Students can go through AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు
→ సంప్రదాయ పాలకులు : రాజులు, చక్రవర్తులు.
→ యూరపులో కొత్త భావనలు : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం.
→ ప్రాభవ ప్రాంతాలు : చట్టాలు వర్తించక, పన్ను చెల్లించక, సైనిక దళాలను కలిగి ఉండడం.
→ సన్, మిన్, చుయి : జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం.
→ మే నాలుగు ఉద్యమం : వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ బీజింగ్ లో నిరసన ప్రదర్శన (1919 మే 4)
→ ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యటం : ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం
→ చైనా రెండు సంక్షోభాలు : 1. నేలలు నిస్సారం, అడవుల నరికివేత
2. దోపిడీపూరిత కౌలు, రుణభారం.
→ గ్రామీణ మహిళా సంఘాలు : గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే కమిటీలు.
→ రైతాంగ సైన్యం : భూస్వామ్యాన్ని అంతం చెయ్యడానికి పోరాడే రైతుల సమ్మేళనం.
→ రైతాంగ పాఠశాలలు : రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాప్తి చేసే రైతుల పాఠశాలలు.
→ నాపాలం : మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు.
→ భూసంస్కరణలు : భూ పంపిణీలో ఉన్న అసమానతలు తొలగించి, భూమిలేని పారికి భూమిని పంచి పెట్టడం.
→ భూస్వామ్యవాదం : భూమి అంతా కొంతమంది వ్యక్తుల అధీనంలో కేంద్రీకరింపబడడం.
→ నూతన ప్రజాస్వామ్యం : భూస్వామ్యవాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో కలిపి ఏర్పడినది.
→ వెట్టి కార్మికులు : తక్కువ వేతనంతో పని చేయించడం గాని, ప్రతిఫలం ఏమీ ఇవ్వకుండా బానిసలుగా గాని పని చేయించడం.
→ రసాయనిక ఆయుధాలు : విషపూరిత మందులు, ఒకేసారి వేలమందిని చంపే అత్యంత విషపూరిత పదార్ధం కలిగిన ఆయుధాలు ఈ బలహీన ప్రజాస్వామ్యం : అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన, సైనిక పాలన గల దానిని బలహీన ప్రజాస్వామ్యం అంటాం.
→ ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఏకం చేయడం.
→ 1902 : పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
→ 1918 : లెనిన్ కొమిటర్న్ ఏర్పాటు
→ 1919 : మే నాలుగు ఉద్యమం (బీజింగ్)
→ 1919 : చైనాలో 5 లక్షల మందితో పారిశ్రామిక కార్మికవర్గం ఏర్పాటు
→ 1921 : చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు
→ 1923 : నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఆవిర్భావం
→ 1931 : వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతి
→ 1937 : చైనా పై జపాన్ దండెత్తడం
→ 1940 : జపాన్ వియత్నాం ఆక్రమణ
→ 1945 : అమెరికాకి జపాన్ దాసోహం
→ 1945 : వియత్నాంలో జాతీయవాద కార్మికసంఘం జాతీయ సమ్మె
→ 1949 : చైనా ప్రజల గణతంత్రం ఏర్పాటు
→ 1950 : చైనాలో భూసంస్కరణలు అమలు
→ 1963 : నైజీరియా స్వాతంత్ర్యం
→ 1974 : పారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు
→ 1999 : నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు