These AP 8th Class Biology Important Questions 10th Lesson పీల్చలేము – తాగలేము will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 10th Lesson Important Questions and Answers పీల్చలేము – తాగలేము
ప్రశ్న 1.
కాలుష్యం అనగానేమి ? దాని ప్రభావం ఏమిటి ?
జవాబు:
వాతావరణానికి హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యం అంటారు.
కాలుష్యం : ప్రకృతి విరుద్ధ మూలకాలు వాతావరణంలో కలియటాన్ని కాలుష్యం అంటారు.
ప్రభావం :1. హానికర పదార్థాలు వాతావరణ వలయాల్లోకి ప్రవేశిస్తే వలయంలోని కొంత భాగంలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
2. దీనివలన వలయంలో రకరకాల రసాయనచర్యలు జరిగి మిగిలిన వలయాన్ని దెబ్బతీస్తాయి.
3. ఇది జీవరాశుల ఆరోగ్యానికి హాని చేస్తుంది.
ప్రశ్న 2.
చెర్నోబిల్ దుర్ఘటన గురించి రాయండి.
జవాబు:
1) 1986లో రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అధిక వేడికి కరిగి రేడియో ధార్మికరేణువులు మండిపోయి మబ్బులాగా ఏర్పడ్డాయి.
2) ఆ మబ్బులు రేడియో ధార్మిక ధూళి కణాలతో నిండిపోయాయి.
3) అవి ఆ ప్రాంత ప్రజలకు థైరాయిడ్ గ్రంధి క్యాన్సర్ ను కలుగజేశాయి.
4) 5 మిలియన్ల రష్యన్లు క్యాన్సర్ కు బలైనారు. కొన్ని వందలమంది మరణించారు.
5) దీనివల్ల అడవులు నాశనం అయ్యాయి.
6) రేడియోధార్మిక మబ్బులు 1,25,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంట పొలాలను నిరుపయోగం చేశాయి.
ప్రశ్న 3.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి రాయండి.
జవాబు:
భోపాల్ గ్యాస్ దుర్ఘటన – క్షమించరాని మానవ తప్పిదం
1. పరిశ్రమలు అభివృద్ధికి సూచికలు. కానీ నాణానికి రెండో వైపు చూస్తే భద్రతా చర్యలు పాటించడంలో నిర్లక్ష్యం, వాయు కాలుష్యం నివారించడంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తాయి.
2. డిసెంబర్ 2, 1984 నాడు భోపాల్ పట్టణంలో సుమారు 3 వేల మంది మరణించారు. 5 వేలమంది మృత్యు ముఖంలోకి నెట్టివేయబడ్డారు.
3. ఇదే కాకుండా వేలకొలది పశువులు, పక్షులు, కుక్కలు, పిల్లులు మరణించాయి.
4. ఈ దుర్ఘటన యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్న క్రిమిసంహారక మందుల తయారీ కర్మాగారం నుండి వెలువడిన మిథైల్ ఐసోసైనైడ్ (MIC) అనే వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది.
5. మానవుని తప్పిదాల వల్ల వేలకొలది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు.
6. ఇది వాయు కాలుష్యం వల్ల జరిగిన మరిచిపోలేని అత్యంత ఘోరమైన దుర్ఘటన.
ప్రశ్న 4.
గాలి కాలుష్యం తగ్గించటానికి మనం ఏమి చేయగలము ? (లేదా) గాలి కాలుష్య నివారణ మార్గాలు తెలపండి.
జవాబు:
గాలి కాలుష్యం తగ్గించటానికి మనం ఈ కింది జాగ్రత్తలు పాటించాలి :
1. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద పొడవైన చిమ్నీలు ఏర్పాటు చేయాలి.
2. ఇంటిలోగాని, పరిశ్రమలోగాని ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించుకోవాలి.
3. ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ (Electrostatic Precipitaters) పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటుచేయాలి.
4. వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సిఎ్వ (compressed natural gas) ని వాడాలి.
5. ఇంటిలో వంటకు ఎల్ పిజి (liquid petroleum gas) ఉపయోగించాలి.
6. వాహనాలలో వాడే ఇంధనాలు నాణ్యత కలిగి ఉండాలి.
7. పునరుద్ధరింపదగిన శక్తి వనరులైన సౌరశక్తి, పవనశక్తి, అలలశక్తి, జలవిద్యుత్ ను ఉపయోగించుకోవాలి.
8. కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం అన్ని వాహనాలు తప్పకుండా క్రమపద్ధతిలో నిర్వహించాలి.
9. సీసం లేని పెట్రోలును ఉపయోగించాలి.
10. మీ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలలో వీలైనన్ని ఎక్కువ చెట్లను పెంచాలి.
ప్రశ్న 5.
గిద్దలూరు గ్రామములో రైతులు వ్యవసాయానికి నీటి వనరులు ఎలా వాడుతున్నారో కింది చిత్రంలో ఇవ్వబడింది. దానిని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) ఏ నీటి వనరులను, తక్కువ మంది రైతులు వాడుకుంటున్నారు ?
బి) ఎక్కువమంది బోరుబావుల నుండి నీటిని వాడుకుంటున్నారు కదా ? ఇలా చేస్తే భవిష్యత్తులో ఏమౌతుంది.
జవాబు:
ఎ) బోరు బావులు (40%)
బి) భవిష్యత్ లో భూగర్భ జల మట్టాలు తగ్గిపోయి బోర్లు విఫలమవుతాయి. నీటి ఎద్దడి కలుగుతుంది. మెట్ట పంటలు, ఆరు తడి పంటలకు నీటి లభ్యత ఉండదు.
ప్రశ్న 6.
పేరాను చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మంచు కుంటల్ సహజవనరులు మనకు ప్రకృతి అందించిన వరం. మనకు ఎంతో ఉపయోగపడే వీటిని అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ వనరులను మనం నాశనం చేస్తే మానవజీవితం సాధించలేని పజిల్ అవుతుంది. అందుకే మనకోసం మరియు మన భావితరాల కోసం ఈ సహజవనరులను శుభ్రంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
ఎ) మనం మన సహజవనరులను ఎలా వినియోగించుకోవాలి ? కొన్ని ఉదాహరణలివ్వండి. నలు
బి) విచక్షణారహితంగా వనరులను వినియోగిస్తే ఏమౌతుంది ?
జవాబు:
ఎ) సహజ వనరులు మనకు ప్రకృతి ఇచ్చిన వరం. వీటిని అర్థవంతంగా వినియోగించుకోవాలి. ఉదాహరణకు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పరిమితం చేస్తూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వినియోగాన్ని పెంచాలి. వాహనాలలో డీజిల్ పెట్రోల్ బదులుగా CNG బయోడీజిల్ వంటి వాటిని వాడటం వలన శిలాజ ఇంధనాలు పూర్తిగా అడుగంటి పోకుండా నివారించవచ్చు.
బి) మానవ జీవితం సాధించలేని పజిల్ అవుతుంది.
ప్రశ్న 7.
కింది పై డయాగ్రమ్ చూడండి – ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. ఈ చిత్రం దేనిని సూచిస్తుంది ?
2. గాలిలో అధిక పరిమాణంలో ఉండే వాయువు లేవా?
3. వాతావరణంలో కార్బన్-డై-ఆక్సెడ్ పరిమాణం పెరిగితే ఏమౌతుంది ?
4. ఏ పరిస్థితుల్లో కార్బన్-డై-ఆక్సెడ్ ను కాలుష్యకారకం కాదని అంటాము.
జవాబు:
1. గాలిలోని వివిధ వాయువుల పరిమాణాల శాతాన్ని తెలియజేస్తుంది.
2. నైట్రోజన్
3. భూతాపం పెరిగి ధృవాలలో ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి.
4. 0.03% CO2 వాతావరణంలో ఉండే అది కాలుష్య కారకం కాదు.
ప్రశ్న 8.
లత తరగతి గదిలో నీటి నమూనాలను పరీక్షించాలనుకుంది. కింది పట్టికను సిద్ధం చేసుకుంది. కింది పట్టికను పరిశీలించండి. ప్రశ్నలకు జవాబులివ్వండి.
ఎ) ఈ ప్రయోగ ఉద్దేశ్యం ఏమిటి ?
బి) ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు ఏమిటి ?
సి) నీటి కఠినత్వాన్ని ఎలా కనుక్కొంటారు ?
డి) నీటికి గల ఆమ్ల క్షార ధర్మాన్ని ఎలా నిర్ధారిస్తారు ?
జవాబు:
ఎ) స్థానికంగా ఉన్న నీటి నమూనాలలో కాలుష్య కారకాలను పరిశీలించుట
బి) గాజు బీకరు, కుళాయి చెరువు నుండి సేకరించిన నీటినమూనాలు, నీలం, ఎరుపు లిట్మస్ పేపర్లు, సబ్బు
సి) నీటి కఠినత్వాన్ని సబ్బును ఉపయోగించి కనుగొంటారు. ఆ నీరు ఎక్కువ నురుగు వస్తే మంచినీరని తక్కువ నురుగువస్తే అది కఠినత్వాన్ని కలిగి ఉందని కనుగొంటారు.
డి) నీలం రంగు లిట్మస్ పేపరు నీటి నమూనాలో ముంచితే అది ఎరుపు రంగుకు మారితే అది ఆమ్లత్వాన్ని కలిగి ఉన్నదని తెలుస్తుంది.
ప్రశ్న 9.
కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
నీటి కాలుష్యం జరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి, నిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల (definite sources), అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల (non-definite sources), నిర్దిష్ట కాలుష్య కారకాలు ఒకే ఒక్క వనరు ద్వారా విడుదల అవుతాయి. ఉదా : పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు. ఇందులో పరిశ్రమల కలుషితాలు, మురికి నీరు, ఇతరత్రా కలుషితాలు నేరుగా నీటిలోనికి విడుదలవుతుంటాయి.
అనిర్దిష్ట కాలుష్య కారకాలు : తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేసే వనరులు. ఇవి తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేస్తున్నప్పటికీ, నీటిని కలుషితం చేయడంలో ప్రధాన కారణం అవుతున్నాయి. నిర్ధిష్టం కాని వనరుల నుండి వచ్చే చిన్న చిన్న కాలుష్య కారకాలు అన్నీ కలిసి గుర్తించదగిన స్థాయి కాలుష్యంగా మారతాయి. ఉదాహరణకు వ్యవసాయం కొరకు ఉపయోగించే ఎరువులు, పురుగుల మందులు, కీటకనాశన మందులు అన్నీ వర్షపు నీటితో కొట్టుకొని పోయి నదులు, సరస్సులు, ఆనకట్టల ద్వారా భూగర్భ జలంలోకి ప్రవేశిస్తాయి. నిర్ధిష్టం కాని వనరులలో తక్కువ కాలుష్య కారకాలు ఉంటాయి. కావున గుర్తించడం చాలా కష్టం. అవి ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టలేం. వ్యర్థాలతో నింపిన గోతులు (లాండ్ ఫిల్స్) కూడా కాలుష్య కారకమే. వీటి నుండి కాలుష్య పదార్థాలు నీటి రవాణా వ్యవస్థలోనికి ప్రవేశిస్తాయి.
ఎ) ఏ రకమైన నీటి కాలుష్య కారకాలను గుర్తించుట కష్టం ?
బి) నిర్దిష్ట నీటి కాలుష్య కారకాలు అంటే ఏమిటి ? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఎ) అనిర్దిష్ట కాలుష్య కారకాలను గుర్తించడం కష్టం.
బి) ఒకే ఒక్క వనరు ద్వారా విడుదల అయ్యే కాలుష్య కారకాలను నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటారు.
ఉదా : పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
“పారదర్శకంగా మరియు స్వచ్ఛంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోతుంది.” దానిపై మీ అభిప్రాయంను తెలియచేయండి.
జవాబు:
1. పారదర్శకంగా మరియు స్వచ్ఛంగా కనిపించే నీరు త్రాగుటకు అన్నివిధాలా సరిపోదు.
2. కారణం దానిలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు అయిన వైరస్లు, బాక్టీరియాలు, ప్రోటోజోవాలు ఉండవచ్చు.
3. అంతేకాక నీటి కలుషితాలు కూడా ఉండవచ్చు.
ప్రశ్న 2.
నీటిలో పోషకాల స్థాయి పెరగటం వలన నీటి జీవుల మనుగడపై ఏవిధంగా ప్రభావం చూపుతుంది ?
జవాబు:
నీటిలో పోషకాల స్థాయి పెరగడం వలన శైవలాలు, కలుపు మొక్కలు మరియు బాక్టీరియాలు విస్తరించును. నీరు చివరకు ఆకుపచ్చగా, మురికిగా వాసనపట్టిన తెట్టుగా తయారవుతుంది. నీటిలో కుళ్లుతున్న మొక్కలు ఆక్సిజనన్ను ఉపయోగించుకొంటాయి. నీటి జీవులకు సరిపడు ఆక్సిజన్ అందక చివరకు అవి మరణించును. జీవవైవిధ్యం తగ్గును.
ప్రశ్న 3.
టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ ఎక్కడికి పోతాయి ? ఏమవుతాయి ?
జవాబు:
టైర్లను, ఎండిపోయిన ఆకులను కాలిస్తే దాని వలన వచ్చే పొగ, బూడిద మొదలైనవన్నీ వాతావరణం (గాలిలోకి) లో చేరి కాలుష్యం కలుగజేయును.
ప్రశ్న 4.
మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగుతుంది. ఈ లక్షణాలు ఎందుకు కలుగుతాయో ఆలోచించండి – చర్చించండి.
జవాబు:
మనం రద్దీగా ఉన్న రోడ్డు పైన సాయంత్రం వేళ పోతున్నప్పుడు చుట్టూ పొగ దట్టంగా ఉంటుంది. మనం రుమాలుతో ముక్కు మూసుకున్నప్పటికీ దగ్గు, చికాకు కలుగును. కారణం ఆ పొగలో ఉన్న అతి చిన్న కణాలు రుమాలు ద్వారా ముక్కు లోపలికి వెళ్ళి అక్కడ మనకు ఎలర్జీ కలుగజేయును. దీనినే మనం డస్ట్ ఎలర్జీ అంటాము.
ప్రశ్న 5.
కాలుష్య కారకాలు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు అవి :
1. ప్రాథమిక కాలుష్య కారకాలు
2. ద్వితీయ కాలుష్య కారకాలు
ప్రశ్న 6.
గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాల జాబితా రాయండి.
జవాబు:
గ్రామాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : కట్టెలు, కిరోసిన్, బయోగ్యాస్, పొట్టు, కంది కంప మొదలైనవి. పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాలు : గ్యాస్, కిరోసిన్.
ప్రశ్న 7.
ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటి పై ఏర్పడే నూనెతెట్టు ఏ రకమైన ప్రమాదాన్ని జీవులకు కలుగజేస్తుందో మీకు తెలుసా ?
జవాబు:
ఓడ ప్రమాదాల వలన సముద్రం నీటిపై ఏర్పడిన నూనె తెట్టు వలన నీటి లోపలకు ఆక్సిజన్ వెళ్ళదు. దీని వలన జలచర జీవుల మనుగడ కష్టమై నీటిలో ఉన్న ఆవరణ వ్యవస్థ దెబ్బతినును.
ప్రశ్న 8.
మీ ఉపాధ్యాయుడిని అడిగి ద్వితీయ కాలుష్య కారకాలు అని వేటిని, ఎందుకు అంటారో తెలుసుకోండి.
జవాబు:
ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడిన పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు.
ప్రశ్న 9.
కాలుష్య తనిఖీ కేంద్రాలలో ఏయే వాయువులు పరీక్షిస్తారు ?
జవాబు:
కాలుష్య తనిఖీ కేంద్రంలో హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు పరీక్షిస్తారు.
ప్రశ్న 10.
కార్బన్ మోనాక్సైడ్, హైబ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే తెంగ్ ఎక్కువగా ఉంటే ఏమిజరుకుతుంది ?
జవాబు:
కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువ ఉంటే ఆ వాహనానికి అపరాధ రుసుము విధిస్తారు.
ప్రశ్న 11.
కాలుష్యం అనగానేమి ?
జవాబు:
వాతావరణానికి హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యం అంటారు. (లేదా)
కాలుష్యం : ప్రకృతి విరుద్ధ మూలకాలు వాతావరణంలో కలియటాన్ని కాలుష్యం అంటారు.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
ఈ క్రింది వానిలో గాలిలో ఉన్న జడ వాయువు
ఎ) ఆక్సిజన్
బి) ఆర్గాన్
సి) నైట్రోజన్
డి) నీటి ఆవిరి
జవాబు:
బి) ఆర్గాన్
ప్రశ్న 2.
చెట్లను నరకడం వలన గాలిలో దేని శాతం పెరుగును ?
ఎ) ఆక్సిజన్
బి) నీటి ఆవిరి
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
సి) కార్బన్ డై ఆక్సైడ్
ప్రశ్న 3.
కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ?
ఎ) ఎరువులు
బి) నీటి సమస్య
సి) ఏ సమస్యా రాదు.
డి) గ్లోబల్ వార్మింగ్
జవాబు:
డి) గ్లోబల్ వార్మింగ్
ప్రశ్న 4.
CFC లు దేని నుండి విడుదలగును?
ఎ) నీటి నుంచి
బి) రిఫ్రిజిరేటర్స్ మరియు ఎ.సి.లు
సి) ఆహారం
డి) ఏమీకావు
జవాబు:
బి) రిఫ్రిజిరేటర్స్ మరియు ఎ.సి.లు
ప్రశ్న 5.
ద్వితీయ కాలుష్యకారకం గుర్తించండి.
ఎ) ఓజోన్
బి) NO
సి) SO2
డి) క్లోరిన్
జవాబు:
ఎ) ఓజోన్
ప్రశ్న 6.
పాదరసం వలన వచ్చు మినిమెటా వ్యాధితో ఏ వ్యవస్థ దెబ్బతినును ?
ఎ) మూత్ర పిండాలు
బి) జీర్ణ వ్యవస్థ
సి) విసర్జక వ్యవస్థ
డి) నాడీ వ్యవస్థ
జవాబు:
బి) జీర్ణ వ్యవస్థ
ప్రశ్న 7.
రంగు, వాసన లేని నీరు
ఎ) కలుషిత నీరు
బి) ఉప్పు నీరు
సి) స్వచ్ఛమైన నీరు
డి) ఏవీకావు
జవాబు:
సి) స్వచ్ఛమైన నీరు
ప్రశ్న 8.
కాలుష్యాన్ని తగ్గించుటకు ఏ R నియమాలను పాటించాలి?
ఎ) 18
బి) 2R
సి) 7R
డి) 4R
జవాబు:
డి) 4R
ప్రశ్న 9.
మోటారు వాహనాల చట్టం చేసిన సంవత్సరం
ఎ) 1986
బి) 1987
సి) 1988
డి) 1989
జవాబు:
సి) 1988
ప్రశ్న 10.
కేంద్రమోటారు వాహనాల నియమం చేసిన సంవత్సరం
ఎ) 1986
బి) 1987
సి) 1988
డి) 1989
జవాబు:
డి) 1989
ప్రశ్న 11.
క్రొత్తగా వాహనాన్ని కొన్నప్పుడు ఎంత కాలం తర్వాత కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవాలి ?
ఎ) 6 నెలలు
బి) 1 సంవత్సరం
సి) 1 1/2 సంవత్సరం
డి) 2 సంవత్సరాలు
జవాబు:
బి) 1 సంవత్సరం
ప్రశ్న 12.
వాహనానికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తీసుకోవల్సిన కాలం
ఎ) ప్రతి 6 నెలలకి
బి) సంవత్సరానికి ఒకసారి
సి) ప్రతి 5 సం|| కొకసారి
ది) జీవితకాలంలో ఒకసారి
జవాబు:
ఎ) ప్రతి 6 నెలలకి
ప్రశ్న 13.
కాలుష్యం అనగా
ఎ) ప్రకృతి విరుద్ధమయిన పదార్థాలు వాతావరణంలో కలవడం
బి) హాని కలుగచేసే రసాయన పదార్థాల చేరిక
సి) మానవ చర్యల వలన ప్రకృతిలో కలిగే మార్పు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 14.
గాలిలో అతి ఎక్కువ శాతంలో ఉండే వాయువు )
ఎ) నత్రజని
బి) ఆక్సిజన్
సి) హైడ్రోజన్
డి) కార్బన్ డయాక్సైడ్
జవాబు:
ఎ) నత్రజని
ప్రశ్న 15.
గాలిలో ఆక్సిజన్ శాతం
ఎ) 78%
బి) 21%
సి) 1%
డి) 56%
జవాబు:
బి) 21%
ప్రశ్న 16.
ఇంధనాలు మందించటం వల్ల వచ్చే పదార్థాలు వాతావరణం లోని మూలకాలతో చర్య జరిపి వీటినేర్పరుస్తాయి.
ఎ) ప్రాథమిక కాలుష్య కారకాలు
బి) ద్వితీయ కాలుష్య కారకాలు
సి) బూడిద
డి) తృతీయ కాలుష్య కారకాలు
జవాబు:
బి) ద్వితీయ కాలుష్య కారకాలు
ప్రశ్న 17.
అగ్ని పర్వతాలు బ్రద్దలయినప్పుడు విడుదలయ్యే వాయువు
ఎ) సల్ఫర్ డై ఆక్సైడ్
బి) అమ్మోనియా
సి) మీథేన్
డి) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
ఎ) సల్ఫర్ డై ఆక్సైడ్
ప్రశ్న 18.
క్రుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి విడుదలయి గాలి కాలుష్యాన్ని కలుగచేసేది
ఎ) సల్ఫర్ డై ఆక్సైడ్
బి) అమ్మోనియా
సి) మీథేన్
డి) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
బి) అమ్మోనియా
ప్రశ్న 19.
మురుగునీటిలో క్రుళ్ళిన వ్యర్థాల నుండి విడుదలయ్యే వాయువు
ఎ) సల్ఫర్ డై ఆక్సెడ్
బి) అమ్మోనియా
సి) మీథేన్
డి) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
సి) మీథేన్
ప్రశ్న 20.
వాహనాల నుండి వెలువడే పొగలోని వాయువు
ఎ) కార్బన్ మోనాక్సైడ్
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) అమ్మోనియా
డి) మీథేన్
జవాబు:
ఎ) కార్బన్ మోనాక్సైడ్
ప్రశ్న 21.
రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు విడుదల చేసేది
ఎ) హైడ్రల్ విద్యుత్ కేంద్రం
బి) అణు విద్యుత్ కేంద్రం
సి) థర్మల్ విద్యుత్ కేంద్రం
డి) సౌర విద్యుత్ కేంద్రం
జవాబు:
బి) అణు విద్యుత్ కేంద్రం
ప్రశ్న 22.
1986 లో రష్యాలోని చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలయినది
ఎ) మిథైల్ ఐసో సైనైడ్
బి) కార్బన్ మోనాక్సైడ్
సి) రేడియోధార్మికత
డి) ప్రమాదకరమయిన విషవాయువులు
జవాబు:
సి) రేడియోధార్మికత
ప్రశ్న 23.
ప్రస్తుతం భూమిపై అడవులు విస్తరించిన శాతం
ఎ) 19%
బి) 21%
సి) 23%
డి) 25%
జవాబు:
ఎ) 19%
ప్రశ్న 24.
గ్లోబల్ వార్మింగ్ కు కారణం
ఎ) అడవుల నరికివేత
బి) గాలిలో కార్బన్ డై ఆక్సెడ్ పెరుగుదల
సి) ఎ మరియు బి
డి) వాతావరణ కాలుష్యం
జవాబు:
సి) ఎ మరియు బి
ప్రశ్న 25.
ఓజోన్ పొరను దెబ్బతీసేవి
ఎ) ఏరోసాల్స్
బి) క్లోరో ఫ్లోరో కార్బన్లు
సి) రిఫ్రిజిరేటర్ల నుండి వెలువడే వాయువులు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 26.
SPM అనగా
ఎ) సస్పెండడ్ పార్టిక్యులేట్ మాటర్
బి) సెన్సిటివ్ పార్టీకల్స్ ఆఫ్ మాటర్
సి) స్పెషల్ పార్టికల్స్ ఆఫ్ మాటర్
డి) సస్పెండడ్ పార్టికల్స్ ఆఫ్ మెటీరియల్
జవాబు:
ఎ) సస్పెండడ్ పార్టిక్యులేట్ మాటర్
ప్రశ్న 27.
ఈ క్రింది వానిలో ద్వితీయ కాలుష్య కారకం
ఎ) క్లోరిన్
బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) ఓజోన్
డి) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
సి) ఓజోన్
ప్రశ్న 28.
ఈ క్రింది వానిలో ద్వితీయ కాలుష్య కారకం కానిది ఏది?
ఎ) హెక్సీ ఎసిటైల్ నైట్రేట్
బి) ఫార్మాలి హైడ్
సి) ఓజోన్
డి) సీసం
జవాబు:
డి) సీసం
ప్రశ్న 29.
PAN ను విస్తరించగా
ఎ) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
బి) పెట్రోలియం ఎసిటైల్ నైట్రేట్
సి) పెరాక్సి అమ్మోనియం నైట్రేట్
డి) పొటాషియం అమ్మోనియం నైట్రేట్
జవాబు:
ఎ) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
ప్రశ్న 30.
తాజ్ మహలకు దీని వలన ప్రమాదం జరుగుతుంది.
ఎ) ఫ్లోలో క్లోరో కార్బన్లు
బి) ఆమ్ల వర్షం
సి) ఏరోసాల్స్
డి) SPM
జవాబు:
బి) ఆమ్ల వర్షం
ప్రశ్న 31.
CNG అనగా
ఎ) కంప్రెడ్ నాచురల్ గ్యాస్
బి) కార్బన్ నాచురల్ గ్యాస్
సి) క్లోరినేటెడ్ నైట్రోజన్ గ్యాస్
డి) కంప్రెడ్ నైట్రోజన్ గ్యాస్
జవాబు:
ఎ) కంప్రెడ్ నాచురల్ గ్యాస్
ప్రశ్న 32.
భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు
ఎ) కార్బన్ మోనాక్సైడ్
బి) రేడియోధార్మిక విషవాయువు
సి) మిథైల్ ఐసోసైనైడ్
డి) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్
జవాబు:
సి) మిథైల్ ఐసోసైనైడ్
ప్రశ్న 33.
మినిమేటా వ్యాధికి కారణం
ఎ) సీసం
బి) కాడ్మియం
సి) పాదరసం
డి) ఫ్లోరిన్
జవాబు:
సి) పాదరసం
ప్రశ్న 34.
రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసే విషవాయువు)
ఎ) రేడియోధార్మిక ఆక్సిజన్
బి) కార్బన్ డై ఆక్సైడ్
సి) కార్బన్ మోనాక్సెడ్
డి) హైడ్రోజన్ సల్ఫైడ్
జవాబు:
సి) కార్బన్ మోనాక్సెడ్
ప్రశ్న 35.
వన మహోత్సవాన్ని ఏ నెలలో జరుపుతారు ?
ఎ) జూన్
బి) జులై
సి) ఆగస్టు
డి) నవంబర్
జవాబు:
బి) జులై
ప్రశ్న 36.
భారతదేశంలో అతి ప్రమాదకరమైన కాలుష్య ప్రాంచ్చంగా గుర్తింపబడినది
ఎ) మహబూబ్ నగర్
బి) పఠాన్ చెరువు
సి) మెహదీపట్నం
డి) పాతబస్తీ
జవాబు:
బి) పఠాన్ చెరువు
ప్రశ్న 37.
మన రాష్ట్రంలో ఈ నది ప్రక్షాళన చేపట్టారు.
ఎ) గంగ
బి) గోదావరి
సి) కృష్ణా
డి) మూసీ
జవాబు:
డి) మూసీ
ప్రశ్న 38.
ఈ క్రింది వానిలో నిర్దిష్ట కాలుష్య కారకం
ఎ) పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థం
బి) ఎరువులు
సి) పురుగుమందులు
డి) కీటకనాశినిలు
జవాబు:
ఎ) పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థం
ప్రశ్న 39.
నీటిలో పోషకాలు బాగా పెరిగి, మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గటాన్నేమంటారు ?
ఎ) నైట్రిఫికేషన్
బి) డీనైట్రిఫికేషన్
సి) యూట్రాఫికేషన్
డి) కార్బొనిఫికేషన్
జవాబు:
సి) యూట్రాఫికేషన్
ప్రశ్న 40.
ఉష్ణకాలుష్యం వీటిపై ప్రభావం చూపుతుంది.
ఎ) అడవులు
బి) భూమిపై పెరిగే జంతువులు
సి) నీటిలోని జంతువులు
డి) గాలిలోని జంతువులు
జవాబు:
సి) నీటిలోని జంతువులు
ప్రశ్న 41.
ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఎన్ని లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది ?
ఎ) 10 లీటర్లు
బి) 15 లీటర్లు
సి) 20 లీటర్లు
డి) 25 లీటర్లు,
జవాబు:
డి) 25 లీటర్లు
ప్రశ్న 42.
ఏ లవణాల వలన భూగర్భజలాలు విషతుల్యమవుతున్నాయి?
ఎ) క్లోరిన్
బి) బ్రోమిన్
సి) ఫ్లోరిన్
డి) పాదరసం
జవాబు:
సి) ఫ్లోరిన్
ప్రశ్న 43.
ఈ క్రింది వానిలో 4 Rలలో లేనిది ఏది ?
ఎ) రియూజ్
బి) రిప్రొడ్యూస్
సి) రికవర్
డి) రెడ్యూస్
జవాబు:
బి) రిప్రొడ్యూస్
ప్రశ్న 44.
కామెర్లు దీని కాలుష్యం వలన వస్తుంది.
ఎ) వాయు కాలుష్యం
బి) నీటి కాలుష్యం
సి) ఉష్ణ కాలుష్యం
డి) నేల కాలుష్యం
జవాబు:
బి) నీటి కాలుష్యం
ప్రశ్న 45.
శ్వాసకోశ వ్యాధులు దీని వలన వస్తాయి.
ఎ) వాయు కాలుష్యం
బి) నీటి కాలుష్యం
సి) ఉష్ణ కాలుష్యం
డి) నేల కాలుష్యం
జవాబు:
ఎ) వాయు కాలుష్యం
ప్రశ్న 46.
మనదేశంలో త్రాగే నీటిలో ఫ్లోరైడ్ మోతాదు ఎంతకన్నా ఎక్కువ ఉన్నది ?
ఎ) 0.5 పి.పి.యం
బి) 1 పి.పి.యం
సి) 1.5 పి.పి.యం
డి) 2 పి.పి.యం
జవాబు:
బి) 1 పి.పి.యం
ప్రశ్న 47.
ఆమ్లవర్ష పితామహుడు అని ఎవరిని అంటారు ?
ఎ) రాబర్ట్ బాయిల్
బి) రాబర్ట్ ఏంజస్
సి) లెవోయిజర్
డి) కావిండిష్
జవాబు:
బి) రాబర్ట్ ఏంజస్
ప్రశ్న 48.
ఇది నీటితో కలసి ఆమ్ల వర్షాలను ఏర్పరుస్తుంది.
(A) సల్ఫర్ డయాక్సైడ్
(B) కాల్షియం హైడ్రాక్సైడ్
(C) ఫాస్ఫరస్ మోనాక్సైడ్
(D) హైడ్రోజన్
జవాబు:
(A) సల్ఫర్ డయాక్సైడ్
ప్రశ్న 49.
కింది వాటిలో పునరుద్ధరింపలేని శక్తి వనరు
(A) సౌరశక్తి
(B) ఇంధన శక్తి
(C) అలల శక్తి
(D) వాయు శక్తి
జవాబు:
(B) ఇంధన శక్తి
ప్రశ్న 50.
“నర్మదా బచావో” ఉద్యమానికి నాయకత్వం వహించిన
(A) సుందర్‌లాల్ బహుగుణ
(B) బాబా అమ్మే
(C) మేథా పాట్కర్
(D) కిరణ్ బేడి
జవాబు:
(C) మేథా పాట్కర్
ప్రశ్న 51.
ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య భూతాపం. ఈ కింది వాటిలో భూతాపానికి కారణమైన వాయువు
(A) O2
(B) SO2
(C) PO2
(D) CO2
జవాబు:
(D) CO2
ప్రశ్న 52.
మీ ఇంటి మూలల్లో నూనెపూసిన కాగితాలు ఉంచడం వల్ల
(A) నూనె ఆవిరైపోతుంది
(B) నూనె పెరిగిపోతుంది
(C) దుమ్ము, ధూళి కాగితంపై పేరుకొనిపోతుంది
(D)ఏ మార్పు ఉండదు
జవాబు:
(C) దుమ్ము, ధూళి కాగితంపై పేరుకొనిపోతుంది
ప్రశ్న 53.
మూసీనది ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలలో సరికానిది
(1) ఘనరూప వ్యర్థాల నిర్వహణ
(2) మురికినీరు, శుద్ధిచేయు ప్లాంట్ ఏర్పాటు
(3) అపరిశుభ్ర జలాలను మూసీలోకి పంపడం
(4) ప్రజలలో అవగాహన కల్పించడం
(A) 1, 2 మాత్రమే
(B) 2 మాత్రమే
(C) 3 మాత్రమే
(D) 1, 2, 4 మాత్రమే
జవాబు:
(D) 1, 2, 4 మాత్రమే
ప్రశ్న 54.
మీరు తెల్ల పేపరు పై ప్రింట్ తీసుకునేటప్పుడు రెండవ వైపును కూడా ఉపయోగించినట్లయితే అది కింది చర్య అవుతుంది
(A) పునః చక్రీయం
(B) పునర్వినియోగం
(C) తిరిగి పొందడం
(D) తగ్గించడం
జవాబు:
(D) తగ్గించడం