These AP 6th Class Science Important Questions 5th Lesson పదార్థాలు – వేరుచేసే పద్ధతులు will help students prepare well for the exams.
AP Board 6th Class Science 5th Lesson Important Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు
6th Class Science 5th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
వస్తువులు దేనితో తయారవుతాయి?
జవాబు:
వస్తువులు రకరకాల పదార్థాలతో తయారవుతాయి.
ప్రశ్న 2.
నీటిపై తేలే పదార్థాలు ఏమిటి?
జవాబు:
తక్కువ బరువు కలిగిన కాగితం, కర్ర, ఆకు, ప్లాస్టిక్ బాటిల్ వంటి పదార్థాలు నీటిపై తేలుతాయి.
ప్రశ్న 3.
నీటిలో మునిగే పదార్థాలు ఏమిటి?
జవాబు:
ఎక్కువ బరువు కలిగిన రాయి, ఇనుము, మట్టి, ఇసుక వంటి పదార్థాలు నీటిలో మునిగిపోతాయి.
ప్రశ్న 4.
నీటిలో కరిగే పదార్థాలు అనగానేమి?
జవాబు:
నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కలిసిపోయే పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటాము.
ఉదా : ఉప్పు, పంచదార.
ప్రశ్న 5.
నీటిలో కరగని పదార్థాలు అంటే ఏమిటి?
జవాబు:
నీటిలో కలిపినప్పుడు కలిసిపోని పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటాము.
ఉదా : రాయి.
ప్రశ్న 6.
విశ్వ ద్రావణి అనగానేమి?
జవాబు:
నీరు అనేక పదార్థాలను కరిగించుకుంటుంది. కావున నీటిని విశ్వద్రావణి అంటాము.
ప్రశ్న 7.
ద్రావణం అనగానేమి?
జవాబు:
ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థాన్ని ద్రావణం అంటాము.
ప్రశ్న 8.
నీటిలో అన్ని ద్రవాలు కరుగుతాయా?
జవాబు:
కొబ్బరి నూనె, కిరోసిన్ వంటి ద్రవాలు నీటిలో కరగవు.
ప్రశ్న 9.
నీటిలో కరిగే ద్రవ పదార్థాలు ఏమిటి?
జవాబు:
నిమ్మరసం, వెనిగర్ ద్రవాలు నీటిలో కరుగుతాయి.
ప్రశ్న 10.
మిశ్రమాలు అనగానేమి?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో తయారైన వాటిని మిశ్రమాలు అంటాము.
ప్రశ్న 11.
చేతితో ఏరివేసే పద్ధతికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బియ్యం నుంచి రాళ్లను తీసివేయడం, ధాన్యంలో నుంచి మట్టి గడ్డలు తీయటం చేతితో ఏరివేసే పద్ధతికి ఉదాహరణలు.
ప్రశ్న 12.
తూర్పారపట్టడం ఎప్పుడు అవసరమవుతుంది?
జవాబు:
ధాన్యం నుంచి ఊక, తాలు వేరు చేయడానికి తూర్పారపట్టడం అవసరము.
ప్రశ్న 13.
ధాన్యం నుంచి తాలు ఎలా వేరు అవుతుంది?
జవాబు:
ధాన్యంతో పోల్చినప్పుడు ఊకతాళ్లు చాలా తేలికగా ఉంటాయి, అందువల్ల రైతులు ధాన్యాన్ని తూర్పారపట్టడం ద్వారా తాలు నుంచి వేరు చేస్తారు.
ప్రశ్న 14.
తేర్చటానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మట్టి నుంచి నీటిని వేరు చేయడానికి తేర్చటం ఉపయోగిస్తాము.
ప్రశ్న 15.
నిత్యజీవితంలో ఏ సందర్భాల్లో తేర్చటం ఉపయోగిస్తాము?
జవాబు:
బియ్యం కడిగేటప్పుడు రాళ్లను వేరు చేయడానికి, మినపప్పు నుంచి రాళ్ళను వేరు చేయడానికి తేర్చటం ఉపయోగిస్తాం.
ప్రశ్న 16.
టీ డికాషన్ నుంచి, టీ పొడిని ఎలా వేరు చేస్తారు?
జవాబు:
వడపోత ద్వారా టీ డికాషన్ నుంచి, టీ పొడిని వేరు చేస్తారు.
ప్రశ్న 17.
పిండి నుంచి పొట్టు ఎలా వేరు చేస్తారు?
జవాబు:
జల్లించడం ద్వారా పిండి నుంచి పొట్టును వేరు చేయవచ్చు.
ప్రశ్న 18.
క్రొమటోగ్రఫి అనగానేమి?
జవాబు:
రంగుల మిశ్రమం నుంచి వివిధ రంగులను వేరు చేసే ప్రక్రియను క్రొమటోగ్రఫి అంటారు.
ప్రశ్న 19.
సముద్రం నుంచి ఉప్పు పొందే ప్రక్రియ ఏమిటి?
జవాబు:
స్ఫటికీకరణ ప్రక్రియ ద్వారా సముద్రం నుంచి ఉప్పు పొందుతాము.
ప్రశ్న 20.
రంగులను విశ్లేషించే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
రంగులను విశ్లేషించే ప్రక్రియను క్రొమటోగ్రఫి అంటారు.
ప్రశ్న 21.
స్వేదనజలం ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
ఇంజక్షన్ చేసే మందులలో స్వేదనజలం ఉపయోగిస్తాము.
6th Class Science 5th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
జల్లించటంను ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
- నాణ్యమైన ఇసుకను పొందటానికి జల్లించటం ఉపయోగిస్తాము.
- పిండి పదార్థాన్ని జల్లించి పిండివంట చేసుకుంటాము.
- రైతులు ధాన్యాన్ని జల్లించి రాళ్లను వేరుచేస్తారు.
- మిల్లులో బియ్యాన్ని జల్లించి నూకలు వేరుచేస్తారు.
ప్రశ్న 2.
ఒకే పదార్థాలతో తయారయ్యే వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెక్క కుర్చీ – చెక్కతో తయారవుతుంది.
గడ్డపార – ఇనుముతో తయారవుతుంది.
విగ్రహం – రాతితో తయారవుతుంది.
టైరు – రబ్బర్ తో తయారవుతుంది.
ప్రశ్న 3.
ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారయ్యే వస్తువుల గురించి రాయండి.
జవాబు:
కొన్నిసార్లు వస్తువుల తయారీకి ఒకటికంటే ఎక్కువ పదార్థాలు వాడతాము. ఉదాహరణకు
సైకిల్ – ఇనుము, రబ్బరు
కిటికీ – చెక్క ఇనుము
కుర్చీ – ఇనుము, ప్లాస్టిక్ వైర్లు
పార _ ఇనుము, చెక్క
ప్రశ్న 4.
కుర్చీ తయారీలో కొన్ని రకాల పదార్థాలు వాడవచ్చు?
జవాబు:
కుర్చీ తయారీలో ఇనుము, ప్లాస్టిక్ వైరు లేదా నవారు ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే పదార్థం ఉపయోగించి కుర్చీలు తయారు చేయవచ్చు. ఉదాహరణకి చెక్క, ప్లాస్టిక్ కుర్చీ, ఇనుప కుర్చీ.
ప్రశ్న 5.
వస్తువుల తయారీకి ఒకే పదార్థం సరిపోతుందని వివేక్ అన్నాడు. దీన్ని నువ్వు సమర్థిస్తావా?
జవాబు:
కుర్చీలు, బల్లలు, సైకిల్, ఎడ్లబండ్లు, వంటపాత్రలు, బట్టలు, టైర్లు వంటి ఎన్నో వస్తువులను మన చుట్టూ గమనిస్తూ ఉంటాము. వస్తువులన్నీ వేరువేరు పదార్థాలతో తయారయి ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. కావున పై వాక్యాన్ని పూర్తిగా సమర్థించలేము.
ప్రశ్న 6.
పదార్థాల ధర్మాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు:
ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలి నిర్వహించాలంటే ముందుగా ఆ పదార్థాల ధర్మాలు తెలుసుకోవాలి. మెత్తదనం, గట్టిదనం మరియు నిల్వ ఉండటం, మెరుపు లేకపోవడం అనే ఎన్నో ధర్మాల పదార్థాలుంటాయి. పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరువేరు సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలో తెలియాలంటే మనకు పదార్థాల ధర్మాల గురించి తెలియాలి.
ప్రశ్న 7.
పదార్థాల స్థితులు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సాధారణంగా పదార్థాలు మూడు స్థితులలో ఉంటాయి. అవి : 1. ఘనస్థితి 2. ద్రవస్థితి 3. వాయుస్థితి.
ప్రశ్న 8.
నీటి యొక్క మూడు స్థితులు తెలపండి.
జవాబు:
ప్రకృతిలో నీరు మూడు స్థితులలో లభిస్తుంది. ఘనస్థితిలో ఉండే నీటిని మంచు అంటాము. ఇది పర్వత శిఖరాలపై, ధ్రువ ప్రాంతాలలో ఉంటుంది. నీటి యొక్క ద్రవస్థితిని నీరు అంటాము. ఇది నదులలోను, సముద్రాలలోను ఉంటుంది. నీటి యొక్క వాయుస్థితిని నీటి ఆవిరి అంటాము. ఇది వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది.
ప్రశ్న 9.
ఒక పదార్థం యొక్క స్థితి ఎప్పుడు మారుతుంది?
జవాబు:
వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారతాయి. అదేవిధంగా చల్లబరచినప్పుడు వాయుస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారతాయి. కావున ఉష్ణోగ్రతలను మార్చి పదార్థం యొక్క స్థితిని మార్చవచ్చును.
ప్రశ్న 10.
ఘన పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం కలిగి గట్టిగా ఉండే పదార్థ స్థితిని ఘనస్థితి అంటాము.
ఉదా : రాయి, గోడ, బల్ల.
ప్రశ్న 11.
ద్రవ పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం లేకుండా ప్రవహించే ధర్మాన్ని కలిగి ఉండి, ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారం ఉండే వాటిని ద్రవపదార్థాలు అంటాము.
ఉదా : పాలు, నూనె.
ప్రశ్న 12.
వాయు పదార్థాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నిర్దిష్ట ఆకారం లేకుండా ఎక్కువ ప్రాంతము విస్తరించే గాలి వంటి పదార్థాలను వాయువులు అంటాము.
ఉదా : హైడ్రోజన్, ఆక్సిజన్.
ప్రశ్న 13.
పంచదార తాను పోసిన పాత్ర ఆకారాన్ని పొందినప్పటికీ అది ఘన పదార్థమే కాని ద్రవ పదార్థం కాదు. చర్చించండి.
జవాబు:
పంచదార స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుంది. స్ఫటికాలు పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల అవి పాత్ర ఆకారంలో సరిపోతాయి. అయినప్పటికీ పంచదార ద్రవపదార్థం కాదు. పంచదార స్ఫటికాన్ని పరిశీలించినట్లయితే అది నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి గట్టిగా ఉంటుంది. ఇది ఘన పదార్థం యొక్క లక్షణం కావున పంచదార కూడా ఘన పదార్థమే.
ప్రశ్న 14.
సాధారణ ఉప్పు ఘన పదార్థమా? లేక ద్రవ పదార్థమా?
జవాబు:
సాధారణ ఉప్పు ఘన పదార్థం. ఉప్పు స్ఫటిక నిర్మాణం కలిగి ఉంటుంది. ఉప్పు స్ఫటికం గట్టిగా ఉండి నిర్దిష్ట ఆకారం కలిగి ఉంటుంది. కావున సాధారణ ఉప్పు ఘన పదార్థం.
ప్రశ్న 15.
కొన్ని పదార్థాలు నీటిలో మునుగుతాయి, మరికొన్ని తేలుతాయి. ఎందుకు?
జవాబు:
నీటి కంటే ఎక్కువ బరువు ఉన్న పదార్థాలు నీటిలో మునిగిపోతాయి. నీటి కంటే తక్కువ బరువు ఉన్న పదార్థాలు నీటిపై తేలుతాయి. ఉదాహరణకు ఎక్కువ బరువు కలిగిన రాయి నీటిలో మునుగుతుంది. తక్కువ బరువు కలిగిన కాగితం నీటిపై తేలుతుంది.
ప్రశ్న 16.
ఇనుప వస్తువులు నీటిలో తేలుతాయా?
జవాబు:
సాధారణంగా ఇనుప వస్తువులు నీటిలో మునిగిపోతాయి. కానీ వాటి ఆకారం మార్చడం వల్ల ఇనుప వస్తువులను నీటిపై చేర్చవచ్చు. ఉదాహరణకు ఇనుపమేకు నీటిలో మునగదు. ఇనుప డబ్బా నీటిపై తేలుతుంది. అందువల్లనే ఇనుము ఆకారాన్ని మార్చి పెద్ద పెద్ద పడవలను నీటిపై తేలే విధంగా తయారు చేస్తున్నారు.
ప్రశ్న 17.
నీటిని విశ్వ ద్రావణి అంటాము. ఎందుకు?
జవాబు:
ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవాన్ని ద్రావణము అంటాము. నీరు అనే ద్రావణం ఇతర ద్రావణాలతో పోల్చినప్పుడు ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకొంటుంది. అందుకని నీటిని “విశ్వద్రావణం” అంటాము.
ప్రశ్న 18.
మిశ్రమాలు అనగానేమి?
జవాబు:
ఒకటి కంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టి లాంటి మిశ్రమాలు సహజంగా లభిస్తే నిమ్మరసం, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలు మనం తయారు చేస్తాం.
ప్రశ్న 19.
పదార్థాలు వేరు చేసే కొన్ని పద్ధతులను తెలపండి.
జవాబు:
పదార్థాలు వేరు చేయడానికి అనేక పద్ధతులు వాడతాం. అవి : 1. తూర్పారపట్టడం 2. జల్లించటం 3. చేతితో ఏరటం 4. స్ఫటికీకరణ 5. స్వేదనం 6. ఉత్పతనం 7. క్రొమటోగ్రఫి
ప్రశ్న 20.
తూర్పారపట్టడం గురించి రాయండి.
జవాబు:
రైతులు తమ పంటను నూర్చినప్పుడు ఊక, తాలు, ధాన్యం గింజల మిశ్రమం లభిస్తుంది. రైతులు వీటిని వేరు చేయడానికి తూర్పారపడతారు. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల్లమీద నిలబడి ధాన్యం ఊక, తాలు మిశ్రమాన్ని చేటతో ఎత్తి క్రిందకు నెమ్మదిగా పోస్తూ ఉంటారు. ఊక, తాలు, ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. మంచిధాన్యం ఒక రాశి లాగా నేరుగా కింద పడుతుంది. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాలు తేలికగా ఉంటాయి. అందువల్ల రైతులు తూర్పార పట్టడం అనే ధర్మాన్ని ఉపయోగించి ధాన్యం నుంచి తాలు వేరు చేస్తారు.
ప్రశ్న 21.
జల్లెడ ఉపయోగించి మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయగలవా? దీనికోసం నీవు ఏ పద్ధతి వాడతావు?
జవాబు:
జల్లెడ ఉపయోగించి మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయలేము. మురికి కణాలు జల్లెడలోని రంధ్రాల కంటే చాలా చిన్నవి. అందువలన ఇవి నీటితోపాటు ప్రయాణిస్తాయి. మురికి నీటి నుంచి మట్టిని వేరు చేయడానికి వడపోత మంచి పద్దతి. దీనికోసం వడపోత కాగితం వాడుతాము.
ప్రశ్న 22.
వడపోత కాగితం గురించి రాయండి.
జవాబు:
వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా వడపోయవచ్చు. నీటి నుంచి మట్టి కణాలను తొలగించడానికి వడపోత కాగితం చాలా మంచి సాధనం.
ప్రశ్న 23.
వడపోత కాగితం ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పు కణాలను వేరు చేయగలమా?
జవాబు:
వడపోత కాగితం ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పు కణాలను వేరు చేయలేము. వడపోత కాగితంలో చాలా సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అయినప్పటికీ ఈ రంధ్రాల ద్వారా ఉప్పు కణాలు జారిపోతాయి. దీనిని బట్టి ఉప్పు కణాలు ఎంత చిన్నవిగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రశ్న 24.
ఉప్పు నీటి నుంచి ఉప్పు ఎలా పొందుతారు?
జవాబు:
ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.
ప్రశ్న 25.
స్పటికీకరణం అనగానేమి?
జవాబు:
ద్రవపదార్థాన్ని వేడిచేసి ఆవిరిగా మార్చడం వల్ల దానిలోని ఘన పదార్థం స్ఫటికాలుగా మారుతుంది. ఈ ప్రక్రియను స్పటికీకరణం అంటాము. ఈ ప్రక్రియ ద్వారా మనము సముద్రం నుంచి ఉప్పును తయారు చేస్తాము.
ప్రశ్న 26.
స్వేదనము అనగానేమి?
జవాబు:
ద్రవ పదార్థాన్ని ఆవిరిగా మార్చి దానిని చల్లబర్చటం వల్ల స్వచ్ఛమైన ద్రవ పదార్థాన్ని పొందటాన్ని స్వేదనం అంటారు. ఈ ప్రక్రియలో వైద్యులు ఇంజక్షన్లలో వాడే మంచి నీటిని తయారుచేస్తారు.
ప్రశ్న 27.
ఉత్పతనం అనగానేమి?
జవాబు:
కొన్ని ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు అవి నేరుగా వాయుస్థితికి మారటాన్ని ఉత్పతనం అంటారు.
ఉదా : అయోడిన్.
ప్రశ్న 28.
మన నిత్య జీవితంలో క్రొమటోగ్రఫీని ఎక్కడ ఉపయోగిస్తాము?
జవాబు:
ఆహార పదార్థాలు ఎంతవరకు పాడైపోయాయో నిర్ధారించడానికి, నేరస్తులను గుర్తించడానికి, రక్తాన్ని విశ్లేషించడానికి, నేర నిర్ధారణ విభాగంలో, శరీరంలోని జీవక్రియల విశ్లేషణకు క్రొమటోగ్రఫీని ఉపయోగిస్తాము.
6th Class Science 5th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నీకు దగ్గర సముద్రపు ఒడ్డున గల ఉప్పుమండలిలోనికి వెళ్ళి వ్రాయుము. ఉప్పును ఎలా తయారు చేస్తారు?
జవాబు:
- ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు.
- సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు.
- గాలికి, సూర్యరశ్మికి మడులలోని నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.
ప్రశ్న 2.
హేమంత ను కొన్ని కిరాణా సరుకులు, కూరగాయలు కొనుక్కురమ్మని వాళ్ళ అమ్మ పంపించింది. అతను పచ్చిమిరపకాయలు, టమాటాలు, కందిపప్పు, గోధుమపిండి, ధనియాలు కొని వాటిని ఒక సంచిలో జాగ్రత్తగా ఉంచాడు. ఇంటికి తిరిగి వస్తుంటే రాయి తగిలి రోడ్డుపైన పడిపోయాడు. సంచిలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి, వాటిని అతను ఏరినట్లయితే
ఎ) మొదటగా ఏ పదార్థాన్ని వేరుచేస్తాడు?
బి) టమాటాలు, పచ్చిమిరపకాయలను ఎలా వేరుచేస్తాడు?
సి) గోధుమపిండిని అతను ఎలా వేరుచేస్తాడు?
డి) ధనియాలను అతను ఎలా వేరుచేస్తాడు?
మీ స్వీయ అనుభవం ద్వారా సమాధానాలు వ్రాయుము.
జవాబు:
ఎ) అతను మొదటగా ప్యాకెట్ల రూపంలో గల సరుకులను చేతితో వేరుచేస్తాడు.
బి) టమాటాలను, పచ్చిమిరపకాయలను చేతితో ఏరి వాటిని వేరుచేస్తాడు.
సి) గోధుమపిండిని మట్టి, ఇసుక, చిన్న చిన్న రాళ్ళు రాకుండా చేతితో ఎత్తి ఇంటికి వెళ్ళాక “జల్లెడతో” వేరుచేస్తాడు.
డి) రోడ్డుపై పడ్డ ధనియాలను చేతితో ఎత్తి, చాట సహాయంతో చెరిగి వేరుచేస్తాడు.
ప్రశ్న 3.
నెయ్యి, మైనం, పంచదార, ఉప్పు, పసుపు, పప్పు దినుసులు, ప్లాస్టిక్, చెక్క, ఇనుపమేకులు మొదలైన కొన్ని ఘనపదార్ధాలను సేకరించండి. ఒక బకెట్ నిండుగా నీరు, బీకరు తీసుకోండి. కింద తెలిపినధర్మాలుగల పదార్థాలు ఏవో గుర్తించడానికి ప్రయత్నించండి.
ఎ) నీటిపై తేలే పదార్థాలు
బి) నీటిలో మునిగే పదార్థాలు
సి) నీటిలో కరిగే పదార్థాలు
డి) నీటిలో కరగని పదార్థాలు
జవాబు:
ఎ) నీటిపై తేలే పదార్థాలు : 1) నెయ్యి 2) మైనం 3) చెక్క 4) ప్లాస్టిక్
బి) నీటిలో మునిగే పదార్థాలు : 1) పంచదార 2) ఉప్పు 3) పసుపు 4) పప్పు దినుసులు 5) ఇనుప మేకులు
సి) నీటిలో కరిగే పదార్థాలు : 1) పంచదార 2) ఉప్పు ..
డి) నీటిలో కరగని పదార్థాలు : 1) నెయ్యి 2) మైనం 3) పసుపు 4) పప్పు దినుసులు 5) ఇనుపమేకులు
ప్రశ్న 4.
ఒక బీకరులో సగం వరకు నీరు తీసుకొని దానిలో ఇసుక, రంపపు పొట్టు, ఉప్పును చేర్చండి. మిశ్రమాన్ని బాగా కలపండి. దీనిని 10 నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచండి.
a) నీవు ఏమి గమనించావు?
b) ఏ పదార్థం నీటిమీద తేలుతుంది?
c) తేలుతున్న పదార్థాన్ని నీవు ఎలా సేకరిస్తావు?
d) బీకరు అడుగు భాగంలో ఏ పదార్దం చేరివుంది?
e) దాన్ని తిరిగి ఎలా సేకరించగలవు?
f) ఏ పదార్థం నీటిలో కరిగినది?
g) ఆ పదార్ధాన్ని నీవు తిరిగి ఎలా పొందగలవు?
జవాబు:
a) నీటిలో రంపపు పొట్టు పైకి తేలినది. ఉప్పు నీటిలో కరిగింది. ఇసుక పూర్తిగా కిందికి దిగింది.
b) రంపపు పొట్టు తేలింది.
c) తేరిన దానిని వంచడం ద్వారా రంపపు పొట్టును సేకరిస్తాము.
d) బీకరు అడుగుభాగాన ఇసుక ఉంది.
e) వడబోత ద్వారా ఇసుకను సేకరిస్తాము.
f) ఉప్పు నీటిలో కరిగింది.
g) ఇగుర్చు ప్రక్రియ ద్వారా నీటిలో కరిగిన ఉప్పును పొందగలము.
ప్రశ్న 5.
1) మనకు తారసపడే అనేక సందర్భాలలో, వేర్వేరు వస్తువులను ఒక మిశ్రమం నుంచి వేరుచేయవలసి ఉంటుంది. అటువంటి రెండు సందర్భాలను ఉదహరించండి.
జవాబు:
1) బియ్యం , చిన్న చిన్న రాళ్లు
2) మురికి నీరు
2) ఆ వస్తువులను నీవు వేరుచేయడానికి ఏం చేస్తావు?
జవాబు:
1) బియ్యంలో చిన్న చిన్న రాళ్లను చేతితో ఏరివేసి వేరుచేస్తాం.
2) వడబోత కాగితంతో మురికినీటిని వడబోస్తాం. వడబోత కాగితం అనేది కాగితంతో తయారయిన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడబోయవచ్చు. మిశ్రమంలోని ప్రతి వస్తువునూ వేరుచేయగల్గితిని.
3) నీవు మిశ్రమంలోని ప్రతి వస్తువునూ వేరుచేయగలిగావా? అన్ని సందర్భాలలో నువ్వు వేరుచేసేందుకు ఉపయోగించిన పద్దతులు ఒకే విధంగా ఉన్నాయా?
జవాబు:
నేను మిశ్రమంలోని పదార్థాలను వేరు చేసేందుకు ఉపయోగించిన పద్దతులు అన్ని సందర్భాలలో ఒకే విధంగా లేవు.
ప్రశ్న 6.
కింది సందర్భాలలో మిశ్రమం నుండి ఒక అంశాన్ని వేరుచేయాలంటే ఏ పద్ధతి ఉపయోగించాలి?
అ) మరొక దానికంటే బరువుగా ఉన్నవాటిని
ఆ) మరొక దానికంటే పెద్దవిగా ఉన్నవాటిని
ఇ) రంగు, ఆకారంలో వేరుగా ఉన్నవాటిని
ఈ) ఒకటి నీటిలో కరిగేది మరొకటి నీటిలో కరగనిది ఉన్నప్పుడు
ఉ) ఒకటి నీటిలో తేలేది మరొకటి నీటిలో తేలనిది ఉన్నప్పుడు
జవాబు:
అ) తూర్పారబెట్టడం
ఆ) జల్లించడం
ఇ) చేతితో ఏరివేయడం
ఈ) వడబోత
ఉ) తేర్చుట
ప్రశ్న 7.
మీదగ్గరలో ఉన్నపాలకేంద్రానికి వెళ్ళండి. పాలనుంచి వెన్ననుఎలావేరుచేస్తారో తెలుసుకోండి.నివేదికరాయండి.
జవాబు:
- సెంట్రీ ఫ్యూజ్ తో పాల నుండి వెన్నను వేరుచేస్తున్నారు.
- ఒక పాత్రలో పాలు తీసుకుని దానిని ఏకరీతి వేగంతో వృత్తాకార మార్గంలో తిరుగునట్లు చేశారు.
- వృత్తాకార మార్గంలో పదార్థాలను తిప్పడానికి కావలసిన అపకేంద్రబలం తేలికైన పదార్థాలకు తక్కువగాను, బరువైన పదార్థాలకు ఎక్కువగాను ఉంటుంది.
- అందువల్ల పదార్థాలు వృత్తాకార మార్గంలో తిరుగునపుడు తేలికైన పదార్థాలు (వెన్న) తక్కువ వ్యాసార్ధం వున్న – వృత్తాకార మార్గంలోను, బరువైన పదార్థాలు (పాలు) ఎక్కువ వ్యాసార్ధం వున్న వృత్తాకార మార్గంలోను ఉంటాయి.
- అందువల్ల వృత్తాకార మార్గంలో తిరిగే పాత్రలో అడుగుభాగానికి పాలు, పై భాగానికి వెన్న తేలుతాయి. దానిని వేరుచేస్తున్నారు.
- మన ఇళ్ళలో ఇదే సూత్రం ఆధారంగా పెరుగును కవ్వంతో చిలికి వెన్నను రాబడతారు.
ప్రశ్న 8.
మిశ్రమాలను వేరుచేయడానికి దివ్య కొన్ని పద్ధతులను సూచించింది. అవి సరయినవో కాదో, సాధ్యమౌతాయో లేదో చెప్పండి. కారణాలు రాయండి.
అ) వడపోయడం ద్వారా సముద్రపు నీళ్ళనుంచి మంచి నీరు పొందవచ్చు.
ఆ) పెరుగును తేర్చడం ద్వారా వెన్నను వేరుచేయవచ్చు.
ఇ) వడపోయడం ద్వారా టీ నుంచి చక్కెరను వేరుచేయవచ్చు.
జవాబు:
అ) 1) వడబోయడం ద్వారా సముద్రపు నీటి నుండి మంచి నీరు పొందలేము.
2) స్వేదన ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి మంచి నీరు పొందగలము.
ఆ) 1) పెరుగును తేర్చడం ద్వారా వెన్నను వేరుచేయలేము.
2) పెరుగును కవ్వంతో చిలకడం ద్వారా వెన్నను వేరుచేయగలము.
ఇ) 1) వడబోయడం ద్వారా టీ నుండి చక్కెరను వేరుచేయలేము.
2) ఇగర్చడం ద్వారా టీ నుండి చక్కెరను వేరుచేయగలము.
ప్రశ్న 9.
మీ ఇంట్లో ఆహార ధాన్యాలు శుభ్రం చేయడానికి ఉపయోగించే పద్ధతులను సేకరించి చార్టు తయారుచేయండి.
జవాబు:
ఆహారధాన్యాలు శుభ్రం చేయడానికి ఉపయోగించే పద్ధతులు :
1) చేతితో ఏరివేయడం :
ఈ పద్ధతిని ఉపయోగించి బియ్యం, తృణధాన్యాలలోని రాళ్లను చేతితో ఏరివేస్తాం.
2) జల్లించడం :
ఎ) మిశ్రమంలోని పదార్థాలు వేరు పరిమాణంలో వున్నప్పుడు జల్లించడం ద్వారా వాటిని వేరు చేస్తారు.
బి) జల్లెడలోని రంధ్రాల ద్వారా చిన్నసైజు కణాలు వెళ్లిపోతాయి. పెద్ద సైజు కణాలు జల్లెడలో ఉండిపోతాయి.
ఉదాహరణ : గోధుమ పిండిని జల్లించడం.
సి) పంట నూర్చుట :
వరి కంకుల నుండి ధాన్యం, గడ్డిని వేరుచేయుట.
ప్రశ్న 10.
మిశ్రమాలను వేరుచేయడానికి మీ ఇంటిలో ఉపయోగించు ఒక పరికరం పటం గీచి వివరించుము.
జవాబు:
మనం టీ డికాక్షన్ నుండి టీ పొడిని, ఎర్రమట్టి నుండి ఇసుకను వేరుచేయుటకు జల్లెడలను ఉపయోగిస్తాం.
ప్రశ్న 11.
నీటిని వడబోయుటకు వడబోత కాగితం ఉపయోగించు విధానం పటము గీయుము.
(లేదా)
ప్రయోగశాలలో వడపోత విధానం అమరిక పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 6th Class Science 5th Lesson 1 Mark Bits Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. రంగులను వేరుచేసే ప్రక్రియ
A) స్వేదనం
B) ఉత్పతనం
C) ఫోటోగ్రఫీ
D) క్రోమటోగ్రఫీ
జవాబు:
D) క్రోమటోగ్రఫీ
2. ఘన స్థితి నుంచి వాయు స్థితికి నేరుగా మార్చే ప్రక్రియ
A) స్వేదనం
B) ఫోటోగ్రఫీ
C) ఉత్పతనం
D) క్రోమాటోగ్రఫీ
జవాబు:
C) ఉత్పతనం
3. ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరచి నీరుగా మారుస్తాం?
A) స్వేదనం
B) వడపోత
C) తూర్పారపట్టడం
D) జల్లించడం
జవాబు:
A) స్వేదనం
4. సముద్రం నుండి. ఉప్పును తయారు చేసే ప్రక్రియ
A) స్ఫటికీకరణ
B) ఉత్పతనం
C) స్వేదనం
D) వడపోత
జవాబు:
A) స్ఫటికీకరణ
5. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి
A) వడపోత
B) తరలించటం
C) స్పటికీకరణం
D) క్రోమటోగ్రఫీ
జవాబు:
A) వడపోత
6. రైతులు ధాన్యం నుంచి తాలు వేరుచేసే ప్రక్రియ
A) వడపోత
B) తూర్పారపట్టడం
C) జల్లించడం
D) ఆవిరి చేయటం
జవాబు:
B) తూర్పారపట్టడం
7. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి
A) మిశ్రమాలు
B) రసాయనాలు
C) ఘన పదార్థాలు
D) ద్రవ పదార్థాలు
జవాబు:
A) మిశ్రమాలు
8. విశ్వ ద్రావణి
A) ఆల్కహాల్
B) నీరు
C) పాలు
D) కిరోసిన్
జవాబు:
B) నీరు
9. నీటి కంటే బరువైన పదార్థాలు నీటిలో
A) తేలుతాయి
B) మునుగుతాయి
C) కొట్టుకుపోతాయి
D) పగిలిపోతాయి
జవాబు:
B) మునుగుతాయి
10. పాత్రల ఆకారము పొందే ఘన పదార్థం
A) ఇసుక
B) పాలు
C) నీరు
D) గాలి
జవాబు:
A) ఇసుక
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. వస్తువులు …….. తో తయారవుతాయి.
2. ఒకే పదార్థంతో తయారైన వస్తువు ………….
3. పదార్థాలు ………… స్థితులలో ఉంటాయి.
4. నీటి యొక్క స్థితిని …….. అంటాము.
5. నీటి యొక్క ……… వాయు స్థితి రూపము.
6. పదార్థాల స్థితి మారటానికి …….. అవసరం.
7. ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ……… స్థితికి వస్తాయి.
8. నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉన్న పదార్థాలు …………….
9. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొనే పదార్థాలు ………………
10. ద్రవపదార్థాలను వేడి చేస్తే అవి ……. స్థితికి మారతాయి.
11. చక్కెర …………. స్థితి కలిగి ఉంది.
12. ఘన స్థితిలో ఉన్నప్పటికీ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థం ………..
13. నీటిలో మునిగే పదార్థం …………
14. నీటిలో తేలే పదార్థం ………..
15. నీటిలో కరిగే పదార్థాలు …………..
16. నీటిలో కరగని పదార్థాలు …………
17. విశ్వ ద్రావణి ………………
18. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ……………. ఏర్పడతాయి.
19. మిశ్రమ పదార్థం ………….. నకు ఉదాహరణ.
20. బియ్యం నుంచి రాళ్లు తీసివేయడానికి వాడే పద్ధతి ……………..
21. ధాన్యం నుంచి తాలు వేరు చేసే పద్ధతి ………..
22. మట్టి నీటి నుంచి మట్టిని, వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి …………
23. టీ డికాషన్ నుంచి టీ వేరు చేయడానికి వాడే పద్ధతి …………..
24. పిండిని శుభ్రం చేయడానికి వాడే పద్దతి …………..
25. సముద్రం నుంచి ఉప్పు పొందే పద్దతి ………….
26. నీటిని ఆవిరిగా మార్చి దానిలోని ఘన పదార్థాలను
వేరు చేయటాన్ని ………….. అంటాము.
27. స్వచ్ఛమైన నీటిని …………… పద్ధతిలో పొందుతాము.
28. వర్షం పడటంలో ఇమిడి ఉన్న ప్రక్రియలు ……………
29. ఉత్పతనం చెందే పదార్థం …………….
30. ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారటాన్ని …………… అంటాము.
31. రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరుచేయు ప్రక్రియ ……………
32. రోజువారి జీవితంలో చూసే ఉత్పతనం చెందే పదార్థం …………
33. సుద్ద ముక్క , నీరు, సిరాతో నీవు ……………. నిరూపిస్తావు.
34. ఉప్పు మిశ్రమం నుంచి కర్పూరాన్ని వేరు చేయడానికి వాడే పద్దతి ……………..
35. సాధారణ నీటి నుంచి, స్వచ్ఛమైన నీటిని పొందటానికి వాడే పద్ధతి ……………..
35. ఉప్పు తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ ……………
36. నీటి నుంచి సన్నని కణాలను వేరు చేయడానికి వాడే పద్దతి …………..
37. అధిక మొత్తంలో ఉన్న ధాన్యం నుంచి రాళ్లను వేరు
చేయడానికి రైతులు వాడే పద్దతి ………..
38. నీటి నుంచి మినపపొట్టు వేరు చేయడానికి గృహిణిలు వాడే పద్ధతి ……………
39. పదార్థాలను వేరు చేయటానికి ……………. పద్ధతిలో గాలి అవసరం.
40. ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థము ……….
జవాబు:
- పదార్థం
- గడ్డపార
- మూడు
- ద్రవస్థితి
- నీటి ఆవిరి
- ఉష్ణోగ్రత
- ద్రవ
- ఘన పదార్థాలు
- ద్రవ పదార్థాలు
- వాయు
- ఘన
- చక్కెర, ఉప్పు, ఇసుక
- రాయి
- చెక్క
- ఉప్పు, పంచదార
- ఇసుక
- నీరు
- మిశ్రమాలు
- లడ్డు, నిమ్మరసం
- చేతితో ఏరటం
- తూర్పారపట్టడం
- తేర్చటం
- వడపోత
- జల్లించటం
- స్పటికీకరణ
- స్పటికీకరణ
- స్వేదనం
- భాష్పోత్సేకం, స్వేదనం
- అయోడిన్
- క్రోమాటోగ్రఫీ
- కర్పూరం
- క్రోమటోగ్రఫీ
- ఉత్పతనం
- స్వేదనం
- స్పటికీకరణం
- వడపోత
- జల్లించటం
- తేర్చటం
- తూర్పారపట్టడం
- ద్రావణం
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు | 1. నీరు |
బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు | 2. నిర్దిష్ట ఆకారం |
సి) మిశ్రమాలు | 3. ఇనుప బీరువా |
డి) ఘన పదార్థం | 4. సైకిల్ |
ఇ) విశ్వ ద్రావణి | 5. లడ్డు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు | 3. ఇనుప బీరువా |
బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు | 4. సైకిల్ |
సి) మిశ్రమాలు | 5. లడ్డు |
డి) ఘన పదార్థం | 2. నిర్దిష్ట ఆకారం |
ఇ) విశ్వ ద్రావణి | 1. నీరు |
2.
Group – A | Group – B |
ఎ) స్థితి మార్పు | 1. పంచదార |
బి) ఉత్పతనం | 2. గాలి |
సి) నీటిలో తేలేవి | 3. ఉష్ణోగ్రత |
డి) వాయు పదార్థాలు | 4. కర్పూరం |
ఇ) నీటిలో కరిగేవి | 5. చెక్క |
జవాబు:
Group – A | Group – B |
ఎ) స్థితి మార్పు | 3. ఉష్ణోగ్రత |
బి) ఉత్పతనం | 4. కర్పూరం |
సి) నీటిలో తేలేవి | 5. చెక్క |
డి) వాయు పదార్థాలు | 2. గాలి |
ఇ) నీటిలో కరిగేవి | 1. పంచదార |
3.
Group – A | Group – B |
ఎ) తూర్పారపట్టడం | 1. ఉప్పు |
బి) క్రొమటోగ్రఫి | 2. ఇసుక |
సి) స్వేదనం | 3. ధాన్యం |
డి) నీటిలో మునిగేవి | 4. శుద్దజలం |
ఇ) స్ఫటికీకరణ | 5. రంగులు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) తూర్పారపట్టడం | 3. ధాన్యం |
బి) క్రొమటోగ్రఫి | 4. శుద్దజలం |
సి) స్వేదనం | 5. రంగులు |
డి) నీటిలో మునిగేవి | 2. ఇసుక |
ఇ) స్ఫటికీకరణ | 1. ఉప్పు |
మీకు తెలుసా?
→ ద్రావణం అనేది ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థం. నీరు అనే ద్రావణం ఇతర ద్రావణాలతో పోల్చినప్పుడు ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకుంటుంది. అందుకని నీటిని “విశ్వ ద్రావణి” అంటారు.
→ రైతులు జల్లెడలనుపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరుచేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను, విత్తనాలుగా కాని లేదా అధిక రేటుకు విక్రయించటంగాని చేస్తారు.
→ ఉప్పునీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది.