AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 6 ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions 6th Lesson ప్రకృతి ఒడిలో
8th Class Telugu 6th Lesson ప్రకృతి ఒడిలో Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
- చిత్రంలో ఒక చెట్టు ఉంది. చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు.
- ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదలి పెడుతున్నారు.
- ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు.
- పక్షులు గూళ్ళకు ఎగిరి వస్తున్నాయి.
- మూడు గుడిసెలు ఉన్నాయి.
- కాలువపై వంతెన ఉంది.
- ఆవులు, కుక్క పరుగు పెడుతున్నాయి.
ప్రశ్న 2.
ఏం జరుగుతూంది?
జవాబు:
చిత్రంలో వర్షం పడుతూ ఉంది.
ప్రశ్న 3.
చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతుండవచ్చు? ఊహించి చెప్పండి.
జవాబు:
- చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ, ఎదుటివారి పడవ కంటె తమ పడవ ముందుకు వేగంగా వెడుతూందని మాట్లాడుతూ ఉండవచ్చు.
- వర్షం వస్తుంది. ఇంటికి వేగంగా వెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు.
- చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి? మాట్లాడండి.
జవాబు:
- మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి.
- చీకట్లో గాలిలోకి విసరిన వస్తువులలో, అది పురుగో, బంతో, కర్రో సులువుగా గ్రహించేశక్తి గబ్బిలాలకు ఉంది.
- ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులూ, పురుగులు వంటి వాటిని, గబ్బిలాలు గుర్తించగలవు.
- తిమింగలాలకు, గబ్బిలాలకన్నా ఎక్కువగా ఇకోలొకేషన్ శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నాయి.
- పాములూ, ఎలుకలూ మన కంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు.
- ఏనుగులు సునామీని 250 కి||మీ దూరంలో ఉండగానే గుర్తిస్తాయి.
ప్రశ్న 2.
శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? దీనివల్ల గతంతో పోలిస్తే, నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి?
జవాబు:
శాస్త్రజ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది. ముఖ్యంగా సమాచార రంగంలో, అణుశక్తి రంగంలో, విద్యుచ్ఛక్తి సాధనాల తయారీలో, కంప్యూటర్ రంగంలో, ఇంటర్నెట్ రంగంలో, ప్రయాణ సాధనాల్లో, ఎన్నో మార్పులు వచ్చాయి. వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల కేన్సర్, గుండెపోటు, మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి. శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. రోదసీ విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము. విమానాలు, రైళ్ళు, బస్సులు, మోటారు సైకిళ్ళు వచ్చాయి.
ప్రశ్న 3.
నిత్యజీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి.
జవాబు:
నేను గమనించిన ప్రకృతి వింతలు ఇవి.
- నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది.
- నీరు పల్లానికే ఎప్పుడూ ప్రవహిస్తుంది.
- ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది.
- చలికి నీరు గడ్డకడుతుంది.
- చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
- గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది. ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు.
II. చదవడం, అవగాహన చేసుకోవడం
ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి. వాటికి పేరు పెట్టండి.
అ) ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది.
జవాబు:
పాఠంలో మొదటి పేరా ఈ భావాన్ని ఇస్తుంది. “కాటారం బడిలో ………….. ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో” ……… ఈ పేరాకు “ప్రకృతి అందాలు” అని పేరు పెట్టవచ్చు.
ఆ) మనం ఎన్నో విషయాలను తెలుసుకోడానికీ, పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి.
జవాబు:
పాఠంలో 2వ పేరా పై భావాన్ని ఇస్తుంది. “ప్రకృతి రహస్యాలను …………. నీటిని మళ్ళించవచ్చు. ……… అనే పేరా, జ్ఞానేంద్రియాల గురించి చెపుతోంది. ఈ పేరాకు “ప్రకృతి ధర్మాలు – మానవుని గుర్తింపు” అని పేరు పెట్టవచ్చు.
ఇ) మానవుడు తనకున్న బలాలను, బలహీనతలను తెలుసుకున్నాడు. కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక, ఎన్నో విషయాలను కనుక్కున్నాడు.
జవాబు:
పాఠంలో 66వ పేజీలోని 12వ పంక్తి నుండి 18వ పంక్తి వరకు ఉన్న పేరా పై భావాన్ని ఇస్తుంది. “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు” – అనే పేరా పై భావాన్ని తెలుపుతుంది. ఈ పేరాకు “శాస్త్రజ్ఞులు – నూతన ఆవిష్కరణలు” – అని పేరు పెట్టవచ్చు.
ప్రశ్న 2.
జట్లు జట్లుగా కూర్చొని పాఠంలోని పేరాలను చదవండి. ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారుచేయండి. అంటే అదే ప్రశ్నకు, పేరాలోని విషయం జవాబుగా రావాలి.
జవాబు:
1వ పేరా : “కాటారం బడిలో ………….. ఇలాంటివి కొన్ని చూద్దామా ?”
ప్రశ్న : ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి.
2వ పేరా : “ప్రకృతి రహస్యాలను ……….. మళ్ళించవచ్చు”.
ప్రశ్న : ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు?
3వ పేరా : “ఆధునిక శాస్త్రవేత్త ………… తరంగాలు అంటారు”.
ప్రశ్న : శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గూర్చి తెలపండి.
4వ పేరా : కొన్ని పరిస్థితులలో ………. జిల్లు మంటుంది.
ప్రశ్న : శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
5వ పేరా : “ఇంద్రియ జ్ఞానం మీదనే …………. రాడార్ వగైరాలు”
ప్రశ్న : శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి.
6వ పేరా : శాస్త్రజ్ఞానం …………. సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది.
ప్రశ్న : శాస్త్రజ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది?
7వ పేరా : “దృష్టి, వినికిడి ………. గబ్బిలాల కన్నా ఎక్కువ”.
ప్రశ్న : “ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి” వివరించండి.
8వ పేరా : “ప్రకృతి వైపరీత్యాలను ……….. శాస్త్రజ్ఞులు నిరూపించారు”.
ప్రశ్న : ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఎట్టిది?
3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి ? వాటివల్ల మనం ఏం చేయగలుగుతున్నాం?
జవాబు:
ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి, మనిషికి ఉన్న మూలసాధనాలు జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు అంటాము.
- కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది.
- చెవి శ్రవణ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
- చర్మం స్పర్శ జ్ఞానాన్ని కల్గిస్తుంది.
- ముక్కు వాసనను తెలియజేస్తుంది.
- నాలుక రుచిని తెలుపుతుంది.
ఆ) ఇంద్రియజ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే, మనకు నేడు రేడియోలు వచ్చాయి. విద్యుచ్ఛక్తి వచ్చింది. ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్ రేలు, చీకట్లో చూడటానికి వీలైన సాధనాలూ, రాడార్ వంటి వాటిని కల్పించారు.
ఇ) చూపు, వినికిడి, వాసనలను తెలుసుకోవడం అన్నవాటి విషయంలో మనకు, జంతువులకు ఉండే తేడాలు ఏమిటి? దీని వలన మీరు ఏం గ్రహించారు?
జవాబు:
ఈ) ఈ పాఠంలోని మొదటి పేరాకు, మిగతా పేరాలకు మధ్య ఉన్న భేదమేమిటి?
జవాబు:
ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది. అది వర్ణనాత్మకంగా ఉంది. చిన్న సైజు అక్షరాలలో ఉంది. రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది. కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి. అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యా యి.
III. స్వీయరచన
1. ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంతమాటలలో జవాబులు రాయండి.
అ) “ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు” దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి.
జవాబు:
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు. మనము ఏ విషయాన్ని గురించి తెలిసికోవాలని ఉన్నా, ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది. మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం. చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం. చర్మానికి తగిలిన స్పర్శ వల్లే అది వేడో, చలో గుర్తించగలం. నాలుకతో రుచి చూస్తేనే, పదార్థం రుచి తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలు ,కోగలం.
ఆ) శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది?
జవాబు:
శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోడానికి, సాధనాలు తయారుచేశారు. వారు మైక్రోస్కోపులు, టెలిస్కోపులు, రాడార్లు , ఎక్స్ రేలు, ఫొటోగ్రఫీ, చీకట్లో చూడగల సాధనాలు తయారుచేశారు. గామా కిరణాలు, రేడియోతరంగాలు వంటి వాటిని తయారుచేశారు.
2. ఈ కింది ప్రశ్నలకు పదివాక్యాలలో సొంతమాటలలో జవాబులు రాయండి.
అ) సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి రెండూ ఒకటేనా? కాదా? ఎందుకు?
జవాబు:
సాధారణ దృష్టి, శాస్త్ర దృష్టి ఒకటి కాదు. సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకూ వెనుక ఉన్న కారణాన్ని గూర్చి ఆలోచించడు. సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ? ఆటలమ్మ ఎందుకు వచ్చింది ? అని శాస్త్ర దృష్టి కలవాడు ఆలోచిస్తాడు. వేంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే, శాస్త్ర దృష్టి కలవాడు అంగీకరించడు. శాస్త్ర దృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు. శాస్త్ర దృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి, సత్యాన్నే నమ్ముతాడు.
ఆ) ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
ప్రకృతి అందాలు :
భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు. అందమైన సూర్యోదయం, ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం, కోయిలల కూతలు, ఆకాశంలో పక్షుల బారులు, కొండలు, కోనలు, పచ్చని వనాలు, పూలతోటలు, ఆవులు, గేదెలు, అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి.
వర్షం వచ్చే ముందు ఇంద్రధనుస్సు ఆకాశంలో కనబడుతుంది. వసంతం వస్తే చెట్లు అన్నీ చిగిర్చి పూలు పూస్తాయి. గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి. కోకిలలు కుహూకుహూ అంటూ కూస్తాయి. చిలుకలు మాట్లాడుతాయి. సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ అరబోసినట్లు ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి.
IV. పదజాలం – వినియోగం
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
అ) శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపిస్తుంది. (త్రోవ)
ఆ) కొండలను పగలగొట్టినప్పుడు భూప్రకంపనలు వస్తాయి. (ఎక్కువ కదలికలు)
ఇ) ఎండమావులను చూసి నీరు అని భ్రమపడతాము. (భ్రాంతి)
2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను ఎంపిక చేసుకొని వాటితో వాక్యాలు రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.
i) కొందరికి పొగడ్తలు ఇష్టం ఉండవు.
ii) ప్రశంసలకు లొంగకపోవడం గొప్పవారి లక్షణం.
అ) బొమ్మలలో రకరకాల ఆకృతులు ఉంటాయి.
జవాబు:
i) నగరంలో పలురకాల ఆకారాల ఇండ్లు ఉంటాయి.
ii) మానవుల్లో రకరకాల రూపాలు గలవాళ్ళు ఉంటారు.
ఆ) బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది.
జవాబు:
i) విద్యార్థులు ఎల్లప్పుడు నిజం పలకాలి.
ii) మహాత్ములు సదా యథార్థం పలికి తీరుతారు.
ఇ) మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ.
జవాబు:
i) జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం.
ii) మనం ఎల్లప్పుడు చక్షువును రక్షించుకోవాలి.
ఈ) మానవుని కంటే జంతువులు తొందరగా వాసనలను పసిగడతాయి.
జవాబు:
i) పశువులు మానవులకు ఉపకారం చేస్తాయి.
ii) మృగాలు అరణ్యంలో సంచరిస్తాయి.
ఉ) చైనాలో ఒకసారి కలుగులలోంచి ఎన్నో పాములు బయటకు వచ్చాయి.
జవాబు:
i) ఇంటిలోని రంధ్రం నుంచి సర్పము వచ్చింది.
ii) పొలంలోని బిలంలో ఫణి చేరింది.
3. కింద గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.
అ) పుష్పాలు సున్నితమైనవి.
ఆ) మన దమ్మం మనం పాటించాలి.
ఇ) శాస్త్రాన్ని అతిక్రమించగూడదు.
ఈ) కొందరికి చిత్తరువులు గీయడంలో నైపుణ్యం ఉంటుంది.
ఉ) ఎవరి ప్రాణం వారికి తీపి.
ప్రకృతి – వికృతి
పుష్పం – పూవు
శాస్త్రం – చట్టం
ప్రాణం – పానం
ధర్మం – దమ్మం
చిత్రము – చిత్తరువు
V. సృజనాత్మకత
ఈ కింది వాక్యాలు చదవండి.
1) “చప్పట్ల చప్పుడు విని, సీతాకోక చిలుకలు పైకి లేచాయి” – సాధారణ వాక్యం.
“ఆ చప్పట్ల ప్రకంపనలకు, ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోకచిలకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి” – పై వాక్యాన్నే వర్ణిస్తూ రాసిన వాక్యం ఇది. వాక్యంలోని కర్త, కర్మ, క్రియ పదాలలో దేన్ని గురించి అయినా గొప్పగా / అందంగా వివరించేలా సరైన పదాలను జోడిస్తూ రాస్తే మామూలు వాక్యాలు కూడా వర్ణనాత్మక వాక్యాలుగా మారుతాయి. మీరు కూడా మీకు నచ్చిన కథను / సన్నివేశాన్ని / సంఘటనను లేదా ఏదైనా ఒక అంశాన్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఆ గ్రామంలో అందం మాట వస్తే, అంతా వసంతసేన గురించే చెప్పుకొనేవారు. వసంతసేన ముఖం ముందు, చంద్రుడు వెలవెల పోయేవాడు. తోటలో పువ్వులు వసంతసేన ముఖాన్ని చూసి తెల్లపోయేవి. వసంతసేన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకొని గుడికి రాజహంసలా వెడుతూంటే, ఆ గ్రామంలో పెద్దలూ, చిన్నలూ ఆమె కేసే కళ్ళు తిప్పకుండా చూసేవారు. వసంతసేన అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే.
ఆ ఊరిలో హరిహరస్వామి ఆలయం ఉంది. వసంతసేనకు అమ్మమ్మ నృత్యగానాలలో మంచి శిక్షణను ఇప్పించింది. వసంతసేనకు వయస్సు రాగానే ఆమె అమ్మమ్మ రాగమాలిక దేవాలయంలో అరంగేట్రం చేయించింది. ఆ రోజు కోడెగారు పిల్లలంతా వసంత సేన కనుసన్నల కోసం పడిగాపులు కాశారు. ఆ సమయంలోనే దేవాలయానికి వచ్చిన ఆ దేశపు రాజు మదనసింహుడి దృష్టి వసంతసేన మీద పడింది. రాజు తన దృష్టిని వసంతసేన నుండి మరలించుకోలేకపోయాడు. వసంత సేన కూడా రాజును కన్ను ఆర్పకుండా చూసింది. ఆ తొలిచూపుల సమ్మేళన ముహూర్తం, వారి వివాహానికి నాంది పలికింది.
VI. ప్రశంస
1) భూమిమీద ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు ……….. ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీ మిత్రులతో చర్చించి దేంట్లో ఏ ఏ గొప్పదనాలున్నాయో రాయండి.
జవాబు:
1) చెట్లు గొప్పదనం :
మనకు పనికిరాని కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు) వాయువును గ్రహించి, మనకు ప్రాణవాయువును ఇస్తాయి.
2) పక్షులు గొప్పదనం :
పక్షులకు గొప్ప దిశా జ్ఞానం ఉంటుంది. అవి ఎక్కడకు ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ గూటికి అవి వస్తాయి.
3) జంతువులు :
కొన్ని జంతువులు ప్రకృతి వైపరీత్యాలను మానవుల కంటే ముందే గుర్తిస్తాయి. దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ముందున్నాయి.
4) మానవులు :
మానవులు బుద్ధిజీవులు, మానవులకు ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి ఉంటాయి. జంతువులకు వివేచనా శక్తి ఉండదు.
ప్రాజెక్టు పని
* ప్రకృతిని గురించిన చిత్రాలను సేకరించి ప్రదర్శించండి.
జవాబు:
VII. భాషను గురించి తెలుసుకుందాం !
1) కింది పదాలను విడదీయండి. సంధి పేరు రాయండి.
ఉదా :
అందమైన = అందము + ఐన – ఉత్వ సంధి
(అ) సూక్ష్మమైన – సూక్ష్మము + ఐన – ఉత్వ సంధి
(ఆ) పైకెత్తు = పైకి + ఎత్తు – ఇత్వ సంధి
(ఇ) అయిందంటే = అయింది + అంటే – ఇత్వ సంధి
2) క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఉదా :
మూడయిన రోజులు మూడు రోజులు
(అ) రెండయిన రోజులు – రెండు రోజులు
(ఆ) వజ్రమూ, వైఢూర్యమూ – వజ్రవైఢూర్యాలు
(ఇ) తల్లీ, బిడ్డా – తల్లీబిడ్డలు
3) కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా :
పార్వతికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు.
పార్వతికి అభినందనలు తెలుపుతూ అందరిచేతా చప్పట్లు కొట్టబడ్డాయి.
అ) కర్తరి : జ్ఞానేంద్రియాలు మనిషికి అనుభవాలను కలిగిస్తాయి.
కర్మణి : జ్ఞానేంద్రియాలచేత మనిషికి అనుభవాలను కలిగింపజేస్తాయి.
ఆ) కర్తరి : చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి.
కర్మణి : చలిచేత నెయ్యి, నూనె పేరుకొనబడతాయి.
ఇ) కర్తరి : శాస్త్రజ్ఞానము కొన్ని ప్రతిపాదనలను చేస్తుంది.
కర్మణి : శాస్త్రజ్ఞానముచేత కొన్ని ప్రతిపాదనలు చేయబడుతుంది.
4) కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) కర్మణి : శాస్త్రజ్ఞులచేత అనేక వేల సాధనాలు కల్పించబడినవి.
కర్తరి : శాస్త్రజ్ఞులు అనేక సాధనాలను కల్పించారు.
ఆ) కర్మణి : ఈ ప్రతిపాదన శాస్త్రముచేత పరమ సత్యంగా పరిగణింపబడదు.
కర్తరి : ఈ ప్రతిపాదనను శాస్త్రము పరమసత్యంగా పరిగణిస్తుంది.
ఇ) కర్మ : అది సిద్ధాంతముగా ఆమోదము పొందబడుతుంది.
కర్తరి : అది సిద్ధాంతంగా ఆమోదం పొందింది.
5) తత్పురుష సమాసం.
1. మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా! కింది వాటిలో గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.
అ) విద్యను అర్థించేవాళ్ళు = విద్యార్థులు – ద్వితీయా తత్పురుష సమాసం
ఆ) గుణాల చేత హీనుడు = గుణహీనుడు – తృతీయా తత్పురుష సమాసం
ఇ) సభ కొరకు భవనం = సభాభవనం – చతుర్థి తత్పురుష సమాసం
ఈ) దొంగ వల్ల భయం = దొంగభయము – పంచమీ తత్పురుష సమాసం
ఉ) రాముని యొక్క బాణం = రామబాణం – షష్ఠీ తత్పురుష సమాసం
ఊ) గురువులలో శ్రేష్ఠుడు = గురుశ్రేష్ఠుడు – షష్ఠీ తత్పురుష సమాసం
ఋ) దేశము నందు భక్తి = దేశభక్తి – సప్తమీ తత్పురుష సమాసం
(పై వాక్యాల్లో వేర్వేరు విభక్తులను గమనించారు కదా!)
పై విగ్రహవాక్యాలకు సమాస పదాలు రాయండి.
2. కింది సమాస పదాలను పరిశీలించి విగ్రహవాక్యాలు రాసి, సమాసాల పేర్లను రాయండి.
ఉదా :
విద్యార్థి – విద్యను అర్థించేవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1. ధనహీనుడు | ధనము చేత హీనుడు | ద్వితీయా తత్పురుష సమాసం |
2. పొట్టకూడు | పొట్ట కొరకు కూడు | చతుర్థి తత్పురుష సమాసం |
3. రాక్షసభయం | రాక్షసుల వలన భయం | పంచమీ తత్పురుష సమాసం |
4. నాపుస్తకం | నా యొక్క పుస్తకం | షష్ఠీ తత్పురుష సమాసం |
5. రాజశ్రేష్ఠుడు | రాజుల యందు శ్రేష్ఠుడు | సప్తమీ తత్పురుష సమాసం |
3. అతిశయోక్తి అలంకారం
కింది వాక్యాన్ని చదవండి.
ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై వాక్యంలో గమనిస్తున్నాం.
ఈ విధంగా గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడాన్ని ‘అతిశయోక్తి అలంకార’మంటారు.
అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని వాక్యాలు రాయండి.
1) మా ఊర్లో పంటలు బంగారంలా పండుతాయి.
2) మా తోటలోని మామిడిపండ్లు అమృతం వలె ఉంటాయి.
3) మా అన్నయ్య తాటిచెట్టంత పొడవున్నాడు.
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
ప్రశంస : పొగడ్త, అభినందన
కలుగు : రంధ్రం, బిలం
నిప్పు : అగ్ని, చిచ్చు
పార్వతి : గౌరి, ఉమ
ఆకాశం : నింగి, నభం
సముద్రం : జలధి, వారిధి
ఆమోదం : అంగీకారం, సమ్మతి
లోకం : విశ్వం, జగము
గాలి : వాయువు, మారుతం
తరంగము : భంగము, అల
నక్షత్రం : తార, చుక్క
వ్యుత్పత్యర్థాలు
అగ్ని : మండెడి స్వభావం కలది
జలధి : నీటిని ధరించునది
సాగరం : సగర కుమారుల చేత త్రవ్వబడినది
ఉదధి : నీటిని ధరించునది
నానార్థాలు
అంబరం = గగనం, వస్త్రం, శూన్యం
వర్షం = వాన, సంవత్సరం
కన్ను = నేత్రం, బండి చక్రం
శక్తి = సామర్థ్యం, పార్వతి
సంధులు
సవర్ణదీర్ఘ సంధి :
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
జ్ఞానాభివృద్ధి = జ్ఞాన + అభివృద్ధి – సవర్ణదీర్ఘ సంధి
ధనాశ = ధన + ఆశ – సవర్ణదీర్ఘ సంధి
నిజానందం = నిజ + ఆనందం – సవర్ణదీర్ఘ సంధి
గుణసంధి :
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునపుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
జ్ఞానేంద్రియం = జ్ఞాన + ఇంద్రియం – గుణసంధి
సర్వోన్నత = సర్వ + ఉన్నత – గుణసంధి
ఆమ్రేడిత సంధి :
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితంబు పరమగునపుడు సంధి తరచుగానగు.
అప్పుడప్పుడు = అప్పుడు + అప్పుడు = ఆమ్రేడిత సంధి
ఔరౌర = ఔర + ఔర = ఆమ్రేడిత సంధి
లులనల సంధి :
సూత్రం : లు, ల, న లు పరమగునపుడు మువర్ణమునకు లోపమును, తత్పూర్వ స్వరమునకు దీర్ఘమును, బహుళముగా వచ్చును.
తరంగాలు = తరంగము + లు – లులనల సంధి
సముద్రాలు = సముద్రము + లు – లులనల సంధి
భూకంపాలు = భూకంపము + లు – లులనల సంధి
రహస్యాలు = రహస్యము + లు – లులనల సంధి
ఉత్వసంధి :
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
ఊరెల్ల = ఊరు + ఎల్ల – ఉత్వసంధి
ముందున్నాయి = ముందు + ఉన్నాయి – ఉత్వసంధి
పరుగెత్తి = పరుగు + ఎత్తి – ఉత్వసంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
ప్రార్థనా సమావేశం | ప్రార్థన కొఱకు సమావేశం | చతుర్థీ తత్పురుష సమాసం |
భూకంపాలు | భూమి యొక్క కంపాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
ప్రకృతి రహస్యాలు | ప్రకృతి యొక్క రహస్యాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
ప్రకృతి ధర్మము | ప్రకృతి యొక్క ధర్మము | షష్ఠీ తత్పురుష సమాసం |
శాస్త్ర ప్రతిపాదనలు | శాస్త్రము నందు ప్రతిపాదనలు | సప్తమీ తత్పురుష మాసం |
కళాదృష్టి | కళయందు దృష్టి | సప్తమీ తత్పురుష సమాసం |
ఇంద్రియజ్ఞానము | ఇంద్రియముల యొక్క జ్ఞానము | షష్ఠీ తత్పురుష సమాసం |
కాంతి తరంగాలు | కాంతి యొక్క తరంగాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
అద్భుత ప్రాణులు | అద్భుతమైన ప్రాణులు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
వంద సంవత్సరాలు | వంద (100) సంఖ్యగల సంవత్సరాలు | ద్విగు సమాసం |
ఐదు కిలోమీటర్లు | ఐదు (5) సంఖ్యగల కిలోమీటర్లు | ద్విగు సమాసం |
మూడు గంటలు | మూడు (3) సంఖ్యగల గంటలు | ద్విగు సమాసం |
రచయిత పరిచయం
పాఠము పేరు : ‘ప్రకృతి ఒడిలో
రచయిత పేరు : కొడవటిగంటి కుటుంబరావుగారు
దేని నుండి గ్రహింపబడింది : రచయిత రాసిన “తాత్త్విక వ్యాసాల నుండి”
రచయిత జననం : అక్టోబరు 28, 1909 (28.10.1909)
మరణం : ఆగస్టు 17, 1980 (17.08.1980)
జన్మస్థలం : తెనాలి, గుంటూరు జిల్లా
రచనలు :
1) ‘జీవితం’, ‘చదువు’ – అనే నవలలు
2) ‘అద్దెకొంప’, ‘షావుకారు సుబ్బయ్య’ మొదలైన కథానికలు
3) సినిమా వ్యాసాలు
4) సైన్సు వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్త్విక వ్యాసాలు మొ||నవి.
కొత్త పదాలు – అర్థాలు
అంశము = విషయము
అభినందన = ప్రశంస, పొగడ్త
అన్వేషించు = వెదకు, పరిశీలించు
అక్కఱ = అవసరమైన పని
ఆమోదం = అంగీకారం
ఆస్వాదించు = అనుభవించు
ఆకృతులు = రూపాలు
ఆధునికము = క్రొత్తది
కలుగు = రంధ్రం, బొరియ
గండి = రంధ్రము, సందు
చలన చిత్రాలు = సినిమాలు
జ్ఞానేంద్రియాలు = జ్ఞానమును కల్గించే అవయవాలు. ఇవి ఐదు. 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మం
దృశ్యము = చూడదగినది, కనబడు వస్తువు
నిరూపించు = నిర్ణయించు
పసిగట్టుట = వాసన ద్వారా గుర్తించుట
పాటించు = ఆదరించు, కావించు
ప్రతిపాదించు = నిరూపించి తెలుపు
పరిమాణము = కొలత
ప్రకంపన = కదలిక
భ్రమలు = భ్రాంతి; లేనిది ఉన్నట్లుగా తోచడం
ఋజువు చేయు = నిరూపించు
విశ్లేషించు = విషయాన్ని విభజించి చూచు
వైపరీత్యము = విపరీతము
విధిగా = ఏర్పాటుగా (తప్పనిసరిగా)
సామ్యము = సాటి, పోలిక
శాస్త్రవేత్త = శాస్త్రం తెలిసినవాడు