AP 10th Class Social Notes Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

Students can go through AP Board 10th Class Social Notes 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి

→ ఏదైనా ఒక ప్రాంత శీతోష్ణస్థితిని అంచనా వేయడానికి 30 సం||రాలను లెక్కగా తీసుకుంటారు.

→ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలివేగం, గాలిలో తేమ, వర్షపాతం ఇవి వాతావరణంలోని అంశాలు.

→ శీతోష్ణస్థితి కారకాలు : అక్షాంశం, భూమికి – నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ.

→ భారతదేశంను కర్కటరేఖ రెండు సమభాగాలుగా చేస్తుంది.

→ భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. నిదానంగా చల్లబడుతుంది.

→ ట్రేడ్ విండ్స్ అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించేగాలులు అని అర్థం.

→ ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది.

→ సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్లో తొలకరి జల్లులు పడతాయి. వీటినే ఆంధ్రప్రదేశ్ లో “మామిడి జల్లులు” అంటారు.

→ ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20° ఉ|| – 20°ద|| అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి.

AP 10th Class Social Notes Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

→ నైఋతి ఋతుపవనాలను భారతదేశం 2 భాగాలుగా విభజిస్తుంది. అవి,

  1. అరేబియా సముద్రం శాఖ
  2. బంగాళాఖాతం శాఖ

→ భారతదేశ సాంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుంది.

→ ఓజోన్ పొర భూమిపై వాతావరణాన్ని కాపాడుతుంది.

→ ప్రస్తుతం భూగోళం వేడెక్కడానికి మానవులే కారణం.

→ భూగోళం వేడెక్కడానికి అడవుల నిర్మూలన ఒక కారణం.

→ హిమాలయాల్లోని హిమపర్వతాలు వేగంగా కరగటం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమయ్యి. మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితమౌతాయి.

→ క్లైమోగ్రాఫ్ : శీతోష్ణస్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను చూపించే, గ్రాఫ్ ను “క్లెమోగ్రాఫ్” అంటారు.

→ వాతావరణం : ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ స్థితులను ‘వాతావరణం’ అంటారు.

→ ఋతుపవనాలు : ఒక నిర్దిష్ట సమయంలో వీచే గాలులను “ఋతుపవనాలు” అంటారు. ఇవి వర్షాన్ని తీసుకొని వస్తాయి.

→ సూర్యపుటము : భూమి సూర్యుని నుండి గ్రహించే ఉష్ణము.

AP 10th Class Social Notes Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

→ పీడన మండలాలు : భూగోళం పై వివిధ పీడన మండలాలు కలవు. అధిక పీడన మండలాలు, అల్పపీడన మండలాలు.

→ భూగోళం వేడెక్కడం : నేటి కాలంలో భూమిపై ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతుండటాన్ని “భూగోళం వేడెక్కడం” అంటారు.

→ జెట్ ప్రవాహం : భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను “జెట్ ప్రవాహం ” అంటారు.

AP 10th Class Social Notes Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి