SCERT AP 6th Class Social Study Material Pdf 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers.
AP State Syllabus 6th Class Social Solutions 6th Lesson తొలి నాగరికతలు
6th Class Social 6th Lesson తొలి నాగరికతలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత మరియు వేదనాగరికతల మధ్య పోలికలు :
- రెండూ భారత దేశ గొప్ప నాగరికతలుగా విలసిల్లినాయి.
- రెండూ నాగరికతల ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినారు. అలంకార ప్రియత్వం కల్గి ఉన్నారు.
- వ్యవసాయం ప్రధాన వృత్తిగా కల్గి ఉన్నారు. బార్లీ, బఠానీ, గోధుమ పంటలను ఇద్దరూ పండించారు.
- లోహ పనిముట్లను వాడినారు. (రాగి, కాంస్యం, ఇనుము మొ||నవి.)
- రెండూ నాగరికత ప్రజలు వినోదానికి ప్రాధాన్యమిచ్చారు. నాట్యం, సంగీతం, చదరంగం మొ||నవి రెండూ నాగరికత కన్పించే అంశాలు.
- రెండూ నాగరికత ప్రజలు మత విశ్వాసాలను కల్గి ఉన్నారు. (అయితే దేవతలు వేరూ కావచ్చు.)
- స్త్రీలకు సమాజంలో గౌరవస్థానం (మలివేదకాలంలో మినహా) ఉండేది.
ప్రశ్న 2.
సింధూ లోయ, నాగరికత తవ్వకాలలో పాల్గొన్నదెవరు?
జవాబు:
1850లో బ్రిటీష్ ఇంజనీర్లు కరాచీ లాహోరు నగరాల మధ్య రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరుపుతుండిరి. ఆ తవ్వకాలలో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్ళను ఉపయోగించాలని నిర్ణయించారు. ఆ రాళ్ళు అయిదు వేల సంవత్సరాల క్రితంవన్న సంగతి అప్పుడు తెలియదు. 1920లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. దీనినే సింధూలోయ నాగరికత అని హరప్పా నాగరికత అని అంటారు. 1921-22 సం॥లలో అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ అయిన సజాన్ మార్నల్ ఆధ్వర్యంలో హరప్పాలో దయారాం సాహి, మొహంజోదారోలో ఆర్.డి. బెనర్జీలు త్రవ్వకాలను జరిపి సింధూ నాగరికత – విశేషాలను వెలుగులోకి తెచ్చారు.
ప్రశ్న 3.
సింధూ ప్రజల ఆర్థిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
సింధూ ప్రజల ఆర్థిక జీవనము :
- వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొ||న పంటలను పండించేవారు. పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
- కాల్చిన ఇటుకలను తయారుచేయుట వీరి వేరొక ముఖ్య వృత్తి, పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుజ్రాలు మరియు గాడిదలను పెంచేవారు.
- అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.
ఆర్థిక జీవనం :
ప్రశ్న 4.
సింధూ ప్రజల ఇండ్ల నిర్మాణము ఎట్టిది?
జవాబు:
- హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకొనేవారు.
- రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకొనేవారు.
- ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాలగది ఉండేది.
- ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు.
ప్రశ్న 5.
సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రశంసనీయమైనది ఎలా?
జవాబు:
- సింధూ ప్రజల మురుగు నీటిపారుదల వ్యవస్థ ఎంతో ప్రశంసనీయమైనది.
- వీరికాలంలో మంచి ప్రణాళికబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
- ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధూ ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ప్రశ్న 6.
“భగవంతుని మీద భక్తి అనేది ఒక నమ్మకం” సింధూ ప్రజల దేవతల గురించి వ్యాఖ్యానించుము.
జవాబు:
- సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
- వేపచెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు.
- భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు.
- కాలిభంగన్ మరియు లోథాల్ ప్రాంతాలలో అగ్ని పేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. (ఆప్) స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.
ప్రశ్న 7.
వేదాలెన్ని? అవి ఏవి?
జవాబు:
వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. అవి :
- ఋగ్వేదము
- యజుర్వేదము
- సామవేదము
- అధర్వణ వేదము.
ప్రశ్న 8.
“వేదమనగా ఉత్కృష్టమైన (ఉన్నతమైన) జ్ఞానము” వ్యాఖ్యానించుము.
జవాబు:
- సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేధము.
- వేదాలను శృతులు అని కూడా అంటారు.
- పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు.
- భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు.
- వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞాన కలదు.
- వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్చినముగా కొనసాగుతున్నవి.
- ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి ‘వేద కాలానికే మరలా వెళ్ళాలి’ అని పిలుపునిచ్చారు.
- వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
- వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము
ప్రశ్న 9.
తొలివేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని వివరింపుము.
జవాబు:
కుటుంబ వ్యవస్థ :
కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను బానిసలుగా చూసేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది.
స్త్రీల స్థానం :
సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కాని, సతీసహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకొనేవారు. వితంతువులు తిరిగి వివాహము చేసుకొనే పద్ధతి కలదు. ఘోష, అపాలా, లోపాముద్ర, ఇంద్రాణి, విష్యవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్య క్రమాలలో పాల్గొనేవారు.
వేష ధారణ :
వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానిని కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ‘ఉండేవి. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవి రింగులు, కంఠభారణాలు, గాజులు మరియు కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకొనేవారు.
వినోదాలు :
రథపు పందేలు, వేట, మల్లయుద్దాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. మూడు రకాలైన సంగీతవాయిద్యాలు ఉపయోగించేవారు.
విద్య :
విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి. బోధనా అభ్యసన ప్రక్రియలలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాలలో యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను నేర్పేవారు.
వర్ణవ్యవస్థ :
తొలి వేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చును.
ప్రశ్న 10.
మలి వేదకాలము నాటి ప్రజల సాంఘిక జీవనము గురించి నీకేమి తెలియును?
జవాబు:
మలి వేదకాలములో తొలి వేదకాలముతో పోల్చితే అనేక సాంఘిక మార్పులు సంభవించాయి. అవి :
- ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది. అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం వీరి కాలంలో ప్రారంభమైనవి.
- స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
- బాల్య వివాహాలు మరియు సతీసహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి.
- రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వము ప్రారంభమైనది.
- స్త్రీకి ఆస్తి హక్కు లేదు, వరకట్నము ఆచరణలోకి వచ్చెను.
- వర్ణాంతర వివాహాలు నిషేధించబడినవి.
ప్రశ్న 11.
ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
రామాయణం, మహాభారతాలు అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు, రామాయణాన్ని (ఆది కావ్యం) సంస్కృతంలోకి వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శపాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడనే ఋషి రచించాడు. అధర్మం పై ధర్మం సాధించిన విజయమే ‘మహాభారతం’గా చెప్పబడింది.
ప్రశ్న 12.
భారతదేశము యొక్క అవుట్ లైన్ మ్యాన్లో ఈ క్రింది వాటిని గుర్తించుము.
ఎ) సింధూనది బి) గంగానది సి) యమునా నది
జవాబు:
ప్రశ్న 13.
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలేవి?
జవాబు:
సింధూలోయ నాగరికత పతనానికి కారణాలు :
- ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు.
- అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు. సింధూ నది తన ప్రవాహమార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధూ నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు.
- సింధూనది మరియు దాని ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవుట వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు.
- సింధూలోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.
6th Class Social Studies 6th Lesson తొలి నాగరికతలు InText Questions and Answers
6th Class Social Textbook Page No.65
ప్రశ్న 1.
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళికకు, ప్రస్తుత పట్టణ ప్రణాళికలకు ఏవైనా తేడాలను నీవు గమనించావా? అయితే ఎలాంటి తేడాలను గమనించావా?
జవాబు:
సింధూలోయ నాగరికతా కాలం నాటి పట్టణ ప్రణాళిక ఆధునిక (ప్రస్తుత) పట్టణ ప్రణాళికను పోలి ఉంది. కొద్ది తేడాలు మాత్రమే గమనించాను. అవి:
- నేడు చాలా చోట్ల భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ లేదు.
- నేడు చాలా పట్టణాల్లో సరియైన ప్రణాళికా బద్దమైన (భవన) నిర్మాణాలు లేవు. మురికివాడల సంగతి మరీ అధ్వాన్నం.
- చాలా పట్టణాల్లో విశాలమైన రహదారులు లేవు. ఇరుకు సందులే.
ప్రశ్న 2.
సింధూ కాలంనాటి నీటిపారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదేనా? ఎలా?
జవాబు:
- సింధూ కాలం నాటి నీటి పారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదే.
- మంచి ప్రణాళికాబద్ధమైన నీటి పారుదల వ్యవస్థ కలదు. .
- వీరు పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు.
6th Class Social Textbook Page No.66
ప్రశ్న 3.
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు ఏవి?
ఆర్థిక కార్యకలాపం | సింధూ ప్రజల కాలం | ప్రస్తుత కాలం |
ఎగుమతులు | ||
దిగుమతులు | ||
పంటలు | ||
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు | ||
చేతి వృత్తులు |
జవాబు:
సింధూలోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు పోలికలు
ఆర్థిక కార్యకలాపం | సింధూ ప్రజల కాలం | ప్రస్తుత కాలం |
ఎగుమతులు | నూలు వస్త్రాలు, ధాన్యం దంతపు దువ్వెనలు, ఆభరణాలు | వజ్రాలు, తోళ్ళు ఉత్పత్తుల., రత్నాలు, ఔషధాలు యంత్రాలు, లోహాలు. |
దిగుమతులు | అలంకార సామాగ్రి, రాగి తగరం | పెట్రోలు, రంగురాళ్ళు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ప్లాస్టిక్, స్టీల్ |
పంటలు | వరి, గోధుమ, బార్లీ, పత్తి, బరాని | వరి, గోధుమ, బార్లీ, తృణధాన్యాలు అన్ని పత్తి, జనుము, పొగాకు, కాఫీ, టీ మొ||నవి |
మచ్చిక చేసుకొని పెంచుకునే జంతువులు | మేకలు, గొర్రెలు, గేదెలు ఎద్దు, ఏనుగులు, కుక్కలు | మేకలు, గొర్రెలు, గేదెలు, ఎద్దులు, గాడిదలు ఏనుగులు, కుక్కలు, ఒంటెలు మొ||నవి. |
చేతి వృత్తులు | తాపీ పని, చేనేత పని, నూలు, వడుకుట, రాగిపాత్రలు, కుండల తయారీ. | తాపీ పని, చేనేతపని, నూలు వడుకుట రాగి పాత్రలు, కుండల తయారీ మొదలైనవి. |
6th Class Social Textbook Page No.67
ప్రశ్న 4.
సింధూ నాగరికత కాలంలోని ప్రజలు ఉపయోగించిన లోహాలను ప్రస్తుతం మనం ఉపయోగించే లోహాలతో పోల్చుము. Page No. 67)
జవాబు:
సింధూలోయ నాగరికత ప్రజలు ఉపయోగించిన లోహాలు | ప్రస్తుతం ఉపయోగిస్తున్న లోహాలు |
రాగి, తగరము పాత్రలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు. | రాగి, స్టీల్, ఇత్తడి పాత్రలు, వెండి, బంగారం, ప్లాటినం మొ||న ఆభరణాలు వాడుతున్నారు. |
కాంస్యంతో చేసిన పనిముట్లు వాడినారు. | ఇనుము, అల్యూమినియం, స్టీల్లో చేసిన పనిముట్లు వాడుతున్నారు. |
6th Class Social Textbook Page No.69
ప్రశ్న 5.
i) పై పట్టికలో నాగరికతల మధ్య ఎలాంటి పోలికలను నీవు గమనించావు?
ii) మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత ఏయే విధములుగా పురోగమించినది? Page No. 699
జవాబు:
i)
- ఈ నాగరికతలన్నీ నదీలోయ ప్రాంతాలలోనే విలసిల్లినాయి.
- ఈ నాగరికతల్లో ఎక్కువ నాగరికతలు పట్టణ నాగరికతలే.
- ఈ నాగరికతలన్నీ తమ స్వంత లిపిని కల్గి ఉన్నాయి.
- ఈ శాస్త్ర, సాంకేతికంగా, ఆయా నాగరికతలు అభివృద్ధి చెందినాయని చెప్పవచ్చు. ఉదా : పిరమిడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ.
లోహాలను కూడా విరివిగా ఉపయోగించినట్లు తెలుస్తుంది.
ii)
- మిగిలిన నాగరికతల కన్నా సింధూ నాగరికత క్రింది విధముగా పురోగమించింది :
- గ్రిడ్ ఆకారంలో ప్రణాళిక బద్దమైన పట్టణ ప్రణాళిక కల్గి ఉంది.
- భూగర్భ మురుగునీటి పారుదల (పైపుల ద్వారా) వ్యవస్థ కలదు.
- ఋతుపవన వ్యవస్థ కలిగి ఉంది.
- బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కల్గి ఉంది.
6th Class Social Textbook Page No.71
ప్రశ్న 6.
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
జవాబు:
భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :
- హిందూ మతము
- క్రైస్తవ మతము
- ఇస్లాం మతము
- బౌద్ధ మతం
- జైన మతం
- సిక్కు మతం
- పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి.
6th Class Social Textbook Page No.72
ప్రశ్న 7.
నేడు మన ప్రజా ప్రతినిధులు ఎలా ఎన్నిక కాబడుతున్నారు?
జవాబు:
నేడు మన ప్రజా ప్రతినిధులను, వయోజనులైన (18 సం||లు పైబడిన) వారు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ సభ్యుల అమోదించే ఎన్నుకోబడుతున్నారు.
ప్రశ్న 8.
మీ పాఠశాల గ్రంథాలయంలోని ప్రముఖ గ్రంథాల పేర్లు రాసి, వాటి రచయితల పేర్లు రాయుము.
జవాబు:
విద్యార్థులు తమతమ పాఠశాల గ్రంథాలయాలలోని గ్రంథాల పేర్లు, రచయిత పేర్లు రాయగలరు. ఉదా :
గ్రంథము | రచయిత |
1. ది ఇన్ సైడర్ | పి.వి. నరసింహారావు |
2. నా దేశయువజనులారా | ఏ.పి.జె. అబ్దుల్ కలాం |
3. ద ఇగ్నైటెడ్ మైండ్స్ ( ఒక విజేత ఆత్మ కథ) | ఏ.పి.జె. అబ్దుల్ కలాం |
4. కొన్ని కలలు | కొన్ని మెలకువలు వాడ్రేవు చినవీర భద్రుడు |
5. మహా ప్రస్థానం | శ్రీశ్రీ |
6. కన్యాశుల్కం | గురజాడ అప్పారావు |
7. అమృతం కురిసిన రాత్రి | దేవరకొండ బాలగంగాధర్ తిలక్ |
8. మైండ్ పవర్ | యండమూరి వీరేంద్రనాథ్ |
9. విజయానికి ఐదు మెట్లు | యండమూరి వీరేంద్రనాథ్ |
10. కృష్ణపక్షం | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
11. వేమన శతకం | వేమన |
12. సుమతీ శతకం | బద్దెన |
13. వేయిపడగలు | విశ్వనాథ సత్యనారాయణ |
14. విశ్వంభర | సి. నారాయణరెడ్డి |
15. టీచర్ | యస్. ఏ. వార్నర్ |
16. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? | జాన్ హోల్డ్ |
17. మనసు భాష – మైండ్ మేజిక్ (NLP) | బి.వి. పట్టాభిరామ్ |
18. విజయం మీదే | బి.వి. పట్టాభిరామ్ |
19. మీరే విజేతలు ! విజయాలన్నీ మీవే | సి.వి. సర్వేశ్వరశర్మ |
20. ఆటలతో పాఠాలు | మన్నవ గిరిధరరావు మొదలైనవి. |