Students can go through AP Board 10th Class Biology Notes 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ
→ శ్వాసక్రియలో మనం పీల్చిన గాలి ఊపిరితిత్తులలోకి, అక్కడ నుండి వాయుగోణులలోకి చేరుతుంది. తిరిగి అదే మార్గంలో వెలుపలికి వస్తుంది.
→ గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నింటిని కలిపి “శ్వాసక్రియ” అంటారు.
→ విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని “లేవోయిజర్” కనుగొన్నాడు.
→ పీల్చిన గాలి నాశికారంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళికలు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, వాయుగోణులకు అక్కడ నుండి రక్తంలోకి చేరుతుంది. అదే మార్గంలో (CO2) వెనుకకు ప్రయాణిస్తుంది.
→ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి అతిచిన్న సంచులవంటి వాటితో జరుగుతుంది.
→ దిగువ భాగంలో ఉండే కండర నిర్మితమైన పొరను “విభాజక పటలం” అంటారు.
→ ఉచ్ఛ్వాసంలో విభాజక పటలం సంకోచించగా “విభాగ పటలం” విశ్రాంతి స్థితికి వస్తుంది.
→ పీల్చేగాలి నాశికాకుహరంలో, వాయునాళంలో వడపోయబడుతుంది.
→ ముక్కురంధ్రాలలోని తేమ, వెంట్రుకలు దుమ్ముకణాలను లోపలికి పోకుండా ఆపివేస్తాయి.
→ ఎపిగ్లాటిస్ ఒక కండరయుతమైన మూత వంటి నిర్మాణం. ఇది గాలిని ఆహారాన్ని తమ మార్గంలో వెళ్ళేందుకు వీలుగా కదులుతుంది.
→ స్వరపేటికలో ఉండే స్వరరంధ్రాలు ఊపిరితిత్తుల నుండి వెలుపలికి వచ్చే గాలికి కంపిస్తాయి. తద్వారా మనం మాట్లాడడం, పాటలు పాడడం చేయగలుగుతున్నాం.
→ శ్వాసనాళం వాయునాళంగానూ అది చిన్నచిన్న వాయుగోణులుగానూ విడిపోతుంది.
→ అతి చిన్నపరిమాణంలో ఉండే వాయుగోణుల నుండి రక్తనాళాలలోని రక్తంలోనికి వాయు వినిమయం జరుగుతుంది.
→ వాయుసహిత శ్వాసక్రియలో అధిక పరిమాణంలో శక్తి విడుదలకావడంతోపాటు నీరు, కార్బన్ డై ఆక్సైడ్ వెలువడతాయి.
→ తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేనపుడు శక్తి విడుదల చేయడానికి అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం జరుగుతుంది.
→ గ్లూకోజ్ కు మంట అంటుకుంటే ఆర్పలేము కానీ కణజాలాలు ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ ను తగినంతగా మండించి నియంత్రిస్తాయి.
→ నీరు మంటను ఆర్పేస్తుంది. కాని కణాలలో చాలా ఎక్కువ నీరు ఉన్నప్పటికీ శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది.
→ కిరణజన్యసంయోగక్రియ, శ్వాసక్రియ వ్యతిరేకమైనవిగా కనిపించినప్పటికీ జీవక్రియలను నిర్వర్తించడానికి కావలసిన అనేక జీవరసాయన చర్యలు రెండింటిలోనూ జరుగుతాయి.
→ మొక్కలలో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు, స్టార్చ్ మొదలైన పిండిపదార్థాలు క్లోరోప్లాస్లో జరిగే కిరణజన్యసంయోగక్రియలో ఏర్పడతాయి.
→ కణశ్వాసక్రియలలో మైటోకాండ్రియాలన్నింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు దహనం చెంది రసాయనిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది జీవక్రియలు నిర్వర్తిస్తుంది.
→ ఆక్సిజన్ రహిత పరిస్థితులలో జరిగే శ్వాసక్రియను “అవాయు శ్వాసక్రియ” అంటారు.
→ అవాయు శ్వాసక్రియ ప్రాథమిక జీవులలోనూ, కండరాలలోనూ జరుగుతుంది.
→ శ్వాసక్రియ కొరకు జీవులలో రకరకాల శ్వాస అవయవాలు ఉంటాయి. వీటిని “శ్వాసేంద్రియాలు” అంటారు.
→ మొప్పలు జలచరజీవులలోనూ, వాయునాళాలు కీటకాలలోనూ, చర్మం కొన్ని అనిలేడా జీవులలోనూ, ఊపిరితిత్తులు భూచర జీవులలోనూ శ్వాస అవయవాలు.
→ మొక్కల శ్వాసక్రియకు పత్రరంధ్రాలు, లెంటి సెల్స్, శ్వాసవేర్లు తోడ్పడతాయి.
→ వాయు శ్వాసక్రియ : ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను “వాయు శ్వాసక్రియ” అంటారు. ఈ ప్రక్రియలో అధిక శక్తి వెలువడుతుంది. ఉన్నతస్థాయి జీవులలో జరుగుతుంది.
→ అవాయు శ్వాసక్రియ : ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను “అవాయు శ్వాసక్రియ” అంటారు.
→ వాయుగోణులు : ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. ఊపిరితిత్తుల లోపల త్వచాలు ముడతలుపడుట వలన ఏర్పడే గుండ్రటి నిర్మాణాలు.
→ గ్రసని : ఆహార, శ్వాస మార్గాల కూడలి. గొంతు ప్రాంతంలో ఉంటుంది.
→ శ్వాసనాళం : మానవునిలో వాయునాళాన్ని “శ్వాసనాళం” అని అంటారు. ఇది పొడవు ‘C’ ఆకారపు మృదులాస్థి ఉంగరాలలో నిర్మితమై ఉంటుంది.
→ శ్వాసనాళిక : మానవ ఉర:కుహారంలో శ్వాసనాళం రెండు చిన్న నాళాలుగా చీలిపోతుంది దీనిని “శ్వాసనాళిక” అంటారు
→ ఉపజిహ్విక : కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణం. శ్వాసమార్గంలో ఆహారం ప్రసరించకుండా నిరోధిస్తుంది.
→ నిర్మాణక్రియ : చిన్న అణువులు కలిసి పెద్ద అణువులుగా రూపొందే జీవక్రియలను “నిర్మాణక్రియలు” అంటారు.
ఉదా : కిరణజన్యసంయోగక్రియ
→ విచ్ఛిన్నక్రియ : పెద్ద అణువులు విచ్ఛిన్నం చెంది, చిన్న అణువులుగా రూపొందించే జీవక్రియను “విచ్ఛిన్నక్రియ” అంటారు.
ఉదా : శ్వాసక్రియ
→ వాయుగత వేర్లు : మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కొరకు ప్రత్యేకీకరణ చెందిన వేర్లు.
→ లెంటిసెల్స్ : వాయు వినిమయానికి తోడ్పడే కాండం మీద ఉండే రంధ్రాలు.
→ కిణ్వనం : అవాయు శ్వాసక్రియలోని రెండవదశ. దీనినే పులియుట అంటారు. ఈ ప్రక్రియలో ఆల్కహాలు ఏర్పడుతుంది.
→ ఎనర్జీ కరెన్సీ : “ఎనర్జీ కరెన్సీ” అంటే ATP. ఈ ఎడినోసిన్ టై ఫాస్ఫేట్ కణస్థాయిలో శక్తి స్వరూపం.
→ మైటోకాండ్రియా : శ్వాసక్రియకు తోడ్పడే కణాంగము. దీనిని కణశక్త్యాగారము అని కూడా అంటారు.
→ జీవక్రియలు : కణాలలో జరిగే జీవ రసాయనిక చర్యలను “జీవక్రియలు” అంటారు.
ఉదా : శ్వా సక్రియ
→ ఆస్యగ్రసని కుహరం : కప్పలో నాసికా కుహరాలు ఆస్యకుహరంలోనే తెరచుకొంటాయి. దీనిని “ఆస్యగ్రసని కుహరం” అంటారు.
→ చర్మీయ శ్వాసక్రియ : చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను “చర్మీయ శ్వాసక్రియ” అంటారు.
ఉదా : కప్ప
→ మొప్పల శ్వాసక్రియ : చేపలలో శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. దీనిని “మొప్పల శ్వాసక్రియ” అంటారు.
→ అంశిక స్వేదనం : బాష్పీభవన స్థానాల ఆధారంగా పదార్థాలను వేరుచేయు ప్రక్రియ. మొలాసిస్ నుండి ఆల్కహాల్ ను ఈ ప్రక్రియ ద్వారానే వేరుచేస్తారు.
→ ఆక్సిజన్ లోటు : అధిక శ్రమ చేసినపుడు కండరాలలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీనినే “ఆక్సిజన్ లోటు” అంటారు.
→ ATP : ఎడినోసిన్ టై ఫాస్ఫేట్ కణస్థాయిలో శక్తి స్వరూపం. దీనినే “ఎనర్జీ కరెన్సీ” అంటారు.
→ కణశ్వాసక్రియ : కణస్థాయిలో జరిగే శ్వాసక్రియను “కణశ్వాసక్రియ” అంటారు.
→ శ్వాసక్రియ : ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించి శక్తిని వెలువరించే ప్రక్రియను “శ్వాసక్రియ” అంటారు. ఇది ఒక ముఖ్యమైన జీవక్రియ.