SCERT AP 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Ex 3.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 3rd Lesson గ.సా.కా – క.సా.గు Exercise 3.2
ప్రశ్న 1.
భాజనీయతా సూత్రమును ఉపయోగించి, కింది సంఖ్యలలో ఏవి 11చే నిశ్శేషంగా భాగించబడతాయో తెలపండి.
అ) 6446
ఆ) 10934
ఇ) 7138965
ఈ) 726352
సాధన.
అ)
భేదం ‘0’ కావున 11 1 6446 భాగింపబడుతుంది.
(లేదా)
6446 ద్విముఖ సంఖ్య (పాలి డ్రోమ్ సంఖ్య) కావున 11చే భాగింపబడుతుంది.
ఆ)
భేదం 11 ని 11 నిశ్శేషంగా భాగిస్తుంది.
కావున ఇచ్చిన సంఖ్య 10934 ను 11 నిశ్శేషంగా భాగిస్తుంది.
ఇ)
భేదం 9 ని 11 నిశ్శేషంగా భాగించదు. కావున
ఇచ్చిన సంఖ్య 7138965 ను 11 నిశ్శేషంగా భాగించదు.
ఈ)
11 భేదం 11 ని 11 నిశ్శేషంగా భాగిస్తుంది. కావున ,
ఇచ్చిన సంఖ్య 726352 కూడా 11 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
ప్రశ్న 2.
11 చే నిశ్శేషంగా భాగించబడే, 2000 మరియు 2100 మధ్యనగల సంఖ్యలను రాయండి.
సాధన.
2000 కు సమీప పెద్దదైన 11 చే భాగింపబడు సంఖ్య = 2002 (ద్విముఖ సంఖ్య)
కావున 2000 మరియు 2100 మధ్య గల 11 చే నిశ్శేషంగా భాగింపబడే సంఖ్యలు
= 2002, 2013, 2024, 2035, 2046, 2057, 2068, 2079, 2090.
(ఏ రెండు వరుస సంఖ్యల భేదమైన 11గా ఉంటుంది)
ప్రశ్న 3.
11 చే నిశ్శేషంగా భాగించబడే, 1234 సంఖ్యకు అతి దగ్గరగా గల సంఖ్యను రాయండి.
సాధన.
ఇచ్చిన సంఖ్య
బేసి స్థానాలలోని అంకెల మొత్తం = 4 + 2 = 6
సరి స్థానాలలోని అంకెల మొత్తం = 3 + 1 = 4
వీని భేదం ‘0’ గాని, 11 చే భాగింపబడే సంఖ్య గాని అయితే 1234, 11 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
భేదం 11 కావడానికి అవకాశం లేదు. కావున ‘0’ కావాలి.
భేదం ‘0’ కావాలంటే బేసి స్థానాలలోని అంకెల మొత్తం 4 కావాలి.
కావున ఒకట్ల స్థానంలోని అంకె 4 కు బదులు 2 ఉన్నట్లయితే ఇది సాధ్యము.
కావున 1232 అనే సంఖ్య 1234 సంఖ్యకు అతి దగ్గరగా ఉండి 11 చే భాగింపబడుతుంది.
(లేదా)
1234 – 2 = 1232
11 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
కావున 11 చే నిశ్శేషంగా భాగింపబడే 1234 కు అతి దగ్గరగా గల సంఖ్య = 1232