AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

AP State Syllabus AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ.

AP State Syllabus 8th Class Telugu Important Questions 5th Lesson ప్రతిజ్ఞ

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అపరిచిత పద్యాలు చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మేడిపండు జూడ మేలిమై యుండును
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు :
1. పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు:
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

2. మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
మేడిపండు పైకి చక్కగా ఉంటుంది.

3. మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు:
మేడిపండు లోపల పురుగులతో కూడి ఉంటుంది.

4. ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు:
ఈ పద్యంవల్ల పిరికివాని స్వభావం తెలుస్తోంది.

2. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. తేనెటీగ తేనెను ఎవరికి ఇస్తున్నది?
జవాబు:
తేనెటీగ తేనెను తెరువరికి (బాటసారికి) ఇస్తున్నది.

2. తాను తినక, కూడబెట్టువారి నేమందురు?
జవాబు:
తాను తినక, కూడబెట్టువారిని పిసినారి అంటారు.

3. పై పద్యము నందలి భావమేమి?
జవాబు:
కూడబెట్టిన ధనం సద్వినియోగం చేయకపోతే వృథా అవుతుంది.

4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
జవాబు:
కూడబెట్టిన ధనం దానం చేసినా లేదా తాను అనుభవించినా సద్వినియోగం అవుతుంది.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

3. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు:
అంటూ ఉంటే రాగం అతిశయిల్లుతుంది.

2. తింటూ ఉంటే తీయనయ్యేది ఏది?
జవాబు:
తింటూ ఉంటే వేపాకు తీయనవుతుంది.

3. సాధనతో సమకూరేవి ఏవి?
జవాబు:
సాధనతో పనులు సమకూరుతాయి.

4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది ఈ పద్యానికి మకుటం.

4. మేరు నగము వంటి ధీరత కలిగియు
పరమశివుడు తనదు పదములంట
ఇంచుకంత చంచలించె పర్వతరాజు
దేవదేవుడన్న భావనమున.
ప్రశ్నలు:
1. పర్వతరాజు ఎటువంటి ధీరత గలవాడు?
జవాబు:
పర్వతరాజు మేరు నగము వంటి ధీరత గలవాడు.

2. పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినదెవరు?
జవాబు:
పర్వతరాజు పాదాలకు నమస్కరించ వచ్చినది పరమ శివుడు.

3. ఇంచుకంత చలించినది ఎవరు?
జవాబు:
ఇంచుకంత చలించినది పర్వతరాజు.

4. పర్వతరాజు శివుని ఎట్లా భావించాడు?
జవాబు:
పర్వతరాజు శివుని దేవదేవుడుగా భావించాడు.

5. ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
జవాబు:
పాకమునకు భాండశుద్ధి అవసరం.

2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
జవాబు:
చిత్తశుద్ధి లేకుండా శివపూజలు (దైవపూజలు) చేయకూడదు.

3. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శుద్ధి’ (నిర్మలత్వం) అని పెట్టవచ్చు.

4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
జవాబు:
ఈ పద్యాన్ని రాసిన కవి వేమన.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

6. మఱవవలెఁ గీడు నెన్నఁడు
మఱవంగా రాదు మేలు మర్యాదలలోఁ
దిరుగవలె సర్వజనములం
దరిఁప్రేమన్ మెలగవలయుఁ దరుణి కుమారీ !
ప్రశ్నలు :
1. దేనిని మరచిపోవాలి?
జవాబు:
కీడును మరచిపోవాలి.

2. దేనిని మరువరాదు?
జవాబు:
మేలును మరువరాదు.

3. అందరి ఎడల ఎట్లా మెలగాలి?
జవాబు:
అందరి యెడల మర్యాదలతోను, ప్రేమతోను మెలగాలి.

4. ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం ‘కుమారీ శతకం’ లోనిది.

7. ఈ కింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తి వాక్యములు సంధానిస్తూ,
స్వర్ణ వాద్యములు సంరావిస్తూ,
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్.
ప్రశ్నలు:
1. భావివేదములు, జీవనాదములు దేనినుండి పుడతాయి?
జవాబు:
బాధచే పీడింపబడిన జీవితం.

2. భక్తి, ముక్తి, రక్తి వంటి పదాలు వాక్యం చివర ఉంటే దానిని ‘అంత్యప్రాస’ అంటారు. అటువంటి మూడు పదాలు పై గేయంలో ఉన్నాయి వెతికి రాయండి.
జవాబు:
నిర్దేశిస్తూ, సంధానిస్తూ, సంరావిస్తూ.

3. ఏ సౌందర్యం గొప్పదని కవి ఉద్దేశం?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యం

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
పై మాటలు ఎవరివి ?

8. ఈ కింది గేయం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు కర్మ వీరులకు
నిత్య మంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధా నిస్తూ
స్వర్ణ వాద్యములు సంరాలిస్తూ
వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం
ప్రశ్నలు
1. కవి ఎవరికి మంగళం నిర్దేశించారు?
జవాబు:
కష్టజీవులకు, కర్మవీరులకు

2. దేనికి సమానమైనది లేదని చెప్పినారు?
జవాబు:
శ్రమైక జీవన సౌందర్యానికి

3. ఈ గేయం రచయిత ఎవరు?
జవాబు:
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ.శ్రీ)

4. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
‘సంరావిస్తూ’ అనగానేమి?

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

9. కింది అపరిచిత గేయం చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. (S.A.III-2016-17)
అడవిలేక అవని లేదు – చెట్టులేక చెలిమి లేదు
మొక్క మానై ఎదగకుంటే – జీవకోటికి బతుకు లేదు
చెట్టు చేమను రక్షించుకుంటూ – బతుకుదీపం కాపాడుకుంటూ
తోడుగుందామా అడవికి ఊపిరౌదామా – తోడుగుందామా అడవికి ఊతమౌదామా
ప్రశ్నలు
1. అవని అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భూమి

2. జీవకోటి బతకాలంటే ఏమేమి కావాలి?
జవాబు:
చెట్లు, ఆహారం

3. చెట్లను రక్షించడం వల్ల ప్రయోజనాలు ఏవి?
జవాబు:
గాలి, ఆహారం దొరుకుతాయి.

4. పై గేయం ఆధారంగా ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మాను’ అంటే ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. (S.A. I – 2019-2017)
జవాబు:
‘ప్రతిజ్ఞ’ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ. ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. వీరు 1910వ సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. తన పద్దెనిమిదవ సంవత్సరంలోనే ‘ప్రభవ’ కావ్యాన్ని రచించాడు. వీరి రచనల్లో ‘మహాప్రస్థానం’ మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వీరు ఎన్నో నాటకాలు, రేడియో నాటికలు, నవలలు రచించారు. వీరి ఆత్మకథ పేరు ‘అనంతం’. కార్మికకర్షక లోకానికి ప్రతీకగా ఈ మహాకవి నిలిచారు. అభ్యుదయ కవిత్వానికి నాంది పలికారు.

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి అభ్యుదయ దృక్పథాన్ని వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ గారికి సమున్నతమైన స్థానం ఉంది. కార్మికకర్షక జీవితాలను, వారి బాధలను కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు. అభ్యుదయ కవిత్వానికి వారధిగా నిలిచారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని నినదించారు. అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. పదునైన వాగ్భాణాలను సమాజంపై సంధించారు. ప్రజాకవిగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. భావి కవులకు మార్గదర్శకంగా నిలిచారు.

ఆ) కింది ప్రశ్నకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
ఈ కవిత మీకు ఎందుకు నచ్చిందో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
ఈ కవితలో శ్రీశ్రీగారు కార్మికులను, కర్షకులను నాయకులుగా చూపుతూ రాయటం నాకు చాలా నచ్చింది. బాగా ఆలోచించి చూస్తే కర్షకులు, కార్మికులూ ప్రపంచ సౌభాగ్యం కోసం, ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా చెమటను చిందిస్తున్నారో, ఎంతగా త్యాగం చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది.

రైతులు పంటలు పండించకపోతే, మనకు తిండి దొరికేది కాదు అని అనుకున్నప్పుడు, రైతులు గొప్ప త్యాగమూర్తులనీ, నిజంగానే వారి చెమటకు విలువ కట్టలేమని అనిపిస్తుంది.

అలాగే కార్మికులు తాము కష్టించి మనకు కావలసిన వస్తువులను తయారుచేసి ఇస్తున్నారు. వారి కళ్ళల్లోని అగ్నికీ, కన్నీటికీ విలువ కట్టలేమని శ్రీశ్రీ చెప్పిన మాట, ఎంతో సత్యమనిపించింది. అందుకే ఈ కవిత నచ్చింది. తాను రాసిన కవితను శ్రీశ్రీ కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి అంకితమివ్వడం నాకు నచ్చింది.

ఈ కవితలోని అంత్యప్రాసలూ, అనుప్రాసలూ గేయరచనకు ఎంతో అందాన్ని ఇస్తున్నాయి.

గేయంలోని కవి ఆవేశం, ఆయనకు కర్షక కార్మికులపై గల అనురాగం ఎంతో నచ్చింది. తన నవ్య కవిత్వానికి వృత్తి పనివారల చిహ్నాలే భావం, భాగ్యం, ప్రణవం అని చెప్పిన మాట, కవిగారి కార్మిక ప్రేమకు నిదర్శనం. ఈ గేయంలోని మాత్రాఛందస్సు, ఎంతో అందంగా చెవులకు ఇంపుగా, పాడుకోవడానికి వీలుగా ఉంది.

ఇ) కింది సృజనాత్మకత ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
నీకు నచ్చిన కవిని గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుడివాడ,
x x x x x

ప్రియమిత్రుడు రామారావు,
నీ మిత్రుడు రాయునది. నేను బాగా చదువుతున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మన తెలుగు సాహిత్యంలో ఎందరో మహాకవులు ఉన్నారు. వారిలో శ్రీశ్రీ గారు. ప్రముఖులు. ఈయన ప్రజాకవి గాను, అభ్యుదయ కవిత్వానికి పితామహుడిగా గుర్తింపు పొందారు. కార్మిక కర్షక లోకానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ప్రజల సమస్యలను తన సమస్యలనుగా? తీసుకొని రచనలు చేశారు. వీరు రచించిన మహాప్రస్థానం విశేషఖ్యాతిని పొందింది. వీరి శైలి మధురంగా ఉంటుంది అందుకే నాకు శ్రీ శ్రీ గారంటే చాలా ఇష్టం. నీకు నచ్చిన కవిని గూర్చి నాకు తెలియజేయి. పెద్దలందరికీ నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
x x x x x x x x

చిరునామా :
పి. రామారావు,
8వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల,
నందిగామ,
కృష్ణాజిల్ల.

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

ప్రశ్న 2.
శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
“ఏ దేశ చరిత్ర చూచినా – ఏమున్నది గర్వకారణం !
నరజాతి చరిత్ర సమస్తం – పరపీడన పరాయణత్వం”

అని కొత్తగా గళమెత్తి సంచలనం రేకెత్తించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అనే రెండక్షరాలు తెలుగు కవిత్వంలో విప్లవం సృష్టించాయి. కలం పేరు శ్రీశ్రీ కాగా, అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. “అనితరసాధ్యం నా మార్గం” అని చాటిన ప్రకవి శ్రీశ్రీ భావకవిత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి అభ్యుదయ ఉద్యమానికి నాంది పలికాడు. ఆ తర్వాత విప్లవ కవిత్వోద్యమానికి స్ఫూర్తినిచ్చాడు.

కాని శ్రీశ్రీ ప్రపంచాన్ని పరిశీలించిన కొద్దీ, పుస్తక పఠనం ఎక్కువైన కొద్దీ కొత్త దారులు తొక్కాలని ఉవ్విళ్ళూరాడు. తానే ప్రపంచాగ్నిగా మారాడు.

తాను కొత్త శైలిని ఎన్నుకొన్నాడు. “ఈ యుగం నాది” అని ఎలుగెత్తి చాటాడు. “సామాజిక దృక్పథాన్ని జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడాయనే. శ్రీశ్రీ “మహాప్రస్థానం” అనే గొప్పకావ్యం రాశాడు. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని అర్థం. కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ ఎర్రబావుటా ఎగరేస్తూ మరో ప్రపంచానికి పదండి అని మేల్కొలుపు పాడుతూ ఇలా పాడాడు.

సామాజంలోని ఎక్కువ తక్కువల్నీ, బలవంతుల – ధనవంతుల అన్యాయాల్ని ఎదిరించిన శ్రీశ్రీ కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు.

“దేశ చరిత్రలు” అనే ఖండిక చారిత్రక వాస్తవికత స్పష్టీకరిస్తుంది. “తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీ లెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?” అని మొట్టమొదటిగా శ్రామికశక్తిని గుర్తించి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రకటించినవాడు శ్రీశ్రీ.

“కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
మునుముందుకు సాగించేదీ” కవిత్వమని శ్రీశ్రీ కొత్త నిర్వచనం ఇచ్చాడు.

ఆయన సమకాలీన సమాజాన్ని హేళన చేస్తూ సిరిసిరిమువ్వా అనే శతకం రాశాడు. కథలూ, నాటికలూ, వ్యాసాలూ, పీఠికలూ… ఏది రాసినా శ్రీశ్రీ ముద్ర గాఢంగా కనిపిస్తూనే ఉంటుంది.

సమాజాన్ని చైతన్యపరిచి, అభ్యుదయ కవిత్వానికి యుగకర్తగా ఉండి, కొత్త తరానికి బాటలు వేసి, తెలుగు కవిత్వంలో – సంతకంగా నిలిచిన శ్రీశ్రీ ప్రజాకవి, సమాజకవి.

8th Class Telugu 5th Lesson ప్రతిజ్ఞ 1 Mark Bits

1. వికారినామ వర్మంలో ఆషాఢంలో మొదటి వరం కురిసింది. (నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) వాన, జడి
బి) సంవత్సరం, వాన
సి) వయస్సు, మొదట
డి) మార్గం, దారి
జవాబు:
బి) సంవత్సరం, వాన

2. “చేసినంత” (పదాన్ని విడదీయండి) (S.A. I – 2019-20)
ఎ) చేసిన + యంత
బి) చేసి + అన్నంత
సి) చేసిన + అంత
డి) చేసినన్ + యంత
జవాబు:
సి) చేసిన + అంత

3. కోటిరత్నాలు (సమాసం పేరు గుర్తించండి) (S.A. I – 2019-20)
ఎ) ద్వంద్వ
బి) బహువ్రీహి
సి) అవ్యయీభావ
డి) ద్విగు
జవాబు:
డి) ద్విగు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

4. నా కరములో ఉన్న అరటి పండును కరి కరముకు అందించాను. నానార్థాలు గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చేయి, హస్తము
బి) హస్తము, కేలు
సి) చేయి, ఏనుగు
డి) చేయి, తొండము
జవాబు:
డి) చేయి, తొండము

5. ప్రాణమున్నంత వరకూ నిజాయితీగా బతకాలి (వికృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) పానము
బి) ప్రానము
సి) పాణము
డి) పాణం
జవాబు:
ఎ) పానము

6. రాజు కొలువుసేసి ప్రజలతో పలికెను (పదాన్ని విడదీయండి) (S.A. I – 2018-19)
ఎ) కొలువు + జేసి
బి) కొలువు + చేసి
సి) కొలువున్ + జేసి
డి) కొలువుం + చేసెన్
జవాబు:
బి) కొలువు + చేసి

7. కింది వానిలో తృతీయా తత్పురుష సమాసపదాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
ఎ) కాలుసేతులు
బి) నాలుగుదిక్కులు
సి) బుద్ధిహీనుడు
డి) షడ్రుచులు
జవాబు:
సి) బుద్ధిహీనుడు

8. శ్రామిక శక్తితో ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. (వికృతి పదం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) శత్రు
బి) సత్తు
సి) సుత్తి
డి) సత్తి
జవాబు:
డి) సత్తి

9. రావణుడు తన గుణముల చేత హీనుడయ్యాడు. (విభక్తిని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ప్రథమ
బి) తృతీయా
సి) పంచమీ
డి) సప్తమీ
జవాబు:
డి) సప్తమీ

10. రామరాజ్యంలో నెలకు ఆనాడు వానలు ప్రతి సంవత్సరం కురిసేవి. గీత గీసిన పదానికి నానార్థ పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) ఘర్షణ
బి) కర్షకుడు
సి) హర్షం
డి) వర్షం
జవాబు:
డి) వర్షం

11. ఎప్పటికైనా దమ్మమే జయిస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) శౌర్యం
బి) యుద్ధం
సి) అధర్మం
డి) ధర్మం
జవాబు:
డి) ధర్మం

12. “ఋగ్యజుస్సామ అధర్వణాలు నాలుగువేదాలు” గీత గీసిన పదం ఏ సమాసం? (S.A. III – 2015-16)
ఎ) ద్విగు సమాసం
బి) బహువ్రీహి సమాసం
సి) తత్పురుష సమాసం
డి) కర్మధారయ సమాసం
జవాబు:
ఎ) ద్విగు సమాసం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

13. “ఆ ఊళ్లో దొంగభయం ఎక్కువ” గీత గీసిన పదానికి సరైన విగ్రహవాక్యాన్ని గుర్తించండి. (S.A. III – 2015-16)
ఎ) దొంగ యందు భయం
బి) దొంగ వలన భయం
సి) దొంగ యొక్క భయం
డి) దొంగ కొరకు భయం
జవాబు:
బి) దొంగ వలన భయం

14. క్రింది వాక్యాలలో గీతగీసిన పదానికి సమానార్థకం కాని పదాన్ని గుర్తించండి. సీత హేమాభరణాలు ధరించింది. (S.A. III – 2015-16)
ఎ) అంగారం
బి) బంగారం
సి) స్వర్ణం
డి) పుత్తడి
జవాబు:
ఎ) అంగారం

భాషాంశాలు – పదజాలం

15. ఘర్మజలం విలువ తెలియాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (S.A. II – 2017-18)
ఎ) విషాదాశ్రువులు
బి) చెమటనీరు
సి) కన్నీరు
డి) ఆనందబాష్పాలు
జవాబు:
బి) చెమటనీరు

16. ధరిత్రిపై శాంతి నిలవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) జలధి
బి) వారిధి
సి) భూమి
డి) వనజం
జవాబు:
సి) భూమి

17. హేమంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) రజితం
బి) కాంశ్యం
సి) అయస్సు
డి) బంగారం
జవాబు:
డి) బంగారం

18. జలం జీవనాధారం – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పీయూషం
బి) నీరు
సి) క్షీరం
డి) సుధ
జవాబు:
బి) నీరు

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

19. కర్షకులు పంటలు పండిస్తారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) పురోహితులు
బి) రైతులు
సి) ఆత్మజులు
డి) అనంతులు
జవాబు:
బి) రైతులు

పర్యాయపదాలు :

20. బంగారంతో ఆభరణాలు చేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) హేమం, హిమం
బి) పుత్తడి, హేమం
సి) కాంచనం, రజితం
డి) అభ్రకం, అయస్సు
జవాబు:
బి) పుత్తడి, హేమం

21. హలంతో పొలం దున్నాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) నాగలి, నీరు
బి) నాగము, నభము
సి) నరము, నారి
డి) వయము, వయసు
జవాబు:
ఎ) నాగలి, నీరు

22. ధ్వని వచ్చింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) రవం, రాగి
బి) శబ్దం, రవం
సి) రసం, రంజని
డి) రతనం, వదనం
జవాబు:
బి) శబ్దం, రవం

23. అగ్ని ప్రకాశించింది – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) చిచ్చు, నిప్పు
బి) నిబం, నింబం
సి) అగ్గి, అశనం
డి) అద్రి, సభం
జవాబు:
ఎ) చిచ్చు, నిప్పు

24. ఇలపై కొంతి వికసించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ధరణి, వాకిలి
బి) పయస్సు, ధారుణి
సి) జగం, జలధి
డి) భూమి, వసుధ
జవాబు:
డి) భూమి, వసుధ

ప్రకృతి – వికృతులు :

25. మనం ప్రతిజ్ఞ చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ప్రయాస
బి) ప్రకాస
సి) పదెన
డి) ప్రతిన
జవాబు:
డి) ప్రతిన

26. ధరం ఆచరించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దరమం
బి) దమ్మం
సి) దశమం
డి) దరన
జవాబు:
బి) దమ్మం

27. న్యాయం పాటించాలి – గీత గీసిన పదానికి దీనికి వికృతి పదం ఏది?
ఎ) నైయం
బి) నాయం
సి) నేయం
డి) నోయం
జవాబు:
బి) నాయం

28. ప్రాణం తిపి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) పారం
బి) పానం
సి) పాయం
డి) సాయం
జవాబు:
బి) పానం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

29. శ్రీ వెల్లి విరియాలి – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) శీరి
బి) సిరి
సి) శ్రీరి
డి) చిరి
జవాబు:
బి) సిరి

30. అగ్గి చల్లారింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) అగ్లో
బి) అగ్ని
సి) అగ్గి
డి) అగా
జవాబు:
బి) అగ్ని

31. బాగెము పండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) భాగ్యము
బి) భాసము
సి) సంపద
డి) భోగ్యము
జవాబు:
ఎ) భాగ్యము

32. కరంతో పని చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) చేయి, తొండం, కిరణం
బి) హస్తం, పాదం, నఖము
సి) నది, ఝరి, సాగరం
డి) కరం, చదరం, చందనం
జవాబు:
ఎ) చేయి, తొండం, కిరణం

33. భూత కాలంలో తిరిగిరావు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) జరిగిపోయినది, ప్రాణి
బి) భూమి, జలధి
సి) ధర్మం, వసుధ
డి) నీరు, ఉదధి
జవాబు:
ఎ) జరిగిపోయినది, ప్రాణి

34. ఆయన కాలం చెందాడు – గీత గీసిన పనికి నానార్థాలు గుర్తించండి.
ఎ) భరతం, భాగ్యం
బి) సమయం, మరణం
సి) సమయం, కన్ను
డి) భాగ్యం, బానిస
జవాబు:
బి) సమయం, మరణం

35. బలం చూపాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) లావు, సామర్థ్యం
బి) మరణం, జననం
సి) చక్రం, వాన
డి) అదృష్టం, పర్జన్యం
జవాబు:
ఎ) లావు, సామర్థ్యం

36. కన్ను రక్షణీయం – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
ఎ) బలం, సామర్థ్యం
బి) నయనం, బండిచక్రం
సి) నేత్రం, కాలం
డి) వాన, నీరు
జవాబు:
బి) నయనం, బండిచక్రం

37. భాగ్యం పండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
ఎ) వర్షం, నీరు
బి) అదృష్టం, సంపద
సి) అవకాశం, అనంతం
డి) అకాలం, అనాగరికం
జవాబు:
బి) అదృష్టం, సంపద

వ్యుత్పత్తర్థాలు :

38. దుఃఖం వల్ల కన్నుల నుండి కారే నీరు – అనే వ్యుత్పత్తి గల పదం ఏది?
ఎ) అశ్రువులు
బి) ఆశ్రమం
సి) అరణి
డి) వసుధ
జవాబు:
ఎ) అశ్రువులు

39. ధర్మము – దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి.
ఎ) ధరకు లొంగేది
బి) ధరించబడేది
సి) ధరచేత కూడినది.
డి) ధరణమును పొందునది
జవాబు:
బి) ధరించబడేది

వ్యాకరణాంశాలు

సంధులు :

40. కూరగాయలు తెచ్చారు – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) కూరె + కాయ
బి) కూర + కాయ
సి) కూర + గాయ
డి) కూర + ఆయ
జవాబు:
బి) కూర + కాయ

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

41. పాలుదాగి – ఇందులోని సంధిని గుర్తించండి.
ఎ) గుణసంధి
బి) గసడదవాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) పూర్వరూప సంధి
జవాబు:
బి) గసడదవాదేశ సంధి

42. పరుషములు అనగా –
ఎ) క చ ట త ప
బి) గ జ డ దలు
సి) న జ బ జ న
డి ) ప ద ని స
జవాబు:
ఎ) క చ ట త ప

43. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) గుళోన్నతి
బి) విలాపాగ్నులు
సి) ఏకైక
డి) తల్లిదండ్రులు
జవాబు:
సి) ఏకైక

44. శ్రమైక జీవనం – గీత గీసిన పదాన్ని విడదీసి గుర్తించండి.
ఎ) శ్రమ + ఔక
బి) శ్రమ + ఏక
సి) శ్రమ + ఐక
డి) శ్రమ + ఓక
జవాబు:
బి) శ్రమ + ఏక

సమాసాలు :

45. రాజపూజితుడు పండితుడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) రాజుకు పూజితుడు
బి) రాజునందు పూజితుడు
సి) రాజువలన పూజితుడు
డి) రాజుచేత పూజితుడు
జవాబు:
డి) రాజుచేత పూజితుడు

46. పేదలకు అన్యాయం జరుగకూడదు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) న్యాయం కావాలి
బి) న్యాయం కానిది
సి) న్యాయమందు కూడినది
డి) న్యాయం కొరకు కానిది
జవాబు:
బి) న్యాయం కానిది

47. శివుడు జటాధారి – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) పంచమీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) చతుర్డీ తత్పురుష
డి) ద్వితీయా తత్పురుష
జవాబు:
డి) ద్వితీయా తత్పురుష

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

48. రాజభటుడు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) ప్రథమా తత్పురుష
బి) చతుర్డీ తత్పురుష
సి) షష్ఠీ తత్పురుష
డి) తృతీయా తత్పురుష
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష

49. చతుర్దీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) తిండిగింజలు
బి) పాపభీతి
సి) విద్యాహీనుడు
డి) శాస్త్ర నిపుణుడు
జవాబు:
ఎ) తిండిగింజలు

50. అగ్నిభయం ఎక్కువ – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) అగ్ని కొరకు భయం
బి) అగ్ని వలన భయం
సి) అగ్నిచేత భయం
డి) అగ్నియందు భయం
జవాబు:
బి) అగ్ని వలన భయం

51. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం గుర్తించండి.
ఎ) ద్వంద్వం
బి) షష్ఠీ తత్పురుష
సి) అవ్యయీభావ
డి) తత్పురుష
జవాబు:
డి) తత్పురుష

52. పంచమీ విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డు, ము, వు, లు
బి) వలన, కంటె, పట్టు
సి) కొరకు, కై
డి) అందు, న
జవాబు:
బి) వలన, కంటె, పట్టు

ణవిభజన :

53. మాత్రా ఛందస్సు గల సాహితీ ప్రక్రియ ఏది?
ఎ) దండకం
బి) గద్యం
సి) గేయం
డి) పద్యం
జవాబు:
సి) గేయం

54. UIU- ఇది ఏ గణం?
ఎ) త గణం
బి) ర గణం
సి) న గణం
డి) మ గణం
జవాబు:
సి) న గణం

వాక్యాలు :

55. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) కర్మణి వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

56. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
బి) సంక్లిష్ట వాక్యం

57. రమ అందమైనది. రమ తెలివైనది – ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి.
ఎ) రమ తెలివైనది కావడంతో అందమైనది.
బి) రమ అందమైనది, తెలివైనది.
సి) రమ తెలివైనది, అందమైనది.
డి) రమ అందమైనది కావడంతో తెలివైనది.
జవాబు:
బి) రమ అందమైనది, తెలివైనది.

58. అందరు బడికి వెళ్ళాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) కొందరు బడికి వెళ్ళలేకపోవచ్చు.
బి) అందరు బడికి వెళ్ళకూడదు.
సి) అందరు బడికి వెళ్ళియుండవచ్చు.
డి) అందరు బడికి వెళ్ళి తీరాలి.
జవాబు:
బి) అందరు బడికి వెళ్ళకూడదు.

59. దొంగతనం చేయవద్దు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) నిషేధార్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
సి) నిషేధార్థక వాక్యం

60. భవిష్యత్కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) అప్యర్థకం
బి) క్యార్థకం
సి) శత్రర్థకం
డి) చేదర్థకం
జవాబు:
డి) చేదర్థకం

61. దయతో అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) శత్రర్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) ప్రార్థనార్థక వాక్యం
డి) హేత్వర్థక వాక్యం
జవాబు:
సి) ప్రార్థనార్థక వాక్యం

62. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) శత్రర్థక వాక్యం
సి) కర్మణి వాక్యం
డి) చేదర్థక వాక్యం
జవాబు:
డి) చేదర్థక వాక్యం

అలంకారాలు :

63. పొలాలు దున్నీ – హలాలు దున్ని – ఇందులోని అలంకారం గుర్తించండి.
ఎ) ఉపమ
బి) వృత్త్యనుప్రాస
సి) యమకం
డి) లాటానుప్రాస
జవాబు:
బి) వృత్త్యనుప్రాస

AP Board 8th Class Telugu Important Questions Chapter 5 ప్రతిజ్ఞ

64. కింది అలంకారాలలో పొసగని అలంకారం గుర్తించండి.
ఎ) ముక్తప్రదగ్రస్తం
బి) రూపక
సి) అంత్యానుప్రాస
డి) యమకం
జవాబు:
బి) రూపక

సొంతవాక్యాలు :

65. కార్మిక లోకం : సమస్త కార్మిక లోకం దేశ సౌభాగ్యం కోసం కృషి చేస్తుంది.

66. నవ్యకవిత్వం : శ్రీ శ్రీ గారు నవ్య కవిత్వం రాయడానికి సిద్ధపడినారు.

67. దాస్యం : బ్రిటిషు ప్రభుత్వంలో మనం దాస్యం అనుభవించాము.

68. కర్షక వీరులు : సమాజంలో కర్షకవీరులు నిరంతరం శ్రమిస్తారు.

69. విరామం : నిరంతరం పనిచేసేవారికి విరామం పొందాలి.

70. ఖరీదు : వస్తువుల ఖరీదు అధికంగా ఉన్నది.

71. ప్రపంచ భాగ్యం : ప్రపంచ భాగ్యం వెల్లి విరియడానికి మనం కృషి చేయాలి.

72. స్వర్ణవాయిద్యములు : తిరుమలలో స్వామివారికి స్వర్ణ వాయిద్యములు మ్రోగిస్తారు.

73. చిహ్నం : ఎన్నికల్లో అభ్యర్థులకు చిహ్నం ఇస్తారు.

74. ప్రణవం : వేదాల్లో ప్రణవం అతి ప్రధానమైనది.