యాడు. ఆర్కాట్ ముట్టడి సమయంలో చందా సాహెబ్‌ను చంపి ఆంగ్లేయులకు విజయాన్ని సాధించాడు. ఈ విజయం వలన క్లైవ్‌ను “ఆర్కాటు వీరుడు” అని పిలిచారు. ఈ విజయం వలన క్లైవ్‌ను మద్రాసు కౌన్సిల్లో సభ్యుడిగా నియమించారు.

ప్లాసీ యుద్ధం (1757, జూన్ 25): బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటిగది ఉదంతాన్ని విన్న మద్రాస్ కౌన్సిల్, ఫోర్ట్ విలియంను తిరిగి స్వాధీనం చేసుకొనే బాధ్యతను రాబర్ట్ క్లెన్క అడ్మిరల్ వాట్సనక్కు అప్పగించింది. వీరి నాయకత్వంలోని ఇంగ్లీషు సైన్యం 1757లో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిస్థితులలో బెంగాల్ నవాబు సిరాజుదౌలా, ఇంగ్లీషువారికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంగ్లీషువారు తమ స్థావరాలన్నింటిని తిరిగి రాబట్టుకున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిరాజ్ అంగీకరించాడు. కలకత్తాలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటానికి, వాటిని పటిష్టం చేసుకోవటానికి, నాణాలను ముద్రించుకోవటానికి ఇంగ్లీషువారికి అనుమతినిచ్చాడు. అయినా సిరాజ్‌ను ఫ్రెంచ్‌వారి పట్ల అనుకూలంగా ఉన్నాడని క్లైవ్ భావించి అతడిని సింహాసనం నుంచి తొలగించాలని నిశ్చయించుకున్నాడు. క్లైవ్‌కు సిరాజ్ సైన్యాధిపతి మీరాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి సహకరించారు. ఈ నేపథ్యంలో ఆంగ్లేయులకు, సిరాజ్ సైన్యాలకు ప్లాసీ వద్ద యుద్ధం జరిగింది. మీరాఫర్ ద్రోహం వల్ల సిరాజ్ ఓడిపోయి యుద్ధభూమిలో మరణించాడు. బీహార్, బెంగాల్, ఒరిస్సాలకు మీరాఫర్ నవాబు అయ్యాడు. 24 పరగణాల జమిందారీ ఇంగ్లీషు కంపెనీవారికి లభించింది. క్లైవ్‌కు 2,34,000 పౌన్లు బహుమానంగా లభించాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్లో ఇంగ్లీషు కంపెనీవారు మొగల్ సుబేదార్‌ను ఓడించగలిగారు. స్థానిక ప్రభువుల బలహీనతలు, వారి అసమర్థత బహిర్గతమయ్యాయి. ప్లాసీ యుద్ధంతో ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి.

ప్లాసీ యుద్ధానంతరం ఆంగ్ల ప్రభుత్వం క్లైవు బెంగాల్ గవర్నర్ గా నియమించింది. గవర్నర్ తన పదవీ కాలం (1758-1760) లో క్లైవ్ డచ్ వారిని ఓడించి వారి నుంచి నష్టపరిహారం కూడా రాబట్టుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లీషువారిని ఎదిరించగల శక్తి భారతదేశంలో లేకుండా పోయింది. 1760లో క్లైవ్ స్వదేశానికి తిరిగివెళ్లాడు.

బక్సార్ యుద్ధం (1764, అక్టోబరు 17): ఇండియా నుంచి రాబర్ట్ క్లైవ్ నిష్క్రమించిన తరువాత బెంగాల్ గందరగోళంలో పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు సొంత వ్యాపారాలలో మునిగి, కంపెనీ వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. వాన్ సిటార్ట్ ఇంగ్లీషు గవర్నర్ అయ్యాడు. అతడు మీర్జాఫర్ను తొలగించి, మీర్ ఖాసింను నవాబ్ నియమించాడు. మీరసిం ఇంగ్లీష్ వారికి బరద్వాన్, మిడ్నాపూర్, చిటగాంగ్ జిల్లాలను దత్తత చేశాడు. మీరసిం సమర్థుడే. బెంగాల్ ఆర్థిక వనరులను మెరుగుపరచటానికి అతడు చర్యలు తీసుకున్నాడు. ఇంగ్లీషు కంపెనీ ఉద్యోగుల సొంత వ్యాపారాలను అరికట్టడానికి కూడా అతడు ప్రయత్నించాడు. అందువల్ల, ఇంగ్లీష్ ్వరిలో ద్వేషం రగిలింది. దానితో మీరసిం అయోధ్యకు పారిపోయి అక్కడ అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల సహాయం అర్థించాడు. మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, షా ఆలంలను 1764 అక్టోబరులో మేజర్ మన్రో బక్సార్ యుద్ధంలో ఓడించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం కన్నా చరిత్రలో ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఇంగ్లీషువారు ఒక బెంగాల్ నవాబుపైనే కాకుండా మొగల్ చక్రవర్తిపైన కూడా విజయం సాధించారు. షా ఆలం లొంగిపోయి ఇంగ్లీషు వారి రక్షణ కిందకు వచ్చాడు. ఇంగ్లీషువారు మరో విజయాన్ని కారాలో సంపాదించుకున్నారు. ఈ విజయం వల్ల అయోధ్య నవాబు కూడా ఇంగ్లీష్‌వారి నియంత్రణ కిందకు వచ్చాడు.

క్లైవ్ బెంగాల్ గవర్నరుగా పునరాగమనం: బక్సార్ యుద్ధానంతరం బెంగాల్లో దుష్టపాలన నెలకొన్నది. అందువలన కంపెనీ డైరెక్టర్లు క్లైవ్‌ను బెంగాల్ గవర్నర్ తిరిగి నియమించారు. 1765 మేలో క్లైవ్ ఇండియా చేరుకుని అయోధ్య నవాబుతోను, మొగల్ చక్రవర్తితోను అలహాబాద్ సంధులను కుదుర్చుకున్నాడు.

అలహాబాద్ సంధులు (1765): అలహాబాద్ సంధుల ప్రకారం

 1. ఇంగ్లీషు వారికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకొనే హక్కు లభించింది. దీన్ని దివానీ అంటారు. పరిపాలన బాధ్యత నవాబుకు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు.
 2. ఉత్తర సర్కారులపై ఇంగ్లీషువారి అధికారాన్ని మొగల్ చక్రవర్తి గుర్తించాడు.
 3. ఆర్కాట్ నవాబు స్వతంత్రపాలకుడయ్యాడు.
 4. అయోధ్య నుంచి కారా, అలహాబాద్‌లను విడగొట్టి మొగల్ చక్రవర్తికి ఇచ్చారు.
 5. ఈస్టిండియా కంపెనీవారు మొగల్ చక్రవర్తికి 20 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు.

ఘనత: భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్ చిన్న గుమస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడిగా ఆధునిక భారతదేశ చరిత్రపుటలలో క్లెవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
ఆంగ్లో, మైసూర్ యుద్ధాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
రాబర్ట్ క్లైవ్ పాలనా కాలం ముగిసే నాటికి మైసూర్ రాజ్యం ఒక ముఖ్యమైన స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మైసూర్‌ని జయించాలని నిశ్చయించారు. వీరి కోరిక ఫలితంగా ఇంగ్లీష్‌వారు నాలుగు యుద్ధాల్ని చేయాల్సి వచ్చింది. వీటినే మైసూర్ యుద్ధాలని అంటారు. హైదర్ అలీ, అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ వీరోచితంగా ఇంగ్లీష్ గవర్నర్లను ఎదుర్కొన్నారు. మొదటి మైసూర్ యుద్ధంలో (1767-69) హైదర్ అలీ, అతని మిత్రపక్షమైన ఫ్రెంచ్ సైన్యాలు టిక్రోమలై వద్ద ఘోరమైన ఓటమిని చవిచూశాయి. కాని తిరిగి తన సైన్యాన్ని కూడకట్టుకొని హైదర్ అలీ ఇంగ్లీష్ వారిని ఎదుర్కొన్నాడు. మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది. యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాలు తిరిగి ఎవరిది వారికి ఇవ్వబడ్డాయి.

మద్రాసు సంధి షరతుల్ని ఇంగ్లీష్ వారు ఉల్లంఘించడం వల్ల రెండవ మైసూర్ యుద్ధం (1780-84) జరిగింది. ఈ తరుణంలో కల్నల్ బేయిలి ఆధ్వర్యంలోని బ్రిటిష్ సైన్యం 80 వేల మంది సైనికులతో జూలై 1780 లో హైదర్ అలీపై మెరుపుదాడి చేసింది. కాని యుద్ధం ముగియకముందే హైదర్ అలీ క్యాన్సర్ జబ్బుతో మరణించాడు. టిప్పు సుల్తాన్ ఇంగ్లీషు వారితో మంగళూరు సంధి చేసుకొని యుద్ధాన్ని విరమించాడు.

1784 తరువాత కూడా మైసూర్, బ్రిటిష్ వారి మధ్య శత్రుత్వం కొనసాగింది. మంగళూరు సంధి వల్ల కేవలం తాత్కాలికమైన శాంతి మాత్రమే ఏర్పడింది. గవర్నర్ జనరల్ అయిన కారన్ వాలీస్ టిప్పు సుల్తాన్‌ను అధికారం నుంచి తొలగించడానికి పావులు కదిపాడు. దీంతో ఇరువురి మధ్య యుద్ధం అనివార్యమయ్యింది. వీరోచితమైన టిప్పు సుల్తాన్ పోరాట పటిమ, ఆయన సైన్యం ఇంగ్లీషు సైన్యాన్ని ఓడించడంలో విఫలమయ్యింది. శ్రీరంగపట్టణం సంధి ద్వారా ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉన్న భూభాగాన్ని బ్రిటిష్ వారి స్వాధీనం చేయడానికి టిప్పు సుల్తాన్ అంగీకరించాడు. మూడవ మైసూర్ యుద్ధంలో ఓడిపోవడం టిప్పు సుల్తాన్ క్షీణిస్తున్న అధికారానికి గుర్తుగా భావించవచ్చు. చివరగా జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో (1799) లార్డ్ వెల్లస్లీ టిప్పు సుల్తాన్‌ను ఓడించి హతమార్చాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాజ్యం ఇంగ్లీషువారి వశమైంది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 4.
కారన్ వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
జవాబు:
సివిల్ పరిపాలనా సంస్కరణలు: ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చాలా లంచగొండులయ్యారని, వారిలో సామర్థ్యం పూర్తిగా లోపించిందని కారన్ వాలీస్ గ్రహించాడు. వారికి కంపెనీ వ్యవహారాలకన్నా సొంత వ్యాపారమే ముఖ్యమైంది. వారు తరచు బహుమానాలను తీసుకునేవారు. అందువలన కంపెనీ ఉద్యోగులు లంచాలనుగాని, బహుమతులనుగాని తీసుకోరాదని కారన్ వాలీస్ హెచ్చరించాడు. ప్రైవేటు వ్యాపారం చేసుకొంటున్న కంపెనీ ఉద్యోగులు దండనలకు పాత్రులవుతారని ప్రకటించాడు. ఉద్యోగుల జీతాలు పెంచమని కంపెనీ డైరెక్టర్లకు సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు కంపెనీ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. కలెక్టరుకు నెలకు 1500 రూపాయల జీతం ముట్టింది. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద, గుణగణాల మీద కారన్ వాలీస్ కు చాలా చులకన భావం ఉంది. భారతదేశానికి చెందిన ప్రతి ఉద్యోగి అమిత లంచగొండి అని అతడి అభిప్రాయం. అందువలన పరిపాలనా వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను భారతీయులకు చోటు లేకుండా పోయింది. అందువలననే పరిపాలనలో ఐరోపీకరణ ప్రవేశపెట్టాడు. ఇది కారన్ వాలీస్ జాతి వివక్షతకు దర్పణం పట్టింది. అయినప్పటికీ పౌర, మిలటరీ ఉద్యోగాలలో లంచగొండితనం రూపుమాపి, కారన్ వాలీస్ నీతివంతమైన పరిపాలన అందించాడు.

న్యాయ సంస్కరణలు: కారన్ వాలీస్ 1787, 1790, 1793లో అనేక న్యాయసంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయశాఖలో ఖర్చును పూర్తిగా తగ్గించాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేశాడు. జిల్లా కలెక్టర్లకు న్యాయాధికారాలు తొలగించి వారికి భూమిశిస్తు వసూళ్లను మాత్రమే అప్పగించాడు. జిల్లా కోర్టులకు జిల్లా జడ్జిలను నియమించాడు. సివిల్, క్రిమినల్ కేసులను విచారించడానికిగాను కారన్ వాలీస్ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 50 రూపాయల లోపు ఆస్తి తగాదాలను మున్సిఫ్ కోర్టులు విచారించాయి. మున్సిఫ్ కోర్టులకు భారతీయులను న్యాయాధికారులుగా నియమించాడు. నాడు మొత్తం 23 జిల్లాలుండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టును ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలను నాలుగు డివిజనులుగా విభజించాడు. ప్రతి డివిజన్‌కు ఒక సర్క్యూట్ కోర్ట్‌ను ఏర్పరచాడు. క్రిమినల్ కేసులలో సదర్ నిజామత్ అదాలత్ అప్పీళ్లను స్వీకరించి విచారించింది. అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ సివిల్ వ్యవహారాల విచారణను స్వీకరించింది. గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ క్రిమినల్ కేసులలో తుది తీర్పును ఇచ్చేది. న్యాయశాఖకు సంబంధించిన అన్ని నియమాలను క్రోడీకరించారు. దీనికి ‘కారన్ వాలీస్ కోడ్’ అని పేరు వచ్చింది. సమన్యాయపాలన, స్వతంత్ర న్యాయశాఖలు ఈ కోడ్‌లో చోటుచేసుకున్నాయి. అంగవిచ్ఛేదంలాంటి క్రూరమైన శిక్షలు రద్దయ్యాయి.

పోలీస్ సంస్కరణలు: పోలీస్ సంస్కరణలలో భాగంగా కారన్ వాలీస్ పోలీస్ అధికారాలను జమిందారుల నుంచి తీసివేశాడు. ప్రతి జిల్లాను ఠాణాలుగా విభజించారు. ప్రతి ఠాణాకు దరోగా అనే పోలీస్ అధికారిని నియమించాడు. ప్రతి జిల్లాకు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఉద్యోగిని నియమించాడు. ఈ విధంగా ఆధునిక పోలీస్ వ్యవస్థకు కారన్ వాలీస్ పునాది వేశాడు.

జైలు సంస్కరణలు: కారన్ వాలీస్ జైలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మేజిస్ట్రేట్లు తరచుగా జైళ్లను తనిఖీ చేయాలని, ఖైదీలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఖైదీల ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సివిల్, క్రిమినల్ నేరస్థులకు వేరువేరు వార్డ్‌లను కేటాయించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక బ్లాక్ లను ఏర్పాటు చేశాడు.

శాశ్వత భూమిశిస్తు నిర్ణయ విధానం: కారన్ వాలీస్ సంస్కరణలన్నింటిలో అతి ప్రధానమైనది శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో భూమిశిస్తును వసూలు చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకొకసారి వేలంపాటలు వేస్తారు. ఈ వేలం పాటలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పుకున్న జమిందారులకు శిస్తువసూలు అధికారాన్ని అప్పగిస్తారు. ఈ మొత్తాన్ని జమిందారులు ప్రతి సంవత్సరం కాక 10 సంవత్సరాల కాలానికి నిర్ణయిస్తారు. ఈ పద్ధతిననుసరించి జమిందారులకు భూములపై యాజమాన్యపు హక్కు ఏర్పడింది. పన్నులు చెల్లించనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేసి, తన బకాయిలను రాబట్టుకుంది. జమిందారుల నుంచి 89 శాతాన్ని శిస్తుగా వసూలుచేసి, మిగిలిన 11 శాతాన్ని వారికే వదిలివేసింది. ఇది అధికమైన భూమిశిస్తే, కాని ఈ నిర్ణయం శాశ్వతమైంది కాబట్టి భూమి నుంచి ఫలసాయం పెరిగినా అది కంపెనీకి చెందదు.

లాభాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలు చేకూరాయి.
అవి:

 1. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలిసింది.
 2. ప్రతి సంవత్సరం భూమిశిస్తు నిర్ణయం, దాని వసూలు బాధ్యతలు ప్రభుత్వాధికారులకు తప్పిపోయాయి.
 3. భూమిశిస్తు రేటు రెండింతలయింది.
 4. జమిందారులు కష్టించి తమ ఉత్పత్తులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోగలిగారు.
 5. పెరిగిన ఆదాయాల వల్ల భూస్వాములు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టగలిగారు.
 6. దీనివల్ల పారిశ్రామికీకరణ జరిగి ప్రజల జీవన ప్రమాణం పెరిగింది.
 7. జమిందారులతో మిత్రత్వం లభించి కంపెనీ పాలనకు భద్రత ఏర్పడింది.

నష్టాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి:

 1. కొందరు జమిందారులు పెరిగిన శిస్తులు చెల్లించలేకపోవటంతో వారి భూములు వేలానికి వచ్చాయి. కంపెనీ ప్రభుత్వం కూడా కొంతవరకు నష్టపోయింది.
 2. ఈ నిర్ణయం వల్ల సమాజం జమిందారులు, కౌలుదారులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది.
 3. జమిందారుల ఆదాయం పెరిగినందువల్ల వారు నగరాలకు వలసవెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపసాగారు.
 4. రైతుల స్థితి దిగజారింది. వారు జమిందారుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వచ్చింది. రైతులకు యాజమాన్యపు హక్కు లేకపోవటంతో వారి జీవితం మరింత దుర్భరమైంది.

ముగింపు: కారన్ వాలీస్ పరిపాలనావేత్తగా పేరుపొందాడు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అక్కడ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతడి పరిపాలనకు కారన్‌వాలీస్ విధానమని పేరొచ్చింది. న్యాయ, పోలీస్ శాఖలలో ఇంగ్లీషువారి విధానాలను ప్రవేశపెట్టాడు. అతడి న్యాయసంస్కరణలలో ఇంగ్లీషు న్యాయ విధానం ప్రతిబింబించింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 5.
1857 తిరుగుబాటుకు గల ముఖ్య కారణాలు తెలపండి.
జవాబు:
ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్య చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలను ఐదు రకాలుగా విభజించవచ్చు.

1) రాజకీయ కారణాలు: భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులను అవలంబించారు. యుద్ధాలు చేయటం ద్వారా, సైన్యసహకారపద్ధతి ద్వారా, పరిపాలన సరిగాలేదనే నెపంతో సామ్రాజ్య విస్తరణ చేశారు. డల్హౌసీ మరో అడుగు ముందుకు వేసి రాజ్యసంక్రమణ సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్‌పూర్, ఝాన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్‌కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులను రద్దుచేశాడు. మొగల్ చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్మనార్కు దగ్గరగా మార్చాలని, బహదూర్షి తరువాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దుచేయాలని ప్రతిపాదించాడు. అందువలన స్వదేశీరాజులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడసాగారు. పైగా ఆంగ్లేయులు పాటించిన జాతి వివక్ష విధానం, వారు ప్రజల పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఈ విధంగా అసంతృప్తికి లోనైనవారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

2) ఆర్థిక కారణాలు: రాజ్యసంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు మొదలైన వారు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వారు తమ కనీస జీవితావసరాలను కూడా గడుపుకోలేక తిరుగుబాటుకు సంసిద్ధులైనారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించలేదు. దేశంలో కుటీరపరిశ్రమలు క్షీణించాయి. కంపెనీ పాలనలో ప్రజలకు చేయటానికి పనిలేక, తినడానికి తిండిలేక అలమటించారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి తిరుగుబాటు తప్ప వేరే మార్గం లేకపోయింది.

3) సాంఘిక కారణాలు: ఈస్టిండియా కంపెనీ లార్డ్ బెంటింక్ కాలం నుంచి లార్డ్ డల్హౌసీ కాలం వరకు అనేక సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సతీసహగమన నిషేధ చట్టం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కలిగించే చట్టం, బాల్య వివాహాల నిషేధచట్టం, వితంతు పునర్వివాహ చట్టం వంటి సంస్కరణలు, తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. డల్హౌసీ కాలం నాటి ఆధునికీకరణ రైల్వే, తంతి తపాల ఏర్పాట్లు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. ఈ మార్పులవల్ల తమ ఆచారబద్ధమైన ప్రాచీన సమాజం కూలిపోయిందని సనాతనులు ఆందోళనపడ్డారు. పాశ్చాత్యతరహా పరిపాలనా సంస్థలు, నూతన న్యాయస్థానాలు, ఇంగ్లీష్ విద్య, రైల్వే, టెలిగ్రాఫ్లు తమ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రవేశపెట్టారని వారు భావించారు. ప్రభుత్వం ఈ విధంగా చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తున్నదనే అపోహ ప్రజలలో వ్యాపించింది.

4) మత కారణాలు: క్రైస్తవులైన ఆంగ్లేయులు తమ పరిపాలన స్థాపించిన తరువాత, హిందువులనందరిని, క్రైస్తవులుగా మార్చివేస్తారనే భయం, అనుమానం ప్రజల్లో ఏర్పడింది. కంపెనీ ప్రభుత్వ కాలంలో, క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారు హిందూ, ముస్లిం మత సంప్రదాయాలను అవహేళన చేస్తూ తమ మత ప్రచారాన్ని కొనసాగించేవారు. 1813 ఛార్టర్ చట్టంలో మిషనరీలకు సౌకర్యాలు కల్పించడం, ఇంగ్లీష్ విద్యావ్యాప్తికి ప్రత్యేక నిధిని కల్పించడం, మతం మార్చుకొన్నప్పటికీ ఆస్తిలో హక్కు కల్పించడం వంటి చర్యలు మత మార్పిడిని ప్రోత్సహించటం కోసమేనని ప్రజలు అనుమానపడ్డారు. క్రైస్తవ మిషనరీలు, పాఠశాలలు, వైద్యశాలలు స్థాపించి అక్కడ కూడా మత సిద్ధాంతాలను బోధించారు. సతీసహగమనాన్ని రద్దుచేయడం, బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను అనుమతించడం, హిందూమత ఆచారాలలో ప్రభుత్వం జోక్యం కలిగించుకొని, మత మార్పిడులను ప్రోత్సహించి, భారతదేశాన్ని క్రైస్తవరాజ్యంగా మార్చడానికి బ్రిటిష్‌వారు ఈ మార్పులు చేస్తున్నారనే భావం ప్రజల్లో ఏర్పడింది. ఇందుకు కొందరు కంపెనీ అధికారులు అవలంబించిన మత పక్షపాత ధోరణి కూడా దోహదం చేసింది.

5) సైనిక కారణాలు: కంపెనీలో రెండు రకాలైన సైనికులున్నారు. భారతీయులు బ్రతుకుతెరువు కోసం కంపెనీలో సైనికోద్యోగులుగా చేరారు. వారిని సిపాయిలు అంటారు. ఆంగ్లేయులను సైనికులంటారు. వీరిరువురి మధ్య హోదాలలోను, జీతభత్యాలలోను ఎంతో వ్యత్యాసముంది. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ సర్వీసెస్ “ఎన్లిల్టిమెంట్” చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి వుంది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. ఇదిగాక కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు వీరిని మరింత కలవరపెట్టాయి. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లలో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తీవ్రమైన స్థాయికి చేరుకుంది. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాలలో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమివల్ల వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించటం కష్టమేమీకాదని వారు విశ్వసించారు. అంతేగాక సిపాయిలకు, ఆంగ్ల సైనికులకు మధ్య సంఖ్యాబలంలో చాలా తేడా వుంది. ఆంగ్లేయులకంటే, సిపాయిల సంఖ్య చాలా ఎక్కువగా వుంది. అందువల్ల 1857లో సిపాయిలు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.

6) తక్షణ కారణం: కంపెనీ ప్రభుత్వం 1856లో కొత్త “ఎన్ఫీల్డ్” తుపాకులను ప్రవేశపెట్టింది. వాటిలో ఉపయోగించే తూటాలను సైనికులు నోటితో చివరి భాగం కొరికి తుపాకీలో అమర్చి పేల్చవలసివుండేవి. కానీ ఆ తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూతపూసినట్లు ఒక వదంతి వ్యాపించింది. ఆవు హిందువులకు పవిత్రమైనది. పందిని ముస్లింలు అపవిత్రంగా భావిస్తారు. ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ విధంగా చేశారని సిపాయిలు విశ్వసించారు. అప్పటికే ప్రబలంగా వున్న అసంతృప్తికి ఈ వదంతి ఆజ్యం పోసినట్లయింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆల్బుకర్క్
జవాబు:
భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్‌గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో కోటలు నిర్మించుకోవడం ద్వారా పోర్చుగీసువారు ఒక శక్తిగా రూపొందటానికి బాటలు వేసెను.

 1. క్రీ.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి, గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొనెను. తదుపరి ఈ గోవా పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరమైంది.
 2. క్రీ.శ. 1511లో దూర ప్రాచ్యంలో మలక్కా సైతం ఆల్బూకర్క్ ఆధీనంలోకి వచ్చింది.
 3. వాణిజ్య విస్తరణలో ఆల్బూకర్క్ అరబ్బులను దారుణ హింసలకు గురిచేసెను.
 4. ఆల్బూకర్క్ తరువాత 1517 లో డయ్యూ, డామన్లు పోర్చుగీస్ హస్తగతమయ్యెను.
 5. అటులనే క్రమముగా పశ్చిమతీరంలో బేసిన్, సాల్సెట్టి, బేల్, బొంబాయిలలోనూ, తూర్పుతీరంలో శాన్ థోమ్, హుగ్లీలలోనూ స్థావరాలు స్థాపితమయ్యాయి.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 2.
రాబర్ట్ క్లైవ్
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనుడు రాబర్ట్ క్లైవ్. క్లైవ్ చిన్న గుమాస్తాగా జీవితం ప్రారంభించి స్వయంకృషి వల్ల గవర్నర్ పదవికి ఎదిగాడు. ఈస్టిండియా కంపెనీ సామ్రాజ్య వ్యవస్థాపకుడుగా ఆధునిక భారతదేశ చరిత్రపుటల్లో రాబర్ట్ క్లైవ్ ప్రముఖ స్థానాన్ని పొందాడు.

ప్రశ్న 3.
సిరాజ్-ఉద్-దౌలా
జవాబు:
బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దేలా 1756లో ఫోర్టు విలియంను ముట్టడించి 146 మంది ఆంగ్లేయులను ఒక చిన్న గదిలో బంధించాడని, మరునాటి ఉదయానికి విపరీతమైన వేడి, ఉక్కవలన 23 మంది తప్ప మిగిలిన వారంతా మరణించారని ఒక కథనం ఉంది. దీనినే బ్లాక్ హోల్ ట్రాజడీ లేక కలకత్తా చీకటి గది విషాదాంతం అంటారు.

ప్రశ్న 4.
బక్సర్ తిరుగుబాటు
జవాబు:
1764 అక్టోబర్ 17న మీర్ ఖాసిం, అయోధ్య నవాబు, మొగల్ చక్రవర్తి షా ఆలంల కూటమికి, ఆంగ్లేయులకు బక్సార్ వద్ద జరిగిన యుద్ధాన్ని బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ముగ్గురు పాలకుల కూటమి ఓడిపోయింది. ఈ యుద్ధం భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణకు తోడ్పడింది.

ప్రశ్న 5.
ద్వంద ప్రభుత్వ విధానం
జవాబు:
1765 నాటి అలహాబాద్ సంధుల ప్రకారం ఇంగ్లీషువారికి, బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో భూమిశిస్తు వసూలు చేసుకునే హక్కు లభించింది. దీన్ని దివాని అంటారు. పరిపాలన బాధ్యత నవాబు అప్పగించడం జరిగింది. దీన్ని నిజామత్ అంటారు. ఈ విధంగా పరిపాలనాధికారాలు విభజించబడినందువల్ల దీనికి ద్వంద ప్రభుత్వం అనే పేరు వచ్చింది.

ప్రశ్న 6.
వారన్ హేస్టింగ్
జవాబు:
భారతదేశంలో క్లెవ్ స్థాపించిన ఆంగ్లాధికారాన్ని సుస్థిరపరచి దాని విస్తరణకు కూడా పునాదులను నిర్మించినవాడు వారన్ హేస్టింగ్ (1772-1785).

వారన్ హేస్టింగ్ ఎదుర్కొన్న సమస్యలు: వారన్ హేస్టింగ్ మొదట బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. కానీ 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అయ్యాడు. వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ అయ్యేనాటికి అతడికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం గందరగోళానికి దారితీసింది. కంపెనీ ఆర్థిక వనరులలో అతి ముఖ్యమైన భూమిశిస్తు జమిందారుల చేతుల్లోకి పోయింది. కంపెనీ ఉద్యోగులు విపరీతంగా ధనార్జన చేశారు. కానీ, కంపెనీ ఖజానా మాత్రం వట్టిపోయింది. న్యాయపాలనలో కూడా విపరీతమైన గందరగోళం చోటుచేసుకుంది.

స్వదేశీ విధానం – సంస్కరణలు: పరిపాలనలో చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులను తొలగించటానికి వారన్ హేస్టింగ్ అనేక సంస్కరణలను చేపట్టాడు. అవి:
ద్వంద ప్రభుత్వం రద్దు: క్లైవ్ ప్రవేశపెట్టిన ద్వంద ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది. అందువలన దానిని రద్దుచేసి, బెంగాల్ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నింటిని కంపెనీ నేతృత్వంలోకి తెచ్చాడు.

ప్రశ్న 7.
సైన్య సహకార విధానం
జవాబు:
సైన్య సహకార పద్ధతిని చాలా స్వదేశీ రాజ్యాలలో అమలుచేసినవాడు వెల్లస్లీ. దీనిననుసరించి స్వదేశీ రాజ్యం తమ విదేశాంగ సంబంధాలన్నింటిని ఇంగ్లీషు కంపెనీకి అప్పగించాలి. ఆ సంస్థానాన్ని విదేశీ శత్రువుల నుంచి ఇంగ్లీషువారు కాపాడతారు. అయితే స్వదేశీ సంస్థానాల ఆంతరంగిక విషయాలలో ఇంగ్లీషు కంపెనీ జోక్యం చేసుకోదు. ఈ పద్ధతి వలన ఇండియాలో ఇంగ్లీషువారి శక్తి గణనీయంగా పెరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 8.
విలియం బెంటింక్
జవాబు:
భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హిందువులలో ప్రబలంగా వున్న సతీసహగమన దురాచారాన్ని మాన్పించడంలో బెంటింక్ చాలావరకు కృతకృత్యుడయ్యాడు. 1829లో రాజారామ్ మోహన్‌రాయ్ సహకారంతో ఒక శాసనము జారీ చేశాడు.

ప్రశ్న 9.
డల్హౌసీ
జవాబు:
డల్హౌసీ తన 8 సంవత్సరాల పాలనా కాలంలో (1848-1856) బ్రిటీషు సామ్రాజ్య విస్తరణయే తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకొన్నాడు. వారన్ హేస్టింగ్ ప్రారంభించిన కంపెనీ సామ్రాజ్యాన్ని తన విజయాల ద్వారా విస్తరింపచేశాడు. కంపెనీ రాజ్య విస్తరణ కోసం డల్హౌసీ నాలుగు మార్గాలను అనుసరించాడు. అవి:

 1. యుద్ధాలు
 2. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
 3. బిరుదులు, భరణాల రద్దు
 4. దుష్పరిపాలన నెపం.

ప్రశ్న 10.
రాజ్య సంక్రమణ సిద్ధాంతం
జవాబు:
రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగా నిస్సంతులుగా మరణించిన స్వదేశీరాజుల సంస్థానాలు ఆంగ్లేయులకు సంక్రమిస్తాయి. ఈ విధానాన్ని అమలుచేసినవాడు డల్హౌసీ, ఈ సిద్దాంతాన్ననుసరించి బ్రిటీషు రాజ్యంలో విలీనమైన మొదటి స్వదేశీ సంస్థానం సతారా. ఈ సిద్ధాంతం 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణమైంది.

ప్రశ్న 11.
రాణి లక్ష్మీబాయి
జవాబు:
1857 తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖులలో ఝాన్సీలక్ష్మీబాయి ఒకరు. ఈమె మహారాష్ట్రకు చెందిన తాంతియాతోపేతో కలిసి బ్రిటీషు వారిని గడగడలాడించింది. తన దత్తకుమారుని తన వారసునిగా గుర్తించటానికి ఆంగ్లేయులు నిరాకరించటంతో ఈమె తిరుగుబాటులో పాల్గొంది. 1858లో సర్ హ్యూరోస్ సేనాని ఝాన్సీని ఆక్రమించినపుడు లక్ష్మీబాయి కోట నుండి తన దత్త కుమారునితో బయటపడి తాంతియాతోపేతో కలిసి గ్వాలియర్ కోటను ఆక్రమించి, బ్రిటిష్ వారితో యుద్ధాన్ని కొనసాగించింది. 1857 జూన్ 17న యుద్ధంలో వీరమరణం పొందింది.

ప్రశ్న 12.
రైత్వారి విధానం
జవాబు:
ఈ విధానంలో శిస్తును రైతులు నేరుగా ప్రభుత్వమునకు అనగా ప్రభుత్వ ఖజానాకు గాని, ప్రభుత్వోద్యోగులకు చెల్లించెదరు. ఇట్లు శిస్తు వసూలునందు ప్రభుత్వమునకు, రైతులకు మధ్య ఎట్టి మధ్యవర్తులు అనగా దళారులు లేకుండుట వలన ఈ విధానమును రైత్వారీ విధానముగా ప్రసిద్ధికెక్కెను. ఇంకనూ రైతులకు పట్టాలిచ్చి వారి వద్ద నుండి కబూలియత్‌లు (శిస్తు చెల్లింపు ఒడంబడికలు) తీసుకొనెడి సంప్రదాయము కూడా కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 11 వలస పాలనలో భారతదేశం

ప్రశ్న 13.
రెండవ బహదూర్షా
జవాబు:
భారతదేశాన్ని పాలించిన మొగల్ చక్రవర్తులలో రెండో బహదూర్ చివరివాడు. 1857 మే లో మీరట్‌లో తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీ చేరి, రెండో బహదూర్‌షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. 1857 సెప్టెంబరులో ఢిల్లీని వశపరచుకొన్న బ్రిటిష్‌వారు బహదూరాను బందీగాచేసి, విచారణ జరిపి, ఖైదీగా రంగూన్ పంపించారు. అతని కుమారులను, మనుమల్ని పరాభవించి, చంపేశారు. 1862లో బహదూర్గా రంగూన్ జైలులో మరణించాడు. దీనితో మొగల్ వంశం అంతరించింది.

ప్రశ్న 14.
టిప్పు సుల్తాన్
జవాబు:
మైసూరు పాలించిన హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. ఇతడు తన తండ్రితోపాటు మొదటి రెండు మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నాడు. రెండో మైసూర్ యుద్ధ కాలంలో హైదర్ అలీ మరణించిన వెంటనే టిప్పు సుల్తాన్ తండ్రి వారసత్వాన్ని స్వీకరించాడు. మూడో మైసూర్ యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి శ్రీరంగపట్టణం సంధిని కుదుర్చుకొని తన రాజ్యంలో చాలా భాగం కోల్పోయాడు. 1799లో జరిగిన నాలుగో మైసూర్ యుద్ధంలో ఓడిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 10th Lesson క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్ చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న వివిధ ఆధారాలపై వ్యాసం రాయండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి పురావస్తు, సాహిత్య (వాఙ్మయ) ఆధారాల నుంచి ఎంతో |విలువైన చారిత్రక సమాచారం లభిస్తుంది. పురావస్తు ఆధారాల్లో శాసనాలు ముఖ్యమైనవి. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత మౌర్య చక్రవర్తి అశోకుడికే దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వారి పరిపాలనా కాలంలో అనేక శాసనాలు వేయించారు. నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైన చోట్ల వారి శాసనాలు ఉన్నాయి. క్రీ.శ. 1వ శాతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని ఇవి తెలియచేస్తున్నాయి. కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు వేయించిన శాసనాలు ఆ కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 1

ఈ యుగానికి చెందిన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మతపరమైన మొదలైన విషయాలను అధ్యయనం చేయడానికి, నేక సాహిత్య రచనలు ఉపకరిస్తున్నాయి. వీటిలో తెలుగు, కన్నడ, సంస్కృతం భాషలోని రచనలతో పాటు విదేశీ రచనలు కూడా ఉన్నాయి.
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 2
AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు 3

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
గణపతిదేవుని ఘనతను అంచనా వేయండి.
జవాబు:
కాకతీయ వంశ పాలకుల్లో గణపతిదేవుడు అత్యంత శక్తిసామర్థ్యాలు గల పరాక్రమవంతుడు. మహాదేవుడి తరువాత సింహాసనం అధిష్టించాడు. రాజనీతిజ్ఞుడు, సైన్యాలను నడపడంలో దిట్ట. ఇతడి తల్లిదండ్రులు బయ్యాంబ, మహాదేవుడు. మైలాంబ, కుందమాంబ గణపతిదేవుడి సోదరీమణులు. గణపతిదేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం కరీంనగర్ లోని మంథని వద్ద లభించింది. దీని ప్రకారం గణపతిదేవుడి పరిపాలన డిసెంబర్ 26, 1199 కంటే ముందే ప్రారంభమైంది. సుమారు అరవై మూడు సంవత్సరాలపాటు గణపతిదేవుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, అనేక చారిత్రాత్మక విజయాలు సాధించాడు. గణపతిదేవుడి సైనిక విజయాల్లో అతని సేనాధిపతి రేచెర్ల రుద్రుడు కీలకపాత్ర పోషించాడు. మల్యాల సేనాధిపతులు కూడా గణపతిదేవునికి అండగా నిలిచారు. గణపతిదేవుని సైన్యాలు యాదవసేనలను ఓడించాయి. తీరాంధ్ర ప్రాంతంపై గణపతిదేవుని సైన్యాలు దండెత్తాయి. వెలనాడు పాలకుడైన పృథ్వీశ్వరుణ్ణి కాకతీయ సేనలు ఓడించాయి. ఈ విషయం గణపతిదేవుని బావమరిది నతవాడి రుద్రుడు వేయించిన క్రీ.శ. 1201 నాటి బెజవాడ శాసనంలో ఉంది. పరాజయం పాలైన వెలనాటి రాజు పృథ్వీశ్వరుడు తాత్కాలికంగా తన రాజధానిని చందవోలు నుంచి పిఠాపురానికి మార్చి, కృష్ణా ప్రాంతంపై తన అధికారాన్ని తిరిగి కొనసాగించాడు. గణపతిదేవుని సైన్యాలు ధరణికోటకు చెందిన కోటనాయకులతో యుద్ధానికి సిద్ధంకాగా కోట నాయకులు కాకతీయ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. ఆ తరువాత మల్యాల చెందుని నేతృత్వంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు కృష్ణానదీ ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్యవంశ రాజుల కేంద్రమైన ‘దివి’పై దండెత్తాయి. కాకతీయ సైన్యాలను విరోచితంగా ఎదుర్కొన్న దివిసీమ పాలకులు ఓటమిని అంగీకరించారు. అయ్యవంశం రాజు పిన్నచోడుడు కాకతీయ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాడు. రాజనీతిజ్ఞుడైన గణపతిదేవుడు దివిసీమను అయ్యవంశ రాజులనే పాలించమని కోరాడు. పినచోడుని కుమారుడైన ‘జాయపను’ గణపతిదేవుడు తన కొలువులో చేర్చుకున్నాడు. అతడిని ‘గజసాహనిగా’ నియమించాడు. గణపతిదేవుడు పినచోడుని కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడి ఇరు రాజ్యాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేశాడు.

గణపతిదేవుడి సేనలు క్రీ.శ. 1206కు ముందు మరోసారి వెలనాటి రాజైన పృథీశ్వరునిపై దండెత్తి అతణ్ణి యుద్ధంలో ఓడించి చంపాయి. యావత్ కళింగ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. కొన్ని కాకతీయ శాసనాల్లో గణపతిదేవుడికి ‘పృథీశ్వర శిరఃఖండుక క్రీడావినోద’ అనే బిరుదు ఉంది. దీన్ని బట్టి పృథ్వీశ్వరుడు కాకతీయ సేనల చేతిలో హతుడైయ్యాడని గ్రహించవచ్చు. క్రీ.శ. 1213 నాటి చేబ్రోలు శాసనం గణపతిదేవుడు జాయప సేనానిని వెలనాడు రాజ్య గవర్నర్ నియమించాడని పేర్కొంటుంది.

గణపతిదేవుడు నెల్లూర్ రాజ్యాన్ని ఏలిన మనుమసిద్ధి కుమారుడైన తిక్కభూపాలుడు, రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో గణపతిదేవుని సహాయం కోరాడు. గణపతిదేవుడు తిక్కభూపాలుని శత్రువులు నల్లసిద్ధి, తమ్మసిద్దిలను ఓడించి నెల్లూరు సింహాసనంపై తిక్క భూపాలుణ్ని నిల్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో కొలను ప్రాంతాన్ని ఏలుతున్న ‘కొలను’ నాయకులను కూడా క్రీ.శ. 1231కి ముందే కాకతీయ సైన్యాలు ఓడించాయి. ‘ఇందులూరి సోముడు’ కొలను రాష్ట్ర గవర్నర్ గా నియమించాడు. గణపతి దేవుడి కాలంలో యాదవరాజులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి.

గణపతిదేవుడు తన సుదీర్ఘ పరిపాలనా కాలంలో (క్రీ.శ. 1199-1263) ఎప్పుడూ ఓటమిని చవిచూడలేదు. క్రీ.శ. 1263వ సంవత్సరంలో పాండ్య సేనలతో జరిగిన ‘ముత్తుకూరు’ యుద్ధంలో జటావర్మన్-సుందర పాండ్యుని సేనల చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. తనకు మగసంతానం లేనందువల్ల కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించాడు. క్రీ.శ. 1268 లో గణపతిదేవుడు మరణించాడు. రుద్రమదేవి తండ్రి కాలంలోనే రాజ్య నిర్వహణలో, సైన్యాలను నడపడంలో శిక్షణ పొందింది.

ప్రశ్న 3.
శ్రీకృష్ణదేవరాయల విజయాలను చర్చించండి.
జవాబు:
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో (క్రీ.శ. 1509 1529) అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశమంతటికి విస్తరించింది. దక్షిణ భారతదేశంలో సారస్వతం, కళలు వికసించాయి.

తొలి జీవితం: శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశస్థుడు. ఇతని తల్లిదండ్రులు నరసానాయకుడు, నాగమాంబ. బాల్యం నుండి అప్పాజీ అనబడే తిమ్మరుసు నేతృత్వంలో సకలవిద్యలు నేర్చుకొని పాలకునికి కావలసిన లక్షణములన్నింటిని తనలో జీర్ణించుకున్నాడు. తన అన్నయైన వీరనరసింహుని మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. సాళువ తిమ్మరుసు ఇతని ప్రధానమంత్రి.

ఆకృతి, వ్యక్తిత్వం: క్రీ.శ. 1520లో శ్రీకృష్ణదేవరాయలను దర్శించిన పోర్చుగీసు వర్తకుడు డామింగో పేస్ రాయల ఆకృతిని వర్ణించాడు. “శ్రీకృష్ణదేవరాయలు పొడగరికాదు, పొట్టికాదు. మధ్యరకం, చక్కని మూర్తి, బొద్దుగా, ముఖంపై స్పోటకం, మచ్చలతో ఉంటాడు. ఉల్లాసవంతుడు, విదేశీయుల పట్ల దయతో, మర్యాదతో వ్యవహరిస్తాడు. హిందూస్థాన్‌లో అతనంటే హడల్” అని వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిలో, యుద్ధాల్లో సమర్థుడు. సంస్కృతాంధ్ర భాషల్లో సాహితీ సృష్ట, సంస్కృతీ ప్రియుడు.

చక్రవర్తిగా రాయలు ఎదుర్కొన్న పరిస్థితులు: శ్రీకృష్ణదేవరాయలు సింహాసనమును అధిష్టించే నాటికి విజయనగర సామ్రాజ్యము అనేక సమస్యలతో ఉన్నది. ఎక్కడ చూసినా తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. ఒక ప్రక్క గజపతులు, మరొక ప్రక్క బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని కబళించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిని ప్రదర్శించి పోర్చుగీసు వారితో సంధి చేసుకొన్నాడు.

పోర్చుగీసు వారితో సంధి: రాయలు క్రీ.శ. 1510లో పోర్చుగీసు వారితో ఒక ఒప్పందాన్ని చేసుకొన్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రాయల సైన్యానికి మేలుజాతి గుర్రాలను సరఫరా చేయటానికి పోర్చుగీసువారు అంగీకరిస్తే, పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకోవటానికి శ్రీకృష్ణదేవరాయలు అడ్డుచెప్పలేదు. పైగా భట్కల్ ప్రాంతంలో పోర్చుగీసువారు కోటలు కట్టుకోవడానికి కూడా రాయలు అనుమతించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

దిగ్విజయాలు: పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, తన సైన్యాన్ని బలపరచుకొన్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు.
1. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్షా, బీదర్ సుల్తాన్ మామూన్షాలు విజయనగరంపై జిహాద్‌ను ప్రకటించి కృష్ణదేవరాయలతో ఘర్షణకు దిగారు. రాయలు వారిని ఓడించి రాయచూర్, ముద్గల్ దుర్గాలను ఆక్రమించాడు. యూసఫ్ అదిల్షా మరణానంతరం అతని కుమారుడు ఇస్మాయిల్ అదిల్షా పిన్న వయస్కుడవటం చేత కమాలాఖాన్ అనే సర్దారు సర్వాధికారాలు పొంది బీజాపూర్ పాలకుడయ్యాడు. అలాగే బీదర్ అహమ్మద్ బరీద్ అనే సేనాని బీదర్ సుల్తానైన మహమ్మదాను బంధించి తానే సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు. రాయలు వారిద్దరిని ఓడించి, పాలకులను వారివారి సింహాసనాలపై కూర్చుండబెట్టి ‘యవన రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు పొందాడు.

2. తరువాత దక్షిణ దిగ్విజయ యాత్రను జరిపి పెనుగొండ, ఉమ్మత్తూర్, శివసముద్రాలను జయించి, ఆ ప్రాంతాలన్నింటిని కలిపి శ్రీరంగపట్నం అనే రాష్ట్రంగా ఏర్పరచాడు.

3. తూర్పు దిగ్విజయ యాత్రను ప్రారంభించి, ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరంలను జయించి, కటకం వరకు నడిచి గజపతులను ఓడించాడు. అంతట ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహం చేశాడు. సింహాచలం, పొట్నూరుల దగ్గర విజయస్థంభాలను నాటి, కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న భూములను గజపతికి ఇచ్చి రాజధానికి తిరిగివచ్చాడు.

4. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్షాన్ ఠాయ రును తిరిగి ఆక్రమించగా క్రీ.శ 1520 లో రాయలు అతనిని ఓడించాడు. ఈ యుద్ధంలో పోర్చగీసు నాస్ “క్రిష్టవో ఫిగరేదో రామలకు చాలా సహాయం చేశాడు. క్రీ.శ.1523లో రాయలు మళ్ళీ దండలే చుపూర్. గుల్బర్గాలను ఆక్రమించి సాగర్ వరకు గల ప్రాంతాలను కొల్లగొట్టాడు. రాయలు క్రీ.శ. 1529లో ను రశించాడు. రాయలు మరణంచే వాటికి అతని సామ్రాజ్యం తూర్పున కటకం నుండి పడమరన సారేశెట్టి వరకు ఉత్తరాన గుల్బర్గా నుండి దక్షిణాన సింహళం వరకు వ్యాపించింది.

పరిపాలనా విధానం ; శ్రీకృష్ణదేవరాయలు ఆదర్శవంతమైన పాలనను ప్రజలకందించాడు. ఇతని కాలంలో విజయనగర వైభవం ఇనుమడించిందని “పేస్” పేర్కొన్నాడు. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో కాలువ చెరువులు త్రవ్వించి, పంటపొలాలకు నీటి పారుదల సౌకర్యాలను కల్పించాడు.

పరమత సహనం: శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ భక్తుడైనను అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. వ్యాసతీర్థ, వల్లభాచార్య అప్పయ్యదీక్షిత, వేదాంతదేశిక అనే వేరువేరు మతములకు చెందిన పండితులను అదరించి సన్మానించాడు.

సారస్వత పోషణ: శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునకు భువనవిజయమని పేరు. భువనవిజయులలో, ‘అష్టదిగ్గజములనే’ ఎనిమిది మంది కవులుండేవారు. వారు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి అని ప్రతీతి. ఈ అస్థానంలో జరుగుతుండేవి. సాహితీ గోష్టులు జరుగుతుండేవి భువనవిజయములో వసంతోత్సవం లాంటి వేడుకలు గొప్పగా సందర్భంలో సంగీత, సాహిత్యాలకు ఆదరణ లభించేది. శ్రీకృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడనే బిరుదు ఉంది. ఇతడు స్వయంగా కవి. ఆముక్తమాల్యద, జాంబవతీ పరిణయం, మదాలస చరిత్ర అనే గ్రంథాల్ని రచించాడు. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఆంధ్రభోజుడు అని కీర్తించబడ్డాడు. “దేశ భాషలందు తెలుగు లెస్స”. అని రాయలే స్వయంగా పేర్కొన్నాడు.

కళాభివృద్ధి: శ్రీకృష్ణదేవరాయల కాలంలో కళలు కూడా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజార రామాలయాన్ని నిర్మించాడు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి అలడులకు గోపురాలను, మండపాలను నిర్మించాడు. ఇతని కాలంలో విజయనగరం రోమ్ మహానగరమంత సుందరంగా ఉన్నట్లు ఇతని కాలంలో విజయనగరాన్ని సందర్శించిన “పేస్” అనే పోర్చుగీసు వర్తకుడు పేర్కొన్నాడు.

ఘనత: దక్షిణ భారతదేశాన్ని పాలించిన కడపటి హిందూ పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు ఇతడు విజయనగర చరిత్రలోనే కాక భారతదేశ చరిత్రలోనే మహోన్నతమైన స్థానాన్ని అధిరోహించిన చక్రవర్తులలో ఒకడిగా విశిష్టమైన స్థావాన్ని సంపాదించుకున్నాడు.

ప్రశ్న 4.
విజయనగర కాలం నాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు:
దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర రాజులు రెండు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతికి రక్షణ కల్పించారు. వీరితో పోరాడవలసి వచ్చినందునే బహమనీ సుల్తానులు ఉత్తర దేశం వైపు దృష్టి మళ్లించి విస్తరించలేకపోయారు.

పాలనా విధానం: వీరు మౌర్యులవలె కేంద్రీకృత రాజరికాన్నే అమలు చేశారు. విజయనగర పాలకులు సర్వజనామోదం పొందిన పాలనా విధానాన్ని పాటించారు. రాజులు ధర్మబద్ధులమని ప్రకటించుకున్నారు. అందువలన దేశంలో న్యాయం ప్రతిష్టించబడి ప్రజలు సుఖించారు. కట్టుదిట్టమైన పాలనా వ్యవస్థ ఉండటం వలన దేశంలో శాంత సౌభాగ్యాలు నెలకొన్నాయి. కే. కొలనలో చక్రవర్తే ముఖ్యుడు. అతని మాటే శాననం. కేంద్రంలో రాజుకు మంత్రిమండలి సభ్యులు సహకరించేవారు. సాళువ తిమ్మరుసు, విద్యారణ్య స్వామి మొదలగువారు ఉన్నత పదవులు చేపట్టినారు. నాడు మంత్రివర్గం సంఖ్య 6 లేదా 8 మంది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

సాంఘిక పరిస్థితులు: విజయనగరం పాలనాకాలంలో సంఘంలో వర్ణవ్యవస్థ బలపడి వర్ణభేదాలు కొనసాగాయి. బ్రాహ్మణుల హక్కులను శూద్రులు ధిక్కరించటం మొదలుపెట్టారు. సంఘంలో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం, వరకట్నం, కన్యాశుల్కం అమలులో ఉన్నాయి. స్త్రీలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానమున్నప్పటికి వితంతువులకు గౌరవం లేదు. మద్యపానం, ధూమపానం సమాజంలో ప్రవేశించాయి. తురుష్క, పాశ్చాత్య సంప్రదాయాల ప్రభావం వేషధారణలో కన్పించసాగింది. ప్రభుత్వం వేశ్యావృత్తిని గుర్తించింది. ప్రభుత్వానికి వేశ్యావృత్తిపై వచ్చే ఆదాయం చాలా ఎక్కువని అబ్దుల్ రజాక్ వ్రాశాడు.

ఆర్థిక పరిస్థితులు: అబ్దుల్ రజాక్, నికోలోకోంటి, డామింగోపేస్, న్యూనిజ్ వంటి విదేశీ యాత్రికుల రచనలు విజయనగర వైభవానికి అద్దంపడుతున్నాయి. వీరి రచనల ప్రకారం విజయనగర రాజ్యం ఐశ్వర్యవంతంగా ఉన్నందువల్లనే తరచూ బహమనీ రాజ్యం దండయాత్రలకు గురైంది. విజయనగరం చుట్టుకొలత 60 మైళ్ళని, దాని చుట్టూ ఏడు ప్రాకారాలుండేవని నికోలోకోంటి పేర్కొన్నాడు.

విజయనగరాధీశులు కాలువలను త్రవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. దారులోహ పరిశ్రమలను స్థాపించి పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు. రాయలసీమలోని రామళ్లకోట, వజ్రకరూర్‌లో వజ్రాలను త్రవ్వేవారు. వజ్రాలు, బంగారం, వెండి, ముత్యాలు వంటి విలువైన వస్తువులను నడిబజారులో రాసులుగా పోసి, ఈ నగరంలో విక్రయించేవారని నికోలోకోంటి పేర్కొన్నాడు. విజయనగరాధీశులు రాజధాని నగరం నుంచి పెనుగొండ, తిరుపతి, శ్రీరంగపట్టణం, కాంచీపురం, రామేశ్వరం, కొండవీడు మొదలగు ముఖ్య నగరాలకు బాటలు వేయించి, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. గుర్రాలు, ఎడ్లు, పల్లకీలు, బండ్లు నాటి ప్రయాణ సాధనాలు. దేశంలో అనేక చోట్ల సంతలు జరిగేవి. విదేశీ వాణిజ్యం అరబ్బులు, పోర్చుగీస్వేరి హస్తగతమైంది. ఎగుమతుల్లో ముఖ్యమైనవి నూలుబట్టలు, రత్నకంబళీలు, దంతపుసామాన్లు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి.

ప్రశ్న 5.
కుతుబ్‌షాహీలు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
గోల్కొండ రాజధానిగా స్వతంత్ర కుతుబ్‌షాహీ వంశాధికారాన్ని క్రీ. శ. 1512లో సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్ స్థాపించాడు. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ షా కాలంలో ఆ రాజ్య విచ్ఛిన్నం జరిగింది. అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే ఐదు స్వతంత్ర రాజ్యాలు బహమనీ రాజ్య శిథిలాలపై వెలిశాయి. గోల్కొండ కుతుబ్‌షాహీలు వారి అధికారులు స్థానిక తెలుగు ప్రజల మద్దతుతో, సుమారు 175 ఏళ్ళపాటు నేడు తెలుగు మాట్లాడే అత్యధిక ప్రాంతాలనూ, కన్నడ, మరాఠి మాట్లాడే కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. సుప్రసిద్ధ చరిత్రకారులైన హరూన్-ఖాన్-షేర్వానీ, నేలటూరి వేంకటరమణయ్య మొదలైన వారు కుతుబ్‌షాహీలు అత్యంత ప్రజాసేవాతత్పరత కలిగిన పాలకులనీ, వారు ముస్లింలు అయినప్పటికీ హిందూ ప్రజలను, వారి ఆచారాలను, సంస్కృతిని గౌరవించారనీ, వీరిలో కొందరు తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించారనీ, వారు తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేశారనీ ప్రశంసించారు. కుతుబ్‌షాహీ సుల్తానుల్లో సుల్తాన్-కులీ-కుతుబ్‌షా (క్రీ.శ. 1512 – 1543), ఇబ్రహీం కుతుబ్‌షా (క్రీ.శ. 1550-1580), మహమ్మద్-కులీ-కుతుబ్‌షా (క్రీ.శ. 1580-1612) సుప్రసిద్ధులు.

ఆధారాలు: కుతుబ్‌షాహీ సుల్తానుల పరిపాలనా కాలానికి సంబంధించిన వివిధ అంశాల గురించి సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు, విదేశీ బాటసారుల రచనలు, కుతుబ్‌షాహీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, సమకాలీన తెలుగు సాహిత్యం ఎంతో అమూల్యమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో
ఫెరిస్టా రాసిన గుల్షన్-ఇ-ఇబ్రహీమి, ఖదీరాఖాన్ రాసిన తారీఖ్-ఇ-కుతుబ్‌షాహీ, సయ్యద్ అలీ-టబాటబీ రచన, బుర్హన్-ఇ-మాసిర్, అజ్ఞాత చరిత్రకారుడు రాసిన తారీఖ్-ఇ-సుల్తాన్ మహమ్మద్ షాహీ పేర్కొనదగినవి. ఈ రచనల్లో సుల్తానుల కాలం నాటి రాజకీయ చరిత్ర, పరిపాలన వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, సంస్కృత రచనల్లో, అద్దంకి గంగాధరుడు రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’, పొనగంటి తెలగనార్యుని రచన యయాతి చరిత్ర, మట్ల అనంతభూపాలుని రచన కుకుత్స విజయం, సారంగతమ్మయ్య రచన ‘వైజయంతీ విలాసం’, భద్రాద్రి శతకం, సింహాద్రి శతకం, భతృహరీ శతకం, కదిరీఫతీ రాసిన ‘హంసవింసతి’, అయ్యలరాజు నారాయణామాత్రుడు రాసిన సుకసప్తతి, వేమన పద్యాలు ఆనాటి ప్రజాజీవనాన్ని వర్ణిస్తున్నాయి. కుతుబ్‌షాహీల రాజధాని గోల్కొండ, కొత్త నగరం హైద్రాబాద్, దక్కన్‌లోని ఇతర నగరాలను, ప్రాంతాలను సందర్శించిన విదేశీ బాటసారులైన ఫ్రాన్స్ దేశస్థులైన టావెర్నియర్, బెర్నియర్, థీవ్నాట్, విలియం మాథోల్డ్ రష్యాకు చెందిన నిఖిటిన్ మొదలైన వారు ఈ యుగానికి చెందిన వివిధ విషయాలను తమ డైరీలలో, రచనల్లో పేర్కొన్నారు. ఇవి కుతుబ్‌షాహీల యుగచరిత్ర రచనకు ఎంతో అమూల్య సమాచారాన్ని అందచేస్తున్నాయి.

సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్-ముల్క్: స్వతంత్ర కుతుబ్‌షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్-కులీ-కుతుబ్-ఉల్- ముల్క్. ఇతడు బహమనీల కొలువులో కొంతకాలం పనిచేశాడు. తెలంగాణా తరఢారుగా పనిచేశాడు. మూడో మహమ్మద్ షా పరిపాలన చివరి దశలో చెలరేగిన తిరుగుబాట్లతో ప్రేరేపితుడై క్రీ.శ. 1512లో స్వతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు సమకాలీన విజయనగర, గజపతి రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. ఇతడు గోల్కొండ దుర్గాన్ని బలోపేతం చేయించాడు. అనేక మసీదులు, రాజప్రసాదాలు, భవనాలు నిర్మించాడు. గోల్కొండకు సమీపంలో ‘మహమ్మద్ నగర్’ అనే కొత్త పట్టణాన్ని కట్టించాడు. అతణ్ణి అధికారులు, ప్రజలు అభిమానించారు. 99వ యేట కుమారుడి (జంషీద్) చేతిలో హత్యచేయబడ్డాడు. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యం దక్కన్‌లోనే కాక సమకాలీన ప్రపంచంలో విశేష ఖ్యాతి గడించింది.

జంషీద్-కులీ-కుతుబ్‌షా (క్రీ.శ. 1543-1550): ఇతడు సుల్తాన్-కులీ మూడో కుమారుడు. స్వార్థపరుడు. కుట్రలకు పెద్ద వ్యూహకర్త. సొంత తండ్రినే అధికార దాహంతో హత్యచేసి సింహాసనం అధిష్టించి ఏడేళ్ళు పరిపాలన చేశాడు. ప్రజలు, అధికారులు ఇతని చర్యను ఏవగించుకున్నారు. మంచి పాండిత్యం కలవాడు. కవిత్వం రాసేవాడు. క్రీ.శ. 1550లో వ్యాధిగ్రస్తుడై మరణించాడు.

సుఖాన్-కులీ-కుతుబ్‌షా: జంషీద్ మరణానంతరం ఏడేళ్ళ పిన్నవయస్కుడైన అతని కుమారుణ్ణి అతని తల్లి, మంత్రులు గోల్కొండ సింహాసనంపై కూర్చోబెట్టి అధికారం చెలాయించారు. ఇతని పరిపాలన కేవలం ఏడు నెలలపాటు కొనసాగింది. రాజ్యంలో అంతరంగిక కలహాలు, సర్దారుల స్వార్థ రాజకీయాలు హద్దుమీరాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగర రాజ్యంలో అళియరామరాయల వద్ద శరణాగతునిగా ఉన్న ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా, రామరాయల మద్దతుతో గోల్కొండ రాజ్య సింహాసనాన్ని క్రీ.శ. 1550లో అధిష్టించాడు. ఈ విధంగా సుబాన్ కులీ పాలన అంతమైంది.

ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా (క్రీ.శ. 1550-1580): ఇతడు గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ చిన్న కుమారుడు. తన సోదరుడైన జంషీద్ పన్నిన కుట్ర నుంచి ప్రాణాలతో తప్పించుకొని క్రీ.శ.1543లో విజయగనర రాజ్యం పారిపోయి అళియ రామరాయల శరణు పొందాడు. అక్కడే ఏడేళ్ళపాటు గడిపాడు. రామరాయలు ఇతణ్ణి సొంత కొడుకులా ఆదరించాడు. తెలుగు భాషలో మంచి పాండిత్యం సంపాదించాడు. క్రీ.శ. 1550లో గోల్కొండ సుల్తానుగా సింహాసనం అధిష్టించిన ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా ప్రజా బలంతో 30 సంవత్సరాలపాటు సమర్థవంతంగా పరిపాలన చేశాడు. ఇతడు రాజ్య విస్తరణ కోసం సోదర షియా సుల్తానులతో, విజయనగర రాజులతో అనేక యుద్ధాలు చేశాడు. అళియ రామరాయల విభజించి పాలించు దౌత్యనీతికి ఇతడు నష్టపోయాడు. గత సహాయాన్ని విస్మరించి విజయనగర చక్రవర్తికి వ్యతిరేకంగా వైవాహిక సంబంధాల ద్వారా బీజాపూర్, అహమద్ నగర్ సుల్తానులను, బీరార్, బీదర్ సుల్తానులను ఐక్యం చేశాడు. చారిత్రాత్మక రాక్షసి తంగడి యుద్ధం (జనవరి 23, 1565)లో విజయగనరం సేనాధిపతియైన ఆళియ రామరాయలను మోసంతో దెబ్బతీశాడు. రాత్రిపూట సంప్రదింపుల సాకుతో వారి శిబిరంపై దాడిచేయించాడు. 80 ఏళ్ళ వయస్సులో రామరాయలు విరోచితంగా పోరాడి ఓడాడు. హుస్సేన్-నిజాం షా రామరాయల తలను ఖండించి యుద్దభూమిలో పగ తీర్చుకొన్నాడు. దీంతో విజయనగర సేనలు చిన్నాభిన్నమయ్యాయి. ఇతని పాలనలో గోల్కొండ రాజ్యం కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆర్థికంగా, సైనికంగా గోల్కొండ రాజ్యం బలోపేతమైంది. ఇతడు వ్యవసాయాభివృద్ధికై అనేక చెరువులు, కాలువలు నిర్మించాడు. వీటిలో పేర్కొనదగ్గవి హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు. రైతాంగం సుఖసంతోషాలతో ఉండేది. స్వదేశీ, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. గోల్కొండ వస్త్రాలు, వజ్రాలు యూరోపియన్ రాజ్యాల్లో మంచి పేరు పొందాయి. సాహిత్యం, కళలు ఇతని పోషణలో వికసించాయి. ఇతడు క్రీ.శ. 1580లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

మహమ్మద్ కులీ-కుతుబ్‌షా (క్రీ.శ. 1580-1612): ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా మరణానంతరం అతని సోదరుడైన (సుల్తాన్-కులీ-మూడో కుమారుడు) మహమ్మద్-కులీ-కుతుబ్‌షా పదిహేను ఏళ్ళ పిన్నవయస్సులో గోల్కొండ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు దక్కన్ ముస్లిం పాలకుల్లో అత్యంత ప్రతిభావంతుడిగా కీర్తిగడించాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. సైన్యాలను నడపడంలో దిట్ట. సాహిత్యప్రియుడు, గొప్ప కట్టడాల నిర్మాత. హైద్రాబాద్ నగరం ఇతని నిర్మాణమే. చార్మినార్, జామామసీద్, చందన్ మహల్ కూడా ఇతడే నిర్మించాడు. ఇతడు ఇబ్రహీం మాదిరిగానే తెలుగు భాషను ఆదరించాడు. అరబిక్, పర్షియన్, ఉర్దు భాషలతో సమానంగా తెలుగుభాష పురోగతి చెందింది. స్థానిక ప్రజల సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను గౌరవించాడు. ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించాడు. క్రీ.శ. 1612లో 32 ఏళ్ళ సుదీర్ఘ పాలన తరువాత మరణించాడు. ఇతడి ఏకైక కుమార్తె హయత్-బక్ష్-బేగం. ఈమె భర్త సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా గోల్కొండ చరిత్రలో మహమ్మద్ కులీ-కుతుబ్‌షా పరిపాలనా కాలం ఒక చారిత్రక ఘట్టం.

సుల్తాన్ మహమ్మద్-కులీ-కుతుబ్‌షా (క్రీ.శ.1612-1626): మహ్మమద్ కులీ-కుతుబ్‌షా మరణానంతరం అతని మేనల్లుడు, అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ సుల్తానుగా బాధ్యతలు చేపట్టాడు. ఇతడు గొప్ప పండితుడు. ఇతనికి మత సంప్రదాయాల పట్ల అభిమానం ఎక్కువ. అధిక సమయం పండితులతో చర్చల్లో గడిపేవాడు. క్రీ.శ. 1617లో హైద్రాబాద్ నగరంలో మక్కామసీదు నిర్మాణానికి ఇతడే పునాది వేశాడు. దీని నిర్మాణం డైబ్బైఏడేళ్ళ పాటు కొనసాగింది. క్రీ.శ 1687 లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ మక్కామసీద్ నిర్మాణాన్ని 1694లో పూర్తిచేశాడు. ఇతడే సుల్తాన్ నగరాన్ని నిర్మించాడు.

అబ్దుల్లా-కుతుబ్‌షా (క్రీ.శ.1626 – 1672): ఇతడు సుల్తాన్ మహమ్మద్ కుమారుడు. పన్నెండు ఏళ్ళ పిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని తల్లి హయత్-బక్ష్-బేగం రాజ్య వ్యవహారాలు నిర్వహించింది. ఇతడు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇతని కాలంలో మొగల్ దాడులు గోల్కొండ రాజ్యంపై తీవ్రతరమయ్యాయి. పరాజయం పొందిన గోల్కొండ సుల్తాన్ మొగల్ చక్రవర్తికి కప్పం చెల్లించి అధికారం కొనసాగించాడు. ఇతడు క్రీ.శ.1672లో మరణించాడు.

అబుల్హాసన్ తానాషా (క్రీ.శ.1672–1687): కుతుబ్‌షాహీ సుల్తానుల్లో అబుల్హసన్ తానాషా చివరివాడు. ఇతడు అబ్దుల్లా కుతుబ్‌షా అల్లుడు. ఇతడి పదిహేను ఏళ్ళ పరిపాలనా కాలంలో కుతుబ్‌షాహీ రాజ్యంపై మొగల్ చక్రవర్తి సేనలు నిరంతర దాడులు చేశాయి. దీనివల్ల కుతుబ్‌షాహీ రాజ్య ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇతడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇతడు పరమత సహనం ప్రదర్శించాడు. ఔరంగజేబ్ సామ్రాజ్య కాంక్షకు అబుల్హాసన్ రాజ్యం బలైంది. సుమారు ఎనిమిది నెలలపాటు ధైర్యసాహసాలతో మొగల్ సేనలను కుతుబ్‌షాహీ సేనలు ఎదుర్కొన్నాయి. పరాజితుడైన సుల్తాన్‌ను మొగల్ సేనలు బందీగా బీదర్, దౌలతాబాద్లలో పన్నెండు ఏళ్ళపాటు ఉంచారు. క్రీ.శ. 1690లో చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ బందీగా దౌలాతాబాద్లోనే మరణించాడు.

ప్రశ్న 6.
కుతుబ్‌షాహీల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను వర్ణించండి.
జవాబు:
గోల్కొండ సుల్తానుల కాలమునాటి ఆంధ్రదేశ పరిస్థితులను తెలుసుకొనుటకు ఆధారములేమనగా:

 1. అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీ సంవరణోపాఖ్యానము”
 2. పొన్నగంటి తెలగనార్యుని “యయాతి చరిత్ర”
 3. మట్ల అనంత భూపాలుని “కకుత్స విజయము”
 4. మల్లారెడ్డి విరిచితమగు “పద్మపురాణము”, “షట్చక్రవర్తి చరిత్రము”
 5. వేమన పద్యములు
 6. “భద్రాద్రి శతకము”, సింహాద్రిశతకము” మున్నగు శతకములు
 7. టావెర్నియర్, థీవ్ నాట్ మున్నగు విదేశీ యాత్రికుల రచనలు
 8. ఫెరిష్టా, ఖాఫీఖాన్ మున్నగు ముస్లిం చరిత్రకారుల రచనలు.

గోల్కొండ సుల్తాన్లు వ్యవసాయమును విస్తృతపరచి, పరిశ్రమలను నెలకొల్పి, వాణిజ్యమును ప్రోత్సహించి 3 ఆర్థికాభ్యుదయమును సాధించిరి. వారి పరమత సహన విధానము, ప్రజాహిత కార్యములు, ఆంధ్ర సారస్వత పోషణ ఆంధ్రుల అభిమానమును వారు చూరగొన్నారు.

A. సాంఘిక పరిస్థితులు: నాటి సమాజములో హిందువులు, ముస్లిములు అను రెండు ప్రధాన వర్గములుండెను. హిందువులలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు, కర్షకులను మూడు తెగలు, ముస్లిములలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులను రెండు తెగలు కలవు.

(ఎ) హిందువులు: పూర్వకాలమునందువలె ఈ యుగమున కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కలదు. కాని మహమ్మదీయుల ప్రాబల్యమధికమగుట వలన వర్ణవ్యవస్థలోని క్లిష్టత మాత్రమే సడలసాగెను. నాటి సమాజమున ప్రధానమగు కులములు నాలుగే అయినను వృత్తి కారణముగా అనేక కులములు ఏర్పడినవి. కాపు, రెడ్డి, వెలమ, యాదవ, బలిజ, కమ్మరి, వడ్రంగి, కాసె, కంచెర, అగసాలె, సాలె, సాతాని, చాకలి, మంగలి, కలిక, గాండ్ల, బెస్త, బోయ, మేదర మున్నగు కులములు నాటి సమాజమున కలవు. కాపులలో పంట, మోటాటి, పాకనాటి మున్నగు బేధముండెను. వీరు వ్యవసాయములో నేర్పరులు. వీరితోపాటు స్త్రీలు కూడా పొలము పనులలో పాల్గొనెడివారు. అగసాలె వారు బొమ్మలకు రంగులు వేసెడివారు.

బ్రాహ్మణులు పంచాంగము చెప్పుట వలన, భిక్షాటన ద్వారా, గ్రహశాంతి జపములు చేయుట వలన, గ్రహసంక్రమణ సమయములందు దానములను గ్రహించుట వలన ధనార్జన చేసి జీవించెడివారు. కొందరు బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములలో నియుక్తులగుచుండిరి. వారు నియోగులనబడిరి. వారు గ్రామకరణములుగా కూడా ఉండెడివారు. నాటి బ్రాహ్మణులు వ్యవసాయము చేయుటయందును నేర్పరులే. కొందరు బ్రాహ్మణులు గాదెల నిండుగ ధాన్యమును, ఆవుల మందలను, గొట్టెల మందలను కలిగియుండిరి.

(బి) మహమ్మదీయులు: ఈ కాలమునకు మహ్మదీయుల పాలన ఆంధ్రదేశమున స్థిరపడెను. సుల్తానులు పరమత సహనమును ప్రదర్శించినప్పటికీ స్థానిక అధికారులు ఆంధ్రదేశమున వీరవిహారము సల్పుచుండిరి. స్త్రీలను చెరపట్టి, గోవులను వధించుచుండిరి. వీరి ప్రభావము వలన వేదశాస్త్ర, పురాణ పఠనములు నశించెను. సయ్యదులు, మౌల్వీలు, ఫకీర్లు మున్నగువారి ప్రభావము పెరుగుటతో బ్రాహ్మణులకు, విద్యాంసులకు, హరిభక్తులకు సంఘమున స్థానము దిగజారినది. మహమ్మదీయుల భాష కూడ ప్రచారములోనికి వచ్చెను. ఉర్దూ పదములు విరివిగా తెలుగులో ప్రవేశించెను.

(సి) ఆహారము: వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ నాటి ప్రధాన ఆహార ధాన్యములు. నేయి, కూర ప్రజల భోజనములో ప్రధాన భాగములు. పొంగలి, పులిహోర, దద్దోజనము, పప్పు, ఆవడులు, వడగులు, పచ్చళ్ళు, దోసెలు, గారెలు, బూరెలు, చక్కిలములు మున్నగు అనేక రకములగు ఆహార పదార్ధములు వారికి తెలియును. కొఱ్ఱలు, రాగి, సజ్జ, జొన్న, మొక్కజొన్న సామాన్య ప్రజల ఆహార ధాన్యములు. వరి ధాన్యములో అనేక రకములు కలవు. ముస్లిములు ప్రధానంగా మాంసాహారులు.
తాంబూలమును సేవించుట నాటి ప్రజలకు (ధనికులకు) అమిత ప్రీతి. తాంబూలములో కర్పూరము, కొత్త సున్నము, లేత తమలపాకులు ప్రధాన భాగములు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(డి) దుస్తులు: వివిధ తరగతులవారు వివిధ రకముల దుస్తులను ధరించిరి. గోల్కొండ సుల్తానులు ఆదిలో పూర్వపు సాంప్రదాయము ప్రకారము తురుష్కుల శైలిలో దుస్తులు ధరించినను క్రమక్రమముగా స్థానిక పద్ధతులకు అలవాటుపడిరి. మహమ్మద్ కులీకుతుబ్‌షా తురష్కటోపి, ఉన్ని కోటులకు మారుగా, దక్కను ప్రాంతీయులు వాడు తలపాగాను, వదులుగానుండు చొక్కాను ధరించెను. లుంగీ, జుబ్బా (లాల్చి), పేటాలు ముస్లిం పురుషుల దుస్తులు. క్రమంగా వీటికి బదులుగా షేర్వానీ, ట్రౌజరు, తుర్కీట్రోపీ వాడుకలోనికి వచ్చెను. ముస్లిం స్త్రీలు చీరలు, జాకెట్లు లేదా పావడ పైట వేసుకొనెడివారు. పూర్వము గొంతు నుండి మోకాళ్ళ వరకు ఉండెడి “చౌలీలు” ధరించిరి. చేతులు గూడా పూర్తిగా కప్పబడి ఉండేవి. తరువాత ఈ చౌలీల స్థానములో పొట్టి రవికులు వచ్చినవి. “పర్ధా” ఘోషా అను ఆచారమును ముస్లిం స్త్రీలందరూ పాటించెడివారు.

హిందువులలో ధనవంతులు పగడం, పచ్చలు ధరించెడివారు. నల్ల అంచుగల పంచె, తలపాగ మున్నగునవి. వారి దుస్తులలోని భాగములు. చొక్కాలు చాలా తక్కువ, కాని అవి వాడుకలోనికి వచ్చి ఉండెను. సామాన్య జనులు ముతక దుప్పటి కప్పుకొనుచుండిరి. నాటి స్త్రీలు “సరిగ” రవికెలు ధరించేవారు. అంచులయందు అల్లిక పనిగలిగిన రవికెలను “సరిగ రవికె” అంటారు. స్త్రీలు నుదుట తిలకమును దిద్దుకొని కొప్పువేసుకొని పూలు తురిమిడివారు.

(ఇ) ఆభరణములు: మణి హారములు, పాపిట బొట్లు, జడబిళ్ళలు, కడియములు పగడాల పేరులు, గజ్జెలు, తాయెత్తులు, కుప్పెలు, సూర్య, చంద్రవంకలు, గండ్లపేరు, కంకణములు, కమ్మలు, ఉంగరములు నాటి స్త్రీల ఆభరణములు. నాటి స్త్రీలు బంగారు గాజులు కూడా ధరించినట్లు తెలియుచున్నది. ముస్లిం స్త్రీలు కాళ్ళకు కడియములు, చెవులకు బంగారు పోగులు, గొలుసులు, ముక్కుపుడకలు, విలువైన రాళ్ళు కూర్చిన బంగారు హారములు ధరించెడివారు. పురుషులకు చెవిపోగులుండట సర్వసాధారణము. చాలామంది దండ కడియమును కూడా ధరించిరి. మహమ్మద్ కులీకుతుబ్‌షా కూడా దండ కడియమును ధరించెడివారు. గొడుగులు, టోపీలు వాడుకలో ఉండెను.

(యఫ్) గృహములు, గృహోపకరణములు: గోల్కొండ సుల్తానులు, ప్రభువర్గముల వారు విశాల భవనములలో నివసించుచూ విలాస జీవితమును గడిపారు. మధ్యతరగతివారు కూడా సౌఖ్యప్రదమైన జీవితమును గడిపినట్లు తెలియుచున్నది. హైదరాబాద్ నగరంలో ఎనిమిది లక్షల జనులు నివసించినారు. ఆ కాలము నాటి ప్రజలు గృహ నిర్మాణ విషయమున మిక్కిలి శ్రద్ధ వహించిరి. పడకగది, వంటగది, దేవతార్చనగది, అటకలు, విశాలమగు చావడతో బావి, గాదెలతో పశువుల దొడ్డి మున్నగువానితో నాటి గృహములు కూడి ఉండెడివి. ధనవంతులు గాజుగిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరి. సుల్తానులు, కులీనులు వెండి, బంగారు పాత్రలను వాడిరి. తివాచీలు, గాజు సామాగ్రిని కూడా ఎక్కువగా వాడుకలో ఉండెను. హైదరాబాదులోని విశాల భవనములను, వెండి, బంగారు పాత్రలను, తివాచీలను, గాజు సామాగ్రిని చూచి మొగలులు ఆశ్చర్యచకితులైనారు.

భోగపరాయణుల శయ్యా మందిరములు చక్కగా అలంకరింపబడేవి. పట్టే మంచములు, దోమతెరలు, ముత్యాల జాలీలు, తూగుటుయ్యాల, తాంబూలపు భరిణ, రుద్రవీణ, వట్టివేళ్ళ విసనకర్రలు, దీపపు స్థంభములు మున్నగువానిచే శయ్యామందిరములు అలంకరింపబడెను. విలాసప్రియులు పన్నీరు, గంధము మున్నగు సుగంధ ద్రవ్యములను వాడేవారు.

(జి) వినోదములు: పండుగలు, జాతరలు, రథోత్సవములు మున్నగునవి ఆనాటి ప్రజలకు సంతోషదాయకములు. ధనవంతులైన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదములను ఏర్పాటు చేయుచుండిరి. గ్రామాధికారి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆ కాలపు సర్కస్. దొమ్మరివాళ్ల విద్యలు, వీధినాటకములు, తోలుబొమ్మలాటలు, విప్రవినోదములు, కోడిపందెములు మున్నగునవి ప్రజలకు వినోదము కలిగించెడివి. పులిజూదము, గుడిగుడిగుంచము, బొంగరములాట మున్నగునవి వారి వినోదక్రీడలు.

(హెచ్) విద్యా విధానము: ఆనాటి విద్యా విధానము ఓనమాలను దిద్దించుటతో ప్రారంభమగును. గుణింతములను, పద్యములను నేర్పెడివారు. విద్యనభ్యసించుటలో శ్రద్ధ చూపని విద్యార్థులకు గురువులు తొడ మెలిపెట్టుట, కోదండములు వేయించుట మున్నగు శిక్షలు విధించెడివారు. సాధారణముగా దేవాలయములు, మసీదులు, విద్యాకేంద్రములుగా ఉండేవి.

(ఐ) ఋణ పత్రములు: ఋణములు తీసుకొనుట, ఋణ పత్రములు వ్రాసి ఇచ్చుట మొదలగునవి ఆనాడు వాడుకలో ఉండెను. ఋణపత్రములను మ్రానిపట్టపై ఒకవిధమగు పసరుతో వ్రాసెడివారు.

(జె) శకునములు, విశ్వాసములు: నాటి ప్రజలకు శకునములపై విశ్వాసము కలదు. నంబి బ్రాహ్మణుడు, పాము, చెవులపిల్లి దుశ్శకునములనియు, గ్రద్ద మంచి శకునమనియు వారి విశ్వాసము. ఏదైనా కీడు కలిగినపుడు భూతములకు శాంతి చేసినచో, దోష నివారణమగునని వారి విశ్వాసము. ఎరుకసాని సోదియందునూ వారికి నమ్మకము
కలదు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

(కె) చలివేంద్రములు: వేసవి కాలములో చలివేంద్రములు ఏర్పాటు చేయబడుచుండెను. నాటి చలివేంద్రములలో మంచినీటితో పాటు మజ్జిగ, గంజి కూడా బాటసారులకు దాహము తీర్చుకొనుటకు ఇచ్చేవారు.

B. ఆర్థిక పరిస్థితులు: గోల్కొండ సుల్తానులు వ్యవసాయము, వర్తక వ్యాపారములను వృద్ధిచేసిరి.
(ఎ) వ్యవసాయము, పంటలు: గోల్కొండ సారవంతమైన తీర భూములతోను, అటవీ సంపదతోను కూడియున్న రాజ్యము. ఔరంగజేబు పేర్కొనినట్లు గోల్కొండ రాజ్యములో “సాగులో లేని భూమి లేదు”. గోధుమ, వరి, జొన్న, రాగి, సజ్జ, పప్పు ధాన్యములు అపారముగా పండుచుండెను. వ్యాపార పంటలైన ప్రత్తి, పొగాకు (దీనిని పోర్చుగీసువారు ప్రవేశపెట్టిరి) ఆదాయముల ద్వారా విదేశీ మారక ద్రవ్యము లభించేది. మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ, నారింజ, అనాస, జామ మున్నగు పండ్లు విరివిగా పండింపబడెను.

(బి) పరిశ్రమలు: గోల్కొండ రాజ్యము వ్యవసాయమునకే కాక పరిశ్రమలకు కూడా ప్రసిద్దికెక్కెను. ఒక మొగలు చిత్రకారుడన్నట్లు హైదరాబాద్ లో ఉన్న కళాకారులు, వ్యాపారులు, శ్రామికుల వివరములు తెలుపవలెనన్న అవి ఒక గ్రంథమగును.
1) నేతపని అభివృద్ధి దశయందుండెను. వివిధ రకములు బట్టలు (సన్ననివి, ముతకవి) తయారుచేయబడుచుండెను. ఓరుగల్లు సన్నని నూలు బట్టలు తయారీకి; మచిలీపట్టణము కలంకారీ అద్దకపు పరిశ్రమకు వాసికెక్కెను. కలంకారీ అద్దక వస్త్రములకు విదేశములలో కూడా మంచి గిరాకీ ఉండెను.

2) నిర్మల్, ఇండోర్ (నిజామాబాద్) సమీపమున ఉన్న ఇందల్వాయీలవద్ద ఖడ్గములు, బాకులు, బల్లెములు తయారుచేయబడినట్లు థీవ్ నాట్ రచనలను బట్టి తెలియుచున్నది. అవి భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయబడుచుండెను.

3) కొండపల్లి, నరసాపురము దారు పరిశ్రమకు ప్రసిద్ధికెక్కెను. నరసాపురము వద్ద నౌకలు నిర్మింపబడుచుండెను. భారతీయులేగాక పోర్చుగీసువారు కూడా ఇచట నౌకలను తయారుచేయించుకొనెడివారు. ‘గ్లోబ్’ అను పేరుగల ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ నౌక కూడా ఇచటనే తయారుచేయబడినట్లు ఆ కంపెనీ ఉద్యోగియైన ష్కోరర్ (Schorer) తెలిపియున్నాడు.

4) ఖమ్మం మెట్టు సమీపంలో ఉన్న నల్గొండ వద్ద నీలిమందు తయారుచేయబడి ఎగుమతి అగుచుండెను.

5) మచిలీపట్టణంలో తుపాకీ మందు తూటాలు తయారుచేయబడుచుండెను. ఇచట లభించు తెరచాప దూలములు నాణ్యమైనవి. గోల్కొండ రాజ్యములో మొత్తం 23 గనులు కలవు. వానిలో సీసము, ఇనుము గనులు కూడా కలవు. గోల్కొండ ఉక్కు విదేశాలలో సైతం వాసికెక్కెను. ప్రపంచ ఖ్యాతినార్జించిన డమాన్కస్ కత్తులు గోల్కొండ ఉక్కుతో చేయబడినవే.

6) గోల్కొండ వజ్రపు గనులకు ప్రసిద్ధి. నాడు వజ్రములు సంచుల ద్వారా లెక్కింపబడుటను బట్టి అవి ఎంత సమృద్ధిగా లభించెడివో విశిదమగును. ఆంధ్రప్రాంతములోని కొండపల్లి, నరసాపురముల వద్ద, కర్ణాటక ప్రాంతములోని కంధికోట కొల్లూరుల వద్ద వజ్రముల త్రవ్వకము ముమ్మరముగా సాగుచుండెను. కర్ణాటక ప్రాంతములలోని వజ్రపు గనులలో ఇరవైవేలకు పైగా శ్రామికులు పనిచేయుచుండెడివారు.

(సి) వర్తక, వ్యాపారములు: విదేశీయుల రాకతో దేశీయ, విదేశీయ వాణిజ్యములు పతాకస్థాయికి చేరుకున్నవి. మచిలీపట్టణము విదేశీ వాణిజ్యమునకు కేంద్రముగా ఉండెను. ఈ విషయములో నేటి బొంబాయికి గల స్థానము నేటి మచిలీపట్టణమునకు కలదు. అరకాన్, పెగూ, టెనన్సరియమ్, మలయా ద్వీపకల్పము, సింహళము, మాల్దీవులు, తుర్కి స్థానము, అరేబియా, పర్షియా, ఐరోపాఖండ దేశములలో విదేశీ వాణిజ్యము జరుగుచుండెను. ముడి పదార్థములు, ఆహారపదార్థములు, నూలు బట్టలు మున్నగునవి ఎగుమతి అగుచుండెను. మిరియాలు, చందనపు చెక్క, శిల్కు, చక్కెర, కస్తూరి, లక్క, గాజుసామానులు దిగుమతి అగుచుండెను. 34% ఎగుమతి, దిగుమతి సుంకములు వసూలు చేయబడుచుండెను. దేశీయ వ్యాపారములో గోల్కొండ నగరము గొప్ప వ్యాపార కేంద్రముగా విలసిల్లెను. రత్నములకు, వజ్రములకు, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములకు గోల్కొండ వ్యాపార కేంద్రముగా ఉండెను.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రుద్రమదేవి విజయాలు
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి లేక రుద్రాంబ క్రీ.శ. (1262 – 1296) గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె రుద్రమదేవిని నియమించాడు. ఈమె కాలంలో ఈమె స్త్రీ అన్న చులకన భావంతో యాదవులు, చోళులు, పాండ్యులు, కాకతీయ రాజ్యంపై దండెత్తగా, రుద్రమదేవి వారి దాడులను తిప్పికొట్టింది. పురుష వేషం ధరించి రాజధర్మాన్ని సమకాలీన రాజుల కంటే గణనీయంగా నిర్వహించింది. ఉదార పరిపాలన ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఈమెకు కుమారులు లేనందున తన కూతురు కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని అతనికి రాజ్యాన్ని అప్పగించింది. రుద్రమదేవి కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్ధవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 2.
రుద్రమాంబ (రుద్రమదేవి)
జవాబు:
ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి. ఈమె గణపతిదేవుని కుమార్తె. ఈమె భర్త చాళుక్య వీరభద్రుడు. ఈమెను సమర్థించి, పరిపాలనలో సహకరించి, విశ్వాస పాత్రుడుగా పనిచేసిన వారిలో రేచెర్ల ప్రసాదిత్యుడు ముఖ్యుడు. ఇతనికే కాకతీయ ‘రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు ఉన్నది.

గణపతిదేవునికి కొడుకులు లేనందున తన వారసురాలిగా తన కుమార్తె అయిన రుద్రమదేవిని నియమించాడు. రుద్రమదేవి స్త్రీ అని, ఆమె సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించి, ధిక్కరించిన వారిని ఈమె అణచివేసింది. కాయస్థ నాయకుడు జన్మిగ దేవుడు, అతని తమ్ముడైన త్రిపురారి అంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడంలో ఈమెకు అండగా నిలిచినారు. రుద్రమదేవి సైన్యాలు కడప, వేంగీ, తీరాంధ్రంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదును ధరించింది. యాదవ రాజులు ఈమె శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి తెలుగుదేశంపై దండెత్తారు. రుద్రమదేవి సైన్యాలు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.

ఈమె ప్రజాహితపాలన చేసింది. అనేక చెరువులు, కాలువలు నిర్మింపచేసింది. కాయస్థ అంబదేవుడు ఈమెకు నమ్మిన సేనాని. కాని రుద్రమదేవి పేరు ప్రతిష్టలు చూసి అసూయచెంది తిరుగుబాటు లేవదీశాడు. జన్మిగ దేవుడు, త్రిపురాంతకుడు ఈమెకు నమ్మిన అధికారులు. వీరి సోదరుడైన అంబదేవుడు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి గవర్నర్‌గా పరిపాలించాడు. ఇతడు అధికార కాంక్షతో రుద్రమదేవికి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారుచేసి గొప్ప తిరుగుబాటును లేవదీశాడు. ఇతని తిరుగుబాటును అణచడానికి వెళ్ళిన రుద్రమదేవి యుద్ధభూమిలో వీరస్వర్గం పొందినట్లు తెలియుచున్నది. రుద్రమదేవికి మగసంతానం లేనందువల్ల తన కుమార్తె కుమారుడైన రెండవ ప్రతాపరుద్రున్ని తన వారసునిగా ప్రకటించింది. ఈమె కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించి ఈమె పాలనను కొనియాడాడు.

ప్రశ్న 3.
రాక్షసి – తంగడి యుద్ధం
జవాబు:
రాక్షసి – తంగడి యుద్ధం క్రీ.శ. 1565లో విజయనగరానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న రాక్షసి తంగడి అను గ్రామాల మధ్య విజయనగర సైన్యాలకు, బహమనీ సైన్యాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడి, సర్వనాశనమయ్యాయి. బహమనీ సైన్యాలు రామరాయలను అతిక్రూరంగా హతమార్చాయి. ఈ యుద్ధానంతరం ముస్లిం సైన్యాలు రక్షణ లేని విజయనగరంలో ప్రవేశించి, దోచుకొని, రాజప్రాసాదాలను, ఆలయాలను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పతనమైంది.

ప్రశ్న 4.
విజయనగర రాజుల కాలం నాటి వాస్తు – శిల్పాలు
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప పండితుడు, సాహిత్యప్రియుడు, కళాపోషకుడు. ఎందరో కవులు, పండితులు అతని స్థానములో గౌరవాన్ని పొందారు. ఇతని రచన ఆముక్తమాల్యద పండితుల ప్రశంసలు అందుకొంది. సంస్కృత భాషలో ఉషాపరిణయం అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. ఇతణ్ణి కవులు, పండితులు ‘ఆంధ్రభోజ’ అని కీర్తించారు. ఇతని ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలనే’ ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారని ప్రతీతి. వీరిలో అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ముఖ్యులు. పెద్దన మనుచరిత్ర మహోన్నత ప్రబంధ కావ్యం. శ్రీకృష్ణదేవరాయలు వాస్తు-శిల్పకళలను పోషించాడు. ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టాడు. అనేక పాత దేవాలయాలకు మరమత్తులు చేయించాడు. శ్రీకృష్ణదేవరాయలు హంపీలోని విఠలాస్వామి గుడికి, హజరామస్వామి ఆలయానికి మరమత్తులు చేయించాడు. శ్రీకూర్మం, అహోబిలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచలం, అమరావతి మొదలైన చోట్ల అనేక ఆలయాలకు మరమత్తులు చేయించాడు. ఉదాహరంగా దానాలు చేశాడు, కానుకలు సమర్పించాడు. ఇతని కాలంలోనే హంపీలో భారీ గణేశ, హనుమాన్, ఉగ్రనరసింహ స్వామి రాతి విగ్రహాలను చెక్కించాడు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం విజయనగర చరిత్రలో మైలురాయిగా మిగిలింది.

ప్రశ్న 5.
మూడో మహ్మద్ షా
జవాబు:
పదిహేను సంవత్సరముల ప్రాయమున సింహాసనమునకు వచ్చిన మహమ్మద్ కులీ రాజ్యాంగ తంత్రములను దూరదృష్టితోను, నేర్పుతోను నడిపిన దక్షుడు. ఇతని కాలము నాటికి ఆంధ్రదేశమంతయు గోల్కొండ రాజ్యములో చేరియుండెను.

రాజ్యవాప్తి: మహమ్మద్కులీ కాలమున నంద్యాల, గండికోట, కడప, కర్నూలు ప్రాంతములలో అధికభాగము గోల్కొండ రాజ్యములో చేర్చబడెను. ఈశాన్య దిక్కున గంజాం జిల్లా వరకు ఇతని రాజ్యము విస్తరించేను.

విదేశీ సంబంధాలు: ఇతని కాలములో మొగలు చక్రవర్తి అక్బరు నుండి రాయబార సంఘమొకటి గోల్కొండకు రాగా అతడు అక్బరుకు కానుకలిచ్చి పంపెను. పారశీక రాయబారిగా కూడా ఇతని ఆస్థానమును సందర్శించెను.

వర్తక వ్యాపారములు: మహమ్మద్ కులీ వర్తక వ్యాపారములను, పరపతి సంస్థలను పోత్సహించెను. పర్షియా నుండి అనేక వ్యాపార కుటుంబములను రప్పించి హైదరాబాద్‌లోను, మచిలీపట్టణమునందును, వారికి నివాస సౌకర్యములను కల్పించెను. సుల్తాన్ అనుమతి పొందిన ఆంగ్లేయులు 1611లో మచిలీపట్టణములో వర్తక స్థావరమును నెలకొల్పుకొనిరి.

వాస్తు నిర్మాణము: మహమ్మద్ కులీ గొప్ప వాస్తు నిర్మాత. ఇతడు తన ప్రియురాలగు ఒక హిందూ నర్తకిపేర (బాగ్మతి) భాగ్యనగర్‌ను నిర్మించెను. తదుపరి ఆ నగరము సుల్తాను కుమారుని పేర (హైదర్) హైదరాబాద్ అని వ్యవహరింపబడెను. హైదరాబాదులో చార్మినార్ (1593), జామామసీదు (1593), చందన మహలు, చికిత్సాలయములు, విశ్రాంతి భవనములు మున్నగువానిని ఇతడు కట్టించెను. మూసీనదికి ఆనకట్ట కట్టించి హైద్రాబాదుకు మంచినీటి వసతి కల్పించెను. ఇతడు తన రాజధాని చుట్టును పండ్ల తోటలు నాటించెను. మహ్మమద్ కులీ పండితుడు, కవి, దానశీలి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 6.
ఫ్రాంకోయిస్ బెర్నియర్
జవాబు:
ఇతడు ఫ్రాన్స్ వాస్తవ్యుడు, వృత్తిరీత్యా వైద్యుడు, గొప్ప చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు. క్రీ.శ. 1656-1668 మధ్యకాలంలో గోల్కొండ రాజ్యంలో పర్యటించాడు. మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడైన దారాషీకోకు ఆస్థాన వైద్యునిగా పనిచేశాడు. ఇతడు భారతదేశంలో పర్యటించిన కాలంలో మొగల్ సామ్రాజ్యంలో, దక్కన్లో ముమ్మరంగా పర్యటించి, తాను చూసిన, విన్న విషయాలను డైరీలో రాశాడు. 1670-71 సంవత్సరంలో ఇతని వివరణలు ‘ట్రావెల్స్ – ఇన్-మొగల్-ఎంపైర్’ అనే గ్రంథంగా ఫ్రాన్స్‌లో ముద్రించారు. బెర్నియర్ రచనలో ఆనాటి సామాజిక వ్యవస్థ, ఆచారాలు, వ్యవహారాలు, ఆర్థిక స్థితి, వృత్తులు, ఖార్ఖానాలు, చేతి వృత్తులు మొదలైన అంశాలు వర్ణించడమైంది. దక్కన్లో వ్యవసాయమే అధిక ప్రజల ముఖ్య వృత్తిగా పేర్కొన్నాడు. సమాజంలో శ్రీమంతులు, సర్దారులు, పేద ప్రజలు ఉన్నారని రాశాడు.

ప్రశ్న 7.
ఇబ్రహీం కుతుబ్‌షా
జవాబు:
జంషీద్ మరణానంతరము అతని కుమారుడు సుభాను గోల్కొండ సుల్తాన్ అయ్యెను. కాని విజయనగరములో తలదాచుకొన్న జంషీద్ సోదరుడగు ఇబ్రహీం గోల్కొండపై దాడి వెడలి సుభాను ఆరుమాసముల పాలన అంతమొందించి సింహాసనమధిష్టించెను. గోల్కొండ రాజ్య నిజమైన నిర్మాత ఇబ్రహీం కుతుబ్‌షా. కుతుబ్‌షా వంశీయులలో ప్రప్రథమంగా “షా” బిరుదును ధరించినది కూడా ఇతడే.. ఇతడు కడు సమర్థుడు. ఇబ్రహీం ముప్పై సంవత్సరములు రాజ్యమేలి పరిపాలనా వ్యవస్థను పటిష్టమొనర్చెను. దారిదోపిడీ దొంగలను అదుపులో ఉంచి వర్తకాన్ని, పరిశ్రమలను అభివద్ధి పరచెను. పరమత సహనాన్ని పాటించి హిందువుల అభిమానమునకు పాత్రుడయ్యెను. ఆంధ్రభాషా పోషకుడై ఆంధ్రులకు ప్రేమాస్పదుడయ్యెను.

ఇబ్రహీం ఆశయాలు: గోల్కొండ సుల్తానుగా ఇబ్రహీం ఆశయాలేమనగా (ఎ) దారిదోపిడీ దొంగలను పట్టుకొని ‘శిక్షించుట, (బి) పరిపాలనను వ్యవస్థాపితము చేయుట, (సి) రాజ్య విస్తరణ విధానమును విడనాడుట.

యుద్ధములు: ఇబ్రహీం ఆదిలో తనకు ఆశ్రయమిచ్చిన రామరాయలతో స్నేహసంబంధాలను కలిగివుండెను. తదుపరి ఇతని విధానంలో మార్పు వచ్చెను. గోల్కొండను విడిచి వెళ్ళిన జగదేకరావునకు రామరాయలు ఆశ్రయ మొసంగుట ఇబ్రహీంకు ఆగ్రహము కలిగించెను. అదికాక విజయనగర రాజ్య ప్రాబల్యమును దానివలన కలుగు ప్రమాదమును, అతడు గుర్తించెను. విజయగనర ప్రాబల్యమును, బీజాపూర్ రాజ్య విస్తరణను గాంచి ఆందోళన చెందిన ఇబ్రహీం, అహమ్మద్ నగర్ సుల్తాన్‌తో సంధి చేసుకొనెను. అందుకు ఆగ్రహించి రామరాయలు గోల్కొండపై దాడి జరిపి పానగల్లు, ఘనపురం దుర్గాలను ఆక్రమించెను. అంతట ఇబ్రహీం రామరాయలుపై పగ సాధించుటకు విజయనగరమును నాశనము చేయుటకు దక్కను సుల్తానులను సమైఖ్యపరచి 1565లో రాక్షసితంగడి యుద్ధంలో పాల్గొనెను.

ప్రశ్న 8.
కుతుబ్‌షాహీల పతనం
జవాబు:
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్హాసన్ తానీషా బ్రాహ్మణ సోదరులైన అక్కన్న, మాదన్నలను సేనాని, ప్రధానమంత్రులుగా నియమించెను. సనాతన ముస్లిం భావాలు, హిందువుల యెడల ద్వేషము గల ఔరంగజేబుకు ఈ నియామకాలు రుచించలేదు.

1) ఔరంగజేబు ఉత్తర హిందూదేశ పరిస్థితులను చక్కబెట్టుకొని, తిరుగుబాటు చేసిన తన కుమారుడు అక్బరును తరుముకొనుచు దక్కన్ వచ్చెను. బీజాపూర్ జయించిన పిమ్మట ఔరంగజేబు గోల్కొండపై దాడికి వెడలెను.

2) 1665-66లో జయసింగ్ నాయకత్వమున, 1679లో దిలీరాఖాన్ నాయకత్వమున, 1685లో యువరాజు ఆజమ్ నాయకత్వమున మొగలులు బీజాపూర్‌పై దండయాత్రలు జరిపినపుడు, గోల్కొండ సుల్తాన్లు మొగలులకు వ్యతిరేకంగా, బీజాపూర్ సుల్తాన్లకు సాయపడిరి.

3) గోల్కొండ సుల్తాన్ మొగలుల విరోధియగు శివాజీతో స్నేహము చేసి అతనికి సహాయము చేయుట, కర్నాటక దండయాత్రలో శివాజీకి తోడ్పడుట ఔరంగజేబుకు ఆగ్రహము కలిగించెను.

4) 1656లో కుదిరిన ఒప్పందము ప్రకారము చెల్లించవలసిన యుద్ధవ్యయము, కప్పము గోల్కొండ సుల్తాన్ మొగలులకు చెల్లింపలేదు. అదియునుగాక, కర్ణాటకలో మీర్ జుమ్లా జాగీరు భూముల నుండి మొగలులకు రావలసిన ఆదాయమును సుల్తాన్ వసూలుచేసి అనుభవించెను.

5) గోల్కొండ రాజ్య ఐశ్వర్యము ఔరంగజేబును ఆకర్షించెను.

6) తానీషా పరమత సహనము ఔరంగజేబుకు గిట్టలేదు.

7) ఔరంగజేబు సున్నీశాఖకు చెందినవాడు. గోల్కొండ సుల్తాన్ షియాశాఖకు చెందినవాడగుటచే అతని పాలనను అంతమొందించుటకు ఔరంగజేబు సిద్ధపడెను.

8) సామ్రాజ్య కాంక్షపరుడైన ఔరంగజేబు గోల్కొండ రాజ్యమును వశపర్చుకొనుటకు నిశ్చయించెను.

9) వీనికితోడు బీజాపూర్ సుల్తానుపై ఔరంగజేబు జరిపించిన దాడిని అబ్దుల్ హసన్ “తుచ్ఛమైన పిరికిపంద చర్యగా” (a mean minded coward’s act) అభివర్ణించుట ఔరంగజేబు గోల్కొండపై తక్షణ దాడికి ప్రోత్సహించెను.

గోల్కొండ పతనము – అక్టోబర్ 3, 1687: ఈ కారణముల వలన ఔరంగజేబు మొదట తన కుమారుడైన షా ఆలంను (1685, జూలై) గోల్కొండపై దండెత్తుటకు పంపెను. కాని మాల్కేడ్ వద్ద గోల్కొండ సైన్యము మొగలులను అడ్డెను. షాఆలం ఎట్టి విజయములు సాధించలేదు. అంతట అక్టోబరు, 1685లో గోల్కొండ సర్వసేనానియగు మీర్ మహమ్మద్ ఇబ్రహీంకు లంచమిచ్చి అతని సాయముతో షా ఆలం హైదరాబాద్‌ను ఆక్రమించెను. సుల్తానైన తానీషా హైదరాబాదు వదలి గోల్కొండకు పారిపోయెను. తానీషా, షా ఆలంతో సంధి చేసుకొనెను. ఆ సంధి ప్రకారము:

 • అక్కన్న, మాదన్నలను కొలువు నుండి బహిష్కరించుటకు,
 • మాల్కేడ్, సేరంలను మొగలులకిచ్చుటకు,
 • యుద్ధ నష్టపరిహారము క్రింద ఒక కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చుటకు,
 • సాలుకు రెండు లక్షల హనులు (Huns) కప్పము క్రింద చెల్లించుటకు తానీషా అంగీకరించెను.

కాని తానీషా అక్కన్న, మాదన్నలను బహిష్కరించుటలో జాప్యము చేయసాగెను. అంతట గోల్కొండ రాణుల ప్రోత్సాహముతో అక్కన్న, మాదన్నలు గోల్కొండ వీథులలో హతులైరి. తానీషా మొగలుల మిత్రుడయ్యెను. షా ఆలం గోల్కొండ కోటలో ఉండెను.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ఔరంగజేబు దాడి: బీజాపూర్ ఆక్రమణ ముగియగానే, ఔరంగజేబు గోల్కొండను సైతము మొగలుల సామ్రాజ్యమున విలీనము చేయదలచి ఫిబ్రవరి 7, 1687లో గోల్కొండపై స్వయముగా దాడిచేసెను. గోల్కొండ కోటలో తానీషా, షా ఆలంల మధ్య రహస్య సమాలోచనలు గ్రహించి ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలంను నిర్భందించెను. తదుపరి గోల్కొండను ముట్టడి చేయడం ప్రారంభించెను. ఈ ముట్టడి 8 నెలలు కొనసాగెను. మొగలు సైన్యమునకు నష్టం కలిగెను. కాని గోల్కొండ దుర్గము ఔరంగజేబు వశము కాలేదు. చివరకు ఔరంగజేబు మాయోపాయముచే అనగా అబ్దుల్లా ఫణియను నౌకరుకు లంచమిచ్చి అక్టోబరు 3, 1687 తెల్లవారుజామున 3 గంటలకు గోల్కొండ తూర్పు ద్వారమును తీయించి కోటలో ప్రవేశించెను. అయినను గోల్కొండ సైనికులు తుదిక్షణము వరకు వీరోచితముగా పోరాడిరి. ఈ పోరాటములో 70 గాయములతో ఏకాకిగా మొగలులతో పోరుసల్పిన అబ్దుల్ రజాక్ లౌరీ అను గోల్కొండ సేనాని ప్రభుభక్తి, వీరోచిత శక్తి గోల్కొండ చరిత్రలో చిరస్మరణీయము. పాతఃకాల విందారగించిన తానీషా బంధీగా దౌలతాబాద్‌కు పంపబడెను. దీనితో గోల్కొండ మొగలుల వశము అయినది. కుతుబ్‌షాహీల పాలన అంతరించింది.

ప్రశ్న 9.
నిజాం-ఉల్-ముల్క్
జవాబు:
నిజాం రాజ్యమునకు మూలపురుషుడు నిజాం ఉల్ ముల్క్, ఇతడు 1724 48ల మధ్య నిజాం రాజ్యాన్ని పాలించాడు. అతడి అసలుపేరు మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్. అతనికి చిన్ ఖిలిచ్ ఖాన్ అను మరొక పేరు కలదు. నిజాం ఉల్ ముల్క్ అనేది అతని బిరుదు మాత్రమే. ఇతడు ఆంధ్ర, నైజాం రాజ్యముల చరిత్రలోనేగాక భారతచరిత్రలో కూడా ప్రముఖవ్యక్తి. ఇతడు ‘అసఫ్ జాహి’ బిరుదుతో పాలించినందువల్ల అతని వంశమునకు ‘అసఫ్ జాహి’ పేరు వచ్చింది. ఇతడు మొదట మొగల్ సామ్రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా పనిచేసెను. సయ్యద్ సోదరుల పతనంలో ప్రధాన పాత్ర వహించి మొగల్ సామ్రాజ్యమునకు ప్రధానిగా నియమింపబడ్డాడు. 1724లో స్వతంత్రుడై నిజాం రాజ్యమును స్థాపించారు. దానికి హైదరాబాద్ రాజధాని. 1858 వరకు మొగల్ సుబేదారులుగా నిజాంరాజులు పాలించినప్పటికీ వారు సర్వస్వతంత్రులు. నిజాం ఉల్ ముల్క్ స్థాపించిన రాజ్యము 1948లో సైనికచర్య జరిగి ఇండియన్ యూనియన్ హైదరాబాద్ కలిసే వరకు కొనసాగింది.

నిజాం-ఉల్-ముల్క్ పాలనలో జరిగిన ముఖ్య సంఘటనలు:
a) మునిషిన్ గాంప్ సంధి(1728): ఇతడు మహారాష్ట్రుల అధికార విస్తరణను అడ్డుకొనే యత్నములో భాగముగా వారిలో వారికి అంతఃకలహములు సృష్టించి స్వకార్యమును నెరవేర్చుకొనుటకు ప్రయత్నించెను. చివరకు పీష్వా బాజీరావు చేతిలో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి సంధికి అంగీకరించెను. ఆ సంధి (1728) ప్రకారము నిజాంచేత, సర్దేశ ముఖి కప్పములు చెల్లించుటకు అంగీకరించి, హామీగా కొన్ని దుర్గములను పీష్వా ఆధీనము చేసేను.

b) వార్నా సంధి: పీష్వాపై త్రియంబక్ రావును ఉసిగొల్పి త్రియంబక్ యుద్ధంలో విఫలమై వారా సంధిని చేసుకొనెను. 1731లో చేసుకున్న వార్నా సంధి ప్రకారం దక్షిణమున నిజాం – ఉల్ -ముల్క్ ఉత్తర హిందూ స్థానమున మహారాష్ట్రులు తమ ప్రాబల్యమును నెలకొల్పుకొనుటకు అంగీకారము కుదిరెను.

c) భోపాల్ యుద్దము (1738): మొగల్ చక్రవర్తికి, నిజాంకు ఉమ్మడి శతృవులైన మహారాష్ట్రులపై కత్తిగట్టిరి. అపుడు 1738 జనవరి నెలలో మహారాష్ట్రులకు నిజాం ఉల్ ముల్క్క భోపాల్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం పూర్తిగా ఓడిపోయెను. అపుడు చేసుకున్న సంధి ప్రకారము మాళ్వా రాష్ట్రమును, చంబల్, నర్మదా నదులు మధ్య దేశమును, యుద్ధ నష్టపరిహారముగా 50 లక్షల రూపాయలను మహారాష్ట్రులకు ఇప్పించుటకు నిజాం అంగీకరించెను.

d) నాదిర్షా దండయాత్ర: క్రీ.శ. 1738లో మొగల్ సామ్రాజ్యముపై నాదిర్షా దండయాత్ర జరిపెను. నాదిర్షా తనను ఎదిరించిన మహ్మద్, నిజాం ఉల్-ముల్క్ ఓడించి ఢిల్లీ చేరుకొనెను. ఆ సందర్భమున నాదిర్షా ఆగ్రహమునకు గురైన ఢిల్లీ పౌరులను నిజాం ఉల్ ముల్క్ కాపాడెను.

e) 1740 లో తన కుమారుడు నాజర్ జంగ్ చేసిన తిరుగుబాటును చాకచక్యంగా అణిచివేసి అతనిని క్షమించెను.

f) సర్కార్, కర్నూల్, ఆర్కాట్ పాలెగాండ్లను తన ఆధీనంలోకి తెచ్చుకొనెను.

మహారాష్ట్రుల దాడుల నుండి తన రాజ్యమును కాపాడుకొనుటకై తూర్పుతీరంలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పుతున్న ఫ్రెంచివారితోను, ఆంగ్లేయులతోను వైరుధ్యము వహింపక స్నేహ హస్తమందించాడు. అతని మరణం నాటికి నిజాం రాజ్యం ఉత్తరమున తపతీ నది నుండి దక్షిణమున తిరుచునాపల్లి వరకు, పశ్చిమాన ఔరంగాబాద్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది.

ఘనత: ఇతడు గొప్ప రాజనీతిజ్ఞుడు. పరిపాలనాదక్షుడు. అసఫీ కళాపోషకుడు. అతని రాజధాని ఔరంగాబాద్ పదిలక్షల జనాభాతో వర్థిల్లుచుండెను. అది కవి పండితులకు నిలయమై ఉండెను. నిజాం ఉల్ ముల్క్ నిరాడంబరముగా జీవించెడివాడు. దర్బారుకు హాజరగు సమయంలో తప్ప ఎటువంటి ఆభరణములు ధరించేవాడుకాదు. అతడు గొప్ప వితరణ శీలి. గొప్పదాన ధర్మములు చేసేవాడు. మత గురువులను గౌరవంగా ఆదరించేవాడు. డా॥ యూసఫ్ హుస్సేన్ ఇలా వ్రాశాడు. “భారతదేశంలో 18వ శతాబ్ది ప్రథమార్థ భాగమున తన రాజకీయ లక్ష్యములను సఫలీకృతం చేసుకున్న రాజనీతిజ్ఞుడు ఇతడొక్కడే. ఇతడు జన్మతః రాజకీయ లక్షణాలు కలవాడు. గొప్ప యోధుడు. పరిపాలనా దక్షుడు”.

ప్రశ్న 10.
నిజాం-అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం-ఉల్-ముల్క్ వారసుల్లో నిజాం-ఆలీ ఖాన్ (క్రీ.శ. 1762-1803),నిజాం-సికందర్ (క్రీ.శ. 1803- 1829), నాసిరుద్దాలా (క్రీ.శ. 1829-1857), ఆఫ్ఘలుద్దాలా (క్రీ.శ. 1857-1869), ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ (క్రీ.శ. 1869-1911), 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (క్రీ.శ. 1911-సెప్టెంబర్ 1948) ప్రముఖులు. వీరి సుదీర్ఘ పాలనలో తెలంగాణా ప్రాంతం దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. హైద్రాబాద్ నగరం ప్రపంచ ఖ్యాతి గడించింది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారతదేశంలోని అత్యధిక భూభాగాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం నెలకొల్పడమైంది. దక్కన్లో జరిగిన ఆంగ్లో-కర్ణాటక, ఆంగ్లో-మరాఠా యుద్దాల్లో హైద్రాబాద్ నిజాంలు కీలకపాత్ర పోషించారు. ఫ్రెంచి వారితో వీరి స్నేహం కొన్ని అద్భుత విజయాలు చేకూర్చింది. కాని క్రీ.శ. 1768లో నిజాం-ఆలీ- ఖాన్ లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్యసహకార ఒప్పందం అంగీకరించాడు. దీంతో నిజాం తన స్వతంత్ర అధికారాలను కొంతమేరకు కోల్పోయాడు. మరాఠాల దాడుల నుంచి, ఇతర శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజాం ఈ ఒప్పందంలో చేరాడు. దీని ప్రకారం హైద్రాబాద్ నగరంలో బ్రిటిష్ సేనలు నిల్పారు. వాటికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించడానికి నిజాం అంగీకరించాడు. నిజాం-ఆలీఖాన్ నగదు చెల్లించలేని పక్షంలో సారవంత భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ధారదత్తం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇతని వారసులైన సికందర్ , నాసిరుద్దాలా, అఫ్టలుద్దాలా ఈ సంధి షరతులు అమలుచేశారు. దీంతో కోశాగారంపై అదనపు భారం పడింది. నిజాం· బ్రిటీష్ స్నేహం క్రీ.శ. 1948 వరకు కొనసాగింది. ఆసఫ్‌జాహీల ప్రధానమంత్రిగా క్రీ.శ. 1853 -1883 మధ్య కాలంలో బాధ్యతలు నిర్వహించిన మొదటి సాలార్జంగ్ ప్రజా సంక్షేమానికై అనేక మహోన్నత సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అతడి భూమిశిస్తు, విద్యా, న్యాయ సంస్కరణలు ప్రజలకు మేలుచేశాయి.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 11.
ఉస్మాన్ అలీ-ఖాన్ విజయాలు
జవాబు:
నిజాం ప్రభువులలో ఆఖరివాడు ఉస్మాన్ అలీఖాన్. ఇతని పాలనాకాలంలో రెండు ప్రపంచ యుద్ధములు, భారత స్వాతంత్ర్యము, హైద్రాబాద్ పై పోలీసు చర్య, సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం వంటి అనేక సంఘటనలు జరిగెను. ఇతని కాలమున నిజాం రాజ్యము సర్వతోముఖాభివృద్ధి చెందెను. ఇతడు అనేక పరిపాలన చర్యలు తీసుకొనెను.

 1. ప్రభుత్వ కార్యాలయములలో అనేకమంది సిబ్బందిని నియమించి ప్రభుత్వ కార్యక్రమములు త్వరితగతిన జరుగునట్లు చేసెను.
 2. రాష్ట్రాదాయము క్రమబద్దము చేసి అనేక ప్రణాళికలను తయారుచేసెను. ఉస్మాన్‌సాగర్ నిర్మాణం జరిపినది ఇతడే.
 3. వ్యవసాయాభివృద్ధికి హిమాయత్ సాగర్, నిజాంసాగర్‌లను నిర్మించెను.
 4. అనేక దేశీయ పరిశ్రమలు స్థాపించబడెను. వాటిలో అజాంజాహి మిక్స్, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మొదలగునవి.
 5. ఇతడు అనేక ప్రజాసంబంధ నిర్మాణములు, విద్యాలయములు, వైద్యాలయములు నెలకొల్పెను.
 6. సాలార్జంగ్ ప్రారంభించిన పారిశ్రామిక వస్తు ప్రదర్శన క్రమబద్ధంచేసి కొనసాగించెను.
 7. స్థానిక కేంద్రాలలో అనేక కార్యాలయములు నిర్మాణం జరిపెను.
 8. పురాతత్వ శాఖను రూపొందించెను.
 9. నిజాం స్టేట్ రైల్వేను స్థాపించెను.
 10. మొదటి ప్రపంచ కాలమందు బ్రిటిష్ వారికి అన్నిరకాల సహకారమందించి “మహాఘనత వహించిన” అను బిరుదు ధరించెను.

అస్తమయం: 1948 సెప్టెంబర్ రజాకార్ల అలజడులు నైజాం ప్రాంతంలో ఎక్కువైనాయి. ఫలితంగా భారత ప్రభుత్వం పోలీసు చర్య కలిపి సంస్థానమును ఆక్రమించెను. చివరకు 1950 జనవరి 26న హైదరాబాదు సంస్థానము ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయెను.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కాకతీయుల శాసనాలు
జవాబు:

 1. మొదటిసారిగా క్రీ.శ. 956వ సం|| నాటి తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని ‘మాగల్లు శాసనం’ కాకత్య గుండ్యన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయవంశ మూలపురుషుడు.
 2. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి శాసనము రుద్రదేవుడు స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొన్న విషయాన్ని అతని విజయాలను తెలివేస్తుంది.
 3. కాకతీయ ప్రభువులు, వారి బంధువులు, సేనాపతులు వేయించినారు.
 4. బయ్యారం శాసనము దీనిని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.
 5. పాలంపేట శాసనం, ద్రాక్షారామం శాసనము, చందుపట్ల శాసనము మొదలగునవి.

ప్రశ్న 2.
మార్కోపోలో
జవాబు:
మార్కోపోలో వెనిస్ యాత్రికుడు. కాకతీయ రుద్రమదేవి కాలంలో ఇతడు ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని సమర్థవంతంగా పాలించిందని, ఆమె పరిపాలనా వ్యవస్థ ఆదర్శవంతంగా సాగిందని మార్కోపోలో పేర్కొన్నాడు. కాకతీయ రాజ్యములో పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నదని, గోల్కొండ ప్రాంతంలో ప్రజల పరిశ్రమ అభివృద్ధిలో ఉన్నదని, ప్రజలు అప్లైశ్వర్యాలతో తులతూగుచుండేవారని కూడా పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
నాయంకర వ్యవస్థ
జవాబు:
కాకతీయులు తమ రాజ్యంలోని భూములను సైనికాధికారులకు పంచిపెట్టారు. వారిని నాయంకరులు అంటారు. వారికిచ్చిన భూమిని నాయకస్థలం లేదా నాయకస్థలవృత్తి అనేవారు. నాయంకర భూములను తీసుకున్న సైనికాధికారులు కొంత సైన్యాన్ని పోషించి రాజుకు అవసర సందర్భాలలో సరఫరా చేయాలి. ఈ పద్ధతి ముస్లిమ్‌ల జాగీర్దార్ పద్ధతిని పోలి ఉంటుంది. ప్రతాపరుద్రుని కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారని తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 4.
పాలంపేట
జవాబు:
రేచర్ల రుద్రుడు పాలంపేటలో ఒక గొప్ప దేవాలయమును నిర్మించెను. ఈ దేవాలయం రూపశిల్పి ‘రామప్ప’. అందుచే దీనికి ‘రామప్ప దేవాలయం’ అని పేరు వచ్చింది. ఈ దేవాలయాలు కాకతీయ శిల్పకళకు పరాకాష్టకు చేరుకున్నాయి. రామప్ప దేవాలయంలో నంది విశిష్టమైనది. రామప్ప గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే ఆకులవలె తేలడం ఒక అద్భుతం.

 

ప్రశ్న 5.
విజయనగర కాలంలో రాష్ట్రపాలన
జవాబు:
పరిపాలన సౌలభ్యం కోసం సువిశాల విజయనగర సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని రాజ్యమని వ్యవహరించారు. తంజావూర్, మధుర, ఇక్కేరి, చంద్రగిరి, శ్రీశైలం, కొండవీడు మొదలైనవి ముఖ్య రాజ్యాలు. ఈ రాజ్యాధిపతులు ఇంచుమించు స్వతంత్రంగానే వ్యవహరించారు.

రాష్ట్రంలో సీమలు, స్థలాలు, సమితులు, గ్రామాలు పాలన విభాగాలు. సీమకు పారుపత్యగారు, స్థలం మీద గౌడ, కరణం అధికార్లు. గ్రామంలో రెడ్డి, కరణం, తలారి మొదలైన వారుండేవారు.

ప్రశ్న 6.
బహమనీ రాజ్యస్థాపన
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మీద జరిగిన అనేకమైన తిరుగుబాట్లలో ఒకదాని పరిణామమే, బహమనీ రాజ్యస్థాపన. ఈ తిరుగుబాటును దక్కన్ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసే ఉద్యోగులు జరిపారు. వీరినే ‘సాదాఅమీర్లు’ అనేవారు. వీరు గుజరాత్, దౌలతాబాద్ ప్రాంతాల్లో జిల్లా ఉద్యోగులుగా ఉండే విదేశీ ప్రభు కుటుంబాలవారు. తుగ్లక్ కాలంలో పన్నులు సరిగా వసూలుకానందున, అమీర్లను అదుపులో ఉంచడం కోసం, షిక్టార్లకు ఆజ్ఞలను జారీచేశాడు. అమీర్లలో భయాందోళనలు పుట్టి, వారంతా ఏకమై సుల్తాన్‌పై తిరగబడ్డారు. వారికి సమర్థుడైన ‘హసన్ గంగూ’ అనే జాఫరాఖాన్ నాయకుడిగా దొరికాడు. గుల్బర్గాను రాజధానిగా చేసుకొని, క్రీ.శ. 1347లో హసన్ గంగూ బహమన్షాను అమీర్లందరూ సుల్తాన్ గా ఎన్నుకోగా, బహమనీ రాజ్యస్థాపన జరిగింది. ‘బహమన్’ చేత ఏర్పాటు చేయబడ్డ సామ్రాజ్యం కాబట్టి, బహమనీ సామ్రాజ్యమని దీనికి పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయం. ఈ వంశంలో మొత్తం 18 మంది సుల్తాన్లు పరిపాలించారు.

ప్రశ్న 7.
మహ్మద్ గవాన్
జవాబు:
గవాన్ పారశీక ప్రభు కుటుంబంలో క్రీ.శ. 1404లో జన్మించాడు. మాతృదేశాన్ని విడిచి, వర్తకం చేసుకుంటూ, 1447లో బీదర్ చేరాడు. రెండో అల్లావుద్దీన్ కొలువులో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణా తరల్దార్ తిరుగుబాటు చేయగా, అతనిని బాలకొండ యుద్ధంలో ఓడించి, సుల్తాన్ అభిమానాన్ని పొందాడు. గవాన్ రాజనీతి, యుద్ధనైపుణ్యం ప్రశంసలందుకొన్నాయి. అతని శక్తి సామర్థ్యాలను, సేవలను గుర్తించి మహమ్మదా అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు.

అధికారంలోకి వచ్చిన వెంటనే, గవాన్ విజయయాత్రలను జరిపి బహమనీ రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. మాళవ, గోవా, తెలంగాణ, రాజమహేంద్రవరం, కొండవీడు ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ సందర్భంలోనే క్రీ.శ.1481లో గవాన్ తీరం వెంబడి కాంచీపురం వరకు దాడి చేశాడు. మార్గమధ్యంలో ఆలయాలను కొల్లగొట్టి అపార ధనరాసులతో తిరిగొచ్చాడు. ఈ విజయాలతో బహమనీ రాజ్యం తపతీ నది నుంచి తుంగభద్రనది వరకు, ఉభయ సముద్రాల మధ్య విస్తరించింది. రాజ్యవిస్తరణ కార్యక్రమంలో ఉన్నప్పుడే గవాన్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసే సంకల్పంతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

AP Inter 1st Year History Study Material Chapter 10 క్రీ.శ. 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్ర

ప్రశ్న 8.
మీర్ మహబూబ్ అలీ కాలంలో విద్యాభివృద్ధి
జవాబు:
ఇతడు వైద్యాలయములు, విద్యాలయములు స్థాపించెను. సిటీ కళాశాల ఉస్మానియా వైద్యాలయము, యునాని వైద్యాలయములు స్థాపించెను. మ్యూజియము, జూబ్లీహాలు నిర్మింపబడెను. విద్యావ్యాప్తికి ఇతడు అనేక ప్రాంతాలలో పాఠశాలలు నిర్మించెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 8th Lesson మొగలుల యుగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మొగల్’ చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలను వివరించండి.
జవాబు:
మొగల్ అను పదము ఒక వంశనామము. ఇది ‘మంగోల్’ అను పదము నుండి వచ్చింది. మంగోల్ అనే పదం నుండి మొగల్ అనే పదము రూపొందుటకు కారణమేమనగా మొగలులు మన దేశాన్ని పాలించే రోజుల్లో ఐరోపావారు వ్యాపార నిమిత్తం వచ్చి మొగల్ దర్బార్‌ను సందర్శించిరి. వారి సహజ నామమైన మంగోల్ అనే పదం వారివారి భాషలలో వేరువేరు రూపాలుగా పేర్కొనబడెను.

మొగల్ చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారాలు: భారతదేశ చరిత్రలో మొగలు చరిత్రకు అమిత ప్రాధాన్యత కలదు. ఈ చరిత్రకున్న ఆధారాలు ఏ చరిత్రకు లేవు. ఇందుకు కారణములు ఏమనగా,

 1. మొగల్ చక్రవర్తులలో అనేకులు సాహితీవేత్తలగుట వలన
 2. చక్రవర్తులు కవులను, పండితులను పోషించుట
 3. చక్రవర్తుల ఫర్మానాలు, ప్రభుత్వ ఆజ్ఞాపనా పత్రాలు
 4. యాత్రికులుగా భారతన్ను సందర్శించిన పెక్కు విదేశీ రచనలు.

మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి ఏమనగా,

 1. వాఙ్మయ ఆధారములు
 2. పురావస్తు ఆధారములు
 3. విదేశీ రచనలు

1. వాఙ్మయ ఆధారములు:
A) బాబరు హుమాయూన్‌ల కాలము:
తుజు – క్ – ఇ · బాబురి: మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. బాబరు టర్కీ భాషలో రాసిన స్వీయచరిత్ర’, ‘తుజు-క్-ఇ-బాబురి’ ద్వారా బాబర్ కాలమునకు, హుమాయూన్ కాలమునకు తొలి జీవిత విశేషాలు తెలుస్తున్నవి.

తారీఖ్-ఇ-రషీది: దీనిని బాబరు బంధువగు ‘మీర్జా మహమ్మద్ హైదర్ దుఘాత్’ రాసెను. ఇందు బాబర్ దిగ్విజయములు, షేర్షా – హుమాయూన్‌ల సంఘర్షణ – కాశ్మీర్ చరిత్ర వర్ణించబడెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

హబీబ్-ఉన్-సియర్: దీనిని ‘ఖ్వాందాహర్ అమీర్’ వ్రాసెను. బాబరు గురించి హుమాయూన్ మొదటి మూడు సం॥ల పాలన గురించి వ్రాయబడెను.

తారీఖ్-ఇ-షాహి: దీనిని ‘అహ్మద్ యాద్గర్’ వ్రాసెను. ఇందు ఆఫ్ఘనులు, బాబరు, హుమాయూన్లతో పోరాడి, తిరిగి అధికారము పొందిన విధము తెలుస్తున్నది.

షైబానీ నామ: దీనిని ‘మహమ్మద్ పాలిప్’ రాసెను. ఇందు బాబర్‌కు, ఉజ్జెక్ పాలకుల మధ్యగల సంబంధాలు వర్ణింపబడినవి.

హుమాయూన్ నామ: దీనిని బాబరు కుమార్తెయగు “గుల్బదన్ బేగమ్” రాసెను. ఇందు బాబరు, హుమాయూన్లు తమ బంధుమిత్రులతో వ్యవహరించిన తీరు, వారి మనోభావములు వర్ణింపబడెను.

ఇంకను హుమాయూన్ గూర్చి తెలుసుకొనుటకు తారీఖ్-ఇ-హుమాయూన్, కానూన్-ఇ-హుమాయూన్ మొదలగు రచనలు తోడ్పడుచున్నవి. షేర్షాను గూర్చి తెలుసుకొనుటకు ‘అబ్బాష్వేణి’ రాసిన తారీఖ్-ఇ-షేర్షా ముఖ్యమైనది.

B) అక్బరు కాలము:
తారీఖ్-ఇ-అక్బరు షాహి: దీనిని అక్బరు రెవెన్యూశాఖ ఉద్యోగియైన హజీమహమ్మద్ ఆరిఫ్ కందాహరే వ్రాసెను. ఇందు అక్బరు వ్యక్తిత్వము, అతని పరిపాలనా విస్తరణ ఉంది.
అక్బరు నామ, ఐనీ- అక్బరీ: ఈ రెండు గ్రంథములను అక్బరు ఆస్థాన పండితుడు, అతని మిత్రుడగు ‘అబుల్ ఫజల్’ వ్రాసెను. మొగల్ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథములు తలమానికవంటివి.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని ‘మీర్ బక్షీ ఖ్వాజీ నిజాముద్దీన్” రాసెను. ఇందు మూడు సంపుటములు కలవు. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బర్ పాలనా కాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరించబడెను.

C) జహంగీర్ పాలనా కాలము:
తారీఖ్-ఇ-ఫెరిస్టా: దీనిని “మహమ్మద్ ఖాసిం ఫెరిస్టా” రాసెను. ఇందు జహంగీర్ సింహాసనం అధిష్టించు వరకు భారతదేశ ముస్లిం పాలనను గూర్చి మరియు దక్కను సుల్తానుల గురించి వర్ణించెను.

తుజుక్-ఇ-జహంగీర్: ఇది జహంగీర్ స్వీయచరిత్ర. జహంగీర్ వ్యక్తిత్వము, అతని పాలనా విశేషాలు తెలుసుకొనుటకు ఇది ఒక అమూల్యమైన గ్రంథము.
ముతమిధాఖాన్ రచించిన ‘ఇక్బాల్ నామా’
మహ్మదాలీ రాసిన ‘వాకిఆత్-జహంగరీ’
ఖ్వాజానియామతుల్లా రాసిన ‘తారీఖ్-ఇ-ఖాన్-జహనీ’
మొదలగు ఇతర రచనలు కూడా జహంగీరు కాలమునకు సంబంధించినవే.

D) షాజహాన్ కాలము:
షాజహాన్ ఆస్థానమును అలంకరించిన జగన్నాథ పండితుడు, జనార్థనభట్టు రచనలు, అబ్దుల్ హమీద్ లహరి రాసిన ‘బాదుషానామ’, మహమ్మద్ సలీ గ్రంథమగు ‘అమల్-ఇ-సాలీ’, ఇనాయత్ ఖాన్, మహమ్మద్ సాదిక్‌ల షాజహాన్నామా మొదలగునవి షాజహాన్ కాలమునకు సంబంధించిన రచనలు.

E) ఔరంగజేబు కాలము:
ఔరంగజేబు చరిత్ర రచనను నిషేదించిననూ అతని కాలమున పెక్కు చారిత్రక గ్రంథములు వెలువడుట అబ్బురము. అందు ముఖ్యమైనవి ‘ఆలంఘీర్ నామ’ దీనిని మీర్జా మహ్మద్ ఖాన్ రాసెను. ఇందు ఔరంగజేబు తొలి పది సంవత్సరాల పాలనా కాలము వర్ణించబడెను.

“మ అనిర్-ఇ-అలంఘ” దీనిని మహ్మద్ సాకే ముస్తయిద్’ వ్రాసెను. హకిరీ రాసిన ‘ఔరంగజేబు నామ’ అకిలాన్ వ్రాసిన ‘జఫర్-నామ-ఇ-ఆలంఘీర్’, ఔరంగజేబు రాసిన “ఫత్వా-ఇ-ఆలంఘీర్’ మొదలగు గ్రంథాలు ఔరంగజేబు కాలమునకు చెందినాయి.

2. పురావస్తు ఆధారములు:
A) శాసనములు: మొగల్ చక్రవర్తులు శాసనములను పెద్దగా వేయించలేదు. వేయించిన కొద్ది శాసనాలు వారి చరిత్రకు ప్రామాణికముగా ఉపయోగపడగలవు.

B) నాణెములు: మొగల్ చక్రవర్తులు ముద్రించిన నాణెములు చరిత్ర రచనకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జహంగీర్, నూర్జహాన్ నాణెములు నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనుటకు ఉపయోగపడుచున్నవి.

C) భవన నిర్మాణము: మొగల్ చక్రవర్తులు నిర్మించిన అసంఖ్యాక కట్టడములు వారి కళాపోషణకు నిదర్శనము. అట్టి వానిలో ముఖ్యమైనవి ఆగ్రా కోట, ఎర్ర కోట, ఫతేపూర్ సిక్రీ, తాజ్‌మహల్, మయూర సింహాసనము మొదలగునవి.

3. విదేశీ రచనలు: మొగల్ యుగమున పెక్కు విదేశీవాసులు భారతదేశమును సందర్శించి తమ అనుభవాలను, నాటి కాల పరిస్థితులను తమ రచనలలో వర్ణించిరి.

A) ఆంగ్లేయులు: రాల్ఫ్ ఫిష్, జాన్ మిల్టన్ హర్, విలియం హాకిన్స్, విలియం ఫించ్, ఎడ్వర్డ్ టెర్రీ, సర్ థామస్ రో రచనలు జహంగీరు కాలమునకు ఆంగ్ల వర్తక కేంద్రస్థాపనా చరిత్రకు అమూల్యమైన ఆధారములు.

B) ఫ్రెంచి, బార్నియర్, టావెర్నియర్, థీవెనాన్: ఈ సందర్భంగా ఔరంగజేబు కాలంలో వచ్చిన జెర్నియార్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రెంచ్ భాషలో వ్రాసిన మొగల్ సామ్రాజ్యంలో యాత్రలు అనునది ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఇట్లు స్వదేశీయ, విదేశీయ రచనల్లో పెక్కు చారిత్రకాంశములు మొగల్ చరిత్రకు ఆధారములుగా ప్రకాశించుచున్నవి.

ప్రశ్న 2.
మొగల్ పరిపాలనలోని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు:
మొగల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసినవాడు అక్బర్. అక్బర్‌కు ప్రభుత్వ విధానాల్లో షేర్షా కొంతవరకు మార్గదర్శి. షేర్షా విధానాలను మెరుగుపరచి, కొత్త విధానాలను ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలకునిగా అక్బర్ చక్రవర్తి మొగల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.

కేంద్ర ప్రభుత్వం: మొగల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తి సర్వాధికారి. అధికారాలన్నీ అతడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. మొగల్ చక్రవర్తి ప్రాజ్ఞ నిరంకుశ ప్రభువు. “నా కింది ఉద్యోగులు నిర్వహించాల్సిన బాధ్యతలను నేను నిర్వహించనవసరం లేదు. పాలకుడు కింది ఉద్యోగులు తప్పులను దిద్దుకుంటూపోతూ తాను చేసే తప్పులను నివారించుకుంటే సరిపోతుంది” అని అక్బర్ చెప్పుకున్నాడు. ప్రభుత్వంలో చక్రవర్తికి (పాదుషాకు) సలహాలిచ్చేందుకు నలుగురు మంత్రులున్నారు. వారు:

1) వకీల్ లేక వకీల్-ఇ-ముత్లాక్ లేక ప్రధానమంత్రి: ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారు. అన్ని శాఖలను పర్యవేక్షిస్తాడు.

2) దివాన్ లేక వజీర్ లేక ఆర్థికమంత్రి: ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమిశిస్తు ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి.

3) మీరక్షీ: ఇతడు యుద్ధ మంత్రి. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. మన్సబార్ల పేర్లు, వారి హోదాలు, వారి జీతాలు ఇతడు నమోదు చేసుకొనేవాడు. రాజప్రాసాద రక్షణ నిమిత్తం గస్తీ ఉద్యోగులను నియమించేవాడు. రాష్ట్రాలలో వార్తాహరులను, గూఢచారులను నియమించటం కూడా ఇతని విధి.

4) సదర్-ఉస్-సదర్: మత విషయాలలో చక్రవర్తికి సలహాలివ్వడం, చక్రవర్తి దానధర్మాలను పర్యవేక్షించటం, ముఖ్య న్యాయాధీశునిగా వ్యవహరించటం ఇతడి విధులు.

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కొరకు మొగల్ సామ్రాజ్యం సుబాలుగా విభజింపబడింది. అక్బర్ కాలంలో దాదాపు 15 సుబాలుండేవి. ఒక రకంగా వీటిని రాష్ట్రాలుగా పరిగణించవచ్చు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ, కేంద్ర పాలనావ్యవస్థకు ప్రతిరూపం లేక ప్రతీక అని చెప్పవచ్చు. సుబాను పాలించే అధికారి సుబేదార్. సుబాలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను సుబేదార్ నిర్వహిస్తాడు. దివాన్, భక్షి, సదర్, ఖాజీ అను అధికారులు కూడా రాష్ట్రపాలనా నిర్వహణలో బాధ్యత స్వీకరిస్తారు. వారి విధులు కేంద్ర ప్రభుత్వంలో అదే పేరుగల అధికారుల విధులను పోలి ఉంటాయి.

ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు కొత్వాలు అనే ఉద్యోగి ఉండేవాడు. అతడు నగరాలలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ప్రభుత్వ ఆజ్ఞలను అమలు పరిచేవాడు. విదేశీయుల కార్యకలాపాలను గమనించేవాడు. సర్కారు పాలన: “సుబాలు” సర్కారులుగా విభజింపబడ్డాయి. సర్కార్లను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కార్లను పాలించడానికి ఈ క్రింది అధికార్లు ఉంటారు.

 • ఫౌజార్: ఇతడు సర్కారు అధిపతి, సైనికాధికారి, తిరుగుబాట్లను అణచివేసి రెవిన్యూ అధికారులకు సహాయం చేయడం ఇతని ముఖ్య విధులు.
 • అమల్ గుజార్: ఇతడు రెవిన్యూ శాఖాధిపతి. భూమిశిస్తు వసూలు చేయడం, ఋణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు.
 • ఖజానాదార్: ఇతడు కోశాధికారి. వసూలైన భూమిశిస్తును ఖజానాలో భద్రపరచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని విధి.
 • బిలక్సీ: ఇతడు భూములకు, భూమిశిస్తులకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

పరగణా పాలన: సర్కార్లు పరగణాలుగా విభజింపబడ్డాయి. ఈ క్రింది అధికారులు పరగణాల యొక్క పరిపాలనను నిర్వహించేవారు.

 • షికార్: ఇతడు పరగణా యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఇతడు కూడా సైనికాధికారియే. పరగణా యొక్క శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాడు.
 • అమీన్: ఇతడు రెవిన్యూ ఉద్యోగి. భూమిశిస్తు విషయాలను నిర్వహిస్తాడు.
 • కానుంగో: పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను తయారుచేస్తాడు.
 • పోద్దార్: ఇతడు పరిగణా యొక్క కోశాధికారి.

గ్రామ పాలన: పరగణాలు గ్రామాలుగా విభజింపబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశము. ముఖద్దమ్, పట్వారీలు గ్రామాధికారులు. ముఖద్దమ్ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమిశిస్తు వివరాలను తయారు చేస్తాడు. గ్రామాలలో పంచాయితీ విధానం అమలులో ఉండేది. పంచాయితీలు న్యాయనిర్వహణ బాధ్యతలను నిర్వహించేవి.

సైనికపాలన: మొగల్ చక్రవర్తులు సమర్థవంతమైన సైన్యమును పోషించిరి. వీరి సైనిక విధానమును ‘మన్సబారీ’ విధానమందురు. ‘మన్సబ్’ అంటే ‘హోదా’ లేదా ‘ఉద్యోగం’ అని అర్థం. ఒక విధముగా ఢిల్లీ సుల్తానుల జాగీర్దార్ విధానం వంటిది.

ఆర్థిక విధానం: మొగలుల ఆర్థిక విధానం సమర్థవంతమైనది. ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా అనే నాలుగు రకాల పన్నులు వసూలు చేసిరి.

భూమిశిస్తు విధానం: మొగలుల భూమిశిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కల్గించినవారు అక్బర్ మరియు ఆయన రెవిన్యూ మంత్రి రాజాతోడరమల్. మొగలుల భూమిశిస్తు విధానంను ‘బందోబస్త్’ విధానమందురు.

న్యాయపాలన: చక్రవర్తితో కూడిన న్యాయమండలి మొగల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం. అతి ముఖ్యమైన వివాదాలను ఈ న్యాయస్థానమే పరిష్కరించేది. చక్రవర్తియే ఉన్నత న్యాయాధీశుడు. ఉద్యోగులలో ప్రధాన ఖాజీ ఉన్నత న్యాయాధికారి. అతడు దిగువ న్యాయస్థానాల యొక్క న్యాయాధిపతులను నియమించేవాడు. ఆ న్యాయస్థానాల నుండి వచ్చే అప్పీళ్లను కూడా ప్రధాన ఖాజీ విచారించేవాడు. చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు. రాష్ట్రాలలో (సుబాలలో) సదర్ క్రిమినల్ కేసులను, దివాన్ రెవిన్యూ వివాదాలను, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవారు. సర్కార్లలో ఫౌజ్దార్లు, ఖాజీలు, పరగణాలలో షికార్లు, అమీన్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు నేర విచారణ చేసేవి.

ముగింపు: మొగలుల పాలనా విధానము ఉదారమైనది, సమర్థవంతమైనది. ప్రజాక్షేమాన్ని కాంక్షించేది. మహమ్మదీయుల పరిపాలనా వ్యవస్థ మొదటిసారిగా మొగలుల కాలంలోనే ఔన్నత్యాన్ని పొందింది.

ప్రశ్న 3.
మొగల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలు చర్చించండి.
జవాబు:
రాజ్య విస్తీర్ణత, సైనిక పటిష్టత, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతికాభివృద్ధి వల్ల ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మొగల్ సామ్రాజ్యం క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది.

మొగల్ బాబర్ చేత స్థాపించబడి అక్బర్, జహంగీర్, షాజహాన్ పాలనల్లో దేదీప్యమానంగా వెలుగొందిన మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబు రెండవ దశలోనూ, ఔరంగజేబు తరువాత పతనమైంది. ప్రసిద్ధ చరిత్రకారుడు వి.ఎ. స్మిత్ అన్నట్లు సామ్రాజ్యం అకస్మాత్తుగా పతనం కావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే చరిత్రపై సాధారణ అవగాహన కలిగిన చరిత్ర విద్యార్థిగా గమనించినట్లయితే మొగల్ సామ్రాజ్యం అంత కాలం ఎలా ఉండగలిగింది అనే సందేహం కలగక మానదు”. కొంత మంది చరిత్రకారులు మొగల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబుని పూర్తి బాధ్యుడుగా పేర్కొంటే మరికొందరు చరిత్రకారులు ఇతర కారణాలతోపాటు ఔరంగజేబు కొంతమేరకు బాధ్యుడని పేర్కొన్నారు.

ఔరంగజేబు తన పరిపాలన చివరి ఇరవై ఐదు సంవత్సరాలు దక్కన్లో తన అధికారాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్న అతడంతో నిరంతర దాడులు చేశాడు. దక్కన్‌లోనే మకాం పెట్టాడు. పరిపాలనా వ్యవస్థను నిర్లక్ష్యం చేశాడు. దీని వల్ల భారతదేశంలో మొగల్ అధికారం బలహీనమైంది.

ఔరంగజేబు తరువాత సింహాసనాన్ని అధిష్టించిన మొగల్ పాలకులు అసమర్థులు. ఔరంగజేబు కాలంలో మొదలైన గల్ రాజ్య పతనాన్ని అడ్డుకొనే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారు మొగల్ అధికారుల చేతుల్లోనే కాకుండా, సావారి చేతుల్లో కూడా కీలుబొమ్మలుగా వ్యవహరించేవారు. వారు సామ్రాజ్యం కంటే కూడా విలాసాలపట్ల మక్కువ ఈ బరిచేవారు. అంతేకాకుండా భారతదేశంలోని అధిక ప్రజలు మొగలులను విదేశీయులుగా భావించడం వల్ల మొగల్ జ్లలకు వారి మద్దతు లభించలేదు. హిందూ మతంలోలాగా మొగలుల్లో వారసత్వ చట్టం లేకపోవడం వల్ల సింహాసనం కోసం వారసత్వ యుద్ధాలు జరిగాయి. అవి మొగల్ రాజ్య పతనానికి దోహదం చేశాయి.

సమైక్యతకు, సామర్థ్యానికి, ప్రతీకగా నిలిచిన మొగల్ కులీనవర్గం సుల్తాన్ల అసమర్థత కారణంగా వివిధ కూటములుగా విడిపోయాయి. స్వార్థపరులుగా తయారయ్యారు. పర్షియన్ షియాలు, సంప్రదాయ సున్నీలు, హిందూస్థానీ మొదలైన కూటములుగా విడిపోయి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోరాటం చేయసాగారు.

మొగల్ సామ్రాజ్య పతనానికి అక్బర్ ప్రవేశపెట్టిన మనసబారీ విధానం ఒక కారణమైంది. మనసబారీ విధానం అక్బర్ కాలంలో మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే అందులోని ప్రాథమిక లోపాల వల్ల ఈ విధానం భూస్వామ్య వ్యవస్థను పోలి సాధారణ సైనికుడు చక్రవర్తి కంటే కూడా మనసబారులపట్ల గౌరవం ప్రదర్శించేవారు. ఫలికంగా బైరాం ఖాన్, మహబత్ ఖాన్ వంటి వారు తిరుగుబాట్లు జరిపారు. వీటన్నింటివల్ల సైనిక పటిష్టత కోల్పోయింది. నీటన్నింటికి తోడు ఐరోపావారిని ఎదుర్కొనేందుకు నౌకాదళం పట్ల శ్రద్ధవహించకపోవడం కూడా మొగల్ పతనానికి కారణమైంది.

షాజహాన్ పాలనాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల, కరువుల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఔరంగజేబు కాలంలో పరిస్థితి మరింత అధికమైంది. అసమర్థులైన కడపటి, మొగలుల కాలంలో ఆర్థిక స్థితి మరింత దిగజారింది. వీటికి తోడు అగ్నికి ఆజ్యంతోడైనట్లు నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రలు ఆర్థిక స్థితిని కోలుకోలేకుండా చేశాయి. ఈ దండయాత్రలు మొగల్ సైనిక బలహీనతను ప్రపంచానికి చాటిచెప్పాయి. దీంతో మొగల్ సుబేదారులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోసాగారు. హైదరాబాద్ నిజాం, బెంగాల్ ఆలీవర్దీఖాన్, ఔద్ సాదతాఖాన్లు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. ఈ విధంగా మొగల్ పాలకుల అసమర్థత, సమకాలీన రాజకీయ సంఘటనలు మొగల్ రాజ్య పతనానికి కారణాలయ్యాయి.

ప్రశ్న 4.
శివాజీ పరిపాలనపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
పరిపాలన: శివాజీ కృషితో స్వతంత్ర మహారాష్ట్ర రాజ్యం ఏర్పడింది. శివాజీ గొప్ప వీరుడు. సైనిక నాయకుడే కాకుండా గొప్ప పాలకుడిగా కూడా పేరు పొందాడు.
శివాజీ పాలన సమానత్వం, న్యాయం, సహనంలపై ఆధారపడి కొనసాగింది. శివాజీ తన రాజ్యానికి ‘స్వరాజ్యం’ అని పెట్టాడు. తన రాజ్యం పరిసర ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశముఖి వంటి పన్నులను వసూలు చేశాడు.

శివాజీ కేంద్రీకృత పాలనావ్యవస్థను ఏర్పాటు చేశాడు. చక్రవర్తి అయిన శివాజీ సర్వాధికారి. అధికారులను గమించే, తొలగించే అధికారం శివాజీకి ఉండేది. శివాజీ తనకు పరిపాలనలో సహకరించేందుకు ఎనిమిది మంది సభ్యులు గల అష్టప్రధానులు అనే మంత్రిమండలిని ఏర్పాటుచేశాడు. మంత్రులకు వివిధ శాఖలను కేటాయించాడు
అష్ట ప్రధానులు:

 • పీష్వా: ప్రధానమంత్రి – సాధారణ పాలనా వ్యవహారాలను చూసేవాడు.
 • అమాత్య: ఆర్థిక మంత్రి – ఆదాయ వ్యయాలు, బడ్జెట్ చూసేవాడు.
 • మంత్రి: ఆంతరంగిక వ్యవహారాల మంత్రి.
 • సచివ: సమాచారశాఖ మంత్రి.
 • సుమంత్: విదేశీ వ్యవహారాల మంత్రి.
 • పండితరావు దానధర్మాలు, ధర్మాదాయం.
 • సేవాపతి: సర్వసైన్యాధ్యక్షుడు.
 • న్యాయాధీశుడు: అత్యున్నత న్యాయాధికారి.

కేవలం సామర్థ్యాన్ని బట్టి మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించేది. వంశపారంపర్య హక్కు ఉండేది కాదు. మంత్రులు, పాలనా వ్యవహారాలతో పాటు అవసరమైనప్పుడు సైనిక విధులను కూడా నిర్వహించేవారు.

పరిపాలనా విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యంను నాలుగు రాష్ట్రాలుగా విభజించి దాని పాలనకు వైశ్రాయ్ లేదా గవర్నర్‌ను నియమించాడు. రాష్ట్రాలను తిరిగి జిల్లాలుగా విభజించాడు. జిల్లాను తిరిగి గ్రామాలుగా విభజించాడు. గ్రామ పాలనకు పంచాయితి, పటేల్, కులకర్ణి అనే అధికారులు నిర్వహించేవారు.
వీటికి తోడు మొగల్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు పరోక్షంగా శివాజీ ఆధీనంలో ఉండేవి. వారి నుంచి చౌత్ అనే పేరున పన్నులు వసూలు చేశాడు.

భూమిశిస్తు విధానం: శివాజీ జాగిర్దారీ విధానాన్ని రద్దుచేశాడు. మత సంస్థల భూములను శివాజీ స్వాధీనం చేసుకొని వాటికి నగదు చెల్లించాడు. భూమిని సర్వే చేయించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పన్నులను ధన రూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించే అవకాశాన్ని కల్పించాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు రుణాలను ఇచ్చి, వాటిని సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించే ఏర్పాటు చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

భూమి శిస్తుతోపాటు వాణిజ్య పన్నులు, నాణాల నుంచి ఆదాయం, చౌత్, సర్దేశముఖి మొదలైన వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. చౌత్ అనే 1/4 వ వంతు పన్ను యుద్ధాల నుంచి రక్షించినందున తన రాజ్య పరిసరాల్లోని వారి నుంచి వసూలు చేసేవాడు. 1/10 వ వంతు వసూలు చేసే సర్దేశముఖి రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను.
సైనిక పాలన: శివాజీ బలమంతా అతని సైన్యంపై ఆధారపడి ఉంది. శివాజీ ప్రతిభావంతమైన, అంకితభావం గల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ముస్లిం పాలకులను మహారాష్ట్రకు దూరంగా ఉంచి హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యంగా గల శివాజీ అందుకు అనువైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. శివాజీ సైన్యంలో 45 వేల అశ్విక దళం, 60 వేల కాల్బలం, లక్షమందితో పదాతి దళం ఉండేది. వీటికి తోడు ఏనుగులు, ఒంటెలు, ఫిరంగి దళం కూడా ఉండేది.

జాగీరులకు బదులు మొదటిసారిగా ధనరూపంలో వేతనాలను చెల్లించేవారు. శివాజీ కోటల రక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకొన్నాడు. సమర్థులైన వారికి బిరుదులు ఇవ్వడం, ప్రతిభావంతులకు అదనపు సౌకర్యాలను కల్పించడం వంటివి శివాజీ చేశాడు. యుద్ధరంగానికి స్త్రీలను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాడు. దీన్ని ఉల్లంఘించిన వారికి మరణ శిక్ష విధించేవాడు. యుద్ధంలో స్వాధీనం చేసుకొన్న సొమ్మంతా చక్రవర్తికి అప్పగించాల్సి ఉండేది.

న్యాయపాలన: న్యాయ వ్యవస్థలో శివాజీ సంప్రదాయ పద్ధతులను పాటించాడు. సమన్యాయాన్ని అనుసరించాడు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు కానీ, మత తేడాలు కానీ చూపించేవాడు కాదు. గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు ” న్యాయపాలన చేసేవి. కేంద్ర స్థాయిలో న్యాయపాలన కోసం ‘న్యాయాధీశ్’ నియమించబడ్డాడు. కేసులు విచారించడంలోనూ, తీర్పులను ఇవ్వడంలోనూ ప్రాచీన హిందూ చట్టాలను పరిగణనలోకి తీసుకొనేవారు.

దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న మొగలులతో వీరోచితంగా పోరాడి శివాజీ విజయం సాధించాడు. గతంలో అనైక్యంగా చిన్నచిన్న భాగాలుగా ఉన్న హిందూమత శక్తులను ఉన్నతమైన ఆశయాలతో ఏకంచేశాడు.

వీటన్నింటికి తోడు శివాజీ గొప్ప రాజకీయవేత్త, చురుకైన నాయకుడు. జె.ఎన్. సర్కార్ అనే చరిత్రకారుడు అన్నట్లు “శివాజీ మహారాష్ట్రులకు వెలుగు మొగలుల పాలిట సింహస్వప్నం తన వారసులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు. శివాజీ గొప్పతనం అతని వ్యక్తిత్వంలోను ఆచరణలోనూ బయల్పడుతుంది”.

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బాబర్ నామ
జవాబు:
మధ్యయుగ భారతదేశ చరిత్రలో గణనీయమైన వ్యక్తులలో బాబరు ఒకడు. భారతదేశమున మొగలు సామ్రాజ్యమును స్థాపించిన ఘనుడు బాబరు. క్రీ.శ. 1483లో బాబరు ఫర్గానాయందు జన్మించెను. ఇతని తండ్రియగు ఉమర్ షేక్ మీర్జా మధ్యఆసియాలోని ఫర్గానా అను చిన్న రాజ్యమునకు అధిపతి. క్రీ.శ. 1494లో తన తండ్రి మరణానంతరము బాబరు 11 సం॥ల ప్రాయమున ఫర్గానా ప్రభువు అయ్యెను. తన మాతృదేశమున నిలువనీడలేక తన దృష్టిని ఆఫ్ఘనిస్తాన్ వైపు మరల్చి 1504లో కాబూల్ ఆక్రమించెను. భారతదేశ రాజకీయ పరిస్థితులు అనుకూలముగా ఉండుటచే క్రీ.శ. 1526లో మొదటి పానిపట్టు యుద్దమున ఢిల్లీ సుల్తాన్గు ఇబ్రహీంలోడిని ఓడించి, వధించి ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించి భారతదేశమున మొగల్ సామ్రాజ్య స్థాపన చేసెను.

బాబరు పర్షియన్, టర్కీ భాషలలో గొప్ప పండితుడు. టర్కీ భాషలో బాబరు వ్రాసుకొన్న స్వీయచరిత్ర తుజ్-క్- ఇ – బాబురి (తన ఆత్మకథ). మొగల్ యుగమున వ్రాయబడిన తొలి చారిత్రక గ్రంథము. ఇందు బాబరు తురుష్క భాషలోనున్న ప్రావీణ్యము తెలియుచున్నది. తుజ్-క్-ఇ-బాబరి సమకాలీన పరిస్థితులకు దర్పణం పడుతుంది. బాబరు కాలమును, హుమాయున్ తొలి జీవిత విశేషములను తెలుసుకొనుటకు ఈ గ్రంథము అత్యంత దోహదపడుతుంది. అందువల్ల మధ్యయుగాలనాటి ఆత్మకథల్లో దీనికి గణనీయమైన ప్రాముఖ్యత ఉంది.

ప్రశ్న 2.
హుమాయూన్
జవాబు:
బాబర్ మరణానంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్టించినవాడు హుమాయూన్. ఇతడు బాబర్ పెద్ద కుమారుడు. హుమాయూన్ అనగా అదృష్టవంతుడని అర్థం. కానీ దీనికి భిన్నంగా అతడి జీవితం గడిచింది.

తొలి జీవితం: హుమాయూన్ 1508, మార్చి 6న జన్మించాడు. బాబర్ కుమారులు నలుగురిలో హుమాయూన్ పెద్దవాడు. తన తండ్రి కోరిక మేరకు హుమాయూన్ మొగల్ రాజ్యాన్ని సోదరులకు పంచాడు. సంభాల్న ఆస్కారీకి, ఆల్వార్ను హిందాల్కు, కాబూల్, కాందహార్ల ను కమ్రాన్‌కు ఇచ్చాడు. ఈ పంపకమే హుమాయూన్ కష్టాలకు మూలమైంది. కమ్రాన్ కాబూల్, కాందహార్ల తో తృప్తిపడక పంజాబును ఆక్రమించుకున్నాడు. సామ్రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంపకం చేసినందువల్ల హుమాయూన్ ఆర్థికంగా, సైనికంగా బలహీనపడ్డాడు.

హుమాయూన్ బలహీనతలు: హుమాయూను కొన్ని వ్యక్తిగత బలహీనతలున్నాయి. అతడికి రాజకీయ చతురత, కార్యదీక్ష, సమయస్ఫూర్తి లేవు. నల్లమందుకు బానిస కావటమే కాక మితిమీరిన భోగలాలసత్వానికి కూడా లోనయ్యాడు.

సమస్యలు: పానిపట్టు, గోగ్రా యుద్ధాలలో బాబర్ చేతిలో ఓడిపోయిన ఆఫ్ఘన్లు తమ సార్వభౌమత్వాన్ని పునః ప్రతిష్టించుకోవటానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాన్‌పూర్‌లో మహమ్మద్లోడీ, బెంగాల్లో నస్రతా, బీహార్‌లో షేర్ ఖాన్ బలం పుంజుకుని భారతదేశం నుంచి మొగలులను పారద్రోలటానికి చర్యలు ప్రారంభించారు.

హుమాయూన్ యుద్ధాలు: హుమాయూన్ రాజ్యానికి రాక మునుపే తండ్రితో పాటు పానిపట్టు, కాణ్వా యుద్ధా పాల్గొని మంచి అనుభవం గడించాడు. రాజ్యానికి వచ్చిన తరువాత కూడా అతడనేక యుద్ధాలు చేశాడు.

కలింజర్ దండయాత్ర (1530): కలింజర్ పాలకుడు తన శత్రువులైన ఆఫ్ఘన్లకు సహాయం చేశాడనే కారణంతో, హుమాయూన్ 1530లో కలింజర్పై దండెత్తి, విజయం సాధించాడు. కానీ, దాన్ని స్వాధీనపరుచుకొనక, నష్టపరిహారం మాత్రమే వసూలు చేసుకొన్నాడు. ఇది రాజనీతిజ్ఞతలేని చేష్ట.

దౌరా యుద్ధం: కలింజర్పై హుమాయూన్ దండెత్తినపుడు బీహార్‌లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ డీ నాయకత్వం క్రింద మొగల్ రాష్ట్రమైన జాన్పుర్పై దాడిచేసి, ఆక్రమించారు. కానీ, కొద్దికాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లను డౌ యుద్ధంలో ఓడించి, దాన్ని తిరిగి స్వాధీనపరచుకొన్నాడు. మహమ్మద్ డీ బీహార్ కు పారిపోయాడు.

చునార్ యుద్ధం: బీహార్‌లో షేర్‌ఖాన్, చునార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడు. షేర్ ఖాన్ ను అణచాలనే ఉద్దేశంతో హుమాయూన్ చుసార్ కోటను ముట్టడించాడు. కానీ, చునారు ఆక్రమించుకొనే సమయంలో షేర్ఫాన్ రాజకీయ చతురత ప్రదర్శించి హుమాయూన్తో సంధి చేసుకొనెను. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్లి దాదాపు ఒక సంవత్సరం పైగా విందులు, వినోదాలతో కాలం వృధా చేసుకొనెను. దీనితో బీహార్ లో షేర్ ఖాన్, గుజరాత్లో బహదూర్గా శక్తిని పుంజుకొని హుమాయూన్‌పై దాడికి సిద్ధమయ్యారు.

షేర్‌ఖాన్‌తో పోరాటం: గుజరాత్‌పై హుమాయూన్ దాడి చేస్తున్న తరుణంలో, షేర్భన్ బీహార్‌లో తన బలాన్ని పెంచుకొని 1537 నాటికి బెంగాల్‌ను ఆక్రమించి, హుమాయూన్కు కప్పం కట్టడం మానేశాడు. షేర్ ఖాన్ విజృంభణ తన సామ్రాజ్యం మనుగడకు ప్రమాదకరమని భావించిన హుమాయూన్, షేర్ఖాన్పై యుద్ధానికి సిద్ధపడ్డాదు. షేర్ ఖాస్ బెంగాల్లో ఉన్నందువల్ల హుమాయూన్ సులభంగా బీహార్‌ను ఆక్రమించుకోగలిగేవాడు. అలాగాక, చూనార్ దుర్గ ముట్టడిలో హుమాయూన్ చాలాకాలం వృథా చేసుకొన్నాడు. అనంతరం బెంగాల్ రాజధాని గౌర్ పైకి నడిచి, గాన్ని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. గౌర్ ఆక్రమణానంతరం హుమాయూన్ ఎనిమిది నెలలు విలాసాలలో మునిగి తేలాడు. ఈలోపు షేర్ ఖాన్ హుమాయూను నిత్యావసర వస్తువులేవీ చేరకుండా ఢిల్లీ, బెంగాల్‌ల మధ్య రాకపోకలకు అడ్డంకులు కలిగించాడు. ఈ అరాచక పరిస్థితుల్లో హిందాల్ తనను తాను మొగల్ చక్రవర్తిగా ప్రకటించుకొన్నాడు. ఈ పరిస్థితుల్లో హుమాయూన్ రాజధానికి తిరుగు ప్రయాణం కట్టాడు.

చౌసా యుద్ధం (1539): రాజధాని చేరడానికి ప్రయాణంలో ఉన్న మొగల్ సైన్యం పైన షేర్‌ఖాన్ గంగానది ఒడ్డున ఉన్న చౌసా వద్ద 1539లో మెరుపు దాడి చేసి విజయం సాధించాడు. ఎలాగో తప్పించుకొని హుమాయ రాజధానికి చేరుకున్నాడు. ఆ తరువాత షేర్ ఖాన్ బీహార్, బెంగాల్‌లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని, వారికి స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలతో ఉత్తేజితుడైన షేర్‌ఖాన్ తన దృష్టిని ఢిల్లీ, ఆగ్రాం పై సారించాడు. ఇదే సమయంలో తన పేరును “షేర్ ” గా మార్చుకున్నాడు.
కనోజ్ యుద్ధం (1540): ఆగ్రావైపు వస్తున్న షేర్ ఖాన్‌ను ఎదుర్కోవడానికి, హుమాయూన్ రెండు లక్షల సైన్యంతో కనోజ్ చేరుకున్నాడు. 1540లో జరిగిన యుద్ధంలో హుమాయూన్కు పరాజయం సంభవించింది. షేర్షా ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు.

పైన పేర్కొనబడిన వివిధ అంశాలు హుమాయూన్ విపులతకు కారణమయ్యెను.

ప్రశ్న 3.
అబుల్ ఫజల్
జవాబు:
మన దేశ చరిత్రలో మొగల్ చరిత్రకు లభ్యమగు ఆధారములు ఏ యుగమున లేవు. అట్టి ఆధారములలో ముఖ్యమైనవి ఐని-ఇ-అక్బరీ.

దీనిని అక్బరు ఆస్థాన పండితులైన అబుల్ ఫజల్ వ్రాసెను. మొగల్ యుగ చరిత్ర ఆధారములలో ఈ గ్రంథము తలమానికం వంటిది. ఇందు మూడు సంపుటములు కలవు. మొదటి సంపుటము నందు తైమూర్ నుండి హుమాయూన్ వరకుగల మొగల్ వంశ చరిత్రను రెండు, మూడు సంపుటములందు అక్బరు పరిపాలనా విశేషముల గూర్చి వ్రాసెను.

ఐనీ-ఇ-అక్బరీ: దీనిని కూడా అబుల్ ఫజల్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు అక్బరు రాజకీయ విధానములు, పరిపాలనా విషయములు, ప్రజల జీవన స్థితిగతులు, అలవాట్లు సవిస్తరముగా వర్ణింపబడినవి. కనుకనే లూనియా (Luniya) పండితుడు “మొగల్ చరిత్ర వ్రాసే ఏ చరిత్రకారుడైనా ఈ గ్రంథమును సంప్రదింపకుండా ఎట్టి రచన చేయలేదు” అని చెప్పెను.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

అక్బరు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు వ్రాసిన లేఖల సంకలనం. దీనిని కూడా అబుల్ ఫజల్ సంతరించెను.

తబ్కాత్-ఇ-అక్బరీ: ఇది ఒక సామాన్య చారిత్రక గ్రంథము. దీనిని మీర్భక్షి ఖ్వాజీ నిజాముద్దీన్ మూడు సంపుటములుగా వ్రాసెను. ఇందు ఢిల్లీ సుల్తానత్ యుగము, బాబరు, హుమాయూన్, అక్బరుల పాలనాకాలము, ప్రాంతీయ రాజ్యాల చరిత్ర వివరింపబడెను. గుజరాత్ చరిత్రకు ఇది ఒక అమూల్యమైన ఆధారము.

ప్రశ్న 4.
నూర్జహాన్
జవాబు:
మొగల్ సామ్రాజ్య చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన స్త్రీ నూర్జహాన్. 1611లో జహంగీర్‌కు నూర్జహాన్‌తో వివాహం జరిగినప్పటి నుంచి జహంగీర్ జీవితం, మొగల్ వంశ చరిత్ర కొత్త మలుపు తిరిగాయి. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి ఘియాస్ బేగ్, తల్లి అస్మత్ బేగం. ఘియాస్ బేగ్ పర్షియా దేశం నుంచి ఉపాధి కోసం భారతదేశం వచ్చి, అక్బర్ ఆస్థానంలో స్థానం పొంది కాబూల్ సుబాకు దివాన్ అయ్యాడు. మెహరున్నీసా అందగత్తె. మెహరున్నీసాకు అక్బర్ కుమారుడైన సలీంకు ప్రేమ కథనం ఉంది. వారి ప్రేమను ఇష్టపడని అక్బర్ ఆమెను షేర్ ఆఫ్ఘన్‌కు ఇచ్చి వివాహం చేసి, ఆ దంపతులను బెంగాల్‌లోని బర్వాన్కు పంపించాడని కొందరి అభిప్రాయం. అక్బర్ మరణానంతరం సలీం, జహంగీర్గా సింహాసనమధిష్టించిన తరువాత షేర్ ఆఫ్ఘన్‌ను వధించి, మెహరున్నీసాను వివాహమాడాడని మరొక కథనం ఉంది. ఆ వివాహం నాటికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ఆమెకు యుక్తవయస్సు వచ్చిన లాడ్లీ బేగం అనే కుమార్తె కూడా ఉంది. జహంగీర్ మెహరున్నీసాను వివాహం చేసుకొన్న తరువాత నూర్మహల్ (ఇంటికి వెలుగు) నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదులిచ్చాడు. వివాహానంతరం ఆమెకు సర్వాధికారాలు అప్పగించి విలాసవంతమైన జీవితం గడిపాడు.

నూర్జహాన్ అధికార దాహం: నూర్జహాన్ తన అధికారాన్ని పటిష్టం చేసుకోవటానికి అనేక చర్యలు తీసుకొంది. నాణేల మీద జహంగీర్ తో పాటు తన పేరును కూడా ముద్రించుకుంది. తన బంధువులకు, ఆశ్రితులకు ఉన్నత పదవులనిచ్చి ముఠాకు నాయకురాలైంది. తన తల్లిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకుంది. తన కుమార్తె లాడ్లీ బేగంను జహంగీర్ మరొక కుమారుడు ప్రియార్కు ఇచ్చి వివాహం చేసింది. ఖుర్రం (షాజహాన్ ) ను కేంద్ర రాజకీయాల నుంచి కాందహార్‌కు పంపించటానికి ప్రయత్నించింది. దీనితో తిరుగుబాటు చేసిన ఖుర్రంను మహబతాన్ సాయంతో అణచివేసింది. ఖుర్రంపై సాధించిన విజయంతో మహబతాఖాన్ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడించాయి. అదీగాక మహబతాన్, జహంగీర్ రెండో కుమారుడు పర్వేజ్‌ను సింహాసనం ఎక్కించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దీనితో మహబతాఖాన్ మీద నూర్జహాన్ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. మహబతాఖాన్ ను దక్కన్ నుంచి బెంగాల్‌కు బదిలీ చేయించింది. దీనితో మహబతాఖాన్ తిరుగుబాటు చేసి, 1626లో జహంగీర్‌ను నూర్జహాన్ను బందీలుగా పట్టుకొని 3 నెలలకు పైగా పరిపాలన చేశాడు. దీనినే శతదిన పాలన అంటారు. కానీ నూర్జహాన్ మాయోపాయంతో ఖైదు నుంచి జహంగీర్ తోపాటు బయటపడింది. దీనితో ధైర్యం చెదిరిన మహబతాఖాన్ దక్కను పారిపోయి ఖుర్రంతో చేతులు కలిపాడు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జహంగీర్ 1627లో మరణించాడు. దీనితో సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.

చివరకు తన శత్రువులందర్నీ ఓడించి, 1628, జూలై 14న ఖుర్రం ఇదివరకే సంపాదించుకున్న “షాజహాన్” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించాడు. నూర్జహాన్ తన ఆశలన్నీ అడియాసలయ్యాయని గ్రహించి రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించింది. చివరి రోజుల్లో దైవచింనతలో గడిపి 1645లో లాహోర్ లో మరణించింది. ఏది ఏమైనప్పటికీ తన భర్త వ్యసనపరుడైనప్పుడు రాజ్యాన్ని ఇతరుల హస్తగతం కాకుండా నూర్జహాన్ కాపాడగలిగింది.

ప్రశ్న 5.
తాజ్‌మహల్
జవాబు:
షాజహాన్ గొప్ప భవన నిర్మాత. ఈ విషయంలో ఇతడి పాలనా కాలాన్ని రోమన్ చక్రవర్తి అగస్టస్ కాలంతో పోల్చడం జరిగింది. ఢిల్లీ, ఆగ్రా, కాబూల్ లో షాజహాన్ కాలానికి చెందిన కట్టడాలు సౌందర్యానికి, కళావైశిష్ట్యానికి నిదర్శనాలుగా నిలిచాయి. రాజధానిగా ఉండటానికి ఆగ్రాకు అర్హతలేదని భావించిన షాజహాన్, షాజహానాబాద్ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అదే ప్రస్తుత పాత ఢిల్లీ. షాజహాన్ నిర్మాణాల్లో ఆగ్రాలోని తాజ్‌మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, అందులోని దివాన్ ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాన్, జామా మసీద్ ప్రధానమైనవి. షాజహాన్ నిర్మాణాలన్నింటిలో తలమానికమైంది, ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన పట్టమహిషి ముంతాజ్ బేగం సంస్మరణార్థం నిర్మించిన తాజ్‌మహల్. దీనిని ప్రపంచ అద్భుత కట్టడాలలో ఒకటిగా భావిస్తారు. దీని నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది. నాలుగున్నర మిలియన్ పౌన్లు ఖర్చయింది. ఉస్తాద్ అహ్మద్ దీని నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాస్తుశిల్పి. షాజహాన్ భవనాలన్నింటిలోను అలంకరణకు పేరుపొందింది.

ప్రశ్న 6.
పురంధర్ సంధి
జవాబు:
1665 సం॥లో మొగల్ సేనాని రాజా జైసింగ్క, మరాఠా నాయకుడు అయిన శివాజీకి మధ్య పురంధర్ వద్ద కుదిరిన సంధిని పురంధర్ సంధి అని అంటారు. ఈ సంధి ప్రకారం:

 1. శివాజీ తన స్వాధీనంలోని సాలీనా నాలుగు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఇరవై మూడు కోటలను మొగలులు స్వాధీనం చేసుకున్నారు.
 2. బీజపూర్తో మొగలులు చేసే యుద్ధాలలో సహాయం చేసేందుకు శివాజీ అంగీకరించాడు.
 3. తన కుమారుడు శంభూజీని ఐదువేల మంది అశ్వికులతో మొగల్ ఆస్థానానికి పంపేందుకు శివాజీ అంగీకరించాడు.
 4. 13 సంవత్సరాల కాలంలో నలభై లక్షల పన్నులను చెల్లించేందుకు శివాజీ అంగీకరించాడు.
 5. ఐదు లక్షల పన్నులను ఇచ్చే బీజపూర్ రాజ్యంలోని ప్రాంతాలపై శివాజీ అధికారాన్ని మొగలులు గుర్తించారు. ఈ సంధి వల్ల మొగలులు ప్రయోజనం పొందారు. వారి ప్రాభవం వృద్ధి చెందింది. దీనితో శివాజీ అవమానానికి గురి అయినాడు. పురంధర్ సంధి ప్రకారం రాజా జైసింగ్ ప్రోద్బలంతో ఆగ్రాలోని మొగల్ దర్బారును శివాజీ దర్శించాడు.

ప్రశ్న 7.
సాహూ
జవాబు:
శివాజీ మరణానంతరం అతని పెద్ద కుమారుడైన శంభూజీ 1680లో సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు బలశాలే అయినా అసమర్థుడు కావడంవల్ల ఔరంగజేబు చేతిలో 1689లో మరణానికి గురయ్యాడు. అనంతరం అతని సవతి సోదరుడు రాజారాం సింహాసనాన్ని అధిష్టించాడు. రాజారాం సమర్థుడు కాకపోయినా రామచంద్ర పంథ్, శాంతాజీ ఘోర్పడే, దానాజీ జాదన్ వంటి సమర్థ అధికారుల సహకారంతో మొగలులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

దురదృష్టవశాత్తు క్రీ.శ. 1700 సంవత్సరంలో రాజారామ్ మరణించడంతో అతడి భార్య తారాబాయి మహారాష్ట్రకు సారధ్యం వహించింది. ఔరంగజేబు మరణానంతరం సాహు బందిఖానా నుంచి విడుదల చేయడంతో తారాబాయి, సాహుల మధ్య వారసత్వ పోరాటం జరిగి సాహు విజయం సాధించాడు. ఫలితంగా మహారాష్ట్ర రాజ్యం కొల్హాపూర్, సతారాలుగా విడిపోయింది. సాహు 1713లో పీష్వాగా బాలాజీ విశ్వనాధ్‌ను నియమించాడు. పీష్వా పదవి వంశపారంపర్యమైంది. క్రమంగా పీష్వాలు మహారాష్ట్రకు నిజమైన పాలకులుగా మారారు.

పీష్వాల రాజ్యానికి పునాదులు వేసిన బాలాజీ విశ్వనాధ్న మహారాష్ట్ర సామ్రాజ్య రెండవ స్థాపకుడిగా పిలుస్తారు. బాలాజీ విశ్వనాధ్ తరువాత అతడి కుమారుడు మొదటి బాజీరావు 1720లో సింహాసనాన్ని అధిష్టించాడు. బలమైన సైన్యంతో మొదటి బాజీరావు కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని మహారాష్ట్రులు కిందకి తెచ్చాడు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఇతని ఆశయం. ‘మరాఠా కూటమి’ని ఏర్పాటుచేసిన బాజీరావు గుజరాత్, మాళ్వ, బుందేల్‌ఖండ్‌లను ఆక్రమించి ఢిల్లీపై దృష్టి కేంద్రీకరించాడు. అయితే లక్ష్యాన్ని సాధించక ముందే 42 సంవత్సరాల వయస్సులో 1740 సంవత్సరంలో మొదటి బాజీరావు మరణించాడు.

ప్రశ్న 8.
బాలాజీ విశ్వనాధ్
జవాబు:
శివాజీ మరణానంతరం మహారాష్ట్ర సామ్రాజ్యం అంతర్యుద్ధం వలన పతనావస్థకు చేరుకుంది. ఆ కల్లోల పరిస్థితులలో శివాజీ వదిలివెళ్ళిన బాధ్యతలను, ఆయన ఆశయాలను నెరవేర్చటమేగాక, పతనావస్థలో ఉన్న మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడిన ఘనత పీష్వాలకు దక్కింది. ఈ పీష్వాల వంశమూలపురుషుడు బాలాజీ విశ్వనాధ్ (1713-1720). మహారాష్ట్ర రాజ్యాన్ని, సంస్కృతిని మొదటగా కాపాడిన ఘనుడు బాలాజీ విశ్వనాధ్. ఛత్రపతి సాహుచే పీష్వాగా నియమించబడిన విశ్వనాధ్ సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, భారతీయ చరిత్రలో మహారాష్ట్రులకు విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. మహారాష్ట్రుల నౌకాదళాధిపతియైన కన్హోజీతో ఒక సంధి కుదుర్చుకొని పోర్చుగీసు వారిని, ఆంగ్లేయులను ఓడించాడు. సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒకప్పుడు శివాజీకి చెందిన భూభాగాలన్నింటిని తిరిగి మొగలాయిల నుండి సంపాదించాడు. మహారాష్ట్రుల కూటమిని ఏర్పరచి మహారాష్ట్రులలో ఐక్యత సాధించాడు. ఇతని విధానాల వలన దేశంలో మహారాష్ట్రుల ప్రాబల్యం పెరిగింది. తన ఆశయాలు పూర్తిగా నెరవేరకమునుపే బాలాజీ విశ్వనాధ్ మరణించాడు.

ప్రశ్న 9.
మూడవ పానిపట్టు యుద్ధం
జవాబు:
అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల సామ్రాజ్యకాంక్ష మూడో పానిపట్టు యుద్ధానికి దారితీసింది. 1757లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహమ్మద్ అబ్దాలీ పంజాబ్‌ను ఆక్రమించుకొని, తన కుమారుడైన తైమూరాను రాష్ట్రపాలకుడిగా నియమించాడు. పీష్వా బాలాజీ బాజీరావు సోదరుడు రఘునాథరావు. మహారాష్ట్ర ప్రభువు మలహరరావ్ హోల్కర్ లు కలిసి పంజాబ్‌పై దాడిచేసి, అక్కడి నుండి తైమూర్గాను తరిమివేశారు. దీనితో అహమ్మదా అబ్దాలీ, మహారాష్ట్రుల మధ్య యుద్ధం అనివార్యమైంది. 1761 నవంబరులో చారిత్రాత్మకమైన పానిపట్టు మైదానంలో మహారాష్ట్ర, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధంలో ఆఫ్ఘన్లు తిరుగులేని విజయం సాధించారు. సదాశివరావ్, విశ్వాసరావ్ అంతటి మహారాష్ట్ర వీరులు సైతం నేలకొరిగారు. వేలకొలది మహారాష్ట్ర సైనికులు యుద్ధభూమిలో మరణించారు. 40,000 మంది సైన్యం యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. ఈ యుద్ధం వల్ల నష్టపోని మహారాష్ట్ర కుటుంబం లేదని జె. ఎన్. సర్కార్ వ్రాశాడు. ఈ పరాజయ వార్త విన్న కొద్దికాలానికే పీష్వా బాలాజీ బాజీరావు కృంగిపోయి మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 8 మొగలుల యుగం

సదాశివరావు అహంభావపూరిత స్వభావం, మహారాష్ట్ర నాయకులలో ఐకమత్యం లేకపోవటం, రొహిల్లాలు, అయోధ్య నవాబు వంటి స్వదేశీయులు అబ్దాలీకి సహాయపడటం, అటువంటి సహాయం మహారాష్ట్రులకు లేకపోవటం, సేనానిగా అబ్దాలీ ప్రదర్శించిన నైపుణ్యం, అబ్దాలీ విజయానికి, మహారాష్ట్రుల పతనానికి దోహదం చేశాయి.
మూడో పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు ఘోరమైన సైనిక పరాజయం. దీనితో మహారాష్ట్రులు అజేయులన్న భావన పటాపంచలైంది. పీష్వా అధికారం క్షీణించి మహారాష్ట్ర సమాఖ్య విచ్ఛిన్నమైనది. ఈ యుద్ధం వలన విజృంభిస్తున్న మహారాష్ట్ర సామ్రాజ్యం అతలాకుతలమైపోయింది. హిందుపదేపదేహి అనే మహారాష్ట్రుల నినాదం గాలిలో కలిసిపోయింది. మొగల్ సామ్రాజ్యం ఇంకా నిర్వీర్యమైపోయింది. మహారాష్ట్రుల వైఫల్యం, మొగలుల బలహీనత ఆంగ్లేయులకు సహకరించాయి. వారిని ఎదిరించి నిలువగలిగిన శక్తి భారతదేశంలో ఎక్కడా లేకుండా పోయింది.

ప్రశ్న 10.
చౌత్, సర్దేశముఖి
జవాబు:
భూమిశిస్తు విధానంలో శివాజీ తనకు ముందు రాజా తోడర్ మల్, మాలిక్ అంబర్లు అనుసరించిన విధానాన్నే చాలా వరకు అనుసరించాడు. భూమిని సర్వే చేయించి, పండిన పంటలో 40 శాతాన్ని శిస్తుగా నిర్ణయించాడు. జమిందారీ విధానాన్ని రద్దుచేసి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శిస్తును రైతులు ధనరూపంలోగాని, ధాన్యరూపంలోగాని చెల్లించవచ్చు. అవసర కాలంలో రైతులకు వాయిదాల పద్ధతిపై అప్పులు ఇచ్చాడు. విత్తనాలు, పశువుల పెంపకం కూడా చేశాడు. కానీ, వాటి విలువలను వాయిదాల పద్ధతి మీద ప్రభుత్వ అధికారులు తిరిగి రాబట్టుకునేవారు. స్వరాజ్ వెలుపల తాను నేరుగా పాలించని ప్రజల నుంచి చౌత్, సర్దేశముఖ్ అనే రెండు పన్నులను వసూలు చేశాడు. చౌత్ అంటే స్వరాజ్యం వెలుపల ఉన్న భూములు ఆదాయంపై 1/4 వంతు, సర్దేశముఖి అంటే ఆదాయంపై 1/10వ వంతు శిస్తుగా వసూలు చేశాడు. ఈ విధంగా వసూలైన ధనాన్ని మరాఠా రాజ్య నిర్మాణానికి వినియోగించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 9th Lesson భక్తి, సూఫీ సంప్రదాయాలు (క్రీ.శ. 8 – 16 శతాబ్ధాలు)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో క్రింది ప్రధాన లక్షణాలను గమనించవచ్చు.
1) ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడమే భక్తుడి లక్ష్యంగా భావించబడింది.

2) పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనం, మానవత్వం, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అని బోధించారు.

3) భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసనను బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసనను ప్రోత్సహించారు. వైష్ణవుల్లో సగుణోపాసన ప్రసిద్ధమైంది. వారు శ్రీమహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా భావించారు. కాగా నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం చేశారు. సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటినీ చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతములో చెప్పబడ్డాయి.

4) ఉత్తర, దక్షిణ భారతదేశ భక్తి ఉద్యమకారులు జ్ఞానం పొందడం ‘భక్తి’లో భాగంగా చెప్పారు. నిజమైన జ్ఞానాన్ని పొందేందుకు గురువు అవసరమని వారు బోధించారు.

5) భక్తి ఉద్యమకారులందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు. అందువల్ల తక్కువ కులాలవారికి వారు ఆశాజ్యోతి అయ్యారు. భక్తి ఉద్యమకారుల్లో అధికమంది తక్కువ వర్గాల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. నామదేవుడు (1270-1350), దర్జీ కుటుంబం, తుకారామ్ (1601-1649) శూద్ర కుటుంబం, కబీర్ దాస్ ముస్లిం మతంలోని నేతకుటుంబం నుంచి వచ్చారు.

6) భక్తి ఉద్యమకారులు పూజారులు పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠి, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 2.
రామానందుడు, కబీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి.
జవాబు:
రామానందుడు : భక్తి ఉద్యమ ప్రవక్తలలో మొదటివాడు రామానందుడు. తమ సొంత బ్రాహ్మణ కులానికి చెందినవారి ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. గంగాతీర ప్రాంతంలో తన సిద్ధాంత ప్రచారానికి హిందీ భాషను ఉపయోగించారు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత మతాన్ని స్వీకరించి మరింత ప్రచారం కల్పించాడు. సాంఘిక దురాచారాలను, కర్మకాండలను తిరస్కరించిన రామానందుడు సంస్కృతం, హిందీ భాషకు ప్రాధాన్యం ఇచ్చాడు. తన రచన ‘ఆనంద భాష్యం’లో శూద్రులు వేదాలను అధ్యయనం చేయడాన్ని గుర్తించలేదు. తక్కువకులం వారిని శిష్యులుగా స్వీకరించాడు. ఇతని శిష్యుల్లో ధర్మాజాట్, సేనానాయి బ్రాహ్మణుడు, రవిదాస్ చర్మకారుడు, కబీర్ మహ్మదీయుడు, మహిళలు కూడా తన శిష్యులయ్యారు. వారిలో పద్మావతి, సురస్త్రీలు.

కబీర్ (1440–1510) : కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ, మతసంస్కర్త. రామానందుడి శిష్యుల్లో కబీర్ విప్లవ భావాలు కలవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి అచరణాత్మక రూపును ప్రసాదించాడు. కబీర్ కులవ్యవస్థను ఖండించాడు. ఇతడు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడాన్ని వ్యతిరేకించాడు. మహిళల పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని విశ్వసించాడు. కబీర్ స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆయనకు ‘లోయ్’ అనే మహిళతో వివాహం అయ్యింది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనా పరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ విశ్వాసం. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ-ముస్లింల మధ్య మైత్రి సాధించడానికి కబీర్ తీవ్రంగా కృషి చేశాడు. “హిందూ, ముస్లింలు ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక, మతసంస్కర్త కబీర్” అని కె.ఎస్. లాల్ అనే పండితుడు పేర్కొన్నాడు. కబీర్ శిష్యులను “కబీర్ పంథీస్” అని అంటారు. కబీర్ రచించిన దోహాలకు ‘బీజక్’ అని పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన రెండు కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. ‘పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగానదిలో స్నానమాచరించడం వల్ల ప్రయోజనం ఏముంది ? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది ? అని కబీర్ ప్రశ్నించాడు.

ప్రశ్న 3.
సూఫీ మతాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు:
మధ్యయుగ భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపైకి తేవటానికి ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీమతం. అరేబీయాలో సూఫీ మతం ప్రారంభమై తరువాత భారతదేశానికి వ్యాప్తి చెందింది. సూఫీమతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అరబ్బులకే దక్కుతుంది.
క్రీ.శ 19వ శతాబ్దంలో ‘సూఫీఇజం’ అనే ఆంగ్లపదం వాడుకలోని వచ్చింది. సూఫీ అనే పదం ‘తసావూఫ్’ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. ‘సపా’ అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ‘సుఫా’ అంటే మహ్మద్ మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే ‘అరుగు’ అని అర్థం. బస్రాకు చెందిన జహీజ్ మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని ఉపయోగించాడు. క్రీ.శ 10వ శతాబ్దం కంటే పూర్వం సూఫీ మతం అరేబియా, పర్షియా ప్రజల సాంఘిక, మత జీవనాన్ని ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణను సూఫీ బోధకులు వ్యతిరేకించారు. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి.

హిజ్రా యుగానికి చెందిన మొదటి రెండు శతాబ్దాల్లో సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం వంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు కఠిన నియమాలను పాటించారు. మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వాన్ని బోధించారు. వారు గురువులను ‘పీర్ ‘గా గౌరవంగా పిలిచేవారు. వారు బహుమతులను స్వీకరించక దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షాలను విశ్వసించారు.

ప్రశ్న 4.
చిట్టీ, సూఫీ బోధకుల విజయాలను చర్చించండి.
జవాబు:
భారతదేశంలోని చిట్టీ, సూఫీ బోధకుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ శిష్యులైన షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకిలు ప్రధానమైనవారు. వారు సమానత్వాన్ని బోధిస్తూ సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వారు స్థానిక హిందువులతో సన్నిహితంగా మెలిగారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాలలో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నట్లువారు పేర్కొన్నారు. భక్తియార్ కాకికి ఆధ్యాత్మిక సంగీతం అంటే ఇష్టం. సూఫీ బోధకులు తమ ఆశ్రమాల్లో ఏర్పాటు చేసిన హిందూ, ముస్లిం సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకొన్నాయి.

షేక్ ఫరీద్ లేదా బబాఫరీద్ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

హజరత్ నిజాముద్దీన్ వినయశీలి. ఇతడు అత్యంత సామాన్య జీవితాన్ని గడిపాడు. పేదవారిని ప్రేమించాడు. ఢిల్లీ సుల్తానుల బహుమానాలను ఆయన తిరస్కరించాడు. నసీరుద్దీన్ చిరాగ్, షేక్ సలీం చిష్టిలు ఆయన ప్రధాన శిష్యులు. షేక్ సలీమ్ చిష్టీ అక్బర్ సమకాలీకుడు. ఇతని సిద్ధాంతాలు, జీవనవిధానం అక్బర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రిని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీమ్ అని అక్బర్ నామకరణం చేశాడు. చిష్తీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 5.
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
జవాబు:
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్‌కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు.

సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

ప్రశ్న 6.
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
జవాబు:
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఆళ్వారులు, నాయనార్లు
జవాబు:
క్రీ.శ. 6వ శతాబ్ద కాలంలో తమిళదేశంలో ఆళ్వారులు (వైష్ణవాచార్యులు), నాయనార్ల (శైవాచార్యులు) నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలు పాడుతూ భక్తిని ప్రచారం చేశారు.

ఆళ్వార్లు, నాయనార్లు కులవ్యవస్థను బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. తొండరిప్పొడి ఆళ్వారు, అప్పార్ అనే నాయనార్లు కులవ్యవస్థను వ్యతిరేకించడంతోపాటు ఉపయోగంలేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. స్త్రీ అయిన ఆండాళ్ (ఆళ్వారు) తన రచనల్లో విష్ణువును ప్రస్తుతించింది. కరైకాల్ అమ్మయార్ (నాయనారు) మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించింది. వీరిద్దరూ తమ రచనల్లో సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించారు.

ప్రశ్న 2.
శంకరాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది. బెనారస్క చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యుడిని ప్రభావితం చేశాయి. శంకరాచార్యుడు హిందూమతానికి నూతన తాత్వికతను జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్తులకు నమ్మకాన్ని కల్పించడంతోపాటు మతాన్ని వదిలి వెళ్ళినవారు తిరిగివచ్చేలా చేశాయి. ఈ విధంగా శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులువేసి నూతన హిందూమత రక్షకుడుగా పేరుపొందారు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు.

ప్రశ్న 3.
రామానుజాచార్యుడు
జవాబు:
భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తరవాత రామానుజాచార్యుడు ప్రధానమైనవారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. తన గురువు యాదవ్ ప్రకాశ్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడు వ్యతిరేకించాడు.
భగవంతుడిని చేరుకొనేందుకు ‘భక్తి’ ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని రామానుజాచార్యుడు బోధించాడు. ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యారు.

ప్రశ్న 4.
గురునానక్
జవాబు:
కాలూరామ్, తృష్ణాదేవి దంపతులకు క్రీ.శ 1469 లో తల్వాండిలో గురునానక్ జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే కుమారులు కలిగారు. ఢిల్లీ సుల్తానుల పాలనలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ పనిచేశాడు. క్రీ.శ. 1494 సంవత్సరంలో గురునానక్‌కు జ్ఞానోదయం అయ్యింది.
గురునానక్ పండితుడు, పర్షియా, హిందీ, పంజాబీ భాషలను అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ‘ఆదిగ్రంథ్’ అనే పుస్తక రూపంలో వెలువడ్డాయి. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని | సమకూర్చారు. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 5.
చైతన్యుడు.
జవాబు:
‘శ్రీ గౌరంగ’ అనే పేరుతో కూడా ప్రసిద్ధికెక్కిన చైతన్యుడు బెంగాలుకు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు, సంఘసంస్కర్త. 25 సంవత్సరాల వయస్సులో కేశవభారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనంలో పర్యటించి అక్కడ ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు. చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడ్డాడు. సర్వాంతర్యామి ఒక్కడేనని అతడే శ్రీకృష్ణుడు లేదా హరి అని చైతన్యుడు బోధించాడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమచాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ‘శిక్ష అస్తక్’ రచించాడు. బ్రహ్మచర్యాన్ని ‘సన్యాసులు’ అనుసరించాలని, సంకీర్తనలను గానం చేయాలనే అంశాలను అనుచరులచేత ఆచరింపచేశాడు.

ప్రశ్న 6.
మీరాబాయి
జవాబు:
క్రీ.శ. 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించిన మహిళా భక్తిబోధకురాలు మీరాబాయి. మేర్తా పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె అయిన మీరాబాయి 18 సంవత్సరాల వయస్సులో 1516 సంవత్సరంలో మేవాడ్ రాజైన రాణాసంగా కుమారుడు భోజోజ్ని వివాహం చేసుకొంది. చిన్నతనం నుంచే మత విశ్వాసాన్ని కలిగిన ఆమె తన పూర్వీకుల లాగానే కృష్ణుడిని ఆరాధించింది. భర్త మరణానంతరం మామగారి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఆమె చివరకు తన జీవితాన్ని కృష్ణుడి ఆరాధనకు అంకితం చేసి పాటలు పాడటం ప్రారంభించింది. బృందావనంలో స్థిరపడి మరణించేవరకు అక్కడే ఉంది.

ప్రశ్న 7.
షేక్ ఫరీద్
జవాబు:
షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ (క్రీ.శ 1175 – 1265) ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు. అతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు. భక్తి బోధకుల సంగీతాన్ని ఇష్టపడేవాడు. ఆయన శిష్యుల్లో నిజాముద్దీన్ అలియా ముఖ్యుడు. ఢిల్లీలోని ఘజియాపూర్లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
షేక్ సలీం చిష్టీ
జవాబు:
షేక్ సలీం చిష్టీ అక్బర్ చక్రవర్తి సమకాలికుడు. సలీం చిష్టీ సిద్ధాంతాలు, జీవన విధానం అక్బర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్బర్ స్వయంగా ఫతేపూర్ సిక్రీని సందర్శించి చిష్టీ ఆశీస్సులను పొందాడు. తనకు కుమారుడు జన్మించాక అతనికి సలీం అని అక్బర్ నామకరణం చేశాడు. చిట్టీ సమాధిపై అక్బర్ నిర్మించిన దర్గా ఉరుసు సందర్భంగా అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

ప్రశ్న 9.
భక్తి సాహిత్యం
జవాబు:
భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను భక్తి ఉద్యమం ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రజలకు ఒక నూతన మార్గాన్ని చూపింది. భక్తి ఉద్యమకారులు పూజారుల పెత్తనాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించారు. ప్రజల భాషలోనే తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అందువల్ల బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, హిందీ వంటి ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగం ప్రారంభమై అభివృద్ధి చెందింది.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526) Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 7th Lesson ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 – 1526)

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తురుష్కుల దండయాత్రల ఫలితాలు.
జవాబు:
భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయము “సత్ఫలితాలివ్వని ఘన విజయము” అని స్టాన్లీ లేనప్పూల్ వర్ణించాడు.
1) అరబ్బులు విశాల భారతదేశమున అత్యల్ప భాగమును మాత్రమే జయించుట వలన అది పెద్దగా గుర్తించబడలేదు.

2) పటిష్టమైన వర్ణవ్యవస్థ గల హిందువులు, అరబ్బుల సాంగత్యమును పరిహసించారు.

3) అరబ్బులు ఎంత ప్రయత్నించినను ఇస్లాంను ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. కాని తరువాత ముస్లిం విజేతలకు మార్గదర్శకులయ్యారు.

4) హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడి వున్న అరబ్బులు హిందూవేదాంతం, ఖగోళ శాస్త్రము, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుండి అభ్యసించారు. బ్రహ్మసిద్ధాంతము, పంచతంత్రము, చరకసంహిత వంటి గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి. అరబ్బులు భారతీయ చిత్రకారులను, శిల్పులను, పండితులను ఆదరించారు. మొత్తము మీద కొన్ని ప్రాచీన కట్టడాలు తప్ప అరబ్బుల దండయాత్ర భారతదేశమున మిగిల్చినదేమీ లేదు. కాని అరబ్బుల విజయం నుంచి హిందువులు మాత్రం ఎటువంటి గుణపాఠాన్ని గ్రహించలేకపోయారు. మహమ్మదీయులలోని సమతాభావాన్ని గాని, ఐకమత్యాన్నిగాని, వారి యుద్ధతంత్రాన్నిగాని నేర్చుకోలేకపోవటం వల్ల తరువాత కాలంలో తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోయారు.

ప్రశ్న 2.
రజియా సుల్తానా.
జవాబు:
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఇలుట్మిష్ కొడుకులు సమర్థులు కానందువల్ల తన వారసురాలిగా తన కుమార్తె రజియాను సుల్తానుగా ప్రకటించాడు. కాని ఇల్లుట్మిష్ మరణానంతరం ఢిల్లీ. సర్దారులు ఇల్టుట్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటంచేత అతడి తల్లి షా తుర్కాన్ పాలించసాగింది. కాని ఆమె అవినీతిపరురాలవటం చేత రజియా సైనికదళ సానుభూతితో ఫిరోజ్న వధించి, ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1236-1240) అధిష్టించింది. ఈమె గొప్ప ధైర్యసాహసాలున్న స్త్రీ, సైన్యాలను నడపటంలోను, ప్రభుత్వ నిర్వహణలోను కడు సమర్థురాలు. కాని ఒక స్త్రీ సుల్తాను కావటం తురుష్క సర్దారులు అవమానంగా భావించారు. ఇల్ల్యుట్మిష్ కాలంలో బానిసలుగా చేరిన వీరు క్రమంగా అమీరులై తమ ప్రాబల్యమును పెంచుకొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమినే చిహల్‌గనీ అంటారు. ఈ కూటమి రజియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగింది. చిహల్గానీ నిరంకుశాధికారాలను నిర్మూలించి, సుల్తాన్ అధికారమును పెంపొందించటానికి రజియా కొన్ని చర్యలు చేపట్టింది. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నతోద్యోగములలో నియమించింది. రాష్ట్ర గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. మాలిక్ యాకూబ్ అనే అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించి అతని పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించింది. రజియా యాకూబ్‌పై అభిమానము చూపటాన్ని సహించలేని ఢిల్లీ సర్దారులు రజియాను పదవీచ్యుతురాలిగా చేయుటకు భటిండా రాష్ట్ర పాలకుడైన కబీర్ ఖాన్ చేతులు కలిపి రజియాపై కుట్రచేసి ఆమెను అంతము చేయదలచారు. ఈ విషయము తెలిసిన రజియా అపార సైనిక బలముతో బయలుదేరి మొదట లాహోర్ పాలకుడైన కబీర్ ఖాన్ తిరుగుబాటును అణచివేసింది. కాని అల్ తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఢిల్లీ సర్దారులు యాకూబ్‌ను వధించారు. అంతట రజియా ఢిల్లీ నుంచి పారిపోయి అజ్ఞునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది. కాని మార్గమధ్యంలోనే రజియా, అల్ తునియాలు హత్యకు (క్రీ.శ 1240) – గురయ్యారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
బాల్బన్ రాజధర్మ స్వరూపం.
జవాబు:
ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఇనుమడింపచేయడానికి బాల్బన్ తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. బాల్బన్ ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించాడు. ‘నియాబత్-ఇ-ఖుదాయి’ (కింగ్ ఈజ్ వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్) ‘రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, నీడ అని అతని భావం’, సుల్తాన్ హోదాకు గౌరవస్థానం కల్పించి, ప్రజల్లో, సర్దారుల్లో, ఉన్నతాధికారుల్లో అతనంటే ప్రత్యేక గౌరవభావన పెంపొందించి బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం ‘నిరంకుశత్వానికి ప్రతిబింబం’ అని తన కుమారుడైన బుఖాన్కు బోధించాడు. తాను ‘జిల్లీ ఇల్హా’ (భగవంతుని నీడ) అని ప్రకటించాడు. సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బారులో ఆచరణలో ఉన్న ‘జమిన్ బోస్’, ‘పాయిబోస్’ సుల్తాన్‌కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను గాని సింహాసనాన్ని గాని ముద్దుపెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. సుల్తాన్ అన్ని వేళలా రాజదర్పం ఉట్టిపడేలా రాజదుస్తుల్లో కనబడాలని కోరుకొన్నాడు. తాను సుల్తాన్ గా పదవి చేపట్టిన తరువాత తన హోదాకు తగిన అధికారులతోనే మాట్లాడేవాడు. బహిరంగంగా సమావేశాల్లో నవ్వేవాడు కాదు. దర్బారులో మద్యం సేవన, జూదం ఆడటం నిషేధించాడు. క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించాడు. తాను ముద్రించిన నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. సుల్తాన్ పట్ల ప్రజలు, అధికారులు గౌరవంతో ప్రేమతో వ్యవహరించాలనీ, అదే విధంగా సుల్తాన్ ప్రజలను తన కన్నబిడ్డల్లా భావించి వారి సంక్షేమానికి సర్వవేళలా శ్రమించాలని పేర్కొన్నాడు. పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం రాజ్య రక్షణకు అత్యావశ్యకమని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు చేశాడు. ‘దివాన్-ఇ-ఆరీజ్’ (సైన్య వ్యవహారాలు) శాఖాధిపతులుగా తనకు విశ్వాసపాత్రుడైన ఇమాద్-ఉల్-ముల్క్న నియమించాడు. సైనికులకు జీతభత్యాల ఏర్పాటు చేశాడు. జాగీరులను రద్దుచేయించాడు. ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత దివాన్-ఇ-అరీజ్ శాఖకు, ఉన్నత సైనికాధికారులకు అప్పగించాడు. కోటలను నిర్మించారు. పాత కోటలకు మరమ్మత్తులు చేయించాడు.

ప్రశ్న 4.
అల్లావుద్దీన్ – ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు.
జవాబు:
అల్లావుద్దీన్ సంస్కరణలన్నింటిలో అత్యంత ఉత్తమమైనవి, ప్రశంసలందుకొన్నవి, అతను ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు. ఇందుకు ముఖ్యకారణం, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించాడు. వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులను అమ్మాలని అల్లావుద్దీన్ నిర్దేశించాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారిని, తప్పుడు తూకాలు, కొలతలు వాడిన వారిని ఇతడు అతి కఠినంగా శిక్షించేవాడు. వ్యాపారస్థులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి, వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోవాలని ఆదేశించాడు. వ్యాపారస్థులపై అజమాయిషీకి “దివానీ రియాసత్’, ‘షహనాయి మండి’ అను ఇద్దరు అధికారులను నియమించాడు. ఘనత : పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టినవాడు అల్లావుద్దీన్. తన పాలనా సంస్కరణల ద్వారా అల్లావుద్దీన్ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచాడు.

ప్రశ్న 5.
మహ్మద్ – బీన్ – తుగ్లక్ సంస్కరణలు.
జవాబు:
జునాఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే బిరుదుతో క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమధిష్టించి 1351 వరకు రాజ్యమేలాడు. ఢిల్లీ సుల్తానులలోనే గాక, మధ్యయుగ చక్రవర్తులందరిలో ప్రత్యేకమయిన వ్యక్తిత్వము ఉన్నవాడు తుగ్లక్.
పరిపాలనా సంస్కరణలు :
1) అంతర్వేది ప్రాంతంపై పన్నుల హెచ్చింపు: మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ్య ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుటకై గంగా, యమునా, అంతర్వేది ప్రాంతంలో పన్నులను విపరీతముగా పెంచాడు. పుల్లరి, ఇంటిపన్ను, భూమిశిస్తు అమితముగా విధించుటయే గాక క్రూరముగా వసూలు చేశాడు. అసలే కరువుతో కటకటలాడుతున్న ప్రజలు ఈ పన్నుల భారము భరించలేక భూములు వదిలివెళ్ళారు. ఆ తరువాత సుల్తాన్ వారికి సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి ఫలించలేదు. ప్రజలలో సుల్తాన్ పట్ల విరక్తి కలిగింది.

2) వ్యవసాయ శాఖ ఏర్పాటు: మహమ్మద్ బీన్ తుగ్లక్ బంజరు భూములను సాగులోకి తెచ్చుట కొరకు వ్యవసాయ శాఖను ఏర్పరచాడు. ఇందుకుగాను ప్రభుత్వము 60 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. కాని ఉద్యోగుల అవినీతి వలన ఈ పథకం విఫలమైంది.

3) రాజధానిని మార్చుట : మంగోలుల దండయాత్రలకు దూరముగా దేశమునకు మధ్యభాగంలో రాజధాని వుండటం మంచిదని తుగ్లక్ తలచి తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఢిల్లీ పౌరులందరు తమ వస్తు, వాహనాలతో దేవగిరికి తరలివెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. 700 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారు. అనేకమంది మార్గమధ్యంలో మరణించారు. దేవగిరికి దౌలతాబాద్ అని నామకరణం చేశాడు. కాని మహమ్మదీయులు ఎవ్వరూ చిరకాలము అచ్చట వుండటానికి ఇష్టపడకపోవటం వలన ఈ పథకం కూడా విఫలమైంది. పైపెచ్చు ఢిల్లీలో సైనిక దళాలు లేవని తెలిసి మంగోలుల దండయాత్రలు పెరిగాయి. సుల్తాన్‌కు కూడా దౌలతాబాద్ వాతావరణం సరిపడలేదు. అందువలన పౌరులందరు మరల ఢిల్లీకి పోవాలని శాసించాడు. సుల్తాన్ చర్య వృథా ప్రయాసకు చిహ్నమని నిశితంగా విమర్శించారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

4) రాగి నాణేల ముద్రణ : నాణేల సంస్కరణలో సుల్తాన్‌కు ఆసక్తి ఎక్కువ. అతడు విభిన్నమైన నాణేలను ముద్రించి, వాని విలువలు భిన్నంగా నిర్ణయించాడు. రాగి నాణేలను ముద్రించి వాని విలువలను వెండి, బంగారు నాణెములతో సమానం చేశాడు. ఫలితంగా స్వార్థపరులైన ప్రజలంతా సొంతంగా నాణెములు ముద్రించుట మొదలుపెట్టారు. వారు బంగారం, వెండి దాచి, రాగి నాణెములు తయారుచేయుట ప్రారంభించారు. దీని ఫలితంగా డబ్బు విలువ పడిపోయి వస్తువుల ధరలు పెరిగాయి. వీరి చర్యలను సుల్తాన్ అరికట్టలేకపోయాడు. విదేశీ వర్తకులు ఈ నాణెములు నిరాకరించుటచేత, వర్తక వాణిజ్యాలు స్తంభించాయి. అరాచక పరిస్థితులేర్పడటం చేత రాగి నాణేలను ఉపసంహరించవలసి వచ్చింది. రాగి నాణేలకు బంగారు, వెండి నాణెములు ఇచ్చుటచే ప్రభుత్వ ధానాగారం ఖాళీ అయింది.

5) న్యాయపాలన: మహమ్మద్ బీన్ తుగ్లక్ మత విధానమునందు సామరస్య ధోరణి ప్రదర్శించాడు. మత సిద్ధాంతాలను పట్టించుకోక లౌకిక సూత్రాలపై పాలన సాగించాడు. మహమ్మదీయేతరుల పట్ల మత సహనం పాటించిన తొలి ముస్లిం పాలకుడు ఇతడే.

విదేశాంగ విధానము : దురదృష్టవశాత్తు ఇతని విదేశాంగ విధానం కూడా ఘోరంగా విఫలమైంది.
1) ఖురాసాన్ దండయాత్ర : ఖురాసాన్ ప్రముఖులచే ప్రేరేపింపబడి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖురాసాన్, ఇరాన్ ట్రాన్-ఆగ్జియానా ప్రాంతాలను జయించదలచాడు. అందుకు పెద్ద సైన్యమును సిద్ధపరచి ఒక ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. కాని తగిన నిధులు లేకపోవుటచే ఈ ప్రయత్నం నుండి విరమించవలసి వచ్చింది.

2) నాగర్ కోట, కారాజాల్ విషయములు : పంజాబులోని భాంగ్రా జిల్లాయందలి నాగర్ కోటను తుగ్లక్ జయించాడు. హిమాలయ ప్రాంతంలోని కారాజాల్ను ఆక్రమించుటకు పెద్ద సైన్యాన్ని పంపాడు. విపరీతమైన జన, ధన నష్టములకు ఓర్చి, ఢిల్లీ సైన్యం కారజాల్ను ఆక్రమించింది.

3) మంగోలులకు లంచములు ఇచ్చుట : మహమ్మద్ బిన్ తుగ్లక్ మంగోలులను ఎదిరించలేక వారికి లంచములు ఇచ్చి, శాంతింపచేయుటకు ప్రయత్నించాడు. సుల్తాన్ బలహీనతను గమనించిన మంగోలులు వారి దాడులను అధికం చేశారు.
తిరుగుబాట్లు : సుల్తాను చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల, క్రూరమైన శిక్షల వల్ల విసుగు చెందిన గవర్నర్లు తిరుగుబాట్లు చేయసాగారు. మొత్తం మీద 22 తిరుగుబాట్లు జరిగాయి. మాబార్, వరంగల్, బెంగాల్ స్వాతంత్ర్యం పొందాయి. విజయనగర, బహమనీ రాజ్యాలు దక్షిణాపథంలో స్థాపించబడ్డాయి. సింధు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచుటకు వెళ్ళిన మహమ్మద్ క్రీ.శ. 1351 లో థట్టా సమీపంలో మరణించాడు. అంతటితో “ప్రజలకు అతని పీడ, అతనికి ప్రజల పీడ” తొలగింది.

ప్రశ్న 6.
ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు.
జవాబు:
భారతదేశం ముస్లిం దాడులకు ముందు అపార సిరిసంపదలతో తులతూగుతుండేది. కాని వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్బెరూనీ, ఇబన్ బటూటా, మార్కోపోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్హాబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డా॥ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి. చేతివృత్తులు, కుల వృత్తులు ఆదరణ పొందాయి. అనేక కొత్త పట్టణాలు, నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు, పండ్లు, పూలు పుష్కలంగా పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, అధిక పన్నుల భారం ప్రజలను పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంత మందికి జీవనభృతి కల్పించింది. సామాన్య ప్రజానీకం దుర్లభజీవనఁ గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తానులు విపరీత పన్నులు విధించారు. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేరకు సైనికుల సంక్షేమానికి ఉపయోగపడ్డాయి. మహ్మద్-బీన్-తుగ్లక్ భూమిశిస్తు, టోకెన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. బెంగాల్ నుంచి మేలురకం బియ్యం మలబార్, గుజరాతు సరఫరా చేయడమైంది. గోధుమలు, అవధ్, కారా, అలహాబాద్లలో భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధిచెందలేదు. ఎడ్లబండ్లపై, గుర్రాలపై సరుకుల రవాణా జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో విదేశీ వర్తకం కొనసాగేది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాణ్యాలు, స్థిరాస్తులు కలిగి ఉండేవి. ముస్లిందాడుల వల్ల హిందూ మతసంస్థల ఆర్థిక స్థితి క్షీణించింది.

ప్రశ్న 7.
ఫిరోజ్ షా – తుగ్లక్ ఆంతరంగిక విధానం.
జవాబు:
మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని (క్రీ.శ. 1351-1388) అధిష్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ బీన్ తుగ్లక్ వైఫల్యానికి దారితీసిన కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దటానికి పూనుకున్నాడు.
1) యమునా నది నుంచి హిస్సార్ వరకు, సట్లేజ్ నుండి గాగ్రా వరకు, సిరూర్ పరిసర ప్రాంతాల నుంచి హన్సీ వరకు, గాగ్రా నుంచి ఫిరోజాబాద్ వరకు, యమునా నది నుంచి ఫిరోజాబాద్ వరకు మొత్తం ఐదు కాలువలను త్రవ్వించి నీటి వనరులను కల్పించి, బంజరు భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయమును అభివృద్ధి చేశాడు. దీనివల్ల నీటి పారుదల పన్ను రూపంలో చాలా ఆదాయం రావటమే కాక బంజరు భూములు సాగువల్ల భూమి శిస్తు కూడా గణనీయంగా పెరిగింది.

2) ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జౌన్పూర్ మొదలగు నగరాలను నిర్మించాడు. ఢిల్లీ చుట్టూ 1200 ఉద్యానవనాలను వేయించాడు. మహమ్మదీయ పకీర్లకు, హిందూ సన్యాసులకు ఎంతో ధనాన్ని విరాళాలుగా ఇచ్చాడు. దివానీ ఖైరత్ అనే పేర ఒక భవనాన్ని నిర్మించి దానిలో పేద మహమ్మదీయ బాలికలకు వివాహాలు జరిపించేవాడు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

3) సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయక సామంతరాజులు సరఫరా చేసే సైన్యం మీదనే ఆధారపడ్డాడు.

4) సైనికులకు జాగీర్లను ఇచ్చే పద్దతిని తిరిగి ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రతిభ ఆధారంగా సైనికులను నియమించే పద్ధతి అంతమొంది అదీ సుల్తానత్ పతనానికి ఒక కారణమైంది.

5) బానిసల అవసరాల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఈ శాఖ కింద 1,80,000 మంది బానిసలుండేవారు. వీరి నిర్వహణ ఖజానాకు చాలా భారమైంది. పైగా బానిసలు రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అనేక కుట్రలు చేసి సుల్తానత్ పతనానికి కారకులయ్యారు.

6) శిస్తును వసూలు చేసుకొనే అధికారాన్ని సర్దారులకు ఇచ్చి వారి అభిమానాన్ని పొందాడు.

7) కఠిన శిక్షలను రద్దు చేశాడు.

8) రాజ్య వ్యవహారాలలో ఉలేమాల జోక్యాన్ని అనుమతించాడు. మత మౌఢ్యంతో హిందువుల పట్ల అసహనవైఖరిని అవలంబించాడు. వారి నుంచి జిజియా పన్నును వసూలు చేశాడు. ఒరిస్సాలో వున్న భువనేశ్వర ఆలయం, మాళ్వా, నాగర్కోటలలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఇతడు సున్నీ మతస్థుడైనందువల్ల షియాల పట్ల కూడా కఠినవైఖరి అవలంబించాడు. ఈ మతవిధానం ప్రజల్లో ఇతని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది.

ప్రశ్న 8.
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు – శిల్పకళ.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల యుగంలో భారతదేశంలో ఒక కొత్తతరహా వాస్తు శిల్పకళ రూపుదిద్దుకొంది. ఢిల్లీలో, అజ్మీర్, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజాబాద్ లో ఢిల్లీ సుల్తానులు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు 1. ఆర్చ్ & డోమ్ 2. సున్నపు మట్టిని గచ్చుగా వాడటం, 3. రాతిని, జిప్సంని వాడటం, 4. అలంకరణ అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, వాస్తు శిల్పులు భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన కువ్వత్-ఉల్-ఇస్లాం-మసీద్ ఒక గొప్ప కట్టడం.

కుతుబ్మనార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్య నమాజ్ కోసం, ఇరుగుపొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి పెర్గూసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ, అలియా దర్వాజాను, ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదు నిర్మించాడు. సిరి పట్టణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రాసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. నసీముద్దీన్ లాల్గుంబద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీమసీదు సికిందర్ లోడీ వజీరైన ముబారక్‌షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇండో- ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ రూపుదిద్దుకొంది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అరబ్ సింధ్ ఆక్రమణ.
జవాబు:
అరబ్బుల దండయాత్ర నాటికి సింధు ప్రాంతమును దాహిర్ పాలించుచున్నాడు. అతడు అసమర్ధుడు, బలహీనుడు కావటం చేత అతని పాలన ప్రజారంజకముగా లేదు.
సింధూను జయించుటకు రెండుసార్లు బలీయమైన సైన్యదళములను హజాజ్ పంపాడు. కాని అరబ్బు సేనాపతులు రెండుసార్లు ఓడిపోయారు. తుదకు హజాజ్ తన అల్లుడైన మహమ్మద్ బీన్ ఖాసిం అనువానిని అపారసైన్యంతో పంపాడు. ఖాసిమ్ యువకుడు, శక్తిశాలియైన సేనాధిపతి.

ఖాసిం 25,000 అరబ్బు సైన్యముతో దేబాల్‌ను ఆక్రమించి దారుణ రక్తపాతానికి తలపడ్డాడు. ఇస్లాంమతము స్వీకరించని వారిని కత్తికి బలి ఇచ్చాడు. నెరూన్, శ్వాన్, శీలమ్ ప్రాంతములు తేలికగా ఆక్రమించుకున్నాడు. తుదకు క్రీ.శ. 712లో రోర్ యుద్ధరంగంలో దాహిర్ మరణించాడు. ఆ తరువాత బ్రాహ్మణాబాదు, సింధూ రాజధానియైన ఆలోర్ను ఖాసిం వశపరచుకున్నాడు. ఇట్లు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించి, ముల్తాన్‌ను కూడా జయించాడు. కనోజ్‌పై దండెత్తుటకు ప్రయత్నములు చేయుచున్నప్పుడు ఖాసింను ఖలీఫా వెనుకకు పిలిపించి క్రూరముగా చంపాడు.

ప్రశ్న 2.
మహమ్మద్ ఘోరీ.
జవాబు:
ఘజనీ వంశ పరిపాలన తరువాత ఘోరీ వంశం సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హీరాట్-ఘజనీ రాజ్యాల మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు ఘియాజుద్దీన్ మహ్మద్. ఇతడు కడపటి ఘజనీల నుంచి ఘజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్రపాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ ను నియమించాడు. చరిత్రలో ఇతడే మహ్మద్ ఘోరీగా కీర్తి గడించాడు. క్రీ.శ. 1173వ సం॥లో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్టించాడు. మహ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 3.
ఆల్బెరూనీ.
జవాబు:
ఆల్బెరూనీ మహమ్మద్ గజనీ ఆస్థానకవి, పర్షియా దేశస్థుడు. సంస్కృత పండితుడు. మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చాడు. తారిఖ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రచించాడు.

ప్రశ్న 4.
జియాఉద్దీన్ – బరనీ
జవాబు:
తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి గ్రంథ రచయిత జియా-ఉద్దీన్-బరౌనీ. ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన బరౌనీ, తండ్రి ముయిద్-ఉల్-ముల్క్, మామయ్య అలా-ఉల్-ముల్క్లు, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైన సుల్తానుల సేవలో వివిధ పదవులు నిర్వహించినందువల్ల బరేనీకి సుల్తానులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఇతడి రచన 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచనే తారీఖ్-ఇ-ఫిరోజ్-షాహి.

ప్రశ్న 5.
కుతుబ్మనార్.
జవాబు:
కుతుబుద్దీన్ ఐబక్ దీనిని భక్తియార్ ఖాదిర్ అను సూఫీ సన్యాసి గౌరవార్ధం దీనిని ప్రారంభించగా ఇల్లుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. ఇది ఢిల్లీలోని మొహరేవి వద్ద కలదు. దీని ఎత్తు 71.4 మీటర్లు. భారత్ పశ్చిమాసియా భవన నిర్మాణ సాంప్రదాయాలు అన్నీ దీనిలో ఉన్నాయి.

ప్రశ్న 6.
మంగోల్ దాడుల ప్రభావం.
జవాబు:
మంగోలులు ఒక సంచార జాతి. వారు ప్రథమం నుండి ఢిల్లీపై దాడులు జరిపి, తీవ్రనష్టం కలిగించారు. ముఖ్యముగా ఇల్టుట్మిష్ వీరి దాడి నుంచి తన రాజనీతిజ్ఞతతో ఢిల్లీని కాపాడెను. బాల్బన్ వీరి దాడుల నుంచి ఢిల్లీని కాపాడుటకు గట్టి ప్రయత్నం చేసెను. అయితే తన కుమారుడిని మంగోలాడుల వల్ల కోల్పోయెను. అల్లావుద్దీన్ ఖిల్జీ | కాలములో కూడా వీరు దాడులు జరిపి, ఢిల్లీకి తీవ్రనష్టము కల్గించారు.

ప్రశ్న 7.
టోకెన్ కరెన్సీ సంస్కరణలు.
జవాబు:
మహ్మద్-బీన్-తుగ్లక్ ఢిల్లీ సింహాసనము అధిష్టించేనాటికి అతని సామ్రాజ్యంలో వెండి, బంగారు లోహాలతో చేసిన టంకా, జిటాల్ వంటి నాణాలు వాడుకలో ఉన్నాయి. కాని అదేకాలంలో బంగారం, వెండి లోహాల తీవ్రకొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికై సుల్తాన్ కొత్త పథకం రూపొందించాడు. కాని స్పష్టమైన మార్గ నిర్దేశనాలు లేనందువల్ల రాగి, ఇత్తడి నాణాలు ప్రతి కంసాలి ఇంట్లో ముద్రించబడ్డాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. తప్పును గ్రహించిన సుల్తాన్ టోకెన్ కరెన్సీని రద్దు చేశాడు. అప్పటికే చాలా నకిలీ నాణాలు మార్కెట్లో చెలామణి అయ్యాయి. చివరకు ఈ పథకాన్ని సుల్తాన్ రద్దు చేశాడు.

ప్రశ్న 8.
మొదటి పానిపట్ యుద్దం.
జవాబు:
బాబర్ భారతదేశ ఆక్రమణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాడు. 1525లో దౌలతాన్ను తరిమివేసి పంజాబ్‌ను స్వాధీనపరచుకున్నాడు. ఆ తరువాత తన సైన్యాన్ని ఢిల్లీ వైపుకు నడిపించాడు. ఢిల్లీ పాలకుడైన ఇబ్రహీంలోడీ ఒక లక్ష సైన్యంతో పానిపట్టు వద్ద బాబర్‌కు ఎదురునిలిచాడు. 1526 ఏప్రియల్ 21న ఈ ప్రదేశం వద్ద జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీ వధించబడ్డాడు. ఢిల్లీ, ఆగ్రాలు బాబర్ వశమయ్యాయి. మొదటి పానిపట్టు యుద్ధం చారిత్రాత్మకమైనది. లోడీ సైనిక పాటవం సర్వనాశనమైంది. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. హిందూస్థాన్ సార్వభౌమత్వం ఆఫ్ఘనుల నుంచి మొగలుల చేతిలోకి పోయింది. మొగలుల వారసత్వం భారతదేశంలో 200 సంవత్సరాలు కొనసాగింది. మొగల్ పరిపాలనవల్ల భారతదేశంలో హిందూ, ముస్లిం సంస్కృతులు సంగమం చెంది మిశ్రమ సంస్కృతి విరాజిల్లింది.

మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయానికి అనేక పరిస్థితులు దోహదం చేశాయి. ఇబ్రహీంలోడీ అనుసరించిన అనుచిత రాజకీయ విధానం బాబర్‌కు సహకరించింది. బాబర్ యుద్ధ వ్యూహం, శతఘ్ని దళం, సుశిక్షితులైన సైనికులు బాబర్ విజయానికి దోహదపడ్డారు.

AP Inter 1st Year History Study Material Chapter 7 ఢిల్లీ సుల్తానుల యుగం ( క్రీ.శ. 1206 - 1526)

ప్రశ్న 9.
ఢిల్లీ సుల్తానుల కాలంలో సాహిత్య వికాసం.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలు సుల్తానుల ఆదరణ, పోషణ పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి-సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలు కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠి, కన్నడ, తమిళ, మైథిలీ, బెంగాలీ భాషలు అభివృద్ధి సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకొనే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవతా విలువలను, ప్రబోధించారు. దీంతో వారిలో సోదరభావం పెంపొందింది.

ప్రశ్న 10.
ఢిల్లీ సుల్తాన్ల పతనం.
జవాబు:
క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్ ఐబక్ తో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల పాలన సుమారు మూడువందల ఇరవై ఏళ్ళపాటు కొనసాగి ఇబ్రహీం లోడీతో క్రీ.శ. 1526లో ముగిసింది. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదు వంశాల పాలన కొనసాగింది. సుల్తాన్ల పతనానికి అనేక కారణాలు దోహదం చేశాయి.

 1. సామ్రాజ్య విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ, సుల్తానులు అన్ని ప్రాంతాలపై కేంద్ర అధికారాన్ని సమర్ధంగా చెలాయించలేకపోవటం.
 2. సుల్తాన్ స్వార్ధపూరిత విధానాలు, సర్దారుల తిరుగుబాట్లు.
 3. స్థానిక ప్రజల అభిమానం పొందలేకపోవడం, హిందూమత వ్యతిరేక విధానాలు.
 4. రాష్ట్రాల పాలకుల తిరుగుబాట్లు.
 5. సైన్యంలో క్షీణించిన పట్టుదల.
 6. మహ్మద్-బీన్-తుగ్లక్ విధానాల వైఫల్యం.
 7. తైమూర్ దండయాత్ర.
 8. దక్షిణాపథంలో వెలమ, రెడ్డి, విజయనగర, బహమనీ రాజ్యాల
 9. మితిమీరిన పన్నుల భారం.
 10. ముస్లిం వర్గాల్లో ఉన్న విభేదాలు మొదలైనవి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 6th Lesson దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.శ. 8వ శతాబ్దం వరకు గల దక్కన్ చరిత్రను అధ్యయనం చేయడానికి సహకరించే ముఖ్య ఆధారాలను చర్చించండి.
జవాబు:
దక్కన్, దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు అనేక సాహిత్య ఆధారాలతోపాటు శాసనాలు దోహదపడుతున్నాయి సంగం యుగంలోని తమిళ రచనల్లో తోలకప్పియార్ రచించిన ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక, సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ తమిళ దేశానికి బైబిల్ వంటిది. ఈ రచన ఆ కాలం నాటి సాంఘిక జీవనం, నైతిక విలువలకు అద్దం పడుతుంది.

శాతవాహనుల కాలంనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులకు మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మ పురాణాలు, గుణాడ్యుడి బృహత్కథ, హాలుడి గాథా సప్తసతి, వాత్సాయనుడి కామసూత్రాలు, మెగస్తనీస్ ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలతోపాటు ప్లినీ, టాలేమీ రచనలు అద్దం పడుతున్నాయి. మొదటి మహేంద్రవర్మ ‘మత్తవిలాసప్రహసనం’ అనే గొప్ప కావ్యాన్ని రచించాడు. భారవి ‘కిరాతార్జునీయం’ దండిన్ ‘దక్షకుమార చరిత్ర’ అనే గ్రంథాలు తమిళ ప్రజల సాంఘిక, మత, జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించాయి. చైనా యాత్రికుడు హుయానా త్సాంగ్ రచనలు పల్లవ, చాళుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించాయి.

శాసనాలు కూడా దక్షిణ భారతదేశ పాలకులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, బెడ్స, అమరావతి, ధరణీకోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, భట్టిప్రోలు, నాగార్జున కొండల్లో లభించాయి. వీటిలో శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి.

చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఐహోలు శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విజయాన్ని వివరిస్తుంది. ఈ శాసనాలతో పాటు నాణాలు కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 2.
సంగం యుగంలోని ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
సంగం యుగంలో ఈ క్రింది అంశాలు కలవు. అవి.
రాజకీయ వ్యవస్థ: నాడు నిరంకుశ రాజరికపు వ్యవస్థ అమల్లో వుంది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనే ప్రజాసభ పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. గ్రామపాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో వీరమరణం పొందడం గౌరవప్రదమైందిగా భావించేవారు.

సాంఘిక,ఆర్థిక, మతజీవనం: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వనం, వరైని, తుడియం, కడంబన్ అనేవి చతుర్వర్ణాలు. అయితే వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రదమైన స్థానాన్ని అనుభవించేవారు. వ్యాపారులు, సంపన్నులు సుఖమయమైన జీవితాన్ని గడిపారు. బానిస వ్యవస్థ అమలులో ఉన్నట్లు
ఆధారాలున్నాయి.

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, పశుపోషణ, కుండల తయారి, నేతపని వంటి వృత్తులు కూడా ఉండేవి. ప్రజల ఆర్థిక జీవనాన్ని శ్రేణులు క్రమబద్ధీకరించేవి. శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమలులో వుంది.

ప్రజల మత జీవనంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయం మిళితమై కనిపిస్తాయి. ప్రాచీన తమిళులు ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలను ఆరాధించేవారు. దేవతలకు యజ్ఞయాగాలను సమర్పించారు. దేవాలయ పూజా విధానంలో సంగీత, నృత్యాలు భాగంగా ఉండేవి. నాడు ప్రజలు శైవమతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు.

సాహిత్యం: సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని ‘తోలకప్పియార్’ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 23వ వాడు. ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం వలన ఇతని ఘనతను తెలుసుకోవచ్చు. ఈ శాసనం వలన ఇతడు శక, యవన, పహ్లవ, క్షహరాట వంశాలను నాశనం చేశాడని, శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడని తెలుస్తున్నది. గౌతమీ బాలశ్రీ మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు “మహారాజ పితామహి”నని చెప్పుకుంది. దీనిని బట్టి శాతకర్ణి గొప్ప యుద్ధవీరుడని తెలుస్తున్నది. ఇతడు అనేక క్షత్రియ రాజవంశాలను జయించి “క్షత్రియ దర్పమానమర్ధన” అనే బిరుదు ధరించాడు. మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి “త్రిసముద్రతోయ పీతవాహన” అను బిరుదును ధరించాడు. మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, సౌరాష్ట్ర, మాళవ, విదర్భ రాజ్యాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి. నాసిక్ శాసనాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని న్యాయబద్ధంగా పన్నులు విధించేవాడని, పేదవారికి, బ్రాహ్మణులకు భూదానాలు చేసేవాడని తెలుస్తున్నది. ఈ శాసనాలే గౌతమీపుత్ర శాతకర్ణికి వర్ణవ్యవస్థ మీద ప్రగాఢమైన నమ్మకముందని, బ్రాహ్మణ కులాన్ని వర్ణసంకరం కాకుండా రక్షించాడని, “ఏకబ్రాహ్మణుడు” అనే బిరుదు ధరించాడని పేర్కొన్నాయి. ఇతడికి ఉన్న “ఆగమనిలయ” అను బిరుదు వల్ల ఇతనికి ఆగమశాస్త్రాలపై అవగాహన ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ కారణాల వలన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గొప్పవాడని చెప్పవచ్చు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 4.
పల్లవ పాలకులైన మహేంద్రవర్మ, మొదటి నరసింహ వర్మ సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ. 600-630): ఇతను సింహవిష్ణువు కుమారుడు. గొప్ప యోధుడు. ఇతను ఉత్తరాన కృష్ణానది వరకు తన అధికారాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలోనే పల్లవులకు చాళుక్యులకు మధ్య స్పర్థ ఆరంభమైంది. క్రీ.శ. 630లో చాళుక్య రాజైన రెండోపులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి, పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. యుద్ధం తర్వాత కొద్ది కాలానికే మహేంద్రవర్మ మరణించాడు. మహేంద్రవర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను మొదట జైనమతస్థుడైనప్పటికీ తర్వాత అప్పార్ బోధనలవల్ల శైవమతస్థుడయ్యాడు. ఇతను కవి. ‘మత్త విలాస ప్రహసన’మనే నాటకాన్ని రచించాడు. సంగీతంలో ఆసక్తి, ప్రవేశమూ ఉన్నవాడు. వాస్తు, శిల్ప, చిత్ర లేఖనాలను పోషించాడు. ఇన్ని విశిష్ట గుణాలున్నవాడవటం వల్ల ఇతను ‘చిత్రకారపులి’ అని, ‘విచిత్రచిత్తుడ’నే ప్రశంసనందుకొన్నాడు.

మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630-668): ఇతను మహేంద్రవర్మ కుమారుడు. పల్లవ రాజులందరిలోనూ అగ్రగణ్యుడు. సింహాసనమెక్కిన వెంటనే నరసింహవర్మ చాళుక్యుల దండయాత్రను ఎదుర్కోవలసి వచ్చింది. క్రీ.శ. 641లో రెండో పులకేశి పల్లవ రాజ్యంపైకి దండెత్తినప్పుడు పల్లవసేనలు అతణ్ణి ఓడించి తరమడమేకాక నరసింహవర్మ నాయకత్వంలో బాదామి వరకు నడిచి పులకేశిని వధించి బాదామిని దోచుకొన్నాయి. తర్వాత చోళ, పాండ్య ప్రభువులు నరసింహవర్మకు సామంతులయ్యారు. ఈ విజయాలకు నిదర్శనంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులను ధరించాడు.

నరసింహవర్మ కూడా తండ్రి మహేంద్రవర్మలాగా సారస్వతాన్నీ, వాస్తు, లలిత కళలనూ పోషించాడు. ఇతను మహామల్లపురం (మహాబలిపురం)లో ఏకశిలా రథాలనే దేవాలయాలను నిర్మింపచేశాడు. సంస్కృతంలో ‘కిరాతార్జునీయం’ అనే కావ్యాన్ని రచించిన భారవి కవిని ఇతను ఆదరించినట్లుగా తెలుస్తున్నది. నరసింహవర్మ కాలంలోనే హుయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాంచీపురాన్ని దర్శించాడు. పల్లవుల రాజ్యాన్ని తమిళ దేశంగా వర్ణిస్తూ ఇక్కడి ప్రజలు నీతిపరులని, సత్యప్రియులని, శ్రమజీవులని, వీరికి విద్యావ్యాసాంగాలలో శ్రద్ధాసక్తులు అధికమని చెప్పాడు. కాంచీపురంలో దాదాపు 100 బౌద్ధారామాలు, 80 దేవాలయాలు ఉన్నట్లుగా కూడా ఇతను తెలిపాడు. నలందా విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుడి జన్మస్థలం కాంచీపురమని ఇతను రాశాడు.

ప్రశ్న 5.
పల్లవయుగంలోని రాజకీయ, సామాజిక ప్రధాన అంశాలను వివరించండి.
జవాబు:
పల్లవుల రాజకీయ వ్యవస్థ: పల్లవులు దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో పల్లవయుగం గొప్పదశ. భారతదేశ సాంస్కృతిక ఐక్యత వీరి కాలంలో జరిగింది. పల్లవులు సంప్రదాయ నిరంకుశ రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరిపాలనా వ్యవస్థకు రాజే ప్రధాన సూత్రధారి. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. అయినా నిరంకుశుడు కాదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దైనందిన పరిపాలనలో రాజుకు అనేకమంది అధికారులు సహకరించేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. భూమిశిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం. దీనికి తోడు వాణిజ్య పన్నులు, వస్తువులపై పన్నుల ద్వారా ఆదాయం లభించేది.

మతాభివృద్ధి: పల్లవులు వైదిక మతాభిమానులు. వీరిలో చాలామంది శైవులు. రాజసింహుడు వంటి కొంతమంది వైష్ణవ మతాభిమానులుండేవారు. శైవులను నాయనార్లని పిలిచేవారు. వీరిలో ‘అప్పార్’, ‘సంబంధార్’, ‘సుందరమూర్తి’, ‘మాళిక్కవాళగర్’ మొదలైనవారు శైవమత వ్యాప్తికి ఈ యుగంలో అంకితమయ్యారు. విప్రనారాయణ, తిరుమంగై మొదలైన ఆళ్వారులు వైష్ణవమత వ్యాప్తికి అంకితమయ్యారు. పల్లవ యుగంలో తిరుపతి, శ్రీరంగం మొదలైన వైష్ణవ క్షేత్రాలు భక్తులను ఆకర్షించాయి. జైన, బౌద్ధమతాలు కూడా ఈ యుగంలో విలసిల్లాయి. కాంచీపురంలో 180 బౌద్ధారామాలున్నట్లు హుయాన్ త్సాంగ్ రాశాడు. అయితే శైవమతం, వైష్ణవమతాల వ్యాప్తితో జైన, బౌద్ధమతాలు కొంతవరకు క్షీణించాయి.

విద్యాసారస్వతాల ప్రగతి: ప్రాచీన పల్లవుల కాలంలో సంస్కృతం రాజభాష అయింది. నవీన పల్లవులు తమ శాసనాలన్నిటినీ సంస్కృతంలోనే వేయించారు. వీరు ఘటికలను స్థాపించి, సంస్కృతాన్ని, వైదిక విద్యలను పోషించారు. ఈ ఘటికల్లో చతుర్విద విద్యలు అంటే అన్వీక్షకి (Philosophy), త్రయీ (Three vedas), వార్తా (Economics), దండనీతి (Politics) బోధించేవారు. కాంచీపుర ఘటికా స్థానం, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి వహించి, దూర ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆకర్షించింది. సంస్కృత కవులైన భారవి, దండి వీరి కాలం వారే. విద్యలతోబాటు, తమిళదేశంలో నాట్య సంగీతాల్లో కూడా విశేషమైన కృషి జరిగింది. ఆనాటి వాఙ్మయంలో మృదంగం, యాళి, విరళి మొదలైన వాయిద్యాల పేర్లున్నాయి.

వాస్తు శిల్పాల్లో పల్లవుల కృషి: దక్షిణ భారతదేశంలో వాస్తు చరిత్ర పల్లవుల కాలంలోనే ప్రారంభమైందని విన్సెట్ స్మిత్ అభిప్రాయం. మనోహరమైన భారతీయ శిల్పరీతుల్లో పల్లవశైలి ఒకటి. వీరి కాలంనాటి శిల్పాలు, నిర్మాణాలు అపురూప కళాఖండాలు. ముఖ్యంగా కొండను తొలిచి ఆలయాలను నిర్మించే అద్భుతమైన కొత్త పద్ధతిని, మహేంద్రవర్మ తమిళ దేశంలో ప్రవేశపెట్టాడు. ఇదే పద్ధతిలో నరసింహవర్మ మహామల్లవరం (మహాబలిపురం)లో పంచపాండవుల రథాలను తొలిపించాడు. రాజసింహుడు మహాబలిపురంలో తీరదేవాలయాన్ని, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాన్ని నిర్మించాడు. పల్లవుల వాస్తు ప్రత్యేకత కైలాసనాథ ఆలయంలో ప్రతిబింబిస్తుంది. శిల్పాల్లో మహామల్లపురంలో ఉన్న ”గంగావతరణ’ శిల్పం విదేశీ కళావిమర్శకుల ప్రశంసలందుకున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 6.
రెండవ పులకేశి గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
రెండోపులకేశి (క్రీ.శ. 609-642): రెండో పులకేశి బాదామి చాళుక్యుల్లోనే గాక ప్రసిద్ధ భారతీయ చక్రవర్తుల్లో ఒకడు. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణాపథాన్ని పూర్తిగా జయించి ఏలిన మొదటి సార్వభౌముడు రెండో పులకేశి. ఇతని విజయాలను రవికీర్తి అనే జైన పండితుడు ‘ఐహోలు’ (ఐహోళి) శాసనంలో వివరించాడు. అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత, రెండో పులకేశి దిగ్విజయ యాత్రలు సాగించాడు. ఇతడు బనవాసి, కొంకణ రాజ్యాలను జయించాడు. లాట, మాళవ, అళుప (ఉడిపి మండలం), ఘూర్జర ప్రభువులనణచి సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ కోసల, కళింగ రాజ్యాల మీద దండయాత్రలను నిర్వహించాడు. పిష్ఠపురం, కునాల (కొల్లేరు) యుద్ధాల్లో విజయాన్ని సాధించి వేంగిని ఆక్రమించాడు. అనంతరం తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా నియమించాడు. పులకేశి మరణం తర్వాత, వేంగీ పాలకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, తూర్పు చాళుక్యులు లేదా వేంగీ చాళుక్యులుగా ప్రసిద్ధి గాంచారు. తర్వాత ఇతడు చేర, చోళ, పాండ్యరాజుల మైత్రిని సంపాదించి, పల్లవ రాజ్యంపై దండెత్తి, మహేంద్రవర్మను పుల్లలూరు యుద్ధంలో ఓడించాడు. చాళుక్య, పల్లవ రాజ్యాల మధ్య సంఘర్షణకు ఇది నాంది. పులకేశి విజయాలన్నిటిలో ఘనమైంది హర్షవర్ధనుణ్ణి ఓడించడం. ‘సకల ఉత్తరాపథేశ్వరుడైన, హర్షవర్ధనుడు దక్షిణాపథాన్ని జయించాలని దండెత్తి వచ్చినప్పుడు పులకేశి అతణ్ణి నర్మదానది ఒడ్డున ఓడించి ‘పరమేశ్వర’ బిరుదును స్వీకరించాడు.

ఈ విజయ పరంపరలతో పులకేశి కీర్తి ప్రతిష్ఠలు దిగంతాలకు వ్యాపించాయి. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పులకేశి శక్తి సామర్థ్యాలను గురించి విని అతనితో దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాడు. అజంతా మొదటి గుహలోని రెండు చిత్రాలు, ఈ రాయబారాలకు సంబంధించినవేనని కొందరి అభిప్రాయం. క్రీ.శ. 640-641 ప్రాంతంలో చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ చాళుక్య రాజ్యాన్ని దర్శించి తన అనుభవాలను వివరించాడు. పులకేశి సామ్రాజ్యం సారవంతమై, సిరి సంపదలతో తులతూగుతున్న దేశమని అతను తెలిపాడు. అక్కడి ప్రజలు యుద్ధప్రియులని, మేలు చేసిన వారిపట్ల కృతజ్ఞులై ఉంటారని వారికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సంసిద్ధులవుతారని, అలాగే కీడు తలపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనిదే నిద్రపోరని అతను వివరించాడు. వారి రాజు పు-లో-కే-షి (పులకేశి) క్షత్రియ వీరుడని, తన ప్రజలను, సైనిక బలాన్ని చూసుకుని అతడు గర్విస్తాడని, పొరుగు రాజ్యాలంటే అతనికి లక్ష్యం లేదని అతను వర్ణించాడు.

ఇన్ని గొప్ప విజయాలను సాధించిన పులకేశి జీవితం విషాదాంతమైంది. క్రీ.శ. 641లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యం మీద దండెత్తినపుడు పల్లవరాజైన నరసింహవర్మ పులకేశిని బాదామి వరకు తరిమి వధించాడు. ఈ పరాజయం నుంచి బాదామి చాళుక్యులు ఒక శతాబ్దం వరకు కోలుకోలేదు.

ప్రశ్న 7.
అమోఘవర్ష సాధించిన విజయాలను చర్చించండి.
జవాబు:
రాష్ట్రకూట పాలకుల్లో మొదటి అమోఘవర్ష (క్రీ.శ. 814-878) గొప్ప పాలకుడు. ఇతడు మూడవ గోవిందుడి కుమారుడు. అతడు స్థానిక పాలకులు, సామంతుల తిరుగుబాట్లను అణచివేశాడు. అతడు వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. గంగరాజును ఓడించాడు. అతడు స్వయంగా గొప్పకవి, కవిపండిత పోషకుడు. కన్నడంలో ‘కవిరాజమార్గం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ‘మంఖేడ్’ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. అమోఘవర్ష తరువాత అతని కుమారుడైన రెండవ కృష్ణుడు సింహాసనాన్ని అధిష్టించాడు. రెండవ కృష్ణుడి పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం ప్రాభావాన్ని సంతరించుకొన్నది. చివరకు రాష్ట్ర కూట రాజ్యాన్ని (క్రీ.శ. 974-975 సం॥లో) తూర్పు చాళుక్య రాజు రెండవ శైలుడు అంతమొందించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ప్రశ్న 8.
రాజరాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
జవాబు:
మొదటి రాజరాజు కాలం నుంచి చోళ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. రాజరాజు అనేక ఘన విజయాలను సాధించి చోళ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. రాజరాజుకు ‘జయంగొండ’, ‘చోళమార్తాండ’ మొదలైన బిరుదులున్నాయి. పాండ్యులను, చేర రాజులను ఓడించి వారి సామ్రాజ్య భాగాలైన కొడమలై, కొళ్ళంలను యుద్ధం చేసి ఆక్రమించాడు. నౌకాదళంతో దాడి చేసి, మలయా ద్వీపాన్ని ఆక్రమించడమే కాకుండా శ్రీలంక మీద అనూరాధపురాన్ని (ఉత్తర సింహళం) నాశనం చేశాడు. ఉత్తర సింహళానికి “ముమ్ముడి చోళమండల”మని నామకరణం చేశాడు. ఇతని కాలంలోనే కళ్యాణి చాళుక్యులకు, వేంగీ చాళుక్యులకు పోరు ప్రారంభమైంది. రాజరాజు వేంగీ చాళుక్యులకు మద్దతునిచ్చి తన ప్రాబల్యాన్ని వేంగీలో నెలకొల్పాడు.

రాజరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడమే కాకుండా క్రమబద్ధమైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పంటపొలాలను సర్వేచేయించి, న్యాయసమ్మతమైన పన్నులను వసూలు చేశాడు. రాజరాజు శివభక్తుడు. తంజావూర్లో ‘రాజరాజేశ్వర’మనే పేరున్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శైవుడైనప్పటికీ రాజరాజు పరమత సహనం ఉన్నవాడు. శైలేంద్ర రాజైన శ్రీమార విజయోత్తుంగ వర్మకు నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని నిర్మించడానికి అనుమతినివ్వడమే కాకుండా ఆ విహారానికి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఇతను లలితకళల అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశాడు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 9.
మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
జవాబు:
మొదటి రాజేంద్రుడు (క్రీ.శ. 1014-1044): రాజరాజు తరువాత చోళ సింహాసనాన్ని అధిష్టించినవాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. ఇతడు తండ్రిని మించిన శూరుడుగా కీర్తి ప్రతిష్టలను పొందాడు. అతడు తండ్రివలెనే దిగ్విజయ యాత్రలు సాగించి సామ్రాజ్య వ్యాప్తికి పాటుపడ్డాడు. మొదట పాండ్య, చేర రాజ్యములను జయించాడు. ఆ తరువాత సింహళముపై నౌకాదండయాత్రలు సాగించి దానినంతటిని జయించి తన ఆధిపత్యము క్రిందకు తెచ్చాడు. చాళుక్యరాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగి చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునకు సహాయం చేశాడు. రాజరాజనరేంద్రునికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. తరువాత గంగానది వరకు దండయాత్రలు చేసి, బెంగాల్ పాలవంశీయుడైన మహీపాలుని ఓడించి “గంగైకొండచోళ” అను బిరుదు ధరించాడు. ఈ విజయానికి గుర్తుగా “గంగైకొండ చోళాపురము” అను నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత గొప్ప నౌకాబలమును రూపొందించుకొని జావా, సుమత్రా ప్రాంతములను పాలించే శ్రీవిజయ సామ్రాజ్యాధినేతయైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి, అతని రాజధాని కడారం స్వాధీనం చేసుకొన్నాడు. ఈ విజయమునకు చిహ్నంగా “కడారంకొండ” అనే బిరుదును ధరించాడు. ఇట్టి దిగ్విజయముల వలన రాజేంద్రచోళుడు భారతదేశ సుప్రసిద్ధ పాలకులలో ఒకడుగా కీర్తిని పొందాడు. ఇతడు తన తండ్రివలె గొప్ప పరిపాలనాదక్షుడు. వ్యవసాయాభివృద్ధి కొరకు అనేక నీటివనరులను ఏర్పరచాడు. వైదిక కళాశాలను స్థాపించి, దాని పోషణకు కొంత భూభాగమును దానము చేశాడు. ఇతడు గొప్ప భవన నిర్మాత. ప్రజాసంక్షేమ పాలన సాగించి, “తండ్రిని మించిన తనయుడు” అనే కీర్తిని పొందాడు. ఇతడు శిల్పకళను ఆదరించాడు. గంగైకొండ చోళపురంలో ఒక శివాలయాన్ని నిర్మించాడు.

ప్రశ్న 10.
చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలియచేయండి.
జవాబు:
చోళుల పాలనా వ్యవస్థలోని ముఖ్య లక్షణం వారి స్థానిక స్వపరిపాలనా విధానం. చోళుల గ్రామ పరిపాలననే “స్థానిక స్వపరిపాలన” అని కూడా అంటారు. మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్ శాసనంలోను, కులోత్తుంగుని శాసనాల్లోను చోళుల గ్రామ పాలనా పద్ధతి వివరించబడింది.

గ్రామ పాలన: చోళుల సామ్రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వయం పాలనాధికారం ఉంది. ప్రతి గ్రామంలోను గ్రామ పెద్దల సభ వుండేది. ఈ గ్రామ సభ స్వరూప స్వభావాలను గ్రామ గ్రామానికి మారుతుండేవి.

గ్రామ సభలు: చోళుల కాలంలో గ్రామాల్లో మూడు రకాల సభలుండేవి. అవి: 1) ఊర్. 2) సభ. 3) నగరం. ఊర్ అనే సభలో గ్రామంలోని భూస్వాములందరూ సభ్యులే. “సభ”లో బ్రాహ్మణ అగ్రహారంలోని వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ‘నగరం’ అనేది వర్తకులకు సంబంధించిన సభ. బ్రాహ్మణ అగ్రహారంలోని సభ్యులకు దేవాలయమే సమావేశపు స్థలం. కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి కచేరీలుండేవి.

సభ్యుల ఎన్నిక: చోళుల కాలంలో ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడ్ని లాటరీ పద్ధతిపై ఎన్నుకునేవారు. ఈ సభ్యులను గ్రామసభ ఉపసంఘాలుగా నియమించేది. చెరువులు, సత్రాలు, ఆలయాలు, తోటలు, పాఠశాలలు, నేర విచారణ, పన్నుల వసూలు మొదలైన వాటికి ప్రత్యేక ఉపసంఘాలుండేవి. “పంచదార వారియం” అనే ఉపసంఘం మిగిలిన సంఘాల కార్యక్రమాలను పరిశీలించేది.

అర్హతలు: గ్రామసభలోని సభ్యుల అర్హతలను గురించి ప్రత్యేక నిబంధనావళిని రూపొందించి అమలు చేశారు. సభ్యులుగా ఎన్నుకోబడుటకు ఒక వ్యక్తికి కొన్ని అర్హతలుండాలి. అతడు

 1. 30 నుండి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
 2. విద్యావంతుడై వుండాలి.
 3. సొంత ఇల్లు కలిగి భూమికి యజమానై వుండాలి.

అనర్హతలు: గ్రామసభ సభ్యులకు కొన్ని అర్హతలతో పాటు కొన్ని అనర్హతలు కూడా నిర్దేశించారు. గ్రామసభకు ఎన్నుకోబడదలచుకున్న వ్యక్తి

 1. పంచ మహాపాపాలు చేసినవాడై ఉండకూడదు.
 2. గత మూడు సంవత్సరాలుగా ఏ ఉపసంఘంలోను సభ్యుడిగా ఉండరాదు.
 3. ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగా అప్పగించని వాడు కూడా అనర్హుడే.
 4. నేరస్తులు వారి బంధువులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు.

గ్రామ సభ అధికారాలు: గ్రామంలోని భూములపై యాజమాన్యపు హక్కు సభకు ఉన్నది. పన్నులను విధించుట, అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తీసుకువచ్చుట మొదలగునవి ఈ సభ ముఖ్య విధులు. వీటితోపాటు భూమి, నీటి తగవులను పరిష్కరించుట, నేరాలను విచారించుట కూడా దీని విధులుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదాయ వనరులు తక్కువ కావటంతో కేంద్ర ప్రభుత్వమే రహదారులు నిర్మించగా వాటిపై అజమాయిషీని సభ నిర్వహించేది. గ్రామసభలకు సలహాలివ్వటానికి అధికారులుండేవారు. కేంద్ర ప్రభుత్వము యొక్క అనవసర జోక్యము ఈ సభలలో ఉండేది కాదు.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ముగింపు: చోళుల గ్రామ పాలన సమర్థవంతమైనది, ఆదర్శవంతమైనది. చోళులు గ్రామ పరిపాలనను ఏర్పరచి అందులో ప్రజలను భాగస్వాములను చేయటం వల్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయం సాధ్యపడింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దక్కన్, దక్షిణ భారతదేశం అనే పదాలను నిర్వచించండి.
జవాబు:
‘దక్కన్’ అనే పదానికి భాషాపరంగా భారతదేశ భూభాగంలోని దక్షిణ, ద్వీపకల్పభాగం అని అర్థం. క్రీ.శ. 1945సం||లో హైద్రాబాద్ లో జరిగిన దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో దక్కన్ భౌగోళిక సరిహద్దులను పేర్కొన్నారు. దీని ప్రకారం ఉత్తరాన తపతి నది నుంచి దక్షిణాన చివరి భూభాగం వరకు, తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రం వరకు ఉన్న భూభాగమే దక్కన్. సాధారణంగా వింధ్య పర్వతాలు, నర్మదానదికి దక్షిణాన తూర్పు నుంచి పడమర వరకు ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశంగా వ్యవహరిస్తారు.

ప్రశ్న 2.
సంగం యుగం నాటి సాహిత్యం
జవాబు:
సంగం యుగంలో తమిళ సాహిత్య చరిత్ర ప్రారంభమైంది. ‘తోలకప్పియం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని తోలకప్పియార్ రచించాడు. ‘కురల్’ అనే ప్రసిద్ధ కావ్యాన్ని తిరువళ్ళువార్ రచించాడు. నైతిక విలువలతో కూడిన ఈ కావ్యం తమిళుల జీవితాల్లో ప్రధానపాత్ర పోషించింది. జైన, బౌద్ధ కవులు, రచయితలు కూడా సంగం సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

ప్రశ్న 3.
కరికాల చోళుడు.
జవాబు:
చోళ రాజుల్లో కరికాల చోళుడు (క్రీ.శ.190) గొప్పవాడు. అతను ‘వెన్ని’ వహైప్పరండలై యుద్ధాలలో చేర, పాండ్య రాజులపై గొప్ప విజయాన్ని సాధించాడు. పూహర్ (కావేరీ పట్టణం) అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మింపచేశాడు. ప్రజాసంక్షేమానికి కృషి చేసి వ్యవసాయ, వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించాడు. శ్రీరంగం సమీపంలో కావేరీనదిపై ఆనకట్టను నిర్మింపచేసి వ్యవసాయానికి నీటిపారుదల వసతిని కల్పించాడు. వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు.

ప్రశ్న 4.
శాతవాహనుల శిల్పకళ
జవాబు:
శాతవాహనుల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలో బౌద్ధ విహారాలు, చైత్యాలు, స్థూపాలు, అధికంగా నిర్మించబడ్డాయి.. బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువుల అవశేషాలపై నిర్మించిన గొప్ప నిర్మాణమే స్తూపం. చైత్యం ఆరాధన ప్రదేశం. ప్రస్తుత గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరంలోగల అమరావతిలో ఉప స్థూపం శాతవాహనుల కాలం నాటి శిల్పకళావైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 5.
శాతవాహనుల కాలంలో మతం
జవాబు:
హిందువులు ఉన్నత స్థితిలో ఉండేవారు. వారిలో కొందరు శైవులు, మరికొందరు వైష్ణవులు. పశుపతి, గౌరి, రుద్రుడు, పార్వతి, లక్ష్మీనారాయణులను దైవాలుగా ప్రజలు పూజించేవారని గాథాసప్తశతి పేర్కొంది. అయితే వారందరిలోనూ త్రివిక్రముణ్ణి గొప్ప దైవంగా పేర్కొంది. కృష్ణుడి కథలు, లీలలు కూడా పరిచితమే. ఈ దేవతలతోబాటు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల ప్రసక్తి కూడా ఉంది.

రాజులు వైదిక మత క్రతువులను నిర్వహించేవారు. పుణ్యక్షేత్రాలను దర్శించడం, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం వాడుకలోకి తెచ్చారు. బావులు, చెరువులను తవ్వించడం, బాటలకిరువైపుల చెట్లను నాటించడం, మార్గమధ్యంలో సేద తీర్చుకోవడానికి సత్రాలు కట్టించడం, మత సంస్థలకు విరాళాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు ఎన్నో రకాల దానాలు చేయడం ఆనాటి రాజులు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు.

బౌద్ధమతానికి కూడా విశేష ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా రాణుల ప్రోత్సాహంలో, బౌద్ధభిక్షువులు అంకిత భావంతో ప్రచారం చేయడం వల్ల బౌద్ధమతం ఎంతో అభివృద్ధి చెందినది.

ప్రశ్న 6.
ఐహోలు శాసనం
జవాబు:
ఐహోల్ కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. ఈ ప్రదేశంలో పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి యొక్క సేనాని రవికీర్తి వేయించిన “ఐహోల్” శాసనం ఉంది. ఈ శాసనంలో రెండవ పులకేశి యొక్క దిగ్విజయ యాత్ర, హర్షునిపై అతని విజయం వర్ణించబడ్డాయి. ఐహోల్‌లో పశ్చిమ చాళుక్యుల నాటి దేవాలయాలున్నాయి.

ప్రశ్న 7.
పల్లవుల శిల్పకళ
జవాబు:
భారతీయ వాస్తు శిల్పకళా రంగాల్లో పల్లవుల కళకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో పల్లవులతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. కట్టడాల్లో రాతిని ఎక్కువగా ఉపయోగించింది మొట్టమొదటగా పల్లవులే కావటం విశేషం. కాంచీపురం, మహాబలిపురం పల్లవుల కాలం నాటి గొప్ప శిల్పకళా కేంద్రాలు. మహేంద్రవర్మ అనేక ఏకశిలా ఆలయాలను నిర్మింపచేశాడు. అందుకు మహాబలిపురంలోని వరాహ, దుర్గ గుహలు చక్కని తార్కాణం. మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అద్భుతమైన ఏడు పగోడాలను నిర్మింపచేశాడు. వీటినే ఏడు రథాలు అంటారు. కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయాలు పల్లవుల నిర్మాణశైలికి, శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 6 దక్కన్, దక్షిణ భారతదేశం, క్రీ.శ. 10వ శతాబ్దం వరకు

ప్రశ్న 8.
బృహదీశ్వర ఆలయం
జవాబు:
తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని చోళరాజు మొదటి రాజరాజు క్రీ.శ. 1009లో నిర్మించాడు. ఇది శివాలయం. ఇది భారతదేశ నిర్మాణాలన్నింటిలో పెద్దది. దీని విమానం ఎత్తు 200 అడుగులు. ఈ ఆలయం వెలుపలి గోడల నిండా మనోహరమైన శిల్పాలు, లోపలి భాగంలో వర్ణచిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశ ఆలయ వాస్తు సాంప్రదాయానికి మకుటాయమానం వంటిది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 5th Lesson క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యుల పరిపాలనపై వ్యాసం వ్రాయండి.
జవాబు:
భారతదేశంలో ప్రప్రథమంగా ఒక నిర్దిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసింది మౌర్యులే. వీరి పాలనావిధానాన్ని తెలుసుకోవటానికి కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ముఖ్య ఆధారాలు.
1. కేంద్ర ప్రభుత్వం: మౌర్య పాలనావ్యవస్థలో చక్రవర్తి సర్వోన్నత అధికారి. అతడే ఉన్నత కార్యనిర్వహణాధికారి, శాసనాధికారి, న్యాయాధికారి కూడా. స్వధర్మాన్ని అమలుచేయటం, ప్రజల ప్రాణాలను కాపాడటం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల ప్రగతికి కృషిచేయటం, న్యాయాన్ని పంచటం, విదేశీ వ్యవహారాల నిర్వహణ, సాహిత్య, లలితకళల పోషణ మొదలైన విషయాలను రాజు ఆచరించవలసిన ముఖ్య ధర్మాలుగా పరిగణించారు. మౌర్య చక్రవర్తులు నిరంకుశులైనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని పాలించారు. “ప్రజల సుఖమే తన సుఖంగా, వారి కష్టాలే తన కష్టాలుగా చక్రవర్తి భావించాలి” అని కౌటిల్యుడు చెప్పడాన్నిబట్టి మౌర్య చక్రవర్తి నియంతగా వ్యవహరించి ఉండకపోవచ్చునని భావించవచ్చు.

ఎ) మంత్రిపరిషత్తు: పరిపాలనలో చక్రవర్తికి సలహాలను ఇవ్వడం కోసం ఒక మంత్రిపరిషత్తు ఉండేది. మంత్రిపరిషత్తు సభ్యుల్లో మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి మొదలగువారు ముఖ్యులు. మంత్రిపరిషత్తును విధిగా సంప్రదించాలనే నిబంధన లేనప్పటికి ప్రజాసంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని సాధారణంగా మంత్రుల సూచనలను చక్రవర్తి పాటించేవాడు.

బి) ప్రజా సభలు: మౌర్య చక్రవర్తులు ప్రజాభిప్రాయాలకు విలువనిచ్చేవారు. నాడు పౌరసభ, జానపదసభ అనే ప్రజాప్రతినిధులతో కూడిన సభలుండేవి. ఆ సభలను సమావేశపరచి వాటితో ప్రభుత్వ కార్యక్రమాలను చర్చించేవారు. అశోకుని కాలంలో ధర్మ ప్రచారార్థం ధర్మమహామాత్రులు అను ప్రత్యేక అధికారులు నియమింపబడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు 32 శాఖలుగా విభజించబడి అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించబడేవి.

సి) సైనిక వ్యవస్థ: మౌర్యులు సమర్థవంతమైన సైనిక వ్యవస్థను నిర్మించారు. మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9 వేల గజబలం, 8 వేల రథాలు వున్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. సైన్యానికి అనుబంధంగా నౌకాదళం కూడా ఉంది. సైనిక పర్యవేక్షణ బాధ్యతను 30 మంది సభ్యులున్న ఒక సంఘానికి అప్పగించారు. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 ఉపసంఘాలుగా విడివడి గజ, అశ్వక, రథ, పదాతి, నౌకాదళాల రవాణా, సరఫరా శాఖల నిర్వహణా బాధ్యతలను చేపట్టేది. మౌర్యుల కాలంలో గూఢచారి దళం కూడా అప్రమత్తతతో పనిచేసి, కీలకమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించేది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

డి) భూమిశిస్తు: మౌర్య సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 6 నుంచి 4వ వంతు వరకు భూమిశిస్తుగా వసూలు చేసేవారు. అశోకుడు బౌద్ధమతము యెడల భక్తితో లుంబినీ వనములో భూమిశిస్తును 8వ వంతుకు తగ్గించాడు. రాచపొలాలు, గనులు, నౌకాకేంద్రాలు, తదితర మార్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. గోపుడు భూమిశిస్తును వసూలు చేసేవాడు. ఆదాయశాఖకు ముఖ్య అధికారి సమాహర్త. ప్రభుత్వ ఆదాయంలో 4వ వంతు ఉద్యోగుల జీతాలు, ప్రజాపనుల పద్దుల క్రింద ఖర్చయ్యేది.

ఇ) న్యాయపాలన: మౌర్యుల పాలనలో చక్రవర్తీ సామ్రాజ్యానికి ఉన్నత న్యాయాధిపతి. రాజాస్థానమే అత్యున్నత న్యాయస్థానం. ఆస్తి తగాదాలు మొదలగు సివిల్ కేసుల పరిష్కారానికి ధర్మస్థియ అను న్యాయస్థానాలు కృషిచేసేవి. అపరాధ విచారణ కోసం కంటకశోధన అనే క్రిమినల్ న్యాయస్థానాలుండేవి. నేరస్తులను దివ్యపరీక్షల ద్వారా విచారించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అయితే అశోక చక్రవర్తి కాలంలో ఈ కాఠిన్యాన్ని కొంతవరకు సడలించారు.

2. రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్య సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు. అశోకుని కాలంలో తక్షశిల, అవంతి, పాటలీపుత్రం, గిర్నార్లు రాజధానులుగా గల ఉత్తరాపథ జనపదాలు, ఉజ్జయిని, కళింగ, సౌరాష్ట్ర అను దక్షిణాపథ జనపదాలు వుండేవి. జనపదాలకు పాలకులుగా రాజకుమారులను నియమించేవారు. జనపదాన్ని తిరిగి ఆహారాలు, విషయాలు, ప్రదేశాలుగా విభజించారు. ప్రదేశానికి అధికారి ప్రాదేశికుడు. పరిపాలనా యంత్రాంగానికి గ్రామమే ప్రాతిపదిక. గ్రామానికి అధికారి గ్రామికుడు.

3. నగరపాలన: మౌర్యుల కాలంలో నగరపాలన గురించి మెగస్తనీస్ తన ఇండికా అను గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి సవివరంగా వర్ణించాడు. ఈ కాలంలో నగరపాలనకు ఒక విశిష్ట స్థానం ఉంది. నగరపాలనను నాగరికుడు అనే అధికారి నిర్వహించేవాడు. పాటలీపుత్ర నగరపాలన నిర్వహణలో నాగరికుడికి 30 మంది సభ్యులున్న ఒక సంఘం తోడ్పడేది. ఈ సంఘం ఐదేసి సభ్యులు గల 6 పంచాయితీలుగా ఏర్పడి 1) పరిశమ్రలు 2) విదేశీయుల సౌకర్యాలు 3) జనన, మరణాల లెక్కలు 4) వాణిజ్యం, వ్యాపారం, తూనికలు, కొలమానాలు 5) వస్తువిక్రయం 6) సుంకాల వసూలు అనే శాఖలకు సంబంధించిన విధులను నిర్వహించేది.

ముగింపు: మౌర్యుల పాలనలో కొన్ని గుణదోషములున్నాయి. ఉద్యోగుల పీడన, కఠిన శిక్షలు ఇందులోని లోపాలు. పౌర, సైనిక శాఖలు వేర్వేరుగా ఉండటం, సమర్థవంతమైన నగరపాలన, ప్రజాసంక్షేమ పాలన అనునవి. ఇందులోని సుగుణాలు. మౌర్యుల పరిపాలనా విధానం ఉత్తమము, ఉదారము, ఆదర్శప్రాయమైనది. వీరి పాలన మొఘలుల పాలన కంటే విశిష్టమైనదని వి.ఎ. స్మిత్ అను పండితుడు వ్యాఖ్యానించాడు. నేటి పాలనా వ్యవస్థలోని మౌలికాంశాలు మౌర్యులనాటివే అని సర్దార్ కె.ఎమ్. పణిక్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 2.
గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి.
జవాబు:
గుప్త చక్రవర్తులు ఉత్తర భారతదేశమున రాజకీయ ఐక్యతను సాధించి సుభిక్షమైన పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరి పాలనలో ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ లేదు. ఫాహియాన్ “గుప్త పాలన ఉదారమైనది, ప్రభుత్వము ప్రజల విషయములో అనవసరముగా జోక్యం చేసుకొనెడిది కాదు” అని పేర్కొన్నాడు. అట్టి ఉదాత్త పాలనలో ప్రజలు సుఖశాంతులను అనుభవించారనుట అతిశయోక్తి కాదు.

కేంద్ర ప్రభుత్వము: గుప్త సామ్రాజ్యమునకు సర్వాధికారి చక్రవర్తి. గుప్త చక్రవర్తులు మహేశ్వర్, మహారాజాధిరాజా, పరమభట్టారక మొదలగు బిరుదులు ధరించారు. రాచరికం వంశపారంపర్యంగా లభించేది. రాజు దైవాంశ సంభూతుడని ప్రజలు విశ్వసించారు. రాజు నిరంకుశుడైనా ప్రజాక్షేమమే తన క్షేమముగా భావించేవాడు. పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. ఈ మండలిలో 1. మహాప్రధానామాత్యుడు 2. సచివుడు 3. కుమారామాత్యుడు 4. సంధి విగ్రహకుడు 5. మహాదండ నాయకుడు 6. రణభండారికుడు అనే ఉద్యోగులుండేవారు. వీరే కాకుండా కంచుకి అనే ఉద్యోగి చక్రవర్తికి, మంత్రిమండలికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఉద్యోగుల నియామకంలో కుల, మత భేదములను పాటింపక అభ్యర్థుల శక్తిసామర్థ్యములను పరిగణనలోనికి తీసుకునేవారు. ఈ కాలంలో గూఢచారి వ్యవస్థ అమలులో ఉంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం: పరిపాలనా సౌలభ్యం కోసం గుప్త చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులుగా, భుక్తులను విషయాలుగా, విషయాలను ప్రదేశాలుగా విభజించారు. భుక్తికి అధిపతిని ఉపరిక అని పిలిచేవారు. విషయానికి అధిపతి విషయపతి. విషయపాలనలో విషయపతికి సహకరించేందుకు 5గురు సభ్యులు గల సభ సహాయపడేది. వారు నగరశ్రేష్టి, సార్ధవాహుడు, ప్రథమకులికుడు, ప్రథమ కాయస్థుడు, పుస్తపాలడు మొదలైనవారు. పాలనా వ్యవస్థలో చివరిది గ్రామము. గ్రామానికి పెద్ద గ్రామికుడు. గ్రామ పాలనలో గ్రామ పంచాయితీ అతడికి తోడ్పడేది.

నగరపాలన: నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉంది. నగర పరిపాలనాధికారిని ”పురపాలుడు’ అనేవారు. పరిపాలనలో అతనికి సహాయపడేందుకు ఒక నగరసభ ఉండేది.

భూమిశిస్తు: గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమిశిస్తు నుండి లభించేది. పండిన పంటలో 1/3వ వంతు పంటను భూమిశిస్తుగా నిర్ణయించేవారు. భూమిశిస్తును భాగకర, ఉద్యంగ అనేవారు. భూమిశిస్తుతో పాటు వృత్తిపన్ను, ఉప్పుపన్ను, వర్తక సుంకం, వాణిజ్య పన్నులు, రేవులు, అడవులు, గనులు మొదలగు వానిపై కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించేది.

న్యాయపాలన: గుప్త పాలకులు ప్రజలకు నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పాలనను అందించారు. న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. ఆయనే ఉన్నత న్యాయాధీశుడు. న్యాయశాఖలో మహాదండ నాయకుడు, మహాక్షపతిలక వంటి న్యాయాధికారులుండేవారు. రాజదండన కఠినంగా ఉండేది కాదు. కాని తిరుగుబాటు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. శిక్షగా వారి కుడిభుజాన్ని ఖండించేవారు లేదా కళ్ళు పీకించేవారు. మరణదండన తప్పనిసరైనప్పుడు అట్టివారిని ఏనుగులతో తొక్కించి చంపేవారు.

సైనిక వ్యవస్థ: గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తే సర్వసైన్యాధ్యక్షుడు. గుప్త చక్రవర్తులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. సైనిక రంగంలో సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు మొదలైన ఉద్యోగులుండేవారు.

ముగింపు: గుప్తుల పరిపాలనలో అధికార వికేంద్రీకరణ చోటుచేసుకుంది. రాష్ట్రపాలకులు ఎక్కువ అధికారాలు అనుభవించారు. ప్రభువులు ప్రజాక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పరిపాలన సాగించటం గుప్త పాలనలోని విశేషం.

ప్రశ్న 3.
పుష్యభూతి వంశస్థుల పాలనలో రాజకీయ పరిస్థితులను వివరించండి.
జవాబు:
గుప్త సామ్రాజ్య పతనం తర్వాత దాని శిథిలాలపై ఉత్తర భారతదేశంలో అనేక చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. అవన్నీ దాదాపు ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్నటువంటివే. అలాంటి రాజ్యాలలో ఒకటి స్థానేశ్వర రాజ్యం.

గుప్తులకు సామంతులుగా ఉన్న ఈ రాజ్య పాలకులు బలపడి ఇతర సామంత పాలకులను తమ అధికార పరిధిలోకి తెచ్చుకుని ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యతను, సుస్థిరతను సాధించగలిగారు. పుష్యభూతి వంశస్థులు స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించగా ఈ వంశంలోనివాడైన హర్షవర్ధనుడి కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

పుష్యభూతి వంశ చరిత్ర: మహాశివభక్తుడైన పుష్యభూతి ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల, ఈ వంశానికి ఆ పేరు వచ్చినట్లు బాణుని “హర్షచరిత్ర” వల్ల తెలుస్తున్నది. ఈ వంశంలో మూడోతరంవాడైన ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతను “మహారాజాధిరాజు” బిరుదాన్ని ధరించాడు. ప్రభాకరవర్ధనుణ్ణి ‘హూణ హరిణకేసరి” అంటూ
”హర్షచరిత్ర’ వర్ణించింది. ఇతని పట్టపురాణి యశోమతీదేవి మాళవరాజైన యశోధర్ముడి కుమార్తె కావడం వల్ల యశోధర్ముడితోపాటు ప్రభాకరవర్ధనుడు కూడా హూణులతో పోరాటంలో పాల్గొన్నాడని భావించవచ్చు. ప్రభాకరవర్ధనుడికి రాజ్యశ్రీ అనే కుమార్తె, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడనే కుమారులున్నారు. కుమార్తె రాజ్యశ్రీని మౌఖరీ రాజైన గృహవర్మకిచ్చి వివాహం జరిపించాడు.

క్రీ.శ. 604లో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తినప్పుడు, ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడు రాజ్యవర్ధనుణ్ణి హూణులను ఎదుర్కొనేందుకు పంపాడు. వారిపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ప్రభాకరవర్ధనుడు జబ్బుచేసి మరణించాడని, యశోమతి సతీసహగమనం చేసిందని తెలిసింది. ఈ కారణంగా రాజ్యవర్ధనుడు పట్టాభిషక్తుడయ్యాడు.

ఇదేసమయంలో మాళవ రాజైన దేవగుప్తుడు గౌడ రాజైన శశాంకుడితో కలిసి కనోజ్‌పై దండెత్తి రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించాడు. ఇది తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజ్‌పై దండెత్తి దేవగుప్తుణ్ణి ఓడించాడు. రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే, దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి కుట్రకు బలయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

రాజకీయ పరిస్థితులు: హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను, గొప్ప పరిపాలనదక్షుడిగాను పేరుపొందాడు. హర్ష చరిత్ర, సి-యూ-కి గ్రంథాల్లో హర్షుణ్ణి ఆదర్శవంతమైన ప్రభువుగా వర్ణించారు. హర్షుడు పరిపాలనలో స్వయంగా శ్రద్ధ వహించాడు. రాజ్యంలో స్వయంగా పర్యటించి, ప్రజల కష్టసుఖాలను స్వయంగా విచారించి, తక్షణమే న్యాయం చేకూర్చేవాడు. ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడంలో హర్షుడికి వ్యవధి చాలేది కాదని, సి-యూ-కి గ్రంథంలో వివరంగా ఉంది.

పరిపాలన సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, భుక్తులను విషయాలుగాను, విషయాలను గ్రామాలు గాను విభజించారు. పాలనా విధానంలోను, విద్యా, సాంస్కృతిక రంగాల్లోను హర్షుడు గుప్తయుగం సంప్రదాయాలనే అనుసరించాడు. రాజుకు సలహాలిచ్చి సహాయం చేయడానికి మంత్రిపరిషత్ ఉండేది. ప్రభుత్వ విధానంలో మంత్రి పరిషత్‌కు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారసత్వాన్ని నిర్ణయించడానికి కూడా మంత్రిపరిషత్తుకు అధికారం ఉంది. హర్షచరిత్ర నుంచి, శాసనాల నుంచి అనేకమంది ఉద్యోగుల పేర్లు తెలుస్తున్నాయి. వారిలో మహాసంధి-విగ్రహాధికృత (యుద్ధ వ్యవహారాలు), రాజస్థానీయ (విదేశీ వ్యవహారాలు), మహాబలాధికృత (సేనాపతి), ఆయుక్తక, భోగక (పన్నుల వసూలు), భాండాగారాధికృత (కోశాధికారి) మొదలైనవారు ముఖ్యులు. వీరికి జీతాలకు బదులు భూములను ఇచ్చేవారు. సైనికోద్యోగులకు మాత్రం జీతాలిచ్చేవారు.

భుక్తికి అధికారి ఉపరిక. ఇతనికే ‘భోగపతి’ అనికూడా పేరు ఉంది. విషయానికి అధికారి ‘విషయపతి’. ఇతనిని ‘కుమారామాత్య’ అనికూడా పిలిచేవారు. గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో అక్షపడలిక, కరణిక అనేవారు ఉద్యోగులు. వీరికి గ్రామ వృద్ధుల సహకారం ఉండేది.

ఆదాయం: భూమిశిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదు. పంటలో ఆరోవంతును మాత్రమే పన్నుగా వసూలుచేసేవారు. పన్నులను ధాన్యరూపంగాగాని, ధనరూపంగాగాని చెల్లించవచ్చు. బాటల మీద, రేవుల మీద సుంకాలుండేవి. వస్తువుల అమ్మకాల మీద కూడా పన్నులు ఉండేవి. అయితే ఇవి ఆయా వస్తువుల బరువులనుబట్టి, విలువలనుబట్టి ఉండేవి. ఈ విధంగా వస్తువుల బరువు ఆధారం చేసుకొని వసూలు చేసే అమ్మకం పన్నునే ‘తుల్యమేయ’ అన్నారు. పన్నులను వసూలు చేయడానికి ధ్రువాధికరణ, గౌల్మిక మొదలైన ఉద్యోగులు ఉండేవారు. ప్రభుత్వాదాయాన్ని ముఖ్యంగా నాలుగు పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి: 1. ప్రభుత్వ యంత్రాంగం 2. రాజప్రాసాదం 3. పండిత సత్కారం 4. దానధర్మాలు.

హర్షయుగంలో నేరాలు ఎక్కువని తెలుస్తున్నది. ఆ కారణంగా శిక్షాస్మృతి కఠినతరమైంది. దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష, సాంఘిక నియమావళిని ధిక్కరించిన వారికి, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైన వారికి అంగచ్ఛేద శిక్షగాని లేదా దేశబహిష్కార శిక్షగాని అమలుపరిచేవారు. చిన్నచిన్న నేరాలకు జరిమానాలను విధించేవారు. నేర నిర్ణయానికి ‘దివ్య పరీక్షలుండేవి. రాజ పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో బాధితులను విడిచిపెట్టే ఆచారం ఉండేది.

సైన్యం: హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలుండేవి. క్రమంగా రథానికి ప్రాముఖ్యం తగ్గింది. హర్షుని సైన్యంలో 5000 ఏనుగులు, 2000 అశ్వాలు, 50,000 కాల్బలం ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రశ్న 4. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
జవాబు:
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.

2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.

3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.

4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:

 • భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
 • సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.

ప్రశ్న 5.
మౌర్యుల నుంచి పుష్యభూతి వంశం వరకు జరిగిన కళ, శిల్ప, నిర్మాణ అభివృద్ధిని చర్చించండి.
జవాబు: మౌర్యుల కళలు:
1) స్తంభాలు, శిల్ప నిర్మాణాలు: మౌర్యుల కళకు చాలా అందమైన నిర్మాణాత్మక నిదర్శనాలుగా అశోకుడు నిర్మించిన స్తంభాలు ఉన్నాయి. అశోకుని శాసనాలతో కూడిన స్తంభాలు, స్థూపాలు నగరాల్లో, కూడళ్లలో ప్రతిష్టించాడు. స్తంభాలను రెండు రకాలైన రాతితో నిర్మించారు. అవి:

 1. మధుర ప్రాంతానికి చెందిన ఎరుపు, తెలుపు మచ్చలలో ఉన్న ఇసుక రాయితో కొన్ని నిర్మించబడ్డాయి.
 2. బాగా పొడిచేసిన ఇసుకరాయి, బనారస్ సమీపంలోని చూనార్ వద్ద లభ్యం అవుతుంది. ఎక్కడైతే స్తంభాలు నిర్మిస్తారో అక్కడికి మధుర, చూనార్ నుంచి రాతిని రవాణాచేసి, అక్కడ శిల్పకారులు, తక్షశిల నుంచి వచ్చిన వారు తమ నైపుణ్యంతో చెక్కారు.

2) స్తూపాలు: స్తూపం అనేది ఇటుక లేదా రాయితో నిర్మించిన అర్ధగోళాకార నిర్మాణం. క్రింద గుండ్రని ఆధారపీఠం ఉంటుంది. చుట్టూ గొడుగు ఆకారం సార్వభౌమాధికారానికి గుర్తుగా ఉంటుంది. అశోకుడు భారతదేశంలోను, ఆఫ్ఘనిస్థాన్‌లలో ఎనభై నాలుగువేల స్థూపాలు నిర్మించాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ తన భారత పర్యటనలో వీటిని చాలావరకు చూశాడు. వీటిలో మంచి ఉదాహరణగా చెప్పదగింది భోపాల్ సమీపంలోని సాంచి స్తూపం.

3) గుహలు: మౌర్యుల కట్టడాల్లో ముఖ్యమైనవి గుహలు. గట్టిరాళ్ళు, చీలిన రాళ్ళతో చెక్కబడినవి. గుహల లోపలి గోడలు బాగా నునుపుగా, అద్దంలాగా ఉంటాయి. ఈ అద్భుత కట్టడాలు సన్యాసుల నివాసగృహాలు, అసెంబ్లీ గదుల వలె ఉపయోగపడ్డాయి.

గాంధార, మధుర అమరావతి శిల్ప నిర్మాణాలు:
A. గాంధార శిల్పం:
1) కాలం, ప్రదేశం, పోషకులు: క్రీ.పూ. 1వ శతాబ్దం మధ్యకాలం నుండి క్రీ.శ. 5వ శతాబ్దం చివరి వరకు గాంధార ప్రాంతంలో ఉన్న అద్భుత శిల్పాలను గాంధార శిల్పాలు అంటారు. భారతీయ గ్రీకు శిల్పకళా సమ్మిళిత నిర్మాణంగా చెబుతారు. బాక్ట్రియా గ్రీకు రాజులు, వాయువ్య భారతం నుంచి ఆవిర్భవించాయి. శకులు, కుషాణులు
వీటి పోషకులు.

2) గాంధార శిల్ప లక్షణాలు: గ్రీకు, రోమన్ సంప్రదాయాల్లో బుద్ధుని విగ్రహాలు నిర్మించబడ్డాయి. మానవ శరీరాన్ని చాలా సహజంగా శిల్పులు చెక్కారు. కండరాలు, మీసాలు, ఉంగరాల జుత్తు మొదలైనవి చక్కగా ఉంటాయి.

B. మధుర శిల్పం: జైనమతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో మత భావనలు ప్రదర్శితమయ్యేట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తిభావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్పశైలిలో నిర్మించడం జరిగింది.

C. అమరావతి శిల్పం: అమరావతి స్తూపం దీనికి గొప్ప ఉదాహరణ. సున్నపురాయి సొబగులు, బుద్ధుని జీవితానికి సంబంధించిన చిత్రాలు, స్వతంత్రంగా ఉన్న బుద్ధుని విగ్రహాలు చుట్టూ ప్రదర్శితం అవుతాయి. భారతీయ శిల్పానికి అది గొప్ప మకుటంలాంటిది.

గుప్తుల కాలం నాటి సంస్కృతి:
1) నిర్మాణాలు: భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్ధతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభవానికి ప్రతీకగా నిలిచింది.
a. రాతి గుహలు: అజంతా, ఎల్లోరా, బాగ్ గుహలు రాతి గుహలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
b. దేవాలయాలు: దేవాలయాల్లో ముఖ్యమైనవి.

 1. చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
 2. రెండో అంతస్తు (విమాన) గల చతురస్రాకార చదరపు పైకప్పు దేవాలయం.
 3. ఒక శిఖరంతో చతురస్రాకార దేవాలయం.
 4. దీర్ఘచతురస్రాకార దేవాలయం.
 5. వృత్తాకార దేవాలయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

నచనాకుధార వద్ద గల పార్వతీ దేవాలయం, భూమ్రా వద్ద గల శివాలయం రెండో రకం దేవాలయానికి చెందినవి. మధ్యప్రదేశ్‌లోని దేవఘడ్, భట్టార్గాంవ్ దేవాలయాలు మూడో రకానికి చెందినవి. వీటి ప్రాధాన్యత ఏమిటంటే గర్భగుడిపైన శిఖరం ఉంటుంది. ఇది నగరశిల్ప నిర్మాణశైలి.

గుప్తుల కళ: గుప్తుల కాలం శిల్ప కళారంగం స్వర్ణయుగంగా ప్రసిద్ధిచెందింది. భవనాలు, దేవాలయాలు, స్తంభాలు, స్తూపాలు అనేకం నిర్మించారు. వీరు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల్లో హూణులు, ముస్లిం దాడుల తరువాత మిగిలినవి

 1. ఝాన్సీ జిల్లాలోని దేవఘడ్ వద్దగల దశావతార దేవాలయం.
 2. మధ్యప్రదేశ్‌లోని భూమారా వద్దగల శివాలయం.

పెర్సీ బ్రౌన్ అభిప్రాయంలో భిట్టర్గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. ఇంకా కొన్ని స్తూపాలు, గుహలు, విహారాలు కూడా నిర్మించబడ్డాయి. సారనాధ్ స్తూపం, అజంతా, ఉదయగిరి గుహలు ఆనాటి గొప్ప నిర్మాణాలు. అందమైన బుద్ధుని విగ్రహాలు రాతితో, లోహంతో, బంకమట్టితో చేయడంతోపాటు వివిధ పౌరాణిక బొమ్మలు రాతిపై అందంగా చెక్కారు.

శిల్ప నిర్మాణం:
a. రాతి శిల్పం: సారనాధ్ బుద్ధ విగ్రహం, ఉదయగిరి వద్దగల గుహ ప్రవేశ ద్వారం వద్దగల వరాహ ప్రతిమ చక్కటి ఉదాహరణలు. గ్వాలియర్ వద్ద ఒక నృత్యకారిణితో మహిళా సంగీత విద్వాంసులు చిత్రాలు అద్భుతమైనవి.

b. లోహ నిర్మాణం: 18 అడుగుల ఎత్తైన బుద్ధుని రాగి విగ్రహం, క్రీ.శ. 6వ శతాబ్దంలో బీహారులో నలంద వద్ద నిర్మించారు. సుల్తాన్ గంజ్ లోని బుద్ధ విగ్రహం 7/2 అడుగుల ఎత్తు ఉంది. ఢిల్లీలో మెహరోలి వద్ద ఉన్న ఇనుప స్తంభం గుప్తుల సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక.
కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 6.
గుప్తుల కాలాన్ని ‘స్వర్ణయుగం’ అని ఎందుకు అంటారు ?
జవాబు:
ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగమంటారు. ఈ కాలాన్ని గ్రీస్ చరిత్రలోని పెరిక్లిస్ యుగంతోను, రోమన్ చరిత్రలోని అగస్టస్ యుగంతోను పోలుస్తారు. ఈ యుగంలో భారతదేశం అన్ని రంగాల్లోను అభివృద్ధిని సాధించింది.

రాజకీయ ఐక్యత: గుప్తపాలకులు ఉత్తర భారతదేశాన్ని అనైక్యత నుండి కాపాడి, దేశ సమైక్యతను సాధించారు. మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు మొదలగు పాలకులు తమ దిగ్విజయ యాత్రల ద్వారా దేశ రాజకీయ ఏకీకరణను సాధించారు.

విజ్ఞులైన చక్రవర్తులు: గుప్త చక్రవర్తులు సమర్థులు, పండితులు, శూరులు. వీరిలో సముద్రగుప్తుడు అగ్రగణ్యుడు. ఇతడు అజేయుడైన వీరుడే కాక మంచి కవి కూడా. గుప్త చక్రవర్తులందరూ మత సహనమును పాటించారు. వీరి వ్యక్తిగత ప్రతిభాసంపత్తి గుప్తయుగము స్వర్ణయుగము కావటానికి దోహదపడింది.

ఆర్థికాభివృద్ధి: గుప్తుల సమర్థవంతమైన పాలన వలన రాజ్యంలో సుఖశాంతులు ఏర్పడి ఆర్థికాభివృద్ధి జరిగింది. ప్రజలు సంపన్నులై, సంతోషంగా జీవించేవారని ఫాహియాన్ పేర్కొన్నాడు. శిక్షలు స్వల్పంగా ఉండేవి. బాటసారులకు దొంగల భయం లేకుండా ఉండేది. స్వదేశీ, విదేశీ వాణిజ్యం పురోగమించుటచే దేశసంపద పెరిగింది. పరిశ్రమలు వర్ధిల్లాయి. వ్యవసాయమునకు మంచి ప్రోత్సాహం లభించింది.

మతసామరస్యము:
ఎ) గుప్త చక్రవర్తులు హిందువులవటంతో అశ్వమేథము మొదలగు వైదిక కర్మలను ఆచరించారు. త్రిమూర్తులకు ప్రాధాన్యతనిచ్చారు. గుప్తుల ఇష్టదైవం విష్ణువు కనుక విష్ణుపురాణం, విష్ణుస్మృతి, భాగవతం మున్నగు గ్రంథములు ఆదరింపబడ్డాయి. శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మున్నగు దేవతలను కూడా వీరు పూజించారు. ఈ కాలంలో సగుణోపాసనకు ప్రాముఖ్యం పెరిగింది.

బి) తాము వైదిక మతమును అవలంబించినప్పటికి గుప్త చక్రవర్తులు జైన, బౌద్ధమతముల యెడల అపారమైన సహనాన్ని పాటించారు. ప్రసిద్ధ బౌద్ధపండితుడైన వసుబంధుని సముద్రగుప్తుడు ఆదరించాడు. సింహళ ప్రభువు మేఘవర్ణుడు భారతదేశములో బౌద్ధవిహారము నిర్మించుటకు ఇతడు అనుమతించాడు. కుమారగుప్తుడు నలందా బౌద్ధ విశ్వవిద్యాలయమును స్థాపించాడు. నాటి బౌద్ధ, జైన ప్రతిమలు అసంఖ్యాకముగా లభించుటయే గుప్తుల మత సహనమునకు తార్కాణం. కాలక్రమేణా బౌద్ధమతం క్షీణించింది. మహాయాన బౌద్ధమతము హిందూమత శాఖవలె తోచుటయే ఇందుకు కారణం. జైనమతం మాత్రమే కొన్ని ప్రాంతాలలో కొనసాగింది. గుప్తులు ఉన్నత ఉద్యోగాలలో మత ప్రమేయం లేకుండా బౌద్ధులను, జైనులను నియమించారు.

సారస్వతాభివృద్ధి: గుప్తుల కాలంలో సంస్కృత భాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాదాబ్ ప్రశస్థి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే కవులుండేవారు. వారు 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతల’మనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలంవాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభువర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: విజ్ఞానశాస్త్రంలో కూడా గుప్తుల కాలం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆర్యభట్టు ‘సూర్యసిద్దాంత’మనే గ్రంథాన్ని, వరాహమిహిరుడు ‘బృహత్సంహిత’ అనే గ్రంథాన్ని రచించారు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టి తన పుస్తకం ద్వారా దానిని లోకానికి వెల్లడి చేశాడు. వైద్యశాస్త్రాభివృద్ధికి విశేషంగా కృషిచేసిన శుశ్రుతుడు, వాగ్భటుడు, ధన్వంతరి మొదలైనవారు గుప్తులకాలం వారే.

కళాభివృద్ధి: గుప్తుల కాలంలో కళలు కూడా పరాకాష్టనందుకొన్నాయి. ఈ కాలంలో జరిగిన నిర్మాణాలన్నీ మతం వలన ప్రేరేపితమైనవే. ఉదా: దేవఘర్‌లోని దశావతార దేవాలయం, తిగావా, భూమారా ఆలయాలు, సాంచి, సారనాధ్ లోని బౌద్ధాలయాలు ఈ కాలంలో వాస్తుకళ సాధించిన ప్రగతికి నిదర్శనాలు. గుప్తుల కాలంలో శిల్పకళ కూడా పరిపక్వతను పొందింది. అజంతా గుహల్లోని కొన్ని కుడ్యచిత్రాలు ఈ కాలానికి చెందినవే. లోహాలతో విగ్రహాలను, ఉక్కుతో స్తంభాలను పోతపోయడంలోను, రకరకాల అందమైన నాణాల తయారీలో కూడా గుప్తయుగం తన ప్రత్యేకతను నిలబెట్టుకొంది.

ముగింపు: గుప్తుల యుగం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టయుగం. ఈ విశిష్టత ప్రధానంగా సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలు కళారంగాలలో కనిపిస్తుంది.

7. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు జరిగిన సాహిత్యాభివృద్ధిని తెలపండి. జవాబు: మౌర్యుల కాలంలో విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది. ప్రజలను విద్యావంతులను చేయడానికి పాలకులు చాలా శ్రద్ధ తీసుకొన్నారు. అశోకుని శాసనాలు సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకొనేట్లు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో తక్షశిల అతిప్రాచీన విద్యాలయం. ఇది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సమానంగా విద్యాభ్యాసం చేయగల అత్యంత ప్రామాణిక విశ్వ విద్యాలయం. భారతదేశం నలుమూలల నుంచేగాక, ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు కుల, మత, భేదాలు లేకుండా తక్షశిలకు వచ్చి విద్యాభ్యాసం చేశారు.

సారస్వత కార్యక్రమాలు: సారస్వత సంబంధ ప్రగతిలో మౌర్యుల కాలం ఉన్నత ప్రగతి సాధించింది. అశోకుని శాసనాల ద్వారా రెండు లిపులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి బ్రహ్మ, ఖరోష్ఠి, కౌటిల్యుడు వ్రాసిన ‘అర్థశాస్త్రం’, భద్రుడు వ్రాసిన ‘కల్ప సూత్రాలు’, బౌద్ధ గ్రంథాలు కథావస్తువు, ధర్మ సూత్రాలు, గృహ సూత్రాలు ఈ కాలంలో రచించబడ్డాయి. కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ మౌర్యుల కాలంనాటి ప్రసిద్ధ గ్రంథం. మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఈ గ్రంథంలో ఉంది.

కనిష్కుడు – గొప్ప సాహిత్య పోషకుడు: కనిష్కుడు గొప్ప సాహిత్య, కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుడు ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు వ్రాసిన గ్రంథాలు “బుద్ధచరిత్ర”, “సౌందరానంద కావ్యం”, “సరిపుత్త ప్రకరణ” ముఖ్యమైనవి. నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు తమ గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. కనిష్కుని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత. కనిష్కపురం (కాశ్మీరు), పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు. బుద్ధుడి విగ్రహాలను గాంధార శిల్ప శైలిలో నిర్మింపజేశాడు. గ్రీకు – భారతీయ శిల్పకళా సమ్మేళనమే గాంధార శిల్పం.

గుప్తుల సారస్వతాభివృద్ధి గుప్తుల కాలంలో సంస్కృతభాష పూర్తి వికాసాన్ని పొందింది. సముద్రగుప్తుడు స్వయంగా కవి. “కవిరాజు” అను బిరుదాంకితుడు. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వ్రాశాడు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో “నవరత్నాలు” అనే కవులుండేవారు. 1) కాళిదాసు 2) అమరసింహుడు 3) శంకు 4) ధన్వంతరి 5) క్షపణికుడు 6) భేతాళభట్టు 7) ఘటకర్షకుడు 8) వరరుచి 9) వరాహమిహిరుడు. కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలం’ అనే కావ్యం అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. “మృచ్ఛకటికం” నాటకాన్ని రచించిన శూద్రకుడు ఈ కాలం వాడే. నాడు వసుబంధు, దిజ్ఞాగుడు, బుద్ధపాలితుడు, భావవివేకుడు వంటి బౌద్ధ రచయితలు నిరుపమానమైన రచనలు చేశారు. ఈ రచనల ద్వారా ఆనాటి రాజాస్థాన జీవితం, ప్రభు వర్గాల జీవన విధానం గురించి తెలుస్తుంది.

పుష్యభూతి వంశస్తుల సాంస్కృతిక ప్రగతి: హర్షుడు గొప్ప సాహిత్య, కళా పోషకుడు స్వయంగా పండితుడు. డా॥ రాయిచౌదరి హర్షుని గురించి ఇలా చెప్పాడు. “హర్షుడు గొప్ప సేనాపతి, పరిపాలనాదక్షుడు. మతపోషకుడిగా, సాహిత్య పోషకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. విద్యా బోధనకు, పండితుల పోషణకు ఉదారంగా విరాళాలిచ్చాడు. సంస్కృతంలో హర్షవర్ధనుడు ‘నాగానందం’, ‘రత్నావళి’, ‘ప్రియదర్శిక’ అనే గ్రంథాలు వ్రాశాడు. అతడి ఆస్థానంలో ఉన్న బాణభట్టు గొప్ప పండితుడు. హర్షుడు ఉదార దానాల ద్వారా విద్యావ్యాప్తికి కృషిచేశాడు. నలంద విశ్వవిద్యాలయ పోషణకు వంద గ్రామాలను దానం చేశాడు. చాలామంది విద్యార్థులు సుదూర ప్రాంతాలైన చైనా, టిబెట్, మంగోలియా దేశాల నుంచి విద్యాభ్యాసం కోసం వచ్చారు. ఈ విశ్వవిద్యాలయంలో 1500 మంది అధ్యాపకులు ఉన్నారు. శీలభద్రుడు విశ్వవిద్యాలయ అధ్యక్షులు వేదాలు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, గణితం, జ్యోతిష్యం, సాహిత్యం, నైతిక విలువల బోధన సంస్కృత భాషలో చేశారు. హుయన్ త్సాంగ్ ఈ విశ్వవిద్యాలయ విద్యార్థి, ధర్మపాలుడు, చంద్రపాలుడు, గుణమతి, స్త్రీర్మతి, ధ్యాన్ చంద్ర, కమల్ శీల మొదలైనవారు ఆచార్యులు. డా॥ R.C. మజుందార్ అభిప్రాయంలో “హర్షుడు యుద్ధం, శాంతి, కళలలో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడు. కలం, కత్తి సమానంగా వాడగల నిపుణుడు, మేధావి అతడు”.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

లఘు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
మౌర్యులకు చెందిన ప్రధాన చారిత్రక ఆధారాలు తెలపండి.
జవాబు:
భారతదేశ చరిత్రలో మౌర్య వంశానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ వంశంవారు ప్రప్రథమంగా సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి దేశ సమైక్యతను చాలావరకు సాధించారు. తత్ఫలితంగా మౌర్య సామ్రాజ్య స్థాపనతో ఉత్తర భారతదేశ చరిత్రలో సామ్రాజ్యాల యుగం ప్రారంభమైనది. తమిళ, కేరళ ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా వీరి సార్వభౌమాధిపత్యం క్రిందికి రావడం గమనించదగ్గ విషయం. వీరు సమర్థవంతమైన పాలనావ్యవస్థను రూపొందించి ప్రజారంజకంగా పాలించారు. విశ్వమానవ కళ్యాణం, పరమత సహనం, శాంతి, అహింస, సర్వ మానవ సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త లక్ష్యసాధనకు చివరి వరకు అహోరాత్రులు కృషిచేసిన విశ్వవిఖ్యాతులైన సామ్రాట్టులో అగ్రగణ్యుడైన అశోక చక్రవర్తి ఈ వంశానికి చెందినవాడు. ఇటువంటి మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు ఈ క్రింది చారిత్రక ఆధారాలు ప్రధానమైనవి. అవి:

మౌర్యుల చరిత్ర అధ్యయనానికి ఉపకరించే ప్రధానమైన ఆధారాలు. శిలలపై రాతిస్తంభాలపై కనిపించే అశోకుడి శాసనాలు, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గ్రీకు రచయితల రచనలు. అంతేగాక పురాణాలు బౌద్ధమత గ్రంథాలు, ‘ముద్రారాక్షసం’ అనే నాటకం కూడా వీరి చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 2.
చంద్రగుప్త మౌర్యుడు మొదటి జాతీయ పాలకుడు – చర్చించండి.
జవాబు:
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు చాణిక్యుని నేతృత్వంలో సకల విద్యాపారంగతుడై ఉత్తమ సైనికుడిగా రూపుదిద్దుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు రెండు ఘనకార్యాలు సాధించాడు. మొదటిది వాయువ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీనం చేసుకోవటం కాగా, నందరాజులను ఓడించి మగధను ఆక్రమించటం రెండవది. అలెగ్జాండర్ భారతదేశమును వదిలివెళ్ళిన పిమ్మట చాణక్య, చంద్రగుప్త మౌర్యుడు మొదటగా పంజాబ్ ప్రాంతంలో ధైర్యసాహసాలకు పేరుబడ్డ జాతులవారిని చేరదీసి ఒక శక్తివంతమైన సైన్యమును సమకూర్చుకున్నారు. ఈ సైన్యం సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ప్రథమంగా గ్రీకులను పారద్రోలి పంజాబును విదేశీపాలన నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత నందరాజు నిరంకుశత్వాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని అధిష్టించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. జైన, బౌద్ధ ఐతిహ్యాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రెండుసార్లు మగధపై దండయాత్ర జరిపాడని, రెండవ దండయాత్రలో విజయం సాధించి సామ్రాజ్య స్థాపనగావించాడని తెలుస్తున్నది. క్రీ.పూ. 305లో భారతదేశముపై దండెత్తి వచ్చిన గ్రీకు సేనాని సెల్యూకస్ నికటార్ను ఓడించి అతని వద్ద నుండి కాబూల్, కాందహార్, హీరట్, బెలూచిస్థాన్లను వశపరచుకొన్నాడు. చంద్రగుప్త మౌర్యుడు 6 లక్షల సైన్యంతో భారతదేశమంతటిని జయించాడని ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఈ దండయాత్రల వలన చంద్రగుప్త మౌర్యుని మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పున బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా వరకు విస్తరించింది.

భారతదేశంలోని అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోనికి తీసుకొనివచ్చిన ఘనత చంద్రగుప్తు మౌర్యునికే దక్కుతుంది. అందువలన భారతదేశ చరిత్రలో చంద్రగుప్తమౌర్యుని జాతీయ పాలకుడుగా భావిస్తారు.

ప్రశ్న 3.
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది.

తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు.

కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు.

సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి.

బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు.

అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు.

అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.

ప్రశ్న 4.
అశోకుని ధర్మము అంటే ఏమిటి ?
జవాబు:
అశోకుని కాలంలో వివిధ మతశాఖలు సామాజిక ఉద్రిక్తతను సృష్టించాయి. నగరాల్లో వ్యాపారవర్గాలు బలపడటంవల్ల నూతన సామాజిక స్థితి ఏర్పడింది. సామ్రాజ్య సువిశాలత్వం కూడా కొన్ని సమస్యలను సృష్టించింది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమైక్యతను సాధించటానికి ఒక క్రొత్త విధానం కావలసి వచ్చింది. అందువలననే అశోకుడు తన ధర్మాన్ని ప్రతిపాదించాడు.

అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అతనిలో కనిపిస్తాయి. బౌద్ధధర్మం, అశోకుని ధర్మం ఒకటి కాదు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో అశోకుడు తన ధర్మాన్ని శిలాశాసనాల్లో పొందుపరిచాడు. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దం పడుతుంది. అశోకుని ధర్మం ముఖ్యంగా మానవుల ప్రవర్తన, నీతికి సంబంధించిన నియమావళికి వర్తిస్తుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి:

 1. జీవహింస చేయరాదు.
 2. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి.
 3. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి.
 4. బానిసలు, సేవకులపట్ల దయతో మెలగాలి.
 5. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చేయాలి.
 6. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారా తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి.

ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుడు కర్మకాండను, మూఢాచారాలను ఖండించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో కుషాణుల కాలానికి గల ప్రాధాన్యత తెలపండి.
జవాబు:
కనిష్కుడి ఆస్థానం ఎంతోమంది పండితులకు ఆశ్రయం కల్పించింది. పార్శ్వుడు, వసుమిత్రుడిలాంటి బౌద్ధ పండితులు నాల్గవ బౌద్ధసంగీతిని నిర్వహించారు. ‘బుద్ధచరిత్ర’, ‘సౌందరనందం’ అనే గ్రంథాలు వ్రాసిన అశ్వఘోషుడు గొప్ప తత్వవేత్త, కవి. మహాయాన మతాన్ని ప్రచారం చేసిన నాగార్జునుడు కూడా కనిష్కుని కాలంవాడే. వీరిరువురు కనిష్కుని ఆదరణ అందుకొన్నారు. కనిష్కుడు మత గ్రంథాలనే కాకుండా లౌకిక గ్రంథాలు, శాస్త్రాలను కూడా ఆదరించాడు.

మాతంగుడనే రాజకీయ దురంధరుడు కనిష్కుడి అమాత్యుడు. ‘చరక సంహిత’ను రచించిన చరకుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు. ఈ చరక సంహితలో రోగనిర్ధారణ, రకరకాల రోగాలు, అవి రావడానికి కారణాలు, రక్తప్రసరణ-పరీక్ష, మానవ శరీరశాస్త్రం, పిండోత్పత్తి (embryology) మొదలైనవి విపులీకరించడం వల్ల పారశీకం మొదలైన భాషల్లోకి ఈ గ్రంథం అనువాదాలు వెలువడ్డాయి.

కళాసేవ: అశోకుడిలాగా ఎన్నో శిల్పాలు చెక్కించడానికి, కట్టడాలు నిర్మించడానికి, చిత్రాలు గీయించడానికి కనిష్కుడు పూనుకొన్నాడు. ‘కనిష్కపురం’ లోని 13 అంతస్తుల స్తంభం (Tower), మధురలోని శిల్పాలు, ‘పురుషపురం’ లోని బౌద్ధవిహారం, స్తూపం ఎంతో ప్రసిద్ధిచెందాయి. రాజధాని పురుషపురంలో 400 అడుగుల ఎత్తు గోపురం నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించాడు. గాంధార శిల్పం ఇతని కాలంలోనే ఉచ్ఛస్థితికి చేరుకుంది. శిల్పాలకు మధుర కేంద్రమయింది. అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు మలచబడ్డాయి.

కనిష్కుడు విదేశీయుడైనా 41 సంవత్సరాల సుదీర్ఘపాలనలో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఉత్తమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని తర్వాత వచ్చిన రాజుల (హనిష్కుడు, వసిష్కుడు) బలహీనత వల్ల, కుషాణుల రాజ్యం అంతరించింది.

ప్రశ్న 6.
గుప్తుల కాలానికి సంబంధించిన ప్రధాన చారిత్రక ఆధారాలను తెలపండి.
జవాబు:
కుషాణ సామ్రాజ్య పతనానంతరం భారతదేశంలో, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో, క్రీ.శ. 4వ శతాబ్ది వరకు ఏ రాజ వంశము సామ్రాజ్యాధికారాన్ని నెలకొల్పలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది ప్రథమార్థంలో గుప్త సామ్రాజ్య స్థాపన మగధలో జరిగింది. అంతవరకు, ఈ ప్రాంతమంతటా చిన్నచిన్న రాజ్యాల వ్యవస్థ కొనసాగింది. ఈ చిన్నచిన్న రాజ్యాల్లో రాజకీయ అస్థిరత్వం నెలకొనడంతో రాజకీయ ఆధిక్యత కోసం ఇక్కడి రాజులు తరచు యుద్ధాలు చేశారు. ఇటువంటి రాజకీయ కల్లోల పరిస్థితుల్లో, రాజకీయంగా, సాంస్కృతికంగా, దేశాన్ని సమైక్యపరిచి అన్నివిధాలా స్వర్ణయుగాన్ని సృష్టించడానికి కృషి చేసినవారు గుప్తులు. వీరు క్రీ.శ. 4వ శతాబ్ది నుంచి క్రీ.శ. 6వ శతాబ్ది మధ్య వరకు, భారతదేశాన్ని
పరిపాలించారు.

గుప్తుల కాలంనాటి ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు ఆధారాలు అనేకం ఉన్నాయి. ఆ ఆధారాలను మూడు విభాగాలు చేయవచ్చు. అవి 1. గ్రంథాలు 2. శాసనాలు 3. జ్ఞాపకచిహ్నాలు, ముద్రలు, కళాఖండాలు, చిత్రాలు, నాణాలు మొదలైనవి.

గ్రంథాల్లో ముఖ్యమైనవి, విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’, ‘దేవి చంద్రగుప్తం’ మొదలైన స్వదేశీ గ్రంథాలు, హుయాన్ త్సాంగ్, ఫాహియాన్ అనే విదేశీ రాయబారులు రచించిన సి-యూ-కి, షో-కువో-కి అనేవి.

శాసనాల్లో ముఖ్యమైనవి రెండో చంద్రగుప్తుడి కాలంనాటి ఉదయగిరి గుహల్లోని శాసనాలు, మధుర శిలా శాసనం, సాంచి శిలా శాసనం మొదలైనవి. ఇవి ఆనాటి ప్రభుత్వ విధానాన్ని, మత విధానాన్ని తెలియజేస్తాయి. జునాగఢ్ శాసనం, ఇండోర్ రాగి రేకు శాసనం, స్కంధగుప్తుని గురించి తెలుపుతున్నాయి.

ఇంకా గుప్తుల కాలంనాటి జ్ఞాపక చిహ్నాలైన అజంతా, ఎల్లోరా గుహల్లోని చిత్రలేఖనం, వారు ప్రవేశపెట్టిన వివిధ రకాలైన నాణాలు వారి ఆర్థిక, సాంస్కృతిక రంగాల ప్రగతిని తెలియజేస్తున్నాయి.

ప్రశ్న 7.
సముద్రగుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
జవాబు:
గుప్తచక్రవర్తులలో సముద్రగుప్తుడు (క్రీ.శ. 335-380) అగ్రగణ్యుడు. సముద్రగుప్తుని విజయాలను, వ్యక్తిత్వాన్ని అతడు జారీచేసిన శాసనాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తొలి జీవితం: సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు, కుమారదేవీలకు జన్మించాడు. మొదటి చంద్రగుప్తుడు తన వారసుడిగా సముద్రగుప్తుడిని నియమించాడు. కాని సముద్రగుప్తుడు జ్యేష్ఠుడు కానందున వారసత్వయుద్ధం జరిగిందని, అందులో తన అన్న “కచుని” సముద్రగుప్తుడు ఓడించాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. కాని “కచుడు” అనునది సముద్రగుప్తునికి గల మరియొక పేరని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

సైనిక విజయాలు: సముద్రగుప్తుడు గొప్ప విజేత. విదేశీదాస్యం నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించి భారతదేశమంతటిని ఒకే పాలన క్రిందకు తీసుకురావాలని ఇతడు ఆశించాడు. ఇతని ఆస్థాన పండితుడు, సేనాపతి అయిన హరిసేనుడు అలహాబాద్ లో అశోక స్తంభం మీద వ్రాయించిన “అలహాబాద్ ప్రశస్థి” ద్వారా ఇతని సైనిక విజయాలను తెలుసుకోవచ్చు. దీని ప్రకారం సముద్రగుప్తుని విజయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: 1) మొదటి ఆర్యావర్త విజయాలు 2) దక్షిణభారత విజయాలు 3) రెండో ఆర్యావర్త విజయాలు.

1) మొదటి ఆర్యావర్త విజయాలు: సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే సముద్రగుప్తుడు తన అధికారాన్ని ధిక్కరించిన ఉత్తర భారతంలోని రాజులను జయించి పాటలీపుత్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో సముద్రగుప్తుడు ఓడించిన రాజులు: అహిచ్ఛత్రాన్ని పాలిస్తున్న అచ్యుతుడు, గ్వాలియర్ సమీపంలో పద్మావతీపురాన్ని పాలిస్తున్న నాగసేనుడు, మధురాపురాధీశుడైన గణపతి నాగుడు, ఇంకా చంద్రవర్మ, రుద్రదేవ వంటి మొత్తం 9 మంది రాజులను అణచి సముద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇతని పరాక్రమాన్ని గుర్తించి సరిహద్దు రాజ్యాలైన సమతట, కామరూప, నేపాల్, దావక, కర్రిపుర మొదలైన రాజ్యపాలకులు సముద్రగుప్తుడితో మైత్రి చేసుకున్నారు. మాళవ, యౌధేయ, అభీర వంటి గణరాజ్యాలు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించాయి. ఈ విజయాల ఫలితంగా ఇతని సామ్రాజ్యం హిమాలయాల నుంచి ‘భిల్సా’ వరకు, పంజాబ్ నుంచి బెంగాల్ వరకు విస్తరించింది.

2) దక్షిణ భారత విజయాలు: మొదటి ఆర్యావర్త యుద్ధాల తరువాత సముద్రగుప్తుడు దక్షిణభారతంపై దండెత్తాడు. ఈ దండయాత్రలో సముద్రగుప్తుడు 12 మంది రాజ్యపాలకులను ఓడించి వారి రాజ్యాలను తిరిగి వారికే అప్పగించాడు. ఆ పాలకులు 1) కోసల పాలకుడైన మహేంద్రరాజు 2) మహాకాంతార పాలకుడైన వ్యాఘ్రరాజు 3) ఏరండపల్లి దమనుడు 4) పిష్టపుర రాజు మహేంద్రుడు 5) కొత్తూరును పాలించే స్వామిదత్తుడు 6) దేవరాష్ట్ర పాలకుడైన కుబేరుడు 7) వేంగి పాలకుడైన హస్తివర్మ 8) పాలక్క రాజైన ఉగ్రసేనుడు 9) కేరళ రాజ్యాన్ని పాలించే మంత్రరాజు 10) కుశస్థలపురం పాలకుడు ధనంజయుడు11) అవముక్త పాలకుడు నీలరాజు 12) కంచిని పాలించిన విష్ణుగోపుడు.
సముద్రగుప్తుని ఈ దండయాత్ర మార్గాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు వున్నాయి.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

3) రెండో ఆర్యావర్త విజయాలు: సముద్రగుప్తుడు దక్షిణ భారత విజయాల్లో మునిగివున్న సమయంలో ఉత్తరభారతంలోని రాజులు వాకాటక రాజు రుద్రసేనుని నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. సముద్రగుప్తుడు వారిని “కౌశాంబి” యుద్ధంలో ఓడించి, అశ్వమేధయాగాన్ని చేసి సామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయాలను గుర్తించి మధ్యభారతంలోని అనేక అటవీ రాజ్యాల అధిపతులు ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఇట్టి విజయ పరంపరల వలన చరిత్రకారులు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు.

ఇతర దేశాలతో సంబంధాలు: విజేతగా సముద్రగుప్తుడి కీర్తి, ప్రతిష్టలు విదేశాలకు కూడా వ్యాపించాయి. అనేకమంది విదేశీరాజులు ఇతనితో దౌత్య సంబంధాలనేర్పరుచుకొన్నారు. సింహళరాజైన మేఘవర్ణుడు క్రీ.శ. 351లో ఇతని ఆస్థానానికి రాయబారులను, కానుకలను పంపడమే కాకుండా తన దేశం నుంచి భారతదేశం వచ్చే బౌద్ధ యాత్రికుల కోసం బుద్ధగయ సమీపంలో ఒక విహారాన్ని నిర్మింపజేశాడు.

ప్రశ్న 8.
గుప్తుల పాలనలో సమాజం, ఆర్థిక స్థితి, మతం వివరించండి.
జవాబు:
సమాజం: సామాజిక ఏర్పాటుకు కుల వ్యవస్థ ఆధారం. సమాజం నాలుగు వర్గాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవించబడ్డారు. చక్రవర్తులు కూడా వీరిని సత్కరించేవారు. అనేక విషయాల్లో పురోహితుడే చక్రవర్తికి ప్రధాన సలహాదారుడు. బ్రాహ్మణుల తరువాత క్షత్రియులు, వైశ్యులు గౌరవ స్థానాల్లో ఉన్నారు. ‘చండాలుర’ గురించి ఫాహియాన్ తెలిపాడు. సాధారణంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు, కసాయి వారు అయి ఉండవచ్చని తెలుస్తుంది.

స్త్రీ స్థానం: కొన్ని అంశాల్లో స్త్రీ హోదా గుప్తుల కాలంనాటి సమాజంలో తగ్గింది. బాల్య వివాహాలు విస్తారంగా జరిగేవి. ‘సతీసహగమనం’ క్రమంగా వాడుకలోకి వచ్చింది.

ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ రాజ్య భాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.

పెద్ద కేంద్ర సైన్యం, అధికార వర్గం లేకపోవడం: మౌర్యులకు భిన్నంగా, గుప్తులకు పెద్ద వ్యవస్థీకృత సైన్యం లేదు. భూస్వాములు పంపే సైన్యమే గుప్తుల సైన్యంలో ప్రధాన భాగం. అదేవిధంగా అధికార వర్గం కూడా లేదు. వీటివల్ల పాలనా యంత్రాంగంపై చక్రవర్తి నియంత్రణ తగ్గింది.

భూస్వామ్య అంశాల అభివృద్ధి:

 • భూదానాలు చేయడం: పురోహితులకు, దేవాలయ భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
 • సేద్యపు బానిసత్వం: భూదానాలు, భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు దానితోపాటు సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.

ప్రశ్న 9.
హర్షవర్ధుని గొప్పతనాన్ని అంచనా వేయండి.
జవాబు:
గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ఒకటి స్థానేశ్వర రాజ్యం. స్థానేశ్వర పాలకులలో హర్షుడు ప్రముఖుడు. (క్రీ.శ. 606-647). హర్షుడు తన జైత్రయాత్ర ద్వారా ఉత్తర భారత రాజకీయ ఏకీకరణను సాధించాడు.

చారిత్రక ఆధారాలు: హర్షుని చరిత్రను తెలుసుకోవటానికి బాణుడు రచించిన హర్షచరిత్ర, హుయాన్ త్సాంగ్ రచించిన సి-యూ-కి, హర్షుడు వేయించిన బన్సీభేరా, మధుబన్, సోనేపట్ శాసనాలు ముఖ్య ఆధారాలు. హర్షుడు రచించిన నాటకాలు కూడా నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తాయి.

తొలి జీవితం: హర్షుడు పుష్యభూతి వంశస్థుడు. ఇతడి తండ్రి ప్రభాకర వర్ధనుడు. ప్రభాకర వర్థనుడి మరణానంతరం హర్షుని సోదరుడు రాజ్యవర్ధనుడు రాజ్యానికి వచ్చాడు. అయితే గౌడ శశాంకుని కుట్రకు రాజ్యవర్ధనుడు బలైపోయాడు. అంతట క్రీ.శ. 606 లో హర్షుడు తన 16వ ఏట స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని ‘రాజపుత్ర’ అను బిరుదుతో అధిష్టించాడు.

తొలి ఘనకార్యాలు: సింహాసనానికి వచ్చిన వెంటనే హర్షుడు కామరూప దేశాధిపతియైన భాస్కరవర్మతో మైత్రిని పొందాడు. తరువాత మాళవ, గౌడాధీశులను ఓడించాడు. వింధ్య అడవులకు పారిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన సోదరి రాజ్యశ్రీని రక్షించాడు. అంతట కనోజ్ మంత్రి పరిషత్ విన్నపం మేరకు స్థానేశ్వరం, కనోజ్ రాజ్యాలను కలిపి “శ్రీలాదిత్య” అను బిరుదుతో పరిపాలనను ప్రారంభించాడు. తన రాజధానిని స్థానేశ్వరం నుంచి కనోజ్‌కు మార్చాడు. క్రీ.శ. 606 నుండి 647 వరకు హర్షుడు రాజ్యశ్రీతో కలిసి పాలించినట్లు తెలుస్తున్నది.

జైత్రయాత్రలు: శూరుడైన హర్షుడు విశాల సైన్యాన్ని సమకూర్చుకొని 6 సంవత్సరాలపాటు నిరంతరంగా దిగ్విజయ యాత్ర సాగించి సామ్రాజ్యాన్ని విస్తరింపచేసినట్లు హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు. మొదట గృహవర్మ మరణానికి కారకుడైన మాళవరాజు దేవగుప్తుడిని తొలగించి, అతని తమ్ముడు మాధవగుప్తుడికి సింహాసనాన్ని అప్పగించి తనకు సామంతుడిగా చేసుకున్నాడు. వల్లభిరాజు ధృవసేనుడిని ఓడించి అతనికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 637లో తూర్పు ప్రాంతానికి దండయాత్రలకు వెళ్ళి వంగ, మగధ, గంజామ్ (ఒరిస్సా) ప్రాంతాలను పాలిస్తున్న శశాంకుడిని ఓడించాడు.

పులకేశి చేతిలో ఓటమి: ఉత్తరాపథంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని దక్షిణాపథాన్ని కూడా జయించాలని హర్షుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనతో దక్షిణాపథంపై దండయాత్రకు బయలుదేరాడు. కాని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి హర్షుని నర్మదానదీ తీరప్రాంతంలో ఓడించి వెనుకకు మళ్ళించాడు. నర్మదానది ఇరువురి రాజ్యాలకు మధ్య సరిహద్దు అయింది. ఈ విషయాన్ని రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో వివరించాడు.

రాజ్య విస్తీర్ణం: హర్షుని సామ్రాజ్యంలో తూర్పు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గంజామ్ ప్రాంతాలు మాత్రమే చేరాయి. రెండవ పులకేశి తన ఐహోల్ శాసనంలో హర్షుని “సకలోత్తరపధేశ్వరుని”గా వర్ణించటాన్ని బట్టి ఉత్తర భారతదేశమంతా హర్షుని ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

పాలన: హర్షుడు సమర్ధవంతుడైన పాలకుడు. ప్రజాసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. ప్రజల స్థితిగతులను కనుగొనుటకు అతడు విస్తృతంగా పర్యటించేవాడు. హర్షుడు విరామమెరుగక రాజ్యభారాన్ని నిర్వహించేవాడని హుయాన్ త్సాంగ్ వ్రాశాడు. హర్షుడు తన సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, విషయాలుగాను, గ్రామాలుగాను విభజించాడు. పండిన పంటలో 6వ వంతును మాత్రమే పన్నుగా వసూలు చేసేవాడు. హర్షుని శిక్షాస్మృతి కఠినంగా ఉండేది. నేరములు అధికంగా ఉండేవి. హర్షుని సైన్యంలో 5వేల ఏనుగులు, 2వేల గుర్రాలు, 50వేల కాల్బలము ఉన్నట్లు తెలుస్తున్నది.

దాన ధర్మాలు: బీదలకు దానధర్మములు చేయుటలో హర్షుడు అశోకుని అనుసరించాడు. రోగులకు, బాటసారులకు అనేక సౌకర్యములు కల్పించాడు. ప్రయాగలో మహామోక్షపరిషత్తును ఐదేండ్లకొకసారి జరుపుచూ, సర్వస్వదానము అను మహావ్రతమును చేశాడు. అందు మొదటిరోజు బుద్ధుని, రెండవ రోజు సూర్యుని, మూడవ రోజు శివుని పూజించి 5 లక్షల జనులకు దానధర్మములు చేశాడు.

విద్యా, సారస్వత పోషణ: హర్షుడు విద్యా, సారస్వతాలను కూడా ఆదరించాడు. నలందా విశ్వవిధ్యాలయానికి 100 గ్రామాలను దానం చేశాడు. పండిత పోషణకు తన ఆదాయంలో 4వ వంతును వినియోగించాడు. హర్షుడు స్వయంగా కవి. ఇతడు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే నాటకాలను రచించాడు. ఇతని ఆస్థాన కవి బాణుడు “హర్షచరిత్ర”, “కాదంబరి” అను వచన కావ్యాలను రచించాడు. సుభాషిత శతకాన్ని రచించిన భర్తృహరి, సూర్య శతకాన్ని రచించిన మయూరుడు, మతంగ దివాకరుడు హర్షుని ఆస్థానంలోనే వారే.

ఘనత: ప్రాచీన చరిత్రలో అగ్రగణ్యులైన చక్రవర్తులలో హర్షుడు ఒకడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విజేతగా, సామ్రాజ్య నిర్మాతగా, ధర్మతత్పరుడిగా, ఉదార పాలకుడిగా, సాహితీవేత్తగా, విద్యాభిమానిగా హర్షుడు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఇతనిలో అశోకుడు, సముద్రగుప్తుడు, భోజరాజువంటి ప్రముఖుల విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయి. గుప్త యుగానికి, రసపుత్ర యుగానికి మధ్య వారధిగా హర్షుని చరిత్రకారులు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’
జవాబు:
అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. మౌర్యుల చరిత్రను తెలుసుకొనుటకు గల ఆధారములలో అర్థశాస్త్రము ప్రముఖమైనది. అర్థశాస్త్రమనగా ఆర్థికశాస్త్రము కాదు. ఇది రాజనీతి శాస్త్రము. ఇందు చక్రవర్తి యొక్క విధులు, సైనిక విధానము, దండనీతి మొదలగు అంశములు పేర్కొనబడెను. అయితే రాజనీతి అంశములతోపాటు ఆర్థిక విషయములు కూడా పేర్కొనబడెను. అర్థశాస్త్రమందు కౌటిల్యుడు “రాజ్యమును సంపాదించుటకు కుటిల మార్గములను” కూడా పేర్కొనెను. అటులనే చెరువులో గల చేపలు నీరు త్రాగకుండా ఎట్లు ఉండలేవో, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు కూడా తీసుకోకుండా ఉండలేరు అని పేర్కొనెను.

ప్రశ్న 2.
ఇండికా
జవాబు:
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాజైన సెల్యూకస్ రాయబారి మెగస్తనీస్. భారతదేశంలో ఉన్నంతకాలం తాను చూచిన, విన్న విషయాలను ఇండికా అను పేరుతో గ్రంథస్తం చేశాడు. అయితే ఇండికాలోని కొన్ని భాగాలు మాత్రమే నేడు లభ్యమౌతున్నాయి. ఈ గ్రంథం వల్ల నాటి పాలనావిధానం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్నాయి. భారతదేశంలో బానిసవ్యవస్థ లేదని, భారతీయులలో 7 కులాలవారున్నారని మెగస్తనీస్ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. పాటలీపుత్ర నగరపాలన గురించి, సైనిక మండలుల గురించి మెగస్తనీస్ సవివరంగా వివరించాడు. ఇతడు విదేశీయుడు. ఇతనికి భారతీయ సంస్కృతీ పరిజ్ఞానం పూజ్యం కాబట్టి ఇతని రచనను స్వవిమర్శతో స్వీకరించవలసి ఉంటుంది.

ప్రశ్న 3.
ధమ్మ మహామాత్రులు
జవాబు:
అశోకుడు నూతన నైతిక నియమావళిని ప్రజలముందుంచాడు. ప్రజల నైతికతను అభివృద్ధి చేయాలనుకొన్నాడు. తన మతాన్ని వ్యాప్తిచేయడానికి ‘ధమ్మ మహామాత్రులు’ అనే ఉద్యోగులను నియమించాడు. 13వ శిలాశాసనంలో అశోకుడు ధమ్మ మహామాత్రుల నియామకం గురించి ఇలా అన్నాడు. “అన్ని మత శాఖలకు ధమ్మ మహామాత్రులను నియమించాను వారు అన్ని ధార్మిక ప్రదేశాలను పరిరక్షిస్తూ ఉంటారు. ప్రజలకు తన మత నైతిక నియమావళిని బోధించడమే వారి విధి. మానవుల సంక్షేమం, వివిధ మత, ధార్మిక కార్యక్రమాల అమలుకు కృషిచేయాలి”. 6వ శిలాశాసనంలో ‘ధమ్మ మహామాత్రుల పనితీరుపై పర్యవేక్షణ కోసం తగిన ఏర్పాట్లు అశోకుడు చేశాడు’ అని పేర్కొనబడింది.

ప్రశ్న 4.
కళింగ యుద్ధం
జవాబు:
కళింగ ప్రాభవం తగ్గించడానికి అశోకుడు కళింగ యుద్ధం (క్రీ.పూ. 261) చేశాడు. అనేకమంది చంపబడటం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. చివరికి అశోకుడు యుద్ధంలో గెలిచాడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని 13వ శాసనంలో ఉన్నాయి. ఇది చాలా ప్రాధాన్యత ఉన్న యుద్ధంగా గుర్తించబడింది. ఎందుకంటే ఈ యుద్ధానంతరం అశోకుడు ధర్మ అశోకుడిగా గుర్తించబడ్డాడు.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 5.
సారనాధ్
జవాబు:
అశోకుడు నిర్మించిన స్తంభాలలో మిక్కిలి ప్రఖ్యాతి గాంచినది సారనాధ్ స్తంభం. సారనాధ్ స్తంభంపై గంట, ఫలక, నాలుగు దిక్కులను తెలిపే నాలుగు జంతువులు (ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం) ఉన్నాయి. జంతువుల మధ్య ధర్మచక్రం ఉంది. వీటికిపైన నాలుగు సింహాల ప్రతిమలు ఉన్నాయి. అవి నాలుగు దిక్కులకు అభిముఖంగా, తమ వెనుక భాగాలు ఒకదానితో ఒకటి తాకుతున్నట్లుగా నిలిచి ఉన్నాయి. స్తంభపీఠం అంచులచుట్టూ మృగాలు, పుష్పాలు, పక్షులు మనోహరంగా చిత్రించబడి ఉన్నాయి. నాలుగు సింహాలలో మూడు మాత్రమే మనకు కనిపిస్తాయి. సింహాల క్రింద భాగంలో ‘సత్యమేవజయతే’ (సత్యమే జయిస్తుంది) అని వ్రాసి ఉంది.’ ఈ సూక్తిని మండకోపనిషత్ నుండి గ్రహించారు. ఈ సారనాధ్ సింహాల కిరీటాన్ని భారత ప్రభుత్వం అధికార చిహ్నంగా స్వీకరించింది.

ప్రశ్న 6.
ఫాహియాన్
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్. బుద్ధుడు జన్మించిన పవిత్రభూమిని చూడాలని, బుద్ధుని ధాతువులను, బౌద్ధ గ్రంథాలను సేకరించాలని ఇతడు భారతదేశం వచ్చాడు. గుప్తుల కాలంనాటి భారతదేశ స్థితిగతులను తన పో-కూ-వో-కి అను గ్రంథంలో వివరించాడు.

ప్రశ్న 7.
అలహాబాద్ స్తంభ శాసనము
జవాబు:
అలహాబాద్ ప్రశస్థిని సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు సంస్కృతభాషలో వ్రాయించాడు. ఇది ఒక శాసనం రూపంలో ఉంది. దీనిలో సముద్రగుప్తుని దిగ్విజయాలు వివరించబడ్డాయి. దీనిని కావ్యశైలిలో రచించారు. ఇది అలహాబాద్ లోని అశోక స్తంభంపై వ్రాయబడి ఉంది.

ప్రశ్న 8.
కాళిదాసు
జవాబు:
గుప్త చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానమును అలంకరించిన నవరత్నములు అను కవులలో అగ్రగణ్యుడు కాళిదాసు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము, కుమార సంభవము, విక్రమోర్వశీయము, మేఘసందేశము, మాళవికాగ్నిమిత్రము మొదలగు ప్రముఖ గ్రంథములు రచించాడు.

ప్రశ్న 9.
అజంతా గుహలు
జవాబు:
భారతీయ నిర్మాణాలలో గుప్తుల కాలానికి ప్రత్యేక స్థానం ఉంది. నగర, ద్రావిడ పద్దతుల్లో గుప్తుల కళ భారతీయ నిర్మాణ చరిత్ర వైభోగానికి ప్రతీకగా నిలిచిన అజంతా గుహలు ముఖ్యమైనవి. ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో కలవు. ఈ గుహల నిర్మాణం ఆనాటి కళానైపుణ్యమునకు నిదర్శనం.

ప్రశ్న 10.
కనిష్కుడు
జవాబు:
కనిష్కుడు గొప్ప సాహిత్య కళాపోషకుడు. అతడి ఆస్థానంలో చాలామంది పండితులు పోషణను అందుకొన్నారు. అశ్వఘోషుడు, నాగార్జునుడు, వసుమిత్రుడు, చరకుడు సుప్రసిద్ధ బౌద్ధ పండితులు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న అశ్వఘోషుడు రాసిన గ్రంథాలు ‘బుద్ధ చరిత్ర’, ‘సౌందరానంద కావ్యం’ ముఖ్యమైనవి. ఇతని కాలంలో సంస్కృత భాష విరాజిల్లింది. కనిష్కుడు గొప్ప భవన నిర్మాత, కనిష్కపురం, పురుషపురం అనే రెండు నగరాలను నిర్మించాడు.

ప్రశ్న 11.
గాంధార శిల్పం
జవాబు:
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.

ప్రశ్న 12.
మధుర కళ
జవాబు:
జైన మతం స్ఫూర్తితో ధ్యానంలో ఉన్న దిగంబర తీర్థంకరుల శిల్పాలను మధుర శిల్పులు నిర్మించారు. మొదట్లో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు నిర్మించారు. తర్వాత కాలంలో, మత భావనలు ప్రదర్శితమయ్యేటట్లు నిర్మించారు. బుద్ధుని ప్రతిమలు బిగుతు కండరాలు, బలమైన శరీరంతో హుందాగా, భక్తి భావంతో ఉండే విగ్రహాలను మధుర శిల్పులు నిర్మించారు. వైదిక దేవతలైన శివుడు, విష్ణువు, పార్వతి, లక్ష్మీ ప్రతిమలు కూడా ఈ శిల్ప శైలిలో నిర్మించడం జరిగింది.

ప్రశ్న 13.
హుయన్సాంగ్
జవాబు:
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్‌లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.

 

ప్రశ్న 14.
మహామోక్ష పరిషత్
జవాబు:
హర్షుడు ప్రయాగ వద్ద ప్రతి 5 సంవత్సరములకొకసారి సర్వస్వదాన కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీనినే మహామోక్ష పరిషత్ అంటారు. ఇటువంటి పరిషత్‌లను హర్షుడు ఆరింటిని జరిపాడు. క్రీ.శ. 643లో జరిగిన 6వ పరిషత్‌కు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు. ఈ పరిషత్తులో హర్షుడు తన సర్వస్వాన్ని బ్రాహ్మణులకు, అనాథలకు పంచి, కట్టుగుడ్డలతో రాజధానికి తిరిగి వచ్చేవాడట.

AP Inter 1st Year History Study Material Chapter 5 క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి

ప్రశ్న 15.
హూణులు
జవాబు:
హూణులు చైనా పరిసర ప్రాంతాలకు చెందిన అనాగరిక మోటుజాతి ప్రజలు. వీరిలో నల్లహూణులు, తెల్లహూణులు అను రెండు శాఖలవారున్నారు. తెల్లహూణులు భారతదేశముపై దాడిచేసి గుప్తుల సామ్రాజ్యంలో శాంతిభద్రతలకు అంతరాయం కలిగించారు. వీరిలో తోరమాణుడు, మిహిరకులుడు ముఖ్యులు. వీరి దండయాత్రల వలన గుప్త సామ్రాజ్యం బలహీనపడింది. గణతంత్ర రాజ్యాలు అంతరించాయి. బౌద్ధమతం నాశనమైంది. కాలక్రమంలో హూణులు క్షత్రియులుగా గుర్తింపు పొందారు.

ప్రశ్న 16.
బాణుని ‘హర్ష చరిత్ర’
జవాబు:
హర్షచరిత్ర అను గ్రంథాన్ని హర్షుని ఆస్థానకవి బాణుడు రచించాడు. మహాశివభక్తుడైన ‘పుష్యభూతి’ ఈ వంశానికి మూలపురుషుడైనందువల్ల హర్షుని వంశానికి పుష్యభూతి వంశమని పేరు వచ్చినట్లు ఈ గ్రంథం వల్ల తెలుస్తున్నది. ఈ గ్రంథం హర్షుని తండ్రి ప్రభాకరవర్ధనుని ‘హూణ హరిణకేసరి’ అని వర్ణించింది. ఈ గ్రంథము హర్షుని జీవితమును, |అతని పాలనాకాలం నాటి దేశ, కాల పరిస్థితులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

Andhra Pradesh BIEAP AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు Textbook Questions and Answers.

AP Inter 1st Year History Study Material 4th Lesson తొలి సమాజాలు, మతోద్యమాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్గ విభేదాలను, సాంఘిక పురోగతిని వర్ణించండి.
జవాబు:
సమాజాలు: క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుష సూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది.
పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.

బ్రాహ్మణులు – తల నుంచి
క్షత్రియులు – దేహం నుంచి
వైశ్యులు – తొడల నుంచి
శూద్రులు – పాదాల నుంచి ఏర్పడ్డారని పేర్కొంది

వర్ణధర్మాన్ని ప్రజలు ఉల్లంఘించడంతో ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలను తయారుచేశారు. వీటన్నింటివల్ల దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం అనేది రాజు కర్తవ్యంగా మారింది. ఫలితంగా రాజుకు న్యాయాధికారాలు లభించాయి. నాడు నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నత వర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు.

రక్త సంబంధం వివాహాలు: రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ కుటుంబీకుల సంబంధాలను తెలుసుకోవడం కష్టం.

ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలో ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

సామాజిక విభేదాలు: ధర్మశాస్త్రాలు, ‘వర్ణధర్మాలు’, ‘వృత్తిధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. మనదేశంలో ఈ కాలంలోనే న్యాయవ్యవస్థ ఏర్పడింది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి: ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం, కంటికి కన్ను, పంటికి పన్నుగా ఉండేవి. శూద్రులు, ద్విజులకు బానిసలుగా, వ్యవసాయ కూలీలుగా ఉండటం వల్ల వారిని తాకడం, స్నేహం చేయడం, వివాహాలు చేసుకోవడం నిషేధంగా ఉండేది.

వర్ణ తారతమ్యాలు: ఈ క్రింది పట్టిక పని విభజనను తెలుపుతుంది.

1. బ్రాహ్మణులు – 1. వేదాల అధ్యయనం, బోధన, యజ్ఞ యాగాదులు చేయటం, బహుమతుల స్వీకరణ.
2. క్షత్రియులు – 2. యుద్ధాలు చేస్తూ ప్రజలను రక్షించడం పరిపాటి.
3. వైశ్యులు – 3. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, వ్యవసాయ వ్యాపారాల నిర్వహణ.
4. శూద్రులు – 4. పై మూడు వర్ణాల వారికి సేవలు, వ్యవసాయ కార్యక్రమాల నిర్వహణ.

సామాజిక పురోగతి: వర్ణాలు నాలుగుగా విభజింపబడినట్లు పై పట్టిక తెలియజేస్తుంది. అయితే సమాజ పురోగతిలో జాతులు కూడా కలిసిపోయాయి. ఇతర గ్రంథాల్లో జాతులను కూడా వర్ణాలుగా పేర్కొనడమైంది. వర్ణాలు నాలుగుగా విభజింపబడగా, జాతులకు నిర్దిష్ట సంఖ్య లేదు. జాతులను వర్ణాలుగా బ్రాహ్మణులు ఒప్పుకునేవారు కాదు. ఉదా: బంగారుపని చేసే కొందరు నిషాధుల్ని ‘స్వర్ణకారు’ అనడానికి బ్రాహ్మణులు ఒప్పుకొనేవారు కాదు. అందువల్ల ‘జాతులు ‘శ్రేణులుగా’ ఏర్పడి అన్ని వృత్తులు నిర్వహించేవారు. శూద్రులు ఈ కాలానికి సేవకుల స్థాయి నుంచి వ్యవసాయదారులుగా పురోగమించారు.

సమాజంలో స్త్రీల పరిస్థితి: మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. వివాహ సందర్భంలో స్త్రీలకు ఇచ్చే కానుకలను వారు స్త్రీ ధనంగా పొందవచ్చు. ఈ ధనంపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి. దీనిపై భర్తకు హక్కు లేదు. మనుస్మృతి భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఆస్తి కలిగి ఉండటం నేరంగా పేర్కొంది.

స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ‘ఎక్సోగమి’ అంటారు. తండ్రి ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి సరైన సమయంలో వివాహం చేసేవారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల దూర ప్రాంతాలలో ఏర్పడిన వర్తక సంబంధాల వల్ల సంప్రదాయాలు, విశ్వాసాలు, విమర్శలకు దారితీయడంతో బ్రాహ్మణులు క్రీ.పూ. 600వ సం||లో వివాహ వ్యవస్థలో మార్పులు తెచ్చారు.

ప్రశ్న 2.
బ్రాహ్మణ మతంలోని గోత్రం, రక్త సంబంధం, వివాహ పద్ధతులను చర్చించండి.
జవాబు:
క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణవ్యవస్థ అమల్లోకి వచ్చింది. సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు అమల్లోకి వచ్చాయి. ఋగ్వేదంలోని పురుషసూక్తం వర్ణ విభజనను, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని పేర్కొంది. నాలుగు వర్ణాలే నాలుగు కులాలుగా మారాయి. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతవర్గంగా, శూద్రులు తక్కువ వర్గంగా పేరుపొందారు. క్రీ.పూ. 1000వ సం॥లో బ్రాహ్మణులు రూపొందించిన మరొక సామాజిక విధానం గోత్రం.

గోత్రం: గోత్రం అనే పద్ధతి బ్రాహ్మణులతో ప్రారంభమై, బ్రాహ్మణ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉంది. అసలు ‘గోత్రం’ అనే పదానికి అర్థం ‘ఆవులకు సంబంధించినది’. బహుశా ఆవులను బట్టి ఆ సమూహ బ్రాహ్మణులు ఆయా గోత్రాలను పెట్టుకొని ఉండవచ్చు. ఆ తరువాత కాలంలో గోత్రం సమూహ పెద్ద పేరుతో కొనసాగింది. చాలాకాలం తరువాత ఏడుమంది ఋషుల పేర్లతో గోత్రనామాలు ఏర్పడినట్లు గృహ్య సూత్రాలు పేర్కొంటున్నాయి. సగోత్రీకులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది.

రక్త సంబంధం: కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. తొలి సమాజాల్లోని కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య సంబంధాలను తెలుసుకోవడం కష్టం. సంస్కృత గ్రంథాల ప్రకారం ‘కులం’ కుటుంబాలకు గుర్తింపును ఇస్తుంది. వంశం అనేది వారి ‘పుట్టుకను’ తెలియజేస్తుంది.

వివాహాలు: ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు. ‘కన్యాదానం’ చేయడం ఆచారమైంది. అయితే మారుతున్న ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఈ ఆచారాలను ప్రశ్నించడం ఆరంభమైంది. ఇలాంటి స్థితిలోనే ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. మనుస్మృతిలో ఎనిమిది రకాల వివాహ పద్ధతులు వివరించబడ్డాయి.

వివాహ రీతులు:

 1. ఎండోగమి – అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం.
 2. ఎక్సోగమి – ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం.
 3. పోలోగమి – బహుభార్యత్వ
 4. పోలయాండ్రి – బహు భర్తృత్వం

మొదలగు వివాహ రీతులు 6వ శతాబ్దంలో అమలులో ఉండేవి.

ప్రశ్న 3.
జైనమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
జైనమతం, బౌద్ధమతం కంటే ప్రాచీనమైనది. జైనమత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వారు 24 మంది. వారిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ వాడైన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆ మతాన్ని సంస్కరించి చక్కని రూపాన్ని అందించినవాడని జైనుల విశ్వాసం.

వర్ధమాన మహావీరుడు: వర్ధమాన మహావీరుడు జైనమత 24వ తీర్థంకరుడు. మహావీరుని అసలు పేరు వర్ధమానుడు. అతడు క్రీ.పూ. 540వ సంవత్సరంలో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో సిద్ధార్థుడు, త్రిశలకు జన్మించాడు. ఇతని భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని. వర్ధమానుడు 30 ఏళ్ళు నిండకముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటి నుంచి నిష్క్రమించి, సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాల కఠిన తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. పరిపూర్ణ జ్ఞానము పొందిన పిమ్మట ‘జినుడు’ అని, ధైర్యసాహసములతో తపస్సు సాగించుటచేత “మహావీరుడని”, మహాజ్ఞాని అయినందువల్ల “కేవలుడు” అని సమస్త భవబంధములను తెంచుకొనుటచే ‘నిగ్రంథుడ’ని పిలువబడ్డాడు. మహావీరుడని “జినుడు” (జయించినవాడు) అను బిరుదు నుంచి ఈ మతానికి జైనమతమనే పేరు వచ్చింది. మానవుల మోక్షసాధన కోసం మహావీరుడు పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖన వ్రతమును బోధించాడు. వీటిని ఆచరించుట ద్వారా మానవులు మోక్షము లేదా కేవలావస్థను పొందగలరని బోధించాడు. తన సందేశాన్ని నిర్విరామంగా ప్రచారం చేస్తూ మహావీరుడు తన 72వ ఏట పావా అనే నగరములో హస్తిపాలుడనే రాజు గృహములో క్రీ.పూ. 468లో మరణించాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

మహావీరుని బోధనలు:
1) పంచవ్రతాలు: జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు నాలుగు సూత్రములను బోధించాడు. అవి: ఎ) జీవహింస చేయరాదు. బి) అసత్యమాడరాదు. సి) దొంగతనము చేయరాదు. డి) ఆస్తిపాస్తులు వుండరాదు. ఈ నాలుగు సూత్రాలకు లేక వ్రతాలకు 24వ తీర్థంకరుడైన మహావీరుడు బ్రహ్మచర్యము అనే ఐదవ సూత్రాన్ని జోడించాడు. ఈ ఐదు సూత్రాలను పంచవ్రతాలు లేక పంచకళ్యాణాలు అంటారు.

2) త్రిరత్నాలు: పంచవ్రతాలతోపాటు త్రిరత్నాలను కూడా మోక్ష సాధనకోసం పాటించాలని మహావీరుడు ప్రబోధించాడు. అవి: ఎ) సమ్యక్ దర్శనం లేక సరియైన విశ్వాసం. బి) సమ్యక్ జ్ఞానం లేక సరియైన జ్ఞానం. సి) సమ్యక్ చరిత్ర లేక సరియైన క్రియ. తీర్థంకరుల బోధనలకై శ్రద్ధను కలిగివుండటమే సమ్యక్ దర్శనము. వాటిలో సత్యాన్ని గ్రహించటమే సమ్యక్ జ్ఞానము. వాటిని పాటించడమే సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని త్రిరత్నాలు అంటారు. వీటిని అనుసరించుట ద్వారా దుఃఖలేశం లేని మోక్షం లేదా కైవలావస్థను మానవుడు పొందగలుగుతాడు.

3) సల్లేఖనా వ్రతం: పార్శ్వనాథుడు చేతన, అచేతన వస్తువులన్నింటిలో జీవముందని బోధించాడు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని తపస్సు మాత్రమే కర్మ బంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక బంధాల నుంచి, కర్మ నుంచి విముక్తిని సాధించటమే మోక్షమని ఆయన ప్రవచించాడు. కర్మచేయటం ద్వారా కర్మఫలాన్ని అనుభవించటం కోసం పునర్జన్మను ఎత్తవలసి వస్తుందని, కనుక కర్మను నాశనం చేయటం ద్వారానే మోక్షప్రాప్తిని పొందగలమని ఆయన బోధించాడు. కనుక ఉపవాసములచేత శరీరమును శుష్కింపచేసుకొని ప్రాణత్యాగము చేయటం ద్వారా కర్మను అణచివేయవచ్చునని ఆయన బోధించాడు. ఈ ప్రక్రియనే “సల్లేఖనా వ్రతము” అంటారు.

4) కైవల్యం: జైనమతం యొక్క అంతిమ లక్ష్యం కైవల్యం లేక మోక్షము. పంచవ్రతాలను, త్రిరత్నాలను, సల్లేఖనా వ్రతమును ఆచరించుట ద్వారా మోక్షాన్ని సాధించవచ్చునని ఆయన ప్రవచించాడు. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయినదే మోక్షము. దీనినే కైవల్యావస్థ అంటారు. కైవల్యావస్థ పొందుట ద్వారా మానవుడు కర్మ, పునర్జన్మ వలయము నుండి శాశ్వత విముక్తిని పొందగలుగుతాడు.

5) ఇతర సూత్రాలు: జైనమతం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. దేవుడున్నాడా లేదా అనే విషయానికి ఈ మతంలో ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై ఆధారపడివుంది. వర్థమాన మహావీరుడు వర్ణవ్యవస్థను ఖండించలేదు. నాటి సామాజిక అసమానతలకు ఆలవాలమైన వర్ణవ్యవస్థను వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్నిబట్టి మానవుడు అగ్ర లేక అధమ వర్ణాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం జంతు బలులను, బ్రాహ్మణ ఆధిక్యతను, వేదాల ఆధిక్యతను నిరసించినది.

జైనమత వ్యాప్తి: జైనమత ప్రచారం కోసం మహావీరుడు జైన సంఘాన్ని స్థాపించాడు. స్త్రీ, పురుషులిద్దరు ఈ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘాలలో జైన భిక్షువులే కాక, తమ మత సూత్రాల ప్రకారం జీవితం గడుపుతూ విరాళాలు, కానుకల ద్వారా ఆ సంస్థలను పోషించే ఉపాసకులు కూడా వుండేవారు. మహావీరుడు సంవత్సరంలో నెలలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేసేవాడు. జైనమతానికి రాజాదరణ కూడా లభించింది. మగధ పాలకులైన హర్యంక, నందవంశ రాజులు, చంద్రగుప్త మౌర్యుడు, కడపటి మౌర్యరాజైన సంప్రతి జైనమతాన్ని పోషించారు. భారతదేశంలో జైనమతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో బాగా ప్రచారంలో వుంది.

ప్రశ్న 4.
బౌద్ధమత బోధనలను, భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి.
జవాబు:
క్రీ.పూ. భారతదేశంలో జనించిన అనేక మతాలలో బౌద్ధమతం ఒకటి. దీని స్థాపకుడు గౌతమబుద్ధుడు. గౌతమబుద్ధుని జీవితం: గౌతమబుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు క్రీ.పూ. 563వ సం||లో ‘శాక్య’ వంశమునకు చెందిన శుద్దోధనుడు, మాయాదేవీలకు లుంబినీవనమున జన్మించాడు. చిన్నతనమునే తల్లిని కోల్పోయి సవతి తల్లి ప్రజాపతి గౌతమిచే పెంచబడి ‘గౌతముడు’ అని పిలువబడ్డాడు. ఇతనికి ‘యశోధర’ అను రాకుమార్తెతో వివాహం జరిగింది. వారి కుమారుడు ‘రాహులుడు’.

మహా పరిత్యాగము: సిద్ధార్థుడు తన 29వ ఏట ఒక ముదుసలిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూచి వైరాగ్యానికి లోనై సకల సంపదలను, భోగభాగ్యాలను, భార్యాబిడ్డలను వదిలి ఇల్లు విడిచి వెళ్ళాడు. ఈ సంఘటనతో అతని మనస్సు వికలమైంది. ప్రపంచమంతా దుఃఖమయమని, జీవితము అశాశ్వతమని గ్రహించి బవబంధములను తెంచుకొని అడవులకు వెళ్ళి సన్యసించాడు. ఈ సంఘటననే ‘మహా పరిత్యాగము’ లేక ‘మహాభినిష్క్రమణము’ అంటారు.

జ్ఞానోదయమును పొందుట సన్యసించిన పిమ్మట సిద్ధార్థుడు సత్యాన్వేషణకై గయను చేరి అచ్చట ఒక అశ్వత్థ వృక్షము క్రింద 40 రోజులు ధ్యానము చేసి జ్ఞానమును పొందాడు. ఈ సంఘటనకే సంబోధి అని పేరు. అప్పటి నుండి సిద్ధార్థుడు బుద్ధుడు అని పిలువబడినాడు. బుద్ధుడు అనగా జ్ఞానము పొందినవాడు అని అర్ధము. బుద్ధుని శాక్యముని అని, తథాగతుడు అని పిలుస్తారు. నాటి నుండి అశ్వత్థ వృక్షము బోధి వృక్షముగాను, గయ బుద్ధగయగాను ప్రసిద్ధి చెందాయి.

ధర్మచక్ర ప్రవర్తనము: బుద్ధుడు గయ నుండి సారనాథ్ చేరి సమీపమున గల జింకల తోటలో తన పూర్వ సహవాసులైన బ్రాహ్మణులకు మొదటిసారిగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సంఘటననే ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. అప్పటి నుండి అనేక సంవత్సరములు బుద్ధుడు తన బోధనలను ప్రచారం చేశాడు. తన శిష్యులలో ప్రముఖులైన వారిని సంఘంలో ఏర్పరచాడు.

నిర్వాణం: విస్తృతంగా బౌద్ధమతాన్ని ఉత్తరాపథమంతటా ప్రచారం చేసి బుద్ధుడు తన 80వ ఏట మల్ల రాజధానియైన కుశి నగరమున క్రీ.పూ. 483లో నిర్వాణం పొందాడు.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

బుద్ధుని బోధనలు: బుద్ధుని బోధనల ప్రకారం మానవ జీవితం కార్యకారణ సంబంధంతో ముడిపడి ఉన్నది. మానవుడు చేసిన కర్మఫలము వలననే ఈ శరీరము మరల మరల జన్మనెత్తవలసి వస్తున్నది. కర్మ ఆచరణకు కోర్కెలే మూలము. అజ్ఞానము వలన కోర్కెలు జనించుచున్నాయి. కోర్కెల వలన మానవుడు కర్మలు ఆచరిస్తాడు. ఈ కర్మ ఫలితమే పునర్జన్మ. పునర్జన్మలేని సుఖమైన, ప్రశాంతమైన జీవనమే నిర్వాణము అని బుద్ధుడు బోధించాడు. నిర్వాణ సాధనకు మానవుడు ఆర్య సత్యములను గ్రహించి అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని పాటించవలెను.

ఆర్య సత్యములు: గౌతమ బుద్ధుడు తన దివ్య పరిజ్ఞానము వలన నాలుగు ప్రధానమైన సత్యములను గ్రహించాడు. వీటినే ఆర్య సత్యములు అంటారు. అవి:

 1. ప్రపంచమంతా దుఃఖమయము.
 2. దుఃఖమునకు కారణము కోర్కెలు.
 3. దుఃఖమును అంతము చేయుటకు కోర్కెలను నిరోధించవలెను.
 4. కోర్కెలను నిరోధించుటకు అష్టాంగమార్గమును అవలంబించవలెను.

అష్టాంగ మార్గము: నిర్వాణమును పొందుటకు మానవుడు తన నిత్య జీవితంలో ఈ అష్టాంగ మార్గమును అనుసరించిన చాలని బుద్ధుడు బోధించాడు. అవి: 1) సరియైన విశ్వాసము 2) సరియైన జ్ఞానము 3) సరియైన వాక్కు 4) సరియైన క్రియ 5) సరియైన జీవనము 6) సరియైన ప్రయత్నం 7) సరియైన ఆలోచన 8) సరియైన ధ్యానము. అష్టాంగ మార్గము ద్వారా ప్రతి వ్యక్తీ శీలసంపదను పెంపొందించుకొని జ్ఞాని కాగలడు. ఈ మార్గము అందరికీ అందుబాటులో ఉండుటచే దీనిని మధ్యేమార్గం అని అంటారు.

దశసూత్ర నీతి: ఆర్యసత్యములు, అష్టాంగ మార్గములతోపాటు బుద్ధుడు పది అంశములు గల దశసూత్ర నీతిని ప్రబోధించాడు. ఈ సూత్రాలు:

 1. జీవహింస చేయరాదు
 2. అసత్యమాడరాదు.
 3. దొంగతనము చేయరాదు.
 4. ఆస్తిపాస్తులు సమకూర్చుకొనరాదు.
 5. బ్రహ్మచర్యను పాటించవలెను.
 6. మత్తు పదార్దములు సేవించరాదు.
 7. పరుష వాక్యములు వాడరాదు.
 8. ఇతరుల ఆస్తులను కోరరాదు.
 9. అవినీతి పనులు చేయరాదు.
 10. విలాసాలను విడనాడాలి.

నిర్వాణము: ఆర్యసత్యములను గ్రహించి, అష్టాంగ మార్గమును, దశసూత్ర నీతిని ఆదరించటం వలన మానవుడు మోక్షమును పొందుటకు అర్హుడవుతాడు. మోక్షమనగా పునర్జన్మలేని జన్మరాహిత్యము. దీనినే బుద్ధుడు నిర్వాణంగా పేర్కొన్నాడు. నిర్వాణ సాధనే ప్రతి వ్యక్తి ధ్యేయం కావలెను అని బుద్ధుడు బోధించాడు.

బౌద్ధమతతత్వం: బుద్ధుడు భగవంతుని ఉనికిని గురించి, ఆత్మను గురించి మౌనం వహించాడు. హిందూమతమందలి కర్మ, పునర్జన్మ, మోక్ష సిద్ధాంతాలను అంగీకరించాడు. మహావీరుని వలె బుద్ధుడు కూడా యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణుల ఆధికత్యను ఖండించాడు. వేదములను ప్రామాణిక గ్రంథములుగా బుద్ధుడు అంగీకరించాడు.

ముగింపు: ప్రపంచమునకు శాంతి సందేశమునందించుటకు అవతరించిన మహాపురుషులలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. కామ, క్రోధములతో, హింసాత్మక చర్యలతో కొట్టుమిట్టాడుతున్న మానవకోటిని ధర్మం, అహింస, కరుణ, మానవత అనే మహోన్నత ఆశయాలతో తీర్చిదిద్దుటకు అవతరించిన పుణ్య పురుషుడు. అందువల్లనే ఆసియా జ్యోతియని, ప్రపంచ జ్యోతియని శ్లాఘించబడ్డాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్ణ వ్యవస్థ సమాజం
జవాబు:
ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు ‘వర్ణధర్మాలు’ ‘వృత్తి ధర్మాలను’ వివరించాయి. పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. వర్ణ ధర్మాలను బట్టి సమాజంలో గౌరవం, పదవులు, వివాహాలు నిర్ణయింపబడ్డాయి. వర్ణ ధర్మాలను ఉల్లంఘించిన శూద్రులకు శిక్షలు అమానుషంగా ఉండేవి. ఉదా: తలలు తీసివేయడం, నాలుక కోయడం.

ప్రశ్న 2.
జాతి అంటే ఏమిటి ?
జవాబు:
ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి. ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరూ ఒకే ఉమ్మడి రక్త సంబంధం, పుట్టుకలకు సంబంధించినవారు కాకపోవచ్చు. అయినప్పటికీ పరస్పర గౌరవంతో కూడిన జాతులుగా మెలుగుతున్నాయని చెప్పవచ్చును.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 3.
రక్త సంబంధం
జవాబు:
కుటుంబంలోని వారందరూ ఆహారం, పని, వనరులు, పూజా కార్యక్రమాలను పంచుకొనేవారు. రక్త సంబంధీకులందరూ కుటుంబంలో ఉండేవారు. కొన్ని కుటుంబాల్లో రక్త సంబంధీకులనే వివాహం చేసుకొనే ఆచారం ఉండేది. ఈ కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆడపిల్లలను భారంగా భావించేవారు. రక్త సంబంధం ఉన్న వారిని కాకుండా ఇతరులను వివాహం చేసుకొనేందుకు ఆసక్తి కనబరిచేవారు.

ప్రశ్న 4.
త్రిరత్నాలు
జవాబు:
జైనమత సూత్రాలను త్రిరత్నాలు అని అంటారు. అవి:

 1. సరైన నమ్మకం
 2. సరైన జ్ఞానం
 3. సరైన శీలం.

ప్రశ్న 5.
బౌద్దమత సూత్రాలు
జవాబు:
బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను ప్రబోధించాడు. అవి:

 1. ప్రపంచం దుఃఖమయం.
 2. దుఃఖానికి కోరికలు కారణం.
 3. కోరికలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది.
 4. దానికి మార్గం ఉన్నది. అదే అష్టాంగ మార్గం.

ప్రశ్న 6.
అజవికులు
జవాబు:
అజవికుల ప్రచారకుడు మక్కలి గోసలి. ఇతడు నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలకు ఎక్కువగా చేరలేదు. ఏదీ మానవుడి చేతిలో లేదు. జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని ఈ బాబావారి నమ్మకం. ఈ అజవికులు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసలి గురువు పురాణ కశ్యపుడు.

ప్రశ్న 7.
తీర్థంకరులు
జవాబు:
జైనమతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. వీరిలో మొదటివాడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు. తీర్థంకరులు అనగా ‘మత గురువులు’ లేదా జీవనస్రవంతిని దాటుటకు మార్గాన్ని చూపించేవారని అర్థం.

AP Inter 1st Year History Study Material Chapter 4 తొలి సమాజాలు, మతోద్యమాలు

ప్రశ్న 8.
బహుభార్యత్వం
జవాబు:
బహు భార్యత్వం అనగా ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకొనుట. దీనినే ‘పోలోగమి’ అని కూడా అంటారు. పూర్వం ఋగ్వేద, మలివేద కాలంలో రాజులలో ఈ పద్ధతి ఉండేది.

ప్రశ్న 9.
ఎక్సోగమి
జవాబు:
స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగమి అని అంటారు. తండ్రి. ‘కన్యాదానం’ చేయడాన్ని ముఖ్య బాధ్యతగా, గౌరవ మర్యాదలుగా భావించి, సరైన సమయంలో వివాహం చేసేవారు.