AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

Students can go through AP Board 7th Class Social Notes 4th Lesson ఢిల్లీ సుల్తానులు to understand and remember the concept easily.

AP Board 7th Class Social Notes 4th Lesson ఢిల్లీ సుల్తానులు

→ క్రీ. శ. 13వ శతాబ్దము నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు.

→ గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.

→ చారిత్రక ఆధారాలను స్థూలంగా రెండు రతాలుగా వర్గీకరించారు. అవి :

  1. పురావస్తు ఆధారాలు,
  2. వాజ్మయ (లిఖిత) ఆధారాలు.

→ ప్రాచీన యుగం – క్రీ.శ. 8వ శతాబ్దం వరకు
మధ్య యుగం – క్రీ.శ. 8 నుండి 18 శతాబ్దం వరకు
ఆధునిక యుగం – క్రీ.శ. 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

→ తోమార వంశానికి చెందిన రాజపుత్రులు దిల్లిక లేదా దిల్లికాపుర (ప్రస్తుత ఢిల్లీ) నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు.

→ క్రీ.శ. 1192వ సంవత్సరంలో మహ్మద్ ఘోరి రెండవ తతాయివ్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.

→ మహ్మద్ ఘోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీ. శ. 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ మొదట లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఐబక్ స్థాపించాడు.

→ ఇల్ టుట్ మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడినది.

→ ఇల్ టుట్ మిష్ ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు.

→ ఇల్ టుట్ మిష్ తరువాత ఇతని కుమార్తె రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించారు.

→ బానిస వంశ పరిపాలన ‘కైకుబాదు’ కాలంలో ముగిసింది.

→ సుల్తానా రజియా (1236 – 1239) ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ.

→ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ (1296- 1316) గూఢచారి వ్యవస్థను స్థాపించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణల్లో భాగంగా వస్తువుల ధరను క్రమబద్ధీకరించాడు.

→ అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

→ చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు.

→ మంగోలులు క్రీ.శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

→ ఖిల్జీలలో చివరి పాలకుడైన ‘ఖుస్రూ’ పాలనను అంతం చేసి ఘియాసుద్దీన్ తుగ్లక్, తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు.

→ మహ్మద్ బీన్ తుగ్లక్ (1324-1351) రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి (దౌలతాబాద్)కి మార్చాడు. రాగి నాణాలు ముద్రించాడు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్.

→ సయ్యద్ వంశ చివరి పాలకుడు ఆలమ్ షా బహలాల్ చేతిలో ఓడిపోవటంతో లోడి వంశ పాలన సంక్రమించింది. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని మొఘల్ వంశస్థుడైన బాబర్ ఓడించి, భారతదేశంలో మొఘల్ వంశ స్థాపన చేసాడు.

→ తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ. శ. 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో సుల్తాన్ సర్వాధికారి.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది.

→ రాజ్యాన్ని ఇకాలు, పరగణాలు, షికు మరియు గ్రామాలుగా విభజించారు.

→ గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు.

→ ఇల్ టుట్ మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని ‘బందగాన్’ అని పిలుస్తారు.

→ ఇల్ టుట్ మిష్ కాలంలో చిహల్ గని సర్దారులు కీలక పాత్ర పోషించారు.

→ పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థనే తుర్కాన్-ఇ-చిహల్ గని లేదా చాలీసా అనేవారు.

→ ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇకాలుగా విభజించారు.

→ ఇక్తా సైనికాధికారులను ఇక్తాదార్లు లేదా ముకీలు అంటారు.

→ ఇక్తాదార్ పదవి వారసత్వముగా ఉండేది కాదు, తరచుగా బదిలీలు ఉండేవి.

→ వ్యవసాయము ప్రధాన వృత్తి. 1/3వ వంతు శిస్తు చెల్లించాలి.

→ పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు మొదలైనవి ప్రధాన ఎగుమతులు.

→ టంకా (వెండి), జిటాల్ (రాగి) నాణేలు ప్రామాణిక నాణేలుగా వాడుకలో ఉండేవి.

→ ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి.

→ స్వదేశీ నిర్మాణాలలో ట్రూబీట్ పద్ధతి తర్వాత అర్క్యుట్ పద్ధతి ప్రవేశపెట్టబడింది.

→ కుతుబ్ మినార్‌ను కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు ఆవరణలో నిర్మించారు.

→ కుతుబ్ మినారను కుతుబుద్దీన్ ఐబక్, ఇల్ టుట్ మిషన్లు కట్టించి సూఫి సన్యాసి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితం ఇచ్చారు.

→ అలైదర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ కువ్వత్-ఉల్-ఇస్లామ్ మసీదుకు దక్షిణ ద్వారం వలే నిర్మించాడు.

→ తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని అల్ బెరూని రచించాడు.

→ అమీర్ ఖుస్రూ అనేక ద్విపద పద్యాలు రచించాడు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ అమీర్ ఖుస్రూకు భారతదేశపు చిలుక (టుటి-ఐ-హింద్) అనే బిరుదు కలదు.

→ 1398 తైమూరు దండయాత్రలలో దేశ సంపదని తరలించి వేశారు.

→ క్రీ.శ. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు.

→ బానిస వంశం-కుతుబుద్దీన్ ఐబక్ స్థాపకుడు, కాలం : 1206-1290

→ ఖిల్జీ వంశం-జలాలుద్దీన్ ఖిల్జీ స్థాపకుడు, కాలం : 1290-1320

→ తుగ్లక్ వంశం-ఘియాజుద్దీన్ తుగ్లక్ స్థాపకుడు, కాలం : 1321-1414

→ సయ్యద్ వంశం-కిజరిన్ స్థాపకుడు, కాలం : 1414-1451

→ లోడి వంశం-బహలాల్ లోడి స్థాపకుడు, కాలం : 1451-1526

→ చరిత్ర : గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.

→ పురావస్తు ఆధారాలు : పురావస్తు సముదాయములైన (నాణాలు, శాసనాలు, స్మారకాలు, కళాఖండములు) ప్రాచీన నాగరికతా అవశేష సంపద.

→ వాజ్మయ ఆధారాలు : లిఖిత ఆధారాలు, సాహిత్య (సారస్వత) ఆధారాలు.

→ ప్రాచీన యుగం : 8వ శతాబ్దం వరకు

→ మధ్య యుగం : 8 నుండి 18వ శతాబ్దం వరకు

→ ఆధునిక యుగం : 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

→ వజీరులు : ఢిల్లీ సుల్తానుల మంత్రులు

→ సంచార జాతులు : ‘ఒక చోట స్థిర నివాసం ఏర్పరుచుకోని జాతులు. నిరంతరం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటివారు.

→ సుల్తాన్ : రాజ్యంలో సర్వాధికారి (రాజు).

→ చిహల్గని : పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థ. దీనిని ఇల్ టుట్ మిష్ ప్రారంభించాడు.

→ బందగాన్ : సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని పర్షియాలో బందగాన్ అంటారు.

→ ఇక్షాలు : ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలు.

→ ఇక్టాదార్ (ముక్తీలు) : ఇకాల యొక్క సైనికాధికారులు.

AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు

→ ట్రూబీట్ శైలి : రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారుచేయబడేవి.

→ ఆర్క్యుట్ శైలి : తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయునట్లుగా ఆర్చి నిర్మాణం ఉంటుంది.

→ రాజవంశం : వారసత్వంగా వచ్చే పాలకుల పరంపర.

→ ప్రకటన : అధికారికంగా వెల్లడి చేసిన సమాచారం.

→ దోహాలు : రెండు పంక్తులలో వ్రాయబడిన పద్యాలు. వీటిలో పాదంలోని పదాలు, లయ దాదాపు సమానంగా ఉంటాయి.

→ కార్యానా : పరిశ్రమలు / కార్యశాలలు

→ షరియత్ : ఇస్లాం న్యాయ సూత్రాలు

1.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 1

2.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 2

3.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 3

4.
AP 7th Class Social Notes Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4