AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు

8th Class Telugu ఉపవాచకం 4th Lesson మధుపర్కాలు Textbook Questions and Answers

I. అవగాహన-ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. పుట్టన్నది రెండు నిట్టాళ్ళపాక. అవి నెత్తిమీద నీడకోసం వేసుకున్న నిట్టాళ్ళు, అసలా ఇంటికి నిట్టాళ్ళు ఆ దంపతులే. పుట్టన్నా, సీతమ్మా ఒక్కటే ఎత్తు. భౌతికంగానే కాదు… ఆత్మలో కూడా సమానమైన ఎత్తులోనే ఉంటారు. ఒకటిగా ఉన్న ఆత్మను రెండుచేసి, రెండింటికి రెండు శరీరాలు కల్పించి, భూలోకంలో కొన్నాళ్ళు ఆడుకురండని ఆ విధాత పంపాడా, అనిపిస్తుంది వారిని చూస్తే.

పుట్టన్న వృత్తి బట్టలనేత. రోజుకు ఏ నాలుగుగంటలో తప్ప, చేతిలో కండెను పడుగులో నుంచి అటూ యిటూ గిరాటువేస్తూ, వస్త్రం నేస్తూనే ఉంటాడు. సీతమ్మ రాట్నం దగ్గర నుంచి లేవదు. వడివడిగా చిలపలు తోడటం, కండెలు చుట్టడం, పడుగు వేసినప్పుడు భర్తతోపాటు గంజిపెట్టడం, కుంచె తీయడం ఆమె విధులు. ఏ సమయంలో కూడా | వారు ‘కాయకష్టం చేస్తున్నాం’ అనే భావాన్ని బయట పెట్టేవారు కాదు. అదో యజ్ఞంగానే చూసుకునేవారు. ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి. ఒక జానెడునేస్తే పుట్టన్న పెదవుల మీద పొట్లపువ్వులు పూచేవి.
ప్రశ్నలు :
1. పుట్టన్న వృత్తి ఏది?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలనేత వృత్తి.

2. సీతమ్మ ఎక్కడి నుండి లేవదు?
జవాబు:
సీతమ్మ రాట్నం దగ్గర నుండి లేవదు.

3. పుట్టన్న దంపతులు దేనిని యజ్ఞంగా భావించేవాళ్ళు?
జవాబు:
పుట్టన్న దంపతులు వృత్తిని యజ్ఞంగా భావించేవాళ్ళు.

4. ఎప్పుడు సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి?
జవాబు:
ఒక్క కండె చుడితే సీతమ్మ కళ్ళు పువ్వులయ్యేవి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

2. పుణ్యం, ధర్మం జీవితానికి పెట్టని కోటలుగా భావిస్తూ జీవిస్తున్న పుట్టన్నకు, ధనం మీద ఆశలేదు. మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే అతని ఆశయం. సీతమ్మ కూడా అంతకుమించి ఏమీ కోరదు. కాకపోతే గోవుకు మేత ఒకటి కావాలి. కాని, కొమ్ము చెంబులతో పాలకు వచ్చేవారంతా, చిట్టూ, తవుడూ, తెలకపిండి చెక్కలు, కానుకలుగా తెస్తూనే ఉంటారు. ఊరి ఆసామి …… కుప్ప నూర్పిళ్ళ కాలంలో అడక్కుండానే వరిగడ్డి తెచ్చి అతని దొడ్లో వామి పెట్టి పోతారు. జనపకట్టలు తెచ్చి ఇంటిమీద ఎండేసి పోతారు. పుట్టన్న వద్దని బ్రతిమాలినా వినరు. “నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని వారు నవ్వుకొని వెళ్ళి పోతారు.
ప్రశ్నలు :
1. జీవితానికి పెట్టని కోటలు ఏవి?
జవాబు:
పుణ్యం ధర్మం అనేవి జీవితానికి పెట్టని కోటలు.

2. పుట్టన్నకు దేని మీద ఆశ లేదు?
జవాబు:
పుట్టన్నకు ధనం మీద ఆశ లేదు.

3. ఊరి ప్రజలు పుట్టన్నను ఏమని ప్రశంసించేవారు?
జవాబు:
ఊరి ప్రజలు పుట్టన్నను ‘నీ గోవు కామధేనువు పుట్టన్నా” అని ప్రజలు ప్రశంసించేవారు.

4. పుట్టన్న ఆశయం ఏమిటి
జవాబు:
మూడు పూటలా కడుపును గంజితో నింపడం ఒక్కటే పుట్టన్న ఆశయం.

3. అప్పుడే సందెవెలుగులు దూసుకువస్తున్నాయి. గానుగచెట్టు చిటారు కొమ్మకు అతికించినట్లుగా నెలవంక కనిపిస్తున్నాడు. పుట్టన్న వాకిట్లోకి రాగానే ఆవు “అంబా” అని అరిచింది. పుట్టన్నకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెళ్ళి దాని మెడ కౌగలించుకొన్నాడు. “నా మీద కోపం వచ్చిందా ? అమ్ముతున్నానని బాధపడుతున్నావా ? ఏం చెయ్యను, ఆచారం కోసం అమ్ముకోవలసి వచ్చింది. నువ్వెక్కడున్నా ప్రతిరోజూ వచ్చి చూస్తా……. నిన్ను దైవం లాగా కొలుస్తున్నా. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు నన్ను?” అని మెడ వదలి ఉత్తరీయంతో దాని ఒళ్ళంతా తుడిచాడు. దానిని
విడవలేక విడవలేక ఊళ్లోకి వెళ్ళాడు.
ప్రశ్నలు :
1. నెలవంక ఎలా కనిపిస్తున్నాడు?
జవాబు:
నెలవంక గానుగచెట్టు చిటారుకొమ్మకు అతికించి నట్లుగా కనిపిస్తున్నాడు.

2. పట్టరాని దుఃఖం ఎవరికి వచ్చింది?
జవాబు:
పట్టరాని దుఃఖం పుట్టన్నకు వచ్చింది.

3. పుట్టన్న వాకిట్లోకి రాగానే అరిచింది ఏది?
జవాబు:
పుట్టన్న వాకిట్లోకి రాగానే గోవు “అంబా” అని ముద్ర వేసింది.

4. పుట్టన్న దేనిని అమ్ముకోవలసి వచ్చింది?
జవాబు:
పుట్టన్న గోవును అమ్ముకోవలసి వచ్చింది.

4. ఆ రోజే బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. నూలు తెచ్చాడు. ఆ నాలుగు రోజులు అతడు మగ్గం గోతిలో నుంచి లేవలేదు. సీతమ్మ రాట్నం వదలలేదు. నాలుగురోజులు గడిచాయి. తెల్లారే లగ్నం ….. ఆ సందెవేళ ఆముదం దీపాలు – అటూఇటూ పెట్టి నేత నేస్తున్నాడు పుట్టన్న. ఇంతట్లోనే చెరువుగట్టున మేళాలు మ్రోగినాయి. “పెళ్ళివారు దిగారు” అంది సీతమ్మ. “ఇంకొక్క ఘడియలో నేత పూర్తి అవుతుంది” అన్నాడు పున్న. మరి కాసేపటికి పల్లకి, దాని వెంట బళ్ళూ ఆ వీధినే వచ్చాయి. సీతమ్మ చూడటానికి బైటికి వెళ్ళింది. ఇలాయి బుడ్ల వెలుతుర్లో పెళ్ళికొడుకును చూచింది. వెంట ఇరవై బళ్లున్నాయి. అన్నీ వాళ్ళ ఇల్లు దాటిపోయేదాకా నిలబడి చూచి ఇంట్లోకి వచ్చింది సీతమ్మ “పెళ్ళికొడుకు కళ్ళూ, ముఖం బాగానే ఉన్నాయి. పాతికేళ్ళుంటాయి. అయినా ఫరవాలా! ఈడుగానే ఉంటాడు. పార్వతి మాత్రం ఒడ్డూ పొడుగూ లేదూ” అంది.
ప్రశ్నలు :
1. ఇలాయి బుడ్ల వెలుతురులో ఎవరిని చూసింది?
జవాబు:
ఇలాయి బుడ్ల వెలుతురులో పెండ్లి కొడుకును చూసింది

2. పుట్టన్న బస్తీకి వెళ్ళి ఏమి తెచ్చాడు?
జవాబు:
పుట్టన్న బస్తీ నుండి నూలు తెచ్చాడు.

3. చెరువు గట్టున ఏవి మ్రోగాయి?
జవాబు:
చెరువు గట్టున మేళాలు మ్రోగాయి.

4. సీతమ్మ దేనిని వదలలేదు?
జవాబు:
సీతమ్మ రాట్నం వదలలేదు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

5. తెల్లవారింది. పాపయ్యగారింట్లో పెళ్ళి వైభవంగా జరుగుతోంది. అర ఎకరం పందిరి వేసినా జనం పట్టక కిటకిటలాడిపోతున్నారు. ఒక పందిరి గుంజనానుకొని సీతమ్మ నిలబడింది, ఆవిడకు కొంచెం పక్కగా పుట్టన్న ఉన్నాడు. నూతన దంపతులు తలంబ్రాలు పోసుకుంటున్నారు. సన్నాయిపాట సాగిపోతోంది, సంతోష తరంగాలుగా. పిల్ల తల్లితండ్రులు ఒకరినొకరు ఎరగనంత క్రొత్తగా చూచుకుంటున్నారెందుకో. పుట్టన్న తన ధర్మం నెరవేర్చుకొన్నానన్న ఆనందంలో మునిగిపోయాడు. లగ్నం అయింది. ‘అందరు భోజనాలకు పదండి’ అన్న కేకలు నాలుగువైపుల నుంచి వినిపించాయి. అంతా వెళ్ళినా పుట్టన్న, సీతమ్మ గోడ ప్రక్కగా నిలబడి – ఏదో చెప్పుకొని నవ్వుతున్నారు. పాపయ్య చూశాడు వారిని. “ఏం అక్కా నువ్విక్కడే ఉన్నావు – బావయ్య అలిగాడా? కలిగిందేదో పెడతాం. అంత అలిగితే ఎలా బావా” అన్నాడు.
ప్రశ్నలు :
1. ఎవరి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది?
జవాబు:
పాపయ్య గారి ఇంట్లో పెండ్లి వైభవంగా జరిగింది.

2. సీతమ్మ ఎలా నిలబడింది?
జవాబు:
సీతమ్మ పందిరి గుంజకు ఆనుకొని నిలబడింది.

3. నూతన దంపతులు వేటిని పోసుకున్నారు?
జవాబు:
నూతన దంపతులు తలంబ్రాలు పోసుకున్నారు.

4. నలువైపులా ఏ కేకలు వినిపించాయి?
జవాబు:
నలువైపులా “భోజనానికి పదండి” అనే కేకలు వినిపించాయి.

6. మధుపర్కాలు తీసుకొని వెళ్ళి ఇచ్చిందాక ఒక దీక్షతో ఉన్నారు పుట్టన్న దంపతులు. ఆ కార్యం నెరవేరింది. వారి మనసులో బరువు తగ్గింది. తగ్గిన తర్వాత ఆవు మీద బెంగ అధికమైంది. ఎలాగో మనస్సుకు సంతృప్తి తెచ్చుకొని నిద్రపోయారు. కాని నిద్రలో వారికాగోమాత ప్రత్యక్షమైంది. పుట్టన్నకు ఆవు ‘అంబా’ అని అరుస్తూన్నట్లు వినిపించింది. దిగ్గునలేచి వెళ్ళి ఇంటి మీద ఉన్న జనప కట్ట తీసుకుని గానుగచెట్టు దగ్గరికి వెళ్ళాడు. బిక్కు బిక్కు మంటూ కట్టుకొయ్య కనిపించింది. అతడి మనస్సు చిట్లి, కొన్ని బెల్లులూడిపోయినట్లయింది. తిరిగివచ్చి ఇంట్లో పడుకొన్నాడు. నిద్ర రావడం లేదు. ఆవు ముట్టెతెచ్చి అతని పొట్టమీద నెట్టి గోకమన్నట్లుగా తోచింది. గభాలున లేచి కూర్చున్నాడు. చూపు చూరులోకీ, మనస్సు శూన్యంలోకి చొచ్చుకుపోతోంది. “నువ్వు పోసిన పాలు త్రాగి పసి పిల్లలు గుక్కలు మాని నిద్రపోతున్నారు.” అని పూజారి అన్నమాటలు వినిపించినాయి. ఆ భావాన్ని తరుముకొంటూ వెనకనుంచి పసిపిల్లల ఏడ్పులు వినిపించినాయి. చెవులు గట్టిగా మూసుకొని “సీతా” అని పిలిచాడు. ఆమె లేచింది. తన అనుభూతి అంతా చెప్పాడు.
ప్రశ్నలు :
1. పుట్టన్న దంపతులకు దేని మీద బెంగ పెరిగింది?
జవాబు:
పుట్టన్న దంపతులకు ఆవుమీద బెంగ పెరిగింది.

2. నిద్రలో ఏది ప్రత్యక్షమైంది?
జవాబు:
నిద్రలో గోమాత ప్రత్యక్షమయింది.

3. శూన్యంలోనికి ఏది చొచ్చుకొని పోయింది?
జవాబు:
శూన్యంలోనికి మనస్సు చొచ్చుకొని పోయింది.

4. ఎవరు గుక్కలు మాని నిద్రపోతున్నారు?
జవాబు:
పసిపిల్లలు గక్కలు మాని నిద్రపోతున్నారు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

7. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దీనితో ముడిపడిన సమస్య అసలు వివాహాలను జరిపే తీరు ఎంతవైభవంగా, ఎంత ధనవ్యయం చేసి జరిపిస్తే అంత ఘనతగా పరిగణించడం మన సమాజంలో పరిపాటి. నిరాడంబరంగా వివాహం జరపడానికి సంఘం హర్షించదు. ఇందువల్ల ఎంత శక్తిహీనుడైనా అప్పో సప్పో చేసి ఘనంగా వివాహం జరిపినట్టు అనిపించుకోవలసి వస్తున్నది. అంతేకాదు, వివాహ సమయంలో బంధువులు, మిత్రులు, వధూవరులకు చదివించే కానుకల హెచ్చుతగ్గులు కూడా ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా పట్టించుకునే స్థితికి మన సంఘం దిగజారిపోయింది. ఈ దురాచారాల నిర్మూలనకు శాసనాలు అవసరమే కావచ్చు కానీ అంతకంటే ముఖ్యంగా వీటి పట్ల ఏహ్యభావాన్ని ప్రజలలో కలిగించడం ముఖ్యం.
ప్రశ్నలు :
1. వివాహం ఎలా జరగడాన్ని సంఘం హర్షించదు?
జవాబు:
వివాహం నిరాడంబరంగా జరగడాన్ని సంఘం హర్షించదు.

2. ‘వధూవరులు” అనేది జంట పదం. అలాంటి జంటపదం పై పేరాలో ఉంది గుర్తించి రాయండి.
జవాబు:
హెచ్చుతగ్గులు

3. శక్తికి మించి వివాహాలు ఘనంగా జరిపించడం, విలువైన బహుమతులివ్వడం వంటివి ఎటువంటివని రచయిత ఉద్దేశ్యం?
జవాబు:
దురాచారాలని రచయిత ఉద్దేశ్యం

4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పేరా దేని గురించి చెపుతుంది?

II వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పుట్టన్న దంపతుల ఆచారమేమిటి ? దాన్ని కొనసాగించడానికి ఆయన చేసిన త్యాగమేమి?
జవాబు:
పుట్టన్న వృత్తి బట్టలు నేయటము. అతని భార్య సీతమ్మ రాట్నం వడికేటప్పుడు భర్తకు సహాయపడేది. తరతరాలుగా వచ్చే బాంధవ ముద్ర చెరిగిపోకుండా కాపాడుకోవడం అతని ముఖ్య ఆశయం.

ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా పుట్టన్న స్వయంగా నేసి, మధుపర్కాలు పంపిస్తాడు. అది ఆ పుట్టన్న దంపతుల ఆచారం. మధుపర్కాలకు వారు పైకం ఏమీ తీసుకోరు. ఆ మధుపర్కాలు కట్టుకొని కొత్త దంపతులు పీటల మీద కూర్చుని, తలంబ్రాలు పోసుకోవడం – దానిని పుట్టన్న దంపతులు చూడడం మామూలు.

క్రమంగా పుట్టన్న దంపతులు అలా ఉచితంగా మధుపర్కాలు ఇవ్వడంతో బీదవారయ్యారు. ఆ గ్రామంలో పెద్దకాపు పాపయ్య గారింట్లో వారి అమ్మాయి పార్వతికి పెళ్ళి కుదిరింది. పాపయ్య ఆ విషయం సీతమ్మకు చెప్పి, పుట్టన్నకు చెప్పమన్నాడు. మధుపర్కాలు నేయడానికి పుట్టన్న వద్ద నూలు లేదు. పుట్టన్న దగ్గర ఒక ఆవు ఉంది. దాని పాలు పితికి రోజూ గ్రామంలో చంటి పిల్లలకు ఉచితంగా వారు పాలు పోసేవారు. నూలు కొనడం కోసం అప్పుచెయ్యడం పుట్టన్నకు ఇష్టం లేక, ఆ ఆవును అచ్చన్నగారికి అమ్మేశాడు. ఈ విధంగా తమ ఆచారం కొనసాగించడానికి పుట్టన్న ఆవును అమ్మి త్యాగం చేశాడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 2.
ఈ కథవల్ల పల్లెటూళ్ళలోని మనుషుల మధ్య ఆత్మీయతానుబంధాలు ఎలా ఉన్నాయని మీకనిపించింది?
జవాబు:
పల్లెటూళ్ళలోని వారు ఎప్పుడూ కలసిమెలసి జీవిస్తారు. ఒకరిపట్ల ఒకరు ఆత్మీయతానుబంధాలు కలిగి ఉంటారు. ఇతరులను మోసం చేయటం, వారిపట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండటం చేయరు. ఎదుటివారికి సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా అన్నిట్లో పాలుపంచుకుంటారని అనిపించింది.

పుట్టన్న దంపతులు తమ ఆవుపాలు పిల్లలకు పాలకోసం వచ్చే వారికి ఉచితంగా పోసేవారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా వారు ఆ నూతన దంపతులకు స్వయంగా నేసి మధుపర్కాలు ఇస్తారు. దాని కోసం పైకం ఏమీ తీసుకోరు. అలాగే వారింటికి పాలకోసం వచ్చేవారంతా చిట్టు, తవుడు, తెలగపిండి, చెక్కలు కానుకలుగా వీరికి ఇచ్చేవారు. కుప్పనూర్పిళ్ళ కాలంలో వరిగడ్డి తెచ్చి పుట్టన్న దొడ్డిలో మేత వేసేవారు.

గ్రామంలో పురుషులు ఆడవారిని అక్కలుగా, చెల్లెళ్ళుగా పిలిచేవారు. పురుషులు వరుసలు కలిపి ‘బావ’ అని పిలిచేవారు. పాపయ్య కాపు పుట్టన్నను “బావా” అని, సీతమ్మను “అప్పా” అని పిలుస్తాడు.

మధుపర్కాలు ఉచితంగా ఇచ్చే తన ఆచారం కోసం పుట్టన్న తనకు ఇష్టమైన ఆవును సైతం అమ్మివేశాడు. ఆవును అమ్మివేశాక పుట్టన్న ఇంటికి పాలకోసం వచ్చిన పూజారి, పుట్టన్నను “ఋషి” వంటివాడని మెచ్చుకున్నాడు.

మధుపర్కాలు పుట్టన్న ఇంటి నుండి పట్టుకు వెళ్ళడానికి మేళతాళాలతో రావడం, సీతమ్మకు కుంకం పెట్టి తాంబూలం ఇవ్వడం, పెళ్ళి భోజనాల దగ్గర పాపయ్య, పుట్టన్న దంపతుల పరిహాసం మాటలూ, ఆ గ్రామ ప్రజల మధ్యన ఉన్న అనుబంధాలకు నిదర్శనాలు. పాపయ్యగారి అల్లుడు తనకు మామగారిచ్చిన మాన్యాన్ని, పుట్టన్న దంపతులకు మధుపర్కాల మాన్యంగా ఇవ్వడం, అందుకు పాపయ్య అంగీకరించడం, ఆ గ్రామ ప్రజల మధ్యగల ఆత్మీయతానుబంధాలను గుర్తు చేస్తున్నాయి.

ప్రశ్న 3.
పుట్టన్న దంపతుల మంచితనాన్ని వర్ణిస్తూ పది వాక్యాలు రాయండి.
(లేదా)
మధుపర్కాలను ఉచితంగా పంపే ఆచారాన్ని కాపాడుకునేందుకు పుట్టన్న దంపతులు అష్టకష్టాలు పడ్డారు. వారి మంచితనాన్ని తెలిపేలా పది వాక్యాలు రాయండి.
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శదంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచిపనికి సహకరిస్తూ, అతనికి చేదోడువాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ.

పుట్టన్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. వారి గ్రామం పాలవెల్లి. అందులో వారు పువ్వుల వంటివారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా ఆ దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. పుట్టన్న దంపతులు శారీరకంగానే కాక, మానసికంగా కూడా వారి మనస్సులు ఒకటే. వారికి ఒక ఆవు ఉండేది. దానిని మేపి, దాని పాలు చంటిపిల్లల కోసం కొమ్ముచెంబులతో వచ్చే ఊరి వారికి ఉచితంగా పోసేవారు. అందరికీ పాలు పోశాక అతనికి ఖాళీ చెంబు మిగిలేది.

ఆ గ్రామంలో ఏ పెళ్ళి జరిగినా ఆ దంపతులకు మధుపర్కాలు నేసి ఇవ్వడం ఆ దంపతులకు ఆచారం. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుపర్కాలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు గారి అమ్మాయి పెళ్ళికి మధుపర్కాలు నేసి ఇయ్యడానికి నూలు లేక తమకు ఎంతో ఇష్టమైన ఆవును సైతం ఆ దంపతులు అమ్ముకున్నారు. తరతరాలుగా వచ్చే ఆచారాన్ని పోగొట్టుకోవడం కన్నా, గోవును వదులుకోవడం మంచిదని వారు నిర్ణయించారు. అప్పుచేయడం పుట్టన్నకు అసలు ఇష్టం లేదు. ఇక ఉచితంగా మధుపర్కాలు అందించలేక గ్రామం నుండి వెళ్ళిపోడానికి కూడా వారు సిద్ధం అయ్యారు.

పాపయ్య గారి అల్లుడు పుట్టన్న మంచితనం గుర్తించి వారికి ఆవును తిరిగి ఇప్పించి, రెండెకరాల మధుపర్కాల మాన్యం ఇచ్చాడు. దీని ద్వారా మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుస్తోంది.. తాము మంచిగా ఉంటూ, ఎదుటివారు మంచిగా మెలిగేలా ఆదర్శప్రాయమైన జీవనం సాగించిన పుట్టన్న దంపతులు మంచిక మారురూపాలు.

ప్రశ్న 4.
ఈ పాఠంలోని అల్లుడు గారి పాత్ర ద్వారా ఎలాంటి ఆదర్శాన్ని గ్రహించారు?
జవాబు:
పాఠంలో పాసయ్య కాపు గారి అల్లుడు చాలా మంచివాడు. ధనవంతుడు, తన పెళ్ళికి మధుపర్కాలు ఉచితంగా నేసి ఇచ్చిన పుట్టన్న దంపతులు నూలు కోసం తమ ఆవును అమ్ముకున్నారని, వారు ఆ గ్రామంలోని పసిపాపకు ఆ ఆవుపాలను ఉచితంగా పోసేవారని తెలిసికొన్నాడు. పుట్టన్న ఆవును అచ్చన్నకు అమ్మేశాడని తెలుసుకొని, పుట్టన్నకు అచ్చన్న ఇచ్చిన డబ్బును, అచ్చన్నకు తిరిగి ఇచ్చివేశాడు. ఆవును పుట్టన్న ఇంటి దగ్గర తిరిగి కట్టివేయనునీ అచ్చన్నకు చెప్పాడు.

అంతేకాకుండా, తనకు మామగారు కానుకగా ఇచ్చిన రెండెకరాల మాన్యాన్ని పుట్టన్న దంపతుల పేర రాయించే ఏర్పాటు చేశాడు. ఆ డబ్బుతో వారు గ్రామస్థులకు ఉచితంగా మధుపర్కాలు శాశ్వతంగా ఇచ్చే ఏర్పాటును చేశాడు. ఆవునూ, మాన్యాన్ని తీసుకోడానికి, పుట్టన్నను ఒప్పించాడు.

ఈ పాత్ర ద్వారా మంచిపనులు చేసేవారికి మనం సాయంచేయాలని, మనకు దేవుడిచ్చిన సంపదను మంచికార్యాలు చేయడానికి, మంచికార్యాలు చేసేవారికి సాయం చేయడానికి వినియోగించాలని గ్రహించాము.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 మధుపర్కాలు

ప్రశ్న 5.
మధుపర్కాలు పాత్రలలో ఆచారాలు పాటించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పుట్టన్న పొరుగూరికి వెళ్లిపోదాం అనుకున్నాడు కదా ! దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
పుట్టన్న దంపతులు ఆదర్శ దంపతులు. మంచితనం మూర్తీభవించిన వారు. పుట్టన్న చేసే ప్రతి మంచి పనికి సహకరిస్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉండే ఉత్తమ ఇల్లాలు సీతమ్మ. పున్న దంపతులు చేనేత వృత్తిగా జీవించేవారు. ఆ గ్రామంలో పెళ్ళిళ్ళు అయిన కొత్త దంపతులందరికీ ఉచితంగా పుట్టన్న దంపతులు మధుపర్కాలను వేసి ఇచ్చే మహాదాతలు. క్రమంగా ఉచితంగా ఇచ్చే మధుప్కూలతో వారి సంపాదన హరించింది. పాపయ్య కాపు కూతురి పెళ్ళి మధుపర్కాలు నేసి ఇవ్వడానికి నూలు లేక ఇంట్లో ఉన్న అవును అమ్ముకున్నారు పుట్టన్న దంపతులు. అప్పుచేయడం ఇష్టంలేని ఆ దంపతులు ఊరు విడిచి వెళ్ళిపోదామనుకున్నారు. ఆ సమయంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారు.

“తనకు మాలిన ధర్మం పనికిరాదన్నది” పెద్దల మాట. కానీ పుట్టన్న దంపతులు తాగడానికి గంజినీళ్ళే అయినా దానధర్మాలు విడువలేదు మాట తప్పి, పూర్వపు ఆచారాన్ని విడిచి ఆ వూరిలో బ్రతకలేమని భావించి, పొరుగూరు వెళదామన్నాడు. అలా అనడంలో కూడా అయిష్టమే ఉంది కాని సంతోషం లేదు. బాధలో అన్న మాటే గాని, నిజంగా వెళ్ళాలని కాదు అని నా అభిప్రాయం.