These AP 6th Class Science Important Questions 10th Lesson విద్యుత్ వలయాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Science 10th Lesson Important Questions and Answers విద్యుత్ వలయాలు
6th Class Science 10th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
విద్యుత్ అనగానేమి?
జవాబు:
విద్యుత్ ఒక శక్తి స్వరూపం.
ప్రశ్న 2.
విద్యుత్ శక్తి ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
విద్యుత్ శక్తి ఘటాల నుంచి ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 3.
విద్యుత్ వాహకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ ప్రవహించే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.
ప్రశ్న 4.
విద్యుత్ బంధకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్తును తమ గుండా ప్రసరింపని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.
ప్రశ్న 5.
విద్యుత్ వినియోగ పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఫ్యాను, బల్బు, ఏ.సి, ఫ్రిజ్ మొదలైనవి విద్యుత్ వినియోగ పదార్థాలు.
ప్రశ్న 6.
విద్యుత్ వలయం అనగానేమి?
జవాబు:
ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం అంటారు.
ప్రశ్న 7.
టార్చి లైలో విద్యుత్తు ఎక్కడ నుండి వస్తుంది?
జవాబు:
టార్చ్ లైట్ లో ఘటాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 8.
ఘటంలో ఎన్ని ధ్రువాలు ఉంటాయి?
జవాబు:
ఘటంలో రెండు ధ్రువాలు ఉంటాయి. అవి
- ధవ ధృవము
- రుణ ధ్రృవం
ప్రశ్న 9.
విద్యుత్తు బల్బుకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి?
జవాబు:
విద్యుత్ బల్బుకు రెండు ధ్రువాలు ఉంటాయి.
ప్రశ్న 10.
ఫిలమెంట్ అనగానేమి?
జవాబు:
బల్బు లోపల రెండు తీగల మీదుగా ఒక సన్నని తీగ లాంటి రింగు తీగ ఉంటుంది. దీనినే ఫిలమెంట్ అంటారు.
ప్రశ్న 11.
ఎడిసన్ తయారుచేసిన బల్బులో ఏ ఫిలమెంట్ 45 గంటలపాటు వెలిగింది?
జవాబు:
మసి పూత పూసిన దారం ఎడిసన్ బల్బులో 45 గంటలపాటు వెలిగింది.
ప్రశ్న 12.
స్విచ్ అనగానేమి?
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటానికి ఉపయోగించే పరికరాన్ని స్విచ్ అంటారు.
ప్రశ్న 13.
కరెంటు అనగానేమి?
జవాబు:
వలయములో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటాము.
ప్రశ్న 14.
టార్చిలైటులోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
టార్చిలైటులో ఘటాలు, బల్బు, స్విచ్ ప్రధాన భాగాలు.
ప్రశ్న 15.
విద్యుత్ వాహకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రాగి, ఇనుము, వెండి వంటి లోహాలు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న 16.
విద్యుత్ బంధకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కాగితం, చెక్క, అట్టముక్క మొదలైనవి విద్యుత్ బంధకాలు.
ప్రశ్న 17.
విద్యుత్ బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బుని కనుగొన్నాడు.
ప్రశ్న 18.
విద్యుత్ బల్బులో ఏ పదార్థాన్ని మొదట ఫిలమెంట్ గా ఉపయోగించారు?
జవాబు:
విద్యుత్ బల్బులో ప్లాటినంను మొదట ఫిలమెంట్ గా వాడారు.
ప్రశ్న 19.
ప్రస్తుతం బల్బులలో ఫిలమెంట్ గా ఉపయోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
టంగ్ స్టన్ పదార్థాన్ని బల్బులలో నేడు ఫిలమెంట్ గా వాడుతున్నారు.
6th Class Science 10th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
టార్చ్ లైట్ లో ఘటాలను చుట్టేసినప్పుడు బల్బు వెలగలేదు ఎందుకు?
జవాబు:
టార్చ్ లైట్ లో విద్యుత్తు ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. టార్చ్ లైట్ లో ఘటాలను తిప్పి వేసినప్పుడు ఇది విద్యుత్ ప్రసరణకు అంతరాయం కలిగించడం వల్ల బల్బు వెలగలేదు.
ప్రశ్న 2.
విద్యుత్ ఘటం యొక్క నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఘటానికి ఒక స్థూపాకార లోహపు పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో కొన్ని రసాయన పదార్థాలను నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిళ్లతో మూసి ఉంటుంది. మొత్తం స్థూపాకార పాత్ర సీలు చేసి ఉంటుంది.
ఘటంపైనున్న ధన (+), ఋణ (-) గుర్తులు ఘటం రెండు ధృవాలను సూచిస్తాయి.
ప్రశ్న 3.
టార్చ్ లైట్ బల్బు యొక్క నిర్మాణంను వర్ణించండి.
జవాబు:
- టార్చ్ లైట్ బల్బ్ లో ఒక లోహపు దిమ్మ, దానిపై గాజు బుగ్గ ఉంటాయి.
- లోపల రెండు తీగలుంటాయి.
- ఇందులో ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ రెండు తీగలూ ధ్రువాలుగా పనిచేస్తాయి.
- బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగులాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ‘ఫిలమెంట్’ అంటారు.
ప్రశ్న 4.
విద్యుత్ వలయం అనగానేమి? దానిలో ఏమేమి ఉంటాయి?
జవాబు:
విద్యుత్ వలయంలో ఒక బల్బు, ఒక ఘటం, వాటిని కలుపుతూ తీగలు ఉంటాయి. ఘటము మరియు బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం అంటాము.
ప్రశ్న 5.
ఒక బల్బును పరిశీలించి అది పాడైపోయిందా లేదా చెప్పగలరా? ఫిలమెంట్ లలో తేడాలు గుర్తించగలరా?
జవాబు:
- బల్బును పరిశీలించి అది పాడైపోయిందో లేదో చెప్పవచ్చు. ఫిలమెంట్ లలోని తేడాలను గుర్తించవచ్చు.
- ఒక పాడైపోయిన బల్బును తీసుకొని వలయంలో కలపాలి. అది వెలగదు.
- బల్బులోని ఫిలమెంటు తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహమార్గం మూసి ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించదు.
- అందుకే బల్బ్ వెలగదు.
ప్రశ్న 6.
కరెంటు అనగానేమి?
జవాబు:
వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. ఇది ధన ధృవం నుంచి ఋణ ధృవానికి ప్రవహిస్తుంది.
ప్రశ్న 7.
స్విచ్ అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించుటకు ఉపయోగించే విద్యుత్ పరికరంను స్విచ్ అంటారు. దీని ద్వారా విద్యుత్ పరికరాలను పనిచేయించవచ్చు లేదా ఆపవచ్చు.
ప్రశ్న 8.
టార్చ్ లైట్ పని చేయకపోవడానికి గల కారణాలను ఊహించండి.
జవాబు:
టార్చ్ లైట్ పనిచేయకపోవటానికి
- టార్చిలైట్ లోని సెల్స్ పనిచేయకపోవచ్చు.
- సెలను సరిగా అమర్చి ఉండకపోవచ్చు.
- స్విచ్ సరిగా పనిచేసి ఉండకపోవచ్చు.
- బల్బు మాడిపోయి ఉండవచ్చు.
- సెల్స్ వెనుకభాగాన తుప్పు పట్టి ఉండవచ్చు.. ,
- విద్యుత్ తీగలు తెగి ఉండవచ్చు.
ప్రశ్న 9.
విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ వాహకాలు :
విద్యుత్ ను తమగుండా ప్రవహింపచేసే పదార్థాలను ‘విద్యుత్ వాహకాలు’ అంటారు.
విద్యుత్ బంధకాలు :
విద్యుత్ ను తమగుండా ప్రవహింపనీయని పదార్థాలను ‘విద్యుత్ బంధకాలు’ అంటారు.
ప్రశ్న 10.
ప్లాస్టిక్ తొడుగును తొలగించకుండా తీగలను ఎందుకు ఉపయోగించకూడదు?
జవాబు:
విద్యుత్ తీగలోని లోహాల గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మనకు విద్యుత్ ఘాతం తగలకుండా వాటి పైన ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తొడుగును తొలగించకపోయినట్లయితే విద్యుత్ ప్రవాహం కొనసాగదు. అందువల్ల ప్లాస్టిక్ తొడుగును తొలగించకుండా తీగలను ఉపయోగించలేము.
ప్రశ్న 11.
విద్యుత్ తీగలో ఉండే పదార్థం ఏమిటి?
జవాబు:
విద్యుత్ తీగలలో విద్యుత్ వాహకాలైన లోహాలు ఉంటాయి. వీటి ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంది.
ప్రశ్న 12.
విద్యుత్తు పనిచేసేటప్పుడు కాళ్లకు ప్లాస్టిక్ చెప్పులు ధరించమని సలహా ఇస్తారు. ఎందుకు?
జవాబు:
విద్యుత్తు పనిచేసేటప్పుడు విద్యుత్ ఘాతం జరిగే ప్రమాదం ఉంది దాన్ని నివారించడానికి ప్లాస్టిక్ చెప్పులు. వాడమంటారు. ఇవి విద్యుత్ బంధకం. అందువలన విద్యుత్ పని చేసేటపుడు కాళ్ళకు ప్లాస్టిక్ చెప్పులు ధరించమని సలహా ఇస్తారు. వీటి వలన వ్యక్తి విద్యుత్ ఘాతం జరగకుండా రక్షింపబడతాడు.
6th Class Science 10th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
స్విచ్ తయారు చేయు విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
పటంలో చూపిన విధంగా ఒక చెక్కపలక పైన గాని లేదా ఒక థర్మకోల్ షీటుపైన గాని వలయాన్ని అమర్చండి.
వలయంలో A, B ల వద్ద రెండు డ్రాయింగ్ పిన్నులు అమర్చండి. ఒక పిన్నీసును తీసుకొని దాని ఒక కొన (B) వద్ద తాకేటట్టుగాను, రెండవ కొన విడిగా ఉండేటట్లుగాను అమర్చండి. ఇప్పుడు పిన్నీసు రెండవ కొనను (A) కి తాకించండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందో లేదో గమనించండి.
కృత్యంలో పిన్నీసు వలయాన్ని మూయడానికి లేదా తెరవడానికి ఉపయోగపడింది. అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుందన్నమాట.
స్విచ్ ఆన్ (ON) చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ (OFF) చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బు లేదా ఇతర విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది.
ప్రశ్న 2.
టార్చిలైట్ నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
చీకటిలో వెలుతురు సం సాధారణంగా టార్చిలైటును వాడతాం. టార్చిలైటులో ఒక స్థూపాకారపు గొట్టం, ఘటం, బల్బు, స్విచ్, గాజుమూత మరియు లోహపు స్ప్రింగు ఉంటాయి.
స్థూపాకారపు గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. మూతకు స్కూ ఉండి తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ (ON) చేయగానే వలయం మూయబడి టార్చిలైటులో ఉన్న బల్బు వెలుగుతుంది.
ప్రశ్న 3.
విద్యుత్ బల్ట్ ఆవిష్కరణ గురించి చెప్పండి.
జవాబు:
ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికి బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగగుండా విద్యుత్ ను ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కాని కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగచుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్, భావించాడు.
ఒక గాజు బుగ్గను తయారుచేసి, దానిలో ప్లాటినం ఫిలమెంటును ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంటు గుండా విద్యుత్ ను ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాలపాటు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్, వేరు వేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంటు కోసం ప్రయత్నించాడు. అతడు మసి పూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా, ఇది 45 గంటలపాటు నిరంతరాయంగా వెలిగింది.
AP Board 6th Class Science 10th Lesson 1 Mark Bits Questions and Answers విద్యుత్ వలయాలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. విద్యుత్ బల్బులో ఫిలమెంట్
A) రాగి
B) వెండి
C) టంగ్ స్టన్
D) ప్లాస్టిక్
జవాబు:
C) టంగ్ స్టన్
2. విద్యుత్ బల్బుని కనుగొన్నది.
A) ఎడిసన్
B) న్యూటన్
C) థామస్
D) రూథర్ ఫర్డ్
జవాబు:
A) ఎడిసన్
3. విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు
A) వాహకాలు
B) బంధకాలు
C) ఘటం
D) జనకాలు
జవాబు:
A) వాహకాలు
4. విద్యుత్ బంధకమునకు ఉదాహరణ
A) ఇనుము
B) ఉక్కు
C) ప్లాస్టిక్
D) రాగి
జవాబు:
C) ప్లాస్టిక్
5. విద్యుద్ఘాతము తగలకుండా ఉపయోగపడునవి
A) వాహకాలు
B) బంధకాలు
C) జనకాలు
D) అన్నీ
జవాబు:
B) బంధకాలు
6. విద్యుత్ వలయంలోని పరికరాలు
A) విద్యుత్ ఘటం
B) విద్యుత్ వాహకం
C) బల్బ్
D) అన్ని
జవాబు:
D) అన్ని
7. విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని ఏమంటారు?
A) విద్యుత్ వలయం
B) విద్యుత్ నిరోధం
C) విద్యుత్ వాహకం
D) విద్యుత్ బంధకం
జవాబు:
A) విద్యుత్ వలయం
8. విద్యుత్ బల్బులు వెలుగునిచ్చే భాగం
A) ధన ధ్రువం
B) రుణ ధ్రువం
C) ఫిలమెంట్
D) గాజుకుప్పె
జవాబు:
C) ఫిలమెంట్
9. టార్చ్ లైట్లో సెలను తిప్పివేస్తే
A) వెలగదు
B) వెలుగుతుంది
C) వెలిగి ఆరిపోతుంది
D) బల్బు మాడిపోతుంది
జవాబు:
A) వెలగదు
10. విద్యుత్ ఘటాలలో విద్యుత్తు వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది?
A) నీరు
B) రసాయనాలు
C) లోహాలు
D) తీగలు
జవాబు:
B) రసాయనాలు
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. ప్రవహించే విద్యుత్తును ………….. అంటాము.
2. విద్యుత్ ఉత్పత్తికి …………… వాడతాము.
3. ఘటము ……….. ధృవాలు కలిగి ఉంటుంది.
4. విద్యుత్ ధన ధ్రువం నుండి ………….. ప్రయాణిస్తుంది.
5. బల్బు రెండు ధృవాల మధ్య ………….. ఉంటుంది.
6. విద్యుత్ బల్బు ఫిలమెంట్ …………. లో ఉంటుంది.
7. ఘటము యొక్క ధన ధృవాన్ని బల్బ్ యొక్క …………….
8. విద్యుత్ వలయంలో ఘటాన్ని ……………. అంటారు.
9. వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేది ………….
10. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు విద్యుత్ ……………………
11. మూసివున్న వలయంలో విద్యుత్ ……………
12. టార్చ్ లైట్ లో స్విచ్ ఆన్ చేయగానే బల్చు …………… ధృవానికి కలుపుతారు.
13. విద్యుత్తు ప్రవహించని పదార్థాలను ………….. అంటారు.
14. విద్యుత్ బల్బును ఆవిష్కరించిన శాస్త్రవేత్త ………………..
15. విద్యుత్ బల్బులో ఉపయోగించే పదార్థం ……………………..
జవాబు:
- కరెంట్
- ఘటము లేదా సెల్
- రెండు
- రుణ ధృవానికి
- ఫిలమెంట్
- గాజుబుగ్గ
- ఋణ ధృవం
- విద్యుత్ జనకం
- స్విచ్
- ప్రవహించదు
- ప్రవహిస్తుంది.
- వెలుగుతుంది
- విద్యుత్ బంధకాలు
- థామస్ ఆల్వా ఎడిసన్
- టంగ్స్టన్
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) విద్యుత్ వాహకాలు | 1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది. |
బి) విద్యుత్ బంధకాలు | 2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది |
సి) విద్యుత్ ఘటం | 3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు |
డి) కాంతి జనకం | 4) విద్యుత్తును అనుమతించదు |
ఇ) స్విచ్ | 5) విద్యుత్తును అనుమతిస్తుంది. |
జవాబు:
Group – A | Group – B |
ఎ) విద్యుత్ వాహకాలు | 5) విద్యుత్తును అనుమతిస్తుంది. |
బి) విద్యుత్ బంధకాలు | 4) విద్యుత్తును అనుమతించదు |
సి) విద్యుత్ ఘటం | 2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది |
డి) కాంతి జనకం | 1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది. |
ఇ) స్విచ్ | 3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు |
2.
Group – A | Group – B |
ఎ) విద్యుత్ | 1) ధన లేదా రుణ |
బి) కాగితం | 2) బల్బు |
సి) రాగి | 3) కరెంట్ |
డి) ఫిలమెంట్ | 4) వాహకం |
ఇ) ధృవము | 5) అవాహకం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) విద్యుత్ | 3) కరెంట్ |
బి) కాగితం | 5) అవాహకం |
సి) రాగి | 4) వాహకం |
డి) ఫిలమెంట్ | 2) బల్బు |
ఇ) ధృవము | 1) ధన లేదా రుణ |