Students can go through AP Board 10th Class Biology Notes 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత
→ ఒక జీవి మండి మరొక ఉనికి శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ఆహార జాలకం తెలియజేస్తుంది.
→ ఆహారపు గొలుసులో బాణాలు ఆహారాన్ని, దానిని తివే జీవికి మధ్య సంబంధాన్ని సూచిస్తాయి.
→ జీవుల మధ్య సంబంధాలను, శక్తి ప్రవాహాన్ని సంధ్యాధిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్ల ద్వారా తెలియజేయవచ్చు.
→ పిరమిడ్ అనునది జ్యామితీయ ఆకారంలో ఉన్న నిర్మాణం.
→ సంఖ్యాపిరమిడ్ ఆహారపు గొలుసులో, ఒక్కొక్క పోషకస్థాయిలో ఉన్న జీవుల సంఖ్యను తెలియజేస్తుంది.
→ ఉపద్రవ్యరాశి పిరమిడ్ ఆహారపు గొలుసులో ఒక్కొక్క పోషక స్థాయిలో ఉన్న ఆహార లభ్యతము, శక్తి మూలాధారాలను తెలియజేస్తుంది.
→ ఉవద్రవ్యరాశిని తన ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు.
→ తెగుళ్ల విచారణకు వంటలలో ఉపయోగించే క్రిమిసంహారకాలు విషహరితమైనవి కావడం వలన పర్యావరణానికి హాని కలిగిస్తాయి.
→ ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు ప్రవేశించడాన్ని వైవిక వ్యవస్థాపనం అంటారు.
→ ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి కాలుష్య కారకాలు ప్రవేశించి ప్రోగుపడదాన్ని జైవిక వృద్ధీకరణం అంటారు.
→ అపాయకరమైన ప్రభావాలు లేకుండా అధిక ఉత్పత్తి పొందడానికి వంట మార్పిడి, జీవనియంత్రణ, జన్యుసంబంధ రకాల అభివృద్ధి మొదలైన పద్దతులు వురుగు మందులకు ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి.
→ ప్రతి జంతువు ఆహారపు గొలుసులో నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం’ లేదా విచ్ (Nidhe) అంటారు.
→ జీవుల మధ్య సంబంధాలను చూపటానికి లేదా వర్ణించటానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ అనే భావనను ప్రతిపాదించారు.
→ వివిధ పోషకస్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు.
→ బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్ 1927లో ఆవరణశాస్త్రంలో పిరమిడ్ రేఖాచిత్రాలను వాడాడు.
→ జీవావరణ పిరమిడ్ లు ప్రధానంగా మూడు రకాలు 1. శంఖ్యాపిరమిడ్లు 2. జీవద్రవ్యరాశి పిరమిడ్ లు 3. శక్తి పిరమిడ్లు
→ ఆహారపు గొలుసులో ప్రతిస్థాయిలో ముమారుగా 90% ఆహారం నష్టపోవటం జరుగుతుంది.
→ అధిక పోషక విలువలు కలిగిన కలుషితాల చేరిక వలన జలవనరులలో యూట్రిఫికేషన్ జరుగుతున్నది.
→ పాదరసం, ఆర్సెనిక్, పీపం కలిగిన పెస్టిసైడ్లు విచ్ఛిన్నం కావు. అలా విచ్ఛిన్నం కాని పెద్ది సైడ్లు అపాయకరమైనవి.
→ ఈ మధ్యకాలంలో చేపలను లోహకాలుష్యాలకు సూచకాలుగా భావిస్తున్నారు.
→ మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థజలాల వలన మినిమేటా అనే వ్యాధి కలుగుతుంది.
→ ప్రతి సంవత్సరం ఒకే పంట పండించకుండా వేరువేరు పంటలు పండించడాన్ని పంట మార్పిడి అంటారు.
→ జైవిక నియంత్రణ పద్ధతుల వలన క్రిమికీటకాలను అదుపుచేయటం మంచి పద్ధతి.
→ పర్యావరణ పరిరక్షణకు చట్టాలు సరిపోవు. ప్రతి ఒక్కరు పర్యావరణ నైతికత కలిగి ఉండాలి.
→ ఆహారపు గొలుసు : ఆహారపు గొలుసులో జీవుల మధ్య సంబంధాన్ని చూపే రేఖాచిత్రాన్ని “ఆహారపు గొలుసు” అంటారు.
→ ఆహార జాలం : అనేక ఆహారగొలుసుల కలయిక వలన ఆహారజాలం ఏర్పడుతుంది.
→ ఆహార పిరమిడ్ : ఆవరణ వ్యవస్థలోని ఆహార సంబంధాలను పిరమిడ్ ఆకారంలో చూపే రేఖాచిత్రం.
ఇవి మూడు రకాలు : 1. సంఖ్యా పిరమిడ్లు 2. జీవద్రవ్యరాశి పిరమిడ్లు 3. శక్తి పిరమిడ్లు
→ సంఖ్యా పిరమిడ్ : ఆహార గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ ఆకారంలో చూపే రేఖాచిత్రం. ఇది ఆహార గొలుసులోని ఒక్కొక్క పోషక స్థాయిలో గల జీవుల సంఖ్యను తెలుపుతుంది.
→ జీవద్రవ్యరాశి పిరమిడ్ : ఆహారపు గొలుసులోని జీవుల ద్రవ్యరాశి వీరమిడ్ ఆకారం చూపే రేఖా చిత్రం. ఇది ఆహారపు గొలుసులో, ఆహార లభ్యతను, శక్తి మూలాధారాలను తెలియజేస్తుంది.
→ క్రిమిసంహారకాలు : కీటకాలను, సూక్ష్మజీవులను చంపటానికి పంట పొలాలలో వాడే రసాయన పదార్థాలు.
→ జైవిక వ్యవస్థాపనం : కలుషితాలు ఆహార గొలుసులోకి ప్రవేశించే ప్రక్రియ.
→ జైవిక వృద్ధీకరణం : ఆహార గొలుసులో కలుషితాలు, సాంద్రీకృతమయ్యే విధానం.
→ పర్యావరణ నైతికత : పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించటం.