AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

SCERT AP 6th Class Science Study Material Pdf 10th Lesson విద్యుత్ వలయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 10th Lesson Questions and Answers విద్యుత్ వలయాలు

6th Class Science 10th Lesson విద్యుత్ వలయాలు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ………… అంటారు. (కరెంట్)
2. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ………………………… నియంత్రిస్తుంది. (స్విచ్)
3. విద్యుత్ ను తమగుండా ప్రవహింపజేసే పదార్థాలను ……………………. అంటారు. (విద్యుత్ వాహకాలు)
4. విద్యుత్ బల్బును …………………. కనిపెట్టాడు. (థామస్ ఆల్వా ఎడిసన్)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. బల్బులో కాంతిని ఇచ్చే భాగం
A) లోహపు మూత
B) గాజు కోటరం
C) ఫిలమెంట్
D) ధృవాలు
జవాబు:
C) ఫిలమెంట్

2. విద్యుత్ బంధకాన్ని గుర్తించండి.
A) జడ పిన్ను
B) ఇనుప మేకు
C) ప్లాస్టిక్ స్కేలు
D) పెన్సిల్ ములుకు
జవాబు:
C) ప్లాస్టిక్ స్కేలు

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

3. ప్రస్తుతం మనం వాడుతున్న బల్బులోని ఫిలమెంట్ ను దీనితో తయారుచేస్తున్నారు.
A) ఇనుము
B) రాగి
C) టంగ్ స్టన్
D) దూది
జవాబు:
C) టంగ్ స్టన్

III. ఈ క్రింది. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
విద్యుత్ వలయం అనగానేమి? పటం సహాయంతో వివరించండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 10
విద్యుత్ ఘటంలోని విద్యుత్ ధన ధృవం నుంచి ప్రారంభమై విద్యుత్ పరికరాల్లో ప్రయాణించి తిరిగి రుణ ధృవాన్ని చేరుతుంది. దీనినే విద్యుత్ వలయము అంటాము. విద్యుత్ వలయం పూర్తి అయినప్పుడు మాత్రమే విద్యుత్ పరికరాలు పనిచేస్తాయి.

ప్రశ్న 2.
టార్చిలైటు యొక్క భాగాలేవి?
జవాబు:
టార్చిలైటులో ప్రధానంగా విద్యుత్ ఘటాలు, బల్బు, స్విచ్, లోహపు తీగలు ఉంటాయి. ఇవన్నీ లోహపు పాత్రలో ఒక పద్ధతిలో కలపబడి స్విచ్ వేసినప్పుడు బల్బు వెలిగే విధంగా అమర్చబడి ఉంటాయి.

ప్రశ్న 3.
కింది వాటిని విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరించండి.
ఎ) నీరు
బి) ప్లాస్టిక్ పెన్ను
సి) పెన్సిల్ ములుకు
డి) పొడిగా ఉన్న నూలుగుడ్డ
ఇ) తడిగా ఉన్న నూలుగుడ్డ
ఎఫ్) పొడిగా ఉన్న కట్టె
జి) తడిగా ఉన్న కట్టె
జవాబు:
విద్యుత్ వాహకాలు :
నీరు, పెన్సిల్ ములుకు, తడిగా ఉన్న నూలు గుడ్డ, తడిగా ఉన్న కట్టె.

విద్యుత్ బంధకాలు :
ప్లాస్టిక్ పెన్ను, పొడిగా ఉన్న నూలు గుడ్డ, పొడిగా ఉన్న కట్టె.

ప్రశ్న 4.
కింది పటంలో చూపిన విధంగా టార్చిలైటులో ఘటాలను అమర్చినప్పుడు ఏమి జరుగుతుంది?
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 2
జవాబు:
టార్చిలైట్ పటంలో విద్యుత్ ఘటాలు తిప్పి ఉన్నాయి. అందువలన విద్యుత్ ప్రవాహం జరగదు. కాబట్టి బల్బు వెలగదు. విద్యుత్ ఘటాలను సరిచేసినట్లయితే వెలుగుతుంది.

ప్రశ్న 5.
చేతికి రబ్బరు తొడుగు వేసుకొని వీధి దీపాలను బాగుచేస్తున్న ఒక వ్యక్తిని చూసి నీహారికకు అనేక సందేహాలొచ్చాయి. ఆ సందేహాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:

  1. విద్యుత్ దీపాలు బాగుచేస్తున్న వ్యక్తి చేతికి రబ్బరు తొడుగు ఎందుకు వేసుకున్నాడు?
  2. రబ్బరు తొడుగుకు విద్యుత్ కి ఉన్న సంబంధం ఏమిటి?
  3. రబ్బరు తొడుగు ఉండటం వల్ల మనం ఎలా రక్షించబడతాము?
  4. విద్యుత్తు తీగపైన ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఎందుకు?

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 6.
ఒక ఘటం, స్విచ్, బల్బులను వలయంలో కలిపినప్పుడు బల్బు వెలగలేదు. కారణాలు ఏమై ఉంటాయో ఊహించి రాయండి.
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్తు ధన ధృవం నుంచి ఋణ ధ్రువానికి ప్రయాణిస్తుంది. కావున విద్యుత్ వలయంలో పరికరాలను ఒక పద్ధతిలో కలపాలి. లేనట్లయితే విద్యుత్ ప్రసరణ జరగదు, బల్బు వెలగదు.

ప్రశ్న 7.
నీకు ఇచ్చిన పదార్థాలు వస్తువులు విద్యుత్ వాహకాలో, విద్యుత్ బంధకాలో ఏ విధంగా పరీక్షించి తెలుసుకుంటావు?
జవాబు:

  • ఒక పదార్థం విద్యుత్ వాహకం అవునో కాదో తెలుసుకోవటానికి నేను విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేస్తాను.
  • పరిశీలించాల్సిన పదార్థాన్ని విద్యుత్ వలయంలో పెట్టినప్పుడు బల్బు వెలిగితే దాని ద్వారా విద్యుత్తు ప్రసరించింది అని అర్ధం. కావున అది విద్యుత్ వాహకం.
  • బల్బ్ వెలగకపోతే ఆ పదార్థం ద్వారా విద్యుత్తు ప్రసరించలేదు అంటే అది విద్యుత్తు బంధకమని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 8.
ఒక ఘటం, స్విచ్, బల్బు ఉన్న విద్యుత్ వలయ పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 3

ప్రశ్న 9.
నిత్య జీవితంలో విద్యుత్ ను ఏయే పనులలో ఉపయోగిస్తున్నామో ఒక జాబితా రాయండి.
జవాబు:
విద్యుత్ మన నిత్య జీవితంతో చాలా ముడిపడి ఉంది.

  1. ఇంటిలో వెలుతురు కోసం విద్యుత్ బల్బు వెలిగిస్తాము.
  2. గాలి కోసం ఉపయోగించే ఫ్యాను విద్యుత్ వల్ల పనిచేస్తుంది.
  3. వేడి నీటి కోసం హీటర్ గీజర్ వాడతాము.
  4. వేసవిలో చల్లదనం కోసం వాడే ఏ.సి.లు విద్యుత్ తో పనిచేస్తాయి.
  5. వీధిలైట్లు, వాహనాల్లోని దీపాలు వెలగటానికి విద్యుత్ కావాలి.
  6. పరిశ్రమలు పనిచేయటానికి విద్యుత్ కావాలి.
  7. విద్యుత్ వాహనాలు, రైళ్లు నడపటానికి విద్యుత్ కావాలి.
  8. మిక్సీ, గైండర్, ఓవెన్, ఫ్రిజ్ వంటి అనేక గృహోపకరణాలు పనిచేయడానికి విద్యుత్ కావాలి.

కృత్యాలు

కృత్యం – 1 ఘటాన్ని పరిశీలిద్దాం

6th Class Science Textbook Page No. 110

ప్రశ్న 1.
టార్చిలైట్ బల్బును లేదా ఒక విద్యుత్ బల్బు (పటం)ను జాగ్రత్తగా పరిశీలించండి.

టార్చిలైట్ బల్బ్ లో ఒక లోహపు దిమ్మ. దానిపైన గాజుబుగ్గ ఉన్నాయి కదా ! లోపల ఉన్న రెండు తీగలను గమనించండి. ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ రెండు తీగలూ ధృవాలుగా పనిచేస్తాయి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 4

విద్యుత్ బల్బ్ లో దిమ్మ వెనుకవైపు రెండు ఉబ్బెత్తు భాగాలుంటాయి. గాజు కోటరం వాటిని పరిశీలించండి. దిమ్మ పగులగొట్టి లోపలి తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. (గాజు ముక్కలు గుచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి) టార్చ్ బల్బ్ కు, విద్యుత్ బల్బుకు తేడాలను గుర్తించండి.

బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్పింగులాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం దీన్నే ‘ఫిలమెంట్’ అంటారు.

• బల్బుకూ, ఘటానికి రెండు ధృవాలు ఎందుకు ఉంటాయి?
జవాబు:
బల్బ్ కు, ఘటానికి రెండు ధృవాలు ఉంటాయి. వీటిలో ఒకటి ధన ధృవము, రెండవది ఋణ ధృవము. ధన ధృవము నుండి ఋణ ధృవానికి విద్యుత్ ప్రవహిస్తుంది. అందువలన ఇవి రెండు ధృవాలు కలిగి ఉంటాయి.

• ఘటం సహాయంతో బల్బు ఎలా వెలుగుతుంది?
జవాబు:
ఘటం లోపల రసాయన పదార్థాలు ఉంటాయి. వీటి నుండి విద్యుత్ ఉత్పత్తి కావటం వలన బల్బ్ వెలుగుతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

కృత్యం – 2 సాధారణ విద్యుత్ వలయాలు

6th Class Science Textbook Page No. 110

ప్రశ్న 2.
పటం – (బి) నుండి (జి) వరకు చూపిన విధంగా విద్యుత్ వలయాన్ని వేరు వేరు విధాలుగా కలపండి. బల్బు వెలుగుతున్నదో లేదో గమనించి, మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 5
పట్టిక

వలయం అమరిక బల్బు వెలుగుతుందా (అవును/కాదు)
పటం – బి
పటం – సి
పటం – డి
పటం – ఇ
పటం – ఎఫ్
పటం – జి

• పై పటాలలో దేనిలో బల్బ్ వెలుగుతుంది ? వేటిలో బల్బ్ వెలగదు? ఎందుకు?
జవాబు:
(డి), (ఇ) పటాలలో మాత్రమే బల్బ్ వెలుగుతుంది. విద్యుత్ ప్రవహించడానికి ఒక మూసి ఉన్న మార్గం ఉంది. కాని మిగిలిన పటాలలో విద్యుత్ ప్రసార మార్గం మూసిలేదు.

వలయం అమరిక బల్బు వెలుగుతుందా (అవును/కాదు)
పటం – బి కాదు
పటం – సి కాదు
పటం – డి అవును
పటం – ఇ అవును
పటం – ఎఫ్ కాదు
పటం – జి కాదు

కృత్యం – 3 స్విచ్ (మీట) ఎలా పనిచేస్తుంది?

6th Class Science Textbook Page No. 112

ప్రశ్న 3.
పటంలో చూపిన విధంగా ఒక చెక్క పలకపైన గాని లేదా ఒక థర్మకోల్ షీటుపైన గాని వలయాన్ని అమర్చండి.
వలయంలో A, B ల వద్ద రెండు డ్రాయింగ్ పిన్నులు అమర్చండి. ఒక పిన్నీసును తీసుకొని దాని ఒక కొన (B) వద్ద తాకేటట్టుగాను, రెండవ కొన విడిగా ఉండేటట్లుగాను అమర్చండి. బల్బు వెలుగుతుందా ? ఇప్పుడు పిన్నీసు రెండవ కొనను (A) కి తాకించండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందో లేదో గమనించండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 6
• పిన్నీసు రెండవ కొన (A) ని తాకనప్పుడు బల్బు ఎందుకు వెలగలేదు?
జవాబు:
రెండవ కొనని తాకనపుడు విద్యుత్ వలయం పూర్తి కాలేదు. అందువలన బల్బ్ వెలగలేదు.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 113

ప్రశ్న 4.
రెండు ఘటాలున్న ఒక టార్చిలైటును తీసుకొని, దానిలో ఘటాలను సాధ్యమైనన్ని విధాలుగా అమర్చండి. ఏ సందర్భంలో బల్బు వెలుగుతుందో గమనించండి. ప్రతిసారి మీ అమరికను పటం ద్వారా చూపండి. ఘటాలను ఒక నిర్దిష్టమైన పద్దతిలో అమర్చినప్పుడు మాత్రమే టార్చిలైటు బల్బు వెలుగుతుంది. ఎందుకో గమనించండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 7
జవాబు:

ఘటాల కలయిక బల్బ్ వెలుగుతుంది / వెలగలేదు
++ (ధన, ధన) వెలగలేదు
+- (ధన, ఋణ) వెలుగుతుంది
– – (ఋణ, ఋణ) వెలగలేదు

కృత్యం – 5 విద్యుత్ వాహకాలు, బంధకాలను గుర్తిద్దాం

6th Class Science Textbook Page No. 114

ప్రశ్న 5.
కృత్యం-3లో ఉపయోగించిన విద్యుత్ వలయాన్ని తీసుకోండి. పటంలో చూపిన విధంగా A, B ల మధ్య ఉండే పిన్నీసును తొలగించండి.

ఇప్పుడు A, B లను తాకేటట్లుగా జడపిన్ను, పిన్నీసు, పెన్సిల్, రబ్బరు, ప్లాస్టిక్ స్కేలు, అగ్గిపుల్ల, లోహపు చేతి గాజు, గాజుతో చేసిన చేతి గాజు, పేపరు క్లిప్పు, ఉప్పు నీరు, నిమ్మరసం మొదలయిన వస్తువులను ఒకదాని తరవాత మరొకటి ఉంచండి. ఏయే సందర్భాలలో బల్బు వెలుగుతుందో పరిశీలించి పట్టికలో నమోదు చేయండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 8
జవాబు:

పట్టిక :

వస్తువు పదార్థం బల్బు వెలుగుతుందా (అవును / కాదు)
1. జడపిన్ను లోహం అవును
2. రబ్బరు రబ్బరు కాదు
3. ప్లాస్టిక్ స్కేలు ప్లాస్టిక్ కాదు
4. అగ్గిపుల్ల చెక్క కాదు
5. గణిత పేటికలోని డివైడరు లోహం అవును
6. పేపరు ముక్క కాగితం కాదు
7. ఇనుప మేకు లోహం అవును
8. గాజు ముక్క గాజు కాదు
9. పెన్సిల్ గ్రాఫైట్ అవును
10. లోహపు ముక్క లోహం అవును
11. చాక్ పీసు సున్నం కాదు
12. పేపర్ క్లిప్పు లోహం అవును

దీని ఆధారంగా పట్టికలోని వస్తువులను విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరించి క్రింది పట్టికలో రాయండి.
జవాబు:

విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు
జడపిన్ను రబ్బరు
గణిత పేటికలోని డివైడరు ప్లాస్టిక్ స్కేల్
ఇనుపమేకు అగ్గిపుల్ల
పెన్సిల్ పేపర్ ముక్క
లోహపు ముక్క గాజు ముక్క
పేపర్ క్లిప్ చాక్ పీస్

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 118

ప్రశ్న 1.
పాఠంలోని కృత్యం -4లో కొన్నిసార్లు బల్బు వెలగడం గమనించాం. ఈ సందర్భాలలో కూడా బల్బు వెలగకుండా చేయగలనని నిహారిక సవాలు చేయడమే గాక వెలగకుండా చేసి చూపించింది. ఆమె ఏమేమి చేసి ఉండవచ్చు?
జవాబు:
ఘటాలను సరిగా కలిపినప్పటికి బల్బు ధృవాలను మార్చితే బల్బు వెలగదు. ఈ విధంగా నిహారికా బల్బు వెలగకుండ చేసి ఉండవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా వలయాన్ని కలపండి.
ఎ) బల్బు వెలుగుతుందా? ఎందుకు?
బి) బల్బు వెలిగే విధంగా వలయాన్ని పూర్తి చేయండి.
సి) ఇవ్వబడిన పటం నందు ఘటం, బల్బుల అమరికను పరిశీలించి సరిగ్గా ఉన్నవో లేవో చూడండి.
AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 9
జవాబు:
ఎ) పటంలో చూపిన వలయంలో బల్బు వెలగదు. దీనికి కారణం రెండు ఘటాలు ధన ధృవము వైపు కలపబడి ఉన్నాయి.
బి)AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు 10a
సి) ఇవ్వబడిన పటంలో ఘటాల, బల్బు అమరిక సరిగా లేదు. బల్బ్ యొక్క రెండు ధృవాలు ఘటం యొక్క ఋణ ధృవానికి కలపబడి ఉన్నాయి. ఇది సరి కాదు బల్బ్ యొక్క ధన ధృవము ఘటం యొక్క ధన ధృవానికి, బల్బ్ యొక్క ఋణ ధృవం ఘటం యొక్క ఋణ ధృవానికి కలపాలి.

ప్రశ్న 3.
థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్న విధానాన్ని గురించి చదివారు కదా ! బల్బు కనిపెట్టడంలో అతను పడిన శ్రమను నీవెట్లా అభినందిస్తావు?
జవాబు:
థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికి విద్యుత్ బల్బు అందించిన మహనీయుడు. ఇతను ప్రతీది ప్రయోగాలు చేసి, నేర్చుకొనే మనస్తత్వం కలవాడు. తన జీవిత కాలంలో వెయ్యికి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడంటే అతని శ్రమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ కోసం తను దాదాపు వెయ్యికి పైగా పదార్థాలు పరిశీలించారు. అంటే అతని పట్టుదల అర్థమవుతుంది.

విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ కోసం అతను నూలు దారాన్ని, వెదురు కర్రను కూడా ఉపయోగించాడంటే అతని అంకితభావం అర్థమవుతుంది. ఎడిసన్ యొక్క ఇటువంటి కృషి వలన ప్రపంచం నేడు వెలుగుతో నిండి ఉంది. కావున ప్రపంచానికి వెలుగు నింపిన శాస్త్రవేత్తగా ఎడిసన్ ను కీర్తించవచ్చు.

AP Board 6th Class Science Solutions Chapter 10 విద్యుత్ వలయాలు

ప్రశ్న 4.
కింది పటంలో చూపిన విధంగా వలయాలను కలపండి. ప్రతి సందర్భంలో మీరేమి గమనించారో నమోదు చేయండి.
జవాబు:

  1. మొదటి సందర్భంలో రెండు ఘటాల ధన ధ్రువాలు ఒకదానితో ఒకటి కలపబడి ఉన్నాయి. కావున విద్యుత్ ప్రసరించదు. అందువలన బల్బు వెలగలేదు.
  2. రెండవ సందర్భంలో రెండు ఘటాలు సరైన విధానంలో కలపబడి ఉన్నాయి. అనగా ఒక ఘటము యొక్క ధన ధ్రువం రెండవ ఘటము యొక్క ఋణ ధ్రువానికి కలపబడి ఉంది. కావున విద్యుత్ ప్రసరించి బల్బ్ వెలుగుతుంది.
  3. మూడవ సందర్భంలో విద్యుత్ ఘటం ఒకటి ఉంది. కావున బల్బు వెలిగినప్పటికి తక్కువ కాంతితో వెలుగుతుంది.
  4. నాలుగవ సందర్భంలో మూడు ఘటాలు ఉపయోగించబడ్డాయి. అవి కూడా సరైన వరుసలో కలుపబడి ఉన్నాయి. కావున బల్బు వెలుగుతుంది అయితే మూడవ సందర్భంలో కంటే మూడు రెట్లు ప్రకాశవంతంగా బల్బు వెలగడం గమనించవచ్చు.

దీన్ని బట్టి ఘటాల సంఖ్య పెరిగితే బల్బు కాంతి తీవ్రత పెరుగుతుంది. వాటిని సరైన పద్ధతిలో అమర్చినపుడే బల్బ్ వెలుగుతుంది.