These AP 7th Class Telugu Important Questions 7th Lesson శిల్పి will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 7th Lesson Important Questions and Answers శిల్పి
7th Class Telugu 7th Lesson శిల్పి Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
కింది షరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్థకము గాని యెన్ని పాషాణములకు
గలిగే నీనాడు పసుపు గుంకాల పూజ!
ప్రశ్నలు – జవాబులు:
అ) – చేతి సుత్తె ఎటువంటిది? ఆ చేయి ఎవరిది?
జవాబు:
చేతి సుత్తె సున్నితమైనది. ఆ చేయి శిల్పిది.
ఆ) శిల్పి సుత్తె నుండి ఏవి బయటకు వచ్చాయి?
జవాబు:
శిల్పి సుత్తి నుండి ఎన్నో ఎన్నో దేవస్థలాలు (దేవాలయాలు) బయటకు వచ్చాయి.
ఇ) వ్యర్ధమైన పాషాణములకు నేడు ఏమి లభించింది?
జవాబు:
సార్థకము కాని పాషాణాలకు, పసుపు కుంకుమల పూజ లభించింది.
ఈ) ఈ పద్య రచయిత ఎవరు? ఇది ఏ పాఠం లోనిది?
జవాబు:
ఈ పద్య రచయిత గుర్రం జాషువ. ఇది ‘శిల్పి’ పాఠంలోనిది.
2. “ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత;
గవనమునఁ జిత్రములు గూర్చు కవికి నీకుఁ
దారతమ్యంబు లే దబద్దంబు గాదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) శిల్పి ప్రతిమను రూపుదిద్ది ఎవరి చరిత్రను చెప్పగలడు?
జవాబు:
శిల్పి ప్రతిమను రూపుదిద్ది, మహారాజు చరిత్రను చెప్పగలడు.
ఆ) కవనం చేసేది ఎవరు?
జవాబు:
కవనము చేసేది కవి.
ఇ) ఎవరెవరి మధ్య తారతమ్యం లేదు?
జవాబు:
కవికి, శిల్పికి మధ్య తారతమ్యం లేదు.
ఈ) ఈ పద్యం ఎవరి గొప్పతనాన్ని గురించి చెప్పింది?
జవాబు:
ఈ పద్యం శిల్పి గొప్పతనాన్ని చెపుతోంది.
3. ఱాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని సోకించి బయటికిఁ బిలిచినావు;
వెలికి రానేర్చి నీ పేరు నిలపకున్నె
శాశ్వతుడ వోయి నీవు నిశ్చయముగాను.
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘శాశ్వతుడవోయి నీవు’ – ఆ శాశ్వతుడు ఎవరు?
జవాబు:
శిల్పి శాశ్వతుడు. అంటే చిరంజీవి.
ఆ) ప్రతిమలు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
ప్రతిమలు రాళ్ళల్లో నిద్రిస్తూ ఉంటాయి.
ఇ) శిల్పి నిద్రించే ప్రతిమలను ఏమి చేస్తాడు?
జవాబు:
శిల్పి నిద్రించే ప్రతిమలను మేలుకొలుపుతాడు.
ఈ) శిల్పి ప్రతిమలను ఎలా బయటికి పిలుస్తాడు?
జవాబు:
శిల్పి తన ఉలిని రాళ్ళకు సోకించి, ప్రతిమలను బయటకు పిలుస్తాడు.
4. “కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయినఁ బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు?
ప్రశ్నలు – జవాబులు :
అ) కవి కలంలో ఏముంది?
జవాబు:
కవి కలంలో అలంకార రచన ఉంది.
ఆ) కవి వద్ద గల అలంకార రచన, శిల్పి వద్ద ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కవి కలంలోని అలంకార రచన, శిల్పి ఉలి ముఖంలో ఉంది.
ఇ) శిల్పి దేనికి కుసుమవల్లరులు గ్రుచ్చాడు?
జవాబు:
ఱాతి కంబములకు శిల్పి కుసుమవల్లరులు గ్రుచ్చాడు.
ఈ) “పూలగుత్తులు ఎలా గుచ్చావు.” అనే భావం గల పంక్తి ఏది?
జవాబు:
‘కుసుమ వల్లరు లేరీతి గ్రుచ్చినావు” అనే పంక్తి, పై భావాన్ని ఇస్తుంది.
5. ఈ కింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింపగలవు చూపరులచేత;
గవనమునఁ జిత్రములు గూర్చు కవికి నీకుఁ
దారతమ్యంబు లే దబద్దంబు గాదు.
ప్రశ్నలు – జవాబులు:
1. ప్రతిమలు రచించి శిల్పి ఎవరి చరితను చెప్పగలడు?
జవాబు:
మహారాజు చరిత్ర చెప్పగలడు.
2. శిల్పి చూపరుల చేత ఏమి చేయించగలడు?
జవాబు:
రాజు చరిత్రను (శిల్పాన్ని చూడగానే) చూపరులు చెప్పగలరు.
3. శిల్పికి, ఎవరికి తారతమ్యం లేదు?
జవాబు:
శిల్పికి, కవికి తారతమ్యం లేదు.
4. ఈ పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చెయ్యండి..
జవాబు:
ఈ పద్యం ఎవరి గొప్పతనాన్ని గురించి చెప్పింది?
ఈ క్రింది అపరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిల
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ !
ప్రశ్నలు :
అ) ఎప్పుడు అబద్దమాడకూడదు?
జవాబు:
రూఢి చేసి మాట్లాడిన తరువాత అబద్ద మాడకూడదు.
ఆ) ఎవరికి కీడు చేయకూడదు?
జవాబు:
సహాయముగా ఉండెడి బంధువులకు కీడు చేయ కూడదు.
ఇ) ఎటువంటి రాజును సేవింపకూడదు?
జవాబు:
కోపించే రాజును సేవింపకూడదు.
ఈ) ఎటువంటి దేశానికి వెళ్ళకూడదు?
జవాబు:
పాపాత్ములుండే దేశానికి వెళ్ళకూడదు.
2. అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు.
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు:
అ) దానములన్నింటి కన్నా ఏ దానము గొప్పది?
జవాబు:
దానములన్నింటి కన్నా అన్నదానమే గొప్పది.
ఆ) ఎవరి కంటే మించినది లేదు?
జవాబు:
కన్నతల్లి కంటే మించినది లేదు.
ఇ) ఎవరికన్న మించిన వ్యక్తి లేడు?
జవాబు:
గురువు కంటే మించిన వ్యక్తి లేడు.
ఈ) ఈ పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.
3. చెప్పకు చేసిన మేలు నొ
కప్పు డుయినఁ గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలఁపు కుమారీ !
ప్రశ్నలు :
అ) ఏమి చెప్పరాదు?
జవాబు:
చేసిన మేలు పరులకు చెప్పరాదు.
ఆ) చెప్పిన ఏమగును?
జవాబు:
అలా చెప్పిన ఎవరూ సంతోషించరు.
ఇ) ఏమి చెప్పకూడదు?
జవాబు:
గొప్పలు చెప్పకూడదు.
ఈ) గొప్పలు చెప్పటం వలన ఏమి జరుగును?
జవాబు:
చేసిన పుణ్యము అంతయూ ‘పోవును.
4. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు:
అ) దుష్టుడు ఎలా మాట్లాడతాడు?
జవాబు:
దుష్టుడు ఆడంబరంగా, ఆర్భాటంగా మాట్లాడుతాడు.
ఆ) ఎవరి పల్కు చల్లగా ఉంటుంది?
జవాబు:
మంచివాని పలుకు చల్లగా ఉంటుంది.
ఇ) కంచు ఎలా మోగుతుంది?
జవాబు:
కంచు ఖంగున మ్రోగుతుంది.
ఈ) బంగారం ఎలా మ్రోగదు?
జవాబు:
కంచులా బంగారం ఖంగున మ్రోగదు.
5. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిత్రలేఖనము, సంగీతము, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకొనే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనులవిందుగా ఉండే గానకళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనసుకు అందించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.
ప్రశ్నలు:
1. వేటిని లలిత కళలు అంటారు?
జవాబు:
చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు.
2. కవిత్వం ప్రత్యేకత ఏమిటో తెల్పండి.
జవాబు:
మనసుకు ఉల్లాసం కల్గించే మాటలు.
3. వీనులవిందుగా ఉండే కళ ఏది?
జవాబు:
గానకళ సంగీతం
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రాగ, తాళ, లయలకు తగినట్లు అభినయం చేయడం ఏ కళ?
6. ఈ కింది లేఖను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
జవాబు:
పెదపాడు, ప్రియ మిత్రుడు త్రివేదికి, నీ మిత్రుడు గంగాధర్ రాయునది. ఉభయకుశలోపరి. నేను ఈ మధ్యన సంక్రాంతి సెలవులలో మా బంధువుల ఇంటికి నంద్యాల వెళ్ళాను. అక్కడ బెలుంగుహలు చూశాను. సాధారణంగా గుహలు భూ ఉపరితలంపై కొండలలో ఉంటాయి. కానీ, విచిత్రం ! ఈ గుహలు భూ అట్టడుగు పొరల్లో ఏర్పడ్డాయి. మేము గుహల దగ్గరకు వెళ్ళాక అక్కడ ఉన్న గైడ్ గుహలలోనకు దింపి ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయో, వాటి విశిష్టతను వివరించాడు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలేమో చాలా అందంగా ఉన్నాయి. వాటి సందర్శనం నాకు అద్భుతమైన అనుభూతిని అందించింది. నువ్వేమన్నా సెలవుల్లో చూస్తే రాయి. ఇట్లు చిరునామా : |
ప్రశ్నలు:
1. పై లేఖ ఎవరు ఎవరికి రాశారు?
జవాబు:
గంగాధర్ త్రివేదికి రాశారు.
2. బెలుంగుహలు ఎక్కడ ఏర్పడ్డాయి?
జవాబు:
నంద్యా లలో
3. సందర్శనం అంటే నీవేమనుకుంటున్నావు?
జవాబు:
‘సమ్యక్ దర్శనం’ సందర్శనం. అంటే చక్కగా చూడటం. ప్రతిదీ ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ చూడటమే సందర్శనం.
4. పై లేఖ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
గుహల విశిష్టత వివరించినదెవరు?
7th Class Telugu 7th Lesson శిల్పి 1 Mark Bits
1. ప్రతి మనిషికి ఏదో ఒక అంశంలో ప్రజ్ఞ ఉంటుంది. (అర్థాన్ని గుర్తించండి)
ఎ) కవిత
బి) ప్రతిభ
సి) అందం
డి) బంధం
జవాబు:
బి) ప్రతిభ
2. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. (సంధి విడదీయండి)
ఎ) స్వా + తంత్ర + ఉద్యమం
బి) స్వాతం + ఉద్యమం
సి) స్వాతంత్ర్య + ఉద్యమం
డి) స్వతంత్ర + ఉద్యమం
జవాబు:
సి) స్వాతంత్ర్య + ఉద్యమం
3. దేవాలయానికి వెళితే పున్నెం వస్తుందని భక్తుల నమ్మకం. (ప్రకృతిని గుర్తించండి)
ఎ) పాపం
బి) బస్సు
సి) పుణ్యం
డి) వాన
జవాబు:
సి) పుణ్యం
4. పూర్వ కవులలో రవీంద్రుడు గొప్పవాడు (సంధిని గుర్తించండి)
ఎ) గుణసంధి
బి) వృద్ధి సంధి
సి) యణాదేశసంధి
డి) సవర్ణదీర్ఘసంధి
జవాబు:
డి) సవర్ణదీర్ఘసంధి
5. పేదలకు సహాయం చేయడం పున్నెం (ప్రకృతి పదం గుర్తించండి)
ఎ) పున్నం
బి) పున్నమి
సి) పుణ్యం
డి) పున్నామం
జవాబు:
సి) పుణ్యం
6. “అకారమునకు ఇ, ఉ, ఋ అనే అక్షరాలు పరమైతే క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఆదేశంగా వస్తాయి.” ఇది ఏ సంధి సూత్రం?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) యణాదేశ సంధి
సి) గుణ సంధి
డి) వృద్ధి సంధి
జవాబు:
సి) గుణ సంధి
7. భయద సింహముల తలలు (అర్ధాన్ని గుర్తించండి)
ఎ) సంతోషం కలిగించే
బి) వికారం కలిగించే
సి) భయం కలిగించే
డి) అభయాన్నిచ్చే
జవాబు:
సి) భయం కలిగించే
8. పరోపకారం చేయుట అలవాటు చేసుకోవాలి. (విడదీయండి)
ఎ) పరు + ఉపకారం
బి) పరా + ఉపకారం
సి) పర + ఊపకారం
డి) పర + ఉపకారం
జవాబు:
డి) పర + ఉపకారం
III. భాషాంశాలు
పదాలు – అర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థం గుర్తించండి.
9. చేపల పాషాణము లందు శిల్పి జీవకళ నిలు గలడు.
ఎ) ఉలి
బి) బండరాయి
సి) చెక్కడం
డి) శిల్పి
జవాబు:
బి) బండరాయి
10. హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్.
ఎ) ఏనుగులు
బి) శిలలు
సి) గుహలు
డి) సింహాలు
జవాబు:
డి) సింహాలు
11. శిల్పి కంఠీరవం ప్రజ్ఞ అసామాన్యము.
ఎ) పులి
బి) వ్యాఘ్రము
సి) సింహం
డి) ఏనుగు
జవాబు:
సి) సింహం
12. దేవుడికి కుసుమముల మాల సమర్పించాలి.
ఎ) పూవు
బి) తామర పుష్పము
సి) పద్మము
డి) రత్నము
జవాబు:
ఎ) పూవు
13. వసుధపై ధర్మం ఉండాలి.
ఎ) బంధి
బి) వారధి
సి) భూమి
డి) తరంగిణి
జవాబు:
సి) భూమి
14. సింహం గహ్వరంలో ఉంది.
ఎ) సదనం
బి) గృహం
సి) గేహం
డి) గుహ
జవాబు:
డి) గుహ
15. లతా వల్లరి పై మరువం ఉంది.
ఎ) తీగ
బి) కొమ్మ
సి) పత్రం
డి) కుసుమం
జవాబు:
ఎ) తీగ
16. పడతి వంద్యురాలు.
ఎ) ధరణి
బి) స్త్రీ
సి) చెలిమి
డి) కలిమి
జవాబు:
బి) స్త్రీ
17. చిత్తం నిర్మలంగా ఉండాలి.
ఎ) ఉషస్సు
బి) ప్రేయస్సు
సి) వచస్సు
డి) మనస్సు
జవాబు:
డి) మనస్సు
18. సత్యాన్ని తలంచి పలకాలి.
ఎ) మందంగా
బి) త్వరగా
సి) ఆలోచించి
డి) గమనంగా
జవాబు:
సి) ఆలోచించి
పర్యాయపదాలు :
సూచన : క్రింద గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి.
19. శిలలపై చెక్కిన శిల్పాలే దేవాలయాలు అయ్యాయి.
ఎ) పాషాణము, ఉలి
బి) రాయి, సుత్తి
సి) రాయి, పాషాణము
డి) సుత్తి, శిల
జవాబు:
సి) రాయి, పాషాణము
20. మలచినాడవు భయద సింహముల తలలు.
ఎ) కంఠీరవము, సింగము
బి) మృగరాజు, గజము
సి) పులి, సింహము.
డి) మృగేంద్రము, శ్వాపదము
జవాబు:
ఎ) కంఠీరవము, సింగము
21. లేమితో భరింపరాదు.
ఎ) ధనం, సంపద
బి) పేదరికం, దారిద్ర్యం
సి) చాతుర్యం, లేక
డి) శిల, ఛాయ
జవాబు:
బి) పేదరికం, దారిద్ర్యం
22. తారతమ్యం చూపవద్దు.
ఎ) అందరం, ఆనందం
బి) ఆహ్లాదం, ఆయుర్దాయం
సి) తేడా, భేదం
డి) ఆనందం, అకృతం
జవాబు:
సి) తేడా, భేదం
23. తలపై పూలు ధరించాలి.
ఎ) సునిత, ప్రణయ
బి) మమత, సమత
సి) సురవి, ప్రణవి
డి) శిరస్సు, మస్తకం
జవాబు:
డి) శిరస్సు, మస్తకం
24. ప్రతిమను పూజించాలి.
ఎ) నైపుణ్యం, నాశనం
బి) విగ్రహం, ప్రతిచ్చాయ
సి) కుసుమం, కాసారం
డి) విషాదం, విచారం
జవాబు:
బి) విగ్రహం, ప్రతిచ్చాయ
25. సింహం విహరించింది.
ఎ) పుండరీకం, వృషభం
బి) శృగాలం, చిహ్నం
సి) జలధి, మయూరం
డి) కేసరి, పంచాస్యం
జవాబు:
డి) కేసరి, పంచాస్యం
26. వసుధపై రత్నరాశులు ఉన్నాయి.
ఎ) సర్వంసహ, ధాత
బి) ధరణి, సరి
సి) పటలి, జటిల
డి) భూమి, మేదిని
జవాబు:
డి) భూమి, మేదిని
ప్రకృతి – వికృతులు :
27. సింగం బావిలో తన మొహాన్ని చూసుకుంది – గీత గీసిన పదం ప్రకృతిని గుర్తించండి.
ఎ) మృగము
బి) సింగము
సి) సింహము
డి) కంఠీరవము
జవాబు:
సి) సింహము
28. ఱాతి కంబములపై కుసుమవల్లరులు గ్రుచ్చావు మతి గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
ఎ) తంబము
బి) కంభం
సి) స్తంభము
డి) తంబము
జవాబు:
సి) స్తంభము
29. దేవేంద్రుడు అప్సరసల నాట్యం తిలకిస్తున్నాడు – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) అప్సరస
బి) అచ్చర
సి) అప్సర
డి) అత్సర
జవాబు:
బి) అచ్చర
30. నేను చిత్రము చూస్తున్నాను – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) చిత్తరువు
బి) చిత్రం
సి) చిత్తరం
డి) విచిత్రం
జవాబు:
ఎ) చిత్తరువు
31. ప్రజ్ఞ ప్రదర్శించాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) ప్రజన
బి) పగ్గె
సి) ప్రెజన్
డి) ప్రజన్
జవాబు:
బి) పగ్గి
32. దవీయంగా ఉన్నాను – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) దావ
బి) దీవి
సి) దవ్వు
డి) దేవ
జవాబు:
సి) దవ్వు
33. స్థలంలో నేను ఉన్నాను – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) తేరం
బి) తల
సి) తీరం
డి) తాలం
జవాబు:
బి) తల
34. అందరు విద్య నేర్వాలి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది?
ఎ) విద్దె
బి) విదెయ
సి) విదియ
డి) వదియ
జవాబు:
ఎ) విద్దె
35. మొగము కడగాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) మగము
బి) మఖము
సి) ముఖము
డి) మొఖము
జవాబు:
సి) ముఖము
36. సంతసం వెల్లివిరియాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) షంతోషం
బి) సంతోషం
సి) సంబరం
డి) సంతోసం
జవాబు:
బి) సంతోషం
వ్యతిరేకపదాలు
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
37. నీ లేమి తలంచి కంటతడి పెట్టున్.
ఎ) బలిమి
బి) కలిమి
సి) చెలిమి
డి) తాలిమి
జవాబు:
బి) కలిమి
38. తారతమ్యంబు లేదు అబద్దంబు గాదు.
ఎ) కల్ల
బి) నిజము
సి) అసత్యం
డి) నిశ్శబ్దం
జవాబు:
బి) నిజము
39. బాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి.
ఎ) నిద్రించి
బి) లేపి
సి) జోకొట్టి
డి) నిద్రపుచ్చి
జవాబు:
డి) నిద్రపుచ్చి
40. శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను.
ఎ) అస్థిరుడు
బి) అశాశ్వతం
సి) అశాశ్వతుడు
డి) నిశ్చితుడు
జవాబు:
సి) అశాశ్వతుడు
41. ప్రజలంతా సంతోషం పొందాలి.
ఎ) విశ్రాంతి
బి) విరామం
సి) వినోదం
డి) విచారం
జవాబు:
డి) విచారం
42. ఎత్తుగా చెట్టు ఉంది.
ఎ) కాఫారు
బి) పల్లం
సి) మధ్యమం
డి) కింద
జవాబు:
బి) పల్లం
43. స్వాతంత్ర్యం పొందాలి.
ఎ) పారంపర్యం
బి) పరమార్థం
సి) పారతంత్ర్యం
డి) దుశ్చర్యం
జవాబు:
బి) పరమార్థం
44. సమాజానికి దూరంగా ఉన్నారు.
ఎ) దగ్గర
బి) దుర్గతి
సి) దురంతం
డి) దుర్నీతీ
జవాబు:
ఎ) దగ్గర
45. జనాభాల్లో వెలుగు నిండాలి.
ఎ) ప్రకాశం
బి) చీకటి
సి) ప్రతాపం
డి) పౌరుషం
జవాబు:
బి) చీకటి
46. ప్రజలు శాంతిని కోరాలి.
ఎ) అనుశాంతి
బి) నిశాంతి
సి) ప్రశాంతి
డి) అశాంతి
జవాబు:
డి) అశాంతి
సంధులు:
47. ‘మహేంద్రుడు’ – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వసంధి
సి) గుణసంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
సి) గుణసంధి
48. విశ్వామిత్రుడు మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు – గీత గీసిన పదం విడదీయండి.
ఎ) మహ + ర్షి
బి) మహా + రిషి
సి) మహా + ఋషి
డి) మహ + ఋషి
జవాబు:
సి) మహా + ఋషి
49. ‘కిరీటాకృతి‘ – పదాన్ని విడదీయండి.
ఎ) కిరీట + అకృతి
బి) కిరీట + ఆకృతి
సి) కిరీటా + కృతి
డి) కిరీ + టాకృతి
జవాబు:
బి) కిరీట + ఆకృతి
50. రాజేంద్రుడు రాజ్యం పాలించాడు – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) వృద్ధి సంధి
సి) యణాదేశ సంధి
డి) గుణసంధి
జవాబు:
డి) గుణసంధి
51. భక్తులు రామేశ్వరం వెళ్ళారు – గీత గీసిన పదం విడదీయండి.
ఎ) రామ + ఈశ్వరం
బి) రామ + ఈశ్వరం
సి) రామే + శ్వరం
డి) రామే + ఈశ్వరం
జవాబు:
బి) రామ + ఈశ్వరం
52. సంధుల్లో గుణాలు అనగా
ఎ) ఆ, ఈ, ఏ
బి) ఇ, ఉ, ఋ
సి) ఈ, ఐ, వి
డి) ఏ, ఓ, అర్
జవాబు:
డి) ఏ, ఓ, అర్
53. స్వాతంత్ర్యోద్యమం ఘనంగా జరిగింది – ఇది ఏ సంధి?
ఎ) ఇత్వసంధి
బి) గుణసంధి
సి) త్రికసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) గుణసంధి
54. రాతియందు ఉన్నది – ఇది ఏ సంధి?
ఎ) యడాగమసంధి
బి) త్రికసంధి
సి) ఉత్వసంధి
డి) ఇత్వసంధి
జవాబు:
ఎ) యడాగమసంధి
సమాసాలు :
55. ‘పసుపు గుంకాలతో పూజించాము’ – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) బహుబ్లీహి సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం
56. ‘విద్యానిధి’ – సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) విద్య చేత నిధి
బి) విద్య వలన నిధి
సి) విద్యల యందు నిధి
డి) విద్యకు నిధి
జవాబు:
సి) విద్యల యందు నిధి
57. పూర్వపదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) తత్పురుష
బి) అవ్యయీ భావం
సి) బహువ్రీహి
డి) కర్మధారయం
జవాబు:
బి) అవ్యయీ భావం
58. క్రింది వానిలో షష్ఠీ తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) కవికలము
బి) విద్యారంభం
సి) ఆంధ్రశ్రీ
డి) తల్లిదండ్రులు
జవాబు:
ఎ) కవికలము
59. కిరీటాకృతి మనోహరం – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) కిరీటం కొరకు ఆకృతి
బి) కిరీటమైన ఆకృతి
సి) కిరీటము యొక్క ఆకృతి
డి) కిరీటంతో ఆకృతి
జవాబు:
సి) కిరీటము యొక్క ఆకృతి
60. గహ్వరముల యొక్క శ్రేణి – దీనిలో సమాసపదం ఏది?
ఎ) గహ్వయ శ్రేణి
బి) శ్రేణీ గహ్వరం
సి) శ్రేణీయ గహ్వరం
డి) గహ్వర శ్రేణి
జవాబు:
డి) గహ్వర శ్రేణి
61. ఉలిముఖం నయన మనోహరంగా ఉంది – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) చతుర్డీ తత్పురుష
బి) షష్ఠీ తత్పురుష
సి) అవ్యయీభావము
డి) పంచమీ తత్పురుష
జవాబు:
బి) షష్ఠీ తత్పురుష
62. శిల్పజగము – ఇది ఏ సమాసం?
ఎ) కర్మధారయం
బి) అవ్యయీభావం
సి) షష్ఠీ తత్పురుష
డి) చతుర్థి తత్పురుష
జవాబు:
సి) షష్ఠీ తత్పురుష
వాక్య ప్రయోగాలు :
63. నగరం అందంగా ఉంది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) నగరం అందంగా ఉండవచ్చు
బి) నగరం అందంగా ఉండకూడదు
సి) నగరం అందంగా లేదు
డి) నగరం అందంగా ఉండితీరాలి
జవాబు:
సి) నగరం అందంగా లేదు
64. అర్జునుడు యుద్ధం చేసినాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తద్ధర్మార్థక వాక్యం
బి) అభ్యర్థక వాక్యం
సి) నిషేధార్థక వాక్యం
డి) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
డి) సామర్థ్యార్థక వాక్యం
65. పాలు తెలగా ఉండును – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) కర్మణ్యర్థక వాక్యం
డి) అభ్యర్థక వాక్యం
జవాబు:
బి) తద్ధర్మార్థక వాక్యం
66. చేదర్థకం అనగా
ఎ) భవిష్యత్కాల అసమాపక క్రియ
బి) వర్తమానకాల సమాపక క్రియ
సి) భవిష్యత్కాల సమాపక క్రియ
డి) భూతకాల అసమాపక క్రియ
జవాబు:
ఎ) భవిష్యత్కాల అసమాపక క్రియ
67. బాగా చదివితే మార్కులు వస్తాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థకం
బి) చేదర్థకం
సి) ధాత్వర్థకం
డి) శత్రర్థకం
జవాబు:
బి) చేదర్థకం
68. అమ్మ అన్నం వండి నిద్రపోయింది – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) తుమున్నరక వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) సంక్లిష్ట వాక్యం
డి) కర్మణి వాక్యం
జవాబు:
సి) సంక్లిష్ట వాక్యం
69. దయతో నన్ను అనుమతించండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిశ్చయార్థకం
బి) ఆత్మర్థకం
సి) నిషేధార్థకం
డి) ప్రార్థనార్థకం
జవాబు:
డి) ప్రార్థనార్థకం
70. క్రింది వాటిలో ప్రథమా విభక్తి ప్రత్యయం గుర్తించండి.
ఎ) కి
బి) వు
సి) వలన
డి) ని
జవాబు:
బి) వు
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :
71. అందు, న – ఇవి ఏ విభక్తి ప్రత్యయాలు?
ఎ) ద్వితీయ
బి) సప్తమీ
సి) చతుర్డీ
డి) సంభావన ప్రథమ
జవాబు:
బి) సప్తమీ
72. వారు అల్లరి చేశారు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) ప్రత్యయం
బి) నామవాచకం
సి) క్రియ
డి) విశేషణం
జవాబు:
సి) క్రియ
73. పవిత్ర ఆశయంతో మెలగాలి – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) అవ్యయం
బి) విశేషణం
సి) నామవాచకం
డి) క్రియ
జవాబు:
బి) విశేషణం
74. నేను ఉన్నంత కాలం – గీత గీసిన పదం ఏ పురుషకు చెందినది?
ఎ) ప్రథమ పురుష
బి) అధమ పురుష
సి) మధ్యమ పురుష
డి) ఉత్తమ పురుష
జవాబు:
డి) ఉత్తమ పురుష
75. క్రింది వానిలో మధ్యమ పురుషకు చెందిన పదం గుర్తించండి.
ఎ) నేను
బి) ఆమె
సి) నీవు
డి) వారు
జవాబు:
సి) నీవు
76. రాముడు శిల్పం చెక్కాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) నామవాచకం
బి) సర్వనామం
సి) క్రియ
డి) విశేషణం
జవాబు:
ఎ) నామవాచకం
సొంతవాక్యాలు :
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
77. కంటతడి పెట్టు : తమ్ముడికి జ్వరం వచ్చిందని, అమ్మ కంట తడి పెట్టింది.
78. సార్థకము : మంచి ర్యాంకు సాధించడంతో నా ప్రయత్నం సార్థకమయ్యింది.
79. చూచేవారు : పేదలను చక్కగా చూచేవారు కనువైనారు.
80. దేవాలయాలు : మన దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తాయి.
81. ఏడవడం : ఆపదలు వచ్చినపుడు ఏడవడం సహజం.
82. ప్రతిమలు : శిల్పులు చెక్కిన ప్రతిమలు నయన – మనోహరంగా ఉన్నాయి.
83. పాషాణం : మహాత్ముల హృదయాలు దుఃఖంతో పాషాణంగా మారతాయి.
84. చిరంజీవిత్వం : ప్రాచీన శిల్పాల్లో చిరంజీవిత్వం కన్పిస్తుంది.
85. మదం : మూర్ఖులు మదంతో విర్రవీగుతారు.
86. వసుధ : వసుధపై ధర్మం చిరకాలం నిలిచి ఉండాలి.
87. తారతమ్యాలు : ప్రజల మధ్య తారతమ్య భేదాలు ఉండకూడదు.
88. కుసుమం : సుగంధ కుసుమాన్ని స్త్రీలు తలపై ధరిస్తారు.