AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు – విడుపు

Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు – విడుపు Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 5 పొడుపు – విడుపు

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 1
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
చిత్రంలో పులికి దాహం వేసింది. వాగు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోతుంది. ఇంతలో ఒక కుందేలు అక్కడకు వచ్చి ఈ వాగు నాది. ఇందులో నీళ్ళు తాగాలంటే – ముందు నేనడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పమంది. వీరిద్దరి సంభాషణను – పరిస్థితిని మిగతా జంతువులు – వింటూ పరిశీలిస్తున్నాయి.

ప్రశ్న 2.
చిత్రంలో ఏఏ జంతువులు ఉన్నాయి? ఏం చేస్తున్నాయి?
జవాబు:
చిత్రంలో పెద్దపులి, కుందేలు, ఏనుగు, కోతి, కొండ చిలువ ఉన్నాయి. అవి పొడుపు-విడుపు ఆట ఆడుకుంటున్నాయి. కుందేలు అడిగిన ప్రశ్నకు – పులి జవాబు చెప్తుందా! అని చూస్తున్నాయి.

ప్రశ్న 3.
కుందేలు ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారు?
జవాబు:
“ కవ్వం ”

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయిగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:

  1. చెట్టు
  2. చెట్టుకొమ్మలు
  3. పాము, కొండచిలువ
  4. కోతి
  5. ఏనుగు
  6. కుందేలు
  7. పెద్దపులి
  8. వాగు
  9. చిన్న చిన్న మొక్కలు

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
పాఠంలోని చిత్రాలలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి.
జవాబు:
మామయ్య, సూరి, గిరి, సీత, వెంకి

ప్రశ్న 2.
ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో దేని గురించి జరిగాయో చెప్పండి.
జవాబు:
సూరి, సీత, వెంకి మధ్య జరిగాయి. పొడపు కథ గురించి, గొలుసుకట్ట ఆట గురించి జరిగాయి.

ప్రశ్న 3.
మీ పెద్దల దగ్గర పొడుపు కథలు ఎప్పుడైనా విన్నారా? అవేమిటో మీకు తెలిసినవి చెప్పండి.
జవాబు:
పాఠంలో పొడుపు కథలు విన్నారు కదా! అలాంటి మరికొన్ని పొడుపు కథలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి.
1. పొడుపు: చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాల్చిన చప్పుడు కావు.
విడుపు : కన్నీళ్ళు

2. పొడుపు: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది. తైతక్క లాడింది!
విడుపు : చలకవ్యం.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

3. పొడుపు: కిట కిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి
విడుపు : రైలు.

4. పొడుపు: రాజుగారి తోటలో రోజాపూలు చూసేవారేగాని లెక్కే సేవారు లేరు?
విడుపు : చుక్కలు

5. పొడుపు: ఇల్లు మొత్తం తిరిగి మూలన కూర్చుంటుంది?
విడుపు : చీపురు

6. పొడుపు : రాత్రి, పగలు – ఎండా వానా లెక్క చేయదు ఎప్పుడు దూకమంటే, అప్పుడు బావిలోకి దూకుతుంది?
విడుపు : చేద

7. పొడుపు: అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటి కొచ్చింది – మహాలక్ష్మి లాగుంది?
విడుపు : గడప

8. పొడుపు: అడుగులు ఉన్నా, కదల్లేనిది ఏది?
విడుపు : గజింబడ్డ (స్కేలు)

9. పొడుపు: కిటకిట తులపులు కిటారు తలుపులు తీసినా, వేసినా చప్పుడు కావు
విడుపు : కంటిరెప్పలు

10. పొడుపు: కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది?
విడుపు : కురీ

11. పొడుపు: అందరినీ పైకి తీసికెళ్తుంది. తాను మాత్రం వెళ్ళలేదు?
విడుపు : నిచెన

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 4.
పాఠంలో ఆరటి పండు, జామపండు లాంటి పండ్లు వచ్చాయి. మీకు ఏఏ పండ్లంటే ఇష్టమో చెప్పండి.
జవాబు:
ద్రాక్ష పళ్ళు, సపోటా పళ్ళు, యాపిల్ పండు, చక్రకేళీలు.

చదవడం – వ్యక్త పరచడం

అ) పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

ప్రశ్న 1.
“ఎప్పుడూ కథలేనా! ఇంకేమైనా చెప్పు”
జవాబు:
సీతి – సూరితో పలికిన మాట.

ప్రశ్న 2.
“సరే! మొదలుపెట్టు.”
జవాబు:
సూరి – సీతితో పలికిన మాట.

ప్రశ్న 3.
“ఆ! ఉల్లిపాయకదూ!”
జవాబు:
వెంకి – సీతితో పలికిన మాట.

ప్రశ్న 4.
“ఓహో! నోరు నుయ్యి అన్నమాట.”
జవాబు:
సీతి – సూరితో పలికిన మాట.

ఆ) కింది కథను చదవండి. పొడుపు విడుపు చెప్పండి.

కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది. దారిలో కుందేలుకు దాహం వేసింది. నీటిని వెతుకుతూ వాగు చేరింది. నీరు తాగబోయింది. ఇంతలో ఒక పులి వచ్చింది. “ఆగు! ఈ వాగు నాది! నువ్వు నీళ్ళు తాగాలంటే నా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. చెప్పలేకపోతే నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది కుందేలు సరే అంది.
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 2
ఇలా పులి అడిగిన అన్ని ప్రశ్నలకూ కుందేలు జవాబులు చెప్పింది. హాయిగా నీరు తాగి వెళ్ళిపోయింది.

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కుందేలు ఎక్కడికి బయలు దేరింది.
జవాబు:
కుందేలు నక్కబావ పెండ్లికి బయలుదేరింది.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 2.
కుందేలు వాగు దగ్గరకు ఎందుకు వెళ్ళింది?
జవాబు:
కుందేలుకు దాహం వేసి వాగు దగ్గరకు చేరింది.

ప్రశ్న 3.
పై కథలో పూర్ణవిరామానికి (.) ముందున్న పదాలు రాయండి.
జవాబు:

  1. బయలు దేరింది.
  2. వేసింది.
  3. చేరింది.
  4. వచ్చింది.
  5. చెప్పాలి.
  6. వచ్చింది.
  7. సరే అంది.

ప్రశ్న 4.
పై కథలో ద్విత్వాక్షరాలున్న పదాలు రాయండి.
జవాబు:

  1. నక్కబావ
  2. వచ్చింది
  3. నువ్వు
  4. నీళ్ళు
  5. చెప్పాలి
  6. చెప్పలేక పోతే
  7. నిన్ను

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

పదజాలం

అ) పాఠంలో ఆకలి-రోకలి వంటి ప్రాస పదాలు ఉన్నాయి కదా! అలాంటివే మరికొన్ని కింది పట్టికల్లో రాయండి.
1. గెలుపు – ______________
2. బరువు – ______________
3. తెలుగు – ______________
4. హారము – ______________
5. చినుకు – ______________
6. పెరుగు – ______________
7. పలుకు – ______________
8. చిలక – ______________
జవాబు:
1. గెలుపు  –  తెలుపు
2. బరువు  –  పరువు
3. తెలుగు  –  వెలుగు
4. హారము  –  పారము
5. చినుకు –  కినుకు
6. పెరుగు –  విరుగు
7. పలుకు  –  ఉలుకు
8. చిలక  –  గిలక

ఆ) కింది వరుసలలో సంబంధం లేని పదాన్ని గుర్తించి దానికి “O “చుట్టండి.
ఉదా :

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 3
జవాబు:
ఉదా :
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 4

ఇ) కింది ఆధారాలను బట్టి ‘లు’ తో అంతమయ్యే పదాలు రాయండి. అలాంటివి మరికొన్ని తయారు చేయండి.

ప్రశ్న 1.
వినడానికి ఉపయోగపడేవి
ఉదా : చెవులు

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 2.
నిద్రలో వచ్చేవి
____ _____ లు
జవాబు:
కలలు

ప్రశ్న 3.
వేసవిలో వచ్చేవి
____ _____ లు
జవాబు:
మల్లెలు , ముంజలు

ప్రశ్న 4.
పక్షులకు ఉండేవి
____ _____ లు
జవాబు:
ముక్కలు, తోకలు

ప్రశ్న 5.
పిల్లలకు ఇష్టమైనవి
____ _____ లు
జవాబు:
ఆటలు

ప్రశ్న 6.
………………….
____ _____ లు
జవాబు:
సముద్రంలో పై కెగసిపడేవి
ఆలలు

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 7.
………………….
____ _____ లు
జవాబు:
బియ్యం చేరిగేవి
చేటలు

స్వీయరచన

అ) కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి.
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 5
జవాబు:

  1. నీరు దాహం తీరుస్తుంది.
  2. నీరు పంటలకు ఆధారం
  3. నీరు పాత్రలను శుభ్రం చేస్తుంది.
  4. నీరు చెట్లకు ప్రాణాధారం
  5. నీరు బట్టలను శుభ్రం చేస్తుంది.

ఆ) కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఈ పాఠంలో సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో రాయండి.
జవాబు:
ఈ పాఠంలో సంభాషణలు, సూరి, సీతి, వెంకి మధ్య జరిగాయి.

ప్రశ్న 2.
ఈ పాఠంలో పిల్లలు వేటి గురించి మాట్లాడుకున్నారు?
జవాబు:
పొడుపు కథలు గురించి, గొలుసుకట్టు ఆటల గురించి మాట్లాడుకున్నారు.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 3.
మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి.
జవాబు:
1. పొడుపు : చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాల్చిన చప్పుడు కావు.
విడుపు : కన్నీళ్ళు

2. పొడుపు : అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది!
విడుపు : చల్లకవ్వం.

3. పొడుపు : కిట కిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి
విడుపు : రైలు.

4. పొడుపు : రాజుగారి తోటలో రోజాపూలు చూసేవారేగాని లెక్కే సేవారు లేరు?
విడుపు : చుక్కలు

5. పొడుపు : ఇల్లు మొత్తం తిరిగి మూలన కూర్చుంటుంది?
విడుపు : చీపురు

6. పొడుపు : రాత్రి, పగలు – ఎండా వానా లెక్క చేయదు ఎప్పుడు దూకమంటే, అప్పుడు బావిలోకి దూకుతుంది?
విడుపు : చేద

7. పొడుపు : అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటి కొచ్చింది – మహాలక్ష్మి లాగుంది?
విడుపు : గడప

8. పొడుపు : అడుగులు ఉన్నా, కదల్లేనిది ఏది?
విడుపు : గజంబద్ద(స్కేలు)

9. పొడుపు : కిటకిట తులపులు కిటారు తలుపులు తీసినా, వేసినా చప్పుడు కావు
విడుపు : కంటిరెప్పలు

10. పొడుపు : కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది?
విడుపు : కుర్చీ

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ప్రశ్న 4.
ఈ పాఠంలో పిల్లలు పొడుపు కథలు, గొలుసుకట్టు ఆటలు ఆడారుగదా! మీరు ఏయే ఆటలు ఆడతారో రాయండి.
జవాబు:

  1. అంత్యాక్షరి
  2. మాట విడుపు’ మాట
  3. చదరంగం
  4. గుళ్ళబోర్డు
  5. ఇంకా చాలా ఆటలు.

సృజనాత్మకత

కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 6
నాలుగు కాళ్ళ జంతువును
తియ్యటి పాలు ఇస్తాను ?
అంబా అంబా అంటాను
ఎవరిని? నేనెవరినీ?
ఆవును

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 7
పండ్లలో రాజును నేను
తియ్యగా ఉంటాను నేను
…………………………..
ఎవరిని? నేనెవరిని?
జవాబు:
పండ్లలో రాజును నేను
తియ్యగా ఉంటాను నేను
పచ్చగా ఉంటాను నేను
ఎవరిని? నేనెవరిని?
మామిడిపండును

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 8
అందరికీ మామను నేను
ఆకాశంలో …………………
………………………
……………………….
జవాబు:
అందరికీ మామను నేను
ఆకాశంలో ఉంటాను
అందంగా ఉంటాను
ఎవరినీ? నేనెవరిని?
చందమామను

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 9
………………………..
………………………..
………………………..
………………………..
జవాబు:
గాలిలో ఎగురుతాను
తోక కలిగి ఉంటాను
ఆకాశం నా హద్దంటాను
ఎవరిని? నేనెవరినీ?
గాలి పటాన్ని

ప్రశంస

మీరు మీ స్నేహితులు కలిసి పొడుపు కథలు, గొలుసుకట్టు ఆట ఆడండి. బాగా ఆడిన వారిని అభినందించండి.
జవాబు:
తేజా! నీకు నా అభినందనలు. ఇన్ని పొడుపుకథలు నీకెలా వచ్చు. అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పావు. అంతేకాదు – గొలుసుకట్టు ఆట కూడా చాలా చక్కగా ఆడావు. నీదగ్గర నుండి మేమందరం కూడా – చాలా పొడుపుకథలు నేర్చుకున్నాం. ఈ వేసవి సెలవుల్లో నీ వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి. అందుకే నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

ప్రాజెక్టుపని

పాఠంలో పొడుపు కథలు విన్నారు కదా! అలాంటి మరికొన్ని పొడుపు కథలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
1. పొడుపు : చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాల్చిన చప్పుడు కావు.
విడుపు : కన్నీళ్లు 

2. పొడుపు : అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది!
విడుపు : చలకవ్యం.

3. పొడుపు : కిట కిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి
విడుపు : రైలు.

4. పొడుపు : రాజుగారి తోటలో రోజాపూలు చూసేవారేగాని లెక్కే సేవారు లేరు?
విడుపు : చుక్కలు

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

5. పొడుపు : ఇల్లు మొత్తం తిరిగి మూలన కూర్చుంటుంది?
విడుపు : చీపురు

6. పొడుపు : రాత్రి, పగలు – ఎండా వానా లెక్క చేయదు ఎప్పుడు దూకమంటే, అప్పుడు బావిలోకి దూకుతుంది?
విడుపు : చేద

7. పొడుపు : అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటి కొచ్చింది – మహాలక్ష్మి లాగుంది?
విడుపు : గడప

భాషాంశాలు

అ) కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలు గమనించండి.

  1. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు.
    రవి పెన్ను, పుస్తకం, పెన్సిలు కొన్నాడు.
    జామ చెట్టు పై రామచిలుక, పావురం వాలాయి.
    AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 10

పై వాక్యాలలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలియజేస్తున్నాయి కదూ! ఇలా పేర్లను తెలిపే పదాలను ‘నామవాచకాలు’ అంటారు.

ఆ) కింది పట్టికలో మీకు తెలిసిన మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు రాయండి.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 11
జవాబు:
మనుషుల పేర్లు

  1. అంజలి
  2. శ్రుతి
  3. అనుష్క
  4. సౌమ్య
  5. తేజ
  6. రాము
  7. రవి
  8. సీత

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

జంతువుల పేర్లు

  1. కుక్క
  2. ఏనుగు
  3. పులి
  4. కోతి
  5. ఆవు
  6. పిల్లి
  7. కుందేలు
  8. నక్క

పక్షుల పేర్లు

  1. నెమలి
  2. కాకి
  3. పావురం
  4. పిచ్చుక
  5. చిలుక
  6. చెకోరము
  7. గ్రద్ద
  8. డెగ

కవి పరిచయం

కవి : చింతా దీక్షితులు
కాలము : (25-8-1891 – 25-8-1960)
రచనలు : ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు
విశేషాలు : కవి, కథకులు, విద్యావేత్త తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత.

పదాలు – అర్థాలు

నుయ్యి = బావి
ప్రారంభించు = మొదలు పెట్టు
ఏరు = నది

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

ఈ మాసపు పాట

చందమామ

అందమైన చందమామ
అందరాని చందమామ
అమ్మా నా చేతిలోని
అద్దములో చిక్కినాడే || అందమైన ||

రెక్కలు నాకుంటేనా
ఒక్క ఎగురు ఎగిరిపోనా?
నెలవంకతొ ఆటలాడి
నీ వొడికే తిరిగి రానా? || అందమైన ||
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 12
గున్నమావి కొమ్మలలో
సన్నజాజి రెమ్మలలో
నక్కినక్కి దొంగల్లే
నన్ను చూచి నవ్వినాడే || అందమైన ||

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

లెక్కలేని చుక్కలకీ
చక్రవర్తి చందమామ
నీలి నీలి మబ్బులలో
తేలిపోవు చందమామ | అందమైన ||

కవి పరిచయం

కవి : నండూరి రామమోహనరావు
కాలము : (24-4-1927 – 2-9-2011)
రచనలు : హరివిల్లు’ ‘నరావతారం’, ‘విశ్వరూపం’
విశేషాలు : కవి, అనువాదకులు, గొప్పభావుకులు, ‘హరివిల్లు ‘ ఆయన రచించిన బాలగేయాల సంపుటం. “ నరావతారం’, ‘విశ్వరూపం’, ల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలి లో పాఠకులకు పరిచయం చేశారు. హకల్, బెరిఫిన్’ వంటి అనువాదాలు కూడా చేశారు.
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 13

ఈ మాసపు కథ

వికటకవి

కృష్ణాతీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుని తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనాలికి తీసికొని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు.

రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు. బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు. అల్లరి ఎక్కువ. పెద్దవాడువుతున్నాడు.

ఒక రోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ క లిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. ” నాయనా ! నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు. అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు. నీకు మేలు కలుగుతుంది”అని చెప్పాడు.
AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు 14
రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది.

కాళికాదేవి రెండు చేతుల్లో రెండు పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. “నాయనా!” ఇవిగో రెండు పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి. మరోకదానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడివవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యపంతుడివవుతావు. నీకేం కావాలో కోరుకో” అంది.

AP Board 3rd Class Telugu Solutions 5th Lesson పొడుపు - విడుపు

రామకృష్ణుడు సందేహంగా చూశాడు. ‘ అమ్మా’ అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ రెండూ ఇవ్వు ఒకసారి చూసి చెప్తాను అన్నాడు.

దేవి ఇచ్చింది. రామ్మకృష్ణుడు ఒకసారి పాల గిన్నెవైపు చూశాడు. ఒకసారి పెరుగు గిన్న వైపు చూశాడు. ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒక్కసారే పాలు, పెరుగూ నోట్లో పోసుకున్నాడు.

కాళికాదేవికి కోపం వచ్చించిది. “ఇదేం పని? నీవు వికటకవి అవుతావు ఫో”అంది.

రామకృష్ణుడు దేవి కాళ్ళ పై బడ్డాడు. క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే. అందుకే రెండూ కావాలన్నాడు. తల్లీ! దయ చూపించమని వేడుకున్నాడు.

కాళికాదేవికి దయ కలిగింది. అశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికటకవిగా ప్రసిద్ధుడు. వికటకవి తిరగవేసి చదవండి. మళ్లీ వికటకవి అవుతుంది. రామకృష్ణుడు రాయల వారి ఆస్థానంలో చేరాడు.అష్ట దిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు. తెనాలి రామకృష్ణుడన్నా రామలింగడన్నా ఒకరే.

అతన్ని గురించి ఎన్నో కథలున్నాయి. తెలుసుకోండి.