AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

Students can go through AP Board 6th Class Social Notes 12th Lesson సమానత్వం వైపు to understand and remember the concept easily.

AP Board 6th Class Social Notes 12th Lesson సమానత్వం వైపు

→ భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం.

→ ప్రజలు మత విశ్వాసాలు, వారి శరీర ఛాయ, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, వారు ధరించే దుస్తులు వంటి చాలా విషయాలలో పక్షపాతంగా వ్యవహరిస్తారు.

→ వివక్షత రకాలు : కుల, మత, ప్రాంతీయ, జాతి, లింగ, దివ్యాంగ, వివక్షతలు.

→ ప్రపంచంలో ఎనిమిది ప్రధాన మతాలు ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి.

→ అగ్రకులాల వారు అనుభవించే హక్కులు నిమ్నకులాల వారిని అనుభవించనీయక పోవడమే కుల వివక్షత.

→ దళితులను ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు (SC) గా పరిగణిస్తుంది.

→ స్త్రీలు (మహిళలు, బాలికల) పట్ల చూపే వివక్షత లింగ వివక్షత.

→ సావిత్రిబాయి పూలే భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా కీర్తించబడ్డారు.

→ సావిత్రిబాయి ఫూలేను ‘భారతీయ స్త్రీవాద మాతామహి’ అని కీర్తిస్తారు.

→ సావిత్రిబాయి ఫూలే భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ వ్యక్తి యొక్క చర్మపు రంగు లేదా జాతి లేదా మూలం ఆధారంగా చూపే వివక్షతను జాతి వివక్షత అంటారు.

→ వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత ప్రాంతీయ వివక్షత.

→ PWD చట్టం – 2016 ప్రకారం నడవలేని, చూడలేని, మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు.

→ అవిద్య, అధికారం, నమ్మకాలు, వృత్తులు, సంపద, సంప్రదాయాలు మన సమాజంలో అసమానతలను వివక్షతను. సృష్టించాయి.

→ సతీసహగమనం 1829లో నిషేధించబడింది.

→ భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు ఆనందిబాయి జోషి.

→ “దక్షిణాఫ్రికా గాంధీగా” నెల్సన్ మండేలాను పిలుస్తారు. ఈయన 1990లో భారతరత్న అవార్డును స్వీకరించారు.

→ భారత రాజ్యాంగంలోని 14వ నిబంధన ప్రకారం చట్టం ముందు అందరు సమానం.

→ భారత రాజ్యాంగంలోని 16వ నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు.

→ భారత రాజ్యాంగంలోని 17వ నిబంధన ప్రకారం అంటరానితనాన్ని పాటించడం నిషేధం, నేరం కూడా.

→ 21-(A) ప్రకారం 6-14 సం||రాల వయస్సులోని బాలబాలికలందరికి ఉచిత ప్రాథమిక విద్య.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ 15(1) ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.

→ ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి 1) చట్టాలు 2) సంక్షేమ కార్యక్రమాలనే రెండు మార్గాలను అనుసరిస్తుంది.

→ డాక్టర్ APJ అబ్దుల్ కలాం భారతదేశపు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు.

→ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకం రాశారు.

→ 2016లో బ్రెజిల్ లోని రియో డి జెనిరో లో జరిగిన పారా ఒలింపిక్స్ లో పురుషుల హైజం లో ‘మరియప్పన్ ఆ తంగవేలు బంగారు పతకాన్ని సాధించారు.

→ ‘సింధుతాయి’ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది.

→ లింగ సమానత్వం : స్త్రీ పురుషులను సమానంగా చూడటం.

→ అంటరానితనం : కొందరు తక్కువ కులం వారని అనబడే వాళ్లను దూరంగా ఉంచే దురాచారం.

→ అపార్టీడ్/జాతి వివక్ష : జాతి ఆధారంగా వివక్ష చూపడం.

→ సుస్థిర అభివృద్ధి : భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చడం.

→ వివక్షత : జాతి, మతం, కులం, లింగం వంటి అంశాల ఆధారంగా కొందరిని అన్యాయంగా అసమానంగా, చూడటం.

→ పక్షపాతం : ఇతరులను ప్రతికూల ధోరణిలోను, నాసిరకం, హీనంగాను చూడటం. తనవారిని ఏ సందర్భంలోనైనా సమర్థించడం.

→ మూసధోరణి : మనం వ్యక్తులను గానీ, సంఘాన్ని గానీ ఒక కోణంలో నుండి మాత్రమే చూడటాన్ని మూసధోరణి అంటారు.

→ మత వివక్షత : కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించేవారిని చిన్నచూపు చూడటం వారి ఆచార, సాంప్రదాయాలను విమర్శించడం.

→ కుల వివక్షత : అగ్ర కులాల వారు అనుభవించే హక్కులు, నిమ్న కులాల వారిని అనుభవించనీయక పోవడమే కుల వివక్షత. (కుల ప్రాతిపదిక వివక్షతను చూపడం కుల వివక్షత)

→ లింగ వివక్షత : స్త్రీ, పురుషులలో ఒకరిని ఎక్కువగాను (అంటే పురుషులను ఎక్కువగాను) ఒకరిని తక్కువగాను చూడటాన్ని లింగ వివక్షత అంటారు.

→ అసమానత : రెండింటి మధ్యలో గాని లేదా ఇద్దరి మధ్యగాని తేడా.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు

→ ప్రాంతీయ వివక్షత : ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మ స్థలం ఆధారంగా చూపే వివక్షత.

→ దివ్యాంగుల పట్ల వివక్షత : నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వ్యక్తుల పట్ల చూపే వివక్షత.

→ ప్రవేశిక : భారత రాజ్యాంగ పీఠిక లేదా ముందుమాట. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను తెలుపుతుంది.

→ సతీసహగమనం : చనిపోయిన భర్త చితిలో భార్య సజీవంగా దూకి ఆత్మాహుతి గావించడం.

→ అణగారిన వర్గాలు : సమాజంలో కింది స్థాయిలో ఉంచబడిన కొన్ని వృత్తుల, కులాలవారు.

→ వైవిధ్యం : వినూత్నంగా / తేడాగా ఉన్నది. మిగతా వాటిలా కాకుండా వేరేగా ఉన్నది.

AP 6th Class Social Notes Chapter 12 సమానత్వం వైపు 1