Students can go through AP Board 7th Class Social Notes 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం to understand and remember the concept easily.
AP Board 7th Class Social Notes 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం
→ పటాలు మన ప్రయాణాన్ని సులభతరం చేయడంతోపాటు గమ్యాన్ని చేరడంలో కచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేస్తాయి.
→ క్రీ.శ. 1498 లో వాస్కోడిగామా భారతదేశంలోని కాలికట్ చేరుకున్నాడు.
→ సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్.
→ పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంతో విలువైంది.
→ సుమేరియన్లు బాబిలోనియన్లు ‘మట్టి పలకలను’ పటాలుగా ఉపయోగించారు.
→ అక్షాంశ, రేఖాంశ భావనలను ‘గ్రీకులు’ పటాల తయారీకి అన్వయించారు.
→ పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడింది.
→ గెరార్డస్ మెర్కేటర్ ప్రవేశపెట్టిన ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకు వచ్చింది.
→ పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలుపుతుంది.
→ భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ‘స్కేలు’ తెలియజేస్తుంది.
→ స్కేలును మూడు రకాలుగా చూపవచ్చు. 1) వాక్య రూప స్కేలు, 2) గ్రాఫ్ రూపంలోని స్కేలు, 3) నైష్పత్తిక స్కేలు.
→ వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం కనుక పటాల తయారీదారులు చిహ్నాలను ఉపయోగిస్తారు.
→ భారత సర్వేక్షణ శాఖ (సర్వే ఆఫ్ ఇండియా) టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది.
→ MSL-సముద్రమట్టం నుండి ఎత్తు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో దీనిని ప్రామాణికంగా స్వీకరిస్తారు.
→ పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ‘లెజెండ్’ అంటారు.
→ ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు అక్షాంశ రేఖాంశాలు ప్రాథమిక సమాచారాన్ని ఇస్తాయి.
→ పటాలను స్కేలు, అంశాలు మరియు విషయాల ఆధారంగా రాజకీయ, భౌతిక, విషయ నిర్దేశిత మరియు చారిత్రక పటాలుగా వర్గీకరించవచ్చును.
→ ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను, రాజకీయ పటాలు తెలియజేస్తాయి.
→ భారతదేశం 3.28 మి.చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచంలో ఏడవ పెద్ద దేశంగా గుర్తించబడింది.
→ మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు.
→ భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది. అక్షాంశ రీత్యా 894-37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 6877-97°25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
→ కర్కటరేఖ భారతదేశం మధ్య గుండా పోతుంది.
→ అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను ‘గ్రిడ్’ అంటారు.
→ పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన భౌతిక స్వరూపాలకు సంబంధించిన సమాచారాలను తెలిపే పటాలను భౌతిక పటాలు అంటారు.
→ సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూరు రేఖలు అంటారు.
→ ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు.
→ టోపోగ్రాఫిక్ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలు చూపుతాయి.
→ గడచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలను ‘చారిత్రక’ పటాలు అంటారు.
→ అశోకుని శాసనాలు : బృహత్ శాసనాలు, స్తంభ శాసనాలు, చిన్న శిలా శాసనాలు.
→ గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం’ అంటారు.
→ పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు ‘డచ్’ కార్టోగ్రాఫర్ ‘గెరార్డస్ మెర్కేటర్’.
→ రెండు కాంటూరు రేఖల ధ్య గల దూరం, ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది.
→ కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది. రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఎక్కువగా ఉంటుంది.
→ రాజకీయ పటాలు : ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేసే పటాలు.
→ భౌతిక పటాలు : వివిధ భూస్వరూపాలను, నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లములతో సూచించే పటాలు భౌతిక పటాలు.
→ చారిత్రక పటాలు : గడచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలను చారిత్రక పటాలు అంటారు. ఉదా : అశోకుని శాసనాలు గల ప్రదేశాలు.
→ శీర్షిక : పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలుపుతుంది.
→ దిక్కులు : సాధారణంగా ఉత్తర దిక్కుకు పైన ఉండే విధంగా పటాలు తయారుచేయ బడతాయి. ప్రధాన దిక్కులు 4 (ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలు).
→ స్కేలు : భూమిపై కల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి కల నిష్పత్తిని స్కేలు అని పిలుస్తాం.
→ స్కేలు రకాలు :
- వాక్య రూప స్కేలు
- గ్రాఫ్ రూప స్కేలు
- నైష్పత్తిక స్కేలు.
→ సాంప్రదాయిక చిహ్నాలు : పటాల తయారీలో ఉపయోగించే కొన్ని గుర్తులు. (వీటిని సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్ తయారీలో ఉపయోగిస్తుంది).
→ నమూనా చిత్రాలు : గణాంక వివరాలను, సమాచారాన్ని, పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా చూపడానికి వీటిని ఉపయోగిస్తారు.
→ లెజెండ్ : పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక.
→ అక్షాంశ, రేఖాంశాలు : ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తాయి.
→ అట్లాస్ : పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు.
→ పటాల్లో రకాలు :
- రాజకీయ పటాలు
- భౌతిక పటాలు
- విషయ నిర్దేశిత పటాలు
- చారిత్రక పటాలు
→ విషయ నిర్దేశిత పటాలు : ఏదేని ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారుచేయబడిన పటాలు. ఉదా : అడవులను చూపే పటాలు.
→ గ్రిడ్ : అక్షాంశ, రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు.
→ కాంటూరు రేఖలు : సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలను కాంటూరు రేఖలు అంటారు.
→ ప్రక్షేపణం : గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు, ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. గెరార్డస్ మెర్కేటర్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు.
→ ఉనికి : అట్లాసుపై ఒక ప్రదేశం యొక్క అక్షాంశ, రేఖాంశాలను తెలుపును.
→ టోపోగ్రఫి : ఒక ప్రదేశంనకు సంబంధించిన భౌతిక స్వరూపాలను తెలుపునది.
→ సముద్ర మట్టం నుండి ఎత్తు (MSL) : ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో MSL (సముద్ర మట్టం నుండి ఎత్తు)ను ప్రామాణికంగా స్వీకరిస్తారు.
→ ప్రాదేశిక సమాచారం : ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సమాచారం.
→ కార్టోగ్రాఫర్ : పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్స్ అంటారు.
→ శాసనాలు : అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజ కుటుంబాలు చేసే అధికారిక ప్రకటన.
→ టోపో షీట్స్ : ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు.
→ కేంద్రపాలిత ప్రాంతాలు : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక పరిపాలన విభాగం.
→ సాంప్రదాయ చిహ్నాలు : భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు. పటంలో వీటిని వివిధ స్వరూపాలకు, అంశాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
→ సముద్రయానం : కొత్త ప్రదేశాల అన్వేషణకు సముద్ర ప్రయాణం చేయటం.
→ నీటి పారుదల : వివిధ వనరుల నుండి నీటి ప్రవాహాలు (ప్రత్యేకించి నదీ ఆధారిత ప్రవాహాలు).
1.
2.
3.
4.