These AP 6th Class Telugu Important Questions 1st Lesson అమ్మ ఒడి will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 1st Lesson Important Questions and Answers అమ్మ ఒడి
6th Class Telugu 1st Lesson అమ్మ ఒడి Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. అమ్మ ఒడి చదువుల బడి మా
యమ్మ ఒడి నా కొక గుడి
అమ్మ చూపును ఒరవడి, దై
వమ్ము కంటెను త్వరపడి
ప్రశ్నలు – జవాబులు :
అ) ఒరవడి అంటే అర్థం ఏమిటి?
జవాబు:
విద్యార్థులకు అక్షరాలను కుదురుగా నేర్పడానికి గురువులు ముందుగా రాసే మేలు బంతి.
ఆ) బడి, గుడి అయినది ఏది?
జవాబు:
అమ్మ ఒడి.
ఇ) దేని కన్న ముందు అమ్మ ఒరవడి చూపుతుంది?
జవాబు:
దైవం కన్నా ముందు అమ్మ ఒరవడి చూపుతుంది.
ఈ) చదువు నేర్పే చోటును ఏమంటారు?
జవాబు:
చదువు నేర్పే చోటును బడి అంటారు.
2. అమ్మ చెప్పిన సుద్దులు, అని
శమ్ము ఒప్పిన బుద్ధులు
అమ్మ పెదవుల హాసము, ని
త్యమ్ము మాకు వికాసము.
ప్రశ్నలు – జవాబులు :
అ) సుద్దులు ఎవరు చెపుతారు?
జవాబు:
అమ్మ సుద్దులు చెపుతుంది.
ఆ) అనిశమ్ము అంటే అర్థం ఏమిటి?
జవాబు:
అనిశమ్ము అంటే ఎల్లప్పుడు అని అర్థం.
ఇ) అమ్మ పెదవులపై ఏమి ఉంటుంది?
జవాబు:
అమ్మ పెదవులపై హాసము ఉంటుంది.
ఈ) అమ్మ హాసము వలన ఏమి కలుగుతుంది?
జవాబు:
అమ్మ హాసము వల్ల వికాసం కలుగుతుంది.
3. అమ్మ మంజుల భాషణం, శ్రా
వ్యమ్ము వీనుల భూషణం
అమ్మ హృది అనురాగము, ది
వ్యమ్ము భవ్యము యోగము !
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ భాషణం ఎలా ఉంటుంది?
జవాబు:
అమ్మ భాషణం మంజులంగా ఉంటుంది.
ఆ) భూషణం అంటే అర్థం తెలపండి.
జవాబు:
భూషణం అంటే అలంకారం అని అర్థం.
ఇ) అనురాగంతో నిండి ఉండేది ఏది?
జవాబు:
అమ్మ హృదయం అనురాగంతో నిండి ఉంటుంది.
ఈ) ఈ భాగంలో యోగమైనది ఏది?
జవాబు:
ఈ భాగంలో యోగమైనది అమ్మ అనురాగము.
4. అమ్మ చల్లని కరములు, దా
నమ్మునకు ఆకరములు
అమ్మ చరణ తలమ్ములు, క్షే
మమ్ము పండు పొలమ్ములు
ప్రశ్నలు – జవాబులు :
అ) ఈ గేయం భాగం ఏ పాఠంలోనిది?
జవాబు:
ఈ గేయభాగం ‘అమ్మ ఒడి’ అనే పాఠంలోనిది.
ఆ) దానానికి నిలయమైనవి ఏవి?
జవాబు:
అమ్మ చేతులు దానానికి నిలయమైనవి.
ఇ) అమ్మ చరణాలు తాకిన నేలపై ఏమి పండుతుంది?
జవాబు:
అమ్మ చరణాలు తాకిన నేలపై క్షేమం పండుతుంది.
ఈ) ఆకరములు అంటే అర్థం ఏమిటి?
జవాబు:
ఆకరములు అంటే నిలయమైనవి అని అర్థం.
5. అమ్మ కన్నుల కాంతులు, లో
కమ్మునకు సుఖశాంతులు
అమ్మయే నా సర్వము,
ర్యమ్ము బలమూ గర్వము
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ కన్నుల్లో ఏమి కనిపిస్తాయి?
జవాబు:
అమ్మ కన్నుల్లో కాంతులు కనిపిస్తాయి.
ఆ) లోకానికి సుఖశాంతులు ఇచ్చేవి ఏవి?
జవాబు:
లోకానికి అమ్మ కన్నుల కాంతులు సుఖశాంతులు ఇస్తాయి.
ఇ) ‘సుఖ శాంతులు’ అనునది ఏ సమాసము?
జవాబు:
‘సుఖ శాంతులు’ అనునది ద్వంద్వ సమాసము.
ఈ) మనిషికి సర్వస్వమైనది ఏది?
జవాబు:
మనిషికి సర్వస్వమైనది అమ్మ.
అపరిచిత పద్యా లు
1. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కోతి ంబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల ంగొలిచి నట్టు
నీతిహీనును నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) కోతికి ఏమి కట్టారు?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టారు.
ఆ) ఎవరు కోతికి పట్టుచీర కట్టారు?
జవాబు:
కొండముచ్చులు కోతికి పట్టుచీర కట్టారు.
ఇ) కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు ఏమి చేసాయి?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు సేవించాయి.
ఈ) నిర్భాగ్యులు ఎవరిని సేవిస్తూ ఉంటారు?
జవాబు:
నిర్భాగ్యులు నీతిహీనుణ్ణి సేవిస్తూ ఉంటారు.
2. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.
ఆ) గుణము ఏలా కొరతపడుతుంది?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.
ఇ) కోపము వలన బ్రతుకు ఏమౌతుంది?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.
ఈ) పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము
3. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
బలవంతుడు ! నా కేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా !
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఏమని అనుకోకూడదు?
జవాబు:
నేను బలవంతుడను, నాకేమిటి అనుకోకూడదు.
ఆ) ఎవరితో అనరాదు?
జవాబు:
చాలామందితో నేను బలమైన వాడను అని అనకూడదు.
ఇ) సర్పము ఎలాంటిది?
జవాబు:
సర్పము చాలా బలమైనది.
ఈ) సర్పము ఎవరి వలన చనిపోయింది?
జవాబు:
సర్పము చలిచీమల వలన చనిపోయింది.
4. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అనువుకాని చోట నధికుల మనరాదు
కొంచముండుటెల్ల గొదువ గాదు
కొండ యద్దమందు గొంచమై యుండదా
విశ్వదాభిరామ ! వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎక్కడ అధికుల మనకూడదు?
జవాబు:
అనువుగాని చోట అధికుల మనరాదు.
ఆ) అనువుగాని చోట ఎలా ఉండాలి?
జవాబు:
అనువుగాని చోట తగ్గి ఉండాలి.
ఇ) కొండ ఎక్కడ నుండి చిన్నదిగా కన్పిస్తుంది?
జవాబు:
కొండ అద్దంలోంచి చిన్నదిగా కన్పిస్తుంది.
ఈ) ఈ పద్యం ఎవరు రచించారు?
జవాబు:
ఈ పద్యం వేమన రచించాడు.
5. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) చుట్టము ఎప్పుడు రావాలి?
జవాబు:
చుట్టము అవసరమైనపుడు రావాలి.
ఆ) మ్రొక్కితే ఎవరు వరాలిస్తారు?
జవాబు:
మ్రొక్కితే దేవతలు వరాలిస్తారు.
ఇ) గుఱ్ఱము ఎప్పుడు పరుగుపెట్టాలి?
జవాబు:
రౌతు ఎక్కినపుడు గుఱ్ఱం పరుగు పెట్టాలి.
ఈ) ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకం లోనిది.
6. కింది అపరిచిత పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆత్మశుద్ధి లేని ఆచార మది యేల
భాండ శుద్ధి లేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఆచారానికి ఏది అవసరం?
జవాబు:
ఆచారానికి ఆత్మశుద్ధి అవసరం.
ఆ) వంటకు ఏది అవసరం?
జవాబు:
గిన్నెలు శుభ్రంగా ఉండాలి.
ఇ) చిత్తశుద్ధితో ఏమి చేయాలి?
జవాబు:
చిత్తశుద్ధితో శివపూజ చేయాలి.
ఈ) పై పద్యానికి తగిన శీర్షికను నిర్ణయించండి.
జవాబు:
శుద్ధి
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత :
ప్రశ్న 1.
బి.వి. నరసింహారావు గురించి రాయండి.
(లేదా)
“అమ్మ ఒడి’ గేయ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘అమ్మ ఒడి’ గేయ రచయిత ‘బాడిగ వెంకట నరసింహారావు. ఆయన కృష్ణాజిల్లాలోని కౌతారంలో జన్మించారు. ఆయన బిరుదు ‘బాలబంధు’. ఆయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి మొదలైనవి 17 పుస్తకాలు రచించారు. బాలసాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే ధ్యేయంగా జీవించారు. ఆయన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రను ధరించడం చేత ఆయన ఆ రోజులలో ‘అనార్కలి నరసింహారావు’ అని పేరు పొందారు.
ప్రశ్న 2.
అమ్మ ప్రేమ ఎటువంటిది?
జవాబు:
అమ్మ ప్రేమ హృదయమంతా నిండి ఉంటుంది. ఆ ప్రేమ చాలా ఉత్తమమైనది. శుభాలను కలిగిస్తుంది. అది – అన్నింటిని సమకూర్చి పెడుతుంది. ఏ లోటు రాకుండా చేస్తుంది.
ప్రశ్న 3.
అమ్మ కాళ్ళు, చేతులు ఎటువంటివి?
జవాబు:
అమ్మ చేతులు చల్లగా ఉంటాయి. అవి దానధర్మాలు చేస్తూ ఉంటాయి. అమ్మ పాదాలు తగిలిన నేలలు శుభాలు అనే పంటలు పండించే పొలాల వంటివి.
ప్రశ్న 4.
మా అమ్మ ఒడి నాకొక గుడి అని కవి ఎందుకన్నారో వివరించండి.
జవాబు:
పిల్లలు అమ్మ ఒడిలోనే ఆట పాటలతో అన్నీ నేర్చుకొంటారు. దేవాలయాలు మన సంస్కృతికి, కళలకు, సంప్రదాయాలకు నిలయాలు. సమాజానికి శుచిశుభ్రతలను దేవాలయాలు నేర్పుతాయి. భక్తి గూడా నేర్పుతాయి.
అలాగే అమ్మ ఒడిలో పిల్లలు జేజే పెట్టడం (నమస్కరించడం) నేర్చుకొంటారు. రెండు చేతులూ పైకెత్తి ‘గోవిందా’ అనడం కూడా తల్లి నేర్పుతుంది. . ఎవరినీ నిందించకూడదనీ, పెద్దలకు నమస్కరించాలని, ఎవరైనా వస్తుంటే రమ్మని పిలవాలనీ, తల్లి తన ఒడిలోనే పిల్లలకు నేర్పుతుంది. అభినయం కూడా నేర్పుతుంది. ఉదాహరణకు: నీ కోపం చూపించమని, నువ్వెలా నవ్వుతావు అంటూ రకరకాల అభినయాలు నేర్పుతుంది. అందుచేతనే అమ్మ ఒడి నాకొక గుడి అని రచయిత అన్నాడు: సంస్కారానికి పునాది అమ్మ ఒడిలోనే నేర్చుకుంటాం. అందుకే అమ్మ ఒడి మనకొక గుడి అని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
“అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము” – వివరించండి.
జవాబు:
అమ్మ పెదవుల హాసము అంటే అమ్మ చిరునవ్వు. అమ్మ చిరునవ్వులో అనేక భావాలు ఉంటాయి. అమ్మ చిరునవ్వును పిల్లలు గమనిస్తుంటారు. అమ్మ చిరునవ్వే పిల్లలకు ప్రోత్సాహం, అమ్మ చిరునవ్వే పిల్లలకు ధైర్యాన్నిస్తుంది.. అమ్మ చిరునవ్వే పిల్లలకు భరోసానిస్తుంది. అమ్మ చిరునవ్వే పిల్లలకు హుషారునిస్తుంది. పిల్లల అభివృద్ధిని అమ్మ చిరునవ్వుతో గమనిస్తూ ప్రోత్సహిస్తుంది. అమ్మ చిరునవ్వుతో ప్రోత్సహిస్తే పిల్లలు ఎంత ఉన్నత స్థితికైనా చేరతారు. దేనినైనా సాధిస్తారు. ఎంత తెలివిగానైనా ప్రవర్తిస్తారు. ఎంత కష్టమైన దానినైనా అలవోకగా సాధిస్తారు. అందుకే తల్లి చిరునవ్వులే పిల్లలకు అభివృద్ధికి సోపానాలని చెప్పవచ్చు.
ప్రశ్న 6.
“అమ్మ చల్లని కరములు – దానమ్మునకు ఆకరములు” – అని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
అమ్మ తన చేతులతో అన్నీ అమర్చి పెడుతుంది. పిల్లలను అభివృద్ధి చెందమని ఆశీర్వదిస్తుంది. తనకంటే తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని కోరుకొంటుంది. దీవిస్తుంది. అందుచేతనే అమ్మవి చల్లని కరములు అన్నారు.
అమ్మ చేతులకు పెట్టడమే తెలుసు. తను ఎంత కష్టాన్నైనా భరించి పిల్లలకు సౌఖ్యాలనందిస్తుంది. తను ఆకలితో అలమటిస్తున్నా పిల్లల కడుపు నింపుతుంది. తను ఎంత దరిద్రాన్నైనా అనుభవిస్తూ పిల్లలకు సకల సౌభాగ్యాలూ అందిస్తుంది. అందుకే అమ్మ కరములు దానమ్మునకు ఆకరములు తన పిల్లలుగానే భావించడం అమ్మతనంలోని గొప్పతనం. తన పిల్లలనే కాదు, అందరినీ ఎంత పెద్దవారినైనా, ఎంత గొప్పవారినైనా తన బిడ్డలుగానే భావించి కొసరి కొసరి వడ్డిస్తుంది, కడుపు నింపుతుంది. ఆకలిగా ఉన్న వారెవరైనా అమ్మకు పసిపిల్లలే, ఆమె దృష్టిలో వారంతా తన సంతానమే.
ప్రశ్న 7.
అమ్మ చేసే సంభాషణల గురించి వివరించండి.
జవాబు:
అమ్మ ఎవరితో సంభాషించినా.తన పిల్లల గురించీ, కుటుంబం గురించే ఎక్కువ శాతం మాట్లాడుతుంది. అమ్మ సంభాషణలలో తన పిల్లల అల్లరి, చదువులు, ఆకలి మొదలైనవే ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎంత పెద్దవారైనా ఆమె దృష్టిలో పసిపిల్లలే, అమ్మ ఎక్కువగా పిల్లలతో మాట్లాడడానికే ప్రాధాన్యం ఇస్తుంది. వారి చిన్ననాటి ముచ్చట్లను చెబుతూ సంతోషిస్తుంది. ఎంత మందిలో ఉన్నా, ఎంత మందితో మాట్లాడినా తన పిల్లల గురించే మాట్లాడుతుంది. తన పిల్లలు తప్ప అమ్మకు వేరే ప్రపంచం ఉండదు. అమ్మ సంభాషణలలో ఆప్యాయత ఉంటుంది. అమ్మ మాటలు అమృతం కంటే తియ్యగా ఉంటాయి.
ప్రశ్న 8.
మీ అమ్మ గురించి వ్రాయండి.
జవాబు:
మా అమ్మకు నేనంటే చాలా యిష్టం. ఎంత అల్లరి చేసినా ఏమీ అనదు. ఎన్నో మంచి మాటలు చెబుతుంది. ఎప్పుడైనా నా అల్లరి భరించలేక తిట్టినా, కొట్టినా చాలా బాధపడుతుంది. ‘అంత అల్లరి చేయకూడదమ్మా ! చదువుకోవాలమ్మా !’ అని వెంటనే లాలిస్తుంది. నన్నెవరైనా ఏమైనా అంటే అస్సలు భరించలేదు. ఎప్పుడూ మా గురించే ఆలోచిస్తుంది. తెల్లటి బట్టలే కట్టుకోమంటుంది. ఆటలలో పడి బట్టలెంతగా మాపుకొన్నా ఏమీ అనదు. అప్పుడప్పుడు విసుక్కొంటుంది. మా అమ్మ వంట చాలా రుచిగా వండుతుంది. ఇప్పటికీ నాకూ, మా తమ్ముడికీ, అక్కకీ అన్నం కలిపి తినిపిస్తుంది. అమ్మ కథలు, కబుర్లు చెబుతూ తినిపిస్తుంటే ఎంతైనా తినేస్తాం. మా అమ్మ దేవత. నేను పెద్దయ్యాక మా అమ్మనీ, నాన్ననీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
ప్రశ్న 9.
అమ్మ గొప్పతనాన్ని కవి ‘అమ్మ ఒడి’ గేయంలో ఎలా వర్ణించారు.
జవాబు:
అమ్మ ఒడి చదువుల బడి, దేవుని గుడి. అమ్మే దేవుని కంటే ముందు భవిష్యత్తుకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మాటలు తెలివితేటలు పెంచుతాయి. అమ్మ పెదవుల మీది చిరునవ్వు వికాసం కలిగిస్తుంది. అమ్మ అందమైన మాటలు చెవులకు ఇంపుగా ఉండి, అలంకారాలవుతాయి. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నింటిని సమకూర్చేదిగా ఉంటుంది. అమ్మ చేతులు దానధర్మాలు చేస్తాయి. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు కలిగిస్తుంది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని కలిగిస్తాయి. అమ్మ అందరికీ ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం అని చెప్పుకోవచ్చు.
ఈ విధంగా ‘బాలబంధు’ బి.వి. నరసింహారావుగారు అమ్మ గొప్పతనాన్ని తన గేయంలో వర్ణించారు.
ప్రశ్న 10.
మీ అమ్మకు నీవు ఏయే పనుల్లో సహాయం చేస్తావో మీ స్నేహితురాలికి ఉత్తరం రాయండి.
జవాబు:
గుంటూరు, ప్రియమైన స్నేహితురాలు వాణికి, నీ స్నేహితురాలు జానకి వ్రాయునది. నీవు మీ అమ్మను గురించి వ్రాసిన ఉత్తరం చేరింది. నేనీ ఉత్తరంలో మా అమ్మకు నేను ఎలా సహాయం చేస్తానో తెలియజేస్తాను. మా అమ్మకు నేనంటే ఎంత ఇష్టమో, నాకు మా అమ్మ అంటే అంత ఇష్టం. అందుకే అమ్మ పనులు చేసుకుంటూ ఉంటే నేను అమ్మకు సహాయం చేస్తుంటాను. అమ్మ వంట చేసేటప్పుడు ఏదైనా వస్తువు అవసరమయితే తెచ్చి ఇస్తాను. ఏవైనా సరుకులు కావలసివస్తే పొరుగునే ఉన్న దుకాణానికి వెళ్ళి తెచ్చి పెడతాను. అమ్మ బట్టలు ఉతికేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను ఆరవేస్తాను. తాతయ్యకు కాఫీ ఇచ్చిరమ్మంటే ఇచ్చివస్తాను. సాయంకాలం హోంవర్కు అయిన తరువాత తోటపనిలో అమ్మకు పాదులకు నీళ్ళు పోయడంలోను, కాయగూరలు కోయడం లోను సాయం చేస్తాను. మా ఇంటికి అమ్మ స్నేహితులు వస్తే వాళ్ళకు మంచినీళ్ళు తెచ్చి ఇస్తాను. నన్ను మా అమ్మతో పాటు అందరూ మంచి అమ్మాయి అని మెచ్చుకుంటారు సుమా ! మీ అమ్మకు, నాన్నకు నమస్కారాలు. మళ్ళీ ఉత్తరం వ్రాయి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 11.
మీ నాన్నగారి గొప్పతనం తెలిసేలా కింది కవితను పొడిగించండి.
మా హీరో మా నాన్న –
నాతో ఆడతాడు మా నాన్న …………
జవాబు:
తప్పు చేస్తే కొడతాడు నాన్న.
డబ్బులు ఇస్తాడు అడిగితే నాన్న.
అందుకే నాకిష్టం మా నాన్న.
ప్రశ్న 12.
అమ్మ ఏకపాత్రను రాయండి.
జవాబు:
అమ్మ
నేనర్రా మీ అమ్మని. “ఔనులెండి. మీకాకలి వేస్తే నేను గుర్తొస్తాను. కడుపునిండితే ఆటలు గుర్తొస్తాయి. ఒరేయ్. అల్లరి చేయకు, ఆ కబుర్లు మాని అన్నం తినరా ! అన్నం తింటే ఎంచక్కా మీ నాన్నలా బలంగా తయారౌతావు. నీకిష్టమని బంగాళాదుంపలు వేయించాను. ఇంకొంచెం తిను. అలా మట్టిలో దేకకు, ఆ బట్టలు చూడు ! ఎలా మాసిపోతున్నాయి ? ఉతికేటప్పటికి రెక్కలు నొప్పెడుతున్నాయి. అసలూ బట్టల్ని కాదురా! నిన్ను ఉతకాలి. అప్పుడు జాగ్రత్తగా ఉంటావు. ఆగరా ! ఆగు… పారిపోయేవా ! పిల్లలు బడికెళ్లి పోయారు. ఇంక కబుర్లు చాలమ్మా ! నాకవతల గంపెడు పని ఉంది.
III. భాషాంశాలు:
1. సరైన అక్షరాలతో కింది ఖాళీలను పూరించండి.
- కడప
- పక పక
- నటన
- మరక
- బరబర
- మర
- శనగ
- టపటప
- గరగ
- పనస
2. కింది పదాలలో దాగిన కొత్త పదాలను రాయండి.
అ) పలకల జత
జవాబు:
- పలక
- కలప
- కల
- జత
- తల
- కలత
- కత
- లత
ఆ) కడవ నడత
జవాబు:
- కడ
- కడవ
- వడ
- తడక
- నడక
- కత
- నడవ
- నడత
- నవ
- తన
3. కింది వానిలో సరైన చోట ‘o’ (సున్నాలు) ఉంచి అర్థవంతమైన పదాలు తయారు చేయండి.
- నద – నంద, నదం
- కళక – కళంకం
3. కల – కలం - రగ – రంగ
- మద – మంద, మదం, మందం
4. కింది పట్టికలలో పదాలను చదవండి. రెండేసి పదాలను కలిపి అర్ధవంతమైన వాక్యంగా రాయండి.
- ఆట సరదా
- నడక పయనం
- లత తల
- నటన ఏల?
- కంచం మంచం
- లంచం దగ
- పలకల జత
- మడత మంచం
- మంచం తలగడ
- నగరం కథ
5. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. …………….. వచం (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ర
ఆ) మ
ఇ) క
జవాబు:
ఇ) క
2. అ …………. ను (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ద
ఆ) ర
ఇ) య
జవాబు:
అ) ద
3. ఔ ……….. (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) య
ఆ) ర
ఇ) డ
జవాబు:
ఆ) ర
4. జ …………… గ (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) య
ఆ) ట
ఇ) ల
జవాబు:
5. ……….. శ (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) ఆ
ఆ) ఎ
ఇ) బ
జవాబు:
అ) ఆ
6. మద (సున్నాలుపయోగిస్తే ఎన్ని పదాలౌతుంది)
అ) 2
ఆ) 3
ఇ) 4
జవాబు:
ఆ) 3
7. పట ……….. (సున్నాలుపయోగించి ఎన్ని పదాలు రాయగలం?)
అ) 2
ఆ) 1
ఇ) 3
జవాబు:
అ) 2
8. మత ……… (సున్నాలుపయోగించి ఎన్ని పదాలు రాయగలం)
అ) 3
ఆ) 2
ఇ) 1
జవాబు:
ఇ) 1
9. పలకల జత ……… (దీనిలోని పదాల సంఖ్య గుర్తించండి.)
అ) 4
ఆ) 3
ఇ) 2
జవాబు:
అ) 4
10. జలజ జ ……….. (ఖాళీలోని అక్షరం గుర్తించండి)
అ) క
ఆ) ప
ఇ) డ
జవాబు:
ఇ) డ
11. ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న (వీటిలోని పదం గుర్తించండి)
అ) పడవ
ఆ) దడ
ఇ) నదము
జవాబు:
ఆ) దడ
12. ప,ఫ,బ,భ,మ,య,ర,ల,వ (వీటిలోని పదం గుర్తించండి)
అ) బరమ
ఆ) భారతం
ఇ) వార
జవాబు:
అ) బరమ
13. జ, ఝ, ఇ, ట, ఠ, డ, ఢ ………. (వీటిలోని పదం గుర్తించండి)
అ) ఝషం
ఆ) జఠరం
ఇ) జడ
జవాబు:
ఇ) జడ
14. శ, ష, స, హ, త, న,ం (వీటిలో పదం గుర్తించండి)
అ) సహనం
ఆ) సహజం
ఇ) ఝషం
జవాబు:
అ) సహనం
15. ప, య, ర, ల, ఒ, క – (వీటిలోని పదం గుర్తించండి.)
అ) కమల
ఆ) కత
ఇ) కరప
జవాబు:
ఇ) కరప
చదవండి – ఆనందించండి
మాతృదేవోభవ, పితృదేవో భవ
పిల్లలూ ! ‘మాతృదేవో భవ’, ‘పితృదేవో భవ’ అంటారు- పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్లు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్నచిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను – శ్రద్ధగా వినండి.
మనం ప్రతి సంవత్సరం వినాయకచవితి ? పూజ చేసుకుంటాం. ఆ సందర్భంగా – వినాయకవ్రత కథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టివచ్చిన వాళ్ళకు గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలివాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరతాడు. వినాయకుడు పెద్ద బొజ్జ గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా ? అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని చెపుతాడు. ఈ విషయం గ్రహించి, వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు ప్రదక్షిణాలు చేసి, నమస్కరించాడు. మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టిరావడమే. తన కంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తిచేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది.
చూశారా పిల్లలూ ! వినాయకుడి కథవల్ల మీరు తెలుసుకోవల్సిందేమిటంటే – తల్లిదండ్రుల్ని మించిన దైవం లేదు. ఈ కథను వినాయకచవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకొంటున్నామంటే తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకొంటున్నామని గ్రహించాలి. అంతేగాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధభావాలు ఉండకూడదు. – అనే విషయము, వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి.