AP 8th Class Biology Notes Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

Students can go through AP Board 8th Class Biology Notes 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి to understand and remember the concept easily.

AP Board 8th Class Biology Notes 4th Lesson జంతువులలో ప్రత్యుత్పత్తి

→ ఒక జీవి నుండి (అది మొక్క గానీ, జంతువు గానీ, ఏకకణజీవి గానీ) అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.

→ ఇది జీవన క్రియలలో అతి ముఖ్యమైనది. ఆ మొక్కలు ఆలైంగిక, లైంగిక పద్ధతులలో ప్రత్యుత్పత్తి జరుపుతాయి.

→ జంతువులలో ఎక్కువగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

→ సంయోగ బీజాలు ఏర్పడకుండా కొత్త జీవిని ఏర్పరిచే పద్ధతిని ‘అలైంగిక ప్రత్యుత్పత్తి’ అంటారు.

→ స్త్రీ, పురుష బీజ కణాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడే దానిని ‘లైంగిక ప్రత్యుత్పత్తి’ అంటారు.

→ హైడ్రాలో ‘కోరకాలు’ (మొగ్గలు) నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. దీనిని ‘కోరకీభవనము’ అంటారు.

→ తల్లి కణం రెండు పిల్ల కణాలను ఏర్పరచి అంతర్థానమయ్యే పద్ధతిని ‘ద్విధా విచ్ఛిత్తి’ అంటారు.
ఉదా : అమీబా, యుగ్లీనా, పేరమీషియం.

→ స్త్రీ, పురుష బీజకణాలు కలసి సంయుక్త బీజం ఏర్పరచటాన్ని ‘ఫలదీకరణ’ అంటారు.

→ ఇది స్త్రీ జీవిలోనే జరుగుతుంది. దీనిని అంతర ఫలదీకరణ అంటారు.

→ ఫలదీకరణ, స్త్రీ జీవి బయట అంటే గాలిలో, నీటిలో, నేలమీద జరిగితే దానిని ‘బాహ్య ఫలదీకరణ’ అంటారు.

→ మానవునిలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు వేరు వేరు జీవులలో ఉంటాయి.

→ దీనిని ‘లైంగిక ద్విరూపకత’ అంటారు.

→ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు ఉంటాయి.

→ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజ కోశాలు (అండాశయాలు), గర్భాశయం, ఫాలోపియన్ నాళాలు ఉంటాయి.

→ సంయుక్త బీజం అభివృద్ధి చెంది పిండంగా ఏర్పడుతుంది. పూర్తిగా ఎదిగిన పిండాన్ని ‘భ్రూణం’ అంటారు.

→ తల్లిదండ్రులలో లేని లక్షణాలు, పిండ దశలో ఉండి, తరువాత వంశ పారంపర్య లక్షణాలు పొందుటను ‘రూపవిక్రియ’ అంటారు. ఉదా : 1) టాడ్ పోల్ లార్వా 2) సీతాకోక చిలుక

→ ఒకే జీవిలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండూ ఉంటే వాటిని ‘ఉభయ లైంగిక జీవులు’ అంటారు.
ఉదా : వానపాము, జలగ మొ||నవి.

→ ఒక కణం లేదా కణజాలం నుండే పూర్తి జీవిని అభివృద్ధి చేసే పద్ధతిని ‘క్లోనింగ్’ అంటారు.

→ ఇయాన్ విల్మట్ మొదటిసారిగా ‘క్లోనింగ్’ ద్వారా ఫినా డార్సెట్ గొర్రె పొదుగు కణంనకు స్కాటిష్ ఆడ గొలై కేంద్రకం తీసి ఫలదీకరలు చెందించి దాన్ని, ఒక స్కాటిష్ ఆడ గొర్రెలో ‘పిండ ప్రతిష్టాపన’ చేశాడు. తద్వారా ‘జాలీ’ అనే గొర్రెపిల్ల అచ్చు తల్లిపోలికలతో పుట్టింది. (అంటే రెండు ఆడగొర్రెల కణాలతో ఒక కొత్తజీవి సృష్టి క్లోనింగ్ ద్వారా జరిగిందన్నమాట.)

AP 8th Class Biology Notes Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి

→ బాహ్య ఫలదీకరణ : జీవి శరీరం బయట జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అంటారు.

→ సంతతి : ప్రౌఢజీవులు ప్రత్యుత్పత్తి ద్వారా జన్మనిచ్చు పిల్లజీవుల తరాన్ని ‘సంతతి’ అంటారు.

→ అంతరఫలదీకరణ : జీవి శరీరం లోపల (స్త్రీ జీవి) జరిగే ఫలదీకరణను అంతరఫలదీకరణ అంటారు.

→ ముష్కాలు : పురుష జీవిలో ఉండే ప్రత్యుత్పత్తి (జననాంగాలు) అంగాలు. ఇవి పురుష బీజకణాలను ఉత్పత్తి చేస్తాయి.

→ శుక్రకణాలు : పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు.

→ అండం : స్త్రీ బీజకణాన్ని ‘అండం’ అంటారు. దీనిని అండకోశంలో ఉన్న ‘పుటికలు’ (follicles) ఉత్పత్తి చేస్తాయి.

→ రూపవిక్రియ : తల్లిదండ్రులలో లేని లక్షణాలు పిండదశలో ఉండి, తరువాత మరలా వంశపారంపర్య లక్షణాలను పొందుటను ‘రూపవిక్రియ’ అంటారు. ఉదా : “టాడ్ పోల్” లార్వా, సీతాకోక చిలుక.

→ పిండం : శుక్రకణం మరియు అండాల కలయిక వల్ల ఫలదీకరణ జరిగి సంయుక్తబీజం ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న సంయుక్త బీజాన్ని ‘పిండం’ అంటారు.

→ భ్రూణం : అభివృద్ధి చెందిన పిండంను భూలం అంటారు. ఇది గర్భాశయ గోడలకు అంటుకుని అభినంది చెంది బిడ్డగా ఎదుగుతుంది. దీనిలో కణ వైవిధ్యం ప్రారంభమై బాహ్య మధ్య అంతర త్వదాల నుండి అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి.

→ గర్భధారణ : స్త్రీ బీజకణం, పురుష నజ కణంతో ఫలదీకరణ జరిగి సంయుక్తబీజం ఏర్పడుతుంది. తద్వారా స్త్రీ జీవి గర్భాధారణ చేసిందని అంటారు. గర్భావధి కాలం తరువాత తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.

→ ద్విధావిచ్ఛిత్తి : ఒక కణం, రెండు పిల్ల కణాలను ఏర్పరచటాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు.

→ గర్భాశయం : స్త్రీ జీవులలో ఉండే ఒక కండరయుత సంచి వంటి నిర్మాణం. దీనిలోనే బిడ్డ రూపుదాల్చి ఎదుగుతుంది. ఇది పొత్తికడుపు భాగంలో ఉంటుంది. 2 నుండి 3 అం॥ వెడల్పు, 4-6 అం॥ పొడవు ఉండే అతి చిన్న సంచి వంటి నిర్మాణం.

→ ఆందోత్పాదకాలు : గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదక జీవులు అంటారు.

→ శిశోత్పాదక జీవులు : పిల్లల్ని కని, పెంచే జీవులను శిశోత్పాదక జీవులని అంటారు. ఉభయ లైంగిక జీవి : ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలను కలిగి ఉన్న జీవిని ఉభయలైంగిక జీవి’ అంటారు. ఉదా: వానపాము.

AP 8th Class Biology Notes Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 1

AP 8th Class Biology Notes Chapter 4 జంతువులలో ప్రత్యుత్పత్తి 2