AP 6th Class Science Notes Chapter 5 పదార్థాలు – వేరు చేసే పద్ధతులు

Students can go through AP Board 6th Class Science Notes 5th Lesson పదార్థాలు – వేరు చేసే పద్ధతులు to understand and remember the concept easily.

AP Board 6th Class Science Notes 5th Lesson పదార్థాలు – వేరు చేసే పద్ధతులు

→ మన చుట్టూ ఉన్న వస్తువులు అనేక రకాలైన పదార్థాలతో తయారయి ఉంటాయి.

→ వేరు వేరు పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరు వేరు సందర్భాలలో ఉపయోగిస్తాం.

→ పదార్థాలు మూడు స్థితులలో ఉంటాయి. అవి ఘన, ద్రవ, వాయు స్థితులు.

→ కొన్ని పదార్థాలు నీటిలో మునుగుతాయి. కొన్ని పదార్థాలు నీటిపై తేలుతాయి.

→ కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి. కొన్ని పదార్థాలు కరగవు.

→ పదార్థాలను వాటి సారూప్యాన్ని బట్టి, ధర్మాలను బట్టి విభజించవచ్చు.

→ ఒక మిశ్రమం నుంచి పదార్థాలను వేరుచేయవచ్చును.

→ పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తాం.

AP 6th Class Science Notes Chapter 5 పదార్థాలు - వేరు చేసే పద్ధతులు

→ కొన్ని తేలికైనవి, కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిసిన మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరుచేయడానికి తూర్పారపట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తాం.

→ ఒక ద్రవంలో కరగని పదార్థాలున్నప్పుడు వాటిని వేరుచేయడానికి తేర్చడం, తేరినదానిని వంపడం అనే ప్రక్రియలను ఉపయోగిస్తాం.

→ ఒక మిశ్రమంలో చిన్నవి, పెద్దవి పదార్థాలున్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరుచేయగలం.

→ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరుచేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తాం.

→ నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం పద్ధతిని ఉపయోగిస్తాం.

→ కొన్ని ప్రత్యేక మిశ్రమాల నుంచి అనుఘటకాలను వేరుచేయుటకు ఒకటి కంటే ఎక్కువ వేరుచేసే పద్ధతులను ఉపయోగిస్తాం.

→ ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారే ప్రక్రియను ఉత్పతనం అంటాం.

→ ఉత్పతనం చిన్న పదార్థాలు అయోడిన్ అమ్మోనియం క్లోరైడ్ మరియు కర్పూరం.

→ ఉప్పు, కర్పూరం కలిసి ఉన్నప్పుడు ఉత్పతనం ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని వేరు చేస్తాము.

→ స్వేదనం వలన స్వచ్ఛమైన నీటిని పొందుతాము.

→ స్వేదన జలాన్ని ఇంజక్షన్ బాటిల్ లో ఔషధాలు కలపటానికి ఉపయోగిస్తాము.

→ రంగుల మిశ్రమం నుంచి రంగులని వేరు చేయడానికి క్రొమటోగ్రఫీ పద్ధతిని ఉపయోగిస్తాము.

→ క్రొమటోగ్రఫీ పద్దతిని నేడు నేర పరిశోధన రంగంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

→ నీటిని ఆవిరిగా మార్చి, దానిలోని ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియ ఇప్పటికీ కారణమంటారు. ఈ ప్రక్రియ ద్వారా సముద్రం నుంచి ఉప్పును తయారు చేసుకుంటున్నాము.

AP 6th Class Science Notes Chapter 5 పదార్థాలు - వేరు చేసే పద్ధతులు

→ పదార్థం : వస్తువులు దేనితో నిర్మితమవుతాయో దానిని పదార్థం అంటాము. ఉదాహరణకు గాజు, చెక్క ప్లాస్టిక్.

→ వస్తువు : వస్తువులు నిర్దిష్ట ఆకారం, పరిమాణం కలిగి పదార్థంతో తయారవుతాయి. ఉదాహరణకు కుర్చీ, బల్ల, పుస్తకం.

→ లోహం : ప్రకాశవంతంగా మెరిసే ధర్మం కలిగి, ఉత్తమ వాహకాలుగా పనిచేసే ఘన పదార్థాలను లోహాలు అంటాము. సాధారణంగా వీటిని వాటి ధాతువు నుంచి వేరు చేస్తారు. ఉదాహరణకు రాగి, ఇనుము మొదలైనవి.

→ ఘన పదార్థం : పాత్రను బట్టి ఆకారాలను మార్చుకోని పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. ఉదాహరణకు చెక్క, రాయి.

→ ద్రవ పదార్థం : నిర్దిష్ట ఆకారం లేకుండా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారం పొందుతూ, ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రవహించే పదార్థాలను ద్రవ పదార్థాలు అంటాము. ఉదాహరణకు నీరు, నూనె.

→ వాయు పదార్థం : ఇవి ఎక్కువ విస్తీర్ణం కలిగి, నిర్దిష్ట ఆకారం లేకుండా పక్కకు విస్తరించే ధర్మాన్ని కలిగిఉంటాయి. ఉదాహరణకు గాలి, పొగ, నీటి ఆవిరి, ఆక్సిజన్.

→ మునగటం : సాధారణంగా బరువైన పదార్థాలను, తేలికైన పదార్థాల్లో వేసినప్పుడు అవి అడుగుకు చేరుతాయి. దీనిని మునగటం అంటాం. ఉదాహరణకు నీటిలో రాయి వేసినప్పుడు
మునిగిపోతుంది.

→ తేలటం : తేలికైన పదార్థాలు బరువైన పదార్థాల మీద పైకి తేలుతాయి.

→ కరగటం : ద్రవాలలో వేసినప్పుడు కొన్ని పదార్థాలు తమ ఆకారాన్ని కోల్పోయి కలిసిపోతాయి. దీన్నే కరగటం అంటాము. ఉదాహరణకు ఉప్పు నీటిలో కరిగిపోతుంది.

→ కరగకపోవటం : కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు. దీన్నే కరగకపోవడం అంటాము. ఉదాహరణకు వెనిగర్, కొబ్బరి నూనె.

→ మిశ్రమం : రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల కలయికను మిశ్రమం అంటాము.

→ తేర్చటం : బరువైన పదార్థాల నుంచి తేలికైన పదార్థాలను వేరు చేయటాన్ని తేర్చటం అంటాము.

→ స్పటికీకరణం : ద్రవ మిశ్రమాలను ఆవిరిగా మార్చి ఘన పదార్థాలను వేరు చేయుట.

→ వేరు చేయటం : భౌతిక ధర్మాల ఆధారంగా మిశ్రమాలలోని పదార్థాలను వేరు చేయటం.

→ తేర్చడం : మట్టి నుంచి నీటిని వేరుచేసే పద్ధతినే తేర్చడం అంటారు.

→ స్వేదనం : ద్రవ పదార్థాలను ఆవిరిగా వేడి చేసి, తిరిగి వాటిని చల్లబరిచే ప్రక్రియను స్వేదనం అంటాము.

→ చేతితో ఏరి వేయటం : మిశ్రమాలలోని కలిసిపోయిన పదార్థాలను చేతితో తీసి వేయటాన్ని చేతితో ఏరి వేయటం అంటాము. ఉదాహరణకు బియ్యం నుండి రాళ్లను చేతితో ఏరి వేస్తాము.

→ జల్లించడం : మిశ్రమాలలోని పదార్థాల పరిమాణంలోని వ్యత్యాసం ఆధారంగా వాటిని వేరు చేయటాన్ని జల్లించటం అంటాము.

AP 6th Class Science Notes Chapter 5 పదార్థాలు - వేరు చేసే పద్ధతులు

→ ఉత్పతనం : ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు అవి నేరుగా వాయు స్థితికి మారే ధర్మాన్ని ఉత్పతనం అంటాము.
ఉదా : అయోడిన్.

→ తూర్పార పట్టడం : గాలి ప్రవాహం ఆధారంగా తేలికైన పదార్థాలను, బరువైనవాటి నుంచి వేరు చేయుట. ఉదాహరణకు ధాన్యాన్ని తూర్పారపట్టినప్పుడు చెత్త వేరు అవుతుంది.

→ వడపోత : ద్రవాల నుంచి పదార్థాలను, కాగితం లేదా గుడ్డ ద్వారా వేరు చేయటం.

→ క్రొమటోగ్రఫీ : మిశ్రమ వర్ణమాలలోని రంగులను వేరు చేయటాన్ని క్రొమటోగ్రఫీ అంటాము. క్రోమా అంటే రంగు అని అర్థము.

AP 6th Class Science Notes Chapter 5 పదార్థాలు - వేరు చేసే పద్ధతులు 1