Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 4th Lesson మన శరీరం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 4 మన శరీరం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మీ తలలోని శరీర భాగాల పేర్లు తెలియజేయండి.
జవాబు.
మన తలలోని శరీర భాగాల పేర్లు : కళ్ళు, ముక్కు, నోరు, దవడ, చెవులు, గెడ్డము, జుట్టు.
ప్రశ్న 2.
ఫోన్ మాట్లాడడానికి ఏ శరీర భాగాలను ఉపయోగిస్తారు ?
జవాబు.
నేను ఫోన్లో మాట్లాడడానికి నా శరీరంలోని క్రింది భాగాలను ఉపయోగిస్తాను.
- చెవులు ఇతరుల మాటలు వినుటకు
- నోరు, నాలుకను మాట్లాడటానికి
- చేతులును ఫోన్ పట్టుకోవటానికి ఉపయోగిస్తాను.
ప్రశ్న 3.
మీకున్న మూడు మంచి అలవాట్లు రాయండి ?
జవాబు.
నా యొక్క మంచి అలవాట్లు.
- నేను రోజులో రెండుసార్లు దంతాలను తోముకుంటాను.
- తినటానికి ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- వారానికొకసారి చేతి గోళ్ళను కత్తిరించుకోవాలి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
మీ రహస్య భాగాలను ఎవరైనా తాకినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఏమి జరుగుతుంది?
జవాబు.
- మన రహస్యభాగాలను ఎవరైనా తాకినప్పుడు మౌనంగా ఉంటే అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము. అట్టి స్పర్శను “చెడు స్పర్శ” అంటారు.
- ఎదుటి వారికి అది అలవాటుగా మారుతుంది.
- రహస్య భాగాలను తాకటానికి ఎవరిని అనుమతించరాదు. వద్దు అని గట్టిగా అరవాలి.
- అక్కడి నుంచి దూరంగా పారిపోయి, నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయాలి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
రవి తన దుస్తులు అద్దంలో గమనించి తన భావాలను ఈ విధంగా రాశాడు. నేను అందంగా కనపడుతున్నాను. నా దుస్తులు, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. రవి లాగే మీ దుస్తులను అద్దంలో గమనించి మీ పరిశీలవలు చెప్పండి, రాయండి.
జవాబు.
అద్దంలో చూసుకున్నప్పుడు నా పరిశీలనలు:
- ఈ దుస్తులలో నేను చాలా అందంగా అనిపిస్తున్నాను.
- దాని వలన నా యొక్క విశ్వసనీయ స్థాయిలు పెరుగుతాయి.
- నేను ఆరోగ్యంగా కనిపిస్తున్నాను.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ స్నేహితులను గమనించి వారు పాటిస్తున్న మంచి అలవాట్లను రాయండి.
జవాబు.
మా స్నేహితులలో నేను గమనించిన, వారు పాటిస్తున్న మంచి అలవాట్లు :
- దంతాలను రోజుకు రెండుసార్లు తోముకుంటారు.
- వారినికొకసారి చేతిగోళ్ళను కత్తిరించుకుంటారు.
- నీటిని ఎక్కువగా త్రాగుతారు.
- రోజూ వ్యాయామం చేస్తారు.
- తాజా పండ్లు, కూరగాయలను తింటారు.
- తినటానికి ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కుంటారు.
V. పటనైపుణ్యాలు, బొమ్మలు గీయడం. నమునాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం:
ప్రశ్న 7.
ప్రక్క పటానికి భాగాల పేర్లు రాయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పృహ కల్గిఉండడం:
ప్రశ్న 8.
టాయిలెట్ ఉపయోగించిన తరువాత మీరు ఏమి చేయాలి ?
జవాబు.
- టాయిలెట్ ఉపయోగించిన తరువాత దానిని నీటితో శుభ్రపరచాలి. అవసరమైతే టాయిలెట్ క్లీనింగ్ ద్రావణాలతో శుభ్రపరచాలి.
- సబ్బుతో చేతులు కాళ్ళు శుభ్రపరచుకోవాలి.
- పంపులను పూర్తిగా కట్టేయాలి. నీటిని వృధా చేయరాదు.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మన శరీరంను ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజిస్తారు ?
జవాబు.
శరీరంను 3 భాగాలుగా విభజిస్తారు.
అవి :
- తల
- మొండెం
- కాళ్ళు, చేతులు
ప్రశ్న 2.
ప్రతి పనిలో ఉపయోగించే శరీర భాగాలను గుర్తించండి. అవి చేసే పనుల గురించి మాట్లాడండి. క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
1. చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారు ?
జవాబు.
చిత్రంలో పిల్లలు చేయు పనులు : చదవటం, తినటం, చప్పట్లు కొట్టడం, పరుగిడటం మరియు ఆటలాడటం.
2. చప్పట్లు కొట్టడానికి ఏ శరీర భాగాలు ఉపయోగిస్తాము.
జవాబు.
చప్పట్లు చేతుల సహాయంతో కొడతాము.
3. చేతులతో మనం ఏయే పనులు చేస్తాము ?
జవాబు.
వస్తువులను పట్టుకోవటం, చప్పట్లు కొట్టడం, వ్రాయటం, కోయటం వంటి పనులు చేస్తాము.
4. కాళ్ళతో మనం చేసే పనులేవి ?
జవాబు.
ఉంగరంవేలు నడవటం, పరుగిడటం మరియు ఆటలాడటం. చూపుడు వేలు.
ప్రశ్న 3.
చేతివేళ్ళ పేర్లను చెప్పండి ?
జవాబు.
బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరంవేలు, చిటికెన వేలు.
ప్రశ్న 4.
మంచి స్పర్శకు సంబంధించిన పనులేవి ?
జవాబు.
మంచి స్పర్శ వల్ల మనకు భద్రత, రక్షణ వంటి భావం కల్గుతుంది.
ఉదా :
- తల్లిదండ్రుల కౌగిలి
- కుటుంబ సభ్యుల ప్రేమ పూర్వక కౌగిలింత.
- తండ్రి తల నిమరడం
- కరచాలనం వంటివి.
ప్రశ్న 5.
చెడు స్పర్శ అనగానేమి ? చెడు స్పర్శకు సంబంధించిన పనులేవి ?
జవాబు.
మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళనను కలిగించే స్పర్శను “చెడు స్పర్శ” అంటారు. ఎవరైన మన రహస్య భాగాలను తాకితే అట్టి స్పర్శను ‘చెడు స్పర్శ” అని అంటారు.
గమనిక :
పిల్లలకు మంచి స్పర్శ, చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించాలి. చెడు స్పర్శ నుంచి తమను తాము కాపాడుకోవాలి. శరీరంలోని ఈ రహస్య భాగాలను ఎవరినీ తాకనీయరాదు.
II. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 6.
క్రింది పనులలో ఉపయోగపడే శరీర భాగాల పేర్లు వ్రాయండి.
1) టెలివిజన్ చూచుట : ______________
2) సంగీతం వినుట : ______________
3) పాటలు పాడటం : ______________
4) పూల వాసన చూడటం : ______________
5) చాక్లెట్లు రుచిచూడటం : ______________
6) చిత్రం గీయటం : ______________
7) బంతిని తన్నడం : ______________
జవాబు.
విద్యార్థి కృత్యము
III. ప్రశంస – విలువలు జీవవైవిధ్యంపట్ల స్పహ కల్గిఉండడం:
ప్రశ్న 7.
“వికలాంగులు” అనగా ఎవరు ? వారిపట్ల నీ బాధ్యత ఏమిటి ?
జవాబు.
“వికలాంగులు” అనగా ప్రమాదాలవల్లనూ, పుట్టుకతో వచ్చే లోపాల వల్లనూ కొంతమంది తమ పనులు తాము చేసుకోలేరు. అట్టి వారిని “వికలాంగులు” అంటారు.
అట్టివారిపట్ల మనం దయతో ఉండి వారికి వీలైనంత సహాయం చేయాలి.
ప్రశ్న 8.
చేతులు ఎలా శుభ్రపరచుకోవాలో మీకు తెలుసా ?
జవాబు.
మనం ఆహారం తినేముందు తిన్న తర్వాత చేతులను పై పటంలో చూపిన విధంగా శుభ్రపరచుకోవాలి.
ప్రస్తుతం ఉన్న “కనా మహమ్మారి’ నుంచి కాపాడుకోవటానికి కూడా తరచుగా సబ్బుతో చేతులను పైన చూపిన విధంగా శుభ్రపరచుకోవాలి.
ప్రశ్న 9.
విద్యార్థి కృత్యము : –
మీ మంచి అలవాట్లను సరిపోల్చుకోండి. (✓) లేక (✗) గుర్తు సూచించండి.
1. మంచి ఆహారాన్ని తినడం ( )
జవాబు.
✓
2. వీడియో గేమ్స్ ఆడటం ( )
జవాబు.
✗
3. రోజూ నీరు ఎక్కువగా త్రాగడం ( )
జవాబు.
✓
4. మరుగు దొడ్డిని వాడిన తర్వాత చేతులు కడుక్కోవడం ( )
జవాబు.
✓
5. తినడానికి ముందు చేతులు కడుక్కోవడం ( )
జవాబు.
✓
6. నెలకోసారి స్నానం చేయడం. ( )
జవాబు.
✗
7. రోజూ దంతాలను తోమకపోవడం. ( )
జవాబు.
✗
8. నెలకోసారి చేతిగోళ్ళు కత్తిరించుకోవడం. ( )
జవాబు.
✗
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
____________ తలను ఇతర శరీర భాగంతో కలుపును.
A) తల
B) మెడ
C) చేతులు
D) కాళ్ళు
జవాబు.
B) మెడ
ప్రశ్న 2.
జ్ఞానేంద్రియం సహాయంతో రుచిని చూస్తాము.
A) ముక్కు
B) కళ్ళు
C) చర్మం
D) నాలుక
జవాబు.
D) నాలుక
ప్రశ్న 3.
ముక్కు సహాయంతో చేయునవి (పనులు)
A) శ్వాస మరియు వాసన
B) వాసన, రుచి
C) a & b
D) ఏవీకావు.
జవాబు.
A) శ్వాస మరియు వాసన
ప్రశ్న 4.
మన శరీరాన్ని ____________ గా ఉంచటం ద్వారా ఆరోగ్యంగా ఉంటాము.
A) మురికిగా
B) శుభ్రంగా
C) ఆరోగ్యం
D) ఏదీకాదు
జవాబు.
B) శుభ్రంగా
ప్రశ్న 5.
ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
A) కలుషితమైన
B) శుభ్రమైన
C) ఆరోగ్యకరమైన
D) ఏదీకాదు
జవాబు.
C) ఆరోగ్యకరమైన
ప్రశ్న 6.
మానవ శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్య
A) 5
B) 4
C) 3
D) ఏదీకాదు
జవాబు.
A) 5
ప్రశ్న 7.
మీ రహస్య భాగాలను ఎవరైనా తాకితే దానిని ____________ అంటారు.
A) స్పర్శ
B) మంచి స్పర్శ
B) మంచి స్పర్శ
C) చెడు స్పర్శ
D) ఏదీకాదు
జవాబు.
C) చెడు స్పర్శ
ప్రశ్న 8.
మనకు భద్రతను, సౌకర్యాన్ని కల్గించే స్పర్శను ____________అంటారు.
A) మంచి స్పర్శ
B) చెడు స్పర్శ
C) A & B
D ) ఏదీకాదు
జవాబు.
A) మంచి స్పర్శ
ప్రశ్న 9.
శరీర అంతర భాగాలను కప్పి ఉంచేది
A) చర్మం
B) కళ్ళు
C) మొండెము
D) కాళ్ళు
జవాబు.
A) చర్మం
ప్రశ్న 10.
వేర్వేరు పనులు నిర్వహించుటకు శరీర భాగాల మధ్య ఉండవలసింది.
A) సమన్వయం
B) భేదం
C) అనుమతి
D) పైవన్నీ
జవాబు.
A) సమన్వయం
ప్రశ్న 11.
తలను వేర్వేరు దిశలలో త్రిప్పుటకు సహాయపడు శరీరభాగం ____________
A) మొండెము
B) కాళ్ళు
C) మెడ
D) ఏదీకాదు
జవాబు.
C) మెడ
ప్రశ్న 12.
ఆపదలోని బాలలను కాపాడే చైల్డ్ లైన్ నెం. ____________
A) 1098
B) 1048
C) 1038
D) 1068
జవాబు.
A) 1098