These AP 7th Class Science Important Questions 9th Lesson ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి will help students prepare well for the exams.
AP Board 7th Class Science 9th Lesson Important Questions and Answers ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి
7th Class Science 9th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఉష్ణము అనగానేమి?
జవాబు:
వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రసరించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు.
ప్రశ్న 2.
ఉష్ణం యొక్క ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణాన్ని బౌల్స్ లేదా కెలోరీలలో సూచిస్తారు.
ప్రశ్న 3.
ఉష్ణాన్ని దేనితో కొలుస్తారు?
జవాబు:
ఉష్ణాన్ని కెలోరీ మీటరుతో కొలుస్తారు.
ప్రశ్న 4.
ఏ రకమైన శక్తి బియ్యం వండటంలో మరియు నీటిని వేడి చేస్తున్నపుడు అవసరము?
జవాబు:
ఉష్ణశక్తి బియ్యం వండటంలో మరియు నీటిని వేడి చేయటానికి అవసరము.
ప్రశ్న 5.
ఉష్ణము ఎలా ప్రవహిస్తుంది?
జవాబు:
ఉష్ణము అధిక ఉష్ణప్రాంతం నుండి అల్ప ఉష్ణం ఉన్న ప్రాంతానికి ప్రసరిస్తుంది.
ప్రశ్న 6.
అధమ ఉష్ణవాహకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గాలి, నీరు, గాజు, ప్లాస్టిక్, చెక్క
ప్రశ్న 7.
ఉష్ణవాహకాలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రాగి, వెండి, ఇనుము, స్టీలు.
ప్రశ్న 8.
ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం ఏమిటి?
జవాబు:
కెల్విన్ (K) ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం.
ప్రశ్న 9.
ఉష్ణ వహనం అనగానేమి?
జవాబు:
ఉష్ణం వేడికొన నుండి చల్లని కొనవైపు బదిలీ చేయబడటాన్ని ఉష్ణవహనం అంటారు.
ప్రశ్న 10.
ధార్మిక స్పర్శ అనగానేమి?
జవాబు:
ఉష్ణజనకాన్ని ప్రత్యక్షంగా తాకుతున్నప్పుడు మాత్రమే ఉష్ణవహనం ద్వారా ఉష్ణం బదిలీ జరుగుతుంది. దీనిని థార్మిక స్పర్శ అంటారు.
ప్రశ్న 11.
యానకం అనగానేమి?
జవాబు:
ఉష్ణము లేదా శక్తి ప్రసరించే పదార్థాలను యానకం అంటారు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఉష్ణానికి యానకాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న 12.
ద్రవాలలో ఉష్ణ ప్రసరణ పద్ధతి ఏమిటి?
జవాబు:
ద్రవాలలో ఉష్ణము ఉష్ణసంవహనము ప్రక్రియలో రవాణా చేయబడును.
ప్రశ్న 13.
ఉష్ణ వికిరణం అనగానేమి?
జవాబు:
ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ‘ఉష్ణ వికిరణం’ అంటారు.
ప్రశ్న 14.
ఏ ఉష్ణ బదిలీ పద్ధతిలో యానకం అవసరం లేదు?
జవాబు:
ఉష్ణ వికిరణ పద్దతిలో యానకం అవసరం లేదు.
ప్రశ్న 15.
థర్మా ప్లాను ఎవరు కనుగొన్నారు?
జవాబు:
సర్ జేమ్స్ డేవర్ – ధర్మాస్ ప్లాను కనుగొన్నాడు.
ప్రశ్న 16.
ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత 37° C లేదా 98.4°F.
ప్రశ్న 17.
శరీర ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు?
జవాబు:
జ్వరమానిని ఉపయోగించి శరీర ఉష్ణోగ్రత కొలుస్తారు.
ప్రశ్న 18.
జ్వరమానినిలో రీడింగ్ అవధులు ఎంత?
జవాబు:
జ్వరమానినిలో రీడింగ్ 35°C నుండి 42° C మధ్య ఉంటుంది.
ప్రశ్న 19.
గాలి పీడనం అనగానేమి?
జవాబు:
ఏదైనా ఉపరితలంపై గాలి కలిగించే పీడనాన్ని గాలి పీడనం అంటారు.
ప్రశ్న 20.
గాలి పీడనాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
గాలి పీడనాన్ని బారోమీటరుతో కొలుస్తారు.
ప్రశ్న 21.
వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు?
జవాబు:
వర్షపాతాన్ని రెయిన్ గేజ్ ఉపయోగించి మి.మీ.లలో కొలుస్తారు.
ప్రశ్న 22.
ఆర్ధత అనగానేమి?
జవాబు:
గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని అర్థత అంటారు.
ప్రశ్న 23.
ఆర్ధతను ఎలా కొలుస్తారు?
జవాబు:
హైగ్రోమీటర్ ఉపయోగించి ఆర్ధతను కొలుస్తారు.
7th Class Science 9th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఉష్ణశక్తి యొక్క అనువర్తనాలు లేదా ఉపయోగాలు తెలుపండి.
జవాబు:
- నిత్యజీవితంలో వంట చేయటానికి, అన్నం వండటానికి ఉష్ణశక్తి అవసరం.
- నీటిని వేడి చేయటానికి నీటి ఆవిరిగా మార్చటానికి ఉష్ణశక్తి అవసరం.
- చలి కాచుకోవటానికి విద్యుత్ ను ఉత్పత్తి చేయటానికి ఉష్ణం అవసరం.
- మొక్కలు ఆహారం తయారు చేసుకోవటానికి ఉష్ణం అవసరం.
ప్రశ్న 2.
ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రతకు మూడు రకాల ప్రమాణాలు కలవు. అవి :
- డిగ్రీ సెల్సియస్
- డిగ్రీ ఫారన్ హీట్
- కెల్విన్
ప్రశ్న 3.
ఉష్ణోగ్రతలను ఒక ప్రమాణం నుండి మరొక ప్రమాణానికి ఎలా మార్చుతారు?
జవాబు:
- సెల్సియస్ నుండి ఫారన్ హీట్ కొరకు
- సెల్సియస్ నుండి కెల్విన్
C = K – 273 సూత్రాలను వాడి ఉష్ణోగ్రత ప్రమాణాలు మార్చవచ్చు.
ప్రశ్న 4.
ఉష్ణవాహకాలు, అధమ ఉష్ణ వాహకాలు అనగానేమి?
జవాబు:
ఉష్ణవాహకాలు :
తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేయగల పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు.
ఉదా : రాగి, వెండి, ఇనుము.
అధమ వాహకాలు :
తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింప జేయని పదార్థాలను అధమ వాహకాలు అంటారు.
ఉదా : చెక్క ప్లాస్టిక్.
ప్రశ్న 5.
ఉష్ణబదిలీ విధానాలు తెలపండి.
జవాబు:
ఉష్ణము మూడు విభిన్న విధానాలలో బదిలీ చేయబడుతుంది. అవి :
- ఉష్ణవహనం
- ఉష్ణ సంవహనం
- ఉష్ణ వికిరణం
ప్రశ్న 6.
చెంచాను వేడి పదార్థాలలో కాసేపు ఉంచితే అది వేడెక్కుతుంది. ఎందుకు?
జవాబు:
- ఉష్ణము ఘన వాహకాలలో ఒక చివరి నుండి మరొక చివరకు ప్రయాణిస్తుంది.
- ఈ ప్రక్రియను ఉష్ణవహనం అంటారు.
- ఉష్ణవహనం వలన వేడి నూనెలో, కూరలో, టీ లేదా వేడి పాలలో ఉంచిన చెంచా వేడెక్కుతుంది.
ప్రశ్న 7.
ఉష్ణ సంవహనం అనగానేమి?
జవాబు:
కణాల చలనం ద్వారా ఉష్ణ జనకం నుంచి ఉపరితలానికి ఉషాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఉపసంవహనం అంటారు. ఇక్కడ ఉష్ణం సంవహన ప్రవాహాలు అని పిలువబడే ప్రవాహాల ద్వారా బదిలీ చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్రవాలు మరియు వాయువులలో ఉంటుంది.
ప్రశ్న 8.
ఉష్ణవికిరణం అనగానేమి? ఇది ఎక్కడ సంభవిస్తుంది?
జవాబు:
ఉష్ణము ఎటువంటి యానకం అవసరం లేకుండా తరంగాల రూపంలో ప్రయాణించడాన్ని ఉష్ణవికిరణం అంటారు.
ఉదా : సూర్యుని నుండి వేడి వికిరణ ప్రక్రియలో భూమిని చేరుతుంది.
ప్రశ్న 9.
చలిమంట వేసుకున్నప్పుడు ఉష్ణము ఏ పద్దతిలో బదిలీ అవుతుంది?
జవాబు:
- చలిమంట వేసుకున్నప్పుడు మంటకు, వ్యక్తులకు మధ్య గాలి ఉన్నప్పటికీ అది ఉష్ణాన్ని చలిమంట నుండి క్షితిజ సమాంతరంగా బదిలీ చేయలేదు.
- గాలి ఉష్ణబంధక పదార్థం. ఇది ఉష్ణాన్ని సంవహన ప్రక్రియల ద్వారా బదిలీ చేస్తుంది.
- అంటే ఉషం చలి మంట నుండి గాలి ద్వారా పైకి వెళుతుంది కాని ప్రక్కకు కాదు.
- ఈ సందర్భంలో చలి కాచుకొంటున్న వ్యక్తులకు చలిమంట నుండి ఉష్ణము ఉష్ణవికిరణ పద్ధతిలో ప్రసరిస్తుంది.
ప్రశ్న 10.
వేడి బెలూన్లు ఎలా ఎగురుతాయి?
జవాబు:
వెచ్చని గాలి, చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి యొక్క ఈ ధర్నాన్ని వేడి గాలి బెలూను ఎగురవేయడంలో ఉపయోగిస్తారు. దీనిలో ఒక సంచి ఉంటుంది, దీనిని ఎన్వలప్ అని అంటారు. ఇది వేడి గాలితో నిండి ఉంటుంది. ఎన్వలప్ కింద ఒక బుట్ట ఉంటుంది, ఇది ప్రయాణీకులను, ఉష్ణజనకాన్ని తీసుకెళుతుంది.
ప్రశ్న 11.
ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు? అది ఏ విధంగా పని చేస్తుంది?
జవాబు:
- ఉష్ణోగ్రతను కొలవటానికి థర్మామీటరు అనే పరికరం ఉపయోగిస్తారు.
- ఇది వేడి చేయటం వలన ద్రవాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రంపై పని చేస్తాయి.
- సాధారణంగా థర్మామీటర్ల పాదరసం లేదా ఆల్కహాలను వాడతారు.
- అవసరాన్ని బట్టి వివిధ స్కేలు కల్గిన థర్మామీటర్లను వాడతారు.
ప్రశ్న 12.
ధర్మామీటర్లలో పాదరసంను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
- దీని వ్యాకోచం ఏకరీతిగా ఉంటుంది.
- ఇది మెరిసే స్వభావం కలిగి, అపారదర్శకంగా ఉంటుంది.
- ఇది గాజు గొట్టానికి అంటుకోదు.
- ఇది ఒక మంచి ఉష్ణవాహకం.
- ఇది అధిక మరుగు ఉష్ణోగ్రతను (357° C) మరియు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రతను ( 39°C) కలిగి ఉంటుంది. అందువల్ల పాదరసం ఉపయోగించి విస్తృత ఉష్ణోగ్రతలను కొలవవచ్చు.
ప్రశ్న 13.
ధర్మామీటర్ లో ఆల్కహాలును ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
- ఆల్కహాల్ యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత – 100°C కంటే తక్కువ. కాబట్టి, ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది.
- ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు దీని వ్యాకోచం ఎక్కువగా ఉంటుంది.
- దీనికి ముదురు రంగులు కలపవచ్చు. అందువల్ల సులభంగా కనిపిస్తుంది.
ప్రశ్న 14.
వివిధ ఉష్ణోగ్రత స్కేలుల మధ్య ఉన్న భేదాలు ఏమిటి?
జవాబు:
ప్రశ్న 15.
ఉష్ణోగ్రత ప్రమాణాల మార్పిడి ఎలా చేస్తావు?
జవాబు:
ఉష్ణోగ్రతలను మార్చుటకు సూత్రాలు
ప్రశ్న 16.
జ్వరమానిని గురించి రాయండి.
జవాబు:
జ్వరమానిని ఆసుపత్రులలో మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిలో రోగి నోటి నుండి బయటకు తీసినప్పుడు పాదరసం ఇగి, , బల్బులోనికి ప్రవహించకుండా నిరోధించే ఒక నొక్కు ఉంటుంది. ఈ నొక్కు ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా నమోటు చేయడానికి సహాయపడుతుంది.
ప్రశ్న 17.
ప్రయోగశాల ఉష్ణమాపకం గురించి రాయండి.
జవాబు:
ప్రయోగశాల ఉష్ణమాపకం : పాఠశాల ప్రయోగశాలలు, పరిశ్రమలు మొదలైన వాటిలో ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. దీనిలో నొక్కు ఉండదు. ఇది పొడవైన గాజు గొట్టం, పాదరస బల్బును కలిగి ఉంటుంది. అందువల్ల ఇది . జ్వరమానిని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను కొలవగలుగుతుంది.
ప్రశ్న 18.
థర్మల్ కెమెరాలు గురించి రాయండి.
జవాబు:
- ఆధునిక కెమెరాలు జీవుల శరీర ఉష్ణోగ్రతను వేడిని పసిగట్టే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి. వీటినే థర్మల్ కెమెరాలు అంటారు.
- వీటి ఆధారంగా రాత్రివేళలో, చీకటి సమయాలలో జీవులను పసిగట్టటానికి వాటి లక్షణాలను అధ్యయనం చేయటానికి వాడతారు.
- పరిసరాలలోని ఉష్ణోగ్రత మార్పులను పసిగట్టటానికి ఉపయోగిస్తారు.
- ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితిని వేడి పవనాల కదలికలను శాటిలైట్ చిత్రాలకు ఈ కెమెరాలు ఉపయోగిస్తారు.
ప్రశ్న 19.
డిజిటల్ ఉష్ణమాపకం గురించి రాయండి.
జవాబు:
డిజిటల్ ఉష్ణమాపకం పాదరసం లేకుండా పనిచేస్తుంది. ఇందులో ఉండే డిస్ప్లే మాపనాలను ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీనిని ఉపయోగించడం చాలా సులభం. దీనిపై ఉండే బటనను నొక్కడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు.
ప్రశ్న 20.
క్లినికల్ థర్మామీటరును ఎలా ఉపయోగించాలి?
జవాబు:
యాంటీసెప్టిక్ ద్రావణంతో క్లినికల్ థర్మామీటర్ని సరిగ్గా కడగండి. పాదరస స్థాయిని క్రిందకు తీసుకురావడానికి జ్వరమానిని గట్టిగా పట్టుకొని కొన్నిసార్లు విదిలించండి. 35 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు వచ్చే విధంగా చేయండి. అపుడు థర్మామీటర్‌ను ఉపయోగించవచ్చు. రీడింగులను చూసేటపుడు జ్వరమాని బల్బుని పట్టుకోవద్దు.
ప్రశ్న 21.
వాతావరణం, శీతోష్ణస్థితి మధ్య భేదాలు ఏమిటి?
జవాబు:
వాతావరణం | శీతోష్ణస్థితి |
1. ఇది ఒక్కరోజులోనే మారుతూ ఉంటుంది. | 1. ఇది చాలాకాలం పాటు ఉండే ఒక ప్రాంతం యొక్క సాధారణ వాతావరణం. |
2. మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. | 2. ఇది మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. |
3. ఇది నిర్దిష్ట ప్రాంతంలో ఒక ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు. | 3. ఇది 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పరిగణించే వాతావరణ పరిస్థితులు. |
7th Class Science 9th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఉష్ణము అనగానేమి? అది ఎన్ని రకాలుగా బదిలీ అవుతుంది?
జవాబు:
ఉష్ణము : వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రసరించే శక్తి స్వరూపం ఉష్ణము. ఇది మూడు విధాలుగా ప్రసరిస్తుంది. అవి :
1. ఉష్ణవహనము,
2. ఉష్ణసంవహనం,
3. ఉష్ణవికిరణం.
1. ఉష్ణవహనం :
ఘనరూప వాహకాలలో వేడికొన నుండి చల్లని కొనకు ఉష్ణము ప్రసరించడాన్ని ఉష్ణవహనం అంటారు.
ఉదా : కొలిమిలో ఉంచిన లోహం రెండవ కొన వేడిగా అవుతుంది.
2. ఉష్ణసంవహనం :
కణాల చలనం ద్వారా ఉష్ణజనకం నుండి ఉపరితలానికి ఉష్ణం బదిలీ కావడాన్ని ఉష్ణ సంవహనం అంటారు. ఈ ప్రక్రియ ద్రవాలు మరియు వాయువులలో జరుగుతుంది.
ఉదా : 1. వేసవిలో సరస్సు పై నీరు వేడెక్కటం.
2. నీటిని కాస్తున్నప్పుడు పై నున్న నీరు మొదట వెచ్చగా మారుతుంది.
3. ఉష్ణ వికిరణం :
ఉష్ణము తరంగ రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ఉష్ణ వికిరణం అంటారు. ఈ ప్రక్రియలో యానకం అవసరం ఉండదు.
ఉదా : 1. సూర్యుని నుండి వేడి భూమికి చేరటం.
2. థర్మల్ స్కానర్ ఉష్ణవికిరణం ఆధారంగా పనిచేస్తుంది.
ప్రశ్న 2.
ఉష్ణవికిరణం అనగానేమి? దాని అనువర్తనాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణవికిరణం :
ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ఉష్ణవికిరణం అంటారు. దీనికి యానకంతో అవసరం లేదు.
అనువర్తనాలు :
- సూర్యుని నుండి ఉష్ణము ఎటువంటి యానకం లేకుండానే భూమికి ఉష్ణవికిరణ రూపంలో చేరుతుంది.
- చలి కాచుకుంటున్నప్పుడు వేడెక్కిన గాలి పైకి కదులుతున్నప్పటికి ఉష్ణవికిరణం వలన మనం ఉష్ణం పొంది చలి కాచుకుంటున్నాము.
- థర్మల్ స్కానర్ పరికరం మన శరీరాన్ని తాకకుండానే ఉష్ణవికిరణం ప్రక్రియ ద్వారా ఉష్ణోగ్రతను కొలుస్తుంది.
- ప్రతి వేడి వస్తువు కొంత ఉష్ణాన్ని ఉష్ణవికిరణ ప్రక్రియ ద్వారా కోల్పోతూనే ఉంటుంది.
ప్రశ్న 3.
ఉష్ణవ్యాకోచము అనగానేమి? నిత్యజీవితంలో దాని అనువర్తనాలు తెలపండి.
జవాబు:
వేడిచేయటం వలన వస్తువుల పరిమాణంలో పెరుగుదల వస్తుంది. దీనినే ఉష్ణవ్యాకోచం అంటారు.
ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు ఉష్ణానికి వ్యాకోచిస్తాయి. ఈ వ్యాకోచం ఘనాల కంటే ద్రవాలలోనూ, ద్రవాలకంటే వాయువులలోనూ అధికంగా ఉంటుంది.
అనువర్తనాలు:
- రైలు పట్టాలు వ్యాకోచానికి అనుకూలంగా, రెండు పట్టాల మధ్య ఖాళీ వదులుతారు.
- ధర్మామీటర్లు వ్యాకోచ సూత్రంపై పనిచేస్తాయి.
- శీతాకాలంలో సంకోచానికి అనువుగా స్తంభాల మధ్య తీగలు వదులుగా కడతారు.
వాయువ్యాకోచం వలన పూరి నూనెలో వేసినపుడు ఉబ్బుతుంది.
ప్రశ్న 4.
ధర్మామీటరు నిర్మాణమును, దాని ఉపయోగాన్ని వివరించండి.
జవాబు:
థర్మామీటరు :
ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే పరికరాన్ని థర్మామీటరు అంటారు.
నిర్మాణము :
- ఇది మందపాటి గోడలు గల సన్నని గాజు గొట్టంతో తయారుచేయబడుతుంది.
- ఈ గొట్టం ఒక చివర పాదరసం లేదా ఆల్కహాల్ కల్గిన బల్పు ఉంటుంది.
- రెండవ చివర మూసి వేయబడి ఉంటుంది.
- గాజు గొట్టంపై స్కేలు ముద్రించబడి ఉంటుంది.
సూత్రం :
వేడికి పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రం ఆధారంగా థర్మామీటర్లు పని చేస్తాయి.
పనిచేయు విధానం :
థర్మామీటర్లను పదార్థాల మధ్య ఉంచినపుడు, ఉష్ణాన్ని గ్రహించి లోపల బల్బులో ఉన్న పాదరసం వ్యాకోచిస్తుంది. పాదరస వ్యాకోచాన్ని స్కేలు ఆధారంగా లెక్కించి ఉష్ణోగ్రతను తెలుపుతారు.
ప్రశ్న 5.
పటాన్ని పరిశీలించి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) ఈ పరికరం యొక్క పేరేమి?
జవాబు:
సిక్స్ గరిష్ట, కనిష్ట ఉష్ణమాపకము
బి) బల్బు – A లోని ద్రవపదార్థం ఏది?
జవాబు:
ఆల్కహాల్
సి) పటంలో “U” ఆకారపు గొట్టంలో ఉండే ద్రవపదార్థం ఏది?
జవాబు:
పాదరసం
డి) నిత్య జీవితంలో ఈ పరికరము ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఒక రోజులో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చును.
AP Board 7th Class Science 9th Lesson 1 Mark Bits Questions and Answers ఉష్ణం, ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. ఉష్ణప్రసరణ ఎల్లప్పుడూ …….
A) వేడి నుండి చల్లదనానికి
B) వేడి నుండి అధిక వేడికి
C) చల్లదనం నుండి వేడికి
D) చల్లదనం నుండి చల్లదనానికి
జవాబు:
A) వేడి నుండి చల్లదనానికి
2. ఉష్ణము యొక్క తీవ్రతకు ప్రమాణం కానిది
A) కెల్విన్
B) సెంటిగ్రేడ్
C) ఫారెన్హీట్
D) కెలోరి
జవాబు:
D) కెలోరి
3. ఉష్ణవాహకం కానిది గుర్తించండి.
A) రాగి
B) చెక్క
C) అల్యూమినియం
D) ఇనుము
జవాబు:
B) చెక్క
4. ఉష్ణవహన పద్ధతి కానిది
A) చెంచా వేడెక్కటం
B) దోసె పెనం వేడక్కటం
C) నీరు వేడెక్కటం
D) లోహపు పాత్ర వేడెక్కటం
జవాబు:
C) నీరు వేడెక్కటం
5. ఉష్ణ బదిలీ విధానము
A) వహనం
B) సంవహనం
C) వికిరణం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
6. ఘనపదార్థాలలో ఉష్ణ ప్రసరణ
A) వహనం
B) సంవహనం
C) వికిరణం
D) వాహకత్వం
జవాబు:
A) వహనం
7. ఉష్ణసంవహనం ప్రదర్శించునవి
A) ఘనాలు
B) ద్రవాలు మరియు వాయువులు
C) మొక్కలు
D) జంతువులు
జవాబు:
B) ద్రవాలు మరియు వాయువులు
8. ఉష్ణబదిలీని తగ్గించటానికి ఉపయోగించే పరికరము
A) కెటిల్
B) ఫ్లాస్క్
C) థర్మామీటరు
D) పాదరసం
జవాబు:
B) ఫ్లాస్క్
9. ఉష్ణము వలన పదార్థ పరిమాణం పెరగడాన్ని ఏమంటారు?
A) వ్యాకోచం
B) సంకోచం
C) సడలింపు
D) తటస్థము
జవాబు:
A) వ్యాకోచం
10. థర్మామీటర్లలో ఉపయోగించే ద్రవాలు
A) పాదరసం
B) నీరు
C) కిరోసిన్
D) నూనె
జవాబు:
A) పాదరసం
11. ఏ థర్మామీటరులో నొక్కు ఉంటుంది?
A) డిజిటల్
B) థర్మల్ స్కానర్
C) జ్వరమానిని
D) ప్రయోగశాల థర్మామీటరు
జవాబు:
C) జ్వరమానిని
12. సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకంలోని ద్రవాలు
A) పాదరసం, ఆల్కహాలు
B) నీరు, ఆల్కహాల్
C) నూనె, పాదరసం
D) నీరు, నూనె
జవాబు:
A) పాదరసం, ఆల్కహాలు
13. గాలి పీడనాన్ని దేనితో కొలుస్తారు?
A) థర్మామీటరు
B) బారోమీటరు
C) హైగ్రోమీటర్
D) హైడ్రోమీటర్
జవాబు:
B) బారోమీటరు
14. అత్యవసర పరిస్థితులలో ఆరోగ్య సహాయం కోసం చేయవలసిన ఫోన్ నెంబర్
A) 100
B) 108
C) 103
D) 102
జవాబు:
B) 108
15. మన జీవన శైలిని ప్రభావితం చేయునది
A) వాతావరణం
B) ఆర్థత
C) శీతోష్ణస్థితి
D) ఉష్ణోగ్రత
జవాబు:
C) శీతోష్ణస్థితి
16. గాలిని వేడి చేసినపుడు
A) తేలిక అవుతుంది
B) వేడెక్కుతుంది
C) వ్యాకోచిస్తుంది
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
17. థర్మల్ స్కానర్ మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణాన్ని ఏ రూపంలో గ్రహిస్తుంది?
A) ఉష్ణ వహనం
B) ఉష్ణ సంవహనం
C) ఉష్ణవికిరణం
D) పైవన్నియూ
జవాబు:
C) ఉష్ణవికిరణం
18. థర్మోస్ ఫ్లాస్క్ లోపలి వెండి పూత ఉష్ణాన్ని ఏ రూపంలో కోల్పోకుండా కాపాడుతుంది?
A) ఉష్ణ వహనం
B) ఉష్ణ సంవహనం
C) ఉష్ణవికిరణం
D) పైవన్నియూ
జవాబు:
C) ఉష్ణవికిరణం
19. ఈ కృత్యం ద్వారా మనము నిరూపించు అంశము
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
20. ఈ కృత్యము ద్వారా మనము నిరూపించు అంశం
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
21. ఈ చిత్రం ద్వారా మనము నిరూపించు అంశం.
A) ద్రవాల వ్యాకోచం మరియు సంకోచం
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
C) ఘనపదార్థాల వ్యాకోచం మరియు సంకోచం
D) ద్రవపదార్థాలలో ఉష్ణసంవహనం
జవాబు:
B) వాయువుల వ్యాకోచం మరియు సంకోచం
22. క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం
A) ఉష్ణం ఒక రకమయిన శక్తి.
B) శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది.
C) ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారమవుతుంది.
D) ఉష్టాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు.
జవాబు:
D) ఉష్టాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తారు.
23. హరి జ్వరమాని బల్బును మండుతున్న కొవ్వొత్తి దగ్గరికి తెచ్చాడు. ఏం జరిగి ఉంటుందో ఊహించండి.
1) పాదరస మట్టం పెరుగుతుంది.
2) పాదరస మట్టం తగ్గుతుంది.
3) పాదరస మట్టంలో ఏ మార్పు ఉండదు.
4) థర్మామీటర్ పగిలిపోతుంది.
A) 1 సరైనది
B) 2 సరైనది
C) 1, 4 సరైనవి
D) 3 సరైనది
జవాబు:
C) 1, 4 సరైనవి
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించే శక్తి ……………..
2. ఉష్ణము యొక్క తీవ్రతను ………… అంటారు.
3. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం ………………. .
4. సెల్సియస్, ఫారన్‌హీట్లు అనునవి ………… ప్రమాణాలు.
5. ఉష్టాన్ని ప్రసరింపజేయు ధర్మాన్ని …………. అంటారు.
6. ఉష్ణవాహకాలు ……………
7. ఘనపదార్థాలలో ఉష్ణము …………… పద్ధతిలో …………… బదిలీ అగును.
8. ఉష్ణబదిలీకి దోహదపడే పదార్థాలను ……….. అంటారు.
9. ద్రవాలు మరియు వాయువులలో ఉష్ణము ……….. పద్ధతిలో రవాణా అగును.
10. …………. పద్దతిలో యానకంతో అవసరం లేదు.
11. ఉష్ణవహన పద్దతిలో ……………… అవసరము.
12. థర్మోస్ ను కనుగొన్న శాస్త్రవేత్త ……………..
13. థర్మల్ స్కానర్ …………. ఆధారంగా పని చేస్తుంది.
14. ఫ్లాస్క్ లోపలి తలం ………… పూత కల్గి ఉంటుంది.
15. ఉష్ణం వలన పదార్థాల పరిమాణం పెరగడాన్ని …………… అంటారు.
16. వేడిగాలి చల్లని గాలికంటే ………… ఉంటుంది.
17. శరీర ఉష్ణోగ్రత కొలవటానికి ………. వాడతారు.
18. థర్మామీటరులలో ఉపయోగించే ద్రవము …………
19. పాదరసం యొక్క మరుగు ఉష్ణోగ్రత …………..
20. ఫారన్‌హీట్ స్కేలు నందు విభాగాల సంఖ్య ………..
21. పాదరసం లేకుండా ………….. ఉష్ణమాపకం పని చేస్తుంది.
22. రోజులోని గరిష్ట – కనిష్ట ఉష్ణోగ్రతలను కొలవటానికి ……………. ఉష్ణమాపకం వాడతాము.
23. సిక్స్ గరిష్ట – కనిష్ట ఉష్ణమాపకాలలో ……………. ఉపయోగిస్తారు.
24. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ………… లేదా ………………
25. గాలి పీడనాన్ని ………….. తో కొలుస్తారు.
26. గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని …………. అంటారు.
27. గాలిలో ఆర్థతను ……………… తో కొలుస్తారు.
28. వాతావరణాన్ని అధ్యయనం చేయు శాస్త్రవేత్తలు ………………….
29. 25 సంవత్సరాల వాతావరణ సగటును ………………… అంటారు.
30. ఒక ప్రాంత ప్రజల ………… శీతోష్ణస్థితి ప్రభావితం చేస్తుంది.
జవాబు:
- ఉష్ణము
- ఉష్ణోగ్రత
- కెల్విన్
- ఉష్ణోగ్రత
- ఉష్ణవాహకత్వం
- రాగి, వెండి
- వహన
- యానకాలు
- ఉష్ణసంవహన
- ఉష్ణ వికిరణ
- థార్మిక స్పర్శ
- సర్ జేమ్స్ డేవర్
- ఉష్ణవికిరణం
- వెండి
- వ్యాకోచం
- తేలికగా
- జ్వరమానిని
- పాదరసం
- 357°C
- 180
- డిజిటల్
- సిక్స్ గరిష్ట, కనిష్ట
- పాదరసం, ఆల్కహాలు
- 37°C, 98.4°F
- బారోమీటర్
- ఆర్ధత
- హైగ్రోమీటర్
- మెట్రాలజిస్టులు
- శీతోష్ణస్థితి
- జీవనశైలిని
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
A) ఉష్ణవహనం | 1) ఉష్ణాన్ని ప్రసరింపజేయటం |
B) ఉష్ణసంవహనం | 2) ఘనపదార్థాలు |
C) ఉష్ణ వికిరణం | 3) యానకం అవసరం లేదు |
D) ఉష్ణ వ్యాకోచం | 4) ద్రవాలు |
E) ఉష్ణవాహకత్వం | 5) పరిమాణం పెరగటం |
6) చల్లని పరిస్థితి |
జవాబు:
Group – A | Group – B |
A) ఉష్ణవహనం | 2) ఘనపదార్థాలు |
B) ఉష్ణసంవహనం | 4) ద్రవాలు |
C) ఉష్ణ వికిరణం | 3) యానకం అవసరం లేదు |
D) ఉష్ణ వ్యాకోచం | 5) పరిమాణం పెరగటం |
E) ఉష్ణవాహకత్వం | 1) ఉష్ణాన్ని ప్రసరింపజేయటం |
2.
Group – A | Group – B |
A) జ్వరమానిని | 1) కనిష్ట ఉష్ణోగ్రత |
B) థర్మల్ స్కానర్ | 2) శరీర ఉష్ణోగ్రత |
C) ప్రయోగశాల థర్మామీటరు | 3) ఉష్ణ వికిరణం |
D) డిజిటల్ థర్మామీటరు | 4) ఎలక్ట్రానిక్ పరికరం |
E) సిక్స్ గరిష్ట – కనిష్ట మాపకం | 5) ద్రవాల ఉష్ణోగ్రత |
జవాబు:
Group – A | Group – B |
A) జ్వరమానిని | 2) శరీర ఉష్ణోగ్రత |
B) థర్మల్ స్కానర్ | 3) ఉష్ణ వికిరణం |
C) ప్రయోగశాల థర్మామీటరు | 5) ద్రవాల ఉష్ణోగ్రత |
D) డిజిటల్ థర్మామీటరు | 4) ఎలక్ట్రానిక్ పరికరం |
E) సిక్స్ గరిష్ట – కనిష్ట మాపకం | 1) కనిష్ట ఉష్ణోగ్రత |
3.
Group – A | Group – B |
A) సెల్సియస్ | 1) ఉష్ణము |
B) ఫారన్‌హీట్ | 2) వాతావరణ పీడనం |
C) కెల్విన్ | 3) S.I ప్రమాణం |
D) కెలోరి | 4) 100 విభాగాలు |
E) సెం.మీ. (cm) | 5) 180 విభాగాలు |
జవాబు:
Group – A | Group – B |
A) సెల్సియస్ | 4) 100 విభాగాలు |
B) ఫారన్‌హీట్ | 5) 180 విభాగాలు |
C) కెల్విన్ | 3) S.I ప్రమాణం |
D) కెలోరి | 1) ఉష్ణము |
E) సెం.మీ. (cm) | 2) వాతావరణ పీడనం |
మీకు తెలుసా?
→ ఉష్ణాన్ని కెలోరీమీటర్తో కొలుస్తారు. జౌల్స్ లేదా కెలోరీలలో లెక్కిస్తారు.
→ వెచ్చని గాలి, చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి యొక్క ఈ ధర్మాన్ని వేడి గాలి బెలూన్లు ఎగురవేయడంలో ఉపయోగిస్తారు. దీనిలో ఒక సంచి ఉంటుంది, దీనిని ఎన్వలప్ అని అంటారు. ఇది వేడి గాలితో నిండి ఉంటుంది. ఎన్వలప్ కింద ఒక బుట్ట ఉంటుంది, ఇది ప్రయాణీకులను, ఉష్ణజనకాన్ని తీసుకెళుతుంది.
→ ఉష్ణోగ్రతలను మార్చుటకు సూత్రాలు
→ ఈ రోజుల్లో వేడిని పసిగట్టే విధంగా కెమెరాలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిని థర్మల్-కెమెరాలు అంటారు. ఇంటర్నెట్ నుంచి థర్మల్ కెమెరాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
→ భారతీయ వాతావరణ విభాగం (IMD) మన దేశ శీతోష్ణస్థితిపై అధ్యయనం చేస్తుంది. మార్చి 23ను ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటారు.