These AP 8th Class Physical Science Important Questions 1st Lesson బలం will help students prepare well for the exams.
AP Board 8th Class Physical Science 1st Lesson Important Questions and Answers బలం
8th Class Physics 1st Lesson బలం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
కండర బలం అనగానేమి? కొన్ని ఉదాహరణలు వ్రాయండి.
జవాబు:
శరీర కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలాన్ని కండర బలం అంటారు.
కండర బలాలకు ఉదాహరణలు :
పళ్ళు తోమడం, స్నానం చేయడం, తినడం, నడవడం, రాయడం, వాహనాలు నడపడం, బరువులు ఎత్తడం మొదలగునవి కండర బలాలు.
ప్రశ్న 2.
ఘర్షణ బలం అనగానేమి?
జవాబు:
- ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే దానిని ఘర్షణ బలం అంటారు.
- ఘర్షణ బలం వస్తువు చలనదిశకు వ్యతిరేకదిశలో పనిచేస్తుంది.
- ఘర్షణ బలం స్పర్శాబలం.
ప్రశ్న 3.
ఘర్షణ బలం ఉపయోగాలు రాయండి.
జవాబు:
ఘర్షణ బలం వలన నడవగలుగుతున్నాం, వ్రాయగలుగుతున్నాం, వాహనాలు నడుపగలుగుతున్నాం, మరియు వివిధ పనులు చేయగలుగుతున్నాం.
ప్రశ్న 4.
అభిలంబ బలము అనగానేమి?
జవాబు:
ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబదిశలో కలుగజేసే బలాన్ని అభిలంబ బలం అంటారు. ఇది స్పర్శాబలం.
ప్రశ్న 5.
తన్యతా బలం అనగానేమి?
జవాబు:
తాడు లేదా దారంలో గల బిగుసుతనాన్ని తన్యతా బలం అంటారు. ఇది స్పర్శాబలం.
ప్రశ్న 6.
అయస్కాంత బలం అనగానేమి?
జవాబు:
రెండు, అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు. ఇది ఒక క్షేత్ర బలం.
ప్రశ్న 7.
గురుత్వాకర్షణ బలం అనగానేమి?
జవాబు:
ఏ రెండు వస్తువుల మధ్యనైన ఉండే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. గురుత్వాకర్షణ బలం క్షేత్ర బలం. ఇది విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్యనైన ఉంటుంది.
ప్రశ్న 8.
స్థావర విద్యుత్ బలం అనగానేమి?
జవాబు:
ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. స్థావర విద్యుత్ బలం క్షేత్రబలం.
ప్రశ్న 9.
వస్తువు త్వరణంతో కదులుతున్న లిఫ్ట్ లో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం కాదు. కారణం ఏమిటి ?
జవాబు:
వస్తువు త్వరణంతో కదులుతున్న లిఫ్ట్ లో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం శూన్యం కాదు. కారణం ఆ వస్తువు అసమచలనంలో ఉంది.
ప్రశ్న 10.
బలాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
బలాలు రెండు రకాలు అవి :
- స్పర్శాబలం
- క్షేత్రబలం
ప్రశ్న 11.
స్పర్శాబలాన్ని నిర్వచించండి.
జవాబు:
రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాన్ని స్పర్శా బలం అంటారు.
ఉదా : కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలం.
ప్రశ్న 12.
క్షేత్రబలాన్ని నిర్వచించండి.
జవాబు:
రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో లేకుండా వాటి మధ్య బలం ఉన్నట్లైతే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు.
ఉదా : అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం మరియు గురుత్వ బలం.
ప్రశ్న 13.
ఫలిత బలం అనగానేమి?
జవాబు:
ఒక వస్తువుపై, పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
ప్రశ్న 14.
పీడనం అనగానేమి?
జవాబు:
ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటారు.
ప్రశ్న 15.
పీడనానికి ప్రమాణాలు వ్రాయుము.
జవాబు:
పీడనానికి MKS మరియు SI పద్దతిలో ప్రమాణాలు – న్యూటన్/మీటర్² (లేదా) N/m²
CGS పద్ధతిలో ప్రమాణాలు – డైన్/సెం.మీ²
1 పాస్కల్ = 1 న్యూటన్ / మీటరు²
[1 Pa = 1 N/m²]
ప్రశ్న 16.
50 న్యూటన్ల బలాన్ని 10 మీ వైశాల్యంపై ప్రయోగించినపుడు ఏర్పడే పీడనాన్ని కనుగొనండి.
జవాబు:
బలం (F) = 50 N ; వైశాల్యం (A) = 10 m²
ప్రశ్న 17.
బలానికి ప్రమాణాలు రాయండి.
జవాబు:
బలానికి MKS మరియు SI పద్దతిలో ప్రమాణాలు : న్యూటన్లు
CGS పద్ధతిలో ప్రమాణాలు : డైన్లు.
1 న్యూటన్ = 105 డైన్లు.
ప్రశ్న 18.
బలాన్ని ప్రయోగించడం ద్వారా “వస్తువు వడిలో మార్పు”కు ఒక ఉదాహరణ రాయండి.
జవాబు:
ఒక పిల్లవాడు రబ్బరు టైరును ఎక్కువ వడిగా వెళ్ళేందుకు దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉండుట.
ప్రశ్న 19.
పీడనానికి దిశ ఉంటుందా?
జవాబు:
పీడనం అదిశరాశి. పీడనానికి పరిమాణం మాత్రమే ఉంటుంది. దిశ ఉండదు.
ప్రశ్న 20.
రూపాయి బిళ్ళ, మంచుముక్క మరియు ఎరేజర్ ఘర్షణ క్రమాన్ని వ్రాయండి.
జవాబు:
మూడు వస్తువుల ఘర్షణ బలాలు : ఎరేజర్ > రూపాయి బిళ్ళ > మంచు ముక్క
ప్రశ్న 21.
చెట్టు మీద నుండి ఒక పండు జారి పడుతున్నది. ఆ పండు మీదపని చేసే బలమేది?
జవాబు:
గురుత్వాకర్షణ బలం.
ప్రశ్న 22.
పై స్వేచ్ఛా పటం నుండి ఫలిత బలాన్ని లెక్కించండి.
జవాబు:
X – అక్షం వెంట ఫలిత బలం = 10 N – 8 N = 2 N
Y- అక్షం వెంట ఫలిత బలం = 5 N – 5 N = 0
ప్రశ్న 23.
కింది వాటిలో ఫలిత బలాన్ని లెక్కించుము.
జవాబు:
ఎ) కుడి వైపు దిశలో బలాల మొత్తం = 8N
ఎడమ వైపు దిశలో బలాల మొత్తం = 12 N + 10 N = 22 N
వస్తువు పై ఫలిత బలం = 22 N – 8 N = 14 N ఎడమ వైపు దిశలో
బి) పై వైపు దిశలో బలం = 9 N
క్రింది వైపు దిశలో బలం = 8 N
వస్తువుపై ఫలిత బలం = 9 N – 8 N = 1 N పై వైపు
8th Class Physics 1st Lesson బలం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
స్వేచ్ఛా వస్తుపటం అనగానేమి?
జవాబు:
1) నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛావస్తుపటం (Free Body Diagram) అంటారు. దీనిని FBD తో సూచిస్తారు.
2) అక్షాల వెంట సంజ్ఞా సంప్రదాయాన్ని అనుసరించి బలాల బీజీయ మొత్తాన్ని కనుగొనుట వలన అక్షాల వెంట ఫలిత బలాన్ని కనుగొంటారు.
X- అక్షం వెంట ఫలిత బలం Fnet = కుడి వైపు పనిచేసే బలాలు – ఎడమ వైపు పనిచేసే బలాలు.
Y- అక్షం వెంట ఫలిత బలం Fnet = పై వైపు పనిచేసే బలాలు – క్రింది వైపు పనిచేసే బలాలు.
8th Class Physics 1st Lesson బలం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఫలిత బలం అనగానేమి? వివరించండి.
జవాబు:
- ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.
- బలాలను కూడాలంటే సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి.
- ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళరేఖామార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఫలితబలాన్ని ఆ బలాల మొత్తంగా తీసుకొంటారు.
ఫలిత బలము Fnet = F1 + F2 - రెండు బలాలు ఒక వస్తువుపై సరళరేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఆ రెంటి బలాల భేదానికి ఫలిత బలం సమానం అవుతుంది. కుడివైపు పనిచేసే బలాలను (F) ధనాత్మకంగాను, ఎడమవైపు పనిచేసే బలాలను (F2) ఋణాత్మకంగా తీసుకొంటారు.
∴ ఫలిత బలము Fnet = F1 + (-F2) = F1 – F2
8th Class Physics 1st Lesson బలం 1 Mark Bits Questions and Answers
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. ఒక వస్తువు, వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది
A) బలం
B) ఘర్షణ
C) పని
D) శక్తి
జవాబు:
B) ఘర్షణ
2. ఘర్షణ దిశ మరియు చలన దిశలు ఎల్లప్పుడూ, పరస్పరం ఇలా ఉంటాయి.
A) ఒకేవైపు
B) వ్యతిరేకంగా
C) A లేదా B
D) చెప్పలేం
జవాబు:
B) వ్యతిరేకంగా
3. క్రింది బలం యొక్క దిశ స్థిరంగా ఉంటుంది.
A) ఘర్షణ
B) తన్యత
C) విద్యుదాకర్షణ
D) గురుత్వాకర్షణ (భూమి వలన)
జవాబు:
D) గురుత్వాకర్షణ (భూమి వలన)
4. ఆవేశపర్చిన బెలూన్ మరియు చిన్నచిన్న కాగితపు ముక్కల మధ్య ఆకర్షణ బలాలు
A) అయస్కాంత బలాలు
B) గురుత్వాకర్షణ బలాలు
C) స్పర్శా బలాలు
D) స్థావర విద్యుత్ బలాలు
జవాబు:
D) స్థావర విద్యుత్ బలాలు
5. వీటి మధ్య గురుత్వాకర్షణ బలం ఉంటుంది.
A) నీకు, నీ స్నేహితునికి మధ్య
B) నీకు, భూమికి మధ్య
C) నీకు, చంద్రునికి మధ్య
D) పైవన్నింటి మధ్య
జవాబు:
D) పైవన్నింటి మధ్య
6. స్పర్శా బలానికీ, క్షేత్ర బలానికీ మధ్య తేడాను దీని ద్వారా తెలుసుకోవచ్చును.
A) పరిమాణం
B) దిశ
C) వాటి మధ్య దూరం
D) పైవన్నియు
జవాబు:
C) వాటి మధ్య దూరం
7. ఒక వస్తువు ఇలా ఉంటే, దానిపై పనిచేసే ఫలితబలం శూన్యం అంటాము.
A) ఏకరీతి చలనం
B) నిశ్చలం
C) A మరియు B
D) స్వేచ్ఛా పతనం
జవాబు:
C) A మరియు B
8. క్రింది వానిలో సరికానిది
A) బలం ఒక వస్తువు యొక్క చలన దిశను మార్చ గలదు.
B) బలం ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చగలదు.
C) బలం ఒక వస్తువు యొక్క వేగాన్ని మార్చగలదు.
D) బలం ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని మార్చగలదు.
జవాబు:
D) బలం ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని మార్చగలదు.
9. క్రింది బలం ఉన్న చోటనే అభిలంబ బలం కూడా ఉంటుంది
A) గురుత్వాకర్షణ
B) ఘర్షణ
C) A మరియు B
D) పైవేవీకాదు
జవాబు:
A) గురుత్వాకర్షణ
10. జతపరిచి, సరియైన సమాధానాన్ని గుర్తించుము.
a) చలన వేగం మార్పు | i) బౌలర్ విసిరిన బంతిని బ్యాట్ తో కొట్టినపుడు |
b) ఆకారం మార్పు | ii) పేపర్ లో పడవ తయారుచేసినపుడు |
c) చలన దిశ మార్పు | iii) కదులుతున్న కారు యొక్క బ్రేకులు వేసినపుడు |
A) a – iii, b – ii, c – i
B) a – i, b – ii, c – iii
C) a – iii, b – i, c – ii
D) a – ii, b – i, c – iii
జవాబు:
A) a – iii, b – ii, c – i
11. క్రింది వానిలో సరియైన వాక్యము.
A) ఒక కారు నిశ్చలంగా ఉందంటే, దానిపై ఏ బలాలు పనిచేయలేదు.
B) ఒక కారు నిశ్చలంగా ఉందంటే, దానిపై ఫలితబలం శూన్యం.
C) ఒక కారు అసమ చలనంలో ఉందంటే, దానిపై ఫలితబలం శూన్యం.
D) పైవేవీ కాదు
జవాబు:
B) ఒక కారు నిశ్చలంగా ఉందంటే, దానిపై ఫలితబలం శూన్యం.
12. స్పర్శా బలానికి ఉదాహరణ.
A) అయస్కాంత బలం
B) స్థావర విద్యుత్ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) ఘర్షణ బలం
జవాబు:
D) ఘర్షణ బలం
13. SI పద్ధతిలో బలానికి ప్రమాణం.
A) పాస్కల్
B) న్యూటన్
C) న్యూటన్/మీటర్²
D) ఏదీకాదు
జవాబు:
B) న్యూటన్
14. భూఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలదీ వాతావరణ పీడనము.
A) తగ్గును
B) పెరుగును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
A) తగ్గును
15. ఘర్షణ బలం
A) వస్తువు ఆకారాన్ని మార్చును.
B) వస్తువు గమనాన్ని నిరోధించును.
C) వస్తువు దిశను మార్చును.
D) పైవన్నీ
జవాబు:
B) వస్తువు గమనాన్ని నిరోధించును.
16. సైకిల్ తొక్కడానికి ఉపయోగించే బలం
A) స్థావర విద్యుత్
B) ఘర్షణ
C) కండర
D) గురుత్వ
జవాబు:
C) కండర
17. ద్రవాలలో పీడనం
A) లోతుకు పోయే కొద్దీ తగ్గును.
B) లోతుకు పోయేకొద్దీ పెరుగును.
C) లోతుకు పోయేకొద్దీ మారదు.
D) వేరు వేరు ద్రవాలలో వేరువేరుగా ఉంటుంది.
జవాబు:
B) లోతుకు పోయేకొద్దీ పెరుగును.
18. సూర్యుని చూట్టూ భూమి పరిభ్రమించుటకు కారణం
A) గురుత్వ బలం
B) స్థావర విద్యుత్ బలం
C) అయస్కాంత బలం
D) యాంత్రిక బలం
జవాబు:
A) గురుత్వ బలం
19. రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం
A) అయస్కాంత బలం
B) స్థావర విద్యుత్ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) పైవన్నీ
జవాబు:
C) గురుత్వాకర్షణ బలం
20. చెట్టు నుండి పండు కింద పడుటలో ఉపయోగపడ్డ బలం
A) గాలి బలం
B) చెట్టు బలం
C) గురుత్వ బలం
D) కండర బలం
జవాబు:
C) గురుత్వ బలం
21. టూత్ పేస్ట్ ట్యూబ్ నొక్కి టూత్ పేస్ట్ బయటకు తీయుటకు కావలసిన బలం
A) కండర బలం
B) ఘర్షణ బలం
C) అభిలంబ బలం
D) తన్యతా బలం
జవాబు:
A) కండర బలం
22. ఒక చెక్క దిమ్మెను స్థిరమైన ఆధారం నుండి తాడుతో వేలాడదీసినపుడు తాడులో గల బిగుసుదనాన్ని …….. అంటారు.
A) అభిలంబ బలం
B) తన్యతా బలం
C) క్షేత్ర బలం
D) గురుత్వ బలం
జవాబు:
B) తన్యతా బలం
23. ఈ క్రింది వానిలో క్షేత్ర బలం
A) అభిలంబ బలం
B) గురుత్వ బలం
C) అయస్కాంత బలం
D) ఘర్షణ బలం
జవాబు:
C) అయస్కాంత బలం
24. ఈ క్రింది వానిలో క్షేత్ర బలం కానిది.
A) తన్యతా బలం
B) అయస్కాంత బలం
C) స్థావర విద్యుత్ బలం
D) గురుత్వ బలం
జవాబు:
D) గురుత్వ బలం
25. ఒక వస్తువుపై పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం. ఆ వస్తువు
A) గమనంలో ఉంటుంది.
B) నిశ్చలస్థితిలో ఉంటుంది
C) సమవడిలో ఉంటుంది
D) ఏదీకాదు
జవాబు:
B) నిశ్చలస్థితిలో ఉంటుంది
26. గమనంలో ఉన్న వస్తువుపై బలాన్ని ప్రయోగించినపుడు ఆ వస్తువులో జరిగే మార్పు
A) వడిలో మార్పు వస్తుంది
B) నిశ్చలస్థితిలోకి వస్తుంది
C) గమనదిశలో మార్పు వస్తుంది
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
27. ప్రమాణ వైశాల్యంగల తలంపై లంబంగా పనిచేసే బలం
A) ఘర్షణ బలం
B) పీడనము
C) అభిలంబ బలం
D) ఏదీకాదు
జవాబు:
B) పీడనము
28. పీడనానికి SI పద్ధతిలో ప్రమాణాలు
A) న్యూటన్
B) న్యూటన్/మీటరు
C) న్యూటన్/మీటరు²
D) ఏదీకాదు
జవాబు:
C) న్యూటన్/మీటరు²
29. పీడనము =
A) ఘనపరిమాణం/వైశాల్యం
B) బలం/వైశాల్యం
C) ద్రవ్యరాశి/వైశాల్యం
D) సాంద్రత/వైశాల్యం
జవాబు:
B) బలం/వైశాల్యం
30. జంతువులు ఉపయోగించే బలం
A) కండర బలం
B) యాంత్రిక బలం
C) గురుత్వ బలం
D) అయస్కాంత బలం
జవాబు:
A) కండర బలం
31. వస్తువు గమనాన్ని నిరోధించే బలము
A) అభిలంబ బలం
B) ఘర్షణ బలం
C) గురుత్వ బలం
D) తన్యతా బలం
జవాబు:
B) ఘర్షణ బలం
32. ఈ క్రింది వానిలో క్షేత్ర బలం కానిది.
A) స్థావర విద్యుత్ బలం
B) అయస్కాంత బలం
C) గురుత్వ బలం
D) కండర బలం
జవాబు:
D) కండర బలం
33. ఈ క్రింది వాటిలో వస్తు స్థితిలో మార్పు తెచ్చునది, తీసుకురావడానికి ప్రయత్నించునది.
A) శక్తి
B) రాశి
C) బలం
D) ద్రవ్యవేగము
జవాబు:
C) బలం
34. బలము అనునది ఒక
A) సదిశ రాశి
B) అదిశ రాశి
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) సదిశ రాశి
35. C.G.S పద్ధతిలో బలమునకు ప్రమాణము
A) డైను
B) న్యూటన్
C) ఎర్గ్
D) జెల్
జవాబు:
A) డైను
36. M.K.S పద్ధతిలో బలమును కొలుచునది
A) డైను
B) న్యూటన్
C) ఎర్గ్
D) బౌల్
జవాబు:
B) న్యూటన్
37. ఈ క్రింది వానిలో వస్తు ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్దమును సూచించునది
A) బలం
B) శక్తి
C) ద్రవ్యవేగము
D) ఏదీకాదు
జవాబు:
A) బలం
38. 1 న్యూటను ఎన్ని డైనులకు సమానము?
A) 10³
B) 105
C) 104
D) 106
జవాబు:
B) 105
39. బలంకు, దాని స్థానభ్రంశంకు మధ్యగల సంబంధంను కనుగొన్న శాస్త్రవేత్త
A) న్యూటన్
B) థామ్సన్
C) రూథర్‌ఫోర్డ్
D) జెల్
జవాబు:
A) న్యూటన్
40. ఈ క్రింది వాటిలో మనము ప్రత్యక్షముగా చూడలేని రాశి
A) బలం
B) శక్తి
C) సామర్థ్యం
D) ఏదీకాదు
జవాబు:
A) బలం
41. ఈ క్రింది రాశులలో మనము ప్రభావంను మాత్రమే చూడగల రాశి ఏది?
A) గతిశక్తి
B) స్థితిశక్తి
C) బలం
D) బరువు
జవాబు:
C) బలం
42. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేయు బలాలు
A) స్పర్శా బలాలు
B) క్షేత్ర బలాలు
C) కండర బలాలు
D) ఘర్షణ బలాలు
జవాబు:
A) స్పర్శా బలాలు
43. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలం
A) క్షేత్ర బలం
B) స్పర్శా బలం
C) కండర బలం
D) మాయా బలం
జవాబు:
A) క్షేత్ర బలం
44. కండరాలు కలుగజేయు బలము
A) క్షేత్రబలం
B) అయస్కాంతబలం
C) కండరబలం
D) ఏదీకాదు
జవాబు:
C) కండరబలం
45. ఈ క్రింది బలాలలో ఉన్నతస్థాయి జీవరాశులన్నీ తమ రోజువారీ.పనులలో ఉపయోగించు బలం
A) ఘర్షణ
B) కండర
C) గురుత్వ
D) విద్యుత్
జవాబు:
B) కండర
46. హృదయ స్పందన, రక్తప్రసరణ, శ్వాస పీల్చినపుడు ఊపిరితిత్తుల సంకోచ, వ్యాకోచాలు మొదలైనవి జరుగుటకు కారణమైన బలం
A) ఘర్షణ
B) కండర
C) గురుత్వ
D) విద్యుత్
జవాబు:
B) కండర
47. ఈ క్రింది వాటిలో భిన్నమైనది
A) అభిలంబ బలం
B) అయస్కాంత బలం
C) ఘర్షణ బలం
D) కండర బలం
జవాబు:
B) అయస్కాంత బలం
48. చలనంలో గల బంతిని నిరోధించే బలం
A) ఘర్షణ బలం
B) అయస్కాంత బలం
C) క్షేత్ర బలం
D) కండర బలం
జవాబు:
A) ఘర్షణ బలం
49. ఈ క్రిందివాటిలో సైకిల్ వడి క్రమముగా తగ్గుటకు కారణమైనది
A) ఘర్షణ బలం
B) అయస్కాంత బలం
C) క్షేత్ర బలం
D) కండర బలం
జవాబు:
A) ఘర్షణ బలం
50. ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు,ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించు బలం ……
A) అభిలంబ బలం
B) గురుత్వ బలం
C) క్షేత్ర బలం
D) ఘర్షణ బలం
జవాబు:
D) ఘర్షణ బలం
51. దీని యొక్క దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తు చలనదిశకి వ్యతిరేక దిశలో ఉండును
A) స్థావర విద్యుత్ బలం
B) గురుత్వ బలం
C) కండర బలం
D) ఘర్షణ బలం
జవాబు:
D) ఘర్షణ బలం
52. ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబదిశలో కలుగజేసే బలం
A) తన్యతా బలం
B) అభిలంబ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) అయస్కాంత బలం
జవాబు:
B) అభిలంబ బలం
53.
ఇచ్చిన పటంలో పనిచేయు రెండు బలాలు
A) అభిలంబ, గురుత్వ బలాలు
B) అయస్కాంత, గురుత్వ బలాలు
C) విద్యుత్, కండర బలాలు
D) అభిలంబ, కండర బలాలు
జవాబు:
A) అభిలంబ, గురుత్వ బలాలు
54. పై పటంలో పనిచేయు బలాల దిశ
A) ఒకే దిశ
B) వ్యతిరేక దిశ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వ్యతిరేక దిశ
55. పై పటంలో ‘Fg‘ తెలుపు బలము
A) అభిలంబ బలం
B) గురుత్వ బలం
C) తన్యతా బలం
D) కండర బలం
జవాబు:
B) గురుత్వ బలం
56. పై పటంలో ‘FN‘ తెలుపు బలము
A) అభిలంబ బలం
B) గురుత్వ బలం
C) తన్యతా బలం
D) కండర బలం
జవాబు:
A) అభిలంబ బలం
57. ప్రక్క పటంలో వస్తువుపై పనిచేయు బలాలు
A) తన్యతా బలం, గురుత్వాకర్షణ బలం
B) గురుత్వ బలం, అభిలంబ బలం
C) అయస్కాంత బలం, క్షేత్ర బలం
D) ఏదీకాదు
జవాబు:
A) తన్యతా బలం, గురుత్వాకర్షణ బలం
58. లాగబడివున్న తాడు లేదా దారంలలో వుండు బిగుసుదనంను ……….. బలం అంటారు.
A) తన్యత
B) అభిలంబ
C) అయస్కాంత
D) క్షేత్ర
జవాబు:
A) తన్యత
59. తన్యతా బలము ఈ రకంకు చెందిన బలం
A) స్పర్శా బలం
B) క్షేత్ర బలం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) స్పర్శా బలం
60. ప్రక్కపటంలో గల వస్తువు ‘A’ పై పనిచేయు బలాలు
A) గురుత్వ బలం, అభిలంబ బలం
B) ఘర్షణ బలం, అభిలంబ బలం
C) అయస్కాంత బలం, ఘర్షణ బలం
D) గురుత్వ బలం, ఘర్షణ బలం
జవాబు:
A) గురుత్వ బలం, అభిలంబ బలం
61. క్రింది వాటిలో అయస్కాంతాల మధ్య కంటికి కనిపించ కుండా పనిచేయు బలము
A) అయస్కాంత బలం
B) ఆకర్షణ బలం
C) వికర్షణ బలం
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
62. అయస్కాంత బలం ఒక ……….. బలం.
A) స్పర్శా
B) క్షేత్ర
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) క్షేత్ర
63. ఒక ఆవేశ వస్తువు, వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలుగజేసే బలం
A) అయస్కాంత బలం
B) విద్యుత్ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) కండర బలం
జవాబు:
B) విద్యుత్ బలం
64. విద్యుత్ బలం దీనికి ఉదాహరణ
A) స్పర్శా బలం
B) క్షేత్ర బలం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) క్షేత్ర బలం
65. బలాలకు ఇవి వుండును
A) పరిమాణం
B) దిశ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
66. ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళరేఖా మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని ……… గా లెక్కిస్తాము.
A) మొత్తం
B) భేదం
C) గుణకారం
D) భాగహారం
జవాబు:
A) మొత్తం
67. ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళరేఖా మార్గంలో వ్యతిరేక దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని ………. గా లెక్కిస్తారు.
A) మొత్తం
B) భేదం
C) లబ్ధం
D) భాగహారం
జవాబు:
B) భేదం
68. నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని ………. అంటారు.
A) స్వేచ్ఛావస్తు పటం
B) నిర్మాణ పటం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) స్వేచ్ఛావస్తు పటం
69. 1 న్యూటన్/మీటర్ దీనికి ప్రమాణము
A) పాస్కల్
B) కౌల్
C) వాట్
D) ఏదీకాదు
జవాబు:
A) పాస్కల్
70. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A | Group – B |
1. ఘర్షణ బలం | a) నెట్టుట, లాగుట వంటి చర్యలు |
2. అభిలంబ బలం | b) త్రాడులో బిగుసుతనం |
3. గురుత్వ బలం | c) వస్తువు గమన స్థితికి వ్యతిరేక దిశలో ఉంటుంది |
4. బలం | d) వస్తువు ఉండే తలానికి లంబదిశలో పై వైపుకు ఉంటుంది |
5. తన్యతా బలం | e) క్షితిజ సమాంతరానికి లంబదిశలో కింది వైపుకు ఉంటుంది |
A) 1 – c, 2 – d, 3 – e, 4 – a, 5 – b
B) 1 – b, 2 – a, 3 – c, 4-e, 5 – d
C) 1 – c, 2 – d, 3 – a, 4 – b, 5 – e
D) 1 – b, 2 – c, 3 – a, 4 – e, 5 – d
జవాబు:
A) 1 – c, 2 – d, 3 – e, 4 – a, 5 – b
71. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A | Group – B |
1. ఘర్షణ బలం | a) హృదయ స్పందన వంటి పనులకు కారణం |
2. పీడనము | b) వస్తువు గమనాన్ని నిరోధించేది |
3. కండర బలం | c) ప్రమాణ వైశాల్యం పై లంబంగా ప్రయోగించే బలం |
4. ఫలిత బలం శూన్యం | d) వస్తువు గమనస్థితిలో ఉంటుంది |
5. ఫలిత బలం శూన్యం కానపుడు | e) వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది |
A) 1 – a, 2 – b, 3 – c, 4 – d, 5 – e
B) 1 – b, 2 – a, 3 – c, 4 – e, 5 – d
C) 1- b, 2 – c, 3 – 2, 4 – d, 5 – e
D) 1 – b, 2 – c, 3- 2, 4 – e, 5 – d
జవాబు:
D) 1 – b, 2 – c, 3- 2, 4 – e, 5 – d
72. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
Group – A | Group – B |
1. స్థావర విద్యుత్ బలం | a) సదిశ రాశి |
2. పాస్కల్ | b) స్పర్శా బలం |
3. న్యూటన్ | c) క్షేత్ర బలం |
4. కండర బలము | d) పీడనానికి ప్రమాణం |
5. పీడనం | e) బలానికి ప్రమాణం |
6. బలం | f) అదిశ రాశి |
A) 1 – a, 2 – b, 3 – c, 4 – d, 5 – e, 6 – f
B) 1 – b, 2 – a, 3 – c, 4 – e, 5 – d, 6 – f
C) 1 – c, 2 – d, 3 – e, 4 – b, 5 – f, 6 – a
D) 1 – c, 2 – b, 3 – a, 4 – d, 5 – f, 6 – e
జవాబు:
C) 1 – c, 2 – d, 3 – e, 4 – b, 5 – f, 6 – a
73. పటంలో పని చేసే ఫలిత బలము.
A) 8 N
B) 16 N
C) 20 N
D) 4 N
జవాబు:
D) 4 N
74. కింది వానిలో క్షేత్ర బలము కానిది
A) అయస్కాంత బలం
B) విద్యుద్బలము
C) అభిలంబ బలం
D) గురుత్వ బలము
జవాబు:
C) అభిలంబ బలం
75. “స్వేచ్ఛా వస్తు పటం” (Free Body Diagram) ను వేటిని లెక్కించటానికి ఉపయోగిస్తారు?
A) వస్తువు ద్రవ్యరాశిని లెక్కించడానికి
B) వస్తువుపై ఉండే పీడనం లెక్కించుటకు
C) వస్తువు పై పనిచేసే ఫలిత బలాలను లెక్కించుటకు
D) వస్తువు పై పనిచేసే రేఖీయ ద్రవ్య వేగాల ఫలితాన్ని లెక్కించుటకు
జవాబు:
C) వస్తువు పై పనిచేసే ఫలిత బలాలను లెక్కించుటకు
76. క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించుము.
A) ఘర్షణ బలం
B) గురుత్వాకర్షణ బలం
C) స్థిర విద్యుత్ బలం
D) అయస్కాంత బలం
జవాబు:
A) ఘర్షణ బలం
77. P : బలానికి దిశ మరియు పరిమాణం ఉంటాయి.
Q : ఫలితబలం ప్రయోగించి వస్తువు గమనస్థితిలో, మార్పు తీసుకురాలేము.
A) P అసత్యము Q సత్యము
B) P మరియు Q లు సత్యములు
C) P మరియు Q లు అసత్యాలు
D) P సత్యము, Q అసత్యము
జవాబు:
D) P సత్యము, Q అసత్యము
78. నీవు టూత్ పేస్టు నొక్కేటప్పుడు టూత్ పేస్ట్ ట్యూబ్, నీ చేతివేళ్ళు ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి. ఇక్కడ పనిచేసే బలాన్ని స్పర్శాబలం అంటారు. అయితే క్రింది వాటిలో స్పర్శాబలం కానిది
A) డస్టర్ తో బోర్డుపైనున్న గీతలను చెరపడం
B) గుండు సూదిని దండయస్కాంతం ఆకర్షించడం
C) బకెట్ తో నూతిలోనున్న నీటిని తోడడం
D) పేపరుపై పెన్నుతో రాయడం
జవాబు:
B) గుండు సూదిని దండయస్కాంతం ఆకర్షించడం
79. ఒక దండాయస్కాంతం వద్దకు దిక్సూచిని తీసుకువస్తే క్రింది విధంగా జరుగుతుందని ఊహించవచ్చును.
A) కండరబలం వలన దిక్సూచిలో ముల్లు కదులును.
B) గురుత్వాకర్షణ బలం వలన దిక్సూచిలో ముల్లు కదులును.
C) ఘర్షణ బలం వలన దిక్సూచిలో ముల్లు కదులును.
D) అయస్కాంత బలం వలన దిక్సూచిలో ముల్లు కదులును.
జవాబు:
D) అయస్కాంత బలం వలన దిక్సూచిలో ముల్లు కదులును.
80. ఒక బాలుడు ఒక రాయిని విసిరినపుడు
A) కండరాలు సంకోచిస్తాయి
B) కండరాలు వ్యాకోచిస్తాయి
C) A మరియు B
D) కండరాలలో మార్పురాదు
జవాబు:
C) A మరియు B
81. ఒక పుస్తకం నిశ్చలంగా ఉంది. అయిన క్రింది బలాలలో జరుగుతుందో ఊహించుము.
A) అభిలంబ బలం
B) ఘర్షణ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) పైవేవీకాదు
జవాబు:
B) ఘర్షణ బలం
82. తాడు తెగినచో ఏమి జరుగుతుందో ఊహించుము.
A) తన్యతాబలం > గురుత్వాకర్షణ బలం
B) తన్యతాబలం = గురుత్వాకర్షణ బలం
C) ఘర్షణబలం > గురుత్వాకర్షణ బలం
D) తన్యతాబలం < గురుత్వాకర్షణ బలం
జవాబు:
D) తన్యతాబలం < గురుత్వాకర్షణ బలం
83. ‘B’ పై పనిచేసే బలాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2
84. భావన (A) : అయస్కాంత బలం ఒక క్షేత్ర బలం.
కారణం (R) : ఒక అయస్కాంతం, మరియొక అయస్కాంతాన్ని సున్నా పరిమాణంతో ఆకర్షించలేక వికర్షించగలదు.
A) A మరియు R లు సరియైనవి
B) A మరియు R లు సరియైనవి కావు
C) A సరియైనది. R సరియైనది కాదు
D) A సరియైనది కాదు. R సరియైనది
జవాబు:
C) A సరియైనది. R సరియైనది కాదు
85. రెండు బెలూన్లు తీసుకొని, వాటిలో గాలిని నింపుము. తర్వాత వాటిని నీ పొడి జుత్తుపై రుద్ది, వానిని దగ్గరకు తీసుకుని రమ్ము. ఏమి జరుగుతుందో ఊహించుము.
A) అవి వికర్షించుకొంటాయి
B) అవి ఆకర్షించుకొంటాయి
C) వాటిలో మార్పు రాదు
D) మనమేమీ చెప్పలేము
జవాబు:
A) అవి వికర్షించుకొంటాయి
86. ఒక ఆపిల్ పండు చెట్టుపై నుండి నేలపై పడుతున్నప్పుడు దానిపై పనిచేసే బలాలు క్రింది వానిలో ఏవో ఊహించుము.
A) గురుత్వాకర్షణ బలం
B) ప్రవాహి ఘర్షణ
C) తన్యతా బలం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
87. క్రింది ఏ బలంతో స్వేచ్ఛాపతన వస్తువును నిశ్చలస్థితిలోకి తీసుకురావచ్చునో ఊహించుము
A) గురుత్వాకర్షణ బలం
B) అభిలంబ బలం
C) పై రెండూ
D) పై రెండూ కాదు
జవాబు:
B) అభిలంబ బలం
88. ఒక కదిలే వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే ఏమి ఏది శూన్యంగా ఉంటుందో ఊహించుము.
A) దాని వేగం మరింత పెరుగును
B) దాని వేగం తగ్గును
C) A లేదా B
D) A మరియు B
జవాబు:
C) A లేదా B
89. విశ్వంలో ఏ వస్తువు పైనైనా తప్పక ప్రభావం చూపు బలాన్ని ఊహించుము.
A) గురుత్వాకర్షణ బలం
B) అయస్కాంత బలం
C) అభిలంబ బలం
D) పైవన్నియూ
జవాబు:
A) గురుత్వాకర్షణ బలం
90. సురేష్ ఒక పుస్తకాన్ని బల్లపై ఉంచాడు. ఆ పుస్తకం పై రెండు బలాలు పనిచేస్తున్నప్పటికీ ఆ పుస్తకం ఎందుకు అలా కదలకుండా ఉండిపోయిందని తన స్నేహితుడు మహేష్ ను అడిగాడు. అప్పుడు మహేష్ క్రింది సరైన కారణాన్ని వివరించాడు.
A) అభిలంబ బలం, గురుత్వాకర్షణ బలం సమానం మరియు ఒకే దిశలో పనిచేస్తున్నాయి.
B) అభిలంబ బలం, గురుత్వాకర్షణ బలం పరిమాణాలు వేరువేరుగా ఉంటూ ఒకే దిశలో పనిచేస్తున్నాయి.
C) అభిలంబ బలం, గురుత్వాకర్షణ బలం పరిమాణాలు వేరు వేరుగా ఉంటూ వ్యతిరేక దిశలలో పని చేస్తున్నాయి.
D) అభిలంబ బలం గురుత్వాకర్షణ బలం సమానం మరియు వ్యతిరేక దిశలలో పనిచేస్తున్నాయి.
జవాబు:
D) అభిలంబ బలం గురుత్వాకర్షణ బలం సమానం మరియు వ్యతిరేక దిశలలో పనిచేస్తున్నాయి.
91.
ఇచ్చిన ప్రయోగం ద్వారా క్రింది వానిని నిర్ధారించవచ్చును.
a) వస్తువు యొక్క నునుపుదనంపై ఘర్షణ ఆధారపడియుంటుంది.
b) వాలు తలం యొక్క నునుపుదనంపై ఘర్షణ ఆధారపడి యుంటుంది.
A) a మాత్రమే
B) bమాత్రమే
C) a మరియు b
D) పైవేవీ కాదు
జవాబు:
A) a మాత్రమే
92. దారం భరించగలిగే గరిష్ఠ బరువును కనుగొనుటకు ఉపయోగించగలిగే పరికరం
A) సామాన్య వ్రాసు
B) స్ప్రింగ్ త్రాసు
C) ఎలక్ట్రానిక్ త్రాసు
D) పైవేవీ కాదు
జవాబు:
B) స్ప్రింగ్ త్రాసు
93. ‘బలం ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చగలదు’ అని క్రింది విధంగా నిరూపించవచ్చును.
A) స్పాంజ్ ను చేతితో పిండడం ద్వారా
B) ఇనుప ముక్కని చేతితో పిండడం ద్వారా
C) బంతిని విసరడం ద్వారా
D) బంతిని ఆపడం ద్వారా
జవాబు:
A) స్పాంజ్ ను చేతితో పిండడం ద్వారా
94.
పైన ప్రయోగం ద్వారా నీవు నిర్ధారించగలిగేది
A) స్పర్శావైశాల్యం తగ్గితే, పీడనం పెరుగుతుంది.
B) స్పర్శావైశాల్యం పెరిగితే, పీడనం పెరుగుతుంది.
C) స్పర్శావైశాల్యం తగ్గితే, పీడనంలో మార్పురాదు.
D) పైవేవీ కావు
జవాబు:
A) స్పర్శావైశాల్యం తగ్గితే, పీడనం పెరుగుతుంది.
95. దారం భరించగలిగే గరిష్టబలాన్ని కనుగొనే ప్రయోగానికి కావాల్సిన పరికరాలు
A) స్ప్రింగ్ త్రాసు, వివిధ రకాల దారాలు, భారాలు, కొక్కెం
B) స్ప్రింగ్ త్రాసు, కొక్కెం, స్టాప్ వాచ్, గ్రాఫ్ పేపర్
C) స్ప్రింగ్ త్రాసు, గ్రాఫ్ పేపరు, దారాలు, గుండుసూది
D) స్ప్రింగ్ త్రాసు, భారాలు, కొక్కెం, స్టాప్ వాచ్
జవాబు:
A) స్ప్రింగ్ త్రాసు, వివిధ రకాల దారాలు, భారాలు, కొక్కెం
96.
బండిని లాగే బలం
A) స్పర్శాబలం
B) క్షేత్రబలం
C) కండర బలం
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
97.
పైన పటము నుండి, పరస్పరం వ్యతిరేక దిశలలో పనిచేసే బలాలు ఏవో ఎన్నుకొనుము.
a) అభిలంబ బలం మరియు ఘర్షణ బలం
b) అభిలంబ బలం మరియు గురుత్వాకర్షణ బలం
c) ఘర్షణ బలం మరియు బాహ్య బలం
d) అభిలంబ బలం మరియు బాహ్యబలం
e) ఘర్షణ బలం మరియు గురుత్వాకర్షణ బలం
A) a, b
B) b, c
C) c, d
D) d, e
జవాబు:
B) b, c
98.
F ప్రక్క పటంలో క్షేత్రబలం
A) f
B) T
C) F
D) W
జవాబు:
D) W
99. ప్రక్కపటంలో వస్తువుపై పనిచేసే బలాలు
A) తన్యత మరియు గురుత్వాకర్షణ
B) తన్యత మరియు ఘర్షణ
C) తన్యత, ఘర్షణ మరియు గురుత్వాకర్షణ
D) తన్యత లేదా గురుత్వాకర్షణ
జవాబు:
A) తన్యత మరియు గురుత్వాకర్షణ
100.
బలం | బలప్రభావ పరిధి | |
a | అయస్కాంత | అయస్కాంతం చుట్టూ |
b | స్థావర విద్యుత్ | చార్జి చుట్టూ |
c | గురుత్వాకర్షణ | భూమి చుట్టూ |
పై పట్టికలో తప్పుగా సూచించినది
A) a
B) b
C) c
D) ఏదీలేదు
జవాబు:
C) c
101.
క్షేత్రబలం ఎక్కువగా ఉండు ప్రాంతం
A) a
B) b
C) c
D) అన్నిట్లో
జవాబు:
C) c
102.
బలం | పరిమాణం | దిశ |
F | 40N | ఎడమవైపు |
f | 20 N | కుడివైపు |
T | 30 N | పైకి |
W | 30N | క్రిందికి |
ఒక వస్తువు పై పనిచేసే బలాలు ఇవ్వబడ్డాయి. ఫలితబలం
A) 20 N (ఎడమవైపుకి)
B) 40 N (కుడివైపుకి)
C) 20 N (క్రిందికి)
D) పైవేవీకాదు
జవాబు:
A) 20 N (ఎడమవైపుకి)
103.
వస్తువుపై పనిచేసే బలాలు
A) +F1, + F2, -F3, +F4
B) – F1, + F2, – F3, +F4
C) + F1, – F2, – F3, – F4
D) + F1, – F2, -F3, + F4
జవాబు:
C) + F1, – F2, – F3, – F4
104.
వస్తువు కదులు దిశ
A) →
B) ←
C) ↓
D) ↑
జవాబు:
B) ←
→ సింగ్ త్రాసు, భారాలు, తేలిక దారాలు, భారాలు తగిలించే కొక్కెం వంటి పరికరాలను ప్రక్క పటంలో చూపినట్లు అమర్చుము. కాగా భారాన్ని వెయిట్ హేంగర్ కి వేలాడతీసి సింగ్ త్రాసులో రీడింగ్ గమనించండి. అలా దారం తెగేవరకూ కొద్దికొద్దిగా భారాలను పెంచుతూ స్ప్రింగ్ త్రాసులో రీడింగ్లు గమనించండి. ఇదే విధంగా వివిద దారాలను ఉపయోగించి ప్రయోగాన్ని చేసి దారాలు భరించ గలిగే గుర్తు గరిష్ట బలాన్ని నమోదు చేయుము.
105. పై సమాచారాన్ని పట్టికలో నమోదు చేయటానికి క్రింది వాటిలో దేనిని ఎంచుకుంటావు?
జవాబు:
A
106. పై సమాచారం ఆధారంగా సామాన్యీకరణ చేయగలిగిన అంశమేది? SAI : 2017-18
A) దారం రంగునుబట్టి అది భరించగలిగే గరిష్టబలం మారుతుంది
B) వివిధ దారాలకు భరించగలిగే గరిష్ట బలం వేరువేరుగా ఉంటుంది
C) సహజ దారాలన్నీ బలంగా ఉంటాయి
D) అన్ని రకాల దారాలు ఒకే గరిష్ట బలాన్ని భరిస్తాయి
జవాబు:
B) వివిధ దారాలకు భరించగలిగే గరిష్ట బలం వేరువేరుగా ఉంటుంది
107. “బలము వస్తువు యొక్క చలన స్థితిని మారుస్తుంది” ఒక ధృడ వస్తువుపై కొంత బలాన్ని ప్రయోగిస్తే .
A) దాని ఆకారంలో మార్పు వస్తుంది
B) దాని స్థితిలో మార్పు వస్తుంది
C) దాని ఘన పరిమాణం మారుతుంది
D) దాని ద్రవ్యరాశి మారుతుంది
జవాబు:
B) దాని స్థితిలో మార్పు వస్తుంది
108.
‘X’ అనేది
A) S
B) N
C) P
D) g
జవాబు:
B) N
109. బల దిశను సూచించే చిత్రము
A) →
B) ←
C) ↑
D) ఏదైననూ
జవాబు:
D) ఏదైననూ
110. క్రింది ఇచ్చిన దత్తాంశానికి సరిపోవు చిత్రము
గుర్తు | బలం | దిశ |
A | తోయుట | ఎడమవైపుకి |
B | లాగుట | కుడివైపుకి |
C | తన్యత | పైకి |
D | గురుత్వాకర్షణ | క్రిందికి |
జవాబు:
A
111. చలనంలో ఉన్న కారు యొక్క స్వేచ్ఛా వస్తు చిత్రము
జవాబు:
C
112.
అభిలంబ బలాన్ని క్రింది వానితో సూచింపబడ్డాయి.
A) a, b
B) c, d
C) c
D) a, c
జవాబు:
A) a, b
113.
పైన చిత్రములో తప్పుగా పేర్కొన్నది
A) a
B) b
C) c
D) d
జవాబు:
B) b
114. దిలీప్ ఒక కర్రను క్రింది పటంలో చూపినట్లు మెట్లపై ఉంచాడు. ఆ కర్రమీద పనిచేసే అభిలంబ బలాలు క్రింది విధంగా ఉంటాయి.
జవాబు:
B
115. వస్తువు పనిచేసే ఫలితబలం శూన్యమైతే ఆ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది. క్రింది వానిలో ఏ వస్తువు నిశ్చలస్థితిలో ఉంటుంది? సరైన పటాన్ని గుర్తించండి.
జవాబు:
D
116. క్రింది పటం నుండి ఫలితబలం యొక్క పరిమాణం కనుగొనుము.
A) 30 N
B) 45 N
C) 15 N
D) 0 N
జవాబు:
C) 15 N
117. గాలి (వాతావరణం) మనకు చాలా అవసరం. ఇది మన భూమి నుండి పలాయనం చెందకుండా ఉంది. దీనికి కారణమైనది
A) అభిలంబ బలం
B) స్థావర విద్యుత్ ఆవేశం
C) గురుత్వాకర్షణ బలం
D) పైవన్నియు
జవాబు:
C) గురుత్వాకర్షణ బలం
118. మనుషులు శారీరకంగా తమ పనులు తాము చేసుకోవడంలో క్రింది సూచింపబడిన బలం ప్రధాన పాత్ర వహిస్తుంది.
A) స్థావర విద్యుద్బలం
B) కండర బలం
C) తన్యతాబలం
D) అయస్కాంతబలం
జవాబు:
B) కండర బలం
119. వృద్ధులు సహాయం కోసం ఎదురు చూస్తారు. కారణం వారు క్రింది బాలాన్ని కోల్పోతారు.
A) కండర బలం
B) ఘర్షణ బలం
C) గురుత్వాకర్షణ బలం
D) పైవన్నియు
జవాబు:
A) కండర బలం
120.
పైన వస్తువు కదిలే దిశ, బలం
A) – 20 N
B) + 60 N
C) – 20 N
D) – 60 N
జవాబు:
A) – 20 N
121. రెండు చేతులతో ఒక రబ్బరు బ్యాండ్ ను సాగదీసినపుడు, రెండు చేతులపై క్రిందిది ప్రయోగింపబడుతుంది.
A) వేరు వేరు పరిమాణాలు మరియు వ్యతిరేక దిశలలో బలాలు
B) ఒకే పరిమాణం మరియు ఒకే దిశలో బలాలు
C) వేరు వేరు పరిమాణాలు మరియు ఒకే దిశలో బలాలు
D) ఒకే పరిమాణం మరియు వ్యతిరేక దిశలలో బలాలు
జవాబు:
D) ఒకే పరిమాణం మరియు వ్యతిరేక దిశలలో బలాలు
122.
పైన కారు ఏ దిశలో చలిస్తుంది?
A) ఎడమ
B) కుడి
C) పైకి
D) చెప్పలేం
జవాబు:
D) చెప్పలేం
123. కూరగాయలు తరిగే చాకు ఇలా తయారు చేయబడుతుంది.
A) తక్కువ ఉపరితల వైశాల్యం
B) ఎక్కువ ఉపరితల వైశాల్యం
C) తక్కువ స్పర్శా వైశాల్యం
D) ఎక్కువ స్పర్శా వైశాల్యం
జవాబు:
C) తక్కువ స్పర్శా వైశాల్యం
124. భావన (A) : ఒక బాలుడు సైకిల్ టైరును కర్రతో పదేపదే కొడుతూ, దాని వేగాన్ని పెంచుతాడు.
కారణం (R) : ఒక చలన వస్తువుపై, దాని చలన దిశలో ఫలిత బలం ప్రయోగింపబడితే సమవేగంతో వెళ్తున్న దాని వేగం పెరుగుతుంది.
A) A మరియు Rలు సరియైనవి, A ను R సమర్థించుచున్నది
B) A మరియు Rలు సరియైనవి, Aను R సమర్థించదు
C) A మరియు R లు తప్పు
D) A సరియైనది, R సరియైనది కాదు.
జవాబు:
A) A మరియు Rలు సరియైనవి, A ను R సమర్థించుచున్నది
125. సూది కొన పదునుగా ఉంటుంది. కారణం
A) తక్కువ స్పర్శా వైశాల్యం వలన, ప్రభావిత పీడనం ఎక్కువ
B) తక్కువ స్పర్శావైశాల్యం వలన, ప్రభావిత పీడనం తక్కువ
C) ఎక్కువ స్పర్శా వైశాల్యం వలన, ప్రభావిత పీడనం ఎక్కువ
D) ఎక్కువ స్పర్శా వైశాల్యం వలన, ప్రభావిత పీడనం తక్కువ
జవాబు:
A) తక్కువ స్పర్శా వైశాల్యం వలన, ప్రభావిత పీడనం ఎక్కువ
126. నీ యొక్క పొడి జుత్తుని దువ్వెనతో దువ్వినపుడు, ఆ దువ్వెన చిన్న చిన్న కాగితాలను ఆకర్షించును కదా ! అక్కడ ఆకర్షణకు కారణమైన బలం
A) అయస్కాంత
B) స్థావర విద్యుదావేశబలం
C) గురుత్వాకర్షణ బలం
D) అభిలంబ బలం
జవాబు:
B) స్థావర విద్యుదావేశబలం
127. అజిత్ చెట్టుకొమ్మను ఒక చేతితో పట్టుకొని వేలాడుతున్న కోతిని చూసాడు. దానిపై పనిచేసే బలాలు
A) గురుత్వాకర్షణ బలం మరియు అభిలంబ బలం
B) గురుత్వాకర్షణ బలం మరియు ఘర్షణ బలం
C) గురుత్వాకర్షణ బలం మరియు తన్యతా బలం
D) గురుత్వాకర్షణ, ఘర్షణ మరియు తన్యతాబలం
జవాబు:
A) గురుత్వాకర్షణ బలం మరియు అభిలంబ బలం
128. ఒక బల్లపై భౌతిక రసాయన శాస్త్ర పుస్తకం ఉంది. దానిపై పని చేసే గురుత్వాకర్షణ బలం 10 న్యూటన్లు అయితే అభిలంబ బలం
A) 0 న్యూటన్లు
B) 10 న్యూటన్లు
C) 15 న్యూటన్లు
D) 20 న్యూటన్లు
జవాబు:
B) 10 న్యూటన్లు
129. మీ అమ్మగారు చపాతీ ముద్దను చపాతీగా చేయడంలో బల ప్రభావం యొక్క ఏ ఫలితాన్ని అభినందిస్తావు?
A) బలం వస్తువు యొక్క వేగాన్ని మారుస్తుంది.
B) బలం వస్తువు యొక్క ఆకృతిని మారుస్తుంది.
C) బలం వస్తువును స్థానభ్రంశం చెందిస్తుంది.
D) బలం వస్తువు యొక్క దిశను మారుస్తుంది.
జవాబు:
B) బలం వస్తువు యొక్క ఆకృతిని మారుస్తుంది.