AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

SCERT AP 6th Class Social Study Material Pdf 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
నక్షత్రం కంటే గ్రహం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
నక్షత్రం కంటే గ్రహం ఏ విధంగా భిన్నమైనదంటే :

  • నక్షత్రం స్వయం ప్రకాశం కలది. గ్రహం స్వయం ప్రకాశం కాదు.
  • నక్షత్రాలు చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. గ్రహాలు నక్షత్రాల కంటే చిన్నగా ఉంటాయి, అంతవేడిగా ఉండవు.
  • నక్షత్రం స్థిరంగా ఉంటుంది. గ్రహాలు తమచుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
  • నక్షత్రంపై జీవం అసాధ్యం, గ్రహాలపై జీవానికి అవకాశం ఉంది.
    ఉదా : భూగ్రహంపై జీవం కలదు.

ప్రశ్న 2.
సౌర కుటుంబం అనగానేమి?
జవాబు:
సూర్యుడు, ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం ‘సౌర కుటుంబం’ అని పిలుస్తాం.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 3.
అన్ని గ్రహాలపై జీవం ఎందుకు సాధ్యం కాదు?
జవాబు:
అన్ని గ్రహాలపై జంతువులు, మొక్కలు (మానవులు) మొదలైన జీవులు పెరగటానికి (జీవించడానికి) అత్యంత కీలకమైన వనరు నీరు మరియు వాతావరణం. ఇవి అన్ని గ్రహాలపై అందుబాటులో లేని కారణంగా అక్కడ జీవం సాధ్యం కాదు.

ప్రశ్న 4.
మనం కేవలం చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే ఎందుకు చూడగలం?
జవాబు:
చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తనచుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. ఫలితంగా, చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది.

ప్రశ్న 5.
విశ్వం అనగానేమి?
జవాబు:
విశ్వం అనేది కొన్ని కోట్లాది. గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించటం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దాని పరిమాణం గురించి మనకు కచ్చితంగా తెలియదు కాని మనమందరం ఈ విశ్వానికి చెందినవారని మనకు తెలుసు.

ప్రశ్న 6.
భూమిపై జీవించడానికి గాలి, నీరు, చాలా అవసరం. కానీ ప్రస్తుతం అవి మానవులచే కలుషితం చేయ బడుతున్నాయి. కాలుష్యం ఇంకా పెరిగితే ఈ భూమిపై జీవులకు ఏమి జరుగుతుంది?
జవాబు:
గాలి కాలుష్యం పెరిగితే :

  • వాతావరణంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) తగ్గిపోతుంది.
  • వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సెడ్) లాంటి గ్రీన్‌హౌస్ వాయువులు పెరిగిపోతాయి.
  • భూగోళం వేడెక్కుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బ తింటుంది.
  • అతివృష్టి, అనావృష్టిలు ఏర్పడతాయి.
  • ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి.
  • ఓజోన్ పొరకు ప్రమాదం కలుగుతుంది.
  • శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం కలదు.

నీటి కాలుష్యం పెరిగితే :

  • నీటి కాలుష్యం వలన అనేక రకాల వ్యాధుల బారిన పడవలసి ఉంటుంది.
  • నీటి కాలుష్యం వలన పంటల దిగుబడి తగ్గిపోతుంది, తద్యం ఆహార కొరత ఏర్పడుతుంది.
  • చేపలు మొదలైన నీటిలో నివసించే జలచరాలకు ముప్పు ఏర్పడి, తద్వారా వాటి కొరత ఏర్పడుతుంది. అలాగే వాటిని స్వీకరించిన
  • మానవులకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
  • పర్యావరణ వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 7.
శాస్త్రవేత్తలు ఇప్పుడు చంద్రుడు, ఇతర గ్రహాల గురించి మరింత అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు మనకు ప్రయోజనం చేకూరుస్తాయని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
చంద్రుడు, ఇతర గ్రహాల గురించిన శాస్త్రవేత్తల ప్రయత్నాలు మనకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయని నేను అనుకుంటున్నాను. కారణం,

  • చంద్రుడు, ఇతర గ్రహాలపై జీవం ఉన్నదో, లేదో మరియు జీవించడానికి అవసరమైన అనుకూలతల గురించి తెలుసుకోవచ్చు.
  • అక్కడ ఏ విధమైన ఖనిజాలు లభ్యమవుతాయో తెలుసుకొని, వాడుకోవచ్చు.
  • వీలుగా ఉంటే చంద్రగ్రహంపై నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
  • అంతరిక్ష , ఖగోళ రహస్యాలను గురించి విపులంగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 8.
చిత్రం. 1.4 సౌర కుటుంబం పరిశీలించి కింది పట్టికను నింపుము.
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 1
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 2 AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 3

→ సరియైన సమాధానం గుర్తించుము.

1. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ, పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది?
అ) సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు.
ఆ) భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది
ఇ) సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు
జవాబు:
అ) సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు.

2. భూమికి కవల గ్రహం (ఎర్త్ – ట్విన్) అని పిలువబడే గ్రహం ……….
అ) బృహస్పతి
ఆ) శని
ఇ) శుక్రుడు
జవాబు:
ఇ) శుక్రుడు

3. సూర్యుడికి మూడవ సమీప గ్రహం ఏది?
అ) శుక్రుడు
ఆ) భూమి
ఇ) బుధుడు
జవాబు:
ఇ) బుధుడు

4. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్ష్యలో తిరుగుతాయి …………
అ) వృత్తాకార కక్ష్య
ఆ) దీర్ఘచతురస్రాకార మార్గం
ఇ) పొడిగింపబడిన వృత్తాకార కక్ష్య
జవాబు:
ఇ) పొడిగింపబడిన వృత్తాకార కక్ష్య

5. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల కక్ష్యల మధ్య కనిపిస్తాయి ……….
అ) శని మరియు బృహస్పతి
ఆ) అంగారకుడు మరియు బృహస్పతి
ఇ) భూమి మరియు అంగారకుడు
జవాబు:
ఆ) అంగారకుడు మరియు బృహస్పతి

కింది వానిని జతపరుచుము.

1. నీలి గ్రహం అ) అంగారకుడు
2. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఆ) వరుణుడు
3. సూర్యుని నుంచి నాలుగవ గ్రహం ఇ) బుధుడు
4. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఈ) భూమి

జవాబు:

1. నీలి గ్రహం ఈ) భూమి
2. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం ఆ) వరుణుడు
3. సూర్యుని నుంచి నాలుగవ గ్రహం అ) అంగారకుడు
4. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఇ) బుధుడు

ఇవి చేద్దాం

→ కింద ఇవ్వబడిన ఆధారాలతో పదబంధాన్ని నింపండి.

అడ్డం
1. కోట్లాది నక్షత్రాల సమూహం
2. భూమి యొక్క సహజ ఉపగ్రహం
3. వలయాలు కలిగి ఉన్న గ్రహం (చిత్రం 1.4 చూడండి)
4. నీటితో కూడిన ఆవరణం
5. తల మరియు తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువు

నిలువు
1. భూమి యొక్క ఆకారం
2. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం
3. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం
4. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పొర
5. అంగారకుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులు
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 4
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 5

6th Class Social Studies 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి InText Questions and Answers

6th Class Social Textbook Page No.4

ప్రశ్న 1.
ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుని దేవునిగా భావించి పూజిస్తున్నారు. కారణాలు తెలపండి.
జవాబు:
ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవునిగా భావించి పూజించటానికి కారణాలు :

  • ప్రాచీనులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. ప్రకృతి శక్తులలో ముఖ్యుడు సూర్యుడు.
  • సూర్యుడు ఈ భూమండలానికంతటికీ వెలుగు, వేడిని ప్రసాదిస్తున్నాడు.
  • భూమిపై జీవనానికి మూలాధారము సూర్యుడే, ప్రాణాధారము సూర్యుడే.
  • ఋతువులు ఏర్పడటంలో, పంటల అభివృద్ధిలో సూర్యునిది కీలకపాత్ర కాబట్టి.
  • సహజశక్తికి మూలం సూర్యుడు. భూమికి అవసరమైన శక్తి సూర్యుని నుండే లభిస్తుంది.
  • సూర్యుడు లేనిదే జీవం లేదు. జీవికి మనుగడ లేదు.

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social Textbook Page No.6

ప్రశ్న 2.
2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. 9వ గ్రహం ఏమిటి? అది ఏమైంది? మీ టీచర్ సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
2006 ఆగస్టు 25 నాటి వరకు మన సౌర కుటుంబంలో గ్రహాలు ‘9’ అని చెప్పుకునేవాళ్ళం . అప్పటి ‘9’వ గ్రహం ‘ప్లూటో’. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య 26వ జనరల్ అసెంబ్లీలు ఫ్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించటం జరిగింది. ఎందుకనగా ఫ్లూటో “క్లియర్డ్ ద నైబర్ హుడ్” (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు) అన్న నియమాన్ని ఉల్లంఘిస్తున్నది. ఇది కొన్ని సందర్భాలలో నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తున్నది.

ప్రశ్న 3.
కింది చిత్రాన్ని పరిశీలించి గ్రహాలకు అనుగుణంగా ఇవ్వబడిన పెట్టెలలో వాటి పేర్లను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 6

ప్రశ్న 4.
జంతువులు మరియు మొక్కలు పెరగడానికి, జీవించడానికి ఏమి అవసరం?
జవాబు:
జంతువులు మరియు మొక్కలు పెరగడానికి, జీవించడానికి అవసరమైనవి – గాలి (వాతావరణం), నీరు, వేడిమి,
కాంతి, మృత్తికలు (నేలలు) మరియు ఇతర వనరులు.

6th Class Social Textbook Page No.7

ప్రశ్న 5.
మన భూమి సౌరకుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం అని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
భూమి సౌరకుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం, ఎలా చెప్పగలనంటే,

  • సౌర కుటుంబంలో జీవం కల్గిన ఏకైక గ్రహం భూమి.
  • సౌర కుటుంబంలో నీరు కల్గిన ఏకైక గ్రహం భూమి.
  • సౌర కుటుంబంలో వాతావరణం కల్గిన ఏకైక గ్రహం భూమి. (ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. మరీ వేడిగానీ, చల్లగాగానీ ఉండదు)
  • జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి.

6th Class Social Textbook Page No.8

ప్రశ్న 6.
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు?
జవాబు:
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ, (ఏప్రిల్ 2, 1984)

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

ప్రశ్న 7.
మీరు చంద్రయాన్-1, చంద్రయాన్-2గురించి విన్నారా? వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, తరగతిలో చర్చించండి.
జవాబు:
మేము చంద్రయాన్ -1, చంద్రయాన్ – 2 గురించి విన్నాము.

  • 2008 అక్టోబర్ 22న మనదేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1 ను ప్రయోగించింది.
  • 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు
  • 2019, సెప్టెంబర్ 2న ‘విక్రమ్’ ల్యాండరు వేరు చేయటం జరిగింది.

ముఖ్య ఉద్దేశ్యాలు :

  1. చంద్రునిపై నీటి జాడను వెదకడం.
  2. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం.
  3. హీలియం – 3ను వెదకడం.
  4. చంద్రుని యొక్క త్రిమితియ అట్లాస్ ను తయారు చేయడం.
  5. సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెతకడం.

చంద్రయాన్ – 1ను ప్రయోగించడం ద్వారా చంద్రునికి ఉపగ్రహాలను పంపిన ఆరు దేశాలలో ఒకటిగా మన భారతదేశం అవతరించింది.

6th Class Social Textbook Page No.9

ప్రశ్న 8.
మానవ నిర్మిత ఉపగ్రహాలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి? చర్చించండి.
జవాబు:
మానవ నిర్మిత (కృత్రిమ) ఉపగ్రహాల ఉపయోగాలు :

  • వాతావరణ అధ్యయనానికి ఇవి ఉపయోగపడతాయి.
  • రేడియో, టెలివిజన్ ప్రసారాలకు ఇవి ఉపయోగపడతాయి.
  • టెలికమ్యూనికేషన్స్ కొరకు ఇవి ఉపయోగపడతాయి.
  • రిమోట్ సెన్సింగ్ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారాన్ని సేకరించడం)కు ఉపయోగపడతాయి. వైమానిక, సైనిక కార్యకలాపాలకు వీటిని ఉపయోగిస్తారు.
  • విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు ఉపయోగపడతాయి.
  • గూఢచర్యం మరియు దేశ భద్రతావసరాలకు కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి

AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

6th Class Social Textbook Page No.11

ప్రశ్న 9.
ఇప్పుడు మీరు విశ్వంతో మీకు గల సంబంధాన్ని గ్రహించారా? మీరు భూమిపై ఉన్నారు.. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక భాగం. మన సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత/గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం అన్న సత్యం మీరు గ్రహించారు కదా. మీరు చిత్రంలో ఎలా సరిపోతారు? మీరు ఎంత చిన్నవారు? కాసేపు ఆలోచించండి.
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 7
జవాబు:
మనం నివసిస్తున్న భూమి మన సౌరకుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లకలాది గెలాక్సీల సమూహం. గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాల (సౌర కుటుంబాల) సమూహం అని గ్రహించాము. ఈ విశాల విశ్వంలో మన భూమే అతి సూక్ష్మధూళి రేణవంతగా అనిపిస్తుంది, అలాంటి భూమిపై మనం ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో ఊహించగలను.

ప్రాజెక్టు పని

సౌర కుటుంబం నమూనా తయారు చేయండి. (లేదా) సౌర కుటుంబం బొమ్మను గీయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి 8