SCERT AP 8th Class Social Study Material Pdf 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Social Solutions 3rd Lesson భూ చలనాలు – రుతువులు
8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
మీ ప్రాంతంలో పండించే పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? పెద్దవాళ్ల తోటి, మిత్రుల తోటి చర్చించి దీని మీద చిన్న వ్యాసం రాయండి. (AS4)
జవాబు:
మాది తూర్పు గోదావరి జిల్లాలోని “అంతర్వేదిపాలెం” అనే చిన్న గ్రామం. మా ప్రాంతంలో రైతులు మూడు పంటలు పండిస్తారు. ఋతుపవనాల కాలంలో వరి, జొన్న మొదలైన పంటలు పండిస్తారు. ఈ కాలం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఉంటుంది. తరువాత నుండి అనగా శీతాకాలం నుండి రబీ పంట పండిస్తారు. దీనిలో కూడా కొందరు వరిని, కొందరు మినుము, పెసర, కందులు మొదలైన వాటిని పండిస్తారు. ఇది వేసవికాలం వరకు ఉంటుంది. దీని తరువాత ఖరీఫ్ మొదలయ్యే లోపు కూరగాయలు, పండ్లు పండిస్తారు. ఇంతేకాక సంవత్సరం పొడుగునా కొబ్బరిచెట్లు దిగుబడినిస్తాయి. ఈ కారణాల రీత్యా పంటలకు, కాలాలకు మధ్య సంబంధం ఉంది అని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 2.
శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ మంచు కురవకపోవటానికి కారణం ఏమిటి? (AS1)
జవాబు:
గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టాలంటే అక్కడ 0°C ఉష్ణోగ్రత లేదా ఇంకా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే ఆ నీరు గడ్డ కట్టి మంచుగా మారి కురుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ 16.5° ఉత్తర అక్షాంశం నుండి 22°C- 25°C ఉత్తర అక్షాంశం మధ్యన (సుమారుగా) వ్యాపించి ఉన్నది. అంటే ఉష్ణమండల ప్రాంతంలో ఉంది. ఇక్కడ శీతాకాలంలో కూడా 15°C నుండి 30°C వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పరిస్థితులలో నీరు మంచుగా మారలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో శీతాకాలంలో మంచు కురవదు.
ప్రశ్న 3.
మనకు వానాకాలం ఉంది. భూమి పరిభ్రమణానికీ, సూర్యుని కిరణాలు పడే తీరుకీ, వానాకాలానికీ మధ్య సంబంధం ఏమిటి? వానలు వేసవిలో పడతాయా, లేక శీతాకాలంలోనా, లేక రెండింటికీ మధ్యలోనా? (AS1)
జవాబు:
భూపరిభ్రమణం వలన కాలాలు, సూర్య కిరణాలు పడే తీరు వలన కాలాల్లో మార్పులు సంభవిస్తాయి. మనకి ఎండా కాలం వచ్చినపుడు ఇక్కడి ప్రాంతం మీద, సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఈ ప్రాంతంలోని గాలి వేడెక్కి పైకిపోతుంది. ఇందుమూలంగా ఇక్కడ వేసవికాలంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అప్పుడు హిందూ మహాసముద్రం మీద అధిక పీడన ప్రాంతం నుండి ఇక్కడకు గాలులు వీచి (ఋతుపవన) వర్షాన్నిస్తాయి. అంటే వేసవికాలం తరువాత వానలు పడతాయి. మరలా శీతాకాలం మొదట్లో ఈ ఋతుపవనాలు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు వర్షాన్నిస్తాయి.
ప్రశ్న 4.
మీ ప్రాంతంలో వివిధ నెలల్లో సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల సమాచారం సేకరించండి. (స్థానిక దినపత్రికల ద్వారా ఈ విషయం తెలుస్తుంది), ప్రతిరోజూ పగటి కాలం, రాత్రి కాలం ఎంతో అన్ని నెలలకూ లెక్కకట్టండి. దీంట్లో ఏమైనా ఒక పద్దతి కనపడుతోందా? (AS3)
జవాబు:
నేను సూర్యోదయ, సూర్యాస్తమయాలకు ఎంతో ప్రాముఖ్యమున్న కన్యాకుమారి, తమిళనాడుని ఈ ప్రాజెక్టుకు ఎంచుకున్నాను. ప్రతి నెలా మొదటి తేదీన సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలను సేకరించాను.
ఈ పట్టికను పరిశీలించిన తరువాత ఆగస్టు నెల నుండి జనవరి వరకు పగటి కాలం తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి నుండి జులై వరకు పెరుగుతూ వచ్చింది.
ఆగస్టు నుండి జనవరి వరకు రాత్రి పొద్దు ఎక్కువ.
ఫిబ్రవరి నుండి జులై వరకు పగటి పొద్దు ఎక్కువ.
ప్రశ్న 5.
భూ భ్రమణం గురించి మీ తల్లిదండ్రులకు లేదా తమ్ముడు, చెల్లెలికి వివరించండి. వాళ్లకు వచ్చిన అనుమానాలు, ప్రశ్నలు రాసుకోండి.
జవాబు:
భూ భ్రమణం గురించి నా తమ్ముడు, చెల్లెకి వివరించాను. వారు నన్ను ఈ క్రింది ప్రశ్నలు అడిగారు.
- భూమి అసలు ఎందుకు తిరుగుతుంది?
- భూమి ఎంత వేగంతో తిరుగుతుంది?
- భూమి తిరుగుతున్నట్లు మనకెందుకు తెలియటంలేదు?
- భూమి తిరుగుతోందని మనం ఎలా నిరూపించగలము?
- భూమి అక్షం ఎందుకు వంగి ఉంది?
- భూమి భ్రమించకపోతే ఏమి జరుగుతుంది? భూమిని ఎవరైనా తిప్పుతున్నారా?
ప్రశ్న 6.
భూమి తన చుట్టూ తాను తిరగకుండా, ఒక సంవత్సర కాలంలో సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ఊహించుకోండి. దీని వల్ల వేరు వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కాలాల్లో ఎటువంటి మార్పు ఉంటుంది? (AS4)
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యునికి ఎదురుగా ఉన్న భాగానికి ఎల్లప్పుడు కాంతి, వేడిమి లభిస్తాయి. మిగిలిన భాగం చీకటిలో, చలిగా ఉండిపోతుంది. సూర్యుని వైపు ఉన్న భాగం చాలా వేడెక్కిపోతుంది. ఈ పరిస్థితులలో భూమిపై జీవం ఉనికి దెబ్బ తింటుంది.
ప్రశ్న 7.
ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని సమశీతోష్ణ మండలంలో ఒక్కొక్క దేశాన్ని గుర్తించండి. ఆ దేశాలలోని కాలాలను మీ ప్రాంతపు కాలాలతో పోల్చండి. మే-జూన్ నెలల్లో ఏ ప్రాంతం వేడిగా ఉంటుంది. డిసెంబరు – జనవరి నెలల్లో లేదా మార్చి సెప్టెంబరు నెలల్లో ఏ ప్రాంతం చలిగా ఉంటుంది? (AS5)
జవాబు:
నేను ఈ ప్రాజెక్టుకు ఉత్తర సమశీతోష్ణ మండలంలోని రష్యాను, దక్షిణ సమశీతోష్ణ మండలంలోని ఫాలాండ్ దీవులను ఎంచుకున్నాను.
రష్యాలోని మాస్కో:
ఈ ప్రాంతం 55.7517° ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రతలు :
ఫా లాండ్ దీవులు :
ఈ ప్రాంతం 51° దక్షిణ అక్షాంశం నుండి 52°ల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంది.
ఉత్తర సమశీతోష్ణ మండలంలో వేసవికాలంలో దక్షిణ ప్రాంతంలో శీతాకాలం ఉన్నది. ఉత్తరాన శీతాకాలం ఉన్నప్పుడు, దక్షిణాన వేసవికాలం ఉన్నది.
మా ప్రాంతం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఈ ప్రాంతం 16.5200° ఉత్తర అక్షాంశం దగ్గర ఉన్నది. ఇక్కడ ఏప్రిల్, మే నెలలలో అత్యధిక ఉష్ణంతో వేసవికాలం, డిసెంబరు, జనవరి నెలలలో శీతాకాలం ఏర్పడతాయి. ఇక్కడ ఆ ప్రాంతాల వేసవి ఉష్ణోగ్రతల కన్నా వేసవికాలంలోనూ, శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అయితే ఈ ప్రాంతాలు మూడింటిలోనూ కాలాలు హెచ్చు తగ్గులతో ఒకే విధంగా ఉన్నాయి.
ప్రశ్న 8.
భారతదేశంలోని ఆరు రుతువులు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంలోని ఆరు రుతువులు :
- వసంత రుతువు – మార్చి మధ్య నుండి మే మధ్య వరకు.
- గ్రీష్మ రుతువు – మే మధ్య నుండి జులై మధ్య వరకు.
- వర్ష రుతువు – జులై మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు.
- శరదృతువు – సెప్టెంబరు మధ్య నుండి నవంబరు మధ్య వరకు.
- హేమంత రుతువు – నవంబరు మధ్య నుండి జనవరి మధ్య వరకు.
- శిశిర రుతువు – జనవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు.
ప్రశ్న 9.
ఈ పాఠంలోని మొదటి పేరాగ్రాఫ్ చదివి, కింది ప్రశ్నకు జవాబు రాయండి. అనేక చెట్లు, జంతువులతో కలిసి మనుషులు సహజీవనం చేస్తున్నారు.
కాలం గడుస్తున్న క్రమంలో మన పరిసరాల్లో నిరంతరం మార్పులు గమనిస్తూ ఉంటాం. మొక్కలు, చెట్లు పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. జంతువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. నెలలు గడుస్తున్న కొద్దీ చెట్లు ఆకులను రాల్చటం గమనించి ఉంటారు. కొంతకాలం బోసిగా ఉండి చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. మళ్లీ పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. అదేవిధంగా సంవత్సరంలోని వివిధ కాలాల్లో వేరు వేరు రకాల పళ్లు, కూరగాయలు రావటం గమనించి ఉంటారు. కొన్ని నెలల్లో చాలా వేడిగా ఉంటుంది. మరి కొన్ని నెలల్లో చాలా చలిగా లేదా వానలు పడుతూ ఉంటుంది.
మానవ జీవితాన్ని రుతువులు ఎలా ప్రభావితం చేస్తాయి? (AS2)
జవాబు:
కాలంతోపాటు మనుషులు, జంతువుల ప్రవర్తనలోనూ, చెట్లలోను మార్పులు ఉంటాయి. ఉదా : ఎండాకాలంలో మనుషులు పల్చటి నేత వస్త్రాలు ధరిస్తారు. చలికాలంలో మందపాటి, ఊలు దుస్తులు ధరిస్తారు. చలికాలంలో చెట్టు ఆకులు రాలిస్తే, వర్షాకాలంలో పూస్తాయి, కాస్తాయి. ఆవులు వర్షంలో తడవడానికి ఇష్టపడవు. వేసవికాలంలో అధిక ఉష్టాన్ని భరించలేవు. ఈ విధంగా రుతువులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
8th Class Social Studies 3rd Lesson భూ చలనాలు – రుతువులు InText Questions and Answers
8th Class Social Textbook Page No.33
ప్రశ్న 1.
మీరు గమనించిన ముఖ్యమైన కాలాలు, సంబంధాలు పోల్చండి.
జవాబు:
నేను గమనించిన ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం. ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. వానాకాలం వానలు కురుస్తాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ప్రశ్న 2.
ప్రతి కాలంలో ఏం జరుగుతుందో వివరించండి – ఎంత వేడెక్కుతుంది, ఎంత వాన పడుతుంది, మొక్కలు, చెట్లు, . పశువులకు ఏమవుతుంది, తినటానికి ఏమి ఆహారం దొరుకుతుంది?
జవాబు:
ఎండాకాలం :
వాతావరణం చాలా వేడిగా (45°C వరకు) ఉంటుంది. ఈ కాలం చివరిలో అప్పుడప్పుడు జల్లులు పడతాయి. మొక్కలు, చెట్లు, మనుషులు, పశువులు కూడా నీడకి, చల్లదనానికి, ఆహారానికి, నీటికి అల్లాడుతారు. ఈ కాలంలో ప్రత్యేకించి పుచ్చకాయలు, మామిడిపళ్ళు, తాటిముంజలు దొరుకుతాయి.
వానాకాలం :
ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వేడి మాత్రం 35°C వరకు ఉంటుంది. మొక్కలు, చెట్లు . పచ్చగా కళకళలాడతాయి. పశువులు మేయడానికి పసిరిక దొరుకుతుంది. అవి కూడా పాలు ఎక్కువ ఇస్తాయి. చాలా రకాల కూరగాయలు, పుట్టగొడుగులు బాగా దొరుకుతాయి.
చలికాలం :
ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. వేడి 30°C వరకు ఉన్నా రాత్రిళ్ళు ఎక్కువ చలి ఉంటుంది. మొక్కలు, చెట్లు పూత తగ్గిపోతాయి. పశువులు కూడా వెచ్చదనం కోసం వెతుక్కుంటాయి. కాలిఫ్లవర్, టమాటా, ద్రాక్ష వంటివి ఎక్కువగా దొరుకుతాయి.
ప్రశ్న 3.
ప్రక్క చిత్రంలోని చెట్లను గమనించండి.
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టా లేక వేరువేరు చెట్లా?
జవాబు:
చిత్రాల్లో ఉన్నది ఒకే చెట్టు.
ప్రశ్న 4.
ఈ చెట్లలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:
- మొదటి చెట్టు మంచుతో నిండి ఉంది.
- రెండవది పెద్ద ఆకులతో ఉంది.
- మూడవది చిగురులు తొడుగుతోంది.
- నాల్గవది ఆకులు రాలుస్తోంది.
ప్రశ్న 5.
కాలాలు భిన్నంగా ఉండే దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎవరైనా మీ తరగతిలో ఉన్నారా ? అక్కడ ఏం జరుగుతుందో వాళ్లను వివరించమనండి.
జవాబు:
మా తరగతిలో ‘అచ్యుత్’ అనే విద్యార్థి డెహ్రాడూన్ నుండి వచ్చి చదువుకుంటున్నాడు. ఇక్కడ తన తాత, అమ్మమ్మల దగ్గర ఉంటున్నాడు. వాళ్ళ నాన్న, అమ్మ డెహ్రాడూన్లో ఉంటారు. అక్కడ కాలాలు మన ‘కన్నా చాలా భిన్నంగా ఉంటాయట. చలికాలం చాలా తీవ్రంగా ఉంటుందంట. అతనేం చెబుతాడో విందాము.
“నా పేరు అచ్యుత్, నేను హిమాలయాల పాదాల చెంత డెహ్రాడూన్లో ఉండేవాణ్ణి. అక్కడ ఎండాకాలం కొంచెం చెమటగా ఉండేది. ఎండ ఇక్కడి మీద కొద్ది తక్కువ. వానాకాలం వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి. ఎంత పడినా కొండల్లో వర్షం తెలిసేది కాదు. కాని చెట్ల ఆకులన్నీ నీటి బొట్లతో కళకళలాడేవి.
ఇక చలికాలానికి వస్తే, అమ్మో ! చాలా చలి. ఏ పనికైనా వేడి నీళ్ళే వాడాల్సి వస్తుంది. మంచినీళ్ళు కూడా వేడిగానే తాగుతాం. పొద్దున్న 7/8 అయితే గాని వెలుతురు సరిగా ఉండదు. వంటి మీద ఇన్నర్లు, డ్రస్సులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, టోపీలు, సాక్స్, గ్లోవ్స్ అన్నీ కచ్చితంగా ధరించాల్సిందే. కాని మా ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.”
8th Class Social Textbook Page No.34
ప్రశ్న 6.
భూమధ్యరేఖకు మొత్తం ఉత్తరాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించాయి. ఐరోపా, ఉత్తర అమెరికా.
ప్రశ్న 7.
భూమధ్యరేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆస్ట్రేలియా ఖండం
ప్రశ్న 8.
భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన విస్తరించిన ఖండం ఏదైనా మీకు కనిపించిందా?
జవాబు:
కనిపించింది. అది ఆసియా ఖండం
ప్రశ్న 9.
“అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అని ఏ దేశాన్ని అంటారో తెలుసుకుని దానిని గ్లోబు మీద గుర్తించండి. దాని రేఖాంశం తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ రేఖాంశంతో పోల్చండి.
జవాబు:
“అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” అనటం కన్నా ‘అర్ధరాత్రి సూర్యుడి ప్రాంతం’ అనటం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర ధృవం దగ్గర ఉన్న దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. డెన్మార్క్ ఫిలాండ్, యూకన్ మరియు వాయవ్య ప్రాంతాలు నూనావత్ తో కలిపి కెనడా, ఐర్లాండ్, లావ్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, ఉత్తర అమెరికాలోని అలాస్కా – ఇవన్నీ కూడా ‘అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలే.’ ఆంధ్రప్రదేశ్ 80° తూర్పు రేఖాంశం వద్ద ఉన్నది.
నార్వే : 5.3400° తూర్పు రేఖాంశం
స్వీడన్ : 15.7591° తూర్పు రేఖాంశం
ఐర్లాండ్ : 18.9720° తూర్పు రేఖాంశం
లాటౌండ్ : 23.25° తూర్పు రేఖాంశం నుండి 26.65° తూర్పు రేఖాంశం వరకు
డెన్మార్క్ : 12.5700 తూర్పు రేఖాంశం
ఫిలాండ్ : 24.7271° తూర్పు రేఖాంశం
అలాస్కా : 148.5569° పశ్చిమ రేఖాంశం
రష్యా : 55.0423° తూర్పు రేఖాంశం
యూకాన్ : 135.7667° పశ్చిమ రేఖాంశం
కెనడా : 86.4196° పశ్చిమ రేఖాంశం మొదలగునవి.
గ్లోబు మీద ఈ దేశాలను వ్యక్తిగతంగా గుర్తించండి.
ప్రశ్న 10.
గ్లోబును చూసి భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న దేశాలను గుర్తించండి.
జవాబు:
ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీలను గ్లోబుపై వ్యక్తిగతంగా గుర్తించండి.
ఆసియా : ఇండోనేషియా, తూర్పు టైమర్, మాల్దీవులలో కొంతభాగం.
ఆఫ్రికా : అంగోలా, బోట్స్వా నా, బురుండి మొ||నవి.
యూరప్ : ఏమీ లేవు.
ఉత్తర అమెరికా : ఏమీ లేవు
దక్షిణ అమెరికా : అర్జెంటీనా, చిలీ, బొలీవియా
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా, న్యూగినియా
ప్రశ్న 11.
కాలాల మాయాజాలానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ,మూడు ప్రశ్నలు రాయండి. వాటికి సమాధానాలు కనుక్కోటానికి ప్రయత్నిద్దాం.
1) కాలాలు ఏర్పడటానికి గల కారణమేమి?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒంగి ఉండటము, భూపరిభ్రమణము దీనికి కారణము.
2) కాలాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
భూమి మీద జీవం అంతరించిపోతుంది.
8th Class Social Textbook Page No.37
ప్రశ్న 12.
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది కానీ అక్షం వంగిలేదని ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ కాలాల్లో మార్పులను అది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
ఇది ఈ పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాల ఉత్తర ప్రాంతంలో కాలాల మార్పులను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
భూమి యొక్క అక్షం వంగి వుండకపోతే ఈ కింది విధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉన్నది. కాబట్టి సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అక్షం వంగి ఉండకపోవటం మూలంగా సంవత్సరమంతా ఇదే విధంగా ఉంటుంది. అందువలన ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరమంతా వేసవికాలమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షాకాలం, శీతాకాలం తమ సమయాలను మార్చుకుంటాయి లేదా అసలు ఉండకపోవచ్చు. దాదాపుగా వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఒకే రోజులో రావడానికి అవకాశం ఉండవచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు.
పాఠం ప్రారంభంలో చూసిన చిత్రాలు ఉత్తర ప్రాంతంలో ఒక్కో కాలంలో, ఒక్కోలా ఉన్నాయి. భూమి అక్షం ఒంగి ఉండనట్లయితే, అక్కడ ఎప్పుడూ చలి, గడ్డ కట్టిన మంచుతో కప్పబడి ఉండేది. అటువంటప్పుడు అక్కడ పొదలు, గడ్డి , తప్ప వృక్షాలు పెరిగే అవకాశమే ఉండదు.
8th Class Social Textbook Page No.38
ప్రశ్న 13.
ఏ నెలలోనైనా సూర్యుడి కిరణాలు ఆంధ్రప్రదేశ్ లో నిటారుగా పడతాయా? పడితే, ఏ నెలలో?
జవాబు:
పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో సూర్యుని కిరణాలు మే నెలలో దాదాపు నిటారుగా పడతాయి.
ప్రశ్న 14.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
భూమి యొక్క అక్షం ఒక ఊహా జనితరేఖ. దీనిని మనం కంటితో చూడలేము.
ప్రశ్న 15.
భూమి యొక్క అక్షంను మనం ఎక్కడ నుండి చూడవచ్చు?
జవాబు:
చూడలేము. ఎందుకంటే భూమి యొక్క అక్షం ఒక ఊహాజనిత రేఖ. దీనిని మనం కంటితో చూడలేము.
ప్రశ్న 16.
ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండలంలో ఉందో, సమశీతోష్ణ మండలంలో ఉందో తెలుసుకోంది.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ సుమారుగా 12° ఉత్తర అక్షాంశం నుండి 19° ఉత్తర అక్షాంశం మధ్యలో వ్యాపించి ఉన్నది. అంటే ఇది ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నది.
ప్రశ్న 17.
ఢిల్లీ ఏ మండలంలో ఉందో తెలుసుకుని, శీతాకాలంలో అక్కడ మంచు కురుస్తుందేమో తెలుసుకోండి.
జవాబు:
ఢిల్లీ 28°22″ ఉత్తర అక్షాంశం నుండి 28°54″ ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నది. అంటే ఢిల్లీ సమశీతోష్ణ మండలంలో ఉన్నది. ఇక్కడ శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కానీ మంచు కురవదు.
ప్రశ్న 18.
భూమి రోజూ ఎంతో వేగంతో తిరుగుతున్నది. కానీ ఆ విషయం భూమిపై నున్న మనకు ఎందుకు తెలియటం లేదు?
జవాబు:
భూమి, భూమిపై నున్న మనుషులు, ఇళ్ళు, చెట్లు, జంతువులు, భూమిని ఆవరించియున్న వాతావరణము, అన్నిటితో సహా తిరుగుచున్నది. అందువలన ఈ విషయం మనకు తెలియటం లేదు.
పట నైపుణ్యాలు
ప్రశ్న 19.
భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను గీచి చూపండి.
జవాబు:
ప్రశ్న 20.
భూమి మీద మూడు ఉష్ణోగ్రతా మండలాలను చిత్రించి చూపండి.
జవాబు:
ప్రశ్న 21.
ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది?
జవాబు:
వేసవి కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది.
ప్రశ్న 22.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
కాలాలను ప్రభావితం చేసే అంశాలు : వీటిని అర్థం చేసుకోవటానికి అనేక అంశాల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఇవి :
- భూమి బంతిలాగా గోళాకారంలో ఉండటం, దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండటం.
- భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం (భూభ్రమణం).
- సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండటం.
- సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం (పరిభ్రమణం).
ప్రశ్న 23.
భూమి భ్రమణాన్ని, పరిభ్రమణాన్ని ప్రశంసించండి.
జవాబు:
భూమి పుట్టినది మొదలు ఈనాటి వరకూ అలుపెరగక భ్రమణ, పరిభ్రమణాలను జరుపుతోంది. అది ఒక్క క్షణం అలుపు తీర్చుకున్నా భూమి మీద ప్రాణికోటి మిగలదు. కాబట్టి భూమికి కృతజ్ఞతాపూర్వక వందనములు.
ప్రశ్న 24.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలోకి ఏది ముఖ్యమని నీవు భావిస్తున్నావు?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే అని నా భావన. ఎండాకాలంలో ఎండిన నేలకి వాన స్వాంతన. ఈ రెండింటి తర్వాత చలి ఎంతో హాయినిస్తుంది. చలికాలం తరువాత ఎండ కూడా హాయిగానే ఉంటుంది. అయితే వాస్తవంగా ఏ కాలం లేకపోయినా భూమి మీద మానవ మనుగడ అసాధ్యం అని నేను భావిస్తున్నాను.
ప్రశ్న 25.
ముఖ్యమైన కాలాలు చెప్పండి.
జవాబు:
ముఖ్యమైన కాలాలు ఎండాకాలం, వానాకాలం మరియు చలికాలం.
ప్రశ్న 26.
భూ భ్రమణం, భూ పరిభ్రమణం ప్రశంసించండి.
జవాబు:
భూ భ్రమణం, భూ పరిభ్రమణం సమస్త జీవరాసులకు ప్రాణాధారం.
ప్రశ్న 27.
భూమిపైన ఉన్న కాలాలన్నింటిలో ఏది ముఖ్యమైనది?
జవాబు:
భూమిపై ఉన్న కాలాలన్నీ ముఖ్యమైనవే. ఏ కాలం లేకపోయినా మానవాళి మనుగడ శూన్యమౌతుంది.