SCERT AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Physical Science 5th Lesson Questions and Answers లోహాలు మరియు అలోహాలు
8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
సరైన ఉదాహరణలతో లోహాల భౌతిక ధర్మాలను వివరించండి. (AS1)
జవాబు:
1) ద్యుతిగుణం :
ఉపరితలంపై కాంతి పరావర్తనం చెందినపుడు మెరిసే గుణాన్ని ద్యుతిగుణం అంటారు. సాధారణంగా లోహాలకు ద్యుతిగుణం ఉంటుంది. ఉదాహరణకు బంగారం, వెండిలు ద్యుతిగుణం వల్ల మెరుస్తూ ఉంటాయి.
2) ధ్వనిగుణం :
నేలపై పడవేసినపుడు లేదా దృఢమైన వస్తువుతో కొట్టినపుడు ధ్వనిని ఉత్పత్తి చేసే గుణాన్ని ధ్వనిగుణం అంటారు.
ఉదాహరణకు ఎ) పాఠశాలలో ఉన్న ఇనుప గంటను లోహాల కడ్డీతో కొట్టినపుడు ధ్వని ఉత్పత్తి అగును.
బి) గుడిలో గంటను కొట్టినపుడు ధ్వని ఉత్పత్తి అగును.
3) సరణీయత :
లోహాలను రేకులుగా సాగగలిగే ధర్మాన్ని సరణీయత అంటారు. ఉదాహరణకు అల్యూమినియం లోహాన్ని రేకులుగా సాగదీసి, విమాన భాగాలు మరియు వంట పాత్రలు మొదలగునవి తయారు చేస్తారు.
4) తాంతవత :
లోహాలను సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు. ఉదాహరణకు రాగి, అల్యూమినియం తీగలను విద్యుత్ వలయాలలో ఉపయోగిస్తారు.
5) ఉష్ణవాహకత :
ఉష్ణం ఒక చోట నుండి మరొక చోటకు ప్రసరించు ధర్మాన్ని ఉష్ణ వాహకత అంటారు. లోహాలు ఉష్ణవాహకత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. లోహాలకు ఉండే అధిక ఉష్ణ వాహకత కారణంగా రాగి, అల్యూమినియంలను వంట పాత్రలుగా ఉపయోగిస్తారు.
6) విద్యుత్ వాహకత :
లోహాలు తమగుండా విద్యుత్ ను ప్రవహింపచేయు, ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటారు. లోహాలు విద్యుత్ వాహకత ధర్మం ప్రదర్శించుట వలన రాగి, అల్యూమినియం తీగలను విద్యుత్ వాహకాలుగా ఉపయోగిస్తారు.
ప్రశ్న 2.
మీకు రెండు పదార్థాలు ఇచ్చినపుడు అందులో ఏది లోహమో, ఏది అలోహమో ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణ వాహకత మరియు విద్యుత్ ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణ వాహకత మరియు విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉండదో ఆ పదార్థాన్ని అలోహం అంటారు.
ప్రశ్న 3.
ఆభరణాల తయారీకి ఏ లోహాలను వాడతారు? ఎందుకు? (AS1)
జవాబు:
బంగారం, వెండి మరియు ప్లాటినమ్ లోహాలను ఆభరణాల తయారీకి వాడతారు. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి. మరియు వీటి స్తరణీయత గుణం వలన వీటితో ఆభరణాలు తయారుచేయటం సులభం.
ప్రశ్న 4.
లోహాలు దేనితో చర్యనొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి? (AS1)
జవాబు:
లోహాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
ప్రశ్న 5.
ఒక రసాయన చర్యలో జింక్ సల్ఫేట్ నుండి జింక్ ను ఐరన్ స్థానభ్రంశం చేయలేకపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
“తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించలేవు”.
ఐరన్ లోహానికి జింక్ లోహం కంటే తక్కువ చర్యాశీలత ఉంటుంది. కావున తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న ఐరన్ లోహం ఎక్కువ చర్యాశీలత గల జింక్ లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు.
ప్రశ్న 6.
పెనమునకు ఇనుప హాండిల్ ఎందుకు వాడం? (AS1)
జవాబు:
ఇనుప లోహం ఉష్ణ వాహకతను కలిగి ఉంటుంది. పెనమునకు ఇనుప హాండిల్ వాడితే పెనమును వేడిచేసినపుడు హాండిల్ కూడా వేడెక్కి కాలుతుంది. కావున పెనమునకు ఇనుప హాండిల్ ను వాడరు.
ప్రశ్న 7.
మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తెస్తే ఏ వాయువు “టప్” మని శబ్దం చేస్తుంది? (AS1)
జవాబు:
మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తెస్తే హైడ్రోజన్ (H2) వాయువు “టప్” మని శబ్దం చేస్తుంది.
ప్రశ్న 8.
సల్ఫర్ డై ఆక్సైడ్ ఒక …… (AS1)
A) క్షార ఆక్సైడ్
B) ఆమ్ల ఆక్సైడ్
C) తటస్థ ఆక్సైడ్
D) ద్వంద్వ స్వభావ ఆక్సైడ్
జవాబు:
B) ఆమ్ల ఆక్సైడ్
ప్రశ్న 9.
గంటలను తయారుచేయడానికి చెక్కకు బదులుగా లోహాలను ఎందుకు వాడతారు? (AS1)
జవాబు:
చెక్కకు ధ్వనిగుణం ఉండదు. లోహాలకు ధ్వనిగుణం ఉంటుంది. కావున గంటలను తయారుచేయడానికి చెక్కకు బదులుగా లోహాలను వాడతారు.
ప్రశ్న 10.
కింది వాటిని జతపరచుము. (AS1)
1. పలుచని రేకులుగా తయారుచేయుట | A) తాంతవత |
2. పదార్థాల మెరుపు | B) వాహకత |
3. తీగలుగా సాగదీయుట | C) శబ్దగుణం |
4. ఉష్ణ వాహకత్వం | D) ద్యుతి |
5. ధ్వని ఉత్పత్తి | E) సరణీయత |
జవాబు:
1. పలుచని రేకులుగా తయారుచేయుట | E) సరణీయత |
2. పదార్థాల మెరుపు | D) ద్యుతి |
3. తీగలుగా సాగదీయుట | A) తాంతవత |
4. ఉష్ణ వాహకత్వం | B) వాహకత |
5. ధ్వని ఉత్పత్తి | C) శబ్దగుణం |
ప్రశ్న 11.
లోహాలు లేని మానవ జీవితం ఎట్లా ఉంటుందో ఊహించి, కొన్ని వాక్యాలు రాయండి. (AS2)
జవాబు:
- పనిముట్లు లేని జీవితం ఉండేది.
- విద్యుత్ కు సంబంధించిన విద్యుత్ పరికరాలు మరియు విద్యుత్ తీగలు ఉండేవి కావు.
- వంట పాత్రలు ఉండేవి కావు.
- వాహనాలు, వాహన పరికరాలు ఉండేవికావు.
- మిశ్రమ లోహాలు ఉండేవి కావు.
- క్షారాలు ఉండవు.
లోహాలు లేనిచో మానవుడికి సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవనం ఉండేది కాదు. మానవుల పురోగాభివృద్ధి ఉండదు.
ప్రశ్న 12.
రహీమ్ ఈ పాఠ్యాంశం పూర్తిచేసిన తర్వాత, లోహాలు దృఢంగాను, అలోహాలు మృదువుగాను ఉంటాయని అవగాహన చేసుకొన్నాడు. ఈ విషయాన్ని అతని అన్నయ్యతో చర్చించినప్పుడు (డైమండ్) వజ్రం దృఢంగా ఉన్నప్పటికి అది అలోహమని అదే విధంగా పాదరసం మృదువుగా ఉన్నప్పటికి లోహామని తెలుసుకొన్నారు. ఈ చర్చ ద్వారా రహీమ్ మదిలో మెదిలిన కొన్ని ప్రశ్నలను ఊహించి రాయండి. (AS2)
జవాబు:
- అలోహమైన వజ్రం (డైమండ్) ఎందుకు దృఢంగా ఉంటుంది?
- లోహమైన పాదరసం ఎందుకు మృదువుగా (ద్రవస్థితిలో) ఉంటుంది?
- వజ్రం కాకుండా ఇంకా ఏఏ అలోహాలు దృఢంగా ఉంటాయి?
- పాదరసం కాకుండా ఇంకా ఏయే లోహాలు ద్రవస్థితిలో ఉంటాయి?
ప్రశ్న 13.
లోహాల, అలోహాల ఆమ్ల మరియు క్షార స్వభావాలను సరైన ప్రయోగాల ద్వారా వివరించండి. (AS3)
జవాబు:
ఉద్దేశ్యం :
లోహాలు, అలోహాలు ఆక్సిజన్ తో జరిపే చర్యను తెలుసుకొనుట.
కావలసిన పరికరాలు :
లోహము (మెగ్నీషియం తీగ), ఒక అలోహము (సల్ఫర్ పొడి), సారాయి దీపం, ఎరుపు, నీలం లిట్మస్ కాగితాలు, డిప్లగ్రేటింగ్ స్పూన్, వాయువుజాడీ మొ||నవి.
విధానము :
1) మెగ్నీషియం లోహపు తీగతో ప్రయోగం :
చిన్న మెగ్నీషియం తీగను సారాయి దీపం సహాయంతో గాలిలో మండించితిని. మెగ్నీషియం తీగ గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సెడ్ ను ఏర్పరచినది. ఏర్పడిన మెగ్నీషియం ఆక్సెడ్ బూడిదను స్వచ్చమైన నీరు గల బీకరులో వేసి కలిపితిని. ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు మరియు నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించితిని. మెగ్నీషియం ఆక్సైడ్ ఎరుపు లిట్మసను నీలి రంగులోకి మార్చినది. మెగ్నీషియం ఆక్సైడ్ కు క్షార స్వభావం గలదు.
2) సల్ఫర్ అలోహంతో ప్రయోగం :
కొద్దిగా సల్ఫర్ (గంధకపు) పొడిని డిప్లగ్రేడింగ్ స్పూన్లో తీసుకొని మండించండి. మండుచున్న డిఫరేటింగ్ స్పూనను జాడీలో చేర్చి మూత బిగించండి. కొంత సేపటి తర్వాత వాయువు బయటకు పోకుండా స్పూన్ తీసివేసి జాడీలోకి కొద్దిగా నీరు కలిపి జాడీని బాగా కదపండి. ఆ వాయువు (సల్ఫర్ డై ఆక్సైడ్) నీటిలో కరిగించాలి.
సల్ఫర్ + ఆక్సిజన్స → సల్ఫర్ డై ఆక్సైడ్
S (ఘ) + 02 (వా) → SO2 (వా)
పై రసాయన చర్య ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు, నీలి లిట్మస్ కాగితాలతో పరీక్షించాలి. సల్ఫర్ డై ఆక్సైడ్ నీలి లిట్మసను ఎరుపు రంగులోకి మార్చును. సల్ఫర్ డై ఆక్సైడ్ ఆమ్ల ఆక్సెడ్ గా చెప్పవచ్చును.
పై ప్రయోగాల ద్వారా లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సెన్లు ఇస్తాయని, అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఆమ్ల స్వభావం గల ఆక్సైడ్ ను ఇస్తాయని తెలుస్తుంది.
ప్రశ్న 14.
వంట పాత్రల నుండి అంతరిక్షవాహనాల వరకు అల్యూమినియం వినియోగిస్తారు. ఇన్ని రకాలుగా వినియోగించుకునే అవకాశంగల ఈ లోహ లక్షణాలను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
అల్యూమినియం లోహ లక్షణాలు :
1) మరణీయత :
అల్యూమినియంకు స్తరణీయత లక్షణం ఆధారం. అల్యూమినియంతో రేకులు మరియు వంట పాత్రలను తయారుచేస్తారు. అల్యూమినియం రేకులు తేలికగా దృఢంగా ఉండుట వలన విమానాలు మరియు అంతరిక్ష వాహనాల తయారీకి ఉపయోగిస్తారు.
2) తాంతవత :
అల్యూమినియంను తాంతవత ధర్మం ఆధారంగా అల్యూమినియంతో తీగలు తయారుచేస్తారు.
3) ఉష్ణ వాహకత :
అల్యూమినియం లోహం ఉష్ణ వాహకతను ప్రదర్శిస్తుంది. కాబట్టి అల్యూమినియం పాత్రలను వంట పాత్రలుగా ఉపయోగిస్తారు.
4) విద్యుత్ వాహకత :
అల్యూమినియం తీగలను విద్యుత్ వాహక తీగలుగా ఉపయోగిస్తారు.
5) లోహద్యుతి :
అల్యూమినియం లోహానికి లోహద్యుతి లక్షణం ఉండటం వల్ల వాహన పరికరాలను మరియు తినుబండారాలను ప్యాకింగ్ చేయుటకు ఉపయోగిస్తారు.
అల్యూమినియం లోహం తేలికగా, దృఢంగా ఉండుట వలన యంత్ర భాగాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. ఉపయోగించిన అల్యూమినియంను మరల కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు. కావున అల్యూమినియం నిత్య జీవితంలో ఎంతో అవసరము.
ప్రశ్న 15.
లోహాల మరణీయత ధర్మం మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS7)
జవాబు:
- జింక్ మరియు ఇనుముల మిశ్రమ పదార్థం ఇనుపరేకుల తయారీలో ఉపయోగపడును.
- వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగపడును.
- విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగపడును.
- ఆటోమొబైల్, శాటిలైట్ తయారీలో ఉపయోగపడును.
- విమానాలు, వంట పాత్రల తయారీలో ఉపయోగపడును.
- యంత్రభాగాలు, అలంకరణ సామాగ్రి తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 16.
లోహ మరియు అలోహ వ్యర్థాల వలన పర్యావరణం కలుషితం అవుతుంది. ఈ వాక్యాన్ని సమర్థిస్తారా? అయితే సరైన ఉదాహరణల ద్వారా వివరించండి. (AS7)
జవాబు:
- లోహాలను మరియు అలోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహణ చేయునపుడు కొన్ని వ్యర్థ వాయువులు, వ్యర్థ పదార్థాలు వెలువడుతాయి. ఇవి వాతావరణమును కలుషితం చేస్తాయి.
ఉదా :
ఎ) హెమటైట్ నుండి ఇనుమును సంగ్రహణం చేయునపుడు CO, CO2 మరియు కాల్షియం సిలికేట్లు వెలువడును.
బి) లవణ ఫాస్ఫేట్ నుండి విద్యుత్ పద్ధతి ద్వారా ఫాస్ఫరస్ తయారుచేయునపుడు CO మరియు కాల్షియం సిలికేట్లు ఏర్పడును. - మేఘంలో మెరుపులు ఏర్పడినపుడు వాతావరణంలో నైట్రోజన్ ఆక్సిజన్ తో చర్య జరిపి NO, NO2 లాంటి వాయువులు వెలువడి వాతావరణ కాలుష్యం జరుగును.
- పరిశ్రమలలో లోహాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క ధ్వనిగుణం ద్వారా వాతావరణంలో శబ్ద కాలుష్యం జరుగును.
- మిశ్రమ లోహాల తయారీ లేదా లోహాలతో యంత్ర పరికరాలు తయారుచేయునపుడు విడుదలయ్యే ఉష్ణం వాతావరణాన్ని వేడిచేయును మరియు విడుదలయ్యే వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.
పరికరాల జాబితా
చెక్కగంట, బొగ్గుముక్క, బ్యాటరీ, బల్బు, వైర్లు, కొవ్వొత్తి మైనము, గుండు సూదులు, ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం, ఇనుప గంట, ఇత్తడి గంట, స్టాండు, ఇనుపకడ్డీ, అల్యూమినియం కడ్డీ, రాగి కడ్డీ, లోహపు ముక్క (మెగ్నీషియం), సారాదీపం, లిట్మస్ కాగితాలు, వాచ్ గ్లాస్, బీకర్లు, జింకు ముక్కలు, ఇనుపముక్కలు, రాగి ముక్కలు, గంధకము, బొగ్గుపొడి, అయోడిన్, కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్
8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook InText Questions and Answers
ఆలోచించండి – చర్చించండి
8th Class Physical Science Textbook Page No. 68
ప్రశ్న 1.
సల్ఫర్, కార్బన్, అయోడిన్లను ఉపయోగించి వలయాన్ని పూర్తిచేయగలరా?
జవాబు:
సల్ఫర్, కార్బన్, అయోడిన్లను ఉపయోగించి సాధారణ విద్యుత్ వలయాన్ని పూర్తి చేయలేము.
8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Activities
కృత్యములు
కృత్యం – 1 పదార్థాల రూపం, రంగులను పరిశీలించుట :
1. ఈ కింది పట్టికలో ఇవ్వబడిన వస్తువుల రంగును మరియు అవి కాంతివంతంగా ఉన్నాయో లేదో నిర్ణయించి మీ పరీశీలనలను రాయండి. పదార్థాల ఉపరితలం మురికిగా ఉంటే గరుకు కాగితం (Sand paper) తో శుభ్రం చేయండి.
నమూనా | కాంతివంతం/కాంతివిహీనం | రంగు |
ఇనుపమేకు | కాంతివంతం | గోధుమ |
జింకు | కాంతివంతం | తెలుపు |
రాగి | కాంతివంతం | ఎరుపు |
గంధకం | కాంతివిహీనం | పసుపు రంగు గల స్ఫటిక పదార్థం |
అల్యూమినియం | కాంతివంతం | తెలుపు |
కార్బన్ | కాంతివిహీనం | నలుపు |
మెగ్నీషియం | కాంతివంతం | తెలుపు |
అయోడిన్ | కాంతివంతం | నలుపు |
కృత్యం – 2 కొన్ని పదార్థాల నుండి ఉత్పత్తి అయిన ధ్వనిని వినడం :
2. జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం మరియు అయోడిన్ వంటి నమూనాలను తీసుకోండి. ఈ నమూనాలను దృఢమైన నేలపై ఒక్కొక్కటిగా పడవేసి వరుసగా అవి ఉత్పత్తి చేసే ధ్వనులను విని పట్టికలో మీ పరిశీలనలను నమోదు చేయండి.
ధ్వనిని ఉత్పత్తి చేసినవి | ధ్వనిని ఉత్పత్తి చేయనివి |
జింక్ (Zn) | సల్ఫర్ (S) |
కాపర్ (Cu) | కార్బన్ (C) |
అల్యూమినియం (Al) | అయోడిన్ (T2) |
మెగ్నీషియం (Mg) |
కృత్యం – 3 పదార్థాల స్తరణీయతను గుర్తించుట :
3. జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం మరియు అయోడిన్ వంటి పదార్థాలను సుత్తితో కొట్టండి. ఆ పదార్థాలలో వచ్చే మార్పులను (పదార్థాల స్తరణీయతను) గమనించి ఈ కింది పట్టికలో నమోదు చేయండి.
పరిశీలించే మార్పు | నమూనా పేరు |
చదునుగా మారడం | ఇనుము, జింక్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం |
ముక్కలు, పొడిగా మారడం | కార్బన్, సల్ఫర్, అయోడిన్ |
ఏ మార్పు లేకుండా ఉండడం | ——- |
కృత్యం – 4 పదార్థాల విద్యుత్ వాహకతను గుర్తించుట :
4. బ్యాటరీ, బల్బు, విద్యుత్ తీగల సహాయంతో ప్రక్క పటంలో చూపిన విధంగా సాధారణ వలయాన్ని తయారుచేయండి. P, Qలను ఈ కింది పట్టికలో నమోదు చేయబడిన నమూనాలతో P, Q ల మధ్య సంధానం చేసి బల్బు వెలుగుతుందో లేదో పరిశీలించి పట్టికలో నమోదు చేయండి. నమూనాలు పొడి రూపంలో ఉంటే వాటిని ‘లో పొడిని నింపి P, Qల మధ్య సంధానం చేయండి.
నమూనా | బల్బు వెలుగుతుందా ? (అవును/కాదు) |
ఇనుము | అవును |
జింకు | అవును |
రాగి | అవును |
గంధకం | కాదు |
అల్యూమినియం | అవును |
కార్బన్ | కాదు |
మెగ్నీషియం | కాదు |
అయోడిన్ | కాదు |
కృత్యం – 5 లోహాల ఉష్ణవాహకతను పరిశీలించుట :
5. ఒక ఇనుపకడ్డీని తీసుకొని దానికి గుండుసూదులను మైనంతో అంటించండి. ఇనుపకడ్డీ ఒక చివరను స్టాండ్ కు అమర్చండి. రెండవ చివర సారాయి దీపంతో వేడిచేయండి. కొంత సేపటికి ఇనుపకడ్డీకి అంటించిన గుండుసూదులు పడిపోవడాన్ని పరిశీలించండి.
మీరు పరిశీలనల ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) గుండుసూదులు ఎందుకు పడిపోయాయి?
జవాబు:
సారాయి దీపంతో వేడి చేయడం వల్ల మైనం కరిగి గుండుసూదులు కింద పడిపోయాయి.
2) కడ్డీకి ఏ వైపున ఉన్న గుండుసూదులు ముందుగా కిందపడ్డాయి? దీనికి కారణమేమిటి?
జవాబు:
సారాయి దీపంతో వేడి చేయబడిన కడ్డీ రెండవ చివర గుండుసూదులు ముందుగా కింద పడిపోయాయి. దీనికి కారణం కడ్డీ రెండవ చివరనుండి కడ్డీ మొదటి చివరకు ఉష్ణం ప్రసరించుట.
3) ఇనుప కడ్డీలో (లోహంలో) ఒక చివర నుండి మరొక చివరకు ఉష్ణం ప్రసరించడాన్ని ఏమంటారు?
జవాబు:
ఇనుప కడ్డీలో (లోహంలో) ఒక చివర నుండి మరొక చివరకు ఉష్ణం ప్రసరించడాన్ని ఉష్ణవాహకత అంటారు.
ప్రయోగశాల కృత్యం లోహాలు ఆక్సిజన్ తో చర్య :
6. ఉద్దేశ్యం : లోహాలు, అలోహాలు ఆక్సిజన్ తో జరిపే చర్యను తెలుసుకొనుట.
కావలసిన పరికరాలు :
ఒక లోహపు ముక్క (మెగ్నీషియం), కొద్ది పరిమాణంలో అలోహం (సల్ఫర్), సారా దీపం లేదా బున్ సెన్ బర్నర్, లిట్మస్ కాగితాలు మొదలైనవి.
- మెగ్నీషియం తీగముక్కను తీసుకొని దాని భౌతిక స్వరూపాన్ని (Appearance) నమోదు చేయండి. ఆ తీగను మండించండి. చర్య జరిగిన తరువాత భౌతిక స్వరూపంలో వచ్చిన మార్పును నమోదు చేయండి.
- కాల్చిన తర్వాత ఏర్పడిన బూడిదను స్వచ్ఛమైన నీటిలో (Distilled water) కలపండి. ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు మరియు నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించి ఫలితాన్ని పట్టికలో నమోదు చేయండి.
- కొద్దిగా గంధకపు పొడిని డిప్లగ్రేటింగ్ స్పూన్లో తీసుకొని మండించండి.
- గంధకం మండటం ప్రారంభం కావడంతోనే స్పూన్ ను జాడీలో చేర్చి మూత బిగించండి. కొద్ది సేపటి తర్వాత స్పూను తీసివేసి వాయువు బయటకు పోకుండా జాగ్రత్తగా మూత పెట్టండి. జాడీలో కొద్దిగా నీరు కలపండి. జాడీని బాగా కలిపి ఆ ద్రావణాన్ని ఎరుపు, నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించి ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.
- గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో నమూనాలను మండించినప్పుడు జరిగే చర్యలు.
ఈ ఆక్సెను లిట్మతో పరీక్షించినట్లయితే మెగ్నీషియం ఆక్సెడ్ ఎరుపు లిట్మసను నీలిరంగులోకి, సల్ఫర్ డై ఆక్సైడ్ నీలి లిట్మసు ఎరుపు రంగులోకి మార్చుతాయి.
గ్రహించినది :
మెగ్నీషియం ఆక్సెడ్ ను క్షార ఆక్సెడ్ గాను సల్ఫర్ డై ఆక్సైడ్ ను ఆమ్ల ఆక్సెడ్ గాను చెప్పవచ్చు.
ఫలితం :
ఈ చర్యల ద్వారా అలోహాలు (Non – metals) ఆక్సిజన్ తో చర్య జరిపి ఆమ్ల స్వభావం కలిగి ఉన్న ఆక్సైడ్ లను ఇస్తాయి. లోహాలు (metals) ఆక్సిజన్ తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్ ను ఇస్తాయి.
పట్టిక
జాగ్రత్త : సల్ఫర్‌ను మండించినపుడు ఏర్పడే వాయువును పీల్చకండి. ప్రమాదకరం.
కృత్యం -7 ఆమ్లాలతో చర్యలు :
7. ఈ కింది ,పట్టికలో పేర్కొన్న నమూనాలను వేర్వేరు పరీక్షనాళికల్లో తీసుకోండి. ప్రతి పరీక్షనాళికలో 5 మి.లీ. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంను డ్రాపర్ సహయంతో కలపండి. కొద్దిసేపు పరీక్ష నాళికలోని చర్యలను పరిశీలించండి. మీరు ఏ విధమైన చర్యను గమనించకపోతే పరీక్ష నాళికను కొద్ది సేపు సన్నని మంటపై వేడిచేసి చూడండి. అప్పటికీ ఏ విధమైన చర్య గమనించకపోతే 5 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. తరువాత పరీక్షనాళిక పై భాగంలో మండుతున్న అగ్గిపుల్లని ఉంచండి. ఏం జరుగుతుందో పరిశీలించండి.
మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
నమూనా | సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య | సజల సల్ఫూరిక్ ఆమ్లంతో చర్య |
ఇనుము | ✓ | ✓ |
జింకు | ✓ | ✓ |
రాగి | ✓ | ✓ |
గంధకం | ✗ | ✗ |
అల్యూమినియం | ||
కార్బన్ | ✗ | ✗ |
మెగ్నీషియం | ✗ | ✗ |
అయోడిన్ | ✗ | ✗ |
కృత్యం – 8 లోహాల చర్యాశీలత :
8. ఆరు బీకరులను తీసుకొని, వాటికి a, b, c, d, e, f స్టిక్కర్లతో గుర్తించండి. ప్రతి బీకరులో 50 మి.లీ. నీరు తీసుకోండి. a, b బీకరులలో ఒక చెంచా కాపర్ సల్ఫేట్ (Cus) ను వేసి బాగా కలపండి. మిగిలిన C మరియు d లలో ఒక చెంచా జింక్ సల్ఫేట్ (Znson, e మరియు స్త్రీ లలో ఒక చెంచా ఐరన్ సల్ఫేట్ (FeSO4) వేసి బాగా కలపండి.
కొద్దిసేపు బీకర్లను కదల్చకుండా ఉంచండి. బీకర్లలో గల ద్రావణాల రంగులో జరిగే మార్పులను పరిశీలించి ఈ కింది పట్టికలో నమోదు చేయండి.
ఈ రసాయన చర్యల నుండి ఎక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తున్నాయని, తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించ లేకపోతున్నాయని పై ప్రయోగాల పరిశీలన వల్ల తెలుస్తుంది.
అదనపు కృత్యం – 1
ఈ కింది పట్టికలోని పదార్థ నమునాలు పరిశీలించి, ఇంతవరకు చేసిన కృత్యాల ఆధారంగా ఈ కింది పట్టికలో ధర్మాలను పాటిస్తే టిక్ ( ✓) కొట్టండి. లేకపోతే తప్పు (✗) గుర్తును రాయండి.