These AP 6th Class Telugu Important Questions 3rd Lesson మాకొద్దీ తెల్ల దొరతనము will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 3rd Lesson Important Questions and Answers మాకొద్దీ తెల్ల దొరతనము
6th Class Telugu 3rd Lesson మాకొద్దీ తెల్ల దొరతనము Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యా లు
పరిచిత పద్యాలు కింది గేయ భాగాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. పన్నెండు దేశాలు పండుచున్నాగాని
పట్టెడన్నమె లోపమండీ
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ
నోట మట్టిగొట్టి పోతాడండీ
అయ్యో ! కుక్కలతో పోరాడి కూడూ తినమంటాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎన్ని దేశాల్లో పంటలు పండుచున్నాయి?
జవాబు:
పన్నెండు దేశాల్లో పంటలు పండుచున్నాయి.
ఆ) దేనిని ముట్టుకుంటే తప్పు అనేవారు?
జవాబు:
ఉప్పును ముట్టుకుంటే తప్పు అనేవారు.
ఇ) ఎవరితో పోరాడి కూడు తినమన్నారు?
జవాబు:
కుక్కలతో పోరాడి కూడు తినమన్నారు.
ఈ) పట్టెడన్నం ఎవరికి లోపమని కవి చెప్పాడు.?
జవాబు:
పట్టెడన్నం భారతీయులకు లోపమని కవి చెప్పాడు.
2. ధనము కోసము వాడు దారి చేసికోని
కల్లు సారాయమ్ముతాడు
మాదు మూటాముల్లెలు దోచినాడు
ఆలి మెళ్లో పుస్తెలు తెంచుతాడు
మాదు కళ్లల్లో డుమ్మేసి కాటికి దరిచేసాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) కల్లు, సారాయి దేని కోసం అమ్మారు?
జవాబు:
ధనం కోసం కల్లు,సారాయి అమ్మారు.
ఆ) భార్యల మెడల్లో ఏముంటాయి?
జవాబు:
భార్యల మెడల్లో పుస్తెలు ఉంటాయి.
ఇ) కళ్లల్లో ఏమి వేశాడు?
జవాబు:
కళ్లల్లో దుమ్ము. వేశాడు.
ఈ) ఈ గేయం ఏ పాఠంలోనిది?
జవాబు:
ఈ గేయం ‘మాకొద్దీ తెల్ల దొరతనము’ అనే పాఠం లోనిది.
3. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ
రావద్దు రావద్దంటాడు
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు.
టోపి తీసి వీపులు బాదుతాడు.
అయ్యో ! రాజద్రోహమంత రాట్నంలో ఉన్నదంట
ప్రశ్నలు – జవాబులు:
అ) గాంధీ టోపీతో ఎక్కడికి వెళ్ళకూడదు?
జవాబు:
గాంధీ టోపీతో పాఠశాలకు వెళ్ళకూడదు.
ఆ) బడిలో ఏమి పెట్టవద్దని అన్నాడు?
జవాబు:
బడిలో రాట్నం పెట్టవద్దని అన్నాడు.
ఇ) రాట్నంలో ఏమున్నదని అన్నాడు?
జవాబు:
రాట్నంలో రాజద్రోహం ఉన్నదని అన్నాడు.
ఈ) ఈ గేయాన్ని ఎవరు రచించారు?
జవాబు:
ఈ గేయాన్ని గరిమెళ్ల సత్యనారాయణ రచించారు.
అపరిచిత పద్యా లు
1. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
గంగి గోవు పాలు గరిటెడైనను జాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గల్గు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఏ పాలు గరిటెడున్నా మంచివే?
జవాబు:
గంగిగోవు పాలు గరిటెడైనా మంచివే.
ఆ) కడవతో ఇచ్చినా ఏ పాలు మంచివి కావు?
జవాబు:
గాడిదపాలు కడవతో ఇచ్చినా మంచివికావు.
ఇ) ఎటువంటి అన్నం ఒక ముద్దయినా సరిపోతుంది?
జవాబు:
ప్రేమతో పెట్టిన అన్నం ఒక ముద్దయినా సరిపోతుంది.
ఈ) దేనివల్ల మేలు కలగదు?
జవాబు:
తిట్టిపోస్తూ ఎంత ఆహారము పెట్టినా మేలు కలగదు.
2. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చెప్పినం చెప్పక యుండినం
దప్పక సేయంగ వలయుఁ దనపనులెల్లన్
మెప్పొదవఁ గానులేదా
ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ!
ప్రశ్నలు – జవాబులు:
అ) సుకుమారి పనులు ఎలా చేయవలెను?
జవాబు:
సుకుమారి చేయవలసిన పనులను చెప్పినను, చెప్పకపోయిననూ పరిశుభ్రముగా చేయవలెను.
ఆ) ఎవరు మెచ్చుకొనేలా పనిచేయాలి?
జవాబు:
జనులు మెచ్చుకొనేలా పరిశుభ్రముగా పనిచేయాలి.
ఇ) ఎప్పుడు నష్టము వాటిల్లును?
జవాబు:
చేయవలసిన పనులు వేళకు చేయకపోతే నష్టము వాటిల్లుసు.
ఈ) పై పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
పై పద్యము కుమారీ శతకములోనిది.
3. కింది అపరిచిత పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ !
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరు చెప్పినా ఏమి చేయవలెను?
జవాబు:
ఎవరు చెప్పిననూ వినవలెను.
ఆ) చెప్పినది వినగానే ఏమి చేయవలెను?
జవాబు:
చెప్పినది వినగానే నిజమో అబద్ధమో తెలుసుకోవాలి.
ఇ) .ఏది న్యాయము?
జవాబు:
వినినది నిజమో, అబద్దమో వివరించి తెలిసికొనుటే న్యాయము
ఈ) పై పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
పై పద్యము సుమతీ శతకములోనిది.
4. ఈ కింది పద్యం చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల ?
భాండ శుద్ధిలేని పాకమేల ?
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా ?
విశ్వదాభిరామ వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఆచారానికి ఏది కావాలి?
జవాబు:
ఆచారానికి ఆత్మశుద్ధి కావాలి.
ఆ) వంటకు ఏది శుద్ధిగా ఉండాలి?
జవాబు:
వంటకు భాండ శుద్ధి ఉండాలి.
ఇ) శివపూజ ఎలా చేయాలి?
జవాబు:
శివపూజను చిత్తశుద్ధితో చేయాలి.
ఈ) పై పద్యానికి సరిపోయే ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై పద్యంలో దేని గురించి చెప్పారు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
మాకొద్దీ తెల్ల దొరతనమని కవిగారు ఎందుకన్నారు?
జవాబు:
ఆ రోజులలో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేవారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయులకు సుఖశాంతులు ఉండేవి కావు. ఏదో ఒక వంకతో భారతీయులను చంపేవారు, అవమానించేవారు, భారతదేశపు సంపదను దోచుకొనేవారు. ప్రతి వస్తువు పైనా పన్నును వేసేవారు. భారతీయులను మత్తుపదార్థాలకు బానిసలను చేసేవారు. ఆ రోజులలో భారతీయులకు కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు. అందుకే ‘ కవిగారు మాకొద్దీ తెల్ల దొరతనమనే గేయం రచించారు. ఎలుగెత్తి పాడారు, పాడించారు.
ప్రశ్న 2.
గాంధీ టోపీ, రాట్నములను బడులలో ఎందుకు అనుమతించలేదు?
జవాబు:
ఆనాటి స్వాతంత్ర్యోద్యమానికి మహాత్మాగాంధీ నాయకత్వం వహించారు. ఆయన మాటంటే దేశ ప్రజలందరికీ చాలా గౌరవం. అదే విధంగా గాంధీ టోపీ స్వాతంత్ర్యానికి గుర్తు. గాంధీ టోపీ ధరించారంటే వారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకమని, స్వాతంత్ర్యోద్యమానికి అనుకూలమని సంకేతం. అందుకే ఆ రోజులలో భారతీయులందరూ గాంధీ టోఫీ ధరించేవారు. గాంధీ టోపీ పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొనేవారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం యొక్క అదుపాజ్ఞలలోనే ఉండాలని ఆంగ్లేయుల ఆలోచన. రాట్నం కూడా స్వాతంత్ర్యోద్యమ నాయకుల చేతిలో ఉండేది. ఇది స్వదేశీ ఉద్యమానికి సంకేతం. అందుకే బడిలో రాట్నాన్ని అనుమతించలేదు. అలాగే గాంధీ టోపీని కూడా ప్రభుత్వ పాఠశాలలో అనుమతించలేదు.
ప్రశ్న 3.
భారతీయులను ఆంగ్లేయులు ఏ పాట పాడవద్దన్నారు? ఎందుకు?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను రెండుగా విభజించింది. ఇది మన జాతీయ నాయకులకు అంగీకారం కాలేదు. వందేమాతరం ఉద్యమం బయలుదేరింది. భారతదేశంలోని పల్లెపల్లెకు అది విస్తరించింది. ప్రతీ పాఠశాలలోను వందేమాతరం పాడేవారు. అది పాడితే ఆంగ్ల ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేది. ఎక్కడ సమావేశం జరిగినా మొదట వందేమాతరం పాడేవారు. అది ఆంగ్ల ప్రభుత్వానికి కర్ణకఠోరంగా ఉండేది. సభలూ, సమావేశాలు జరపవద్దని పోలీస్ చట్టం సెక్షన్ 144ను విధించారు. ఆ చట్ట ప్రకారం ఎక్కడ నలుగురు మనుషులు గుమిగూడినా పోలీసులు లాఠీఛార్జి చేసేవారు. భరతమాత యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశపు గొప్పతనాన్ని వందేమాతరం పాట తెలియజేస్తుంది. దీనిని బంకించంద్ర ఛటర్జీగారు రచించారు. ఈ వందేమాతర గీతం భారత జాతిని ఒకతాటిపై నడిపించింది.
ప్రశ్న 4.
ప్రభుత్వం కల్లు, సారాయి అమ్మడం వలన భారతీయులు నష్టపోతున్నారని కవిగారు ఎందుకు అన్నారు?
జవాబు:
కల్లు, సారా మొదలైనవి మత్తుపదార్థాలు. వీటివలన మానవులలో ఆలోచనా శక్తి నశిస్తుంది. వాటిని తాగితే విచక్షణా జ్ఞానం కోల్పోతారు. ఏది మంచో, ఏది చెడో తెలియదు. వాటికి బానిసలైపోతారు. సంపాదించిన డబ్బంతా కల్లు, సారాయిలకే ఖర్చయిపోతుంది. ఆ డబ్బంతా అప్పట్లో ఆంగ్ల ప్రభుత్వానికి చేరిపోయేది. తరతరాలుగా వస్తున్న ఆస్తులను, నగలను, నగదునూ కూడా ఖర్చు పెట్టేసేవారు. చివరికి పెళ్ళాం మెడలో మంగళసూత్రాలు కూడా ఎత్తుకుపోయి తాగేసే నీచస్థితికి దిగజారిపోయేవారు. చివరకు రోగాలపాలై బలహీనులై మరణించేవారు. ఆంగ్ల ప్రభుత్వానికి అదే కావాలి. ప్రజలు తెలివిగా ఉంటే ఆంగ్ల ప్రభుత్వం ఆటలు సాగవని వారికి తెలుసు. ఆరోగ్యంగా ఉంటే చక్కగా ఆలోచించి సమైక్యంగా ఆంగ్ల ప్రభుత్వాన్ని ఎదిరిస్తారు. అది ఆంగ్లేయులు తట్టుకోలేరు. రోగాలపాలైతే ఈ సమస్యలేవీ ఉండవు అని ఆంగ్లేయుల ఆలోచన. అందువల్ల ప్రభుత్వం సారాయి, కల్లును అమ్మడాన్ని నిషేధించాలని మన జాతీయ నాయకులు, కవిగారి వంటి మేధావులు ఉద్యమాలను నడిపారు. ప్రజలను చైతన్యపరచారు.
ప్రశ్న 5.
‘ఉప్పు ముట్టుకుంటే దోషమండీ’ అని కవిగారు ఎందుకు అన్నారు?
జవాబు:
భారతీయులను ఆంగ్ల ప్రభుత్వం చాలా రకాలుగా బాధలు పెట్టింది. భారతీయులను ఎలాగైనా పేదలుగా చేయాలని అనేక పథకాలు ఆలోచించింది. ప్రతి వస్తువు పైనా పన్నులు విధించింది. ఎంత పంట పండినా ఆ సంపదంతా పన్నుల రూపంలో దోచుకునేది. పేదవాడు గంజిలో వేసుకునే ఉప్పుపైనా కూడా పన్ను విధించింది. పన్ను కట్టకుండా ఉప్పు ముట్టుకుంటే పోలీసులు కొట్టేవారు. ప్రకృతిసిద్ధంగా సముద్రపు నీటితో తయారు చేసుకునే ఉప్పుపై పన్నెందుకు కట్టాలని జాతీయ నాయకులు ప్రశ్నించారు. గాంధీగారి నాయకత్వంలో దేశ ప్రజలంతా ఉప్పు సత్యాగ్రహం చేశారు. సమ్మెలు చేశారు. సభలూ, సమావేశాలు పెట్టి ఆంగ్ల పరిపాలకుల దుర్మార్గాలను ఎండగట్టారు. ఎంతోమంది జాతీయ నాయకులు, సామాన్య ప్రజలు లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్ళకు వెళ్లారు. అనుకున్నది సాధించారు. ఉప్పుపైన పన్ను రద్దు చేయించారు.
ప్రశ్న 6.
ఆంగ్లేయుల పరిపాలనా కాలం తెలిసిన వృద్ధుడు మీ గ్రామంలో ఉన్నాడు. ఆయనతో నీవు సంభాషణ చేసినట్లుగా ఊహించి ఆ సంభాషణ రాయండి.
జవాబు:
రంజిత్ : తాతగారూ ! బాగున్నారా !
తాత : (నవ్వుతూ) బాగానే ఉన్నాను. ఏంటీ ? ఏమైనా కథ కావాలా ?
రంజిత్ : ఔను. మీ చిన్ననాటి కథ చెప్పండి.
తాత : నా చిన్నప్పటి కథంటే?
రంజిత్ : అదే మీ చిన్నతనంలో ఆంగ్లేయులు పరిపాలించేవారు కదా !
తాత : ఔను.
రంజిత్ : మీ బడిలో ఎలా ఉండేది?
తాత : మా బడిలో మాట్లాడితే కొట్టేసేవారు. అందరినీ బడులలోకి రానిచ్చేవారు కాదు. అప్పట్లో గాంధీగారి గురించి మాట్లాడినా కొట్టేసేవారు.
రంజిత్ : మరి గ్రామంలో ఎలా ఉండేది?
తాత : మా నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ, నానమ్మ అందరూ స్వాతంత్ర్య సమర యోధులే. ఎప్పుడూ సమావేశాలు, ఊరేగింపులే.
రంజిత్ : మరి పోలీసులేమీ చేసేవారు కాదా?
తాత : (నవ్వుతూ) వాళ్ళు బైట ఉన్నది తక్కువ. జైలులో ఉన్నది ఎక్కువ కాలం. ఔనూ. ఈ రోజు బడి లేదా?
రంజిత్ : ఉంది. వెళ్ళిపోతున్నా, సాయంత్రం చాలా చెప్పాలి మరి.
తాత : ఒకరోజేమిట్రా వారంపాటు చెబుతా.
రంజిత్ : ఓ.కే. బై. తాతగారూ !
ప్రశ్న 7.
మాకొద్దీ తెల్లదొరతనం గేయం నుండి నీవు నేర్చుకొన్న వాటి గురించి మీ అన్నయ్యకు లేఖ రాయండి.
జవాబు:
నెల్లూరు, ప్రియమైన అన్నయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమంగా ఉన్నట్లు తలచెదను. మొన్న మా స్కూల్లో ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయం చెప్పారు. దానిని గరిమెళ్ళ సత్యనారాయణగారు రచించారు. గేయం చాలా బాగుంది. ఆ రోజులలో భారతీయులు చాలా బాధలు పడ్డారట. తినడానికి తిండి కూడా ఉండేది కాదట. ఉప్పుపైన కూడా పన్ను వేశారు. ఆంగ్లేయులు చాలా దారుణంగా పరిపాలించారట. పాఠశాలకు గాంధీటోపీతో వస్తే చావబాదేవారుట. రాట్నం తెస్తే దేశద్రోహమట, సమావేశాలు జరపకూడదట, మనం రోజూ పాడుకొనే వందేమాతరం పాడకూడదట. భారతదేశంపై చాలా దాడులు చేశారట. చాలా సంపద దోచుకొన్నారట. అవన్నీ వింటుంటే నాకు చాలా బాధ కలిగింది. అన్నయ్యా ! ఆ రోజులలో వాళ్ళు అన్ని బాధలు పడ్డారు కనుక . ఈ రోజు మనం సుఖంగా ఉన్నామని మా మాష్టారు చెప్పారు. నువ్వు కూడా చదువు. ఈసారి నీకు అది పాడి వినిపిస్తా. ఇట్లు, చిరునామా : |
III. భాషాంశాలు
పర్యాయపదాలు
దొర = అధిపతి, రాజు
అన్నము = ఆహారము, కూడు
ఉప్పు = లవణము, క్షారము
దుమ్ము = పరాగము, ధూళి
నోరు = వక్రము, వాయి
పోరాటము = యుద్ధము, రణము
ప్రాణము = జీవము, ఉసురు
దోషము = తప్పు, అపచారము
కళ్లు = నేత్రాలు, నయనాలు
బడి = పాఠశాల, విద్యాలయం
చేటు = కీడు, ఆపద
వ్యతిరేక పదాలు
వద్దు × కావాలి
పోతాడు × వస్తాడు
పెట్టి × తీసి
దాటి × దాటక
వెళ్లవద్దు × రావద్దు
పైన × క్రింద
దోషము × నిర్దోషము
అమ్మడం × కొనడం
ఉన్నది × లేదు
వెళ్లి × వచ్చి
చెడు × మంచి
వినడు × వింటాడు
1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
1. కష్టాలు పొంచి చూస్తున్నాయి.
జవాబు:
పొంచి = దాగి
కష్టాలు వెనుక సుఖాలు దాగి ఉంటాయి.
2. భారతీయులు ప్రాణాల కంటె మానాలుకు విలువ ఇస్తారు.
జవాబు:
మానాలు = గౌరవాలు
కష్టపడి చదివితే గౌరవాలు పెరుగుతాయి.
3. దోషము చేయని వారుండరు.
జవాబు:
దోషము = తప్పు
తప్పులు రాస్తే మార్కులు తగ్గుతాయి.
4. శ్రీరాముని ఆలి పేరు సీతాదేవి.
జవాబు:
ఆలి = భార్య
భార్య భర్త కలిసి ఇంటిని నడపాలి.
5. సుంత కూడా జాలి లేనివారు కఠినాత్ములు.
జవాబు:
సుంత = కొద్దిగా
కొద్దిగా నైనా ఇతరులకు సహాయపడాలి.
2. కింది వానిలో పర్యాయపదాలు గుర్తించి రాయండి.
1. ఎవరి ప్రాణం వారికి తీపి. యమధర్మరాజు ఉసురు తీస్తాడు.
జవాబు:
ప్రాణం, ఉసురు.
2. కూడు లేకపోతే బ్రతకలేం. అందుకే అన్నం వృథా చేయకూడదు.
జవాబు:
కూడు, అన్నం
3. ధనము సంపాదించాలి కానీ డబ్బు కోసం తప్పులు చేయకూడదు.
జవాబు:
ధనము, డబ్బు.
3. కింది వానిలో వ్యతిరేకార్థక పదాలు గుర్తించి క్రమంలో రాయండి.
1. అమ్మడం, పెట్టి, వెళ్లాలి, తీసి, రావాలి, కొనడం.
జవాబు:
అమ్మడం × కొనడం
పెట్టి × తీసి
వెళ్లాలి × రావాలి
1. కింది వానిలో అనునాసికాలు గుర్తించండి. రాయండి.
గణగణమని గంట మోగింది.
జవాబు:
ణ, న, మ
2. కింది వానిలో మూర్ధన్యాలను గుర్తించండి. రాయండి.
మఠము వేసి ఋషి వటవృక్షము కింద కూర్చున్నాడట.
జవాబు:
ఠ, ఋ, షి, ట, డ – మూర్ధన్యాలు
3. కింది వానిలో ఓష్యాలు గుర్తించండి. రాయండి.
ఉన్న ఊరు పట్టుకొని ఫలితం బడయువాడు భంగ పడడని మన పెద్దలన్నారు.
జవాబు:
ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ – ఓష్యాలు
4. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. కిందివానిలో ‘చ’ వర్ణాక్షరమేది?
అ) క
ఆ) ఝ
ఇ) ఈ
జవాబు:
ఆ) ఝ
2. కిందివానిలో ‘ప’ వర్గాక్షరమేది?
అ) ల
ఆ) య
ఇ) భ
జవాబు:
ఇ) భ
3. కిందివానిలో పరుష్కారమేది?
అ) ప
ఆ) ఖ
ఇ) డ
జవాబు:
అ) ప
4. నాన్న మామ్మను మామ్మన్నాను. (దీనిలో ఉన్నవి?)
అ) సరళాలు
ఆ) పరుషాలు
ఇ) అనునాసికాక్షరాలు
జవాబు:
ఇ) అనునాసికాక్షరాలు
5. డబడబా వాగవద్దు – (దీనిలో లేని అక్షరాలు?)
అ) సరళాలు
ఆ) అంతస్థాలు
ఇ) పరుషాలు
జవాబు:
ఇ) పరుషాలు
6. సరళ పాట పాడింది. (దీనిలో లేని అక్షరాలేవి?)
అ) అనునాసికాలు
ఆ) పరుషాలు
ఇ) సరళాలు
జవాబు:
అ) అనునాసికాలు
7. కఠినంగా మాట్లాడకు — (దీనిలో వర్గయుక్కేది?)
అ) క
ఆ) ఠి
ఇ) మా
జవాబు:
ఆ) ఠి
8. పొలాలన్నీ హలాల దున్నాలి. (దీనిలోని ఊష్మాక్షరం?)
అ) పొ
ఆ) లా
ఇ) హ
జవాబు:
ఇ) హ
9. వనజ జడ బాగుంది – (దీనిలో అక్షరాలన్ని ఏమిటి?)
అ) స్పర్శాలు
ఆ) పరుషాలు
ఇ) సరళాలు
జవాబు:
అ) స్పర్శాలు
10. కంఠం నుండి పుట్టే అక్షరాలనేమంటారు?
అ) మూర్ధన్యాలు
ఆ) కంఠ్యాలు
ఇ) దంత్యాలు
జవాబు:
ఆ) కంఠ్యాలు
11. త,ధ,ధ,న – వీటి వర్ణోత్పత్తి స్థానం గుర్తించండి.
అ) త వర్గం
ఆ) తాలవ్యాలు
ఇ) దంత్యాలు
జవాబు:
ఇ) దంత్యాలు
12. ప,ఫ,బ,భ,మ – వీటి వర్ణోత్పత్తి స్థానం గుర్తించండి.
అ) ఓష్యాలు
ఆ) ప వర్గాక్షరాలు
ఇ) తొలవ్యాలు
జవాబు:
అ) ఓష్యాలు
13. ఎ, ఏ, ఐ – వీటి వర్ణోత్పత్తి స్థానాలు గుర్తించండి.
అ) కంఠోష్యాలు
ఆ) కంఠతాలవ్యాలు
ఇ) దంతోష్యాలు
జవాబు:
ఆ) కంఠతాలవ్యాలు
14. ముక్కు సాయంతో పలికే అక్షరాలనేమంటారు?
అ) అనునాసికాలు
ఆ) కంఠ్యాలు
ఇ) తాలవ్యాలు
జవాబు:
అ) అనునాసికాలు
15. ఓష్యాలు వేటి సాయంతో పలుకుతాము?
అ) కంఠం
ఆ) దౌడలు
ఇ) పెదవులు
జవాబు:
ఇ) పెదవులు
16. దోషము లేనివారు లేరు – (అర్థం గుర్తించండి)
అ) ఆస్తి
ఆ) తప్పు
ఇ) పౌరుషం
జవాబు:
ఆ) తప్పు
17. అందరి సమ్మతము కలదే ప్రజాస్వామ్యం – (అర్థం గుర్తించండి)
అ) అంగీకారం
ఆ) పదవులు
ఇ) ఆలోచనలు
జవాబు:
18. వంట జిహ్వకు రుచిగా ఉండాలి. (అర్థం గుర్తించండి)
అ) అందరూ
ఆ) నాలుక
ఇ) భర్త
జవాబు:
ఆ) నాలుక
19. రావణుడు మట్టిగొట్టుకు పోయేడు. (అర్థం గుర్తించండి)
అ) ఎత్తుకుపోయేడు
ఆ) యుద్ధం చేశాడు
ఇ) నాశనమైపోయేడు
జవాబు:
ఇ) నాశనమైపోయేడు
20. పోరాటం మంచిదికాదు. (అర్ధం గుర్తించండి)
అ) యుద్ధం
ఆ) స్నేహం
ఇ) విరోధం – మనం
జవాబు:
అ) యుద్ధం
21. ప్రాణం పోయినా కొందరు తప్పుచేయరు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) జీవితం, బతుకు
ఆ) జీవం, ఉసురు
ఇ) పరువు, కీర్తి
జవాబు:
ఆ) జీవం, ఉసురు
22. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) బడి, విద్యాలయం
ఆ) బడి, గుడి
ఇ) చదువు, విద్య
జవాబు:
అ) బడి, విద్యాలయం
23. పెళ్ళిలో సందడి ఎక్కువ. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) వేడుక, జాతర
ఆ) ఉత్సవం, పండుగ
ఇ) వివాహం, పరిణయం
జవాబు:
ఇ) వివాహం, పరిణయం
24. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) నాలుక, రసన
ఆ) ముఖము, నాలుక
ఇ) భర్త, పతి
జవాబు:
అ) నాలుక, రసన
25. అమ్మ ప్రేమకు సాటిలేదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) అత్త, తల్లి
ఆ) జనని, తల్లి
ఇ) పినతల్లి, మాత
జవాబు:
ఆ) జనని, తల్లి
26. తెల్ల దొరతనము వద్దు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) దొంగ
ఆ) రాజు తన
ఇ) తెల్లవాడు
జవాబు:
అ) దొంగ
27. సారా అమ్మడం తప్పు (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) బేరం
ఆ) ఇవ్వడం
ఇ) కొనడం
జవాబు:
ఇ) కొనడం
28. మన మనసులోంచి చెడును తీసివేయాలి’ (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) వేసి
ఆ) పోయక
ఇ) రాసి
జవాబు:
అ) వేసి
29. కొందరు మనముందు పొగుడుతారు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పైన
ఆ) కింద
ఇ) వెనుక
జవాబు:
ఇ) వెనుక
30. తప్పు చేయడం మానవ సహజం. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) ఒప్పు
ఆ) శుద్ధతప్పు
ఇ) దోషం
జవాబు:
అ) ఒప్పు
చదవండి – ఆనందించండి
సమయపాలన – జీవనవిద్య
సమావేశానికి గాంధీగారంతటి వ్యక్తి నిరాడంబరంగా, సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్కక్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా, నూరు ఆరైనా జరిపేవారు. ఆఖరుకి జైలులో ఉన్న సమయంలో కూడా కచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ.
దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు, ప్రతిరోజూ ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు, అంతకు ముందురోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని, పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టీపట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీగారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ.
విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే, సమయపాలన కోసం గడియారాన్ని మరిచిపోయినా ఫరవాలేదు కదా ! అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి, టీవీ చూస్తూనో, కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడుచేస్తూ వుంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక, తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం.
అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా సమయాన్ని తప్పకుండా, జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి.
మరి అందరం అదే బాటలో పయనిద్దామా !