AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

Students can go through AP Board 10th Class Social Notes 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు to understand and remember the concept easily.

AP Board 10th Class Social Notes 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు

→ భారతదేశ నదీ జలవ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది.
AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1

→ పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జలవ్యవస్థను రెండుగా విభజించవచ్చు.
AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2

→ ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం.

→ వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్ళు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్ళు దెబ్బతింటాయి. కరవు పరిస్థితులలో వేళ్ళ ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు ఎండిపోతాయి.

→ చాలా లోతుల నుండి మనం తోడే నీరు వేల సంవత్సరాల నుండి నిల్వ అయి ఉంటుంది.

→ తుంగభద్రానదీ పరీవాహక ప్రాంతాన్ని మూడుగా విభజిస్తారు.
AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3

→ చెట్లను విస్తృతంగా నరికివేయడం, గనులు తవ్వడం వంటి వాటి వల్ల అడవులు క్షీణిస్తున్నాయి.

→ కుద్రేముఖ్ లో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీసు త్రవ్వకాల వల్ల పరీవాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయం పూడికకు గురి అవుతున్నాయి.

→ నీటి సమస్యలు వేసవిలో మరింత తీవ్రమవుతాయి.

→ గత కొద్ది దశాబ్దాలుగా భూగర్భజలాలు గృహ అవసరాలకు, వ్యవసాయానికి. ముఖ్యమైన వనరుగా మారాయి.

→ అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి.

→ భూగర్భ జలాలపై భూమి ఉన్న వాళ్ళకే హక్కు ఉంటుంది.

AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

→ భూగర్భంలో ప్రవహిస్తున్న నీటికి సరిహద్దులుండవు.

→ రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ‘ప్రజా ఆస్తి’ గా భావించాలి. నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం.

→ ప్రవాహ వనరులు : భూమి మీద భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఒకచోట నుండి ఇంకో చోటికి ప్రవహించే వనరులు.
ఉదా : ప్రవహించే నీరు, సూర్యరశ్మి.

→ అంతర్భూజలం : భూమి ఉపరితలానికి అడుగున ఉన్న జలం, ఈ జలం సహజంగా నేలకి రాతిపొరకు మధ్యలో ఉంటుంది.

→ నీటి ప్రవాహ వ్యవస్థ : నీరు కాలువలు, నదులు మొదలైన రూపాలలో పుట్టి ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే విధానాన్ని నీటి “ప్రవాహవ్యవస్థ” అంటారు.

→ జల పంపిణీ చట్టం : నదుల జలాల్ని అది ప్రవహించే ప్రాంతాల వారు సహేతుకంగా పంచుకునేందుకు చేయబడిన చట్టం.

AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

→ భూగర్భ నీటి వనరు : భూమిలోపల పొరల్లో ఉన్న నీరు.

→ పరీవాహక ప్రాంతం : నది ప్రవహించే ప్రాంతం.

→ కరవు : చాలాకాలం వర్షాలు లేక, పంటలు లేక ఏర్పడే పరిస్థితులు.

→ నీళ్లు నేలలోపలికి ఇంకటం : చిన్న చిన్న రంధ్రాల ద్వారా లేదా వేరే ఇతర మార్గాల ద్వారా నీరు లోపలికి ఇంకటం.

AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4 AP 10th Class Social Notes Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 5