AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Unit Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 8th Lesson జ్యామితీయ భావనలు Unit Exercise
ప్రశ్న 1.
కింది పటం నందు AC, AB, CD ల పొడవులను కొలిచి కింది వాక్యాలు సత్యమో, కాదో సరిచూడండి.
(అ) AB + AC > AC
(ఆ) AC > AD – DC
సాధన.
ఇవ్వబడిన పటంలో, AB = 4.2 సెం.మీ., BC = 5.5 సెం.మీ.
AC = 5.4 సెం.మీ., CD = 3 సెం.మీ., AD = 4 సెం.మీ.
(i) AB + AC = 4.2 + 5.4 = 9.6 సెం.మీ. > 5.4 సెం.మీ.
∴ AB + AC > AC
(ii) AD – DC = 4 – 3 = 1 సెం.మీ. < 5.4 సెం.మీ.
∴ AD – DC < AC (లేదా) AC > AD – DC
ప్రశ్న 2.
\(\overline{\mathbf{A B}}\) అనే రేఖా ఖండంను గీచి దానిపై C బిందువును గుర్తించండి. \(\overline{\mathbf{C B}}\) ని D వరకు CD > AB అయ్యేటట్లు పొడిగించండి. AC మరియు BD ల పొడవులను సరిపోల్చండి.
సాధన.
AC = 3 సెం.మీ.
BD = 5.5 సెం.మీ.
AB < CD లేదా CD > AB
ప్రశ్న 3.
m\(\angle \mathbf{AOB}\) = 40° కొలతగా గల \(\angle \mathbf{AOB}\) ని గీయండి. m\(\angle \mathbf{AOC}\) = 90° అగునట్లు \(\angle \mathbf{BOC}\) కోణాన్ని గీయండి. m\(\angle \mathbf{AOB}\) + m\(\angle \mathbf{BOC}\) = m\(\angle \mathbf{AOC}\) అగునో, కాదో సరిచూడండి.
సాధన.
\(\angle \mathbf{AOB}\) = 40°
\(\angle \mathbf{AOC}\) = 90°
\(\angle \mathbf{BOC}\) = 50°
m\(\angle \mathbf{AOB}\) + m\(\angle \mathbf{BOC}\) = 40° + 50° = 90°
∴ m\(\angle \mathbf{AOB}\) + m\(\angle \mathbf{BOC}\) = m\(\angle \mathbf{AOC}\)
ప్రశ్న 4.
m\(\angle \mathbf{XYZ}\) = 62° అగునట్లు \(\angle \mathbf{XYZ}\) కోణాన్ని గీయండి. \(\angle \mathbf{XYZ}\) బాహ్యకోణం ఎంత ఉందో కొలవండి.
సాధన.
\(\angle \mathbf{XYZ}\) = 62°
\(\angle \mathbf{XYZ}\) బాహ్యకోణం = 118° + 180° = 298°
ప్రశ్న 5.
జతపర్చండి.
1. మూలమట్టాలు | (A) కోణాలను కొలుచుటకు |
2. కోణమానిని | (B) రేఖా ఖండాల పొడవులు కొలుచుటకు |
3. విభాగిని | (C) సమాంతర రేఖలు గీయుటకు |
సాధన.
1. మూలమట్టాలు | (C) సమాంతర రేఖలు గీయుటకు |
2. కోణమానిని | (A) కోణాలను కొలుచుటకు |
3. విభాగిని | (B) రేఖా ఖండాల పొడవులు కొలుచుటకు |
ప్రశ్న 6.
ఆంగ్ల అక్షరమాలలో పెద్ద అక్షరాలు (Capital letters) నుండి లంబకోణాలను కలిగి ఉన్న అక్షరాలను రాయండి.
సాధన.
ప్రశ్న 7.
\(\angle \mathrm{AQP}, \angle \mathrm{CPR}, \angle \mathrm{BRQ}\) ల కొలతలను కొలవండి.
\(\mathbf{m} \angle \mathbf{A Q P}, \mathbf{m} \angle \mathbf{C P R}, \mathbf{m} \angle \mathbf{B R Q}\) విలువలు రాయండి.
సాధన.
m\(\angle \mathrm{AQP}\) = 120°
m\(\angle \mathrm{CPR}\) = 110°
m\(\angle \mathrm{BRQ}\) = 130°