AP 6th Class Maths Notes 10th Lesson ప్రాయోజిక జ్యామితి

Students can go through AP Board 6th Class Maths Notes 10th Lesson ప్రాయోజిక జ్యామితి to understand and remember the concept easily.

AP Board 6th Class Maths Notes 10th Lesson ప్రాయోజిక జ్యామితి

→ జ్యామితీయ ఉపకరణాల పెట్టెలోని పరికరాలు – ఉపయోగాలు :
స్కేలు, వృత్తలేఖిని, కోణమానిని, విభాగిని మరియు రెండు మూలమట్టాలుంటాయి.
ఈ మూలమట్టాలలో ఒకటి 459, 459, 90°ల మూలమట్టం, మరొకటి 309, 60, 90°ల మూలమట్టము.

ఉపయోగాలు :

  • స్కేలు : రేఖలు, రేఖాఖండాలు గీయడం మరియు రేఖాఖండాల పొడవులను కొలవడం.
  • వృత్తలేఖిని : వృత్తాలు, చాపరేఖలు గీయడం.
  • కోణమానిని : కోణాలను కొలవడం, కోణాలను గీయడం.
  • విభాగిని : రేఖాఖండాన్ని సమభాగాలుగా విభజించడం, రేఖపై బిందువులను గుర్తించడం.
  • మూలమట్టాలు : 159, 30°, 459, 75°, 90°, 1059, 135° కోణాలను గీయడానికి ఇచ్చిన రేఖ పై ఇచ్చిన బిందువు వద్ద సమాంతర, లంబరేఖలను గీయడానికి ఉపయోగిస్తారు.

→ రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖ : ఇచ్చిన రేఖాఖండాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ, ఆ రేఖాఖండానికి లంబంగా ఉండే రేఖను లంబ సమద్విఖండన రేఖ అంటారు.

AP 6th Class Maths Notes 10th Lesson ప్రాయోజిక జ్యామితి

→ కోణ సమద్విఖండనరేఖ : :ఇచ్చిన కోణాన్ని రెండు సమాన కోణాలుగా విభజించే రేఖ (కిరణం)ను ఆ కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ అంటారు.
AP 6th Class Maths Notes 10th Lesson ప్రాయోజిక జ్యామితి 1
ఉదా :
ప్రక్కపటంలో ∠BOC = ∠COA
∠AOB ని \(\overrightarrow{\mathrm{OC}}\) రెండు సమాన కోణాలు ∠BOC
మరియు ∠COA లుగా విభజిస్తున్నది.
కావున ∠AOB యొక్క కోణ సమద్విఖండనరేఖ \(\overrightarrow{\mathrm{OC}}\) అవుతుంది.