AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Ex 9.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Exercise 9.3
ప్రశ్న 1.
ఇవ్వబడిన చతుర్భుజాన్ని పరిశీలించి, ప్రశ్నలకు సమాధానమివ్వండి.
(అ) ఇవ్వబడిన చతుర్భుజం యొక్క భుజాలేవి?
(ఆ) \(\overline{\mathrm{AB}}\) భుజానికి ఎదుటి భుజమేది?
(ఇ) శీర్షం B కు ఎదుటి కోణమేది?
(ఈ) \(\angle \mathbf{C}\) కు ఎదుట ఉండే భుజం ఏది?
(ఉ) పక్కకోణాల జతలెన్ని? అవి ఏవి ?
(ఊ) ఎదుటి కోణాల జతలెన్ని ? అవి ఏవి?
సాధన.
(అ) \(\overline{\mathrm{AB}}, \overline{\mathrm{BC}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{DA}}\).
(ఆ) \(\overline{\mathrm{AB}}\) భుజానికి ఎదుటి భుజం \(\overline{\mathrm{CD}}\).
(ఇ) శీర్షం B కు ఎదుటి కోణం \(\angle \mathbf{D}\) లేదా \(\angle \mathbf{ADC}\).
(ఈ) \(\angle \mathbf{C}\) కు ఎదుటి భుజంను నిర్ణయించలేము.
\(\angle \mathbf{C}\) కు ఎదుటికోణము \(\angle \mathbf{A}\).
(ఉ) పక్కకోణాల జతలు = 4
అవి : \((\angle \mathrm{A}, \angle \mathrm{B}),(\angle \mathrm{B}, \angle \mathrm{C}),(\angle \mathrm{C}, \angle \mathrm{D}),(\angle \mathrm{D}, \angle \mathrm{A})\)
(ఊ) ఎదుటి కోణాల జతలు = 2
అవి : (i) \((\angle \mathrm{A}, \angle \mathrm{C})\)
(ii) \((\angle \mathrm{B}, \angle \mathrm{D})\)
ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన పటాలకు సౌష్ఠవాక్షాల సంఖ్య తెలపండి.
సాధన.
(i) ఇవ్వబడిన పటం చతురస్రం.
చతురస్రానికి గీయదగు సౌష్ఠవాక్షాల సంఖ్య = 4
(ii) సౌష్ఠవాక్షాల సంఖ్య = అనంతము.
(వృత్తం యొక్క ప్రతి వ్యాసము ఒక సౌష్ఠవాక్షం అవుతుంది. వృత్తానికి అనంత వ్యాసాలు గీయగలము.)
(iii) ఇవ్వబడిన త్రిభుజానికి గీయదగు సౌష్ఠవాక్షాల సంఖ్య = 3