These AP 6th Class Science Important Questions 7th Lesson కొలుద్దాం will help students prepare well for the exams.
AP Board 6th Class Science 7th Lesson Important Questions and Answers కొలుద్దాం
6th Class Science 7th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కొలత యొక్క సంప్రదాయ పద్ధతులు ఏమిటి?
జవాబు:
కొలత యొక్క సంప్రదాయ పద్ధతులు అడుగు, జాన మరియు మూర.
ప్రశ్న 2.
పొడవుకు ప్రమాణం ఏమిటి?
జవాబు:
మీటర్ పొడవు యొక్క ప్రమాణం.
ప్రశ్న 3.
వైశాల్యం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
చదరపు సెంటీమీటర్² (సెం.మీ.²) వైశాల్యం యొక్క ప్రమాణం.
ప్రశ్న 4.
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?
జవాబు:
కొలజాడీ ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం.
ప్రశ్న 5.
గజం అంటే ఏమిటి?
జవాబు:
మన యొక్క ముక్కు చివర నుండి చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని గజం అంటారు.
ప్రశ్న 6.
మొదటి మీటర్ స్కేల్ ను ఎవరు చేశారు? ఇప్పుడు అది ఎక్కడ ఉంది?
జవాబు:
ఫ్రాన్స్ దేశస్థులు మొదటి మీటర్ స్కేల్ ను తయారు చేశారు. ఇప్పుడు అది ఫ్రాన్స్ మ్యూజియంలో ఉంది.
ప్రశ్న 7.
స్కేల్ చేయడానికి ఫ్రాన్స్ ఏ పదార్థంను ఉపయోగించింది?
జవాబు:
ప్లాటినం మరియు ఇరిడియం లోహాల మిశ్రమాన్ని మీటర్ స్కేల్ చేయడానికి ఫ్రాన్స్ ఉపయోగించింది.
ప్రశ్న 8.
పొడవును కొలవడానికి మన దైనందిన జీవితంలో ఉపయోగించిన సాధనాలు ఏమిటి?
జవాబు:
మనం సాధారణ టేప్, చుట్టుకొనే టేప్, చెక్క ప్లాస్టిక్ మరియు లోహాలతో చేసిన వివిధ స్కేల్ లను ఉపయోగిస్తాము.
ప్రశ్న 9.
వక్రమార్గాన్ని కలిగిన వస్తువులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బకెట్ మరియు తవ్వ వంటి వంట పాత్రల చుట్టుకొలతలు వక్రమార్గాలకు ఉదాహరణ.
ప్రశ్న 10.
గుంటూరు నుండి విశాఖపట్నం మధ్య దూరాన్ని కొలవడానికి అనుకూలమైన ప్రమాణం ఏది?
జవాబు:
కిలోమీటర్ ఎక్కువ దూరాలను కొలవడానికి తగిన ప్రమాణం.
ప్రశ్న 11.
మూరను పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణంగా ఎందుకు తీసుకోరు?
జవాబు:
మూర విశ్వసనీయమైన ప్రమాణం కాదు. ఎందుకంటే చేతి లేదా మూర పొడవు ప్రజలందరికీ సమానం కాదు.
ప్రశ్న 12.
క్యూబ్ లేదా ఘన.సెం.మీ. అంటే ఏమిటి?
జవాబు:
క్యూబ్ అనగా 1 సెం.మీ పొడవు, 1 సెం.మీ వెడల్పు మరియు 1 సెం.మీ ఎత్తు యొక్క కొలత. ఇది ఘన ఆ పరిమాణాన్ని చూపిస్తుంది.
ప్రశ్న 13.
వక్రరేఖ యొక్క పొడవును కొలవడానికి మనం ఏ పరికరం ఉపయోగిస్తాము?
జవాబు:
వక్ర రేఖ యొక్క పొడవును కొలవడానికి మనం దారం మరియు స్కేలును ఉపయోగిస్తాము.
ప్రశ్న 14.
ఎక్కువ దూరాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
అధిక దూరాన్ని కిలోమీటర్ల ద్వారా కొలుస్తారు.
1 కిలోమీటర్ = 1000 మీటర్లు.
ప్రశ్న 15.
రాము ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం 2500 మీటర్లు. ఈ దూరాన్ని కిలోమీటర్లకు మార్చండి.
జవాబు:
1 కిలోమీటర్ = 1000 మీటర్లు ⇒ 2500 కి.మీ. = 2500/1000 = 2.5 కి.మీ.
ప్రశ్న 16.
మి.లీ. మరియు మీ³ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
1 మి.లీ = సెం.మీ³
ప్రశ్న 17.
వైర్ల మందాన్ని కొలవటానికి ప్రమాణం ఏమిటి?
జవాబు:
మిల్లీ మీటర్లు
ప్రశ్న 18.
పాలు మరియు ద్రవాల పరిమాణాలను కొలవడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తారు?
జవాబు:
కొలజాడీ లేదా కొలపాత్ర
ప్రశ్న 19.
క్రమరహిత ఉపరితలం యొక్క వైశాల్యం కొలవడానికి ఏ సాధనాలను ఉపయోగిస్తారు?
జవాబు:
గ్రాఫ్ పేపర్
ప్రశ్న 20.
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలిచే ప్రామాణిక ప్రమాణం ఏమిటి?
జవాబు:
ద్రవాల ఘనపరిమాణాన్ని కొలిచే ప్రామాణిక ప్రమాణం మి.లీ.
ప్రశ్న 21.
మీరు వదులుగా ఉండే ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవగలరా?
జవాబు:
అవును. మనం ఇసుక, కంకర వంటి వదులుగా ఉండే ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని కొలవగలము.
ప్రశ్న 22.
ఘనపరిమాణం యొక్క ప్రామాణిక ప్రమాణం ఏమిటి?
జవాబు:
ఘన సెం.మీ³ ఘనపరిమాణం యొక్క ప్రామాణిక ప్రమాణం.
6th Class Science 7th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రాచీన కాలంలో గజం దూరం ఎలా నిర్ణయించబడింది?
జవాబు:
- ప్రాచీన కాలంలో వారి దేశపు రాజు ముక్కు నుండి మధ్య వేలు చివరకు గల దూరాన్ని వారు ‘గజం’ అని పిలిచారు.
- గజం మూడు సమాన భాగాలుగా విభజించబడింది మరియు ప్రతి భాగాన్ని ‘అడుగు’గా పిలుస్తారు.
- ప్రతి అడుగును ‘అంగుళాలు’ అని పిలువబడే పన్నెండు సమాన భాగాలుగా విభజించారు.
- ప్రతి అంగుళాన్ని కూడా చిన్న భాగాలుగా విభజించి కొలతలు కొలుస్తారు.
ప్రశ్న 2.
పొడవులను కొలవడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన పరికరాన్ని ఎందుకు అభివృద్ధి చేయవలసి వచ్చింది?
జవాబు:
ప్రతి దేశానికి వారి సొంత స్కేల్ అమలులో ఉంది, ఇది ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది వాణిజ్యానికి మరియు వాణిజ్య లావాదేవీలలో చాలా సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉమ్మడి స్కేలు ప్రారంభించాలని నిర్ణయించారు. చివరగా ఫ్రాన్స్ లో ఒక ప్రత్యేక పదార్థంతో (ప్లాటినం – ఇరిడియం) తయారు చేసిన రాడ్ యొక్క నిర్దిష్ట పొడవును మీటర్ గా నిర్ణయించారు. ఇది అంతర్జాతీయంగా పొడవుకు ప్రమాణంగా అంగీకరించబడింది.
ప్రశ్న 3.
పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణం ఏమిటి? దీన్ని చిన్న యూనిట్లుగా ఎలా విభజించారు?
జవాబు:
‘మీటర్’ పొడవు యొక్క ప్రామాణిక ప్రమాణం. సెంటీమీటర్ మరియు మిల్లీమీటర్లు పొడవు యొక్క చిన్న ప్రమాణాలు.
1 మీటర్ (1 మీ) = 100 సెంటీ మీటర్లు (100 సెం.మీ)
1 సెంటీ మీటర్ (1 సెం.మీ) = 10 మిల్లీ మీటర్లు (10 మి.మీ)
ప్రశ్న 4.
కొలపాత్రను వర్ణించండి. ఇవి ఎక్కడ ఉపయోగించబడతాయి?
జవాబు:
ఇది స్థూపాకారంలో ఉంటుంది. దానిమీద కొలతలు గుర్తించి ఉంటాయి. వీటిని ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ఉపయోగిస్తారు. అలాగే దుకాణదారు పాలు, నూనె, మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి కొలపాత్రలను ఉపయోగిస్తాడు. ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి వీటిని ద్రవంతో నింపిన తరవాత ద్రవం పుటాకార తలానికి కచ్చితంగా కింద ఉండే గుర్తును చూస్తారు. ఇలా చూసేటప్పుడు మన కళ్ళను ఈ గుర్తు వెంబడి ఉండేలా తీసుకువచ్చి, ఆ గుర్తు వద్ద ఉన్న గీతను నమోదు చేస్తాం.
ప్రశ్న 5.
నాణేల మందాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
- ఒకే పరిమాణంలో ఉన్న రూపాయి నాణేలను 10 తీసుకొని ఒకదానిపై ఒకటి ఉంచండి.
- వాటి మొత్తం మందాన్ని(ఎత్తును) స్కేల్ లో కొలవండి.
- ఆపై నాణెం యొక్క మందాన్ని తెలుసుకోవటానికి ఆ ఎత్తును సంఖ్య నాణేలతో భాగించండి.
- వచ్చిన విలువ నాణెం మందాన్ని సూచిస్తుంది.
ప్రశ్న 6.
సాధారణంగా మనుషుల ఎత్తును 1.85 మీ. గా వ్రాస్తూ ఉంటారు. దీన్ని సెం.మీలోకి మరియు మి.మీ లోకి మార్చండి.
జవాబు:
వ్యక్తి ఎత్తు 1.85 మీ.
1 మీటర్ = 100 సెం.మీ.
1.85 మీ = 1. 85 మీ × 100 = 185 సెం.మీ.
1 మీటర్ = 1000 మి.మీ.
1.85 మీ =1.85 × 1000 మి.మీ. = 1850 మి.మీ.
ప్రశ్న 7.
దుస్తుల పొడవును కొలవడానికి మీటర్ స్కేల్ ను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
మీటర్ స్కేల్ అంతర్జాతీయంగా ఆమోదించబడిన, పొడవును కొలిచే పరికరం. అంతర్జాతీయంగా ఒకే ప్రమాణం వాడటం వలన వర్తకాలు మరియు వాణిజ్యంలో చాలా సమస్యలు పరిష్కరింపబడ్డాయి. మీటర్ పొడవు, ప్రపంచంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది.
ప్రశ్న 8.
మల్లె పువ్వుల మాల కొలిచేందుకు మహిళలు తమ చేతులను ఎందుకు ఉపయోగించారు?
జవాబు:
మల్లె పువ్వుల మాల కొలవడంలో ఖచ్చితత్వం అంత ముఖ్యం కాదు. వీటి ధర తక్కువ కాబట్టి ఖచ్చితత్వంను అనంతరం పట్టించుకోరు. కాబట్టి పూలమాల కొలవటంలో మూరను వాడటం వలన సమస్య లేదు. ఇది కూడా మన దేశం యొక్క సంప్రదాయ పద్ధతి. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రశ్న 9.
ఘనపరిమాణంను నిర్వచించండి. దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
ఘనపరిమాణం అంటే ఒక వస్తువు ఆక్రమించిన స్థలం. ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడంతో పాటు ఇసుక మరియు బంకమట్టి వంటి ఘనపదార్థాల పరిమాణాలను కూడా కొలుస్తాము. పాలు, కిరోసిన్ మరియు నూనె వంటి ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలపాత్రను ఉపయోగిస్తాము. ద్రవాల ఘనపరిమాణం లీటర్లలో లేదా మి.లీ.లలో కొలుస్తారు.
ప్రశ్న 10.
మీటర్ స్కేల్ ఎలా రూపొందించబడింది? మరియు దాని ఉపయూనిట్లు ఏమిటి? ఇది ఎక్కడ భద్రపరచబడింది?
జవాబు:
ఫ్రాన్స్ లో ఒక ప్రత్యేకమైన పదార్థం (ప్లాటినం-ఇరిడియం మిశ్రమం)తో తయారు చేసిన రాడ్ యొక్క నిర్దిష్ట పొడవును మీటర్ అని పిలుస్తారు. మీటరు 100 సమాన భాగాలుగా సెంటీమీటర్ విభజించారు. ప్రతి సెంటీమీటరు మిల్లీమీటర్ అని పిలిచే పది సమాన భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం దీన్ని ప్రపంచవ్యాప్తంగా పొడవు కోసం ప్రామాణిక కొలతగా ఉపయోగిస్తున్నాము. ఈ స్కేల్ ఫ్రాన్స్ లోని మ్యూజియంలో భద్రపరచబడింది.
ప్రశ్న 11.
మీటర్ స్కేల్ తో పొడవును కచ్చితంగా ఎలా కొలుస్తావు?
జవాబు:
నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్ తో చేసిన స్కేలును పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం. దీనిమీద సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు గుర్తించి ఉంటాయి. ఒక టేబుల్ పొడవును కొలవాలంటే మనం మీటరు స్కేలును తీసుకొని, దానిపైనున్న సున్నా గుర్తును టేబుల్ కు ఒక చివర కచ్చితంగా కలిసేటట్లుగా ఉంటే టేబుల్ కు రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకొంటాం.
ప్రశ్న 12.
పొడవును కొలవడానికి తగిన పరికరాన్ని ఎలా ఎంచుకుంటారు?
జవాబు:
కొలవవలసిన పొడవు ఆధారంగా తగిన పరికరాన్ని ఎన్నుకొంటాము. చిన్న చిన్న పొడవులకు స్కేలును, పెద్ద పొడవులకు లింకు గొలుసును, పూల మాలకు మూరను, ఇళ్ల స్థలాలకు గజాలను ఎన్నుకొంటాము.
6th Class Science 7th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మీటర్ స్కేల్ ఉపయోగిస్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు:
మీటరు స్కేల్ ను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :
- ఏ పొడవును కొలుస్తున్నామో దాని వెంబడి ఉండేటట్లుగా స్కేలును ఉంచాలి.
- స్కేలుపై సున్నాను సూచించే బిందువు కచ్చితంగా కొలవవలసిన పొడవు మొదటి బిందువుతో కలిసేలా స్కేలును ఉంచాలి.
- మన కన్ను స్కేలుపై ఏ బిందువు నుంచి మనం కొలతను తీసుకొంటామో ఆ బిందువునకు నిటారుగా పైన ఉండాలి.
- స్కేలు చివరి భాగాలు విరిగిపోయిగాని, అరిగిపోయిగాని ఉండకుండా చూసుకోవాలి.
- కచ్చితత్వం కోసం ఏ వస్తువు పొడవునైనా రెండు కంటే ఎక్కువసార్లు కొలిచి, దాని సరాసరిని తీసుకోవాలి.
ప్రశ్న 2.
మీటర్ స్కేల్ ఉపయోగించి మీ ఎత్తును ఎలా కొలుస్తారు?
జవాబు:
ముందుగా మీ మిత్రుని వీపు గోడకు ఆనించి నిటారుగా నిలబడమనండి. కచ్చితంగా అతని తల పైభాగం మీద ఉండే విధంగా గోడమీద ఒక గీత గీయండి. ఇప్పుడు నేలనుంచి ఈ గీత వరకు గోడమీద ఉన్న దూరాన్ని ఒక స్కేలుతో కొలవండి. ఇదే విధంగా మీ మిత్రుని ఎత్తును, మిగిలిన విద్యార్థుల ఎత్తును కూడా కొలవండి. ఈ కొలతలన్నింటినీ మీ నోట్ బుక్ లో నమోదు చేయండి.
ప్రశ్న 3.
మీటర్ స్కేల్ లో పొడవును ఎలా ఖచ్చితంగా కొలవాలి?
జవాబు:
నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్ తో చేసిన స్కేలును పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం. దీనిమీద సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు గుర్తించి ఉంటాయి. ఒక టేబులు పొడవును కొలవాలంటే మనం మీటరు స్కేలును తీసుకొని, దాని పైనున్న సున్నా గుర్తును టేబుల్ కు ఒక చివర కచ్చితంగా కలిసేటట్లుగా ఉంటే టేబులకు రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకొంటాం. మీటరు స్కేలు కొద్దిపాటి మందం కలిగి – ఉండడం వల్ల మనం మన కంటిని సరైన స్థానంలో ఉంచకపోతే కొలతలలో దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశ్న 4.
అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలపాత్రతో ఎలా కనుగొంటావు?
జవాబు:
ఒక కొలపాత్రను తీసుకొని దాన్ని దాదాపు సగం వరకు నీటితో నింపండి. పటంలో చూపిన విధంగా ఇప్పుడు నీటి ఘనపరిమాణం కొలపాత్రపైన ఉన్న రీడింగును పరిశీలించి నమోదు చేయండి. దీని విలువ ‘a’ ఘ. సెం.మీ. (లేదా ‘a’ మి.లీ.) అనుకోండి. ఇప్పుడు ఒక చిన్న అక్రమాకారపు రాయికి పురి లేని దారాన్ని కట్టండి. దాన్ని నెమ్మదిగా కొలపాత్రలోని నీటిలోకి, పూర్తిగా మునిగే విధంగా జారవిడిచి —- పట్టుకోండి. కొలపాత్రలోని నీటిలో రాయి ఉంచినపుడు ఆ రాయి దాని ఘనపరిమాణానికి సమానమైన నీటిని తొలగించడం వలన పాత్రలోని నీటిమట్టం ఎత్తు పెరగడాన్ని మీరు గమనిస్తారు.
ఇప్పుడు పాత్రపైన రీడింగ్ ను పరిశీలించి దానిలోని నీటి ఘనపరిమాణాన్ని నమోదు చేయండి. దీని విలువ ‘b’ ఘ. సెం.మీ. (లేదా ‘b’ మి.లీ) అనుకోండి.
నీటి రెండవ, మొదటి ఘనపరిమాణాల భేదానికి రాయి ఘనపరిమాణం సమానమవుతుంది. కావున రాయి ఘనపరిమాణం = (b – a) ఘ. సెం.మీ. (లేదా మి.లీ).
ప్రశ్న 5.
1. ఏ పటానికి ఎక్కువ వైశాల్యం ఉంటుంది? ఎందుకు?
జవాబు:
నేను రెండవ పటానికి ఎక్కువ వైశాల్యం ఉంది అనుకొంటున్నాను.
2. రెండు పటాలలో ఉన్న చిన్న భాగాలన్నీ సమానంగా ఉన్నాయా?
జవాబు:
రెండు పటాలలో ఉన్న చిన్న భాగాలన్నీ సమానముగా ఉన్నాయి.
3. పటాలలో ఉన్న చిన్న భాగాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
జవాబు:
ఇవి చదరపు ఆకారాన్ని కలిగి ఉన్నాయి.
4. ప్రతి భాగం పొడవు, వెడల్పులూ సమానంగా ఉన్నాయా?
జవాబు:
ప్రతి భాగం పొడవు మరియు వెడల్పులు సమానంగా ఉన్నాయి.
5. పటంలో ఏదో ఒక భాగం పొడవు, వెడల్పులను కొలవండి. మీరు ఏమి గమనిస్తారు?
జవాబు:
వీటి పొడవు, వెడల్పులు వేరుగా ఉన్నప్పటికి ఒకే వైశాల్యము కలిగి ఉన్నాయి.
ప్రశ్న 6.
క్రింది పటం చూడండి మరియు కింది వాటికి సమాధానం ఇవ్వండి.
• పెద్దపెద్ద దూరాలను మనం పటంలో చూపిన పరికరాలతో కొలవగలమా?
జవాబు:
పెద్ద పెద్ద దూరాలను స్కేల్ తో కొలవటం సాధ్యం కాదు.
• ఒకవేళ కొలవలేకపోతే మరి వాటిని దేనితో కొలుస్తారు?
జవాబు:
కిలోమీటర్లలో ఎక్కువ దూరాలను కొలుస్తారు.
• వీటిని కొలవడానికి ఏ పరికరాలు వాడుతారు?
జవాబు:
కిలోమీటర్లను కొలవడానికి ఓడోమీటర్ ఉపయోగిస్తారు.
• చాలా పెద్ద దూరాలను ఎలా కొలుస్తారో మీ మిత్రులతోను, అమ్మానాన్నలతోను, ఉపాధ్యాయులతోను చర్చించి తెలుసుకోండి.
జవాబు:
చాలా పెద్ద దూరాలను సాధారణంగా కాంతి సంవత్సరాల్లో సూచిస్తారు. అంటే, ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం.
ప్రశ్న 7.
స్కేల్ కథను వివరించండి.
జవాబు:
ఇంతకుముందు రోజులలో భూములను తాళ్ళ పొడవులతో కొలిచేవారు. చాలా సందర్భాలలో కొలతలు సరిగా లేవని గొడవలు జరుగుతూండేవి.
పొడవులు కొలవడానికి ఎవరి ‘మూర’ను ప్రామాణికంగా తీసుకోవాలి?
ఒక మూర పొడవులో సగం లేదా నాలుగోవంతు పొడవులను ఎలా కొలవాలి?
ఇలాంటి ప్రశ్నలకు ఒక శాస్త్రీయమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం ఎవరూ కూడా ఆ రోజులలో ఇవ్వలేకపోయారు.
చివరిగా కొద్దిమంది తెలివైన వ్యక్తులందరూ ఒకచోట సమావేశమై ఒక నిర్దిష్టమైన పొడవు గల స్కేలు (కొలబద్ద)ను తయారుచేసుకోవాలని నిర్ణయించారు. ఈ స్కేలు పొడవు కంటే తక్కువ పొడవులను కొలవడానికి దాన్ని సమానమైన సూక్ష్మభాగాలుగా విభజించే విధంగా దానిపై గుర్తులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తరవాత ఆ ప్రాంత ప్రజలందరూ ఆ స్కేలు పొడవుకు సమానమైన పొడవు వుండే లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలును ఉపయోగించడం ప్రారంభించారు.
ఒక ప్రాంతంలోని ప్రజలు, ఆ దేశపు రాజు ముక్కు దగ్గరినుంచి అతని చేతి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఈ దూరాన్ని ‘ఒక గజం’గా పిలిచేవారు. ఈ పొడవుకు సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడి ప్రజలు వాడేవారు. ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకొనేవారు.
గజాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగాన్నీ ఒక ‘అడుగు’గా పిలిచేవారు. ఆ తర్వాత ప్రతి అడుగునూ పన్నెండు సమ భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక “అంగుళం”గా పిలిచేవారు. ఈ ‘అంగుళం’ పొడవును కూడా వారు ఇంకా సూక్ష్మభాగాలుగా కూడా విభజించారు.
ప్రశ్న 8.
కార్డ్ బోర్డు బాక్స్ యొక్క ఘనపరిమాణాన్ని మీరు ఎలా కొలుస్తారు?
జవాబు:
- క్యూబ్ బాక్సుల (సమ ఘనం) సహాయంతో కార్డ్ బోర్డు పరిమాణాన్ని కొలుస్తాము.
- ప్రతి క్యూబ్ 1 సెం.మీ. పొడవు, 1 సెం.మీ. వెడల్పు మరియు 1 సెం.మీ. ఎత్తు ఉంటుంది.
- ఒక క్యూబ్ యొక్క ఘనపరిమాణం 1 సెం.మీ. × మీ. × 1 సెం.మీ. = 1 సెం.మీ³ కు సమానం. దీనిని 1 క్యూబిక్ సెంటీ మీటర్ అని పిలుస్తారు మరియు 1 సెం. మీ³ గా వ్రాయబడుతుంది.
- క్యూబిక్ సెంటీ మీటర్, ఘనపదార్థాల పరిమాణాన్ని కొలవడానికి ఒక ప్రామాణిక ప్రమాణం.
- అందువల్ల దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ పెట్టె యొక్క పరిమాణం అది ఆక్రమించిన మొత్తం సమ ఘనాల సంఖ్యకు సమానం.
- దీర్ఘచతురస్రాకార కార్డ్ బోర్డ్ బాక్స్ = 12 × 1 సెం.మీ³ = 12 సెం.మీ.³
- ఇప్పుడు మనం పొడవు, వెడల్పు మరియు ఎత్తును గుణిస్తే, అది 3 సెం.మీ × 2 సెం.మీ × 2 సెం.మీ = 12 సెం.మీ³
- పెట్టె ఘనపరిమాణం = పొడవు × వెడల్పు × ఎత్తుకు సమానం.
AP Board 6th Class Science 7th Lesson 1 Mark Bits Questions and Answers కొలుద్దాం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించుము.
1. పొడవు యొక్క ప్రమాణం
A) సెంటీ మీటర్
B) మిల్లీ. మీటర్
C) కిలో మీటర్
D) ఒక మీటర్
జవాబు:
D) ఒక మీటర్
2. తూకములు మరియు కొలతల వైవిధ్యం గురించి తెలుపు శాస్త్రం
A) చరక సంహిత
B) రాజ తరంగిణి
C) అర్థశాస్త్రం
D) కాదంబరి
జవాబు:
C) అర్థశాస్త్రం
3. విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు?
A) నాటికల్ మైల్స్
B) కిలోమీటర్లు
C) అడుగులు
D) మైల్స్
జవాబు:
A) నాటికల్ మైల్స్
4. ద్రవాల ఘనపరిమాణంనకు ప్రమాణం
A) మి.లీ.
B) సెం.మీ.
C) మి.మీ.
D) కి.మీ.
జవాబు:
A) మి.లీ.
5. క్రింది వానిలో సరైనది
A) 1 సెం.మీ – 100 మిమీ
B) 1 మీ = 100 సెం.మీ
C) 1 కి.మీ = 100 మీ.
D) అన్నీ
జవాబు:
B) 1 మీ = 100 సెం.మీ
6. కోణమానిని (ప్రొట్రాక్టర్)లో కోణాలు
A) 90 – 180
B) 0 – 90
C) 0 – 180
D) 0 – 360
జవాబు:
C) 0 – 180
7. వక్ర మార్గం పొడవును దేనితో కొలుస్తారు?
A) టేప్
B) గ్రాఫ్ పేపర్
C) దారము
D) కొలపాత్ర
జవాబు:
C) దారము
8. ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్రపరచబడింది?
A) యు.ఎస్.ఎ
B) రష్యా
C) యు.కె
D) ఫ్రాన్స్
జవాబు:
D) ఫ్రాన్స్
9. చదరపు మిల్లీమీటరు …. గా సూచిస్తాము.
A) మీ.
B) మి.మీ.
C) సెం. మీ
D) కి.మీ. 7
జవాబు:
B) మి.మీ.
10. పెద్ద దూరాలను దేనితో కొలవవచ్చు?
A) మి.మీ
B) కి.మీ.
C) సెం.మీ.
D) పైవన్నీ
జవాబు:
B) కి.మీ.
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. 1 సెం.మీ = ………….. మి.మీ.
2. నాణేల మందం …………. తో కొలుస్తారు.
3. చదరపు మిల్లీమీటర్ యొక్క సంకేతం …………
4. 1 కిమీ = ………….. మీటర్లు.
5. క్రమరహిత ఆకారపు వస్తువు ఘనపరిమాణాన్ని కొలవడానికి ………….. ఉపయోగించబడుతుంది.
6. అడుగు, జాన మరియు మూర వస్తువుల పొడవును కొలవడానికి ………….. పద్ధతులు.
7. …………… అనేది స్కేల్ లో అతి చిన్న ప్రమాణం .
8. …………. చదరపు మీటర్ యొక్క సంకేతం.
9. ………….. వస్తువు ఆక్రమించిన ఉపరితలం.
10. ద్రవాల ఘనపరిమాణాన్ని ………. లో కొలుస్తారు.
జవాబు:
- 10 మిమీ.
- స్కేల్
- చ.మి.మీ.
- 1000 మీ.
- కొలపాత్ర
- సాంప్రదాయక
- మిల్లీమీటర్/మి.మీ.
- మీ²
- ఘనపరిమాణం
- మిల్లీ లీటర్లు/మి. లీ.
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) కొలపాత్ర | 1) ఓడ ప్రయాణించే దూరం |
బి) మీటర్ టేప్ | 2) ద్రవాల ఘనపరిమాణం |
సి) నాటికల్ మైళ్ళు | 3) టైలర్ |
డి) బిఘా | 4) గ్రామ్ |
ఇ) ద్రవ్యరాశి | 5) మొఘల్ కొలత పద్దతి |
జవాబు:
Group – A | Group – B |
ఎ) కొలపాత్ర | 2) ద్రవాల ఘనపరిమాణం |
బి) మీటర్ టేప్ | 3) టైలర్ |
సి) నాటికల్ మైళ్ళు | 1) ఓడ ప్రయాణించే దూరం |
డి) బిఘా | 5) మొఘల్ కొలత పద్దతి |
ఇ) ద్రవ్యరాశి | 4) గ్రామ్ |
2.
Group – A | Group – B |
ఎ) సెంటీమీటర్ | 1) వెడల్పు |
బి) చదరపు మిల్లీమీటర్ | 2) 3 అడుగులు |
సి) గజం | 3) సెం.మీ. |
డి) మిల్లీమీటర్ | 4) మి.మీ² |
ఇ) వైశాల్యం | 5) మి.లీ. |
జవాబు:
Group – A | Group – B |
ఎ) సెంటీమీటర్ | 3) సెం.మీ. |
బి) చదరపు మిల్లీమీటర్ | 4) మి.మీ² |
సి) గజం | 2) 3 అడుగులు |
డి) మిల్లీమీటర్ | 5) మి.లీ. |
ఇ) వైశాల్యం | 1) వెడల్పు |
మీకు తెలుసా?
→ ద్రవాల ఘనపరిమాణం మిల్లీ లీటర్లలలో, ఘనపదార్థాల ఘనపరిమాణం ఘ. సెం.మీ.లలో రాయడం మీరు గమనించే ఉంటారు. ఈ రెండు ప్రమాణాల మధ్య ఏమైనా సంబంధం మీరు గుర్తించగలరా?
1 మి.లీ. = 1. ఘ. సెం.మీ.