Students can go through AP Board 10th Class Biology Notes 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ
→ శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరుచేసి ఆ బయటకు పంపడాన్ని “విసర్జన” అంటారు.
→ మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి.
→ ప్రతి మూత్రపిండం సుమారు 1.3-1.8 మిలియన్ల మూత్రనాళికలు (Nephrons) కలిగి ఉంటుంది. మూత్రనాళికలు మూత్రపిండాల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు.
→ మూత్రనాళికలో బొమన్ గుళిక, రక్తకేశనాళికాగుచ్ఛం, సమీపస్థ సంవళితనాళం, హెస్లీశిక్యం, దూరస్థ సంవళితనాళం మరియు సంగ్రహణనాళం ఉంటాయి.
→ మూత్రం ఏర్పడడంలో నాలుగు దశలున్నాయి. 1) గుచ్ఛగాలనం 2) వరణాత్మక పునఃశోషణం 3) నాళికాస్రావం 4) అతిగాఢత గల మూత్రం ఏర్పడడం.
→ మన శరీరం నుండి మూత్రపిండాలు నత్రజని వ్యర్థాలను తీసివేస్తాయి. నీటి సమతాస్థితిని నెలకొల్పుతాయి. లవణగాఢత, pH మరియు రక్తపీడనాన్ని క్రమబద్ధీకరిస్తాయి.
→ డయాలసిస్ యంత్రం ఒక తాత్కాలిక మూత్రపిండం. ఇది శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తుంది. రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని వ్యక్తులలో మూత్రపిండాల మార్పిడి చేయాలి.
→ వేరువేరు జంతువులలో విసర్జకావయవాలు వేరువేరుగా ఉంటాయి. ఉదా : అమీబా – సంకోచరిక్తిక, ప్లాటి హెల్మింథిస్ – జ్వాలాకణాలు, అనిలెడా – వృక్కాలు, ఆర్థోపొడ – మాల్ఫీజియన్ నాళికలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు – మూత్రపిండాలు.
→ మొక్కల్లో ప్రత్యేక విసర్జకావయవాలు లేవు. మొక్కలు ఆకుల్లో, బెరడులో, పండ్లలో, విత్తనాల్లో వ్యర్థాలను నిల్వచేసి, పక్వానికి వచ్చాక మొక్కల నుండి విడిపోతాయి.
→ మొక్కల్లో జీవక్రియా ఉత్పన్నాలు రెండు రకాలు.
1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు. ఉదా : ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు,
2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు. ఉదా : ఆల్కలాయిడ్లు, జిగుర్లు, టానిన్లు, లేటెక్స్ మరియు రెసిన్లు. ఇవి ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
→ జీవుల నుండి వ్యర్థాలను తొలగించడాన్ని, విసర్జన పదార్థాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలటాన్ని ‘స్రావం’ (Secretion) అంటారు.
→ మొక్కలు వేరువేరు భాగాలలో ఆల్కలాయిడ్లను నిల్వ చేసుకొంటాయి. ఇవి నత్రజని సంబంధిత ఉప ఉత్పన్నాలు.
→ టానిన్లను ప్రధానంగా తోళ్ళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఇవి తంగేడు, కరక్కాయ చెట్ల నుండి లభిస్తాయి.
→ పైనస్ చెట్ల నుండి రెసిన్లు లభిస్తాయి. వీటిని వార్నిష్ తయారీలో ఉపయోగిస్తారు.
→ హీవియా బ్రెజీలియన్సిస్ (రబ్బరు మొక్క) మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు.
→ మన శరీరంలో లాలాజలం, హార్మోన్లు, ఎంజైమ్ లను స్రావాలుగా పరిగణిస్తారు.
→ కృత్రిమ మూత్రపిండాన్ని డయాలసిస్ అంటారు.
→ మూత్రపిండాలు పనిచేయని వారికి శాశ్వత పరిష్కారంగా మూత్రపిండ మార్పిడి నిర్వహిస్తారు.
→ క్రియాటినిన్ : రక్తం మరియు మూత్రంలో ఉండే ప్రోటీన్ పదార్థం.
→ నాళద్రవం : కణజాలంలో ఉన్న ద్రవాన్ని నాళద్రవం అంటారు.
→ బాహ్య రక్తకేశనాళికా వల : నెఫ్రాన్లో హెన్లీశక్యాన్ని ఆవరించి ఉన్న రక్తకేశనాళికా వల.
→ పోడోసైట్ : బొమన్ గుళికలోని ఉపకళా కణజాలంలోని కణాలు. ఇవి రంధ్రాలను కలిగిన పొరవలె అమరి ఉంటాయి.
→ రక్తకేశ నాళికాగుచ్చం : బొమన్ గుళికలో అభివాహి ధమని అనేక శాఖలుగా చీలి ఏర్పడ్డ నిర్మాణం. రక్తాన్ని వడపోస్తుంది.
→ సమీపస్థ సంవళిత నాళం : బొమన్ గుళిక పరభాగం మెలితిరిగి ఉంటుంది. పునఃశోషణ దాని ప్రధాన విధి.
→ దూరస్థ సంవళిత నాళం : హెన్లీశిక్యం యొక్క పరభాగం. గుళికకు దూరంగా ఉంటుంది. నాళికాస్రావం దాని ప్రధాన విధి.
→ అభివాహి ధమనిక : బొమన్ గుళికలోనికి ప్రవేశించే రక్తనాళం. వ్యర్థాలను కలిగి ఉంటుంది.
→ అపవాహి ధమనిక : బొమన్ గుళిక నుండి వెలుపలికి వచ్చే రక్తనాళం. ఇది శుద్ధి చేసిన రక్తాన్ని కలిగి ఉంటుంది.
→ కేలిసిస్ : మూత్రపిండంలో నెఫ్రాస్టు ద్రోణిలోనికి తెరుచుకొనే ప్రాంతం. ఇవి వేళ్ళవంటి నిర్మాణాలు.
→ మూత్ర విసర్జన : ప్రసేకం ద్వారా మూత్రాశయం నుండి మూత్రం బయటకు విడుదలగుటను ‘మూత్రవిసర్జన’ అంటారు.
→ యూరోక్రోమ్ : మూత్రానికి రంగును కలిగించే పదార్థం.
→ డయలైజర్ : డయాలసిస్ యంత్రంలో ఉపయోగించే ద్రవ పదార్థం. ఇది రక్త నిర్మాణాన్ని పోలి ఉంటుంది. వ్యర్థాలు ఉండవు.
→ హీమోడయాలసిస్ : మూత్రపిండాలు పనిచేయని వారిలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ.
→ ఆల్కలాయిడ్లు : మొక్కలలోని నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. ఇవి వేరువేరు భాగాలలో నిల్వ చేయబడతాయి.
ఉదా : నికోటిన్
→ జీవ ఇంధనం : మొక్కల నుండి తయారుచేస్తున్న ఇంధన పదార్థాలను జీవ ఇంధనాలు అంటారు.
ఉదా : జట్రోపా.
→ హెగౌశిక్యం : నెఫ్రాలో ‘U’ ఆకారపు గొట్టము. పునఃశోషణకు తోడ్పడుతుంది.