AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

Students can go through AP Board 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ వస్తువులపై పడిన కాంతి పరిక్షేపణం చెంది మన కంటిని చేరడం వలన మనం వస్తువులను చూడగలుగుతాము.

→ మానవుని కన్ను దృష్టి ప్రతిస్పందన అను నియమంపై ఆధారపడి పని చేస్తుంది.

→ మన కంటిలో ఒక కటకం ఉంటుంది.

→ మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే అది మన కంటికి దాదాపు 25 సెం.మీ.ల దూరంలో ఉండాలి. దీనినే “స్పష్ట దృష్టి కనీస దూరం” అంటారు.

→ ఈ స్పష్ట దృష్టి కనీస దూరం విలువ వ్యక్తి వ్యక్తికీ, వయసును బట్టి మారును.

→ ఏ గరిష్ఠ కోణంతో మనం వస్తువును పూర్తిగా చూడగలమో, సిలియరి ఆ కోణమును “దృష్టికోణం” అంటాం.
AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

→ ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా 60° ఉంటుంది.

→ మన చుట్టూ వున్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి కన్ను ఉపయోగపడును.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ కనుగుడ్డు దాదాపు గోళాకారంగా ఉంటుంది.

→ ‘కంటి ముందు భాగం ఎక్కువ వడ్రంగా ఉండి, కార్నియా అను పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది.

→ కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతావ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.

→ కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనాపై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది.

→ రెటీనా అనేది ఒక సున్నితమైన పొర. దీనిలో దండాలు మరియు శంఖువులు అనబడే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలుంటాయి.

→ సిలియరి కండరాల సహాయంతో కంటి కటకం వస్తు దూరానికి అనుగుణంగా తన నాభ్యంతరాన్ని మార్చుకొనును.

→ కంటి కటకం తన నాభ్యంతరమును మార్చుకునే సామర్థ్యాన్ని కటక “సర్దుబాటు సామర్థ్యం” అంటారు.

→ కంటి కటక దోషాల వల్ల చూపు మసకబారినట్లుగా అవుతుంది.

→ కంటికటక సర్దుబాటు దోషాలు మూడు రకాలు. అవి :

  1. హ్రస్వదృష్టి
  2. దీర్ఘదృష్టి
  3. చత్వారం

→ దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలిగి, దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడలేని కంటి దృష్టి దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటాం.

→ హ్రస్వదృష్టి దోషం గల వ్యక్తులకు కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కన్నా తక్కువ ఉంటుంది.

→ హ్రస్వదృష్టి దోషం నివారణకు పుటాకార కటకమును వాడతారు.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ ఒక వ్యక్తి కనిష్ఠ దూర బిందువుకు లోపల ఉన్న వస్తువును చూడలేకపోయే దృష్టి దోషమును దీర్ఘ దృష్టి అంటాం.

→ దీర్ఘదృష్టి నివారణకు కుంభాకార కటకమును వాడతారు.

→ వయస్సురీత్యా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయే దృష్టిదోషాన్ని చత్వారం అంటాం.

→ ఒక కటకం కాంతికిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటారు.

→ కటక నాభ్యంతరం యొక్క విలోమమును “కటక సామర్థ్యం” అని కూడా అంటారు.
AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2

→ కటక సామర్థ్యంను డయాప్టర్లతో సూచిస్తారు.

→ ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసరయానకం నుండి వేరు చేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని “పట్టకం” అంటాం.

→ పట్టక వక్రీభవన గుణకమునకు సూత్రము \(\mathrm{n}=\frac{\sin \left[\frac{(\mathrm{A}+\mathrm{D})}{2}\right]}{\sin \frac{\mathrm{A}}{2}}\)

→ తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని “కాంతి విక్షేపణం” అంటాము.

→ కాంతి జనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను “పౌనఃపున్యం” అంటాం.

→ కాంతి తరంగ వేగం (v), తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (f) ల మధ్య సంబంధము.
v= fλ

→ ఇంద్రధనుస్సు అనునది మన కంటి వద్ద తన కొనభాగాన్ని కలిగి వున్న త్రిమితీయ శంఖువు.

→ కాంతి పరిక్షేపణం ఒక సంక్లిష్ట దృగ్విషయం.

→ పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినపుడు అవి కాంతి శక్తిని శోషించుకుని, వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి.

→ వాతావరణంలో వివిధ పరిమాణాలలో అణువులు, పరమాణువులుంటాయి. కావున వాటి పరిమాణాలకు అనుగుణంగా అవి కాంతి పరిక్షేపణను చేయుట వలన వర్ణపటము ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ స్పష్టదృష్టి కనీస దూరం : మానవుని కంటికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక వస్తువును స్పష్టంగా చూసేందుకు కంటి నుండి వస్తువుకు ఉండవలసిన కనీస దూరము.

→ దృష్టికోణం : ఇది ఏ గరిష్ఠ కోణంతో మనము వస్తువును పూర్తిగా చూడగలమో ఆ కోణము విలువ.

→ కటక సర్దుబాటు : కంటి కటకము తన నాభ్యంతరమును మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు.

→ హ్రస్వదృష్టి : ఇది దగ్గరగా వున్న వస్తువులను చూడగలిగి, దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడలేని దృష్టి లోపము.

→ దీర్ఘదృష్టి : ఇది దూరంగా వున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి, దగ్గరలో వున్న వస్తువులను చూడలేని దృష్టి లోపము.

→ చత్వారం : ఇది వయస్సు రీత్యా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవు దృష్టిలోపము.

→ కటక సామర్థ్యం : ఇది నాభ్యంతరం యొక్క విలోమము.

→ పట్టకం : ఇది ఒకదానితో ఒకటి కొంతకోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడి వున్న పారదర్శక యానకపు వస్తువు.

→ పట్టక కోణం (లేదా) పట్టక : ఒక పట్టకం యొక్క రెండు వక్రీభవన తలాల మధ్య గల కోణము పట్టక కోణం వక్రీభవన కోణం లేదా పట్టక వక్రీభవన కోణం అగును.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

→ కనిష్ఠ విచలన కోణం : ఒక పట్టకం గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు పతన కోణం, బహిర్గత కోణానికి సమానమైన విచలన కోణం కనిష్ఠమగును. ఈ కోణమే కనిష్ఠ విచలన కోణం అగును.

→ విక్షేపణం : ఇది తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవు దృగ్విషయము.

→ పరిక్షేపణం : ఇది ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వేర్వేరు తీవ్రతలతో విడుదల చేయు ప్రక్రియ.

→ విచలన కోణం : ఒక పట్టకం గుండా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు పతన కిరణమునకు, బహిర్గత కిరణమునకు మధ్యగల కోణము.

AP 10th Class Physical Science Notes 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3