AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

These AP 10th Class Social Studies Important Questions 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 7th Lesson Important Questions and Answers ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social 7th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఎంత?
జవాబు:
2 లక్షలు

2. తిరుపతిలోని విమానాశ్రయం ఎక్కడ ఉంది?
జవాబు:
రేణిగుంట.

3. విమానాశ్రయ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)

4. మహానగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.

5. హైద్రాబాదు మెట్రోపాలిటన్ నగరం అనడానికి కారణ మేమిటి?
జవాబు:
జనాభా 10 లక్షల కంటే ఎక్కువ, కోటికి తక్కువగా

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

6. ఒక లక్ష నుండి పదిలక్షల మధ్య జనాభా గల నివాస ప్రాంతాలను ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
క్లాస్ – 1 నగరాలు.

7. క్రింది వానిలో పట్టణ జనాభా పెరుగుదలకు కారణం కాని అంశమేది?
→ సహజ పెరుగుదల.
→ గ్రామీణ ప్రాంతాలను పట్టణాలలో ప్రాంతాలుగా ప్రకటించింది.
→ వలసలు.
→ పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం.
జవాబు:
పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం.

8. ఆది మానవులు నివసించిన భింబేడ్క రాతి గుహలు ఏ రాష్ట్రంలో కలవు?
జవాబు:
మధ్య ప్రదేశ్.

9. మహా నగరాలలో జనాభా ఎంత?
జవాబు:
ఒక కోటికి మించి.

10. హీథే అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
లండన్ (UK)

11. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
జవాబు:
బ్యాంకాక్ (థాయ్ లాండ్)

12. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?
జవాబు:
ఈజిప్టు

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

13. ఏ ప్రాంతాలలో కొండ చరియలు విరిగి పడటం జరుగుతుంది?
జవాబు:
హిమాలయాలు.

14. మానవులు సుమారు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు?
జవాబు:
1.8 లక్షల సంవత్సరాలు.

15. కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకోవడం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది?
జవాబు:
10,000 సంవత్సరాలు.

16. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఏ నగరం ఉండటం కేంద్రంగా ఉంది?
జవాబు:
ఢిల్లీ

17. ప్రస్తుతం భారతదేశంలో ఢిల్లీ ఎన్నో పెద్ద నగరం జనాభా ప్రకారం?
జవాబు:
రెండవ.

18. ప్రస్తుత ఢిల్లీ నగర జనాభా ఎంత?
జవాబు:
1,60,00,000.

19. 1951లో ఢిల్లీ నగర జనాభా ఎంత?
జవాబు:
20,00,000.

20. గత 60 సంవత్సరాలలో ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది?
జవాబు:
8 రెట్లు.

21. ఢిల్లీకి మాస్టర్ ప్రణాళికను ఎన్నిసార్లు తయారు చేశారు?
జవాబు:
3 సార్లు.

22. 19వ శతాబ్దంలో ఏ పట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిషు, ఫ్రెంచి దేశాలు నావికా యుద్ధానికి దిగాయి?
జవాబు:
విశాఖపట్టణం

23. భారతదేశంలో ప్రస్తుతం ఎంతమంది ప్రజలు నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు?
జవాబు:
35 కోట్ల మంది (దాదాపు 1/3 వంతు)

24. ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో సంబంధాన్ని తెలియజేయునది ఏది?
జవాబు:
పరిస్థితి.

25. ప్రతాప్ గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
మహారాష్ట్ర.

26. ఏవి నిర్మించే అవకాశం ఉండటం వల్ల వలస పాలకులు తీరప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు?
జవాబు:
రేవులు.

27. విశాఖపట్నం ఏ తీరంలో ఉంది?
జవాబు:
బంగాళాఖాతం.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

28. మానవులు ఏది ప్రారంభించిన తరువాత స్థిర నివాసం ఏర్పరచుకున్నారు?
జవాబు:
వ్యవసాయం.

29. ఢిల్లీలో ప్రణాళికబద్ధ కాలనీల శాతం ఎంత?
జవాబు:
23.7%

30. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో ఎక్కడ కోట నిర్మించారు?
జవాబు:
ప్రతాప్ గఢ్.

31. భారతదేశంలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
50 పైగా

32. ఏది అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు?
జవాబు:
వ్యవసాయం.

33. వృత్తి పనివాళ్ళు ఎక్కడ స్థిరపడటానికి పాలకులు ప్రోత్సహించారు?
జవాబు:
పట్టణ ప్రాంతాల్లో.

34. ఒక ప్రాంత లక్షణాలను తెలియ జేయునది ఏది?
జవాబు:
ప్రదేశం.

35. విమానాశ్రయాల చుట్టూ ఏర్పడే నివాస ప్రాంతాలను ఏమంటారు?
జవాబు:
విమానాశ్రయ నగరం.

36. ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరుచుకున్న పద్ధతినేమంటారు?
జవాబు:
నివాస ప్రాంతం.

37. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద నగరం ఏది?
జవాబు:
ముంబయి.

38. ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు?
జవాబు:
ముంబయి, చెన్నై.

39. ఏ దశాబ్ద కాలంలో విశాఖ పట్టణం జనాభా గణనీయంగా పెరిగింది?
జవాబు:
1961.

40. భారతదేశంలో ప్రస్తుత గ్రామాల సంఖ్య?
జవాబు:
6.4 లక్షలు.

41. జనాభా వృద్ధిలో ఎన్నో వంతు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది?
జవాబు:
1/5 వంతు

42. 2009 – 10లో షెడ్యూల్డ్ కులాలు / జాతులకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం ఎంత?
జవాబు:
1/6 వంతు

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

43. కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
మహానగరాలు.

44. పదిలక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
మెట్రో పాలిటన్ నగరాలు.

45. ఒకలక్ష – పదిలక్షల మధ్య జనాభా ఉన్న నగరాలను ఏమంటారు?
జవాబు:
క్లాస్ -1 నగరాలు.

46. పట్టణీకరణ వల్ల ఏర్పడే ప్రధాన సమస్యను ఒకదానిని తెల్పండి.
జవాబు:
మురుగునీటి పారుదల సమస్య, పారిశుద్ధ్య (చెత్త) నిర్వహణ సమస్య. వాయుకాలుష్యం, మంచినీటి సమస్య, వసతి సమస్య మొ||నవి.

47. DDA ని విస్తరింపుము.
జవాబు:
ఢిల్లీ అభివృద్ధి సంస్థ (Delhi Development Authority)

48. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్టణం జనాభా ఎంత?
జవాబు:
20,35,690

49. ఢిల్లీ నగరంలోని చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించని గుడిసెలను ఏమని పిలుస్తారు?
జవాబు:
జుగ్గి జోష్ఠిలు

50. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ ఓడరేవు ఏది?
జవాబు:
విశాఖపట్టణం

51. హైద్రాబాద్ నగర జనాభా 78 లక్షలు అయినచో ఈ నగరం ఏ విధమైన ప్రాంత రకంనకు చెందుతుంది?
జవాబు:
మెట్రోపాలిటన్ నగరం.

52. బరంపురం నగరపాలక సంస్థ (BMC) ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
ఒడిశా.

53. BMC ఏర్పాటు చేయనున్న ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి సాంకేతిక, విధానపర మద్దతు అందిస్తోన్న అంతర్జాతీయ సంస్థ ఏది?
జవాబు:
అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IFC).

54. ప్రస్తుతం కోటి జనాభా దాటిన నగరాలు (భారత దేశంలో) ఎన్ని ఉన్నాయి?
జవాబు:
మూడు.

55. 1950 లలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఎన్ని ఉండేవి?
జవాబు:
అయిదు.

56. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ……. ప్రాంతాలలో పేదరిక స్థాయి తక్కువ.
జవాబు:
పట్టణ.

57. జనాభా ఆధారంగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా నగరాలను అవరోహణ క్రమంలో అమర్చి రాయండి.
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.

58. భారతదేశంలోని మెట్రో పాలిటన్ నగరానికి ఒక ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
హైద్రాబాద్, అహ్మదాబాద్, చెన్నై.

59. గుంటూరు నగర జనాభా 6.70 లక్షలు. అయితే ఈ ఏవి?
జవాబు:
క్లాస్ – 1 నగరం.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

60. కింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ మహానగరాలు – కోటి మించి జనాభా.
→ పట్టణాలు – 5 వేల నుంచి 1 లక్ష మధ్య జనాభా
→ క్లాస్ – 1 నగరాలు – ఒక లక్ష నుంచి పది లక్షల మధ్య జనాభా.
→ మెట్రోపాలిటన్ నగరాలు – 10 లక్షలు నుంచి 50 లక్షల మధ్య జనాభా.
జవాబు:
మెట్రో పాలిటన్ నగరాలు – 10 లక్షలు నుంచి 50 లక్షల మధ్య జనాభా.

61. కోల్‌కతా ఏ నివాస ప్రాంత రకానికి చెందినది?
జవాబు:
మహానగరం.

62. ఢిల్లీ నగరంలో ఎటువంటి భూములు ఉన్న ప్రాంతాలు బస్తీలుగా, మురికి వాడలుగా ఆక్రమణకు గురయ్యాయి?
జవాబు:
సాంప్రదాయ ఉమ్మడి భూములు.

63. ప్రభుత్వ గుర్తింపు పొందని నివాస ప్రాంతాలను ఏమంటారు?
జవాబు:
అనధీకృత కాలనీలు.

64. క్రింది వానిలో విమానాశ్రయ నగరాలలోని సదుపాయం కానిది ఏది?
హెటళ్ళు, దుకాణాలు, బంధువుల ఇళ్ళు, వినోదం.
జవాబు:
బంధువుల ఇళ్ళు.

65. 2001 -2011 మధ్యకాలంలో పట్టణ జనాభాకు సంబంధించిన గణాంకాలలో సరికానిది ఏది?
→ 9.1 కోట్లు పెరిగింది.
→ 44% సహజ పెరుగుదల వల్ల పెరిగింది.
→ 32% పట్టణాల విస్తరణ వల్ల పెరిగింది.
→ 34% వలసల వల్ల పెరిగింది.
జవాబు:
34% వలసల వల్ల పెరిగింది.

66. D. D. A. అను సంస్థను ఏ నగర అభివృద్ధికై ఏర్పాటు చేసారు?
జవాబు:
ఢిల్లీ

67. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలను రూపొందించటానికి, కేటాయించడానికి (సాధారణంగా) తప్పనిసరిగా ఉండాల్సినది ఏది?
జవాబు:
మాస్టర్ ప్రణాళిక.

68. నివాస ప్రాంతాల పిరమిడ్ లో ఎగువ స్థాయిలో ఉండేవి నగరం ఏ విధమైన నివాస ప్రాంతం క్రిందకు వస్తుంది?
జవాబు:
మహానగరాలు.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

69. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కైరో విమానాశ్రయము ( ) a) ఈజిప్టు
ii) హీధ్రా విమానాశ్రయము ( ) (b) లండన్
iii)సువర్ణభూమి విమానాశ్రయము ( ) c) బ్యాంకాక్
iv) దుబాయి విమానాశ్రయము ( ) d) UAE మధ్య జనాభా.
జవాబు:
1-a, ii-b, iii – c, iv-d.

70. ‘X’ అనే నగర జనాభా ప్రస్తుతం 8 లక్షలు, కనీసం ఇంకెంత పెరిగితే దానిని మెట్రోపాలిటన్ నగరం అని పిలవవచ్చు.
జవాబు:
2 లక్షలు.

71. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 2009-10లో SC/ST లకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/6వ వంతు ఉంది.
ii) 2009-10లో SC/ST లకు చెందని పట్టణ ప్రాంత ప్రజలలో పేదరికం 1/3 వ వంతు ఉంది.
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) & (ii)
D) రెండూ కావు
జవాబు:
(C) i & ii

10th Class Social 7th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
గత చరిత్ర మరియు వర్తమాన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే విశాఖపట్నం జనాభా పెరుగుదల తీవ్రంగా ఉండటానికి గల ముఖ్య కారణాలు ఏవై ఉంటాయని నీవు భావిస్తావు?
జవాబు:
విశాఖపట్టణం జనాభా పెరుగుదల తీవ్రంగా ఉండుటకు కారణాలు :

  1. రేవు పట్టణంగా విశాఖపట్టణానికి ఉన్న ప్రాముఖ్యత.
  2. రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండుట.
  3. వలస ప్రజలు విశాఖపట్టణానికి ఎక్కువగా రావడం.
  4. విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండుట.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 2.
కొన్ని ప్రదేశాలు చక్కని నివాస ప్రాంతాలుగా ఎక్కువ మందిని ఆకర్షించడానికి గల కారణం ఏమిటి?
జవాబు:

  1. నీటివనరులు
  2. నేల రకాలు
  3. భద్రత
  4. ప్రకృతి శక్తుల నుంచి రక్షణ
  5. సహజ ఓడరేవు
  6. విమానాశ్రయం
  7. రైల్వే స్టేషన్
  8. బస్టాండ్
  9. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు గల ప్రదేశాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి.

ప్రశ్న 3.
ఢిల్లీ నగర జనాభా

సంవత్సరంజనాభా (లక్షల్లో)
195120
196135
197148
198168
1991100
2001120

ఢిల్లీ నగర జనాభా అనూహ్యంగా ఏ దశాబ్దంలో పెరిగింది? దానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
1. 1981 – 1991 దశాబ్దంలో ఢిల్లీ నగర జనాభా అత్యధికంగా పెరిగింది.
2. ఉపాధి అవకాశాలు, వలసలు, విద్య, వైద్య సదుపాయాలు మొదలగు కారణాల వలన ఢిల్లీ జనాభా పెరిగింది.

ప్రశ్న 4.
మహానగరాలు అని వేటిని పిలుస్తాము? ఉదాహరణనిమ్ము.
జవాబు:
కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను మహానగరాలు అంటారు.
ఉదా : ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా

ప్రశ్న 5.
మెట్రోపాలిటన్ నగరం అని దేనినంటారు? ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
పది లక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలిటన్ నగరాలు అంటారు.
ఉదా : చెన్నై, హైదరాబాదు, అహ్మదాబాదు.

ప్రశ్న 6.
పట్టణీకరణ సమస్యలకు ఏవేని రెండు పరిష్కార మార్గాలను సూచించంది.
జవాబు:
పట్టణీకరణ సమస్యలకు పరిష్కార మార్గాలు :

  1. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గించాలి. దానికిగాను గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన గావించాలి.
  2. వివిధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయాలి. అలాంటి వారిని ప్రోత్సహించాలి.
  3. చెత్తను రీసైకిల్ చేయటం, చెత్త శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలి.
  4. ప్లాస్టిక్ వినియోగం వీలైనంత తగ్గించాలి, అవసరమైతే నిషేధించాలి.

ప్రశ్న 7.
నివాసప్రాంతంలో ఏయే కార్యక్రమాలు జరుగుతాయి?
జవాబు:
నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యక్రమాలుంటాయి.

ప్రశ్న 8.
మానవుడు వ్యవసాయం ప్రారంభించి సుమారు ఎంతకాలమైంది?
జవాబు:
మానవుడు వ్యవసాయం ప్రారంభించి 10,000 సంవత్సరాలైంది.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 9.
భీంబేడ్కా ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
భీంబేడ్కా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

ప్రశ్న 10.
భీంబేడ్కా రాతి గుహలలో ఏమి బయటపడ్డాయి?
జవాబు:
భీంబేడ్కా రాతి గుహలలో ఆదిమానవులు గీచిన చిత్రాలు బయటపడ్డాయి.

ప్రశ్న 11.
జుగ్గి జోష్ఠి ప్రాంతాలు అంటే ఏమిటి?
జవాబు:
ఢిల్లీలో చట్టబద్ధమైన నివాసాలుగా గుర్తించిన గుడిసెలను జుగ్గి జోష్ఠి అంటారు.

ప్రశ్న 12.
ఢిల్లీకి ఎన్నిసార్లు మాస్టర్ ప్రణాళికను తయారుచేశారు?
జవాబు:
ఢిల్లీకి 3 సార్లు మాస్టర్ ప్రణాళికను తయారుచేశారు.

ప్రశ్న 13.
D.D.A ను విస్తరించండి.
జవాబు:
Delhi Development Authority ఢిల్లీ అభివృద్ధి సంస్థ.

ప్రశ్న 14.
పట్టణీకరణ అంటే ఏమిటి?
జవాబు:
ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేస్తూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకొనుటను పట్టణీకరణ అంటాం.

ప్రశ్న 15.
భారతదేశంలో అత్యధిక జనాభా గల 3 నగరాలేవి?
జవాబు:
భారతదేశంలో అత్యధిక జనాభా గల 3 నగరాలు : ముంబై, ఢిల్లీ, కోల్‌కతా.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 16.
విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి?
జవాబు:
పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్న నగరాలనే విమానాశ్రయ నగరాలు అంటారు.

ప్రశ్న 17.
రెవెన్యూ గ్రామాలంటే ఏమిటి?
జవాబు:
నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాలను రెవెన్యూ గ్రామాలు అంటాం.

ప్రశ్న 18.
కోటి జనాభా దాటిన నగరాలనేమంటారు?
జవాబు:
కోటి జనాభా దాటిన నగరాలను మహా నగరాలు అంటారు.

ప్రశ్న 19.
ఆవాస ప్రాంతం అంటే ఏమిటి?
జవాబు:
ఆవాస ప్రాంతం అనగా రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ల సముదాయం

10th Class Social 7th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
భారతదేశంలో ఢిల్లీ రెండవ అత్యంత పెద్ద నగరముగా పేర్కొనబడుటకు గల కారణములేవి?
జవాబు:
భారతదేశంలో ఢిల్లీ రెండవ అత్యంత పెద్ద నగరముగా పేర్కొనటానికి కారణాలు :

  1. భారతదేశానికి స్వాతంత్ర్యంకు పూర్వం, వచ్చిన తరువాత ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగడం.
  2. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో ప్రజలు ఈ నగరానికి వలస రావడం.
  3. దేశ రాజధాని కావటం, పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వలన అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసిస్తున్నారు.
  4. ఢిల్లీ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడం.
  5. ఢిల్లీ, చుట్టుప్రక్కల ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికాభివృద్ధి జరగడం.

ప్రశ్న 2.
“పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడటంలేదు.” నగరాలలో పేద ప్రజల పరిస్థితులపై నీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. పట్టణ పేద ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు, ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండవు.
  2. పౌష్టికాహారం పొందలేని స్థాయిలో ఇక్కడ పేద ప్రజలు ఉంటారు.
  3. సరైన గృహవసతి ఉండదు.
  4. విద్యా, వైద్య సదుపాయాలు వీరికి అందుబాటులో ఉండవు. అందువలన పట్టణ ప్రాంతాలలోని పేద ప్రజలు దయనీయ పరిస్థితులలో జీవిస్తున్నారు.

ప్రశ్న 3.
ఈ క్రింది పట్టిక ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
విశాఖపట్టణం జనాభా

సంవత్సరముజనాభామార్పు శాతంలో
19511,08,042+53.8%
19612,11,190+95.5%
19713,63,467+72.1%
19816,03,630+66.1%
19917,52,031+24.6%
200113,45,938+78, 97%
201120,35,690+51.2%

i) ఏ దశకంలో జనాభా మార్పు (శాతంలో) తక్కువగా ఉంది?
జవాబు:
1991 వ దశకంలో జనాభా మార్పు (శాతంలో) తక్కువగా ఉంది. +24.6% మాత్రమే.

ii) విశాఖపట్టణం జనాభా గణనీయంగా పెరగటానికి గల కారణమేమి?
జవాబు:

  1. రేవు పట్టణంగా విశాఖ పట్టణానికి ఉన్న ప్రాధాన్యత.
  2. రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండుట.
  3. విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండుట.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 4.
పట్టణీకరణ సమస్యల గురించి రాయండి.
జవాబు:
పట్టణీకరణ సమస్యలు :

  1. గృహవసతి
  2. నీటి సరఫరా
  3. మురుగు నీరు
  4. ఇతర వ్యర్థ పదార్థాలు
  5. రవాణా మరియు రద్దీ
  6. వాయు కాలుష్యం
  7. అంటు వ్యాధులు
  8. వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు

ప్రశ్న 5.
పట్టణీకరణ వలన పర్యావరణంపై పడే ఒత్తిడి ఏ విధమైన అనర్థాలకు దారితీస్తుందో తెలుపుము.
జవాబు:
పట్టణీకరణ వలన కలిగే అనర్థాలు :

  1. వాయు కాలుష్యం పెరుగుతుంది.
  2. శీతోష్ణస్థితి మార్పులు సంభవిస్తాయి.
  3. మురుగునీటి పారుదల సమస్యలు పెరగుతాయి.
  4. భూమిలో కలవని వ్యర్థాలు పెరిగిపోతాయి.

ప్రశ్న 6.
ఢిల్లీ నగరానికి వలసలు పెరగడానికి కారణాలేంటి?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఢిల్లీ దేశరాజధానిగా కొనసాగింది. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ నగరానికి వలసలు రాసాగారు. దేశ రాజధాని కావటం, పార్లమెంటు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వలన అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి నివసిస్తున్నారు. కోటీ అరవై మూడు లక్షల మందితో ఢిల్లీ దేశంలో రెండో పెద్ద నగరంగా పెరిగింది.

ప్రశ్న 7.
మాస్టర్ ప్రణాళిక అనగానేమి? వాటిలో ఏమేముంటాయి?
జవాబు:
ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించటానికి, కేటాయించటానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఏ నగరంలోనైనా నివాసప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయ ప్రాంతాలు, ఆ ఉద్యానవనాలు, వినోద స్థలాలు వంటివి ఉండాలి. దీని ఆధారంగా ఎలాంటి రోడ్లు ఉండాలి, ఎంత విద్యుత్తు లేదా నీళ్లు అవసరం అవుతాయి. వ్యర్థ పదార్థాలను ఎలా తొలగించాలి, పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా కల్పించాలి వంటి అంశాలను ప్రణాళికలు తయారుచేసేవాళ్లు నిర్ణయిస్తారు. ఢిల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళికలు మూడుసార్లు తయారుచేశారు.

ప్రశ్న 8.
తీర ప్రాంతాలపైన పట్టుకు యూరప్ దేశస్తులు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
జవాబు:
రేవులు నిర్మించే అవకాశం ఉండడం వలనే వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ రేవుల ద్వారా కొల్లగొట్టిన ముడిసరుకును వలస పాలకులు తమ దేశాలకు తరలించవచ్చు.

19వ శతాబ్దంలో విశాఖపట్టణం పై ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగారు. ముంబై, చెన్నె వంటి నగరాలను కూడా వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికే అభివృద్ధి చేశారు.

ప్రశ్న 9.
వార్షిక సంతల గురించి నీకేం తెలుసు?
జవాబు:
కొన్ని గ్రామాలలో వార్షిక సంత జరుగుతుంది. ఇక్కడ పెద్ద మార్కెట్లో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నాటకాలు, సంగీతం, నాట్యం వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. వారపు, లేదా వార్షిక సంతలు ఆ ప్రాంత వృక్ష, పశు జన్యు సంపదకు చాలా కీలకమైనవి. ఇక్కడ స్థానిక విత్తనాలు, పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. ఈ సంతల వల్ల వేరు వేరు గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి.

ఇతర ప్రాంతాలతో మంచి అనుసంధానం ఉన్న (సాధారణంగా రోడ్డు రవాణా, నదుల ద్వారా, ఇతర సాధనాలు కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైనవి) ప్రాంతాలలో మార్కెట్లు, సంతలు బాగా జరుగుతుంటాయి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 10.
నివాస ప్రాంతాలు పెద్దవి కావడంతో మానవ జీవనంలో వచ్చే మార్పులు ఏమిటి?
జవాబు:
నివాస ప్రాంతాలు పెద్దవిగా అవ్వటంతో వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటం మరింత సంక్లిష్టంగా మారసాగింది.

– ఆహార ఉత్పత్తి ఒక్కటే కాకుండా ఇతర ఎన్నో పనులు పుట్టుకొచ్చాయి. ప్రతి నివాస ప్రాంతంలో ప్రజలు కొన్ని నైపుణ్యాలలో ప్రత్యేకతను ప్రదర్శించేవాళ్లు. అమ్మటం కోసం అనేక సరుకుల ఉత్పత్తి మొదలయ్యింది. వీటిని వర్తకులు దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లేవాళ్లు.

ప్రశ్న 11.
ఢిల్లీ నగరంలో గల నివాసప్రాంత రకాలను పేర్కొనుము.
జవాబు:
ఢిల్లీ నగరంలో గల నివాస ప్రాంతాలు :

  1. జుగ్గి జోష్ఠి ప్రాంతాలు
  2. మురికివాడలుగా గుర్తించిన ప్రాంతాలు
  3. అనధీకృత కాలనీలు
  4. జుగ్గి జోష్ఠి పునర్నివాస కాలనీలు
  5. గ్రామాలు
  6. క్రమబద్ధీకరించిన అనధీకృత కాలనీలు
  7. పట్టణ గ్రామాలు
  8. ప్రణాళికాబద్ధ కాలనీలు.

ప్రశ్న 12.
సంతలు గ్రామాల మధ్య ఏ రకంగా సంబంధాలు పెంచుతాయి?
జవాబు:
గ్రామంలో వారం, వారం జరిగే సంత ఇతర ప్రదేశాలతో సంబంధానికి ముఖ్యమైన వేదికగా ఉంటుంది. ఈ వారపు సంత ఎంత పెద్దగా ఉంటే, ఆ ఊరు అంత పెద్దదన్నమాట. ఈ సంతలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తారు.

ప్రశ్న 13.
పట్టణీకరణకు దోహదం చేసే అంశాలు ఏవి?
జవాబు:
పట్టణాలు, నగరాలలోని జనాభా పెరుగుదలలో అధిక భాగం సహజ వృద్ధి వల్ల జరిగింది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవటం వల్ల కొన్ని పట్టణాలు, నగరాలు విస్తరించాయి. జనాభా వృద్ధిలో అయిదింట ఒక వంతు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలసల వల్ల సంభవించింది.

ప్రశ్న 14.
ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలు కొన్నింటిని పేర్కొనుము.
జవాబు:
ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలకు ఉదాహరణలు : సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం (బ్యాంకాక్, థాయ్ లాండ్), దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (దుబాయి, యు.ఎ.ఇ.). కైరో అంతర్జాతీయ విమానాశ్రయం (కైరో, ఈజిప్టు), లండన్ హీథే విమానాశ్రయం (లండన్, యుకె).

ప్రశ్న 15.
పట్టిక : నివాసప్రాంత రకం – జనాభా

నివాసప్రాంత రకం2000 సంవత్సరంలో జనాభా అంచనా (లక్షల్లో)నగర మొత్తం జనాభాలో శాతం
జుగ్గి జోష్ఠి ప్రాంతాలు20.7214.8
మురికివాడలుగా గుర్తించిన ప్రాంతాలు26.6419.1
అనధీకృత కాలనీలు7.405.3
జుగ్గి జోష్ఠి పునఃనివాస కాలనీలు17.7612.7
గ్రామాలు7.405.3
క్రమబద్ధీకరించిన అనధీకృత కాలనీలు17.7612.7
పట్టణ గ్రామాలు8.886.4
ప్రణాళికాబద్ధ కాలనీలు33.0823.7
మొత్తం139.64100

సవరణ :
జనాభా అంచనా వేలల్లో అని ఇచ్చారు, లక్షల్లో అని ముద్రించాలి. పాఠ్యపుస్తకంలో)
పై పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
అ) మురికివాడలలో ఎంత శాతం జనాభా నివసిస్తున్నారు?
ఆ) ఢిల్లీ నగరం మొత్తం జనాభా ఎంత?
ఇ) ఎక్కువ మంది జనాభా ఏ నివాస ప్రాంతంలో నివసిస్తున్నారు? ఎంత శాతం?
జవాబు:
అ) మురికివాడలలో 19.1 శాతం జనాభా నివసిస్తున్నారు.
ఆ) ఢిల్లీ నగర మొత్తం జనాభా : 139.64 లక్షలు.
ఇ) ఎక్కువమంది జనాభా ప్రణాళికాబద్ద కాలనీలలో నివసిస్తున్నారు. అది 23.7 శాతం.

10th Class Social 7th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్ళను పేర్కొని, నివారణా మార్గాలు చూపండి.
జవాబు:
వివిధ కారణాల వలన ‘పట్టణ జనాభా’ పెరగడాన్నే పట్టణీకరణ అంటారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకోవడమే పట్టణీకరణ.

పట్టణీకరణకు కారణాలు 3. అవి సహజ వృద్ధి (పెరుగుదల), వలసలు, గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవడం.

పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్ళు, సమస్యలు :

  1. పట్టణ జనాభా పెరిగిపోతూ ఉండడం వల్ల స్థలం కొరత ఏర్పడుతుంది.
  2. మురికివాడలు పెరిగిపోతున్నాయి. వలస కార్మికుల వల్ల ఇవి ఎక్కువవుతున్నాయి.
  3. ధ్వని (వాహనాలను విరివిగా వినియోగించడం వల్ల) వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతుంది.
  4. పెరుగుతున్న వాహనాల వల్ల నిరంతర ట్రాఫిక్ సమస్య.
  5. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహవసతి ఏర్పాటు పెద్ద సమస్య. అదెలు పెరిగిపోతున్నాయి.
  6. మురుగు నీటి పారుదల సమస్య వర్షం సంభవించినపుడు డ్రెయిన్లు పొంగడం లాంటి సమస్యలు. ఇవి ఎన్నో అంటు వ్యాధులకు దారితీయవచ్చు.
  7. వ్యక్తిగత వాహనాల వాడకం విపరీతంగా పెరగడం వలన కాలుష్యం ఏర్పడి ఆరోగ్య సమస్యలకు, స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుంది.
  8. భూమిలో కలిసిపోని (ప్లాస్టిక్, ఇతరాలు), కుళ్ళిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగడం. దీని వలన చెత్త పెరగడం.

నివారణా మార్గాలు :

  1. గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గించాలి. దానికిగాను గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన గావించాలి.
  2. చెత్తను రీసైకిల్ చేయటం, చెత్త శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలి.
  3. ప్లాస్టిక్ వినియోగం వీలైనంత తగ్గించాలి, అవసరమైతే నిషేధించాలి.
  4. ప్రజా రవాణాను మెరుగుపరచి, వాటి వాడకంపై ప్రోత్సహించాలి.
  5. వివిధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలలోనే ఏర్పాటు చేయాలి. అలాంటి వారిని ప్రోత్సహించాలి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 2.
మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్ కు ఉత్తరం రాయుము.
జవాబు:

సింగనగర్,
విజయవాడ.
తేదీ : 9 సెప్టెంబర్, 20xx.

గౌరవనీయులైన కలెక్టరు గారికి,
నా పేరు శ్రీనివాసరావు. నేను సింగ్ నగర్ లో నివసిస్తున్నాను. మా ప్రాంతంలో ఉన్న పర్యావరణ సమస్యల గురించి మీకు తెలియపరుస్తున్నాను.

మా ప్రాంతంలో వలస కూలీల సంఖ్య పెరిగింది. వారు వారి అవసరాలు తీర్చుకోవడానికి నగరానికి వచ్చి ఇక్కడ క్రొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. నీటి సరఫరా కొరత, మురికివాడల పెరుగుదల, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీద పడవేయడం వల్ల రవాణా మరియు కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద వదలివేయడం, వాటిని తిన్న చాలా జంతువులు మరణించాయి. చెత్తాచెదారం పెరిగింది. దానిని సరిగా శుభ్రం చేయడం లేదు. భయంకరమైన దుర్గంధం వెలువడుతుంది. ఇవి వివిధ రకాల రోగాలకు కారణమవుతున్నాయి.

నేను చేసుకునే విన్నపం ఏమిటంటే వీటిని బాగుచేయించటంతోపాటు కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు ఊరికి దూరంగా ఏర్పాటుచేయడం వలన మరియు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను కూడా నిలిపివేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

మీయందు విధేయత గల
శ్రీనివాసరావు.

చిరునామా:
జిల్లా కలెక్టర్,
విజయవాడ.

ప్రశ్న 3.
పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారాలు చూపండి.
జవాబు:
పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలకు పరిష్కారాలు :

  1. సక్రమ మురుగునీటి పారుదల నిర్వహణ చేయాలి.
  2. సక్రమ త్రాగునీటి సరఫరా ఉండాలి.
  3. గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలు కల్పించి, ఉపాధి అవకాశాలు పెంచాలి.
  4. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన పట్టణ వలసలు తగ్గుతాయి.
  5. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఉద్యోగావకాశాలు కల్పించాలి.
  6. పట్టణ రోడ్ల విస్తరణ చేపట్టాలి.
  7. కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
  8. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి.

ప్రశ్న 4.
హైదరాబాదు ప్రాంతం అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వివరించండి.
జవాబు:
హైదరాబాదు ప్రాంతం అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అనుకూల పరిస్థితులు :

  1. హైదరాబాదు నగరం విస్తరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  2. 80 లక్షలకు మించి జనాభాను కలిగి ఉంది.
  3. రవాణా సౌకర్యాలైన రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.
  4. అవస్థాపన సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
  5. ఎన్నో పరిశ్రమల స్థాపన వలన పారిశ్రామిక అభివృద్ధి బాగా జరిగినది.
  6. అనేక విశ్వవిద్యాలయాలు ఉండుట వలన విద్యావకాశాలు మెండుగా ఉన్నాయి.
  7. వివిధ రకములైన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉండుట వలన వైద్య, ఆరోగ్య సేవలు ఎక్కువగా ఉన్నాయి.
  8. సమాచార, సాంకేతిక విస్తరణ (ఐ.టి) బాగా ఉన్నది.
  9. హైదరాబాదులో సేవల రంగం బాగా విస్తరించి ఉన్నది.

ప్రశ్న 5.
పట్టణీకరణ పెరగడమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒకటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. – పట్టణీకరణ పరిణామాలపై మీ వైఖరిని తెలియజేయండి.
జవాబు:
పట్టణీకరణ పెరగటం వల్ల అవకాశాలతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అవి :

  • నివాస స్థలాలకు మరియు గృహ వసతికి కొరత
  • మురికివాడలు పెరగడం
  • గాలి, నీరు, నేల కలుషితం అవడం
  • ట్రాఫిక్ సమస్యలు పెరగడం
  • ఆహార పదార్థాల కొరత
  • చెత్త నిర్వహణ కష్టమవడం
  • మురుగునీటి నిర్వహణ సమస్య
  • ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం.
  • పర్యావరణంపై ఒత్తిడి పెరగడం
    అభివృద్ధిలో పట్టణీకరణ అనేది ఒక భాగం. అయినప్పటికీ ప్రభుత్వం పట్టణాలలో తగిన వసతులు కల్పించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పట్టణీకరణయే అభివృద్ధికి ఆటంకం అవుతుంది.

ప్రశ్న 6.
పట్టణీకరణ వలన కలుగు సమస్యలను విశ్లేషించండి.
(లేదా)
పట్టణీకరణలో ఎదుర్కొనే సమస్యలేవి?
జవాబు:
పట్టణీకరణ పెరగటమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒక్కటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహవసతి కావాలి. వాళ్లకి నీటి సరఫరా ఉండాలి. మురుగునీరు, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల వినియోగం పెరగటం వల్ల పట్టణాలలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇది ఆరోగ్య సమస్యలకు, స్థానికంగా వాతావరణ మార్పులకు దారి తీస్తుంది. మురుగునీటి తొలగింపు సరిగా లేకపోతే అది ఎన్నో అంటువ్యాధులకు దారితీయవచ్చు.

పట్టణీకరణ పెరగటంలోని ఒక సమస్య భూమిలో కలిసిపోని, లేదా కుళ్లిపోవటానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగటం. దీనివల్ల ఎంతో చెత్తను తొలగించాల్సి ఉంటుంది.

ప్రశ్న 7.
మీ నివాస ప్రాంతంలో గత 20 సం||ల నుండి జరిగిన మార్పులను తెలిపి, వాటికి గల కారణాలను వివరించండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల కాలంలో జనాభా పెరిగింది.
  2. రవాణా సౌకర్యాలు విస్తరించాయి.
  3. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గింది.
  4. ఆవాస స్థలాలు, వాణిజ్య సముదాయాల విస్తీర్ణం పెరిగింది.
  5. మురికివాడలేర్పడ్డాయి.
  6. పర్యావరణ కాలుష్యం పెరిగింది.
    వీటిన్నంటికీ ప్రధాన కారణంగా వలసల పెరుగుదల, పట్టణీకరణను చెప్పుకొనవచ్చును.

ప్రశ్న 8.
ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయో వివరించండి.
జవాబు:
కొన్ని ప్రదేశాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. దానికి గల కారణాలు :
1. మంచి రవాణా సౌకర్యాల సదుపాయం :
ఎక్కడైతే మంచి రవాణా సౌకర్యం ఉంటుందో, అక్కడ ప్రయాణించే సమయం తగ్గుతుంది. కావున ఆ ప్రదేశం ప్రజలను ఆకర్షిస్తుంది.

2. మంచి జీవన పరిస్థితులు :
మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ప్రభుత్వ రావాణా సదుపాయం, వాతావరణ కాలుష్యం – లేని ప్రాంతాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి.

3. విద్య, ఉద్యోగ అవకాశాలు :
మంచి చదువు, మంచి ఉద్యోగం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎక్కడైతే విద్య, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతం ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

మిగతా కారణాలు :
మంచి ఆరోగ్య సౌకర్యం, విద్యుచ్ఛక్తి, ప్రశాంతమైన జీవన విధానం గల ప్రాంతాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 9.
కింది పేరాను చదివి వ్యాఖ్యానించండి.

జనాభా పెరగడంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే వస్తువుల రకాలు, సంఖ్య పెరగడం వలన వర్తకం కూడా పెరిగింది. వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటాన్ని పాలకులు ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలు అంటే వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించసాగాయి.
జవాబు:
మొదట పాలకులే వృత్తి పనివారిని పట్టణాలకు వెళ్ళి పని చేయడానికి ప్రోత్సహించారు. చిన్నగా పట్టణాలలో అన్నీ సౌకర్యాలు విస్తరించడంతో, గ్రామాలలో భూమి లేని వ్యవసాయ కూలీలు మరియు మిగతావారు పట్టణాలకు వలస వెళ్ళడంతో వారి జీవన స్థితిగతులు మెరుగుపడినాయి. కొన్ని సంవత్సరాల తరువాత పరిశ్రమలను స్థాపించడంతో ప్రజలు వారి వృత్తులను కూడా వదిలి పట్టణాలకు వచ్చి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచుకోసాగారు.

దానితో పట్టణాల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పట్టణ జనాభా కూడా పెరిగిపోయింది. దాని వలన వ్యవసాయం మీద ఆధారపడినవారి శాతం కూడా తగ్గిపోసాగింది. వ్యవసాయం నుండి వచ్చే GDP శాతం తగ్గిపోయింది. కాని పట్టణాలలో జనాభా పెరగడం వలన చాలా సమస్యలను ప్రజలు ఎదుర్కోసాగారు.

ప్రశ్న 10.
చిత్రం 7.1లోని చిత్రాలను చూసి వివిధ నివాస ప్రాంతాలు, ఇళ్ల నిర్మాణంలో ఎదుర్కొనే ముప్పులు, భూ వినియోగం, నివాస ప్రాంతరకం వంటి వాటిల్లో తేడాలను పోల్చండి.
AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 1 AP 10th Class Social Important Questions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 2
జవాబు:
అ) 25,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో నేడు రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలోని వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ప్రకృతి నాశనమవుతోంది. కొండపై గల పచ్చని వాతావరణాన్ని నాశనం చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

ఆ) హిమాలయాల్లో తరచు కొండచరియలు విరిగి పడుతుండటంతో నివాసానికి ఈ ప్రాంతం అంత అనుకూలంగా లేదు. రోడ్లు నిర్మించినా తరచు వీటిపై కొండచరియలు పడి మార్గంలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాల దృష్ట్యా గృహనిర్మాణాలు చేపట్టడం లేదు. అయితే సహజంగా పెరిగే వృక్షజాలాన్ని ఆధారం చేసుకొని పశుపోషణ పర్యాటక రంగం వంటి రంగాలలో ప్రజలు ఉపాధి పొందుతున్నారు.

ఇ) లడక్ లోని సుబ్రా లోయలో వర్షాలు అసలు కురవకపోవడంతో కొండలపై చెట్లు పెరగక బోడిగా ఉంటాయి. పంటలు కూడా వర్షాకాలంలో కాకుండా మంచు కరగగా వచ్చే నీటితో వేసవిలో పండిస్తారు. అందుచే ఈ ప్రాంతంలో నివాసాలు, జనాభా బాగా తక్కువ.

ప్రశ్న 11.
ఆదిమానవులు (సంచార జీవులు, సేకరించేవారు, వేటగాళు) గురించి నీకేం తెలుసు?
జవాబు:
తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునే వాళ్లు. అందుకనే వాళ్లని సేకరించేవాళ్లు, వేటగాళ్లు అనేవాళ్లు. వాళ్లు సంచార జీవులు. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్లు. ఆహారాన్ని అన్వేషిస్తూ – అంటే చెట్ల నుంచి పండ్లు సేకరిస్తూ, మాంసం, చర్మాలు, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ వాళ్లు సంచారజీవనం సాగించేవాళ్లు. మొదట రాళ్లుతో తయారుచేసిన పరికరాలను ఉపయోగించటం మొదలు పెట్టారు. ఈ పరికరాలతో వాళ్లు సమర్ధతతో, నైపుణ్యంతో వేటాడగలిగేవాళ్ళ.

మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ – వేటగాళ్లుగా గుంపులలో జీవించారు. అప్పుడు వాళ్లు వ్యవసాయం చేసేవాళ్లు కాదు.

ప్రశ్న 12.
వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏవి?
జవాబు:
వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఉదాహరణకు రుతు చక్రాలు, వాతావరణ పరిస్థితులను ముందుగా ఊహించటం, సాగు పనులు (విత్తటం, కోయటం వంటివి) ఏవి ఎప్పుడు చేయాలో బాగా తెలిశాయి. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించటానికి వాళ్లకి తీరిక సమయం చిక్కింది. జనాభా కూడా పెరిగింది.

జనాభా పెరగటంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే , వస్తువుల రకాలు, సంఖ్య పెరగడం వల్ల వర్తకం కూడా పెరిగింది. వృత్తి పనివాళ్లు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటాన్ని పాలకులు. ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలు, అంటే వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించసాగాయి.

ప్రశ్న 13.
ఢిల్లీ నగర ప్రణాళిక అమలులో గల పరిమితులేవి?
(లేదా)
ఢిల్లీ నగర ప్రణాళిక సక్రమంగా అమలు కాకపోవడానికి కారణాలేంటి?
జవాబు:
ప్రణాళికలు తయారుచేయటంలో, ఏ ప్రాంతాలను ఎందుకు ఉపయోగించాలో ప్రకటించటంలో ఆలస్యం జరుగుతోంది. పని కోసం వెదుక్కుంటూ నగరానికి వచ్చిన వాళ్లు భూమిని ఆక్రమించుకుని, ఎటువంటి అనుమతులూ లేకుండా, ఎవరి సహాయం, ఏ సదుపాయాలూ లేకుండా తమ శక్తిమేరకు ఇళ్లు కట్టుకుంటారు. ఇవి చాలాకాలంపాటు అనధీకృత కాలనీలుగా ఉండిపోతాయి. అంతిమంగా ప్రణాళికను ప్రకటించిన నాటికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు.

ఇది క్లిష్టమైన వైరుధ్య పరిస్థితికి దారి తీస్తుంది. ఈ ప్రాంతాలలో సరైన బజారులు, మురుగునీటి వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో కొన్నింటిని చట్టపరంగా మురికివాడలుగా ప్రకటించారు. కొన్నింటిని ప్రకటించలేదు. అనేక సందర్భాలలో భూమి హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవి. ప్రజలు ఎంతో ఖాళీ చేయించేవి. ఫలితంగా ప్రజలు ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు గుర్తింపులేని మరొక ప్రాంతంలో భూమిని ఆక్రమించుకుంటారు. ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతమవుతూ ఉంటుంది. ఇవి ఢిల్లీ నగర ప్రణాళికల అమలులో అవరోధాలు లేదా పరిమితులు.