Students can go through AP Board 8th Class Physical Science Notes 5th Lesson లోహాలు మరియు అలోహాలు to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 5th Lesson లోహాలు మరియు అలోహాలు
→ పదార్థాల ఉపరితలంపై కాంతి పరావర్తనం చెందినపుడు మెరిసే గుణం గల పదార్థాలను ద్యుతి పదార్థాలు అంటారు. ఈ విధంగా మెరువని పదార్థాలను ద్యుతి గుణం లేని పదార్థాలంటారు.
→ సాధారణంగా లోహాలు ద్యుతిని ప్రదర్శిస్తాయి.
→ రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని స్తరణీయత అంటారు.
→ అల్యూమినియం, వెండి, బంగారం వంటి లోహాలు అధిక స్తరణీయతను కలిగి ఉంటాయి.
→ ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వనిగుణం గల పదార్థాలు అంటారు.
→ పాదరసం లోహమైనప్పటికీ శబ్దాన్ని విడుదల చేయదు. పాదరసం (Hg) ద్రవస్థితిలో గల లోహం.
→ అతి పలుచని వెండి రేకులను మిఠాయిలపై అలంకరించుటకు ఉపయోగిస్తారు.
→ తినుబండారములను ప్యాకింగ్ చేయడానికి పలుచని అల్యూమినియం రేకును ఉపయోగిస్తారు.
→ పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు.
→ తమగుండా విద్యుత్ ను ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ‘అల్యూమినియం, రాగి వంటివి మంచి విద్యుత్ వాహకాలు.
→ లోహాలకు ఉండే అధిక ఉష్ణవాహకత కారణంగా లోహాలను వంట పాత్రలుగా ఉపయోగిస్తారు.
→ దాదాపు లోహాలన్నీ ద్యుతి, ధ్వని గుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రాగి, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరన్ మరియు జింక్ మొదలగునవి.
→ కొన్ని లోహాలు గాలిలోని కొన్ని అంశీభూతాలతో వివిధ రకాలుగా వివిధ వేగాలతో చర్య జరుపుతాయి.
→ బంగారం మరియు ప్లాటినమ్ వంటి లోహాలు గాలితో చర్య జరపవు.
→ లోహాలు వాటి చర్యాశీలతను అనుసరించి ఒకదానికొకటి స్థానభ్రంశం చెందుతాయి.
→ కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువులను విడుదల చేస్తాయి.
→ అలోహ ఆక్సెస్టు సాధారణంగా ఆమ్ల స్వభావము కలిగి ఉంటాయి. ఇవి నీలి రంగు లిట్మస్ పేపర్ ను ఎరుపు రంగుగా మారుస్తాయి.
→ లోహ ఆక్సైడీలు సాధారణంగా క్షార స్వభావం కలిగి ఉంటాయి. ఇవి ఎరుపు లిట్మస్, పేపరును నీలి రంగుగా మారుస్తాయి.
→ లోహాలు : ద్యుతి, ధ్వనిగుణం, తాంతవత, స్తరణీయత, ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత వంటి ధర్మాలను కలిగి ఉన్న మూలకాలను లోహాలు అంటారు.
→ అలోహాలు : ద్యుతి, ధ్వనిగుణం, తాంతవత, స్తరణీయత, ఉష్ణ వాహకత, విద్యుత్ వాహకత వంటి ధర్మాలను కలిగి ఉండని మూలకాలను అలోహాలు అంటారు.
→ మిశ్రమ లోహాలు : రెండు లేదా అంతకన్నా ఎక్కువ లోహ మూలకాలు లేదా లోహ, అలోహ మూలకాల సజాతీయ మిశ్రమాన్ని మిశ్రమ లోహాలు అంటారు.
ఉదా : స్టీలు (ఇనుము + కార్బన్)
→ ద్యుతి గుణం : ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే ధర్మాన్ని ద్యుతి గుణం అంటారు.
→ ధ్వని గుణం గల పదార్థాలు : ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వనిగుణం గల పదార్థాలు అంటారు.
→ స్తరణీయత : రేకులుగా సాగే పదార్థ ధర్మాన్ని స్తరణీయత అంటారు.
→ తాంతవత (Ductility) : పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు.
→ ఉష్ణ వాహకత : పదార్థంలో అధిక ఉష్ణ ప్రాంతం నుండి అల్ప ఉష్ణ ప్రాంతానికి ప్రసరించు ధర్మాన్ని ఉష్ణ వాహకత అంటారు.
→ విద్యుత్ వాహకత : తమగుండా విద్యుతను ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.
→ లోహ ఆక్సైడ్లు : లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఏర్పడే పదార్థాలను లోహ ఆక్సైడ్లు అంటారు.
→ అలోహ ఆక్సైడ్లు : అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పడే పదార్థాలను అలోహ ఆక్సైడ్లు అంటారు.
→ స్థావభ్రంశ చర్య : ఒక సమ్మేళనములో ఒక మూలకమును లేదా ప్రాతిపదికను వేరొక మూలకము లేదా ప్రాతిపదికతో స్థానభ్రంశం చెందిస్తే దానిని స్థానభ్రంశ చర్య అంటారు.