AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

These AP 10th Class Social Studies Important Questions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II will help students prepare well for the exams.

AP Board 10th Class Social 14th Lesson Important Questions and Answers ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social 14th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. రష్యాను పాలించే రాజులను ఏమంటారు?
జవాబు:
జాలు.

2. రష్యా పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డ్యూమా.

3. జపాన్ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
డైట్.

4. జర్మనీ పార్లమెంట్ ను ఏమంటారు?
జవాబు:
రిచ్ స్టాగ్.

5. రష్యన్ విప్లవంలో మితవాద ధోరణిని అవలంభించిన వారి నేమంటారు?
జవాబు:
మెన్షివికు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

6. రష్యన్ విప్లవంలో అతివాద ధోరణిని అవలంభించిన వారినేమంటారు?
జవాబు:
బోల్షివికు.

7. రష్యన్ మహిళా విప్లవ నాయకురాలు ఎవరు?
జవాబు:
మార్ఫా వాసిలేవా.

8. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడినది ఏది?
జవాబు:
కొమిటర్న్.

9. 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని ఏ విధంగా పిలుస్తారు?
జవాబు:
మార్చి విప్లవంగా.

10. ఏ సంవత్సరంలో USSR పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది?
జవాబు:
1928.

11. రష్యా రాచరిక వాదుల సైన్యంను ఏమంటారు?
జవాబు:
తెల్ల సైన్యం

12. అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై లేనందున మాంద్యం నుంచి తప్పించుకోగలిగిన దేశం ఏది?
జవాబు:
USSR (రష్యా)

13. ఏ దేశంలోని స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఆర్థిక మాంద్య పరిణామాలు మొదలయ్యాయి?
జవాబు:
అమెరికా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

14. ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావ వంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని చెప్పిన ఆర్థికవేత్త ఎవరు?
జవాబు:
J.M. కీన్స్.

15. ఆర్థిక మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

16. జర్మనీ రహస్య పోలీసు బృందంను ఏమని పిలుస్తారు?
జవాబు:
గెస్టాపో.

17. హిట్లర్ జర్మనీ ఆర్ధిక పునఃనిర్మాణ బాధ్యతను ఏ ఆర్థికవేత్తకు అప్పగించాడు?
జవాబు:
హజాల్మర్ షాకిక్ట్.

18. హిట్లర్ ఏ సంవత్సరంలో పోలెండ్ పై దండెత్తాడు?
జవాబు:
1939.

19. రెండవ ప్రపంచ యుద్ధ నీడలో మానవ మారణ హెూమాన్ని చేపట్టిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

20. ప్రపంచ జనాభా విస్తరణలో మూడవ పెద్ద దేశమేది?
జవాబు:
రష్యా.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

21. రష్యా తొలి నాళ్ళల్లో భూముల్లో అధిక భాగం ఎవరి ఆధీనంలో ఉండేవి?
జవాబు:
ఫ్యూడల్ ప్రభువుల

22. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం ఏ దేశం కల్గి ఉండేది?
జవాబు:
రష్యా.

23. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
స్టాలిన్.

24. ఆర్థిక మాంద్యం కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత శాతం దాకా తగ్గి లక్షలాది రైతులు పేదవాళ్లుగా మారారు?
జవాబు:
60% దాకా.

25. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు?
జవాబు:
రూల్ట్.

26. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటిని ఎవరి కుట్రగా హిట్లర్ పేర్కొన్నాడు?
జవాబు:
యూదుల

27. జర్మన్ ప్రజల కారు?
జవాబు:
వోక్స్ వాగెన్.

28. కొమిస్టర్న్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

29. ఆర్థిక మాంద్యం యొక్క ముఖ్య పరిణామం ఏమిటి?
జవాబు:
వస్తువుల గిరాకీ పడిపోవడం.

30. USA (అ. సం. రా) ఏ సంవత్సరంలో (ఎప్పుడు) రెండవ ప్రపంచ యుద్ధంలో చేరాయి?
జవాబు:
డిసెంబరు 8, 1941.

31. సోవియట్ రష్యాలో 1920లో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

32. పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల ముద్రణ దేనికి దారితీస్తుంది?
జవాబు:
ద్రవ్యోల్బణం.

33. మార్షల్ ప్రణాళిక ప్రకటించిన దేశమేది?
జవాబు:
అమెరికా.

34. జర్మనీ తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం (GDR) ఎవరి ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
USSR.

35. జర్మనీ పశ్చిమ భాగమైన జర్మన్ గణతంత్ర సమాఖ్య (FRG) ఏ దేశ ప్రభావం క్రిందకు వెళ్ళింది?
జవాబు:
అమెరికా.

36, ఏ సంవత్సరంలో USSR జర్మనీపై దండెత్తింది?
జవాబు:
1941.

37. ‘యానిమల్ ఫాం’ అనే వ్యంగ్య నవలలో ఏ విప్లవం గూర్చి చర్చించారు?
జవాబు:
రష్యా విప్లవం.

38. సమాచారాన్ని పూరించండి.
జర్మనీలో నాజీజం ప్రాబల్యం :
వర్సయిల్స్ సంధి షరతులు → జర్మన్ అవమాన భారం → నాజీ పార్టీ విజృంభణ → హిట్లర్ నియంతృత్వం → ?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభం / నాంది.

39. సమాచారాన్ని పూరించండి.
ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు – ?
జవాబు:
పడిపోయాయి.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

మొదటిజతలోని రెండు అంశాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి.

40. UNESCO : పారిస్ : : UNICEF 😕
జవాబు:
న్యూయార్క్

41. ఫాసిస్ట్ పార్టీ : ఇటలీ : : నాజీ పార్టీ : ?
జవాబు:
జర్మనీ.

42. మెన్షవిక్ : కెరన్స్క : : బోల్షివిక్ : ?
జవాబు:
లెనిన్.

43. జపాన్ : డైట్ : : రష్యా : ?
జవాబు:
డ్యూమా.

44. ఒట్టోమాన్ : టర్కీ : : వైమర్ రిపబ్లిక్ : ?
జవాబు:
జర్మనీ సామ్రాజ్యం

45. స్టాలిన్ : USSR : : రూజ్వెల్ట్ : ?
జవాబు:
USA.

46. రష్యాలో వచ్చిన ఫిబ్రవరి విప్లవం ముఖ్య ఫలితం ఏమిటి?
జవాబు:
జార్ చక్రవర్తి పారిపోవడం (పదవీచ్చుతుడవడం)

47. రష్యాలో పౌర యుద్ధ కాలం …………..?
జవాబు:
1917 – 1920.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

48. మార్చి 8, 1917న రాజధాని సెయింట్ పీటర్బర్గ్ లో ఊరేగింపుగా వెళ్ళిన సుమారు 10,000 మంది మహిళల డిమాండ్ ఏమిటి?
జవాబు:
రొట్టె, శాంతి.

49. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ బ్రిటన్ – చర్చిల్
→ అమెరికా – రూజ్ వెల్ట్
→ రష్యా – స్టాలిన్
→ ఇటలీ – హిట్లర్
జవాబు:
ఇటలీ – హిట్లర్.

50. USSR లోని సోవియట్లు, రైతాంగం, కార్మికులు, సైనికులు, జమిందారులలో ఎవరికి సంబంధించని కౌన్సిల్లు?
జవాబు:
జమీందారులు.

51. హిట్లర్ ఏ చట్టము ద్వారా జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు?
జవాబు:
ఎనేబ్లింగ్ చట్టము.

52. హిట్లర్ రచించిన పుస్తకం పేరేమిటి?
జవాబు:
మైన్ కాంఫ్ (నా పోరాటం )

59. యుద్ధాన్ని నివారించ వలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారతీయ నాయకుడెవరు?
జవాబు:
మహాత్మాగాంధీ.

54. న్యూడీల్ పాలసీ ముఖ్య ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
ఆర్థికమాంద్యం వలన నష్టపోయిన వారికి సహాయం చేయటం.

55. వేగవంతమైన పారిశ్రామికీకరణ, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు అనే జోడెద్దుల విధానంను అనుసరించిన దేశమేది?
జవాబు:
USSR.

56. చిట్ట చివరి జార్ చక్రవర్తి ఎవరు?
(or)
రష్యా విప్లవ కాలంనాటి రష్యా చక్రవర్తి ఎవరు?
జవాబు:
జార్ నికోలస్ – II

57. ఎనెల్లింగ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
జవాబు:
1933.

58. మార్షల్ ప్రణాళికను అమెరికా ఏ దేశాల ఆర్థిక పునరుద్దరణకు ఏర్పాటు చేసింది?
జవాబు:
జర్మనీ మరియు జపాన్.

59. లెనిన్ మరణించిన సంవత్సరం?
జవాబు:
1924.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

60. పుట్టుక, లింగం, భాష వంటి వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన దేశం?
జవాబు:
రష్యా USSR.

61. ‘రక్తసిక్త ఆదివారం’ విప్లవం (రష్యాలో) ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1905లో.

62. ఆర్థిక మాంధ్యం కాలంలో అమెరికాలో నిరుద్యోగుల శాతం ఎంత?
జవాబు:
25%

63. యూదులపై సామూహిక హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
1941 లో

64. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నది ఏ సంవత్సరంలో?
జవాబు:
1945 లో

65. 1917లో సంభవించిన మలి రష్యన్ విప్లవాన్ని ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
అక్టోబర్ విప్లవం.

66. గ్రెగోరియన్ క్యాలండర్ తేదీలు జులియన్ క్యాలండర్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి?
జవాబు:
13 రోజులు.

67. మన క్యాలండర్ ప్రకారం రష్యాలో ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం ఏ తేదీన జరిగాయి?
జవాబు:
నవంబరు – 7.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

68. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర మాంద్యం కొనసాగిన కాలం ఏది?
జవాబు:
1929 – 39.

69. “ఎకోస్ ఆఫ్ నేటివ్ ల్యాండ్ టు సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్” అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
జవాబు:
సెర్జ్ ష్మెమాన్.

70. “అన్నిటి కంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంది” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

71. “ఈ లోకంలోకి మహిళ ఇచ్చే ప్రతి సంతానము ఒక యుద్దమే” అని అన్నది ఎవరు?
జవాబు:
హిట్లర్.

72. “ఏ పని చెయ్యటానికైనా సిద్ధమే” అని రాసిన కార్డులు మెడలో వేసుకుని ఏదేశంలోని నిరుద్యోగులు తిరిగారు?
జవాబు:
జర్మనీ.

73. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయిన దేశమేది?
జవాబు:
జర్మనీ.

74. ఏ సంవత్సరంలో నాజీ పార్టీ జర్మనీలో 37% ఓట్లతో అతి పెద్ద పార్టీగా పరిణమించింది?
జవాబు:
1937.

75. నాజీ పార్టీ చిహ్నం ఏది?
జవాబు:
స్వస్తిక్

76. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించినా, 1943 ఆరంభంలో ప్రఖ్యాతమైన ఏ యుద్ధంలో ఓటమితో అపజయాలుగా మారసాగాయి?
జవాబు:
లెనిన్ గ్రాడ్.

77. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న క్యాలండర్ ఏది?
జవాబు:
గ్రెగోరియన్ క్యాలండర్.

78. రష్యాలో భూముల ఏకీకరణ ప్రారంభమైన సంవత్సరం?
జవాబు:
1929.

79. 1920లో సోవియట్ రష్యాలో కాలుపెట్టిన భారతీయుడు ఎవరు?
జవాబు:
M.N. రాయ్

80. ఓష్ విడ్జ్ అనునది ఏమిటి?
జవాబు:
హిట్లర్ పాలనలోని శిక్షా శిబిరం.

81. జర్మనీ రాజధాని నగరం ఏది?
జవాబు:
బెర్లిన్.

82. ‘హోలో కాస్ట్’ అంటే?
జవాబు:
యూదుల సామూహిక విచారణ.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

83. క్రింది వానిని సరిగా జతపరచండి.
1) రక్తసిక్త ఆదివారం ( ) a) 1905
ii) కొమిన్ టర్న్ ఏర్పాటు ( ) b) 1919
iii)రష్యాలో మొదటి పంచవర్ష ప్రణాళికలు ( ) c) 1928
iv) వైమర్ గణతంత్ర ప్రకటన ( ) d) 1918
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

10th Class Social 14th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“తీవ్ర ఆర్థికమాంద్యం” అనగానేమి?
జవాబు:

  1. ప్రపంచ వ్యాప్తంగా వస్తువులు గిరాకీ పడిపోవడం కలగ ధరలు క్షీణించడాన్ని తీవ్ర ఆర్థిక మాంద్యం అంటారు.
  2. ఇది ప్రపంచ వారంగా 1999 నుండి 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 2.
USSR తీవ్ర ఆర్థిక మాంద్యం నుండి ఎలా తప్పించుకోగలిగింది?
జవాబు:
అంతర్జాతీయ మార్కెట్ తో USSR అనుసంధానమై లేనందున ఈ మాంద్యం నుంచి తప్పించుకోగలిగింది.

ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం, ఏమి ఉత్పత్తి చెయ్యాలో, ఎంత ఉత్పత్తి చెయ్యాలో అన్న అంశాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం మొ||నవి.

ప్రశ్న 3.
హిట్లర్ ప్రవేశపెట్టిన ఏవేని రెండు ఆర్థిక సంస్కరణ అను రాయండి.
జవాబు:

  1. సమ్మెల నిషేధం
  2. పన్నుల భారం తగ్గించడం
  3. యుద్ధ సామగ్రి ఉత్పత్తి చేసే పరిశ్రమల స్థాపన
  4. ఉపాధి కల్పన

ప్రశ్న 4.
1917 రష్యా విప్లవానికి, భారత స్వాతంత్రోద్యమానికి గల రెండు భేదాలను రాయండి.
జవాబు:

రష్యా విప్లవం భారత స్వాతంత్ర్యోద్యమం
1) జార్ నికోలస్ కు వ్యతిరేకంగా జరిగింది. 1) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది.
2) ‘రొట్టె, శాంతి’ కోసం డిమాండు జేయటం. 2) స్వాతంత్ర్యం కోసం పోరాటం.
3) రెండు దశలు 3) మూడు దశలు
4) ఉదారవాదులు, రాచరిక కుటుంబాలకు వ్యతిరేకంగా. 4) విదేశీయులకు వ్యతిరేకంగా.

ప్రశ్న 5.
జర్మనీలో యూదుల పట్ల హిట్లర్ ప్రవర్తనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని తెల్పండి.
జవాబు:
యూదుల పట్ల హిట్లర్ యొక్క ప్రవర్తన చాలా క్రూరమైనది మరియు అన్యాయమైనది.

ప్రశ్న 6.
ప్రసుత భారతదేశ ప్రభుత్వము అమలుచేస్తున్న ఏవైనా రెండు సంక్షేమ పథకాలు వ్రాయుము.
జవాబు:
ప్రస్తుత భారతదేశ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు:

  1. సుకన్య సంవృద్ధి యోజన.
  2. ప్రధానమంత్రి జీవ జ్యోతి బీమా యోజన
  3. MNREGA
  4. అటల్ పెన్షన్ యోజన

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 7.
‘ఉమ్మడి క్షేత్రాల’ వ్యవసాయం గురించి వ్రాయండి.
జవాబు:
ఉమ్మడి క్షేత్రాల వ్యవసాయం :

  • యు.ఎస్.ఎస్.ఆర్ లో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో చేరేలా బలవంతం చేయడం.
  • ఈ క్షేత్రాలలో ఉమ్మడిగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించి, ఉత్పత్తిని అందరూ పంచుకోవటం.

ప్రశ్న 8.
పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని హిట్లర్ ఎలా పొందాడు?
జవాబు:
హిట్లర్ పార్లమెంటును పట్టించుకోకుండా ఉండే అధికారాన్ని ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదించడం ద్వారా పొందారు.

ప్రశ్న 9.
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశములను పేర్కొనండి.
జవాబు:
‘కొత్త ఒప్పందము’ (న్యూడీల్) నందలి ముఖ్యాంశాలు :

  1. మాంద్యానికి గురైన వారికి పునరావాసం
  2. ఆర్థిక సంస్థల సంస్కరణ
  3. ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోవడానికి చర్యలు

ప్రశ్న 10.
‘తీవ్ర ఆర్థిక మాంద్యము’ అనగా నేమి?
జవాబు:
తీవ్ర ఆర్థిక మాంద్యము : 1929 సం||ములో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్ధిక క్షీణతనే తీవ్ర ఆర్థిక మాంద్యము అంటారు.

ప్రశ్న 11.
సమాచారాన్ని పూరించండి.
ఆర్థికమాంద్యం నాటి పరిస్థితులు.
నిరుద్యోగం – పెరిగింది.
డిమాండ్ – తగ్గింది.
ధరలు -?
జవాబు:
ధరలు – పడిపోయాయి.

ప్రశ్న 12.
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత అతిపెద్ద జనాభాగల దేశం ఏది?
జవాబు:
జార్ పాలనలో చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా రష్యా అవతరించింది.

ప్రశ్న 13.
రష్యాలో కలిసున్న కొన్ని దేశాలేవి?
జవాబు:
ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కోమానియా వంటి పలు దేశాలు రష్యాలో కలిసి ఉండేవి.

ప్రశ్న 14.
రొట్టె, శాంతి కావాలని ఏ నగరంలో మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు?
జవాబు:
రొట్టె, శాంతి కావాలని 10,000 మంది మహిళలు “సెంట్ పీటర్స్ బర్గ్” నగరంలో ప్రదర్శనలు చేశారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 15.
మార్చి విప్లవం అని దేనినంటారు?
జవాబు:
1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని రష్యన్ విప్లవమని లేదా మార్చి విప్లవం అని అంటారు.

ప్రశ్న 16.
రష్యా జులియన్ క్యాలెండర్‌ను ఎంతవరకు అనుసరించింది?
జవాబు:
రష్యా జులియన్ క్యాలెండర్‌ను 1918 ఫిబ్రవరి 1 వరకు అనుసరించింది.

ప్రశ్న 17.
బోల్షివిక్కుల నాయకుడెవరు?
జవాబు:
బోల్షివిక్కుల నాయకుడు బ్లడిమిర్ లెనిన్.

ప్రశ్న 19.
పౌరయుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
జవాబు:
పౌరయుద్ధం రష్యా రాచరికవాదుల తెల్ల సైన్యం, కమ్యూనిస్టు వ్యతిరేక సైనికుల మధ్య జరిగింది. ఇది 1918 – 20 సం||ల మధ్య జరిగింది.

ప్రశ్న 20.
రష్యా USSR గా ఎప్పుడు అవతరించింది?
జవాబు:
రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ గా 1924లో అవతరించింది.

ప్రశ్న 21.
రష్యాలో తీవ్ర కరవు ఎప్పుడు సంభవించింది?
జవాబు:
రష్యాలో తీవ్ర కరవు 1929-30లో సంభవించింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

ప్రశ్న 22.
ఏ నగరంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు?
జవాబు:
“మాగ్నిటాగోర్క్స్” అన్న పట్టణంలో 3 సం||ల కాలంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించారు.

ప్రశ్న 23.
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టిల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసినదెవరు?
జవాబు:
“ది హిస్టరీ ఆఫ్ ఎ సోవియట్ కలెక్టల్ ఫాం” అన్న గ్రంథాన్ని రాసింది “ఫెడార్ బెలోవ్”.

ప్రశ్న 24.
బోల్సివిక్లు రూపొందించిన విద్యావిధానం పేరేమి?
జవాబు:
బోల్షివికు రష్యాలో విస్తరించిన విద్యావిధానాన్ని రూపొందించారు.

ప్రశ్న 25.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ పేరేమి?
జవాబు:
కమ్యూనిస్టు విప్లవాన్ని ప్రోత్సహించటానికి ఏర్పడిన సంస్థ “కొమ్మి ర్న్”.

ప్రశ్న 26.
“ఐరోపాలోని ఇతర రాజధానులతో పోలిస్తే మాస్కో అంత శుభ్రంగా అనిపించదు” అన్నదెవరు?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్.

ప్రశ్న 27.
అరికమాంద్యం ఎప్పుడు ప్రారంభమై, ఎంతవరకు కొనసాగింది?
జవాబు:
ఆర్థికమాంద్యం 1929 చివరలో ప్రారంభమై, 1939 వరకు కొనసాగింది.

ప్రశ్న 28.
“పిల్లవాడికి మూడేళ్ళ వయస్సు నుంచే ఊపటానికి అతడికి ఒక చిన్న జెండా ఇస్తాం” అన్నదెవరు?
జవాబు:
జర్మను కార్మిక నాయకుడు రాబర్ట్ లే.

ప్రశ్న 29.
నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ ఏ వయసు పిల్లలకు ఇచ్చేవారు?
జవాబు:
ఆరు నుంచి పది (6-10) సంవత్సరాల మగపిల్లలందరూ నాజీ సిద్ధాంతంలో ప్రాథమిక శిక్షణ పొందేవాళ్ళు.

ప్రశ్న 30.
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది ఎవరు?
జవాబు:
కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామికవర్గ ఉద్యమాలను వ్యతిరేకించింది హిట్లర్.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 31.
“గెస్టాపో” అంటే ఏమిటి?
జవాబు:
జర్మనీ సమాజాన్ని నియంత్రించడానికి, భద్రతా పరిరక్షణకు ఏర్పాటు కాబడిన “రహస్య పోలీసు బృందం”.

ప్రశ్న 32.
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఎవరికి అప్పగించాడు?
జవాబు:
జర్మన్ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ “ఆర్థికవేత్త హజాల్మర్ షాకిక్ట్”కి అప్పగించాడు.

ప్రశ్న 33.
తీవ్ర ఆర్థికమాంద్యం ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
1929-30లో సంభవించిన తీవ్ర ఆర్థికమాంద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. నిరుద్యోగం పెరిగిపోయింది.

ప్రశ్న 34.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు దాడికి గురి అయిన జపానులోని నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకి.

ప్రశ్న 35.
‘న్యూ డీల్’ కు సంబంధించిన మూడు విధానాలు (3R’s) ఏమిటి?
జవాబు:
పునరావాసం (ఆర్థికమాంద్యానికి గురైన వారికి), ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి కోలుకోడానికి చర్యలు.

ప్రశ్న 36.
బోల్షివిక్ విప్లవం అనగానేమి?
జవాబు:
1917 నవంబరులో లెనిన్ నాయకత్వాన షరతులు లేని శాంతి, భూ పంపిణీ తదితర డిమాండులతో వచ్చిన విప్లవాన్ని ‘బోల్షివిక్ విప్లవం’ అంటాం.

10th Class Social 14th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది కాలపట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులివ్వండి.

కాలపట్టిక
వైమర్ గణతంత్ర రాజ్యాంగ ప్రకటన నవంబర్ 9, 1918
హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్‌గా కావడం జనవరి 30, 1933
జర్మనీ పోలెండ్ పై దండెత్తడం; రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం సెప్టెంబర్ 1, 1939
USSR పై జర్మనీ దండెత్తడం జూన్ 22, 1941
యూదులపై సామూహిక హత్యాకాండ జూన్ 23, 1941
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం డిసెంబర్ 8, 1941
సోవియట్ సేనలు ఆష్విల్డ్ కు విముక్తి కల్పించడం జనవరి 27, 1945
యూరప్లో కూటమిగా సాధించిన విజయం మే 8, 1945

A) రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఆష్వి కు విముక్తి కల్పించడం ద్వారా మిత్రదేశాలకు విజయానికి మార్గం సుగమం అయినది అని ఎలా చెప్పవచ్చు?
B) ప్రపంచ చరిత్రలో 1941 నాటి కీలక అంశాలు ఏవి?
జవాబు:
A) జర్మనీలో ఆష్విజ్ ప్రాంతాన్ని 1945లో రష్యా ఆక్రమించుకోవడంతో జర్మనీ బలహీన పడింది. దీంతో మిత్ర రాజ్య సైన్యాలు బెర్లిన్ ను ఆక్రమించుకున్నాయి. గత్యంతరం లేని పరిస్థితులలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

B) 1) యు.ఎస్.ఎస్.ఆర్. పై జర్మనీ దండెత్తడం
2) యూదులపై సామూహిక హత్యాకాండ
3) అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 2.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు?
జవాబు:
డచ్ ఈస్ట్ ఇండియాను ఇప్పుడు ఇండోనేషియా అని పిలుస్తున్నారు.

2) ఏ చైనా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది?
జవాబు:
చైనాలోని మంచూరియా ప్రాంతం జపాన్ అధీనంలో ఉంది.

3) భారతదేశంతో భూభాగ సరిహద్దును కలిగి యుండి జపాన్ నియంత్రణలో లేని దేశం ఒకదాని పేరు వ్రాయండి.
జవాబు:
నేపాల్, టిబెట్, భూటాన్

ప్రశ్న 3.
ఏవేని రెండు ఆర్థిక మాంద్య ప్రభావాలను వ్రాయండి.
జవాబు:
ఆర్థిక మాంద్య ప్రభావాలు :

  1. నిరుద్యోగిత పెరగడం
  2. ధరల పతనం
  3. కర్మాగారాల మూసివేత
  4. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం

ప్రశ్న 4.
క్రింది పేరాను చదవండి.
భూమి ఎవరికి కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దాన్ని జయించగల సాహసం, దాన్ని కాపాడులోగల బలం, దాన్ని దున్నగల శ్రమ, చేయగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. బలమైన, జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది.
ప్రశ్న : బలం, శక్తి ఉన్నవాళ్ళకే ఈ ప్రపంచం చెందాలనే అభిప్రాయంపై వ్యాఖ్య రాయండి.
జవాబు:
నేను ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. “ఎందుకనగా ఈ ప్రపంచం అందరిదీ పుట్టుకతో మానవులందరూ సమానులే.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యమునకు సంబంధించిన ఏయే అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు :

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకము.
  3. గృహనిర్మాణ పథకాలు.
    ఉదా : PAY మొ||
  4. MNREGA
  5. వృద్ధాప్య పింఛన్లు.
  6. ఆరోగ్య పథకాలు.
    ఉదా : ఆయుష్మాన్ భారత్, యన్.టి.ఆర్. వైద్యసేవ మొ||వి.

ప్రశ్న 6.
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
యుద్ధాలను నివారించడం గురించి రెండు నినాధాలు :

  1. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  2. పొరుగు దేశాల వారిని ప్రేమించండి – వారూ మన వంటివారే.
  3. ఆయుధాలు వద్దు – అభివృద్ధి ముద్దు.
  4. విశ్వ మానవ సౌభ్రాతృత్వం – భగవంతునికి ప్రీతి.
  5. యుద్దాలను వీటో చేద్దాం – ప్రపంచ శాంతికి పట్టం కడదాం.

ప్రశ్న 7.
జార్ నికొలాస్ II కాలంలో రష్యాలో జరిగిన పరిణామాలు వివరించుము.
జవాబు:
నికొలాస్ II రష్యా విశాల సామ్రాజ్యాన్ని, సైన్యం, సమర్థులైన పాలనాధికారుల సహాయంతో పాలించాడు. అయితే ప్రపంచయుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ప్రపంచంలో కెల్లా అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. 1917 నాటికి 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయి, మొదటి ప్రపంచయుద్ధంలో అత్యధిక ప్రాణనష్టం చవిచూసింది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్ళించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత ఏర్పడింది. రొట్టె, శాంతి కావాలని మహిళలు, కార్మికులు నిరసన ర్యాలీలతో పాటు ఉద్యమాలు చేపట్టారు. జార్ నికొలాస్ పరారు కావటంతో రాచరికానికి చెందని రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ప్రశ్న 8.
లెనిన్ నాయకత్వంలో రష్యాలో విప్లవం తరువాత బోల్షివిక సంస్కరణలు ఏమిటి?
జవాబు:
బోల్షివి లకు వ్లాడిమిర్ లెనిన్ (1870 – 1924) నాయకత్వం వహించాడు. రష్యాను అగ్రగామిగా చేయడానికి, ప్రజలలో ఆత్మసైర్యం పెంచడానికి అనేక సంస్కరణలు అమలు చేశారు.

  1. షరతులు లేని శాంతిని నెలకొల్పుట.
  2. భూమినంతటిని జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం.
  3. ధరలను నియంత్రించి, మార్కెట్ ధర కల్పించడం.
  4. బ్యాంకులను, కర్మాగారాలను జాతీయం చేసి రైతాంగ, కార్మిక, సైనికుల విశ్వాసం చూరగొనడం.
  5. రష్యన్ అధీనంలో ఉన్న దేశాలన్నీ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టారు.

ప్రశ్న 9.
స్టాలిన్ నాయకత్వంలో రష్యా పురోభివృద్ధిని వివరించండి.
జవాబు:
1924లో లెనిన్ చనిపోయిన తరువాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అయ్యాడు.

  1. తర్వాత దశాబ్దంలో అతడు తన పూర్తి నియంత్రణను సాధించుకొని, వ్యతిరేకత అన్నది లేకుండా చేశాడు.
  2. వివరణ, శాసించటానికి లేని అధికారంతో సోవియట్ రష్యాని బలమైన ఆర్ధిక శక్తిగా మలిచాడు.
  3. 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  4. వేగవంతమైన పారిశ్రామికీకరణతో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాడు.
  5. “భూముల ఏకీకరణ” పేరుతో చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ఉమ్మడి క్షేత్రాలలో వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాడు.

ప్రశ్న 10.
రష్యా (USSR)కి సంబంధించిన హింసాత్మక ధోరణులు తెలుపుము.
జవాబు:
ఆర్థికమాంద్యం సమయంలో కూడా సమర్ధవంతంగా పనిచేసి అద్వితీయ ప్రగతి మార్గాలలో రష్యాను నడిపించిన నాయకులు, బోల్షివికు, కమ్యూనిస్టులు తరువాత కాలంలో అనేక హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు.

  1. పౌరులకు సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ ఇవ్వలేదు.
  2. ప్రజలలో పెల్లుబికిన వ్యతిరేకతను బలంతో అణచివేసారు.
  3. ప్రతిపక్ష నాయకులను నిర్దాక్షిణ్యంగా అధిక సంఖ్యలో చంపేశారు.
  4. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కొరకు అడ్డంగా ఉన్నారనే సాకుతో పెట్టుబడిదారులను తొలగించుకున్నారు.
  5. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను నిషేధించారు.
  6. జార్జ్ ఆర్వెల్ అనే రచయిత “యానిమల్ ఫాం” అనే తన నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR లో ఎలా నీరుకార్చారో వివరించాడు.

ప్రశ్న 11.
హిట్లర్ కొత్త శైలిని, రాజకీయంగా జర్మనీలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించుము.
జవాబు:
ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ప్రపంచం ఆకర్షించే విధానాలతో, ఆలోచనలతో ముందుకు నడిచి, జర్మనీని సరికొత్త మార్గంలో నడిపించిన గొప్పవ్యక్తి హిట్లర్. ఒక అద్భుతమైన వక్త. యువతను ఆకర్షించే క్రమంలో పని, ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ యువతను ఆకర్షించాడు. జర్మనీ ప్రజల గౌరవాన్ని నిలబెడతానంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పాడు. తీవ్ర మాంద్యం, పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపడానికి ప్రయత్నించి సఫలీకృతుడయ్యాడు. రాజకీయ ప్రత్యర్థులను, కమ్యూనిస్టులను అరెస్టు చేసి శిక్షణ శిబిరాలకు పంపించాడు. ప్రత్యేక నిఘా, రక్షణ దళాలను ఏర్పరిచాడు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 12.
“బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందంటూ” హిట్లర్ ఉపన్యాసాన్ని క్లుప్తంగా వివరించండి.
జవాబు:
అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉంటుందని హిట్లర్ చెబుతూ, తన ప్రసంగ, బహిరంగ సమావేశాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను జాగృతం చేశాడు.

భూమి ఎవరికీ కేటాయించబడి లేదు. ఎవరికీ బహుమతిగా కట్టబెట్టలేదు. తమ హృదయాలలో దానిని జయించగల సాహసం, దానిని కాపాడుకోగల బలం, దానిని దున్నగల, శ్రమ చెయ్యగల ప్రజలకు దేవుడు దానిని ఉద్దేశించాడు. ఇది “ప్రపంచం ప్రాథమిక హక్కు శక్తి ఉన్నంతవరకు జీవించటానికి ఉన్న హక్కు. ఈ హక్కు ఆధారంగా బలమైన జాతి తన జనాభాకి తగినట్టు సరిహద్దులను విస్తరించుకుంటుంది. ఈ విధంగా తన వాగ్దాటితో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసాడు.

ప్రశ్న 13.
జార్ పాలనలో రష్యా ప్రగతిని 4 వాక్యాల్లో రాయుము.
జవాబు:
జార్ పాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాల సామ్రాజ్యంగా ఉండేది. చైనా, భారతదేశం తరువాత 15.6 కోట్ల జనాభాతో మూడవ అతి పెద్ద దేశంగా ఉండేది. రష్యన్లలో అధికశాతం వ్యవసాయంతో జీవనోపాధి పొందేవారు. ప్రపంచంలో అతి పెద్ద సైన్యం రష్యాకు ఉండేది. పెద సెన్యం రష్యాకు ఉండేది.

ప్రశ్న 14.
రష్యాలో సోవియట్లు ఎవరు?
జవాబు:
రెండో నికొలాస్ పదవీచ్యుతుడైన తరువాత రష్యాను పాలిస్తున్న ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పితృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక కొరతను తీర్చి యుద్ధాన్ని వ్యతిరేకించిన వాళ్ళను సోవియట్లుగా పిలిచారు.

ప్రశ్న 15.
బోల్షివిక్కుల లక్ష్యాలేమిటి?
జవాబు:

  1. రష్యాలో శాంతిని నెలకొల్పడం.
  2. రైతులందరికీ అండగా నిలిచి మిగులు భూమిని పంచిపెట్టడం.
  3. కర్మాగారాలను, బ్యాంకులను జాతీయం చేయడం.
  4. రష్యా కింద ఉన్న దేశాలకు స్వేచ్ఛను ప్రసాదించడం.

ప్రశ్న 16.
“భూముల ఏకీకరణ” ను క్లుప్తంగా వివరించుము.
జవాబు:
పారిశ్రామికీకరణ, వ్యవసాయంలో భూముల ఏకీకరణ అన్న రెండు విధానాలను స్టాలిన్ ఆధ్వర్యంలో USSR లో అమలు చేశారు. ఈ విధానంలో ….. చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి “ఉమ్మడి క్షేత్రాలతో” చేరేలా బలవంతం చేసి చిన్న కమతాల ఉత్పత్తికి స్వస్తి పలకాలని ప్రయత్నించింది. గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులను ఉమ్మడి ఆస్తిగా భావించారు.

ప్రశ్న 17.
ప్రపంచ శాంతి పరిరక్షణ కొరకు యుద్దాలను నివారించడానికి కొన్ని పరిష్కారాలు సూచించండి.
జవాబు:

  1. ప్రపంచ శాంతి పరిరక్షణలో యుద్ధాలు జరగకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు.
  2. సమస్యల సాధన కోసం ప్రపంచ దేశాలు వీలైనంతవరకు సామరస్యమైన చర్చలకు, అంతర్జాతీయ సమాజ సూచనలపై – ఆధారపడవచ్చు.
  3. ఎక్కువ యుద్ధాలు అగ్రరాజ్యాల స్వార్థాల కోసం, అవి అపార సహజవనరులపై ఆధిపత్యం కోసం, ప్రభావ ప్రాంతాల కోసం చేసిన ఏర్పాట్లవల్లే జరిగాయి. కావున అవి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
  4. శాంతియుత సహజీవనం కోసం ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా సంయమనం పాటించాలి.

ప్రశ్న 18.
ఇచ్చిన కాలపట్టిక చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రారంభం ఏది?
2) హిట్లర్ ఏ దేశానికి చెందినవాడు?
3) USA రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరింది?
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. హిట్లర్ జర్మనీ దేశానికి చెందినవాడు.
  3. USA రెండవ ప్రపంచ యుద్ధంలో డిసెంబర్ 8, 1941లో చేరింది.

ప్రశ్న 19.
ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 1
1) భారతదేశానికి పొరుగున ఉన్న ఏ దేశం జపాన్‌చే ఆక్రమించబడింది?
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న బర్మా జపాన్‌చే ఆక్రమించబడింది.

2) జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం ఏ మహాసముద్రంలో భాగం?
జవాబు:
జపాన్ అధీనంలో ఉన్న అధిక ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో భాగం.

3) 1942లో మంగోలియా జపాన్ అధీనంలో ఉందా?
జవాబు:
1942లో మంగోలియా జపాన్ అధీనంలో లేదు.

ప్రశ్న 20.
ఆర్థికమాంద్యంలో జరిగిన పరిణామాలు వివరించండి.
జవాబు:

  1. ఉపాధి అవకాశాలు కోల్పోయి, యువత వీధిన పడింది.
  2. కరెన్సీ విలువ పడిపోయి ఉద్యోగస్తుల, పింఛనుదారుల పొదుపులు కరిగిపోయాయి.
  3. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి, రైతులు కుప్పకూలిపోయారు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 21.
జర్మనీ ప్రజలకు హిట్లర్ వాగ్దానాలేవి?
జవాబు:

  1. బలమైన దేశాన్ని నిర్మిస్తానన్నాడు.
  2. వర్సయిల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానన్నాడు.
  3. జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానన్నాడు.
  4. పని కావాలనుకునే వారికి పని, యువతకు బంగారు భవిష్యత్తు అందిస్తానన్నాడు.
  5. విదేశీ కుట్రలను తిప్పికొడతానని వాగ్దానం చేశాడు.

10th Class Social 14th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
సోవియట్ రష్యా (USSR) లో జోసెఫ్ స్టాలిన్ వేడట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు ఏవి?
జవాబు:
స్టాలిన్ చేపట్టిన సంస్కరణలు :
1924లో లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు, రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు.

  • 1928లో పంచవర్ష ప్రణాళికలతో USSR ప్రణాళికాబద్ద ఆర్థిక అభివృద్ధిని చేపట్టాడు.
  • వేగవంతమైన పారిశ్రామికీకరణ, వ్యవసాయంతో భూముల ఏకీకరణ అన్న జోడు విధానాలను అవలంబించాడు.
  • స్టాలిన్ నాయకత్వంలో USSR చిన్న, పెద్ద రైతులు తమ భూములను వదిలేసి ‘ఉమ్మడి క్షేత్రాల’లో వేరేలా బలవంతం చేసి చిన్న రైతాంగ ఉత్పత్తికి స్వస్తి పలితాలని ప్రయత్నించింది.
  • ఈ క్షేత్రాలు గ్రామంలోని భూములు, పరికరాలు, యంత్రాలు, పశువులన్నింటిని ఉమ్మడి సొత్తుగా చేశాయి. అందరూ కలిసి వ్యవసాయం చేసి ఉత్పత్తిని పంచుకునేవారు.
  • పరిశ్రమలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండేవి, స్వేచ్ఛ కూర్కెట్ కి అనుమతినివ్వలేడు.
  • మొదట్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గినా, తరువాత అది పెరిగి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో పారిశ్రామికీకరణను USSR సాధించింది.
  • విస్తరించిన విద్యా విధానాన్ని రూపొందించి, కార్మికులు, రైతాంగం విశ్వవిద్యాలయాలలోకి ప్రవేశించే ఏర్పాట్లు చేశారు.
  • మహిళా కార్మికుల కోసం ప్యాక్టరీలలో శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • తక్కువ ఖర్చుతో ప్రజారోగ్యం సంరక్షణ కల్పించి కార్మికులకు ఆదర్శ గృహ వసతిని ఏర్పాటు చేశారు.
  • USSR పౌరులందరికీ పూర్తి ఉపాధి కల్పించగలిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి.
  • ఇదే కాలంలో పాశ్చాత్య ప్రపంచం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. కాని USSR ఈ మాంద్య ప్రభావానికి గురి కాకుండా ఉండటం గొప్ప విషయం.

ప్రశ్న 2.
అమెరికాలో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఏమిటి?
జవాబు:
(అమెరికాలో) 1929 తీవ్ర ఆర్థిక మాంద్యం యెక్క ప్రభావాలు :

  • అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో ఈ పరిణామాలు ప్రారంభమైనాయి.
  • నిరుద్యోగం పెరిగిపోయింది, దాదాపు 25% నిరుద్యోగులు పెరిగారు.
  • అనేక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు 60% దాకా తగ్గిపోయాయి.
  • పేదరికం పెరిగిపోయింది, పెద్ద సంఖ్యలో ఇళ్ళు లేనివాళ్ళతో నిర్జన ప్రాంతాలుగా మారాయి.
  • ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది.
  • డిమాండ్ తగ్గిపోవటంతో, కర్మాగారాలు మూతపడిపోయాయి.
  • ఉత్పత్తి తగ్గిపోవడం వలన వాణిజ్యం తగ్గిపోయింది.
  • ఉత్పత్తి, వ్యాపారం, వాణిజ్యం తగ్గిపోవడంతో ప్రజల నిజమైన ఆదాయం తగ్గిపోయింది.
  • ఈ విధంగా తీవ్ర మాంద్యం కాలంలో అమెరికా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.
  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్వాల్ట్ న్యూడీలను ప్రకటించి, ఆర్థిక సంస్కరణలు చేపట్టి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు.

ప్రశ్న 3.
రష్యా విప్లవం రష్యన్ సమాజంలో తీసుకువచ్చిన మార్పులు ఏవి?
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ప్రశ్న 4.
ప్రపంచ యుద్ధాల పరిణామాలేవి?
జవాబు:
ప్రపంచ యుద్ధాల పరిణామాలు:

  1. ప్రపంచ యుద్ధాల కారణంగా అసంఖ్యాక ప్రాణనష్టం జరిగింది.
  2. ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ధరణ జరిగింది. దాని ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాలు పున:ప్రతిష్టించబడ్డాయి.
  3. అధికార సమతుల్యంలో మార్పులు ఏర్పడ్డాయి.
  4. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి వంటి కొత్త అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి.
  5. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1918లో మహిళలకు ఓటుహక్కు లభించింది.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
జవాబు:
“నాజీ పోలీసులు వారి అధికారాలను ఉపయోగించుకుని లక్షలాది రాజకీయ ఉద్యమకారులను, కార్మిక సంఘ నాయకులను అల్పసంఖ్యాక వర్గ ప్రజలను అరెస్టు చేసి హింసించేవాళ్ళు. అంతకు ముందెన్నడూ లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు, వ్యతిరేకులను భయభ్రాంతుల్ని చేశారు.”
జవాబు:

  1. ఇవ్వబడిన పేరాగ్రాఫ్ నాజీ సైనికుల క్రూర విధానాలను విశదీకరిస్తుంది.
  2. హిట్లర్ జర్మనీలోని లక్షలాది రాజకీయ నాయకులను, కార్యకర్తలను, కార్మిక సంఘాల నాయకులను నిర్బంధించి, హింసించాడు. అల్పసంఖ్యాక వర్గాలవారు కూడా పీడించబడ్డారు. ఈ పరిస్థితి జర్మనీలో హిట్లర్ నాయకత్వంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది.
  3. 1932 ఎన్నికలలో గెలిచిన హిట్లర్ ‘ఎనేబ్లింగ్ యాక్ట్’ను తెచ్చి, గెస్టాపో, రక్షణ దళాలు, నేర విచారణ పోలీసులు, భద్రత సేవలు వంటి ప్రత్యేక నిఘా, భద్రతా దళాలను ఏర్పరిచాడు. ఈ దళాలు అమానుషంగా వ్యవహరించి, ప్రజల్లో భయందోళనలను సృష్టించాయి.
  4. హిట్లర్ ఏ రాజకీయ పార్టీని లేదా కార్మికసంఘాన్ని పనిచేయనీయలేదు. ప్రజలందరినీ నాజీలను అనుసరించమని ఆదేశించాడు. శాంతి అనేది శూన్యం. యూదులను శత్రువులుగా చూసేవాడు. వారిని నిర్బంధ శిబిరాలకు పంపేవాడు. వారిలో చాలామంది గ్యాస్ చాంబర్లలో చంపబడ్డారు.
  5. తను సూచించినదే ప్రతి ఒక్కరు అనుసరించాలని హిట్లర్ భావించేవాడు. తన చట్టాన్ని అమలుపరచడంలో హిట్లర్ . ఎంత మొండివాడో దీనివల్ల తెలుస్తోంది.
  6. ఒకవేళ హిట్లర్ ప్రజాస్వామిక విధానాలను అనుసరించి వుంటే, జర్మనులను ఒకే వేదిక పైకి తేగలిగేవాడు కాదు. వర్సయిల్స్ సంధిలో జర్మనీపై అనేక షరతులున్నందున, హిట్లరే ప్రతీకారం తీర్చకోవాలని భావించాడు.
  7. యూదుల పట్ల అతని క్రూర వైఖరి కారణంగా అందరు హిట్లర్‌ను విమర్శించారు. అతని చర్యల మూలంగా జర్మనీ మొత్తం భయభ్రాంతమయింది.
  8. నాజీలకు అనుకూలంగా ఉండేందుకు సమాజాన్ని నియంత్రించడానికి అనేక పోలీసు దళాలను ఏర్పరచాడు. ఎవరైనా హిట్లర్ విధానాలను వ్యతిరేకించినా విమర్శించినా గెస్టాపో (రహస్య పోలీసు బృందం) వారిని నిర్బంధించి, నిర్బంధ శిబిరాల్లో చంపేవారు.
  9. హిట్లర్ చర్యలు అన్యాయపూరితమైనవని, అప్రజాస్వామికమైనవని నేను భావిస్తాను. అమాయకులు ఎందరో బాధించబడ్డారు.
  10. ప్రస్తుతం అన్ని దేశాలు ప్రజాస్వామిక ప్రభుత్వాలవైపు నడుస్తున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని విజయవంతం చేయాలంటే, అక్షరాస్యతా శాతం ప్రధాన అంశంగా ఉండాలి.
  11. అన్ని దేశాలు అక్షరాస్యతా శాతంపై దృష్టి సారించి, వివిధ కార్యక్రమాలను చేపట్టి, పటిష్టంగా అమలుపరచాలి. తద్వారా ఏ దేశంలోను అటువంటి పరిస్థితికి తావుండదు.

ప్రశ్న 6.
క్రింది పేరాను చదివి, మీ వ్యాఖ్యానాన్ని రాయండి.
“యుఎస్ఎస్ఆర్ ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్ ప్రయోగం ప్రారంభించింది. ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చెయ్యటానికి యుఎస్ఎస్ఆర్ ప్రయత్నించింది.”
జవాబు:

  1. యుఎస్ఎస్ఆర్ సమానత్వంతో కూడిన దేశాన్ని స్థాపించిందని ఈ పేరాగ్రాఫ్ వలన తెలుస్తోంది. అక్కడ పెట్టుబడిదారులు, దోపిడీదారులు మరియు పీడితులు లేరు.
  2. అది పారిశ్రామికీకరణ మరియు ఆధునిక సాంకేతిక, కాలానుగుణ జీవనశైలి వంటి వాటిని అనుసరించినా అసమానత అనేది ఏ రూపంలోనూ లేదు. అదే సోషలిజం యొక్క అసలైన ఉద్దేశ్యం.
  3. ఆ కాలంలో సమానత్వం, ఆధునిక ప్రగతి ఒక్క యుఎస్ఎస్ఆర్లో తప్ప మరే దేశంలోను లేదు.
  4. ఏ దేశంలోనైనా వివక్ష ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో వివక్ష రంగు రూపంలో కనిపిస్తుంది.
    ఉదా : తెల్లవారు, నల్లవారు.
  5. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలలోని అనేక దేశాలు ఆఫ్రికా నుండి ప్రత్యేకించి నైజీరియా నుండి బానిసలను కొనుగోలు చేసేవి. నైజీరియన్లు కూడ మానవులే కాని అమెరికన్లు అలా భావించేవారు కాదు.
  6. కొన్ని దేశాల్లో యూదులు ద్వితీయ శ్రేణి ప్రజలుగా పరిగణింపబడ్డారు. శారీరకంగా హింసించబడ్డారు. కొన్ని సందర్భాల్లో వారు గ్యాస్ చాంబర్లలో పాశవికంగా చంపబడ్డారు.
  7. మన దేశంలో కొన్ని కులాలు ఉన్నత కులాలుగా, మరికొన్ని తక్కువ కులాలుగా ఉండేవి. ఈ కుల, మత, లింగ, వర్ణ, భాషాపరమైన వివక్ష ప్రతిచోటా ఉంది.
  8. అసంఘటిత రంగంలో పురుషులకిచ్చే వేతనం కన్న స్త్రీలకిచ్చే వేతనం తక్కువ.
  9. బాలురను పై చదువులు చదివిస్తుంటే, బాలికలను అనేక కారణాలతో పాఠశాలలకు పంపడం లేదు.
  10. చాలా దేశాలు తమ రాజ్యాంగాలలోని పీఠికలలో సమానత్వానికి ప్రాధాన్యతనిస్తామని, వివక్ష ఏ రూపంలోనూ ఉండదని పేర్కొన్నాయి.
  11. పూర్వకాలంలో మన దేశాన్ని రాజులు, ఫ్యూడల్ భూస్వాములు పరిపాలించారు. కొంతమంది రాజులు ప్రజావాణికి విలువ ఇచ్చినా, అత్యధికులు ప్రజలను పట్టించుకోలేదు. అందువలన పేద ప్రజలు అవమానించబడ్డారు. వారికి తగిన గౌరవం దక్కలేదు.
  12. ప్రతి దేశం సమానత్వాన్ని పాటించాలని నేను కోరుకుంటాను. పీడిత వర్గాల ఉద్ధరణ జరగాలి. సమానత్వాన్ని పాటించే దేశం అన్ని దేశాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.

ప్రశ్న 7.
తీవ్ర ఆర్థిక మాంద్యంకు గురికాకుండా ఉండటానికి రష్యా దేశం అనుసరించిన సంస్కరణలు, పద్ధతులు ఏవిధంగా ఉపయోగపడ్డాయో వ్రాయండి. .
జవాబు:

  1. అంతర్జాతీయ మార్కెట్ తో యు.ఎస్.ఎస్.ఆర్ అనుసంధానమై లేదు
  2. యు.ఎస్.ఎస్.ఆర్.లో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం ఉండేది. 3) ఏమి ఉత్పత్తి చేయాలో, ఎంత ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయించేది.
  3. దీని డిమాండ్ – సరఫరా మధ్య సమతౌల్యాన్ని అది సాధించగలిగింది.

ప్రశ్న 8.
జర్మనీలో నాజీయిజం ప్రాబల్యం గురించి వివరించండి.
జవాబు:

  1. ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమయిన దేశం జర్మనీ.
  2. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజలలో తీవ్ర భయాందోళలను కలిగించింది.
  3. ఈ పరిస్థితిని హిట్లర్ మరియు నాజీలు చాలా తెలివిగా వినియోగించుకున్నారు
  4. తన మాటల ద్వారా, ఉద్వేగం ద్వారా హిట్లర్ ప్రజలను కదిలించి వేశాడు.
  5. అన్ని విషయాలలో బలమైన దేశాన్ని నిర్మిస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు.
  6. రాజకీయాలలో కొత్తశైలిని ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించాడు.
  7. వీటన్నిటి ఫలితంగా 1932 నాటికి నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
  8. 1933లో ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా హిట్లర్ జర్మనీకి నియంతగా అవతరించాడు. నాజీ ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా అవతరించింది.

ప్రశ్న 9.
ఈ క్రింది కాలపట్టిక సహాయంతో దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
1) రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణమేమి?
2) అమెరికా ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధములోనికి ప్రవేశించింది?
3) వైమర్ రిపబ్లిక్ ఏ దేశమునకు చెందినది?
4) 1941లో సంభవించిన ఏవేని రెండు సంఘటనలు వ్రాయండి.
జవాబు:

  1. పోలెండ్ పై జర్మనీ దండెత్తడం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభాన్ని సూచిస్తోంది.
  2. డిసెంబరు 8, 1941
  3. జర్మనీ
  4. 1. యు.ఎస్.ఎస్.ఆర్ పై జర్మనీ దండెత్తడం
    2. యూదులపై సామూహిక హత్యాకాండ
    3. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో చేరడం.

ప్రశ్న 10.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్ వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించాడు. దీని ప్రకారం మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణ, ఆర్థిక పరిస్థితి తిరిగి కోలుకోటానికి చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెట్టసాగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకావటంతో సైన్యం, ఆయుధాలపై ప్రభుత్వ ఖర్చు పెరిగి కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకి ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే ఎంతో అవసరమైన సామాజిక భద్రతా విధానాన్ని కూడా రూజ్ వెల్ట్ ప్రవేశపెట్టాడు. అందరికీ వర్తించే పదవీ విరవమణ పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి దీనివల్ల సమకూరాయి. అమెరికాలోని సంక్షేమ వ్యవస్థకు ఇది ఒక చట్రాన్ని ఏర్పరిచింది. మాంద్యం మొదలుకాక ముందు మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనే ఈ దిశలో బ్రిటన్ కొన్ని చర్యలు చేపట్టింది. నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను పథకాలను ఏర్పరించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి బ్రిటన్ కూడా నిరుద్యోగ భృత, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ వంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యం అన్న దానిని ఏర్పరచటానికి దోహదం చేశాయి. దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. పని చెయ్యగల పౌరులందరికీ ఉపాధిని కల్పించే బాధ్యతను చాలావరకు ప్రభుత్వం తీసుకుంది. ఈ విధంగా ప్రభుత్వం మార్కెటు ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడిదుడుకులను తగ్గించటానికి ప్రయత్నించింది.
“రూజ్ వెల్ట్ ప్రకటించిన కొత్త ఒప్పందంలోని సంస్కరణలు ప్రజల ఆర్ధిక పరిస్థితి బాగుచేసి, సంక్షేమ రాజ్యానికి దోహదం చేశాయి.” అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? చర్చించండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రూజ్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించి, దాని ప్రకారం ప్రజలకు అనేక సంస్కరణలను కల్పించాడు. అవి

  1. ఆర్థిక మాంద్యానికి గురైన వారికి పునరావాసం, ఆర్థిక సంస్థల సంస్కరణల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కోలుకోటానికి అవసరం అయిన చర్యలు చేయబడ్డాయి.
  2. ప్రజలకు అవసరం అయినా సంస్కరణల కొరకు ప్రభుత్వం చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది.
  3. ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావటంతో కర్మాగారాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగాయి.
  4. అమెరికా, ప్రజలకు ఎంతో అవసరం అయిన ‘సామాజిక భద్రతా విధానాన్ని’ ప్రవేశపెట్టింది. ‘సామాజిక భద్రతా విధానంలోని కొన్ని అంశాలు :
    ఎ) ప్రజలందరికి వర్తించే పదవీ విరమణ పింఛను,
    బి) నిరుద్యోగులకు బీమా పథకాలు కల్పించడం,
    సి) వికలాంగులకు, తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు సంక్షేమ ప్రయోజనాలు వంటివి కూడా కల్పించబడినాయి.
    5) సంక్షేమ రాజ్యం అనే విధానం ప్రకారం, ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి విషయాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది.

పై సంస్కరణలను ప్రజలందరికీ కల్పించి, వాటి అమలుకు ప్రభుత్వమే హామీగా పంపి, అమలు జరిగేలా చూసి, సంక్షేమ రాజ్యానికి ఈ సంస్కరణ దోహదం చేశాయని చెప్పవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 11.
ఈ క్రిందివాటిని ప్రపంచపటంలో గుర్తించుము.

  1. సెయింట్ పీటర్స్బర్గ్
  2. మాస్కో
  3. కిర్గిజ్స్తాన్
  4. యుక్రెయిన్
  5. ఉజ్బెకిస్తాన్
  6. తజికిస్తాన్
  7. కజికిస్తాన్
  8. టర్కో మేనియా

AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 3

ప్రశ్న 12.
పట్టిక ఆధారంగా జర్మనీ చరిత్రలోని ముఖ్య సంఘటనలను విశ్లేషించుము.
AP 10th Class Social Important Questions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-II 2
జవాబు:
పై కాలపట్టికను పరిశీలించగా ఈ విషయాలు తెలియుచున్నవి.

జర్మనీ, మొదటి ప్రపంచయుద్ధం తరువాత 1918,నవంబరు 9న ‘వైమర్’ గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. నెమ్మదిగా నాజీజం వ్యాప్తిలోకి వచ్చి, చివరికి- 1933, జనవరి 30న నాజీ-అధ్యక్షుడు హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు. ప్రపంచంలో జర్మనీ జాతి గొప్పదనే భావనను హిట్లర్ ప్రచారం చేశాడు. సామ్రాజ్య కాంక్షతో అనేక దేశాలను ఆక్రమించుకుంటూ చివరికి 1939, సెప్టెంబర్ 1న, జర్మనీ పోలెండ్ పై దాడి చేయటం రెండవ ప్రపంచయుద్ధ ప్రారంభానికి కారణం అయింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941, జూన్ 22న జర్మనీ యు.ఎస్.ఎస్.ఆర్ పై దండయాత్ర చేసింది. హిట్లర్కు యూదులంటే ద్వేషం. వారి మీదున్న ద్వేషంతో అనేక మంది యూదులను హింసలకు గురిచేశాడు. 1941, జూన్ 23న హిట్లరు యూదులపై సామూహికంగా హత్యకాండ జరిపినాడు అని కాలపట్టిక ద్వారా తెలియుచున్నది.