These AP 10th Class Biology Important Questions 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.
AP Board 10th Class Biology 6th lesson Important Questions and Answers ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ
10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
సజీవులలో సమవిభజన ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
సమవిభజన గాయాలు మాన్పటానికి, పెరుగుదలకు తోడ్పడుతుంది.
ప్రశ్న 2.
బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయంది.
జవాబు:
బీజ దళాలు మొక్కలో పత్రాలు ఏర్పడేవరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.
ప్రశ్న 3.
నీవు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలను సందర్శించిన డాక్టర్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- AIDS వ్యాధి ఎలా కలుగుతుంది?
- AIDS ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది?
- AIDS వ్యాధి లక్షణాలు ఏవి?
- AIDS వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రశ్న 4.
ప్రథమ స్తన్యం అనగా నేమి?
జవాబు:
గర్భావధి చివరిదశలో స్తన గ్రంథుల్లో ప్రోగయ్యే శోషరసాన్ని పోలిన ద్రవాన్ని ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం (Colostrum) అంటారు. ఇది నవజాత శిశువులో వ్యాధి నిరోధకతను పెంచడానికి అత్యావశ్యకం. దీని తరువాత పాలు స్రవించబడతాయి.
ప్రశ్న 5.
స్త్రీ భ్రూణ హత్యల నివారణకు రెండు సలహాలను సూచించండి.
జవాబు:
- సంబంధిత నినాదాలు తయారు చేయుట
- ర్యాలీలు నిర్వహించుట
- ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచుట.
ప్రశ్న 6.
రైజోపస్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించినపుడు మీరు తీసుకొనిన రెండు జాగ్రత్తలను తెలుపండి.
జవాబు:
- ప్రయోగంలో ఉపయోగించే రొట్టెను నేరుగా చేతులతో ముట్టరాదు.
- రొట్టెను చేతులతో ముట్టినట్లయితే చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.
- రొట్టెను ఒక గంటపాటు ఆరుబయట ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సాంక్రమిక పదార్థాలను గ్రహిస్తుంది.
- రొట్టెను వుంచిన సంచిని మాత్రము తెరవద్దు.
- ప్రతి రెండు రోజులకోసారి పరీక్షిస్తూ, ఎండిపోకుండా కొంత నీటిని చల్లుతూ ఉంచాలి.
- సంచిని దూరంగా, చీకటి, తేమ మరియు వెచ్చగా వుండే ప్రదేశంలో ఉంచాలి.
ప్రశ్న 7.
ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
ప్రత్యుత్పత్తి :
ఒక జీవి తన జీవిత కాలంలో తనను పోలిన జీవులను ఉత్పత్తి చేసే ధర్మాన్ని “ప్రత్యుత్పత్తి” అంటారు.
ప్రశ్న 8.
అనుకూల పరిస్థితులలో పారమీషియం ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
అనుకూల పరిస్థితులలో పారమీషియం ద్విధావిచ్ఛిత్తి ద్వారా రెండు పిల్ల పారమీషియంలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగటం వలన ఎక్కువ సంఖ్యలో జీవులు ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 9.
అననుకూల పరిస్థితులలో పారమీషియం ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుపుతుంది?
జవాబు:
ప్రతికూల పరిస్థితులలో రెండు పారమీషియాలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకొంటాయి. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి.
ప్రశ్న 10.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
అలైంగిక ప్రత్యుత్పత్తి : సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని “అలైంగిక ప్రత్యుత్పత్తి” అంటారు.
ప్రశ్న 11.
ద్విధావిచ్చిత్తి అనగానేమి?
జవాబు:
ద్విధావిచ్చిత్తి :
ఏకకణ జీవులు రెండుగా విడిపోయే ప్రక్రియను “ద్విధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది సౌష్ఠవంగా జరుగుతుంది.
ఉదా: అమీబా, పారమీషియం
ప్రశ్న 12.
బహుధావిచ్చిత్తి అనగా నేమి?
జవాబు:
బహుధావిచ్చితి :
ఒక జీవి ఎక్కువ భాగాలుగా విడిపోయి, అవి జీవులుగా రూపొందే ప్రక్రియను “బహుధావిచ్చిత్తి” అంటారు. సాధారణంగా ఇది ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది.
ప్రశ్న 13.
‘అనిషేక జననం’ అనగానేమి?
జవాబు:
అనిషేక జననం :
ఫలదీకరణం జరగకపోయినా అండం అభివృద్ధి చెంది పిల్లజీవులుగా ఏర్పడే ప్రక్రియను “అనిషేక జననం” అంటారు.
ప్రశ్న 14.
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకములను తెలపండి.
జవాబు:
కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి విధానాలు :
స్టోలన్లు : వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ
లశునాలు: ఉల్లి
కొమ్ములు : పసుపు
దుంప : బంగాళదుంప
ప్రశ్న 15.
కణజాలవర్ధనం అనగానేమి?
జవాబు:
కణజాలవర్ధనం: మొక్కలలోని కొంత కణజాలాన్ని వర్ధన యానకంలో ఉంచినపుడు, అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ ప్రక్రియను “కణజాలవర్ధనం” అంటారు.
ప్రశ్న 16.
సిద్ధబీజాశయ పత్రాలు అనగానేమి?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రాలు :
ఫెర్న్ మొక్క ఆకుల అడుగు భాగాన బూడిద రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను “సిద్ధబీజాశయ పత్రాలు” (Sporophyll) అంటారు.
ప్రశ్న 17.
బాహ్య ఫలదీకరణం అనగానేమి?
జవాబు:
బాహ్య ఫలదీకరణం :
తల్లి శరీరానికి బయట జరిగే ఫలదీకరణను “బాహ్య ఫలదీకరణం” అంటారు.
ఉదా : చేపలు, కప్పలు
ప్రశ్న 18.
అంతర ఫలదీకరణ అనగానేమి?
జవాబు:
అంతర ఫలదీకరణం : సీ జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు
ప్రశ్న 19.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు తెలపంది.
జవాబు:
ముష్కాలు, శుక్రవాహిక, ప్రసేకం, పౌరుష గ్రంథి, మేహనం, ఎపిడిడిమిస్ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.
ప్రశ్న 20.
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాల పేర్లు చెప్పండి.
జవాబు:
గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు, స్త్రీ బీజకోశాలు, యోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు.
ప్రశ్న 21.
అండోత్సర్గం అనగానేమి?
జవాబు:
అండోత్సర్గం :
గ్రాఫియన్ పుటిక నుండి అండం విడుదల కావటాన్ని “అండోత్సర్గం” (Ovulation) అంటారు.
ప్రశ్న 22.
పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏమిటి?
జవాబు:
పిండాన్ని ఆవరిస్తూ పరాయువు (Chorion), ఉల్బం (Amnion), ఎల్లంటోయిస్ (Allantois) అనే పొరలు ఉంటాయి.
ప్రశ్న 23.
తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
జవాబు:
జరాయువు బొడ్డు తాడు (నాభిరజ్జువు) ద్వారా తల్లి, పిండాల మధ్య పదార్థాల రవాణా జరుగుతుంది.
ప్రశ్న 24.
జననాంతరం అనగానేమి?
జవాబు:
జననాంతరం :
శిశువు జననం తరువాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంత వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియను “జననాంతరం” అంటారు.
ప్రశ్న 25.
పిండకోశంలో ఎన్ని కణాలు ఎన్ని సమూహాలుగా అమరి ఉంటాయి?
జవాబు:
పిండకోశంలో మొత్తం ఏడు కణాలు, మూడు సమూహాలుగా ఉంటాయి. వీటిలో ధృవ కేంద్రకం ద్వయస్థితికంగా ఉండును.
ప్రశ్న 26.
ఏకలింగ పుషాలు అనగానేమి?
జవాబు:
ఏకలింగ పుష్పాలు :
కొన్ని పుష్పాలు కేసరావళిగాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఇటువంటి పుష్పాలను “ఏకలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : సొరకాయ, బొప్పాయి
ప్రశ్న 27.
ద్విలింగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
ద్విలింగ పుష్పాలు :
కేసరావళి అండకోశము రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను “ద్విలింగ పుష్పాలు” అంటారు.
ఉదా : బఠాని, ఉమ్మెత్త
ప్రశ్న 28.
స్వపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
స్వపరాగ సంపర్కం :
ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రం చేరడాన్ని “స్వపరాగ సంపర్కం” అంటారు.
ప్రశ్న 29.
పరపరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
పరపరాగ సంపర్కం :
పుష్పంలోని పురుష బీజకణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల స్త్రీ బీజకణాలతో ఫలదీకరణ జరిగితే దానిని “పరపరాగ సంపర్కం” (Cross pollination) అంటారు.
ప్రశ్న 30.
పిండ కోశంలోని కణాలు ఏమిటి?
జవాబు:
పుష్పించే మొక్కల పిండకోశంలో 7 కణాలు ఉంటాయి. వీటిలో మూడు ప్రాతిపదిక కణాలు రెండు సహాయకణాలు. ఒక స్త్రీ బీజకణం, ఒక ద్వితీయ కేంద్రకం ఉంటాయి.
ప్రశ్న 31.
అంకురచ్ఛదము ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పురుష బీజకణం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి అంకురచ్ఛదాన్ని (Endo sperm) ఏర్పరుస్తుంది.
ప్రశ్న 32.
ద్విఫలదీకరణ అనగానేమి?
జవాబు:
ద్విఫలదీకరణ :
మొక్కలలో రెండు పురుష కేంద్రకాలు ఏర్పడి, ఒకటి స్త్రీ బీజకణంతోనూ, మరొకటి ద్వితీయ కేంద్రకంతోనూ కలుసాయి. ఇలా పిండకోశంలో రెండు ఫలదీకరణాలు జరగడాన్ని “ద్విఫలదీకరణం” అంటారు.
ప్రశ్న 33.
DNA అనగానేమి? దాని రసాయనిక నిర్మాణం ఏమిటి?
జవాబు:
డీ ఆక్సీరిబో న్యూక్లిక్ ఆసిడ్ ను “DNA” అంటారు. ఇది ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుంది. దీని నిర్మాణాన్ని 1953లో “జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రికె” కనుగొన్నారు.
ప్రశ్న 34.
సమవిభజన గల ఉపదశలు ఏమిటి?
జవాబు:
సమ విభజనలో ప్రథమదశ, మధ్యస్థదశ, చలనదశ మరియు అంత్యదశ అనే ఉపదశలు ఉన్నాయి.
ప్రశ్న 35.
మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
జవాబు:
- మధ్యస్థదశలో క్రోమోజోములు, సెంట్రిమియర్లు అన్నీ వరుసగా అమరి మధ్య ఫలకాన్ని ఏర్పరుస్తాయి.
- క్రోమోజోములను అంటి ‘కండె పరికరం’ ఏర్పడుతుంది.
- మధ్య ఫలకం, కండె పరికరం మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్ష్యం.
ప్రశ్న 36.
క్షయకరణ విభజన ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
క్షయకరణ విభజనలో లైంగిక కణాల క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడి సంయోగబీజాలు ఏర్పడతాయి. వీటి కలయిక వలన ఏర్పడిన కొత్త జీవిలో తల్లి జీవుల వలె క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.
ప్రతి తరంలోనూ క్రోమోజోమ్ ల సంఖ్య స్థిరంగా ఉంచటానికి క్షయకరణ విభజన తోడ్పడుతుంది.
ప్రశ్న 37.
స్టాక్, సయాన్ అనగా నేమి?
జవాబు:
సయాన్ :
అంటుకట్టే ప్రక్రియలో వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కను “సయాన్” అంటారు.
స్టాక్ :
సయానికి ఆధారాన్నిచ్చే క్రింది మొక్కను “స్టాక్” అంటారు.
ప్రశ్న 38.
అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు తెలపండి.
జవాబు:
విచ్ఛిత్తి, కోరకీభవనం, ముక్కలు కావటం, సిద్ధబీజాలు, అనిషేక ఫలాలు మొదలైనవి. అలైంగికోత్పత్తిలోని కొన్ని ప్రక్రియలు.
ప్రశ్న 39.
కోరకీభవనాన్ని ఏ జీవులలో గమనిస్తావు?
జవాబు:
ఈస్ట్ వంటి శిలీంధ్రాలలో కోరకీభవనాన్ని గుర్తించవచ్చు.
ప్రశ్న 40.
ముక్కలవటం (Fragmentation) ఏ జీవులలో పరిశీలించవచ్చు?
జవాబు:
చదును పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవులలో ముక్కలవటం గమనించవచ్చు.
ప్రశ్న 41.
అనిషేక జననం ఏ ఏ జంతువులలో గమనించవచ్చు?
జవాబు:
తేనెటీగలు, చీమలు, కందిరీగలలో అనిషేక జననం గమనించవచ్చు.
ప్రశ్న 42.
పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది?
జవాబు:
రణపాల ఆకు (బ్రయోఫిల్లమ్) పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతుంది.
ప్రశ్న 43.
ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కలు ఏమిటి?
జవాబు:
చెరకు, గులాబి, మందార వంటి మొక్కలు ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి చెందుతాయి.
ప్రశ్న 44.
పాలను పెరుగుగా మార్చే సూక్ష్మజీవిలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి?
జవాబు:
లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. ఇది ద్విదావిచ్ఛిత్తి ద్వారా తన సంఖ్యను విపరీతంగా పెంచుతుంది.
ప్రశ్న 45.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అనిషేక ఫలనం (Parthenogenesis) ప్రక్రియలో విత్తనరహిత ఫలాలు ఏర్పడతాయి.
ఉదా : అరటి, ద్రాక్ష
ప్రశ్న 46.
కొన్ని లైంగిక వ్యాధులు తెలపండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ మొదలైనవి లైంగిక వ్యాధులు.
ప్రశ్న 47.
కొన్ని గర్భనిరోధక పద్ధతులు తెలపండి.
జవాబు:
భౌతిక ఉపకరణాలు : కండోమ్ లు, డయాఫ్రమలు, కాపర్ – T
రసాయన ఉపకరణాలు : స్పెర్మిసైడ్స్, మాలా – డి
శస్త్ర ఉపకరణాలు : వేసెక్టమీ, ట్యూబెక్టమీ మొదలైన గర్భనిరోధక పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి.
ప్రశ్న 48.
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రము అనగానేమి?
జవాబు:
సెమినల్ ప్లాస్మా :
శుక్ర గ్రాహికలు ఉత్పత్తిచేసే ద్రవం, పౌరుష గ్రంధి స్రావాలు, కౌపర్ గ్రంధి స్రావాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు.
శుక్రము :
సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము (Semen) అంటారు.
ప్రశ్న 49.
‘స్కలనము’ అనగానేమి?
జవాబు:
స్కలనము :
పురుష జీవి నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని ‘స్కలనము’ అంటారు.
ప్రశ్న 50.
సాధారణ ఫలదీకరణము జరగడానికి శుక్ర కణాలకు ఉండవలసిన లక్షణాలేవి?
జవాబు:
i) సాధారణ ఫలదీకరణానికి శుక్ర కణాలలో 60% సరైన ఆకారము, పరిమాణంలో ఉండాలి.
ii) కనీసం 40% వేగంగా చలించేలా ఉండాలి.
10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఈ క్రింది పటంలో 4, b, c, d లను గుర్తించి వాటి విధులను వ్రాయండి.
జవాబు:
a) అండాశయం :
మొక్కలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండాశయం, స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ, పురుష బీజకణాలు కలసి సంయోగ బీజం అండాశయంలో ఏర్పడుతుంది. ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర వహిస్తుంది.
b) కీలం :
పురుష బీజకణాలు దీని ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరటానికి తోడ్పడుతుంది.
c) కేసర దండం :
కేసరము పురుష బీజ ప్రత్యుత్పత్తి భాగము. దీనికి కేసర దండం, పరాగకోశం అని రెండు భాగాలుంటాయి. కేసర దండం పరాగ కోశానికి ఆధారాన్నిస్తుంది.
d) పరాగ కోశం :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పరాగకోశంలో పురుష బీజకణాలైన “పరాగ రేణువులు” ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 2.
మానవ శుక్రకణం పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 3.
రెండు లక్షణాలను ఎన్నుకొని అంటుకట్టుట ద్వారా వాంఛిత ఉపయుక్త లక్షణాలను ఎలా పొందవచ్చో వివరించండి.
జవాబు:
- రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
- నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని అవాంఛిత లక్షణాలు గల భాగాన్ని సయాన్ అని అంటారు.
- స్టాక్, సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్బాలి.
- వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు కావలసిన లక్షణాలున్న మొక్కలను సయాగా ఉపయోగించాలి.
ప్రశ్న 4.
పిండకోశం బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 5.
మీ పాఠశాలకు వచ్చిన డాక్టర్ తో HIV వ్యాప్తి చెందే మార్గాలను తెలిసికోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- HIV సంక్రమించే మార్గాలు ఏమిటి?
- రక్తమార్పిడి ద్వారా HIV వ్యాపిస్తుందా?
- సిరంజ్ లను వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించండి.
- తల్లి నుండి బిడ్డకు HIV సంక్రమిస్తుందా?
ప్రశ్న 6.
క్షయకరణ విభజనలో మాతృకణాల కంటే ఏర్పడే పిల్లకణాల్లో క్రోమోసోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఒకవేళ ఇలా జరుగకపోతే ఏమవుతుందో ఊహించి వ్రాయండి.
జవాబు:
- క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడనట్లయితే రెండు కణాల కలయిక వలన కొత్తతరంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది.
- క్రోమోజోముల సంఖ్యలోని మార్పు జీవి లక్షణాలను పూర్తిగా మార్చివేస్తుంది.
- జనకతరంతో పొంతన లేని కొత్తతరం ఏర్పడుతుంది.
- కొత్తతరంలో మనుగడకు తోడ్పడని విపరీత లక్షణాలు ఏర్పడతాయి.
ప్రశ్న 7.
విత్తనరహిత ఫలాలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా అభివృద్ధి చేసిన వాటికి రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
కొన్ని మొక్కలలో అండం క్షయకరణ విభజన జరగకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. ఇవి విత్తనరహిత ఫలాలు.
ఉదా : పుచ్చకాయ, ద్రాక్ష
ప్రశ్న 8.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధులు రాకుండా నీవు తీసుకునే జాగ్రత్తలేవి?
జవాబు:
- తెలియని వ్యక్తులతో లేదా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకపోవడం,
- శృంగారంలో పాల్గొనిన ప్రతిసారి కండోమ్ ఉపయోగించడం.
- రోగులకు సురక్షిత రక్తాన్ని ఎక్కించడం.
- డిస్పోసబుల్ సిరంజిలు మరియు సూదులు ఉపయోగించడం.
- HIV పాజిటివ్ ఉన్న తల్లి, డాక్టరు సలహా మేరకు మాత్రమే పిల్లల్ని కనాలి.
ప్రశ్న 9.
ఇవ్వబడిన పటాన్ని గమనించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
a) ఏ ఏ దశలు పూర్తవటానికి ఒకే సమయం తీసుకుంటాయి?
b) DNA సంశ్లేషణ ఏ దశలో జరుగుతుంది?
జవాబు:
a) ‘G1’ దశ మరియు ‘S’ దశ.
b) ‘S’ దశ
ప్రశ్న 10.
బొమ్మను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) బొమ్మలోని పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల పేర్లను రాయండి.
ii) బొమ్మలో సూచించిన 1, 2 భాగాల పేర్లు రాయండి.
జవాబు:
i) పురుష నిర్మాణాలు : పరాగరేణువులు, పరాగకోశము
స్త్రీ నిర్మాణాలు : కీలాగ్రము, అండాశయం, మరియు అండము.
ii) 1) రక్షక పత్రావళి, 2) ఆకర్షణ పత్రావళి
ప్రశ్న 11.
అప్పారావ్ మరియు రాములమ్మ కొత్తగా పెళ్ళైన నిరక్షరాశ్యులైన జంట. కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి కొరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను కొన్నింటిని వ్రాయుము.
జవాబు:
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్దతులు :
1) కండోమ్స్ 2) డయాఫ్రమ్స్ (క్యాప్స్) 3) కాపర్-టి 4) లూప్ 5) పిల్స్
ప్రశ్న 12.
సమవిభజనలో మధ్యస్థ దశ బొమ్మగీసి, దాని గురించి రాయండి.
జవాబు:
- క్రోమోజోమ్ లు కండే ఫలకము దగ్గరకు కదులుతాయి.
- సెంథీమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి.
ప్రశ్న 13.
అనిషేక జననం ఏ సందర్భంలో జరుగుతుంది? ఈ ప్రక్రియ జరిపే జంతువులకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
ఫలదీకరణము చెందని అండ కణము నుంచి పిల్ల జీవులు నేరుగా ఏర్పడినప్పుడు అనిషేక జననము జరుగును.
ఉదా : 1. తేనెటీగలు, 2. చీమలు, 3. కందిరీగ
ప్రశ్న 14.
వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుందా?
జవాబు:
- వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయం వేరుగా ఉంటుంది.
- కీటకాల జీవితకాలం కొన్ని నెలలలోనే పూర్తి అయితే, ఏనుగు సంతానోత్పత్తికి 360 రోజులు పడుతుంది.
- ఈస్ట్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఒక గంట వ్యవధిలోనే తమ సంఖ్యను విస్తృతంగా పెంచుకుంటాయి.
- పిల్లి, కుక్కలలో గర్భావధికాలం 63 రోజుల ఉండగా, ఆవులో 280 రోజులు, గుర్రంలో 330 రోజులు ఉంటుంది.
- చుంచులలో అతి తక్కువ గర్భావధి 20 రోజులు ఉండగా, మానవునిలో 280 రోజులు ఉంటుంది.
ప్రశ్న 15.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సంయోగబీజాల కలయిక లేకుండా కేవలం ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.
అలైంగిక ప్రత్యుత్పత్తి | ఉదాహరణ |
1. విచ్ఛిత్తి | బాక్టీరియా, పారమీషియం |
2. కోరకీభవనం | ఈస్ట్ |
3. ముక్కలవటం | స్పైరోగైరా శిలీంధ్రం |
4. అనిషేక ఫలాలు | పుచ్చకాయ, ద్రాక్ష |
5. పునరుత్పత్తి | ప్లనేరియా |
ప్రశ్న 16.
విచ్ఛిత్తి గురించి రాయండి.
జవాబు:
విచ్ఛిత్తి (Fission):
పారమీషియం , బాక్టీరియా వంటి ఏకకణ జీవులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి సాధారణంగా ఏకరూపకత కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సౌష్ఠవంగా జరుగుతుంది. పారమీషియం రెండుగా విడిపోవడాన్ని ద్విధావిచ్చిత్తి అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే దానిని బహుధావిచ్చిత్తి అని అంటారు. పారమీషియం పారామీషియంలో విచ్చిత్తి , వంటి జీవులలో తరచుగా ఈ విధానంలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
ప్రశ్న 17.
కోరకీభవనం గురించి రాయండి.
జవాబు:
జనక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతాయి. అది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్‌లో కోరకీభవనం.
ప్రశ్న 18.
ముక్కలగుట గురించి రాయండి.
జవాబు:
కొన్ని జీవులు జనక జీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం చదును పురుగులు, మోల్డులు, లైకేన్లు, స్పెరోగైరా వంటి సరళజీవులలో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది.
ప్రశ్న 19.
విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
ప్రకృతిలో సహజంగా కొన్నిసార్లు అండాలు ఫలదీకరణం చెందకుండానే, అండాశయం ఫలంగా మారుతుంది. ఇటువంటి కాయలో విత్తనాలు ఉండవు. వీటిని అనిషేక ఫలాలు అంటారు.
మానవుడు జిబ్బరెల్లిన్ వంటి ఫైటో హార్మోన్లను చల్లి కృత్రిమంగా అనిషేక ఫలాలు పొందుతున్నాడు.
ఉదా : అరటి, ద్రాక్ష
ప్రశ్న 20.
పార్టినోజెనెసిస్ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా, జరగకపోయినా అండం జీవిగా అభివృద్ధి చెందుతుంది.
- ఈ ప్రక్రియలో ఏకస్థితిక పిల్లజీవులు మగజీవులు గాను, ద్వయస్థితిక అండాల నుండి ఆడజీవులు అభివృద్ధి చెందుతాయి.
- ఫలదీకరణతో ప్రమేయం లేకుండా అండాలు, జీవులుగా వృద్ధి చెందే ప్రక్రియను పార్టినోజెనెసిస్ అంటారు.
ఉదా : తేనెటీగలు, చీమలు, కందిరీగలు
ప్రశ్న 21.
పునరుత్పత్తి అనగానేమి?
జవాబు:
పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులకు తమ శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యం కలదు. ఈ ప్రక్రియను పునరుత్పత్తి అంటారు. దీనిని ‘ముక్కలవటం’ అనే శాఖీయోత్పత్తితో పోల్చవచ్చు.
ఉదా : ప్లనేరియా, వానపాము.
ప్రశ్న 22.
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు :
- ఛేదనం : చెరకు, మందార
- అంటు తొక్కుట : మల్లె, గన్నేరు
- అంటుకట్టుట : గులాబి, మామిడి
ప్రశ్న 23.
ఛేదనం గురించి రాయండి.
జవాబు:
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది. ఆ ఛేదనం చేసిన భాగాన్ని తడి నేలలో నాటాలి. కొద్ది రోజులలో వేర్లు ఏర్పడి, మొగ్గలు పెరిగి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : బంతి, గులాబి
ప్రశ్న 24.
అంటు తొక్కుట గురించి రాయండి.
జవాబు:
అంటు తొక్కుట (Layering) :
మొక్కలో కనీసం ఒక కణపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తరువాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అపుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేయాలి. వేర్లను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది.
ఉదా : మల్లె, గన్నేరు.
ప్రశ్న 25.
సిద్ధబీజాశయ పత్రం అనగానేమి?
జవాబు:
ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ముదిరిన ఆకుల అడుగుభాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను సోరై అంటారు. సోరైలుండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు (Sporophyll) అంటారు.
ప్రశ్న 26.
చేపలు, కప్పలు ఎక్కువ సంఖ్యలో అందాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఎందుకు?
జవాబు:
చాలా వరకు చేపలు, ఉభయచరాలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీ జీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంది. అదే విధంగా పురుష జీవి మిలియన్లలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. కాబట్టి స్త్రీ, పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి.
ప్రశ్న 27.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అనుబంధ గ్రంథులు ఏవి? వాటి పని ఏమిటి?
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులైన పౌరుష గ్రంథి, రెండు కాఫర్ గ్రంథులు కలిసి జిగురు వంటి ఆ స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనిని శుక్రం అంటారు. ఇది శుక్రకణాలకు పోషక పదార్థాలను అందించడంతో పాటు శుక్రకణాల కదలికలకు మాధ్యమంగా కూడా పనిచేస్తుంది.
ప్రశ్న 28.
అండోత్సరం అనగానేమి?
జవాబు:
స్త్రీ బీజకోశ పుటికలలో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుటికలు (Graphian follicles) అంటారు. ఈ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి పుటికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినపుడు, పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం (Ovulation) అంటారు.
ప్రశ్న 29.
ఫలదీకరణ సమయంలో గర్భాశయంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం లేదా సంయుక్త బీజం ప్రవేశించడానికి ముందుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. ఇప్పుడు దీని లోపలి గోడలు మృదువుగా, దళసరిగా మారతాయి. తేమతో కూడిన ద్రవాన్ని స్రవిస్తాయి. రక్త సరఫరా కూడా బాగా మెరుగుపడుతుంది. ఇప్పుడు గర్భాశయం పిండ ప్రతిస్థాపనకు సిద్ధంగా ఉందన్నమాట.
ప్రశ్న 30.
పిండ ప్రతిస్థాపన అనగానేమి?
జవాబు:
ఫలదీకరణ చెందిన అండం గర్భాశయ కుడ్యానికి అంటి పెట్టుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ, రక్షణ, ఆధారం ఇవ్వడానికి వీలుగా వేరు వేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి.
ప్రశ్న 31.
కణజాలవర్ధనం అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.
ప్రశ్న 32.
జరాయువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పరాయువు (Chorion) అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు పరాయువు ఉపరితలం నుండి సన్నని వేళ్ళవంటి నిర్మాణాలు గర్భాశయ మృదుకణజాలంలోనికి పెరుగుతాయి. క్రమేపి గర్భాశయి జ్యంలో పాతుకున్న ఈ వేళ్ళ వంటి నిర్మాణాల చుట్టూ వేగంగా కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం, దీనికి ఆనుకొని ఉన్న గర్భాశయ కణజాలం కలిసి జరాయువు (Placenta) ను ఏర్పరుస్తాయి.
ప్రశ్న 33.
జరాయువు పని ఏమిటి?
జవాబు:
పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భధారణ జరిగిన సుమారు 12 వారాలకు ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితిలో తల్లికి, బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాలు విస్తరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి.
ప్రశ్న 34.
నాభిరజ్జువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
- పిండం యొక్క మరోక త్వచం ఎల్లంటోయిస్ (Allantois) త్వచం పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది.
- సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి.
- ఈ నాళాన్నే నాభిరజ్జువు (Umbellical cord) అంటారు. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్త నాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషకపదార్థాలు అందజేయబడతాయి.
ప్రశ్న 35.
గర్భావధి కాలం అనగానేమి? వివిధ జంతువులలోని గర్భావధికాలం తెలపండి.
జవాబు:
గర్భావధి కాలం :
పిండం పూర్తిగా అభివృద్ధి చెందటానికి పట్టే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. వివిధ జీవులలో సరాసరి గర్భావధి కాలం వేర్వేరుగా ఉంటుంది. పిల్లి, కుక్కలలో గర్భావధి కాలం 63 రోజులు. గుర్రం 330 రోజులు, ఆవు 280 రోజులు. ఎలుకలు మరియు చుంచుల గర్భావధి కాలం 20-22 రోజులు ఉంటుంది.
ప్రశ్న 36.
జనసాంతరం అనగానేమి?
జవాబు:
- ప్రసవం తరువాత శిశువు నుండి జరాయువు వరకు గల నాభిరజువును వైద్యులు కత్తిరించి వేరుచేస్తారు.
- శిశువుతోనున్న నాభిరజువు యొక్క చిన్న భాగం కృశించుకుపోయి కొద్ది రోజులలో ఊడిపోతుంది. ఈ భాగాన్ని నాభి అంటాం.
- శిశుజననం తరవాత గర్భాశయ కండరాల సంకోచం, జరాయువును బయటకు నెట్టేంతవరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే ‘జననాంతరం’ అంటారు.
ప్రశ్న 37.
ప్రథమ స్తన్యం అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
- గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథులలో ప్రోగవుతుంది. దీనినే “ముర్రుపాలు లేదా ప్రథమ స్తన్యం” అంటారు.
- శిశుజననం తరువాత కొన్ని రోజులు స్తన గ్రంథులు ముర్రుపాలనే స్రవిస్తాయి.
- నవజాత శిశువులో వ్యాధినిరోధకత పెంచటానికి ఇవి అత్యావశ్యకం.
ప్రశ్న 38.
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత :
అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి.
ప్రశ్న 39.
పరాగసంపర్కానికి సంబంధించి డార్విన్ పరిశీలన ఏమిటి?
జవాబు:
మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.
ప్రశ్న 40.
విత్తనంలో అంకురచ్ఛదం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
అంకురచ్చదాన్ని ఉపయోగించుకొని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి. కొన్ని మొక్కల బీజదళాలు (ఉదా : చిక్కుడు) అలకు రచ్చదాన్ని పూర్తిగా వినియోగించుకొని విత్తనాలుగా మారతాయి. ఫలితంగా పోషక పదార్థాల నిలువలు పెరగడం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది. మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితోపాటుగా అంకురచ్ఛద కణజాలం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది.
ప్రశ్న 41.
కణవిభజన మీద ‘ఆగస్ట్ వీస్మన్’ ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:
- ఒక జాతి జీవులలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎన్ని తరాలు మారినా నిర్దిష్టంగా, ఒకే విధంగా ఉంటుంది.
- కణ విభజన జరిగినా క్రోమోజోమ్ సంఖ్య స్థిరంగా ఉంటుంది.
ప్రశ్న 42.
లైంగిక వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి?
జవాబు:
లైంగిక వ్యాధులు ఎక్కువగా సురక్షితం కాని లైంగిక కార్యకలాపాల వలన, శుద్ధిచేయని సూదులు మొదలైన ఉపకరణాల వలన, రక్త మార్పిడి వలన ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. కొన్ని సందర్భాలలో తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపిస్తాయి.
ప్రశ్న 43.
ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకొంటున్న చర్యలు ఏమిటి?
జవాబు:
ప్రభుత్వం ART కేంద్రాల ద్వారా (Anti Retroviral Therapy) HIV వ్యాధిగ్రస్తులకు వైద్య సదుపాయాలు కలుగజేస్తోంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాలు AIDS నిర్మూలన కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆశ (ASHA – Accredited Social Health Activist), రెడ్ రిబ్బన్ ఎక్స్ ప్రెస్ మొదలైన కార్యక్రమాల ద్వారా AIDS వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణా చర్యలను తెలుపుతూ అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రశ్న 44.
కుటుంబ నియంత్రణకు చేసే శస్త్రచికిత్సలు ఏమిటి?
జవాబు:
స్త్రీ పురుషులిద్దరికీ కుటుంబ నియంత్రణ (birth control) కోసం శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పురుషులకు చేసే శస్త్రచికిత్సలో శుక్రనాళాన్ని కత్తిరించి నాళం రెండు చివరలను గట్టిగా కట్టి ముడివేస్తారు. అందువల్ల శుక్రకణాలు విడుదల కాకుండా అడ్డగించబడతాయి. ఈ పద్ధతినే వేసెక్టమీ (Vasectomy) అంటారు. స్త్రీలలో అండనాళంలో (Fallopian tubes) చిన్న భాగాన్ని కత్తిరించి, తీసివేసి చివరలను గట్టిగా ముడి వేస్తారు. ఇలా చేయటం ద్వారా అండం, అండనాళంలోనికి వెళ్ళకుండా చేస్తారు. దీనిని ట్యూబెక్టమీ అంటారు.
ప్రశ్న 45.
18 సంవత్సరాలు వయస్సు నిండకుండా అమ్మాయిలకు వివాహం ఎందుకు చేయకూడదు?
జవాబు:
చిన్నతనంలో తల్లి కావడం అనారోగ్యానికి దారితీస్తుంది. శిశువుకు జన్మనివ్వడం అనేది ఒక సంక్లిష్టమైన జీవన ప్రక్రియ. స్త్రీలలో 18 సంవత్సరాలు నిండిన తరువాతే శిశువుకు జన్మనివ్వడానికి శారీరకంగా సిద్ధంగా ఉంటారు. నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు, బాల్యవివాహాలకు ముఖ్యమైన కారణాలు. కుటుంబ సంక్షేమశాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా 21 శాతం మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు. పోషకాహార లోపం కూడా ప్రసవ సమయానికి ముందు, ప్రసవం తరువాత మరణానికి దారితీస్తుంది. కాబట్టి 18 సంవత్సరాల వయస్సు నిండకుండా అమ్మాయిలు వివాహానికి అంగీకరించకూడదు.
ప్రశ్న 46.
ద్విధావిచ్ఛిత్తి ఏ విధంగా బహుధావిచ్చిత్తి కంటే భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ద్విధావిచ్ఛిత్తి | బహుధావిచ్చిత్తి |
1. రెండు పిల్ల జీవులు ఏర్పడతాయి. | 1. ఎక్కువ పిల్ల జీవులు ఏర్పడతాయి. |
2. సౌష్ఠవంగా జరుగుతుంది. | 2. సౌష్ఠవంగా జరగదు. |
3. అనుకూల పరిస్థితులలో జరుగుతుంది. | 3. ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది. |
4. తక్కువ సమయం పడుతుంది. | 4. ఎక్కువ సమయం పడుతుంది. |
ప్రశ్న 47.
ఫలదీకరణ అనగానేమి? అందలి రకాలు తెలపండి.
జవాబు:
ఫలదీకరణ :
స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణ అంటారు. ఇది రెండు రకాలు.
1. బాహ్య ఫలదీకరణ :
శుక్రకణాలు, అండాల కలయిక జంతు శరీరం బయట జరిగితే దానిని “బాహ్య ఫలదీకరణ” అంటారు.
ఉదా : చేప, కప్ప
2. అంతర ఫలదీకరణ :
ఫలదీకరణ స్త్రీ జీవి శరీరంలో జరిగితే దానిని “అంతర ఫలదీకరణ” అంటారు.
ఉదా : పక్షులు, క్షీరదాలు
ప్రశ్న 48.
‘బాల్య వివాహాలను ఒక సాంఘిక దురాచారం’ అని తెలుపుతూ కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
- బాల్య వివాహం చేయటం ఓడిపోనున్న ఆటతో సమానం.
- బాల్య వివాహాలు వద్దు – చదువే ముద్దు.
- బాల్య వివాహాలను అరికట్టండి – బాలికలను ఎదగనీయండి.
- బాలిక అమ్మా అని పిలవాలి – ఆమె అమ్మా అని పిలవబడకూడదు.
- మంచి వివాహాలు నిదానంగా జరుగుతాయి. బాలిక వివాహం పట్ల జాగరూకత ఉండాలి.
- బాల్య వివాహాలు వద్దు – బతుకంతా నరకం చేయవద్దు.
ప్రశ్న 49.
HIV ఎయిడ్స్ వ్యాధి నివారణ తెలుపుతూ 5 నినాదాలు రాయండి.
జవాబు:
- ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.
- ఎయిడ్స్ వ్యాధి నీ కళ్ళను మూయక ముందే వాటిని నీవు తెరువు.
- ఎయిడ్స్ వ్యాధిని అసహ్యించండి… వ్యాధిగ్రస్తులను కాదు.
- విజ్ఞానాన్ని వ్యాప్తి చేయండి…. HIV వైరసన్ను కాదు.
- ఎయిడ్స్ అంటువ్యాధి కాదు …. అంటించుకునే వ్యాధి.
- కండోమ్ ను ధరించు ….. వ్యాధి సంక్రమణను నివారించు.
ప్రశ్న 50.
పైన గీయబడిన మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో A, B, C, D అని సూచించిన భాగముల పేర్లు వ్రాయుము.
జవాబు:
A – ఫాలోపియన్ నాళం (స్త్రీ బీజవాహిక) –
B – అండాశయం, C – గర్భాశయం, D – యోని
ప్రశ్న 51.
కౌమార దశలోని పిల్లలలో ఎటువంటి జీవన నైపుణ్యాలు ఉండవలసిన అవసరముందో వివరించండి.
జవాబు:
- సరియైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యం అనగా సరియైన విధంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం.
- వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం అనగా, స్నేహితులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం.
- సంభాషణ నైపుణ్యం అనగా తమ అభిప్రాయాలను, భయాలను, సందేహాలను నిర్భయంగా వ్యక్తపరచడం.
- సమస్యలను అధిగమించే నైపుణ్యం అనగా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం.
- సమవయస్కుల ఒత్తిళ్ళకు సరియైన రీతిలో స్పందించడం అనగా తోటి వారి వత్తిడులకు లొంగకుండడం.
- మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనగా, స్త్రీలు పురుషుల పట్లను, పురుషులు స్త్రీల పట్లను సరియైన అవగాహనతో మెలగడం.
ప్రశ్న 52.
శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత జరిగే మార్పులు ఏవి?
జవాబు:
- శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తరువాత రెండు కేంద్రకాలు కలవడానికి ముందుగా అండంలో క్షయకరణ విభజన యొక్క రెండవ దశ జరుగుతుంది.
- ఫలదీకరణం తరువాత అండం సంయుక్తబీజం (Zygote) గా మారుతుంది.
- సంయుక్తబీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు సమవిభజనలు చెందడం మొదలవుతుంది.
- గర్భాశయాన్ని చేరే సమయానికి సంయుక్త బీజం కణాల ‘బంతిగా మారుతుంది.
10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
పుష్పంలో అండము నుండి విత్తనము ఏర్పడే విధానములో ఉండే మార్పులను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం విధానం :
- మొక్క జాతిని బట్టి అండాశయంలో ఒకటి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. ప్రతీ అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు మరియు సిద్ధ బీజకణాలను కలిగిన పిండకోశం (embryo sac) ఉంటుంది.
- పిండకోశం 7 కణాలను, 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధ బీజం 4 విభజనల తరువాత 8 కణాల స్థితి లోనికి వస్తుంది.
- 3 కణాలు పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాదకణాలు” (Antipodals) అంటారు. పిండకోశం పూర్వ భాగంలో 3 కణాలుంటాయి. వానిలో రెండు “సహాయ కణాలు” (Synergids), ఒకటి “స్త్రీ బీజకణం” (Egg) ఉంటాయి.
- మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది. “దీనిని ద్వితీయ కేంద్రకం” అంటారు.
- పరాగ రేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం పిండకోశం లోనికి ప్రవేశించగానే, కొనభాగం పగిలిపోయి రెండు పురుష బీజకణాలు పిండకోశంలోనికి విడుదలవుతాయి.
- వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. దీనివల్ల “సంయుక్త బీజం” ఏర్పడుతుంది. మరొక పురుష బీజ కేంద్రకం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలసి “అంకురచ్ఛదం” (Endosperm)ను ఏర్పరుస్తుంది. అలా రెండు సార్లు ఫలదీకరణ జరగటాన్ని “ద్విఫల దీకరణం” (Double fertilization) అంటారు.
- ద్విఫలదీకరణం తరువాత అండంలో త్వరితగతిన జరిగే అనేక మార్పుల కారణంగా, అంకురచ్చదం ఏర్పడటం మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది. పిండంలో ఒకటి లేదా రెండు బీజదళాలు ఏర్పడతాయి.
- అంకురచ్చదంలో నిలువచేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
- ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం పలుమార్లు సమవిభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరుచుకొని విత్తనంగా మారుతుంది.
- అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి.
ప్రశ్న 2.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మొక్క పేరు | వ్యాప్తి చెందే పద్ధతి |
1. మామిడి | అంటుకట్టడం |
2. గులాబి, మందార | ఛేదనం |
3. మల్లె | అంటు తొక్కడం |
4. రణపాల | ఆకు అంచుల నుండి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి |
5. బంగాళదుంప | దుంప |
6. ఉల్లి | లశునం |
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు?
జవాబు:
పట్టికలో సూచించినవి శాఖీయోత్పత్తి విధానాలు.
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడి సంయోగం చెందుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడవు.
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
జవాబు:
బంగాళదుంప మొక్కలు ‘కన్నులు’ అనే శాఖీయోత్పత్తి విధానంలో వ్యాప్తి చెందును.
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
జవాబు:
శాఖీయోత్పత్తిలో మొక్కల నాణ్యత మారదు. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు.
ప్రశ్న 3.
వివిధ మొక్కలలో అవలంభించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు తెలపండి.
జవాబు:
కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు :
a) అంటు తొక్కుట :
మల్లె, జాజి వంటి పుష్ప, మొక్కలు బలహీన కాండాలను కల్గి ఉంటాయి. వీటి బెరడును కొంచెం తొలగించి, భూమిలో పాతిపెట్టి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయు పద్దతిని అంటు తొక్కుట అంటారు.
b) అంటుకట్టుట :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు. ఈ ప్రక్రియలో క్రింది భాగాన్ని (వేరు కల్గిన భాగం) స్టాక్ అని, పైన పెరిగిన భాగాన్ని సయాన్ అని అంటారు.
ఉదా : గులాబి, మామిడి.
c) కణజాల వర్ధనం :
ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. కణజాలాన్ని కాలలో పెంచి మొక్కలుగా పెంచుతారు. ఇది నియంత్రిత పరిస్థితులలో జరుగుతుంది.
ప్రశ్న 4.
క్రింది పటాల ఆధారంగా కణ విభజనలోని వివిధ దశలను గుర్తించి, వివరించండి.
జవాబు:
దశ | వివరణ |
A) ప్రథమదశ | 1. క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది క్రమంగా పొట్టిగా, దళసరిగా మారతాయి. (కాంతి సూక్ష్మదర్శిని కింద కనిపించేలా తయారవుతాయి.) కేంద్రకం చిన్నదవుతుంది. |
2. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి. |
|
3. కేంద్రకత్వచం అంతర్థానమవుతుంది. | |
4. కడ్డీ వంటి సెంట్రియోలను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె పరికరాన్ని ఏర్పరుస్తుంది. (జంతు కణాలలో మాత్రమే సెంట్రియోల్స్ ఉంటాయి. క్షయకరణ విభజన వలె క్రోమోజోమ్ లు జతలుగా ఏర్పడవు.) | |
B) మధ్యస్థదశ | 1. క్రోమోజోమ్ లు కండె. ఫలకం దగ్గరకు కదులుతాయి. సెంట్రోమియర్లు కండె తంతువులకు కలుపబడి ఉంటాయి. |
2. సెంట్రోమియర్ చీలిపోయి రెండు క్రొమాటిడ్లు వేరవుతాయి. | |
C) చలనదశ | 1. సెంట్రోమియర్లను అంటి ఉన్న కండె తంతువులు సంకోచం చెందడం వలన క్రొమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి. |
D) అంత్యదశ | 1. క్రొమాటిద్దు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనబడవు. తిరిగి క్రోమోజోమ్లుగా మారుతున్నాయన్నమాట. |
2. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి. | |
3. కణ త్వచంలో నొక్కు ఏర్పడటం ద్వారా రెండు పిల్ల కేంద్రాలు వేరవుతాయి. (జంతు కణాలలో), అదే మొక్కలలో అయితే కండే పరికరం ప్రాంతంలో కణకవచ పదార్థం లేదా కణఫలకం ఏర్పడటం ద్వారా రెండు కేంద్రకాలు వేరవుతాయి. | |
4. కేంద్రకం రెండుగా విడిపోతుంది. తరువాత సైటోప్లాజమ్ విభజన జరుగుతుంది. రెండు కణాలు ఏర్పడతాయి. |
ప్రశ్న 5.
సమ విభజనలోని వివిధ దశలేవి ? వాటిని సూచించే బొమ్మలు గీసి, ప్రథమ దశలో ఏ మార్పులు జరుగుతాయో వివరించండి.
జవాబు:
1) ప్రథమ దశ 2) మధ్యస్థ దశ 3) చలనదశ 4) అంత్యదశ
ప్రథమదశలో జరిగే మార్పులు :
- క్రోమోజోమ్ లు వికుండలీకరణ చెంది పొట్టిగా మారతాయి. కేంద్రకం చిన్నదవుతుంది.
- ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి.
- కేంద్రక త్వచం అంతర్థానమవుతుంది.
- కడ్డీ వంటి సెంట్రియోల్స్ ను కలిగి ఉన్న సెంట్రోసోమ్ విభజన చెంది కండె ఫలకాన్ని ఏర్పరుస్తుంది.
ప్రశ్న 6.
చక్కని అండాశయం నిర్మాణం పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 7.
పుష్పించే మొక్క జీవిత చరిత్రను తెలిపే పటం గీయండి. బీజ దళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయండి.
జవాబు:
బీజదళాలు మొక్కలో పత్రాలు ఏర్పడే వరకు ఆహారాన్ని అందించటానికి తోడ్పడతాయి.
ప్రశ్న 8.
పటమును పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
ఎ) పుష్పంలోని నాలుగు ప్రధాన భాగములేవి?
బి) పటంలో బీజకణాలను ఉత్పత్తి చేసే నిర్మాణాలేవి?
సి) పరాగ సంపర్కానికి తోడ్పడే భాగాలేవి?
డి) మొగ్గదశలో పుష్పాన్ని రక్షించు నిర్మాణాలేవి?
ఇ) పటంలోని ఏ భాగం భవిష్యత్ లో ఫలంగా మారుతుంది?
జవాబు:
ఎ) 1. రక్షక పత్రావళి, 2. ఆకర్షక పత్రావళి, 3) కేసరావళి, 4) అండకోశం
బి) కేసరావళి, అండకోశం సి) ఆకర్షక పత్రావళి డి)రక్షక పత్రావళి ఇ) అండకోశం
ప్రశ్న 9.
కొన్ని జీవులు అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తిని వివిధ రకాలుగా జరుపుకుంటాయి. క్రింద ఇవ్వబడిన జీవులను మరియు వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని నీవు సేకరించిన సమాచారం ఆధారంగా సరైన విధంగా పట్టికలో నింపండి.
ఉల్లి, స్పెరోగైరా, స్ట్రాబెర్రీ, అల్లం, తేనెటీగలు, పారామీషియం , ప్లనేరియా, ఈస్ట్.
జవాబు:
జీవి పేరు | అది జరిపే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం |
1. ఉల్లి | లశునం |
2. స్పెరోగైరా | ముక్కలగుట |
3. స్ట్రాబెర్రీ | స్టోలన్ |
4. అల్లం | కొమ్ములు |
5. తేనెటీగలు | అనిషేక ఫలనం |
6. పారామీషియం | ద్విధావిచ్ఛిత్తి |
7. ప్లనేరియా | పునరుత్పత్తి |
8. ఈస్ట్ | కోరకీభవనం |
ప్రశ్న 10.
i) పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములు గుర్తించుము.
జవాబు:
ii) పుష్పంలో గల లైంగిక అవయవాలు ఏవి?
ఎ) కేసరావళి బి) అండకోశం
ప్రశ్న 11.
ప్రయోగశాలలో రైజోపస్ యొక్క సిద్ధబీజాశయాలను గమనించుటకు అవలంబించు ప్రయోగ విధానము మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించండి.
(లేదా)
రైజోపసను పరిశీలించుటకు మీరు నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన సామగ్రి మరియు ప్రయోగ విధానమును రాయండి.
జవాబు:
పరికరాలు : సూక్ష్మదర్శిని, బ్రెడ్, ప్లాస్టిక్ సంచి, నీరు సైడ్, కవర్ స్లిప్.
తయారీ విధానం :
- బ్రెడ్ నుగాని, రొట్టెను గాని నియమిత పరిస్థితులలో ఉంచి రైజోపస్ లేదా బూజును పెంచాలి.
- ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి దానిపై నీళ్ళు చల్లాలి. అది తేమను గ్రహిస్తుంది. ఇప్పుడు సంచిలో కొంత గాలి ఉండేలా దారంతో ముడి వేయండి.
- చీకటి మరియు వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. 2-3 రోజుల్లో బూజు పెరగడం మొదలై 1-2 వారాల్లో పూర్తిస్థాయిలో పెరుగుతుంది.
పరిశీలన :
- ఒక గాజు సైడ్ తీసుకొని దానిపై మధ్యలో ఒకచుక్క నీరువేసి పంటి పుల్లతో కొంత బూజు తీసుకొని స్లెడ్ మధ్యలో ఉంచాలి.
- దానిపై కవర్‌తో నీటి బుడగలు లేకుండా అమర్చాలి.
- అధికంగా ఉన్న నీటిని టిష్యూ పేపరుతో తొలగించాలి. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
- రైజోపసను చేతితో ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
జాగ్రత్తలు :
- బూజును పెంచే సంచిని మిగతా ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి.
- రొట్టెను చేతితో పట్టుకుంటే, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రశ్న 12.
మొక్కలలో జరిగే ద్విఫలదీకరణను వివరించండి. దీని తర్వాత ఏర్పడే అంకురచ్ఛదం ఉపయోగాలను వివరించండి.
జవాబు:
ద్విఫలదీకరణం :
పుష్పించే మొక్కలలో పరాగరేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగ నాళం పిండకోశంలోనికి ప్రవేశించగానే కొన భాగం పగిలిపోయి రెండు పురుషబీజకణాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. వాటిలో ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. మరొక పురుషబీజ కణం పిండకోశం మధ్యలోనున్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదం ఏర్పరుస్తుంది ఇలా ఫలదీకరణం రెండు సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు.
- అంకురచ్ఛదాన్ని ఉపయోగించుకుని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి.
- అంకురచ్ఛదంలో నిలువ చేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి.
- కొన్ని మొక్కల బీజదళాలు అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకుని విత్తనాలుగా మారుతాయి.
- పోషక పదార్థాల నిలువలు పెరగటం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది.
ప్రశ్న 13.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధాణాలు రాయండి.
i) స్త్రీ సంయోగ బీజాన్ని ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి?
జవాబు:
స్త్రీ బీజకోశము (అండాశయము)
ii) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
స్త్రీ బీజవాహిక (ఫాలోపియన్ నాళము)
iii) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండము అభివృద్ధి చెందు ప్రాంతం ఏమిటి?
జవాబు:
గర్భాశయము
iv) కొన్ని సందర్భాలలో వైద్యులు ఫాలోఫియన్ నాళాన్ని కత్తిరించి ముడి వేస్తారు. ఈ ఆపరేషన్ పేరు ఏమిటి ?
జవాబు:
ట్యూబెక్టమీ
ప్రశ్న 14.
మొక్కలలో జరిగే కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి.
జవాబు:
1. కృత్రిమ శాఖీయ విధానాలు
i) ఛేదనం ii) అంటు తొక్కుట iii) అంటుకట్టుట
2. i) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్కభాగాన్ని వేరు చేసినపుడు ఆ ఛేదన భాగం నుండి క్రొత్త మొక్క పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార
3. ii) అంటుతొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగివున్న శాఖను నేలవైస వంచి నా ప ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కప్పివుంచిన భాగం నుంచి కొత్తవేరు అని
కొమ్మను జనక మొక్క నుండి వేరుచేయాలి. ఉదా : మల్లె, గన్నేరు.
4. iii) అంటుకట్టుట :
రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి, ఒక మొక్కగా పెరుగుతాయి. నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్కనుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అనీ అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి, పురివున్న దారంతో కట్టాలి.
ఉదా : ఆపిల్, మామిడి
ప్రశ్న 15.
కింది ఇచ్చిన సమాచారాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రతి జీవిలో రెండు రకాల కణ విభజనలు జరుగుతాయి. సమ విభజనలో క్రోమోజోమ్ సంఖ్య (20) లో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి (1) కు తగ్గుతుంది, అని వీసమన్ ఎరికల్పన చేశాడు.
i) ‘n’ మరియు ‘2n’ అనేవి వేటిని సూచిస్తాయి?
జవాబు:
‘n’ ఏకస్థితికమును, ‘2n’ ద్వయ స్థితికమును సూచిస్తాయి.
ii) క్షయకరణ విభజన ఏ కణాలలో జరుగుతుంది?
జవాబు:
లైంగిక కణాలలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన జరుగుతుంది.
iii) క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే క్రోమోజోముల సంఖ్య తరువాత తరాలలో స్థిరంగా వుండదు.
iv) చర్మ కణాలు ఏ రకం అయిన కణవిభజనను జరుపుతాయి?
జవాబు:
చర్మ కణాలు సమవిభజనను జరుపుతాయి.
ప్రశ్న 16.
తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు పొందుటకు రెండు సహజ మరియు రెండు కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులను ఉదాహరణలతో తెలుపండి.
జవాబు:
I. సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
ఉదా : రణపాల
2) కాండాలు:
1) స్టోలన్స్ : ఉదా : మల్లె, స్ట్రాబెర్రీ,
2) లశునాలు : ఉదా : ఉల్లి,
3) కొమ్ములు : ఉదా : పసుపు, అల్లం,
4) దుంపలు : ఉదా : బంగాళాదుంప
3) వేర్లు : ఉదా : డాలియా, ముల్లంగి, క్యారెట్
II. కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి :
1) ఛేదనం :
జనక మొక్క నుండి కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరుచేసినపుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్కగా పెరుగుతుంది.
ఉదా : గులాబి, మందార,
2) అంటు తొక్కుట :
మొక్కలో కనీసం ఒక కణుపు అయినా కలిగి వున్న శాఖను నేలవైపు వంచి, కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేట్లుగా మట్టితో కప్పాలి. కొద్దికాలం తర్వాత ఈ కప్పి వుంచిన భాగం నుండి కొత్తవేర్లు ఉత్పత్తి అవుతాయి.
ఉదా : మల్లె, గన్నేరు.
3) అంటు కట్టుట:
i) రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కల్సిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి.
ii) నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు.
iii)’స్టాక్’, ‘సయాన్’ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి దారంతో కట్టాలి. ఉదా : మామిడి, నిమ్మ, ఆపిల్, గులాబి.
ప్రశ్న 17.
కింద నటికను పరిశీలించండి.
ప్రత్యుత్పత్తి విధానం | జీవులు |
విచ్చిత్తి | పారామీషియం, బాక్టీరియా |
కోరకీభవనం | ఈస్ట్, హైడ్రా |
ముక్కలగుట | స్పెరోగైరా, బద్దె పురుగులు |
కొమ్ములు | పసుపు, అల్లం |
ఛేదనం | గులాబి, మందార |
అంటుకట్టుట | నిమ్మ, ఆపిల్ |
పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(i) పై పట్టికలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే రెండు జీవుల పేర్లు రాయండి.
(ii) సై పట్టికలో సూచించిన వాటిలో రెండు కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలను రాయండి.
(iii) పై వాటిలో సహజ శాఖీయ వ్యాప్తి జరిపే రెండు మొక్కల పేర్లు రాయండి.
(iv) విచ్ఛిత్తి ద్వారా ఒక జీవి నుండి ఎన్ని జీవులు ఏర్పడతాయి?
జవాబు:
1. పారామీషియం, బాక్టీరియా, ఈస్ట్, హైడ్రా
2. (ఎ) ఛేదనము (బి) అంటుకట్టుట
3. (ఎ) పసుపు (బి) అల్లం
4. విచ్చిత్తి – ద్విదా విచ్చిత్తి – రెండు జీవులు ఏర్పడతాయి.
(లేదా)
విచ్ఛిత్తి – బహుదా విచ్ఛిత్తి – రెండు కంటే ఎక్కువ జీవులు ఏర్పడతాయి.
ప్రశ్న 18.
మొక్కలలోని సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలపండి.
జవాబు:
సహజమైన శాఖీయ ప్రత్యుత్పత్తి :
పత్రాలు :
రణపాల వంటి మొక్కలలో ఆకుల అంచుల వెంబడి చిన్న చిన్న మొక్కలు పెరుగుతాయి.
కాందాలు :
రన్నర్లు, సోలన్ల వంటి బలహీన వాయుగత కాండాలు నేలను తాకినట్లయితే అక్కడ నుండి పీచు వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ జనక మొక్క నుండి ఈ భాగం విడిపోయినట్లయితే కొత్తగా ఏర్పడిన వేర్ల సహాయంతో కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాండం ద్వారా జరిపే మొక్కలకు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.
స్టోలన్లు – వాలిస్ నేరియా, స్ట్రాబెర్రీ, లశునాలు – ఉల్లి; కొమ్ములు – పసుపు; దుంప – బంగాళదుంప.
వేర్లు :
దాలియా, ముల్లంగి, క్యారట్ మొదలగు వాటిపై పెరిగే చిన్నచిన్న మొగ్గలు, పత్రాలు కలిగిన కాండ భాగాలుగా పెరుగుతాయి.
ప్రశ్న 19.
అంటుకట్టుట గురించి రాయండి.
జవాబు:
అంటుకట్టుట (Grafting) :
వేరు వేరు మొక్క భాగాలను జోడించి, కలిపి ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను అంటుకట్టుట అంటారు.
ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినపుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను ‘స్టాక్’ అని, వేరే మొక్క నుండి వేరుచేయబడిన వేర్లు లేని భాగాన్ని ‘సయాన్’ అని అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథీన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు.
ప్రశ్న 20.
సిద్ధబీజాల గురించి రాయండి.
జవాబు:
- శిలీంధ్రాలలో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
- శిలీంధ్రాలలో సిద్ధబీజాలు ఏర్పడే పద్ధతిని స్పోరులేషన్ అంటారు.
- సిద్ధబీజము ఒక సూక్ష్మమైన, ఏకకణ ప్రత్యుత్పత్తి చేసే ప్రమాణం.
- శిలీంధ్రాలలో సిద్ధబీజములు సిద్ధబీజాశయము అనే ప్రత్యేకమైన నిర్మాణంలో ఏర్పడతాయి.
- సిద్ధబీజాశయములోని కేంద్రకము అనేక సార్లు సమవిభజన చెంది, అనేక సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది.
- సిద్ధబీజాలు అనుకూల పరిస్థితులలో అంకురించి పెక్కు తంతువులతో ఒక పెద్ద జీవిగా ఏర్పడతాయి.
ప్రశ్న 21.
మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ :
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రెండు ముష్కాలు బాహ్యంగా ఉండే సంచిలాంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. దీనినే ముష్కగోణి అంటారు. ముష్కాలలో అధిక సంఖ్యలో మిలియన్ల కొద్దీ పురుష బీజకణాలైన శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను తెలుసుకోవడానికి మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటంను పరిశీలించండి. ప్రతీ ముష్కంలో చాలా లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో బాగా మెలితిరిగి చిన్న చిన్న నాళికలు ఉంటాయి. వీటిని శుక్రోత్పాదక నాళికలు అంటారు. ఇవి దాదాపు 80 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. శుక్రనాళికలు శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలను సేకరిస్తాయి. శుక్రనాళికలన్నీ కలిసి ఎపిడిడిమిసను ఏర్పరుస్తాయి. ఇక్కడ శుక్ర కణాలు తాత్కాలికంగా నిలువ ఉంటాయి. ఇక్కడి నుండి శుక్రనాళం ద్వారా ప్రసేకంలోనికి, అక్కడి నుండి శరీరం వెలుపలికి వెలువడుతాయి.
ప్రశ్న 22.
మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
- స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలుంటాయి. ఇవి ఉదరకుహరంలో మూత్రపిండాలకు దిగువగా ఉంటాయి.
- ఒక్కొక్క అండకోశంలో అనేక సంచీల్లాంటి నిర్మాణాలున్నాయి. వీటిని స్త్రీ బీజకోశ పుటికలు లేక గ్రాఫియన్ పుటికలు అంటారు.
- ప్రతి పుటికలోనూ పెద్దగా ఉండే ఒక అండము ఉంటుంది.
- పుటిక నుండి విడుదలయిన అండము ఫాలోపియన్ నాళములోనికి ప్రవేశిస్తుంది.
- ఈ నాళం పుర్వాంతము వేళ్ళలాంటి అనేక నిర్మాణాలను కలిగి ఉంటుంది.
- దీనికి శైలికలు కూడా ఉంటాయి. ఇవి అండము ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయంలోకి కదలడానికి తోడ్పడుతాయి.
- గర్భాశయము దృఢంగా కండరయుతంగా ఉండే కోశము వంటి నిర్మాణము.
- ఇది యోని అను కండరయుత నాళంలోకి తెరచుకొని ఉంటుంది.
ప్రశ్న 23.
పిండాన్ని చుట్టి ఉంచు పొరలు ఏమిటి?
జవాబు:
- పెరుగుతున్న పిండము తన చుట్టూ రెండు పొరలను ఏర్పరుచు కుంటుంది.
- అవి 1) పరాయువు 2) ఉల్బం
- పరాయువు గర్భాశయ గోడతో సంబంధం ఏర్పరుచుకొని, పిండానికి ఉల్బం పోషక పదార్థాలను అందజేయటంలోనూ, పిండము నుండి విసర్జక పదార్థాలను తీసివేయటంలోనూ సహాయపడుతుంది.
- ఉల్బము పిండము చుట్టూ ఉండే ఒక సంచి వంటి నిర్మాణము.
- ఇందులో ఉల్బక ద్రవముంటుంది. ఇది పిండమును యాంత్రిక అఘాతముల నుండి రక్షిస్తుంది.
- మరొక త్వచం ఎల్లంటోయిస్ పిండం యొక్క ఆహార నాళం నుండి ఉద్భవిస్తుంది.
- సొన సంచి, ఉల్బపు ముడతల అంచులు, ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిసే నాళాన్ని ఏర్పరుస్తుంది.
- ఈ నాళాన్ని నాభిరజువు (Umbellical cord) అంటారు.
ప్రశ్న 24.
శిశు జనన ప్రక్రియను వివరించండి.
జవాబు:
- శిశుజననం, గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటినొప్పులు అని భావిస్తాం.
- ముందుగా గర్భాశయ కండర సంకోచ సడలికలు శిశువును స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకుల్య అయిన యోని వైపునకు నెమ్మదిగా నెట్టుటకు సరిపడేంత బలాన్ని కలిగిస్తాయి.
- ఈ దశలో శిశువును ఆవరించియున్న ఉల్బం పగిలి అందులోని ద్రవ పదార్థాలు బయటకు విడుదలవుతాయి.
- ప్రసవం సరియైన విధానంలో జరుగుతోంది. అనడానికి ఇది ఒక సరయిన సంకేతం.
- అప్పుడు గర్భాశయ కండరాల సంకోచాలు బలంగా, అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువును బాహ్య ప్రపంచంలోనికి నెట్టబడుతుంది.
ప్రశ్న 25.
శిశు జననానికి ముందు గర్భాశయంలో కలిగే మార్పులు ఏమిటి?
జవాబు:
- గర్భావధి కాలం గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్న పిండం పెరిగి రూపుదాల్చుకుంటుంది.
- భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది.
- సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు, గర్భావధి కాలం చివరి దశలో తల భాగం కిందివైపునకు గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది.
- సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది.
- కొన్ని సమయాలలో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రసవం చాలా కష్టం.
- శిశు జననం లేదా పురిటి నొప్పులు ఎలా వస్తాయన్నది. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. దీనిని ఒక సంక్లిష్టమైన దృగ్విషయంగా భావిస్తారు.
ప్రశ్న 26.
పుష్ప నిర్మాణం వర్ణించండి.
జవాబు:
పుష్పమునకు గల కాడను పుష్పవృంతం అంటారు. దీని చివరి భాగం ఉబ్బి ఉంటుంది. దీనిని పుష్పాసనం అంటారు. దీనిపై సాధారణంగా (1) రక్షక పత్రాలు (2) ఆకర్షక పత్రాలు (3) కేసరావళి (4) అండకోశము అను పుష్పభాగాలు వివిధ వలయాలలో అమరి ఉంటాయి.
1) రక్షక పత్రములు :
ఇవి మొదటి వలయంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఇవి మొగ్గదశలో, పుష్పం లోపలి భాగాలను కప్పి ఉండి రక్షణనిస్తాయి.
2) ఆకర్షక పత్రములు :
ఇవి పుష్పం యొక్క రెండవ వలయంలో వివిధ వర్ణములను, సువాసనను కలిగి, కీటకాలను పరాగ సంపర్కం కోసం ఆకర్షించటానికి సహాయపడతాయి.
3) కేసరావళి :
ఇవి పుష్ప మూడవ వలయంలో ఉంటాయి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. కేసరావళి, కేసరదండము, పరాగకోశము అను భాగాలను కలిగి ఉంటుంది. పరాగకోశాలలో పరాగరేణువులు తయారవుతాయి.
4) అండకోశము :
ఇవి పుష్పాసనం నాల్గవ వలయంలో ఉండే భాగము. ఇది అండాశయము, కీలము, కీలాగ్రము అను భాగాలను కలిగి ఉంటుంది. అండాశయములో అండములు ఉంటాయి. ఇవి అండాశయంలో అండన్యాస స్థానం వద్ద అమరి ఉంటాయి.
ప్రశ్న 27.
అండం యొక్క నిర్మాణం వర్ణించండి.
జవాబు:
- స్త్రీ సంయోగబీజాన్ని అండం అంటారు.
- అండాశయములోని అండన్యాస స్థానమునందు అండములు అండ వృంతము ద్వారా చేర్చబడి ఉంటాయి.
- అండములోని కణజాలాన్ని, అండాంత కణజాలము అంటారు. అండము రెండు పొరలచే లేక అండ కవచములచే కప్పబడి ఉంటుంది.
- ఈ రెండు కవచాలు అండాన్ని పూర్తిగా కప్పకుండా ఒక చిన్న రంధ్రాన్ని వదులుతాయి. దాన్ని అండ ద్వారము అంటారు.
- అండం క్రింద భాగములో రెండు కవచములు ప్రారంభమయ్యే స్థలాన్ని ఛలాజా అని పిలుస్తారు.
- అండాంత కణజాలము నుండి ఒక కణము స్థూల సిద్ధబీజ మాతృకణముగా విభేదనము చెందుతుంది. ఇది ద్వయక స్థితిలో (2n) ఉంటుంది.
- క్షయకరణ విభజన ద్వారా ఈ మాతృకణము నాలుగు సూలసిద్ధ బీజాలను ఇస్తుంది. వీటిలో ఒకటి మాత్రమే పిండకోశముగా అభివృద్ధి చెందుతుంది.
- ఇది ఏక స్థితిదశలో ఉంటుంది. దీనిని స్త్రీ సంయోగ బీజదము అని అంటారు.
ప్రశ్న 29.
ఫలదీకరణ తరువాత పుష్పంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
ఫలదీకరణము తరువాత పుష్పభాగాలలో అనేక మార్పులు వస్తాయి.
- అండాశయము ఫలముగాను, అండము విత్తనముగాను మారుతుంది.
- అండము యొక్క రెండు కవచములు విత్తనములపై కవచంగాను, లోకవచంగాను మారుతాయి.
- అండకోశపు కీలము, కీలాగ్రము రాలి పోతాయి.
- కొన్ని సందర్భాలలో రక్షణ పత్రాలు పొడిగా అయి ఫలదీకరణం తరువాత ఉండిపోతాయి.
- పుష్పములో కేసరాలు, ఆకర్షణ పత్రావళి కూడా పడిపోతాయి.
ప్రశ్న 30.
ద్విఫలదీకరణ అనగా నేమి?
జవాబు:
- జంతువులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది.
- మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్ఛదం ఏర్పడతాయి.
- పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి.
- ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి.
- ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి అండాన్ని చేరుతుంది.
- రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది.
- ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్ధాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.
ప్రశ్న 31.
కణవిభజన చరిత్ర గురించి తెలపండి.
జవాబు:
- కణాలు అంతకు ముందు ఉన్న కణాల నుండే ఉత్పన్నమవుతాయని “విర్చోవ్” మొదట ప్రతిపాదించాడు.
- 1852 లో “రాబర్ట్ రెమెక్” కణవిభజన గురించి పరిశోధన జరిపాడు.
- “వాల్టర్ ఫ్లెమింగ్” 1879లో, కణవిభజన సమయంలో కణ కేంద్రకంలో దారపుపోగుల వంటి నిర్మాణాలు నిలువుగా చీలుతాయని పరిశీలించాడు.
- “విల్ హెల్మ్ రాక్స్” ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైన విభిన్నమైన అంశాలను కలిగి ఉంటుందని తెలిపాడు.
- “గ్రెగర్ మెండల్” బఠాని మొక్కలో పరిశోధనలు జరిపి, అనువంశికతా సూత్రాలను తెలిపాడు.
- “వాట్సన్ మరియు క్రిక్”లు క్రోమోజోమ్స్ DNA తో నిర్మితమవుతాయని DNA ద్వికుండలి నిర్మాణం కలిగిఉంటుందని నిరూపించారు.
ప్రశ్న 32.
కణచక్రంలోని దశలు తెలపండి.
జవాబు:
సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన (mitosis) అంటాము. అది 40 నుంచి 60 నిమిషాలల్లోనే పూర్తవుతుంది. (సరిగ్గా విభజనకై తీసుకొనే సమయం), రెండు కణ విభజనలకు మధ్య నుండే సమయాన్ని అంతర్దశ (interphase) అంటారు. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు.
G1 దశ : ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది.
S దశ : ఇది DNA సంశ్లేషణ జరిగే దశ. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి.
G2 దశ : ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్యగల దశ. కణాంగాలు విభజన చెందుతాయి. క్రోమోజోమ్లు సమవిభజనకు సిద్ధమవుతాయి.
M దశ : ఇది సమవిభజన జరిగే దశ.
ప్రశ్న 33.
కణ విభజనలోని దశలను వర్ణించండి.
జవాబు:
ప్రశ్న 34.
క్షయకరణ విభజన గురించి రాయండి.
జవాబు:
క్షయకరణ విభజన (Meosis) :
- శరీర కణాలన్నింటిలో సాధారణంగా జరిగే సమ విభజన వలె కాకుండా క్షయకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడేటప్పుడే జరుగుతుంది.
- క్షయకరణ విభజన రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశ క్షయకరణ విభజన మాతృకణాలలో జరుగుతుంది. (రెండు జతల క్రోమోజోమ్లుంటాయి.)
- రెండుసార్లు విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ విభజన మాత్రం ఒకేసారి జరుగుతుంది.
- రెండవ దశ సాధారణ సమవిభజన మాదిరిగా ఉంటుంది.
- క్రోమోజోమ్ విభజన జరగదు. కాబట్టి పిల్లకణాలకు క్రోమోజోమ్లు సమానంగా పంచబడతాయి. అందువల్ల నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
- కానీ మాతృకణాల కంటే సగం క్రోమోజోమ్ లనే కలిగి ఉంటాయి. కనుక వీటినే ఏకస్థితికాలు (ఒకే జత క్రోమోజోమ్ లు ఉంటాయి) అంటారు.
- ఈ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. కనుక ఈ విభజనను క్షయకరణ విభజన (Reduction division) అంటారు.
ప్రశ్న 35.
మన రాష్ట్రంలో AIDS విస్తరణ గురించి రాయండి.
జవాబు:
దురదృష్టవశాత్తు మన రాష్ట్రం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. 2011-12 సం|| ప్రభుత్వ గణాంకాల ప్రకారం 24 లక్షలకు పైగా HIV పాజిటివ్ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత స్థానంలో కర్ణాటక, మహారాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 300 మందిలో ఒకరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర జనాభాలో పురుషులలో 1.07 శాతం, స్త్రీలలో 0.73 శాతం మంది HIV కి గురువుతున్నారు. ఇదికూడా ఇతర రాష్ట్రాలకన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న వారిలో ముఖ్యంగా 15-49 సంవత్సరాల వయసుల సమూహంలో 0.09 శాతం ఉండగా గర్భిణీలో 1.22 శాతం మంది ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
నిరక్షరాస్యత, అనారోగ్యం , నిరుద్యోగం, వలసలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు పాటించకపోవడం, విచ్చలవిడితనం, వ్యభిచారం మొదలైనవి HIV ప్రబలడానికి కారణం అవుతున్నాయి.
ప్రశ్న 36.
గర్భనిరోధం అనగానేమి? కొన్ని గర్భనిరోధ పద్దతులు సూచించంది.
జవాబు:
స్త్రీ గర్భం ధరించకుండా ఉండటం కోసం ఫలదీకరణం జరగకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవడాన్ని గర్భనిరోధం (Contraception) అంటారు. ఏదేని ఉపకరణం లేదా రసాయనం (మందులు) ఉపయోగించి స్త్రీలలో గర్భధారణను అడ్డుకుంటే దానినే గర్భనిరోధక సాధనం (Contraceptive) అంటారు.
ప్రస్తుతం గర్భనిరోధక విధానాలెన్నో అందుబాటులో ఉన్నాయి. భౌతికపరమైన ఉపకరణాలుగా కండోమ్ లు మరియు డయాఫ్రము (Cap) మొదలైనవి ఉపయోగించవచ్చు. ఇలా కేవలం ఫలదీకరణ ప్రక్రియనే కాకుండా లైంగిక అంటువ్యాధులు (Sexally Transmitted Diseases (STD) వ్యాపించకుండా కూడా అరికట్టడంలో ఉపయోగపడతాయి.
ఇవి కాకుండా ఇతర గర్భనిరోధక మార్గాలేవీ కూడా లైంగిక వ్యాధుల వ్యాప్తిని నిరోధించలేవు. నోటి ద్వారా తీసుకొనే మాత్రలు లేదా స్త్రీ లైంగిక అవయవాలలో ఉంచే మాత్రలలోని రసాయనాలు లేదా హార్మోన్లు అండాశయాలు అండాన్ని విడుదల చేయకుండా ఫలదీకరణం జరగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో పురుషుల కోసం కూడా ఇలాంటి మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. ఆ మాత్రల వలన శుక్రకణాలు చనిపోతాయి. కనుకనే వీటిని శుక్రకణనాశినులు లేదా స్పెర్మిసైడ్స్ (Spermicides) అని అంటారు.
గర్భాశయ ద్వారంలో అమర్చడానికి వీలైన కాపర్ – T, లూప్ మొదలైనవి ఎంతో ప్రభావవంతమైన గర్భనిరోధక సాధనాలుగా ఉపయోగపడతాయి. అవాంఛిత గర్భధారణ కాకుండా గర్భనిరోధక సాధనంగా కాపర్ – T ని ఉపయోగిస్తే అది గర్భాన్ని రాకుండా నిరోధించవచ్చు. కానీ, భాగస్వామికి ఒకవేళ ఏదేని లైంగిక అంటువ్యాధి ఉంటే దానిని ఆపలేదు.
ప్రశ్న 37.
భ్రూణహత్యలు అనగానేమి? దానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
గర్భస్థ శిశువులను గర్భవిచ్ఛిత్తి ద్వారా చంపటాన్ని భ్రూణహత్యలు అంటారు. ఇది ప్రధానంగా లింగవివక్ష ఆధారంగా జరగటం బాధాకరవిషయం.
కారణాలు :
- సమాజంలో ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఉండటం.
- ఆడపిల్లల పెంపకం, కట్నకానుకలు, వ్యయభరితంగా మారటం.
- సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం.
- గర్భధారణపై అవగాహన లేక అవాంఛిత గర్భం దాల్చటం.
- నైతిక విలువలు లేక పెళ్ళికి ముందు గర్భం దాల్చటం వంటి కారణాలు భ్రూణహత్యలకు కారణమవుతున్నాయి.
ప్రశ్న 38.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) పటంలో చూపబడిన వ్యవస్థ ఏ జీవక్రియను నిర్వహిస్తుంది?
b) పురుష సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) వేసక్టమి ఆపరేషన్లో ఏ భాగాన్ని కత్తిరిస్తారు?
d) ముష్కాలు వేనిలో అమరి ఉంటాయి?
e) పటంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన వ్యవస్థ ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తుంది.
b) పురుష సంయోగబీజాలు ముష్కాలలో ఉత్పత్తి అవుతాయి.
c) వేసక్టమి ఆపరేషన్లో శుక్రవాహికలను కత్తిరిస్తారు.
d) ముష్కాలు ముష్కగోణులలో అమరి ఉంటాయి. –
e) ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగము ‘మూత్రాశయం’.
ప్రశ్న 39.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) శుక్ర కణంలోని మూడు ప్రదానభాగాలు ఏమిటి?
b) శుక్రకణం చలనానికి తోడ్పడు నిర్మాణం ఏమిటి?
c) శుక్రకణ చలనానికి శక్తిని అందించే మైటోకాండ్రియాలు ఏ భాగంలో ఉంటాయి?
d) ఆక్రోసోమ్ ప్రయోజనం ఏమిటి?
e) మానవ శుక్రకణ కేంద్రకంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి?
జవాబు:
a) శుక్ర కణంలో 1) తల 2) మధ్యభాగం 3) తోక అనే మూడు భాగాలు ఉంటాయి.
b) శుక్రకణ చలనానికి తోక ఉపయోగపడును.
c) మైటోకాండ్రియాలు మధ్యభాగంలో ఉంటాయి.
d) ఎక్రోసోమ్ అండంలోనికి చొచ్చుకుపోవటానికి తోడ్పడుతుంది.
e) శుక్రకణంలో 23 క్రోమోజోమ్లు ఉంటాయి.
ప్రశ్న 40.
ప్రక్కపటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) పటంలో చూపబడిన కండరయుత సంచి వంటి నిర్మాణం ఏమిటి?
b) స్త్రీ సంయోగబీజాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
c) ట్యూబెక్టమీలో కత్తిరించబడే భాగాలు ఏమిటి?
d) మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
e) గర్భాశయ గ్రీవం ఏ భాగంలోనికి తెరుచుకొంటుంది?
జవాబు:
a) స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కండరయుత సంచి వంట నిర్మాణం గర్భాశయం.
b) స్త్రీ సంయోగబీజాలు స్త్రీ బీజకోశంలో ఉత్పత్తి అవుతాయి.
c)ట్యూబెక్టమీలో ఫాలోపియన్ నాళాలు కత్తిరించబడతాయి.
d) మానవునిలో ఫలదీకరణ ఫాలోపియన్ నాళాలలో జరుగును.
e) గర్భాశయ గ్రీవం యోనిలోనికి తెరుచుకొంటుంది.
ప్రశ్న 41.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
a) పటంలో చూపబడిన భాగము ఏమిటి?
b) ఈ నిర్మాణంలో ఎన్ని కణాలు ఎన్ని గుంపులుగా ఉంటాయి?
c) ఈ నిర్మాణంలో ద్వయ స్థితిక కణము ఏమిటి?
d) పై వైపున ఉన్న మూడు కణాలను ఏమంటారు?
e) సీబీజ కణం మొక్క స్థానం ఏమిటి?
జవాబు:
a) పటములో చూపబడిన నిర్మాణాన్ని ‘పిండకోశం’ అంటారు.
b) పిండకోశంలో ఏడు కణాలు మూడు గుంపులుగా ఉంటాయి.
c) ద్వితీయ కేంద్రకం ద్వయస్థితిక దశలో ఉంటుంది.
d) పై వైపున ఉన్న మూడు కణాలను ప్రాతిపదిక కణాలు అంటారు.
e) క్రింద ఉన్న మూడు కణాలలో మధ్యకణం స్త్రీ బీజకణము.
ప్రశ్న 42.
అంటుకట్టడం ద్వారా ఏ ఏ మొక్కలను పెంచుతారో మీ గ్రామంలోని తోట యజమానిని అడిగి తెల్సుకోవడానికి ప్రశ్నల జాబితా రాయండి. తెలుసుకున్న సమాచారాన్ని నమోదు చేయడానికి నమూనా పట్టిక రాయండి.
జవాబు:
- అంటుకట్టడం అనగానేమి?
- అంటుకట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?
- అంటుకట్టడం వలన వ్యాప్తి చెందించబడే మొక్కలు ఏవి?
- అంటుకట్టడం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొక్కలు వ్యాధులను తట్టుకొని నిలబడగలుగుతాయా?
- అంటుకట్టడం ద్వారా కొత్త మొక్క రావడానికి ఎంత సమయం అవసరం అవుతుంది?
- వాంఛిత లక్షణాలు కలిగిన మొక్కలను అంటుకట్టడం ద్వారా పొందవచ్చా?
- అంటుకట్టడంలో నేల యందు గల మొక్క భాగాన్ని ఏమంటారు?
- అంటుకట్టడంలో నేలయందున్న మొక్క భాగానికి జతకట్టబడిన భాగాన్ని ఏమంటారు?
ప్రశ్న 43.
పుష్పించే మొక్క జీవితచక్రం పటం గీచి, భాగాలు గుర్తించండి. మొక్క జీవితచక్రంలో ఏకస్థితిక నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
మొక్క జీవిత చక్రంలో సంయోగబీజాలు (అండాలు, పరాగ రేణువులు) ఏకస్థితికంలో ఉంటాయి.
ప్రశ్న 44.
ఆరోగ్యం – పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కలిగించడానికి నీవు చేపట్టే కార్యక్రమాలు ఏమిటి?
జవాబు:
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భముగా ఆరోగ్య సదస్సులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహింపచేస్తాను.
- సామూహిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమములు ఏర్పాటు చేయుటలో వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తాను.
- క్రిమిరహిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికి మాత్రలు సరఫరా అయ్యే విధంగా చూస్తాను.
- వ్యక్తిగత పరిశుభ్రత – ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులచే సెమినార్లు నిర్వహిస్తాను.
- చిన్న కుటుంబము యొక్క ఆవశ్యకతను వివరిస్తాను. కుటుంబ నియంత్రణను పాటించే విధంగా గ్రామస్తులను ప్రోత్సహిస్తాను.
- కరపత్రాలను ముద్రించి పంచుట ద్వారా సంతులిత ఆహారము యొక్క ప్రాధాన్యతను, తీసుకోవలసిన అవసరాన్ని తెలుపుతాను.
- మల మూత్రవిసర్జన తరువాత కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవలసిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాను.
- నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు వయోజన పాఠశాలలు నెలకొల్పే విధంగా ప్రోత్సహిస్తాను.
ప్రశ్న 45.
మానవ శుక్రకణ నిర్మాణాన్ని పటసహాయమున వర్ణించండి.
జవాబు:
శుక్రకణము :
- శుక్రకణానికి ఏక్రోజోమ్ మరియు కేంద్రకము కలిగిన తల ఉంటుంది.
- శుక్రకణం అండములోనికి ప్రవేశించటానికి ఏక్రోజోమ్ తోడ్పడుతుంది.
- మధ్యలో ఉండే పురుష కేంద్రకం, స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది.
- శుక్రకణం తల, మధ్యభాగం మెడతో కలుపబడతాయి.
- మధ్యభాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలటానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.
- తోక శుక్రకణం ముందుకు కదలటానికి తోడ్పడుతుంది.
10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers
ఫ్లో చార్టులు
1.
జవాబు:
మొగ్గ తొడగటం
2.
జవాబు:
ఆకులు
3.
జవాబు:
రైజోమ్
4.
జవాబు:
అంటు తొక్కుట
5.
జవాబు:
ద్విదావిచ్ఛిత్తి
6.
జవాబు:
పిండకోశం
7.
జవాబు:
ఫెర్న్
8.
జవాబు:
కేసరావళి
9.
జవాబు:
ఏకలింగ పుష్పము
10.
జవాబు:
కీలాగ్రం
11.
జవాబు:
పరాగ సంపర్కం
12.
జవాబు:
జీవ కారకాలు
13.
జవాబు:
ఫలం
14.
జవాబు:
ఎపిడిడిమిస్
15.
జవాబు:
స్థలన నాళం
16.
జవాబు:
ఫాలోపియన్ నాళం
17.
జవాబు:
సంయుక్త బీజం
18.
జవాబు:
క్షయకరణ విభజన
19.
జవాబు:
S దశ
20.
జవాబు:
మధ్య దశ
శాస్త్రవేత్తను కనుగొనండి
21. ఇతను కణ సిద్ధాంతం యొక్క ప్రతిపాదకుడు, కణాలు అన్నీ ముందుగా ఉన్న కణాల నుండి ఉత్పన్నమవుతాయి అని చెప్పాడు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ విర్కోన్
22. అతను జర్మన్ శాస్త్రవేత్త. 1952లో కణ విభజనపై తన పరిశీలనలను ప్రచురించాడు. ద్విదావిచ్ఛిత్తి జంతు కణాల ప్రత్యుత్పత్తి సాధనమని ఆయన పేర్కొన్నారు. అతను ఎవరు?
జవాబు:
రాబర్ట్ రీమాక్
23. కణాలలో విభజన సమయంలో కేంద్రకంలో నిలువుగా వీడిపోయే దాతాల వంటి నిర్మాణాలు గమనించాడు. అతను ఆ కణ విభజనకు సమ విభజన అని పేరు పెట్టాడు. అతను ఎవరు?
జవాబు:
వాల్తేర్ ఫ్లెమింగ్
24. జీవులలోని క్రోమోజోమ్ జననీ జనకుల నుండి సంక్రమిస్తాయని ప్రతిపాదించారు. అతను ఎవరు?
జవాబు:
విల్మ్ రూక్స్
25. అతను కంటిచూపు తక్కువగా ఉన్న జీవశాస్త్రవేత్త. వరుస కణ విభజనలో క్రోమోజోమ్ ల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని అతను ఊహించాడు. అతను ఎవరు?
జవాబు:
ఆగస్టు వీస్మాన్
26. 1904 లో సమ విభజన దశలు ఆయనచే ధృవీకరించబడినాయి. అతను ఎవరు?
జవాబు:
థియోడర్ బోవేరి
27. 1953లో వరుస ప్రయోగాల తరువాత జన్యు పదార్థం యొక్క రసాయన స్వభావం వారిచే నిర్ణయించబడింది. వారు ఎవరు?
జవాబు:
జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్
28. అతను కణ శాస్త్రవేత్త. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు. కణ సంలీన టెక్నిక్ ఉపయోగించి అంతర దశ నిర్మాణాన్ని ఆయన వెల్లడించారు. అతను ఎవరు?
జవాబు:
పోటు నరసింహారావు
విస్తరించుము
29. G1 దశ – పెరుగుదల దశ 1
30. Sదశ – సంశ్లేషణ దశ
31. S2 దశ – పెరుగుదల దశ 2
32. M దశ – సమ విభజన దశ
33. H.I – హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్
34. A.I.D.S – అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్
35. A.R.T – యాంటీ – రెట్రోవైరల్ థెరపీ
36. A.S.H.A – గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త
37. S.T.D – లైంగికంగా సంక్రమించే వ్యాధి
38. D.N.A – డీ ఆక్సిరైబో న్యూక్లిక్ ఆసిడ్
సరైన గ్రూపును గుర్తించండి
39. ఈ క్రింది సమూహాలలో ఏది సహజ శాఖీయ వ్యాప్తి పద్దతి కాదు?
ఎ) విచ్చిత్తి, మొగ్గ తొడగటం, ముక్కలు కావటం
బి) ఛేదనం, అంటు తొక్కుట, అంటుకట్టుట
జవాబు:
గ్రూపు-బి
40. కాండం ద్వారా ఏ మొక్కల సమూహం వ్యాప్తి చేయబడదు?
ఎ) క్యారెట్, బ్రయోఫిల్లమ్, ముల్లంగి
బి) మల్లె, ఉల్లిపాయ, బంగాళాదుంప
జవాబు:
గ్రూపు-ఎ
41. కాండం ద్వారా వ్యాప్తి చెందే సమూహం ఏది?
ఎ) స్టోలన్, మొక్కజొన్న, రైజోమ్
బి) మొగ్గ తొడుగుట, పత్ర మొగ్గలు, విచ్ఛిత్తి
జవాబు:
గ్రూప్-ఎ
42. కింది వాటిలో సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తున్న సమూహము ఏది?
ఎ) ద్రాక్ష, పుచ్చకాయ, క్యారెట్
బి) పుట్టగొడుగు, రైజోపస్, ఫెర్న్
జవాబు:
గ్రూపు-బి
43. పురుష పునరుత్పత్తి వ్యవస్థకు చెందిన అనుబంధ గ్రంథుల సమూహం ఏది?
ఎ) శుక్ర గ్రాహికలు, ప్రోస్టేట్ గ్రంథి, కౌపర్ గ్రంథి
బి) పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి
జవాబు:
గ్రూపు-ఎ
44. ఏ జీవుల సమూహం బాహ్య ఫలదీకరణం జరుపుతాయి ?
ఎ) కుక్క పిల్లి, ఏనుగు
బి) చేప, కప్ప, వానపాము
జవాబు:
గ్రూపు-బి
45. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధం లేని భాగాలు ఏవి?
ఎ) అండాశయం, గర్భాశయం, యోని
బి) టెస్టిస్, ఎపిడిడిమిస్, యురేత్రా
జవాబు:
గ్రూపు-ఎ
46. స్త్రీలలోని గర్భనిరోధక పద్ధతుల సమూహం ఏది?
ఎ) కండోమ్స్, వాసెక్టమీ, ట్యూబెక్టమీ
బి) కాపర్-టి, డయాఫ్రాగమ్, నోటి మాత్రలు
జవాబు:
గ్రూపు-బి
47. కణ చక్రం యొక్క సరైన క్రమం ఏది?
ఎ) G1 – S – G2 – M
బి) G1 – G2 – S – M
జవాబు:
గ్రూపు-ఎ
48. సమ విభజన దశల యొక్క సరైన క్రమం ఏది?
ఎ) ప్రథమ, చలన, మధ్య అంతిమ దశలు
బి) ప్రథమ, మధ్య, చలన, అంత్య దశలు
జవాబు:
గ్రూపు-బి
49. పువ్వు యొక్క అండకోశంలో ఉన్న భాగాలు ఏమిటి?
ఎ) అండాశయం, కీలాగ్రం, కీలం
బి) కాడ, పరాగకోశం, పుప్పొడి రేణువులు
జవాబు:
గ్రూపు-ఎ
50. ఏ కణాల సమూహం సమ విభజన జరుపుతాయి?
ఎ) అస్థి కణం, కాలేయ కణం, నెఫ్రాన్లు
బి) సిద్ధబీజ తల్లి కణం, పుప్పొడి తల్లి కణం, శుక్ర తల్లి కణం
జవాబు:
గ్రూపు-ఎ
51. ఏక స్థితిక క్రోమోజోమ్ లను కలిగి ఉన్న కణాల సమూహం ఏది?
ఎ) ధ్రువ కేంద్రకాలు, జైగోట్, స్త్రీ బీజ కణం
బి) యాంటిపోడల్ కణాలు, సహాయక కణాలు, స్త్రీ బీజ కణం
జవాబు:
గ్రూపు-బి
జతపరచుట
52. సరిపోలని దాన్ని గుర్తించండి.
ముష్కము – శుక్రకణాలు
అండాశయం – టెస్టోస్టెరాన్
ప్రసేకము – మూత్ర జననేంద్రియ నాళం
జవాబు:
అండాశయం – టెస్టోస్టెరాన్
53. సరిగ్గా సరిపోలిన దాన్ని కనుగొనండి.
అండాశయం – శుక్రకణాలు
ముష్కములు – అండము
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం
జవాబు:
ఫెలోపియన్ నాళం – ఫలదీకరణం
54. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం
ప్రొజెస్టెరాన్ – ఆడవారిలో ద్వితీయ లైంగిక లక్షణాలు
టెస్టోస్టెరాన్ – పిండ ప్రతిస్థాపన
జవాబు:
ఈస్ట్రోజన్ – ఋతుచక్రం
55. సరిపోలని దాన్ని గుర్తించండి.
అండ ఉత్పత్తి – 28-30 రోజులు
గర్భధారణ కాలం – 180 రోజులు
జరాయువు ఏర్పడటం – గర్భం యొక్క 12 వారాలు
జవాబు:
గర్భధారణ కాలం – 180 రోజులు
56. సరిపోలని దాన్ని గుర్తించండి.
రక్షక పత్రావళి – రక్షణ
ఆకర్షక పత్రావళి – ప్రకాశవంతమైన రంగు
కేసరాలు – అండకోశం
జవాబు:
కేసరాలు – అండకోశం
57. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
అండాశయం – విత్తనంపై పొర
అండం – విత్తనం
విత్తనకవచం – పండు
జవాబు:
అండం – విత్తనం
58. సరిపోలని దాన్ని గుర్తించండి.
గాయాలు మానటం – సమవిభజన
బీజకణాలు – క్షయకరణ విభజన
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన
జవాబు:
క్రోమోసోమ్ తగ్గింపు – క్షయకరణ విభజన
59. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
పారామీషియం – మొగ్గ తొడగటం
ఫ్లనేరియా – పునరుత్పత్తి
హైడ్రా – ద్విదావిచ్ఛిత్తి
జవాబు:
ప్లనేరియా – పునరుత్పత్తి
60. సరిపోలని దాన్ని గుర్తించండి.
ఆకులు – పత్ర మొగ్గలు
అల్లం – రన్నర్
రోజ్ – స్టోలన్
జవాబు:
రోజ్ – స్టోలన్
ఉదాహరణలు ఇవ్వండి
61. హైడ్రామొగ్గ తొడగటం ద్వారా ప్రత్యుత్పత్తి చేయగలదు. ఇటువంటి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్
62. ద్విదావిచ్చిత్తి ప్రక్రియ ద్వారా అమీబా తదుపరి తరానికి ప్రత్యుత్పత్తి చేస్తుంది. దీనికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పేరామీషియం / బాక్టీరియా
63. ప్లనేరియా ప్రత్యుత్పత్తికి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
హైడ్రా
64. బ్రయోఫిల్లమ్ ఆకుల ద్వారా వ్యాప్తి చెందే మొక్క వేర్ల ద్వారా వ్యాప్తి చెందగల మొక్కకు మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
క్యారెట్ / ముల్లంగి
65. రైజోమ్ ఒక భూగర్భ కాండం, ఇది అడ్డంగా పెరిగింది. నిలువుగా పెరిగిన భూగర్భ కాండానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కార్న్
66. ఛేదనం అనేది మొక్కలలో ఒక కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతి. బహుళ పండ్ల మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అంటుకట్టుట
67. ఫెర్న్ మొక్క సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రొట్టె బూజు / పుట్ట గొడుగు
68. ఏకలింగ పువ్వుకు గుమ్మడి ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొప్పాయి
69. టెస్టోస్టెరాన్ పురుష లైంగిక హార్మోన్. స్త్రీ లైంగిక హార్మోన్‌కు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఈస్ట్రోజన్ / ప్రొజెస్టెరాన్
70. హెచ్.ఐ.వి. లైంగిక సంక్రమణ వ్యాధి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గనేరియా, సిఫిలిస్
71. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారం. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్య
పోలికను గుర్తించుట
72. బాహ్య ఫలదీకరణం : కప్ప : 😕 : పులి
జవాబు:
అంతర్గత ఫలదీకరణం
73. ముష్కం : శుక్రకణం : : అండాశయము 😕
జవాబు:
అండము
74. పరాగకోశం 😕 : : పిండం కోశం : స్త్రీ బీజ కణం
జవాబు:
పుప్పొడి రేణువు
75. సహాయ కణం : n::? : 2n
జవాబు:
ధ్రువ కేంద్రకాలు / కేంద్ర కణం
76. మగవారు : వేసెక్టమీ : : ఆడవారు 😕
జవాబు:
ట్యూబెక్టమీ
77. ప్రొజెస్టెరాన్ : స్త్రీ లైంగిక హార్మోన్ : 😕 : పురుష లైంగిక హార్మోన్
జవాబు:
టెస్టోస్టెరాన్
78. రైజోపస్ 😕 : : శైవలం : ముక్కలు కావటం
జవాబు:
సిద్ధబీజాలు
79. 2n : మియోసిస్ : : n:?
జవాబు:
సమ విభజన
80. లశునం : ఉల్లిపాయ : 😕 : బంగాళాదుంప
జవాబు:
దుంప కాండం
నేను ఎవరు?
81. నేను ఒకే జాతికి చెందిన కొత్తతరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న జీవిత ప్రక్రియను.
జవాబు:
ప్రత్యుత్పత్తి
82. నేను జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తిని. ఈ ప్రక్రియలో తేనెటీగల ఫలదీకరణం చెందని గుడ్ల నుండి డ్రోన్లు ఏర్పడతాయి.
జవాబు:
అనిషేక జననము (పారాథెనో జెనెసిస్)
83. నేను మొక్కలలో కృత్రిమ వ్యాప్తి పద్ధతిని. ఈ పద్ధతిలో ఒక మొక్క యొక్క ఒక భాగంలో మరొక మొక్కను ఉంచడం వలన, అవి ఒకే విధమైన మొక్కలా పెరుగుతాయి.
జవాబు:
అంటు కట్టుట (గ్రాఫ్టింగ్)
84. నేను కణచక్రంలో ఒక దశను. నేను రెండు కణ విభజనల మధ్య అంతరాన్ని. ఈ దశలో క్రోమోజోమ్ ల సంఖ్య రెట్టింపు అవుతుంది.
జవాబు:
అంతర దశ
85. నేను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అనుబంధ గ్రంథుల నుండి స్రవింపబడతాను. పురుషుల శరీరం నుండి శుక్రకణాలను పంపించడానికి నేను సహాయంచేస్తాను.
జవాబు:
శుక్ర స్రావం
86. నేను అండాశయంలో గుండ్రని కణాల బంతి లాగ ఉన్నాను. అండం ఈ చిన్న నిర్మాణం నుండి అభివృద్ధి చెందుతుంది.
జవాబు:
ఫియన్ పుటిక
87. నేను పిండం మరియు తల్లి నుండి ఏర్పడిన కణజాలం. నేను గర్భం దాల్చిన 12 వారాల వద్ద ఏర్పడతాను మరియు పిండం యొక్క పోషణకు సహాయపడతాను.
జవాబు:
జరాయువు
88. నేను గర్భావధి చివరలో క్షీర గ్రంథులలో శోషరసము వంటి ద్రవం పేరుకుపోవడం వలన ఏర్పడతాను. నేను పిల్లల రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయపడతాను.
జవాబు:
ప్రారంభ స్తన్యము
దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి
89. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి స్వలింగ పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.
జవాబు:
మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా, స్వీకరించడానికి, వ్యాధులను తట్టుకోవటానికి, కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి మరియు వారి జనాభాను పెంచడానికి లైంగిక పునరుత్పత్తి మంచి అవకాశాన్ని ఇస్తుంది.
90. కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు మోనో లైంగిక పువ్వులు.
జవాబు:
కేసరం మరియు కార్పెల్ రెండింటినీ కలిగి ఉన్న పువ్వులు ద్విలింగ లైంగిక పువ్వులు.
91. యాంటీ పోడల్ కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.
జవాబు:
సహాయక కణాలు పుప్పొడి గొట్టం పెరుగుదలను గుడ్డు వైపు నిర్దేశిస్తాయి.
92. స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు టెస్టోస్టిరాన్ బాధ్యత వహిస్తుంది.
జవాబు:
స్త్రీలలో ద్వితీయ లైంగిక పాత్రలకు ఈస్ట్రోజెన్ బాధ్యత వహిస్తుంది.
93. వాసా ఎఫరెన్షియా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.
జవాబు:
అడెనోకార్సినోమా అనేది వృషణాల పృష్ఠం వైపున ఉన్న అత్యంత కాయిల్డ్ ట్యూబ్. వీర్యకణాలు వాటిలో నిల్వ చేయబడతాయి.
94. మగవారిలో అండాశయాల యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.
జవాబు:
మగవారిలో శుక్రనాళం యొక్క చిన్న భాగం శస్త్రచికిత్స ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది మరియు రెండు చివరలను సరిగ్గా కట్టివేస్తారు.
95. ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని స్పోరోఫిల్స్ మొగ్గలు అంటారు.
జవాబు:
ఆకు మార్జిన్ వెంట నోట్లలో ఉత్పత్తి అయ్యే మొగ్గలు నేల మీద పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని ఎపిఫిల్లస్ మొగ్గలు అంటారు.
96. ఈ క్రింది నినాదాల యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆడపిల్లలు గులాబీ రేకులలాంటి వారు, వారిని కాపాడండి.
భవిష్యత్ తరాలను కాపాడటానికి అమ్మాయిలను రక్షించండి.
జవాబు:
స్త్రీ భ్రూణహత్యలను ఆపడానికి
బొమ్మలపై ప్రశ్నలు
97.
స్ట్రాబెర్రిలోని కాండం ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
స్టోలన్
98.
ఈ చిత్రంలో చూపించబడిన శాఖీయ వ్యాప్తి విధానం?
జవాబు:
అంటుకట్టుట
99.
పటంలో చూపబడిన అలైంగిక నిర్మాణం?
జవాబు:
సిద్ధబీజాశయ పత్రం
100.
ఇవ్వబడిన పుష్పము ఏ రకానికి చెందుతుంది?
జవాబు:
ద్విలింగ పుష్పము
101.
పుష్పంలో అందమైన భాగాల పని?
జవాబు:
కీటకాల ఆకర్షణ
102.
పటంలో చూపబడిన X భాగం ఏమిటి?
జవాబు:
పరాగనాళం
103.
పటంలో తప్పుగా గుర్తించిన భాగం.
జవాబు:
ఫాలోపియన్ నాళం
104.
ఈ పటంలో చూపబడిన భాగం యొక్క పని
జవాబు:
శుక్రకణ కదలిక
105.
పటంలో చూపబడిన కణ విభజన దశ ఏమిటి?
జవాబు:
చలన దశ
ఖాళీలను పూరించండి
106. బంగాళాదుంప ……. ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
జవాబు:
కన్నుల
107. భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండం ………..
జవాబు:
రైజోమ్
108. పుష్పంలోని లైంగిక వలయాల సంఖ్య
జవాబు:
2
109. పిండకోశములో ద్వయస్థితిక కేంద్రకము …………..
జవాబు:
మధ్యస్థ కేంద్రకము
110. విత్తనాలు లేకుండా ఏర్పడే ఫలాలు ……..
జవాబు:
అని షేక ఫలాలు
111. పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క …..
జవాబు:
రణపాల
112. మొక్కలలోని లైంగిక భాగం ………….
జవాబు:
పుష్పము
113. పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య …………
జవాబు:
7
10th Class Biology 6th lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers
1.
జాబితా – A | జాబితా – B |
1. ముక్కలగుట | శిలీంధ్రాలు |
2. కోరకీభవనము | పారామీషియమ్ |
3. ద్విదావిచ్ఛిత్తి | చదునుపురుగు |
తప్పుగా జతపరచబడినవి ఏవి?
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3
జవాబు:
B) 2, 3
2. సమవిభజనలోని కణచక్రం యొక్క ప్లోచార్ట్ దశలను సరియైన, క్రమంలో అమర్చండి.
A) 4, 1, 2, 3
B) 2, 3, 4, 1
C) 4, 2, 3, 1
D ) 1, 3, 4, 2
జవాబు:
A) 4, 1, 2, 3
3. బొమ్మలో గుర్తించిన ‘X’ దీనిని సూచిస్తుంది.
A) సహాయకణాలు
B) ప్రతిపాదిత కణాలు
C) ధృవ కేంద్రకం
D) అండకణం
జవాబు:
C) ధృవ కేంద్రకం
4. సరైన క్రమాన్ని గుర్తించండి.
A) ప్రథమదశ → చలనదశ → అంత్యదశ → మధ్యస్థదశ
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ
C) మధ్యస్థదశ → అంత్యదశ → ప్రథమదశ → చలనదశ
D) ప్రథమదశ → చలనదశ → మధ్యస్థదశ → అంత్యదశ
జవాబు:
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ
5. శుక్ర కణాలను ఉత్పత్తి చేసే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం
A) శుక్రవాహిక
B) పౌరుష గ్రంథి
C) ముష్కాలు
D) శుక్రాశయము
జవాబు:
C) ముష్కాలు
6. మొక్కల్లో పురుష బీజకేంద్రం ద్వితీయ కేంద్రకంతో కలిస్తే ఏర్పడేది
A) పిండకోశం
B) అంకురచ్ఛదం
C) బీజదళాలు
D) సిద్ధబీజాలు
జవాబు:
B) అంకురచ్ఛదం
7. విభజన చెందని కణాలున్న శరీర భాగం
A) మెదడు
B) ఊపిరితిత్తులు
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
A) మెదడు
8. అండాలను ఉత్పత్తిచేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగము ఏది?
A) గర్భాశయ ముఖద్వారం
B) ఎపిడిడిమిస్
C) అండాశయము
D) ఫాలోఫియన్ నాళం
జవాబు:
C) అండాశయము
9. పార్థినోజెనిసిస్ ప్రదర్శించే జీవి ……..
A) తేనెటీగలు
B) కందిరీగలు
C) చీమలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ
10. గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవేవి?
A) సిగరెట్ పొగలో రసాయనాలు
B) ఆల్కహాల్
C) మందులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
11. మానవులలో గర్భావధి కాలం
A) 330 రో॥
B) 20 రో॥
C) 280 నె॥
D) 280 రో॥
జవాబు:
D) 280 రో॥
12. ఈ క్రింది విత్తనాలలో అంకురచ్ఛదం కలది ………..
A) ఆముదము
B) బఠాణి
C) కందులు
D) పెసలు
జవాబు:
A) ఆముదము
13. మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రిందయివ్వబడినవి. సరియైన క్రమంలో అమర్చండి.
1) కౌమార దశ
2) శిశుదశ
3) వయోజన దశ
4) బాల్య దశ
A) 1, 3, 4, 2
B) 4, 2, 3, 1
C) 2, 4, 1, 3
D) 3, 1, 2, 4
జవాబు:
C) 2, 4, 1, 3
14. ఈ చిహ్నం తెలియజేయు అంశం
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
B) ప్రపంచ వైద్యుల దినోత్సవం
C) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
D) ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జవాబు:
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
15. సైడ్ పైన ఒక విద్యార్థి పరాగరేణువును సూక్ష్మదర్శినిలో పరీక్షించినపుడు ఈ క్రింది విధంగా కనబడింది.
‘X’ దేనిని సూచించును?
A) పక్వం చెందిన కేంద్రకం
B) పరాగ నాళం
C) కీలాగ్రం
D) నాళికా కేంద్రకం
జవాబు:
B) పరాగ నాళం
16. ప్రక్క పటంలో ‘X’ దేనిని తెలియజేస్తుంది?
A) ఆక్రోసోమ్
B) తల
C) కేంద్రకం
D) తోక
జవాబు:
A) ఆక్రోసోమ్
17. కోరకీభవనము ఏ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి?
A) ఈస్ట్
B) పారమీసియం
C) వానపాము
D) అమీబా
జవాబు:
A) ఈస్ట్
18. క్రింది బొమ్మలోని సమవిభజన దశను గుర్తించుము.
A) ప్రథమ దశ
B) చలన దశ
C) మధ్య స్థ దశ
D) అంత్య దశ
జవాబు:
B) చలన దశ
19. క్రింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని
i) ప్రొజెస్టిరానను స్రవించుట
ii) టెస్టోస్టిరానను స్రవించుట
iii) ఆళిందమును ఏర్పరచుట
iv) శుక్రకణాల ఉత్పత్తి
A) (i) మరియు (iii)
B) (ii) మరియు (iv)
C) (iii) మరియు (iv)
D) (i) మరియు (ii)
జవాబు:
B) (ii) మరియు (iv)
20. సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క
A) మందార
B) గడ్డిచామంతి
C) బంతి
D) ఫెర్న్
జవాబు:
D) ఫెర్న్
21. కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరచి చూచినపుడు కనిపించే భాగాలు
A) బీజదళాలు మరియు ప్రథమ మూలం
B) ప్రథమ కాండం, బీజదళం
C) బీజదళం మరియు అంకురచ్ఛదం
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం
జవాబు:
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం
22. కింది వానిలో వేరుగా ఉన్నది
A) పౌరుష గ్రంథి
B) ఎపిడిడిమిస్
C) శుక్రవాహికలు
D) ఫాలోపియన్ నాళం
జవాబు:
D) ఫాలోపియన్ నాళం
23. అండకణం శుక్రకణం కన్నా పెద్దదిగా ఉంటుంది అని ఉపాధ్యాయుడు బోధించాడు. దీనికి గల కారణం
A) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది.
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
C) మందమైన కణత్వచాన్ని కలిగి ఉంటుంది.
D) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది.
జవాబు:
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
24. గర్భధారణ జరిగాక 3 నెలల పిండాన్ని ఏమంటారు?
A) సంయుక్త బీజం
B) జరాయువు
C) పిండం
D) భ్రూణం
జవాబు:
D) భ్రూణం
25. ఎయిడ్స్ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే ……
A) పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రక్తమార్పిడికి ఉపయోగించాలి.
B) డిస్పోజబుల్ సూదులను వాడాలి.
C) సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
26. పటంలో చూపబడిన మొక్క
A) బంగాళాదుంప
B) వాలిస్ నేరియా
C) స్ట్రాబెర్రీ
D) రణపాల
జవాబు:
D) రణపాల
మీకు తెలుసా?
* వాణిజ్యరీత్యా ఈ సాంప్రదాయ పద్ధతులకు బదులుగా అధునాతన కృత్రిమ శాఖీయోత్పత్తి పద్దతులైన కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు. కణజాల వర్ధనంలో కేవలం మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ణన యానకంలో ఉంచినపుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు. దీనిని “కణజాలవర్ధనం” అంటారు.
* లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత : అలైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనక జీవి మాత్రమే ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు పాల్గొంటాయి. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృథా కావు. భాగస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి. ఈ పాఠం ప్రారంభంలో పారమీషియంలో జరిగే లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తులను గురించి చర్చించిన అంశాలను గుర్తుకు తెచ్చుకోండి.
* మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరుచేస్తే వాటికి స్వపరాగసంపరం జరుపుకొనే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినపుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సం||లో “ఛార్లెస్ డార్విన్” నిరూపించాడు.
* లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వలన సంయుక్తబీజం ఏర్పడుతుంది. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్తబీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్చదం ఏర్పడతాయి. పరాగరేణువులో రెండు కణాలుంటాయి. వీటిలో ఒకటైన నాళికాకణంలో రెండు కేంద్రకాలుంటాయి. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండకోశంలోని స్త్రీ బీజకణాన్ని చేరుతుంది. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇది సంయుక్తబీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషకపదార్థాలను అందిస్తుంది. దీనినే “ద్విఫలదీకరణం” అంటారు.
* ఆగస్ట్ వీస్మన్ ఒక జీవ శాస్త్రవేత్త. అతనికి కంటిచూపు తక్కువగా ఉండేది. కణాలను సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించడం కష్టంగా ఉండేది. అందుకే అతను ఇతర మార్గాల ద్వారా తన పరిశోధనలను కొనసాగించాడు. శాస్త్రం కేవలం సేకరించిన సమాచారంపైనే ఆధారపడి అభివృద్ధి చెందలేదు. సేకరించబడిన సమాచారాన్ని గురించి ఆలోచించడం మరియు నూతన విషయాలను కనుక్కోవడం, వాటిని వ్యాఖ్యానించడం కూడా పరిశోధనే అవుతుంది. ఆగస్ట్ వీసమన్ తనకు కంటిచూపు తక్కువ అని విచారిస్తూ వృథాగా కూర్చోలేదు. తన సమయాన్నంతా శాస్త్ర విషయాలను గురించి ఆలోచించడానికే కేటాయించాడు. నిజంగా అతనెంత గొప్పవాడో, ఆదర్శప్రాయుడో ఆలోచించండి.
పునశ్చరణం