Students can go through AP Board 8th Class Biology Notes 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు
→ మొక్కలు, జంతువులు నివసించే ప్రాంతాన్ని ‘ఆవాసం’ అంటారు.
→ సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ నిలకడగా రాణించే మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ (Ecosystem) అంటారు.
→ ఈ మాటను 1935 సంవత్సరంలో ఎ.జి. టాస్తే మొట్టమొదటగా వాడారు.
→ ఈయన ఇంగ్లండ్ దేశానికి చెందిన వృక్ష శాస్త్రవేత్త.
→ ఈయన కన్నా ముందు శాస్త్రవేత్తలు ఈ సజీవ, నిర్జీవ వాతావరణ కారతాల సంబంధాన్ని రకరకాలైన పదాలతో అంటే ఆవాసం, జీవావరణం, పర్యావరణ వ్యవస్థ లాంటి పదాలు వాడేవారు.
→ టాన్ ప్లే వీటికి సరైన ప్రత్యామ్నాయం చూపి చిన్న భాగాన్ని ‘ఆవరణ వ్యవస్థ’ పెద్ద భాగాన్ని (ప్రదేశాన్ని) ‘జీవావరణం’ అంటూ సున్నితమైన నిర్వచనాన్ని ఇచ్చారు.
→ సజీవులు, నిర్జీవులు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి.
→ సజీవులలో శక్తి ప్రసారం శక్తి స్థాయిల ద్వారా జరుగును.
→ వీటిని ఆహారపు గొలుసు’ అంటారు.
→ ఒక జీవి ఒకే గొలుసులో కాకుండా మరొక గొలుసులో కూడా ఉంటుంది. అనేక ఆహారపు గొలుసుల సమాహారమే “ఆహార జాలకం”.
→ తమంత తాము తమ ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని ‘ఉత్పత్తిదారులు’ అంటారు. (మొక్కలు, శైవలాలు)
→ ఉత్పత్తిదారులను తిని, శక్తిని గ్రహించి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. (జంతువులు, మనుషులు)
→ వ్యర్థ పదార్థాలు, మృత కళేబరాలను కుళ్ళింపచేసి, వాటిని మృత్తికలో కలిపి, కొంత శక్తిని గ్రహించి జీవించే వాటిని ‘విచ్ఛిన్నకారులు’ అంటారు.
→ సముద్ర తీరప్రాంతంలో, నది సముద్రంలో కలిసే చోట ఏర్పడ్డ అడవులను ‘మడ” అడవులు అంటారు.
→ అడవులు మనకు ఆర్థికంగా, పర్యావరణ పరంగా విలువైన సేవలను అందిస్తున్నాయి.
→ జీవులలో ప్రతిసారీ శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80-90 స్థితిశక్తి వివిధ రూపాలలో ఉష్ణశక్తిగా విడుదల అవుతుంది.
→ భూమి పైకి చేరిన సౌరశక్తి 57% వాతావరణంలో శోషించబడుతుంది. 35% భూమిని వేడిచేయటానికి, నీటిని నీటి ఆవిరిగా మార్చటానికి ఉపయోగపడుతుంది. 8% మొక్కలకు చేరుతుంది. దీనిలో సగం మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వాడబడుతున్నది.
→ ఆహారపు గొలుసులో 4 స్థాయిలు ఉన్నాయి.
ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → తృతీయ వినియోగదారులు.
→ ఆవాసం : సజీవులు నివసించే నిర్దిష్టమైన ప్రదేశం. ఉదా : ఇల్లు, మంచె, గుడిసె, ఇగ్లూలు మొదలగునవి.
→ ఆవరణ వ్యవస్థ : 1) ప్రకృతి యొక్క మూల ప్రమాణం.
2) జీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు పరస్పరం ఒకరినొకరు ప్రభావితం చేసుకునే వ్య వస్థ.
→ ఆహార జాలకం : అనేక ఆహార గొలుసుల సమాహారమే (శక్తి ప్రసారం, శక్తి స్థాయిల కలగలుపు) ఆహార జాలకం.
→ ఉత్పత్తిదారులు : మొక్కలు, శైవలాలు సూర్యరశ్మిని గ్రహించి ఆహారం తయారుచేసుకుంటాయి. వీటిని ఉత్పత్తిదారులు అంటారు.
→ వినియోగదారులు : ఉత్పత్తిదారులైన మొక్కలను, వాటి నుంచి లభించే పదార్థాలను, శైవలాలను తిని శక్తిని గ్రహించే జీవులే వినియోగదారులు.
ఉదా : కీటకాలు, కప్పలు, సింహం, మానవుడు, పశువులు.
→ విచ్ఛిన్నకారులు : మొక్కలు, జంతువులు విడిచిపెట్టిన వ్యర్థాలపైన గానీ, వాటి కళేబరాలపైన గానీ ఉండి వాటిని ద్వంసం చేసి శక్తిని గ్రహించి జీవించే జీవులు – సూక్ష్మ జీవులు – బాక్టీరియా.