AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

SCERT AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 11th Lesson Questions and Answers కొన్ని సహజ దృగ్విషయాలు

8th Class Physical Science 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో ఏ వస్తువులకు రాపిడి ద్వారా ఆవేశాన్ని కలిగించలేం? (AS1)
ఎ) ప్లాస్టిక్ స్కేలు
బి) రాగి కడ్డీ
సి) గాలి నింపిన బెలూన్
డి) ఉన్ని గుడ్డ
ఇ) కర్ర ముక్క
జవాబు:
బి) రాగి కడ్డీ.

ప్రశ్న 2.
గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు ఏం జరుగుతుంది? (AS1)
ఎ) కడ్డీ, సిల్క్ గుడ్డ రెండూ ధనావేశం పొందుతాయి.
బి) కడ్డీ ధనావేశం పొందుతుంది. ఎందుకంటే సిల్క్ గుడ్డ రుణావేశం పొందుతుంది.
సి) కడ్డీ, సిల్క్ గుడ్డ రెండూ ఋణావేశం పొందుతాయి.
డి) కడ్డీ ఋణావేశం పొందుతుంది. ఎందుకంటే సిల్క్ గుడ్డ ధనావేశం కలిగి ఉంటుంది.
జవాబు:
డి) కడ్డీ ఋణావేశం పొందుతుంది. ఎందుకంటే,సిల్క్ గుడ్డ ధనావేశం కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 3.
కింది వాక్యాలను పరిశీలించి సరైనవైతే ‘అవును’ అని, సరైనవి కాకపోతే ‘కాదు’ అని గుర్తించండి. (AS1)
ఎ) ఒకే రకమైన ఆవేశాలు ఆకర్షించుకుంటాయి.
జవాబు:
కాదు

బి) ఆవేశం కలిగిన గాజుకడ్డీ, ప్లాస్టిక్ స్ట్రాలు ఆకర్షించుకుంటాయి.
జవాబు:
అవును

సి) తటిద్వాహకం మెరుపుల నుండి భవనాలను రక్షించలేదు.
జవాబు:
కాదు

డి) భూకంపాన్ని ముందుగా ఊహించలేం.
జవాబు:
అవును

ప్రశ్న 4.
చలికాలంలో చలికోటును విడిచే సమయంలో శబ్దం వస్తుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. చలికాలంలో చలికోటును విడిచే సమయంలో శబ్దం వస్తుంది.
  2. చలికోటు కృత్రిమ దారాలతో తయారుచేయబడి ఉంటుంది.
  3. చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. కావున వాతావరణంలో కొంత తేమ ఉంటుంది.
  4. ఈ వాతావరణంలోని తేమ కణాలు చలికోటులోని కణాలను ఆవేశపరుస్తాయి.
  5. చలికోటులోని ఆవేశ కణాలు లోదుస్తులను లేదా చర్మంపై ఉండే వెంట్రుకలను ఆకర్షించుకుంటాయి.
  6. చలికోటు విడిచే సమయంలో ఈ ఆకర్షణ బలాలను వ్యతిరేకించడం వలన శబ్దం ఏర్పడును.

ప్రశ్న 5.
ఆవేశం కలిగిన వస్తువును చేతితో తాకినపుడు ఆవేశం కోల్పోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. ఆవేశం కలిగిన వస్తువు చేతితో తాకినపుడు ఆవేశం కోల్పోతుంది.
  2. ఎందుకంటే ఆవేశాలు శరీరం ద్వారా భూమికి చేరుతాయి.

ప్రశ్న 6.
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని దేనితో కొలుస్తారు? భూకంపాన్ని స్కేలుపై కిగా గుర్తించారు. భూకంప లేఖిని ద్వారా దానిని గుర్తించవచ్చా? ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుందా? (AS1)
జవాబు:

  1. భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని భూకంప లేఖిని లేదా భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కొలుస్తారు.
  2. భూకంప లేఖిని ద్వారా 3.5 కన్నా తక్కువ రిక్టరు స్కేలుతో నమోదు చేస్తుంది. కానీ మనం దానిని గుర్తించలేము.
  3. రిక్టరు స్కేలు 3ను చూపినపుడు నష్టం ఏమీ జరగదు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 7.
పిడుగు లేదా మెరుపుల నుండి రక్షించుకోవడానికి మూడు పద్ధతులు తెల్పండి. (AS1)
జవాబు:

  1. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి.
  2. తక్కువ ఎత్తుగల ఇల్లు లేక భవనం సురక్షితమైనది.
  3. అడవిలో ఉన్నప్పుడు పొట్టి చెట్టు కింద ఉండడం సురక్షితం.
  4. ఇండ్లకు లేదా భవనాలకు తటిద్వాహకం అమర్చాలి.
  5. చివరి ఉరుము వచ్చిన 30 ని|| తరువాత బయటకు వెళ్ళాలి.
  6. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో కారు లేదా బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే కిటికీలు మరియు తలుపులు మూసివేయవలెను.

ప్రశ్న 8.
ఆవేశం కలిగిన బెలూన్, ఆవేశం లేని బెలూన్ ఆకర్షించుకుంటాయి. కానీ ఒకే ఆవేశం కలిగిన రెండు బెలూన్లు ఎందుకు వికర్షించుకుంటాయి? వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆవేశం గల బెలూన్ దగ్గరకు ఆవేశం లేని బెలూన్ ను తీసుకొని వచ్చినపుడు ఆవేశం లేని బెలూన్ పై ఆవేశం గల బెలూన్ ప్రభావంతో వ్యతిరేక ఆవేశం ప్రేరేపించబడుతుంది.
  2. వ్యతిరేక ఆవేశాలు గల బెలూన్ల మధ్య ఆకర్షణ బలం పనిచేయడం వల్ల ఆకర్షించుకొంటాయి.
  3. కాబట్టి ఆవేశం కలిగిన బెలూన్, ఆవేశం లేని బెలూన్ ను దగ్గరకు తెచ్చినపుడు ఆకర్షించుకొంటుంది.
  4. ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ బలం ఉంటుంది.
  5. కాబట్టి ఒకే ఆవేశం గల బెలూన్ల మధ్య వికర్షణ బలం వలన వికర్షించుకొంటాయి.

ప్రశ్న 9.
భారతదేశంలో భూకంపాలు తరచుగా వచ్చే రాష్ట్రాలను మూడింటిని తెల్పండి. (AS1)
జవాబు:
భారతదేశంలో భూకంపాలు తరచుగా వచ్చే రాష్ట్రాలు :

  1. కాశ్మీర్
  2. రాజస్థాన్
  3. గుజరాత్.

ప్రశ్న 10.
మీరున్న ఆవాస ప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో ఉందా? వివరించండి. (AS1)
జవాబు:
మేము ఉన్న ఆవాస ప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో లేదు.
(లేదా)

  1. మేము ఉన్న ఆవాసప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో ఉంది.
  2. ఆంధ్రప్రదేశ్ లో భూకంప ప్రమాద ప్రాంతాలు :
    1) ఒంగోలు
    2) విజయనగరం
    3) దర్శి

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1

ప్రశ్న 11.
మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువసార్లు భూకంపం వచ్చింది? (AS1)
జవాబు:

  1. ఒంగోలు
  2. నెల్లూరు
  3. శ్రీకాకుళం
  4. గుంటూరు
  5. తిరుపతి
  6. కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతాలు
  7. బంగాళాఖాతములో ఎక్కువసార్లు భూకంపాలు వచ్చాయి.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 12.
ఒక పదార్థం ఎప్పుడు ఆవేశం పొందుతుంది? (AS1)
జవాబు:

  1. పదార్థం రాపిడిలో ఉన్నప్పుడు ఆవేశం పొందుతుంది.
  2. ఒక పదార్థం వద్దకు మరొక ఆవేశం గల పదార్థాన్ని దగ్గరగా తెచ్చినపుడు ఆవేశంలేని పదార్థంలో ఆవేశం ప్రేరేపించబడి, వ్యతిరేక ఆవేశం ఏర్పడుతుంది.
  3. ఆవేశం లేని వస్తువుకు, వాహకం ద్వారా ఆవేశపరచినపుడు ఆవేశం పొందుతుంది.

ప్రశ్న 13.
ఒకే ఆవేశం కలిగిన రెండు వస్తువులను దగ్గరగా చేర్చితే ఏం జరుగుతుంది? వేరు వేరు ఆవేశాలు కలిగివున్న రెండు వస్తువులను దగ్గరగా చేర్చితే ఏం జరుగుతుంది? ఇటువంటి ఉదాహరణలు ఏమైనా ఇవ్వగలరా? (AS1)
జవాబు:
ఎ) రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే వాటి మధ్య వికర్షణ బలం ఉంటుంది.
ఉదా : 1) ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్, ఉన్ని గుడ్డతో రుద్దిన మరో బెలూన్ ను వికర్షించినది.
2) పాలిథిన్ కాగితంతో రుదైన రిఫిల్ ను, పాలిథిన్ కాగితంతో రుద్దిన మరో రీఫిల్ వికర్షించినది.
3) ఒకే ఆవేశం గల బెలూన్లు లేదా ఒకే ఆవేశం గల రిఫిల్ మధ్య వికర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

బి)

  1. వేరు వేరు ఆవేశపూరిత వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.
  2. రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.
    ఉదా : 1) ఒక రిఫిల్ ను తీసుకొని పాలిథిన్ కాగితంతో రుద్ది, దానిని ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఉంచండి.
    2) ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్ ను గ్లాసులో గల రిఫిల్ వద్దకు తీసుకుని వెళ్ళి పరిశీలించండి.
    3) రిఫిల్ ను బెలూన్ వికర్షిస్తుంది. కాబట్టి విరుద్ధ ఆవేశాలు గల వస్తువుల మధ్య వికర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

ప్రశ్న 14.
ఆవేశాల బదిలీ వలన కలిగే ప్రభావాన్ని వివరించే నిత్యజీవిత సందర్భాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
ఆవేశాల బదిలీ వలన కలిగే ప్రభావాన్ని వివరించే రెండు ఉదాహరణలు :

  1. ఎర్తింగ్ చేయడం.
  2. విద్యుదర్శిని ఉపయోగించి ఒక వస్తువు పై గల ఆవేశాన్ని గుర్తించడం.
  3. ఘటాలలో ఉండే విద్యుదావేశాలను తీగల ద్వారా బల్బుకు అందించి వెలిగించడం.

ప్రశ్న 15.
రెండు బెలూన్లను ఊదండి. వాటిని మొదటగా గుడ్డతో, తర్వాత వేరొక వస్తువుతో రాపిడి చేయండి. రెండు సందర్భాలలోనూ అవి ఆకర్షించుకుంటాయా? (AS3)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2

  1. రెండు బెలూన్లను తీసుకొని గాలిని నింపండి.
  2. రెండు బెలూన్లను ప్రక్క పటంలో చూపినట్లు ఒకదాని ప్రక్కన మరొకటి తగలకుండా వేలాడదీయండి.
  3. ఒక బెలూనను ఉన్నిగుడ్డతో రుద్ది వదలండి.
  4. రెండవ బెలూనను ప్లాస్టిక్ కాగితంతో రుద్ది వదలండి.
  5. రెండు బెలూన్లను ఉన్ని గుడ్డ, ప్లాస్టిక్ కాగితంతో రుద్దే సమయంలో మీ చేతులు బెలూన్లకు తగలకుండా జాగ్రత్త వహించాలి.
  6. రెండు బెలూన్లు ఒక దానితో మరొకటి వికర్షించుకొనుటను గమనించవచ్చును.
  7. పై ప్రయోగం ఆధారంగా రెండు బెలూన్లను తీసుకొని ఒకదానిని ఉన్ని గుడ్డతో, రెండవ దానిని ప్లాస్టిక్ కాగితం (ఇతర వస్తువుతో) రాపిడికి గురిచేస్తే ఆ రెండు బెలూన్లు వికర్షించుకొంటాయి అని తెలుస్తుంది.

ప్రశ్న 16.
భూమిలోని పలకలు ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తిని, ఆ సమయంలో భూ వాతావరణంలో మార్పులను ఏ విధంగా పోలుస్తారు? (AS4)
జవాబు:
భూమిలోని పలకలు ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తి భూ వాతావరణంలో మార్పులు :

  1. పెద్ద భవనాలు, కట్టడాలు నేలమట్టం అవుతాయి.
  2. పెద్ద పెద్ద చెట్లు, ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాలు నేలమట్టం అవుతాయి.
  3. నదుల మార్గాలను మారుస్తాయి.
  4. భూ తలాలను చీలుస్తాయి.
  5. పెద్ద పెద్ద భూభాగాలు వాటి స్థానం నుండి దూరంగా జరుగుతాయి.
  6. పర్వతాలు లోయలుగా మారవచ్చును.

ప్రశ్న 17.
ప్రపంచంలో ఏ దేశంలో తరచుగా భూకంపాలు వస్తాయి? ఈ మధ్యకాలంలో జపాన్లో వచ్చిన భూకంపం వివరాలు, చిత్రాలు సేకరించండి. (AS4)
జవాబు:
ప్రపంచంలో జపాన్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తాయి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 3

ప్రశ్న 18.
మీరున్న ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయం అందించే సంస్థలు ఏవైనా ఉన్నాయా గుర్తించండి. భూకంప బాధితులకు ఏ రకమైన సహాయం ఇస్తారో కనుక్కోండి. ఈ అంశాలపై చిన్న నివేదికను రూపొందించండి. (AS4)
జవాబు:

  1. ప్రభుత్వం బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి తగిన ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయం చేస్తుంది.
  2. ప్రభుత్వ, ప్రభుత్వేతర డాక్టర్లు మరియు జూనియర్ డాక్టర్లు బాధితులకు వైద్య సేవలు చేస్తారు.
  3. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగస్థులు విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తారు. దీనిని ప్రభుత్వం బాధితులకు ఉపయోగిస్తుంది.
  4. పాఠశాల, కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా విరాళాలు మరియు బట్టలు సేకరించి బాధితులకు సరఫరా చేస్తారు.
  5. వివిధ దిన పత్రికలు బాధితుల సహాయ నిధికి విరాళాలు సేకరించి, బాధితులకు ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయం చేస్తాయి.
  6. వివిధ ప్రాంతాలలో ఉండే స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు బాధితులకు విరాళ రూపేణా ఆర్థిక మరియు వారికి కావలసిన వస్తువులను అందిస్తారు.
  7. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు సేకరించి బాధితులకు కావలసిన ఆర్థిక మరియు వారి అవసరాలకు సంబంధించిన సహాయం చేస్తుంది. ఉదా : సినిమా యాక్టర్లు, సంగీత కళాకారులు.
  8. ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు బాధితులకు పిల్లలకు కావలసిన పుస్తకాలు, బట్టలు, పాఠశాల నిర్మాణాలకు సహాయం చేస్తాయి.
  9. యువజన సంఘాలు విరాళాలు సేకరించి బాధితులకు వారికి అవసరమైన విధంగా సహాయం చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 19.
వస్తువుకున్న ఆవేశాన్ని గుర్తించడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? పటం ద్వారా వివరించండి. (కృత్యం -1) (AS5)
జవాబు:
ఒక వస్తువు ఆవేశాన్ని గుర్తించడానికి విద్యుదర్శినిని ఉపయోగిస్తారు.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 4

విద్యుదర్శిని :

  1. ఒక ఖాళీ సీసా తీసుకోండి.
  2. సీసా మూతకంటే పెద్దదైన కార్డుబోర్డు ముక్కను తీసుకోండి.
  3. కార్డుబోర్డు ముక్కకు మధ్యలో చిన్న రంధ్రం చేయండి.
  4. 4 సెం.మీ x 1 సెం.మీ పరిమాణంలో గల రెండు అల్యూమినియం రేకులను తీసుకోండి.
  5. వాటిని ప్రక్క పటంలో చూపినట్లు పేపరు క్లిప్ యొక్క ఒక కొనపై ఉంచి, ఆ పేపర్ క్లిప్ ను కార్డ్ బోర్డ్ యొక్క రంధ్రం గుండా గుచ్చి సీసాలోకి నిలువుగా వేలాడదీయండి.
  6. ఆవేశ పరచబడిన ఒక వస్తువును పేపరు క్లిప్ రెండవ కొనకు తాకించండి.
  7. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశం పేపరు క్లిప్ ద్వారా రెండు అల్యూమినియం రేకులకు అందుతుంది.
  8. అల్యూమినియం రేకులకు అందిన ఆవేశం ఒకే రకమైనది కాబట్టి అల్యూమినియం రేకులు వికర్షించుకుంటాయి.
  9. అల్యూమినియం రేకులు వికర్షించుకొని దూరం జరగడం వలన వస్తువులో ఆవేశం ఉన్నట్లుగా గుర్తించవచ్చును.

ప్రశ్న 20.
భారతదేశ పటంలో భూకంప ప్రమాద ప్రాంతాలను రంగులతో గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 5

ప్రశ్న 21.
భూకంప లేఖిని నమూనా రూపొందించండి. (AS5)
జవాబు:
భూకంపలేఖిని నమూనాను తయారుచేయుట.

కావలసిన వస్తువులు :

  1. శీతలపానీయ సీసా,
  2. L ఆకారం గల లోహపు కడ్డీ,
  3. దీర్ఘచతురస్రాకార ప్లాస్టిక్ డబ్బా,
  4. బాల్ పాయింట్ పెన్ను,
  5. దారం,
  6. ఇసుక,
  7. తెల్ల కాగితం.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 6
తయారుచేయు విధానం :

  1. శీతలపానీయ సీసాలో పటంలో చూపిన విధంగా (L) ఆకారం గల లోహపు కడ్డీని అమర్చి ఇసుకతో నింపండి.
  2. బరువు గల బాల్ పాయింట్ పెన్నుకు దారమును కట్టి లోహపు కడ్డీకి వేలాడదీయండి.
  3. బాల్ – పాయింట్ పెన్ను లోలకం వలె పనిచేస్తుంది.
  4. దీర్ఘచతురస్రాకార ప్లాస్టిక్ డబ్బాపై తెల్లకాగితం ఉంచి, బాల్ – పాయింట్ మొన తెల్లకాగితాన్ని తాకునట్లు అమర్చవలెను.
  5. భూకంపం వచ్చే సమయంలో బాల్ – పాయింట్ పెన్ను ఇసుక భూకంపనాల వలన కంపిస్తుంది.
  6. బాల్ – పాయింట్ పెన్ను చేసే కంపనాలు తెల్లకాగితంపై నమోదు అగును. వాటిని అధ్యయనం చేసి భూకంప వివరాలను రూపొందించవచ్చును.

ప్రశ్న 22.
భూకంప తీవ్రత, దాని మూలాన్ని గుర్తించే పరికరం రూపొందించిన శాస్త్రవేత్తల కృషిని ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:

  1. భూకంప తీవ్రత, దాని మూలాలను గుర్తించే పరికరాలు భూకంపలేఖిని, భూకంపదర్శిని.
  2. భూకంపదర్శిని గుర్తించే రిక్టర్ స్కేలు విలువలను బట్టి భూకంప ప్రభావాన్ని గుర్తిస్తారు.
  3. రిక్టరు స్కేలు విలువల ఆధారంగా భూకంపం ఎన్ని కిలోమీటర్ల మేరకు ప్రభావాన్ని చూపుతుందో అంచనా వేయవచ్చును.
  4. రిక్టరు స్కేలు విలువను బట్టి జరిగిన ఆస్తి మరియు ప్రాణ నష్టాన్ని అంచనా వేయవచ్చును.
  5. భూకంప ప్రభావిత ప్రాంతాలలో వచ్చే భూకంపాలను తట్టుకొనే విధంగా భవన నిర్మాణాలను నిర్మించవచ్చును.
  6. భూకంప సమయంలో ఎక్కువగా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు తగిన సూచనలను ఇవ్వవచ్చును. ఇన్ని ఉపయోగాలు గల భూకంప లేఖిని, భూకంపదర్శినిని తయారుచేసిన శాస్త్రవేత్తలను ప్రశంసించవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 23.
భూకంపం వచ్చినపుడు ఇంటి బయట ఉంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? (AS7)
జవాబు:

  1. భవనాలకు దూరంగా ఉండవలెను.
  2. చెట్లకు దూరంగా ఉండవలెను.
  3. హైటెన్షన్ విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.
  4. కారులో గాని, బస్సులో గాని ప్రయాణిస్తున్నట్లైతే నెమ్మదిగా బహిరంగ ప్రదేశానికీ నడపాలి. కారు లేదా బస్సు నుండి బయటకు రాకూడదు.

ప్రశ్న 24.
వాతావరణశాఖ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావచ్చని హెచ్చరించింది. ఆ సమయంలో మీరు బయటకు – వెళ్లాల్సి వచ్చింది. మీరు గొడుగు తీసుకొని వెళ్తారా? వివరించండి. (AS7)
జవాబు:

  1. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో నేను బయటకు వెళ్లాల్సివస్తే గొడుగును తీసుకొనిపోను. వర్షపుకోటు వేసుకుపోతాను.
  2. గొడుగు లోహపు గొట్టాలు మరియు లోహపు పుల్లతో తయారుచేయబడి ఉంటుంది. లోహం విద్యుత్ వాహకం.
  3. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గొడుగుతో వెళితే, ఉరుము, మెరుపులు గొడుగు ద్వారా మన శరీరంలోనికి అధికమొత్తంలో విద్యుదావేశం ప్రవేశించి, విద్యుత్ షాక్ ద్వారా హాని కలుగుతుంది.
    కాబట్టి ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గొడుగుతో బయటకు వెళ్ళకూడదు.

ప్రశ్న 25.
మీరున్న ప్రాంతంలో భూకంపం వస్తే ఏం చేస్తారు? మీరు ఇంటిలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏం చేస్తారు? (AS7)
జవాబు:
భూకంపం వచ్చినప్పుడు రక్షించుకొనుటకు ఈ కింది విధంగా చేయవలెను.

  1. భవనాలకు దూరంగా ఉండవలెను.
  2. చెట్లకు, హైటెన్షన్ తీగలకు దూరంగా ఉండవలెను.
  3. కారులోగాని, బస్సులోగాని ప్రయాణిస్తున్నట్లైతే నెమ్మదిగా బహిరంగ ప్రదేశాలకు నడపాలి.
  4. కారులో నుండి గాని, బస్సులో నుండి గాని బయటకు రాకూడదు.

ప్రశ్న 26.
మీరు ఇంటిలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏం చేస్తారు? (AS7)
జవాబు:

  1. భూమి కంపించడం తగ్గే వరకు బల్ల కిందికి వెళ్లటం.
  2. కిటికీలకు, అల్మరాలకు (బీరువాలకు) దూరంగా ఉండవలెను.
  3. ఎత్తైన వస్తువులకు దూరంగా ఉండవలెను.
  4. ఒకవేళ మంచంపై పడుకొని ఉన్నట్లయితే తలపై దిండును పెట్టుకోవలెను.
  5. విద్యుత్ సరఫరాను ఆపివేయవలెను.

పరికరాల జాబితా

పొడిదువ్వెన, రబ్బరు బెలూన్లు, కాగితం ముక్కలు, రీఫిల్, స్ట్రా, ఎండిన ఆకులు, ఊక లేదా పొట్టు, స్టీలు స్పూన్, పాలిథీన్ షీటు, కాగితం, ఉన్ని గుడ్డ, థర్మోకోల్ బంతి, సిల్కు గుడ్డ, గాజు సీసా, కార్డుబోర్డు ముక్క పేపర్ క్లిప్, వెండిపొర, గాజుకడ్డీ, పలుచని అల్యూమినియం రేకులు.

8th Class Physical Science 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
రాపిడి ద్వారా ఆవేశాన్ని ఉత్పత్తి చేయుట – రాపిడి యొక్క ఫలితము.

ఈ కింది పట్టికలోని వస్తువులకు రాపిడి ద్వారా ఆవేశాలను ఉత్పత్తి చేసి, ఆ ఆవేశాలు వివిధ వస్తువులతో ఆకర్షణ, వికర్షణలు ఏ విధంగా ఉండునో పట్టికలో నమోదు చేయండి. మరియు ఈ కృత్యం వలన మీరు గమనించిన విషయాన్ని రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 7
ఈ కృత్యం ద్వారా గమనించిన విషయాలు :
1) వస్తువులను రాపిడికి గురిచేస్తే వస్తువులపై ఆవేశం ఏర్పడుతుంది.
2) ఆవేశం గల వస్తువును ఆవేశం లేని వస్తువు వద్దకు దగ్గరకు తెస్తే ఆవేశం లేని వస్తువుపై ఆవేశం ప్రేరేపింపబడి, ఆకర్షిస్తుంది.

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 2.
వస్తువులను రాపిడికి గురిచేయడం వల్ల ఏర్పడే ఆవేశాల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు ఉంటాయని ప్రయోగం ద్వారా వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
వివిధ వస్తువులతో రుద్దడం వలన ఆవేశాన్ని పొందిన వస్తువుల ఆవేశ ప్రభావాన్ని కనుగొనుట).

కావలసిన పరికరాలు :
రిఫిల్, బెలూన్, దువ్వెన, రబ్బరు, స్టీల్ స్పూన్, పాలిథిన్ షీట్, కాగితం, ఉని, గుడ్డ.

పద్దతి :
ఈ కింది పట్టికలోని మొదటి వరుసలో గల వస్తువులను వాటికెదురుగా గల రెండవ వరుసలోని వస్తువులతో కొద్ది సేపు రుద్దండి. తరువాత అలా రుద్దిన ప్రతి వస్తువునూ చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గరకు తీసుకురండి.
పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 8

నిర్ధారణ :
రీఫిల్, దువ్వెన వంటి కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేక పదార్థాలతో రుద్దినపుడు కాగితపు ముక్కల వంటి చిన్న చిన్న వస్తువులను ఆకర్షిస్తాయి. కాని స్పూనవంటి వస్తువులను ఏ పదార్థంతో రుద్దినప్పటికీ ఇతర వస్తువులను ఆకర్షించవు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

కృత్యం – 2

ప్రశ్న 3.
ఆవేశాల రకాలను అవగాహన చేసుకొనుట:
ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2

  1. రెండు బెలూన్లను తీసుకుని వాటిలో గాలిని ఊడండి.
  2. ప్రక్క పటంలో చూపిన విధంగా రెండు బెలూన్లను ఒకదానికి మరొకటి తగలకుండా వేలాడదీయండి.
  3. రెండు బెలూన్లను ఉన్ని గుడ్డతో రుద్ది వదలండి.
  4. ఉన్ని గుడ్డతో బెలూన్లను రుద్దే సమయంలో చేతులను బెలూనకు తగలకుండా జాగ్రత్త పడండి.
  5. రెండు బెలూన్లు ఒకదానితో మరొకటి వికర్షించుకుంటాయి.
  6. రెండు బెలూన్లు ఉన్ని గుడ్డతో రుద్దడం వలన రెండు బెలూన్లకు ఒకే ఆవేశం ఏర్పడుతుంది.
  7. ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ ఉంటుందని ఈ కృత్యం ద్వారా మనకు తెలుస్తుంది.

కృత్యం – 3

ప్రశ్న 4.
ఒక వస్తువుపై ఉన్న ఆవేశాన్ని కనుగొనుట.
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 9

  1. ఒక చిన్న థర్మాకోల్ బంతిని తీసుకోండి. దాని చుట్టూ పలుచని వెండిపొరను చుట్టండి.
  2. ఈ థర్మాకోల్ బంతిని ప్రక్క పటంలో చూపిన విధంగా స్టాండుకు వేలాడదీయండి.
  3. సిల్క్ గుడ్డతో రుద్దిన గాజు కడ్డీని ఈ థర్మాకోల్ బంతి దగ్గరకు తీసుకురండి. రెండూ ఆకర్షించుకొంటాయి.
  4. గాజు కడ్డీని థర్మాకోల్ బంతికి ఆనించండి. ఆ తరువాత గాజుకడ్డీని మరల సిల్క్ గుడ్డతో రుద్దండి.
  5. తిరిగి గాజు కడ్డీని థర్మాకోల్ బంతి వద్దకు తీసుకురండి.
  6. ఈసారి థర్మాకోల్ బంతి గాజుకడ్డీకి దూరంగా పోవుటను అనగా వికర్షించుటను గమనించవచ్చును.
  7. థర్మాకోల్ బంతి మరియు గాజుకడ్డీలపై ఒకే రకమైన ఆవేశం ఉండటం వలన రెండూ వికర్షించుకొంటున్నాయి.
  8. ఈ కృత్యం ద్వారా ఒకే ఆవేశాలు వికర్షించుకొంటాయి అని తెలుస్తుంది.
  9. ఆవేశాన్ని గుర్తించడానికి వికర్షణ ధర్మం సరియైనది అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

కృత్యం – 5

ప్రశ్న 5.
భూకంపాల వల్ల కలిగే నష్టాల సమాచారాన్ని సేకరించుట.

భూకంపాలు సంభవించినప్పుడు పెద్దఎత్తున జరిగే ఆస్తి, ప్రాణ నష్టం గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. భూకంపం వచ్చిన రోజుల్లో పత్రికలో వచ్చిన చిత్రాలు, వార్తా కథనాలను సేకరించండి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 10

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 11
ఎ) భూకంపం అంటే ఏమిటి?
జవాబు:
భూపటలంలో ఏర్పడే కదలికల వలన భూకంపాలు వస్తాయి.

బి) భూకంపం వచ్చినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
భూకంపం వచ్చినపుడు భూమి తీవ్రమైన ప్రకంపనలకు గురి అవుతుంది. దీని ఫలితంగా భూమిపై గల భవనాలు, కట్టడాలు శిథిలమై ప్రమాదాలు సంభవిస్తాయి. సముద్రాలలో సునామీలు ఏర్పడతాయి.

సి) భూకంప ప్రభావాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చు?
జవాబు:

  1. ముఖ్యంగా సెస్మిక్ ప్రాంతాల్లో నివసించేవారు భవన నిర్మాణాలను భూకంపాలకు తట్టుకునే విధంగా చేసుకోవాలి.
  2. భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నచోట్ల మట్టి, కలప, తేలికపాటి చెక్కలు ఉపయోగించి నిర్మాణాలు చేయాలి. భవనాలపై భాగం తేలికగా ఉంటే అవి కూలిపోయినప్పుడు నష్టం తక్కువగా ఉంటుంది.
  3. ఇంటి గోడలకు అల్మారాలు ఏర్పాటు చేయాలి. అవి త్వరగా పడిపోవు.
  4. గోడలకు వ్రేలాడదీసిన వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అవి మీద పడవచ్చు.
  5. భూకంపాలు వచ్చిన సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కనుక విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్ల పట్ల జాగ్రత్త వహించాలి.
  6. పెద్ద పెద్ద భవనాల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

కృత్యం – 6

ప్రశ్న 6.
సునామికి గురి అయిన ప్రాంతాలను పటంలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 12