AP 6th Class Maths Notes 12th Lesson దత్తాంశ నిర్వహణ

Students can go through AP Board 6th Class Maths Notes 12th Lesson దత్తాంశ నిర్వహణ to understand and remember the concept easily.

AP Board 6th Class Maths Notes 12th Lesson దత్తాంశ నిర్వహణ

→ P.C. మహలనోబిస్ (భారతదేశం) (1893 – 1972):
ఈయన భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా ఖ్యాతిగాంచారు. కోల్‌కతాలో గల భారత సాంఖ్యక శాస్త్ర పరిశోధనా సంస్థను ఈయన స్థాపించారు. ఈయన ‘నేషనల్ శాంపిల్ సర్వేలు’ ప్రపంచ ఖ్యాతిని పొందాయి.

→ దత్తాంశము : ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడు సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారాన్ని దత్తాంశం అంటారు.

→ పౌనఃపున్య విభాజన పట్టిక : దత్తాంశంలోని వివిధ అంశాలను, వాటి పౌనఃపున్యాలను (అంశాల సంఖ్యను) సూచించు పట్టికను పౌనఃపున్య విభాజన పట్టిక అంటారు.

→ దత్తాంశాన్ని సూచించు చిత్రాలు : పౌనఃపున్య విభాజన పట్టికలో చూపిన దత్తాంశాన్ని దృశ్య రూపంలో చూపటానికి పట చిత్రాలు, కమ్మీ రేఖాచిత్రాలు, వలయ చిత్రాలు మొదలగునవి ఉపయోగిస్తారు.

AP 6th Class Maths Notes 12th Lesson దత్తాంశ నిర్వహణ

→ పట చిత్రాలు : పౌనఃపున్య విభాజనంలోని దత్తాంశాన్ని సూచించుటకు బొమ్మలకు ఉపయోగించే చిత్రాలు. దత్తాంశంలోని అంశాల పౌనఃపున్యం అనుగుణంగా కొన్ని అంశాలకు ఒక బొమ్మ ప్రాతినిథ్యం వహించే విధంగా స్కేలును నిర్ణయించి, పటచిత్రాలు గీస్తాము.

→ కమ్మీ రేఖా చిత్రాలు : కమ్మీ రేఖా చిత్రాలు గీయడానికి గ్రాఫ్ కాగితాన్ని ఉపయోగిస్తాము. ఇవి రెండు రకాలుగా గీస్తాము.
అవి : 1. నిలువు కమ్మీ రేఖా చిత్రాలు,
2. అడ్డు కమ్మీ రేఖా చిత్రాలు. కమ్మీ రేఖా చిత్రాలలోని కమ్మీల వెడల్పులు మరియు కమ్మీల మధ్య దూరం సమానంగా ఉంటాయి. కమ్మీలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. మరియు కమ్మీల పొడవులు అవి సూచించే రాశుల పౌనఃపున్యాలకు అనులోమానుపాతంలో ఉంటాయి.