Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 8th Lesson ఊరికి పోదాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 8 ఊరికి పోదాం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మీరు ఏఏ వాహనాలలో ప్రయాణించారు?
జవాబు.
నేను బస్సు, ఆటో, రిక్షా, ద్విచక్రవాహానం, రైలువంటి వాహనాలలో ప్రయాణించాను.
ప్రశ్న 2.
రవాణాకు ఉపయోగించే జంతువులు ఏవి?
జవాబు.
గుజ్జాలు, ఎద్దులు, ఒంటెలు, దున్నపోతులు, మొదలగు జంతువులను రవాణాకు ఉపయోగిస్తారు.
ప్రశ్న 3.
చక్రాలు, లేకుండా కదిలే వాహనాలు ఏవి?
జవాబు.
పడవలు, ఓడలు, మొదలైనవి చక్రాలు లేకుండా కదిలే వాహనాలు.
ప్రశ్న 4.
మూడు చక్రాల వాహనాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి?
జవాబు.
ఆటోలు, రిక్షాలు, మూడు చక్రాల వాహనాలకు ఉదాహరణలు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 5.
మీ గ్రామానికి రవాణా సదుపాయాలు లేకపోతే ఏం జరుగుతుందో ఊహించి రాయండి?
జవాబు.
- రవాణా సదుపాయాలు లేకపోతే మనుషులు కాలినడక ద్వారానే ప్రయాణం సాగించాలి మరియు చాలామంది ఎచ్చటివారచ్చటే ఉండవలసి వస్తుంది.
- అత్యవసర సమయాలలో కూడా ప్రజలు సమీప పట్టణాలకు వెళ్ళాలన్నా ఇబ్బంది పడవలసి వస్తుంది. లేకున్నా చాలా ఖరీదు కట్టి అద్దె వాహనాలు తీసుకోవలసి వస్తుంది. పేదవారికి అది కూడా కష్టమగును.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 6.
మన చూట్టూ ఉండే వివిధ వాహనాల వలన ప్రయోజనాలు ఏమిటో వివరించండి?
జవాబు.
ఆ కార్లు, బస్సులు, ఆటోలు, రైళ్ళు, పడవలు. మొదలైనవి ప్రజల రవాణాకు ఉపయోగించే వాహనాలు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ను వ్యవసాయంలోనూ, ఓడలు, రారీలు వంటివాటిని సరుకులరవాణాకు ఉపయోగిస్తారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 7.
మీ వీధిలో ప్రయాణించే వివిధ రవాణా సాధనాలు ఏమిటో ఏదో ఒక ఆదివారం గమనించి ఈ క్రింది పట్టికలో సమోదు చేయండి?
ఎక్కువగా కనిపించే వాహనాలు ఏవి? తక్కువగా కనిపించిన వాహనాలు ఏవి?
జవాబు.
విద్యార్థి కృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 8.
పడవ చిత్రాన్ని గీసి, రంగులు వేయండి?
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 9.
ప్రయాణ సాధనాలుగా మనం వివిధ జంతువులను ఉపయోగిస్తాం వాటి పట్ల నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావు?
జవాబు.
మనం గుట్టాలు, ఎద్దులు, ఒంటెలు వంటి జంతువులను ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తాము. అట్టి జంతువులను దయతో ప్రేమగా చూడాలి ఎందుకంటే వాటికి కూడా అలసట ఉంటుంది. వాటికి కూడా తగిన విరామాన్ని ఇస్తూ మంచి ఆహారాన్ని ఆవాసాన్ని కల్పించాలి.
ప్రశ్న 10.
నీకు విమానంలో ప్రయాణించడం ఇష్టమేనా? అలా ప్రయాణించాలంటే నీవు ఏమి చేయాలి?
జవాబు.
నాకు విమానంలో ప్రయాణించటం ఇష్టమే. అలా ప్రయాణించాలంటే ముందుగా మా అమ్మా నాన్నలతో చెప్పి ఆ ప్రయాణానికి కావలసిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను. అనగా ప్రయాణ సమయం మరియు ఖర్చు వంటివి సిద్ధం చేసుకుంటాను.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
జస్టాండ్ అనగానేమి? అక్కడ నీవేమి గమనించావు?
జవాబు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులన్నీ నిలుపు స్థలాన్ని ” బస్టాండ్” అంటారు. అక్కడ ప్రయాణికులు బస్సుకోసం వేచి ఉండటానికి, కూర్చోవడానికి అనువైన స్థలం (ప్లాట్‌ఫారం) ఉంటుంది. ఈ
ప్రశ్న 2.
ప్రయాణ మార్గాలు ఎన్నిరకాలు?? అవిఏవి? వేగవంతమై ప్రయాణ మార్గం ఏది?
జవాబు.
1. ప్రయాణ మార్గాలు నాల్గు రకాలు.
అవి :
- రోడ్డు మార్గం
- నీటిమార్గం
- వాయుమార్గం
- రైలుమార్గం
2. వాయుమార్గం అన్నింటిలోనూ వేగ వంతమైన ప్రయాణమార్గం.
ప్రశ్న 3.
ముఖ్య ప్రయాణమార్గం ఏది? అవి ఎన్ని రకాలు?
జవాబు.
ముఖ్యమైన ప్రయాణ మార్గం రోడ్డుమార్గం. రోడ్ల తయారు చేసే మెటీరియల్‌ను బట్టి అవి 6 రాకాలు.
- మట్టి రోడ్డు
- గ్రావెల్ రోడ్డు
- ఎర్రమట్టి రోడ్డు
- గ్రానైట్ రోడ్డు
- తారు రోడ్డు
- కాంక్రీట్ రోడ్డు.
ప్రశ్న 4.
పై గుర్తులు దేనిని సూచిస్తాయో తెల్పండి?
జవాబు.
- పాఠశాల ప్రాంతం నిదానంగా వెళ్ళమని సూచిస్తుంది
- జీబ్రాక్రాసింగ్ – ” ఇచ్చట రోడ్డు దాటండి” అని సూచిస్తుంది.
- వాహనాన్ని అధిగమించవద్దు అని సూచిస్తుంది
ప్రశ్న 5.
ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉండే రంగులు వేటిని తెలియ జేస్తాయో తెల్పండి?
జవాబు.
- ఆకుపచ్చరంగు సిగ్నల్ ” వెళ్ళుము” అని సూచిస్తుంది..
- ఎరుపు రంగు సిగ్నల్ ” ఆగుము ” అని సూచిస్తుంది. :
- పసుపు రంగు సిగ్నల్ ” వెళ్ళుటకు సిద్ధంగా ఉండుము” అని సూచిస్తుంది.
ప్రశ్న 6.
భారత ప్రభుత్వం విద్యుత్, సి. ఎన్ . జీ ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. ఎందుకు?
జవాబు.
భారళ ప్రభుత్వం విద్యుత్, CNG ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగింమని ప్రచారం చేస్తుంది. దీనికి కారణం కాలుష్యాన్ని నివారించుటకు మరియు, కార్బన్ ఇంధనాలను పోదుపు చేయటం ద్వారా భవిష్యత్ తరాలకు అందించుటకు.
ప్రశ్న 7.
పెట్రోల్ బంక్ వద్ద చేయకూడని రెండు పసులను రాయండి?
జవాబు.
- పోగత్రాగరాదు
- మొబైల్ ఫోన్లు వాడరాదు.
ప్రశ్న 8.
పట్టికను పూరించండి, ఈ వాహనాలను నడిపే వ్యక్తులను ఏమని పిలుస్తారో రాయండి?
జవాబు.
వాహనం పేరు | వాహనాలను నడిపే వ్యక్తి పేరు |
1. బస్సు | డ్రైవర్ |
2. పడవ | నావికుడు |
3. విమానం | పైలట్ |
4. రైలు | లోకో పైలట్ |
II. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 9.
జతపరచండి:
జవాబు.
1. డి
2. సి
3. బి
4. ఎ
క్రింది ఎమర్జెన్సీ నెంబరులను ఎమర్జెన్సీ సర్వీసులతో జతపరచండి.
జవాబు.
1. సి
2. బి
3. ఎ
4. ఇ
5. ఎఫ్
6. డి.
III. క్రింది వాహణాల పేర్లు వ్రాయండి.
జవాబు.
విధ్యార్ధి కృత్యము.
IV. సైకిల్ బొమ్మ గీచి బాగాలు గుర్తించండి?
జవాబు.
V. ప్రయాణ సాధనాలకు గల చక్రాల సంఖ్య ఆధారంగా వాటిని విభజించి క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు.
విధ్యార్ధి కృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
మనం ఒక చోటు నుంచి మరోచోటుకి ప్రయాణించుటకు _____________ ఉపయోగించాలి.
A) ప్రయాణ సాధనాలు
B) ఆక్సిజన్
C) ఇంధనం
D) ఏదీకాదు
జవాబు.
A) ప్రయాణ సాధనాలు
ప్రశ్న 2.
వాహనాలు నడవాలంటే, _____________ అవసరం.
(B) ..
A) శక్తి
B) ఇంధనం
C) ఆక్సిజన్
D) ఏదీకాదు
జవాబు.
B) ఇంధనం
ప్రశ్న 3.
వేగవంతమైన ప్రయాణ మార్గము _____________
A) రోడ్డు మార్గం
B) రైలుమార్గం
C) వాయుమార్గం
D) నీటి మార్గం
జవాబు.
C) వాయుమార్గం
ప్రశ్న 4.
చక్రాలు లేని ప్రయాణ సాధనం _____________
A) ఓడ
B) పారాచూట్
C) పడవ
D) పై అన్నీ
జవాబు.
D) పై అన్నీ
ప్రశ్న 5.
ముఖ్యమైన ప్రయాణ మార్గము _____________
A) రోడ్లు
B) నీరు
C) గాలి
D) పై అన్నీ
జవాబు.
A) రోడ్లు
ప్రశ్న 6.
రోడ్డు నీయమాలను పాటించటం ద్వారా _____________ లను అరికట్టవచ్చు )
A) దొంగతనం
B) ప్రమాదం
C) పగుళ్ళు
D) ఏదీ కాదు.
జవాబు.
B) ప్రమాదం
ప్రశ్న 7.
జిబ్రాక్రాసింగ్ _____________ కు సూచిక.
A) రోడ్డుదాటుటకు
B) అధిగమించుటకు
C) ఆపుటకు
D) వెళ్ళుటకు
జవాబు.
A) రోడ్డుదాటుటకు
ప్రశ్న 8.
ట్రాఫిక్ సిగ్నల్ లో ఎర్ర లైటు _____________ ను సూచిస్తుంది.
A) వెళ్ళుట
B) సిద్ధంగా ఉండుట
C) ఆగుట
D) ఏదీ కాదు.
జవాబు.
C) ఆగుట
ప్రశ్న 9.
విమాన చోదకుని _____________ అంటారు.
A) నావికుడు
B) పైలట్
C) డ్రైవర్
D) ఏదీ కాదు.
జవాబు.
B) పైలట్
ప్రశ్న 10.
ఖరీదైన ప్రయాణ మార్గము _____________
A) రోడ్లు
B) రైళ్ళు
C) వాయుమార్గం
D) ఏదీ కాదు.
జవాబు.
C) వాయుమార్గం