AP 8th Class Social Important Questions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

These AP 8th Class Social Important Questions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 19th Lesson Important Questions and Answers సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 1.
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో ఏమి స్థాపించాడు?
జవాబు:
వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

ప్రశ్న 2.
మనము సావిత్రిబాయి పూలేని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎందుకు?
జవాబు:
సావిత్రిభాయి పూలేని మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఆమె ఒక సంఘ సంస్కర్త. ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయిని ఆమె తన భర్తతో కలసి మహిళల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారికి విద్యను అందించే విషయంలో, వారిని శక్తివంతులుగా చేయడానికి ఆవిడ సమాజంతో పోరాడి గెలిచిన మహిళ.

ప్రశ్న 3.
“స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో మహిళల హక్కులకోసం పోరాడిన వాళ్ళలో పురుషులే ఎక్కువగా ఉన్నారు” దీనిని మీరేవిధంగా అర్థం చేసుకుంటారు ? మీ వ్యాఖ్యలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో స్త్రీలు విద్యావంతులు కారు. కావున వారి కోసం పురుషులు ఉద్యమించవలసి వచ్చింది.

  1. స్త్రీలు ఇండ్లు దాటి బయటకు వచ్చేవారు కాదు.
  2. పరదా పద్ధతి అమలులో ఉండేది.
  3. ఏ విషయంలోనూ స్త్రీలకు స్వంత నిర్ణయాలు ఉండేవి కావు.
  4. వారికి హక్కులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు.
  5. పురుషులు విద్యావంతులవడం, వారికి స్త్రీకి గల హక్కులు గురించి తెలియడంలో వారి సమాజంలో అణిచివేతకు గురవుతున్నారు. కావున వారికి పోరాడే అవకాశం లేకపోవడం ఈ పై విషయాల వలన పురుషులే స్త్రీల హక్కుల కోసం పోరాడారు.
  6. స్త్రీలు విద్యావంతులు కాకపోవడం వలన వారి హక్కుల కోసం వారు పోరాడలేకపోయారు.

AP 8th Class Social Important Questions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 4.
ఇప్పటికి భారతదేశంలో బాల్య వివాహాలు జరగడానికి గల రెండు కారణాలు తెలిపి, బాల్య వివాహాలను అరికట్టుటకు రెండు చర్యలను సూచించండి.
జవాబు:
1. పేదరికం :
చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల కుటుంబ ఖర్చులు తగ్గుతాయని తల్లిదండ్రులు భావించటం.

2. లింగవివక్షత :
కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానమైన విలువ ఇవ్వకపోవడం.

3. మగ పిల్లల విద్యపై పెట్టే ఖర్చు తమకు ఎక్కువ ప్రయోజనకరమైనదిగా భావించడం.

బాల్య వివాహాలను అరికట్టడంకు తీసుకోదగిన చర్యలు :

  1. ఆడపిల్లలకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందించడం.
  2. బాలికలకు ఉచిత విద్యను అందించడం.
  3. బాల్య వివాహాలను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావడం.
  4. బాల్యవివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం.