AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

SCERT AP 6th Class Science Study Material Pdf 4th Lesson నీరు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Science 4th Lesson Questions and Answers నీరు

6th Class Science 4th Lesson నీరు Textbook Questions and Answers

Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)

I. ఖాళీలను పూరించండి.

1. నీరు, నీటి ఆవిరిగా మారే ప్రక్రియను …………… అంటారు. (బాష్పీభవనం)
2. జల చక్రాన్ని ………… అని కూడా అంటారు. (హైడ్రోలాజికల్ వలయం)
3. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో ……… కు దారితీస్తుంది. (కరవు)
4. అధిక వర్షాలు ……… కారణమవుతాయి. (వరదలకు)

II. సరైన సమాధానాన్ని గుర్తించండి.

1. సముద్రపు నీటి స్వభావం
A) ఉప్పగా ఉంటుంది
B) రుచి ఉండదు
C) వాసన ఉండదు
D) తియ్యగా ఉంటుంది
జవాబు:
A) ఉప్పగా ఉంటుంది

2. జల చక్రంలో భాగం కానిది
A) బాష్పీభవనం
B) సాంద్రీకరణం
C) వర్షం
D) స్వేదనం
జవాబు:
D) స్వేదనం

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

3. కింది వానిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియ
A) వడగళ్ళు
B) అవపాతం
C) సాంద్రీకరణం
D) బాష్పీభవనం
జవాబు:
C) సాంద్రీకరణం

III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ప్రతిరోజు మనం నీటిని ఉపయోగిస్తూ చేసే పనుల జాబితా రాయండి.
జవాబు:
మన రోజువారీ కార్యకలాపాలకు ఉదా : ఎ) త్రాగడానికి బి) మరుగుదొడ్లు సి) స్నానం చేయడం డి) బట్టలు ఉతకడం ఇ) పాత్రలు శుభ్రం చేయడానికి మనకు నీరు అవసరం.

  • విత్తనం అంకురోత్పత్తికి నీరు అవసరం.
  • విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తారు.
  • పంటలలో నీటిపారుదల కోసం నీటిని ఉపయోగిస్తారు.
  • మన శరీర జీవక్రియ చర్యలకు నీరు అవసరం.
  • అనేక పరిశ్రమలలో నీటిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
మేఘాలు ఎలా ఏర్పడతాయి? వివరించండి.
జవాబు:
ఘనీభవనం మరియు బాష్పీభవన ప్రక్రియ మేఘాలు ఏర్పడటానికి కారణమవుతుంది.

  • సూర్యుడు తన వేడితో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిలో నీటిని ఆవిరి చేస్తాడు.
  • ఈ బాష్పీభవన ప్రక్రియ ద్వారా నీరు నీటి ఆవిరిగా మారుతుంది.
  • నీటి ఆవిరి వాతావరణంలోకి పైకి లేచినప్పుడు అది చల్లగా మారుతుంది.
  • ఈ నీటి ఆవిరి అధిక స్థాయికి చేరుకున్నప్పుడు, ఇది చల్లని గాలితో కలసి ఘనీభవిస్తుంది అందువలన చిన్న చుక్కలు లేదా నీటి బిందువులను ఏర్పరుస్తుంది.
  • ఈ చిన్న బిందువులు వాతావరణంలో అధిక స్థాయిలో గాలిలో తేలుతూ ఉండి మేఘాలుగా కనిపిస్తాయి.

ప్రశ్న 3.
కిందివానిలో ఏ రోజు ఉతికిన బట్టలు ఆరడానికి చాలా అనువైనది? వివరించండి.
A) బాగా గాలి వీస్తున్న రోజు B) మేఘాలు ఆవరించిన రోజు,
జవాబు:

  • ఉతికిన బట్టలు ఆరబెట్టడానికి గాలులతో కూడిన రోజు అనుకూలంగా ఉంటుంది.
  • మేఘావృతమైన రోజున, గాలిలో తేమ మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాష్పీభవనం నెమ్మదిగా జరుగుతుంది.
  • గాలులతో కూడిన రోజున వాతావరణంలో తేమ మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి బాష్పీభవన రేటు ఎక్కువగా ఉంటుంది.
  • అందువల్ల, గాలులతో కూడిన రోజు ఉతికిన బట్టలు త్వరగా ఆరిపోతాయి.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

ప్రశ్న 4.
చలికాలంలో మనం మాట్లాడేటప్పుడు మన నోటి దగ్గర పొగ మేఘాల్లాంటివి ఎందుకు ఏర్పడతాయి?
జవాబు:
చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది.

  • దీనివల్ల నీటి ఆవిరి చల్లబ చిన్న నీటి బిందువుల పొగమంచుగా ఘనీభవిస్తుంది.
  • కాబట్టి, గాలి నోటి వెలుపలికి చేరుకున్నప్పుడు నోటిలోని నీటి ఆవిరి అకస్మాత్తుగా చల్లబడుతుంది.
  • తద్వారా శీతాకాలంలో మాట్లాడేటప్పుడు మన నోటి దగ్గర పొగ వంటి మేఘాన్ని చూస్తాము.

ప్రశ్న 5.
వర్షంలో వాహనం నడుపుతున్న డ్రైవర్ బయటి వైపు వైపర్ పని చేస్తున్నప్పటికి లోపలి వైపున అద్దాన్ని తరచుగా తుడుస్తుంటాడు. ఎందుకు?
జవాబు:

  • వాహనం వెలుపల వైపర్ వర్షపు నీటిని తుడిచివేస్తుంది.
  • వర్షం యొక్క చల్లదనం వలన గాజు లోపలి ఉపరితలంపై కారులోకి గాలిలోని తేమ చేరుతుంది.
  • తేమ యొక్క ఈ సాంద్రీకరణ కారణంగా డ్రైవరు డ్రైవ్ చేయడానికి ఆటంకంగా మారుతుంది.
  • స్పష్టంగా చూడటానికి అద్దంపై తేమను తొలిగించాలి కావున, డ్రైవర్ అద్దం లోపలి తలాన్ని చేతితో తుడిచివేస్తాడు.

ప్రశ్న 6.
జలచక్రం అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను “జలచక్రం” (హైడ్రోలాజికల్ వలయం) అని అంటారు, జలచక్రాన్ని సులభంగా ఈ కింది విధంగా క్రోడీకరించవచ్చు.
1. బాష్పీభవనం : ద్రవం, వాయువుగా మారటం.
కారణం : సూర్యుడు నీటి వనరులను వేడి చేయటం.
ఫలితం : ద్రవ నీరు, నీటి ఆవిరి ( వాయువు)గా మారుతుంది.

2. సాంద్రీకరణం : వాయువు ద్రవంగా మారటం.
కారణం : ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడటం.
ఫలితం : నీటి ఆవిరి (వాయువు) మేఘాలలో ద్రవ నీటిగా మారుతుంది.

3. అవపాతం : నీరు లేదా గడ్డ కట్టిన నీరు భూమిపై పడటం.
కారణం : మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అవి భూమిపై పడతాయి.
ఫలితం : వర్షం, మంచు, స్ట్రీట్ లేదా వడగళ్ళ రూపంలో అవపాతం చెందిన నీరు భూమికి చేరటం.

4. సేకరణ మరియు ప్రవాహం : నీరు భూగర్భంలోనికి ఇంకడం, ప్రవహించడం.
కారణం : భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం, కొన్నిసార్లు ముందుకు ప్రవహించటం.
ఫలితం : నీరు సరస్సులు, చెరువులలో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా ప్రవహించి, సముద్రాలు, మహా సముద్రాలకు చేరుతుంది.

ప్రశ్న 7.
పాఠశాలకు వెళ్ళటానికి సిద్ధం అవుతున్న రేవంత్ తన నోటి నుండి అద్దం పైకి గాలి ఉదాడు. అద్దంలో తన ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడటాన్ని గమనించాడు. సంఘటనలో మీకు ఏమైనా సందేహాలు కలిగాయా? మీ సందేహాలపై ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:

  • రేవంత్ అద్దం పైకి గాలి ఊదినప్పుడు అద్దంలో ఉన్న చిత్రం ఎందుకు స్పష్టంగా లేదు?
  • దీనికి కారణమయ్యే ప్రక్రియ ఏమిటి?
  • ఇది అన్ని వేళలా జరుగుతుందా?
  • ఏ వాతావరణ పరిస్థితులలో ఇది జరుగుతుంది?

ప్రశ్న 8.
మనం నీటిని దుర్వినియోగం చేస్తూ పోతే భవిష్యత్ లో ఏమి జరగవచ్చు?
జవాబు:
మనం నీటిని దుర్వినియోగం చేస్తే అది భవిష్యత్తులో నీటి కొరతకు కారణమవుతుంది.

  • నీరు లేని చోట మనం వివిధ కార్యకలాపాలు చేయలేము.
  • ఇది గ్లోబల్ వార్మింగ్ కు కూడా దారితీస్తుంది.
  • ఆహారం మరియు పశుగ్రాసం పొందడం చాలా కష్టం.
  • నీరు లేకుండా భూమిపై జీవనం సాధ్యం కాదు.

ప్రశ్న 9.
ఒక గాజు గ్లాసు, నీరు, మంచు ముక్కలను ఉపయోగించి నీటి సాంద్రీకరణను ఎలా ప్రదర్శిస్తారు?
జవాబు:
లక్ష్యం : నీటి సాంద్రీకరణ ప్రదర్శించటం.

మనకు ఏమి కావాలి? : ఒక గాజు గ్లాసు, నీరు మరియు మంచు ముక్కలు.
AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు 1

ఏం చెయ్యాలి? :
సగం నీటితో నిండిన గ్లాసు తీసుకోండి. బయటి నుండి గాజు గ్లాసును ఒక గుడ్డతో తుడవండి. నీటిలో కొన్ని మంచు ముక్కలు వేయండి. ఒకటి లేదా రెండు నిమిషాలు వేచి ఉండండి. గాజు బయటి ఉపరితలంపై జరిగే మార్పులను గమనించండి.

మనం ఏమి చూస్తాము :
గాజు బయటి ఉపరితలంపై నీటి చుక్కలు కనిపిస్తాయి.

మనం ఏమి నేర్చుకుంటాం :
గాజు యొక్క చల్లని ఉపరితలం దాని చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తుంది. చుట్టుపక్కల ఉన్న నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది గాజు ఉపరితలంపై నీటి బిందువులను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 10.
జల చక్రాన్ని చూపు చక్కని పటం గీయండి.
జవాబు:
AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు 2

ప్రశ్న 11.
మొక్కలు మరియు జంతువుల యొక్క వివిధ అవసరాలకు నీటిని అందుబాటులో ఉంచటంలో జల చక్రం యొక్క పాత్రను ఎలా అభినందిస్తావు?
జవాబు:
జీవుల యొక్క ప్రాథమిక అవసరం నీరు.

  • వర్షపాతానికి జల చక్రం కారణం మరియు ఇది పంటల ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహదం చేస్తుంది.
  • నీటి చక్రం భూమి యొక్క పర్యావరణ సమతుల్యతను నిర్వహిస్తుంది.
  • నీటి చక్రం భూమి యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహిస్తుంది.
  • నీరు చాలా మొక్కలు మరియు జంతువులకు ఆవాసంగా ఉంది.
  • కావున నీరు లేనిదే భూమిపై జీవ కోటి లేదు.

ప్రశ్న 12.
నీరు వృథా కాకుండా ఉండటానికి ఏమి సూచనలు ఇస్తావు?
జవాబు:

  • ఉపయోగించిన తర్వాత నీటి కొళాయిని త్వరగా ఆపివేయండి.
  • వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయండి.
  • వాడిన నీటిని ఇతర పనులకు వాడండి.
  • నీటిని ఆదా చేయడానికి మోటరును సమయానికి స్విచ్ ఆఫ్ చేయండి.
  • లీకులు లేకుండా మరమ్మతులు చేయండి.
  • నీటి కొళాయిలను తరచూ తనిఖీ చేయండి.
  • త్రాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.
  • కాలుష్య కారకాలను వేరు చేసి నీటిని రీసైకిల్ చేయండి.
  • వర్షపు నీటి పెంపకం వంటి నీటి నిర్వహణ పద్ధతులను అనుసరించండి.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

ప్రశ్న 13.
తీవ్రమైన వరదల కారణంగా బాధపడుతున్న ప్రజలకు నీవు ఏవిధంగా సహాయం చేస్తావు?
జవాబు:
తీవ్రమైన వరదలు కారణంగా ప్రజలు బాధపడుతుంటే, నేను క్రింది మార్గాలను అనుసరించి, వారికి సహాయం చేస్తాను.

  • ఆహారం, త్రాగునీరు అందించడం ద్వారా,
  • వారికి దుప్పట్లు, దుస్తులు అందించడం ద్వారా,
  • శానిటరీ పరిశుభ్రత మరియు మందులకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా,
  • ఆశ్రయం కల్పించడం ద్వారా,
  • వారి సహాయం తీసుకోవడానికి వ్యక్తిగత స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలను సంప్రదించడం ద్వా రా.

కృత్యాలు

కృత్యం – 1

6th Class Science Textbook Page No. 33

ప్రశ్న 1.
పిల్లలతో జట్లుగా ఏర్పడండి. రోజువారీగా ఏయే పనులకు నీటిని ఉపయోగిస్తారో చర్చించండి. రాయండి. మీరు తయారుచేసిన “నీటిని ఉపయోగించి చేసే పనులు జాబితాను”ను మూడు సమూహాలుగా వర్గీకరించండి. ఏ పనులు ఏ సమూహం కిందకు వస్తాయో గుర్తించండి.
జవాబు:

  1. ఇంటి లేదా కుటుంబ అవసరాలు.
  2. వ్యవసాయ అవసరాలు
  3. ఇతర అవసరాలు

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు 3

కుటుంబ అవసరాలు వ్యవసాయ అవసరాలు ఇతరములు
త్రాగడం, స్నానం చేయడం, అంట్లు కడగడం, నేల శుభ్రపరచడం, మరుగుదొడ్లు మొదలైన వాటి కోసం. విత్తనాల అంకురోత్పత్తి, పంటల నీటిపారుదల. పరిశ్రమలకు, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి నీటిని ఉపయోగిస్తారు.

 

కృత్యం – 2

6th Class Science Textbook Page No. 33

ప్రశ్న 2.
మనం వివిధ రకాల అవసరాలకు నీటిని ఉపయోగిస్తుంటాం. ఒక రోజుకు మీ కుటుంబం ఎన్ని నీళ్ళు ఖర్చు పెడుతుంది ? నీవు అంచనా వేయగలవా?
మీరు తెలుసుకొన్న అంచనా వివరాలను పట్టికలో నమోదు చేయండి. దాంతోపాటుగా మీ ఇంటిలో నీటి వాడకాన్ని ఎంత వరకు తగ్గించగలరో, నీటిని ఎలా పొదుపు చేయగలరో రాయండి.

కృత్యం వాడుతున్న నీరు ఆదా చేయ తగిన నీరు
త్రాగడం 2 లీటర్లు పొదుపు లేదు
మరుగుదొడ్లు 10 లీటర్లు 5 లీటర్లు
స్నానం 30 లీటర్లు 10 లీటర్లు
బట్టలు ఉతకడం 60 లీటర్లు 20 లీటర్లు
ఇతరములు 80 లీటర్లు 30 లీటర్లు
మొత్తం 182 లీటర్లు 65 లీటర్లు

మీరు సేకరించిన పరిశీలనలు మరియు డేటా నుండి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
• ఒక వ్యక్తి ఒక రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం ………… లీటర్లు.
జవాబు:
ఒక వ్యక్తి రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం = 182 లీటర్లు.

• వీధి / గ్రామం / పట్టణ జనాభా ఒక రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం ……………..
జవాబు:
వీధి / గ్రామంలో మొదలైన వారి సంఖ్య. వీధి 100 మంది. గ్రామంలో 5000 మంది.
వీధి / గ్రామంలో రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం.
వీధిలో = 100 × 182 = 18200 లీటర్లు. గ్రామంలో = 5000 × 182 = 9, 10,000 లీటర్లు.

• వీధి / గ్రామం / పట్టణ జనాభా ఒక నెలకు ఉపయోగించే నీటి పరిమాణం …………. లీటర్లు.
జవాబు:
వీధి / గ్రామంలో నెలకు ఉపయోగించే నీటి పరిమాణం.
వీధిలో = 18200 × 30 = 5,46,000 లీటర్లు.
గ్రామంలో = 910000 × 30 = 2,73,00,000 లీటర్లు.

• వీధి / గ్రామం / పట్టణ జనాభా ఒక సంవత్సరానికి ఉపయోగించే నీటి పరిమాణం …….. లీటర్లు.
జవాబు:
వీధి / గ్రామంలో సంవత్సరానికి ఉపయోగించే నీటి పరిమాణానికి మీరు ఇదే విధంగా లెక్కించవచ్చు.

• ప్రపంచ మొత్తం జనాభాకు ఒక రోజు / ఒక నెల / ఒక సంవత్సరానికి ఎన్ని నీళ్ళు కావాలో ఊహించండి.
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా అవసరమైన నీటిని ఊహించుకోవడానికి అదే విధానాన్ని అనుసరిస్తారు.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

కృత్యం – 3

6th Class Science Textbook Page No. 34

ప్రశ్న 3.
మీ దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రజలు త్రాగునీరు తెచ్చుకొనే బావిని చూడండి. బావిలో గల నీటి పరిమాణాన్ని అంచనా వేయగలరా? మీ పెద్దలను అడిగి గడిచిన సంవత్సరాలలో బావికి గల నీటిమట్టం గురించిన వివరాలను సేకరించండి.
• నీటి మట్టం స్థిరంగా ఉందా? మారుతోందా?
జవాబు:
నీటి మట్టం స్థిరంగా లేదు. వర్షాకాలంలో బావిలో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో నీటి మట్టం తగ్గుతుంది.

• బావిని ఎలా తవ్వుతారు?
జవాబు:
బావి తవ్వవలసిన స్థలాన్ని మొదట ఎంపిక చేస్తారు. కాకి బార్లు మరియు స్పేలను ఉపయోగించే కార్మికులు ఆ ప్రదేశంలో మట్టిని తొలగించడం ప్రారంభిస్తారు. ఈ బావిలో భూగర్భంలోని నీరు నింపే వరకు తవ్వే ప్రక్రియ కొనసాగుతుంది. భూగర్భ జలాల్లోని నీటి పట్టిక తగ్గడంతో వేసవిలో బావిలోని నీటి మట్టం తగ్గుతుంది.

• మీరు బోరు బావి తవ్వడాన్ని ఎప్పుడైనా చూశారా? పెద్దలను అడిగి బావి, బోరుబావి తవ్వే పద్ధతిని తెలుసుకొని మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
ఒక బోర్ బావి భూమిలోకి తవ్వే లోతైన, ఇరుకైన రంధ్రం. లోతైన పైపు మరియు పంపు ద్వారా నీరు తీయబడుతుంది. డ్రిల్లింగ్ చేయవలసిన లోతు కనీసం 40 మీటర్లు ఉండాలి. కొన్ని సార్లు 200 నుండి 300 అడుగులు డ్రిల్ చేయవలసి ఉంటుంది. బోర్ బావులు సాధారణంగా 4.5 – 12 అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి.

కృత్యం – 4

6th Class Science Textbook Page No. 35

ప్రశ్న 4.
మేఘాలు ఎందుకు వర్షిస్తాయి?
జవాబు:
మేఘాలు చల్లబడినపుడు వాటిలోని నీటి ఆవిరి సాంద్రీకరణ చెంది నీరుగా మారుతుంది. ఈ నీరు భూమి ఆకర్షణ వలన వర్షంగా భూమిపై పడుతుంది.

• వర్షాలకు, మేఘాలకు మధ్యగల సంబంధం ఏమిటి?
జవాబు:
వర్షం మేఘాల నుండే వస్తుంది. మేఘాలలోని నీటి ఆవిరి చల్లబడి వర్షంగా మారుతుంది.

• అన్ని మేఘాలూ వర్షాలనెందుకు కురిపించవు?
జవాబు:
అన్ని మేఘాలూ వర్షించలేవు. మేఘాలలోని నీటి ఆవిరి పరిమాణం, వాటి ఉష్ణోగ్రత వర్షాన్ని నిర్ణయిస్తాయి.

• మీరు నీటిని మంచుగా మార్చగలరా? మనం ఏమి చేయాలో వివరించండి.
జవాబు:
అవును. మనం నీటిని మంచుగా మార్చగలం. ఐస్ క్యూబ్ బాక్సను నీటితో నింపి కొంతకాలం రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. కొంత సమయం తరువాత, నీరు మంచుగా మారుతుంది.

• మంచును ఆరుబయట ఉంచితే ఏమవుతుంది?
జవాబు:
మనం మంచును ఆరుబయట ఉంచితే అది కరిగి నీటిగా మారుతుంది.

• నీరు వేడి చేసినప్పుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
మనం నీటిని వేడి చేసినప్పుడు అది నీటి ఆవిరిగా మారుతుంది.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

కృత్యం – 5

6th Class Science Textbook Page No. 36

ప్రశ్న 5.
తడి దుస్తులను ఎండలో ఆరవేసినపుడు బట్టలలో ఉన్న నీరు ఏమవుతుంది?
జవాబు:
తడి దుస్తులలోని నీరు ఎండ వేడి కారణంగా వాతావరణంలోకి ఆవిరైపోతుంది.

• తడి బట్టలలోని నీరు ఎండకు మాత్రమే ఆవిరవుతుందా?
జవాబు:
తడి బట్టల్లోని నీరు, సూర్యరశ్మి వల్లనే కాకుండా గాలి వలన కూడా ఎండిపోతుంది.

• ఇలా ఆవిరైన నీరు ఎక్కడికి పోతుంది?
జవాబు:
నీరు ఆవిరిగా మారి గాలితో కలిసిపోతుంది.

• బాష్పీభవనం చెందిన తరువాత ఈ నీటి ఆవిరి ఎక్కడికి వెళ్తుంది?
జవాబు:
బాష్పీభవన ప్రక్రియ ద్వారా గాలిలోకి ప్రవేశించే నీటి ఆవిరి ఆకాశంలో మేఘాలను ఏర్పరుస్తుంది.

కృత్యం – 6

6th Class Science Textbook Page No. 37

ప్రశ్న 6.
ఒక గ్లాసులో కొంత నీరు తీసుకోండి. దానికి కొన్ని మంచు ముక్కలు కలపండి. కొద్దిసేపటి తర్వాత గమనించండి.
• గ్లాసు వెలుపలి తలం పైన మీరు ఏమైనా మార్పులు గమనించారా?
జవాబు:
గ్లాసు బయటి ఉపరితలంపై చిన్న చుక్కల నీరు ఏర్పడటాన్ని మేము గమనించాము.

• ఈ బిందువులు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
గాజు బయటి ఉపరితలం యొక్క తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గ్లాసు చుట్టూ ఉన్న నీటి ఆవిరి ఘనీభవిస్తుంది.

• గ్లాసు లోపల మంచు ముక్కలు లేకపోయి వుంటే కూడా ఇలా ఏర్పడతాయా?
జవాబు:
గ్లాసులో మంచు లేనట్లయితే అది నీటి చుక్కలను ఏర్పరచదు.

కృత్యం – 7

6th Class Science Textbook Page No. 40

ప్రశ్న 7.
నలుగురు, ఐదుగురు విద్యార్థులు చొప్పున జట్లుగా ఏర్పడండి. కింద సూచించిన అంశాలను జట్టుకు ఒక అంశం. చొప్పున ఎంపిక చేసుకోండి. ఆ అంశం గురించి జట్టులో చర్చించండి. జట్టు నివేదికను రూపొందించండి.
• అంశం -1 : గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఈ సంవత్సరం వర్షపాతం గత సంవత్సరం కంటే తక్కువగా ఉంటే, అది తక్కువ ఆహార ఉత్పత్తికి కారణం కావచ్చు. పంట దిగుబడి తగ్గుతుంది. నీటి మట్టాల క్షీణత, నీటి కొరత ఏర్పడి వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది.

• అంశం – 2 : ఐదు సంవత్సరాలపాటు సరైన వర్షాలు కురవకపోతే జరిగే పరిణామాలు ఏమిటి?
జవాబు:
ఐదేళ్లుగా వర్షాలు పడకపోతే ఆ ప్రాంతంలో కరువు సంభవిస్తుంది. నీటి వనరులన్నీ ఎండిపోతాయి. వృక్షసంపద ఉండదు, పశుగ్రాసం లేకపోవడం వల్ల జంతువులు చనిపోతాయి. నేల ఎండిపోయి పగుళ్లు ఏర్పడతాయి. త్రాగునీటి కొరత వస్తుంది.

• అంశం – 3 : ఒక ప్రదేశంలో నీటి ఎద్దడి ఏర్పడడానికి దారితీసే కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
అటవీ నిర్మూలన మరియు పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం కారణంగా వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత ఏర్పడుతుంది. చాలా సంవత్సరాలు వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల నీటి కొరత ఏర్పడుతుంది.

• అంశం – 4 : ఒక ప్రదేశంలో నీటి ఎద్దడి వల్ల ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఆహారం మరియు పశుగ్రాసం పొందడం చాలా కష్టం. త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు చాలా దూరం ప్రయాణించాలి. నేల ఎండిపోతుంది, వ్యవసాయం మరియు సాగు కష్టమవుతుంది. ప్రజలు ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళతారు.

కృత్యం – 8

6th Class Science Textbook Page No. 41

ప్రశ్న 8.
కరవులు మన జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
ఇక్కడ ఉన్న ఉత్తరాన్ని చదవండి. ప్రజల జీవితాల మీద కరవు ఎలాంటి తీవ్రమైన ప్రభావాలను కలుగజేస్తుందో అర్థం చేసుకోండి. ఈ కింది అంశాలను చర్చించండి.

ప్రియమైన ఫిరోజ్ కు,
నీవు అక్కడ క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. ప్రస్తుతం మన ఊళ్ళో కరవు తీవ్రంగా ఉంది. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. గత నాలుగైదు సంవత్సరాలుగా వర్షాలు లేవు. పొలాలన్నీ ఎండిపోయాయి. నీళ్లు లేక నేల బీటలు వారిపోయింది. పంటలు పండించ లేకుండా ఉన్నాం. బోరుబావులు తవ్వించడానికి నాన్న బోలెడు డబ్బు ఖర్చు పెట్టాడు. అప్పులు మిగిలాయి తప్ప ఫలితం లేదు. ఐదారు కిలోమీటర్ల దూరం పోయి బోరుబావి దగ్గర యుద్ధం చేస్తే తప్ప త్రాగడానికి కాసిని మంచి నీళ్లు తెచ్చుకోలేకుండా ఉన్నాము. రోజులు గడవడం చాలా కష్టం ఉంది. చాలామంది ఇప్పటికే గొడ్డూగోదా అమ్ముకుని హైదరాబాదు, బెంగళూరు వెళ్లిపోయారు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. నువ్వు మీ నాన్నకి చెప్పి మా నాన్నకు అక్కడ ఏదైనా పని. చూపించమను. ఊరిలో మానాన్న మంచి పేరున్న రైతే అయినా అక్కడ ఏ పని దొరికినా చేస్తాను అంటున్నాడు. నువ్వు మాకు ఎలాగైనా సాయం చేస్తావని ఆశతో ఉన్నాను.

ఇట్లు,
నీ ప్రియమైన స్నేహితుడు,
అ రమణ.

• రమణ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?
జవాబు:
రమణ కరవు కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాడు. పొలాలు ఎండిపోయి పంట పండలేదు. బోర్ బావులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడింది. ప్రజలు నీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చింది. ఉద్యోగం కోసం ప్రజలు నగరాలకు వలసపోయారు.

• ఫిరోజ్, రమణకు ఏ విధంగా సహాయం చేస్తాడనుకుంటున్నావు?
జవాబు:
ఫిరోజ్ తండ్రి, కీలకమైన కరవు పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి రమణ తండ్రి కోసం ఉద్యోగం వెతుకుతాడు.

• మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కరవు ఏర్పడింది. వర్షాలు లేకపోవడం భూగర్భ – జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఎక్కువ నీరు అవసరమైన పంటను పండించడం వల్ల ఇలాంటి ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి?
జవాబు:
ఒక రైతు కరవు ప్రాంతంలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటను పండిస్తే, ఇది నీటి కొరతకు దారితీస్తుంది. ఇది పంట పెట్టుబడిని పెంచుతుంది. ఇది భూగర్భ జలమట్టాన్ని తగ్గిస్తుంది. లోతైన బావులను తవ్వటము వలన ఖరీదు పెరుగుతుంది. ఎక్కువ వేడి పరిస్థితి కాబట్టి పంటలు మంచి దిగుబడి ఇవ్వవు.

• నీటి కోసం విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వి నీటిని తోడివేస్తే భూగర్భజలాల మీద ఎలాంటి ప్రభావం కలుగుతుంది? భూగర్భ జలాలు తగ్గడానికి గల కారణాలను మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:
భూగర్భ జల మట్టం మరింత తగ్గుతుంది. నీటిని పొందడానికి రైతులకు లోతైన బావులు అవసరం. ఇది కొంతకాలం కొనసాగితే బోర్ బావులు ఎండిపోతాయి.

కృత్యం – 9

6th Class Science Textbook Page No. 41

ప్రశ్న 9.
ప్రకృతి వైపరీత్యాలు – వరదలు
చిత్రాన్ని చూడండి. వర్షాకాలంలో తరచుగా వార్తా పత్రికలలో ఇలాంటి దృశ్యాలను చూస్తూ ఉంటారు కదా ! ఇలాంటి పరిస్థితి ఎందుకు కలుగుతుందో జట్లలో చర్చించండి.
AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు 4
• ఈ చిత్రం ఏం తెలియజేస్తుంది?
జవాబు:
ఇది వరదలు గురించి చెబుతుంది.

• మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షపాతం ఇటువంటి పరిస్థితికి దారితీసిందా?
జవాబు:
అవును. ఇటీవల మద్రాస్, కేరళ, ముంబైలలో ఈ పరిస్థితిని చూశాము.

• ఈ పరిస్థితికి దారితీసే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
వాతావరణ మార్పులు, కాలుష్యం, అటవీ నిర్మూలన, ఎల్నినో మొదలైనవి ఈ పరిస్థితికి కారణమైన కొన్ని అంశాలు.

• మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? అప్పుడు ఏమి చేశారు? వార్తాపత్రికలోని వార్తలు లేదా మీ సొంత అనుభవాల ఆధారంగా వరదలు గురించి రాయండి.
జవాబు:
అవును. నేను 2014 లో హుడ్ హుడ్ మరియు 2018 లో టిట్లే అనే వరద గురించి విన్నాను. ఒక శక్తివంతమైన టిట్లే తుఫాను ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 150 కి.మీ. వేగం గాలులతో సంభవించింది.

ఒరిస్సాలోని లోతట్టు జిల్లాల నుండి సుమారు 3 లక్షల మందిని తరలించారు. రోడ్లు దెబ్బతిన్నాయి మరియు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోల్పోయింది. చాలా ప్రాంతాల్లో తాగునీటి కొరత వచ్చింది.

ప్రాజెక్ట్ పనులు

6th Class Science Textbook Page No. 44

ప్రశ్న 1.
మీ గ్రామంలో ఉండే వివిధ నీటి వనరులను చూపిస్తూ గ్రామపటాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం : నీటి వనరులు ఒక ప్రదేశానికి, మరో ప్రదేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి, విద్యార్థి తన ప్రాంతంలో లభించే నీటి వనరులను గమనించి, తదనుగుణంగా ఒక పటాన్ని సిద్ధం చేయాలి.

ప్రశ్న 2.
“నీటిని దుర్వినియోగం చేయవద్దు” అనే అంశంపై ఒక కరపత్రాన్ని తయారుచేయండి. పాఠశాల గోడపత్రికలో ప్రదర్శించండి.
జవాబు:

  • మన ప్రాథమిక అవసరాలు గాలి, నీరు మరియు ఆహారం.
  • మన దైనందిన జీవితంలో అనేక కార్యకలాపాలకు నీరు అవసరం.
  • నీరు ప్రకృతి యొక్క విలువైన బహుమతి.
  • నీరు లేకుండా ఒక రోజు కూడా జీవించలేము.
  • కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారు.
  • నీరు లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాలు నెమ్మదిగా ఎడారులుగా మారుతున్నాయి.
  • కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరు సేకరించడానికి చాలా దూరం ప్రయాణించాలి.
  • నీటి కొరత ఉంటే, ఆహారం మరియు పశుగ్రాసం పొందడం చాలా కష్టం.
  • నీరు విలువైనది. ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయనివ్వకండి.
  • నీటిని మనకు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించాలి.
  • కాబట్టి నీటిని వృథా చేయవద్దు.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

ప్రశ్న 3.
నీళ్ళలో ఆడే ఆటలకు సంబంధించిన సమాచారం, చిత్రాలు సేకరించండి. బుక్ తయారుచేయండి.
జవాబు:
నీటి ఆటలు అంటే ఈత కొలను, చెరువు, సరస్సు, నది లేదా సముద్రం వంటి నీటి ప్రాంతాలలో ఆడే ఆటలు.

నీటి సంబంధిత కొన్ని ఆటలు :
AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు 5

ప్రశ్న 4.
వరదలు, కరవులు మానవ తప్పిదాలతోనే ఏర్పడతాయి. ఈ వాక్యాన్ని అంగీకరింపచేయడానికి నీవు ఏయే కారణాలను పేర్కొంటావు?
జవాబు:
కరవు మరియు వరదలు మనిషి చర్యల ఫలితం.

  • అటవీ నిర్మూలన, భారీ మొత్తంలో నీటిని వృథా చేయడం, అనేక బోర్ వెల్సను డ్రిల్లింగ్ చేయడం దీనికి కారణం.
  • కర్మాగారాల నుండి వచ్చే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది.
  • గ్లోబల్ వార్మింగ్ జల చక్రానికి భంగం కలిగిస్తుంది మరియు తక్కువ వర్షపాతం లేదా ఎక్కువ వర్షపాతం కలిగిస్తుంది.
  • మానవ కార్యకలాపాల వల్ల ప్రధానంగా వృక్షసంపద నాశనం కావటం వలన, ఎక్కువ కాలం వర్షాలు పడవు.
  • ఆ ప్రాంతంలో వర్షం పడినప్పుడు మానవుడు వృక్షాలను తొలగించటం వలన వరదలు వస్తాయి.
  • అందువల్ల, కరవు మరియు వరదలు. మనిషి చర్య యొక్క ఫలితాలు అని మనం చెప్పగలం.

ప్రశ్న 5.
కరవు నివారణ చర్యలపై ఒక సెమినార్ నిర్వహించండి.
జవాబు:

  • ఎక్కువ కాలం వర్షం లేకపోతే, అది కరవుకు కారణం కావచ్చు.
  • ఇది పంటలు, పశువులు మరియు పర్యావరణాన్ని దెబ్బతీసే నీటి కొరతను సృష్టిస్తుంది.
  • కరవును నియంత్రించడానికి, కొన్ని కార్యకలాపాలను అనుసరించాలి.
  • కాలుష్యానికి కారణమయ్యే వాయువుల ఉద్గారాలను మనం నియంత్రించాలి.
  • అటవీ నిర్మూలనను నియంత్రించాలి మరియు అటవీ ప్రాంతాన్ని వృద్ధి చేయాలి.
  • నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి.
  • మురుగునీటి శుద్ధి అమలు చేయాలి. వ్యర్థ జలాల రీసైక్లింగ్ చేయాలి.
  • నీటి కొరతను నివారించడానికి మనం నీటిని విచక్షణంగా ఉపయోగించాలి.
  • మనం నీటి సంరక్షణలో పద్ధతులను అనుసరించాలి.

AP Board 6th Class Science Solutions Chapter 4 నీరు

ప్రశ్న 6.
మీ తాత, మామ్మల నుండి, వారు చూసిన అతిపెద్ద కరవుకు సంబంధించిన సమాచారం సేకరించి, నివేదిక తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం :
విద్యార్థి తన తాత, మామ్మల నుండి కరవు గురించి వారి అనుభవాల నుండి సమాచారాన్ని సేకరించాలి.