AP Board 7th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 7th Class Social Studies Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 7th Class Textbook Solutions.

Students can also read AP Board 7th Class Social Studies Solutions for exam preparation.

AP State Syllabus 7th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

AP 7th Class Social Studies Important Questions and Answers in English Medium

7th Class Social Important Questions Sem 1

AP 7th Class Social Important Questions Sem 2

AP 7th Class Social Chapter Wise Important Questions in Telugu Medium

7th Class Social Important Questions Sem 1

AP 7th Class Social Important Questions Sem 2

AP 7th Class Social Studies Important Questions and Answers in English Medium (Old Syllabus)

AP Board 7th Class English Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 7th Class English Chapter Wise Important Questions and Answers are part of AP Board 7th Class Textbook Solutions.

Students can also read AP Board 7th Class English Solutions for exam preparation.

AP State Syllabus 7th Class English Important Questions and Answers

AP 7th Class English Important Questions and Answers

7th Class English Important Questions Sem 1

AP 7th Class English Important Questions Sem 2

AP Board 6th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Social Studies Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 6th Class Textbook Solutions.

Students can also read AP Board 6th Class Social Studies Solutions for exam preparation.

AP State Syllabus 6th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

AP 6th Class Social Studies Important Questions and Answers in English Medium

AP 6th Class Social Chapter Wise Important Questions in Telugu Medium

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

These AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 9th lesson Important Questions and Answers మన పర్యావరణం – మన బాధ్యత

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే ఏమవుతుంది?
జవాబు:
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్నకారులను తొలగిస్తే జీవరసాయన వలయాలు భర్తీ కావు. జీవులలోని సేంద్రియ పదార్థాలు నిరీంద్రియ పదార్థాలుగా మారవు.

ప్రశ్న 2.
క్రింది వానిని పరిశీలించి సంఖ్యా పిరమిడ్ చిత్రం గీయండి.
గడ్డి – మేక – మానవుడు,
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1

ప్రశ్న 3.
పిచ్చుకలు లేని ప్రపంచాన్ని ఊహించలేం. వాటి సంరక్షణ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి?
జవాబు:

  1. క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించాలి.
  2. సెల్ టవర్ రేడియేషన్ తగ్గించాలి.
  3. జైవిక నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  4. పక్షుల సంరక్షణ కేంద్రాలను నెలకొల్పాలి.

ప్రశ్న 4.
మీ పరిసరాలలో మీరు గమనించిన ఒక ఆహారపు గొలుసును గుర్తించి, దానిలోని ఉత్పత్తిదారుల మరియు వివిధ స్థాయిలలో గల వినియోగదారుల పేర్లు వ్రాయండి.
జవాబు:
గడ్డి → కీటకాలు → కప్ప → పాము
ఉత్పత్తిదారులు – గడ్డి
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – కప్ప
తృతీయ వినియోగదారులు – పాము

నీటిమొక్కలు → కీటకాలు → చేప → కొంగ
ఉత్పత్తిదారులు – నీటిమొక్కలు
ప్రాథమిక వినియోగదారులు – కీటకాలు
ద్వితీయ వినియోగదారులు – చేప
తృతీయ వినియోగదారులు – కొంగ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఆహారపు గొలుసులోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదార్ల పేర్లను రాయండి.
జవాబు:
ఉత్పత్తిదారులు – మొక్కలు, ఆకుపచ్చ శైవలాలు
వినియోగదారులు – అన్ని రకాల జంతువులు

ప్రశ్న 6.
“కీటకాలు, పక్షులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము.” వాటిని సంరక్షించుటకు మీరు పాటించే రెండు పద్ధతులను తెలుపండి.
జవాబు:

  1. క్రిమి సంహారక మందులను అతిగా వాడకూడదు.
  2. కీటకాల మరియు పక్షుల సహజ ఆవాసాలను కాపాడాలి.
  3. పార్కులను మరియు పక్షుల సాంక్చ్యురీలను అభివృద్ధి చేయాలి.
  4. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ సూత్రాలను పాటించే విధంగా చైతన్య పరచాలి.

ప్రశ్న 7.
క్రింది ఆహార పిరమిడను గమనించండి. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
i) ఏ పోషక స్థాయిలో అధిక శక్తి ఉంటుంది?
ii) T4 పోషక స్థాయికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
i) T1 (లేదా) ఆకుపచ్చ మొక్కలు (లేదా) ప్రాథమిక ఉత్పత్తిదారులు. –
ii) సింహము, పులి, డేగ మొ||నవి.

ప్రశ్న 8.
పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాలపై అవగాహన కల్పించుటకు ఏవైనా రెండు నినాదాలను వ్రాయండి.
జవాబు:

  1. పచ్చదనాన్ని పెంచు – భూగోళాన్ని శుభ్రంగా ఉంచు.
  2. ప్రకృతిని నీవు నాశనం చేస్తే – ప్రకృతి నిన్ను నాశనం చేస్తుంది.
  3. కాలుష్య నివారణకు ఉత్తమ మార్గం – మొక్కల పెంపకం.
  4. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం – కాలుష్యాన్ని తగ్గిద్దాం.

ప్రశ్న 9.
హరితహారంలో భాగంగా మీ పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షించటానికి మీరు ఏ చర్యలు తీసుకొంటారు?
జవాబు:

  1. మొక్కలకు నీటిని సరఫరాచేయటం,
  2. కంచె వేయటము (లేదా) మొక్కల సంరక్షణ,
  3. మొక్కలను దత్తత తీసుకోవటం,
  4. సహజ ఎరువులను సరఫరా చేయటము.

ప్రశ్న 10.
జీవావరణం అనగానేమి?
జవాబు:
భూమి మీద జీవులు నివసించటానికి యోగ్యమైన ప్రదేశం అంతా ‘కలిపి ‘జీవావరణం’ అంటారు. ఇది అనేక ఆవరణ వ్యవస్థల సమూహం. అతి పెద్ద ఆవాసంగా కూడా జీవావరణాన్ని పరిగణించవచ్చు.

ప్రశ్న 11.
పోషకస్థాయి అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద లభించే పోషక విలువను పోషకస్థాయి అంటారు. సాధారణంగా ఆహార గొలుసులో పోషకస్థాయి వద్ద 10 నుండి 20 శాతం శక్తి బదిలీ జరుగుతూ ఉంటుంది.

ప్రశ్న 12.
పర్యావరణం అనగానేమి?
జవాబు:
పర్యావరణం:
జీవజాలం మీద ప్రభావం చూపే జీవభౌతిక కారకాలతో పాటు, రసాయనిక కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” (Environment) అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 13.
పర్యావరణంలోని నిర్జీవ కారకాలు ఏమిటి?
జవాబు:
నిర్జీవ కారకాలు :
పర్యావరణంలో గాలి, నీరు, నేల, కాంతి మొదలైన నిర్జీవ కారకాలను “భౌతిక కారకాలు” అంటారు.

ప్రశ్న 14.
పర్యావరణంలోని జీవకారకాలు ఏమిటి?
జవాబు:
జీవకారకాలు :
పర్యావరణంలోని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను కలిపి “జీవకారకాలు’ అంటారు.

ప్రశ్న 15.
ఆహార గొలుసు అనగానేమి?
జవాబు:
ఆహార గొలుసు:
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధ వరుస క్రమాన్ని ఆహార గొలుసు అంటారు.

ప్రశ్న 16.
ఆహార జాలకం అనగానేమి?
జవాబు:
ఆహార జాలకం :
అనేక ఆహారపు గొలుసుల కలయికను ఆహార జాలకం అంటారు. ఇది ఆహార గొలుసుల మధ్యగల సంబంధాన్ని చూపుతుంది.

ప్రశ్న 17.
ఆహారపు గొలుసులోని స్థాయిలను తెలపండి.
జవాబు:
ఆహారపు గొలుసులో కింది స్లాయిలు ఉంటాయి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4

ప్రశ్న 18.
ఆహార గొలుసుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
1. గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
2. గడ్డి → కుందేలు → నక్క → తోడేలు
3. గడ్డి → మేక → మానవుడు

ప్రశ్న 19.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు జరిగే నష్టమెంత?
జవాబు:
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ జరిగేటప్పుడు 80 నుండి 90% శక్తి వృథా అవుతుంది. ఇది శ్వాసక్రియలోనూ, ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణరూపంలో నష్టపోవటం జరుగును.

ప్రశ్న 20.
భౌమ ఆవరణ వ్యవస్థలోని వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి?
జవాబు:
భూమధ్యరేఖకు, ధృవాలకు మధ్యగల శీతోష్ణస్థితిలోని వ్యత్యాసాలే భౌమ్యావరణ వ్యవస్థలను నిర్ధారిస్తాయి.

ప్రశ్న 21.
కొల్లేరు సరస్సులోనికి ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు ఎలా చేరుతున్నాయి?
జవాబు:
కొల్లేరు పరీవాహక ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. రసాయనిక ఎరువులు కలిగిన ఈ నీరు సరస్సులోనికి చేరి కలుషితం చేస్తుంది.

ప్రశ్న 22.
నిచ్ (Niche) అనగానేమి?
జవాబు:
నిచ్ : ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాహం ‘ లేదా ‘నిచ్’ అంటారు.

ప్రశ్న 23.
జీవావరణ పిరమిడ్ అనగానేమి?
జవాబు:
జీవావరణ పిరమిడ్ :
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించటానికి, ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ అనే భావనను ఉపయోగించారు. వివిధ పోషకస్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ‘పిరమిడ్’ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని “జీవావరణ పిరమిడ్” (Ecological pyramid) అంటారు.

ప్రశ్న 24.
ఆవరణశాస్త్ర పిరమిడ్ లోని రకాలు తెలపంది.
జవాబు:
ఆవరణ శాస్త్ర పిరమిడ్లు మూడురకాలు :

  1. సంఖ్యాపిరమిడ్లు
  2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు
  3. శక్తి పిరమిడ్లు

ప్రశ్న 25.
సంఖ్యాపిరమిడ్ అనగానేమి?
జవాబు:
ఆహారపు గొలుసులోని జీవులను సంఖ్యాత్మకంగా చూపించే పిరమిడను “సంఖ్యాపిరమిడ్” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 26.
జీవద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని “జీవద్రవ్యరాశి” అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తికోసం వినియోగిస్తే అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

ప్రశ్న 27.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు ఎలా ఉంటాయి?
జవాబు:
జీవద్రవ్యరాశి పిరమిడ్లు :
భౌమ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్లు నిటారుగా ఉంటాయి. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషకస్థాయిలలో ఉన్న జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్ అధోముఖంగా ఉంటుంది.

ప్రశ్న 28.
ఆహారపు గొలుసులో శక్తి బదిలీ శాతం ఎంత?
జవాబు:
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి 10 నుండి 20% వరకు, జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 29.
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఏమిటి?
జవాబు:
జలావరణ వ్యవస్థలో నీటి మొక్కలు, నాచు, వృక్షప్లవకాలు ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 30.
శక్తి పిరమిడ్ అనగానేమి?
జవాబు:
శక్తి పిరమిడ్ :
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణను, పరిమాణాన్ని చూపించే రేఖా పటాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.

ప్రశ్న 31.
శక్తి పిరమిడ్ లోని శక్తి క్షీణతను దిమ్మెల చిత్రంలో చూపించండి. వృక్ష ఫ్లవకాలు జంతుప్లవకాలు
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 32.
BOD అనగానేమి?
జవాబు:
“బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్”ను సంక్షిప్తంగా BOD అంటారు. ఇది ఆవాసంలోని ఆక్సిజన్ మోతాదును తెలియజేస్తుంది. ఆక్సిజన్ మోతాదు కంటే తగ్గినపుడు జీవులు మరణించే ప్రమాదం ఉంది.

ప్రశ్న 33.
యూట్రిఫికేషన్ అనగానేమి?
జవాబు:
యూట్రిఫికేషన్ :
నీటిలోనికి పోషక కలుషితాలు అధికంగా వచ్చి చేరటం వలన కలుపు మొక్కలు విపరీతంగా పెరిగి జలావాసాన్ని పాడుచేస్తాయి. ఈ పరిస్థితిని “యూట్రిఫికేషన్” అంటారు. దీని వలన జలచర జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి.

ప్రశ్న 34.
నీటిని కలుషితం చేసే భారలోహాలు ఏమిటి?
జవాబు:
నీటిని కలుషితం చేసే భారలోహాలు :
సీసం (Pb), కాడ్మియం (Cd), క్రోమియం (Cr), మాంగనీస్(Mn), నికెల్ (Ni) మరియు ఐరన్(Fe) వంటి భారలోహాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.

ప్రశ్న 35.
జైవిక వ్యవస్థాపనం అనగానేమి?
జవాబు:
జైవిక వ్యవస్థాపనం :
ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని “జైవిక వ్యవస్థాపనం” అంటారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 36.
జైవిక వృద్ధీకరణం అనగానేమి?
జవాబు:
జైవిక వృద్దీకరణం : ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని “జైవిక వృద్ధీకరణం” అంటారు.

ప్రశ్న 37.
ఏదులాబాద్ రిజర్వాయర్ లో పెంచే చేపల పేరు ఏమిటి?
జవాబు:
సిప్రినస్ కార్షికో అనే పొలుసు చేపను ఏదులాబాద్ రిజర్వాయర్లో పెంచుతారు.

ప్రశ్న 38.
పంట మార్పిడి పద్ధతి అనగానేమి?
జవాబు:
పంట మార్పిడి పద్దతి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించే పద్ధతిని “పంటమార్పిడి” పద్ధతి అంటారు.

ప్రశ్న 39.
వంధ్యత్వం కలిగించే పద్ధతి అనగానేమి?
జవాబు:
వంధ్యత్వం కలిగించే పద్ధతి : తెగుళ్లు కలిగించే క్రిమి కీటకాల పురుషజీవులు పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా చేసే ప్రక్రియను “వంధ్యత్వం కలిగించే పద్ధతి” అంటారు.

ప్రశ్న 40.
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుందా? ఎందుకు?
జవాబు:
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. ఎందుకంటే ఆహారపు గొలుసులో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి బదిలీ అయ్యేటప్పుడు క్షీణత అధికంగా ఉంటుంది. అందువలన ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలదీ ప్రవహించే శక్తి విలువ తక్కువగా ఉండి శక్తి పిథమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.

ప్రశ్న 41.
ఆవరణ వ్యవస్థలో ఆహారానికి మూలం మొక్కలే అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మనం తినే ఆహారాన్ని పరిశీలిస్తే, పెరుగు పాల నుండి వస్తుంది. పాలు ఆవు నుండి లభిస్తాయి. ఆవు గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆహారం ఏరకమైనా దానికి మూలం ఆకుపచ్చని మొక్కలే.

ప్రశ్న 42.
మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సు ఎక్కడ విస్తరించి ఉంది?
జవాబు:
మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇది ఒక పెద్ద మంచి నీటి సరస్సు. దాదాపు 6121 చ.కి.మీ. విస్తరించి ఉంది.

ప్రశ్న 43.
కొల్లేరు సరస్సు యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
1999 నవంబరులో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడ 193 రకాల పక్షి జాతులు, వివిధ రకాల జంతు వృక్షజాలానికి ఆవాసంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల మందు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్, మార్చి నెలల మధ్యకాలంలో ప్రతి ఏటా దాదాపు, 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. సరస్సుపై ఆధారపడి దాదాపు 20 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు.

ప్రశ్న 44.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది.
  5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఈ క్రింది ఫ్లోచార్టును వివరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 3
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా. నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 2.
కింద ఇవ్వబడిన సంఖ్యా పిరమిడను పరిశీలించి, ప్రశ్నలకు జవాబిమ్ము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
i) పోషక స్థాయిలలోని జీవుల సంఖ్య ప్రకారం అతి ఎక్కువగా, అతి తక్కువగా గల జీవులు ఏవి?
ii) ఒకవేళ ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే ఏం జరుగుతుంది?
జవాబు:
i) పోషక స్థాయిలోని జీవుల సంఖ్య ప్రకారం ఎక్కువగా గల జీవులను ‘ఉత్పత్తిదారులు’ అని, తక్కువగా గల జీవులను ‘తృతీయ వినియోగదారులు’ అని అంటారు.
ii) ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే తృతీయ వినియోగదారులకు ఆహారం లభించక వాటి సంఖ్య తగ్గిపోతుంది. ప్రథమ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది.

ప్రశ్న 3.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) పై పటం నుండి ఏవైనా రెండు ఆహార గొలుసులు తెలపండి.
ii) నీవు వ్రాసిన ఆహారపు గొలుసులోని ద్వితీయ వినియోగదారులు ఏమిటి?
జవాబు:
i) a) మొక్క → మేక → పులి
b) మొక్క → కుందేలు → తోడేలు / నక్క

ii) పులి, తోడేలు / నక్క
(లేదా)

i) a) వృక్షప్లవకాలు → క్రస్టేషియన్లు → చేపలు
b) మొక్కలు → ఎలుకలు → గ్రద్ద

ii) చేపలు, గ్రద్ద

ప్రశ్న 4.
గడ్డి → మిడత → కప్ప → పాము → గద్ద
పై ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగిస్తే ఏమి జరుగుతుంది? వివరించుము.
జవాబు:

  1. ఇవ్వబడిన ఆహారపు గొలుసులో కప్ప ద్వితీయ వినియోగదారు.
  2. ఈ ఆహారపు గొలుసు నుండి కప్పను తొలగించినట్లయితే మిడతల సంఖ్య పెరుగును. మరోవైపు కప్పల మీద ఆధారపడిన పాముల సంఖ్య తగ్గుతుంది.
  3. దీని వలన జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

ప్రశ్న 5.
పర్యావరణం అనగానేమి? అందలి అంశాలు ఏమిటి?
జవాబు:
పర్యావరణం :
జీవుల మీద ప్రభావం చూపే జీవ, భౌతిక కారకాలతో పాటు, రసాయన కారకాలన్నింటిలో గల పరస్పర సంబంధాన్ని “పర్యావరణం” అంటారు.

పర్యావరణంలోని అంశాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

1. నిర్జీవ అంశాలు :
గాలి, నేల, నీరు, కాంతి మొదలైన భౌతిక కారకాల ఎ “నిర్జీవ అంశాలు” అంటారు.

2. జీవకారకాలు :
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, క్రిములు, కీటకాలు అన్నింటిని “జీవకారకాలు” అంటారు.

ప్రశ్న 6.
ఆహారపు గొలుసు, ఆహారజాలకాన్ని నిర్వచించండి.
జవాబు:
ఆహారపు గొలుసు :
ఆవాసంలో జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని చూపించే రేఖీయ చిత్రాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇది సాధారణంగా ఉత్పత్తిదారులతో ప్రారంభమై అగ్రశ్రేణి వినియోగదారులతో ముగుస్తుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 8

ఆహారజాలం :
ఆవరణ వ్యవస్థలోని అన్ని ఆహారపు గొలుసులను కలిపి ఆహారజాలం అంటారు. ఇది సంక్లిష్ట నిర్మాణం. ఇది ఒక జీవి ఎన్ని రకాలుగా ఆహారం పొందుతుందో వివరిస్తుంది.

ప్రశ్న 7.
ఆవరణ వ్యవస్థను నిర్ణయించే కారకాలు తెలపండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలో గాలి, నీరు, నేల, ఉష్ణోగ్రత, లవణాలు, కాంతి వంటి నిర్జీవ కారకాలు ఆవరణ వ్యవస్థను నిర్ణయిస్తుంటాయి. నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఎడారి ఆవాసాలుగానూ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలు అటవీ ఆవాసంగానూ, జలవనరులు ఉన్న ప్రాంతాలు జల ఆవాసాలుగానూ మారతాయి.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 8.
నిచ్ అనగానేమి? ఇది ఆవాసం కంటే ఎలా భిన్నమైనది?
జవాబు:
ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ‘ఆహార జాలకపు ఆవాసం’ లేదా ‘నిచ్’ (Niche) అని వర్ణిస్తారు. ఉదాహరణకు, ఆకుల నుండి రసాలను పీల్చే ఎఫిడ్లు అనే కీటకాలకు ఒక స్థానం ఉంటే ఆకులను చిన్నచిన్న ముక్కలుగా చేసే లేదా కొరికే దవడలున్న గొంగళి పురుగులకు మరొక స్థానం ఉంటుంది.

‘నిచ్’ అనే పదం, ఆహార జాలకంలో జంతువు యొక్క ఆక్రమించిన సరైన స్థానాన్ని మరియు ఆహారాన్నే కాకుండా, దాని జీవన విధానాన్ని తెలుపుతుంది. ఆవాసం అనేది జంతువు యొక్క నివాస స్థలమైనట్లే ‘నీచ్’ దాని బ్రతుకుదెరువును అంటే ఆ జీవి చేసే పనిని, సంచరించే ప్రదేశాలను ఆహారం పొందే విధానాన్ని మొదలైన వాటన్నింటినీ స్పష్టంగా వర్ణిస్తుంది.

ప్రశ్న 9.
ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవుల మధ్య సంబంధాలను చూపడానికి లేదా వర్ణించడానికి ఆవరణ శాస్త్రవేత్తలు ‘పిరమిడ్’ (Pyramid) అనే భావనను ఉపయోగిస్తారు. వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ‘జీవావరణ పిరమిడ్’ (Ecological pyramid) అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త ‘చార్లెస్ ఎల్టన్’ 1927లో ఆవరణశాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టాడు. పిరమిడ్ పీఠభాగంలో ఉత్పత్తిదారులు (ప్రథమ పోషకస్థాయి), వాటిపై క్రమంగా ఇతర పోషకస్థాయిలు (ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు) ఒకదానిపై ఒకటి చొప్పున పిరమిడ్ శిఖరం వరకు అమరి ఉంటాయి.

ఆవరణశాస్త్ర పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి: 1. సంఖ్యాపిరమిడ్లు . 2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు – 3. శక్తి పిరమిడ్లు.

ప్రశ్న 10.
సంఖ్యా పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 6
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ అనే రేఖాపటం ద్వారా చూపవచ్చును. పిరమిడ్ లోని ప్రతిభాగం ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయి (Trophic level) లో గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. ప్రథమ వినియోగదారుల స్థాయి నుండి అతిపెద్ద మాంసాహారుల వరకు, ఆహారపు గొలుసులోని ప్రతి పోషకస్థాయిలో సాధారణంగా జీవుల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కానీ జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది.

ప్రశ్న 11.
జీవద్రవ్యరాశి పిరమిడ్లు అనగానేమి? వివరించండి.
జవాబు:
చెట్లు, గుల్మాలు, పంటలు, గడ్డి, శైవలాలు, నీటి మొక్కలు, వ్యవసాయ మరియు అరణ్య సంబంధ అవక్షేపాలు, మొక్కల, జంతువుల విసర్జితాలన్నీ జీవద్రవ్యరాశులే. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి (Biomass) అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే, అది జీవశక్తి (Biofuel) అవుతుంది.

జీవద్రవ్యరాశి పిరమిడ్ ప్రతి పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని, వివిధ పోషకస్థాయిలలో ఉన్న రాశుల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది. భౌమ్యావరణ వ్యవస్థలలో, ఉత్పత్తిదారుల నుండి మాంసాహారుల వరకు జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల జీవద్రవ్యరాశి పిరమిడ్ల నిర్మాణం నిటారుగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జీవద్రవ్యరాశి ఇతర పోషక స్థాయిలలో ఉన్న జీవుల జీవద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 12.
జలావరణ వ్యవస్థలోని జీవద్రవ్యరాశి పిరమిడను వర్ణించండి.
జవాబు:
జలావరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన నీటిలో తేలే మొక్కల జీవద్రవ్యరాశి, వీటిని ఆహారంగా తీసుకొనే క్రస్టేషియన్లు మరియు శాకాహార చేపల జీవద్రవ్యరాశి కన్నా చాలా తక్కువ. చిన్న చేపలు తినే పెద్ద, మాంసాహార చేపల జీవ ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విధమైన పిరమిడ్ నిర్మాణం తలకిందులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి 10 నుండి .20% వరకు జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది.

ప్రశ్న 13.
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని క్రింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
ఒక పోషకస్థాయిలోని జీవద్రవ్యరాశి, దాని కింది స్థాయిలోని జీవద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకనగా, జీవద్రవ్యరాశి అనేది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారానికి కొలమానం. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు, దానిలోని కొంతభాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి ఆహారమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడడం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించబడకపోవడం జరుగుతుంది.

ప్రశ్న 14.
జీవద్రవ్యరాశి పిరమిడ్లో శక్తి తగ్గుదలను వివరించండి.
జవాబు:
ఆహారపు గొలుసులో, ప్రతి పోషకస్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. 1000 కిలోల నీటిలో తేలే మొక్కలు, 100 కిలోల నీటిపై తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరమవుతుంది. ఆ 100 కిలోల జంతు ప్లవకాలు 10 కిలోల చేపల ఉత్పత్తికి, తిరిగి ఈ చేపలు ఒక కిలో మానవ కణజాలాల ఉత్పత్తికి అవసరమవుతాయి. ఈ జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో (ఉత్పత్తిదారులలో) నిక్షిప్తమైన స్థితిశక్తి (సూర్యరశ్మి ఫలితంగా) పై పోషకస్థాయులకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

ప్రశ్న 15.
కొల్లేరు సరస్సు విస్తీర్ణం తగ్గుదలకు గల కారణాలు ఏమిటి?
జవాబు:
80వ దశకం నుండి కొల్లేరు ప్రాంతంలో రొయ్యలు, చేపల పెంపకం (Acqua culture) అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా విస్తరించింది. అందువల్ల అనేక మంది పెట్టుబడిదారుల దృష్టి దీని పైబడి సరస్సు ఆక్రమణలకు గురైంది. 1996 నాటికి చాలా ప్రాంతాలలో కట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని మళ్ళించి సరస్సును సాగుభూమిగా మార్చారు. ఇది సరస్సు సహజ ప్రవాహ దిశను మార్చివేసింది. అందువల్ల సరస్సులో నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.

ప్రశ్న 16.
విచక్షణారహితంగా పెస్టిసైడ్లు వాడటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
పెస్టిసైడ్లు విచక్షణారహితంగా ప్రభావాన్ని చూపుతూ, ఎక్కువ సంఖ్యలో ఇతర జంతువులను నాశనం చేస్తాయి. వీటిలో ఈ క్రిములను ఆహారంగా తీసుకొనే జంతువులు మరియు ఇతరులకు ఆహారమయ్యే జంతువులూ ఉంటాయి. ఫలితంగా పెస్టిసైడ్లు ఆహారపు గొలుసులలో అనూహ్యమైన మార్పులకు దారితీస్తూ, ఆవరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి నేలలో కలిసిపోయినపుడు అవి కలిగించే ప్రభావం ఇంకా అపాయకరంగా ఉంటుంది.

ప్రశ్న 17.
జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణం పదాలను నిర్వచించంది.
జవాబు:
పాదరసం, ఆర్సెనిక్, సీసం కలిగియున్న పెస్టిసైడ్లు విచ్ఛిన్నం చెందవు. విచ్ఛిన్నం కాని పెస్టిసైడ్లు చాలా అపాయకరమైనవి. ఇవి ఒక్కొక్క పోషకస్థాయిలో కేంద్రీకృతమవుతూ పిరమిడ్ శిఖర భాగంలో ఉండే జంతువుల శరీరాలలోనికి చేరి అపాయకరమైన స్థాయిలో పేరుకుంటాయి. ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని ‘జైవిక వ్యవస్థాపనం’ (Bio accumulation) అంటారు. ఆహారపు గొలుసులోని ఒక పోషకస్థాయి నుండి తరవాత పోషకస్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని జైవిక వృద్ధీకరణం (Bio magnification) అంటారు.

ప్రశ్న 18.
చేపలను లోహ కాలుష్య సూచికలుగా పరిగణిస్తున్నారు. ఎందుకు?
జవాబు:
పట్టణ, పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానాలు, మానవుల నిత్యకృత్యాల కారణంగా భారమూలకాలు దగ్గరలోని నీటివనరులలో కలుస్తున్నాయి. దీని వలన జీవజాలం ఈ కలుషిత నీటిలోనే జీవనం కొనసాగించవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో జీవించే చేపలు లోహ కాలుష్య వాతావరణానికి తీవ్రంగా ప్రతిస్పందించడాన్ని గమనించారు. అందువల్ల ఈ మధ్యకాలంలో చేపలను లోహకాలుష్యాలకు జీవసూచికలుగా భావిస్తున్నారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 19.
ఏదులాబాదు రిజర్వాయర్ లోని చేపలలో గుర్తించిన కలుషితాలు ఏమిటి?
జవాబు:
ఏదులాబాదు చేపల్లో భారమూలకాల పరిమాణం దేశ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అలాగే భారమూలకాల సంచయనాన్ని పరిశీలిస్తే అన్నింటికన్నా ఎక్కువ ఇనుము ఉండగా సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూలకాలు ఆహార జాలకం ద్వారా చేపల కణాల్లో చేరి అక్కడ నుండి మానవులలోకి చేరుతున్నాయి. చేపల కాలేయం, మొప్పలు, మూత్రపిండాలలో కాడ్మియం అత్యధికంగా చేరుతోంది. అతి తక్కువ గాఢతలలో కూడా చేపలు కాడ్మియం లోహానికి సున్నితత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఇది చేపల కణజాలంలోకి సులభంగా చేరుతోందని గుర్తించారు. క్రోమియం, ఇనుము, నికెల్, సీసం తరువాతి స్థానాలలో ఉన్నాయి.

ప్రశ్న 20.
మానవ కార్యకలాపాలు సహజ ఆవరణవ్యవస్థలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
నదులపై ఆనకట్టలు నిర్మిస్తూ, చిత్తడి నేలలను, సముద్రతీరాలను ఆక్రమిస్తూ, అడవులను నరుకుతూ, భూమిని దున్ని పంటలను పండిస్తూ, కాలువలు, రహదారులు, పట్టణాలు మరియు నగరాలను నిర్మిస్తూ మానవుడు సహజ ఆవరణ వ్యవస్థలను ఎన్నో మార్పులకు గురిచేశాడు. ఈ మార్పులు సహజ ఆవరణ వ్యవస్థలలో నివసిస్తున్న వృక్ష, జంతుసముదాయాలను చాలా వరకు మార్చివేశాయి.

ప్రశ్న 21.
ఒక పట్టణ అభివృద్ధిలో ఏ ఏ మార్పులు, జీవజాలంలో చోటు చేసుకుంటాయి?
జవాబు:

  1. కొన్ని వృక్షజంతు జాతులు చనిపోతాయి.
  2. కొన్ని మారిన, కొత్త పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని తక్కువ సంఖ్యలో మనుగడ కొనసాగిస్తాయి.
  3. కొన్ని మారిన, కొత్త పరిస్థితుల నుండి లాభాన్ని పొందుతూ, వాటి సంఖ్యను పెంచుకుంటాయి.

ప్రశ్న 22.
మినిమేటా వ్యాధి గురించి రాయండి.
జవాబు:
మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమయోటో ప్రిఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్ర (Shiranui sea), మినమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్లపాటు కొనసాగాయి.

ప్రశ్న 23.
పిచ్చుకల ప్రయోజనాన్ని శాస్త్రవేత్తలు ఎలా తెలియజేశారు?
జవాబు:
చనిపోయిన పిచ్చుకల జీర్ణవ్యవస్థలోని పదార్థాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. దానిలో మూడు వంతులు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు ఉండగా, ఒక వంతు మాత్రమే ధాన్యపు గింజలు ఉన్నట్లు కనుగొన్నారు. పిచ్చుకలు మానవులకు ఎంతో ఉపయోగం కలిగించే పక్షులని వారు తమ పరిశోధనల ద్వారా నిర్ధారణకు వచ్చారు. పిచ్చుకలను నాశనం చేసే ప్రయత్నాల వలన పంట దిగుబడి పెరగకపోగా మరింతగా తగ్గిపోయింది.

ప్రశ్న 24.
పిచ్చుకల నిర్మూలన వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
మిడతలను తినే పిచ్చుకలు లేకపోవడంతో పంటలపై మిడతల దాడి ఎక్కువయింది. దానితో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తోడయ్యాయి. అతి పెద్ద కరవుకు దారితీశాయి. మిడతలను చంపడానికి కీటకనాశనులను పెద్దమొత్తంలో వినియోగించడం ప్రారంభించడంతో నేల నాణ్యత క్షీణించిపోయింది. పొలాలలో పనిచేయాల్సిన రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకపోడంతో వేల సంఖ్యలో గ్రామాలను వదిలి పరిశ్రమలలో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 25.
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. కొల్లేరు సరస్సు అధికంగా ఆక్రమణలకు లోనైంది.
  2. పరిసరప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చారు.
  3. చేపల పరిశ్రమ లాభసాటిగా ఉండుటవలన ఆక్రమిక ప్రాంతాలు రొయ్యల సాగు కేంద్రాలుగా మారాయి.
  4. కలుషితాలు చేరి, పూడిక పెరిగింది. 5. ఆక్రమణల వలన నీటి ప్రవాహదిశ మారి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
క్రిమి కీటకాల బారి నుండి పంటలను, ఆహార పదార్థాలను నివారించే క్రిమి సంహారకాలను ఉపయోగించాలా? లేదా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలా ? ఆ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను రాయండి.
జవాబు:

  1. క్రిమి సంహారకాలను ఉపయోగించరాదు. వీనికి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలి.
  2. విచక్షణ కాని క్రిమి సంహారకాల వినియోగం వివిధ రకాల కాలుష్యాలకు కారణమవుతుంది.
  3. హానికారక క్రిమిసంహారకాలు ఆవరణ వ్యవస్థలోనికి చేరి జైవిక వ్యవస్థాపనం, జైవిక వృద్ధీకరణంలకు కారణమైన పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నది.
  4. క్రిమిసంహారకాలకు ప్రత్యామ్నాయంగా జైవిక నియంత్రణ, వంధ్యత్వం, జన్యు ఉత్పరివర్తన రకాల అభివృద్ధి మరియు తెగుళ్ళకు సంబంధించిన మూలకారణాల అన్వేషణ విధానాలను అనుసరించాలి.

ప్రశ్న 2.
క్రిమి సంహారకాల వినియోగాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి అనువైన ఏవైనా 4 పర్యావరణహిత పద్ధతులను వివరించండి.
(లేదా)
పంటలకు హాని కలిగించే చీడ పీడలను నివారించేందుకు అనుసరించాల్సిన ఏవేని నాలుగు జైవిక నియమాలను రాయండి.
జవాబు:
పంటలను నాశనం చేసే చీడలను తొలగించడానికి వాడే, రసాయనిక క్రిమి సంహారకాల పర్యావరణాన్ని నాశనం చేయడమే కాక నేలను కూడా కాలుష్యం చేస్తాయి. నేల కాలుష్యాన్ని నివారించడానికి ఈ క్రింది పద్ధతులు ఆచరణ యోగ్యం అయినవి.

1) పంట మార్పిడి :
ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరు వేరు పంటలను పండించే పంట మార్పిడి విధానాన్ని పాటించడం వల్ల తెగుళ్ళను, వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.

2) తెగుళ్ళకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకోవడం :
ఏ తెగులు ఎలా వ్యాపిస్తుంది, దీనికి మూల కారణాలేంటి, అనే విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం వలన పంట నష్టాన్ని నివారించవచ్చు.

3) జైవిక నియంత్రణ :
తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను, నిశాచర మాంస భక్షకులను ప్రవేశపెట్టడం ద్వారా తెగుళ్ళను నివారించవచ్చు.

4) వంధ్యత్వం :
తెగుళ్ళు కలిగించే క్రిమి కీటకాల పురుష జీవుల పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంధ్యత్వం చేయడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.

5) జన్యు ఉత్పరివర్తన రకాలు :
వివిధ రకాల తెగుళ్ళను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యు సంబంధ రకాలను అభివృద్ధి చేయడం ద్వారా పురుగుమందుల వినియోగాన్ని తగ్గించవచ్చు.

6) పర్యావరణ నైతికత కల్గి ఉండడం :
పర్యావరణం పట్ల నైతికత కల్గి ఉండాలి. పర్యావరణ సంబంధ చట్టాలను తెలుసుకోవడమే కాక పర్యావరణపరంగా ఏది సరి అయినది ఏది సరికానిదో తెలుసుకొని ప్రవర్తించాలి.

ప్రశ్న 3.
ఈ దిగువనీయబడిన పటములోని సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 7
i) మీకివ్వబడిన ఆహార జాలకంలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏవి?
ii) పటము నుండి ఏదైనా ఒక ఆహారపు గొలుసును తయారు చేయండి.
iii) పై ఆహారజాలకంలో తృతీయ వినియోగదారులేవి?
iv) ఏవేని రెండు శాకాహార జంతువుల పేర్లను తెలపండి.
జవాబు:
i) మొక్కలు, గడ్డి, వృక్షప్లవకాలు, చెట్లు మొదలైనవి.
ii) గడ్డి → కుందేలు → నక్క → పులి
iii) పులి, రాబందు, కొంగ, గుడ్లగూబ, నెమలి మొదలైనవి.
iv) కుందేలు, జింక, మేక, ఆవు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 4.
ప్రక్కన చూపిన జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 9
a) ఈ పిరమిడ్ లో పైకి వెళ్ళే కొద్దీ ద్రవ్యరాశి తగ్గిపోతుంది కదా ! ఎందుకు?
జవాబు:
ఈ పిరమిడ్ నందు ఉత్పత్తిదారుల నుండి పై పోషకస్థాయికి పోయేకొలది జీవ ద్రవ్యరాశి 10% మాత్రమే బదిలి జరుగుతుంది. అందువలన ద్రవ్యరాశి తగ్గిపోతుంది.

b) ఉత్పత్తిదారులకు, ప్రాథమిక వినియోగదారులకు కొన్ని ఉదాహరణలిమ్ము..
జవాబు:
ఉత్పత్తిదారులు : ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు, వృక్ష ప్లవకాలు
ప్రాథమిక వినియోగదారులు : శాకాహార జంతువులు (లేదా) కుందేలు, ఆవు, మేక మొ॥

c) ఉత్పత్తిదారులకు శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది?
జవాబు:
ఉత్పత్తిదారులకు శక్తి సూర్యుని నుండి లేదా సూర్యరశ్మి నుండి లభిస్తుంది.

d) ప్రతీ పోషకస్థాయిలో ఎంత ద్రవ్యరాశి నష్టపోతున్నది?
జవాబు:
ప్రతీ పోషకస్థాయిలో 90% ద్రవ్యరాశి నష్టపోతుంది.

ప్రశ్న 5.
శక్తి పిరమిడ్ ను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 10

  1. ఆవరణ వ్యవస్థలో ఆహారం ద్వారా జీవులలో శక్తి ప్రసరణ జరుగుతుంది. ఆహారపు గొలుసులో కేలరీలు శక్తిప్రసరణను పిరమిడ్ ఆకారంలో రేఖాత్మకంగా సూచించడాన్ని “శక్తి పిరమిడ్” అంటారు.
  2. ఆహారగొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం జరుగుతుంది. ప్రతి పోషక స్తాయిలో 20% ఆహారం నష్టపోవడం జరుగుతుంది.
  3. కావున ఆహారపు గొలుసులో పైకి ప్రయాణిస్తున్నది కొలది శక్తి విలువ తగ్గుతుంది, అందువలన శక్తిపిరమిడ్ ఎల్లప్పుడూ శీర్షాభిముఖంగానే ఉంటుంది.
  4. ఈ పిరమిడ్ లో అడుగుభాగాన ఉత్పత్తిదారులు అధిక శక్తిని కలిగి ఉండగా, ప్రతి పోషక స్థాయిలో సుమారు 10% శక్తి బదిలీ అవుతూ ఉంటుంది.

ప్రశ్న 6.
నీటిలో అధిక పోషకాలు కలిగిన వ్యర్థాలు చేరటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జవాబు:
వ్యవసాయ రసాయనాలు, ఎరువులు, చేపల చెరువుల వ్యర్థాలు, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు, మున్సిపల్ వ్యర్థాలు మొదలైనవన్నీ సరస్సులో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్థాలు (Anthropogenic pollutants) కలుపు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి.

ఫలితంగా సరస్సులో నీరు క్షారస్వభావంతో, మురికిగా, పోషక పదార్థాలతో కూడి ఉండడం వల్ల నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం (DO) తగ్గిపోయింది. జైవిక ఆక్సిజన్ డిమాండ్ (BOD) ఎక్కువ కావడం వలన జలచరాలపై తీవ్ర ప్రభావం కలిగింది. ఇక్కడి ప్రజలకు జలకాలుష్యంపై అవగాహన లేకపోవడం వల్ల డయేరియా, కలరా, టైఫాయిడ్, అమీబియాసిస్ మొదలైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. వీటితో పాటు దోమలు వంటి వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా ప్రబలాయి. రొయ్యలు, చేప వంటి జలచరాలు కూడా కాలుష్యానికి గురయ్యాయి. పొలాలు వ్యవసాయానికి యోగ్యం కాకుండా పోయాయి. దిగుబడి తగ్గిపోయింది.

ప్రశ్న 7.
చైనా ప్రభుత్వం పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది?
జవాబు:
చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉతృతిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపుదిద్దుకొనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటిదాకా చైనా వ్యవయసాయాధారిత సమాజమే. ఈ ఉద్యమంలో భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అన్నది ఒక ముఖ్యాంశం. దీనివల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది.

ఈ మొదటి విజయంతో తరువాతి సంవత్సరానికి మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. కానీ వాతావరణం అందుకు సహకరించలేదు. కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలను సాధించలేకపోయామనే భయంతో ప్రభుత్వ వ్యవసాయాధికారులు దిగుబడిని ఎక్కువగా లెక్కగట్టారు. ఈ తప్పుడు లెక్కలు ప్రజల అవసరాలకు ఆహార సరఫరాలకు మధ్యగల సమతుల్యత పై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనినుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైకి నెట్టారు. గిడ్డంగుల నుండి సంవత్సర కాలంలో ఒక పిచ్చుక సుమారుగా 1.8 కిలోల ధాన్యపు గింజలు తిన్నదని అందువల్ల ఆహార కొరత ఏర్పడిందని ప్రకటించారు. పిచ్చుకలపై నేరాన్ని మోపారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందరినీ పిచ్చుకలపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.

ప్రశ్న 8.
మీ ఇంట్లో ఏయే పనులకు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారు? వాటిని సంరక్షించడానికి నీవు చేపట్టే చర్యలు ఏవి?
జవాబు:
మా ఇంట్లో LPGని వంటకు, వేడి చేయడానికి మరియు మండించే ప్రక్రియలందు శిలాజ ఇంధనాలను వినియోగిస్తాము. పెట్రోలు మరియు డీజిలను రవాణాకు మరియు జనరేటర్లు, నీటిపంపులు పనిచేయడానికి వినియోగిస్తాము.

శిలాజ ఇంధనాలను సంరక్షించడానికి చేపట్టే చర్యలు :

  1. వంట చేయడానికి అవసరమయిన పదార్ధములు మరియు పాత్రలు సిద్ధం చేసుకున్న తర్వాతే వంట చేయడం మొదలు పెడతాను.
  2. అన్నంను రైస్ కుక్కర్ నందు వండుట వలన 20% మరియు మాంసంను వండుట ద్వారా 41.5% సహజ వాయువును ఆదా అయ్యే విధంగా చూస్తాను.
  3. ప్రెజర్ కుక్కర్ నందు మరిగే ప్రక్రియ – ప్రారంభం అయిన వెంటనే పొయ్యి మంట పరిమాణాన్ని తగ్గిస్తాను. దీని ద్వారా నాకు 35% ఇంధనం ఆదా అవుతుంది.
  4. ఆహార పదార్థాలను వండడానికి ముందు కొంచెం సేపు నానబెట్టుట వలన 22% ఇంధనం ఆదా చేయగలుగుతాను.
  5. వెడల్పు మరియు తక్కువ లోతుగల పాత్రలలో ఆహార పదార్థాలను వండుతాను. తద్వారా ఇంధనమును ఆదా చేస్తాను.
  6. వండే పాత్రలపై మూతను ఉంచుట ద్వారా ఆహార పదార్ధములు త్వరగా ఉడుకునట్లు చూస్తాను.
  7. పాఠశాలకు నడకద్వారా ప్రతిరోజు వచ్చి వెళతాను. దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభుత్వ రవాణా సాధనములను ఉపయోగిస్తాను.
  8. శిలాజ ఇంధనాలకు బదులుగా నీటిని వేడిచేయడానికి, బల్బులను వెలిగించడానికి సోలార్ శక్తిని వినియోగిస్తాను.
  9. పెట్రోలు మరియు డీజిల్ తో నడిచే జనరేటర్లు, నీటి పంపులను సోలార్ పవర్ తో నడిచే విధంగా చూస్తాను.

ప్రశ్న 9.
సాధారణంగా ఆవరణ వ్యవస్థలలో ఉత్పత్తిదారుల నుండి అగ్రభాగాన ఉండే మాంసాహారులకు చేరేసరికి జీవుల సంఖ్య, జీవద్రవ్యరాశి తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొలది శక్తి ప్రసరణ తగ్గుతుంది. సరిపడిన శక్తి కొరకు వినియోగదారులు అధిక సంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఆహార కొరత ఏర్పడి, అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కావున ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల కంటే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో సుమారుగా 90% ఆహారం నష్టపోవడం జరుగుతుంది. జంతువులు తమ ఆహారాన్ని గ్రహించినపుడు దానిలోని కొంత భాగం మాత్రమే తరువాత పోషకస్థాయికి అవసరమయ్యే కొత్త కణజాలాలు ఏర్పడడానికి వినియోగించబడుతుంది. ఆహారంగా గ్రహించిన జీవద్రవ్యరాశి చాలా వరకు విసర్జింపబడటం లేదా శక్తి ఉత్పత్తిలో ఉపయోగించకపోవడం జరుగుతుంది. జీవద్రవ్యరాశి ఉత్పత్తి ప్రక్రియలో, మొక్కలలో నిక్షిప్తమైన . స్థితిశక్తి పై పోషకస్థాయిలకు వెళ్ళే కొద్దీ క్రమంగా నష్టపోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 10.
మీ గ్రామములో కుటుంబ నియంత్రణ, ఆరోగ్య పరిశుభ్రత, పచ్చదనం, పోలియో, ఎయిడ్స్ వంటి కార్యక్రమాలు అమలుపరచడానికి ఎప్పుడు, ఏయే సందర్భాలలో, ఎటువంటి కార్యక్రమాలు చేపడతావో పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

వ్యాధి పేరు/ కార్యక్రమం పేరు అమలు పరిచే కార్యక్రమాలు
1. పోలియో పల్స్ పోలియో కార్యక్రమము నందు అందరు పిల్లలకు వ్యాక్సిన్ వేయటం.
ఇంటింటి ప్రచారం – పోలియో రహిత సమాజం కోసం ప్రచారం.
కరపత్రముల ద్వారా పోలియో వ్యాధి నివారణ చర్యలు ప్రచారం చేయటం.
డాక్టర్లచే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
2. AIDS ఆశ వర్కర్ల సహాయంతో HIV వైరస్ పట్ల ఇంటింటికి తిరిగి అవగాహన కల్గించడం.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులచే ప్రచారం చేయించటం కరపత్రాలు మరియు గోడపత్రికలు విడుదల చేయడం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (డిసెంబర్ 1) జరపటం
సామూహిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం
నిపుణులైన వైద్యులచే సమావేశాలు నిర్వహించడం
3. కుటుంబ నియంత్రణ ప్రజలలో అవగాహన కల్పించడం సామూహిక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సా శిబిరాలను ఏర్పాటు చేయడం.
4. ఆరోగ్యం – పరిశుభ్రత ఆరోగ్యంగా ఉండవలసిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించుట.
పరిశుభ్రత పై నిపుణులచే సలహాలు ఇప్పించుట
ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాల నిర్వహణ
5. పచ్చదనం పచ్చదనం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం సామూహిక చెట్లు నాటే కార్యక్రమాలు వనమహోత్సవాల నిర్వహణ

ప్రశ్న 11.
పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలు మీ పాఠశాలలో ఏమేమి నిర్వహిస్తారో రాయండి.
జవాబు:

  1. పర్యావరణ క్లబ్బులను పాఠశాలలో ఏర్పడే విధంగా చూస్తాము. క్లబ్బు సభ్యులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వాటిలో గ్రామ ప్రజల భాగస్వామ్యము ఉండే విధంగా చూస్తాము.
  2. పాఠశాల యందు అందమైన తోటను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాము. ఇందులో పూల, పండ్ల మరియు కూరగాయల మొక్కలు ఉండే విధంగా చూస్తాము.
  3. పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కరెంటు సరఫరాను నిలుపుదల చేయు అలవాటును విద్యార్థులలో కల్పిస్తాను. దీనిద్వారా విద్యుత్తును ఆదా చేయవచ్చు.
  4. పాఠశాలలో పోగయిన చెత్తను కాల్చకుండా చూస్తాము. క్రుళ్ళిపోయే పదార్థాలను గుర్తించి వాటిని కంపోస్టు ఎరువు తయారీలో వినియోగిస్తాము. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూస్తాము.
  5. పాఠశాల ఒక మూలయందు కంపోస్టు ఎరువును తయారు చేయుటకు గుంటను త్రవ్వి అందులో మధ్యాహ్న భోజన సమయంలో తయారగు వ్యర్థాలు అన్నింటిని వేసి కంపోస్టు తయారీని చేపడతాము. దానిని పాఠశాలలో పెరిగే మొక్కలకు ఎరువుగా వినియోగిస్తాం.
  6. బాల బాలికలు పాలిథీన్ కవర్లు కాకుండా గుడ్డ సంచులను వినియోగించే విధంగా ప్రోత్సహిస్తాము.
  7. ఘన వ్యర్థాలను సేకరించి వాటిని సక్రమ నిర్వహణ ద్వారా వినియోగించి నేల కాలుష్యము కాకుండా చూస్తాము.
  8. విద్యార్థిని విద్యార్థులు ‘4R’ ల పద్ధతిని పాటించే విధంగా కృషి చేస్తాము. తగ్గించడం, తిరిగి వినియోగించడం మరియు పునఃచక్రీయం పద్ధతులను అవలంబించే విధంగా కృషి చేస్తాము.

ప్రశ్న 12.
జీవ ద్రవ్యరాశి అనగానేమి? కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడు గీయండి.
ఎ) గడ్డి బి) శాకాహారులు సి) మాంసాహారులు డి) గద్ద లేదా రాబందు
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. వివిధ ఆహారపు గొలుసుల జీవ ద్రవ్యరాశి పిరమిడ్లను నిర్మిస్తే అవి ఆహారపు గొలుసులోని జీవుల పరిమాణాన్ని సూచిస్తాయి.
గడ్డి → కీటకం → పాము → గద్ద
ఉత్పత్తి శాకాహారి → మాంసాహారి → అగ్రశ్రేణి మాంసాహారి

పై ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడను నిర్మిస్తే అది అధోముఖంగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులో పైకి వెళ్ళేకొలది జీవుల యొక్క జీవ ద్రవ్యరాశి పెరుగుతుండుట వలన పిరమిడ్ తలక్రిందులుగా ఏర్పడింది. కానీ సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉంటాయి.

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత ½ Mark Important Questions and Answers

విస్తరింపుము

1. EBWRని విస్తరించండి.
జవాబు:
ఎడులాబాద్ వాటర్ రిజర్వాయర్

2. MOEF ని విస్తరించండి.
జవాబు:
పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ

3. BODని విస్తరించండి.
జవాబు:
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్

4. DO ని విస్తరించండి.
జవాబు:
కరిగిన ఆక్సిజన్

దోషాన్ని గుర్తించి, సరిచేసి వ్రాయండి

5. పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవేతర కారకాలు అంటారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలోని జీవులను, భాగాలను జీవ కారకాలు అంటారు.

6. జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.
జవాబు:
నిర్జీవ కారకాలను పర్యావరణ కారకాలు అని కూడా అంటారు.

7. పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.
జవాబు:
పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని తిని, వివిధ అణువులుగా తిరిగి పర్యావరణానికి మారుస్తారు.

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

8. పోషకస్థాయి ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.
జవాబు:
నిచ్ ఆహారజాలకంలో జంతువుల స్థానాన్ని మరియు దాని జీవన విధానాన్ని సూచిస్తుంది.

9. ఈజిప్ట్ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ అనేది ఆహార గొలుసులోని వివిధ పోషక స్థాయిల జీవుల మధ్య సంబంధాల యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం.

10. పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ విచ్ఛిన్నకారుల చేత ఆక్రమించబడుతుంది.
జవాబు:
పర్యావరణ పిరమిడ్ యొక్క అడుగు ఎల్లప్పుడూ ఉత్పత్తిదారుల చేత ఆక్రమించబడుతుంది.

11. ఆహార గొలుసులో ప్రతి దశలో సుమారు 10% ఆహారం పోతుంది.
జవాబు:
ఆహారగొలుసులో ప్రతి దశలో సుమారు 90% ఆహారం పోతుంది.

12. ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశపెట్టే ప్రక్రియను బయో మాగ్నిఫికేషన్ అంటారు.
జవాబు:
ఆహార గొలుసులోకి కాలుష్య కారకాలను ప్రవేశ పెట్టే ప్రక్రియను జైవీకరణ అంటారు.

13. కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషకస్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవీకరణ అంటారు.
జవాబు:
కాలుష్య కారకాలు ఒక పోషకస్థాయి నుండి తదుపరి పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు కేంద్రీకృతమయ్యే ధోరణిని జైవిక వృద్ధీకరణ అంటారు.

నేను ఎవరు?

14. నేను ఒక వ్యా ధిని. నేను మొట్టమొదట 1956లో జపాన్లో కనుగొనబడ్డాను. నా కారణంగా పిల్లి, కుక్క పంది మరియు మానవుల మరణాలు 36 ఏళ్ళు కొనసాగాయి. నేను ఎవరు?
జవాబు:
మినిమేటా

15. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంచినీటి సరస్సును. నేను 20 మిలియన్ల నివాసితులకు ఆవాసంగా ఉన్నాను. 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను పక్షుల అభయారణ్యంగా ప్రకటించింది.
జవాబు:
కొల్లేరు సరస్సు

16. నేను బ్రిటిష్ పర్యావరణవేత్తను. పర్యావరణ పిరమిడ్ అనే పదాన్ని పరిచయం చేసిన మొదటి వ్యక్తిని నేను.
జవాబు:
చార్లెస్ ఎల్టన్

17. ఆహార గొలుసు మరియు ఆహార జాలకం గురించి తప్పుగా పేర్కొన్న వ్యత్యాసాన్ని కనుగొనండి.
1. ఇది జీవుల యొక్క సరళ ప్రముల.
2. ఇది బహుళ ఆహార గొలుసుల సముదాయం
3. ఆహార గొలుసు బహుళమార్గాన్ని అనుసరిస్తుంది.
4. ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.
జవాబు:
4 – ఆహార జాలకం ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.

జతపరచుట

18. సరిగ్గా సరిపోలిన దాన్ని గుర్తించండి.
సంఖ్యా పిరమిడ్ – జీవి యొక్క బరువు
జీవ ద్రవ్యరాశి పిరమిడ్- జీవుల సంఖ్య
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం
జవాబు:
శక్తి పిరమిడ్ – శక్తి ప్రవాహం

19. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
ఉత్పత్తిదారి – ఎలుక
ప్రాథమిక వినియోగదారుడు – మొక్క
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి
జవాబు:
ద్వితీయ వినియోగదారుడు – పిల్లి

20. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు
పులి – ప్రాథమిక వినియోగదారులు
జింక – అగ్ర మాంసాహారి
జవాబు:
శిలీంధ్రాలు – విచ్ఛిన్నకారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

21. సరిగ్గా సరిపోలినదాన్ని గుర్తించండి.
జైవిక వృద్ధీకరణ – ఆహార గొలుసులోకి కాలుష్య కారకాల ప్రవేశం
జైవీకరణ – కాలుష్య కారకాల సాంద్రత
పోషకస్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి
జవాబు:
పోషక స్థాయి – ఆహార గొలుసులో శక్తి స్థాయి

ఉదాహరణ ఇవ్వండి

22. జంతువులు జీర్ణించుకోని మొక్కల పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
సెల్యులోజ్, లిగ్నిన్

23. కీటకాల బాహ్య అస్థిపంజరం, మరియు ఈకలు జీర్ణం కాని జంతువుల భాగాలు. వీటికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రోమాలు

24. మెర్క్యురీ మరియు ఆర్సెనిక్ నీటిలో ఉంటే లోహపు వ్యరాలుగా ఉంటాయి. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెడ్

25. ఎదులాబాద్లో నీటి కాలుష్యం యొక్క జీవ సూచికగా పనిచేసే చేపలు ఏమిటి?
జవాబు:
సైప్రినస్ కార్పియో

26. EBWR లో లోహపు నిష్పత్తి యొక్క సరైన క్రమాన్ని వ్రాయండి.
Fe > Pb > Cr > Ni > Cd
జవాబు:
Fe< Pb< Cr < Ni < Cd

27. EBWR లో చేపలలో లోహాలు చేరడం లేదు. తన క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
Cd < Cr < Fe< Ni « Pb

28. పిచ్చుక ప్రచారం తరువాత పంట దిగుబడి చైనాలో గణనీయంగా తగ్గింది. ఈ గొప్ప చైనీస్ కరవుకు గల కారణం ఏమిటి?
జవాబు:
మిడుత జనాభా

29.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 11
ఈ చిత్రం ఏ రకమైన తెగులు నియంత్రణ పద్ధతిని సూచిస్తుంది?
జవాబు:
జీవ నియంత్రణ పద్ధతి

30. భూ సంబంధ పర్యావరణ వ్యవస్థలో నేల మరియు నేల రకాలు జీవేతర కారకాలు. మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఉష్ణోగ్రత / నీరు

31. జల పర్యావరణ వ్యవస్థలో విచ్ఛిన్న కారకాలకు లో ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
శిలీంధ్రాలు / బాక్టీరియా

ఫ్లో చార్టులు

32.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 12
జవాబు:
ఉష్ణోగ్రత

33. ఆహార గొలుసును పూరించండి.
ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారి → ద్వితీయ వినియోగదారి → అగ్రశ్రేణి వినియోగదారి
జవాబు:
ద్వితీయ వినియోగదారి

34.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 13
జవాబు:
సముద్ర ఆవరణ వ్యవస్థ

35. గడ్డి → కుందేలు → నక్క → సింహం
పై ఆహార గొలుసులో ద్వితీయ వినియోగదారి ఏది?
జవాబు:
నక్క

36. గడ్డి → కీటకం → కప్ప → పాము → గ్రద్ద
పై ఆహార గొలుసులో అగ్ర వినియోగదారి ఏది?
జవాబు:
గ్రద్ద

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 14
జవాబు:
రసాయనిక

37.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 15
జవాబు:
సంఖ్యా పిరమిడ్

38. నీటి మొక్క → కీటకాలు → [ ] → కొంగ
జవాబు:
చేప

39. క్రింది వానిలో ఏది జలావరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

40. జీవ ద్రవ్యరాశి పిరమిడను పూరించండి.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 17
జవాబు:
50 kgs

41. క్రింది వానిలో ఏది పరాన్నజీవుల సంఖ్యా పిరమిడ్ ను సూచిస్తుంది?
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 16
జవాబు:
B

10th Class Biology 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 1 Mark Bits Questions and Answers

1. ఈ క్రింది ఆహారపు గొలుసులలో సరైన క్రమము
A) గద్ద → ఎలుక → పాము → ధాన్యం
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద
C) పాము → గద్ద → ఎలుక → ధాన్యం
D) ఎలుక → పాము → ధాన్యం → గద్ద
జవాబు:
B) ధాన్యం → ఎలుక → పాము → గద్ద

2. చార్లెస్ ఎల్టన్ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం ………….
A) మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటాయి
B) పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడును
C) పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

3. ఆహారపు గొలుసు దేనితో మొదలౌతుంది?
A) మాంసాహారి
B) ఉత్పత్తిదారు
C) శాకాహారి
D) ఏదీకాదు
జవాబు:
B) ఉత్పత్తిదారు

4. మొక్క → కీటకము – కప్ప → [ ]
A) పాము
B) గుడ్డు
C) పుష్పం
D) ఏదీకాదు
జవాబు:
A) పాము

5. క్రిందివానిలో ప్రాథమిక వినియోగదారులు
A) కుందేలు
B) పులి
C) కప్ప
D) పాము
జవాబు:
A) కుందేలు

6. ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → తృతీయ వినియోగదారులు
ఈ ఆహారపు గొలుసులో 2లో ఈ జీవి ఉంటుంది.
A) పాము
B) మొక్క
C) మిడుత
D) కప్ప
జవాబు:
C) మిడుత

7. క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే …………..
A) పురుగుమందుల వాడకంపై పూర్తి నియంత్రణ
B) పురుగుమందుల నిషేధం
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం
D) జీవ రసాయన పరిశ్రమలు మూసివేయడం
జవాబు:
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడం

8.
AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 19
ఖాళీని పూరించడానికి సరియైన దానిని ఎన్నుకోండి.
A)మిడత
B) పాము
C)కప్ప
D) గద్ద
జవాబు:
B) పాము

9. క్రింది పట్టికలో (?) స్థానంలో వుండవలసినది

పిరమిడ్ రకం ఆధారం
సంఖ్యా పిరమిడ్ జీవుల సంఖ్య
? శక్తి పరిమాణం

A) భౌగోళిక పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

10. క్రింది పట్టికను పూరింపుము.

పిరమిడ్ రకం ఆధారం
సంఖ్యా పిరమిడ్ జీవుల సంఖ్య
……… ? ……. శక్తి ప్రవాహం

A) ఆవరణ పిరమిడ్
B) శక్తి పిరమిడ్
C) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
D) గిజా పిరమిడ్
జవాబు:
B) శక్తి పిరమిడ్

11. 1958లో చైనా ఏ పక్షులపై దండయాత్ర ప్రకటించింది?
A) చిలుకలు
B) పిచ్చుకలు
C) కాకులు
D) రాబందులు
జవాబు:
B) పిచ్చుకలు

12. నేలలో నత్రజనిని వృద్ధి చేసే మొక్క ఏది?
A) బంతి
B) తుమ్మ
C) గైరిసిడియా
D) కాక్టస్
జవాబు:
C) గైరిసిడియా

13. కింది వానిలో జలావరణ వ్యవస్థ నందు నిటారుగా ఉండని పిరమిడ్
A) సంఖ్యా పిరమిడ్
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్
C) శక్తి పిరమిడ్
D) ఉష్ణ, పిరమిడ్
జవాబు:
B) జీవ ద్రవ్యరాశి పిరమిడ్

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

14. కింది వానిలో గ్రీన్‌హౌస్ వాయువు కానిది ………
A) కార్బన్ డయాక్సెడ్
B) మీథేన్
C) ఓజోన్
D) క్లోరోఫ్లోరో కార్బన్స్
జవాబు:
C) ఓజోన్

15. గీత ఎల్లప్పుడూ మన్నిక గల వస్తువులనే వాడుతుంది, ఎందుకంటే …….
A) వ్యర్థాలను తగ్గించటానికి
B) పునః వినియోగం తగ్గించటానికి
C) పునః చక్రీయం తగ్గించటానికి
D) పునః స్థాపన పెంచటానికి
జవాబు:
A) వ్యర్థాలను తగ్గించటానికి

16. రేణురూప పదార్థాలు గాలిలో చేరుట వల్ల
A) మూత్రపిండాల వ్యాధులు కల్గుతాయి
B) ఆర్గెటీస్ కలుగుతుంది
C) కీళ్ళనొప్పులు కలుగుతాయి.
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.
జవాబు:
D) శ్వాసకోశ వ్యాధులు కల్గుతాయి.

17. భౌగోళిక వెచ్చదనంను తగ్గించుటకు నీవు పాటించే పద్ధతి
A) ప్లాస్టిక్ ను కాల్చివేయడం
B) విస్తారంగా పశువులు మేపడం
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట
D) ఎ.సి. ల వాడకాన్ని పెంచడం
జవాబు:
C) శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుట

18. కింది వాక్యాలలో సరియైనది.
i) పిరమిడ్ ఆధార భాగంలో ఎల్లప్పుడు ఉత్పత్తిదారులే ఉంటారు.
ii) జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఎల్లప్పుడు నిటారుగా ఉంటుంది.
A) (i), (ii) సరియైనవి.
B) (i) మాత్రమే సరియైనది.
C) (ii) మాత్రమే సరియైనది.
D) (i), (ii) లు సరియైనవి కావు.
జవాబు:
B) (i) మాత్రమే సరియైనది.

19. దేనికోసం మొక్కలు పోటీ పడతాయి?
(i) నీరు (ii) ఆహారం (iii) స్థలం
A) (i) మరియు (ii)
B) (ii) మరియు (iii)
C) (i) మరియు (iii)
D) (i), (ii) మరియు (iii)
జవాబు:
C) (i) మరియు (iii)

20. పంటలు పండించడానికి సరియైన పద్దతి కానిది
A) పంట మార్పిడి
B) జైవిక నియంత్రణ
C) మిశ్రమ పంటలు పండించడం
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం
జవాబు:
D) రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం

21. ఎల్లప్పుడు ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది?
A) శాకాహారులు
B) మాంసాహారులు
C) ఉత్పత్తిదారులు
D) ఏదీకాదు
జవాబు:
C) ఉత్పత్తిదారులు

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత

22. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరయిన వాక్యం
A) సంఖ్యా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా ఉత్పత్తి దారులు పై భాగంలో ఉంటాయి.
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.
C) సాధారణంగా సంఖ్యా పిరమిడ్ లాగే జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఉంటుంది.
D)ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయి జీవులకు శక్తి పూర్తిగా చేరుతుంది.
జవాబు:
B) చార్లెస్ ఎల్టన్ జీవావరణ పిరమిడ్ల రేఖాచిత్రాలను మొదటగా ప్రవేశపెట్టాడు.

మీకు తెలుసా?

• పిరమిడ్ నిర్మాణం జ్యామితీయ ఆకృతిలో ఉంటుంది. బయటి ఉపరితలాలు త్రిభుజాకారంలో ఉండి వాటి చివరలు పై కొనలో కలుస్తాయి. పిరమిడ్ అడుగుభాగం త్రిముఖీయంగా లేదా చతుర్ముఖీయంగా లేదా బహుముఖీయ ఆకారంలో ఉంటుంది. చతురస్రాకార పిరమిడ్ల చతురస్రాకారంగా ఉండి బయటి ఉపరితలాలు మాత్రం త్రిభుజాకారంలో ఉంటాయి. సాధారణంగా పిరమిడ్ లో ఈ ఆకృతిలోనే ఉంటాయి.

• శిలాజ ఇంధనాలపై (భూమిలో మృత కళేబరాల అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలు) మనం ఆధారపడటాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, జీవ ద్రవ్యరాశిని కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చును. జీవ ద్రవ్యరాశిని ఇంధనంగా వాడినపుడు కూడా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ, అది జీవ ద్రవ్యరాశి ఏర్పడటానికి, తిరిగి గాలి నుండి గ్రహించబడుతుంది.

• మినిమేటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్‌లోని కుమమోటో ఎఫెక్చర్ లో గల మిమిమేటా నగరంలో కనుగొన్నారు. 1932 నుండి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాలే, మినిమేటా వ్యాధికి కారణం. షిరని సముద్రం (Shiranui sea) మినిమేటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోకి మిథైల్ మెర్క్యురీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్ళుగా కొనసాగాయి.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 9th lesson మన పర్యావరణం – మన బాధ్యత 18

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

These AP 9th Biology Important Questions and Answers 6th Lesson జ్ఞానేంద్రియాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Biology 6th Lesson Important Questions and Answers జ్ఞానేంద్రియాలు

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
మనకు ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది?
జవాబు:
నాడీ సంకేతాల వలన ఇంద్రియ జ్ఞానం కలుగుతుంది.

ప్రశ్న 2.
ఆకు ఆకుపచ్చగా కనబడుటకు కారణమేది?
జవాబు:
ఆకుపచ్చని ఆకు నుండి పరావర్తనం చెందిన కాంతి గ్రాహకాలను చేరి నాడీ సంకేతాలుగా మారి అవి మెదడుకు చేరి, అది ఒక ఆకుపచ్చని ఆకారంగా రూపకల్పన చేయబడుతుంది.

ప్రశ్న 3.
దృష్టి ఎందుకు సహాయపడుతుంది?
జవాబు:
మన భౌతిక పరిసరాల్లో కోరుకున్న ‘గమ్యాలు, భయాలు, మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ఉండడానికి దృష్టిలో (చూపు) ఉపయోగపడుతుంది.

ప్రశ్న 4.
కంటిలోని మూడు ముఖ్యమైన పొరలు ఏవి?
జవాబు:
దృఢస్తరం, రక్తపటలం మరియు నేత్రపటలం కంటిలోని మూడు ముఖ్యమైన పొరలు.

ప్రశ్న 5.
కటకం కంటి గుడ్డు లోపలి భాగాల్ని ఎన్ని భాగాలుగా విడగొడుతుంది?
జవాబు:
రెండు భాగాలు, అవి నేత్రోదక కక్ష మరియు కాచావత్ కగా విడగొడుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 6.
నేత్రోదక కక్ష మరియు కాచావత్ కక్ష వేటితో నింపబడి ఉంటాయి?
జవాబు:
నేత్రోదక కక్ష నీరు వంటి ద్రవంతోను, కాచావత్ కక్ష జెల్లి వంటి ద్రవంతోను నిండి ఉంటాయి.

ప్రశ్న 7.
కంటిని మనము ఏ విధంగా భావించవచ్చు?
జవాబు:
ప్రపంచంలోని దృశ్యాలను చలన చిత్రాలుగా తీయడానికి మెదడు ఉపయోగించే ఒక రకమైన వీడియో కెమెరాగా కంటిని భావించవచ్చు.

ప్రశ్న 8.
కన్ను ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది?
జవాబు:
కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 9.
కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, కుడి ఎడమగాను, తలకిందులుగాను ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
నేత్రపటలం మధ్యభాగంలో ఉండే ఫోవియో యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
ఫోవియో నందు శంకువులు గుమికూడి ఉంటాయి. ఇవి , దృష్టి స్పష్టంగా ఉండేలా చేస్తాయి. మరియు మనం చూడాలనుకున్న దానిని సూక్ష్మంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది.

ప్రశ్న 11.
అంధచుక్క అనగా నేమి?
జవాబు:
నేత్రపటలంలో ఒక చిన్న ప్రాంతంలో కాంతి గ్రాహకాలు ఉండవు. దానితో ఆ ప్రాంతం అంధకారంగా ఉంటుంది. దీనిని అంధచుక్క అంటారు.

ప్రశ్న 12.
కంటిని, కంటి భాగాల్ని యాంత్రిక అఘాతాల నుండి రక్షించేవి ఏవి?
జవాబు:
నేత్రోదక కక్ష, కచావత్ కక్షలో ఉండే ద్రవాలు కంటిని, కంటి భాగాల్ని రక్షిస్తాయి.

ప్రశ్న 13.
కంటిలోని ద్వికుంభాకారంలో ఉండే కటకం యొక్క ఆకారాన్ని మార్చేవి ఏవి?
జవాబు:
కటకాల యొక్క నాభ్యంతరం శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయువుల సహాయంతో మార్పుచేయబడుతుంది. అవి కటకం యొక్క ఆకారాన్ని కావలసిన విధంగా మార్చగలవు.

ప్రశ్న 14.
భ్రమలు మనకు దృష్టి జ్ఞానం గురించి ఏమి తెలుపుతాయి?
జవాబు:
భ్రమలు మనం చూస్తున్న దానికి బాహ్యంగా ఉన్న సత్యానికి మధ్య ఉన్న తేడాల్ని అవగాహన చేసుకోడానికి, తార్కికతను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 15.
కళ్ళకు ప్రధానంగా వచ్చే కొన్ని వ్యాధులు ఏవి?
జవాబు:
రేచీకటి, పొడిబారిన కళ్ళు, హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి, గ్లూకోమా, కంటి శుక్లం, వర్ణాంధత మొదలగునవి కళ్ళకు వచ్చే వ్యాధులు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 16.
చెవుల యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
వినడంతోబాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.

ప్రశ్న 17.
చెవినందలి మూడు భాగాలు ఏవి?
జవాబు:
వెలుపలి చెవి, మధ్యచెవి మరియు అంతర చెవి

ప్రశ్న 18.
వెలుపలి చెవినందుండే గ్రంథులు ఏవి?
జవాబు:
వెలుపలి చెవినందు మైనాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథులు, తైలాన్ని స్రవించే తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది.

ప్రశ్న 19.
మధ్య చెవినందలి మూడు ఎముకలు ఏవి?
జవాబు:
కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణాంతరాస్థి లేక అంకవన్నె అనే మూడు ఎముకలు మధ్య చెవిలో ఉంటాయి.

ప్రశ్న 20.
అంతర చెవినందు ఉండే పేటికా ఉపకరణం యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:
పేటికా ఉపకరణం శరీరస్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి, శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది.

ప్రశ్న 21.
చెవికి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏవి?
జవాబు:
బాక్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు.

ప్రశ్న 22.
ముక్కు జంతువులను ఏ విధంగా సంరక్షిస్తోంది?
జవాబు:
ప్రమాదకరమైన ఆహారం, పరభక్షుల నుండి వచ్చే వాసనను గ్రహించుట ద్వారా ముక్కు జంతువులను సంరక్షిస్తోంది.

ప్రశ్న 23.
నాలుక కలిగించే రుచి జ్ఞానంలో ఉన్న నాలుగు ప్రాథమిక రుచులు ఏవి?
జవాబు:
తీపి, పులుపు, చేదు, ఉప్పు నాలుక కలిగించే రుచి రకాలు.

ప్రశ్న 24.
ఉమామి రకపు రుచి గురించి తెలపండి. ఏయే ఆహారపదార్థాలలో ఉంటుంది?
జవాబు:
మాంసం, సముద్రం నుండి లభించే ఆహారం, జున్ను వంటి మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహారం నుండి వచ్చే వాసనను ‘ఉమామి’ అంటారు.

ప్రశ్న 25.
ఆహారపు రుచిని ఏవిధంగా తెలుసుకోగలం?
జవాబు:
ఆహారం నమిలిన, కొరికిన, చప్పరించిన వెలువడే రసాయనాలు రుచికణికల్ని ప్రేరేపిస్తాయి. దాంతో అవి ప్రేరణను మెదడుకు పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 26.
నాలుక మీద ఉండే నిర్మాణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
నాలుగు రకాలు. అవి :

  1. ఫిలిఫార్మ్ పాపిల్లే
  2. ఫంగిఫార్మ్ పాపిల్లే
  3. సర్కంవేలేట్ పాపిల్లే
  4. ఫోలియేట్ పాపిల్లే.

ప్రశ్న 27.
చర్మంలోని రెండు ముఖ్యమైన పొరలు ఏవి?
జవాబు:
బహిశ్చర్మం మరియు అంతశ్చర్మం అనేవి చర్మంలోని పొరలు.

ప్రశ్న 28.
బహిశ్చర్మం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? అవి ఏవి?
జవాబు:
బహిశ్చర్మం మూడు పొరలను కలిగి ఉంటుంది. అవి వెలుపలి కార్నియం పొర, జీవకణాలుండే గ్రాన్యులర్ పొర మరియు స్థిరంగా విభజనలు చెందే మాల్ఫీజియన్ పొర.

ప్రశ్న 29.
అంతశ్చర్మంలో ఏమి ఉంటాయి?
జవాబు:
అంతశర్మంలో స్వేదగ్రంథులు, తైలగ్రంథులు, రోమపుటికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయి.

ప్రశ్న 30.
కంటి చూపులో బలహీనులయిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు స్పర్శ ద్వారా బ్రెయిలీ లిపిని ఎందుకు చదవగలరు?
జవాబు:
బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఉబ్బెత్తులు, పల్లాలు కలిగి ఉంటాయి. అందువలన కంటి చూపులో బలహీనులయిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు బ్రెయిలీ లిపిని చదువగలరు.

ప్రశ్న 31.
జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు?
జవాబు:
వారు మామూలు మనుష్యులలాగానే జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసమును వారిలో నింపుతాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమకు ఎటువంటి కొరత లేదనే భావనను మరియు వారికి కొదువ లేదనే తృప్తిని అందిస్తాను.

ప్రశ్న 32.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులు నీకు ఎలాఉపయోగపడుతున్నాయి?
జవాబు:
మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వీనుల విందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో మరియు చల్లని చిరుగాలిని చర్మంతో స్పర్శిస్తున్నాము మరియు ఆహార పదార్థాల రుచిని నాలుకతో ఆస్వాదిస్తున్నాము.

ప్రశ్న 33.
కాంతి యొక్క హానికర ప్రభావానికి లోనుగాకుండా శరీరపు పొరలను చర్మం ఏ విధముగా కాపాడుతుంది?
జవాబు:
చర్మంలో ఉండే వర్ణద్రవ్యం మెలనిన్ సూర్యకాంతి చేత ఉత్తేజితమవుతుంది. అటువంటప్పుడు చర్మం నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోనుగాకుండా చూస్తుంది.

ప్రశ్న 34.
కన్నీరు మనకు ఏ విధముగా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఎప్పుడైనా, ఏదైనా అవసరం లేని పదార్థం కనుక కంటిలో పడితే వెంటనే అశ్రుగ్రంథులు ప్రేరేపితమై ఆ పదార్థాన్ని బయటకు పంపించివేస్తాయి.

ప్రశ్న 35.
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది?
జవాబు:
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే శబ్దతరంగాలు సేకరించబడవు తద్వారా మనకు ఏమీ వినపడదు.

ప్రశ్న 36.
మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు మామూలుగా పదార్థాలను వాసన చూడగలరా? (పేజీ నెం. 89)
జవాబు:
జలుబుగా ఉన్నప్పుడు నాసికామార్గాలు మూయబడి ఉండుట చేత మనకు ఆహారము యొక్క వాసన తెలియదు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 37.
వాసనకి, రుచికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? (పేజీ నెం. 89)
జవాబు:
వాసన, రుచి కూడా ఆహారంలో ఉండే రసాయనాలను గుర్తించడం పైన ఆధారపడిన ఇంద్రియ జ్ఞానము. ఇవి ఒకదానితో ఒకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి.

ప్రశ్న 38.
మనకు దోమ కుట్టగానే దానిని ఎలా చంపగలం?
జవాబు:
కాలిమీద దోమ కుట్టగానే జ్ఞాన నాడులు దోమకుట్టే సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. మెదడు దోమను చంపాల్సిందిగా చాలకనాడుల ద్వారా చేతికి సమాచారం పంపుతుంది. అప్పుడు చేతితో దోమను చంపుతాం.

ప్రశ్న 39.
మానవులలో జ్ఞానేంద్రియములు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
మానవులలో ఐదు జ్ఞానేంద్రియాలు కలవు. అవి :

  1. కన్ను
  2. చెవి
  3. ముక్కు
  4. నాలుక
  5. చర్మం.

ప్రశ్న 40.
కంటిలోని ప్రధాన భాగాలేవి?
జవాబు:
కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు, కంటిగుడ్డు కంటిలోని ప్రధాన భాగాలు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 41.
అరచేయిలో ఎక్కడ స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది? (పేజీ నెం. 93)
జవాబు:
అరచేయి మధ్యలో స్పర్శజ్ఞానం ఎక్కువ.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మీరు జ్వరంతో బాధపడుతున్నప్పుడు నోటికి ఆహారం రుచిగా ఉండదు. ఎందువల్ల?
జవాబు:
రుచి కణికల్లో ఉండే ఎంజైములు 77°F నుండి 98.6°F వరకు మాత్రమే పనిచేస్తాయి. ఎంజైములు పనిచేయక పోవడం వలన రుచి కణికలో ఉండే కణాలు మెదడు నందలి రుచి భాగములకు సమాచారమును పంపకపోవడం వలన జ్వరంగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

ప్రశ్న 2.
కన్ను ఇతర జ్ఞానేంద్రియాల కంటే ఏ విధముగా భిన్నమైనది?
జవాబు:
కాంతి తరంగాల నుండి సమాచారాన్ని తీసుకొని మెదడు, తన ప్రక్రియను నిర్వర్తించడానికి వీలుగా వాటి కాంతి లక్షణాలను నాడీ సంకేతాలుగా మార్చే సామర్థ్యం ఇతర జ్ఞానేంద్రియాలకు లేకుండా కంటికి మాత్రమే ఉన్న లక్షణం.

ప్రశ్న 3.
నేత్రపటలంలోని దందాల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. మన కంటిలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం కలిగిన దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉన్నాయి.
  2. అవి అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువుల్ని చూడగలవు. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం గుర్తించలేవు.

ప్రశ్న 4.
కన్ను గురించి ఇటీవల కనుగొనిన విషయాలు ఏమిటి?
జవాబు:
వస్తువుల అంచులు, సరిహద్దులను సునిశితంగా చూపేవి, వెలుతురుకు, నీడకు, కదలికలకు స్పందించే ప్రత్యేక గ్రాహక కణాల్ని నేత్రపటలంలో ఇటీవల కనుగొన్నారు.

ప్రశ్న 5.
ఆధార్ కార్లను ఇవ్వడంలో కంటిపాపలు ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:

  1. కంటిపాపలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి.
  2. అందుకే వేలిముద్రల మాదిరిగానే కంటిపాపలను కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
చెవులు నిర్వహించే విధులు ఏమిటి?
జవాబు:
చెవుల యొక్క విధులు :

  1. శబ్ద ప్రకంపనాలను నాడీ ప్రేరణలుగా మార్చి మెదడుకు అందించడం.
  2. సమతాస్థితిని కాపాడుతాయి.

ప్రశ్న 7.
నాసికా కుహరమునందలి శ్లేష్మము మరియు వెంట్రుకల ఉపయోగం ఏమిటి?
జవాబు:
ముక్కు కుహరంలో ఉండే వెంట్రుకలు, మ్యూకస్, దుమ్ము, సూక్ష్మక్రిములు ఇంకా అవసరములేని ఇతర పదార్థాలను ముక్కు ద్వారా శరీరంలోకి చేరకుండా కాపాడతాయి.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 8.
చర్మము యొక్క గ్రాహక స్వభావమెటువంటిది?
జవాబు:

  1. స్పర్శకు, ఉష్ణోగ్రతకు, పీడనానికి చర్మం సూక్ష్మ గ్రాహకత్వాన్ని చూపుతుంది.
  2. స్పర్శకు స్పర్శ గ్రాహకాలు, పీడనానికి పెసిమియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకి నాసిష్టారులు వంటి ప్రత్యేక గ్రాహకాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 9.
చర్మానికి వచ్చే కొన్ని వ్యాధులను తెలపండి.
జవాబు:

  1. పొంగు, ఆటలమ్మ వంటివి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు.
  2. చర్మానికి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి కుష్టు.
  3. మెలనిన్ లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి బొల్లి.
  4. ఫంగస్ వలన చర్మానికి తామర వస్తుంది.
  5. విటమిన్ల లోపం వలన చర్మానికి పెల్లాగ్రా వ్యాధి వస్తుంది.

ప్రశ్న 10.
మెలనిన్ అనగానేమి? మెలనిన్ యొక్క విధులేమిటి?
జవాబు:

  1. చర్మానికి రంగునిచ్చే వర్ణద్రవ్యము మెలనిన్.
  2. ఈ వర్ణద్రవ్యం సూర్యకాంతి చేత ఉత్తేజితమవుతుంది.
  3. అటువంటప్పుడు చర్మం నల్లబడి మిగిలిన పొరల్ని కాంతి యొక్క హానికర ప్రభావానికి లోను కాకుండా చేస్తుంది.

ప్రశ్న 11.
మనకు వెలుపలి చెవి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? (పేజీ నెం. 87)
జవాబు:

  1. చెవి ద్వారా శబ్దతరంగాలు సేకరించబడవు.
  2. మధ్య చెవిని తాకే శబ్ద తరంగాలను మాత్రమే వినగలము.
  3. అందువలన వెలుపలి చెవి శబ్ద తరంగాలను సేకరించకపోతే మనకు ఏమీ వినపడదు.

ప్రశ్న 12.
ప్రేరణలు లేదా ఉత్తేజకాలు అనగానేమి? పరిసరాల నుండి సమాచారం మెదడుకు ఎట్లా చేరుతుంది?
జవాబు:

  1. ప్రకృతిలోని కొన్ని పరిస్థితులు, పదార్థాలు ఇంద్రియ జ్ఞానం మన శరీరంలో కలిగేలా ప్రేరేపిస్తాయి. వాటిని ప్రేరకాలు లేదా ఉత్తేజకాలు అంటారు.
  2. ఈ ఉత్తేజకాలు తీసుకెళ్ళే సమాచారాన్ని మన జ్ఞానేంద్రియాలలోని గ్రాహకాలు గ్రహించి నాడీ సంకేతాలుగా మారుస్తాయి.
  3. ఇవి మెదడుకు అందించబడి, ఇంద్రియ జ్ఞానంగా రూపొందుతాయి.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జ్ఞానేంద్రియాలు చేసే పనికి కేంద్రం ఎవరు? అది ఏ విధముగా సమాచారాన్ని విశ్లేషిస్తుంది? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం మెదడు.
  2. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలు తెచ్చే జ్ఞాననాడులు ద్వారా సమాచారాన్ని అందుకుంటుంది.
  3. తరువాత వాటిని విశ్లేషించి చాలకనాడులు అని పిలువబడే నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది.
  4. ఉదాహరణకు మన కాలి మీద దోమ కుట్టగానే జ్ఞాననాడులు దోమ కుట్టిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి.
  5. మెదడు దోమను చంపాల్సిందిగా చాలకనాడుల ద్వారా చేతికి సమాచారం పంపుతుంది. అపుడు చేతితో దోమను చంపేస్తాం.

ప్రశ్న 2.
కంటి నిర్మాణమును పటము సహాయముతో వివరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. మన కంటిలో కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు ఉంటాయి.
  2. కంటి ముందు భాగాన్ని పలుచటి కంటిపొర కప్పి ఉంటుంది.
  3. కంటి గుడ్డు కంటి గుంతలో అమరి ఉంటుంది.
  4. కంటిగ్రుడ్డులో కేవలం 1/6వ వంతు భాగం మాత్రమే మన కంటికి కన్పిస్తుంది.
  5. కంటిలో మూడు ముఖ్యమైన పొరలు ఉన్నాయి. అవి దృఢస్తరం, రక్తపటలం నేత్రపటలం.
  6. దృఢస్తరం ఉబ్బి శుక్లపటలంను ఏర్పరుస్తుంది.
  7. దృఢస్తరం యొక్క కొనభాగంలో దృక్నడి కలుపబడుతుంది.
  8. రక్తపటలం నలుపురంగులో ఉండి అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది.
  9. తారక భాగాన్ని తప్ప కంటి యొక్క అన్ని భాగాల్ని రక్తపటలం ఆవరించి ఉంటుంది.
  10. తారక చుట్టూ రక్తపటలం నుండి ఏర్పడిన భాగము కంటిపాప.
  11. తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది.
  12. కంటిగుడు లోపలి భాగమును నేత్రోదక కక్ష, కాచావత్ కక్ష అనే రెండు భాగాలుగా కటకం విడగొడుతుంది.
  13. నేత్రపటలంలో దండాలు, శంకువులు ఉంటాయి.
  14. దృష్టి జానంలేని అంధచుక్క, మంచి దృష్టి జ్ఞానాన్ని కలిగిన పచ్చచుక్క నేత్రపటలంలో ఉంటాయి.
  15. పచ్చచుక్కను మేక్యులా అని, ఫోవియా అని కూడా అంటారు.

ప్రశ్న 3.
కన్ను పనిచేసే విధానమును వివరించండి.
జవాబు:

  1. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి, కంటిలో వెనుకభాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  2. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.
  3. ఈ తలకిందులైన ప్రతిబింబం మెదడు నిర్మాణంపై ప్రభావం చూపి జ్ఞానకేంద్రాలలో దాన్ని సక్రమంగా చేయడానికి మార్గాన్ని ఏర్పరచుకుంటుంది.
  4. అందువల్ల జ్ఞానేంద్రియాల నుండి వచ్చే సమాచారం చాలా వరకు మెదడులో వ్యతిరేకదిశ నుండి దాటిపోతుంది.
  5. మెదడులోని జ్ఞానకేంద్రాలలో పటాలన్నీ సాధారణముగా తిరగబడి, తలకిందులుగా అవుతాయి.
  6. కన్ను ఏర్పరచే ప్రతిబింబం మెదడులో మరొక పెద్ద ప్రక్రియకు లోనవుతుంది.

ప్రశ్న 4.
కాంతి గ్రాహకాలు అనగానేమి? అవి కాంతిని ఏ విధముగా గ్రహిస్తాయి?
జవాబు:

  1. నేత్రం పటలంలో ఉండే సున్నితమైన కాంతిని గ్రహించే కణములను కాంతి గ్రాహకాలు అంటారు.
  2. కాంతి గ్రాహకాలలో కాంతి శక్తిని శోషించుకోగలిగి, నాడీ ప్రేరణలను సృష్టించి ప్రత్యుత్తరమివ్వగలిగే దండాలు, శం అనే రెండు రకాల ప్రత్యేక కణాలు ఉంటాయి.
  3. మన కళ్ళు కొన్నిసార్లు చిమ్మచీకటిలోను, కొన్నిసార్లు కాంతివంతమైన వెలుతురులోనూ పనిచేస్తుంటాయి.
  4. అందుకనే ఈ రెండు రకాల కణాలు తగిన ప్రక్రియలను నిర్వహిస్తాయి.

ప్రశ్న 5.
నేత్రపటలం నందలి శంకువుల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. రంగుల్లో స్వల్ప ప్రత్యేకతల్ని చూడగలిగే లక్షణం శంకువుల్లో ఉంది.
  2. దాదాపు ఏడు మిలియన్ల శంకువులు కంటిలో ఉంటాయి.
  3. అవి అయొడాప్సిన్ అనే వర్గపదార్థాన్ని కలిగి కాంతివంతమైన వెలుతురులో రంగుల్ని గుర్తిస్తాయి.
  4. నేత్రపటలం మధ్యభాగంలో ఉండే ఫోవియా అనే చిన్నభాగంలో శంకువులు గుమిగూడి ఉండి దృష్టి స్పష్టంగా ఉండేలా చేస్తాయి.

ప్రశ్న 6.
కన్నులు ఏ విధంగా సంరక్షించబడతాయి?
జవాబు:

  1. కనురెప్పలు, రెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు అశ్రుగ్రంథులతో కన్ను నిరంతరం రక్షించబడుతూ ఉంటుంది.
  2. కంటి ముందు భాగాన ఉన్న కంటిపొర కంటికి రక్షణ కల్పిస్తుంది.
  3. ఏదైనా అవసరం లేని పదార్థం కనుక కంటిలో పడితే వెంటనే ఆశ్రుగ్రంథులు ప్రేరేపితమై ఆ పదార్థాన్ని బయటకు పంపించివేసాయి.
  4. కంటిలో నేత్రక, కాచావత్ కక్షలో ఉండే ద్రవాలు కటకాన్ని, కంటి యొక్క ఇతర భాగాల్ని యాంత్రిక అఘాతాల నుండి రక్షిస్తాయి.
  5. కంటిపాపకు ముందుండే శుక్లపటలం, దృఢస్తరం ఒక పరిశుభ్రమైన కిటికీలా పనిచేస్తుంది. అది కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురికాకుండా రక్షిస్తుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 7.
వెలుపలి చెవి గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. వెలుపలి చెవి ఒక గొప్ప మాదిరిగా ఉంటుంది. దీన్నే పిన్నా అని అంటారు.
  2. పిన్నా మగాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథుల్ని, తైలాన్ని స్రవించే తైలగ్రంథుల్ని కలిగి ఉంటుంది.
  3. ఇవి శ్రవణ కుహరాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇంకా దుమ్ము, ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆపుతాయి.
  4. శ్రవణ కుహరాన్ని ఆడిటరీ మీటస్ అని కూడా అంటారు.
  5. శ్రవణ కుహరం చివరలో కర్ణభేరి అనే పలుచని పొర ఉంటుంది.
  6. ఇది వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. ఇది ఒక శంకువు ఆకారంలో ఉంటుంది.
  7. కర్ణభేరి సన్నటి భాగం మధ్యచెవి యొక్క మొదటి ఎముక కూటకం లేక సుత్తికి కలుపబడి ఉంటుంది.

ప్రశ్న 8.
మధ్య చెవి గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. కరభేరిపై కలిగిన ప్రకంపనాలకు పెంచడంలో మధ్యచెవి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
  2. మూడు ఎముకల గొలుసు కూటకము లేక సుత్తి, దాగలి లేక పట్టెడ, కర్ణాంతరాస్థి లేక అంకవన్నె ఈ పనికి సహకరిస్తాయి.
  3. మధ్య చెవి చివరిభాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే పొర ఉంటుంది.
  4. మధ్య చెవి, లోపలి చెవిలోకి వర్తులాకార కిటికీ ద్వారా తెరచుకుంటుంది.

ప్రశ్న 9.
అంతరచెవి నిర్మాణమును వివరించండి.
జవాబు:

  1. లోపలి చెవిలో త్వచాగహనంను ఆవరించి అస్లి గహనం ఉంటుంది.
  2. త్వచాగహనంలో పేటిక, అర్ధవర్తుల కుల్యలు, కర్ణావర్తం అనే భాగాలుంటాయి.
  3. పేటిక యొక్క ముందుభాగాన్ని సేక్యులస్ అని, వెనుకభాగాన్ని యుట్రిక్యులస్ అనీ అంటాం.
  4. వాటి నుండి వచ్చే నాడీ తంతువులు పేటికానాడిని ఏర్పరుస్తాయి.
  5. అర్ధవర్తులాకార కుల్యలు, పేటికకు కలుపబడి ఉండి అంతరలసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి.
  6. పేటిక, అర్థవర్తుల కుల్యలు కలిసి పేటికా ఉపకరణంను ఏర్పరుస్తాయి.
  7. ఇది శరీరస్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది.
  8. కర్ణావర్తం ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలావెస్టిబులై, స్కాలామీడియా, స్కాలాటింపాని అనే మూడు సమాంతర నాళాల్ని కలిగి ఉంటుంది.
  9. స్కాలా వెస్టిబులై, స్కాలాటింపాని పరలసిక ద్రవంతోనూ, స్కాలామీడియా అంతరలసిక ద్రవంతోనూ నిండి ఉంటాయి.
  10. ఇది కార్టి అంగాన్ని, ఇంకా చిన్న ప్రాథమిక జ్ఞాన కణాల్ని కలిగి ఉంటుంది.
  11. పేటికానాడి, కర్ణావర్తన నాడి కలిసి శ్రవణ నాడి ఏర్పడుతుంది.

ప్రశ్న 10.
శ్రవణ జ్ఞానం కలిగే విధమును వ్రాయుము
జవాబు:

  1. వెలుపలి చెవి శబ్ద తరంగాలను సేకరిస్తుంది. అవి శ్రవణకుల్యను చేరతాయి.
  2. అప్పుడు కర్ణభేరిని తాకుతాయి. కర్ణభేరి నుండి వచ్చే ప్రకంపనాలు కూటకము, దాగలి, కర్ణాంతరాస్థిలను చేరతాయి.
  3. కూటకము, దాగలి, కర్ణాంతరాస్థి శబ్ద ప్రకంపనాల తీవ్రతను పెంచుతాయి.
  4. కర్ణాంతరాస్థి ప్రకంపనాలను అండాకార కిటికీకి చేరుస్తుంది.
  5. అక్కడ నుండి అవి కర్ణావర్తం చేరుతాయి.
  6. త్వచాగహనం కదులుతుంది. దాంతో ప్రకంపనాలు కార్టె అంగాన్ని చేరుతాయి.
  7. ప్రేరణలు శ్రవణనాడి ద్వారా మెదడుకు చేరతాయి.
  8. మెదడు ఇచ్చిన ప్రతిస్పందనలను బట్టి వినడం జరుగుతుంది.

ప్రశ్న 11.
ముక్కు నిర్మాణమును గురించి వివరించండి.
జవాబు:
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. మనకు బాహ్యంగా కనిపించే ముక్కు రెండు నాసికా రంధ్రాలను కలిగి ఉంటుంది.
  2. అవి నాసికా కుహరంలోకి తెరచుకుంటాయి.
  3. నాసికా విభాజకం నాసికా కుహరాన్ని రెండుగా విభజిస్తుంది.
  4. నాసికా కుహరం గోడలు శ్లేష్మస్తరాన్ని, చిన్న వెంట్రుకలని కలిగి ఉంటాయి.
  5. శ్లేష్మస్తరంలో ఋణ గ్రాహకాలు ఉంటాయి.

ప్రశ్న 12.
మన నాలుక మీద ఉండే వివిధ రకాల నిర్మాణముల గురించి రాయండి.
జవాబు:

  1. నాలుక మీద పొలుసుల వంటి నిర్మాణాలను ఫిలిఫార్మ్ పాపిల్లే అంటారు.
  2. గుండ్రంగా కనిపించే వాటిని ఫంగి ఫార్మ్ పాపిల్లే అంటారు.
  3. నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లే ఉంటాయి. వాటిని సర్కం వేలేట్ పాపిల్లే అంటారు.
  4. నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలను ఫోలియేట్ పాపిల్లే అంటారు.
  5. అన్ని రకాల పాపిల్లేల్లోనూ రుచి కణికలు ఉంటాయి. ఒక్క ఫిలి ఫార్మ్ పాపిల్లేలో మాత్రం ఉండవు.

ప్రశ్న 13.
చర్మమును గురించి సంక్షిప్తంగా వివరించండి.
జవాబు:

  1. మన శరీరంలో అన్నింటికంటే వెలుపల ఉండే పొర చర్మం.
  2. చర్మం శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.
  3. చర్మం స్పర్శ జ్ఞానేంద్రియం.
  4. స్పర్శ గ్రాహకాలు స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తాయి.
  5. అన్ని అవయవాల కంటే చర్మం పెద్దది.
  6. మన శరీరానికి ప్రాథమిక రక్షణను చర్మం ఇస్తుంది.

ప్రశ్న 14.
మన జ్ఞానేంద్రియాలు ఉమ్మడిగా పనిచేస్తాయా? ఎందుకు? ఎందువలన పనిచేయవు?
జవాబు:

  1. అవును, మన జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి.
  2. మన శరీరంలో జరిగే పనులన్నింటిని మెదడు నిర్వహిస్తుంది మరియు నియంత్రిస్తుంది. జ్ఞానేంద్రియాలను కూడా మెదడు సమన్వయపరుస్తుంది.
  3. మెదడు. ఈ విధముగా చేయకపోయినట్లైతే ప్రేరణలకు సంబంధించిన విశ్లేషణ మనను తికమకకు గురిచేస్తుంది.
  4. మెదడు నిరంతరం జ్ఞానేంద్రియాల నుండి ప్రేరణలను గ్రహించుట ద్వారా అవయవాలు కలిసి పనిచేయుటకు అవకాశం కల్పిస్తుంది.
  5. సమాచారమును సమన్వయము చేయుట ద్వారా మెదడు అన్ని భాగాలను కలిపి ఉంచుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 15.
కనురెప్పలకు వెంట్రుకలు లేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. కనురెప్పల యొక్క ముఖ్యవిధి కంటిని ఎల్లప్పుడు తడిగా ఉంచడం.
  2. కనురెప్పల వెంట్రుకలు కంటిని దుమ్ము, ధూళి నుండి కాపాడతాయి.
  3. కనురెప్పలకు వెంట్రుకలు కనుక లేకపోయినట్లైతే కంటిగుడ్డు ఎల్లప్పుడూ తేమగా ఉండే అవకాశం లేదు.
  4. దుమ్ము, ధూళి నుండి రక్షణ ఉండదు.

ప్రశ్న 16.
మన చర్మం స్పర్శ జ్ఞానాన్ని ఎలా కలిగి ఉంటుంది?
జవాబు:

  1. మన శరీరపు వివిధ భాగాలలో స్పర్శ జ్ఞానం వేరుగా ఉంటుంది.
  2. మెడచుట్టూ మరియు వేళ్ళ చివరన స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అరచేయి, మోకాలు, చేతుల మీద స్పర్శ జ్ఞానం తక్కువగా ఉంటుంది.
  3. మన శరీరపు స్పర్శ జ్ఞానం ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.
    a)మన శరీరపు చర్మం మందం మీద.
    b) స్పర్శ గ్రాహకాల సంఖ్య మీద.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Important Questions and Answers

ప్రశ్న 1.
కింది పటాన్ని పరిశీలించి భాగాలు గుర్తించండి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3
ఎ) చెవిని స్థూలంగా ఎన్ని భాగాలుగా విభజిస్తారు?
జవాబు:
3 భాగాలుగా విభజిస్తారు.
1) బాహ్యచెవి, 2) మధ్యచెవి, 3) లోపలిచెవి

బి) చెవి ఎముకలను సరైన క్రమంలో తెలపండి.
జవాబు:
కూటకము, దాగలి, కర్ణాంతరాస్థి

సి) ధ్వని తరంగాల వల్ల చెవిలో కంపించే భాగం ఏది?
జవాబు:
కర్ణభేరి

డి) సమతాస్థితిని కలిగించే చెవిలోని భాగం ఏది?
జవాబు:
పేటికా ఉపకరణం

ప్రశ్న 2.
కర్ణభేరికి రంధ్రాలు పడితే ఏమవుతుంది?
జవాబు:

  1. కర్ణభేరికి రంధ్రం పడితే, శబ్ద ప్రకంపనాలు సరియైన ప్రేరణలుగా మార్చబడలేవు.
  2. ఇందువల్ల ఈ ప్రేరణలను శ్రవణ నాడి మెదడుకు చేర్చలేదు.
  3. అందువల్ల వినపడదు. చెవుడు వస్తుంది (Deafness).

ప్రశ్న 3.
కన్ను పటము గీచి భాగాలు గుర్తించండి. కంటిలో శంఖువులు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. శంఖువులు ఎక్కువ కాంతిలో చూడడానికి, రంగులను గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
  2. శంఖువులు లేకపోతే ఎక్కువ వెలుతురులో చూడడానికి, రంగులను గుర్తించడానికి వీలుకాదు.

ప్రశ్న 4.
చర్మం తన స్పర్శజ్ఞానంను కోల్పోతే ఏమి జరుగుతుందో ఊహించి వ్రాయండి.
జవాబు:
a) శరీరాన్ని వేడి నుండి చలి నుండి కాపాడుకోలేము.
b) శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం కాదు
c) స్పర్శ కోల్పోనపుడు చర్మానికి తగిలే గాయాలు, దెబ్బలు మనం గుర్తించలేము. అందువల్ల తీవ్ర రక్తస్రావం జరిగే మరణించే అవకాశం ఉన్నది.
d) నడవటం చాలా కష్టమవుతుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 5.
కంటిలో శంకు కణాలు లోపిస్తే ఏమౌతుంది?
జవాబు:
రంగులను శక్తివంతమైన వెలుతురులో స్పష్టంగా గుర్తించలేము.

ప్రశ్న 6.
చర్మం ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుందని నీవెట్లా చెప్పగలవు?
జవాబు:

  1. చర్మం అన్నింటికన్నా పెద్దదైన జ్ఞానేంద్రియం
  2. ఇది మనకు స్పర్శను కలుగజేస్తుంది.
  3. మనశరీరంలో స్పర్శ జ్ఞానం వేరుగా ఉంటుంది.
  4. మెడచుట్టూ మరియూ వేళ్ళ చివరన స్పర్శజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అరచేయి, మోకాలు చేతుల మీద స్పర్శజ్ఞానం తక్కువగా ఉంటుంది.
  5. స్పర్శకు, ఉష్ణోగ్రతకు, పీడనానికి చర్మం సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటుంది.
  6. స్పర్శకు స్పర్శ గ్రాహకాలు, పీడనానికి పెసినియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకు నాసిప్టారులు వంటి ప్రత్యేక గ్రాహకాల్ని కలిగి ఉంటుంది.
  7. పై కారణాల వలన చర్మం ఒక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
1. A, B, C ల భాగాల పేర్లను రాయండి.
2. కంటిలో కటకం చేసే పని ఏమిటి?
3. నేత్రపటలంలో ఉండే ప్రత్యేకమైన కణాలేవి?
4. కంటికి వచ్చే ఏవైనా రెండు వ్యాధుల పేర్లు వ్రాయండి.
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 4
జవాబు:

  1. A) ధృడసరం, B) రక్తపటలం, C) నేత్రపటలం
  2. కన్ను కాంతిని సేకరించీ కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటి వెనుక భాగాన ఉండే నేత్ర పటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  3. దండాలు, కొనులు
  4. రేచీకటి, కండ్లకలక, శుక్లాలు ఏర్పడటం, Dry Eye మొదలగునవి.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు 1 Mark Bits Questions and Answers

లక్ష్యాత్మక నియోజనము

1. ఇంద్రియజ్ఞానం మన శరీరంలో కలిగేలా ప్రేరేపించే కొన్ని పరిస్థితులు, పదార్థాలు
A) ఉత్తేజితాలు
B) క్రియాత్మకాలు
C) ఉత్ర్పేరకాలు
D) ఎంజైములు
జవాబు:
A) ఉత్తేజితాలు

2. పరిసరాల నుండి ప్రేరణలను గ్రహించే మన శరీర భాగాలు
A) కన్ను, చెవి
B) ముక్కు, నాలుక
C) చర్మం
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

3. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికి కేంద్రం
A) వెన్నుపాము
B) మెదడు
C) హృదయము
D) కన్ను
జవాబు:
B) మెదడు

4. జ్ఞానేంద్రియాల నుండి నాడీ ప్రచోదనలను తీసుకొనివచ్చేవి
A) చాలకనాడులు
B) వెన్నునాడులు
C) జ్ఞాననాడులు
D) అన్నీ
జవాబు:
C) జ్ఞాననాడులు

5. కంటి ముందుభాగంలో ఉండే పలుచని పొర
A) దృఢస్తరం
B) రక్తపటలం
C) కటకం
D) కంజెక్టివ్ (కంటిపొర)
జవాబు:
D) కంజెక్టివ్ (కంటిపొర)

6. కంటిగుద్దులో కేవలం ఎన్నవ వంతు భాగం మాత్రమే మనకు కన్పిస్తుంది?
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 5
జవాబు:
B

7. కంటినందుండే ఈ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలుంటాయి.
A) కంటిపొర
B) దృఢస్తరం
C) రక్తపటలం
D) నేత్రపటలం
జవాబు:
C) రక్తపటలం

8. జెల్లీ వంటి ద్రవంతో నిండి ఉండే కంటి గుడ్డు భాగం
A) కాచావత్ క
B) నేత్రోదక కక్ష
C) రక్తపటలం
D) దృఢస్తరం
జవాబు:
B) నేత్రోదక కక్ష

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

9. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దీనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
A) దృఢస్తరం
B) కనుపాప
C) తారక
D) నేత్రపటలం
జవాబు:
D) నేత్రపటలం

10. నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం
A) రొడాప్సిన్
B) అయొడాప్సిస్
C) ఫోటాప్సిన్
D) కీటాప్సిన్
జవాబు:
A) రొడాప్సిన్

11. శంకువుల ఉపయోగం
A) చీకటిలో చూడడానికి
B) రంగులలోని తేడాలు గుర్తించలేకపోవుట
C) రంగులు గుర్తించడం
D) అశ్రువులను ఉత్పత్తిచేయటం
జవాబు:
C) రంగులు గుర్తించడం

12. నేత్రపటలంలోని ఈ భాగమునందు కాంతిగ్రాహకాలు ఉండవు.
A) అంధ చుక్క
B) పసుపు చుక్క
C) ఆకుపచ్చ చుక్క
D) నల్ల చుక్క
జవాబు:
A) అంధ చుక్క

13. కంటిలోని గ్రంథులు
A) లాక్రిమల్ గ్రంథులు
B) సెరుమినస్ గ్రంథులు
C) సెబేషియస్ గ్రంథులు
D) శ్లేష్మ గ్రంథులు
జవాబు:
A) లాక్రిమల్ గ్రంథులు

14. కంటిలోని ఈ భాగమును సరిచేయవచ్చును.
A) కంటిగ్రుడ్డు
B) ద్వికుంభాకార కటకం
C) నేత్ర పటలం
D) శుక్ల పటలం
జవాబు:
B) ద్వికుంభాకార కటకం

15. పిన్నా అని దీనిని అంటారు.
A) బాహ్య చెవి
B) మధ్య చెవి
C) లోపలి చెవి
D) కర్ణభేరి
జవాబు:
A) బాహ్య చెవి

16. మధ్య చెవిలోని ఎముకల గొలుసునందు ఉండేవి
A) కూటకము
B) దాగలి
C) కర్ణాంతరాస్థి
D) అన్నియు
జవాబు:
D) అన్నియు

17. మధ్య చెవి అంతరచెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది.
A) గుండ్రని కిటికి
B) అండాకార కిటికి
C) వర్తులాకార కిటికి
D) దీర్ఘవృత్తాకార కిటికి
జవాబు:
C) వర్తులాకార కిటికి

18. నాలికయందు గల రుచి కణికల సంఖ్య
A) 100
B) 1000
C) 10000
D) 5000
జవాబు:
C) 10000

19. ఋణ గ్రాహకాలు గల జ్ఞానేంద్రియం
A) చర్మం
B) కన్ను
C) చెవి
D) ముక్కు
జవాబు:
D) ముక్కు

20. మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది. ఆహార పదార్థాలలో ఉంటుంది.
A) సహజ ఆహార పదార్థాలు
B) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు
C) పచ్చి ఆహార పదార్థాలు
D) వండిన ఆహార పదార్థాలు
జవాబు:
B) కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలు

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

21. నాలుక యందు రుచికలు ఈ నిర్మాణాలలో ఉంటాయి.
A) ఫంగి ఫార్మ్ పాపిల్లే
B) ఫోలియేట్ పాపిల్లే
C) ఫంగి ఫార్మ్ మరియు ఫోలియేట్ పాపిల్లే
D) ఫిలి ఫార్మ్ పాపిల్లో
జవాబు:
C) ఫంగి ఫార్మ్ మరియు ఫోలియేట్ పాపిల్లే

22. స్పర్శగ్రాహకాలు గల జ్ఞానేంద్రియం
A) చెవి
B) నాలుక
C) ముక్కు
D) చర్మం
జవాబు:
D) చర్మం

23. చర్మము నందలి అంతశ్చర్మంలో ఉండేవి
A) స్వేదగ్రంథులు
B) సెబేషియస్ గ్రంథులు, రక్తనాళాలు
C) రోమపుటికలు, కొవ్వులు
D) పైవి అన్నీ
జవాబు:
D) పైవి అన్నీ

24. చర్మము నందు స్పర్శకు గల ప్రత్యేక గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టార్స్
B) పెసిమియన్ గ్రాహకాలు
C) నాసి రిసెప్టారులు
D) అన్నీ
జవాబు:
A) టార్టెల్ రిసెప్టార్స్

25. విటమిన్ లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి
A) కుష్టు
B) పెల్లాగ్రా
C) బొల్లి
D) తామర
జవాబు:
B) పెల్లాగ్రా

26. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దీనిలో ఉంటుంది.
A) చెవి
B) నాలుక
C) ముక్కు
D) చర్మం
జవాబు:
D) చర్మం

27. ఈ క్రింది వాటిలో చర్మ వ్యాధిని గుర్తించండి.
A) శుక్లం
B) జిరాఫాల్మియా
C) లూకోడెర్మా
D) గ్లూకోమా
జవాబు:
C) లూకోడెర్మా

28. 2,300 సంవత్సరాల క్రిందట మన ఇంద్రియ జ్ఞానాలను గూర్చి తెలియచేసినది
A) అరిస్టాటిల్
B) ప్లాటో
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

29. స్పర్శజ్ఞానంలో నాడుల పాత్రను గూర్చి మొదటిసారిగా తెలిపినది
A) ఆల్బర్టస్ మేగ్నస్
B) అరిస్టాటిల్
C) ప్లాటో
D) కెప్లర్
జవాబు:
A) ఆల్బర్టస్ మేగ్నస్

30. భూభ్రమణం, భూపరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసినవాడు
A) ఆల్బర్టస్ మేగ్నస్
B) అరిస్టాటిల్
C) ప్లాటో
D) జోహన్స్ కెప్లర్
జవాబు:
D) జోహన్స్ కెప్లర్

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

31. జ్ఞానేంద్రియాలు చేసే పన్నులన్నింటికి కేంద్రం
A) మెదడు
B) వెన్నుపాము
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
C) A మరియు B

32. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) అధిక స్థాయిలో ఉండే ప్రేరణ అల్ప స్థాయిలో ఉండే ప్రేరణని కప్పివేస్తుంది.
B) బాహ్య ప్రపంచంలోని మార్పులను గుర్తించటం జ్ఞానేంద్రియాల ప్రధాన పని.
C) మార్పులేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడవు.
D) ప్రేరణలు స్థిరంగా ఉంటే వాటి గురించి పట్టించుకోవటం తగ్గుతుంది.
జవాబు:
C) మార్పులేని ప్రేరణలకు మన జ్ఞానేంద్రియాలు అలవాటు పడవు.

33. మెటాలిక్ టేస్ట్ ఈ క్రింది ఆహార పదార్థాల్లో ఉంటుంది.
A) సహజ ఆహార పదార్థాలు
B) కృత్రిమంగా తయారయిన ఆహార పదార్థాలు
C) పచ్చి ఆహార పదార్థాలు
D) వండిన ఆహార పదార్థాలు
జవాబు:
B) కృత్రిమంగా తయారయిన ఆహార పదార్థాలు

34. కంటిలో ఉండే ముఖ్యమైన పొరల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
C) 3

35. కంటిలోని కటకం
A) ద్విపుటాకార
B) ద్వికుంభాకార
C) పుటాకార
D) కుంభాకార
జవాబు:
B) ద్వికుంభాకార

36. దండాలు, శంఖువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి.
A) దృఢస్తరం
B) రక్తపటలం
C) నేత్రపటలం
D) పైవేవీ కావు
జవాబు:
C) నేత్రపటలం

37. నేత్ర పటలంలో దండాలు, శంఖువులు లేని ప్రాంతం
A) అంధచుక్క
B) పసుపుచుక్క
C) పచ్చచుక్క
D) తెల్లచుక్క
జవాబు:
A) అంధచుక్క

38. పసుపు చుక్కలో ఉండేవి
A) దండాలు
B) శంఖువులు
C) దండాలు మరియు శంఖువులు
D) పైవేవీ కావు
జవాబు:
B) శంఖువులు

39. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం
A) మామూలుగా నిలువుగా
B) మామూలుగా తలక్రిందులుగా
C) ఎడమ కుడిగా నిలువుగా
D) ఎడమ కుడిగా తలక్రిందులుగా
జవాబు:
D) ఎడమ కుడిగా తలక్రిందులుగా

40. హ్రస్వదృష్టి ఉన్నవారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం
A) నేత్ర పటలానికి ముందు
B) నేత్రపటలంపై
C) నేత్ర పటలంకు వెనుక
D) పైవేవీ కావు
జవాబు:
A) నేత్ర పటలానికి ముందు

41. కంటిలో ఉండే గ్రాహకాలు
A) నాసిప్టారులు
B) టాక్టయిల్ రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) ఫోటో, రిసెప్టర్స్
జవాబు:
D) ఫోటో, రిసెప్టర్స్

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

42. కంటిలో ఉండే శంఖువుల సంఖ్య
A) 7 మిలియన్లు
B) 125 మిలియన్లు
C) 14 మిలియన్లు
D) 100 మిలియన్లు
జవాబు:
A) 7 మిలియన్లు

49. కంటిలో ఉండే దందాల సంఖ్య
A) 7 మిలియన్లు
B) 125 మిలియన్లు
C) 14 మిలియన్లు
D) 100 మిలియన్లు
జవాబు:
B) 125 మిలియన్లు

44. తక్కువ కాంతిలో వస్తువుల్ని చూడడానికి ఉపయోగపడేవి సంయోగ పదార్థాలుంటాయి?
A) దండాలు
B) కోనులు
C) A మరియు B
D) పైవేవీ కావు
జవాబు:
A) దండాలు

45. రంగుల్ని గుర్తించడానికి ఉపయోగపడే వర్ణద్రవ్యం
A) రొడాప్సిన్
B) అయోడాప్సిన్
C) పై రెండూ
D) పైవేవీ కావు
జవాబు:
B) అయోడాప్సిన్

46. అంధచుక్క ఉండే ప్రదేశం
A) నేత్రపటలం
B) దృక్మడి
C) నేత్రపటలం నుండి దృక్ నాడి వెలువడే చోటు
D) నేత్రపటలంలో కోనులు ఎక్కువగా ఉండే ప్రదేశం
జవాబు:
C) నేత్రపటలం నుండి దృక్ నాడి వెలువడే చోటు

47. ఆధార్ గుర్తింపుకార్డు ఇచ్చేటప్పుడు ఫోటో తీసే కంటి భాగం
A) కంటికటకం
B) కంటిపాప
C) తారక
D) రెటీనా
జవాబు:
B) కంటిపాప

48. శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవం
A) కన్ను
B) ముక్కు
C) చెవి
D) చర్మం
జవాబు:
C) చెవి

49. గుబిలిని స్రవించే గ్రంథులు
A) సెబేషియస్ గ్రంథులు
B) స్వేదగ్రంథులు
C) క్షీరగ్రంథులు
D) సెరుమినస్ గ్రంథులు
జవాబు:
D) సెరుమినస్ గ్రంథులు

50. శ్రవణ కుహరం చివరలో ఉండే నిర్మాణం
A) కర్ణభేరి
B) మూడు ఎముకల గొలుసు
C) అర్ధవర్తుల కుల్యలు
D) పేటిక
జవాబు:
A) కర్ణభేరి

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

51. మధ్యచెవిలో ఉండే ఎముకల గొలుసులోని మూడు ఎముకలు వరుసగా
A) కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి
B) దాగలి, కూటకం, కర్ణాంతరాస్థి
C) కూటకం, కర్ణాంతరాస్థి, దాగలి
D) కర్ణాంతరాస్థి, దాగలి, కూటకం
జవాబు:
A) కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి

52. పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటారు?
A) యుట్రిక్యులస్
B) శాక్యులస్
C) కాక్లియ
D) అర్ధవర్తుల కుల్యలు
జవాబు:
B) శాక్యులస్

53. స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలాటింపాని వీనిలోని భాగాలు.
A) త్వచాగహనం
B) అస్థి గహనం
C) పేటిక
D) కర్ణావర్తం
జవాబు:
D) కర్ణావర్తం

54. అంతరలసికా ద్రవంతో నిండి ఉండేది
A) స్కాలా వెస్టిబ్యులై
B) స్కాలాటింపాని
C) స్కాలామీడియా
D) పైవేవీ కావు
జవాబు:
C) స్కాలామీడియా

55. పేటికానాడి, కర్ణావర్తనాడి కలసి ఏర్పడేది
A) జిహ్వనాడి
B) దృక్నడి
C) శ్రవణనాడి
D) వాగన్నడి
జవాబు:
C) శ్రవణనాడి

56. అపుడే తయారయిన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని
A) 500
B) 600
C) 700
D) 800
జవాబు:
B) 600

57. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనలను ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను వర్గీకరించారు?
A) 1000
B) 1500
C) 2,000
D) 2,500
జవాబు:
B) 1500

58. మెదడులోని దేని ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
A) మెడుల్లా
B) హైపోథాలమస్
C) ద్వారగొర్ధం
D) మస్తిష్కం
జవాబు:
B) హైపోథాలమస్

59. MSG అనగా
A) మోనోసోడియం గ్లుటామేట్
B) మెగ్నీషియం సోడియం గ్లుటామేట్
C) మోనోసల్ఫర్ గ్లుటామేట్
D) మెగ్నీషియం సల్ఫర్ గ్లుటామేట్
జవాబు:
A) మోనోసోడియం గ్లుటామేట్

60. రుచికణికలు దీనిలో ఉండవు.
A) ఫిలి ఫార్మ్ పాపిల్లే
B) ఫంగి ఫార్మ్ పాపిల్లే
C) సర్కం వాలేట్ పాపిల్లే
D) ఫోలియేట్ పాపిల్లే
జవాబు:
A) ఫిలి ఫార్మ్ పాపిల్లే

61. ప్రాచీన కాలం నుండి ఉన్నతమైన జ్ఞానంగా గుర్తించినది
A) దృష్టి జ్ఞానం
B) ఋణ జ్ఞానం
C) జిహ్వ జ్ఞానం
D) స్పర్శ జ్ఞానం
జవాబు:
D) స్పర్శ జ్ఞానం

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

62. నిర్జీవ కణాలుండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతశ్చర్యం
జవాబు:
A) కార్నియం పొర

63. స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతఃశ్చర్శం
జవాబు:
C) మాల్ఫీజియన్ పొర

64. స్వేదగ్రంథులు, తైలగ్రంథులుండే పొర
A) కార్నియం పొర
B) గ్రాన్యులర్ పొర
C) మాల్ఫీజియన్ పొర
D) అంతఃశ్చర్మం
జవాబు:
D) అంతఃశ్చర్మం

65. శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచేది
A) కన్ను
B) ముక్కు
C) చెవి
D) చర్మం
జవాబు:
D) చర్మం

66. అన్ని అవయవాల కంటే పెద్దది
A) చర్మం
B) హృదయం
C) మూత్రపిండం
D) మెదడు
జవాబు:
A) చర్మం

67. యుక్తవయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 6
జవాబు:
A

68. చర్మంను కాంతి నుంచి రక్షించేది
A) టానిన్
B) మెలనిన్
C) టైలిన్
D) హి మోగ్లోబిన్
జవాబు:
B) మెలనిన్

69. ఈ క్రింది వానిలో పీడన గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
C) పాసీనియన్ రిసెప్టర్స్

70. ఈ క్రింది వానిలో స్పర్శ గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెప్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
A) టార్టెల్ రిసెప్టర్స్

71. ఈ క్రింది వానిలో ఉష్ణ గ్రాహకాలు
A) టార్టెల్ రిసెప్టర్స్
B) ఫోటో రిసెప్టర్స్
C) పాసీనియన్ రిసెస్టర్స్
D) నాసిస్టర్స్
జవాబు:
D) నాసిస్టర్స్

72. ఈ క్రింది వానిలో విటమిన్ల లోపం వలన చర్మానికి వచ్చే వ్యాధి
A) బొల్లి
B) పెల్లాగ్రా
C) తామర
D) పొంగు
జవాబు:
B) పెల్లాగ్రా

73. కంటి ఆరోగ్యా నికి అవసరమైన విటమిన్
A) విటమిన్ ‘ఎ’
B) విటమిన్ ‘బి’
C) విటమిన్ ‘సి’
D) విటమిన్ ‘డి’
జవాబు:
A) విటమిన్ ‘ఎ’

74. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి
A) జ్ఞానేంద్రియాలు
B) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
C) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
D) మెదడు, నాడీప్రేరణలు
జవాబు:
C) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

75. వెలుపలి చెవిగనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే శ్రవణకుల్య
A) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
B) ఏమీ వినలేదు
C) కొద్దిగా వినగలదు
D) శబ్దం పుట్టుకని, రకాన్ని తెలుసుకోలేదు
జవాబు:
B) ఏమీ వినలేదు

76. ఒక వ్యక్తి యొక్కకంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం
A) ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు.
B) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు.
C) కంటిలో నొప్పి వస్తుంది. కళ్ళు మూసుకోలేడు.
D) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు.
జవాబు:
B) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు.

77. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అపుడు ఆ వ్యక్తి
A) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు.
B) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు.
C) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు.
D) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.
జవాబు:
D) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.

78. మధ్య చెవి అంతర చెవిలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది.
A) గుండ్రని కిటికి
B) అండాకార కిటికి
C) వర్తులాకార కిటికి
D) దీర్ఘవృత్తాకార కిటికి
జవాబు:
C) వర్తులాకార కిటికి

79. సరియైన జతను గుర్తించండి.
1) పిన్నా – వెలుపలి చెవి
2) కర్ణభేరి – సెరుమినస్ గ్రంథులు
3) మైనం ఉత్పత్తి – కర్ణభేరి
A) 1 మాత్రమే
B)3 మాత్రమే
C) 2, 3
D) 1, 3
జవాబు:
C) 2, 3

80. క్రింది వాక్యాలను చదవండి.
a) పోవియా అనే చిన్న భాగంలో శంకువుల గుమిగూడి ఉండి దృష్టిని స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
b) కనుపాపకు ముందుండే శుక్లపటలం ఒక పరిశుభ్రమైన కిటికీలా పనిచేస్తుంది.
A) a సరియైనది, b సరియైనది కాదు
B) b సరియైనది, a సరియైనది కాదు
C) a, b లు రెండూ సరియైనవి కావు
D) a, b లు రెండూ సరియైనవి
జవాబు:
D) a, b లు రెండూ సరియైనవి

81. సరిగా గుర్తించిన జతను గుర్తించండి.
1) బొల్లి – చర్మం
2) గ్లూకోమా – ముక్కు
3) చెవుడు – చెవి
A) 1, 3
B) 2, 3
C) 1 మాత్రమే
D) 2 మాత్రమే
జవాబు:
D) 2 మాత్రమే

82. ఈ క్రింది వాక్యాలను చదవండి.
a) అంధచుక్క దృక్ నాడి కంటి నుండి బయటకు పోయే చోట ఉంటుంది.
b) చెవిలోని సెరుమిన్ గ్రంథులు తైలాన్ని స్రవిస్తాయి.
A) a మరియు b లు సరియైనవే
B) a మరియు b లు సరియైనవి కావు
C) a సరియైనది, b సరియైనది కాదు
D) b సరియైనది, a సరియైనది కాదు
జవాబు:
C) a సరియైనది, b సరియైనది కాదు

83. సరిగా జతపరచని జతను గుర్తించండి.
1) వాసన – గ్రాహక కణాలు
2) కన్నీళ్ళు – అశ్రు గ్రంథులు
3) మైనము – సెరుమిన్ గ్రంథులు
A) 1, 2
B) 2,3
C) 2 మాత్రమే
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. వయసు సంబంధిత మాక్యులా (పచ్చచుక్క) క్షీణత ఈ వ్యాధి పరిస్థితిలో నేత్రపటలం నందలి మధ్యభాగమైన మాక్యులా లేదా ఫోవియా క్షీణించిపోతుంది. అంధత్వము వస్తుంది.
2. ఎస్టిగ్మాటిజమ్ నేత్రపటలం నందలి వంపు అసంపూర్ణంగా ఉండడం.
3. కంటిశుక్లం (కెటరాక్ట్) కంటి ముందరభాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా అయి పగులుతుంది. కళ్ళు సరిగా కనపడవు.
4. సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్ నేత్రపటం నందలి సిరలో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడడం.
5. కలర్ బ్లైండ్ నెస్ (వర్ణాంధత) సాధారణ పరిస్థితులలో రంగులను గుర్తించకపోవటం, చూడలేకపోవడం.

పై పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి.

84. నేత్రపటలం నందలి వంపులో మార్పు రావటం వలన కలిగే వ్యాధి.
A) ఎస్టిగ్మాటిజమ్
B) కంటిశుక్లం
C) సింట్రల్ రెటినల్ లీన్ ఆక్లుసన్
D) వర్ణాంధత
జవాబు:

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. కండ్ల కలక కంటి ముందర పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది, నీరు కారుతుంది.
2. శుక్లపటలం మార్పు చెందడం శుక్లపటలం మీద మచ్చలు, ఉబ్బటం వలన లేదా అక్రమాకారం ఉండడం వలన కళ్ళు మెరవడం, చూపు చెదరడం జరుగుతుంది.
3. డయాబెటిక్ రెటినోపతి మధుమేహం వలన కంటికి వచ్చు వ్యాధి నేత్రపటలం నందలి రక్తనాళాలలో మార్పు వలన కలుగుతుంది.
4. పొడికళ్ళు లేదా జిరాఫ్తాల్మియా కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చెయ్యవు. కంటిపొర పొడిగా అవుతుంది.
5. దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను సరిగ్గా కాంతిని వక్రీభవించదు. అందువలన ప్రతిబింబాలు నేత్రపటలం వెనుక ఏర్పడతాయి. దూరపు వస్తువులు కనపడతాయి. దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు.
6. గ్లూకోమా కంటిలోని దృక్మడి పాడయిపోతుంది. దీనివలన కంటిలో ఎక్కువ పీడనము కలుగుతుంది.
7. కెరోలైటిస్ శుక్లపటలం ఉబ్బుతుంది. అందువలన కన్ను ఎర్రగా మారి నొప్పి కలిగిస్తుంది. చూచునపుడు నొప్పి ఉంటుంది.

పై పట్టికను పరిశీలించి ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానాన్ని ఎన్నుకోంది.

85. ఈ వ్యాధిలో ప్రతిబింబాలు రెటీనా వెనుక ఏర్పడతాయి.
A) పొడికళ్ళు లేదా జిరాపాల్మియా
B) దీర్ఘదృష్టి
C) గ్లూకోమా
D) కెరోలైటిస్
జవాబు:
B) దీర్ఘదృష్టి

86. ఈ చిత్రం సూచించినది ఏమి?
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 7
A) చర్మం
B) కన్ను
C) నాలుక
D) చెవి
జవాబు:
C) నాలుక

87. పటంలోని A, B, C భాగాల పేర్లు.
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 8
జవాబు:
C

88. కంటికి సంబంధిత వ్యాధులను అరికట్టడానికి నీవు ఏమి చేస్తావు.
A) కంటిని 3-4 సార్లు కడుగుతాను
B) విటమిన్ – A ఉన్న ఆహారం తింటాను
C) కళ్ళను నలపనుత
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

89. సరిగా జతపరచండి.
1) ఫోవియా ( ) a) నాలుక
2) ఫోలియట్ పాపిల్లె ( ) b) ఆడిటరీమీటన్
3) శ్రవణ కుహరం ( ) c) పచ్చచుక్క
A) 1 – a, 2 – b, 3-c
B) 1-b, 2 – a, 3-c
C) 1 – c, 2 – b, 3- a
D) 1-c, 2-a, 3-b
జవాబు:
D) 1-c, 2-a, 3-b

90. మెలనిన్ వర్ణకం యొక్క లోపం దేనికి దారితీస్తుంది.
A) ల్యూకోడెర్మా
B) పెల్లాగ్రా
C) రింగ్ వార్మ్
D) టానింగ్
జవాబు:
A) ల్యూకోడెర్మా

91. అశ్రుగ్రంధులచే విడుదలయ్యే అశ్రువుల విధి
A) రంగులను గుర్తించుట
B) కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రించుట
C) కంటిని తడిగా, తేమగా వుంచుట
D) ఏ విధి లేదు
జవాబు:
C) కంటిని తడిగా, తేమగా వుంచుట

92. కంటిని నేత్రోదయ కక్ష్య కచావత్ కక్ష్యగా విభజించునది
A) కటకము
B) కనుపాప
C) తారక
D) రక్తపటలము
జవాబు:
A) కటకము

93. శరీరస్థితి సమతులనం (సమతాస్థితి)ని క్రమబద్ధం చేయునది
A) యుట్రిక్యులస్ మాత్రమే
B) యుట్రిక్యులస్, సేక్యులస్
C) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు
D) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు మరియు కర్ణావర్తనం
జవాబు:
C) యుట్రిక్యులస్, సేక్యులస్, అర్ధవృత్త కుల్యాలు

94. జీవశాస్త్రీయంగా వాసన ఇలా ప్రారంభమవుతుంది.
A) ఆహారాన్ని చూడడం వలన
B) ఆహారపు వాసన గురించి ఆలోచించడం వలన
C) ఆహారాన్ని రుచి చూడడం వలన
D) ముక్కులోని రసాయన సంఘటన వలన
జవాబు:
D) ముక్కులోని రసాయన సంఘటన వలన

95. మెలనిన్ అనునది
A) పీడన గ్రాహకము
B) గోర్లు, వెంట్రుకలను ఏర్పరుస్తుంది
C) చర్మం రంగు నిర్ధారిస్తుంది
D) ఉష్ణాన్ని క్రమబద్ధం చేస్తుంది.
జవాబు:
C) చర్మం రంగు నిర్ధారిస్తుంది

96. P : రవి కొన్ని రంగులను గుర్తించలేకున్నాడు.
Q: రవి కంటి నందు కోన్ కణాలు లోపించినవి.
A) P, Q లు రెండూ సరియైనవి
B) P కి Q సరియైన వివరణ కాదు
C) P కి ఏ సంబంధము లేదు
D) P Q సరైన వివరణ
జవాబు:
A) P, Q లు రెండూ సరియైనవి

97. ఆధార్ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కంటిపాప ఫోటోలను తీయుటకు కారణము.
A) కంటిపాపలు ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి
B) కంటి రంగులు వేరు వేరుగా ఉంటాయి
C) దృష్టి దోషములను గుర్తించుటకు
D) సమయాభావంను పాటించుటకు
జవాబు:
A) కంటిపాపలు ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి

98. చెవి నిర్మాణంలో ఎముకల వరుస క్రమము
A) సుత్తి, పట్టెడ, అంకవన్నె
B) అంకవన్నె, పట్టెడ, సుత్తి
C) పట్టెడ, అంకవన్నె, సుత్తి
D) సుత్తి, అంకవన్నె, పట్టెడ
జవాబు:
A) సుత్తి, పట్టెడ, అంకవన్నె

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

99. P: జ్ఞానేంద్రియాలు ప్రేరణలను మాత్రమే గ్రహిస్తాయి.
Q: మెదడు ప్రేరణలను విశ్లేషించి ప్రతి స్పందనలను ఏర్పరుస్తుంది.
A) P మాత్రమే సరియైనది
B) Q మాత్రమే సరియైనది
C) P మరియు Q సరియైనది
D) P మరియు Q సరియైనవి కావు
జవాబు:
C) P మరియు Q సరియైనది

100. వృద్ధులు రుచిని గ్రహించలేకపోవడానికి కారణం ఏమైవుంటుందో ఊహించండి.
A) ఘ్రాణగ్రాహకాల సామర్థ్యం తగ్గడం
B) రుచి కళికల సామర్థ్యం తగ్గడం
C) నాళికా కుహరం మూసుకుపోవడం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

101. అధిక ఉప్పు కలిగిన ఆహారపదార్థమును తీసికొన్న తరువాత ఆవ్యక్తి.
A) ఉప్పు రుచి తెలుసుకుంటాడు
B) ఉప్పు రుచిని ఇష్టపడతారు
C) ఉప్పు కలిగిన పదార్థములను ఇష్టపడడు
D) తక్కువ ఉప్పు కలిగిన రుచిని గుర్తించలేడు
జవాబు:
D) తక్కువ ఉప్పు కలిగిన రుచిని గుర్తించలేడు

102. కింది వాటిని జతపరచండి.
1. నాలుక ( ) a) ఘాణగ్రాహకాలు
2. చెవి ( ) b) కర్ణభేరి
3. ముక్కు ( ) c) రుచికణికలు
A) c, a, b
B) a, b, c
C) c, b, a
D) b, a, c
జవాబు:
C) c, b, a

103. చెవిలో ఉన్న చిన్న ఎముక పేరు
A) సుత్తి
B) అంకవన్నె
C) పట్టెడ
D) కర్ణభేరి
జవాబు:
B) అంకవన్నె

104. కంటి సంబంధిత వ్యాధులను అరికట్టడానికి నీవు ఏమి చేస్తావు?
A) కంటిని 3-4 సార్లు కడుగుతాను
B) విటమిన్-A ఉన్న ఆహారం తింటాను
C) కళ్ళను నలపను
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

మీకు తెలుసా?

“ఆధార్” లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు వారు మీ కళ్ల ఫోటోలను తీసుకుంటారు. మీ కంట్లో వారు దీన్ని ఫోటోగా తీసుకుంటారో మీకు తెలుసా ? కంటిపాప (Iris) ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ప్రతి రుచికణికలోనూ ఒక కుహరం, రంధ్రాన్ని కలిగి ఉంటుంది. ఆ రంధ్రాన్ని రుచిరంధ్రం అంటాం. రుచికణిక దగ్గర ఉండే ఉపకళా కణాలు రుచికణాలు లేక గ్రాహకాలను ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక కణాలు, వాటికి ఆధారం ఇచ్చే కణాలు, కుహరంలో ఉంటాయి. ప్రతి గ్రాహక కణం, ఒక నాడీ తంతువుకు కలుపబడి ఉంటుంది. అన్ని నాడి తంతువులు కలిసి ప్రధాన నాడులుగా ఏర్పడతాయి. అవి మెదడుకు, వెన్నుపాముకి వార్తలను అందిస్తాయి.

జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు, మనం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని చూస్తాం, వింటాం, ఆస్వాదిస్తాం. జ్ఞానేంద్రియాల గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. అదే మంచి జీవనానికి దారితీస్తుంది.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 9
ఆల్బర్టస్ మేగ్నస్ ఇటలీలో ఒక చర్చి బిషప్. ప్రకృతి పరిశీలకుడు. అరిస్టాటిల్ ఆలోచనలను అనుసరిస్తూ విజ్ఞానశాస్త్రాన్ని ఇష్టపడే వ్యక్తి. మొదటిసారిగా వాటిని విమర్శిస్తూ, విస్తృతమైన విద్యా విషయక చర్చనీయాంశాలుగా అందరికీ అందుబాటులో ఉంచిన వ్యక్తి. స్పర్శజ్ఞానంలో నాడుల పాత్రను మొదటిసారిగా తెలిపిన వ్యక్తి ఆయన.

17వ శతాబ్దం నుండి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేయబడింది. ఆ సమయంలోనే బాగా దగ్గరగా చూడడం కోసం కంటికి సంబంధించి, అనేక ఉపకరణాలను కనుగొనడం జరిగింది. క్రీ. శ. 1600వ సంవత్సరంలో భూమి భ్రమణం – పరిభ్రమణం గురించి తెలిపిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler) జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేశారు.

ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియాలను గురించి ఎన్నో విషయాలు కనుగొన్నారు. జ్ఞానేంద్రియాలు ఇంకా మనకు తెలిసీ తెలియని ఎన్నో రకాల ఆశ్చర్యకరమైన క్లిష్టమైన, నమ్మశక్యంకాని పనులను చేయగలవని తెలిపారు. నాడీ సంకేతాల విద్యుత్ రసాయనిక ఆధార ప్రకారం మెదడులో జ్ఞానానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు, అవి చేసే పనుల గురించి సరైన అవగాహనను కూడా పెంపొందించారు.

AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు

అరిస్టాటిల్ కాలం నుండి 19వ శతాబ్దం వరకు ఇంద్రియాల వరకు పొందే జ్ఞానాలు ఐదుగా పేర్కొనేవారు. అయితే ఆధునిక కాలంలో ఆ సంఖ్య (5), మన శరీరంలోని జ్ఞానేంద్రియాల సంఖ్యను తెలియజేసేదిగా మారింది.

మనం లెక్కకు ఐదు జ్ఞానేంద్రియాలనే కలిగి ఉన్నా, ఇంద్రియ జ్ఞానాలు మాత్రం చాలా ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకి మనం పీడనాన్ని తెలుసుకునేందుకు ఒక స్పర్శజ్ఞానాన్ని, వేడిమి, చల్లదనాన్ని తెలుసుకునేందుకు మరొకటి, కంపనాలు, తరచుదనం తెలుసుకునేందుకు ఇంకొకటి ‘అలా ఎన్నో ఉన్నా లెక్కకి మాత్రం అన్నీ ఒకే రకమైన స్పర్శజ్ఞానంగా భావించడం జరుగుతుంది.

పునరాలోచన
AP 9th Class Biology Important Questions 6th Lesson జ్ఞానేంద్రియాలు 2

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

These AP 9th Physical Science Important Questions and Answers 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 12th Lesson Important Questions and Answers ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రమాణం అనగానేమి?
జవాబు:
కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.

ప్రశ్న 2.
వివిధ వస్తువులను కొలవడానికి వివిధ ప్రమాణాలను ఎందుకు వినియోగిస్తాము?
జవాబు:
పదార్థాల పరిమాణాలను అనుసరించి వివిధ ప్రమాణాలను వినియోగిస్తాము.

ప్రశ్న 3.
MKS పద్ధతిలో ప్రాధమిక రాశులను రాయుము.
జవాబు:
ద్రవ్యరాశి (m), పొడవు (l) మరియు కాలం (t).

ప్రశ్న 4.
ప్రాథమిక రాశులు అనగానేమి?
జవాబు:
మరే ఇతర పరిమాణాలలోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులను ప్రాథమిక రాశులు అంటారు.

ప్రశ్న 5.
ప్రాథమిక ప్రమాణం అనగానేమి?
జవాబు:
ప్రాథమిక రాశులను వ్యక్తపరచడానికి వినియోగించే ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 6.
MKS లో ప్రాథమిక ప్రమాణాలను రాయుము.
జవాబు:
మీటరు, కిలోగ్రాము మరియు సెకను.

ప్రశ్న 7.
CGS పద్ధతి అనగానేమి?
జవాబు:
సెంటీమీటరు, గ్రాము మరియు సెకను.

ప్రశ్న 8.
SI పద్ధతి అనగానేమి? అది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
జవాబు:
SI పద్దతి అనగా అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి. ఇది 1971లో ప్రవేశపెట్టబడింది.

ప్రశ్న 9.
SI పద్ధతికి జోడించిన కొన్ని ప్రాథమిక రాశులను రాయుము.
జవాబు:
విద్యుత్, కాంతి తీవ్రత, పదార్ధ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.

ప్రశ్న 10.
MKS, SI పద్దతులలో తేడా ఏమిటి?
జవాబు:

  1. MKS పద్ధతిలో మూడు ప్రాథమిక రాశులు మాత్రమే ఉన్నవి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం.
  2. SI పద్ధతిలో ఎనిమిది ప్రాథమిక రాశులు ఉన్నాయి. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణం, ఉష్ణోగ్రత మరియు సమతల కోణం.

ప్రశ్న 11.
ఉత్పన్న రాశి అనగానేమి?
జవాబు:
ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ఉత్పన్న రాశులు అంటారు.

ప్రశ్న 12.
ఉత్పన్న ప్రమాణాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ప్రమాణాల నుండి ఉత్పన్నమయ్యే ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 13.
వైశాల్యం, ఘనపరిమాణాలకు ఉత్పన్న ప్రమాణాలను రాయుము.
జవాబు:
వైశాల్యం = m² (మీటరు²) ; ఘనపరిమాణం = m³ (మీటరు)

ప్రశ్న 14.
బలం యొక్క ప్రమాణాలను ఏఏ ప్రాథమిక ప్రమాణాల ద్వారా వ్యక్తపరచవచ్చును?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1
కావున బలం ప్రమాణాలను కి.గ్రా., మీటరు, సెకను అనే మూడు ప్రాథమిక ప్రమాణాలను ఉపయోగించి వ్యక్తపరచ వచ్చును.

ప్రశ్న 15.
కిలోమీటరును మీటరుగా మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
1000.

ప్రశ్న 16.
మీటరను కిలోమీటర్ లోకి మార్చుటకు వినియోగించు మార్పిడి గుణకం ఏది?
జవాబు:
10-3

ప్రశ్న 17.
కి.మీ./గం. ను మీ./సె. లలోకి మార్చుటకు మార్పిడి గుణకాన్ని రాయుము.
జవాబు:
\(\frac{8}{18}\)

ప్రశ్న 18.
శాస్త్రవేత్తల పేర్ల మీద గల కొన్ని ప్రమాణాలను రాయుము.
జవాబు:
న్యూటన్ (N), పాస్కల్ (Pa), జౌల్ (J), వాట్ (W) మొదలగునవి.

ప్రశ్న 19.
గ్రాఫు అనగానేమి?
జవాబు:
రెండు రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేసే పటమే గ్రాఫు.

ప్రశ్న 20.
స్వతంత్ర రాశులు, ఆధారిత రాశులు అనగానేమి?
జవాబు:

  1. ప్రయోగంలో ఏ రాశి విలువలు మనచేత నియంత్రించబడతాయో లేదా నిర్ణయించబడతాయో ఆ రాశులను స్వతంత్ర రాశులు అంటారు.
  2. ప్రయోగంలో ఏ రాశి విలువలు స్వతంత్ర రాశి విలువలకు అనుగుణంగా మార్పు చెందుతాయో ఆ రాశులను ఆధారిత రాశులు అంటారు.

ప్రశ్న 21.
X- అక్షంపై ఎటువంటి రాశిని తీసుకుంటారు?
జవాబు:
స్వతంత్ర రాశిని.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 22.
గ్రాఫు పేపర్ పై ‘గళ్ళు’ అనగానేమి?
జవాబు:
గ్రాఫు పేపర్ పై మందపాటి మరియు సన్నని, అడ్డంగా మరియు నిలువుగా గీయబడిన రేఖలు ఉంటాయి. ఈ రేఖలు ఖండించుకోవడం వలన ఏర్పడినవే గళ్ళు లేదా చదరాలు.

ప్రశ్న 23.
‘వ్యాప్తి’ అనగానేమి?
జవాబు:
గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య భేదాన్ని ‘వ్యాప్తి’ అంటారు.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ

ప్రశ్న 24.
‘స్కేలింగ్’ అనగానేమి?
జవాబు:
X – అక్షం మరియు Y – అక్షం పై విలువలను గుర్తించడాన్ని ‘స్కేలింగ్’ అంటారు.

ప్రశ్న 25.
‘స్కేలు’ అనగానేమి?
జవాబు:
అక్షాలపై తీసుకున్న విలువల అవధిని స్కేలు అంటారు.

ప్రశ్న 26.
X – అక్షం స్కేలును ఎలా కనుగొంటారు?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2

ప్రశ్న 27.
వక్రరేఖా గ్రాఫు అనగానేమి?
జవాబు:
గ్రాఫు వక్ర ఆకారంలో ఉంటే ఆ గ్రాఫును వక్రరేఖా గ్రాఫు అంటారు.

ప్రశ్న 28.
హుక్ సూత్రం రాయుము.
జవాబు:
ఒక స్ప్రింగ్ యొక్క సాగుదల, దానిపై ప్రయోగించిన ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది.

ప్రశ్న 29.
సరళరేఖా గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 3

ప్రశ్న 30.
గ్రాఫు వాలు అనగానేమి?
జవాబు:
గ్రాఫు X – అక్షంతో చేసే కోణం యొక్క tan విలువను గ్రాఫు వాలు అంటారు.
\(\tan \theta=\frac{\Delta \mathrm{y}}{\Delta \mathrm{x}}\)

ప్రశ్న 31.
గ్రాఫు వైశాల్యం అనగానేమి?
జవాబు:
X – అక్షం, Y – అక్షం పై గల భౌతిక రాశుల లబ్ధం వలన ఏర్పడే మరొక భౌతిక రాశిని వివరించేదే గ్రాఫు వైశాల్యం.

ప్రశ్న 32.
స్థానభ్రంశం – కాలం గ్రాఫు వాలు (m) దేనిని వివరిస్తుంది?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4

ప్రశ్న 33.
త్వరణం కాలం గ్రాఫు వైశాల్యం దేనిని వివరిస్తుంది?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 5

ప్రశ్న 34.
ఒక స్వేచ్ఛాపతన వస్తువు యొక్క కాలం-వేగం గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించండి.
జవాబు:
సరళరేఖా గ్రాఫు.

ప్రశ్న 35.
బస్సు ప్రయాణం యొక్క దూరం-కాలం గ్రాఫు ఆకారం ఎలా ఉంటుంది?
జవాబు:
వక్రరేఖా గ్రాఫు.

ప్రశ్న 36.
నల్లబల్లపై రిత్విక్ ‘3 kgs పంచదార’ అని రాశాడు. ఒక ప్రశ్నను అడిగి పై వాక్యాన్ని సరిచేయుము.
జవాబు:
ప్రమాణాలు రాయాల్సినపుడు kg లను బహువచనంలో kgs గా రాయవచ్చా?

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 37.
కార్తీక్ కి ‘3 న్యూటన్లు’ అనే పదాన్ని చూసి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం ఏమై ఉంటుంది?
జవాబు:
న్యూటన్లలో ఏ భౌతికరాశిని కొలుస్తారు?

ప్రశ్న 38.
హుక్ సూత్రాన్ని నిరూపించడానికి చేసే ప్రయోగంలో ఏఏ పరికరాలు అవసరమవుతాయి?
జవాబు:
1) స్ప్రింగ్, 2) బరువులు, 3) స్కేలు, 4) స్టాండ్

ప్రశ్న 39.
వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత, ద్రవ్యరాశి
a) పై వానిలో ప్రాథమిక రాశులేవి?
b) పై వానిలో ఉత్పన్న రాశులేవి?
జవాబు:
a) ద్రవ్యరాశి,
b) వైశాల్యం, ఘనపరిమాణం, సాంద్రత.

ప్రశ్న 40.
‘ధీరజ్ తన ప్రయాణించిన దూరాన్ని ప్రతి 10 ని||లకు లెక్కించి నమోదు చేసుకున్నాడు.
పై దత్తాంశం నుండి స్వతంత్రరాశి, ఆధారిత రాశిని రాయండి.
జవాబు:
కాలం (ని॥) స్వతంత్ర రాశి మరియు దూరం ఆధారిత రాశి.

ప్రశ్న 41.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 6
పై గ్రాలో (6, 4), (0, 0) దత్తాంశ బిందువులను గుర్తించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 7

ప్రశ్న 42.
ప్రమాణాల ద్వారా శాస్త్రజ్ఞులను ఎలా గుర్తుకు తెచ్చుకుంటావో రాయుము.
జవాబు:

  1. కొన్ని ప్రమాణాలు శాస్త్రవేత్తల పేర్లతో వ్యక్తపరచబడ్డాయి. ఉదా : న్యూటన్ (N), జాల్ (J), కెల్విన్ (K) మొదలగునవి.
  2. పై ప్రమాణాలను వినియోగించినపుడు ఆయా శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు.

ప్రశ్న 43.
గ్రాఫు యొక్క ఉపయోగమేమి?
జవాబు:

  1. చాలా సమస్యలను గ్రాఫు ద్వారా సాధించవచ్చును.
  2. రెండు రాశుల మధ్య సంబంధాన్ని గ్రాఫు ద్వారా తెలుసుకోవచ్చును.

ప్రశ్న 44.
5, 7, 3, 8, 18, 4, 2, 6 విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ
= 18 – 2 = 16

ప్రశ్న 45.
వ్యాప్తి 10 మరియు అడ్డంగా 20 గళ్ళు ఉన్నప్పుడు X – అక్షంపై ‘స్కేలు’ ఎలా తీసుకుంటావు?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 8

ప్రశ్న 46.
స్థానభ్రంశం-కాలం గ్రాఫు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
స్థానభ్రంశం-కాలం గ్రాఫు వాలును కనుగొని తద్వారా వేగంను లెక్కించవచ్చును.

ప్రశ్న 47.
వేగం-కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థానం (position) ను గుర్తించడానికి వేగం కాలం గ్రాఫు యొక్క వైశాల్యం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 48.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 9
‘B’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 10

ప్రశ్న 49.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 11
‘A’ వద్ద త్వరణం ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 12

ప్రశ్న 50.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 13
గ్రాఫులో A నుండి B కి వస్తువు ప్రయాణించిన దూరం ఎంత? ఎందుకు?
జవాబు:
సున్న. ఎందుకనగా కొలం మారినప్పటికీ దూరంలో మార్పులేదు.

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రమాణం (యూనిట్) అనగానేమి? దీనిని ఎక్కడ ఉంచుతారు?
జవాబు:

  1. కొలతలను పోల్చుటకు ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు.
  2. ఈ ప్రమాణాలను భౌతిక రాశుల పరిమాణాలకు కుడివైపున రాయాలి.
    ఉదా : 2 కి.గ్రా., 10 మీ.

ప్రశ్న 2.
ప్రాథమిక రాశులు, ఉత్పన్న రాశుల మధ్య తేడాలు రాయుము.
జవాబు:

ప్రాథమిక రాశులు ఉత్పన్న రాశులు
1) ప్రాథమిక రాశులు అనేవి మరే ఇతర పరిమాణాల లోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులు. 1) ఏ రాశులైతే ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడతాయో వాటిని ‘ఉత్పన్న రాశులు’ అంటారు.
2) ఇవి స్వతంత్ర రాశులు. 2) ఇవి ప్రాథమిక రాశులపై ఆధారపడతాయి.
3) ఉదా : ద్రవ్యరాశి, పొడవు, కాలం. 3) ఉదా : వైశాల్యం , ఘనపరిమాణం, సాంద్రత

ప్రశ్న 3.
సాంద్రత ప్రమాణాలను ఉత్పన్నం చేయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 14

ప్రశ్న 4.
వివిధ రకాల కొలత పద్దతులను రాయుము.
జవాబు:
1) FPS : అడుగు (F), పౌండు (P), సెకను (S).
2) CGS : సెంటీమీటరు (C), గ్రాము (G), సెకను (S).
3) MKS : మీటరు (M), కిలోగ్రాము (Kg), సెకను (S).
4) SI : మీటరు, కిలోగ్రాము, సెకను, ఆంపియర్, కాండెలా, మోల్, కెల్విన్, రేడియన్.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 5.
క్రింది వానికి ప్రమాణాలను ఉత్పాదించుము.
a) త్వరణం b) బలం
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 15

ప్రశ్న 6.
క్రింది వానిలో ఏవి సరైనవి? ఎందుకు?
A) m/s B) m/s/s C) m-s2 D) 10 – kgs E Pascal joule
జవాబు:
A మరియు F లు సరైనవి.
B) రెండు సార్లు | గుర్తు వినియోగించబడినది. తప్పు.
C) ‘-‘ ఉపయోగించబడినది. తప్పు.
D) ‘.’ మరియు kg లను kgs గా బహువచనంలో వినియోగించబడినది. తప్పు.
E) ‘P’ కేపిటల్ అక్షరం వినియోగించబడినది. తప్పు.

ప్రశ్న 7.
క్రింది ప్రమాణాలను సరిచేసి రాయుము.
(i) DB (ii) mhz (iii) 20 – m (iv) kg.m-s-2
జవాబు:
(i) dB
(ii) MHz
(iii) 20 m
(iv) Kg.m.s-2

ప్రశ్న 8.
క్రింది గ్రాఫుల ఆకారాన్ని ఊహించి రాయండి.
(a) a ∝ b (b) a ∝ \(\frac{1}{b}\)
జవాబు:
a) a ∝ b గ్రాఫు సరళరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.
b) a ∝ \(\frac{1}{b}\) గ్రాఫు వక్రరేఖా గ్రాఫుగా ఉండవచ్చును.

ప్రశ్న 9.
ప్రక్క గ్రాఫు నుండి
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 16
a) OA, OB, OC రేఖల వాలులు దేనిని సూచిస్తాయి?
b) ఏ రేఖ ఎక్కువ వడిని సూచిస్తుంది?
జవాబు:
a) OA, OB, OC రేఖల వాలులు ‘వడి’ లను సూచిస్తాయి.
b) OA రేఖ అధిక వడిని సూచిస్తుంది. కారణం OB, OC రేఖల కన్నా ఎక్కువ ‘వాలు’ ని OA కలిగి ఉంది.

ప్రశ్న 10.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 17
a) పై వానిలో ఏది స్వతంత్ర రాశి?
b) పై వానిలో ఏది ఆధారిత రాశి?
c) గ్రాఫు ఎలా ఉంటుందో ఊహించుము.
d) Y – అక్షంపై వ్యాప్తిని కనుగొనుము.
జవాబు:
a) ద్రవ్యరాశి
b) భారం
c) సరళరేఖా గ్రాఫు
d) Y – అక్షంపై విలువలు = 98, 196, 294, 392, 490.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ = 490 – 98 = 392

ప్రశ్న 11.
క్రింది బిందువులను గ్రాఫు పేపర్ పై గుర్తించి కలుపుము.
(8, 10) (20, 15) (40, 22.5) (48, 0)
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 18
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 19

ప్రశ్న 12.
సమవేగాన్ని సూచించు చిత్తు గ్రాఫును గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 20

ప్రశ్న 13.
ఒక వస్తువు కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత నిశ్చలంగా ఉంది. దీనిని సూచించు గ్రాఫును గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 21

ప్రశ్న 14.
సమస్యా సాధనలో గ్రాఫుల యొక్క పాత్రను నీవెలా అభినందిస్తావు ?
జవాబు:

  1. కాలం-స్థానభ్రంశం, కాలం-వేగం, పీడనం-ఘనపరిమాణం మొదలగు గ్రాఫులు వాటిలోని భౌతిక రాశుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. తద్వారా వాటి మధ్య గల సమస్యలను సాధించుటకు ఉపయోగపడతాయి.
  2. గ్రాఫులలో వస్తువు ప్రయాణ మార్గం, దిశలను సులువుగా తెలుసుకోవచ్చును. సంబంధిత సమస్యలను సాధించవచ్చును.
  3. గ్రాఫులలోని రేఖల వాలు, వైశాల్యంలను తెలుసుకొనుట ద్వారా వేగం, త్వరణం, స్థానం మొదలగు భౌతిక రాశుల సమస్యలను సాధించవచ్చును.
  4. గ్రాఫులు గరిష, కనిష్ట విలువలను కనుగొనుటకు ఉపయోగపడతాయి.
    ఉదా : పట్టకం కనిష్ట విచలన కోణం.
  5. ప్రయోగ విలువలను గ్రాఫులలో చూపి సమస్యలను సాధించవచ్చును.
  6. ఈ విధంగా గ్రాఫులు సమస్యా సాధనలో అభినందించదగ్గ పాత్రను పోషిస్తున్నాయి.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 15.
ప్రక్క ఇవ్వబడిన గ్రాఫులో ‘B’ బిందువు వద్ద వాలును, వైశాల్యాన్ని కనుక్కోండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 22

ప్రశ్న 16.
3 మీ/సె.ను కి.మీ./గం. లలోకి మార్చుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 23

ప్రశ్న 17.
ఒక 100 గ్రా. బంతిని 0.01 కి.మీ./సె. తొలివేగంతో విసిరిన, ఆ సమయంలో బంతి ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
ద్రవ్యవేగం = ద్రవ్యరాశి × వేగం
బంతి ద్రవ్యరాశి = 100 గ్రా. = 0.1 కి.గ్రా.
బంతి తొలివేగం = 0.01 కి.మీ./సె. = 0.01 × 1000 మీ./సె. = 10 మీ./సె.
ద్రవ్యవేగం = m × v = 0.1 కి.గ్రా, × 10 మీ.సె-1 = 1 కి.గ్రా. మీ.-1

ప్రశ్న 18.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 24
గ్రాఫు గీయడం ద్వారా రోజు-4 ఉష్ణోగ్రతను కనుగొనుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 25
గ్రాఫు నుండి రోజు – 4న 43 °C ఉష్ణోగ్రత ఉంది.

ప్రశ్న 19.
పట్టికను పరిశీలించి క్రింది వానికి జవాబులిమ్ము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2
జవాబు:
i) 12 cm = ……………….m
ii) 2nm = ……………. om
జవాబు:
i) 12 సెం.మీ. = 12 × 10-2 మీ.
ii) 2 nm = 2 × 10-7 cm
[∵ 1 నానోమీటరు = 10-9 మీ.; 1 సెం.మీ. = 10-2మీ.
నానోమీటరును సెంటిమీటర్లలోకి మార్చడానికి = 10-9/ 10-2 = 10-7 మార్పిడి గుణకంతో గుణించాలి.]

ప్రశ్న 20.
క్రింది వానికి మార్పిడి గుణకాలను కనుగొనుము.
a) పికోమీటరు నుండి మీటరు
b) గిగాబైట్ నుండి కిలోబైట్లకు
జవాబు:
a) 1 పికోమీటరు = 10-12 మీ.; 1 మీ. = 100 మీ.
పికోమీటరు – మీటరు మార్పిడి గుణకం ⇒ 10-12 – (0) = 10-12

b) 1 GB = 109 బైట్లు, 1 KB = 10³ బైట్లు
మార్పిడి గుణకం (GB నుండి KBB) = 109-3 = 106

ప్రశ్న 21.
క్రింది వానికి మార్పిడి గుణకాన్ని కనుక్కోండి.
a) మెగావాట్స్ నుండి కిలోవాట్స్
b) కిలోవాట్స్ నుండి మెగావాట్స్
జవాబు:
a) 1 మెగావాట్ = 106 వాట్స్; 1 కిలోవాట్ = 10³ వాట్స్
1 మెగావాట్ నుండి కిలోవాట్ = 106-3 = 10³ (మార్పిడి గుణకం)
1 మెగావాట్ = 10³ కిలోవాట్

b) 1 కిలోవాట్ నుండి 1 మెగావాట్ = 103-6 = 10-3 (మార్పిడి గుణకం)
1 కిలోవాట్ = 10-3 మెగావాట్

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కొలత ప్రమాణాలు రాయడానికి నాలుగు నిబంధనలు రాయుము.
జవాబు:

  1. ప్రమాణాన్ని రాసేటప్పుడు సంఖ్యకి మరియు ప్రమాణానికి మధ్య ఖాళీ ఇవ్వాలి.
    ఉదా : 24 kg, 2 cm, 5 s.
  2. గుణించడం వలన ఏర్పడే ఉత్పన్న ప్రమాణాలను చుక్క (. )తో గాని, ఖాళీతోగాని సూచించాలి.
    ఉదా : N.m లేదా N m
  3. ఒక ప్రమాణాన్ని రాసేటప్పుడు దాని మధ్యలో (. )గాని, ఫుల్ స్టాప్ గాని ఉంచరాదు.
    ఉదా : 4 k.g. కి బదులు 4 kg అని రాయాలి.
  4. ఒక వ్యక్తి పేరుమీద ఉన్న ప్రమాణాలు పొట్టి రూపంలో అయితే ఆంగ్ల పెద్ద అక్షరాలతోను పూర్తి పేరు రూపంలో అయితే ఆంగ్ల చిన్న అక్షరాలతోనూ సూచించాలి.
    ఉదా : N, J, Pa (లేదా) newton, joule, pascal.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 2.
పట్టిక రూపంలో ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫును నిర్మించడానికి కావలసిన సోపానాలు రాయుము.
జవాబు:
1) ఒక గ్రాఫు పేపరును తీసుకొని, దానిపై X – అక్షం మరియు Y- అక్షంను గీయుము.

2) పట్టికలో దత్తాంశంనుబట్టి స్వతంత్ర రాశి, ఆధారిత రాశులను గుర్తించుము. స్వతంత్ర రాశిని X – అక్షం మీద, ఆధారిత రాశిని Y – అక్షం మీద తీసుకోవాలి.

3) X – అక్షం మీద తీసుకున్న విలువలకు మరియు Y- అక్షం మీద తీసుకున్న విలువల వ్యాప్తులను కనుగొనాలి.
వ్యాప్తి = గరిష్ట విలువ – కనిష్ట విలువ

4) అక్షాలపై తీసుకోవలసిన స్కేలును లెక్కించాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 26
స్కేలు ప్రకారం అక్షాలపై స్కేలింగ్ చేయాలి.

5) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న భౌతిక రాశుల పేర్లు వాటి ప్రమాణాలతో కలిపి రాయాలి.

6) పట్టికలో ఇచ్చిన దత్తాంశాన్ని (x1 yx1) (xx2 yx2) …….. వలె దత్తాంశ బిందువులుగా రాయాలి.

7) ఈ దత్తాంశ బిందువులను సంబంధిత క్షితిజ సమాంతర (అడ్డం), క్షితిజ లంబం (నిలువు) ఖండిత బిందువుల వద్ద గుర్తించాలి.

8) ఈ బిందువులన్నింటినీ కలిపితే గ్రాఫు తయారవుతుంది.

ప్రశ్న 3.
క్రింది పట్టికను సరియైన జవాబులతో నింపుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 27
జవాబు:
a) N/m²
b) Pa (పాస్కల్)
c) s-1
d) బలం
e) m. kg.s-2
f) m². kg. s-2
g) J/s (or) \(\frac{\mathrm{N} \cdot \mathrm{m}}{\mathrm{s}}\)
h) W (వాట్)

ప్రశ్న 4.
క్రింది పట్టికను పూరించుము.

ఉత్పన్న రాశి ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం ప్రమాణం
వైశాల్యం
ఘనపరిమాణం
సాంద్రత
వడి
వేగం
త్వరణం
పని
ద్రవ్య వేగం

జవాబు:

ఉత్పన్న రాశి ప్రాథమిక, ఉత్పన్న రాశులతో సంబంధం ప్రమాణం
వైశాల్యం పొడవు X వెడల్పు m2
ఘనపరిమాణం పొడవు X వెడల్పు X ఎత్తు m3
సాంద్రత ద్రవ్యరాశి /ఘనపరిమాణం kg m-3
వడి దూరం / కాలం m s-1
వేగం స్థానభ్రంశం / కాలం m s-1
త్వరణం వేగం / కాలం m s-2
పని బలం / దూరం kg m2 s-2
ద్రవ్య వేగం ద్రవ్యరాశి X వేగం kg m s-1

ప్రశ్న 5.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 28
1) ప్రయాణంలో ఎవరు విశ్రాంతి తీసుకున్నారు?
2) 100 నిమిషాల తర్వాత పద్మ, భవానీల స్థానాలు ఏమిటి?
3) ఎవరు సమవడిలో వెళ్ళారు?
4) భవాని వడి ఎంత?
జవాబు:
1) పద్మ విశ్రాంతి తీసుకుంది.
2) 100 నిమిషాల తర్వాత పద్మ 700 మీ. దూరంలోనూ, భవాని 600 మీటర్ల దూరంలోనూ ఉన్నారు.
3) భవాని సమవడిలో ప్రయాణించింది.
4) భవాని వడి = \(\frac{600}{100}\) = 6 మీ. / నిమిషం .

ప్రశ్న 6.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 29
a) ఏ భౌతికరాశి స్వతంత్ర రాశిగా తీసుకోబడింది?
b) X. అక్షంపై స్కేలు ఎంత?
c) Y- అక్షంపై స్కేలు ఎంత?
d) గ్రాఫు ఆకారం ఏమిటి?
జవాబు:
a) దూరం స్వతంత్ర రాశిగా తీసుకోబడింది.
b) 1 cm = 100 m
c) 1 cm = 2 నిమిషాలు
d) గ్రాఫు వక్రరేఖా గ్రాఫు.

ప్రశ్న 7.
ఇచ్చిన దత్తాంశానికి గ్రాఫు గీయుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 30
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X- అక్షం, Y- అక్షాలను గీయాలి.

2) దత్తాంశం ప్రకారం కాలం స్వతంత్ర రాశి, స్థానభ్రంశం ఆధారిత రాశి. కావున, X – అక్షంపై కాలం, Y – అక్షంపై స్థానభ్రంశాలను తీసుకోవాలి.

3) X – అక్షం, Y – అక్షంపై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X – అక్షంపై వ్యాప్తి = 24 – 4 = 20
Y- అక్షంపై వ్యాప్తి = 15 – 2 = 13

4) X – అక్షం, Y – అక్షం పై తీసుకుంటున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 31
X – అక్షంపై స్కేలు 1 cm = 2 ని.
Y – అక్షంపై స్కేలు 1 cm = 1 కి.మీ.
తీసుకొని అక్షాలపై గుర్తించాలి.
5) X – అక్షంపై కాలం (ని.), Y – అక్షంపై స్థానభ్రంశం. (కి.మీ.) అని రాయాలి.

6) దత్తాంశ బిందువులను (4, 2) (8, 3) (12, 7) (16, 11) (20, 13) (24, 15) గా తీసుకోవాలి.

7) పై బిందువులను గ్రాఫు పేపరుపై గుర్తించాలి.

8) ఆయా బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 32

ప్రశ్న 8.
వేగం-కాలం (v – t) గ్రాఫును గీయుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 33
జవాబు:
1) గ్రాఫు పేపరుపై X – అక్షం, Y – అక్షాలను గీయాలి.

2) దత్తాంశం ప్రకారం బలం స్వతంత్ర రాశి, వేగం ఆధారిత రాశి, కావున X – అక్షంపై కాలంను, Y – అక్షంపై వేగంను తీసుకోవాలి.

3) X – అక్షం, Y – అక్షంపై తీసుకున్న విలువల వ్యాప్తులను లెక్కించాలి.
X- అక్షంపై వ్యాప్తి = 180 – 20 = 160
Y- అక్షంపై వ్యాప్తి = 20 – 5 = 15

4) X – అక్షం, Y – అక్షంపై స్కేలును అంచనా వేయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 34
X- అక్షంపై స్కేలు 1 cm = 8s; Y – అక్షంపై స్కేలు 1 cm = 1 m/s

5) X – అక్షంపై కాలం (సె), Y- అక్షంపై వేగం (మీ./సె.) అని రాయాలి.

6) దత్తాంశ బిందువులు (20, 5), (40, 10), (60, 15), (80, 20), (100, 20), (120, 20), (140, 20), (160, 20), (180, 15) గా తీసుకోవాలి.

7) పై బిందువులను గ్రాఫు పేపర్ లో గుర్తించాలి.

8) గుర్తించిన బిందువులను కలుపుతూ రేఖను గీయాలి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 35

ప్రశ్న 9.
i) v = u + at, ii) s = ut + ½ at² అని గ్రాఫు పద్ధతిలో నిరూపించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 36
i) 1) కాలాన్ని X – అక్షంపై, వేగాన్ని Y – అక్షంపై తీసుకొని పటంలో చూపినట్లు గ్రాఫును గీయాలి.

2) పై గ్రాఫు నుండి,
t విలువ “O” వద్ద వస్తు వేగం = 4
t విలువ “t” వద్ద వస్తు వేగం = v

3) వేగంలో మార్పు = v – u

4) గ్రాఫు నుండి x1 = 0, x2 = t, y1 = u, y2 = v
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 37

ii) 1) పై గ్రాఫు యొక్క వైశాల్యం ట్రెపీజియం ఆకారంలో ఉంది. ఇది ABCD దీర్ఘ చతురస్రం మరియు DCE త్రిభుజం కలిపి యుంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 38

ప్రశ్న 10.
క్రింది గ్రాఫును పరిశీలించి 12 సెకన్ల వద్ద వస్తు స్థానభ్రంశాన్ని లెక్కించంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 39
జవాబు:

  1. స్థానభ్రంశం (s) ⇒ గ్రాఫు వైశాల్యం = ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం + BDC త్రిభుజ వైశాల్యం.
  2. ABDO దీర్ఘచతురస్ర వైశాల్యం = 8 × 20 = 160.
  3. BDC త్రిభుజ వైశాల్యం = ½ × 20 × (12 – 8) = ½ × 20 × 4 = 40.
  4. స్థానభ్రంశం(S) = 160 + 40 = 20oమీ.
  5. 12 సెకన్ల వద్ద వస్తువు 200 మీ. స్థానభ్రంశం చెందింది.

ప్రశ్న 11.
గ్రాఫు నుండి 4 వద్ద వేగాన్ని లెక్కించండి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 40
జవాబు:

  1. త్వరణం – కాలం (a – t) గ్రాఫు యొక్క వైశాల్యం వేగం (v) ను సూచిస్తుంది.
  2. AB లను కలుపుము.
  3. వేగం (v) = ∆ ABO వైశాల్యం = ½ × 60 × 120 = 3600 మీ./సె.

ప్రశ్న 12.
క్రింది గ్రాఫులో ‘B’ వద్ద బలాన్ని లెక్కించుము.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 41
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 42

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 1 Mark Bits Questions and Answers

1. భౌతికరాశుల ప్రమాణాల స్థానము
A) పరిమాణాలకు ఎడమవైపు
B) పరిమాణాలకు కుడివైపు
C) పరిమాణాల క్రింద
D) పరిమాణాల పైన
జవాబు:
B) పరిమాణాలకు కుడివైపు

2. ఈ క్రింది వానిలో ప్రాథమిక రాశి కానిదేది?
A) కాంతి తీవ్రత
B) పొడవు
C) పీడనము
D) ద్రవ్యరాశి
జవాబు:
C) పీడనము

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

3. SI పద్ధతిలో ఉష్ణోగ్రతకు ప్రమాణాలు
A) °C
B) కెల్విన్
C) కెలోరి
D) A లేదా B
జవాబు:
B) కెల్విన్

4. SI పద్ధతి అనగా
A) Standard International Measures
B) State Implement Units
C) International System of Units
D) International Standards of Measurements
జవాబు:
C) International System of Units

5. ‘సెకండ్లు’ అనే ప్రమాణాలు ఈ పద్దతికి చెందినవి.
A) CGS పద్ధతి
B) MKS పద్ధతి
C) SI పద్ధతి
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

6. జతపరచండి.
a) విద్యుచ్ఛక్తి ( ) i) మోల్
b) కాంతి తీవ్రత ( ) ii) కాండెలా
c) పదార్థ పరిమాణము ( ) iii) ఆంపియర్
A) a – iii, b – ii, c – i
B) a – i, b – ii, c – iii
C) a – i, b – iii, c – ii
D) a – ii, b-iii, c – i
జవాబు:
A) a – iii, b – ii, c – i

7. ప్రమాణాల నిర్వచనం ప్రకారం పీడనానికి ఉపయోగించే ప్రమాణాలు ఏవి?
a) మీటరు b) కిలోగ్రామ్ c) సెకండు
A) a & c
B) b & c
C) a & b
D) a, b & c
జవాబు:
D) a, b & c

8. 1 పీకో మీటరు =
A) 10-9 మీటర్లు
B) 10-8 మీటర్లు
C) 10-12 మీటర్లు
D) 10-10 మీటర్లు
జవాబు:
C) 10-12 మీటర్లు

9. ఈ క్రింది వానిలో అసత్యమైనది
A) 10-9 m = 1 నానోమీటర్
B) 10-6 m = 1 మైక్రోమీటర్
C) 10-3 m = 1 కిలోమీటర్
D) పైవేవీకావు
జవాబు:
C) 10-3 m = 1 కిలోమీటర్

10. 5 × 10-3 కి.మీ. = 0.005 కి.మీ.
పై వాక్యంలో మార్పిడి గుణకం
A) 5
B) 10-3
C) 0.005
D) 5 x 10-3
జవాబు:
B) 10-3

11. km/hr లను m/sగా మార్చడానికి మార్పిడి గుణకం
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 43
జవాబు:
A

12. వేగం = 10 మీ/సె. SI పద్ధతిలో వేగము
A) 0.1 m/s
B) 0.01 m/s
C) 1 ms.
D) 10³ m/s
జవాబు:
A) 0.1 m/s

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

13. ప్రమాణాలను తెలియజేసే సరైన పద్ధతి ఈ క్రింది వానిలో ఏది?
A) 2 Kg
B) 2kg
C) 2 kg
D) 2 kgs
జవాబు:
C) 2 kg

14. ఈ క్రింది వానిలో సరైనది కానిది ఏది?
A) 4 joules
B) 4 j
C) 4 J
D) ఏదీకాదు
జవాబు:
B) 4 j

15. ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) MW
B) kW
C) Watts
D) K.W
జవాబు:
A) MW

16. 1మీ, 2మీ, 3మీ ….. ఖచ్చితమైన దారపు పొడవుతో ప్రమీల లోలకం యొక్క కంపనాలను లెక్కిస్తుంది.
పై సమాచారంలో స్వతంత్ర రాశి
A) పౌనఃపున్యాల సంఖ్య
B) పొడవు
C) కాలము
D) గోళ ద్రవ్యరాశి
జవాబు:
B) పొడవు

17. 1, 1.1, 0.5, 1.6, 1.01, 1.5 ల వ్యాప్తి
A) 1.1
B) 0.5
C) 1.01
D) 0.1
జవాబు:
A) 1.1

18. X – అక్షంపైనున్న గళ్ళ సంఖ్య 24 మరియు వ్యాప్తి 12 అయిన X – అక్షంపై స్కేలు
A) 2
B) 6
C) 0.5
D) 1
జవాబు:
C) 0.5

19. లంబాక్షము మరియు సమాంతర అక్షములు వరసగా
A) X – అక్షము, Y – అక్షము
B) Y – అక్షము, X – అక్షము
C) X – అక్షము, X – అక్షము
D) Y- అక్షము, Y – అక్షము
జవాబు:
B) Y – అక్షము, X – అక్షము

20. స్వేచ్ఛగా పడే వస్తువు యొక్క వేగము మరియు కాలముల గ్రాఫు
A) వక్రరేఖా గ్రాఫు
B) సరళరేఖా గ్రాపు
C) A లేదా B
D) బార్ గ్రాఫ్
జవాబు:
B) సరళరేఖా గ్రాపు

21. s – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానం
జవాబు:
B) వేగం

22. v – t గ్రాఫు వాలు సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
C) త్వరణం

23. v – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
D) స్థానభ్రంశం

24. a – t గ్రాఫు వైశాల్యం సూచించునది
A) వడి
B) వేగం
C) త్వరణం
D) స్థానభ్రంశం
జవాబు:
B) వేగం

25. స్ప్రింగ్ లో సాగుదలకు, స్ప్రింగ్ కు వేలాడదీసిన ద్రవ్యరాశికి గల సంబంధాన్ని తెలిపే గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

26. F ∝ \(\frac{1}{\mathbf{d}^{2}}\). F – d గ్రాఫు ఆకారము
A) సరళరేఖ
B) పరావలయం
C) వక్రరేఖ
D) A లేదా B
జవాబు:
B) పరావలయం

27. a) y, x కు విలోమానుపాతంలో ఉంది.
b) y, x² కు అనులోమానుపాతంలో ఉంది.
c) y, √x కు అనులోమానుపాతంలో ఉంది.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 44
గ్రాఫులను జతపరచండి.
A) a – i, b – ii, c – iii
B) a – ii, b – iii, c – i
C) a – iii, b – i, c – ii
D) a – iii, b – ii, c – i
జవాబు:
A) a – i, b – ii, c – iii

28. బలం మరియు కాలం గ్రాఫు వైశాల్యము
A) పీడనం
B) స్థానభ్రంశం
C) ప్రచోదనం
D) ఏదీకాదు
జవాబు:
C) ప్రచోదనం

29. హుక్ సూత్రము యొక్క గ్రాఫు ఆకారం
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ
B) X – అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
C) Y- అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ
D) వక్రరేఖ
జవాబు:
A) మూలబిందువు గుండా వెళ్ళే సరళరేఖ

30.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 45
మంచు యొక్క విశిష్టోషాన్ని సూచించే భాగం
A) AB
B) BC
C) CD
D) DE
జవాబు:
B) BC

మీకు తెలుసా?

కొలత పద్దతులు వాటి ప్రమాణాలు ఏమిటో క్రింది పట్టికలో చూడండి.
AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 46

మీటరు :
శూన్యంలో కాంతి 1/299, 792,458 సెకన్లలో ప్రయాణించిన దూరాన్ని మీటరు కొలతగా నిర్ధారించారు.

కొన్ని ప్రమాణాలను శాస్త్రవేత్తల పేర్లతో సూచిస్తాము. న్యూటన్, పాస్కల్, బౌల్, వాట్, కులూంబ్, వోల్టు, ఫారడే, ఓమ్, వైబర్, హెన్రీ మొదలగునవి.

విలోమానుపాత నియమం :
రెండు రాశులు విలోమానుపాతంలో ఉండాలి అంటే అవి క్రింది నిబంధనలను పాటించాలి.

  1. ఒక రాశి విలువ ‘0’ గా ఉండాలి. ఇప్పుడు రెండో రాశి విలువను నిర్వచించలేము. అంటే అనంతంగా చెప్పవచ్చు.
  2. ఏ జత విలువల లబ్దం లెక్కించినా విలువ స్థిరంగా ఉండాలి.
  3. ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండవ రాశి తగ్గుతూ ఉండాలి.

AP 9th Class Physical Science Important Questions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

అనులోమానుపాత నియమం :
రెండు రాశులు అనులోమానుపాతంలో ఉండాలి అంటే కింది నిబంధనలు పాటించాలి.

  1. ప్రారంభ విలువలు ‘0’గా ఉండాలి.
  2. ఏ జత విలువల నిష్పత్తిని లెక్కించినా స్థిరంగా ఉండాలి.
  3. ఒక రాశి విలువ పెరుగుతూ ఉంటే రెండవ రాశి విలువ కూడా పెరుగుతూ ఉండాలి.

పై నిబంధనలు పాటిస్తేనే ఆ రెండు రాశులు అనులోమ / విలోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పగలం. అంతే తప్ప ఒక రాశి పెరుగుతూ ఉంటే రెండో రాశి కూడా పెరుగుతూ ఉన్నంత మాత్రాన అవి అనులోమ సంబంధం – కలిగి ఉన్నట్లు కాదు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

These AP 9th Physical Science Important Questions and Answers 11th Lesson ధ్వని will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 11th Lesson Important Questions and Answers ధ్వని

9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ధ్వని యొక్క అనుభూతిని మనం ఎలా పొందుతాము?
జవాబు:
ఒకచోట ఉత్పత్తి అయిన ధ్వని గాలిలో ప్రయాణించి చెవిని చేరి, చెవిలో కర్ణభేరిని కదిలించడం ద్వారా ధ్వని యొక్క
అనుభూతిని కల్పిస్తుంది.

ప్రశ్న 2.
శృతిదండం యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
శృతిదండం యొక్క పిచ్ దాని భుజాల పొడవుపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 3.
ధ్వని ఏ రూపంలో ప్రసరిస్తుంది?
జవాబు:
ధ్వని తరంగ రూపంలో ప్రసరిస్తుంది.

ప్రశ్న 4.
అనుదైర్ఘ్య తరంగాలంటే ఏమిటి?
జవాబు:
యానకంలో కణాలు తరంగ చలన దిశలోనే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.

ప్రశ్న 5.
యానకం సాంద్రతలో మార్పునకు కారణమయ్యే తరంగాలు ఏవి?
జవాబు:
అనుదైర్ఘ్య తరంగాలు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 6.
అనుదైర్ఘ్య తరంగాలలో ఏర్పడే ప్రదేశాలను ఏమంటారు?
జవాబు:
యానక సాంద్రతలో మార్పువల్ల అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడన, విరళీకరణములనబడే ప్రదేశాలు ఏర్పడతాయి.

ప్రశ్న 7.
తిర్యక్ తరంగాలనగానేమి?
జవాబు:
యానకంలో కణాలు తరంగచలన దిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.

ప్రశ్న 8.
ప్రతిధ్వని అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ తర్వాత శ్రోతకు పరావర్తన ధ్వని వినబడితే దానిని ప్రతిధ్వని అంటారు.

ప్రశ్న 9.
ప్రతినాదం అనగానేమి?
జవాబు:
అసలు ధ్వని వినబడిన 0.1 సె॥ కంటే తక్కువ కాలంలో నిజధ్వనితో కలిసి పరావర్తన ధ్వని వినిపిస్తే దానిని ప్రతినాదం అంటారు.

ప్రశ్న 10.
సాధారణ మానవుని సగటు శ్రవ్య అవధి ఎంత?
జవాబు:
20 హెర్ట్ నుండి 20,000 హెర్ట్.

ప్రశ్న 11.
పరశ్రావ్యాలను ఉత్పత్తి చేసే జంతువులకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఏనుగులు, తిమింగలాలు, ఖడ్గమృగాలు మొదలైనవి.

ప్రశ్న 12.
సోనార్ (SONAR) అనగానేమి?
జవాబు:
సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.

ప్రశ్న 13.
ఒక సంగీత స్వరం, మరొక సంగీత స్వరం కంటే భిన్నమైనదని తెలిపే అఖిలక్షణాలను వ్రాయుము.
జవాబు:
అభిలక్షణాలు :
i) పిచ్ (స్థాయి) ii) తీవ్రత iii) నాణ్యత

ప్రశ్న 14.
నీకు దగ్గరలో గల కాంపౌండర్ గారి వద్దకు వెళ్ళి స్టెతస్కోప్ ఎలా గుండె చప్పుళ్లను తెలుపుతుందో సమాచారాన్ని అడిగి క్లుప్తంగా వ్రాయుము.
జవాబు:
శరీర అంతర్భాగాల ద్వారా వచ్చే శబ్దాలు స్టెతస్కోప్ కుండే గొట్టంలో అనేక పర్యాయాలు పరావర్తనం చెందుతూ, దానికి ఉండే గ్రాహకంలో కూడా అభివృద్ధి చెందబడి ధ్వని వైద్యుని చెవికి చేరుతుంది.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 15.
SONAR వ్యవస్థలో ఉపయోగించే రెండు ముఖ్యమైన పరికరాలను తెలుపండి.
జవాబు:
SONAR వ్యవస్థలో క్రింది ముఖ్యమైన పరికరాలు వినియోగిస్తారు. అవి :
1) ప్రసారిణి 2) గ్రాహకం

9th Class Physical Science 11th Lesson ధ్వని 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
0.6 సెం.మీ. తరంగ దైర్ఘ్యము గల ధ్వని గాలిలో 300 మీ/సె. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ధ్వనిని వినగలమా?
జవాబు:
vani అని మనకు తెలుసు.
n: v. 300 : 50,000 Hz
0.6×10-2
ఇది శ్రవ్య అవధిలో లేదు. కావున మనము వినలేము.

ప్రశ్న 2.
తరంగ స్వభావము వివరించే తరంగపు లక్షణాలు ఏవి?
జవాబు:
ఒక తరంగ స్వభావాన్ని వివరించే తరంగ లక్షణాలు :

  1. తరంగ దైర్ఘ్యం (wavelength)
  2. కంపన పరిమితి (amplitude)
  3. పౌనఃపున్యం (frequency)
  4. తరంగ వేగం (wave speed)

ప్రశ్న 3.
ధ్వనులను ఎన్ని రకాలుగా విభజించవచ్చును? అవి ఏవి? వాటిని వ్రాయుము.
జవాబు:
ధ్వనులను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి : i) సంగీత స్వరాలు ii) చప్పుళ్లు.

  1. వినుటకు చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను సంగీత స్వరాలు అని అంటారు.
  2. వినుటకు చెవికి కఠోరంగా ఉన్న శబ్దాలను చప్పుళ్లు అంటారు.

ప్రశ్న 4.
“ధ్వని చరిత్ర”ను వ్రాయుము.
జవాబు:

  1. పైథాగరస్ అనే గ్రీకు తత్త్వవేత్త ధ్వని గాలిలో అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగిస్తుందని వివరించాడు.
  2. ఈ విషయాన్ని గెలీలియో మరియు బెకన్లు సమర్థించారు.
  3. ఆ తర్వాత న్యూటన్ మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 5.
పౌనఃపున్యము మరియు ఆవర్తన కాలాల మధ్య సంబంధమును రాబట్టుము.
జవాబు:
యానకంలో ఒక కణం ‘n’ డోలనాలు చేయుటకు పట్టిన కాలము ‘1’ సెకను అనుకొనుము.
ఒక డోలనానికి పట్టిన కాలం = 1/n సెకన్లు. దీనినే ఆవర్తన కాలం అంటారు.
కావున ఆవర్తన కాలం (T) = 1/n సెకన్లు.

ఒక సెకనులో చేసిన డోలనాల సంఖ్య పౌనఃపున్యం (n) కావున ఆవర్తన కాలం (T) = 1/η అగును.

ప్రశ్న 6.
“సోనిక్ బూమ్” గురించి వ్రాయుము. (లేదా) సూపర్ సానిక్ వేగము, షాక్ తరంగాలు మరియు సోనిక్ బూమ్ ల గూర్చి వ్రాయుము.
జవాబు:

  1. ఒక వస్తువు గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ వస్తువు వేగాన్ని సూపర్ సానిక్ వేగమంటారు.
  2. ఒక ధ్వని జనకం నుండి ఉత్పత్తైన ధ్వని సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తున్నపుడు అది గాలిలో “షాక్ తరంగాలను” ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి అధికశక్తి గల తరంగాలను ఉత్పత్తి చేసే అధిక తీవ్రత గల ధ్వనులనే “సోనిక్ బూమా” అంటారు.
  3. ఈ “సోనిక్ బూమ్” వలన విడుదలయ్యే షాక్ తరంగాల వలన అద్దాలకు మరియు భవనాలకు నష్టం వాటిల్లును

ప్రశ్న 7.
రాజు తన స్నేహితుని ఊరికి ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్లాడు. అక్కడ అతను కొన్ని రకాల శబ్ద జనకాలను గమనించాడు అవి వివిధ ఆకృతులలో ఉండటంతో అతనికి కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో కొన్నింటిని వ్రాయండి.
జవాబు:

  1. ఆ శబ్దజనకాల ఆకృతి పేరేమిటి?
  2. వాటిని ఆ ఆకృతిలోనే తయారుచేయాలా?
  3. వాటిని పొడవైన గొట్టాల లాగా ఉంచకూడదా?
  4. ఆ ఆకృతి వలన ఏమైనా ఉపయోగముందా?

ప్రశ్న 8.
సిరి ప్రతిరోజూ “నేషనల్ జాగ్రఫిక్ ఛానల్”ను చూస్తూ ఉంటుంది. ఒక రోజు ఆ ఛానల్ లో ట్యూనా చేపలు పట్టే కార్యక్రమం చూపిస్తున్నారు. ఆ చేపలు పట్టేవారు, వారి పడవలో చేపలు ఎక్కడ ఉన్నాయో, ఎంత దూరంలో ఉన్నాయో అని కచ్చితముగా చెప్పగలుగుచున్నారు. ఇది చూసిన సిరికి కొన్ని రకాల ప్రశ్నలు తలెత్తాయి. అవి ఏమిటో మీరు ఊహించగలరా? అయితే వాటిని కొన్నింటిని వ్రాయుము.
జవాబు:

  1. ఆ చేపలు పట్టే వారు వాడే సాధనం పేరేమిటి?
  2. ఆ సాధనం ఏ విధముగా పనిచేస్తుంది?
  3. వారు కచ్చితముగా చేపల దూరాన్ని ఎలా చెప్పగలుగుచున్నారు?
  4. ఈ పరికరము చేపలు పట్టేందుకు మాత్రమేనా ఇంకా దేనికైనా వినియోగిస్తారా?

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 9.
నీకు దగ్గరగా ఉన్న పారిశ్రామికవాడకు వెళ్ళి మోడరన్ టెక్నాలజీ సహాయంతో వారు లోహపు వస్తువులకు రంధ్రాలు చేయడంగాని, పెళుసైన పదార్ధాలను కావలసిన ఆకృతులలో ఎలా రంధ్రాలు మరియు కట్ చేయుచున్నారో వారిని అడిగి సమాచారాన్ని వ్రాయండి.
జవాబు:

  1. లోహపు వస్తువులకు రంధ్రాలను చేయడానికి ‘హర్న్” అనే సన్నని, దృఢమైన లోహపు కొనను కంపింపచేయటం వల్ల జనించే అతిధ్వనులను వాడతారు.
  2. ఇది ఒక సుత్తిలాగా పనిచేసి సెకనుకు సుమారు 10 లక్షల సార్లు లోహపు పలకపై కొట్టడం వలన కావలసిన ఆకృతులలో రంధ్రాలు చేస్తుంది.
  3. అట్లాగే గాజు వంటి పెళుసైన పదార్థాలను సైతం కోరిన ఆకృతులలో రంధ్రాలు చేయడం, కట్ చేయడం సులభంగా చేయవచ్చు.

ప్రశ్న 10.
సాధారణ పద్ధతిలో శుభ్రపరచబడిన వస్తువులపై మురికిని పూర్తిగా కొన్ని ప్రదేశాలలో తొలగించలేము. ఈ సమస్యకు నీవు ఏ విధమైన పరిష్కారమివ్వగలవో మీ పెద్దలనడిగి సమాచారాన్ని సేకరించి వ్రాయుము.
జవాబు:

  1. ఇటువంటి మురికిని అతిధ్వనులను ఉపయోగించి సులభంగా శుభ్రపరచవచ్చు.
  2. వస్తువులను శుభ్రపరిచే ద్రావణంలోకి అత్యధిక పౌనఃపున్యం కలిగిన తరంగాలను పంపించి వస్తువులకు వివిధ ప్రదేశాలలో అంటిన మురికి కణాలను కదిలిస్తారు.
  3. వాటిని తిరిగి నీటితో సులభంగా శుభ్రపరుస్తారు.

ప్రశ్న 11.
ప్రస్తుత రోజులలో కాలేయం, పిత్తాశయం, గర్భాశయం మొదలగు వాటిల్లో ఏర్పడే రాళ్ళను, కణితులను గుర్తించుటకు ఏ పద్ధతులను పాటిస్తున్నారో ప్రముఖ వైద్యుని ఇంటర్వ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

  1. అతిధ్వనులు వైద్యుల చేతికి అందిన శక్తివంతమైన మరియు సురక్షితమైన పరికరము.
  2. ఇకోకార్డియోగ్రఫి అనే పద్ధతిలో గుండెలోని వివిధ భాగాల నుండి పరావర్తనం చెందిన అతిధ్వనులు గుండె చిత్రాల్ని ఏర్పరుస్తాయి.
  3. అల్ట్రాసోనోగ్రఫి అనే పద్ధతిని రోగి శరీరంలోని అవయవాలలో ఏర్పడ్డ కణితులను, రాళ్ళను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
  4. ఇదే పద్ధతిని తల్లి గర్భంలోని భ్రూణము యొక్క పెరుగుదలను పరిశీలించుటకు కూడా వాడతారు.

ప్రశ్న 12.
స్వరము యొక్క పిచ్ ను నిర్ధారించే నమూనాను తయారు చేయండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 3

ప్రశ్న 13.
ప్రక్క పటంను గమనించి దాని గురించి రెండు వాక్యాలు వ్రాయుము.
AP Board 9th Class Physical Science Solutions 11th Lesson ధ్వని 9
జవాబు:

  1. ఇచ్చిన పటం ధ్వని పరావర్తనంను తెలియజేయుచున్నది.
  2. ధ్వని పరావర్తనం చెందిన తర్వాత అన్ని మూలలకు సమానంగా చేరుకునేటట్లు సమావేశ మందిరంను నిర్మించారు.

ప్రశ్న 14.
శృతిదండంను కనుగొన్న సంగీత విద్వాంసుడు అయిన “జాన్‌ షోర్” కృషిని ఎలా అభినందిస్తారు?
జవాబు:

  1. జాన్ షోర్ కనుగొన్న శృతిదండము లేకుంటే ప్రస్తుతము మనము వింటున్న సంగీత సాధనాలుగాని, ఇంపైన సంగీతముగాని ఉండేది కాదు.
  2. శృతిదండంను ఉపయోగించి సంగీత వాయిద్యాలను శృతి చేస్తారు.
  3. ఈ విధంగా మనకు ఉపయోగకరమైన శృతిదండంను కనుగొనుటలో జాషోర్ కృషిని ఏ విధంగా అభినందించినా అది తక్కువే.

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

ప్రశ్న 15.
X – కిరణాలు మరియు కాంతి తరంగాలకు బదులుగా అతిధ్వనులను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?
జవాబు:

  1. అల్ట్రాసోనోగ్రఫి అతిధ్వనులపై ఆధారపడి పనిచేస్తుంది. అల్ట్రాసోనోగ్రఫి అనునది X – కిరణాలతో పరీక్షించడం వంటి పాత పద్ధతుల కంటే సురక్షితమైనది.
  2. ఎందుకనగా తరచుగా X – కిరణాలు వాడటం వలన శరీర కణజాలాలకు ముఖ్యంగా, గర్భంలోని భ్రూణాలకు అపాయం కలిగే అవకాశం ఉంటుంది.

9th Class Physical Science 11th Lesson ధ్వని 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శృతిదండం గురించి వ్రాయుము.
జవాబు:

  1. శృతిదండం ఒక శబ్ద అనునాదకము. దీనిని “జాన్ షోర్” అనే సంగీత విద్వాంసుడు కనుగొనెను.
  2. ఇది U – ఆకారములో వంచబడిన ఉక్కు ముక్క.
  3. దీనిని పట్టుకునేందుకు U – ఆకారపు వంపు వద్ద కడ్డీ అతుకబడి ఉంటుంది.
  4. ఇది నిర్దిష్ట పి’ అనునాదం చెందును.
  5. దీని పిచ్ దాని భుజాల పొడవులపై ఆధారపడును.
  6. సంగీత వాయిద్యాలను శృతిచేయడంలో దీని పిచ్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.

ప్రశ్న 2.
కంపన తరంగాలలోని రకాలు ఎన్ని? అవి ఏవి? వాటిని వివరింపుము.
జవాబు:
కంపన తరంగాలు రెండు రకాలు. అవి:

  1. అనుదైర్ఘ్య తరంగాలు,
  2. తిర్యక్ తరంగాలు.

అనుదైర్ఘ్య తరంగాలు:

  1. యానకంలోని కణాలు తరంగ చలనదిశలో (తరంగ చలనదిశకు సమాంతరంగా)నే కంపిస్తే, ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
  2. అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పుకు కారణమవుతాయి.
  3. అనుదైర్ఘ్య తరంగాలలో వరుసగా సంపీడన మరియు విరళీకరణములు ఏర్పడును.
  4. అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ : ధ్వని తరంగాలు.

తిర్యక్ తరంగాలు:

  1. యానకంలోని కణాలు తరంగ చలనదిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.
  2. తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పునకు. కారణమవుతాయి.
  3. తిర్యక్ తరంగాలలో వరుసగా శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడును.
  4. తిర్యక్ తరంగాలకు ఉదాహరణ : నీటిలో ఏర్పడే తరంగాలు

ప్రశ్న 3.
సాంద్రత – దూరం గ్రాఫులో తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితులను చూపే పటంను గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 2

ప్రశ్న 4.
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలను చూపు నమూనాను తయారు చేయండి.
జవాబు:
పౌనఃపున్యం యొక్క ఉన్నత ప్రమాణాలు

కిలో హెర్ట్ (KHz) 103 Hz
మెగా హెర్జ్ (MHz) 106Hz
గిగా హెర్ట్ (GHz) 109 Hz
టెరా హెర్జ్ (THz) 1012 Hz

ప్రశ్న 5.
ఒక సంగీత స్వరం యొక్క పిచను తెలిపే పటాలను గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని 4

9th Class Physical Science 11th Lesson ధ్వని 1 Mark Bits Questions and Answers

1. క్రింది జతలలో సరైనది కానిది
A) పిచ్, పౌనఃపున్యం
B) ప్రతిధ్వని, వక్రీభవనం
C) గుణం, తరంగరూపం
D) తీవ్రత, కంపన పరిమితి
జవాబు:
B) ప్రతిధ్వని, వక్రీభవనం

2. వేగం (V), పౌనఃపున్యం (υ) మరియు తరంగదైర్ఘ్యం (λ)ల మధ్య సంబంధం
A) V = υλ
B) υ = Vλ
C) λ = Vυ
D) \(\mathrm{V}=\frac{\mathrm{U}}{\lambda}\)
జవాబు:
A) V = υλ

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

3. భూమిపై వాతావరణం లేదనుకుంటే ధ్వని తరంగవేగం
A) 3 × 108ms-1
B) 331.2ms-1
C) 3 × 10-8 ms-1
D) వ్యాప్తి చెందదు
జవాబు:
D) వ్యాప్తి చెందదు

4. కింది వానిలో సంగీత ధ్వనుల లక్షణం కానిది
A) తరంగదైర్ఘ్యం
B) కీచుదనం
C) తీవ్రత
D) నాణ్యత
జవాబు:
C) తీవ్రత

5. ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళుతున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాదాగతో కొలిచాడు. అతడు ఆ క్షణంలో కొలిచినది
A) తక్షణ త్వరణం
B) తక్షణ వేగం
C) సరాసరి త్వరణం
D) సరాసరి వేగం
జవాబు:
B) తక్షణ వేగం

6. ఏ స్వరం యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుందో తెల్పండి.
A) స
C) గ
D) మ
జవాబు:
D) మ

I. సరియైన సమాధానమును రాయుము.

1. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ప్రభావితమయ్యే ధ్వని లక్షణం
A) తరంగ దైర్ఘ్యం
B) పౌనఃపున్యము
C) వేగం
D) కంపన పరిమితి
జవాబు:
C) వేగం

2. ఈ క్రింది వానిలో …….. లోధ్వని వేగము అధికము.
A) ఘనపదార్ధములు
B) ద్రవపదార్ధములు
C) వాయు పదార్ధములు
D) శూన్యము
జవాబు:
A) ఘనపదార్ధములు

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

3. సోనార్ వ్యవస్థలో ఉపయోగించు తరంగాల రకము
A) నీటి తరంగాలు
B) రేడియో తరంగాలు
C) ధ్వని తరంగాలు
D) పరశ్రావ్యాలు
జవాబు:
C) ధ్వని తరంగాలు

4. కింది వానిలో పరశ్రావ్యాలను వినగలిగేది.
A) కుక్క
B) గబ్బిలం
C) ఖడ్గమృగం
D) మానవుడు
జవాబు:
C) ఖడ్గమృగం

5. 20°C వద్ద ఒక వ్యక్తి ప్రతిధ్వనిని వినుటకు పరావర్తన తలంకు, అతనికి మధ్యగల కనీస దూరము
A) 12.2మీ.
B) 17.2మీ.
C) 15.2మీ.
D) 134.4మీ.
జవాబు:
B) 17.2మీ.

6. ఒక యానకములో తరంగము ప్రయాణించేటపుడు, ఈ కింది వానిలో ఒక కణము నుండి వేరొక కణానికి బదిలీ అగునది.
A) శక్తి
B) ద్రవ్యవేగం
C) రెండూనూ
D) ఏదీకాదు
జవాబు:
A) శక్తి

7. అనుదైర్ఘ్య తరంగము కింది వానిలో ప్రయాణిస్తుంది.
A)ఘనపదార్థాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

8. ఒక వస్తువు కంపిస్తుంటే స్థిరంగా ఉండే భౌతిక రాశి
A) కంపన పరిమితి
B) వేగం
C)త్వరణము
D) దిశ
జవాబు:
A) కంపన పరిమితి

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

9. ఈ క్రింది వానిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు?
A) ఉష్ణోగ్రత
B) యానకము
C) పీడనము
D) తరంగదైర్ఘ్యం
జవాబు:
C) పీడనము

10. ధ్వని యొక్క పిచ్ ప్రాథమికముగా ఆధారపడునది.
A) తీవ్రత
B) పౌనఃపున్యము
C) లక్షణము
D) అన్నియూ
జవాబు:
B) పౌనఃపున్యము

11. సితార మరియు వీణల నుండి వచ్చే ధ్వనులను వేరుపరచునది.
A) తీవ్రత
B) పిచ్
C) లక్షణము
D) B మరియు C
జవాబు:
C) లక్షణము

12. స్ప్రింగులో ఏర్పడే తరంగాలు …… రకపు తరంగాలు.
A) అనుదైర్ఘ్య
B) తిర్యక్
C) రెండూనూ
D) ఏవీకావు
జవాబు:
A) అనుదైర్ఘ్య

13. ఒక వస్తువు ధ్వనిని మాత్రమే ఉత్పత్తి చేయు స్థితి
A) నిశ్చల
B) కంపన
C) చలన
D) శూన్యము
జవాబు:
B) కంపన

14. Hz ప్రమాణముగా గలది ……….
A) పౌనఃపున్యం
B) అవధి
C) కంపన పరిమితి
D) ఏదీకాదు
జవాబు:
A) పౌనఃపున్యం

AP 9th Class Physical Science Important Questions 11th Lesson ధ్వని

15. కంపన పరిమితికి S.I ప్రమాణము
A) మి.మీ.
B) సెం.మీ.
C) మీ.
D) Å
జవాబు:
C) మీ.

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. ధ్వని ఉత్పత్తి అగు స్థితి ……………….
2. ధ్వని తరంగంలో అధిక పీడనంగల ప్రాంతములు ……………
3. ధ్వని ……………….. గుండా ప్రయాణించదు.
4. ధ్వని ఒక ……………….. స్వరూపము.
6. ధ్వని తరంగంలో అల్ప సాంద్రత గల ప్రాంతములు ……………….
7. కీచుదనం మరియు బొంగురు స్వరాల మధ్య తేడాకు కారణం …….
8. 1 కిలో హెర్ట్జ్ = ……………… హెర్ట్జ్‌లు.
9. అనుదైర్ఘ్య తరంగాలు యానకపు …………….. లో మార్పునకు కారణమవుతాయి.
10. మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించినవాడు ………………
11. శృతిదండాన్ని కనుగొన్న సంగీత విద్వాంసుడు ………………
12. తిర్యక్ తరంగాలు యానకపు ………… లో మార్పునకు కారణమవుతాయి.
13. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలి పీడనం …………….. కు అనులోమానుపాతంలో ఉంటుంది.
14. రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరంను ……………….. అంటారు.
15. యానకంలోని కణాలు వాని. మధ్యస్థ స్థానానికి ఇరువైపులా పొందే గరిష్ఠ అలజడిని ………………. అంటారు.
16. కణాలు ఒక పూర్తి డోలనం చేయుటకు పట్టిన కాలాన్ని …………… అంటారు.
17. 20°C వద్ద పొడిగాలిలో ధ్వ నివేగం ……………..
18. 20°C వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగానికి ……………… రెట్లు అధికం.
19. ఇనుములో ధ్వని వేగం ……….
20. చెవికి ఇంపుగా ఉన్న శబ్దాలను ………… అంటారు.
21. శబ్ద తరంగపు పౌనఃపున్యం ఎక్కువైతే దాని. ………… ఎక్కువ అని చెప్పవచ్చు.
22. మానవుని చెవులు …………………. dB నుండి ……………… dB వరకు గల శబ్దాలను వినగలవు.
23. విమానపు జెట్ ఇంజన్ శబ్ద తీవ్రత …………….. dB ఉంటుంది.
24. ధ్వని పరావర్తనం కూడా … …………….. పరావర్తన నియమాలను పాటిస్తుంది.
25. మానవుని శ్రవ్య అవధి 5. శృతిదండం ఒక
26. వృద్ధులకు గరిష్టంగా ధ్వనులను వినే అవధి ………..
27. ఖడ్గమృగాలు వినగల పరశ్రావ్య ధ్వనుల పౌనఃపున్యము
28. డాల్ఫిన్లు వినగల ధ్వనుల పౌనఃపున్యం ……………..
29. కొన్ని రకాల చేపలు ………………… పౌనఃపున్యం గల ధ్వనులను వినగలవు.
30. సోనార్ అనగా …………….
జవాబు:

  1. ప్రకంపన స్థితి
  2. సంపీడనాలు
  3. శూన్యం
  4. శక్తి
  5. శబ్ద అనునాదకం
  6. విరళీకరణాలు
  7. పిచ్
  8. 10
  9. సాంద్రత
  10. న్యూటన్
  11. జాన్ స్టోర్
  12. ఆకృతి
  13. సాంద్రత
  14. తరంగదైర్ఘ్యం
  15. కంపన పరిమితి
  16. ఆవర్తనకాలం
  17. 343.2 మీ/సె
  18. 4.3
  19. 1487 మీ/సె
  20. సంగీత స్వరములు
  21. పిచ్
  22. 9 – 180
  23. 120
  24. కాంతి
  25. 20 Hz – 20 KHz
  26. 10 KHz – 12 KHz
  27. 5 Hz
  28. 1 లక్షకు పైగా
  29. 1 – 25 Hz
  30. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్

III. జతపరచుము.

i)

Group – A Group – B
1. పరశ్రావ్యాలు A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
2. అతిధ్వనులు B) 1,00,000 Hz లు
3. శ్రవ్య అవధి C) 1-25 Hz
4. గబ్బిలం D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
5. ఏనుగులు E) 20 Hz – 20,000 Hz
F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం

జవాబు:

Group – A Group – B
1. పరశ్రావ్యాలు A) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం
2. అతిధ్వనులు F) 20 KHz కంటే ఎక్కువ పౌనఃపున్యం
3. శ్రవ్య అవధి E) 20 Hz – 20,000 Hz
4. గబ్బిలం B) 1,00,000 Hz లు
5. ఏనుగులు D) 20 Hz కంటే తక్కువ పౌనఃపున్యం

ii)

Group – A Group – B
1. శబ్ద తీవ్రత A) మీటరు
2. కంపన పరిమితి B) సెకను
3. పౌనఃపున్యం C) డెసిబెల్స్
4. తరంగ దైర్ఘ్యం D) హెర్టర్లు
5. ఆవర్తన కాలం E) పాస్కల్
F) υ

జవాబు:

Group – A Group – B
1. శబ్ద తీవ్రత C) డెసిబెల్స్
2. కంపన పరిమితి E) పాస్కల్
3. పౌనఃపున్యం D) హెర్టర్లు
4. తరంగ దైర్ఘ్యం A) మీటరు
5. ఆవర్తన కాలం B) సెకను

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

These AP 9th Physical Science Important Questions and Answers 10th Lesson పని మరియు శక్తి will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 10th Lesson Important Questions and Answers పని మరియు శక్తి

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక జౌల్ పని అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుపై 1 న్యూటన్ బలం పని చేసి ఆ వస్తువును బల ప్రయోగదిశలో 1 మీ. దూరం కదిలిస్తే అపుడు 1 జౌల్ పని జరిగింది అంటాం.

ప్రశ్న 2.
ఒక బంతిని పైకి విసిరితే అది పైకి వెళుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
బంతి పైకి వెళుతున్న కొద్దీ దానిపై గురుత్వాకర్షణ బలము వ్యతిరేకదిశలో పని చేయటం వల్ల ఆ బంతి వడి క్రమేపి తగ్గును.

ప్రశ్న 3.
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి ఎంత?
జవాబు:
పైకి విసిరిన బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వడి శూన్యము.

ప్రశ్న 4.
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నప్పుడు దాని వది ఏమవుతుంది?
జవాబు:
పైకి విసిరిన బంతి తిరిగి కిందికి పడుతున్నపుడు దాని వడి క్రమేపి ‘పెరుగును.

ప్రశ్న 5.
శక్తి అనగానేమి?
జవాబు:
పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటారు.

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 6.
ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఎక్కువ సేపు నిలుచున్నా, అలసిపోతాడు. ఎందుకు?
జవాబు:
నిలచున్న వ్యక్తి ఏ పని చేస్తున్నట్లు మనకు కనిపించకపోయినా, అతని శరీరంలో కండరాలు సంకోచవ్యాకోచాలు చెందుతాయి. అదే విధంగా గుండె వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇటువంటి అనేక పనుల వలన శరీరంలోని శక్తి తరిగిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి అలసిపోతాడు.

ప్రశ్న 7.
గతిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని గమనం వల్ల లభించే శక్తిని ‘గతిశక్తి’ అంటారు.

ప్రశ్న 8.
గతిశక్తిని కొలవడానికి సూత్రం వ్రాయుము.
జవాబు:
గతిశక్తి KE = \(\frac{1}{2}\) mv².

ప్రశ్న 9.
స్థితిశక్తి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వల్ల పొందే శక్తి ‘స్థితిశక్తి’ అంటారు.

ప్రశ్న 10.
స్థితిశక్తిని కొలవడానికి సూత్రం రాయుము.
జవాబు:
స్థితిశక్తి PE = mgh.

ప్రశ్న 11.
శక్తి నిత్యత్వం అనగానేమి?
జవాబు:
శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమము అంటారు.

ప్రశ్న 12.
ప్రక్కన ఇవ్వబడిన పటం ద్వారా నీవేమి సమాచారాన్ని గ్రహించితివో వ్రాయండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 5
పళ్ళెంలో నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు గోళీ ‘పని’ చేయలేకపోయింది. కానీ దానిని కొంత ఎత్తు వరకు పైకి ఎత్తినపుడు గోళీ పని చేయగలిగింది.

ప్రశ్న 13.
మీ ఇంటిలో వాడే లైట్లు (బల్బులు) ఏ విధంగా శక్తి పరివర్తనను జరుపుచున్నాయో వ్రాయుము.
జవాబు:
ఎలక్ట్రిక్ బల్బు, విద్యుత్ శక్తిని మొదటగా ఉష్ణశక్తిగాను, తర్వాత కాంతిశక్తిగాను మారుస్తుంది.
∴ విద్యుత్ శక్తి → ఉష్ణశక్తి → కాంతి శక్తి

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 14.
25 కిలోల బియ్యం బస్తాను పిల్లలు పైకెత్తలేకపోవచ్చు. కానీ పెద్దవారు ఎత్తగలుగుతారు. ఎందుకు?
జవాబు:
పిల్లవాడు ప్రయోగించిన బలం కన్నా, పెద్దవారు ప్రయోగించిన బలం అధికము కావున.

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
‘పని’ భావనను శాస్త్రీయంగా చెప్పాలంటే క్రింది రెండు షరతులు పాటింపబడాలి.
1. వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి.
2. ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.
క్రింది పట్టికను పూరించండి.
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 1
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 2

ప్రశ్న 2.
అ)
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 2
ఆ)
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 21
పై పటములలో చూపబడిన వస్తువులు ఏ శక్తులను కలిగి ఉంటాయో తెలపండి.
జవాబు:
i) వస్తువు స్థితిశక్తిని కలిగియుంది.
ii) వస్తువు గతిశక్తిని కలిగియుంది.

ప్రశ్న 3.
సామర్థ్యమును వివరించుము. ఇది అదిశ రాశా? సదిశ రాశా?
జవాబు:
పని జరిగే రేటును సామర్ధ్యం అంటారు. (లేక) శక్తి మార్పు రేటును సామర్థ్యం అంటారు. ఒక శక్తి ‘W’ పనిని ‘t’
కాలములో చేసిన దాని సామర్థ్యము (P) = పని / కాలము
⇒ P = \(\frac{W}{t}\)
పని మరియు కాలములు అదిశ రాశులు కావున సామర్ధ్యము కూడా అదిశ రాశి అగును.

ప్రశ్న 4.
క్రింది పటంను గమనించి, దాని గురించి వ్రాయుము.
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 3
జవాబు:
ఒక సమతలం పైన కదులుతున్న బంతిపై ఘర్షణ బలం బంతి కదిలే దిశకు వ్యతిరేక దిశలో పనిచేయడం వలననే ఆ బంతి కొంత సేపటికి ఆగిపోతుంది.

ప్రశ్న 5.
పని జరగటానికి కావాల్సిన షరతులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
విజ్ఞానశాస్త్రం ప్రకారం పని జరిగిందని చెప్పాలంటే క్రింద తెలిపిన రెండు షరతులు సంతృప్తి పరచబడాలి.

  1. వస్తువుపై ఏదైనా బలం పని చేయాలి.
  2. ఆ వస్తువు స్థానంలో లేదా స్థితిలో మార్పు జరగాలి.

ప్రశ్న 6.
సామర్థ్యమునకు SI పద్ధతిలో ప్రమాణము వ్రాయుము. దాని యొక్క ఉన్నత ప్రమాణాలను తెలుపుము.
జవాబు:
1) SI పద్ధతిలో సామర్ధ్యమునకు ప్రమాణము వాట్. వాట్ అనగా 1 జోల్ పనిని 1 సెకను కాలము చేయుట అని అర్ధము.

2) సామర్ధ్యం యొక్క టన్నుల విలువను కిలోవాట్లలో కొలుస్తారు.
1 కిలోవాట్ = 1000 వాట్లు = 1000 వోళ్ళు / సెకను
1 మెగావాట్ = 106 వాట్లు

ప్రశ్న 7.
ఒక బొమ్మ కారుకు ‘కీ’ ఇవ్వకుండా నేలపై ఉంచాం. తర్వాత ‘కీ’ ఇచ్చి నేలపై ఉంచబడిన పటం ఇవ్వబడినది. దానిపై ఒక వాక్యమును వ్రాయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 4
‘కీ’ ఇవ్వబడని కారు నిశ్చల స్థితిలోనే ఉంటుంది. కాని ‘కీ’ ఇచ్చిన తర్వాత అదే బొమ్మకారు కదిలేందుకు కావలసిన శక్తిని స్ప్రింగు ద్వారా పొందుతుంది.

ప్రశ్న 8.
గతిశక్తికి కొన్ని ఉదాహరణలిచ్చు సందర్భాలను వ్రాయుము.
జవాబు:

  1. వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడం.
  2. అదే బంతి బ్యాట్ కు తగిలితే వేగంగా మరొక దిశలో కదలడం.
  3. వేగంగా కదిలే తుపాకి గుండు, లక్ష్యం గుండా దూసుకొని పోవడం.
  4. కదిలే గాలి (పవనం) గాలిమరను తిప్పడం.

ప్రశ్న 9.
మానవ శరీరంలోని శక్తిని గురించి రాయుము.
జవాబు:

  1. మానవ శరీరం వివిధ రకాల శక్తి మార్పులు జరిగే ఒక సంక్లిష్ట వ్యవస్థ.
  2. మానవ శరీరంలోని శక్తికి మూలాధారం ఆహారం.
  3. పనిని చేసేటపుడు కండరాల సంకోచ, వ్యాకోచాల సందర్భంలో గుండె రక్తాన్ని “పంప్” చేయడానికి శక్తి వినియోగించ బడుతుంది.
  4. మన శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి పనిచేసే బలం మన శరీర శక్తిని తగ్గిస్తుంది. అటువంటి సందర్భంలో మనం అలసిపోతాం.

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 10.
సోను ఈ మధ్య జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించాడు. అతనికి క్రికెట్లోని బంతి, బ్యాట్ పై మరియు దాని చలనాలపై కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో వ్రాయండి.
జవాబు:

  1. బంతిని బౌలర్ వేగంగా ఎందుకు వేస్తున్నాడు?
  2. వేగంగా కదిలే క్రికెట్ బంతి వికెట్లను పడగొట్టడంలో ఇమిడివున్న నియమమేమిటి?
  3. అదే బంతి బ్యాట్ కు తగలగానే దిశ ఎందుకు మార్చుకోగలిగినది?

ప్రశ్న 11.
వెంకట్ వాలీబాల్ తో ఆడుచున్నాడు. అతను బంతిని పైకి వేసిన సందర్భంలో దానిలో కలిగే మార్పులను గమనించాడు. అతనికి కొన్ని ప్రశ్నలు (సందేహాలు) వచ్చాయి. అవి ఏమైవుంటాయో మీరు ఊహించగలరా?
జవాబు:

  1. బంతి పైకి వెళుతుంటే దాని వేగం ఏమవుతుంది?
  2. బంతి చేరుకున్న గరిష్ట ఎత్తు వద్ద దాని వేగం ఎంత?
  3. బంతి తిరిగి కిందకి వస్తున్నప్పుడు దాని వడి ఏమవుతుంది?

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సితిజ, గతిజ శక్తుల మధ్య పోలికలు, తేడాలను వ్రాయండి.
జవాబు:

స్థితిజ శక్తి గతిజ శక్తి
1) ఒక వస్తువుకు దాని ఆకారం లేదా స్థానం వలన పొందే శక్తిని స్థితిజశక్తి (P.E) అని అంటారు. 1) ఒక వస్తువుకు దాని గమనం వలన పొందే శక్తిని గతిజ శక్తి (K.E) అని అంటారు.
2) ఇంటిపై గల నీటి ట్యాంక్ లో నీటికి గల శక్తి స్థితిజ శక్తి. సాగదీసి ఉంచబడిన రబ్బరు బ్యాండ్‌కు గల శక్తి స్థితిజ శక్తి. 2) ప్రవహించే నీటికి గల శక్తి గతిజ శక్తి. ప్రయాణించే వాహనానికి గల శక్తి గతిజ శక్తి.
3) P.E = mgh 3) K.E = \(\frac{1}{2}\) mv2
4) ఇది ఎత్తుపై ఆధారపడి ఉంటుంది.
(కొన్ని సందర్భాలలో)
4) ఇది వేగంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 2.
యాంత్రిక శక్తి అనగానేమి? దాని యొక్క రూపాలను రాయుము. ఒక ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
ఒక వస్తువునకు యాంత్రిక బలము వలన వచ్చు శక్తినే యాంత్రిక శక్తి అంటారు.

యాంత్రిక శక్తి రెండు రకాలు. అవి : 1) గతిశక్తి ii) స్థితిశక్తి

ఉదాహరణ:

  1. ఒక విమానం నిశ్చలస్థితిలో ఉన్నప్పుడు దాని గతిశక్తి విలువ శూన్యం. అదే విధంగా అది నేలపై ఉన్నప్పుడు దాని స్థితిశక్తి విలువ కూడా శూన్యమే.
  2. అనగా నేలపై నిశ్చలస్థితిలో ఉన్న విమానం యొక్క యాంత్రికశక్తి శూన్యం.
  3. అదే విమానం కొంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు దానికి గతిశక్తి మరియు స్థితిశక్తి ఉంటాయి కనుక యాంత్రిక శక్తి ఉండదు.

ప్రశ్న 3.
ప్రకృతిలో జలచక్రం ఏర్పడడాన్ని నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. సముద్రాలు, నదులు, సరస్సులు మరియు కొలనులలోని నీరు ఆవిరిగా భాష్పీభవనం చెందును.
  2. ఈ ఆవిరి నీటి మేఘములను ఏర్పరచును.
  3. ఈ మేఘములు వర్షములు కురిసేందుకు దోహదపడును.
  4. వర్షం ద్వారా వచ్చిన నీరు డ్యాములలో నిల్వ చేయబడును. వీటికి స్థితిశక్తి వుండును.
  5. మరలా ఈ నీరు తిరిగి సముద్రంలోకి కలియును.
  6. ఈ కలిసే నీటిని మనము విద్యుత్ శక్తి వనరుగా ఉపయోగిస్తాము.
  7. ఈ విధముగా ప్రకృతిలో గల జలచక్రం మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జలచక్రంను నేను అభినందిస్తున్నాను.

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి 1 Marks Bits Questions and Answers

1. బంతి వడి రెట్టింపైన దాని గతిజశక్తి
A) మారదు.
B) రెట్టింపగును.
C) సగమవుతుంది.
D) నాలుగురెట్లగును.
జవాబు:
D) నాలుగురెట్లగును.

2. చైతన్య 5 నిమిషాల కాలంలో 3000 ల పని చేసిన ఆమె సామర్థ్యం
A) 60 W
B) 1/60 W
C) 1 W
D) o W
జవాబు:
C) 1 W

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

3. ‘పని’కి
A) దిశ మాత్రమే ఉంది, కాని పరిమాణం లేదు.
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.
C) పరిమాణం, దిశ రెండూ కలవు.
D) పరిమాణం, దిశ రెండూ లేవు.
జవాబు:
B) పరిమాణం మాత్రమే ఉంది, కాని దిశ లేదు.

4. సామర్థ్యానికి నిర్వచనం
P) పని జరిగే రేటు
Q) శక్తి బదిలీ రేటు
R) స్థితిశక్తి, గతిశక్తిల మొత్తం
A) P మాత్రమే
B) Q మరియు R
C) P మరియు Q
D) P, Q మరియు R
జవాబు:
C) P మరియు Q

5. ఒక పుస్తకంపై 4.5 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించి, దానిని 30 సెం.మీ. కదిలించిన జరిగిన పని ఎంత?
A) 1.55 J
B) 1.35 J
C) 1.53 J
D) 1.3 J
జవాబు:
B) 1.35 J

I. సరియైన సమాధానమును రాయుము.

1. వస్తువుపై పనిచేసే బలం దాని వడికి విలోమాను పాతంలో ఉంటే గతిశక్తి …..
A) స్థిరం
B) కాలానికి విలోమానుపాతం
C) కాలానికి అనులోమానుపాతం
D) ఏదీకాదు
జవాబు:
C) కాలానికి అనులోమానుపాతం

2. 1కి.గ్రా. ద్రవ్యరాశి, 2 N – S ద్రవ్యవేగం గల వస్తువు గతిశక్తి ……..
A) 2 J
B) 4 J
C) 8 J
D) 16 J
జవాబు:
A) 2 J

3. 15 కి.గ్రా. సూట్‌కేస్ ని పట్టుకొని 15 ని|| బస్సు కొరకు వేచి ఉండుటలో జరిగిన పని
A) ఎక్కువ
B) తక్కువ
C) శూన్యం
D) అనంతం
జవాబు:
A) ఎక్కువ

4. 1 k Wh = ……….. ఎర్గులు.
A) 3.6 × 1018
B) 3.6 × 1011
C) 3.6 × 1012
D) 3.6 × 1013
జవాబు:
D) 3.6 × 1013

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

5. క్రింది వానిలో ఏది మిగతా వాటితో విభేదించును?
A) వాట్ – సెకను
B) కూలుంబు – ఫారడే
C) న్యూటన్ – మీటరు
D) కూలుంబు – వోల్టు
జవాబు:
B) కూలుంబు – ఫారడే

6. 100 కి.గ్రా. నీటిని 100 మీ. ఎత్తుకి 10 సె॥లలో తోడగల పంపు సామర్థ్యం …………
A) 9800 W
B) 980 W
C) 98 W
D) శూన్యం
జవాబు:
A) 9800 W

7. 2 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువు 20 మీ ఎత్తు నుండి క్రింద పడిత స్థితిశక్తిలో నష్టం ……..
A) 400 J
B) 300 J
C) 200 J
D) 100 J
జవాబు:
A) 400 J

8. 1 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువుకి 1 కౌలు శక్తి ఉండడానికి కావల్సిన వేగం ……
A) 1 మీ/సె
B) 4 మీ/సె
C) 1.414 మీ/సె
D) 9.8 మీ/సె
జవాబు:
C) 1.414 మీ/సె

9. రెండు ఎలకానను ఒకదానికొకటి దగ్గరగా జరిపితే వ్యవస్థ స్థితిశక్తి ……
A) శూన్యం
B) 1 J
C) 2 J
D) 4 J
జవాబు:
A) శూన్యం

10. స్వేచ్ఛాపతనంలో గతిశక్తి …………….
A) ఎత్తుకి అనులోమానుపాతంలో
B) తగ్గును
C) పెరుగును
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి

11. ఒక రాయిని నిట్టనిలువుగా పైకి విసిరితే అది తిరిగి నేలను చేరింది. దాని స్థితి గరిష్టమయ్యేది
A) పైకి ప్రయాణించినపుడు
B) గరిష్ఠ ఎత్తు వద్ద
C) తిరుగు ప్రయాణంలో
D) అడుగు భాగంలో
జవాబు:
B) గరిష్ఠ ఎత్తు వద్ద

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. పని ఒక ……………. రాశీ.
2. పనికి ప్రమాణాలు ……………
3. పైకి వెళ్ళే వస్తువు వడి క్రమేపి …..
4. పని ధనాత్మకమైన ఆ వస్తువు శక్తిని …………
5. పని ఋణాత్మకమైన ఆ వస్తువు శక్తిని ……………..
6. వివిధ వస్తువుల పనిచేయగల సామర్థ్యం వాటి ………………. పై ఆధారపడుతుంది.
7. మానవ శరీరం ఒక ………. వ్యవస్థ.
8. సముద్ర అలలు …………… శక్తి వనరు.
9. చెట్టుపై నుండి పడే కొబ్బరికాయకు ఉండు శక్తి.
10. పారుతున్న నీటికి ఉండే శక్తి ………
11. గతిశక్తికి సమీకరణము ……….
12. బొమ్మకారులో ‘కీ’ ని తిప్పినపుడు దానిలో ఉన్న శక్తి ……………..
13. స్థితిశక్తికి సమీకరణము ……………..
14. యాంత్రిక శక్తి = ………….. + …………..
15. నేలపై ఆగి ఉన్న విమానపు గతిశక్తి విలువ ………….
16. ఇస్త్రీ పెట్టెలో ……………… శక్తి, …………….. శక్తిగా మారుతుంది.
17. టార్చ్ లైట్ లో ………….. శక్తి, ……….. గా మారును.
18. సామర్ధ్యమనేది ……………… కు కొలమానము.
19. సామర్థ్యంకు ప్రమాణం …………….
20. ఒక వస్తువుకు దాని చలనం వలన కలిగే శక్తిని …………….. అంటాము.
21. ఒక వస్తువు దాని స్థానం, ఆకారం వలన పొందే శక్తిని ……………. అంటాము.
22. ఒక వస్తువు యొక్క స్థితిశక్తి, గతిశక్తుల మొత్తం ………… శక్తి అగును.
జవాబు:
1) అదిశ
2) N- m లేదా జోల్
3) తగ్గును
4) గ్రహించును
5) కోల్పోవును
6) స్థితి, స్థానాల
7) సంక్లిష్ట
8) సూర్యునిపై ఆధారపడని
9) గతిశక్తి
10) గతిశక్తి
11) K.E = \(\frac{1}{2}\)mv²
12) స్థితిశక్తి
13) P.E = mgh
14) స్థితిశక్తి, గతిశక్తి
15) శూన్యం
16) విద్యుత్, ఉష్ణ
17) రసాయన, కాంతిశక్తి
18) పనిచేసే వేగం
19) వాట్
20) గతిశక్తి
21) స్థితిశక్తి
22) యాంత్రిక

III. జతపరచుము.

Group – A Group – B
1. పని A) mgh
2. సామర్థ్యం B) \(\frac{1}{2}\) mv²
3. స్థితిశక్తి C) Fs
4. గతిశక్తి D) \(\frac{W}{t}\)

జవాబు:

Group – A Group – B
1. పని C) Fs
2. సామర్థ్యం D) \(\frac{W}{t}\)
3. స్థితిశక్తి A) mgh
4. గతిశక్తి B) \(\frac{1}{2}\) mv²

ii)

Group – A Group – B
1. ఎలక్ట్రిక్ హీటరు A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి
2. ఎలక్ట్రిక్ మోటరు B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
4. హెడ్ ఫోను D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి

జవాబు:

Group – A Group – B
1. ఎలక్ట్రిక్ హీటరు D) విద్యుత్ శక్తి → ఉష్ణ శక్తి
2. ఎలక్ట్రిక్ మోటరు C) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
3. ఎలక్ట్రిక్ బ్యాటరీ A) రసాయన శక్తి → విద్యుత్ శక్తి
4. హెడ్ ఫోను B) విద్యుత్ శక్తి → ధ్వని శక్తి

పునరాలోచన

AP 9th Class Physical Science Important Questions 10th Lesson పని మరియు శక్తి 6

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

These AP 9th Physical Science Important Questions and Answers 8th Lesson గురుత్వాకర్షణ will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 8th Lesson Important Questions and Answers గురుత్వాకర్షణ

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రమును కనుగొనుటకు చేయు ప్రయోగములో తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాయుము.
జవాబు:

  1. జ్యామితీయ కేంద్రం గుండా తాడు పోయే విధంగా తాడును కట్టవలయును.
  2. వస్తువు పూర్తిగా విశ్రాంతికి వచ్చిన తర్వాతే తాడు గుండా గీతగీయాలి.

ప్రశ్న 2.
భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తన భ్రమణాలను ఆపేస్తే చంద్రుడు అనుసరించే మార్గం ఏది?
జవాబు:
భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తన భ్రమణాలను ఆపేస్తే చంద్రుడు తను తిరుగుతున్న కక్ష్యకి స్పర్శరేఖ మార్గాన్ని అనుసరిస్తుంది.

ప్రశ్న 3.
అభికేంద్ర బలంను నిర్వచించుము.
జవాబు:
సమవృత్తాకార చలనంలోనున్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం, వృత్తకేంద్రం వైపునకు ఉంటే ఆ బలాన్ని ‘అభికేంద్ర బలం’ అంటారు.

ప్రశ్న 4.
అభికేంద్ర త్వరణం అనగానేమి?
జవాబు:
వస్తువు వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు.

ప్రశ్న 5.
న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని తెలుపుము.
జవాబు:
విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్యదూర వర్గానికి విలోమానుపాతంలోను ఉంటుంది.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 6.
గురుత్వ త్వరణమును నిర్వచింపుము.
జవాబు:
భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమ్యాకర్షణ వల్ల ఏర్పడే త్వరణమును గురుత్వ త్వరణము లేదా స్వేచ్ఛాపతన త్వరణము అంటారు.

ప్రశ్న 7.
విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అనగానేమి?
జవాబు:
ఒక కి.గా, ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరుచేయబడి ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలమును విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం (G) అంటారు.

ప్రశ్న 8.
స్వేచ్ఛాపతన వస్తువు అనగానేమి?
జవాబు:
భూమ్యాకర్షణ బలంతో క్రిందికి పడే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అంటారు.

ప్రశ్న 9.
భారము అనగానేమి?
జవాబు:
స్వేచ్ఛావతన వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలమును భారము అంటారు.

ప్రశ్న 10.
గురుత్వ కేంద్రమును నిర్వచింపుము.
జవాబు:
ఒక వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువుగుండా పనిచేస్తుందో ఆ’ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అంటారు.

ప్రశ్న 11.
ఒక వస్తువు ఎప్పుడు సమతాస్థితిలో ఉంటుంది?
జవాబు:
వస్తువు గురుత్వ కేంద్రం నుండి గీసిన క్షితిజలంబం, దాని ఆధారిత వైశాల్య భాగం గుండా పోయినచో ఆ వస్తువు సమతాస్థితిలో లేక స్థిరత్వంలో ఉంటుంది.

ప్రశ్న 12.
భ్రమణకాలం (T) అనగానేమి?
జవాబు:
సమవృత్తాకార చలనంలోనున్న వస్తువు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని భ్రమణకాలం (T) అంటారు.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 13.
కొంత ఎత్తు నుండి చెరువు నీటిలోనికి లేదా స్విమ్మింగ్ పూల్ లోనికి దూకిన అనుభవం మీకుందా ? ఉంటే ఈ సందర్భంలో మీ శరీర స్థితిని గూర్చి వ్రాయుము.
జవాబు:
మనిషి ఎగిరినప్పుడు కాని, ఎత్తు నుండి కిందికి దూకేటప్పుడు కాని అతడు “భారరహిత స్థితి”లో ఉంటాడు. కావున చెరువులోకి గాని, స్విమ్మింగ్ పూల్ లోనికి గాని దూకినప్పుడు నా శరీరం గాలిలో తేలినట్లు అనిపిస్తుంది.

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
60 Kg ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి చంద్రుని మీదకు వెళితే
i) అతని ద్రవ్యరాశి మరియు భారములలో ఏమైనా మార్పు ఉంటుందా?
జవాబు:
అతని ద్రవ్యరాశి 60 kg మాత్రమే ఉంటుంది. కానీ, అతని భారంలో మార్పు ఉంటుంది.

ii) భూమి మరియు చంద్రునిపై అతని భారము ఎంత?
జవాబు:
భూమిపై అతని భారం We = mg = 60 × 9.8 = 588.0 = 588 N.
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 1

ప్రశ్న 2.
క్రింది చలన సమీకరణాలను పరిగణలోకి తీసుకొని వాటిని స్వేచ్ఛా పతన వస్తువుకు ఆపాదించి వ్రాయండి.
v=u + at
s = ut + \(\frac{1}{2}\) at
జవాబు:
స్వేచ్ఛా పతన వస్తువుకి
u = 0 (తొలివేగం = 0 మీ/సె)
a = g (త్వరణం = గురుత్వ త్వరణం)
s = h (దూరం = ఎత్తు)
చలన సమీకరణాలు స్వేచ్ఛా పతన వస్తువుకి క్రింది విధంగా మారును.
i) v = u+ at ⇒ v = 0 + gt ⇒ v = gt
ii) s = ut + \(\frac{1}{2}\) at² ⇒ h = 0 + \(\frac{1}{2}\)gt² ⇒ h = \(\frac{1}{2}\)gr²

ప్రశ్న 3.
గురుత్వాకర్షణబలం ఫార్ములా \(\mathrm{F}=\mathrm{G} \frac{\mathrm{M}_{1} \mathrm{M}_{2}}{\mathrm{R}^{2}}\) ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) G విలువ ఎంత?
జవాబు:
G విలువ = 6.67 × 10-11 Nm²kg-2

ii) ఈ ఫార్ములాలో ‘R’ దేనిని తెలుపుము?
జవాబు:
‘R’ రెండు వస్తువుల మధ్య దూరాన్ని సూచిస్తుంది.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 4.
భూ వాతావరణం యొక్క గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడానికి రవి తన ఉపాధ్యాయుణ్ణి ఏ ప్రశ్నలు అడిగి ఉంటాడు? ఉపాధ్యాయుని సమాధానం ఏమై ఉంటుంది?
జవాబు:
రవి ప్రశ్నలు:

  1. భూమి ఏ ఆకారంలో ఉంటుంది?
  2. గోళాకృతిలో ఉన్న వస్తువు యొక్క గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది?

ఉపాధ్యాయుని సమాధానాలు

  1. భూమి గోళాకారంలో ఉంటుంది.
  2. గోళం యొక్క జ్యామితీయం కేంద్రమే దాని గురుత్వ కేంద్రం అవుతుంది.

ప్రశ్న 5.
చంద్రుడు భూమి చుట్టూ సుమారుగా వృత్తాకార మార్గంలో ఏ విధంగా చలించగలుగుతున్నాడు? అలా చలించడానికి సహాయపడుతున్న అంశమేమిటి?
జవాబు:

  1. చంద్రుడు భూమి చుట్టూ సమవృత్తాకార చలనములో నిరంతరంగా చలించేందుకు చంద్రునిపై ఒక అభికేంద్ర బలం పనిచేయాలి.
  2. ఈ బలం భూమి మరియు చంద్రుడు మధ్య గల ఒక ఆకర్షణ బలం వలన ఉత్పత్తి అవుతుంది.
  3. అందువలన చంద్రుడు భూమి చుట్టూ చలించడానికి సహాయపడుతున్న అంశము అభికేంద్రబలమే.

ప్రశ్న 6.
విశ్వగురుత్వ స్థిరాంకంను నిర్వచించుము. దానికి ప్రమాణాలను మరియు విలువను వ్రాయుము.
జవాబు:
1) విశ్వగురుత్వ స్థిరాంకం (G) :
ఒక కేజీ ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం విశ్వగురుత్వ స్థిరాంకం (G) కు సమానము.
న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం ప్రకారం
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 2
2) ‘G’ యొక్క విలువ 6.67 × 10-11.
3) దీని ప్రమాణాలు Nm² kg-2 అగును.

ప్రశ్న 7.
స్వేచ్ఛాపతన వస్తువును నిర్వచించి, వివరించుము.
జవాబు:
స్వేచ్ఛాపతన వస్తువు :
భూమ్యాకర్షణ బలం మాత్రమే పని చేసే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువు అంటారు.

వివరణ :
కొంత ఎత్తు నుండి ఒక పుస్తకంను, పేపర్‌ను వదలిన పుస్తకం ముందుగా భూమిని చేరును. అదే గాలి నిరోధంను లెక్కలోనికి తీసుకోకున్న రెండు వస్తువులు భూమికి ఒకేసారి చేరును. ఈ వస్తువుల విషయంలో భూమి వాటిపై బలంను మాత్రమే ప్రయోగిస్తుంది. కావున వాటిని స్వేచ్ఛాపతన వస్తువులు అందురు.

ప్రశ్న 8.
గురుత్వ కేంద్రంను నిర్వచించుము. కొన్ని జ్యామితీయ ఆకారాల యొక్క గురుత్వ కేంద్రంను తెల్పుము.
జవాబు:
గురుత్వ కేంద్రం :
వస్తువు యొక్క ఏ స్థితిలోనైనా, స్థానంలోనైనా దాని బరువు యొక్క చర్యారేఖ, ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువును దాని గురుత్వ కేంద్రం లేక గరిమనాభి అందురు. వివిధ పటాలకు వేర్వేరు స్థానాలలో గురుత్వ కేంద్రముండును.

  1. వృత్తాకార వస్తువులకు వాటి కేంద్రం వద్ద,
  2. త్రిభుజాకార వస్తువులకు వాటి మధ్యగతరేఖల ఖండన బిందువు వద్ద ఉండును.

ప్రశ్న 9.
స్థిరత్వం గూర్చి వ్రాయుము.
జవాబు:

  1. ఒక వస్తు స్థిరత్వము దాని గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉండును.
  2. వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యం గుండా పోయిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉండును.
  3. వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యమునకు దూరంగా బయటకి వెళ్ళిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోవును.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 10.
రాజు తన 9వ తరగతి పుస్తకం నుండి “గురుత్వాకర్షణ” పాఠంను చదివాడు. అతనికి చంద్రుడు, భూమి, సూర్యుని చలనాలపై కొన్ని సందేహాలు తలెత్తాయి. అవి ఏమిటో ఊహించి వ్రాయుము.
జవాబు:

  1. భూమి, సూర్యుని చుట్టూ చేసే చలనం ఏ రకమైనది?
  2. చంద్రుడు, భూమి చుట్టూ అదే రకమైన చలనంలో ఉన్నాడా?
  3. భూమి, చంద్రునికి మరియు సూర్యునికి, భూమికి మధ్య ఏమైనా బలాలు పని చేస్తున్నాయా?

ప్రశ్న 11.
వర్షాకాలంలో నీటి గుంటలయందు సైకిల్ చక్రాన్ని తిప్పిన చక్రం నుండి వచ్చు నీటి దిశ ఒక ఋజుమార్గంలో ప్రయాణించును. ఎందుకో మీ ఉపాధ్యాయుడిని అడిగి సమాచారాన్ని సేకరించుము.
జవాబు:
వృత్తాకార మార్గం పరంగా వస్తువు యొక్క వేగం ఎల్లప్పుడూ వృత్తాకార మార్గానికి గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది. అదేవిధంగా చక్రం నుండి విడుదలగు నీటి (వస్తువు) దిశ ఎల్లప్పుడు ఋజుమార్గంలోనే ప్రయాణించును.

ప్రశ్న 12.
సమవృత్తాకార చలనంలో వున్న వస్తు వేగసదిశలను చూపు పటంను గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 3

ప్రశ్న 13.
సమవృత్తాకార చలనంలో వున్న వస్తువు యొక్క త్వరణ దిశను చూపు పటము గీయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 4

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం ఆ వస్తువు యొక్క బయటిభాగంలో ఉండే సందర్భాలను రెండింటిని తెల్పి, వివరించండి.
జవాబు:

  1. ఒక అథ్లెట్ హైజంప్ చేయు సందర్భంలో, కొంత ఎత్తునుండి పారాచూట్ సహాయంతో విమానం నుండి దూకు సందర్భంలో గురుత్వ కేంద్రం బయటకు వచ్చును. ఎందుకనగా ఈ స్థితిలో వస్తువు అస్థిరత్వం మరియు భారరహితంగా ఉంటుంది కావున.
  2. గుర్రపునాడ అయస్కాంతం యొక్క గురుత్వకేంద్రం బాహ్యంగా ఉంటుంది. కానీ వస్తువుపై ఉండదు.
  3. వృత్తాకార రింగ్ యొక్క గురుత్వ కేంద్రం, దాని మధ్య భాగంలో ఉంటుంది. కానీ వస్తువుపై ఉండదు.
  4. అర్ధగోళం (గుల్ల) యొక్క గురుత్వ కేంద్రం కూడా వస్తువుకి బయటే ఉంటుంది.

ప్రశ్న 2.
20 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల రెండు గోళాకార వస్తువుల కేంద్రాల మధ్య దూరం 20 సెం.మీ. వాటి మధ్యగల గురుత్వాకర్షణ బలంను లెక్కించండి. (G = 6.67 × 10-11 Nm²kg-2)
జవాబు:
రెండు గోళాకార వస్తువుల ద్రవ్యరాశులు వరుసగా (m,, m) = 20 కి.గ్రా మరియు 20 కి.గ్రా.
గోళాల మధ్య దూరం (d) = 20 cm = 0.2 m.
G = 6.67 × 10-11 Nm²kg-2
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 5

ప్రశ్న 3.
కింది సమర్తి వస్తువుల పటములు గీచి ద్రవ్యరాశి కేంద్రములను గుర్తించండి.
i) సమబాహు త్రిభుజం ii) చతురస్రం iii) వృత్తం
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 6

b) వస్తువు గరిమనాభి ప్రత్యేకత ఏమిటి?
జవాబు:

  1. ఒక వస్తు స్థిరత్వము దాని గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉండును.
  2. వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యం గుండా పోయిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉండును.
  3. వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబము, దాని ఆధార వైశాల్యమునకు దూరంగా బయటకి వెళ్ళిన ఆ వస్తువు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోవును.

ప్రశ్న 4.
అభికేంద్ర బలమును నిర్వచించి, దానిని లెక్కించుటకు సూత్రంను రాబట్టుము.
జవాబు:
1) అభికేంద్ర బలము :
సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం వృత్తకేంద్రం వైపు పనిచేయు బలమును “అభికేంద్ర బలము” అంటారు.

2) ఇది వస్తు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలం. కావున న్యూటన్ రెండవ గమన నియమం నుండి ఫలిత బలం, Fnet = ద్రవ్యరాశి × త్వరణము

3) సమవృత్తాకార చలనంలో ఫలితబలం, అభికేంద్ర బలం (Fc)కి సమానం కావున
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 7
4) ఈ బలం (Fc) దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 5.
అభికేంద్ర త్వరణమనగానేమి? దానిని లెక్కించుటకు సూత్రమును రాబట్టుము.
జవాబు:
1) అభికేంద్ర త్వరణం :
వస్తువు వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని “అభికేంద్ర త్వరణం” అంటారు.

2) ఈ త్వరణ పరిమాణం, ఒక పూర్తి భ్రమణంలో వస్తువు పొందిన వేగ మార్పు పరిమాణం మరియు భ్రమణ కాల నిష్పత్తికి సమానము.

3) సమవృత్తాకార చలనంలో గల వస్తు త్వరణంను ‘a.’ అనుకొనుము.
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 8

ప్రశ్న 6.
న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమమును తెల్పి, దానిని వివరించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 9
విశ్వగురుత్వాకర్షణ నియమము :
విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరి మాణం వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతం లోనూ, వాటి మధ్య దూర వర్గానికి విలోమాను పాతంలోనూ ఉంటుంది.

వివరణ :
ఈ నియమం ప్రకారం, విశ్వంలోని ఏవైనా రెండు వస్తువుల ద్రవ్యరాశులు M1 మరియు M2, వాటి మధ్య దూరము ‘d’ అనుకొనుము.

వాటి మధ్య ఆకర్షణ బలం (F), వాటి ద్రవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలోనూ అనగా F ∝ M1 M2
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 10 AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 11

ప్రశ్న 7.
గురుత్వత్వరణమును నిర్వచించుము. భూమి ద్రవ్యరాశి (M) మరియు విశ్వగురుత్వ స్థిరాంకం (G)లలో గురుత్వ త్వరణంకు గల సంబంధమును రాబట్టుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 12
1) ‘m’ ద్రవ్యరాశి గల వస్తువు (ఆపిల్)ను భూ ఉపరితలానికి దగ్గరగా విడువుము.
2) భూమి ద్రవ్యరాశి ‘M’ మరియు భూమి వ్యాసార్ధం ‘R’ అనుకొనుము.
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 13
పై సూత్రం ద్వారా ‘g’ విలువ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదు.
వ్యాసార్ధపు వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది.

గురుత్వ త్వరణం :
భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమ్యాకర్షణ వల్ల ఏర్పడే త్వరణంను గురుత్వత్వరణం లేదా స్వేచ్ఛాపతన త్వరణం అంటారు.

భూ ఉపరితలం వద్ద ‘g’ విలువ 9.8 మీ/సె² గా ఉండును.

ప్రశ్న 8.
స్వేచ్ఛా పతన సమీకరణాలను వ్రాయుము. వాటి విషయంలో ‘g’ యొక్క ప్రభావంను తెల్పుము. దాని గుర్తులో మార్పు గూర్చి వ్రాయుము.
జవాబు:

  1. స్వేచ్చా పతన వస్తు సమీకరణాలు V = u + at. s = ut + \(\frac{1}{2}\)at² మరియు v² – u² = 2as లు అగును.
    AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 14
  2. గురుత్వ త్వరణం (g) విలువ, భూ కేంద్రం నుండి వస్తువుకు గల దూరంతో పాటు మారును.
  3. భూ ఉపరితలం వద్ద ‘g’ విలువ స్థిరము. భూమి నుండి పైకి వెళ్ళే కొలది ‘g’ విలువ ధనాత్మకము, భూమి నుండి క్రిందకి వెళ్ళేకొలది ఋణాత్మకంగా తీసుకుంటాము.

ప్రశ్న 9.
విశ్వగురుత్వ స్థిరాంకానికి మరియు గురుత్వ త్వరణానికి మధ్య గల భేదాలను వ్రాయండి.
జవాబు:

విశ్వగురుత్వ స్థిరాంకము గురుత్వ త్వరణము
1) ప్రమాణ ద్రవ్యరాశులు గల రెండు వస్తువులు ప్రమాణ దూరంలో వేరు పరచబడిన వాని మధ్య గల గురుత్వాకర్షణ బలాన్ని విశ్వగురుత్వ స్థిరాంకం అంటారు. 1) స్వేచ్ఛాపతన వస్తువులో, గురుత్వాకర్షణ బలం వలన కలిగే త్వరణాన్ని గురుత్వ త్వరణం అంటారు.
2) దీనిని ‘G’ తో సూచిస్తారు. 2) దీనిని ‘g’ తో సూచిస్తారు.
3) దీని విలువ విశ్వంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. 3) దీని విలువ ప్రదేశం నుండి ప్రదేశానికి మారును.

ప్రశ్న 10.
ఒక క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుగొనే పద్ధతిని తెలుపుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 15

  1. ఒక మీటరు స్కేలును తీసుకొనుము.
  2. ఆ స్కేలుపై వేర్వేరు బిందువులను మరియు మధ్య బిందువును గుర్తించుము.
  3. ఆ స్కేలును వేర్వేరు బిందువుల వద్ద పటంలో చూపినట్లు వ్రేలాడదీయుము. అది క్షితిజ సమాంతరంగా ఉండదు.
  4. ఇప్పుడు ఆ స్కేలును మధ్య బిందువు వద్ద వ్రేలాడదీయుము. అది క్షితిజ సమాంతరంగాను, స్థిరంగాను ఉండటం గమనించవచ్చును.
  5. స్కేలు యొక్క ఈ జ్యామితీయ కేంద్రం దాని గురుత్వ కేంద్రం అగును.
  6. స్కేలుపై గల ప్రతి చిన్న భాగాన్ని భూమి ఆకర్షించును.
  7. ఆ చిన్న చిన్న బలాల ఫలితబలం ఒక బిందువు వద్ద పని చేయును, దానినే గురుత్వ కేంద్రం అంటారు.

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 11.
ఒక అక్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను ఏ విధముగా కనుగొంటారో వివరించుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 16

  1. అక్రమాకార వస్తువు అంచుల వద్ద A, B, C అను మూడు రంధ్రాలను చేయుము.
  2. A రంధ్రం సహాయంతో కారు బోర్డును దారం సహాయంతో P మేకుకు వ్రేలాడదీయుము.
  3. వడంబకమును కూడా అదే మేకు నుండి వ్రేలాడదీయుము.
  4. వడంబకం త్రాడు వెంబడి వస్తువు పై AD సరళరేఖను గీయుము. ఈ రేఖ ఆ స్థానంలో వస్తువు బరువు యొక్క చర్యా దిశను తెలియజేస్తుంది.
  5. ఇదే ప్రయోగాన్ని, వస్తువును B రంధ్రం, C రంధ్రంల నుండి వ్రేలాడదీసి BE, CF చర్యారేఖలను గీయవలెను.
  6. ఈ మూడు చర్యారేఖల ఖండిత బిందువు ‘G’ వస్తువు గురుత్వ కేంద్రం అగును.

ప్రశ్న 12.
కింది పటంను గమనించి దానిపై రెండు వాక్యాలను వ్రాయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 12

  1. పై పటంలో భూమ్యాకర్షణ బలం వలన ఆపిల్ భూమి వైపు లాగబడుచున్నది.
  2. ఈ విషయంలో వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అందురు.

ప్రశ్న 13.
కొన్ని జ్యామితీయ ఆకారాల యొక్క గురుత్వ కేంద్రాలను తెలుపు నమూనాను తయారు చేయండి.
జవాబు:

వస్తువు ఆకారము గురుత్వ కేంద్రం ఏర్పడు స్థానము
1. క్రమస్థూపము మధ్య బిందువు వద్ద
2. వృత్తాకార ప్లేటు ప్లేటు మధ్య బిందువు వద్ద
3. త్రిభుజాకార వస్తువు భుజాల మధ్యగత రేఖల మిళిత బిందువు వద్ద
4. స్థూపాకార శంకువు శంకువు భూమి ఎత్తు (h) లో నాల్గవ వంతు వద్ద
5. దీర్ఘచతురస్రాకార వస్తువు కర్ణాల ఖండన బిందువు వద్ద
6. వృత్తాకార రింగు రింగు యొక్క మధ్యన (బాహ్యంగా)

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 17

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ 1 Mark Bits Questions and Answers

1. సమవృత్తాకార చలనంలో వస్తువు విషయంలో సరియైనది / సరియైనవి
i) వలిత బలం వస్తువు వేగదిశను మాత్రమే మారుస్తుంది.
ii) ఫలితబలం ఎల్లపుడూ కేంద్రంవైపు ఉంటుంది.
iii) ఫలితబలంను అభికేంద్రబలం అంటారు.
A) i, ii
B) ii, iii
C) i, iii
D) i, ii, iii
జవాబు:
D) i, ii, iii

2. భావన (A) : 10 కేజీల వస్తు భారం 98N
కారణం (R) : భారం W = mg
A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.
B) భావన (A) కారణం (R) రెండు సత్యం మరియు R, A ను బలపరచదు.
C) భావన (A) సత్యం, కారణం (R) అసత్యం
D) భావన (A) అసత్యం , R సత్యం
జవాబు:
A) భావన (A) కారణం (R) రెండూ సత్యం మరియు R, A ను బలపరుస్తుంది.

3. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం విలువ
A) 6.67 × 1011 Nm-2 kg²
B) 6.67 × 10-11 Nm² kg-2
C) 6.67 × 10-19 Nm² kg-2
D) 6.67 × 10-11Nm-2 kg²
జవాబు:
B) 6.67 × 10-11 Nm² kg-2

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

4. నీ తరగతిలో ఒకేసారి ఒకరాయిని, ఆకును ఒకే ఎత్తునుండి పడవేసినపుడు నీ పరిశీలన
A) రెండూ ఒకే కాలంలో భూమిని చేరుతాయి
B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.
C) ఆకు త్వరగా భూమిని చేరుతుంది.
D) రెండూ భూమిని చేరవు.
జవాబు:
B) గాలిలో ఘర్షణ వల్ల రాయి భూమిని త్వరగా చేరుతుంది.

5. సమ వృత్తాకార చలనంలో త్వరణ దిశ
A) స్పర్శ రేఖ వెంబడి
B) కేంద్రం వైపు
C) కేంద్రం వెలుపల
D) దిశ ఉండదు
జవాబు:
B) కేంద్రం వైపు

6. భూ ఉపరితలం నుండి దూరంగా వెళ్ళేకొలది గురుత్వ త్వరణం విలువ
A) తగ్గుతుంది
B) పెరుగుతుంది
C) మారదు
D) శూన్యం
జవాబు:
A) తగ్గుతుంది

7. భావన (A) : ఒక వస్తు భారం చంద్రునిపై భూమి కంటే తక్కువగా ఉంటుంది.
కారణం (R) : భూమి చంద్రుని కంటే బరువైనది.
A) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ
B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు
C) A సరైనది, కానీ R సరైనది కాదు
D) A సరైనది కాదు, R సరైనది
జవాబు:
B) A మరియు R రెండు సరైనవి మరియు R, Aకు సరైన వివరణ కాదు

8. ఒక అర్థవంతమైన ప్రయోగం కొరకు కింది ఐచ్చికాల సరైన క్రమము
P) ఒక బిందువు నుండి ఒక వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబాన్ని గీయండి.
Q) రెండు రేఖల ఖండన బిందువు గురుత్వ కేంద్రం అవుతుంది.
R) స్టీలు ప్లేటుతో తయారు చేసిన భారతదేశ పటాన్ని తీసుకోండి.
S) మరొక బిందువు నుండి వస్తువును వ్రేలాడదీసి, క్షితిజ లంబరేఖను గీయండి.
A) P,Q, R, S
B) R, S, P,Q
C) R, P, S, Q
D) Q, R, P, S
జవాబు:
C) R, P, S, Q

9. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే, ఆ వస్తువు తొలి వేగమెంత?
A) 9.8 మీ/సె.
B) 8.9 మీ/సె.
C) 0 మీ/సె.
D) 10 మీ/సె.
జవాబు:
C) 0 మీ/సె.

10. గురుత్వ త్వరణం ఏ దిశలో పనిచేస్తుంది?
A) ఎల్లపుడూ కిందికి
B) ఎల్లపుడూ పైకి
C) కొన్ని సందర్భాల్లో కిందికి, కొన్ని సందర్భాల్లో పైకి
D) వస్తువు కదిలే దిశలో
జవాబు:
A) ఎల్లపుడూ కిందికి

I. సరియైన సమాధానమును రాయుము.

11. త్రిభుజాకారపు ఆకృతి గరిమనాభి
A) లంబకేంద్రము
B) గురుత్వ కేంద్రం
C) అంతరవృత్త కేంద్రం
D) పరివృత్త కేంద్రం
జవాబు:
D) పరివృత్త కేంద్రం

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

12. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరిన, దాని గురుత్వ బలం పనిచేయు దిశ …… వైపు ఉండును.
A) వస్తు చలనదిశ
B) చలన దిశకు వ్యతిరేకదిశ
C) స్థిరముగా
D) వస్తువు పైకి వెళ్ళేటపుడు పెరుగును
జవాబు:
B) చలన దిశకు వ్యతిరేకదిశ

13. కొంత ఎత్తు నుండి పడుతున్న బంతిని
A) భూమి మాత్రమే ఆకర్షించును
B) బంతి మాత్రమే ఆకర్షించును
C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును
D) ఒకదానికొకటి వికర్పించుకొనును
జవాబు:
C) రెండూనూ ఒకదానికొకటి ఆకర్షించుకొనును

14. న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం పనిచేయు సందర్భం …………….
A) సౌరవ్యవస్థలో మాత్రమే
B) భూమిపై వస్తువుల మధ్య
C) గ్రహాలందు మాత్రమే
D) విశ్వమంతయు
జవాబు:
D) విశ్వమంతయు

15. ‘g’ మరియు ‘G’ ల మధ్య సంబంధము
AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ 18
జవాబు:
D

16. భూమికి దగ్గరగా గురుత్వ త్వరణము విలువ
A) 8.9 ms-2
B) 9.8 ms-2
C) 8.9 cms-2
D) 9.8 cms-2
జవాబు:
D) 9.8 cms-2

17. శూన్యం నందు స్వేచ్ఛాపతన వస్తువులన్నీ …………… కలిగి ఉంటాయి.
A) ఒకే వేగాన్ని
B) ఒకే వడిని
C) ఒకే త్వరణాన్ని
D) ఒకే బలాన్ని
జవాబు:
C) ఒకే త్వరణాన్ని

18. కొంత ఎత్తు నుండి ఒక రాయిని విడిచారు. 20 mలు పడిన తర్వాత దాని వేగము …………
A) – 10 m/s
B) 10 m/s
C) – 20 m/s
D) 20 m/s
జవాబు:
C) – 20 m/s

19. 10కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తు భారము
A) 98 న్యూటన్లు
B) 89 న్యూటన్లు
C) 9.8 న్యూటన్లు
D) 8.9 న్యూటన్లు
జవాబు:
A) 98 న్యూటన్లు

AP 9th Class Physical Science Important Questions 8th Lesson గురుత్వాకర్షణ

20. వస్తు భారమును వ్యక్తపరచని ప్రమాణాలు ……………….
A) కేజీ – భారము
B) న్యూటన్లు
C) డైన
D) కేజీ
జవాబు:
D) కేజీ

II. ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

1. విశ్వంలోని ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా ………… బలం ఉంటుందనే భావన న్యూటన్ అభివృద్ధి చెందించాడు.
2. ఏదైనా వస్తువు స్థిరవడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని ………….. అంటారు.
3. వస్తువు వేగం ఎల్లపుడు వృత్తాకార మార్గానికి గీసిన ……….. దిశలో వుండును.
4. గమనంలో ఉన్న ఏ వస్తువైనా పనిచేసే ఫలిత బలదిశ ఆ వస్తువు యొక్క ………… దిశలోనే ఉంటుంది.
5. వస్తు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలాన్ని ………. బలం అంటారు.
6. వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని ………… అంటారు.
7. భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనము ఇంచుమించు ………….. చలనమును పోలి వుంటుంది.
8. భూమి నుండి చంద్రునికి గల దూరము ……… కి.మీ.
9. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణానికి పట్టు కాలం ……………………..
10. భూమిపై చంద్రుడి త్వరణం ………
11. భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం
12. భూ వ్యా సార్ధం …………………..
13. విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకము (G) విలువ ………
14. భూమికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం తీసుకునే సమయం సుమారుగా ……………..
15. G, gల మధ్య సంబంధము ……………
16. వస్తువు సమతాస్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసే ఆధారిత బలము
17. స్వేచ్ఛాపతన స్థితిలో వస్తువు …………. స్థితిగా వుంటుంది.
18. ఒక వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ వస్తువును …………….. వస్తువంటారు.
19. వస్తు స్థిరత్వం, ఆ వస్తువు ………………. పై ఆధారపడి ఉంటుంది.
జవాబు:

  1. గురుత్వాకర్షణ
  2. సమవృత్తాకార చలనం
  3. స్పర్శరేఖ
  4. త్వరణ
  5. అభికేంద్ర
  6. అభికేంద్ర త్వరణం
  7. సమవృత్తాకారం
  8. 3,84,400
  9. 27.3 రోజులు లేక 2.35 × 106 సెకనులు
  10. 0.27 సెం.మీ/సె²
  11. 981 సెం.మీ/సె²
  12. 6371 కి.మీ.
  13. 6.67 × 10-11 Nm²/kg²
  14. 1 గం|| 24.7 ని॥లు
  15. \(\left(g=\frac{G M}{R^{2}}\right)\)
  16. భారము
  17. భారరహిత
  18. స్వేచ్ఛాపతన
  19. గురుత్వ కేంద్రం

III. జతపరచుము.

i)

Group – A Group – B
1. భూమి ద్రవ్యరాశి A) 9.8 m/se2
2. భూ వ్యాసార్ధం B) 0.027 m/s2
3. భూమిపై చంద్రుని త్వరణం విలువ C) 6.4 × 106 కి.మీ.
4. భూమిపై గురుత్వ త్వరణం విలువ D) 6 × 1024 కి.గ్రా.

జవాబు:

Group – A Group – B
1. భూమి ద్రవ్యరాశి D) 6 × 1024 కి.గ్రా.
2. భూ వ్యాసార్ధం C) 6.4 × 106 కి.మీ.
3. భూమిపై చంద్రుని త్వరణం విలువ B) 0.027 m/s2
4. భూమిపై గురుత్వ త్వరణం విలువ A) 9.8 m/se2

ii)

Group – A Group – B
1. భారము A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం
2. అభికేంద్ర బలం B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు
3. అభికేంద్ర త్వరణం C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం
4. గురుత్వ కేంద్రం D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం
5. గురుత్వ త్వరణం E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము
6. స్వేచ్ఛాపతన వస్తువు F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం

జవాబు:

Group – A Group – B
1. భారము E) వస్తువు పై పనిచేసే భూమ్యాకర్షణ బలము
2. అభికేంద్ర బలం D) వస్తువును సమవృత్తాకార చలనంలో ఉంచేందుకు ప్రయత్నించే బలం
3. అభికేంద్ర త్వరణం F) వస్తు వేగ దిశలో మాత్రమే నిరంతరంగా మార్పు తీసుకొని వచ్చే త్వరణం
4. గురుత్వ కేంద్రం B) వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పని చేస్తుందో ఆ బిందువు
5. గురుత్వ త్వరణం C) భూమ్యాకర్షణ వల్ల కలిగే త్వరణం
6. స్వేచ్ఛాపతన వస్తువు A) వస్తువుపై భూమ్యాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉండటం

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

These AP 9th Physical Science Important Questions and Answers 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 6th Lesson Important Questions and Answers రసాయన చర్యలు – సమీకరణాలు

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
Fe2O3+ 2Al → Al2O3 + 2Fe సమీకరణంలో ఏ పదార్ధం ఆక్సీకరణం చెందింది.
జవాబు:
Fe2O3 + 2Al → Al2O3 + 2 Fe ను సమీకరణంలో అల్యూమినియం (Al), Al2O3 గా ఆక్సీకరణం చెందినది.

ప్రశ్న 2.
నీటి సరఫరా కొరకు లోహపు గొట్టాలకు బదులుగా PVC గొట్టాలను ఉపయోగిస్తాము. ఎందుకు?
జవాబు:
PVC పైపులు తుప్పు పట్టవు. కనుక లోహపు గొట్టాలకు బదులుగా PVC గొట్టాలను ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
రసాయన స్థానభ్రంశం అనగానేమి? ఉదాహరణలివ్వంది.
జవాబు:
సమ్మేళనంలో ఒక మూలకం యొక్క స్థానాన్ని, అధిక చర్యాశీలత గల మరొక మూలకం ఆక్రమించటాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
AB + C → AC + B

  1. CuSO4 + Zn → ZnSO4 + Cu
  2. CuSO4 + Fe → FeSO4 + Cu
  3. 2AgNO3 + Zn → Zn(NO3)2 + 2Ag

ప్రశ్న 4.
ఇనుప వస్తువులను ఆరుబయట తేమగాలిలో ఉంచితే ఏమి జరుగుతుంది? ఆ చర్యను చూపే రసాయన సమీకరణం రాయండి.
జవాబు:
ఇనుప వస్తువులను ఆరుబయట తేమగాలిలో ఉంచిన వాటి ఉపరితలాలపై “తుప్పు” ఏర్పడును.
2Fe(ఘ) + O2(వా) + 4H+(జల) → 2 Fe2+(జల) + 2H2O(ద్ర)

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 5.
కాపర్ ఆక్సైడ్ పొడికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపితే నీలి-ఆకుపచ్చ రంగులో ద్రావణం ఏర్పడింది. ఆ కొత్త పదార్థం ఏమిటో తెలుపండి.
జవాబు:
కాపర్ క్లోరైడ్ (లేక) CuCl2 (or)
Cu0 + 2HCl → CuCl2 + H2O

ప్రశ్న 6.
సమీకరణాన్ని తుల్యం చేయండి.
C3H4 + O2 → 4 CO2 + H2O.
జవాబు:
తుల్యం చేయగా C3H8 + 5O2 → 3CO2 + 4H2O.

ప్రశ్న 7.
సిల్వర్ క్లోరైడ్ సూర్యకాంతి సమక్షంలో వియోగం చెందే రసాయనచర్యకు సమీకరణం రాయంది.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 1

ప్రశ్న 8.
ఒక ఇనుప ముక్కను ఘనరూపంలో ఉన్న CuSO4 స్పటికాలలో వేసిన ఏదైనా చర్య జరుగుతుందా? కారణం ఊహించండి.
జవాబు:
ఒక ఇనుప ముక్కను ఘనరూపంలో ఉన్న CuSO4 స్పటికాలలో వేసినప్పుడు రసాయన చర్య జరగదు. కారణమేమనగా CuSO4 స్పటికాలలో Cu+2, SO4-2 అయాన్లు విడివిడిగా ఉండవు. జలద్రావణంలో మాత్రమే అవి అయాన్లుగా ఉంటాయి. కనుక ఇనుము, రాగిని స్థానభ్రంశం చెందించలేదు.

ప్రశ్న 9.
భౌతిక మార్పులు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
రంగులో గానీ, స్థితిలోగానీ, ఉష్ణోగ్రతలో గానీ వచ్చే మార్పులను భౌతిక మార్పులు అంటారు. వీటిని తాత్కాలిక మార్పులు అని కూడా అంటారు.
ఉదా : ఐస్, మైనం కరగటం, నీరు ఆవిరగుట, బల్బు వెలుగుట, ఇనుప ముక్కను అయస్కాంతీకరించుట మొదలైనవి.

ప్రశ్న 10.
తుల్య సమీకరణం అనగానేమి?
జవాబు:
ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం క్రియాజనకాలలోని పరమాణువుల సంఖ్య, క్రియాజన్యంలోని పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉన్న సమీకరణాన్ని ‘తుల్య సమీకరణం’ అంటారు.

ప్రశ్న 11.
రసాయన వియోగాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
జవాబు:
రసాయన వియోగాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. ఉష్ణ వియోగం (Thermal decomposition)
  2. కాంతి వియోగం (Photolysis)
  3. విద్యుత్ విశ్లేషణ (Electrolysis)

ప్రశ్న 12.
ఎక్కువ చర్యాశీలత గల లోహాల యొక్క ఆరోహణక్రమాన్ని వ్రాయుము.
జవాబు:
K< Na < Ca < Mg < Al <  Zn < Fe < Sn < Pb.

ప్రశ్న 13.
తక్కువ చర్యాశీలతగల లోహాల యొక్క ఆరోహణక్రమాన్ని వ్రాయుము.
జవాబు:
H > Cu > Hg > Ag > Au > PL.

ప్రశ్న 14.
రసాయన స్థానభ్రంశాన్ని చెందించే లోహాలేవి?
జవాబు:
అధిక చర్యాశీలత గల లోహాలు, తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించగలవు.
ఉదా :
కాపర్, వెండి, బంగారం, ప్లాటినం లోహాల కంటే అధిక చర్యాశీలత గల హైడ్రోజన్ స్థానభ్రంశం చెందించగలదు.

ప్రశ్న 15.
గాల్వనీకరణం అనగానేమి? (లేక) గాల్వనైజేషన్ అనగానేమి?
జవాబు:
ఇనుప వస్తువులు తుప్పుపట్టకుండా జింక్ లోహంతో పలుచగా పూతగా వేయటాన్ని గాల్వనీకరణం అంటారు. గాల్వనీ కరణం చేసిన గొట్టాలను నీటి సరఫరా కోసం మరియు ఇండ్లకు గేట్లు తయారుచేయటానికి విరివిగా వాడుచున్నారు.

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 16.
ర్యాన్సిడిటీ (Rancidity) అనగానేమి?
జవాబు:
నూనెలు లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచిని, వాసనను కోల్పోతాయి. దీనినే ముక్కిపోవటం లేదా ర్యాన్సిడిటీ అంటారు.

ప్రశ్న 17.
ఉష్ణమోచక చర్యలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక రసాయన చర్యలో ఉష్ణాన్ని బయటకు విడుదలచేసే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు.
ఉదా : శ్వాసక్రియ, మెగ్నీషియం గాలిలో మండటం, ఇంధనాలు దహనం చెందడం మొదలైనవి ఉష్ణమోచక చర్యలు.
i) C + O2 → CO2 + Q (ఉష్ణం)
ii) 2Mg + O2 → 2MgO + O (ఉష్ణం)
iii) CaO + H2O → Ca(OH)2 + Q (ఉష్ణం)

ప్రశ్న 18.
ఉష్ణగ్రాహక చర్యలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక రసాయన చర్యలో ఉష్ణాన్ని లోపలకు గ్రహించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
ఉదా : 1. N2 + O2 → 2NO – Q (ఉష్ణం)
2. C2H2 + 2H2 → C2H6 – Q (ఉష్ణం)

ప్రశ్న 19.
ఆక్సీకరణం అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలుపుట లేదా హైడ్రోజన్‌ను తొలగించటాన్ని లేదా ఎలక్ట్రాన్లను కోల్పోవటాన్ని ఆక్సీకరణం అంటారు.
ఉదా : 1. 2Cu + O2 → 2CuO
2. H2S → S + H2

ప్రశ్న 20.
క్షయకరణం అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక సమ్మేళనానికి హైడ్రోజనను కలుపుట లేదా ఆక్సిజన్‌ను తొలగించుట లేదా ఎలక్ట్రాన్లను గ్రహించటాన్ని క్షయకరణం అంటారు.
ఉదా : 1. H2 + Br2 → 2HBr
2.2Cu0 → 2Cu + 0,

ప్రశ్న 21.
రెడాక్స్ (ఆక్సీకరణ – క్షయకరణ) చర్యలు అనగానేమి? ఉదాహరణలివ్వంది.
జవాబు:
ఒక రసాయన చర్యలో ఆక్సీకరణం, క్షయకరణం ఒకదాని వెంట మరొకటి జరిగే చర్యలను రెడాక్స్ చర్యలు అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 2

ప్రశ్న 22.
ఆక్సీకరణానికి నిత్యజీవితంలోని అనువర్తనాలేవి?
జవాబు:
ఇనుము తుప్పుపట్టడం, ఆపిల్, బంగాళదుంపలు కోసిన కాసేపటికి రంగు మారటం, కరకరలాడే బిస్కెట్లు, చక్కిలాలు, నూనెలతో చేసే ఆహారపదార్థాలు రుచి, వాసన మారిపోవటం, టపాసులు గాలిలో మండించినపుడు కాంతివంతంగా మండటం మొదలైనవి.

ప్రశ్న 23.
ఇనుప వస్తువులు తుప్పుపట్టడం అనగానేమి ? ఇది ఏ రకమైన చర్య?
జవాబు:
ఇనుప వస్తువులు గాలిలోని తేమ మరియు ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి ఆక్సీకరణం చెందటాన్ని తుప్పుపట్టడం అంటారు. ఈ చర్యను ఈ విధంగా చూపవచ్చు. ఇది ఒక సంయోగచర్య.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 3

ప్రశ్న 24.
కరోజన్ లేదా క్షయము చెందటం అనగానేమి?
జవాబు:
కొన్ని లోహాలు తేమగాలికి లేదా ఆమ్లాల సమక్షంలో ఉంచినపుడు లోహ ఆక్సైడులను ఏర్పరచటం ద్వారా వాటి మెరుపును కోల్పోతాయి. ఈ చర్యనే క్షయము చెందటం లేదా కరోజన్ అంటారు.
ఉదా : వెండి పై నల్లని పూత, ఇత్తడి, రాగి వస్తువులపై చిలుముపట్టడం.

ప్రశ్న 25.
మిశ్రమ లోహాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహాలను తగు నిష్పత్తులలో కలిపినపుడు ప్రత్యేక లక్షణాలు గల క్రొత్త లోహాలు ఏర్పడతాయి. వీటినే మిశ్రమ లోహాలు అంటారు.
ఉదా : స్టెయిన్లెస్ స్టీల్, కంచు, ఇత్తడి, ఉక్కు మొదలైనవి.

ప్రశ్న 26.
ఆపిల్, అరటిపండు, బంగాళదుంప మొదలైనవి కోసిన తర్వాత వాటి రంగు మారును. ఎందువల్ల?
జవాబు:
ఆపిల్, అరటిపండు, బంగాళదుంప మొదలైన వాటితో పాలీఫినాల్ ఆక్సిడేజ్ (లేదా) టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఆక్సిజన్తో చర్య పొందుతుంది. అందువలన ఆపిల్ వంటి పండ్లను కోసిన తర్వాత ఉపరితలం గోధుమ రంగులోనికి మారుతుంది. దీనిని అరికట్టాలంటే ఆపిల్ ముక్కలను కోసిన వెంటనే నీటిలో ఉంచితే రంగు మారకుండా తాజాగా ఉంటాయి.

ప్రశ్న 27.
రసాయన సమీకరణంలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు అనగానేమి?
జవాబు:
ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు’ అని, క్రొత్తగా ఏర్పడిన పదార్థాలను ‘క్రియాజన్యాలు’ అని అంటారు.
ఉదా : 2 ALB, సూర్య కాంతి

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 28.
ప్రాథమిక సమీకరణం అనగానేమి?
జవాబు:
అణు ఫార్ములాలు మాత్రమే ఉండే తుల్యం చేయని రసాయన సమీకరణంను ప్రాథమిక సమీకరణం’ అంటారు.

ప్రశ్న 29.
ఉష్ణ వియోగ చర్యలు అనగానేమి? ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
వేడి చేయుట వలన పదార్థాలు వియోగం చెందినట్లయితే అట్టి చర్యలను ఉష్ణ వియోగ చర్యలు అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 4

ప్రశ్న 30.
కాంతి రసాయన చర్యలు అనగానేమి ? ఉదాహరణనిమ్ము.
జవాబు:
కాంతి సమక్షంలో జరిగే రసాయన చర్యలను కాంతి రసాయన చర్యలు అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 5

ప్రశ్న 31.
ఆక్సీకరణ – క్షయకరణ చర్యలు లేదా రెడాక్స్ చర్యలు అనగానేమి? ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఒకే చర్యలో ఆక్సీకరణము, క్షయకరణము జరిగితే అనగా ఒక క్రియాజనకం ఆక్సీకరణం చెందిన మరొక క్రియాజనకం క్షయకరణం చెందుతుంది. ఇటువంటి చర్యలను ‘ఆక్సీకరణ – క్షయకరణ చర్యలు’ లేదా ‘రెడాక్స్ చర్యలు’ అంటారు.
ఉదా : 2 Fe2O3 + 3C → 4 Fe + 3 CO2

ప్రశ్న 32.
వెండి వస్తువులపై నల్లని పూత ఏర్పడుటకు ఒక సమీకరణం వ్రాయుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 6

ప్రశ్న 33.
క్షయము చెందుట (Corrosion) ను ఎలా నివారించవచ్చు?
జవాబు:
క్షయము చెందుట (Corrosion) ను నివారించడానికి లేదా కనీసం తగ్గించడానికి లోహతలంపై ఒక పొరలాంటిది ఏర్పరచి, తద్వారా ఆక్సిజన్ మరియు తేమ తగలకుండా చేస్తారు. లోహతలంపై రంగు వేయడం, నూనె, గ్రీజు లేదా క్రోమియం పూత ద్వారా గాని, మిశ్రమ లోహాలను తయారు చేయడం ద్వారా గాని ఈ సమస్యను నివారిస్తారు.

ప్రశ్న 34.
ముక్కిపోవడం (Rancidity) అనేది ఏ రకమైన చర్య?
జవాబు:
ముక్కిపోవడం (Rancidity) అనేది ఆక్సీకరణ చర్య.

ప్రశ్న 35.
తేమ గల క్లోరిన్ వాయువులు రంగు గల వస్తువులను విరంజనం చెందించుటకు ఒక సమీకరణం రాయుము.
జవాబు:
Cl2 + H2O → HOCl + HCl
HOCl → HCl + (O)
రంగు గల వస్తువు + (O) → రంగు కోల్పోయిన వస్తువు

ప్రశ్న 36.
ఆహారం పాడవకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
జవాబు:
ఆహారం పాడవకుండా నిల్వ ఉండాలంటే దానికి విటమిన్ ‘C’ లేదా విటమిన్ ‘E’ లాంటి వాటిని కలపాలి.

ప్రశ్న 37.
సున్నంతో వెల్లవేసిన గోడలు మెరుస్తూ ఉంటాయి. కారణమేమి?
జవాబు:
1) పొడి సున్నానికి నీటిని కలపడం ద్వారా తడి సున్నాన్ని తయారుచేస్తారు.
CaO + H2O → Ca(OH)2 + Q

2) ఇలా తయారుచేసిన తడి సున్నాన్ని గోడలకు వెల్ల వేయడానికి వాడతారు.

3) తడి సున్నం (కాల్షియం హైడ్రాక్సైడ్) గాలిలో గల కార్బన్ డై ఆక్సైడ్ (CO2)తో చర్యజరిపి సన్నని, తెల్లని కాల్షియం కార్బొనేట్ పొరను ఏర్పరుస్తుంది. అందువల్లనే సున్నంతో వెల్లవేసిన గోడలు మెరుస్తూ ఉంటాయి.
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O

ప్రశ్న 38.
క్రింది సమీకరణములను తుల్యము చేయుము.
a) Na + O2 → Na2O
జవాబు:
4Na + O2 → 2Na2O

b) H2O2 → H2O + O2
జవాబు:
H2O2 → 2H2O + O2

c) Mg(OH)2 + HCl → MgCl2 + H2O
జవాబు:
Mg(OH)2 + 2HCl → MgCl2 + 2H2O

d) Fe + O2 → Fe2O3
జవాబు:
4Fe + 3O2 → 2Fe2O3

ప్రశ్న 39.
క్రింది సమీకరణములను తుల్యము చేయుము.
a) Al(OH)3 → Al2O3 + H2O
జవాబు:
2Al(OH)3 → Al2O3 + 3H2O

b) NH3 + CuO → Cu + N2 + H2O
జవాబు:
2NH3 +3CuO → 3Cu + N2 + 3H2O

c) Al2(SO4)3 + NaOH → Al(OH)3 + Na2SO4
జవాబు:
Al2(SO4)3 + 6NaOH → 2Al(OH)3 + 3Na2SO4

d) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O
జవాబు:
2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O

e) NaOH + H2SO4 → Na2SO4 + H2O
జవాబు:
2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O

f) BaCl2 + H2SO4 → BaSO4 + HCl
జవాబు:
BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl

g) Na+H2O → NaOH + H2
జవాబు:
2Na + 24,0 → 2NaOH + H2

h) K2CO3 + HCl → KCl + H2O+ CO2
జవాబు:
K2CO3 + 2HCl → 2KCl + H2O + CO2

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 40.
లెడ్ నైట్రేట్ వియోగం చెందడం వలన ఏర్పడే క్రొత్త పదార్థాలు వ్రాయుము.
జవాబు:
లెడ్ ఆక్సైడ్ (PbO), నైట్రోజన్ డై ఆక్సైడ్ (NO) మరియు ఆక్సిజన్ (O2).

ప్రశ్న 41.
ఇనుము త్రుప్పు పట్టడాన్ని నీవు ఏ విధంగా నిరోధిస్తావు?
జవాబు:
రంగు పూయడం, మిశ్రమ లోహాన్ని తయారుచేయడం, గాల్వనైజింగ్ ప్రక్రియల ద్వారా ఇనుము తుప్పుపట్టడాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 42.
ఈ క్రింది రసాయన సమీకరణాన్ని తుల్యం చేయంది.
C2H6 O2 → CO2 + H2O
జవాబు:
2C2H6 + 7O2 → 4CO2 + 6H2O

ప్రశ్న 43.
యాంటీ ఆక్సిడెంట్లు అనగానేమి?
జవాబు:
నూనెలు, కొవ్వులు నిల్వ ఉంచడానికి, ఆక్సీకరణం నివారించుటకు కలిపే పదార్థాలను యాంటీ ఆక్సిడెంట్లు అంటారు.

ప్రశ్న 44.
సూర్యకాంతి సమక్షంలో సిల్వర్‌ బ్రోమైడ్ బూడిద రంగులోనికి మారును. దీనిలో ఇమిడి ఉన్న రసాయన చర్య ఏది?
జవాబు:
కాంతి రసాయన చర్య.

ప్రశ్న 45.
NH4Cl → NH3 + HCl ఇది ఏ రకమైన రసాయనచర్య?
జవాబు:
రసాయన వియోగం.

ప్రశ్న 46.
ఫార్ములా యూనిట్ అనగానేమి?
జవాబు:
అయానిక పదార్థాల ద్రవ్యరాశిని తెలియజేసే విధానాన్ని ఫార్ములా యూనిట్ అంటారు.

ప్రశ్న 47.
ప్రొపేనను (C3H8) ఆక్సిజన్ సమక్షంలో మండించు చర్యకు రసాయన తుల్య సమీకరణం రాయండి.
జవాబు:
C3H8 + 5O2 → 3CO2 + 4H2O

ప్రశ్న 48.
మిశ్రమలోహం అనగానేమి? రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఒక లోహానికి మరొక లోహం లేదా అలోహాన్ని కలపడం ద్వారా ఏర్పడే లోహ మిశ్రమాన్ని మిశ్రమ లోహం అంటారు.
ఉదా : స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్.

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
లేత పసుపు రంగు గల సంయోగ పదార్థం ‘X’ ను సూర్యకాంతిలో కొంత సేపు ఉంచాం. అది బూడిదరంగు గల పదారంగా మారింది. ఆ సంయోగ పదార్థం ‘X’ పేరేమిటి? ఇక్కడ జరిగే రసాయనిక చర్య ఏ రకమో ఊహించి, వ్రాయండి.
జవాబు:
1) పసుపు రంగులో ఉన్న ‘X’ అనే పదార్థాన్ని ఎండలో ఉంచినపుడు అది బూడిదరంగులోకి మారింది.

2) అనగా పసుపు రంగులో ఉన్న ‘X’ పదార్థం ‘సిల్వర్ బ్రోమైడ్ (AgBr)” కావచ్చును.

3) దీనిని సూర్యకాంతిలో ఉంచినపుడు బూడిదరంగు గల సిల్వర్ (Ag) మరియు Br (బ్రోమిన్) లుగా వియోగం చెందింది.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 7

ప్రశ్న 2.
క్రింద రసాయన చర్యకు వాటి భౌతిక స్థితులను చూపుతూ సమీకరణాలను వ్రాసి, తుల్యం చేయండి.
బేరియం క్లోరైడ్ మరియు ద్రవ సోడియం సల్ఫేట్ చర్య నొంది బేరియం సల్ఫేట్ అవక్షేపాన్ని మరియు ద్రవ సోడియం క్లోరైడ్ లను ఏర్పరుస్తుంది.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 8

ప్రశ్న 3.
N2(వా) +O2(వా) + ఉష్ణం → 2 NO(వా). ఈ సమీకరణాన్ని బట్టి మీరు ఏమి అవగాహన చేసుకున్నారు? వివరించుము.
జవాబు:

  1. ఇచ్చిన సమీకరణంలో నైట్రోజన్ వాయువు ఆక్సిజన్ వాయువుతో చర్య జరిపి నైట్రిక్ ఆక్సైడ్ ను ఏర్పరచుచున్నది.
  2. నైట్రోజన్ ఆక్సీకరణం చెందుతుంది.
  3. ఇది ఉష్ణగ్రాహక చర్య.
  4. ఇది రసాయన సంయోగ చర్య.
  5. ఈ చర్యలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు కూడా వాయువులే.

ప్రశ్న 4.
i) CaCO3(ఘ) → CaO(ఘ) + CO2(వా)
ii) 2Ag Br2(ఘ) → 2Ag2(ఘ) + Br2(వా)
పైన తెలిపిన రసాయన చర్యలు ఏరకమైన రసాయన చర్యలో తెలిపి ఇందులో ఏది కాంతి రసాయన చర్యను సూచిస్తుందో తెలుపుము.
జవాబు:
1) ఇచ్చిన రెండు రసాయన చర్యలు రసాయన వియోగ చర్యలే.

2) ఇచ్చిన చర్యలలో కాంతి రసాయన చర్య :
2Ag Br → 2 Ag + Br2

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 5.
ఇచ్చిన చర్యలలో ఏర్పడడానికి వీలయ్యే క్రియాజన్యాలను రాయండి. కారణాలను తెల్పండి.
FeCl2 + Zn →
ZnCl2 + Fe →
జవాబు
i) FeCl2 + Zn → ZnCl2 + Fe
ii) ZnCl2 + Fe → ఈ రెండు రసాయనాల మధ్య చర్య జరగదు

కారణం : జింక్ కన్నా ఐరన్ చర్యాశీలత తక్కువ.

ప్రశ్న 6.
క్రింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి.
i) Na + H2O → NaOH + H2
ii) K2CO3 + HCl → KCl + H2O + CO2
జవాబు:
i) 2Na + 2H2O → 2NaOH + H2
ii) K2CO3 + 2HCl → 2KCl + H2O + CO2

ప్రశ్న 7.
కొన్ని లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి లోహాక్సెడ్లుగా ఆక్సీకరణం చెందుతాయి. ఫలితం అవి పాడైపోతాయి. దీనికి కొన్ని ఉదాహరణలిస్తూ, ఆ చర్యలకు తుల్య సమీకరణాలు వ్రాయండి.
జవాబు:
1. వెండి వస్తువులపై నల్లని పూత ఏర్పడుట.
4 Ag + 2 H2S + O2 → 2 Ag2S + 2H2O

2. రాగి వస్తువులపై ఆకుపచ్చని పూత ఏర్పడుట.
2Cu + O2 → 2 CuO

ప్రశ్న 8.
లోహ క్షయాన్ని నివారించుటకు నీవు సూచించు పద్దతులేవి?
జవాబు:
నివారణలు :

  1. లోహతలాలపై రంగు వేయుట.
  2. లోహతలాలపై నూనె, గ్రీజు లేదా క్రోమియం పూత పూయుట ద్వారా.
  3. మిశ్రమ లోహాలను తయారుచేయుట.
  4. గాల్వనీకరణం చేయుట మొ||వి.

ప్రశ్న 9.
క్షయం చెందే, క్షయం చెందని లోహాలను ఉదహరించి, కొన్ని లోహాలు క్షయం చెందకపోవడానికి కారణాలు తెల్పండి.
జవాబు:
క్షయం చెందు కొన్ని లోహాలు :
ఇనుము, రాగి, వెండి, మొ||వి.

క్షయం చెందని కొన్ని లోహాలు :
బంగారం మరియు ప్లాటినం.

బంగారం మరియు ప్లాటినములు’ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ వంటి ఏ వాయువుతో చర్య జరుపవు. కనుక ఇవి ఏ విధమైన క్షయకరణ స్వభావంను ప్రదర్శించవు.

ప్రశ్న 10.
నీటి సరఫరాకై నీవు సూచించు గొట్టాలు ఏవి? నీ సమాధానాన్ని సమర్థించుము.
జవాబు:
నీటి సరఫరాకై ప్లాస్టిక్ చేసిన PVC పైపులనే నేను సమర్థిస్తాను. ఎందుకనగా ఇనుము, రాగి, జింకుతో చేసిన పైపులు నీటిలోని ఆక్సిజన్, క్లోరిన్, H2 వంటి వాటితో చర్య జరిపి ఆక్సెలను ఏర్పరుస్తాయి. దీని కారణం అవి క్షయము చెందటం జరుగును. అందుకని నేను నీటి సరఫరాకు PVC పైపులను సమర్ధిస్తాను. ఇవి నీటితో, దానిలోని మూలకాలతో ఎట్టి చర్య జరుపవు.

ప్రశ్న 11.
ఇనుము క్షయం చెందే లోహం. దీనిని మిశ్రమలోహంగా మార్చడం ద్వారా లోహక్షయాన్ని అరికట్టవచ్చు. సమర్ధించండి.
జవాబు:

  1. ఇనుముకు కార్బన్, నికెల్ మరియు క్రోమియం వంటి పదార్థాలను కలపడం ద్వారా “స్టెయిన్లెస్ స్టీల్” అనే మిశ్రమ లోహం ఏర్పడుతుంది. ఈ లోహం గట్టిగా ఉండడంతో పాటు తుప్పు పట్టదు.
  2. గట్టిగా, దృఢంగా, మెరుస్తూ ఉండేలా కావలసిన లోహ ధర్మాలను అభివృద్ధి చేసుకోవడానికి మిశ్రమ లోహాల తయారీ కూడా చాలా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 12.
మీ ఇంటికి నీటి సరఫరాకు నీవు ఏ రకపు గొట్టాలు ఉపయోగిస్తావు?
జవాబు:

  1. మా ఇంటి నీటి సరఫరా వ్యవస్థలో ఉపయోగించినవి, PVC పైపులు మరియు వాటిని గోడలలో అమర్చుటకు జింకుతో చేసిన క్లాంపులను వాడారు.
  2. ఇంటిలోని ప్రతి పోరనులోని నీటిని, పంపు వ్యవస్ల యందు కూడా PVC పైపులనే వాడారు.

ప్రశ్న 13.
లోహాలు క్షయం చెందటానికి గాలి, తేమ అవసరమని నిరూపించు ప్రయోగ విధమును వివరించుము.
జవాబు:
సాధారణముగా మనము స్కూలుకి వెళ్ళుటకు వాడు సైకిలును, కొన్ని రోజులు ఆరుబయట ఉంచిన, దానికి ఉండు చైనులు, హ్యాండిల్ మొ||వి వాటిపై ఒక రకపు పొర ఏర్పడును. ఇదియే ఐరన్ ఆక్సెడ్ (తుప్పు). అనగా ఇనుము గాలిలోని తేమ మరియు ఆక్సిజన్లతో చర్య జరిపి ఐరన్ ఆక్సెడు ఏర్పరచినది.
2 Fe + 3O2 + H2O → Fe2O3. H2O

ప్రశ్న 14.
క్రింద ఇవ్వబడిన లోహాలు జాబితాను పరిశీలించి వాటిని క్షయం చెందే, క్షయం చెందని లోహాలుగా వర్గీకరించి పట్టికలో తెల్పండి.
అల్యూమినియం, వెండి, ఇనుము, రాగి, బంగారం, తగరం, టంగ్ స్టన్, ప్లాటినం.
జవాబు:

క్షయం చెందునవి క్షయం చెందనివి
అల్యూమినియం, వెండి, ఇనుము, రాగి, తగరము, టంగ్స్టన్ బంగారం, ప్లాటినం

ప్రశ్న 15.
రసాయన మార్పులు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
శాశ్వత మార్పులను రసాయన మార్పులు అంటారు. రసాయన మార్పులలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. సంఘటనంలో మార్పు వస్తుంది. రసాయన ధర్మాలలో మార్పు వచ్చును.
ఉదా :
ఆహారపదార్థాలను వండుట, పాలు పెరుగుగా మారుట, ఆహారం జీర్ణం అగుట, అగ్గిపుల్ల మండటం, ఇనుము తుప్పుపట్టుట, శ్వాసక్రియ మొదలైనవి.

ప్రశ్న 16.
సాధారణ రసాయన సమీకరణంలో లోపాలేవి?
జవాబు:
సాధారణ రసాయన సమీకరణంలోని లోపాలు :

  1. క్రియాజనకాల, క్రియాజన్యాల భౌతికస్థితులను తెలియజేయవు.
  2. చర్య పూర్తి అయినదో, లేదో వివరించదు.
  3. చర్యా వేగాన్ని వివరించదు.
  4. చర్యకు అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, ఉత్ప్రేరకాల గురించి వివరించదు.

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 17.
కుర్ కురే, లేస్ వంటి ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువును ఎందుకు నింపుతారు?
జవాబు:

  1. నూనెలతో చేసే ఆహార పదార్థాలు గాలిలోని తేమతోనూ, ఆక్సిజన్తోనూ కలిసి ఆక్సీకరణం చెందుతాయి. తద్వారా వాటి తాజాదనాన్ని, కరకరలాడే స్వభావాన్ని కోల్పోతాయి. దీనిని నివారించటానికి కురురే, లేస్ ప్యాకెట్లలో గాలిని తీసివేసి నైట్రోజన్ వాయువును నింపి సీల్ చేస్తారు.
  2. దీనికి కారణం నైట్రోజన్, జడవాయువుల తర్వాత అతి తక్కువ చర్యాశీలతను కలిగి ఉండును. అందువలన లోపలి ఆహార పదార్థాలతో రసాయన చర్య జరగదు. అందువలన లోపలి పదార్థాలు తాజాగా ఉంటాయి. ఇదే కాకుండా ప్యాకెట్ బయటకు నిండుగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
  3. ఇదే విధంగా విద్యుత్ బల్బులలోనూ ఫిలమెంట్ ఆక్సీకరణం చెందకుండా నైట్రోజన్ వాయువును నింపుతారు.

ప్రశ్న 18.
రసాయన సమీకరణం అనగానేమి ? అందులోని భాగాలేవి?
జవాబు:

  1. రసాయన చర్యలను అతి సూక్ష్మరూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దానిని రసాయన సమీకరణం అంటారు.
  2. రసాయన సమీకరణంలో ఎడమవైపున సమ్మేళనాలు లేదా మార్పుకు గురి అయ్యే పదార్థాలను క్రియాజనకాలు అంటారు.
  3. రసాయన సమీకరణంలో కుడివైపున సమ్మేళనాలు లేదా క్రొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అంటారు.
  4. సమీకరణంలో ‘+’ గుర్తు చర్యని తెలియజేస్తుంది.
  5. ‘→’ బాణం గుర్తు క్రియాజనకాల నుండి క్రియాజన్యాలు ఏర్పడతాయని తెలియజేస్తుంది.
  6. ‘↑’ వాయువుని, ‘↓’ అవక్షేపాన్ని తెలియజేస్తుంది.
  7. B గుర్తు వేడి చేయడాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 19.
ఒక రసాయన సమీకరణం ఏ విషయాలను తెలియజేస్తుంది?
జవాబు:
ఒక రసాయన సమీకరణం

  1. చర్యలో పాల్గొన్న క్రియాజనకాలను తెలియజేస్తుంది.
  2. చర్యలో పాల్గొన్న క్రియాజన్యాలను తెలియజేస్తుంది.
  3. చర్యలో పాల్గొన్న పరమాణు, అణువుల సంఖ్యలను తెలియజేస్తుంది.
  4. క్రియాజన్యాల, క్రియాజనకాల అణుభారాలను తెలియజేస్తుంది.
  5. క్రియాజనకాల, క్రియాజన్యాల మోలుల సంఖ్యను తెలియజేస్తుంది.
  6. వాయు స్థితిలో ఉన్న క్రియాజనకాల, క్రియాజన్యాల ఘనపరిమాణాలను తెలియజేస్తుంది.

ప్రశ్న 20.
రసాయన సమీకరణాన్ని తుల్యం చేయునపుడు పాటించవలసిన నియమాలేవి?
జవాబు:

  1. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయునపుడు ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం ఒక చర్యలో పాల్గొన్న పదార్థాల మొత్తం ద్రవ్యరాశి, చర్య ముందు, తరువాత కూడా సమానంగా ఉండాలి.
  2. ముందుగా రసాయన చర్యలో పాల్గొన్న ప్రతి పదార్థం యొక్క సరియైన సాంకేతికాన్ని రాయాలి.
  3. సమీకరణాన్ని తుల్యం చేయునపుడు కేవలం గుణకాలను మాత్రమే మార్చాలి. ఫార్ములాను మార్చకూడదు.
  4. గుణకాలు కనిష్ఠ పూర్ణాంకాలుగా ఉండాలి.
  5. బాణపు గుర్తుకు ఇరువైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.

ప్రశ్న 21.
రసాయనిక సమీకరణాన్ని ఎలా రాస్తారు?
జవాబు:

  1. పద సమీకరణ రూపంలో రాసిన రసాయనిక చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారడాన్ని బాణపు గుర్తుతో సూచిస్తాం.
  2. బాణపు గుర్తుకు ఎడమవైపున క్రియాజనకాలు, కుడివైపున క్రియాజన్యాలు రాస్తాం.
  3. బాణపు గుర్తు తల క్రియాజన్యాల వైపు ఉంటూ రసాయనిక చర్య దిశను తెలుపుతుంది.
  4. ఒకవేళ చర్యలో రెండు లేదా ఒకటి కంటే ఎక్కువ క్రియాజనకాలుగాని, క్రియాజన్యాలుగాని ఉన్నట్లయితే వాటి మధ్యలో ‘+’ గుర్తును ఉంచుతాం.

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 9

ప్రశ్న 22.
నిత్యజీవితంలో ఆక్సీకరణం యొక్క ప్రభావాలు ఏమిటి?
జవాబు:

  1. భస్మీకరణం ఆక్సీకరణ ప్రభావాలలో చాలా సాధారణమైనది.
  2. పిండికి ఈస్టను కలిపి కొద్దిసేపు ఉంచినట్లయితే అది ఉబ్బుతుంది. ఈ చర్యలో చక్కెరలు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సెడ్, నీరు ఏర్పడుతాయి.
  3. తేమ గల క్లోరిన్ వాయువులు రంగు గల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తాయి.
  4. కొన్నిసార్లు వర్షాకాలంలో కరెంటు స్థంభం నుండి మన ఇళ్ళకు వచ్చే సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహ ఆక్సైడ్ పూత ఏర్పడడమే.

ప్రశ్న 23.
ఒక రసాయన చర్య యొక్క ముఖ్య లక్షణాలేమిటి?
జవాబు:
ఒక రసాయన చర్య యొక్క ముఖ్య లక్షణాలు :

  1. వాయువులు వెలువడుట
  2. అవక్షేపం ఏర్పడుట.
  3. రంగులో మార్పు
  4. ఉష్ణోగ్రతలో మార్పు
  5. స్థితిలో మార్పు

ప్రశ్న 24.
నిత్యజీవితంలో కొన్ని రసాయన చర్యలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. పాలు విరుగుట
  2. పాలు పెరుగుగా మారుట
  3. ఆహారం ఉడుకుట
  4. ఆహారం జీర్ణమగుట
  5. ద్రాక్ష పళ్ళు పులియుట
  6. ఇనుము తుప్పుపట్టుట
  7. ఇంధనాలు మండుట
  8. కాయలు పళ్ళుగా మారుట

ప్రశ్న 25.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 10
ఈ సమీకరణమును వివరించుము.
జవాబు:

  1. ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ మండి కార్బన్ డై ఆక్సెడ్ అనే వాయువును వెలువరించును.
  2. ఈ చర్యలో ఉష్ణం వెలువడినది కావున ఇది ఉష్ణమోచక చర్య.

ప్రశ్న 26.
2Cu + O2 → 2 CuO ఈ సమీకరణం ద్వారా లభించు సమాచారమేమిటి?
జవాబు:
పై సమీకరణం ద్వారా తెలియు విషయాలు :

  1. రాగి, ఆక్సిజన్ తో చర్య జరిపి కాపర్ ఆక్సెడ్ ను ఏర్పరచును.
  2. 2 మో ల కాపర్, 1 మోల్ ఆక్సిజన్తో చర్య జరిపి 2 మోల కాపర్ ఆక్సెడు ఏర్పరచును.

ప్రశ్న 27.
ఈ క్రింద తెలుపబడిన సమీకరణము నందలి క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలను తెల్పండి.
Na2SO4 + BaCl2 → BaSO4 + 2 NaCl
జవాబు:
1. క్రియాజనకాలు :
సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్

2. క్రియాజన్యాలు :
బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 28.
ఈ క్రింద ఇవ్వబడిన రసాయన సమీకరణాన్ని తుల్యం చేయండి. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడానికి సంబంధించిన సోపానాలను అనుసరించి తుల్యం చేయండి.
Cu2S + O2 → Cu2O + SO2
జవాబు:
Step – 1 : తుల్యం చేయని సమీకరణం ముందుగా వ్రాయాలి.
Cu2S + O2 → Cu2O + SO2

Step – 2 :
గుణకాలను మార్చడం ద్వారా సమీకరణాన్ని తుల్యం చేయడానికి ప్రయత్నం చేయాలి.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2

Step – 3 :
గుణకాలను కనిష్ఠ పూర్ణాంక రూపంలో మార్చాలి.

Step – 4 :
తుల్యం చేసిన సమీకరణాన్ని వ్రాయాలి.
2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2

ప్రశ్న 29.
ఆక్సీకరణ మరియు క్షయకరణల మధ్య భేదాలు తెల్పండి. ఉదాహరణనిమ్ము.
జవాబు:

ఆక్సీకరణం క్షయకరణం
1. ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలపడం లేదా ఒక సమ్మేళనం నుంచి హైడ్రోజన్ తొలగించడం. 1. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలపడం లేదా ఒక సమ్మేళనం నుంచి ఆక్సిజన్ తొలగించడం.
2. ఎలక్ట్రానులు కోల్పోవడం.
ఉదా : C + O2 → CO2
2. ఎలక్ట్రానులు గ్రహించడం.
ఉదా : N2 + 3H2 → 2NH3

ప్రశ్న 30.
అవక్షేపాలు ఏర్పడే రసాయన చర్యలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
1) సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని, బేరియం ద్రావణాన్ని కలిపితే సోడియం క్లోరైడ్ ద్రావణంతోపాటు తెల్లని బేరియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడుతుంది.
Na2SO4(జ.ద్రా) + BaCl2(జ.ద్రా) → BaSO4(ఘ) ↓ + 2NaCl(జ.ద్రా)

2) సిల్వర్ నైట్రేట్ జలద్రావణం, సోడియం క్లోరైడ్ జలద్రావణంతో చర్య జరిపి సిల్వర్ క్లోరైడ్ అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది.
NaCl(జ.ద్రా) + AgNO3(జ.ద్రా) → AgCl(ఘ)+ NaNO3(జ.ద్రా)

ప్రశ్న 31.
40 గ్రాముల మీథేన్ ని దహనం చెందించితే విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ఎంత?
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 11

ప్రశ్న 32.
ఫార్ములా యూనిట్ అంటే ఏమిటి? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
ఇచ్చిన ఫార్ములాకు సంబంధించిన ఒక పరమాణువు లేదా అయాన్ లేదా అణువు కావచ్చు.
ఉదా:

  1. NaCl యొక్క ఫార్ములా యూనిట్, ఒక Na+ అయాన్ మరియు ఒక Cl అయాన్.
  2. MgBr2 యొక్క ఫార్ములా యూనిట్, ఒక Mg+ అయాన్ మరియు రెండు Br అయాన్లు
  3. H2O ఫార్ములా యూనిట్ ఒక H2O అణువు.

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
క్రింది వాటికి తుల్య రసాయన సమీకరణం రాసి, అవి ఎలాంటి రకమైన చర్యలో తెల్పండి.
A) మెగ్నీషియం(ఘ) + అయోడిన్(వా) → మెగ్నీషియం అయోడైడ్(ఘ)
B) జింక్స్(ఘ) + హైడ్రోక్లోరిక్ ఆమ్లము(జ.ద్రా) → జింక్ క్లోరైడ్(జ.ద్రా) + హైడ్రోజన్(వా)
జవాబు:
Mg + I2 → MgI2
ఇది రసాయన సంయోగ చర్య.
Zn + 2HCl → ZnCl2 + H2
ఇది రసాయన స్థానభ్రంశ చర్య.

ప్రశ్న 2.
రసాయన సమీకరణాలను ఎందుకు తుల్యం చేయాలి? ఏదైనా ఒక రసాయన సమీకరణాన్ని తీసుకొని తుల్యం చేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
ఏ సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపుగల మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అటువంటి సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు.

ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు, లేదా నాశనం చెయ్యబడవు. అనగా చర్యకు ముందు మరియు చర్య జరిగిన తరువాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. దీనినే ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు.
కాబట్టి ఒక రసాయన సమీకరణం ఖచ్చితంగా తుల్యం చేయబడాలి.
ఉదా : 2H, + 0, 28,0

ప్రశ్న 3.
క్రింది రసాయన సమీకరణాలను తుల్యం చేయుము.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 12
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 13

ప్రశ్న 4.
నీటి రసాయన వియోగం (నీటి విద్యుత్ విశ్లేషణ) ప్రయోగాన్ని నిర్వహించుటకు కావలసిన పరికరాల జాబితా రాయంది. ప్రయోగ విధానాన్ని వివరించండి. ఈ చర్యలో ఏర్పడే క్రియాజన్యాలను తెల్పండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
ప్లాస్టిక్ మగ్గు / బీకర్, రెండు పరీక్ష నాళికలు, 9V బ్యాటరీ, స్విచ్, రెండు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లు , వాహక తీగలు, నీరు.

ప్రయోగ విధానము:
i) ఒక ప్లాస్టిక్ మగ్గును / బీకర్‌ను తీసుకుని దాని అడుగు భాగంలో రెండు రంధ్రములను చేసి, ఎలక్ట్రోడ్లను అమర్చాలి.

ii) మగ్గులో / బీకరులో ఆమీకృత నీటిని పోసి రెండు పరీక్ష నాళికలనూ నీటితో నింపి రెండు ఎలక్ట్రోడ్లపై తలక్రిందులుగా బోర్లించాలి.

iii) ఎలక్ట్రోడ్లను స్విచ్, బ్యాటరీల ద్వారా వలయం పూర్తి చేసి నీటిలో విద్యుత్ ప్రవహింపచేయాలి.

iv) పరీక్షనాళికలలో వాయువులు వెలువడుటను గమనించాలి.

క్రియాజన్యాలు :
హైడ్రోజన్, ఆక్సిజన్లు.

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 5.
జింక్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య జరిగే చర్యకు సమీకరణం రాని తుల్యం చేయండి. ఈ చర్యలో 1 మోల్ HCl పూర్తిగా పాల్గొంటే S.T.P. వద్ద విడుదలయ్యే హైడ్రోజన్ వాయువులోని అణువుల సంఖ్యని లెక్కించండి.
[గ్రామ్ మోలార్ ఘనపరిమాణం = 22.4 లీ. (S.T.P. వద్ద) అవగాడ్రో సంఖ్య = 6.023 × 1023]
జవాబు:
Zn + 2HCl → ZnCl2 + H2 చర్యలో 2 మో HCI పూర్తిగా పాల్గొంటే 1 మోల్ హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి 1 మోల్ HCI పూర్తిగా పాల్గొంటే ½ మోల్ హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
ఒక మోల్ H2 వాయువులో ఉండే H2 అణువుల సంఖ్య 6.023 × 1023
½ మోల్ H, వాయువులో ఉండే H, అణువుల సంఖ్య = 6.02 × 1023 × ½ = 3.011 × 1023

ప్రశ్న 6.
మిశ్రమ లోహంగా మార్చడం ద్వారా లోహక్షయం నివారించబడుతుంది. దీని సమర్థనకు నీవు అడిగే ప్రశ్నలు ఏవి?
జవాబు:

  1. లోహాలను మిశ్రమముగా చేయుటకు ఏ లోహాలను కలపాలి?
  2. మిశ్రమాలుగా వాడు లోహాల పేర్లేవి?
  3. అన్ని లోహాలనూ కలిపి మిశ్రమాలు అంటారా? ఎందుకు?
  4. ఈ మిశ్రమ లోహం ధృడంగా ఉంటుందా?
  5. ఈ మిశ్రమ లోహం కాంతిని (మెరుపు) ను కోల్పోదా?
  6. లోహం – లోహంతోనే మిశ్రమం చెందాలా? అలోహంతో కూడా మిశ్రమం చెందవచ్చా?
  7. సాధారణ లోహం, మిశ్రమ లోహంలు చేసే రసాయన చర్యలో ఏ రకమైన తేడా కలదు?
  8. మిశ్రమలోహం, ప్రధానలోహం యొక్క లోహధర్మంను అభివృద్ధి పరచునా?

ప్రశ్న 7.
కాల్షియం నైట్రేట్ పై ఉష్ణం యొక్క చర్యను చూపే క్రింది రసాయన సమీకరణాన్ని పరిశీలించండి.
2Ca (NO3)2 → Ca0 + 4NO2 ↑ + O2
జవాబు:
ఇవ్వబడిన తుల్య సమీకరణము
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 14
ఇక్కడ Ca ((NO3)2, CaO ల అణుద్రవ్యరాశులు వరుసగా 164 మరియు 56,

అ) ఒక మోల్ 2 Ca (NO3)2 వియోగం చెందినపుడు ఎన్ని మోల్ NO2 ఏర్పడుతుంది?
జవాబు:
పై తుల్య సమీకరణముననుసరించి ఒక మోల్ 2 Ca (NO3)2 వియోగం చెందినపుడు 4 మోe NO2 ఏర్పడును.

ఆ) స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 164 గ్రాముల Ca (NO3)2 వేడిచేసినపుడు ఉత్పత్తి అయ్యే NO2 ఘనపరిమాణం ఎంత?
జవాబు:
Ca (NO3)2 యొక్క అణుభారము = 164 గ్రాములు
స్థిర ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 2 × 164 గ్రాములు Ca (NO3)2లను వేడి చేసినపుడు 22.4 × 4 లీటర్ల NO2 ను విడుదల చేయును. అదే ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 164 గ్రాముల Ca (NO3)2 ను వేడిచేసినపుడు విడుదలగు
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 15

ఇ) 82 గ్రాముల Ca (NO3)2 ను వేడిచేసినపుడు ఏర్పడే కాల్షియం ఆక్సెడ్ ద్రవ్యరాశిని లెక్కించంది.
జవాబు:
తుల్య సమీకరణం నుండి 164 గ్రాముల Ca (NO3)2 వియోగం చెంది 112 గ్రాముల CaO ను ఏర్పరచును.
అదే 82 గ్రాముల Ca (NO3)2 వియోగం చెంది విడుదలచేయు Ca0 విలువ = \(\frac{82}{164}\) × 112 = 56 గ్రాములు

ఈ) 5 మోల్ O2 క్రియాజన్యాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన Ca (NO3)2 పరిమాణం ఎంత?
జవాబు:
పై తుల్య సమీకరణం నుండి 2 మోల్ Ca (NO3)2, 5 మోల్ల వాయువులు (4 మోల్ల NO2 మరియు 1 మోల్ ఆక్సిజన్)ను విడుదల చేయుచున్నవి.

5 మోల్ల వాయు ఉత్పన్నాలు ఏర్పడాలంటే కావలసిన Ca (NO3)2 ద్రవ్యరాశి = 2 × 164 = 328V

ప్రశ్న 8.
ఒక విద్యార్థికి కింది పదార్థాలను ఇచ్చి రసాయన చర్యా రకాలను ప్రయోగం చేసి చూపమన్నారు. అతడు ఏ విధంగా చేసి ఉంటాడో రాయండి.
కాపర్ సల్ఫేట్ ద్రావణం, బేరియం క్లోరైడ్ ద్రావణం, ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలు, ఇనుప మేకులు, పొడిసున్నం, నీరు.
జవాబు:
విద్యార్థికి ఇచ్చిన పదార్థాలు :
CuSO2 ద్రావణం, BaCl2 ద్రావణం, ఇనుప మేకులు (Fe), ఫెర్రస్ సల్ఫేట్ (FeSO4), పొడిసున్నం (CaO) మరియు నీరు (H2O).

1. కాపర్ సల్ఫేట్ ద్రావణం :
కాపర్ సల్ఫేట్ ద్రావణంలో, జింక్ ముక్కలను కలిపిన కాపర్ కంటే జింకుకు చర్యాశీలత ఎక్కువ కనుక, జింకు, కాపర్‌ను దాని స్థానం నుండి స్థానభ్రంశం చెందించును. కనుక ఇది ఒక రసాయన స్థానభ్రంశ చర్య.
CuSO4 + Zn → ZnSO4 + Cu

2. బేరియం క్లోరైడ్ ద్రావణం :
బేరియం క్లోరైడ్ ను ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణంతో చర్య జరిపితే రసాయన ద్వంద్వ వియోగం జరిగి BaSO4 మరియు FeCl2, ఏర్పడును.
BaCl2(జల) + FeSO4(జల) → BaSO4(ఘ) ↓ + FeCl2(జల)

3. ఇనుప మేకులు (Fe) :
కాపర్ సల్ఫేట్ లో ఇనుపమేకులను ముంచిన అవి గోధుమరంగులోకి మారును. CuSO4 రంగును కోల్పోవును. ఇది ఒక స్థానభ్రంశ చర్య.
Fe(ఘ) + CuSO4(జల) → FeSO4(జల) + Cu(ఘ)

4. ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలు :
ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను వేడిచేసిన, అవి వియోగము చెంది Fe2O3, SO2, SO3 లు ఏర్పడును.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 16

5. పొడిసున్నం :
పొడిసున్నంను నీటితో చర్యజరిపిన తడిసున్నం ఏర్పడును. CaO(ఘ) + H2O(ద్ర) → Ca (OH)2(జల)

6. నీరు :
నీటిని విద్యుత్ విశ్లేషణం చెందించిన అది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా విడిపోవును.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 17

ప్రశ్న 9.
రసాయన సమీకరణం ద్వారా అదనపు సమాచారాన్ని ఎలా తెలుసుకోవచ్చు?
జవాబు:
రసాయన సమీకరణాల ద్వారా మరింత సమాచారం తెలుసుకోవడానికి క్రియాజనకాలు, క్రియాజన్యాలకు సంబంధించిన కింద సూచించిన లక్షణాలు తెలియజేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది.
i) భౌతిక స్థితి
ii) ఉష్ణోగ్రతలో మార్పులు (ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రాహక చర్యలు)
iii) ఏదైనా వాయువు వెలువడడం
iv) ఏదైనా అవక్షేపం ఏర్పడడం

i) భౌతిక స్థితిని తెలియజేయుట :
పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటాయి. వీటిని వరుసగా (ఘ), (ద్ర), (వా) లాంటి గుర్తులతో రసాయన సమీకరణాలలో సూచిస్తారు. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జల ద్రావణాలు (జ.ద్రా. )తో సూచిస్తారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 18

ii) ఉష్ణ మార్పులను తెలియజేయుట :
ఉష్ణాన్ని విడుదల చేస్తే జరిగే చర్యలను ఉష్ణమోచక చర్యలని, ఉష్టాన్ని గ్రహిస్తూ జరిగే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అని అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 19

iii) వాయువు విడుదలను సూచించుట :
ఒక రసాయనిక చర్యలో వాయువు విడుదలైతే, దానిని పైకి చూపిస్తున్న బాణపు గుర్తు (↑) తో సూచిస్తాం.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 20

iv) అవక్షేపం ఏర్పడడాన్ని సూచించుట :
ఒక రసాయనిక చర్యలో అవక్షేపం ఏర్పడితే, దానిని క్రిందవైపుకు సూచిస్తున్న బాణపు గుర్తు (↓) తో సూచిస్తాం.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 21

ప్రశ్న 10.
రసాయన చర్యలు ఎన్ని రకములు? అవి ఏవి? ఉదాహరణలతో వివరింపుము.
జవాబు:
రసాయన చర్యలు నాలుగు రకాలు. అవి:
1. రసాయన సంయోగం : రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కలిసి ఒక క్రొత్త పదార్ధంగా ఏర్పడటాన్ని రసాయన సంయోగం అంటారు.
ఉదా : 2Mg + O2 → 2MgO

2. రసాయన వియోగం :
ఒక సమ్మేళనం శక్తి సమక్షంలో రెండు కాని అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 22

3. రసాయన స్థానభ్రంశం :
సమ్మేళనంలోని ఒక మూలకం యొక్క స్థానాన్ని, అధిక చర్యాశీలత గల మరొక మూలకం ఆక్రమించడాన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
ఉదా : Zn + CuSO4 → ZnSO4 + Cu

4. రసాయన ద్వంద్వ వియోగం :
రెండు క్రియాజనకాలు తమ ప్రాతిపదికలను పరస్పరం మార్పిడి చేసుకొనే రసాయన చర్యను రసాయన ద్వంద్వ వియోగం అంటారు.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 23

ప్రశ్న 11.
రెండు బీకర్లను తీసుకొని వాటిలో లెడ్ నైట్రేట్ జల ద్రావణం మరియు పొటాషియం అయోడైడ్ జల ద్రావణాలను తయారుచేస్తే అవి ఏ రంగులో ఉంటాయి? ఆ రెండు ద్రావణాలను వేరొక బీకరులో కలిపితే ఏమి జరుగుతుంది? ఇది ఏ రకమైన రసాయన చర్య? ఏర్పడే క్రియాజన్యాలను తెల్పుము.
జవాబు:
రెండు ద్రావణాలు తెల్లరంగులోనే ఉంటాయి. ఆ రెండు ద్రావణాలను కలిపితే పసుపురంగు అవక్షేపం ఏర్పడుతుంది. ఇది రసాయన ద్వంద్వ వియోగ (అవక్షేప) చర్య. రెండు ద్రావణాల మధ్య చర్య జరిగి లెడ్ అయోడైడ్ అవక్షేపం (పసుపురంగు) ఏర్పడుతుంది. పొటాషియం నైట్రేట్ ద్రావణంలో ఉంటుంది. .
Pb(NO3)2 + 2KI → PbI2 + 2KNO3

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 12.
లత కొంత పరిమాణంలో ఒక పదార్థ చూర్ణాన్ని పరీక్షనాళికలోనికి తీసుకొంది. స్పిరిట్ ల్యాంతో దానిని వేడిచేసింది. వెలువడిన వాయువును రెండవ పరీక్షనాళికలో ఉన్న ద్రావణంలోనికి పంపింది. రెండవ పరీక్ష నాళికలో ద్రావణం పాలవంటి తెల్లని రంగులోకి మారింది. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము.
ఎ) వేడిచేయబడిన పదార్థం ఏమై ఉంటుంది?
బి) వెలువడిన వాయువు ఏమిటి?
సి) రెండవ పరీక్షనాళికలో తీసుకొన్న ద్రావణం ఏమిటి?
డి) ఈ ప్రయోగంలో ఏ రకపు రసాయనచర్యలు ఇమిడి ఉన్నాయి?
జవాబు:
ఎ) వేడిచేయబడిన పదార్థం కాల్షియం కార్బొనేట్ (మరి ఏదైనా లోహ కార్బొనేట్ కావచ్చు).
బి) వెలువడిన వాయువు కార్బన్ డై ఆక్సైడ్,
సి) సున్నపుతేట లేదా తడిసున్నం (Ca(OH)2).
డి) ఈ ప్రయోగంలో వియోగ చర్య మరియు తటస్థీకరణ చర్యలు ఇమిడి ఉన్నాయి.
CaCO3 → CaO + CO2 (రసాయన వియోగ చర్య)
Ca(OH)2 + CO2 → CaCO3 + H2O (తటస్థీకరణ చర్య)

ప్రశ్న 13.
కొంత పరిమాణంలో లేత పసుపు రంగు గల ఒక పదార్థాన్ని వాచ్ గ్లాస్ నందు తీసుకొని, దానిని కొంతసేపు ఎండలో ఉంచారు. అది బూడిదరంగు గల చూర్ణంగా మారింది.
ఎ) లేత పసుపు రంగుగల పదార్థం ఏమిటి?
జవాబు:
సిల్వర్ బ్రోమైడ్

బి) బూడిద రంగులో ఏర్పడిన క్రొత్త పదార్థం ఏమిటి?
జవాబు:
సిల్వర్

సి) ఇది ఏ రకమైన రసాయన చర్య?
జవాబు:
కాంతి రసాయన చర్య (రసాయన వియోగం)

డి) ఈ రసాయన చర్యకు రసాయన సమీకరణం వ్రాయుము.
జవాబు:
2AgBr(ఘ) → 2Ag(ఘ) + Br2(ఘ)

ప్రశ్న 14.
ఈ క్రింది సమీకరణాలకు తుల్య సమీకరణాలు వ్రాయుము.
ఎ) Na2SO4 + BaCl2 → BaSO4 + NaCl
బి) Al4C3 + H2O → CH4 + Al(OH)3
సి) Pb(NO3)2 → PbO + NO2 + O2
డి) Fe2O3 + Al → Al2O3 + Fe
జవాబు:
ఎ) Na2SO4 + BaCl2 → BaSO4 + NaCl
Na2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl

బి) Al4C3 + H2O → CH4 + Al (OH)3
Al4C3 + 12H2O → 3CH4 + 4Al (OH)3

సి) Pb(NO3)2 → PbO + NO2 + O2
2Pb(NO3)2 → 2PbO + 4NO2 + O2

డి) Fe2O3 + Al → Al2O3 + Fe
Fe2O3 + 2Al → Al2O3 + 2 Fe

ప్రశ్న 15.
నిత్యజీవిత ఆక్సీకరణ చర్యలకు ఏవేని ‘8’ ఉదాహరణలిమ్ము.
జవాబు:
నిత్యజీవితంలో ఆక్సీకరణ చర్యలు :

  1. ఆహారం ముక్కిపోవడం
  2. ఇనుము తుప్పుపట్టడం
  3. ఇంధనాలను మండించడం
  4. ఆపిల్ ను కోసినపుడు అది గోధుమరంగులోకి మారడం
  5. టపాసులు పేలడం
  6. రంగు గల వస్తువులు ఆక్సీకరణం చెంది వాటి రంగును కోల్పోతాయి.
  7. పిండికి ఈస్టు కలిపితే అది ఉబ్బుతుంది. ఈ చర్యలో చక్కెరలు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడుతుంది.
  8. వెండి, రాగి వస్తువులపై రంగుపూత (చిలుము) ఏర్పడటం,

ప్రశ్న 16.
మీ మిత్రునికి/మిత్రురాలికి రసాయన ద్వంద్వ వియోగం అనే అంశం గురించి కొన్ని సందేహాలున్నాయి. దానిని నివృత్తి చేయుటకు నీవు ఎటువంటి ప్రయోగాలు చేసి చూపిస్తావు? వివరింపుము.
జవాబు:
రసాయన ద్వంద్వ వియోగానికి సంబంధించి చేసే ప్రయోగాలు:
1) లెడ్ నైట్రేట్ ద్రావణానికి పొటాషియం అయోడైడ్ ద్రావణం కలిపితే పసుపురంగు అవక్షేపం లెడ్ అయోడైడ్ మరియు ద్రావణంలో పొటాషియం నైట్రేట్ ఏర్పడతాయి.

ఈ చర్యలు లెడ్ అయాన్ మరియు పొటాషియం అయాన్ వాటి స్థానాలు పరస్పరం మార్చుకొంటాయి.
Pb (NO3)2(జ.ద్రా) + 2KI(జ.ద్రా) → Pbl2(ఘ) + 2KNO3(జ.ద్రా)

2) సోడియం సల్ఫేట్ ద్రావణానికి బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిపితే సోడియం క్లోరైడ్ ద్రావణంతోపాటు తెల్లని బేరియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడుతుంది.
Na2SO4(జ.ద్రా) + BaCl2(జ.ద్రా) → BaSO4(ఘ) + 2Nacl(జ.ద్రా)
సోడియం, బేరియం అయాన్లు పరస్పరం తమ స్థానాలను మార్చుకొన్నాయి.

3) సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యజరిపి సోడియం క్లోరైడ్ మరియు నీరు ఏర్పరుస్తుంది.
NaOH(జ.ద్రా) + HCl(జ.ద్రా) → NaCl(జ.ద్రా) + H2O(ద్ర)
Na+ H+ అయాన్లు తమ స్థానాలను మార్చుకొన్నాయి.

4) సిల్వర్ నైట్రేట్ జలద్రావణంకు సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిపితే సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం ఏర్పడుతుంది.
AgNO3(జ.ద్రా) + NaCl(జ.ద్రా) → AgCl(ఘ) + NaNO3(జ.ద్రా)
Ag+, Na+ లు తమ స్థానాలను పరస్పరం మార్చుకొన్నాయి.

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. C6H12O6 → C2H5OH + CO2 అనే చర్య
A) సంయోగం
B) వియోగం
C) స్థానభ్రంశం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
B) వియోగం

2. BaCl2 + Na2SO4 → BaSO4 + 2NaCI అనే సమీకరణం ఈ రకం చర్యను సూచిస్తుంది.
A) స్థానభ్రంశం
B) వియోగం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
D) ద్వంద్వ వియోగం

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

3. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో విడుదలయ్యే ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘనపరిమాణాల నిష్పత్తి …..
A) 1 : 2
B) 2 : 1
C) 1 : 1
D) 3 : 1
జవాబు:
A) 1 : 2

4. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుపమేకు గోధుమ రంగులోకి మారి నీలిరంగు కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు కోల్పోవును. ఇది ఎటువంటి రసాయన చర్య?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన ద్వంద్వ వియోగం
D) రసాయన స్థానభ్రంశం
జవాబు:
D) రసాయన స్థానభ్రంశం

5. x KClO3 → yKCl + zO2 సమీకరణంలో x, y, z విలువలు వరుసగా
A) 1, 2, 3
B) 3, 3, 2
C) 2, 2, 3
D) 2, 2, 2
జవాబు:
C) 2, 2, 3

6. పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారుచేయటం ఈ రకమైన చర్య.
A) రసాయన వియోగం
B) ఉష్ణమోచక చర్య
C) ఉష్ణగ్రాహక చర్య
D) రసాయన స్థానభ్రంశం
జవాబు:
B) ఉష్ణమోచక చర్య

7. టపాసులు పేలడం అనునది. ఈ రకమైన చర్య
A) క్షయకరణం
B) భంజనము
C) ఆక్సీకరణం
D) గాల్వనైజేషన్
జవాబు:
C) ఆక్సీకరణం

8. ఒక ప్రయోగంలో విడుదల అయిన ఒక వాయువు మండుచున్న పుల్లను ఇంకా ప్రకాశవంతంగా మండించిన ఆ వాయువు ……….
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
A) ఆక్సిజన్

9. Zn + 2 HCl → ZnCl2 + H2 అనే రసాయన చర్య కింది వాటిలో దేనికి ఉదాహరణ? ఏది?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం

10. పొడి సున్నాన్ని నీటికి కలిపితే జరిగే చర్య ఒక …………
A) స్థానభ్రంశ చర్య
B) వాయువు విడుదల చేయు చర్య
C) ఉష్ణం విడుదల చేయు చర్య
D) దహన చర్య
జవాబు:
C) ఉష్ణం విడుదల చేయు చర్య

11. 4 మోల్‌ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4 మోల్‌ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్‌ల సంఖ్య
A) 1 మోల్
B) 2 మోల్లు
C) 3 మోలు
D) 4 మోలు
జవాబు:
B) 2 మోల్లు

12.
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 24
A) రసాయన సంయోగ చర్యలు
B) రసాయన వియోగ చర్యలు
C) రసాయన స్థానభ్రంశ చర్యలు
D) గ్వంద్వ వియోగ చర్యలు
జవాబు:
B) రసాయన వియోగ చర్యలు

13. క్రింది వాటిలో సరియైన తుల్య సమీకరణము
A) NaOH + Zn → NaZnO2 + H2
B) 2NaOH + Zn → Na2ZnO2 + H2
C) 2NaOH + 2Zn → 2NaZnO2 + H2
D) NaOH + 2Zn → NaZn2O2 + H2
జవాబు:
B) 2NaOH + Zn → Na2ZnO2 + H2

14. సిల్వర్ బ్రోమైడ్ రంగు……
A) ఎరుపు
B) నీలం
C) ఆకుపచ్చ
D) లేత పసుపు
జవాబు:
D) లేత పసుపు

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

15. ఆక్సీకరణం అనగా ………
A) ఆక్సిజన్ కలపటం
B) హైడ్రోజన్ తొలగించటం
C) ఎలక్ట్రానులను పోగొట్టుకొనుట
D) ఉష్ణవహన చర్య
జవాబు:
D) ఉష్ణవహన చర్య

16. క్షయకరణం అనగా ……
A) ఆక్సిజన్ కోల్పోవటం
B) హైడ్రోజన్ కలపటం
C) ఎలక్ట్రానులను గ్రహించుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

17. రసాయన వియోగానికి ఈ క్రింది వాటిలో అవసరమైనది
A) కాంతి
B) ఉష్ణం
C) విద్యుత్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

18. ఈ క్రింది వానిలో ఆక్సీకరణానికి ఉదాహరణ
A) ఇనుము తుప్పుపట్టుట
B) శ్వాసక్రియ
C) ర్యాన్సిడిటీ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

19. ఈ క్రింది వాటిలో ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ
A) కోసిన ఆపిల్ ముక్కలు రంగు మారటం
B) టపాసులు పేలటం
C) బంగాళదుంపల ముక్కలు రంగు మారటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

20. రాన్సిడిటీని అరికట్టడానికి ఈ క్రింది వానిలో ఏది కలపాలి?
A) విటమిన్ సి
B) విటమిన్ ఇ
C) యాంటీ ఆక్సిడెంట్లు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

21. ఈ క్రింది వానిలో రసాయన మార్పు
A) బల్బు వెలగటం
B) ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించటం
C) ఆహారం జీర్ణం అవటం
D) లోహాలు వ్యాకోచించటం
జవాబు:
D) లోహాలు వ్యాకోచించటం

22. ఈ క్రింది వానిలో భౌతిక మార్పు
A) పండ్లు పండటం
B) అగ్గిపుల్ల మండటం
C) సిమెంట్ గట్టి పడటం
D) నీరు ఆవిరిగా మారటం
జవాబు:
D) నీరు ఆవిరిగా మారటం

23. చర్యాశీలతలో భేదాల వలన జరుగు రసాయన చర్యలు
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) స్థానభ్రంశం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
C) స్థానభ్రంశం

24. శక్తిని బయటకు విడుదల చేసే చర్య …..
A) ఉష్ణమోచక
B) ఉష్ణగ్రాహక
C) ఉష్ణవినిమయ
D) ఉష్ణవహన
జవాబు:
A) ఉష్ణమోచక

25. శక్తిని గ్రహించే చర్య
A) ఉష్ణ మోచక
B) ఉష్ణగ్రాహక
C) ఉష్ణవినిమయ చర్య
D) పెవన్నీ
జవాబు:
B) ఉష్ణగ్రాహక

26. ఈ క్రింది వానిలో ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ
A) C + O2 → CO2 + Q
B) C + O2 → CO2 – Q
C) C + O2 + Q → CO2
D) పైవన్నీ
జవాబు:
A) C + O2 → CO2 + Q

27. ఈ క్రింది వానిలో ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ
A) C + O2 → CO2 + Q
B) C + O2 → CO2 – Q
C) C + O2 + Q → CO2
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

28. కూరగాయలు కంపోస్టుగా వియోగం చెందడం ……………. కు ఉదాహరణ.
A) ఆక్సీకరణము
B) క్షయకరణము
C) ముక్కిపోవడం
D) క్షయము చెందుట
జవాబు:
A) ఆక్సీకరణము

29. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి క్రొత్త పదార్థం ఏర్పడటాన్ని ……………… అంటారు.
A) ఉష్ణరసాయన చర్య
B) ఉష్ణమోచక చర్య
C) ఉష్ణగ్రాహక చర్య
D) కాంతిరసాయన చర్య
జవాబు:
C) ఉష్ణగ్రాహక చర్య

30. 2N2O → 2N2 + O ……………….. చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగ
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశ
D) రసాయన ద్వంద్వవియోగ
జవాబు:
D) రసాయన ద్వంద్వవియోగ

31. Ca + 2H2O → Ca(OH)2 + H2 ↑ అనేది ……………… చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం

32. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాలను ………….. అంటారు.
A) క్రియాజనకాలు
B) క్రియాజన్యాలు
C) అవక్షేపాలు
D) వాయువులు
జవాబు:
A) క్రియాజనకాలు

33. ఆపిల్, బంగాళదుంపలలో ఉండే ఎంజైమ్ …….
A) టయలిన్
B) పాలిఫినాల్ ఆక్సిడేజ్
C) టైరోసినేజ్
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

34. వెండి, రాగి వస్తువులు మెరుపును కోల్పోవటాన్ని …………….. అంటారు.
A) ముక్కిపోవడం
B) తుప్పుపట్టడం
C) కుళ్ళిపోవడం
D) క్షయము చెందడం
జవాబు:
D) క్షయము చెందడం

35. ఇనుప వస్తువులపై జింక్ పూత వేయడాన్ని ………… అంటారు.
A) రాన్సిడేషన్
B) ఆక్సిడేషన్
C) రిడక్షన్
D) గాల్వనీకరణము
జవాబు:
D) గాల్వనీకరణము

36. తుప్పును నిరోధించే సామర్థ్యం గల లోహము …….
A) ఇనుము
B) బంగారం
C) ఉక్కు
D) రాగి
జవాబు:
B) బంగారం

37. ఆహారం పాడవకుండా నిల్వ ఉండుటకు ………….. విటమిన్లు కలపాలి.
A) విటమిన్ A & C
B) A & B విటమిన్
C) విటమిన్ C & E
D) విటమిన్ D & E
జవాబు:
C) విటమిన్ C & E

38. చిప్స్ తయారీదారులు, ఎక్కువకాలం నిల్వ ఉండడానికి ప్యాకెట్ లోపల …………. వాయువును నింపుతారు.
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) క్లోరిన్
జవాబు:
B) నైట్రోజన్

39. ముక్కిపోవటం ఒక ………… చర్య.
A) ఉష్ణమోచక
B) ఉష్ణగ్రాహక
C) ఆక్సీకరణ
D) క్షయకరణ
జవాబు:
C) ఆక్సీకరణ

40. Na → Na+ +e. ఈ చర్యలో సోడియం ……………. చెందింది.ణ.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రసాయన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
A) ఆక్సీకరణం

41. Cl + e → Cl ఈ చర్యలో క్లోరిన్ ……. చెందింది.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రసాయన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
B) క్షయకరణం

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

42. NaOH + HCl → NaCl + H2O. ఇది …………… చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగం
B) రసాయన స్థానభ్రంశం
C) రసాయన వియోగం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
D) రసాయన ద్వంద్వ వియోగం

43. Fe+ CuSO4 → FeSO4 + Cu లో ఎక్కువ చర్యా శీలత గల లోహం ……………..
A) Fe
B) Cu
C) S
D) O2
జవాబు:
A) Fe

44. ఆక్సీకరణం, క్షయకరణం ఒకేసారి జరిగే చర్యలను…………….. అంటారు.
A) ఆక్సీకరణ చర్య
B) క్షయకరణ చర్య
C) రెడాక్స్ చర్య
D) రసాయన వియోగం
జవాబు:
C) రెడాక్స్ చర్య

45. CuO + H2 → Cu + H2O. ఈ చర్యలో Cu0 …………….. చెందింది.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) మార్పు
D) క్షయము
జవాబు:
B) క్షయకరణం

46. అవక్షేపాలు ఏర్పడే చర్యలను …………….. చర్యలు అంటారు.
A) సంయోగ
B) వియోగ
C) స్థానభ్రంశ
D) ద్వంద్వ వియోగ
జవాబు:
D) ద్వంద్వ వియోగ

47. అధిక చర్యాశీలత గల లోహాలు, అల్ప చర్యాశీలత గల లోహాలను ……………… చెందిస్తాయి.
A) స్థానభ్రంశం
B) వియోగం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
A) స్థానభ్రంశం

48. విద్యుత్ విశ్లేషణలో ఏర్పడిన హైడ్రోజన్, ఆక్సిజన్ నిష్పత్తి …………
A) 1:2
B) 2:1
C) 3:2
D) 2:3
జవాబు:
B) 2:1

49. లెడ్ అయోడైడ్ అవక్షేపం రంగు ………
A) ఎరుపు
B) తెలుపు
C) పసుపు
D) జేగురు
జవాబు:
C) పసుపు

50. క్షయము చెందుట అనునది ……………. చర్య.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రెడాక్స్
D) ఏదీకాదు
జవాబు:
A) ఆక్సీకరణం

51. Fe2O3 + 2Al → Al2O3 + 2 Fe ఈ చర్య దేనికి ఉదాహరణ?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగచర్య
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వవియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం

52. లేత పసుపుపచ్చరంగులో ఉండే ఒక పదార్థమును సూర్య కాంతిలో ఉంచితే అది బూడిద రంగులోనికి మారుతుంది. అయితే తీసుకోబడిన పదార్థం ఏమిటి?
A) లెడ్ అయోడైడ్
B) పొటాషియం అయోడైడ్
C) సిల్వర్ బ్రోమైడ్
D) హైడ్రోజన్ క్లోరైడ్
జవాబు:
C) సిల్వర్ బ్రోమైడ్

53. రసాయనిక చర్యలో అవక్షేపమును సూచించుటకు ఉపయోగించు బాణపు గుర్తు
A) →
B) ↑
C) ↓
D) ←
జవాబు:
C) ↓

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

54. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది …………. ద్రావణం.
A) ఆమ్ల
B) క్షార
C) తటస్థ
D) ద్వంద్వ స్వభావ
జవాబు:
B) క్షార

55. జింక్ సల్ఫేట్ ద్రావణం గల పరీక్షనాళికలో శుభ్రమైన ఇనుపముక్కలు ఉంచినప్పుడు ఏమి జరుగుతుందనగా ………………….
A) ద్రావణం రంగును కోల్పోయి, ఇనుపముక్కలపై జింక పూత ఏర్పడుతుంది.
B) గ్రావణం ఆకుపచ్చ రంగులోకి మారి, ఇనుప ముక్కలపై జింకప్పత ఏర్పడును.
C) ద్రావణాన్ని, ఆకుపచ్చ రంగులోకి మార్చుతూ, ఇనుపముక్కలు ద్రావణంలో కరుగుతాయి.
D) ఎటువంటి చర్య జరుగదు.
జవాబు:
D) ఎటువంటి చర్య జరుగదు.

56. ఒక విద్యారి పరీక్షనాళికలో (Pb(NO3)2) లెడ్ నైట్రోజన్ వేసి వేడిచేసినాక అందులోనుండి విడుదల అయిన వాయువులు
A) NO2 O2
B) NO2, H2
C) NO2, N2
D) NO2, CO2
జవాబు:
A) NO2 O2

57. CaCO3 ని వేడి చేయగా ఏర్పడిన పదార్థాలు
A) CaO, CO2
B) CaCO3, H2O
C) CaO, H2O
D) Ca, CO3
జవాబు:
A) CaO, CO2

58. సోడియంను నీటిలో వేసినప్పుడు అందులో ‘టప్’ మని మండి శబ్దం చేయును. దీనికి కారణం
A) నైట్రోజన్ వాయువు విడుదల
B) ఉష్ణం విడుదల అయినందువల్ల
C) H2 వాయువు విడుదల అయి మండటంవల్ల
D) ఆక్సిజన్ విడుదల అవడం వల్ల
జవాబు:
C) H2 వాయువు విడుదల అయి మండటంవల్ల

59. రాగి వస్తువులపై ఆకుపచ్చని పూతకు కారణమైన పదార్థం
A) CuO
B) CuCl2
C) Cus
D) CuSO4
జవాబు:
A) CuO

60. రంగుగల వస్తువులను విరంజనం (రంగును కోల్నో యేలా చేయడం) చేయగల పదార్థం
A) తేమగల ఆక్సిజన్ వాయువు
B) తేమ గల క్లోరిన్ వాయువు
C) తేమగల నైట్రోజన్ వాయువు
D) తేమగల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు
జవాబు:
B) తేమ గల క్లోరిన్ వాయువు

61. 1 గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువులోని అణువుల సంఖ్య
A) 6.02 × 1023
B) 6.02 × 1022
C) 3.01 × 1022
D) 3.01 × 1011
జవాబు:
A) 6.02 × 1023

62. లోహాలు, ఆమ్లాలతో చర్య జరిపినపుడు వెలువడు వాయువు
A) H2
B) O2
C) N2
D) CO2
జవాబు:
A) H2

63. జింక్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లని తెచ్చినపుడు టప్ అనే శబ్దంతో అగ్గిపుల్ల ఆరిపోతుంది. వెలువడిన వాయువు ఏమి?
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) క్లోరిన్
జవాబు:
B) హైడ్రోజన్

64. ఒక రసాయన చర్య జరిగినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లను తెచ్చినపుడు అగ్గిపుల్ల ప్రకాశవంతంగా మండుచున్నది. వెలువడిన వాయువు ఏది?
A) హైడ్రోజన్
B) కార్బన్ డై ఆక్సైడ్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్
జవాబు:
C) ఆక్సిజన్

AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

65. ఒక రసాయన చర్య జరిగినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లను తెచ్చినపుడు అగ్గిపుల్ల ఆరిపోతుంది. అయితే వెలువడిన వాయువు ఏది?
A) కార్బన్ డై ఆక్సైడ్
B) హైడ్రోజన్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్
జవాబు:
A) కార్బన్ డై ఆక్సైడ్

66. క్రింది రసాయన సమీకరణాలను పరిశీలించుము
AP 9th Class Physical Science Important Questions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 25
పైన ఇచ్చిన జతలకు క్రింది వానిలో సరియైన దానిని ఎంపిక చేయుము.
A) a, b, c, d
B) a, c, d, b
C) b, c, d, a
D) b, d, c, a
జవాబు:
C) b, c, d, a

II. జతపరచుము.

i)

గ్రూప్ – ఎ గ్రూప్ – బి
1. ఆపిల్ A) మిటమిన్ సి, ఇ
2. చిప్స్ ప్యాకెట్లు B) ర్యాన్సిడిటీ
3. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు C) క్రోజన్
4. మెరుపు కోల్పోవటం D) నైట్రోజన్ వాయువు
5. రుచి, వాసన మారిపోవటం E) టైరోసినేజ్

జవాబు:

గ్రూప్ – ఎ గ్రూప్ – బి
1. ఆపిల్ E) టైరోసినేజ్
2. చిప్స్ ప్యాకెట్లు D) నైట్రోజన్ వాయువు
3. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు A) మిటమిన్ సి, ఇ
4. మెరుపు కోల్పోవటం C) క్రోజన్
5. రుచి, వాసన మారిపోవటం B) ర్యాన్సిడిటీ

ii)

గ్రూప్ – ఎ గ్రూప్ – బి
1. శక్తి గ్రహించటం A) క్షయకరణం
2. శక్తి విడుదల B) ఆక్సీకరణం
3. హైడ్రోజన్ కలుపుట C) ఉష్ణగ్రాహక చర్య
4. ఆక్సిజన్ కలుపుట D) అవక్షేపం
5. నీటిలో కరగని పదార్థాలు E) ఉష్ణమోచక చర్య

జవాబు:

గ్రూప్ – ఎ గ్రూప్ – బి
1. శక్తి గ్రహించటం C) ఉష్ణగ్రాహక చర్య
2. శక్తి విడుదల E) ఉష్ణమోచక చర్య
3. హైడ్రోజన్ కలుపుట A) క్షయకరణం
4. ఆక్సిజన్ కలుపుట B) ఆక్సీకరణం
5. నీటిలో కరగని పదార్థాలు D) అవక్షేపం

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

These AP 9th Physical Science Important Questions and Answers 5th Lesson పరమాణువులో ఏముంది ? will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 5th Lesson Important Questions and Answers పరమాణువులో ఏముంది ?

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
వైద్యరంగంలో ఐసోటోప్ల ఉపయోగం ఏమిటి?
జవాబు:

  1. గాయిటర్ చికిత్సలో అయొడిన్ ఐసోటోపును వాడుతారు.
  2. కేన్సర్ చికిత్సయందు కోబాల్ట్ ఐసోటోపును ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
హైడ్రోజన్ యొక్క ఐసోటోపుల పేర్లు వ్రాయుము.
జవాబు:
హైడ్రోజన్, డ్యుటీరియం, ట్రిటియం.

ప్రశ్న 3.
గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు గల మూలకాలు ఏవి?
జవాబు:
సీజియం, హీలియంలు అధిక సంఖ్యలో ఐసోటోపులు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ప్రశ్న 4.
M – కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల గరిష్ఠ సంఖ్య ఎంత?
జవాబు:
M – కర్పరంలో ఉండే ఎలక్ట్రానుల సంఖ్య 2 x 3² = 2 x 9 = 18.

ప్రశ్న 5.
పరమాణు కేంద్రకంలో న్యూట్రా లేని మూలకమేది?
జవాబు:
హైడ్రోజన్.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 6.
‘ఫాస్ఫరస్’లో ఎలక్ట్రాన్ల పంపిణీని పటం రూపంలో చూపుము.
జవాబు:
ఫాస్ఫరస్ పరమాణు సంఖ్య = 15
ఎలక్ట్రాన్ల పంపిణీ = 2, 8, 5.

ప్రశ్న 7.
పరమాణువులో ఎలక్ట్రాన్ల పంపిణీకి సంబంధించి నియమాలు ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
బోర్-బ్యురీ.

ప్రశ్న 8.
బోర్-జ్యురీ మొదటి నియమం ఏమిటి?
జవాబు:
ఒక కక్ష్యలో ఉండే గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్యను 2n² సూత్రం ద్వారా నిర్ణయిస్తారు.

ప్రశ్న 9.
బోర్-బ్యురీ రెండవ నియమం ఏది?
జవాబు:
ప్రతీ కర్పరం లేదా ఎలక్ట్రాన్ కక్ష్య తిరిగి ఉపకర్పరాలుగా విభజింపబడినది. ఈ ఉపకర్పరాలలో గరిష్టంగా పట్టే ఎలక్ట్రానుల సంఖ్య 8.

ప్రశ్న 10.
బోర్-బ్యురీ మూడవ నియమం తెలుపుము.
జవాబు:
తక్కువ శక్తిగల లోపలి కర్పరాలలో ఎలక్ట్రానులు పూర్తిగా నిండనంత వరకు తర్వాత కర్పరాలలో ఎలక్ట్రానులు చేరవు.

ప్రశ్న 11.
అష్టకము అనగానేమి?
జవాబు:
ఏదేని పరమాణువు తన బాహ్యకక్ష్యలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే ఆ పరమాణువును ‘అష్టకం’ను పొందింది అంటాం.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 12.
ఒక పరమాణువు అష్టకమును ఎలా పొందగలదు?
జవాబు:
పరమాణువులు రెండు విధాలుగా అష్టకాన్ని పొందగలవు.
అవి : 1) ఎలక్ట్రాన్ల బదిలీ
2) ఎలక్ట్రాన్లను పంచుకోవడం

పై రెండు విధానాల ఫలితంగా పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుంది.

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
36 గ్రాముల నీరును మోలలోనికి మార్చండి.
జవాబు:
నీటి యొక్క అణుఫార్ములా = H2O
నీటి యొక్క పరమాణు ద్రవ్యరాశి = (2 x 1) + 16 = 18
నీటి యొక్క గ్రాము అణుభారం = 18 గ్రా.
18 గ్రా|| నీరు అనగా = 1 మోల్
36 || నీరు అనగా = \(\frac{36}{18}\) = 2 మోల్లు.

ప్రశ్న 2.
క్రింది యివ్వబడిన పట్టికను పరిశీలించండి.

కక్ష్య కక్ష్య సంఖ్య కక్ష్యలో ఉండదగిన గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య
K 1 2(1)2 = 2
L 2 2(2)2 = 8
M 3 2(3)2 = 18
N 4 2(4)2 = 32

క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
i) ఏ కక్ష్య గరిష్ట సంఖ్యలో ఎలక్ట్రానులను కలిగి వుంది?
జవాబు:
‘N’ కక్ష్య గరిష్ఠ సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంది.

ii) ఒక కక్ష్యలో వుండదగిన గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్యను కనుగొనుటకు సాధారణ ఫార్ములాను వ్రాయుము.
జవాబు:
ఒక కక్ష్యలో వుండదగిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనుటకు సాధారణ ఫార్ములా 2n (n = 1, 2, 3 …….)

ప్రశ్న 3.
సంయోజకత అనగా నేమి? హైడ్రోజన్ సంయోజకత ఎంత?
జవాబు:
1) పరమాణువు యొక్క బాహ్యతమ కక్ష్యలోగల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు.

2) హైడ్రోజన్ సంయోజకత : 1

ప్రశ్న 4.
పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలను నిర్వచింపుము.
జవాబు:

  1. పరమాణు కేంద్రకంలో గల ప్రోటానుల సంఖ్యను పరమాణు సంఖ్య (Z) అంటాం.
  2. కేంద్రక కణాల సంఖ్యను (న్యూట్రానులు మరియు ప్రోటానుల మొత్తం సంఖ్య) పరమాణు ద్రవ్యరాశి సంఖ్య (A) అంటారు.
    A = Z + N

ప్రశ్న 5.
199F’ను వివరింపుము.
జవాబు:

  1. F → మూలక సంకేతం (ఫ్లోరిన్)
  2. 9 → పరమాణు సంఖ్య
  3. 19 → ద్రవ్యరాశి సంఖ్య
  4. ఫ్లోరిన్ పరమాణువులో 9 ప్రోటాన్లు, 10 న్యూట్రాన్ (19 – 9 = 10)లు ఉన్నాయి.
  5. 9 ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి.

ప్రశ్న 6.
ఐసోటోపులు అనగానేమి? రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఒకే మూలకానికి చెందిన వేరు వేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటానులు ఉండి, వేరువేరు న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటే వాటిని “ఐసోటోపులు” అంటారు.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 2

ప్రశ్న 7.
ఎలక్ట్రాన్ల పంపిణీకి సంబంధించి బోర్-బ్యురీ నియమాలను రాయండి.
జవాబు:
ఎలక్ట్రాన్ల పంపిణీకి సంబంధించి బోర్-బ్యురీ క్రింది నియమాలు ప్రతిపాదించారు. అవి :

  1. ఒక కక్ష్యలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య 2n² అనే సూత్రం ద్వారా నిర్ణయిస్తాము. ఇక్కడ ‘n’ కర్పరం సంఖ్య.
    ఉదా : K కర్పరానికి n = 1
    ∴ గరిష్ట ఎలక్ట్రానుల సంఖ్య = 2(1)² = 2 × 1 : 2.
  2. ప్రతి కర్పరం లేదా ఎలక్ట్రాన్ కక్ష్య తిరిగి ఉపకర్పరాలుగా విభజించబడింది. ఈ ఉపకర్పరాలలో గరిష్ఠంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 8.
  3. తక్కువ శక్తిగల లోపలి కర్పరాలలో ఎలక్ట్రానులు పూర్తిగా నిండనంతవరకు తర్వాత కర్పరాలలో ఎలక్ట్రానులు చేరవు.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 8.
బోర్-బ్యురీ నియమాలనుపయోగించి ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ల పంపిణీని వివరించుము.
జవాబు:

  1. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8.
  2. ఆక్సిజన్లో 8 ప్రోటాన్లు, 8 ఎలక్ట్రానులు ఉన్నాయి.

సోపానం – 1 :
K కర్పరంలో గరిష్టంగా 2 ఎలక్ట్రానులు ఉంచగలం. కాబట్టి మొదటి 2 ఎలక్ట్రానులు K కర్పరం (n = 1) లో నిండుతాయి.

సోపానం – 2 :
మిగిలిన 6 ఎలక్ట్రానులు తర్వాతి కర్పరం L కర్పరం (n = 2) లో నిండుతాయి.

సోపానం – 3 :
ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ నిర్మాణ క్రమం 2, 6.

ప్రశ్న 9.
ఫ్లోరిన్ పరమాణువు చిట్టచివరి కక్ష్యలో “7” ఎలక్ట్రాన్లు కలవు. కానీ దాని సంయోజకత ‘1’ వివరించండి.
జవాబు:

  1. సంయోజకత అనగా పరమాణువు చిట్టచివరి కక్ష్యలోని ఎలక్ట్రానుల సంఖ్య,
  2. ఫ్లోరిన్ పరమాణువులో ఎలక్ట్రాన్ల పంపిణీ 2, 7.
  3. కావున ఫ్లోరిన్ సంయోజకత 7 కావాలి.
  4. కానీ 7 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కంటే ఒక ఎలక్ట్రాన్ని గ్రహించడం ఫ్లోరిను తేలిక.
  5. అందువల్ల అష్టకం (8) నుండి 7 ఎలక్ట్రాన్లను తీసివేయగా వచ్చిన ‘1’ ని ఫ్లోరిన్ సంయోజకతగా పరిగణిస్తాం.

ప్రశ్న 10.
సంయోజకత యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. బాహ్యతమ కక్ష్యలో అష్టకం (8 ఎలక్ట్రానులు) ఉన్న పరమాణువు అత్యంత స్థిరమైనది. అంతేగాక ఇవి ఇతర మూలకాలలో రసాయన చర్యలో పాల్గొనవు.
    ఉదా : Ne, Ar మొ||
  2. బాహ్యతమ కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్లను కలిగియున్న పరమాణువుకు కూడా అధిక స్థిరత్వం వస్తుంది.
    ఉదా : He
  3. ఒక మూలక పరమాణువులు వేరొక పరమాణువులతో చర్య నొందినపుడు వాటి బాహ్య కక్ష్యలో అష్టకాన్ని పొందే విధంగా అవి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.
  4. అనగా మూలక పరమాణువులు జడవాయువులలో మాదిరిగా స్థిర ఎలక్ట్రాన్ అమరికను పొందడానికి సంయోగం చెంది, సమ్మేళనాలని ఏర్పరుస్తాయి.

ప్రశ్న 11.
మొదటి 18 మూలకాలలో ఎలక్ట్రాన్ల పంపిణీని పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 3

ప్రశ్న 12.
నిత్యజీవితంలో ఐసోటోపుల ఉపయోగాలేవి?
జవాబు:

  1. రసాయన, వైద్య రహస్యాలను ఛేదించడానికి కొన్ని ఐసోటోపులను ఉపయోగిస్తారు.
  2. రసాయన చర్యలలో ప్రతి ఒక్క దశను అధ్యయనం చేయడానికి ప్రయోగశాలల్లో సాధారణంగా ఐసోటోపులను ఉపయోగిస్తారు.
  3. యురేనియం ఐసోటోపును న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడుతారు.
  4. గాయిటర్ చికిత్సలో అయొడిన్ ఐసోటోపును వాడుతారు.
  5. కేన్సర్ చికిత్సయందు కోబాల్ట్ ఐసోటోపును ఉపయోగిస్తారు.

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఎ) క్రింది పరమాణువులలో కేంద్రకం మరియు వివిధ కర్పరాలలో ఎలక్ట్రాన్ అమరికను చూపే పటాలను గీయండి.
అ) హీలియం ఆ) కార్బన్ ఇ) ఆర్గాన్
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 1

బి) పై వాటిలో అస్థిరమైనది ఏది? ఎందుకు?
జవాబు:
కార్బన్ అస్థిరమైన మూలకం.

  1. హీలియంలో రెండు ఎలక్ట్రానులు వేలన్సీ ఎలక్ట్రానులుగా ఉన్నాయి. అందువలన స్థిరమైనది.
  2. ఆర్గాన్ లో ఎనిమిది ఎలక్ట్రానులు వేలన్సీ ఎలక్ట్రానులుగా ఉన్నాయి. అనగా అష్టక విన్యాసం కలిగి ఉంది. స్థిరమైనది.
  3. కార్బన్లో 4 ఎలక్ట్రానులు వేలన్సీ ఎలక్ట్రానులుగా ఉన్నాయి. అనగా అష్టక విన్యాసం లేదు. అస్థిరమైనది.

ప్రశ్న 2.
క్రింది పట్టికను లోపించిన సమాచారముతో నింపండి.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 4
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 5

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన మూలకాలలో ఎలక్ట్రాన్ల పంపిణీని సూచించు పటాలను గీయండి.
1. హీలియం, ఆక్సిజన్ మరియు ఆర్గాన్.
జవాబు:
1) హీలియం ((He) _ 2) ఆక్సిజన్ (0) 3) ఆర్గాన్ ( Ar)
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 6

2. సోడియం పరమాణు కేంద్రకంలో ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయో తెలపండి.
జవాబు:
సోడియం = 1123Na
న్యూట్రాన్లు = 23 – 11 – 12

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 4.
డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోని మూఖ్యాంశాలను రాయండి.
జవాబు:
మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ ప్రతిపాదించాడు.

మూఖ్యాంశాలు:

  1. డాల్టన్ ప్రకారం, పరమాణువులను విభజించలేం. అంటే వాటిని మరింత చిన్నవిగా విభజించడం సాధ్యం కాదు.
  2. ఒక మూలకం యొక్క పరమాణువులన్నీ ఒకే విధంగా ఉంటాయి.
  3. కాని ఇతర మూలక పరమాణువులకు భిన్నంగా ఉంటాయి.

ప్రశ్న 5.
పరమాణు ఉపకణాలు అనే భావన ఎలా ఉద్భవించింది?
జవాబు:

  1. డాల్టన్ ప్రతిపాదన ప్రకారము పరమాణువు విభజింప వీలుకానిది.
  2. కానీ విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరమాణువులు ఋణావేశాన్ని పొందుతాయని మైఖేల్ ఫారడే కనుగొన్నాడు. ఇది డాల్టన్ సిద్ధాంతానికి విరుద్ధం.
  3. పరమాణువులు కొన్నిసార్లు ఆవేశపూరిత కణాలుగా ప్రవర్తించాలంటే, కారణం దానిలో తప్పక అత్యంత సూక్ష్మకణాలుండాలి అనే భావనకు దారితీసింది.
  4. పరమాణువులు విద్యుత్ పరంగా తటస్థమైనవిగా తీసుకున్నాం కనుక పరమాణువులో సమాన సంఖ్యలో ధన మరియు ఋణావేశాలు ఉండి ఉంటాయి.
  5. ఈ భావనే పరమాణువులో ఉన్న ఉపకణాల గురించి, పరమాణు అంతర నిర్మాణం గురించి శాస్త్రవేత్తలు ఆలోచించడానికి అవకాశం కల్పించింది.

ప్రశ్న 6.
థామ్సన్ పరమాణు నమూనా యొక్క ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:
1898వ సంవత్సరంలో J.J. థామ్సన్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 7

అతని ముఖ్య ప్రతిపాదనలు :

  1. పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉండి దానిలో ఎలక్ట్రానులు పొదగబడి ఉంటాయి.
  2. పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువు అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది.
  3. మొత్తం ధనావేశాలు, ఋణావేశాలు సమానంగా ఉండడం వల్ల పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. ఈ నమూనాను ‘పుచ్చకాయ నమూనా’ లేక ‘ప్లమ్ పుడింగ్ నమూనా’ అంటారు.

ప్రశ్న 7.
రూథర్ ఫర్డ్ పరమాణు నమూనాలోని ముఖ్యాంశాలేవి?
జవాబు:
రూథర్ ఫర్డ్, తను చేసిన α – కణ పరిక్షేపణ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకొని 1909వ సం||లో ఒక పరమాణు నమూనాని ప్రతిపాదించాడు.

ముఖ్యాంశాలు :

  1. పరమాణువులో ధనావేశమంతా ‘కేంద్రకం’ అనే అతిచిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానులు ఉండవు.
  2. ఈ కేంద్రకం చుట్టూ ఋణావేశ ఎలక్ట్రానులు వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి.
  3. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం అత్యంత చిన్నది.
  4. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానుల చలనం, సూర్యుని చుట్టూ గ్రహాల చలనాన్ని పోలి ఉండడం వల్ల ఈ నమూనాను గ్రహమండల నమూనా అని కూడా పిలుస్తాం.
  5. ఈ నమూనా పరమాణు స్థిరత్వాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 8.
ఐసోటోపులు కలిగిన మూలక పరమాణు ద్రవ్యరాశిని ఎలా కనుక్కొంటాం?
జవాబు:

  1. ప్రకృతిలో చాలా మూలకాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఐసోటోపుల మిశ్రమంగా లభిస్తాయి.
  2. ప్రకృతిలో లభించే ఒక మూలక ఐసోటోపులో ప్రతి ఐసోటోపు కొంతశాతం కలిగి ఉంటుంది.
  3. ఒక మూలక ద్రవ్యరాశిని ఆ మూలక నమూనాలో ఉండే అన్ని పరమాణువుల సగటు పరమాణు ద్రవ్యరాశిగా తీసుకుంటాం.
  4. ఉదా : క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశిని లెక్కిద్దాం.
  5. క్లోరిన్ ప్రకృతిలో రెండు ఐసోటోపుల రూపంలో లభిస్తుంది. వాటి ద్రవ్యరాశి సంఖ్యలు వరుసగా 35, 37.
  6. ద్రవ్యరాశి 35గా గల క్లోరిన్ ఐసోటోపు ప్రకృతిలో 75%, ద్రవ్యరాశి 37 గల క్లోరిన్ ఐసోటోపు ప్రకృతిలో 25% లభిస్తుంది.

7. AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 8

∴ క్లోరిన్ సరాసరి పరమాణు ద్రవ్యరాశి = 35.5 ప్రమాణాలు.

ప్రశ్న 9.
రూథర్ఫ α – కణ పరిక్షేపణ ప్రయోగమును గూర్చి వివరింపుము. ఈ ప్రయోగం ద్వారా తెలిసిన అంశాలేవి?
జవాబు:
1909వ సంవత్సరంలో, పరమాణు నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికై రూథర్‌ఫర్డ్ α – కణ పరిక్షేపణ ప్రయోగాన్ని నిర్వహించాడు.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 9 AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 10

  1. నిర్దిష్టమైన శక్తి గల α – కణాలను నేరుగా పల్చని బంగారు రేకుపై పడేలా చేశాడు.
  2. పలుచని బంగారు రేకును పటంలో చూపినట్లు ఒక శోధకం మధ్యలో ఉంచారు. ఈ శోధకానికి α – కణం తాకగానే చిన్న మెరుపు వస్తుంది.
  3. మొత్తం అమరికను ఒక గాలి లేని గదిలో ఉంచాడు.
  4. α – కణాలలో విచలనం స్వల్పంగా ఉంటుందని రూథర్ ఫర్డ్ భావించాడు. కానీ ఏ α – కణంలో కూడా అధిక విక్షేపణాన్ని అతడు ఊహించలేదు.
  5. కానీ కొన్ని కణాలు కొద్ది విచలనం పొందడాన్ని కొన్ని కణాలు మాత్రం ఎక్కువ కోణాలతో విక్షేపణం చెందడం, అతి కొద్ది కణాలు మాత్రం వచ్చిన దారి వెంబడే పరావర్తనం చెందడం గమనించాడు.
  6. పై ఫలితాల ఆధారంగా కింది ప్రతిపాదనలు చేశాడు.
    1) ఆల్ఫా కణాలు వెళ్లిపోవడానికి కారణం పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉండడమే.
    2) పరమాణువులో మొత్తం ధనావేశం అతిచిన్న ప్రదేశంలో కేంద్రీకృతమై ఉండి ఉండాలి. దీనికే ‘కేంద్రకం’ అని పేరు పెట్టాడు.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

ప్రశ్న 10.
3517X నుండి నీవు గ్రహించిన సమాచారమేమిటి?
జవాబు:
1) ఇవ్వబడిన మూలకము యొక్క పరమాణు సంఖ్య : 17
2) ఇచ్చిన మూలకము క్లోరిన్ సంకేతం Cl
3) ప్రోటానుల సంఖ్య = 17
4) ద్రవ్యరాశి సంఖ్య = 35
5) న్యూట్రానుల సంఖ్య = 35 – 17 = 18
6) ఎలక్ట్రానుల సంఖ్య = 17
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 11
8) సంయోజకత -1
9) అష్టకంను పొందుటకు ఒక ఎలక్ట్రానును గ్రహిస్తుంది.

9th Class Physical Science 5th Lesson పరమాణువులో ఏముంది ? 1 Mark Bits Questions and Answers

1. జతపరచండి.

P) పరమాణు సంఖ్య (Z) S) ప్రోటాన్ల సంఖ్య
Q) ద్రవ్యరాశి సంఖ్య(A) T) A-Z
R) న్యూట్రాన్ల సంఖ్య (n) U) ప్రోటాన్ల సంఖ్య + న్యూట్రాన్ల సంఖ్య

A) P – U, Q – S, R – T
B) P – T, Q – S, R – U
C) P – S, Q – T, R – U
D) P – S, Q – U, R – V
జవాబు:
D) P – S, Q – U, R – V

2. బాహ్య (చిట్ట చివరి) కక్ష్యలో 8 ఎలక్ట్రానులను కలిగివుండే ధర్మమును ………. అంటారు.
A) పరమాణుకత
B) సంయోజకత
C) అష్టకము
D) జడత్వ స్వభావము
జవాబు:
C) అష్టకము

3. Na+ అయానులో గల బాహ్యతమ ఎలక్ట్రానుల సంఖ్య
A) 8
B) 1
C) 10
D) 2
జవాబు:
A) 8

4. నిత్యజీవితంలో అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి రాకుండా నివారింపబడవచ్చు.
A) క్యాన్సర్
B) గాయిటర్
C) ఎగ్జిమా (చర్మవ్యాధి)
D) అల్సర్
జవాబు:
B) గాయిటర్

5. గాయిటర్ : అయోడిన్ ఐసోటోప్ : : కేన్సర్ : ……………….
A) యురేనియం ఐసోటోప్
B) కార్బన్ ఐసోటోప్
C) కోబాల్ట్ ఐసోటోప్
D) క్లోరిన్ ఐసోటోప్
జవాబు:
C) కోబాల్ట్ ఐసోటోప్

6. రూథర్ ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ఉద్గారించబడిన కణాలు/కిరణాలు
A) బీటా కణాలు
B) గామా కణాలు
C) X-కిరణాలు
D) ఆల్ఫా కణాలు
జవాబు:
D) ఆల్ఫా కణాలు

7. ఆక్సిజన్లోని ఎలక్ట్రాన్ల అమరికను సూచించునది
A) 2, 2, 2
B) 2, 2, 4
C) 2, 2, 6
D) 2, 4, 2
జవాబు:
B) 2, 2, 4

8. ఏ నియమం ప్రకారం అత్యంత అంతర కక్ష్యలో రెండు ఎలక్ట్రాన్లకు మాత్రమే చోటు ఉంది?
A) బోర్
B) థామ్సన్
C) బోర్ – బ్యురీ
D) రూథర్ ఫర్డ్
జవాబు:
C) బోర్ – బ్యురీ

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

9. విద్యుత్ పరంగా పరమాణువు ….
A) ధనాత్మకం
B) ఋణాత్మకం
C) తటస్థం
D) చెప్పలేము
జవాబు:
C) తటస్థం

10. పరమాణువులోనున్న చిన్న, చిన్న కణాలను …………. అంటారు.
A) మూలకాలు
B) ప్రోటానులు
C) ఎలక్ట్రానులు
D) పరమాణు ఉపకణాలు
జవాబు:
D) పరమాణు ఉపకణాలు

11. పరమాణువులోనున్న ముఖ్యమైన ఉపకణాలు …….
A) ప్రోటానులు
B) న్యూట్రానులు
C) ఎలక్ట్రానులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

12. ఋణావేశ కణాలు ……..
A) ఎలక్ట్రానులు
B) ప్రోటానులు
C) న్యూట్రానులు
D) ఏదీ కాదు
జవాబు:
A) ఎలక్ట్రానులు

13. ధనావేశ కణాలు
A) ఎలక్ట్రానులు
B) ప్రోటానులు
C) న్యూట్రానులు
D) ఏదీ కాదు
జవాబు:
B) ప్రోటానులు

14. ఆవేశరహిత కణాలు ……
A) ఎలక్ట్రానులు
B) ప్రోటానులు
C) న్యూట్రానులు
D) ఏదీ కాదు
జవాబు:
C) న్యూట్రానులు

15. α – కణాల ఆవేశం ……..
A) ధనాత్మకం
B) ఋణాత్మకం
C) తటస్థం
D) ఆవేశం లేదు
జవాబు:
A) ధనాత్మకం

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

16. రూథర్ పరమాణు నమూనాని …… అంటారు.
A) ప్లమ్ పుడింగ్ నమూనా
B) కేంద్రక నమూనా
C) పుచ్చకాయ నమూనా
D) ధనాత్మక నమూనా
జవాబు:
B) కేంద్రక నమూనా

17. న్యూక్లియాన్లు అనగా ……
A) ప్రోటానులు, ఎలక్ట్రానులు
B) ఎలక్ట్రానులు, న్యూట్రానులు
C) ప్రోటానులు, న్యూట్రానులు
D) న్యూట్రానులు
జవాబు:
A) ప్రోటానులు, ఎలక్ట్రానులు

18. రూథర్ ఫర్డ్ నమూనా వివరించలేని విషయం
A) పరమాణువు ధనాత్మకత
B) పరమాణువు ఋణాత్మకత
C) పరమాణువు యొక్క తటస్థత
D) పరమాణు స్థిరత్వము
జవాబు:
A) పరమాణువు ధనాత్మకత

19. నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నది ……….
A) కర్పరం
B) కేంద్రకం
C) పరమాణువు బయట
D) కనిపెట్టలేము
జవాబు:
A) కర్పరం

20. పరమాణువులో ద్రవ్యరాశి అంతా ……… లో కేంద్రీకృతమై ఉంది.
A) ప్రోటానులు
B) ఎలక్ట్రానులు
C) న్యూట్రానులు
D) కేంద్రకం
జవాబు:
D) కేంద్రకం

21. n = 2 అనునది సూచించు కర్పరము ……………..
A) K
B) L
C) M
D) N
జవాబు:
B) L

22. ఒక కక్ష్యలో పట్టే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్యను సూచించు సూత్రం ………….
A) 2n
B) n²
C) 2n²
D) 2n³
జవాబు:
C) 2n²

23. N – కర్పరంలో ఉండదగు ఎలక్ట్రాన్ల సంఖ్య
A) 2
B) 32
C) 16
D) 18
జవాబు:
B) 32

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

24. సల్ఫర్ సంయోజకత …….
A) 2
B) 6
C) 2 మరియు 6
D) O2
జవాబు:
C) 2 మరియు 6

25. నియాన్ యొక్క సంయోజకత
A) 1
B) 3
C) 2
D) 0
జవాబు:
D) 0

26. Al27 లో న్యూట్రానుల సంఖ్య ……………
A) 14
B) 13
C) 27
D) 40
జవాబు:
A) 14

27. కేంద్రక కణాల మొత్తం సంఖ్యను …….. అంటారు.
A) పరమాణు సంఖ్య
B) ద్రవ్యరాశి సంఖ్య
C) న్యూట్రానుల సంఖ్య
D) ప్రోటానుల సంఖ్య
జవాబు:
B) ద్రవ్యరాశి సంఖ్య

28. గాయిటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోపు …….
A) అయొడిన్ ఐసోటోపు
B) యురేనియం ఐసోటోపు
C) కోబాల్ట్ ఐసోటోపు
D) హైడ్రోజన్ ఐసోటోపు
జవాబు:
A) అయొడిన్ ఐసోటోపు

29. కింద వాటిలో ఐసోటోపునకు ఉదాహరణ …….
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 12
జవాబు:
D

30. న్యూట్రాను ద్రవ్యరాశి దాదాపుగా దీనికి సమానము.
A) ప్రోటాను
B) ఎలక్ట్రాను
C) α – కణం
D) β – కణం
జవాబు:
A) ప్రోటాను

31. థామ్సన్ నమూనా ప్రకారం, పరమాణువు యొక్క ……….. అంతయూ ఏకరీతిలో పంపిణీ చేయబడి వుంటుంది.
A) పరిమాణం
B) సాంద్రత
C) పీడనం
D) ద్రవ్యరాశి
జవాబు:
D) ద్రవ్యరాశి

32. రూథర్ ఫర్డ్ α – కణ పరిక్షేపణ ప్రయోగంలో, α – కణాలను, …………. పై పడేలా చేశాడు.
A) అల్యూమినియం రేకు
B) సిల్వర్ రేకు
C) రాగి రేకు
D) బంగారు రేకు
జవాబు:
D) బంగారు రేకు

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

33. α – కణాలు వీటిని కల్గి వుండవు.
A) ఎలక్ట్రానులు
B) ప్రోటానులు
C) న్యూట్రానులు
D) ఏవీకావు
జవాబు:
A) ఎలక్ట్రానులు

34. ప్రవచనం – I : α కణాలు 2 ప్రోటానులను కల్గి వుంటాయి.
ప్రవచనం – II : α కణాలు 4 న్యూట్రానులను కలిగి వుంటాయి.
A) I, II లు సత్యా లు
B) I – సత్యం, II – అసత్యం
C) I – అసత్యం, II – సత్యం
D) I, II లు అసత్యాలు
జవాబు:
A) I, II లు సత్యా లు

35. బోర్ ప్రతిపాదన ప్రకారం ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ …………… లో తిరుగుతాయి.
A) కక్ష్య
B) కర్పరాలు
C) ఆర్బిటాలు
D) 1 మరియు 2
జవాబు:
D) 1 మరియు 2

36. n = 3 అనేది ……. కర్పరంను సూచించును.
A) K
B) L
C) M
D) N
జవాబు:
C) M

37. రూథర్ ఫర్డ్ ప్రతిపాదన ప్రకారం పరమాణు ద్రవ్యరాశి అంతా …………. లో ఉంటుంది.
A) కక్ష్య
B) కర్పరం
C) ఆర్బిటాల్
D) కేంద్రకం
జవాబు:
D) కేంద్రకం

38. ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయికి చేరుటకు శక్తిని ……….
A) గ్రహించును
B) విడుదల చేయును
C) కోల్పోవును
D) మార్పుండదు
జవాబు:
A) గ్రహించును

39. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయికి చేరుటకు శక్తిని ………..
A) గ్రహించును
B) విడుదల చేయును
C) కోల్పోవును
D) మార్పుండదు
జవాబు:
C) కోల్పోవును

40. బోర్ నమూనా ప్రకారం, ఎలక్ట్రానులు ………….. చుట్టూ తిరుగుతుంటాయి.
A) విభిన్న కక్ష్య
B) స్థిర కక్ష్య
C) అధిక శక్తి
D) A మరియు B.
జవాబు:
D) A మరియు B.

41. బోర్ నమూనా ………….. పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేకపోయింది.
A) హైడ్రోజన్
B) He+
C) Li2+
D) భార పరమాణువులు
జవాబు:
D) భార పరమాణువులు

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

42. ఎలక్ట్రానుల పంపిణీకై నియమాలు ప్రతిపాదించినది ………….
A) బోర్
B) రూథర్‌ఫర్డ్
C) బ్యురీ
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

43. M – కర్పరంలో ఉండదగు గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య …………..
A) 2
B) 8
C) 18
D) 32
జవాబు:
C) 18

44. ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ నిర్మాణ క్రమము …………………
A) 2, 4
B) 2, 6
C) 2, 8
D) 2, 8, 2
జవాబు:
B) 2, 6

45. పరమాణు బాహ్య కక్ష్యలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యను …………. అంటారు.
A) వేలన్సీ
B) జత
C) జతకాని
D) అన్యోన్య జత
జవాబు:
A) వేలన్సీ

46. ఏదేని పరమాణువు తన బాహ్య కక్ష్యలలో 8 ఎలక్ట్రాన్లను కలిగియుంటే ఆ పరమాణువును …………… పొందింది అంటాం.
A) ద్వి
B) అష్టకం
C) త్రికం
D) చతుర్ముఖం
జవాబు:
B) అష్టకం

47. బాహ్య కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు కలిగియున్న పరమాణువు రసాయనికంగా …………..
A) స్థిరము
B) అస్థిరము
C) రెండునూ
D) ఏదీకాదు
జవాబు:
A) స్థిరము

48. ఒక మూలక పరమాణువులు వేరొక పరమాణువులతో చర్యనొందినపుడు వాటి బాహ్యకక్ష్యలలో ………….. పొందే విధంగా సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.
A) ఏక
B) అష్టకం
C) త్రికం
D) చతుర్ముఖం
జవాబు:
B) అష్టకం

49. పరమాణువులు ………….. ద్వారా లేదా …….. ద్వారా అష్టకాన్ని పొందగలవు.
A) ఎలక్ట్రానుల బదిలీ, ఎలక్ట్రానులు పంచుకొనుట
B) ఎలక్ట్రానులను కోల్పోవుట, ఎలక్ట్రానులను తిరిగి పొందుట
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఎలక్ట్రానుల బదిలీ, ఎలక్ట్రానులు పంచుకొనుట

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

50. ఎలక్ట్రాన్ల బదిలీ లేదా ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల రెండు పరమాణువుల మధ్య …………………. ఏర్పడుతుంది.
A) ఆకర్షణ బలాలు
B) రసాయన బంధం
C) వికర్షణ బలం
D) A మరియు B
జవాబు:
B) రసాయన బంధం

51. పరమాణు కేంద్రకంలోని ప్రోటానుల సంఖ్యను ………….. అంటారు.
A) పరమాణు సంఖ్య
B) ద్రవ్యరాశి సంఖ్య
C) పరమాణు ద్రవ్యరాశి
D) పరమాణు ఘనపరిమాణము
జవాబు:
A) పరమాణు సంఖ్య

52. న్యూట్రానుల సంఖ్య N = …………
A) A – Z
B) A + Z
C) A × Z
D) A/Z
జవాబు:
A) A – Z

53. పరమాణువులోని కేంద్రక కణాల సంఖ్యను, ………… అంటారు.
A) పరమాణు సంఖ్య
B) ద్రవ్యరాశి సంఖ్య
C) పరమాణు ద్రవ్యరాశి
D) పరమాణు ఘనపరిమాణము
జవాబు:
B) ద్రవ్యరాశి సంఖ్య

54. పరమాణు సంఖ్యను …….. చే సూచిస్తారు.
A) A
B) Z
C) A – Z
D) A + Z
జవాబు:
B) Z

55. పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను ………. చే సూచిస్తారు.
A) Z
B) A – Z
C) A
D) A + Z
జవాబు:
A) Z

56. గరిష్ఠ సంఖ్యలో ఐసోటోపులను కలిగియున్న రెండు మూలకాలు ……….. మరియు ………..
A) జీనాన్, సీజియమ్
B) సోడియం, పొటాషియం
C) కాల్షియం, స్ట్రాన్షియం
D) బేరియం, రేడియం
జవాబు:
A) జీనాన్, సీజియమ్

57. యురేనియం ఐసోటోపును ………….. లో ఇంధనంగా వాడుతారు.
A) ఉష్ణ
B) హైడ్రో
C) పవన
D) న్యూక్లియర్ రియాక్టర్
జవాబు:
D) న్యూక్లియర్ రియాక్టర్

58. క్యాన్సర్ చికిత్స యందు ………….. ఐసోటోపును వాడుతారు.
A) ఐరన్
B) సోడియం
C) అయోడిన్
D) కోబాల్ట్
జవాబు:
D) కోబాల్ట్

59. 21H ను ………….. అంటారు.
A) హైడ్రోజన్
B) డ్యుటీరియం
C) ట్రీటియం
D) ఏదీకాదు
జవాబు:
B) డ్యుటీరియం

60. జీనాన్ మరియు సీజియంకు గల ఐసోటోపుల సంఖ్య …………..
A) 30
B) 32
C) 36
D) 40
జవాబు:
C) 36

61. కేంద్రకంలో ఉండనివి ……………
A) ప్రోటానులు
B) ఎలక్ట్రానులు
C) పాసిట్రాన్లు
D) న్యూట్రానులు
జవాబు:
B) ఎలక్ట్రానులు

62. నియాన్ ఎలక్ట్రాను విన్యాసం
A) 2
B) 2, 8
C) 2, 8, 8
D) 2, 8, 7
జవాబు:
B) 2, 8

63. జతపరచుము.

a) కార్బన్ 1) 2, 8, 8
b) ఆర్గాన్ 2) 2, 8, 7
c) క్లోరిన్ 3) 2
d) హీలియం 4) 2, 4

A) a → 4, b → 1, c → 2, d → 3
B) a → 3, b → 2, c → 1, d → 4
C) a → 2, b → 3, c → 4, d → 1
D) a → 1, b → 2, c → 3, d → 4
జవాబు:
A) a → 4, b → 1, c → 2, d → 3

64. జతపరుచుము.

a) ప్రోటాను i) e
b) ఎలక్ట్రాను 2) n°
c) న్యూట్రాను 3) P+

A) a → 2, b → 1, c → 3
B) a → 3, b → 1, c → 2
C) a → 1, b → 2, c → 3
D) a → 2, b → 3, c → 1
జవాబు:
B) a → 3, b → 1, c → 2

65. కింది వాటిలో సరికాని ప్రవచనము
A) ప్రోటాను ద్రవ్యరాశి, ఎలక్ట్రాను ద్రవ్యరాశి 1836 రెట్లు ఎక్కువగా ఉండును.
B) ప్రోటానును P గా వ్యక్తపరచవచ్చును.
C) ప్రోటాను, న్యూట్రానును వికర్షించును.
D) పరమాణువులో ఉప పరిమాణు కణము ప్రోటాను.
జవాబు:
B) ప్రోటానును P గా వ్యక్తపరచవచ్చును.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

66. వరమాణువులో ప్రోటానులు లేకపోతే జరిగే పరిణామాలు
A) అన్ని పరమాణువులు ఋణాత్మక ఆవేశాన్ని కల్గివుంటాయి.
B) అన్ని పరమాణువులు ధనాత్మక ఆవేశాన్ని కల్గివుంటాయి.
C) అన్ని పరమాణువులు తటస్థ ఆవేశాన్ని కల్గివుంటాయి.
D) పైవన్నియూ.
జవాబు:
A) అన్ని పరమాణువులు ఋణాత్మక ఆవేశాన్ని కల్గివుంటాయి.

67. ‘X’ అనునది ఒక ఉపపరమాణు కణమైన, దానికి ధనాత్మక లేక ఋణాత్మక ఆవేశమున్న, X-1 అనునది
A) ప్రోటాను
B) పాసిట్రాన్
C) ఎలక్ట్రాను
D) న్యూట్రాను
జవాబు:
D) న్యూట్రాను

68. ఒక α కణము ప్రోటానుకు దగ్గరగా వున్నట్లయితే, అది ప్రోటానును
A) ఆకర్షించును
B) వికర్షించును
C) మార్పుండదు
D) మొదట ఆకర్షించి, తర్వాత వికర్పించును
జవాబు:
B) వికర్షించును

69. ఎలక్ట్రాను కేంద్రకంలో పడదు ఎందుకనగా
A) ఎలక్ట్రానులు నిర్ధిష్ట కక్ష్యలో తిరుగుతున్నంతసేపు శక్తిని విడుదల చేయవు.
B) ఎలక్ట్రానులు నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్నంత సేపు శక్తిని విడుదల చేయును.
C) కేంద్రకము యొక్క పరిమాణము చాలా తక్కువ కనుక ఎలక్ట్రానును ఆకర్షించును.
D) A మరియు C
జవాబు:
A) ఎలక్ట్రానులు నిర్ధిష్ట కక్ష్యలో తిరుగుతున్నంతసేపు శక్తిని విడుదల చేయవు.

70. ఫ్లోరిన్ పరమాణువు యొక్క బాహ్య కక్ష్యలో 7 ఎలక్ట్రానులు కలవు కానీ దాని సంయోజకత 1. దీనికి తగిన కారణము గుర్తించుము.
A) ఇది బాహ్య కక్ష్య నుండి ‘6’ ఎలక్ట్రానులను కోల్పోవును.
B) ఇది వేలన్సీ కక్ష్య నుండి ఒకే ఒక ఎలక్ట్రానును కోల్పోవును.
C) ఇది ఒకే ఒక ఎలక్ట్రానును పొందును.
D) ఇది ఏడు ఎలక్ట్రానులను పొందును.
జవాబు:
B) ఇది వేలన్సీ కక్ష్య నుండి ఒకే ఒక ఎలక్ట్రానును కోల్పోవును.

71. విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలు చేస్తున్నపుడు పరమాణువులు ఋణావేశాన్ని పొందుతాయని ……….. కనుగొనెను.
A) డాల్టన్
B) మైఖేల్ ఫారడే
C) రూథర్‌ఫోర్డ్
D) బోర్
జవాబు:
B) మైఖేల్ ఫారడే

72. ఎలక్ట్రాను ద్రవ్యరాశి, ప్రోటాను ద్రవ్యరాశికి …………. రెట్లు.
A) 1200
B) 1836
C) 1830
D) 1870
జవాబు:
B) 1836

73. న్యూట్రానును కనుగొన్నవారు
A) జె.జె. థామ్సన్
B) రూథర్‌ఫోర్డు
C) గోల్డ్ స్టెయిన్
D) ఛాడ్విక్
జవాబు:
D) ఛాడ్విక్

74. ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటానులు ఉండి, వేరు వేరు న్యూట్రాన్ల సంఖ్య కలిగి ఉంటే వాటిని ……………… అంటారు.
A) ఐసోబారులు
B) ఐసోటోపులు
C) ఐసోటోనులు
D) ఐసోమర్లు
జవాబు:
B) ఐసోటోపులు

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

75. జతపరచుము.

a) పుచ్చకాయ నమూనా 1) గోల్డ్ స్టెయిన్
b) ప్రోటాను 2) జె.జె. థామ్సన్
c) సోడియం 3) 2, 8, 1

A) a → 3, b → 1, c → 2
B) a → 2, b → 1, c → 3
C) a → 1, b → 2, c → 3
D) a → 3, b → 2, c → 1
జవాబు:
B) a → 2, b → 1, c → 3

76.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 13
పట్టిక నుండి, కింది వాటిలో సరికానిది?
A) ఎలక్ట్రానుకు ఋణావేశము కలదు.
B) న్యూట్రానుకు ఆవేశము లేదు.
C) ప్రోటానుకు ఆవేశం మరియు ద్రవ్యరాశి కలదు.
D) ఎలక్ట్రాను ద్రవ్యరాశి చాలా స్వల్పము.
జవాబు:
B) న్యూట్రానుకు ఆవేశము లేదు.

77. రూథర్ఫో ర్డ్ : ………….. : : జె.జె.థామ్సన్ : పుచ్చకాయ నమూనా
A) గ్రహగమన నమూనా
B) కొబ్బరికాయ
C) α – కణం
D) ఓగ్ బ్యాంగ్
జవాబు:
A) గ్రహగమన నమూనా

78. పటంలో ……….. అధిక శక్తి గల కక్ష్య
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 14
A) K
B) L
C) M
D) అన్నీ సమానమే
జవాబు:
C) M

79.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 15
ఇవ్వబడిన కాలరేఖలో, చివరగా ఉపపరమాణు కణమును కనుగొన్నవారు?
A) ప్రోటాను
B) న్యూట్రాను
C) ఎలక్ట్రాను
D) కేంద్రకము
జవాబు:
B) న్యూట్రాను

80. ఇవ్వబడిన పరమాణువు
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 16
A) He
B) O
C) Ne
D) Ar
జవాబు:
C) Ne

81. ఇవ్వబడిన పరమాణువుల ఉమ్మడి ధర్మం
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 17
A) ఒకే సంఖ్యలో గల కర్పరాలు
B) ఒకే పరమాణు సంఖ్యలు
C) ఒకే వేలన్సీ
D) పైవన్నియూ
జవాబు:
C) ఒకే వేలన్సీ

82. ఇవ్వబడిన పటంలో ఎలక్ట్రానుల అమరిక క్రమం
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 18
A) 2, 6
B) 2, 4
C) 2, 2
D) 0, 8
జవాబు:
B) 2, 4

83.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 19
Ne లో బాహ్య కక్ష్య
A) K
B) L
C) M
D) N
జవాబు:
B) L

84. పై పటం నుండి ‘Ar’ యొక్క ప్రోటానుల సంఖ్య
A) 8
B) 16
C) 18
D) 10
జవాబు:
C) 18

85. పై పట్టికలో ‘Ar’ యొక్క సంయోజకత
A) 8
B) 2
C) 18
D) 71
జవాబు:
D) 71

86.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 20
కార్బన్ యొక్క సంకేతము
A) Ca
B) C
C) Cr
D) Cl
జవాబు:
B) C

87. పై పట్టిక నుండి హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 0
జవాబు:
A) 1

88. పై పట్టిక నుండి నియాను యొక్క ప్రోటానుల సంఖ్య
A) 5
B) 4
C) 6
D) 100
జవాబు:
D) 100

89. హైడ్రోజన్ యొక్క ఉపపరమాణు కణము కానిది?
A) ప్రోటాను
B) ఎలక్ట్రాను
C) న్యూట్రాను
D) ఏదీకాదు
జవాబు:
C) న్యూట్రాను

90. 146C, 136C, 126C లు దీనికి ఉదాహరణలు.
A) ఐసోటోపులు
B) ఐసోబారులు
C) ఐసోటోనులు
D) ఏదీకాదు
జవాబు:
A) ఐసోటోపులు

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

91. 146C లో, న్యూట్రానుల సంఖ్యలు ఎన్ని?
A) 6
B) 14
C) 8
D) 20
జవాబు:
C) 8

92. క్రింది పటంలోని ప్రయోగంను చేసినవారు
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 9
A) బోర్
B) థామ్సన్
C) రూథర్‌ఫోర్డ్
D) హూండ్
జవాబు:
C) రూథర్‌ఫోర్డ్

93. ఇవ్వబడిన పటంలోని భాగాలను సరిచేయుము.
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 21
A) 1 – ప్రోటాను, 2 – న్యూట్రాను, 3 – ఎలక్ట్రాను
B) 1 – న్యూట్రాను, 2 – ప్రోటాను, 3 – ఎలక్ట్రాను
C) 1 – ఎలక్ట్రాను, 2 – న్యూట్రాను, 3 – ప్రోటాను
D) 1 – ఎలక్ట్రాను, 2 – ప్రోటాను, 3 – న్యూట్రాను
జవాబు:
C) 1 – ఎలక్ట్రాను, 2 – న్యూట్రాను, 3 – ప్రోటాను

94. పటంలోని లోపము
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 22
A) K కక్ష్యలోని ఎలక్ట్రానుల సంఖ్య
B) కక్ష్యల సంఖ్య
C) కేంద్రకంకు ధనావేశము కలదు
D) ఎట్టి లోపము లేదు
జవాబు:
A) K కక్ష్యలోని ఎలక్ట్రానుల సంఖ్య

95. 4, 8, 8 ఎలక్ట్రానుల అమరికను చూపు నమూనా
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 23
జవాబు:
A

96. డాల్టన్ పరమాణు నమూనా బంగారురేకు
AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది 24
జవాబు:
B

97. ఈ కారణము చేత థామ్సన్ అభినందనించదగినవాడు
A) మొదటి పరమాణు
B) ఎలక్ట్రాను
C) ప్రోటాను
D) పైవన్నీ
జవాబు:
B) ఎలక్ట్రాను

98. ఈ కారణం చేత రూథర్‌ఫోర్డ్ అభినందనీయుడు
A) పరమాణులోని కేంద్రకము వలన
B) పరమాణువులో ఎక్కువ ఖాళీని గుర్తించుట వలన
C) కేంద్రకముకు ధనావేశముండుట వలన
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

99. గాయిటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోపు ……
A) అయొడిన్ ఐసోటోపు
B) యురేనియం ఐసోటోపు
C) కోబాల్ట్ ఐసోటోపు
D) హైడ్రోజన్ ఐసోటోపు
జవాబు:
A) అయొడిన్ ఐసోటోపు

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

100. కింది వాటిలో క్యాన్సర్ చికిత్సకు వాడు ఐసోటోపు …………………
A) అయోడిన్
B) సోడియమ్
C) కోబాల్ట్
D) ఏదీకాదు
జవాబు:
C) కోబాల్ట్

101. ఐసోటోపులను ఈ వ్యవస్థకు వాడరు
A) రసాయన మరియు వైద్య విచిత్రాలను సాధించుటకు
B) రసాయనిక చర్యల వెనుక గల సోపానాలను తెలుసుకొనుటకు
C) వైద్య పరీక్షలకు
D) విద్యుత్ ను ప్రసారం చేయుటకు
జవాబు:
D) విద్యుత్ ను ప్రసారం చేయుటకు

102. కార్బన్ డేటింగ్ కు సంబంధించినది
A) 146C
B) శిలాజాలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

103. 166O లలో గల న్యూట్రానుల సంఖ్య
A) 8
B) 16
C) 23
D) శూన్యము
జవాబు:
A) 8

104. సోడియం యొక్క సరైన ఎలక్ట్రాను విన్యాసం
A) 2, 8
B ) 8, 2, 1
C) 2, 1, 8
D) 2, 8, 1
జవాబు:
D) 2, 8, 1

105. 146C ఐసోటోపును దీనిని కనుగొనుటకు వాడతారు.
A) శిలాజాల వయస్సును తెలుసుకొనుటకు
B) జీన్స్ యొక్క స్వభావంను తెలుపుటకు
C) వైద్య పరీక్ష నిమిత్తం
D) పైవన్నియూ
జవాబు:
A) శిలాజాల వయస్సును తెలుసుకొనుటకు

మీకు తెలుసా?

భౌతికశాస్త్రంలో థామ్సన్ కి నోబెల్ బహుమతి రావడమే కాక, అతని కొడుకు జార్జ్ తో సహా అతని శిష్యులలో ఏడుగురికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అలాంటి థామ్సన్ శిష్యులలో ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్ ఒకరు.

AP 9th Class Physical Science Important Questions 5th Lesson పరమాణువులో ఏముంది ?

రూథర్ ఫర్డ్ ప్రయోగంలో బంగారు రేకు పైకి పంపిన α – కణాలలో సరాసరి ప్రతి 12000 ఆల్ఫా కణాలకి ఒక్క కణం మాత్రమే వెనుకకు మరలింది.

రెండు మూలకాలు గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు కలిగి ఉన్నట్లు గుర్తింపు పొందాయి. అవి జినాన్ (Xenon), సీజియం (Cesium). వీటి ఐసోటోపుల సంఖ్య 36.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

These AP 9th Physical Science Important Questions and Answers 4th Lesson పరమాణువులు-అణువులు will help students prepare well for the exams.

AP Board 9th Class Physical Science 4th Lesson Important Questions and Answers పరమాణువులు-అణువులు

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
“O2 మరియు లు భిన్నమైనవి” అని మోహన్ చెప్పాడు. నీవు అంగీకరిస్తావా? సమర్ధించుము?
జవాబు:
1) మోహన్ చెప్పినదానిని నేను అంగీకరిస్తాను.
‘O2‘ మరియు ‘0’ లు భిన్నమైనవి.

2) ‘O’ అనగా ఒకే ఒక్క ఆక్సిజన్ పరమాణువు (కార్బన్ మోనాక్సైడ్).
‘O2‘ అనగా ఒకే ఒక్క ఆక్సిజన్ అణువు (ఆక్సిజన్).

ప్రశ్న 2.
ఒక మూలకపు పరమాణుసంఖ్య Z = 6 అయితే ఆ మూలకము పేరు రాయండి.
జవాబు:
పరమాణు సంఖ్య (Z) = 6 అయిన మూలకం కార్బన్ (C).

ప్రశ్న 3.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణు సాంకేతికం రాయమని ఉపాధ్యాయుడు చెబితే, నమిత “0” గాను, రాజు “0” గాను రాసారు. నీవు ఎవరి జవాబును సమర్ధిస్తావు?
జవాబు:
నమిత రాసిన జవాబును సమర్ధిస్తాను.
“ఆక్సిజన్ అణుసాంకేతికం O2“.

ప్రశ్న 4.
2N మరియు N2 ల మధ్య భేదమేమి?
జవాబు:
2N అనగా రెండు నైట్రోజన్ పరమాణువులు. ఇది అస్థిరమైనది.
N2 అనగా ఒక నైట్రోజన్ అణువు. ఇది స్థిరమైనది.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 5.
‘హీలియం’ మూలకానికి ఆ పేరెలా వచ్చింది?
జవాబు:
మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సూర్యునిలో కనుగొనబడిన వాయువు కనుక ‘హీలియం’ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో ‘హీలియో’ అనగా సూర్యుడు అని అర్ధం.

ప్రశ్న 6.
అణువు అనగానేమి?
జవాబు:
స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్దంకు చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే అతి సూక్ష్మమైన కణాన్నే ‘అణువు’ అంటారు.

ప్రశ్న 7.
Na మూలకమా? సమ్మేళనమా? ఎందుకు?
జవాబు:
Na మూలకము. ఇది Na పరమాణువులచే (ఒకే రకమైన పరమాణువులతో) ఏర్పడినది.

ప్రశ్న 8.
O2 మూలకమా? సంయోగ పదార్థమా? ఎందుకు?
జవాబు:
సంయోగ పదార్థము. ఎందుకనగా O2 రెండు ఆక్సిజన్ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడింది.

ప్రశ్న 9.
అవగాడ్రో సంఖ్య అనగానేమి? దీని విలువ ఎంత?
జవాబు:
ఏ పదార్థంలోనైనా ఒక మోల్ లో ఉండే కణాల సంఖ్యను అవగాడ్రో సంఖ్య అంటారు. దీని విలువ 6.022 × 1023 ఈ విలువ ఎల్లప్పుడూ స్థిరం.

ప్రశ్న 10.
పరమాణు ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి ఆధునిక కాలంలో ఏ పరికరం వాడుతున్నారు?
జవాబు:
ద్రవ్యరాశి స్పెక్ట్రోమీటర్ (Mass Spectrometer).

ప్రశ్న 11.
రసాయనశాస్త్ర పిత అని ఎవరిని పిలుస్తారు? అతను చేసిన కృషి ఏమిటి?
జవాబు:

  1. ఆంటోని లెవోయిజర్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్తను ఆధునిక రసాయనశాస్త్ర పిత అని పిలుస్తారు.
  2. అతను రసాయనశాస్త్రంలో ఎంతో కృషి చేశాడు.
  3. ప్రధానమైన కృషి ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించుట.

ప్రశ్న 12.
ద్రవ్యనిత్యత్వ నియమమును నిర్వచించండి.
జవాబు:
ద్రవ్యనిత్యత్వ నియమము : ఒక రసాయనచర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేం, నాశనం చేయలేం.
(లేదా)
ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి, ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశికి సమానం.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 13.
స్థిరానుపాత నియమమును నిర్వచించండి.
జవాబు:
స్థిరానుపాత నియమము :
ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడు స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 14.
పరమాణుకతను నిర్వచించండి.
జవాబు:
పరమాణుకత :
ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యను ‘పరమాణుకత’ అంటారు.

ప్రశ్న 15.
సంయోజకతను నిర్వచించండి.
జవాబు:
సంయోజకత :
ఒక మూలక పరమాణువులు వేక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యంను ఆ మూలక పరమాణువు యొక్క ‘సంయోజకత’ అంటారు.

ప్రశ్న 16.
అయాన్లను నిర్వచించండి.
జవాబు:
అయాన్లు :
అయాన్లు ఒక ఆవేశపూరిత పరమాణువుగా గాని, ఫలిత ఆవేశం కలిగి ఉన్న పరమాణువుల గుంపుగా గాని ఉంటాయి.

ప్రశ్న 17.
పరమాణు ద్రవ్యరాశి అనగానేమి?
జవాబు:
ఒక మూలక పరమాణువు కార్బన్-12 యొక్క ద్రవ్యరాశిలో 1/12వ భాగం కంటె ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలక పరమాణువు యొక్క పరమాణు ద్రవ్యరాశి అంటారు.

ప్రశ్న 18.
అణువులు ఎట్లా ఏర్పడుతాయి?
జవాబు:
ఒకేరకమైన మూలక పరమాణువులుగాని, వేర్వేరు మూలక పరమాణువులుగాని సంయోగం చెంది ‘అణువులు ఏర్పడుతాయి.

ప్రశ్న 19.
అణుద్రవ్యరాశిని నిర్వచించండి.
జవాబు:
అణుద్రవ్యరాశి :
ఒక పదార్థం యొక్క అణుద్రవ్యరాశి, ఆ పదార్థపు అణువులోని అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తానికి సమానం.

ప్రశ్న 20.
ఫార్ములా యూనిట్ ను నిర్వచించండి.
జవాబు:
ఫార్ములా యూనిట్ :
ఒక అణువు యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఆ అణువు యొక్క ఫార్ములా యూనిట్ లోని పరమాణువుల లేదా అయాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానం.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 21.
మోలను నిర్వచించండి.
జవాబు:
మోల్ :
ఒక పదార్ధ పరమాణు ద్రవ్యరాశి లేదా అణు ద్రవ్యరాశికి సమానమైన పదార్థంలో ఎన్ని కణాలు (పరమాణువులు, అణువులు, అయాన్లు) ఉంటాయో తెలిపే సంఖ్యనే ‘మోల్’ అంటాం.

ప్రశ్న 22.
మోలార్ ద్రవ్యరాశిని నిర్వచించండి.
జవాబు:
మోలార్ ద్రవ్యరాశి : ఒక మోల్ పదార్ధ ద్రవ్యరాశిని గ్రాములలో వ్యక్తపరిస్తే దానిని మోలార్ ద్రవ్యరాశి అంటాం.

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కింది పట్టికను పూరింపుము.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 1
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 2

ప్రశ్న 2.
జాన్ డాల్టన్ పదార్థ స్వభావం గురించి చేసిన ప్రతిపాదనలు ఏమిటి?
జవాబు:
జాన్ డాల్టన్ పదార్థ స్వభావం గురించి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అవి :

  1. ద్రవ్యరాశి నిత్యత్వం జరగాలంటే తప్పనిసరిగా మూలకాలన్నీ చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉండాలి. ఆ చిన్న కణాలకు అతడు ‘పరమాణువు’ అని పేరు పెట్టాడు.
  2. స్థిరానుపాత నియమం పాటించాలంటే ఒక పదార్థంలో అన్ని కణాలు ఒకేలా ఉండాలి. లేకపోతే ఆ పదార్థం యొక్క ఉత్పన్నం ఒకేలా ఉండదు.

ప్రశ్న 3.
భారతీయ ఋషి ‘కణాదుడు’ ప్రకారం పరమాణువు అంటే ఏమిటి?
జవాబు:

  1. 2600 ఏళ్ళకు పూర్వమే ‘కణాదుడు’ అనే భారతీయ ఋషి చెప్పిన ‘వైశేషిక సూత్ర’ లో పరమాణువులకు చెందిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి.
  2. ఇతడు పదార్ధం యొక్క అన్ని రూపాలు “అణువు” లనే చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయని చెప్పాడు.
  3. ఈ అణువులే మరల పరమాణువులనే సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉన్నాయని ఇతడు ప్రతిపాదించాడు.

ప్రశ్న 4.
మూలకాలకు సంకేతాలు రాయడం వలన ఉపయోగమేమి?
జవాబు:

  1. రసాయనశాస్త్రంలో రకరకాల రసాయన చర్యలుంటాయని మనకు తెలుసు.
  2. ప్రతిసారి రసాయన చర్యలో పాల్గొనే మూలకాల, సమ్మేళనాల పూర్తి పేర్లు రాయడం వలన సమయం వృథా కావడమే కాక ఇబ్బందికరంగా కూడా వుంటుంది.
  3. ఆ సమస్యను అధిగమించుటకు మూలకాలను చిన్న గుర్తులతో సూచించుట ప్రారంభమైనది. ఈ గుర్తులనే సంకేతాలు అంటారు.

ప్రశ్న 5.
సంకేతాలు రాయడంలో గల నియమాలేవి?
జవాబు:
1. మూలక సంకేతాలలో 1 లేదా 2 ఇంగ్లీషు అక్షరాలు వుంటాయి.
ఉదా : H, He, N, Ca మొదలైనవి.

2. సంకేతంలోని మొదటి అక్షరం ఎల్లప్పుడూ పెద్ద అక్షరం (Upper case) గాను, రెండవ అక్షరం ఎల్లప్పుడు చిన్న అక్షరం (Lower case)గాను ఉంటుంది.
ఉదా : 1) AI, Cr, CI సరియైన పద్ధతి.
2) CL, DE, he సరియైన పద్ధతి కాదు.

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
పట్టికను పూర్తి చేయండి.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 3
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 4

ప్రశ్న 2.
క్రింది సమాచారాన్ని చదివి జవాబులు రాయండి.
ఒక అణువు ద్రవ్యరాశి అందలి వివిధ మూలక పరమాణువుల విడిద్రవ్యరాశుల మొత్తానికి సమానం.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 5
i) Na2CO3 అణుభారం కనుగొనండి.
జవాబు:
Na2CO3 అణుభారం = (23 × 2) + 12 + (16 × 3) = 46 + 12 + 48 = 106

ii) C మరియు 0లను కలిగియున్న ఒక అణువు యొక్క అణుభారం 44 అయిన ఆ అణుఫార్ములా తెల్పండి.
జవాబు:
అణువు యొక్క అణుభారం = 44
C పరమాణు భారం = 12
మిగిలిన అణుభారం = 44 – 12 = 32 = 16 × 2
= (ఆక్సిజన్ పరమాణు భారం × 2) ⇒ O2
కావున అణుఫార్ములా = CO2

iii) పరమాణు ద్రవ్యరాశిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
జవాబు:
పరమాణు ద్రవ్యరాశిని amu లలో కొలుస్తారు.
amu అనగా ‘పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం’ (Atomic Mass Unit).

iv) అణుభారం ఆధారంగా NaOH, H,0లలో ఏది భారమైనది?
జవాబు:
NaOH అణుభారం = 23 + 16 + 1 = 40
H2O అణుభారం = (1 × 2) + 16 = 18
NaOH అణుభారం > H2O అణుభారం
NaOH అణువు H2O అణువు కన్నా భారమైనది.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 3.
మూలకాలకు ఆ పేర్లు ఎలా పెట్టారు? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
1. మూలకాలకు వాటి ధర్మాలననుసరించి కొన్నిసార్లు పేర్లు పెట్టడం జరిగింది.
ఉదా :
a) లాటిన్ భాషలో “హైడ్రో” అనగా నీరు అని అర్థం. కావున ఆక్సిజన్తో చర్యపొంది నీటిని ఏర్పరిచే స్వభావమున్న పదార్థానికి హైడ్రోజన్ అని పేరు పెట్టారు.
b) లాటిన్ భాషలో ఆక్సి అంటే ఆమ్లం అని అర్థం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణమున్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టారు.

2. మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఉదా : సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు ‘హీలియం’ అని పేరు పెట్టారు. (గ్రీకు భాషలో ‘హీలియో’ అనగా సూర్యుడు)

3. శాస్త్రవేత్తల గౌరవార్థం కొన్ని మూలకాలను వారి పేర్లతో పిలిచేవారు.
ఉదా : ఐన్ స్టీనియం, రూథర్‌ఫోర్డియం, మెండలీవియం.

ప్రశ్న 4.
క్రిస్ – క్రాస్ పద్ధతిలో ఒక సంయోగ పదార్థానికి ఫార్ములా రాసే విధానాన్ని ఉదాహరణతో వివరించుము.
జవాబు:
క్రిస్ – క్రాస్ పద్ధతిలో సాంకేతికాలను రాయడానికి క్రింది సోపానాలు పాటించాలి.
ఉదా : సోడియం కార్బొనేట్ అణువుకు ఫార్ములా రాద్దాం.

సోపానం – 1 : అణువులో ఉండే పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలను పక్కపక్కనే రాయండి.
Na CO3

సోపానం – 2 : ఆ పరమాణువుల లేదా పరమాణు సమూహాల సంకేతాలకు పైన వాటి సంయోజకతలను రాయండి.
Na1 (CO3)2

సోపానం – 3 : వాటి సంయోజకతల కనీస నిష్పత్తిని పొందడానికి ఆ సంయోజకతలను వాటి గరిష్ఠ సామాన్య భాజకంతో భాగించండి.
Na1(CO3)2

సోపానం – 4 : సంయోజకతలను ఒకదానికొకటి పరస్పరం మార్పుచేసి అనుఘటకాలకు పాదాంకంగా రాయండి.
Na2 (CO3)1

సోపానం – 5 : ఏ అనుఘటకమైనా పాదాంకం 1ని పొందితే సాంకేతికాలను రాసేటప్పుడు 1 ని రాయనవసరం లేదు.
Na2CO3
∴ సోడియం కార్బొనేట్ సాంకేతికం Na,CO.

ప్రశ్న 5.
పరమాణు ద్రవ్యరాశిని అర్థం చేసుకోవడానికి ఒక ‘పై’ చిత్రాన్ని గీసి వివరించండి.
జవాబు:
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 6
వివరణ :

  1. పటంలోని వృత్తం కార్బన్ – 12 ద్రవ్యరాశిని సూచిస్తుందని భావించండి.
  2. ఈ వృత్తాన్ని 12 సమాన భాగాలుగా చేస్తే ఒక్కోభాగం కార్బన్ – 12 యొక్క \(\frac{1}{12}\) వ భాగం యొక్క ద్రవ్యరాశిని సూచిస్తుంది.

పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం :
కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశి సరిగ్గా \(\frac{1}{12}\)వ వంతును ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా నిర్వచిస్తారు.

పరమాణు ద్రవ్యరాశి :

ఒక మూలక పరమాణువు కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశిలో \(\frac{1}{12}\)వ భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే, ఆ మూలక పరమాణువు యొక్క పరమాణు ద్రవ్యరాశి అంటారు.

ప్రశ్న 6.
మోల్ భావనను ఒక పటం రూపంలో వివరించుము.
జవాబు:
మోల్ :

  1. ఒక పదార్ధ పరమాణు ద్రవ్యరాశి లేదా అణు ద్రవ్యరాశికి సమానమైన పదార్ధంలో ఎన్ని కణాలు (అణువులు, పరమాణువులు, అయానులు) ఉంటాయో తెలిపే సంఖ్యనే ‘మోల్’ అంటారు.
  2. ఏ పదార్థంలోనైనా ఒక మోల్ లో ఉండే కణాల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం. దీని విలువ 6.022 × 1023 దీనినే అవగాడ్రో సంఖ్య అంటారు.

కింది పటం ద్వారా మోల్ భావనను సులభంగా అవగతం చేసుకోవచ్చు.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 7

ప్రశ్న 7.
మొట్టమొదటగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన జాన్ డాల్టనను నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితమే శాస్త్ర, సాంకేతిక రంగాలని మనకు తెలుసు.
  2. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస, కొత్త విషయాలు కనుక్కోవాలనే తపనే ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారి తీసింది.
  3. అటువంటి నూతన ఆవిష్కరణే, డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణం.
  4. లెవోయిజర్ తెలిపిన ద్రవ్యనిత్యత్వ నియమం, ప్రొస్ట్ తెలిపిన స్థిరానుపాత నియమాల ఆధారంగా డాల్టన్ పరమాణు నిర్మాణాన్ని ప్రతిపాదించాడు.
  5. డాల్టన్ ప్రకారం పరమాణువు విభజింప వీలులేనిది.
  6. ఇది శాస్త్రవేత్తల ముందు అతి పెద్ద సవాలును విసిరి, నేడు మనకు తెలిసిన ఆధునిక పరమాణు నిర్మాణానికి దారి తీసింది.
  7. కావున పరమాణు నిర్మాణాన్ని ఆవిష్కరించడంలో డాల్టన్ కృషి అభినందనీయము.

ప్రశ్న 8.
వివిధ మూలకాలు, సంయోగ పదార్థాల సంకేతాలు / సాంకేతికాలు చదివిన తరువాత నీ స్పందన ఏమిటి?
జవాబు:

  1. రసాయన శాస్త్రం ఎక్కడో లేదు, మన వంటగదిలోనే ఉందన్న విషయాన్ని కింది తరగతులలో నేర్చుకున్నాను.
  2. కాని చాలా రసాయనాల (వంట సామగ్రి)ని వాటి వాటి సాధారణ పేర్లతో పిలిచేవాడిని.
  3. కాని సంకేతాలు / సాంకేతికాలు చదువుకున్న తరువాత, మన చుట్టూ ఉండే అనేక పదార్థాలను వాటి వాటి రసాయన పేర్లతో పిలవడం అలవాటయినది.
  4. ఉదా : సాధారణ ఉప్పును సోడియం క్లోరైడ్ (NaCI) అని, వంటసోడాను సోడియం బైకార్బోనేట్ (NaHCO3) అని మొదలగునవి.
  5. ఇది నాకెంతో ఉత్సాహాన్నిచ్చి మిగిలిన పదార్థాల రసాయన నామాలు, వాటి ఫార్ములాలు తెలుసుకోవాలనే కోరిక బలంగా నాటుకుంది.
  6. ఇది నా పై చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 9.
స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించడానికి దారితీసిన జోసెఫ్ ప్రొస్ట్ ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
జోసెఫ్ ప్రొస్ట్, కాపర్ కార్బోనేట్ యొక్క సహజ, కృత్రిమ నమూనాలను సేకరించి వాటి అనుఘటక మూలకాల యొక్క భారశాతాలను కనుగొన్నాడు. ఈ శాతాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

భారశాతాలు సహజ నమూనా కృత్రిమ నమూనా
కాపర్ 51.35 51.35
కార్బన్ 38.91 38.91
ఆక్సిజన్ 9.74 9.74
  1. పై పట్టిక ద్వారా నమూనా ఏ ప్రాంతం నుండి లేదా ఏ పద్దతిలో సేకరించబడిందో అనే దానిపై సంఘటన శాతాలు ఆధారపడవని గ్రహించాడు.
  2. పై ప్రయోగం ఆధారంగా ప్రొస్ట్ స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ నియమం ప్రకారం “ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడు స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది”.

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు 1 Mark Bits Questions and Answers

1. అవగాడ్రో స్థిరాంకం విలువ
A) 6, 022 × 10-19
B) 6.022 × 10-34
C) 6.022 × 1023
D) 6.022 × 1019
జవాబు:
C) 6.022 × 1023

2. హైడ్రోజన్ మోనాక్సైడ్ యొక్క సాధారణ నామము
A) నీరు
B) లవణము
C) బట్టలసోడా
D) వంటసోడా
జవాబు:
A) నీరు

3. నైట్రోజన్, హైడ్రోజన్ సంయోజకతలు వరుసగా 3, 1. అయితే వీటి కలయిక వల్ల ఏర్పడే అమ్మోనియా అణువు ఫార్ములా
A) NH3
B) NH4
C) N3H
D) N4H
జవాబు:
A) NH3

4. P : ఆక్సిజన్ పరమాణుకత 3
Q : ఓజోన్ సాంకేతికము O3
A) P – సత్యము, Q – అసత్యము
B) P – అసత్యము Q – సత్యము
C) P మరియు Q లు అసత్యము
D) P మరియు Qలు సత్యము
జవాబు:
D) P మరియు Qలు సత్యము

5. ద్రవ్య నిత్యత్వ నియమముపై చేయు ప్రయోగములో ముందుగా తీసుకునే ఒక జాగ్రత్త
A) పరీక్ష నాళిక బలికి పోకుండా చూడాలి.
B) పరీక్ష నాళిక ఒలికి పోయేట్లు చూడాలి.
C) శాంకవకుప్పెలో పరీక్ష నాళిక మునిగేట్లు చూడాలి.
D) పరీక్ష నాళిక శాంకవకుప్పె బయటవైపు ఉంచాలి.
జవాబు:
B) పరీక్ష నాళిక ఒలికి పోయేట్లు చూడాలి.

6. మనం ధరించే ఆభరణాలలో ఉండే లోహము ………
A) పాదరసం
B) సోడియం
C) కాల్షియం
D) బంగారం
జవాబు:
D) బంగారం

7. టంగ్స్టన్ మూలకపు లాటిన్ పేరు
A) ఆరం
B) ప్లంబం
C) కాలియం
D) వోల్ ఫ్రం
జవాబు:
D) వోల్ ఫ్రం

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

8. ఓజోన్ అణు ఫార్ములా ……….
A) O3
B) O2
C) O
D) O3
జవాబు:
A) O3

9. జతపరచండి.

i) సోడియం బై కార్పొనేట్ x) Na2CO3
ii) సోడియం కార్పొనేటు y) NaOH
iii)సోడియం హైడ్రాక్సైడ్ z) NaHCO3

A) i – y, ii – x, iii – z
B) i – z, ii – x, iii – y
C) i – y, ii – z, iii – x
D) i – z, ii – y, iii – x
జవాబు:
B) i – z, ii – x, iii – y

10. 18గ్రా|| నీటిలో H2 అణువుల సంఖ్య
A) 6.02 × 1022
B) 6.022 × 1023
C) 6.02 × 1032
D) 6.02 × 1033
జవాబు:
B) 6.022 × 1023

11. Mg యొక్క సంయోజకత ‘+2’ మరియు SO4 (సల్ఫేట్) యొక్క సంయోజకత ‘-2’ అయిన వీటితో ఏర్పడే అణు ఫార్ములా
A) Mg2SO4
B) Mg (SO4)2
C) MgSO4
D) Mg3(SO4)2
జవాబు:
C) MgSO4

12. కింది వానిలో సజాతీయ అణువు
A) H2O
B) N2
C) N2O3
D) FeSO4
జవాబు:
B) N2

13. ఒకేరకమైన పరమాణువులను కలిగి ఉన్న పదార్థంను …………………. అంటాం.
A) అణువు
B) మూలకం
C) సంయోగ పదార్ధం
D) పరమాణువు
జవాబు:
B) మూలకం

14. ఒకే రకమైన మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని ……….. అంటారు.
A) అణువు
B) మూలకం
C) సంయోగపదార్థం
D) పరమాణువు
జవాబు:
A) అణువు

15. వేర్వేరు మూలక పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని …………. అంటారు.
A) అణువు
B) మూలకం
C) సంయోగ పదార్థం
D) పరమాణువు
జవాబు:
C) సంయోగ పదార్థం

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

16. పొటాషియం సంకేతం …………
A) Pb
B) Na
C) Fe
D) K
జవాబు:
D) K

17. టంగ్ స్టన్ కు గల మరొక పేరు ……….
A) నేట్రియం
B) కాలియం
C) వోల్ ఫ్రం
D) క్యూప్రం
జవాబు:
C) వోల్ ఫ్రం

18. క్రింది వానిలో సరియైనది ……….
A) BE
B) he
C) al
D) Cr
జవాబు:
D) Cr

19. అష్టక పరమాణుక అణువునకు ఉదాహరణ
A) నైట్రోజన్
B) ఆక్సిజన్
C) కార్బన్
D) సల్ఫర్
జవాబు:
D) సల్ఫర్

20. సల్ఫేట్ యొక్క సంయోజకత …………
A) 2 –
B) 2 +
C) 3 –
D) 3 +
జవాబు:
A) 2 –

21. NH2Cl లో కాటయాన్ ……… .
A) Cl
B) NH4
C) NH4Cl
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

22. అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంకేతికం
A) Al2SO4
B) (Al2)2 (SO4)3
C) Al2 (SO4)3
D) Al SO4
జవాబు:
C) Al2 (SO4)3

23. H2SO4 యొక్క అణుద్రవ్యరాశి
A) 98 యూనిట్లు
B) 89 యూనిట్లు
C) 49 యూనిట్లు
D) 106 యూనిట్లు
జవాబు:
A) 98 యూనిట్లు

24. 1.5055 × 1023 అణువులు గల కాల్షియం అణువు యొక్క మోలార్ ద్రవ్యరాశి …………..
A) 20 గ్రా.
B) 40 గ్రా.
C) 10 గ్రా.
D) 30 గ్రా.
జవాబు:
C) 10 గ్రా.

25. “8 గ్రా. మెగ్నీషియం” మోల్లలో …………………
A) 0.3
B) 3
C) 2
D) 0.2
జవాబు:
A) 0.3

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

26. కింది వాటిలో అధిక సంఖ్యలో పరమాణువులను కలిగియున్న మూలకం …………
A) సల్ఫర్
B) కాల్షియం
C) నైట్రోజన్
D) కార్బన్
జవాబు:
D) కార్బన్

27. “ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము” దీనిని ………… అంటారు.
A) స్థిరానుపాత నియమం
B) బహుళానుపాత నియమం
C) ద్రవ్యనిత్యత్వ నియమం
D) శక్తి నిత్యత్వ నియమం
జవాబు:
C) ద్రవ్యనిత్యత్వ నియమం

28. డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు సిద్ధాంతమునకు ఆధారమైనది
A) ద్రవ్య నిత్యత్వ నియమం
B) సిరానుపాత నియమం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

29. డాల్టన్ ప్రకారం పరమాణువు ఒక ……….. కణము.
A) విభజించబడని
B) అతిచిన్న
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

30. పరమాణువు అనే పదం గ్రీకు పదమైన ‘atomio’ నుండి పుట్టింది. దీని అర్థం ………….
A) విభజించబడని
B) విభజించబడిన
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) విభజించబడని

31. ప్రతి పదార్థానికి …… పునాది అయినవి.
A) పరమాణువుల
B) అణువులు,
C) మూలకాలు
D) సమ్మేళనాలు
జవాబు:
A) పరమాణువుల

32. నీరు యొక్క లాటిన్ నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియోస్
D) ఏదీకాదు
జవాబు:
A) హైడ్రో

33. ఆమ్లము యొక్క లాటిన్ నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియోస్
D) ఏదీకాదు
జవాబు:
B) ఆక్సీ

34. బెరీలియం సంకేతం
A) Ba
B) Be
C) Br
D) B
జవాబు:
B) Be

35. నైట్రోజన్ సంకేతం
A) Ni
B) Na
C) N
D) NO
జవాబు:
C) N

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

36. Cl2 దీని యొక్క ఫార్ములా
A) క్లోరిన్
B) కాడ్మియం
C) క్రోమియం
D) కాల్షియం
జవాబు:
A) క్లోరిన్

37. బంగారం యొక్క సంకేతం
A) G
B) Ga
C) Ge
D) Au
జవాబు:
D) Au

38. సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా రక్షణ కవచంగా
A) O3
B) He
C) H2
D) Ne
జవాబు:
A) O3

39. ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యను ……………. అంటారు.
A) వేలన్సీ
B) పరమాణుకత
C) పరమాణు సంఖ్య
D) ద్రవ్యరాశి సంఖ్య
జవాబు:
B) పరమాణుకత

40. సోడియం యొక్క పరమాణుకత
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1

41. ఒక మూలక పరమాణువులు మరొక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యాన్ని ……………. అంటారు.
A) వేలన్నీ
B) పరమాణుకత
C) పరమాణు సంఖ్య
D) ద్రవ్యరాశి సంఖ్య
జవాబు:
A) వేలన్నీ

42. ఆర్గాన్ సంయోజకత
A) 0
B) 1
C) 2
D) 3
జవాబు:
A) 0

43. కార్బన్ సంయోజకత
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
D) 4

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

44. ధనావేశ అయాను ………… అంటారు.
A) రాడికల్
B) యానయాను
C) కాటయాన్
D) సంక్లిష్ట అయాను
జవాబు:
C) కాటయాన్

45. ఋణావేశ అయాను …….. అంటారు.
A) రాడికల్
B) యానయాను
C) కాటయాన్
D) సంక్లిష్ట అయాను
జవాబు:
B) యానయాను

46. NH4OH లో ఆనయాన్
A) OH
B) NH+4
C) NH+3
D) NH
జవాబు:
A) OH

47. …………….. పరమాణు ద్రవ్యరాశిని ప్రామాణికంగా తీసుకొని ఇతర పరమాణువుల ద్రవ్యరాశులను కొలిచారు.
A) కార్బన్ – 12
B) కార్బన్ – 14
C) ఆక్సిజన్ – 16
D) ఆక్సిజన్ – 18
జవాబు:
A) కార్బన్ – 12

48. ఒక మూలక పరమాణువు కార్బన్ – 12 యొక్క ద్రవ్యరాశిలో 1/12వ భాగం కంటె ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలక పరమాణువు యొక్క …………….. అంటారు.
A) వేలన్సీ
B) పరమాణుకత
C) పరమాణు ద్రవ్యరాశి
D) పరమాణు సంఖ్య
జవాబు:
C) పరమాణు ద్రవ్యరాశి

49. మెగ్నీషియం యొక్క పరమాణు ద్రవ్యరాశి
A) 8
B) 10
C) 12
D) 24
జవాబు:
D) 24

50. సిల్వర్ నైట్రేట్ ఫార్ములా పనిచేసే వాయువు
A) AgNO2
B) AgSO4
C) AgNO3
D) Ag(NO3)2
జవాబు:
C) AgNO3

51. సోడియం కార్బొనేట్ యొక్క ద్రవ్యరాశి ………. U
A) 108
B) 104
C) 110
D) 106
జవాబు:
D) 106

52. అవగ్రాడో సంఖ్య (NA) = ………..
A) 6.022 × 1020
B) 6.022 × 1021
C) 6.022 × 1022
D) 6.022 × 1023
జవాబు:
D) 6.022 × 1023

53. నీటి మోలార్ ద్రవ్యరాశి …………. U
A) 16
B) 18
C) 20
D) 22
జవాబు:
B) 18

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

54. 32 గ్రా. ఆక్సిజన్ అణువులో ఉండే కణాల సంఖ్య …………
A) 6.022 × 1020
B) 3.011 × 1023
C) 6.022 × 1022
D) 6.022 × 1023
జవాబు:
D) 6.022 × 1023

55. 22 గ్రా. కార్బన్‌డయాక్సైడ్ యొక్క మెలార్ సంఖ్య
A) 1
B) 0.25
C) 0.75
D) 0.50
జవాబు:
D) 0.50

56. Cu2Oలో కాపర్ సంయోజకత
A) +1
B) +2
C) +3
D) -1
జవాబు:
A) +1

57. 7.75 గ్రా. ఫాస్ఫరస్ ద్రవ్యరాశి ………
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 1.5055 × 1023
D) 6.022 × 1022
జవాబు:
C) 1.5055 × 1023

58. నైట్రోజన్ సంకేతం
A) NO3
B) NO2
C) N3-
D) N
జవాబు:
D) N

59. ప్రవచనం – I : క్లోరైడు అయాను సంకేతం Cl.
ప్రవచనం – II : అమ్మోనియం అయాను సంకేతం NH4+.
A) I, II లు సత్యాలు
B) I – సత్యం , II – అసత్యం
C) I – అసత్యం, II – సత్యం
D) I, II లు అసత్యాలు
జవాబు:
A) I, II లు సత్యాలు

60. సోడియం సంకేతం
A) Na
B) Na2+
C) Na3+
D) Na+
జవాబు:
D) Na+

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

61. జతపర్చుము.

a) కాల్షియం నైట్రేట్ i) HNO3
b) నైట్రికామ్లము ii) (NH4)3PO4
c) అమ్మోనియం క్లోరైడ్ iii) Ca(NO3)2
d) అమ్మోనియం ఫాస్ఫేట్ iv) NH4Cl

A) a – iii, b – i, c – iv, d – ii
B) a – i, b – ii, c – iii, d – iv
C) a – ii, b – iii, c – iv, d – i
D) a – iv, b – i, c – ii, d – iii
జవాబు:
A) a – iii, b – i, c – iv, d – ii

62. అమ్మోనియం కార్బొనేట్ ఫార్ములా
A) AlCO3
B) Al2CO3
C) Al2(CO3)3
D) Al(CO3)2
జవాబు:
C) Al2(CO3)3

63. జింక్ అయాను సంకేతం
A) Zn
B) Zn+
C) Zn2+
D) Zn3+
జవాబు:
C) Zn2+

64. కిందివాటిలో డాల్టన్ చే ఇవ్వబడని ప్రవచనము
ప్రవచనము (A) : ద్రవ్యం నిత్యత్వమైనట్లయితే తప్పనిసరిగా మూలకాలన్ని చిన్నచిన్న కణాలతో నిర్మితమై ఉండాలి.
ప్రవచనము (B) : స్ట్రానుపాత నియమం పాటించాలంటే ఒక పదార్థంలో అన్ని కణాలు ఒకేలా ఉండాలి.
A) A మాత్రమే
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) B మాత్రమే

65. ఎవరు సరైనవారు?
మనో : మూలకాలు పరమాణువులచే ఏర్పడతాయి.
సోహన్ : పరమాణువులు మూలకాలతో నిర్మితమవుతాయి.
A) మనో
B) సోహన్
C) ఇద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
A) మనో

66. పరికల్పన (A) : మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య 24
వివరణ (R) : మెగ్నీషియం, 1/12 వంతు కార్బన్ కన్నా మెగ్నీషియం పరమాణువు 24 రెట్లుండును.
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
C) A, Rలు అసత్యాలు
D) A సత్యం కాని R అసత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ

67. పరికల్పన (A): పరమాణు ద్రవ్యరాశికి ప్రమాణాలు లేవు.
వివరణ (R) : పరమాణు ద్రవ్యరాశి అనునది ఒక నిష్పత్తి యొక్క రూపము.
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
C) A, Rలు అసత్యాలు
D) A సత్యం కాని R అసత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ

68. ఒక ఇనుప కమ్మీ త్రుప్పు పట్టుట వలన ఐరన్ ఆక్సెడ్ గా మారినది. రెండు సందర్భాలలో వస్తువు యొక్క భారాలను ఊహించుము.
a = కమ్మీ యొక్క భారము, b = తుప్పు యొక్క భారము
A) a > b
B) b > a
C) a = b
D) చెప్పలేము
జవాబు:
C) a = b

69. ద్రవ్య నిత్యత్వ నియమమును నిరూపించు ప్రయోగంలో పరీక్ష నాళికలోని ‘Mg’ భారము, రిబ్బనును కాల్చిన తర్వాత ఏర్పడిన MgO భారముకు సమానం కాదని సోహన్ గమనించెను. దీనికి గల కారణములు గుర్తించుము.
A) కొన్ని రసాయనిక మార్పులకు ద్రవ్య నిత్యత్వ నియమాలు వర్తించవు.
B) ఈ ప్రయోగంలో కొంత వాయువు అదృశ్యమగును.
C) అతను భారమును కొలుచుటకు సాధారణ త్రాసును వాడెను.
D) పైవన్నియూ.
జవాబు:
B) ఈ ప్రయోగంలో కొంత వాయువు అదృశ్యమగును.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

70. CO : l : l ::  CO2 : ……….
A) 1: 1
B ) 2 : 1
C) 1 : 2
D) 2 : 3
జవాబు:
C) 1 : 2

71. నీటిలోని అణువులు H2O అయిన హైడ్రోజన్లోని అణువులు
A) H
B) H2
C) A లేక B
D) అణువులు లేవు
జవాబు:
B) H2

72. కాపర్ యొక్క సంకేతము Cu గా ఎందుకు తీసుకున్నారు?
A) కాపర్ లాటిన్ నామము క్యూప్రమ్ కనుక
B) కాపర్ యొక్క అసలు స్పెల్లింగ్ Cupper కనుక
C) అన్ని లోహాల యొక్క సంకేతాలలో రెండు అక్షరాలు మాత్రమే తీసుకుంటారు కనుక
D) పైవన్నియూ
జవాబు:
A) కాపర్ లాటిన్ నామము క్యూప్రమ్ కనుక

73. పరికల్పన (A) :
కార్బన్ సంకేతం ‘C’ అదేవిధంగా కాల్షియం యొక్క సంకేతం ‘Ca’
వివరణ (R) :
కార్బన్ మరియు కాల్షియంలకు ఒకే మొదటి Capital letter లు కలవు, ఆవర్తన పట్టికలో కార్బన్ మొదటగా వచ్చును. కనుక దాని సంకేతంను ‘C’ గా మరియు కాలియం సంకేతంను Ca గా తీసుకుంటారు.
A) A మరియు Rలు సత్యాలు
B) A మరియు Rలు అసత్యాలు
C) A సత్యం కాని R అసత్యం
D) A అసత్యం కాని R సత్యం
జవాబు:
A) A మరియు Rలు సత్యాలు

74. సాధారణంగా జడవాయువులైన He, Ne, Ar, Kr, Xe లు ఏక పరమాణు మూలకాలుగా దొరుకును. దీనికి కారణమును ఊహించుము.
A) అవి అధిక చర్యాశీలత కలవి
B) వాటి వేలన్సీ శూన్యము
C) వాటి వేలన్సీ రి కన్నా తక్కువ
D) అవి అస్థిరములు
జవాబు:
B) వాటి వేలన్సీ శూన్యము

75. ‘x-1‘ మరియు Na’x’ అయిన ‘X’ అనునది
A) కార్బన్
B) క్రోమియం
C) క్లోరిన్
D) కాపర్
జవాబు:
C) క్లోరిన్

76. MgO నందు Mg మరియు O ల వేలన్సీలు వరుసగా
A) 1, 1
B) 2, 2
C) 1, 2
D) 2, 1
జవాబు:
B) 2, 2

77. ‘X2 Y’, ‘X’ H ‘Y’, ‘X’ OH అయిన X మరియు Y లను ఊహించుము.
A) X = Na ; Y = OH
B) X = Na ; Y = CO3
C) X = CO3 ; Y =Zn
D) X = Zn ; Y = CO3
జవాబు:
B) X = Na ; Y = CO3

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

78. Ag+, Cl, Na+, OH లనుపయోగించి ఏర్పడు పదార్థాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 6
జవాబు:
C) 4

79. x అణువు యొక్క అణుభారము = 2 గ్రా||
y అణువు యొక్క అణుభారము = 32 గ్రా||
x²y అణువు యొక్క అణుభారము = 18 గ్రా|| అయిన
x మరియు y లను గుర్తించుము.
A) x = H2 ; y = O2
B) x = O2 ; y = H2
C) x = H2 ; y = Cl2
D) x = Cl2 ; y = H2
జవాబు:
A) x = H2 ; y = O2

80. 44 గ్రా|ల| నందు CO2 గల అణువుల సంఖ్య దీనికి సమానము.
A) 18 గ్రా||ల H2O నందు గల అణువుల సంఖ్య
B) 32 గ్రా||ల H2 నందు గల అణువుల సంఖ్య
C) 32 గ్రా||ల O2 నందు గల అణువుల సంఖ్య
D) పై వాటిలో ఏదో ఒకటి
జవాబు:
D) పై వాటిలో ఏదో ఒకటి

81. ద్రవ్య నిత్యత్వ నియమము నిరూపణలో భారము అనగా
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 8
A) లెడ్ నైట్రేటు యొక్క భారము
B) పొటాషియం అయోడైడ్ యొక్క భారము
C) లెడ్ ఆయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ల భారము
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

82. పై ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్త అంశము
A) క్కాను గట్టిగా ఉంచాలి.
B) అనుఘటకాలను ఖచ్చితంగా కొలువుము
C) భారము తీసుకొనేటప్పుడు పరికరాలను స్వేచ్ఛగా వదలాలి
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

83. ద్రవ్యరాశి నిత్యత్వ నియమమును ప్రతిపాదించినది.
A) ఆంటోని లెవోయిజర్
B) జోసెఫ్ ఎల్. ప్రొస్ట్
C) జాన్ డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
A) ఆంటోని లెవోయిజర్

84. ద్రవ్యనిత్యత్వ నియమమును ప్రయోగాత్మకంగా నిరూపించినది.
A) లెవోయిజర్
B) ప్రొస్ట్
C) డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
D) లాండాల్ట్

85. స్థిరానుపాత నియమమును ప్రతిపాదించినది.
A) లెవోయిజర్
B) ప్రొస్ట్
C) డాల్టన్
D) లాండాల్
జవాబు:
B) ప్రొస్ట్

86. ‘అణు’, ‘పరమాణు’ లను ప్రతిపాదించిన భారతీయ ఋషి ‘కణాదుని’ అసలు పేరు
A) వైశేషిక సూత్ర
B) ఋషి
C) కశ్యప
D) భాస్కర
జవాబు:
C) కశ్యప

87. మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం (Upper case)ను మూలక సంకేతంగా వాడాలని సూచించినది.
A) జాన్ డాల్టన్
B) లాండాల్ట్
C) జాన్ బెర్జీలియస్
D) ఆస్వాల్డ్
జవాబు:
C) జాన్ బెర్జీలియస్

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

88. ‘మోల్’ అనే పదాన్ని ముందుగా ప్రవేశపెట్టినవారు …………….
A) జాన్ బెర్జీలియస్
B) ఆస్వాల్డ్
C) డాల్టన్
D) అవగాడ్రో
జవాబు:
B) ఆస్వాల్డ్

89. 9 గ్రా. అల్యూమినియంలో ఉండే కణాల సంఖ్య ………………
A) 2.007 × 1023
B) 3.011 × 1023
C) 18.066 × 1023
D) 6.022 × 1023
జవాబు:
A) 2.007 × 1023

90. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు
A) లెవోయిజర్
B) బ్రెస్ట్
C) డాల్టన్
D) లాండాల్ట్
జవాబు:
A) లెవోయిజర్

91. సూర్యుని యొక్క గ్రీకు నామము
A) హైడ్రో
B) ఆక్సీ
C) హీలియస్
D) అటామియో
జవాబు:
C) హీలియస్

92. మెర్క్యురీ లాటిన్ నామము
A) ఆరమ్
B) కప్సమ్
C) కాలియం
D) హైడ్రా జీరమ్
జవాబు:
D) హైడ్రా జీరమ్

93.

భార శాతాలు సహజ నమూనా కృత్రిమ నమూనా
కాపర్ 51.35 51.35
కార్బన్ 9.74 9.74
ఆక్సిజన్ 38.91 38.9

పై పట్టిక దేని నిరూపణకు వినియోగించెదరు?
A) ద్రవ్య నిత్యత్వ నియమం
B) స్థిరానుపాత నియమం
C) శక్తి నిత్యత్వ నియమం
D) పైవన్నియూ
జవాబు:
B) స్థిరానుపాత నియమం

94.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 9
A) Ch
B) Ce
C) Cl
D) Chl
జవాబు:
C) Cl

95.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 10
వరుసగా X, Y, Z లు ……………
A) సోడియం, Ag, కాలియం
B) కాలియం, సోడియం, Ag
C) Ag, సోడియం, కాలియం
D) Ag, కాలియం, సోడియం
జవాబు:
A) సోడియం, Ag, కాలియం

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

96. ఇవ్వబడిన పదార్ధము నుండి O2, తప్పుగా వున్న ప్రవచనమును గుర్తించుము.
A) ఇది ఆక్సిజన్ యొక్క అణువు
B) దీనికి రెండు మూలకాలు కలవు
C) దీని యందు రెండు ఆక్సిజన్ పరమాణువులు కలవు
D) ఇది సమ్మేళనం కాదు
జవాబు:
B) దీనికి రెండు మూలకాలు కలవు

97.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 11
మెగ్నీషియం క్లోరైడు యొక్క ఫార్ములా
A) MgCl2
B) Mg2Cl
C) MgCl
D) Mg2Cl2
జవాబు:
A) MgCl2

98.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 12
ఏకీకృత నీటి అణువు
A) ‘a’
B) ‘b’
C) ‘a’ మరియు ‘b’
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

99. 2H2O దీనిని వినియోగించి, సరికాని ప్రవచనాన్ని గుర్తించుము.
A) నీటి అణువు యొక్క పరమాణుకత ‘6’
B) నీటి అణువు ‘3’ పరమాణువులను కల్గి ఉంటుంది
C) రెండు నీటి అణువులను తెలుపన్నునది
D) ఇది వ్యవస్థితం కాదు ఎందుకనగా అస్థిరమైనది కనుక
జవాబు:
A) నీటి అణువు యొక్క పరమాణుకత ‘6’

100.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 13
వరుసగా X, Y, Z లు …………….
A) O8, S3, ద్విపరమాణుకత
B) S8, C3, ఏకపరమాణుకత
C) S8, O3, ద్వాపరమాణుకత
D) S8, O3, ద్విపరమాణుకత
జవాబు:
C) S8, O3, ద్వాపరమాణుకత

101.
AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 14
వరుసగా a, b, c లు
A) NaCl, Na2NO3, MgOH
B) NaCl2, NaNO3, Mg(OH)2
C) NaCl, NaNO3, MgOH
D) NaCl, NaNO3, Mg(OH)2
జవాబు:
D) NaCl, NaNO3, Mg(OH)2

102. తుల్య అయాను ఆవేశపరముగా విభిన్నమైనదానిని గుర్తించుము.
A) హైడ్రోజన్, సోడియం, పొటాషియం
B) మెగ్నీషియం, కాల్షియం, జింక్
C) అల్యూమినియం, ఇనుము, సిల్వర్
D) అమ్మోనియం, కాపర్, సిల్వర్
జవాబు:
C) అల్యూమినియం, ఇనుము, సిల్వర్

103. ఆంటోని లెవోయిజర్ ను అభినందించదగిన విషయం
A) అతను ద్రవ్య నిత్యత్వ నియమంను ప్రతిపాదించెను కనుక
B) అతను ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడు కనుక
C) అతను స్థిరానుపాత నియమమును ప్రతిపాదించెను కనుక
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

104. పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితముగా కొలవదగిన
A) ద్రవ్య స్పెక్ట్రోమీటరు
B) కాంతి స్పెక్ట్రోమీటరు
C) విద్యుత్ త్రాసు
D) ఏదీకాదు
జవాబు:
A) ద్రవ్య స్పెక్ట్రోమీటరు

105. 16 గ్రా||ల ఆక్సిజన్లోని పరమాణు సంఖ్య
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 12.044 × 1023
D) ఏదీకాదు
జవాబు:
A) 6.022 × 1023

106. 44 గ్రా||ల CO2 18 గ్రా॥ల నీటితో కలిసి సోదానీటిలో ఉన్న, నీటిలో గల H2CO3 అణువుల సంఖ్య
A) 6.022 × 1023
B) 3.011 × 1023
C) 12.044 × 1023
D) ఏదీకాదు
జవాబు:
A) 6.022 × 1023

107. ఒక మోల్ ఏ పదార్థం నందైనా ఉండదగు అణువుల సంఖ్యను కనుగొన్నాడు కనుక అవగాడ్రోను అభినందించవచ్చును.
అయితే ఒక మోల్ పదార్థంలోని అణువుల సంఖ్య …………….
A) 6.2 × 1022
B) 6.4 × 1019
C) 6.02 × 1023
D) లెక్కించలేము.
జవాబు:
C) 6.02 × 1023

108. మోల్ భావనను కనుగొన్నవాడు
A) అవగాడ్రో
B) వోస్ట్ వాల్డ్
C) డాల్టన్
D) లెవోయిజర్
జవాబు:
B) వోస్ట్ వాల్డ్

109. “వాషింగ్ సోడా” సాధారణ నామము
A) Na2CO3
B) NaHCO3
C) Na2SO4
D) Na2PO4
జవాబు:
A) Na2CO3

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

110. జతపర్చుము.

a) రాగి i) ఆరమ్
b) పొటాషియమ్ ii) క్యూప్రమ్
c) బంగారం iii) కైలమ్ పరికరం
d) సిల్వర్ iv) అర్జెంటమ్

A) a – iii, b – iv, c – i, d – ii
B) a – ii, b – iii, c – i, d – iv
C) a – i, b – ii, c – iii, d – iv
D) a- iv, b – i, c – ii, d – iii
జవాబు:
B) a – ii, b – iii, c – i, d – iv

మీకు తెలుసా?

ద్రవ్య నిత్యత్వ నియమంను లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ దీనిని లాండాల్ట్ (Landolt) అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతో ప్రయోగం చేసి ఋజువు చేశాడు. ఆ ప్రయోగం గూర్చి మీ ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోండి.

ఆహార పదార్థాల ప్యాకింగ్ కు వాడే ఈ అల్యూమినియం పేపర్ చూడడానికి చాలా పలుచగా ఉన్నాసరే, దీనిలో వేల సంఖ్యలో పరమాణువులుంటాయి.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు 15
ఆంటోనీ లెవోయిజర్ (1743 – 1794) ప్రఖ్యాత ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త, రసాయన శాస్త్రంలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కొందరు ‘ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడు’ (Father of Modern Chemistry) అని పిలుస్తారు.

లెవోయిజర్ దహన చర్యలను గురించి విపులంగా అధ్యయనం చేశాడు. ఉదాహరణకు దహనచర్యలలో పాల్గొనే క్రియాజనకాలైన ఘనపదార్థాల భారాలను కొలవడమే కాకుండా వాయుపదార్థాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. దీని కొరకు చర్యలో వెలువడిన వాయు పదార్థాలు బయటికి పోకుండా ఉండేందుకు ప్రత్యేక పరికరాలను తయారు చేసాడు. ఈ ప్రయత్నాలే ద్రవ్యనిత్యత్వ నియమానికి దారి తీశాయి.

2600 ఏళ్ళకు పూర్వమే ‘కణాదుడు’ అనే భారతీయ ఋషి చెప్పిన ‘వైశేషిక సూత్ర’ లో పరమాణువులకు చెందిన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కణాదుడి అసలు పేరు కశ్యపుడు. తన కణసిద్ధాంతంతో ఇతడు కణాదుడుగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. పదార్ధం యొక్క అన్నిరూపాలు ‘అణువు’లనే చిన్న కణాలతో నిర్మితమై ఉన్నాయి. ఈ అణువులే మరలా పరమాణువులనే | సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉన్నాయని ఇతడు ప్రతిపాదించాడు.

పరమాణువు (atom) అనే పదము గ్రీకు పదమైన ‘a-tomio’ నుండి పుట్టింది. దీని అర్థం – ‘విభజించవీలులేనిది’ (indivisible).

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

హైడ్రోజన్, ఆక్సిజన్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

మూలకాలకు వాటి ధర్మాలననుసరించి కొన్నిసార్లు పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు లాటిన్ భాషలో ‘హైడ్రో’ (Hydro) అనగా ‘నీరు’ అని అర్ధం. కనుక ఆక్సిజన్‌ చర్యపొంది నీటిని ఏర్పరిచే స్వభావం ఉన్న మూలకానికి హైడ్రోజన్ అని పేరు పెట్టారు. అలాగే ఒకప్పుడు ప్రజలు ఆక్సిజన్తో చర్యపొందే అన్ని పదార్థాలు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటాయని నమ్మేవారు. లాటిన్ భాషలో ‘ఆక్సీ’ (Oxy) అంటే ‘ఆమ్లం’ (Acid) అని అర్ధం. కాబట్టి ఆమ్లాన్ని ఏర్పరిచే గుణం ఉన్న ఈ వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆమ్ల లక్షణానికి, ఆక్సిజనకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. అయితే అప్పటికే ఈ మూలకానికి ఆ పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆ పేరును మార్పు చేయలేదు.

మూలకాలకు పేర్లు పెట్టడంలో అవి లభించే ప్రదేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఉదాహరణకు సూర్యునిలో కనుగొనబడిన వాయువుకు హీలియం (Helium) అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో ‘హీలియో’ (Helio) అనగా ‘సూర్యుడు’ అని అర్థం. పొలోనియం, కాలిఫోర్నియంలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీరు ఊహించగలరా ? శాస్త్రవేత్తల గౌరవార్థం కొన్ని మూలకాలను వారి పేర్లతో పిలిచారు. ఉదాహరణకు ఐన్ స్టీనియం, రూథర్‌ఫోర్డియం, మెండలీవియం, ఫెర్మియం మొదలగునవి.

మోల్ అనే పదంను ,విల్ హెల్త్ ఆస్వాల్డ్ (Wilhelm Ostwald) లాటిన్ పదమైన ‘Moles’ నుండి తీసుకున్నాడు. దీని | అర్థం కుప్ప (Heap or Pile). అనగా ఒక మోల్ పదార్థాన్ని పరమాణువులు లేదా అణువుల కుప్పగా భావించవచ్చు.

ఒక నమూనా (Sample) లోని పరమాణువుల లేదా అణువుల కుప్పను తెల్పడానికి ఉపయోగించే పెద్ద సంఖ్యకు మోల్ అనే ప్రమాణంను వాడాలని 1967లో నిర్ణయించారు.

జాన్ బెర్జీలియస్ (John Berzelius) మూలకం యొక్క పేరును సూచించే ఇంగ్లీషు పదంలోని మొదటి పెద్ద అక్షరం (Upper case)ను మూలక సంకేతంగా వాడాలని సూచించాడు. ఉదాహరణకు ఆక్సిజనకు ‘O’, హైడ్రోజను ‘H’ ను సంకేతంగా వాడవచ్చు.

AP 9th Class Physical Science Important Questions 4th Lesson పరమాణువులు-అణువులు

మూలకాల పరమాణు భారాలను నిర్ణయించడానికి డాల్టన్ మొదట హైడ్రోజన్ పరమాణు భారాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. శాస్త్రవేత్తలు ఎన్నో పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను గురించి అన్వేషించారు. అయితే ముందుగా ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఆక్సిజన్ పరమాణువు యొక్క ద్రవ్యరాశిలో 1/16 వంతును ప్రమాణంగా తీసుకున్నారు. ఇలా ఆక్సిజన్ ద్రవ్యరాశిని ప్రమాణికంగా తీసుకోవడానికి రెండు కారణాలున్నాయి.

  • ఆక్సిజన్ ఎక్కువ రకాల మూలకాలతో చర్య పొంది సమ్మేళనాలను ఏర్పరచడం.
  • ఈ ద్రవ్యరాశి ప్రమాణం ఎన్నో మూలక ద్రవ్యరాశులను చెప్పడానికి వీలుగా ఉండడం.

19వ శతాబ్దంలో పరమాణు ద్రవ్యరాశుల్ని కనుగొనడానికి ఎలాంటి వసతులు (facilities) లేవు. అందుకే రసాయన శాస్త్రవేత్తలు ఈ విలువలను ప్రయోగాల ద్వారా సాపేక్షంగా నిర్ధారించారు. ఈ రోజుల్లో పరమాణువుల ద్రవ్యరాశిని చాలా కచ్చితంగా కనుగొనడానికి ద్రవ్యరాశీ స్పెక్ట్రోమీటర్ (mass spectrometer) వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు.