AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

SCERT AP 6th Class Social Study Material Pdf 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 10th Lesson స్థానిక స్వపరిపాలన

6th Class Social 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్రామసభ మరియు గ్రామ పంచాయితీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

గ్రామసభ గ్రామపంచాయితీ
1. గ్రామ స్థాయిలో సాధారణ సభ. 1. గ్రామ స్థాయి అసెంబ్లీ లాంటిది.
2. దీనిలో గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులే. 2. దీనిలో ఎన్నుకోబడిన వార్డు సభ్యులే సభ్యులు.
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం. 3. ఇది పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యానికి నిదర్శనం
4. గ్రామ పంచాయితీ పనితీరును సమీక్షిస్తుంది. 4. గ్రామ సభ పనితీరును సమీక్షించలేదు.
5. దీనికి ఎన్నికలుండవు. 5. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
మీరు మీ స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే మీరు ఏ సమస్యలు ప్రస్తావిస్తారు?
జవాబు:
నేను మా స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే ఈ క్రింది సమస్యలు ప్రస్తావిస్తాను.

 • ప్రజా సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మురుగు నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ, చెత్త సేకరించుట, నిర్వహణ గురించి
 • ప్రభుత్వ పాఠశాలలో నమోదు, హాజరు పెంచుట గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు (నిర్వహణ), నాడు – నేడు అమలు గురించి ప్రస్తావిస్తాను.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
మీ పంచాయితీ / మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఏ సమస్యపైన అయినా నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకొంటున్నారా? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మా మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు.
ఉదాహరణలు :

 • మా వారులో పాఠశాల దగ్గర ఒక మద్యం షాపు పెట్టారు. దానితో పాఠశాల నడపటం కష్టంగా ఉండేది. దానితో ప్రజలందరూ కలిసి వార్డు సభ్యునికి తెలియపరిచారు. వార్డు సభ్యుడు చైర్మన్, కమిషనర్ తో మాట్లాడి ఆ షాపును అక్కడి నుంచి తీయించేశారు.
 • మా వార్డులో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. కాబట్టి ప్రజలు చాలామంది మున్సిపాలిటీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమస్యను కాగితం రూపంలో సమర్పించాము. వారు సమావేశంలో చర్చించి ‘భూగర్భ మురికి కాలువలను’ మా వార్డుకు శాంక్షన్ చేశారు.

ప్రశ్న 4.
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచాలా, లేదా ప్రభుత్వ నిధుల మీద ఆధారపడాలా? మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచితే అది ప్రజలకు భారమవుతుంది. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడితే అది కూడా పరోక్షంగా ప్రజలకు భారమౌతుంది. కాబట్టి పంచాయితీలు కొన్ని స్వావలంబనా కార్యక్రమాలు జరపాలి. పోరంబోకు స్థలాల్లో గడ్డి పెంచడం, చెరువుగట్లపై కొబ్బరి, ఈతచెట్లు పెంచడం, వాటిని వినియోగించేవారికి వేలంపాట నిర్వహించి ఆ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించాలి.

ప్రశ్న 5.
అంకితభావంతో పనిచేసే సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళను వివరించండి.
జవాబు:
నేడు అంకితభావంతో పనిచేసేవారు అతికొద్దిమందే ఉన్నారు. వారికి అడ్డత్రోవలో పనిచేయించుకునే వారు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉదా : గ్రామంలో ఇందిరా ఆవాస్ యోజన, దీపం పథకం, అన్నపూర్ణ పథకం, పనికి ఆహార పథకం, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛనులు మొదలైనవి అనేకం ఉన్నాయి. వీటిని అర్హులు కానివారికి ఇప్పించాలని సర్పంచ్ పై పేరు, పలుకుబడి ఉన్నవారు ఒత్తిడి తీసుకువస్తారు. ఈ సవాళ్ళను అన్నింటినీ అధిగమించి గ్రామాన్ని ముందుకు నడిపించడం సర్పంచ్ కు కత్తిమీద నడకలాంటిది.

ప్రశ్న 6.
పురపాలక సంఘం కల్పిస్తున్న ఏయే పౌర సౌకర్యాలను గ్రామ పంచాయితీ కల్పించటం లేదు?
జవాబు:
విద్యుత్తు, రవాణా, ఉన్నత విద్య, చెత్త సేకరణ (వ్యర్థ పదార్థాల నిర్వహణ), భూగర్భ డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్, పార్కులు మెరుగైన ఆరోగ్య సేవలు మొదలైన పౌర సౌకర్యాలను పురపాలక సంఘం కల్పిస్తుంది. గ్రామ పంచాయితీలు కల్పించడం లేదు.

ప్రశ్న 7.
గీతిక ఉన్న వీధిలో కొళాయి నుంచి నీరు అరగంట కూడా రాదు. అందువల్ల చాలామంది బకెట్లు నింపుకోవడానికి వరుసలో నిలుచుంటారు. ఆమె సమస్య పరిష్కారం కావటానికి మీరు గీతికకు ఏ విధమైన సలహా ఇస్తారు?
జవాబు:
తన యొక్క వార్డు కౌన్సిలర్ ని కలిసి సమస్యను అతనితో చెప్పవలసినదిగా సలహా ఇస్తాను. అపుడు ఆ సమస్యను కౌన్సిల్ ముందు వుంచుతారు. అధికారులు నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఈ అప్పటివరకు బోరింగు పంపు నుండి నీరు పట్టుకుంటుంది.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
స్థానిక కార్పోరేటర్/కౌన్సిలర్‌ను కలిసి పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికి గాను కొన్ని ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కార్పొరేటర్ ను కలిసి, పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికిగాను ఈ క్రింది ప్రశ్నలను తయారుచేశాను.

ప్రశ్నలు :
1. పురపాలక సంఘం, చెత్తను ఉపయోగించి ఏమైనా వ్యాపారం చేస్తుందా?
2. రోడ్డును శుభ్రంచేసే స్త్రీలకు, పురుషులకు ఏమైనా పేర్లు ఉన్నాయా?
3. మంచినీటి శుద్ధీకరణ ఏ విధంగా చేస్తారు?
4. వీధి లైట్లు నిర్వహణ కొరకు ఏదైనా కంట్రోల్ యూనిట్ ఉంటుందా?
5. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును పురపాలక సంఘం దేనికి ఖర్చు చేస్తుంది?

ప్రశ్న 9.
దిగువ ఇవ్వబడిన పురపాలక సంఘాలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
i) విశాఖపట్నం
ii) విజయవాడ
iii) భీమునిపట్నం
iv) కడప
v) అనంతపురం
vi) తిరుపతి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

6th Class Social Studies 10th Lesson స్థానిక స్వపరిపాలన InText Questions and Answers

6th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో కల్పించే ప్రజా సౌకర్యాలను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు :

 • రక్షిత మంచినీటి సౌకర్యం.
 • ఆ భూగర్భ డ్రైనేజి ఆ మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
 • రహదారుల నిర్మాణం, నిర్వహణ
 • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మతు) నిర్వహణ
 • ఉద్యానవనాల ఏర్పాటు నిర్వహణ
 • ఉచిత విద్యా సౌకర్యం
 • ఉచిత వైద్య సదుపాయాలు
 • గ్రంథాలయాలు, పఠనాలయాలు
 • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

ప్రశ్న 2.
మీరు గ్రామంలో నివసిస్తుంటే మీ గ్రామసభను సందర్శించి నివేదిక రూపొందించండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా చేయగలరు. (ఈ క్రింది వానిని ఆధారంగా ఉదాహరణగా తీసుకోగలరు)

మా గ్రామంలోని గ్రామసభను సందర్శించాను. అక్కడ – రేషన్‌కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామసభకు హాజరైంది. కాని ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామసభలో దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మ లాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామసభకు వచ్చిన జనం చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తరువాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన (BPL) గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్దిదారులవుతారని తెలియజేశాడు.

ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్దిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం గాని, భూమి గాని వేరే ఏ ఆధారంగాని లేదని తెలిపింది. సర్పంచ్, ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగ కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళింది. చివరిగా రేషన్‌కార్డు కోసం కూపన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది.

6th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
జవాబు:
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు :

 • రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి.
 • రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
 • అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
 • రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).

6th Class Social Textbook Page No.113

ప్రశ్న 4.
ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలరా?
జవాబు:
కొత్తగా 18 సం|| నిండిన వారిని, ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీ పైగాని, ఇల్లు మారిగాని వచ్చిన వారిని, వివాహమై కొత్తగా వచ్చిన వారిని ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేస్తారు.

ఇటీవల మరణించిన వారిని, బదిలీపై లేదా ఇల్లు మారి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన వారిని, వివాహమై ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

6th Class Social Textbook Page No.115

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయులు/తల్లిదండ్రుల సహాయంతో గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలు :

 • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి తెలియజెప్పటమే కాకుండా మన ఇంటి దగ్గరకు (అందుబాటులోకి) తీసుకు వస్తారు.
 • వృద్ధాప్య పింఛన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
 • రేషన్ సరుకులను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
 • ప్రభుత్వ పథకాల దరఖాస్తులను అందివ్వడం, ఆ దరఖాస్తులను అధికారులకు పంపిణీ చేయటం జరుగుతుంది.
 • గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 6.
మీ మండల ప్రాదేశిక నియోజక వర్గ (MPTC) సభ్యులు మరియు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ (ZPTC) సభ్యులు ఎవరు?
జవాబు:
సౌవిద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఉదా : మా MPTC – …………….
మా ZPTC – …………………..

ప్రశ్న 7.
మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
జవాబు:
విద్యార్థులు మీ మీ జిల్లాలను అనుసరించి రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా మా జిల్లాలో 57 మండలాలు కలవు.

6th Class Social Textbook Page No.116

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాల జాబితాను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాలు :

 • రక్షిత మంచినీటి సౌకర్యం.
 • భూగర్భ డ్రైనేజి
 • మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
 • రహదారుల నిర్మాణం, నిర్వహణ
 • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మత్తు) నిర్వహణ
 • ఉచిత విద్యా సౌకర్యం
 • ఉద్యనవనాలు ఏర్పాటు నిర్వహణ
 • ఉచిత వైద్య సదుపాయాలు
 • గ్రంథాలయాలు, పఠనాలయాలు
 • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

6th Class Social Textbook Page No.117

ప్రశ్న 9.
మీ జిల్లాలో నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్ని కలవు?
జవాబు:
విద్యార్థులు మీ జిల్లా గురించి తెలుసుకుని రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా, మా జిల్లాలో
కార్పోరేషన్లు : 01 (గుంటూరు)
పురపాలక సంఘాలు : 12 (1. మంగళగిరి 2. సత్తెనపల్లి 3. తాడేపల్లి 4. తెనాలి 5. పొన్నూరు 6. బాపట్ల 7. రేపల్లె 8. నర్సరావుపేట 9. చిలకలూరి పేట 10. మాచర్ల 11. వినుకొండ 12. పిడుగురాళ్ళ
నగర పంచాయితీలు : 02 (దాచేపల్లి, గురజాల)

6th Class Social Textbook Page No.118

ప్రశ్న 10.
గ్రామ పంచాయితీ దాని పనితీరులో మున్సిపాలిటీకి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

గ్రామ పంచాయితీలు పురపాలక సంఘాలు
1. పంచాయితీలు గ్రామ స్వపరిపాలన సంస్థలు తక్కువ సంఖ్యలో జనాభా వుంటారు. 1. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇక్కడ ఎక్కువ జనాభా వుంటారు.
2. రోడ్లను నిర్వహించడం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, చౌక, ధరల షాపులు నిర్వహించడం మొ||న పనులు పంచాయితీ చేస్తుంది. చెత్తను ఎత్తివేయడం లాంటి పనులు చాలా గ్రామాలలో కనబడదు. 2. గ్రామ పంచాయితీలు చేసే పనులతో పాటు అదనంగా చెత్తను ఎత్తి వేయడం, మురుగు కాలువల నిర్మాణం నిర్వహణ లాంటి బాధ్యతలను పురపాలక సంఘాలు నిర్వహిస్తాయి.
3. పంచాయితీ విధులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు. 3. పురపాలక సంఘ పనులను కమీషనర్ మరియు ఇతర కమిటీలు పర్యవేక్షిస్తారు.
4. ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు. 4. పెద్ద మొత్తంలో ఉద్యోగులు అవసరం అవుతారు.
5. కాంట్రాక్ట్ కార్మికులు మనకు కనబడరు. 5. పురపాలక సంఘాలలో కాంటాక్ట్ కార్మికులు చాలామంది ఉంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని సహాయంతో దిగువ పట్టికను పూర్తి చేయండి.
జవాబు:

హోదా ఎవరు ఎన్నుకుంటారు ప్రత్యక్ష / పరోక్ష ఎన్నిక
వార్డు మెంబర్ గ్రామవార్డులోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
సర్పంచ్ గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ పరోక్ష ఎన్నిక
MPTC గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
ZPTC మండలంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక
మండల అధ్యక్షులు MPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
జిల్లా పరిషత్ చైర్మన్ ZPTC సభ్యులు పరోక్ష ఎన్నిక
పురపాలక సంఘం ఛైర్మన్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు(కౌన్సిలర్) పరోక్ష ఎన్నిక
మేయర్ కార్పోరేటర్స్ & ఇతర సభ్యులు పరోక్ష ఎన్నిక