SCERT AP 6th Class Maths Solutions Chapter 1 మన చుట్టూ ఉండే సంఖ్యలు Ex 1.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు Exercise 1.3
ప్రశ్న 1.
అంతర్జాతీయ సంఖ్యామాన స్థానవిలువల పట్టిక ఉపయోగించి కింది ఇవ్వబడిన సంఖ్యలను అంకెలలో రాయండి. వాటిని విస్తరణ రూపంలో కూడా రాయండి.
అ) తొమ్మిది మిలియన్ల ఏడు వందల వేల ఆరు వందల ఐదు.
సాధన.
9,700,605:
విస్తరణ రూపం : 9 × 1,000,000 + 7 × 100,000 + 6 × 100 + 5 × 1
= 9,000,000 + 700,000 + 600 + 5
ఆ) ఏడు వందల మిలియన్ల ఎనిమిది వందల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఏడు.
సాధన.
700,872,407:
విస్తరణ రూపం : 7 × 100,000,000 + 8 × 100, 000 + 7 × 10,000 + 2 × 1,000 + 4 × 100 + 7 × 1
= 700,000,000 + 800,000 + 70,000 + 2,000 + 400 + 7
ప్రశ్న 2.
కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామాన పద్దతిలో కామాలతో విభజించండి. సంఖ్యలను అక్షర రూపంలో రాయండి.
అ) 717858
ఆ) 3250672
ఇ)75623562
ఈ) 956237676
సాధన.
అ) 717,858 : ఏడు వందల పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది.
ఆ) 3,250,672 : మూడు మిలియన్ల రెండు వందల యాభై వేల ఆరువందల డెబ్బై రెండు.
ఇ) 75,623,562 : డెబ్బై ఐదు మిలియన్ల ఆరువందల ఇరవై మూడు వేల ఐదు వందల అరవై రెండు.
ఈ) 956,237,676 : తొమ్మిది వందల యాభై ఆరు మిలియన్ల రెండు వందల ముప్పై ఏడు వేల ఆరువందల డెబ్బై ఆరు.
ప్రశ్న 3.
కింది సంఖ్యలను హిందూ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్యామానంలోనూ అక్షరాలలో రాయండి.
అ) 6756327
ఆ) 45607087
ఇ) 8560707236
సాధన.
అ) 6756327
హిందూ సంఖ్యామానం :
67,56,327 : అరవై ఏడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు.
అంతర్జాతీయ సంఖ్యామానం :
6,756,327 : ఆరు మిలియన్ల ఏడు వందల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు.
ఆ) 45607087
హిందూ సంఖ్యామానం ;
4, 56,07,087 : నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఏడు వేల ఎనభై ఏడు.
అంతర్జాతీయ సంఖ్యామానం :
45,607,087 : నలభై ఐదు మిలియన్ల ఆరు వందల ఏడు వేల ఎనభై ఏడు.
ఇ) 8560707236
హిందూ సంఖ్యామానం :
856,07,07,236 : ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల ఏడు లక్షల ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు.
అంతర్జాతీయ సంఖ్యామానం :
8,560,707,236 : ఎనిమిది బిలియన్ల ఐదు వందల అరవై మిలియన్ల ఏడు వందల ఏడు వేల రెండు వందల ముఫ్పై ఆరు.
ప్రశ్న 4.
కింది సంఖ్యలను మరొక సంఖ్యామానంలో రాయండి.
హిందూ సంఖ్యామానం | అంతర్జాతీయ సంఖ్యామానం |
42,56,876 | |
6,303,448,433 | |
956,76,72,345 | |
800,000,000 |
సాధన.
హిందూ సంఖ్యామానం | అంతర్జాతీయ సంఖ్యామానం |
42,56,876 | 4,256,876 |
630,34,48,433 | 6,303,448,433 |
956,76,72,345 | 9,567,672,345 |
80,00,00,000 | 800,000,000 |
ప్రశ్న 5.
కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షర రూపంలో రాయండి.
అ) ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు.
సాధన.
293,546,753 : రెండు వందల తొంభై మూడు మిలియన్ల ఐదు వందల నలభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు.
ఆ) వెయ్యి కోట్ల తొంబై తొమ్మిది లక్షల నలభై మూడు.
సాధన.
10,009,900,043 : పది బిలియన్ల తొమ్మిది మిలియన్ల తొమ్మిది వందల వేల నలభై మూడు.
ప్రశ్న 6.
కింది సంఖ్యలను హిందూ – సంఖ్యామానంలో అక్షరరూపంలో రాయండి.
అ) తొమ్మిది బిలియన్ల ఇరవై నాలుగు మిలియన్ల యాభై వేల డెబ్బై రెండు.
సాధన.
902,40,50,072 : తొమ్మిది వందల రెండు కోట్ల నలభై లక్షల యాభై వేల డెబ్బై రెండు.
ఆ) ఏడు వందల బిలియన్ల ఆరు మిలియన్ల నాలుగు వేల ఏడు వందల ఐదు.
సాధన.
70000,60,04,705 : డెబ్బై వేల కోట్ల అరవై లక్షల నాలుగు వేల ఏడు వందల ఐదు.